🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 371 🌹
✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ
🍀. విశ్వం శాశ్వతమైతే మనము శాశ్వతమే. అందుకనే ప్రాచ్యంలో 'అహం బ్రహ్మస్మి' అన్నారు.అంటే నేనే దేవుణ్ణి అని అర్థం. నేనే సత్యం' అని అర్థం. ఇవన్నీ అద్భుతమయిన తీర్మానాలు. వాటిని అనుభూతి చెందు. 🍀
విశ్వం విశాలమైంది. హద్దులు లేనిది. దాంట్లో భాగాలం కనక మనమూ సరిహద్దులు లేని వాళ్ళమే. అనంత విశ్వంలోని అపూర్వ లక్షణాలు మనలోనూ వున్నాయి. చిన్ని ఫార్ములాని గమనించు. సమస్తం శాశ్వతమయితే భాగాలు ఎప్పటికీ అశాశ్వతం కావు. అట్లాగే విశ్వం శాశ్వతమైతే మనము శాశ్వతమే. అందుకనే ప్రాచ్యంలో 'అహం బ్రహ్మస్మి' - అంటే నేనే దేవుణ్ణి అని అర్థం. నేనే సత్యం' అని అర్థం. ఇవన్నీ అద్భుతమయిన తీర్మానాలు. అవి మానవజాతి తరపున తీర్మానాలు. ఇవి అహంకార పూరితాలు కావు. అవి వాస్తవ ప్రకటనలు. వాటిని అనుభూతి చెందు. ఆద్యంతాలు లేని అనంతంలో నువ్వు భాగం. అపుడు నువ్వు తెలికపడతావు. నీ అల్పమయిన కష్టాలు, బాధలు వదిలిపెడతావు. నీ వైశాల్యంలో అవి అతి అల్పమైనవి. అవి లెక్కించాల్సినవి కావు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment