1) 🌹 శ్రీమద్భగవద్గీత - 521 / Bhagavad-Gita - 521🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 58, 59 / Vishnu Sahasranama Contemplation - 58, 59🌹
3) 🌹 Sripada Srivallabha Charithamrutham - 309🌹
4) 🌹. శివగీత - 94 / The Shiva-Gita - 94 🌹
5) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 78🌹
6) 🌹 Guru Geeta - Datta Vaakya - 97 🌹
7) 🌹. గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 83 / Gajanan Maharaj Life History - 83 🌹
8) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 76 🌹
9) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 41, 42 / Sri Lalita Chaitanya Vijnanam - 42, 42🌹
10) *🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 24🌹*
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 436 / Bhagavad-Gita - 436🌹
12) *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 9 / Sri Devi Mahatyam - Durga Saptasati - 9🌹*
13) 🌹. శివ మహా పురాణము - 251 🌹
14) 🌹 Light On The Path - 9🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 139🌹
16) 🌹 Seeds Of Consciousness - 202 🌹
17) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 56 📚
18) 🌹. అద్భుత సృష్టి - 58🌹
19) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 41 / Sri Vishnu Sahasranama - 41 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 521 / Bhagavad-Gita - 521 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 07 🌴*
07. మమైవంశో జీవలోకే జీవభూత: సనాతన: |
మన:షష్టానీన్ద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి ||
🌷. తాత్పర్యం :
ఈ బద్ధభౌతికజగమునందలి జీవులందరు నా శాశ్వతాంశలు. బద్ధజీవనము కారణముగా మనస్సుతో కలిపి ఆరైన ఇంద్రియములను గూడి వారు తీవ్రసంఘర్షణ కావించుచున్నారు.
🌷. భాష్యము :
జీవుని యథార్థరూపము ఈ శ్లోకమునందు స్పష్టముగా ఒసగబడినది.
యథార్థమునకు అతడు శ్రీకృష్ణభగవానుని శాశ్వతాంశము. అనగా అతడు బద్ధజీవితమున వ్యక్తిత్వమును పొంది, ముక్తస్థితిలో ఆ భగవానునితో ఐక్యమగునని కాదు. అతడు శాశ్వతముగా భగవానుని నుండి విడివడియే యుండును. ఈ విషయమే “సనాతన”యను పదము ద్వారా స్పష్టపరుపబడినది.
వేదముల ప్రకారము శ్రీకృష్ణభగవానుడు అసంఖ్యాక రూపములలో వ్యక్తమై విస్తరించియుండును. వానిలో ప్రధానవిస్తారములు విష్ణుతత్త్వములనియు, అప్రధానవిస్తారములు జీవతత్త్వములనియు పిలువబడును.
అనగా విష్ణుతత్త్వములు స్వీయవిస్తారములు కాగా, జీవులు విభక్తమైనట్టి విస్తారములు. ఈ రీతి శ్రీకృష్ణభగవానుడు తన స్వీయవిస్తారముతో రామ, నృసింహ, విష్ణుమూర్తి మరియు పలువైకుంఠాధిపతుల రూపములందు వ్యక్తమగుచుండును.
విభక్తవిస్తారములైన జీవులు అతని నిత్య సేవకులే. భగవానుని స్వీయవిస్తారములు (విష్ణుతత్త్వములు) శాశ్వతముగా నిలుచునట్లే, భగవానుని విభక్తవిస్తారములైన జీవులు సైతము తమ వ్యక్తిత్వములను కలిగియున్నారు.
దేవదేవుని అంశలుగా వారు అతని లక్షణములను అంశమాత్రము కలిగియున్నారు. దేవదేవుని అంశలుగా వారు అతని లక్షణములను అంశమాత్రము కలిగియున్నారు. అట్టి లక్షణములలో స్వతంత్రమనునది యొకటి. అనగా ప్రతిజీవియు వ్యక్తిత్వమును మరియు స్వతంత్ర్య యొక్క సుక్ష్మాంశమును కలిగియున్నాడు.
అట్టి సూక్ష్మస్వతంత్రతను దుర్వినియోగపరచుటచే అతడు బద్ధుడగుచుండ, సద్వినియోగముచే ముక్తుడగుచున్నాడు. బంధ, ముక్తస్థితులనెడి రెండింటి యందును అతడు దేవదేవుని వలనే గుణరీతి శాశ్వతుడు. ముక్తస్థితిలో అతడు భౌతికజీవనము నుండి విడివడియుండి శ్రీకృష్ణభగవానుని దివ్యసేవలో నియుక్తుడై యుండును.
కాని బద్ధస్థితిలో గుణములచే ప్రభావితుడై ఆ భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవను మరచియుండును. తత్పలితముగా అతడు భౌతికజగమునందు తన జీవనమునకై తీవ్రసంఘర్షణను కావింపవలసివచ్చును.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 521 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 15 - Purushothama Yoga - 07 🌴*
07. mamaivāṁśo jīva-loke
jīva-bhūtaḥ sanātanaḥ
manaḥ-ṣaṣṭhānīndriyāṇi
prakṛti-sthāni karṣati
🌷 Translation :
The living entities in this conditioned world are My eternal fragmental parts. Due to conditioned life, they are struggling very hard with the six senses, which include the mind.
🌹 Purport :
In this verse the identity of the living being is clearly given. The living entity is the fragmental part and parcel of the Supreme Lord – eternally.
It is not that he assumes individuality in his conditional life and in his liberated state becomes one with the Supreme Lord. He is eternally fragmented. It is clearly said, sanātanaḥ.
According to the Vedic version, the Supreme Lord manifests and expands Himself in innumerable expansions, of which the primary expansions are called viṣṇu-tattva and the secondary expansions are called the living entities. In other words, the viṣṇu-tattva is the personal expansion, and the living entities are the separated expansions.
By His personal expansion, He is manifested in various forms like Lord Rāma, Nṛsiṁha-deva, Viṣṇumūrti and all the predominating Deities in the Vaikuṇṭha planets. The separated expansions, the living entities, are eternally servitors.
The personal expansions of the Supreme Personality of Godhead, the individual identities of the Godhead, are always present. Similarly, the separated expansions of living entities have their identities.
As fragmental parts and parcels of the Supreme Lord, the living entities also have fragmental portions of His qualities, of which independence is one. Every living entity, as an individual soul, has his personal individuality and a minute form of independence.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Sripada Srivallabha Charithamrutham - 309 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj
Chapter 43
*🌻 Description of Sri Anagha Laxmi Sripada’s Vyshnava Maya 🌻*
In the night, after finishing his worship, Sri Bhaskar pundit said, ‘Sirs! Upasana of Srividya, is very great.
In fact, Sripada Srivallabha is the combined form of Maha Saraswathi, Maha Laxmi and Maha Kaali.’ I said, ‘Sir! You said Sripada was the form of Sri Padmavathi Venkateswara.
Now you are saying, He is ‘three maathas’ also. He is also called Anagha with Anagha Devi. I am not able to understand. Please explain in detail.’
*🌻 Sripada’s opulent form 🌻*
That Maha pundit said, ‘Sir! It is said that paramatma is present in all living beings. He is omnipresent from ant to Brahma.
In the avathar of Sripada Srivallabha, He said He was present in ant and Brahma also. So in all this creation, He is in the form of ‘creation’. He is in a state of ‘oneness’ with the chaitanyam of all living beings.
This is the speciality of this avathar. Though He is present in all living beings, the jeevas do not feel His touch in any plane. That is His vyshnava maya. He would say that one should respect the relations, limits and the rules related to them.
When we say He is in the forms of Maha Saraswathi, Maha Laxmi and Maha Kaali, it means that the chaitanyam, which expressed itself in such forms, is Himself. Through His yoga maya, He will be always in a state of ‘oneness’ with those expressed forms.
When He is in a state of oneness with the chaitanyam of Maha Saraswathi, He will also be in the state of ‘oneness’ with the chaitanyam of Chaturmukha Brahma (four faced Brahma) related to Saraswathi.
But he will not be having any touch relation with Maha Saraswathi form or Hiranya Garbha form. Similarly, one atma is said to come in four or five male forms. The ‘Shakti’ of that atma also may take four or five female forms as wifes.
The relation between one male form and one female form is decided by fate and its limitations should be followed strictly. Similarly, He is present as Anagha with Anagha Devi.
This is His ‘ardha nareeswara’ form. But He is in a ‘Yathi’ form as Sripada Srivallabha. The relations and limits of those expressed ‘SagunaSaakara’ forms are said to be followed strictly.
This is dharma sukshmam (subtle dharma). Dharma is different and subtle dharma is different. To extensively rain the divine grace, he is in the form of ‘srishti’ (creation). He is in an absorbed state in ‘srishti’.
The meaning is that the development of humans will happen quickly. He will remain in japa and dhyana. He will not keep that power of tapas. It will be offered to all the creation.
He will use the power of His tapas to remove the worldly problems of His devotees and relieve them from the bonds of karma. The four forms of ‘jaganmatha’ – Maha Saraswathi, Maha Laxmi, Maha Kaali and Rajarajeswari, got manifested for ruling the universe.
Ambika has three levels (1) Individual level (2) Universal level and (3) Transcendental level (beyong these two). Before the formation of ‘shrishti’, the Para Shakti remains in Transcendental level.
She will attract the endless ‘truths’ from paramatma into Her and after taking them into Her chaitanyam, she will give birth to the world ‘srishti’.
Her work is not over after creation. She creates the jeevas, enters them and empowers them. This is Her ‘Viswa sthai’ (universal level).
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 58, 59 / Vishnu Sahasranama Contemplation - 58 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻 58. లోహితాక్షః, लोहिताक्षः, Lohitākṣaḥ 🌻*
*ఓం లోహితాక్షాయ నమః | ॐ लोहिताक्षाय नमः | OM Lohitākṣāya namaḥ*
లోహితే అక్షిణీ యస్య సః ఎర్రని కన్నులు ఎవనికి కలవో అట్టివాడు. అసా వృషభో లోహితాక్షః ఈతడు ఋషభుడును (శ్రేష్ఠుడును) లోహితాక్షుడును అని శ్రుతి (తైత్తిరీయ ఆరణ్యకము 4.42)
:: శ్రీమద్భాగవతము - అష్టమ స్కందము, షష్టోఽధ్యాయము ::
విరిఞ్చో భగవాన్దృష్ట్వా సహ శర్వేణ తాం తనుమ్ ।
స్వచ్ఛాం మరకతశ్యామాం కఞ్జగర్భారుణేక్షణామ్ ॥ 3 ॥
శర్వుణితోగూడి (శివుడు) విరించి (బ్రహ్మ) ఆ భగవంతుడి దివ్య మనోహర విగ్రహాన్ని స్వచ్చమైనదిగను, మరకత శ్యామ వర్ణముగలదిగను, కమలము లోపలి భాగము యొక్క యెఱ్ఱతనము గల కన్నులున్నదానిగను గాంచెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 58 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 58.Lohitākṣaḥ 🌻*
*OM Lohitākṣāya namaḥ*
Lohite akṣiṇī yasya saḥ One whose eyes are tinged red. Asā vr̥ṣabho lohitākṣaḥ The Supreme Lord who is Lohitākṣaḥ (Taittirīya Āraṇyaka 4.42)
Śrīmadbhāgavata - Canto 8, Chapter 6
Viriñco bhagavāndr̥ṣṭvā saha śarveṇa tāṃ tanum,
Svacchāṃ marakataśyāmāṃ kañjagarbhāruṇekṣaṇām. (3)
:: श्रीमद्भागवत - अष्टम स्कंद, षष्टोऽध्याय ::
विरिञ्चो भगवान्दृष्ट्वा सह शर्वेण तां तनुम् ।
स्वच्छां मरकतश्यामां कञ्जगर्भारुणेक्षणाम् ॥ ३ ॥
Lord Brahmā, along with Lord Śiva, saw the crystal clear personal beauty of the Supreme Personality of Godhead, whose blackish body resembles a marakata gem, whose eyes are reddish like the depths of a lotus.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अग्राह्यश्शाश्वतः कृष्णो लोहिताक्षः प्रतर्दनः ।प्रभूतः स्त्रिककुब्धाम पवित्रं मङ्गलं परम् ॥ 7 ॥
అగ్రాహ్యశ్శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః ।ప్రభూతః స్త్రికకుబ్ధామ పవిత్రం మఙ్గళం పరమ్ ॥ 7 ॥
Agrāhyaśśāśvataḥ kr̥ṣṇo lohitākṣaḥ pratardanaḥ ।Prabhūtaḥ strikakubdhāma pavitraṃ maṅgaḷaṃ param ॥ 7 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 59/ Vishnu Sahasranama Contemplation - 59 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻 59. ప్రతర్దనః, प्रतर्दनः, Pratardanaḥ 🌻*
*ఓం ప్రతర్దనాయ నమః | ॐ प्रतर्दनाय नमः | OM Pratardanāya namaḥ*
(ప్రలయే భూతాని) ప్రతర్దయతి (హినస్తి) ప్రలయ సమయమునందు ప్రాణులను హింసించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 59🌹*
📚. Prasad Bharadwaj
*🌻 59.Pratardanaḥ 🌻*
*OM Pratardanāya namaḥ*
(Pralaye bhūtāni) Pratardayati (hinasti) Destroyer of all at the time of cosmic dissolution.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अग्राह्यश्शाश्वतः कृष्णो लोहिताक्षः प्रतर्दनः ।प्रभूतः स्त्रिककुब्धाम पवित्रं मङ्गलं परम् ॥ 7 ॥
అగ్రాహ్యశ్శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః ।ప్రభూతః స్త్రికకుబ్ధామ పవిత్రం మఙ్గళం పరమ్ ॥ 7 ॥
Agrāhyaśśāśvataḥ kr̥ṣṇo lohitākṣaḥ pratardanaḥ ।Prabhūtaḥ strikakubdhāma pavitraṃ maṅgaḷaṃ param ॥ 7 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 78 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఆత్మను తెలుసుకొను విధము -08 🌻*
ఇంకా ఆత్మయొక్క లక్షణాలను విశేషంగా చెప్తున్నారు. ఈ విశేషం గా చెప్పేటటువంటి అంశాలలో ఆత్మకు శరీరం లేనివాడు. అసలు ఆత్మకు శరీరమే లేదు. కుండకు లోపల బయటా ఆకాశం ఎలా సర్వవ్యాపకముగా ఉన్నదో, ఆత్మ ఈ శరీరమునకు లోపల, బయటా అంతటా వ్యాపించి ఉన్నది.
కాబట్టి, ఆత్మకు శరీరము లేదు. ఏ రకమైన శరీరమూ లేదు. అష్టవిధ శరీరములు లేవు. అష్టతనువులు లేవు. కనుక ఆత్మ అశరీరి. శరీరములు అనిత్యములు. శరీరము అంటే అసలు అర్థమేమిటి? ‘శీర్యతే ఇతి శరీరః’ - అంటే, తనకు తానుగా నశించిపోవునది ఏదో, అదే శరీరము. తనకు తా పుట్టినది, తనకు తా నశించిపోవునది.
అనగా అర్థమేమిటంటే, సముద్రపు అలల మీద నురుగు వస్తుంది, ఆ నురుగులో బుడగలు వస్తాయి. ఆ బుడగల మధ్యలో గాలి ఉంటుంది. బుడగల బయట కూడా గాలి వుంటుంది. బుడగలు గాలిలో తేలుతూ ఉంటాయి. ఆ బుడగ ఎంత సేపు ఉంటుంది? ఎంత సేపటికి పోతుంది? అంటే ఎవరైనా చెప్పగలరా? గాలి లోపలా ఉన్నది, గాలి బయటా ఉన్నది. కానీ సముద్రము లేదా ఆ బుడగలో..? ఆ నీళ్ళు లేవా? వీటి అన్నిటి యొక్క సంయోజనీయత ఉన్నట్లుగా తోచుచున్నది.
ఆ గాలి బుడగ బ్రద్దలైంది. బ్రద్దలైతే ఏమైంది? ఆ గాలి గాలిలో కలిసిపోయింది, నీరు నీటిలో కలిసిపోయింది. ఇంక ఎక్కడా ఏమీ లేవు. దానికి రూపమే లేదు, ఆకారమే లేదు. అప్పటివరకూ ఉన్న బుడగ ఎక్కడికి పోయిందయ్యా? ఏ గాలిలో పుట్టిందో, ఆ గాలిలోకే పోయింది. ఏ నీటితో పుట్టిందో, ఆ నీటిలోకే పోయింది. ఏ పంచభూతాలతో పుట్టిందో, ఆ పంచభూతాలలోకే పోయింది.
ఇట్లా క్షణ భంగురమైనటువంటి శరీరము అనంతముగా వ్యాపించి యున్న విశ్వము అనేటటువంటి బ్రహ్మము ఆ బ్రహ్మము యొక్క కాలమానం దృష్ట్యా చూసినప్పుడు, ఒక మానవుడు పుట్టి, జీవించి, పోవడం అనేటటువంటిది ఒక గాలి బుడగతో సమానమైనటువంటిది.
దానికి ఎంత విలువ వుందో, దీనికి అంతే విలువ ఉంది. కాబట్టి, ఆత్మకు శరీరము లేదు. ఎందుకని? ఆత్మ సర్వవ్యాపకమైనటువంటిది. అనంత విశ్వ వ్యాపకమైనటువంటిది. బృహద్వ్యాపకమైనటువంటిది. కాబట్టి అది అశరీరి. శరీరములు అనిత్యములు. జీర్ణించి పోవునవి. పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆత్మ నిత్యుడు. ఎప్పుడైతే ఆ నిత్యత్వం అంటే సర్వకాల సర్వావస్థల యందును ‘ఉండుట’ అనేటటువంటి లక్షణం కలిగియున్నదో ఆ ఆత్మ నిత్యత్వమును కలిగియున్నది.
సర్వ వ్యాపకుడు. ఎంతగా సర్వవ్యాపకుడు అంటే, దీనికి కంటే అవతల ఎల్లలు లేవు ఇక. ఎంతమేరకు చెబితే అంతమేరకు వ్యాపించి ఉన్నది. సర్వము గురించి చెబితే అంత మేరకు వ్యాపకధర్మమును కలిగి వున్నది. అచలుడు - అంతగా వ్యాపించి ఉండటం చేత, కదలడానికే అవకాశం లేనంత స్థితి వరకూ వ్యాపించడం చేత అది (ఆత్మ) కదలికే లేకుండా ఉంది. ఇది అచలము. అంతటా ఎల్లప్పుడూ ఉన్నది. ‘ఉండుట’ అన్నది మాత్రమే కలిగియున్నది.
అందుచేత అనిత్యములైనటువంటి శరీరములందు నిత్యుడై ఉన్నది. శరీరము అనిత్యమే కానీ, ఆత్మ నిత్యము. ఆత్మ అనే ఆధారమే లేకుండా శరీరము అనేటటువంటిది ఉండే అవకాశమే లేదు. శరీరము - అనునది ఉన్నట్లుగా తోచినప్పటికి, అది ఆత్మ అనే దానియందు అంశీభూతమై యున్నది.
అనేకముగా అఖండముగా వ్యాపించి ఉన్నటువంటి సముద్రము నుంచి అనేకములైన బుడగలు పుట్టినంత మాత్రమున, అలలు పుట్టినంత మాత్రమున అవన్నీ సముద్రములో భాగములు కావా? అట్లే, అఖండముగా వ్యాపించియున్నటువంటి బ్రహ్మమునందు అనేక జీవులు, ఈ అలలవలె, నురుగు వలె, బుడగల వలె ఉత్పన్నమౌతున్నవి.
అయినచొ అందంతటను వ్యాపించినది ఒకే ఒక బ్రహ్మము మాత్రమే. ఒకే ఒక ఆత్మయే. అట్టి గొప్పవాడును సర్వవ్యాపి అగు ఆత్మ, ధ్యానాదుల మూలమున తెలుసుకున్న జ్ఞాని శోకింపడు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. శోక రహితమైన స్థితిని.. బుద్ధుడు కూడా చెప్పినటువంటి పద్ధతి ఇదే! - విద్యా సాగర్ స్వామి
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివగీత - 94 / The Siva-Gita - 94 🌹*
*🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ
ద్వాదశాధ్యాయము
*🌻. ఉపాసనా విధి - 2 🌻*
ఆపిచేత్సురురాచారో - భజతే మామనన్యభాక్,
సాదురెవ సమస్తవ్య - స్సమృగ్వ్యవసితో హిస : 7
స్వజీవ త్వేనయోవేత్తి - మామేవైక మనస్యదే :,
తంన స్శ్రుశంతి పాపని - బ్రహ్మ హత్యాది కాన్యాపి. 8
ఉపాసావిధయస్త్రత్ర - చత్వార: పరికీర్తితా:,
సంపదారోప సంసర్గా - ధ్యాసా ఇతి మనీషిభి: 9
అల్పస్య చాధికత్వేన - గుణ యోగా ద్విచింత నమ్,
అనంతం వైమన ఇతి - సంపద్విధి రుదీరిత: 10
దుర్మార్గుడైనను పశ్చాతాపమును పొంది, అధిక శ్రద్ధ తో సేవింపగ అట్టి వాడు సజ్జనుండే యగును. ఇతర చింత లేమియు లేక త్వమేహం అనే బుద్ధి చేత నన్నెవడు ఉపశించునో అట్టి వాడిని బ్రహ్మ హత్యాది పాపములు స్ప్రుశింప జాలవు.
విద్వాంసుల చేత సంప దారోపము, సంపర్గము, అధ్యాస అని నాలుగు రకాలుగా ఉపాసన విధించనైనది. గుణ సంధము చేత స్వల్ప మైన దానిని అధికము 'మనస్సు అనంతము' అని, చింతన చయట సంపద్విధి యని చెప్ప బడినది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 The Siva-Gita - 94 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj
Chapter 12
*🌻Upasana Jnanaphalam - 2 🌻*
Even if a sinner being remorseful, if does Upasana to me such a sinner would be hailed as equivalent to a forest recluse sage. One who keeps firm devotion in me and sees no difference between him and me, such a devotee, would remain unstained even by Brahmahatya sin! Scholars categorized the Upasana as being of four types viz. Sampada, ropam, Samvargam, Adhyasa.
Due to the relation with qualities, seeing little as more s called as Sampad vidhi.
N.B:Here whatever Lord Shiva mentioned about the grace what he confers on his devotees, same is stated in mahabharata by sage Upamanyu in more detail. He says that whosoever remains devoted to Shankara, even if he is a great sinner, remains untouched with sins and becomes as high as a saint.
Mahabharata narrates Lord Shiva's grace in a very detailed manner which is out of scope of this text. The sum and substance is, there is no other grace higher than the grace of Lord Shiva. A devotee of Shiva would never fall. Such is the bond between the devotee and the supreme godhead lord Shiva!
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Guru Geeta - Datta Vaakya - 97 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
90
If we analyze the meaning of the previous 3 slokas, what do we see?
We see that TAT is indivisible, that TVAM is small, that TVAM merges into TAT and becomes one. This is a very great principle. The essence of all scriptures is in this. To help us understand this easily, let’s look at an example.
Say, there are two people Venkayya and Subayya. They have different names, but they are both human beings. Let’s assume one’s from Vijaywada and the other’s from Mysore. Although these are two different towns, both people live on earth.
One speaks gently, the other speaks brashly. But, they both speak with their tongue. One eats vegetarian food, the other eats something else, but both are putting food in their stomach.
Analyzing in this manner, even though we see a few differences between the two, if we broaden our minds and take a higher level perspective, we can see that they are both living on earth, they are both eating alike, talking and living as human beings. That means, there are no differences between them when viewed from that angle.
But, for everyday affairs, we have to refer to them as two different people – Venkayya and Subayya. In reality, however, this small difference merges into the indivisible because they are both human beings and there is no difference between them.
The TVAM and TAT are similar to this. Becoming one is what is ASI. Let’s examine this from a different angle. The sun, stars, time and yugas are all illuminated. We can see them all. Why can we see them?
How do we see them? We should think carefully. Because, you, the one who is seeing, is illuminated, all these things are illuminated. If that is the case, why do we see darkness? Because you also have darkness in you, you can see darkness.
When you are really awake, when you are completely illuminated, there is no darkness. Everything is illuminated. This may sound like a stubborn argument, but think about it carefully, analyze it and meditate on it. Only then will you realize the truth in it.
This is the meaning of the term ASI. Only the Guru is capable of teaching this concept. Here, teaching doesn’t mean theorizing or lecturing on the subject or just talking for 2-3 hours.
“He can say whatever he wants to, he is a Guru. He knows everything, so whatever he says is the word of God”. True, while that may be the case, that may not be the right approach to talk or teach.
So, how should one talk? The teaching should cause a change in heart. When the Guru talks, we will feel a change in our heart.
Others may talk for 2 hours, or 3 hours or even 6 hours while standing. But, only Guru has the capability to move you, to bring a change in heart. Obeisance to such a Guru.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 83 / Sri Gajanan Maharaj Life History - 83 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. 17వ అధ్యాయము - 1🌻*
అత్యంత పవిత్రమయినవాడా మీకు జై. భక్తులను రక్షించేవాడా మీకు జై. చీకటిని పారద్రోలేవాడా మీకు జై. దిగజారిన వాళ్ళను కాపాడేవాడా, ఓ భగవంతుడా ! హిరణ్యకశ్యపుడు చాలాక్రూరుడు, మంచివాళ్ళకు శత్రువు. ప్రహ్లాదుడిని రక్షించడానికి మీరు స్థంబంలోనుండి ప్రకటించి అతనిని సంహరించారు. ఆ సమయంలో మీరు ఉగ్ర స్వరూపం కలిగి ఉన్నారు. భయంకరమైన పళ్ళతోనూ, దౌడలతోనూ, జుత్తు మెడమీద వరకు పాకుతూ, నిప్పులాంటి ఎర్రని కళ్ళు పూర్తి బ్రహ్మాండాన్ని దహనం చేద్దామన్నట్టు ఉన్నాయి.
కానీ ఈవిధమయిన భయానక అవతారానికి పులిపిల్లలు తల్లిపులి ఒడిలో ఆడుకున్నట్టుగా, భక్తులు భయపడలేదు, మీయొక్క ఈ స్వరూపంచూసి లక్ష్మీదేవికూడా మీ దగ్గరకు రావడానికి ధైర్యం చెయ్యలేదు కానీ భక్తులు మీపాదాలు స్పర్శించారు. ఓలక్ష్మీకాంతా మీరు మీ భక్తులను ప్రేమిస్తారు. వారికోరికలు అన్నీమీరు పూర్తిచేస్తూ వాళ్లకి ఎప్పుడూ లేదు, కాదు అని అనరని యోగులు చెపుతారు.
ఇప్పుడు దాసగణు మీకు నమస్కరించి, నన్ను నిర్భయుడునిచేసి, మీయొక్క ఆఘనతను నిలబెట్టుకోమని ప్రార్ధిస్తున్నాడు. అకోలాలో చాలామంది శ్రీగజానన్ భక్తులు ఉన్నారు. వీళ్ళఇళ్ళకి ఆయన తరుచు వెళుతూ ఉండేవారు. వీళ్ళలో చపడగానికి చెందిన బాలకృష్ణ ఖటావ్శేల్, గొండులాల్ కుమారుడయిన బచులాల్, జిజాబాయి పండిత్ ఇంకా అనేకులు ఉన్నారు.
ఒకసారి శ్రీమహారాజు అకోలావచ్చి ఖటావ్ మిల్లులో ఉన్నారు. విష్ణుసా అనే శ్రీమహారాజు భక్తుడు, శ్రీమహారాజును తనదగ్గరకు మల్కాపూరుకి తీసుకువెళ్ళలని కోరుకుని, భాస్కరును దీనికి ఏర్పాటు చెయ్యమని అర్ధించాడు. అడగాంలో నిర్వాణం పొందిన భాస్కరు ఇతనే. భాస్కరు శ్రీమహారాజు నిత్యావసరాలు చూసేందుకు ఆయనతో ఉన్నాడు.
శ్రీమహారాజు కృపపొందడానికి, విష్ణుసా ఇతనిమీద ఆధారపడి ఉన్నాడు. విష్ణుసా ఆహ్వనంతో వచ్చాడు కావున, మల్కాపూరు సందర్శించ వలసిందిగా భాస్కరు శ్రీమహారాజును అర్ధించాడు. భాస్కరా నేను మల్కాపూరు వెళ్ళాలని కోరుకోటంలేదు, కాబట్టి నన్ను బలవంతం చెయ్యకు. నువ్వు ఇంకా ఎక్కువ బలవంతంచేస్తే నువ్వు నిరశ పొందేలా చేస్తుంది అని నేను చెపుతున్నాను. తాడును ఎక్కువ సాగదీస్తే అది తెగుతుంది.
నేను ఇక్కడనుండి కదల దలుచుకోలేదు, కావున నన్ను ఇబ్బంది పెట్టకు అని శ్రీమహారాజు అన్నారు. మీరు ఏమి అన్నాసరే, విష్ణుసా కొరకు మల్కాపూరు సందర్శించాలని మిమ్మల్ని నేను అర్ధిస్తున్నాను. నేను మీప్రియమైన భక్తుడిని. మీరు మల్కాపూరు వస్తారని నేను విష్ణుసాకు వాగ్దానంచేసాను. మీ ఈనిరాకరణకు నేను ఖంగుతిన్నాను, దయచేసి నా వాగ్దానాన్ని ఆదరించండి. మనం మల్కాపూరు వెళదాం అని భాస్కరు అన్నాడు.
ఈవిదంగా బలవంతం చేసి, మల్కాపూరు వెళ్ళేందుకు శ్రీగజానన్ మహారాజును భాస్కరు రైల్వేస్టేషనుకు తీసుకు వచ్చాడు. భాస్కరు అభ్యర్ధన మీద స్టేషను మాష్టరు ఒకబోగి శ్రీమహారాజు కొరకు ఖాలీ చేసి ఇస్తాడు. రైలు బైలుదేరేవరకు, శ్రీమహారాజు కదలలేదు, ఏమీ మాట్లాడలేదు. రైలు బయలుదేరేందుకు గంటా మొగినప్పుడు, ఆయన ఎవరూగమనించకుండా, ఖాలీచేసిన బోగీలో కాకుండా, మహిళల డబ్బాలో ఎక్కుతారు.
ఈనగ్న యోగిని చూడడంతో మహిళలు భయపడి, పోలీసుకు తెలియపరిచారు. పోలీసు ఆఫీసరు వచ్చి, ఓదిగంబరా మహిళల డబ్బాలో ఎలా ఎక్కావు ? నీకు బుద్ధిలేదా అని అంటూ డబ్బానుండి బయటకు ఈడవడం మొదలు పెట్టాడు. శ్రీమహారాజు ఒక్కఊపుతో అతని చెయ్యివదిలించుకొని, ఆ ఆఫీసరు అంటే భయం లేకుండా అక్కడనే కూర్చున్నారు. అప్పుడు ఆ ఆఫీసరు, స్టేషను మాష్టరు దగ్గరకు వెళ్ళి, అతనిని మహిళల డబ్బాదగ్గరకు తెచ్చాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Gajanan Maharaj Life History - 83 🌹*
✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj
*🌻 Chapter 17 - part 1 🌻*
Shri Ganeshayanmah! Jai to you, the most auspicious one! Jai to you the protector of devotees. Jai to you to recoverer or darkness. O Saviour of the fallen. O God.
Hiranyakashyap was very cruel and an enemy of good people. You killed him by emerging out of pillar to protect Pralhad. That time you had a peerless form with fearful teeth and jaws, mane flowing on the neck and your fire red eyes looked as if they were going to burn the entire universe. But this horrible appearance did not scare the devotees, like cubs playing in the laps of tiger.
Looking to your appearance even Lakshmi dared not go near you, but the devotee touched your feet. O Lakshmikant, you are lover of your devotees and saints say that you fulfill aIl their desires and never say no to them. Now Dasganu prostrates before you and prays to keep up this fame of yours by making me fearless.
There were many devotees of Shri Gajanan Maharaj at Akola to whom he frequently used to go to. Some of them were Bapukrishna of Chapadgaon, Khatauseth, Bacchulal son of Gondulal and Jijibai Pandit. Once Shri Gajanan Maharaj came to Akola and stayed at Khatau mills. Vishnusa, a devotee of Shri Gajanan Maharaj wished to take Shri Gajanan Maharaj to Malkapur, and requested Bhaskar to arrange it.
This was the same Bhaskar who had later attained Nirvan at Adgaon. He was with Shri Gajanan Maharaj to look after his needs and comfort. Vishnusa depended on him for getting the grace of Shri Gajanan Maharaj . Bhaskar requested Shri Gajanan Maharaj to Visit Malkapur as Vishnusa had come to invite him.
Shri Gajanan Maharaj said, Bhaskara, I don't wish to go to Malkapur so don't force me. I tell you that if you force me, it will make you regret. If a rope is stretched too much, it breaks. I don't wish to move from here, so do not bother me at all. Bhaskara said, Whatever you may say.
I still request you to visit Malkapur for the sake of Vishnusa. I, your most beloved devotee, have promised Vishnusa that you will go to him at Malkapur. Your refusal is shocking to me. Please honor my promise and let us go to Malkapur. Forcing like this, Bhaskar brought Shri Gajanan Maharaj to Railway station for going to Malkapur.
On Bhaskara's request the station master got one compartment vacated for Shri Gajanan Maharaj . Shri Gajanan Maharaj did not move, nor said anything till the departure of the train. When the bell rang for the train to start, he moves unnoticed and instead of entering the vacant compartment, entered the ladies compartment.
The sight of the naked saint scared the ladies and they immediately informed the police. The Officer of the police came and started dragging him out of the compartment saying, You naked man, don’t you have any sense. How did you enter ladies compartment?” With a jerk Shri Gajanan Maharaj freed his hand and continued to sit there without fear of that officer.
Then the police Officer went to the Station Master and brought him to the ladies compartment.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 76 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 26 🌻*
324. స్థూలకాయముతో అపవిత్రుడైన మానవుడు దేవతల కంటే తక్కువ స్థితి గలవాడు. కానీ మానవుడు వానిలో అంతర్నిహితమైయున్న శక్యతల వలన నిజముగా శ్రేష్ఠుడు.
325. మానవుడు తన అపరిపూర్ణతలను, హద్దులను బలహీనతలను అనుభవించుచు తన నిజమైన శక్తిని, పవిత్రతను అనుభూతి నొందుటలో (అంతర్గతముగా) శక్యతగా పరిపక్వమైనవాడు.
ఈశక్యతయు, పవిత్రతయు ప్రధాన దేవదూతలకు కూడా అందుబాటులో లేనిది.
మౌఖిక ఐక్యము :__
326. మానవుని ఆధ్యాత్మిక వికాసములలోనిది యొకటి.అధిక సంఖ్యాకులైన మానవులు ఏదియో ఒక అవతారమును నమ్మి ఆతడు చెప్పు సందేశమందు విశ్వాసము కలిగి యుందురు .ఇక్కడ భగవంతునితో గల ఐక్యత మాటల ద్వారానే అంగీకరించుట జరుగుచున్నది .
దానికి తోడు మతగురువు లొసంగు మతధర్మములను పాటించుటతో , అది , రాబోవు ఆధ్యాత్మిక మార్గములో ప్రవేశించుటకు మానవుని తయారు చేయుచున్నది .
327. సామాన్య మానవుడు , మానవునిగా, తనను ప్రతి వారిలో ప్రతిదానిలో చూచును .ఇతడు భూమికలను గురించి వివరించలేడు .
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 41, 42 / Sri Lalitha Chaitanya Vijnanam - 41, 42 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*18. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతునాభ జంఘిక*
*గూఢగుల్ఫా కూర్మపృష్ట జయిష్ణు ప్రపదాన్విత*
*🌻 41. 'ఇంద్రగోప పరిక్షిప్త స్మరతునాభ జంఘిక 🌻*
దేవి పిక్కలు అమ్ములపాదులతో పోల్చబడినవి. అవి ఎర్రగ
నున్నవని తెలుపబడినవి. మన్మథుడు పుష్పబాణముల నుంచు పొదులవలె తెలుపబడినవి. ఎర్రని రంగు అనగా ఆరుద్ర పురుగుల రంగు. అది అందమైన ఎరుపు.
కదంబ పుష్పపు ఎరుపు. అట్లు అందమైన ఎరుపుతో కాంతివంతముగ నున్న అమ్ముల పొదివలె, అదియును మన్మథుని అమ్ములపొదివలె శ్రీదేవి పిక్కలు గోచరించుచున్నవని భావము. ఆ అమ్ములపొదిలో మన్మథుని బాణములు గోప్యముగ రక్షింపబడుచున్నవి.
అవి సమస్త కామములను పూరింపగల శక్తిగలవి. పిక్కల యందుగల బలమును బట్టి జీవునికి కామమునందు గల బలము తెలియును.
శ్రీదేవి సమస్త కామములను వర్షింపగల శక్తి స్వరూపిణి. మోక్షకాములకు కూడ మోక్షము నందించగల శక్తి ఆమె పిక్కల కున్నది. బలహీనపు పిక్కలు గలవారు అమ్మవారి పిక్కల వర్ణమును ఆరాధన చేసినచో కామపూరణము సిద్ధించును.
ధర్మమునకు విరుద్ధము కాని కామము దివ్యమే. కామి కానివాడు మోక్షకామి కూడ కాలేడు.
కావున కామమే సృష్టికిని అందుండి మోక్షము నకును ఆధారమగు శక్తి. అట్టి కామశక్తి పిక్కల యందుండునని శాస్త్రములు తెలుపుచున్నవి. సమస్త కామములనెడు అమ్ములను అమ్మవారు తన ఎఱ్ఱని, అందమైన పిక్కలనెడు పొదిలో రహస్యముగ దాచి ఉంచెనని అర్థము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 41 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
41. Indragopa- parikṣipta- smaratūṇābha-jaṅghikā इन्द्रगोप-परिक्षिप्त-स्मरतूणाभ-जङ्घिका (41)
Her calf muscles look like the quiver of Manmatha, the god of love.
Saundarya Laharī (verse 83) says “In order to win the heart of your Lord Śiva, the five arrowed cupid God of love has made your legs into an arrow case with ten arrows (toe nails).”
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 42 / Sri Lalitha Chaitanya Vijnanam - 42 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*18. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతునాభ జంఘిక*
*గూఢగుల్ఫా కూర్మపృష్ట జయిష్ణు ప్రపదాన్విత*
*🌻 42. 'గూఢగుల్ఫా' 🌻*
బలిష్ఠమైన చీలమండలు గలది దేవి అని అర్థము. గుల్ఫ అను పదమునకు రక్షణ చేయునది అని అర్థము. గూఢ అనగా రహస్యముగ అని అర్థము. రహస్యముగ తనను ధ్యానించువానిని రక్షించు స్వభావము గలది శ్రీదేవి అని తెలియవలెను.
రహస్యముగ రక్షించుట ఇహజీవనమందలి సమస్యల నుండియే గాక ఇహమునుంచి కూడ రహస్యముగ శ్రీదేవి రక్షించ గలదు.
ఆమె మూల ప్రకృతి. ఆమె నుండియే అష్ట ప్రకృతులు ఉద్భవించినవి. ఆమె అవ్యక్తము యొక్క వ్యక్తరూపమే. ఇష్ట ప్రకృతులు ఆవరణములు సృష్టించగ ఆమె అవ్యక్తమునకు మొదటి ఆవరణముగ నిలచినది. ఆమె పరాప్రకృతి. ఆమె నుండి ఉద్భవించినవి అపర ప్రకృతులు.
అపర ప్రకృతుల నుండి దాటించి పరాప్రకృతి అనుభవము నిచ్చి అవ్యక్తమునకు గొనిపోవ సమర్ధురాలు శ్రీదేవియే. అమ్మవారి ఆరాధన సకల శుభములను రహస్య ముగ అందించును. బాహాటముగ రక్షణము గోచరింపక పోయినను అమ్మ తప్పక రక్షించును అను దృఢ విశ్వాసముతో ధ్యానించు వారికి ఆమె రక్షణ లభించును.
చీలమండలను ఒకదానిపై నొకటి పేర్చి గుదము క్రిందుగ నుంచి సిద్ధాసనము వహించి ధ్యానించువారికి ప్రకృతి సహకరించి ప్రజ్ఞను
ఊర్థ్వగతి చేర్చి ఆజ్ఞయందు స్థిరపరచునని హఠయోగము బోధించుచున్నది. ఇది కుండలిని ప్రచోదన రహస్యవిద్య. దీని కధిదేవతకూడ అమ్మయే.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 42 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 42. Gūḍha-gulphā गूढ-गुल्फा (42) 🌻*
She has round and well shaped ankles that are hidden.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 3. చంద్రఘంట - అన్నపూర్ణ దేవి 🌹
📚 . ప్రసాద్ భరద్వాజ
🌷. ప్రార్ధనా శ్లోకము :
పిండజప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా ।
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ॥
🌷. అలంకారము : అన్నపూర్ణ దేవి - లేత రంగు
🌷. నివేదనం : కొబ్బరి అన్నం
🌷. మహిమ :
దుర్గామాత మూడవ నామమైన చంద్రఘంటా స్వరూపం మిక్కిలి శాంతిప్రదము, కల్యాణకారకము. తన శిరస్సుపై అర్ధచంద్రుడు ఘంటాకృతిగా వుండడం వల్ల ఈ నామం ఏర్పడింది. ఈమెని ఆరాధిస్తే సింహపరాక్రమముతో నిర్భయంగా ఉంటారు. జపమాల,ఘంట, బాణం, పదునైన ఖడ్గం, శ్వేత పద్మం, పానపాత్ర, త్రిశూలం, ధనుస్సు, కమలం, గద ధరించి మహాలావణ్య శోభతో ప్రకాశిస్తుంది.
🌷. చరిత్ర :
దుర్గామాతయొక్క మూడవ శక్తి నామము ‘చంద్రఘంట’. నవరాత్రి ఉత్సవాలలో మూడవరోజున ఈమె విగ్రహానికే పూజాపురస్కారాలు జరుగుతాయి. ఈ స్వరూపము మిక్కిలి శాంతిప్రదము, కల్యాణ కారకము. ఈమె తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘాంటాకృతిలో ఉండటంవల్ల ఈమెకు ‘చంద్రఘంట’ అనే పేరు స్థిరపడింది. ఈమె శరీరకాంతి బంగారువన్నెలో మిలమిలలాడుతుటుంది. తన పది చేతులలో – ఖడ్గము మొదలయిన శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించి ఉంటుంది. సర్వదా సమరసన్నాహయై యుద్ధముద్రలో ఉండే దివ్య మంగళ స్వరూపం. ఈమె గంటనుండి వెలువడే భయంకర ధ్వనులను విన్నంతనే క్రూరులైన దుష్టులు గడగడలాడిపోతారు.
నవరాత్రి దుర్గాపూజలలో మూడవ రోజు సేవ మిక్కిలి మహిమోపేతమైనది. ఆ రోజు సాధకుని మనస్సు మణిపూరక చక్రాన్ని ప్రవేశిస్తుంది. చంద్రఘంటాదేవి కృపవలన ఉపాసకునికి దివ్య వస్తు సందర్శనం కలుగుతుందని చెబుతారు. దివ్య సుగంధ అనుభవము కూడా సిద్ధిస్తుంది. అలాగే వివిధాలైన దివ్యధ్వనులు కూడా వినిపిస్తాయి. ఈ దివ్యానుభవ అనుభూతికొరకు, సాధకుడు సావధానుడై ఉండాలి.
ఈ మాత కృపవలన సాధకుని సమస్త పాపాలూ, బాధలూ తొలగిపోతాయి. ఈమె ఆరాధన సద్యః ఫలదాయకము. ఈమె నిరంతరమూ యుద్దసన్నద్ధురాలై ఉన్నట్లు దర్శనమిస్తుంది కనుక భక్తుల కష్టాలను అతి శీఘ్రముగా నివారిస్తుంది. ఈ సింహవాహనను ఉపాసించేవారు సింహసదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉంటారు. ఈమె ఘాంటానాదము సంతతము భక్తులను భూతప్రేతాది బాధలనుండి కాపాడుతూ ఉంటుంది. ఈమెను సేవించినంతనే శరణాగతుల రక్షణకై అభయఘంట ధ్వనిస్తూ ఉంటుంది.
ఈ దేవీ స్వరూపము దుష్టులను అణచివేయటంలో, హతమార్చుటంలో అను క్షణమూ సన్నద్ధురాలై ఉండునదే; అయినప్పటికీ భక్తులకూ, ఉపాసకులకూ ఈమె స్వరూపము మిక్కిలి సౌమ్యముగానూ, ప్రశాంతముగానూ కనబడుతూ ఉంటుంది. ఈమెను ఆరాధించడంవల్ల సాధకులలో వీరత్వ నిర్భయత్వములతోపాటు సౌమ్యతా, వినమ్రతలు పెంపొందుతుంటాయి. వారి నేత్రాలలోని కాంతులు, ముఖవర్చస్సు, శరీర శోభలు ఇనుమడిస్తూ, సద్గుణములు వృద్ధిచెందుతుంటాయి. వారి కంఠస్వరములలో అలౌకికమైన దివ్యమాధుర్యము రాశిగా ఏర్పడుతుంది. చంద్రఘంటాదేవిని భజించేవారు, ఉపాసించేవారు ఎక్కడికి వెళ్ళినా వారిని దర్శించిన వారందరూ సుఖశాంతులను పొందుతారు. ఇలాంటి ఉత్తమ సాధకుల శరీరాలనుండి దివ్యమూ, ప్రకాశవంతమూ అయిన తేజస్సు బహిర్గతము అవుతూ ఉంటుంది. ఈ దివ్య ప్రక్రియ సామాన్యులదృష్టికి గోచరించదు. కానీ ఉత్తమ సాధకులూ, వారి అనుయాయులు మాత్రము వీటిని గ్రహించి, అనుభూతిని పొందగలరు.
మనము త్రికరణశుద్ధిగా విధ్యుక్తకర్మలను ఆచరిస్తూ, పవిత్రమైన అంతఃకరణ కలిగి చంద్రఘాంటాదేవిని శరణుజొచ్చి, ఆమెను ఉపాసించడానికీ, ఆరాధించడానికీ తత్పరులమై ఉండాలి. అలాంటి ఉపాసన ప్రభావము వల్ల, మనము సమస్త సాంసారిక కష్టములనుండి విముక్తులమై, సహజంగానే పరమపద ప్రాప్తికి అర్హులమవుతాము. నిరంతరమూ ఈ దేవి పవిత్రమూర్తిని ధ్యానిస్తూ మనము సాధనలో అగ్రగణ్యులమవ్వటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. దేవి ధ్యానము మనకు ఇహపర లోకాలలో పరమ కల్యాణదాయకమై సద్గతులను ప్రాప్తింపజేస్తుంది.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 9 / Sri Devi Mahatyam - Durga Saptasati - 9 🌹*
✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ
*అధ్యాయము 2*
*🌻. మహిషాసుర సైన్యవధ - 3 🌻*
దేవతలు, ఋషులు తనను కొనియాడుచుండగా, ఆయాస లక్షణాలు ఏమీ లేని ముఖంతో, ఈశ్వరి అసుర దేహాలపై తన శస్త్రాస్త్రాలను ప్రయోగించింది.
దేవి వాహనమైన సింహం కూడా కోపంతో జూలు విదుర్చుచు అరణ్యంలో కార్చిచ్చువలె అసురసైన్యంలో సంచరించింది. యుద్ధం చేస్తూ దేవి విడిచే నిట్టూర్పులు వెంటనే నూర్లకొలది, వేలకొలది ఆమె సైన్యగణంగా రూపొందుచున్నాయి.
దేవి శక్తిచే అభివృద్ధి నొందుతున్న ఉత్సాహంతో ఈ సైన్యం గండ్రగొడ్డళ్ళతో, గుదియులతో,
అడ్డకత్తులతో తాకి అసురగణాలను నాశమొనర్చెను. ఈ సైన్యంలో కొందఱు ఆ యుద్ధమహోత్సవంలో తప్పెటలు కొట్టారు; కొందరు శంఖాలు ఊదారు. (50-54)
మణికొందఱు మృదంగం వాయించారు. అంతట దేవి తన త్రిశూలంతో, గదతో, బల్లెంలు కురిపించడంతో, ఖడ్గాదులతో నలకడంచేత, నూర్లకొలది మహాసురులను వధించింది. కొందఱిని తన ఘంటానినాదంతో అవశులైన వారిని పడద్రోసింది. ఇతరులను తన పాశంతో బంధించి నేలపై ఈడ్చింది. కొందఱు తీక్ష్మమైన ఆమె ఖడ్గపు వ్రేటులచే రెండుగా నఱకబడ్డారు.
ఇతరులు తీవ్రమైన ఆమె గదదెబ్బలు తిని భూమిపై పడిపోయారు. మరికొందరు ఆమె రొకటిపోటులతో
తీవ్రంగా గాయపడి నెత్తురు కక్కుకున్నారు. కొందరి వక్షం ఆమె త్రిశూల పోటుచే భిన్నమవడంతో భూమిపై పడిపోయారు. (55-59)
కొందరు సురవైరులు ఎడతెగక గ్రుచ్చుకొంటున్న బాణసమూహంచే ముళ్ళపందులను పోలి రణాంగణంలో ప్రాణాలు వదిలారు. కొందరి బాహువులు, కొందరి కంఠాలు తెగిపోయాయి. కొందరి శిరస్సులు నేలపై దొర్లాడాయి. కొందరి నడుములు ఖండింపబడ్డాయి. కొందరు మహాసురులు పిక్కలు తెగిపోవడంతో భూమిపై కూలారు. (60-61)
ఒకే చేయి, ఒకే కన్ను, ఒకే కాలు నిలిచి ఉన్న కొందరిని దేవి మరల రెండు ముక్కలుగా ఖండించింది. మరికొందరు శిరస్సులు ఛేదింపబడి పడిపోయి మళ్ళీ లేచారు. (62)
కొన్ని మొండాలు ఉత్తమాయుధాలు తీసుకుని దేవితో పోరాడాయి. మరికొన్ని మొండాలు ఆ యుద్ధంలో వాద్యాల లయను అనుసరించి నృత్యం చేసాయి. (63)
ఇతర మహాసురుల మొండాలు ఖడ్గాలు, బల్లాలు, కుంతములు ఇంకా చేతబట్టుకుని అప్పుడే తెగిన తలలతో “ఆగు, ఆగు” అని దేవిని ఉద్దేశించి కేకలు వేసాయి.
ఆ యుద్ధం జరిగిన రంగం అసురులు, ఏనుగులు, గుఱ్ఱములు, రథములు కూలి ఉండడం చేత నడువ శక్యంకాకుండా ఉంది. అసురుల, వారి ఏనుగుల, గుజ్రాల రక్తసమూహం వెంటనే మహానదీరూపమై ఆ సైన్యం మధ్యలో ప్రవహించింది.
గడ్డి, కట్టెల పెద్దరాశిని అగ్ని ఎలా క్షయమొనరుస్తుందో అలా ఆ అసుర మహాసైన్యాన్ని అంబిక క్షణమాత్రాన నాశనం చేసింది.
(64–67)
దేవి వాహనమైన సింహం జూలు విదుర్చుచు, మహానాదం చేస్తూ, సురవైరుల దేహాలలో ప్రాణాలకై వెదకుతున్నట్లు ఆ రణరంగంలో సంచరించింది. (68)
అక్కడ దేవీగణాలు అసురులతో చేసిన యుద్ధవైఖరిని చూసి సంతుష్టులై దేవతలు పుష్పవర్షాన్ని కురిపించారు. (69)
శ్రీమార్కండేయ పురాణమునందలి సావర్ణి మన్వంతరమున “దేవీ మాహాత్మ్యము” లో “మహిషాసుర సైన్యవధ” యను పేరిటి ద్వితీయాధ్యాయము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 9 🌹*
✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj
*CHAPTER 2:*
*🌻 Slaughter of the armies of Mahisasura - 3 🌻*
49-58. They began to strike her with swords in order to kill her. Showering her own weapons and arms, that Devi Chandika very easily cut into pieces all those weapons and arms.
Without any strain on her face, and with gods and sages extolling her, the Isvari threw her weapons and arms at the bodies of the asuras.
And the lion also which carried the Devi, shaking its mane in rage, stalked among the hosts of the asuras like a conflagration amidst the forests. The sighs which Ambika, engaged in the battle, heaved became at once her battalions by hundreds and thousands.
Energized by the power of the Devi, these (battalions) fought with axes, javelins, swords, halberds, and destroyed the asuras. Of these battalions, some beat drums, some blew conches and others played on tabors in that great martial festival.
Then the Devi killed hundreds of asuras with her trident, club, showers of spears, swords and the like, and threw down others who were stupefied by the noise of her bell; and binding others with her noose, she dragged them on the ground.
Some were split into two by the sharp slashes of her sword, and others, smashed by the blows of her mace, lay down on the ground; and some severely hammered by club vomited forth blood.
59-61. Pierced in the breast by her trident, some fell on the ground. Pierced all over by her arrows and resembling porcupines, some of the enemies of devas gave up their lives on that field of battle.
Some had their arms cut off, some, their necks broken the heads of others rolled down; some others were torn asunder in the middle of their trunks, and some great asuras fell on the ground with their legs severed.
62. Some rendered one-armed, one-eyed, and one-legged were again clove in twain by the Devi. And others, though rendered headless, fell and rose again.
63. Headless trunks fought with the Devi with best weapons in their hands. Some of these headless trunks danced there in the battle to the rhythm of the musical instruments.
64-65. The trunks of some other great asuras, with their swords, spears and lances still in their hands, shouted at the Devi with their just severed heads, 'Stop, stop'.
That part of earth where the battle was fought became impassable with the asuras, elephants and horses and chariots that had been felled.
66-67. The profuse blood from the asuras, elephants and horses flowed immediately like large rivers amidst that army of the asuras.
As fire consumes a huge heap of straw and wood, so did Ambika destroy that vast army of asuras in no time.
68-69. And her carrier-lion, thundering aloud with quivering mane, prowled about in the battlefield, appearing to search out the vital breaths from the bodies of the enemies of devas.
In that battlefield the battalions of the Devi fought in such a manner with the asuras that the devas in heaven, showering flowers, extolled them.
Here ends the second chapter called 'Slaughter of the armies of Mahishasura' of Devi-mahatmya in Markandeya-purana, during the period of Savarni, the Manu.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 251 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴*
58. అధ్యాయము - 13
*🌻. నారదునకు శాపము - 1 🌻*
నారదుడిట్లు పలికెను -
హే బ్రహ్మన్ ! విధీ! నీవు మహా బుద్ధిశాలివి. ప్రవక్తలలో శ్రేష్ఠుడవు. దక్షుడు ప్రీతితో ఇంటికి వెళ్లిన తరువాత ఏమయినది? మాకు చెప్పుము (1).
బ్రహ్మ ఇట్లు పలికెను -
దక్ష ప్రజాపతి ఆనందముతో నిండిన మనస్సు గలవాడై తన ఆశ్రమమునకు వెళ్లి నా ఆజ్ఞచే అనేక తెరంగుల మానసిక సృష్టిని చేసెను (2). దక్ష ప్రజాపతి ఆ సృష్టిలో వృద్ధి లేకపోవుటను గాంచి తండ్రియగు నాకు నివేదించెను (3).
దక్షుడిట్లు పలికెను -
హే బ్రహ్మన్! తండ్రీ! ప్రజాపతీ! ప్రభూ! నాచే సృష్టింపబడిన సంతానములో వృద్ధి ఏమియూ కానవచ్చుట లేదు . ఎంతమందిని సృష్టించితినో, అంతమందియే ఉన్నారు (4). హే ప్రజానాథా! నేను ఏమి చేయుదును? ఈ సంతానము తనంత తాను వృద్ధి పొందు ఉపాయమును చెప్పుము. నేను సృష్టిని చేసెదను. దానిలో సంశయము లేదు (5).
బ్రహ్మ ఇట్లు పలికెను -
వత్సా! దక్ష ప్రజాపతీ! నా మంచి మాటను విని అటులనే చేయుము. నీవు దేవతలలో శ్రేష్ఠుడవు. శివుడు నీకు శుభమును చేయగలడు (6). కుమారా! పంచజన ప్రజాపతికి అసిక్నియను అందమైన కుమార్తె గలదు. ఓ ప్రజాపతీ! నీవు ఆమెను భార్యగా స్వీకరించుము (7). నీవు అట్టి సుందరియగు భార్యయందు మైథున ధర్మముచే ఈ ప్రజాసృష్టిని విస్తారముగా చేయగలవు (8). అపుడు దక్షుడు నా ఆదేశముచే వీరణుని (పంచజనుని ) కుమార్తెను, మైథున ధర్మముచే సంతానమును గనుటకై వివాహమాడెను (9).
అపుడా దక్ష ప్రజాపతి వీరణుని కుమార్తె యగు అసిక్నియందు హర్యశ్వులు అను పేరుగల పదివేల మంది కుమారులను గనెను (10). ఓ మహర్షీ! వారందరు ఒకే ధర్మము గలవారై ఉండిరి. వారు తండ్రియందు భక్తి గలవారై నిత్యము వేదమార్గము నందు నిష్ఠ కలిగియుండిరి (11). తండ్రి వారిని సంతానమును గనుడని చెప్పెను వత్సా! ఆ దక్షపుత్రులందరు తపస్సు కొరకు పశ్చిమ దిక్కునకు వెళ్లిరి (12).
అచట దివ్యమగు సింధునది సముద్రములో కలిసే సంగమము వద్ద పరమ పవిత్రమైన నారాయణ సరస్సు అనే తీర్థము గలదు (13). ఆ జలములను స్పృశించినంతనే వారి హృదయములలోని మాలిన్యములు క్షాళితమై పోయెను. వారి బుద్ధి పరమ హంస ధర్మము (నివృత్తి ధర్మము) నందు పరినిష్ఠితమయ్యెను (14). పుణ్యాత్ములు, జితేంద్రియులు అగు దక్షపుత్రులు తండ్రియొక్క ఆదేశముచే నియంత్రింపబడిన వారై, సంతాన వృద్ధి కొరకై అచట తపస్సును చేయుచున్నారని నీకు తెలిసినది. నీవు విష్ణువు హృదయములోని భావమునెరింగి అచటకు వెళ్లితివి (16).
దక్షకుమారులారా! హర్యశ్వులారా! భూమి యొక్క అంతము నెరుంగనే మీరు సృష్టిని చేయుటకు ఎట్లు సిద్ధమైతిరి? అని నీవు ఆదరముతో ప్రశ్నించితివి (17). ఆ హర్యశ్వులు జాగరూకులై నీ మాటను వినిరి. వారందరు పుట్టుకతోడనే బుధ్దిశాలురు గదా ! వారు నీ మాటలను సమగ్రముగా విచారణ చేసిరి (18).
శాస్త్రమే తండ్రి. శాస్త్రము నివృత్తిని బోధించుచున్నది. అట్టి శాస్త్రాదేశమును తెలియనివాడు త్రిగుణములను నమ్ముకొని సృష్టికి పూనుకొనుట యెట్లు పొసగును? (19). బుద్ది శాలులు, దృఢనిశ్చయము గలవారునగు ఆ దక్ష పుత్రులు ఇట్లు నిశ్చయించుకొని, ఆ నారదునకు నమస్కరించి, ప్రదక్షిణము చేసి పునరావృత్తి లేని జ్ఞానమార్గములోనికి వెళ్లిరి (20).
ఓ నారదా! శంభుని మనస్సు నీవే (ఎరుంగుదువు) .ఓ మహర్షీ! నీవు ఒంటరిగా లోకములను తిరుగాడెదవు. నీవు వికారములు లేనివాడవై సర్వదా మహేశ్వరుని మనోవృత్తులను (ఆశయములను ) నెరవేర్చెదవు (21). చాల కాలము గడచిన తరువాత నా కుమారుడగు దక్ష ప్రజాపతి తన కుమారులు నారదుని వలన ప్రవృత్తి మార్గము నుండి తొలగిరని విని మిక్కిలి దుఃఖించెను (22).
మంచి కుమారులను కలిగి యుండుట దుఃఖములకు నిధానము అని పలుమార్లు పలుకుచూ దక్షడు శివమాయచే మోహితుడై అనేక విధములుగా దుఃఖించెను (23). నేను వచ్చి కుమారుడగు దక్షునకు శాంతముగా నుండుమనియు, దైవము బలీయమైనదనియు చెప్పి ప్రీతిపూర్వకముగా ఓదార్చితిని (24).
నాచే ఇట్లు ఓదార్చ బడిన దక్షుడు పాంచజన్య (పంచజనుని కుమార్తె) యను తన భార్యయందు శబలాశ్వులను పేరుగల వేయిమంది కుమారులను గనెను (25). దృఢమైన వ్రతము గల ఆ దక్షపుత్రులు కూడా తండ్రిచే ఆదేశింపబడిన వారై ప్రజా సృష్టిని చేయగోరి, తమ సోదరులు పూర్వము సిద్ధి పొందిన తీర్థమునకే వెళ్లిరి (26).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 LIGHT ON THE PATH - 9 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj
*🌻 1. BEFORE THE EYES CAN SEE THEY MUST BE IN CAPABLE OF TEARS - 9 🌻*
49. As a rule these people are sufficient unto themselves, and they distrust and despise everybody else.
That is always characteristic of anyone who is on the dark path; he is right and everybody else is wrong. He looks down on everybody else. People talk sometimes about a black brotherhood.
There is no such thing. There could not be any true brotherhood among them, but they do occasionally join together in face of an imminent peril or when something threatens any of their plans.
At best it is a very loose alliance, formidable only because of the tremendous power that some of them possess. It does happen now and again that? the work that some of our Masters are doing for the evolution of the world crosses their tracks, and then they become formidable enemies.
They cannot touch our Masters – I think that must be very irritating to them – but they sometimes get hold of one of Their pupils, and so cause Them a little trouble or some disappointment, if we can suppose that a Master would feel disappointment.
50. The reason of all the warnings given to us to beware of these people is that we shall find them trying sometimes to mislead us.
Madame Blavatsky, who knew a great deal about them and had a wholesome respect for them, rather gave the impression that they were tempting demons who exult in evil for its own sake.
This would be true only of those at a lower level; the more powerful of them would consider it quite undignified to exult in anything; but their plans, which are always entirely selfish, may sometimes involve a great deal of harm to certain people.
They are as calm and self-contained and as passionless as any disciple of the Master; in fact, they are more so, because they have killed out all feeling intentionally.
They would not injure a man merely for the sake of doing harm, but, as I said before, in pursuit of some end of their own which his existence interferes with they would not hesitate to sweep him out of their way.
Those whose work it is to assist people astrally sometimes come across their victims, and in that case the man who tries to help often brings down upon himself also the determined opposition of the black magician.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 139 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. నారద మహర్షి - 13 🌻*
97. అనంతరం శ్రీమహావిష్ణువు గురించి ఊర్ధ్వబాహుడై ఒక్క పాదంమీద నిలబడి అనేక సంవత్సరములు తపస్సుచేసాడు. నారదునికి ఒక దివ్యమైన స్వరూపంతో దర్శనమిచ్చాడు. “నారదా! నీవంటి తపోనిష్ఠకలవాడికి నా లక్షణము తెలియచేయటముకోసమే నీకు దర్శనం ఇచ్చాను. ఇలా తపస్సు చేసిన వారికే ఈ దర్శనమవుతుంది. నేనే ఇరవై నాలుగు తత్త్వాలలో ఉన్నాను. నేనే పరమపురుషుడను, నేనే విరాట్టును, వాసుదేవుణ్ణి.
98. భూతాత్మక మయినటువంటి ధాతువుల యొక్క సంయోగమే దేహము. అందులో జీవవ్యాప్తి లేకపోతే, శరీరానికి చేష్టలుండవు. జీవశరీరములు రెండూ పరస్పరము ఆశ్రయించుకొని ఉంటాయి. నేను లేకుండా జీవుడు స్వతంత్రుడై ఎన్నడూ ఉండడు. కాబట్టి నేను సన్నిహితంగా అతడియందు ఉంటూ అతడిని అనుసరించి ఉంటాను. అతడు నాయందే స్థితి కలిగి ఉంటాడు.
99. ఈ స్థితికి అతడి యందు నేను ఉండటమే కారణం, వేరొకటిలేదు అని ఎవరైతే తెలుసుకుంటారో అతడికి తక్షణమే సర్వకర్మలు నశించి అతడు ముక్తిని పొందుతాడు. జీవాత్మనుంచీ ముక్తిని పొందుతాడు. అతడు తననుతాను ఆధేయంగాను, అతడికి ఆధారమైన వస్తువుగా నన్ను తెలుసుకోవాలి. అంతే!
100. ఈ లోకాలను సృష్టించే బ్రహ్మదేవుడిని నేను సృష్టించాను. లోకాలు ప్రవర్తించే కాలంలో కూడా జగత్ హితమయినటువంటి, కార్యాలకోసం నేను మళ్ళీ పుడుతుంటాను” అని చెప్పి ఆ రూపము అదృశ్యమయి పోతుంది.
101. పరమేశ్వర స్వరూపంలో ఉన్న శివుడి యొక్క ప్రకృతిని ‘దుర్గ’ అంటారు. విష్ణువుకు ప్రక్కన ఉండేటటువంటి పరాశక్తిని లక్ష్మి అంటారు. బ్రహ్మకు ప్రక్కన ఉండే పరాశక్తిని సావిత్రి అంటారు. స్వర్గంలో ఉంటే స్వర్గలక్ష్మి అంటారు. రాజు ఇంట్లో ఉంటే రాజ్యలక్ష్మి అంటారు. గృహంలో ఉంటే గృహలక్ష్మి అంటారు. ఈ ప్రకారంగా పరాశక్తి అక్కడ నుంచి క్రిందిదాకా అంతటా వ్యాపించి ఉంది. పురుషుడి ప్రక్కనే ఆశ్రయించి ఆ చైతన్య స్వరూపిణి ఉంది.
102. గణేశ ఖండములో గణపతి యొక్క జన్మ వృత్తాంతము ప్రస్తావించబడింది. అతడియొక్క ప్రభావము, అతడి శక్తి అంతా చెప్పబడింది. ఆ గణేశ్వరుని యొక్క ప్రభావము ఏమిటంటే, సమస్త జీవకోటి, అంటే శరీరధారణ చేసిన ప్రతి జీవునికీ, ‘ఈ శరీరమే నేను’ అనే భావాన్ని దృఢంగా కల్పించినవాడు అతడు.
103. అతడిని ఉపాసించటం ఎందుకంటే, అట్టి దేహాత్మ భావన విడిపోవటానికి. హేతువును ఉపాసిస్తే సత్యం చూపిస్తుంది. హేతువు చేసేదేమీ లేదు. దేహాత్మభావనకు హేతువైనటువంటి శక్తి ఏదో ఆ శక్తి నారాధిస్తే ఆ శక్తి ఇతడిని విడిచిపెడుతుంది.
104. దేహాత్మ భావన పోతే సత్యం వెంటనే తెలుస్తుంది. నేను దేహం కాను అని నోటితో, మనసుతో అనుకుంటున్నాం. దేహాత్మభావనలోంచే ఆ మాట వస్తున్నది. దేహాత్మభావన కలిగినవాడికే, ‘నేను దేహం కాను’ అనే వేదాంతవాక్యం చెబుతున్నారు. పలుకుతున్నారు, వింటున్నారు.
105. ఊరికే రోజూ ‘నాహం దేహో న ఇంద్రియాణి’ అంటూ జపంచేస్తే అనుభవంలోకి వస్తుందా? కాని గణపతి ఆరాధనచేస్తే, దీని సత్యం అవగత మయ్యేటట్లు అనుభూతినివ్వగలడు! ఎందుకంటే గణపతి స్థితుడై ఉన్న మూలాధార మందే దేహాత్మభావన స్థితి ఉంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు - 56 🌹*
*🍀 16. సృష్టి రసాయనము - సమస్తమగు కర్మకాండ గుణముల నుండియే పుట్టుచున్నది. అందుచే జీవుడు సంగము లేక వీని యందు ప్రవర్తించినచో ముక్తుడుగ నుండును. సంగము కలిగినచో బద్దుడగును. 🍀*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. కర్మయోగము - 28 📚*
28. తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః |
గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే || 28 ||
సృష్టి యంతయు ఒక రసాయనము. పురుషుని సాన్నిధ్యమున ప్రకృతిశక్తులు రసాయనము చెంది, సృష్టిగ వర్తించుచున్నవి. గుణములు గుణములయందు అహర్నిశలు రసాయనము చెందుచూ, సృష్టికార్యము నడచుచున్నది.
సమస్తమగు కర్మకాండ గుణముల నుండియే పుట్టుచున్నది. అందుచే జీవుడు సంగము లేక వీని యందు ప్రవర్తించినచో ముక్తుడుగ నుండును. సంగము కలిగినచో బద్దుడగును. సంగము లేక కర్మ లాచరించుటయే కర్మలయందు కౌశలము. సంగము వలననే జీవుడు ద్వంద్వములకు చిక్కును.
నిజమునకు ప్రకృతి రమణీయత, ఆకర్షణీయత చూచు వానిని బట్టి యుండును. స్త్రీ, పురుష శరీరములుగ కన్పట్టుచున్నది రక్తమాంసాదులతో నిర్మించబడిన రూపమని తెలిసిన జీవుడు వికారము చెందడు. లేనిచో వికారము చెందును. ఆకర్షణమునకు లోనగుట జీవునకు జరుగుచున్నది గాని, ఆకర్షించు కార్యక్రమము ప్రకృతికి లేదు.
సృష్టి ఆకర్షణముగ నున్నను, అట్టి ఆకర్షణమున కతీతముగ నున్నవారు గలరు. ఆకర్షణమునకు లోనైన వారునూ గలరు. ఈ భేదము సంగము లేకుండుట, ఉండుట వలన కలుగుచున్నది. అసంగుని సృష్టి ఆకర్షింపలేదు కదా! సనక సనందనాదులట్టివారు.
సంగము ఒక బలహీనత. అసంగమే బలము. అసంగుడు ముక్తుడు. అతడు గుణముల వ్యాపారమున బడడు. అట్టి వాడే యథార్థమును తెలిసినవాడు. (3-28).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Seeds Of Consciousness - 202 🌹*
✍️ Nisargadatta Maharaj
Nisargadatta Gita
📚. Prasad Bharadwaj
*🌻 51. Worship the knowledge ‘I am’ as God, as your Guru, the message ‘I am’ is there, the mind-flow is there, stay in the ‘I am’ and realize you are neither. 🌻*
You must not only understand the ‘I am’ but also realize its extreme importance.
Everything is created by the ‘I am’, worship it as God and it is the only means for your way out so treat it like your guide or Guru.
To begin with what do you have but the knowledge ‘I am’ only without words?
Later comes the verbal ‘I am’ your gathering of concepts and thus begins the mind-flow.
Now revert this mind-flow, come to the verbal ‘I am’ and go past it and stabilize in the non-verbal ‘I am’. In this process you shall realize that you are none of these.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. అద్భుత సృష్టి - 58 🌹*
✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. యాక్టివేషన్ జరిగేటప్పుడు మన 7 శరీరాలలో వచ్చే మార్పులు - 2 🌻*
🌟 *4. గెలాక్టిక్ లైట్ బాడీ యాక్టివేషన్:-*
4వ దేహమైన విజ్ఞానమయకోశం గెలాక్టిక్ లైట్ బాడీగా మారుతుంది. 9వ ప్రోగు DNA యాక్టివేషన్ జరుగుతుంది. ఇందులో ఉన్న 12 అగ్ని అక్షరాలు యాక్టివేషన్ లోకి తీసుకురాబడతాయి. మన యొక్క హృదయ ద్వారం (పోర్టల్) నుండి విశ్వంలో ఉన్న పోర్టల్స్ కి, భూమిలో ఉన్న కోర్ ఎనర్జీకి కనెక్షన్ అవుతుంది. భూమి యొక్క పోర్టల్ ఓపెన్ చేయబడతాయి.
మనచుట్టూ వెండి, బంగారురంగు కాంతితో తిరుగుతున్న బంగారురంగు కాంతి గోళం ఏర్పడుతుంది. 3వ డైమెన్షన్ కి సంబంధించిన షడ్భుజి (6 ముఖాల) నక్షత్రం ఏర్పడుతుంది.
✨. ఈ ఆరు ముఖాలను అనుసంధానం చేసుకుని ఒక్కొక్క కోణానికి 4 కోణాలు చొప్పున ఏర్పడతాయి. నీలి ఆకుపచ్చకలర్ తో కూడుకున్న లైట్ యొక్క ఫ్లోరోసెంట్ ట్యూబ్. ఇది హృదయచక్రం వద్ద నుండి శరీరమంతా వ్యాపిస్తుంది. ఇది స్త్రీలలో వేరుగా, పురుషులలో వేరువేరుగా ఉంటుంది. గెలాక్సీ స్థాయిలో మన యొక్క శక్తి శరీరం స్థిరీకరించేందుకు సహకరిస్తుంది. ఇది అన్ని డైమెన్షనల్ స్థాయిల్లో మనకు అందిన బహుమతి.
✨9 వ ప్రోగు DNA అందులోని అగ్ని అక్షరాలు యాక్టివేషన్ లోకి వస్తాయి. 9వ స్ట్రాండ్ DNA యాక్టివేషన్ అనేది ఈథర్ రికార్డ్స్ ను తిరిగి వ్రాయడమే. గెలాక్టిక్ లైట్ బాడీ యాక్టివేషన్ ద్వారా మన యొక్క శక్తి శరీరం మనం ఉన్న గెలాక్సీ స్థాయికి ఎదుగుతాం.
🌟 *5. ఇంటర్ గెలాక్టిక్ లైట్ బాడీ యాక్టివేషన్:-*
మన 5వ దేహమైన ఆనందమయ కోశం, ఇంటర్ గెలాక్టిక్ లైట్ బాడీగా మారుతుంది. ఇక్కడ 10వ ప్రోగు యాక్టివేషన్ లోకి వస్తుంది. 29 నుండి 35 చక్రాలు యాక్టివేషన్ లోకి తీసుకురాబడతాయి. భగవంతుని దివ్య శక్తి మన 5వ శరీరంలోకి ప్రవేశిస్తుంది. మనకు 7వ డైమన్షన్ పోర్టల్ తో కనెక్షన్ దొరుకుతుంది.
ఐదు సమబాహు త్రిభుజం ఏర్పడతాయి. 20 ముఖాలు కలిగిన గోళం మన చుట్టూ ఏర్పడుతుంది. మన యొక్క అణువులు, పరమాణువులు పూర్తిస్థాయిలో ప్రకటిస్తూ సోలార్ క్రిస్టియన్ క్రీస్తు కాన్షియస్ (చైతన్యం)లోకి మారిపోతుంది. మన యొక్క శక్తి శరీరం అన్ని గెలాక్సీల స్థాయికి ఎదిగేలా చేస్తుంది. ఇక్కడ ఉన్న 12 అగ్ని అక్షరాలు యాక్టివేషన్ లోకి వస్తాయి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 41 / Sri Vishnu Sahasra Namavali - 41 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*
*సింహరాశి- పుబ్బ నక్షత్ర 1వ పాద శ్లోకం*
*🌻 41. ఉద్భవ క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః।*
*కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః॥*
అర్ధము :
🍀. ఉద్భవః -
సృష్టి ఉద్భవమునకు కారణభూతుడు.
🍀. క్షోభణః -
ప్రళయకాలమందు అంతటిని హరించువాడు.
🍀. దేవః -
విశ్వముతో క్రీడించువాడు.
🍀. శ్రీగర్భః -
సమస్త ఐశ్వర్యములు తన గర్భమందు కలవాడు.
🍀. పరమేశ్వరః -
ఉత్క్రుష్టమైనవాడు, ఊహ కందనివాడు.
🍀. కరణం - జగత్తు ఉత్పత్తికి సాధనమైనవాడు.
🍀. కారణం -
సృష్టి ఆవిర్భావమునకు కారణమైనవాడు.
🍀. కర్తా -
అన్నింటికీ కర్త అయినవాడు.
🍀. వికర్తా -
విశ్వరచన చేసినవాడు.
🍀. గహనః -
గ్రహింపశక్యం కానివాడు.
🍀. గుహః -
వ్యక్తము కానివాడు, అగమ్యగోచరుడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 41 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*
*Sloka for Simha Rasi, Pubba 1st Padam*
udbhavaḥ, kṣōbhaṇō devaḥ śrīgarbhaḥ parameśvaraḥ |
karaṇaṁ kāraṇaṁ kartā vikartā gahanō guhaḥ || 41 ||
🌻 Udbhavaḥ:
One who is the material cause of creation.
🌻 Kṣōbhaṇaḥ:
One who at the time of creation entered into the Purusha and Prakriti and caused agitation.
🌻 Devaḥ:
'Divyati' means sports oneself through creation and other cosmic activities.
🌻 Śrīgarbhaḥ:
One in whose abdomen (Garbha) Shri or His unique manifestation as Samsara has its existence.
🌻 Parameśvaraḥ:
'Parama' means the supreme. 'Ishvarah' means one who hold sway over all beings.
🌻 Karaṇam:
He who is the most important factor in the generation of this universe.
🌻 Kāraṇam:
The Cause – He who causes others to act.
🌻 Kartā:
One who is free and is therefore one's own master.
🌻 Vikartā:
One who makes this unique universe.
🌻 Gahanaḥ:
One whose nature, greatness and actions cannot be known by anybody.
🌻 Guhaḥ:
One who hides one's own nature with the help of His power of Maya.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹