నిర్మల ధ్యానాలు - ఓషో - 258

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 258 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. 'తమసోమా జ్యోతిర్గమ' దేవా చీకటి నించీ నన్ను కాంతిలోకి నడిపించు, అసతోమా సద్గమయ అసత్యం నించీ సత్యానికి నడిపించు. మృత్యోర్మా అమృతంగమయ మరణం నించీ మరణ రాహిత్యానికి నడిపించు. ఇది అపూర్వమైన ప్రార్థన. 🍀

ప్రాచీన ఉపనిషత్ కాలం ఋషులు అద్భుతమయిన ప్రార్థన చేశారు. ప్రపంచంలోని అద్భుత ప్రార్థన అది. 'తమసోమా జ్యోతిర్గమ' దేవా చీకటి నించీ నన్ను కాంతిలోకి నడిపించు, అసతోమా సద్గమయ అసత్యం నించీ సత్యానికి నడిపించు. మృత్యోర్మా అమృతంగమయ మరణం నించీ మరణ రాహిత్యానికి నడిపించు. ఇది అపూర్వమైన ప్రార్థన. వేల సంవత్సరాల క్రితందయినా యిప్పటికి ఎంతో విలువైంది. యిప్పుడూ దీని ప్రాధాన్యం మరింత వుంది. నేను చీకటి నించీ వెలుగుకు నడిపించమని చెప్పను. ఎందుకంటే చీకటి వునికిలో లేదు. నన్ను కాంతి నించీ మరింత కాంతికి నడిపించమని కోరుతాను.

అట్లాగే అసత్యం నుండి సత్యానికి నడిపించమని కోరను. ఎందుకంటే అసత్యం లేదు. సత్యం నించీ మరింత సత్యానికి నడిపించమంటాను. అట్లాగే మరణం నించీ మరణం లేని తనానికి నడిపించమనను. ఎందుకంటే మరణమన్నది లేదు. మరణరాహిత్యం నించీ మరింత మరణ రాహిత్యానికి నడిపించమంటాను. జీవితం నించీ మరింత నిరాటంక జీవితానికి సమగ్రత నించీ మరింత సమగ్రతకు నడిపించ మంటాను. సాధారణంగా సమగ్రత అంటే దాన్ని మించి లేదని, అదే ముగింపు అని అంటారు. నేనట్లా అనుకోను. సమగ్రత మరింత సమగ్రత కావాలి. ప్రతి దశా ఒక సమగ్రతే. అది మరింత సంపన్నంగా, వర్ణభరితంగా మారుతూ సాగాలి. కొత్త నాట్యం, కొత్త ఉత్సవం, పరిణామానికి అంతముండదు.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

నిత్య ప్రజ్ఞా సందేశములు - 359 - 24. విశ్వం యొక్క . . . / DAILY WISDOM - 359 - 24. Consciousness of . . .

🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 359 / DAILY WISDOM - 359 🌹

🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀

📝. ప్రసాద్ భరద్వాజ్

🌻24. విశ్వం యొక్క సంపూర్ణత యొక్క స్పృహ🌻

ధ్యానం అనేది ఈ అనంతమైన చైతన్యంలో అంచెలంచెలుగా భాగస్వాములవడం. విశ్వం యొక్క పరిణామ ప్రక్రియలలో దైవిక చైతన్యం దశలవారీగా వ్యక్తమవుతుంది. ఇక్కడ ఉన్న వ్యక్తిగత చైతన్యం కూడా ఆ మహాచైతన్యం యొక్క ఒక చిన్న భాగమే. కానీ ఇక్కడ, మనిషి విషయంలో, ఆ చైతన్యం భౌతిక రూపంతో తనను తాను గుర్తించి ఇతర రూపాల్లో ఉన్న తన ఉనికిని అనుభూతి చెందలేని స్థితికి దిగజారింది. అంతటా వ్యాపించిన చైతన్యం భౌతిక రూపాలకు దిగి, వ్యక్తిగత శరీరాలు మరియు వస్తువులుగా మారింది.

విస్తార చైతన్యంలోని అధమ భాగం ఇతర జీవులతో తనకు ఉన్న సంబంధాన్ని గుర్తించలేనంతగా దిగజారింది. ఇది ఈ చిన్న శరీరం యొక్క నాలుగు గోడలతో ముడిపడి అలాంటి ఇతర శరీరాలలో ఉన్న తనను తాను చూసుకోలేని స్థితిలో ఉంది. కానీ, అది ఇతరులలో తన ఉనికిని అనుభూతిచెందలేనప్పటికీ, అచేతనంగా ఇతర వస్తువులపై, విషయాలపై ఎందుకు లాగబడుతుందంటే ఆ వస్తువులలో ఉన్న అదే చైతన్యం వైపు తెలియకుండానే ఆకర్షించబడుతుంది. చైతన్యం నాశనం కాదు; అది అమరమైనది మరియు అవిభాజ్యమైనది. ఇతర జీవులలో ఉన్న ఈ ఒకే చైతన్యం యొక్క ఆకర్షణ కారణంగానే వాటిపట్ల ప్రేమ, ఆప్యాయత, ఆకర్షణ మైడలైనవి ఉన్నాయి. అలాగే అత్యల్పమైన అణువుల నుంచి, అనంత రోదసిలో ప్రయాణించే పాలపుంతల వరకు ఉండే ఈ వ్యవస్థకు సైతం ఈ ఆకర్షణే కారణం.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 DAILY WISDOM - 359 🌹

🍀 📖 from The Philosophy of Religion 🍀

📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj

🌻24. Consciousness of the Fullness of the Universe🌻

Meditation is our graduated participation in the consciousness of this enveloping fullness. It is achieved by degrees. The divine consciousness manifests itself in stages in the evolutionary processes of the universe. Even the little individual mind here, as a person, is a degree of that very consciousness. But here, in the case of man, it has descended to so low a state that it has identified itself with the physical form and is unable to feel its presence in other forms. The all-pervading consciousness has come down to the physical forms and has become individual bodies and objects.

The lowest descent has taken such a morbid shape that it cannot recognise its kinship with the rest of the world. It has got tied up to the four walls of this tiny body and it cannot visualise itself in other such bodies. But, though it cannot consciously feel its presence in others, yet, subconsciously, or unconsciously, it is pulled towards other things, for it is, after all, present there at the invisible depths and centres of things. Consciousness cannot be destroyed; it is immortal and undividedly present. The unconscious pull exerted by its own presence in other things is the reason behind attractions, affections, loves and spirits of organisation in creation, from the lowest forms of the gyration of the atoms to the galaxies that spin through endless space.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ శివ మహా పురాణము - 642 / Sri Siva Maha Purana - 642

🌹 . శ్రీ శివ మహా పురాణము - 642 / Sri Siva Maha Purana - 642 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 14 🌴

🌻. గణ వివాదము - 3 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను -

కైలాసము నుండి క్రోసెడు దూరములో నిలబడి యున్న శివుని చూచి, ఆ శివగణములందరు ఆయన వద్దకు వెళ్లి జరిగతిన వృత్తాంమును చెప్పిరి (23). త్రిశూలమును చేతబట్టి యున్న పరమేశ్వరుడు మనస్సులో మిక్కిలి క్రోధమునుపొంది వీరులని పేరు పొందిన తన గణముల ఎదుట నవ్వి ఇట్లు పలికెను (24).

శివుడిట్లు పలికెను -

ఓరీ గణములారా! మీరు నపుంసకులు. మీకు వీరులనే అభిమానముగలదు. కాని మీరు వీరులు గారు. మీరు నా ఎదుట నుండుటకు అర్హులు గారు. మీరు బయపెట్టినచో వాడేమి మాటలాడగల్గును? (25). వెళ్లుడు. మీలో సమర్థుడెవడైననూ వానిని కొట్టుడు. ఇన్ని మాటలేల? వానిని ఇచట నుండి తరిమి వేయవలసినదే (26).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! దేవ దేవడగు మహేశ్వరుడు ఇట్లు గద్దించగా, శ్రేష్ఠులగు ఆ గణములందరు అచటకు వెళ్లి వానితో నిట్లునిరి (27).

శివగణములిట్లు పలికిరి -

ఓరీ! బాలకా! నీవు వినుము. నీవు మమ్ములను మిక్కిలి అవమానించి ఏల మాటలాడు చున్నావు? ఇచట నుండి నీవు దూరముగా పొమ్ము. లేనిచో, నీకు చావు మూడినది (28).

బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడు శివుని అజ్ఞను పాలించే వారి ఈ మాటలను విని ఆ పార్వతీ పుత్రుడు ఏమి చేయవలెనో తెలియక దుఃఖితుడాయెను (29). ఇంతలో వానికి ఆ గణములతో జరుగుచున్న కలహమును గాంచి, పార్వతీదేవి తన చెలికత్తెను ద్వారము వద్ద చూడుమని పంపెను (30). చెలికత్తె అచటకు వచ్చి జరిగిన వృత్తాంతమునెరిగి క్షణకాలము అచటనే ఉండి ఆ వాగ్వాదమును గాంచి ఆనందించి పార్వతి వద్దకు మరలి వెళ్లెను (31). ఓ మునీ! ఆ చెలికత్తె అచట జరిగిన వృత్తాంతమునంతను పూసగూచ్చినట్లుగా పార్వతి యెదుట చెప్పెను (32).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 SRI SIVA MAHA PURANA - 642🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 14 🌴

🌻 The Gaṇas argue and wrangle - 3 🌻

Brahmā said:—

23. Then the Gaṇas of Śiva went to Śiva who was standing at the distance of a Krośa from Kailāsa and spoke to him.

24. Śiva ridiculed them all. The trident-armed great lord of fierce temperament spoke to his Gaṇas who professed to be heroes.

Śiva said:—

25. “Hello, Gaṇas, impotent wretches, you profess to be heroic but are never so. You are unfit to stand before me and speak. If he is only taunted he will speak in similar tone again.

26. Go and beat him. Some one among you may be competent to do so. Why should I speak more? He must be driven away.”

Brahmā said:—

27. O great sage, when rebuked thus by lord Śiva, the excellent Gaṇas went back and spoke to him.

Śiva’s Gaṇas said:—

28. Hello you boy there, listen. Why do you speak so arrogantly? You go away from here. If not, your death is certain.

Brahmā said:—

29. On hearing the words of Śiva’s servants the son of Pārvatī became unhappy and thought “What shall I do?”

30. In the meantime, the goddess heard the noise of this wrangle between the Gaṇas and the doorkeeper, then looked at her friend and spoke. “Go and see.”

31. The friend came to the door and saw them for a moment. She understood the whole matter. She was delighted and returned to Pārvatī.

32. O sage, coming back she reported the matter to Pārvatī as it had occurred.

Continues....

🌹🌹🌹🌹🌹

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 680 / Vishnu Sahasranama Contemplation - 680

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 680 / Vishnu Sahasranama Contemplation - 680🌹

🌻680. స్తవప్రియః, स्तवप्रियः, Stavapriyaḥ🌻

ఓం స్తవప్రియాయ నమః | ॐ स्तवप्रियाय नमः | OM Stavapriyāya namaḥ

స్తవ్యఏవ యతో విష్ణురత ఏవ స్తవప్రియః స్తవ్యః

అను నామము నందు వివరించినట్టి హేతువు చేతనే స్తవముల యందు ప్రీతి కల వాడును, తన స్తవము చేసిన వారిని అనుగ్రహించు వాడును గనుక విష్ణువు స్తవప్రియః.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 680🌹

🌻680. Stavapriyaḥ🌻

OM Stavapriyāya namaḥ

स्तव्यएव यतो विष्णुरत एव स्तवप्रियः / Stavyaeva yato viṣṇurata eva stavapriyaḥ

As explained in the previous divine name Stavyaḥ, He delights in the Stavas or eulogies and being pleased by such, His devotees get bestowed by His grace and hence He is Stavapriyaḥ.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

स्तव्यस्स्तवप्रियस्स्तोत्रं स्तुतिः स्तोता रणप्रियः ।पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः ॥ ७३ ॥

స్తవ్యస్స్తవప్రియస్స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః ।పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ॥ 73 ॥

Stavyasstavapriyasstotraṃ stutiḥ stotā raṇapriyaḥ,Pūrṇaḥ pūrayitā puṇyaḥ puṇyakīrtiranāmayaḥ ॥ 73 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

శ్రీమద్భగవద్గీత - 281: 07వ అధ్., శ్లో 01 / Bhagavad-Gita - 281: Chap. 07, Ver. 01

🌹. శ్రీమద్భగవద్గీత - 281 / Bhagavad-Gita - 281 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴.7 వ అధ్యాయము - జ్ఞానవిజ్ఞాన యోగం - 01 🌴

01. శ్రీభగవానువాచ

మయ్యాసక్తమనా: పార్థ యోగం యుంజన్మదాశ్రయ: |
అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తుచ్చ్రుణు ||

🌷. తాత్పర్యం :

శ్రీకృష్ణభగవానుడు పలికెను: ఓ పార్థా! మనస్సును నా యందే సంలగ్నము చేసి నా సంపూర్ణభావనలో యోగమభ్యసించుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లు సమగ్రముగా నెరుగగలవో ఇప్పుడు ఆలకింపుము.

🌷. భాష్యము :

భగవద్గీత యొక్క ఈ సప్తమాధ్యాయమున కృష్ణభక్తిరసభావనా తత్త్వము సమగ్రముగా వివరింపబడినది.

సమస్త విభూతులను సంగ్రముగా కలిగియున్న శ్రీకృష్ణభగవానుడు తన విభూతులను సమగ్రముగా కలిగియున్న శ్రీకృష్ణభగవానుడు తన విభూతులను సమగ్రముగా కలిగియున్న శ్రీకృష్ణభగవానుడు తన విభూతులను ఏ విధముగా ప్రదర్శించునో ఈ అధ్యాయమున వర్ణింపబడినది.

అదే విధముగా శ్రీకృష్ణుని శరణుజొచ్చు నాలుగు తరగతుల అదృష్టభాగుల గూర్చియు మరియు కృష్ణునికి ఎన్నడును శరణమునొందని నాలుగు తరగతుల అదృష్టహీనుల గూర్చియు ఈ అధ్యాయమున వివరింపబడినది.

భగవద్గీత యొక్క మొదటి ఆరుఅధ్యాయములలో జీవుడు ఆత్మస్వరూపుడనియు మరియు వివిధములైన యోగముల ద్వారా తనను ఆత్మసాక్షాత్కారస్థితితికి ఉద్దరించుకొనగలడనియు వివరింపబడినది.

శ్రీకృష్ణభగవానుని యందు స్థిరముగా మనస్సును సంలగ్నము చేయుటయే (కృష్ణభక్తిరసభావనము) యోగములన్నింటి యందును అత్యున్నత యోగమనియు షష్టాధ్యాయపు అంతమున స్పష్టముగా తెలుపబడినది. అనగా శ్రీకృష్ణునిపై మనస్సును నిలుపుట ద్వారానే మనుజుడు పరతత్త్వమును సమగ్రముగా నెరుగగలడు గాని అన్యథా కాదు. నిరాకార బ్రహ్మానుభూతి గాని లేదా పరమాత్మానుభూతి గాని అసంపూర్ణమై యున్నందున ఎన్నడును పరతత్త్వపు సంపూర్ణజ్ఞానము కాజాలదు.

వాస్తవమునకు అట్టి సంపూర్ణ శాస్త్రీయజ్ఞానము శ్రీకృష్ణభగవానుడే. కృష్ణభక్తిరసభావన యందు మనుజుడు శ్రీకృష్ణుడే నిస్సందేహముగా చరమజ్ఞానమని ఎరుగగలడు. వివిధములైన యోగపద్ధతులు అట్టి కృష్ణభక్తిరసభావనమునకు సోపానములు వంటివి మాత్రమే. కనుకనే కృష్ణభక్తిభావన యందు ప్రత్యక్షముగా నెలకొనినవాడు బ్రహ్మజ్యోతి మరియు పరమాత్మలకు సంబంధించిన జ్ఞానమును సంపూర్ణముగా అప్రయత్నముగనే పొందగలుగును.

అనగా కృష్ణభక్తిభావనాయోగమును అభ్యసించుట ద్వారా మనుజుడు పరతత్త్వము, జీవులు, ప్రకృతి, సంపత్పూర్ణమైనటువంటి వాని వ్యక్తీకరణముల గూర్చి పూర్ణముగా తెలిసికొనగలుగును.

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 281 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Vijnana Yoga - 01 🌴

01. śrī-bhagavān uvāca

mayy āsakta-manāḥ pārtha yogaṁ yuñjan mad-āśrayaḥ
asaṁśayaṁ samagraṁ māṁ yathā jñāsyasi tac chṛṇu

🌷 Translation :

The Supreme Personality of Godhead said: Now hear, O son of Pṛthā, how by practicing yoga in full consciousness of Me, with mind attached to Me, you can know Me in full, free from doubt.

🌹 Purport :

In this Seventh Chapter of Bhagavad-gītā, the nature of Kṛṣṇa consciousness is fully described. Kṛṣṇa is full in all opulences, and how He manifests such opulences is described herein. Also, four kinds of fortunate people who become attached to Kṛṣṇa and four kinds of unfortunate people who never take to Kṛṣṇa are described in this chapter.

In the first six chapters of Bhagavad-gītā, the living entity has been described as nonmaterial spirit soul capable of elevating himself to self-realization by different types of yogas. At the end of the Sixth Chapter, it has been clearly stated that the steady concentration of the mind upon Kṛṣṇa, or in other words Kṛṣṇa consciousness, is the highest form of all yoga. By concentrating one’s mind upon Kṛṣṇa, one is able to know the Absolute Truth completely, but not otherwise. Impersonal brahma-jyotir or localized Paramātmā realization is not perfect knowledge of the Absolute Truth, because it is partial. Full and scientific knowledge is Kṛṣṇa, and everything is revealed to the person in Kṛṣṇa consciousness.

In complete Kṛṣṇa consciousness one knows that Kṛṣṇa is ultimate knowledge beyond any doubts. Different types of yoga are only steppingstones on the path of Kṛṣṇa consciousness. One who takes directly to Kṛṣṇa consciousness automatically knows about brahma-jyotir and Paramātmā in full. By practice of Kṛṣṇa consciousness yoga, one can know everything in full – namely the Absolute Truth, the living entities, the material nature, and their manifestations with paraphernalia.

🌹 🌹 🌹 🌹 🌹

13 Nov 2022 Daily Panchang నిత్య పంచాంగము

🌹13, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹

శుభ ఆదివారం, Sunday, భాను వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేదు 🌻

🍀. ఆదిత్య స్తోత్రం - 09 🍀

9. బ్రహ్మాణ్డే యస్య జన్మోదితముషసి పరబ్రహ్మముఖ్యాత్మజస్య
ధ్యేయం రూపం శిరోదోశ్చరణపదజుషా వ్యాహృతీనాం త్రయేణ |

తత్సత్యం బ్రహ్మ పశ్యామ్యహరహమభిధం నిత్యమాదిత్యరూపం
భూతానాం భూనభస్స్వః ప్రభృతిషు వసతాం ప్రాణ సూక్ష్మాంశమేకమ్

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : భగవానుని పరీక్షలు - మానవులను మోహపెట్టి పరీక్షించే కార్యభారం భగవానుడు తనపై వేసికొని వుండకపోతే ఈ ప్రపంచం త్వరితగతిని అథోగతి పాలయ్యేది. మోహపూర్వకమైన యీ పరీక్షలను నీ అంతరంగంలో జరగనీ. వాటిని ఎదుర్కొనడంలో అప్పుడు నీవు నీలోని కుసంస్కారాలను క్షయింప జేసుకో గలుగుతావు. 🍀

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, దక్షిణాయణం,

శరద్‌ ఋతువు, కార్తీక మాసం

తిథి: కృష్ణ పంచమి 24:53:39 వరకు

తదుపరి కృష్ణ షష్టి

నక్షత్రం: ఆర్ద్ర 10:18:25 వరకు

తదుపరి పునర్వసు

యోగం: సద్య 22:49:02 వరకు

తదుపరి శుభ

కరణం: కౌలవ 11:38:25 వరకు

వర్జ్యం: 23:46:30 - 25:34:18

దుర్ముహూర్తం: 16:09:50 - 16:55:14

రాహు కాలం: 16:15:31 - 17:40:38

గుళిక కాలం: 14:50:24 - 16:15:31

యమ గండం: 12:00:10 - 13:25:17

అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:22

అమృత కాలం: -

సూర్యోదయం: 06:19:43

సూర్యాస్తమయం: 17:40:38

చంద్రోదయం: 21:37:51

చంద్రాస్తమయం: 10:27:42

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: జెమిని

యోగాలు : ధ్వాo క్ష యోగం - ధన నాశనం,

కార్య హాని 10:18:25 వరకు తదుపరి

ధ్వజ యోగం - కార్య సిధ్ధి

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

🍀 13 - NOVEMBER - 2022 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🍀

🌹🍀 13 - NOVEMBER - 2022 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🍀🌹
🌹13 - NOVEMBER నవంబరు - 2022 SUNDAY ఆదివారం, భానువాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 281 / Bhagavad-Gita -281 - 7వ అధ్యాయము 01 జ్ఞాన విజ్ఞాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 680 / Vishnu Sahasranama Contemplation - 680 🌹
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 642 / Sri Siva Maha Purana - 642 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 359 / DAILY WISDOM - 359 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 258 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹13, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేదు 🌻*

*🍀. ఆదిత్య స్తోత్రం - 09 🍀*

*9. బ్రహ్మాణ్డే యస్య జన్మోదితముషసి పరబ్రహ్మముఖ్యాత్మజస్య*
*ధ్యేయం రూపం శిరోదోశ్చరణపదజుషా వ్యాహృతీనాం త్రయేణ |*
*తత్సత్యం బ్రహ్మ పశ్యామ్యహరహమభిధం నిత్యమాదిత్యరూపం*
*భూతానాం భూనభస్స్వః ప్రభృతిషు వసతాం ప్రాణ సూక్ష్మాంశమేకమ్*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : భగవానుని పరీక్షలు - మానవులను మోహపెట్టి పరీక్షించే కార్యభారం భగవానుడు తనపై వేసికొని వుండకపోతే ఈ ప్రపంచం త్వరితగతిని అథోగతి పాలయ్యేది. మోహపూర్వకమైన యీ పరీక్షలను నీ అంతరంగంలో జరగనీ. వాటిని ఎదుర్కొనడంలో అప్పుడు నీవు నీలోని కుసంస్కారాలను క్షయింప జేసుకో గలుగుతావు. 🍀* 

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, దక్షిణాయణం,
శరద్‌ ఋతువు, కార్తీక మాసం
తిథి: కృష్ణ పంచమి 24:53:39 వరకు
తదుపరి కృష్ణ షష్టి
నక్షత్రం: ఆర్ద్ర 10:18:25 వరకు
తదుపరి పునర్వసు
యోగం: సద్య 22:49:02 వరకు
తదుపరి శుభ
కరణం: కౌలవ 11:38:25 వరకు
వర్జ్యం: 23:46:30 - 25:34:18
దుర్ముహూర్తం: 16:09:50 - 16:55:14
రాహు కాలం: 16:15:31 - 17:40:38
గుళిక కాలం: 14:50:24 - 16:15:31
యమ గండం: 12:00:10 - 13:25:17
అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:22
అమృత కాలం: -
సూర్యోదయం: 06:19:43
సూర్యాస్తమయం: 17:40:38
చంద్రోదయం: 21:37:51
చంద్రాస్తమయం: 10:27:42
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: జెమిని
యోగాలు : ధ్వాo క్ష యోగం - ధన నాశనం,
కార్య హాని 10:18:25 వరకు తదుపరి
ధ్వజ యోగం - కార్య సిధ్ధి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 281 / Bhagavad-Gita - 281 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴.7 వ అధ్యాయము - జ్ఞానవిజ్ఞాన యోగం - 01 🌴*

*01. శ్రీభగవానువాచ*
*మయ్యాసక్తమనా: పార్థ యోగం యుంజన్మదాశ్రయ: |*
*అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తుచ్చ్రుణు ||*

🌷. తాత్పర్యం :
*శ్రీకృష్ణభగవానుడు పలికెను: ఓ పార్థా! మనస్సును నా యందే సంలగ్నము చేసి నా సంపూర్ణభావనలో యోగమభ్యసించుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లు సమగ్రముగా నెరుగగలవో ఇప్పుడు ఆలకింపుము.*

🌷. భాష్యము : 
భగవద్గీత యొక్క ఈ సప్తమాధ్యాయమున కృష్ణభక్తిరసభావనా తత్త్వము సమగ్రముగా వివరింపబడినది. 

సమస్త విభూతులను సంగ్రముగా కలిగియున్న శ్రీకృష్ణభగవానుడు తన విభూతులను సమగ్రముగా కలిగియున్న శ్రీకృష్ణభగవానుడు తన విభూతులను సమగ్రముగా కలిగియున్న శ్రీకృష్ణభగవానుడు తన విభూతులను ఏ విధముగా ప్రదర్శించునో ఈ అధ్యాయమున వర్ణింపబడినది. 

అదే విధముగా శ్రీకృష్ణుని శరణుజొచ్చు నాలుగు తరగతుల అదృష్టభాగుల గూర్చియు మరియు కృష్ణునికి ఎన్నడును శరణమునొందని నాలుగు తరగతుల అదృష్టహీనుల గూర్చియు ఈ అధ్యాయమున వివరింపబడినది.

భగవద్గీత యొక్క మొదటి ఆరుఅధ్యాయములలో జీవుడు ఆత్మస్వరూపుడనియు మరియు వివిధములైన యోగముల ద్వారా తనను ఆత్మసాక్షాత్కారస్థితితికి ఉద్దరించుకొనగలడనియు వివరింపబడినది. 

శ్రీకృష్ణభగవానుని యందు స్థిరముగా మనస్సును సంలగ్నము చేయుటయే (కృష్ణభక్తిరసభావనము) యోగములన్నింటి యందును అత్యున్నత యోగమనియు షష్టాధ్యాయపు అంతమున స్పష్టముగా తెలుపబడినది. అనగా శ్రీకృష్ణునిపై మనస్సును నిలుపుట ద్వారానే మనుజుడు పరతత్త్వమును సమగ్రముగా నెరుగగలడు గాని అన్యథా కాదు. నిరాకార బ్రహ్మానుభూతి గాని లేదా పరమాత్మానుభూతి గాని అసంపూర్ణమై యున్నందున ఎన్నడును పరతత్త్వపు సంపూర్ణజ్ఞానము కాజాలదు. 

వాస్తవమునకు అట్టి సంపూర్ణ శాస్త్రీయజ్ఞానము శ్రీకృష్ణభగవానుడే. కృష్ణభక్తిరసభావన యందు మనుజుడు శ్రీకృష్ణుడే నిస్సందేహముగా చరమజ్ఞానమని ఎరుగగలడు. వివిధములైన యోగపద్ధతులు అట్టి కృష్ణభక్తిరసభావనమునకు సోపానములు వంటివి మాత్రమే. కనుకనే కృష్ణభక్తిభావన యందు ప్రత్యక్షముగా నెలకొనినవాడు బ్రహ్మజ్యోతి మరియు పరమాత్మలకు సంబంధించిన జ్ఞానమును సంపూర్ణముగా అప్రయత్నముగనే పొందగలుగును. 

అనగా కృష్ణభక్తిభావనాయోగమును అభ్యసించుట ద్వారా మనుజుడు పరతత్త్వము, జీవులు, ప్రకృతి, సంపత్పూర్ణమైనటువంటి వాని వ్యక్తీకరణముల గూర్చి పూర్ణముగా తెలిసికొనగలుగును.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 281 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 7 - Jnana Vijnana Yoga - 01 🌴*

*01. śrī-bhagavān uvāca*
*mayy āsakta-manāḥ pārtha yogaṁ yuñjan mad-āśrayaḥ*
*asaṁśayaṁ samagraṁ māṁ yathā jñāsyasi tac chṛṇu*

🌷 Translation : 
*The Supreme Personality of Godhead said: Now hear, O son of Pṛthā, how by practicing yoga in full consciousness of Me, with mind attached to Me, you can know Me in full, free from doubt.*

🌹 Purport :
In this Seventh Chapter of Bhagavad-gītā, the nature of Kṛṣṇa consciousness is fully described. Kṛṣṇa is full in all opulences, and how He manifests such opulences is described herein. Also, four kinds of fortunate people who become attached to Kṛṣṇa and four kinds of unfortunate people who never take to Kṛṣṇa are described in this chapter.

In the first six chapters of Bhagavad-gītā, the living entity has been described as nonmaterial spirit soul capable of elevating himself to self-realization by different types of yogas. At the end of the Sixth Chapter, it has been clearly stated that the steady concentration of the mind upon Kṛṣṇa, or in other words Kṛṣṇa consciousness, is the highest form of all yoga. By concentrating one’s mind upon Kṛṣṇa, one is able to know the Absolute Truth completely, but not otherwise. Impersonal brahma-jyotir or localized Paramātmā realization is not perfect knowledge of the Absolute Truth, because it is partial. Full and scientific knowledge is Kṛṣṇa, and everything is revealed to the person in Kṛṣṇa consciousness. 

In complete Kṛṣṇa consciousness one knows that Kṛṣṇa is ultimate knowledge beyond any doubts. Different types of yoga are only steppingstones on the path of Kṛṣṇa consciousness. One who takes directly to Kṛṣṇa consciousness automatically knows about brahma-jyotir and Paramātmā in full. By practice of Kṛṣṇa consciousness yoga, one can know everything in full – namely the Absolute Truth, the living entities, the material nature, and their manifestations with paraphernalia.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 680 / Vishnu Sahasranama Contemplation - 680🌹*

*🌻680. స్తవప్రియః, स्तवप्रियः, Stavapriyaḥ🌻*

*ఓం స్తవప్రియాయ నమః | ॐ स्तवप्रियाय नमः | OM Stavapriyāya namaḥ*

*స్తవ్యఏవ యతో విష్ణురత ఏవ స్తవప్రియః స్తవ్యః*

*అను నామము నందు వివరించినట్టి హేతువు చేతనే స్తవముల యందు ప్రీతి కల వాడును, తన స్తవము చేసిన వారిని అనుగ్రహించు వాడును గనుక విష్ణువు స్తవప్రియః.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 680🌹*

*🌻680. Stavapriyaḥ🌻*

*OM Stavapriyāya namaḥ*

*स्तव्यएव यतो विष्णुरत एव स्तवप्रियः / Stavyaeva yato viṣṇurata eva stavapriyaḥ*

*As explained in the previous divine name Stavyaḥ, He delights in the Stavas or eulogies and being pleased by such, His devotees get bestowed by His grace and hence He is Stavapriyaḥ.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
स्तव्यस्स्तवप्रियस्स्तोत्रं स्तुतिः स्तोता रणप्रियः ।पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः ॥ ७३ ॥
స్తవ్యస్స్తవప్రియస్స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః ।పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ॥ 73 ॥
Stavyasstavapriyasstotraṃ stutiḥ stotā raṇapriyaḥ,Pūrṇaḥ pūrayitā puṇyaḥ puṇyakīrtiranāmayaḥ ॥ 73 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 642 / Sri Siva Maha Purana - 642 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 14 🌴*
*🌻. గణ వివాదము - 3 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను -

కైలాసము నుండి క్రోసెడు దూరములో నిలబడి యున్న శివుని చూచి, ఆ శివగణములందరు ఆయన వద్దకు వెళ్లి జరిగతిన వృత్తాంమును చెప్పిరి (23). త్రిశూలమును చేతబట్టి యున్న పరమేశ్వరుడు మనస్సులో మిక్కిలి క్రోధమునుపొంది వీరులని పేరు పొందిన తన గణముల ఎదుట నవ్వి ఇట్లు పలికెను (24).

శివుడిట్లు పలికెను -

ఓరీ గణములారా! మీరు నపుంసకులు. మీకు వీరులనే అభిమానముగలదు. కాని మీరు వీరులు గారు. మీరు నా ఎదుట నుండుటకు అర్హులు గారు. మీరు బయపెట్టినచో వాడేమి మాటలాడగల్గును? (25). వెళ్లుడు. మీలో సమర్థుడెవడైననూ వానిని కొట్టుడు. ఇన్ని మాటలేల? వానిని ఇచట నుండి తరిమి వేయవలసినదే (26).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! దేవ దేవడగు మహేశ్వరుడు ఇట్లు గద్దించగా, శ్రేష్ఠులగు ఆ గణములందరు అచటకు వెళ్లి వానితో నిట్లునిరి (27).

శివగణములిట్లు పలికిరి -

ఓరీ! బాలకా! నీవు వినుము. నీవు మమ్ములను మిక్కిలి అవమానించి ఏల మాటలాడు చున్నావు? ఇచట నుండి నీవు దూరముగా పొమ్ము. లేనిచో, నీకు చావు మూడినది (28).

బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడు శివుని అజ్ఞను పాలించే వారి ఈ మాటలను విని ఆ పార్వతీ పుత్రుడు ఏమి చేయవలెనో తెలియక దుఃఖితుడాయెను (29). ఇంతలో వానికి ఆ గణములతో జరుగుచున్న కలహమును గాంచి, పార్వతీదేవి తన చెలికత్తెను ద్వారము వద్ద చూడుమని పంపెను (30). చెలికత్తె అచటకు వచ్చి జరిగిన వృత్తాంతమునెరిగి క్షణకాలము అచటనే ఉండి ఆ వాగ్వాదమును గాంచి ఆనందించి పార్వతి వద్దకు మరలి వెళ్లెను (31). ఓ మునీ! ఆ చెలికత్తె అచట జరిగిన వృత్తాంతమునంతను పూసగూచ్చినట్లుగా పార్వతి యెదుట చెప్పెను (32).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 642🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 14 🌴*

*🌻 The Gaṇas argue and wrangle - 3 🌻*

Brahmā said:—
23. Then the Gaṇas of Śiva went to Śiva who was standing at the distance of a Krośa from Kailāsa and spoke to him.

24. Śiva ridiculed them all. The trident-armed great lord of fierce temperament spoke to his Gaṇas who professed to be heroes.

Śiva said:—
25. “Hello, Gaṇas, impotent wretches, you profess to be heroic but are never so. You are unfit to stand before me and speak. If he is only taunted he will speak in similar tone again.

26. Go and beat him. Some one among you may be competent to do so. Why should I speak more? He must be driven away.”

Brahmā said:—
27. O great sage, when rebuked thus by lord Śiva, the excellent Gaṇas went back and spoke to him.

Śiva’s Gaṇas said:—
28. Hello you boy there, listen. Why do you speak so arrogantly? You go away from here. If not, your death is certain.

Brahmā said:—
29. On hearing the words of Śiva’s servants the son of Pārvatī became unhappy and thought “What shall I do?”

30. In the meantime, the goddess heard the noise of this wrangle between the Gaṇas and the doorkeeper, then looked at her friend and spoke. “Go and see.”

31. The friend came to the door and saw them for a moment. She understood the whole matter. She was delighted and returned to Pārvatī.

32. O sage, coming back she reported the matter to Pārvatī as it had occurred.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 359 / DAILY WISDOM - 359 🌹*
*🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀*
*📝. ప్రసాద్ భరద్వాజ్*

*🌻24. విశ్వం యొక్క సంపూర్ణత యొక్క స్పృహ🌻*

*ధ్యానం అనేది ఈ అనంతమైన చైతన్యంలో అంచెలంచెలుగా భాగస్వాములవడం. విశ్వం యొక్క పరిణామ ప్రక్రియలలో దైవిక చైతన్యం దశలవారీగా వ్యక్తమవుతుంది. ఇక్కడ ఉన్న వ్యక్తిగత చైతన్యం కూడా ఆ మహాచైతన్యం యొక్క ఒక చిన్న భాగమే. కానీ ఇక్కడ, మనిషి విషయంలో, ఆ చైతన్యం భౌతిక రూపంతో తనను తాను గుర్తించి ఇతర రూపాల్లో ఉన్న తన ఉనికిని అనుభూతి చెందలేని స్థితికి దిగజారింది. అంతటా వ్యాపించిన చైతన్యం భౌతిక రూపాలకు దిగి, వ్యక్తిగత శరీరాలు మరియు వస్తువులుగా మారింది.*

*విస్తార చైతన్యంలోని అధమ భాగం ఇతర జీవులతో తనకు ఉన్న సంబంధాన్ని గుర్తించలేనంతగా దిగజారింది. ఇది ఈ చిన్న శరీరం యొక్క నాలుగు గోడలతో ముడిపడి అలాంటి ఇతర శరీరాలలో ఉన్న తనను తాను చూసుకోలేని స్థితిలో ఉంది. కానీ, అది ఇతరులలో తన ఉనికిని అనుభూతిచెందలేనప్పటికీ, అచేతనంగా ఇతర వస్తువులపై, విషయాలపై ఎందుకు లాగబడుతుందంటే ఆ వస్తువులలో ఉన్న అదే చైతన్యం వైపు తెలియకుండానే ఆకర్షించబడుతుంది. చైతన్యం నాశనం కాదు; అది అమరమైనది మరియు అవిభాజ్యమైనది. ఇతర జీవులలో ఉన్న ఈ ఒకే చైతన్యం యొక్క ఆకర్షణ కారణంగానే వాటిపట్ల ప్రేమ, ఆప్యాయత, ఆకర్షణ మైడలైనవి ఉన్నాయి. అలాగే అత్యల్పమైన అణువుల నుంచి, అనంత రోదసిలో ప్రయాణించే పాలపుంతల వరకు ఉండే ఈ వ్యవస్థకు సైతం ఈ ఆకర్షణే కారణం.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 359 🌹*
*🍀 📖 from The Philosophy of Religion 🍀*
*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*

*🌻24. Consciousness of the Fullness of the Universe🌻*

*Meditation is our graduated participation in the consciousness of this enveloping fullness. It is achieved by degrees. The divine consciousness manifests itself in stages in the evolutionary processes of the universe. Even the little individual mind here, as a person, is a degree of that very consciousness. But here, in the case of man, it has descended to so low a state that it has identified itself with the physical form and is unable to feel its presence in other forms. The all-pervading consciousness has come down to the physical forms and has become individual bodies and objects.*

*The lowest descent has taken such a morbid shape that it cannot recognise its kinship with the rest of the world. It has got tied up to the four walls of this tiny body and it cannot visualise itself in other such bodies. But, though it cannot consciously feel its presence in others, yet, subconsciously, or unconsciously, it is pulled towards other things, for it is, after all, present there at the invisible depths and centres of things. Consciousness cannot be destroyed; it is immortal and undividedly present. The unconscious pull exerted by its own presence in other things is the reason behind attractions, affections, loves and spirits of organisation in creation, from the lowest forms of the gyration of the atoms to the galaxies that spin through endless space.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 258 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. 'తమసోమా జ్యోతిర్గమ' దేవా చీకటి నించీ నన్ను కాంతిలోకి నడిపించు, అసతోమా సద్గమయ అసత్యం నించీ సత్యానికి నడిపించు. మృత్యోర్మా అమృతంగమయ మరణం నించీ మరణ రాహిత్యానికి నడిపించు. ఇది అపూర్వమైన ప్రార్థన. 🍀*

*ప్రాచీన ఉపనిషత్ కాలం ఋషులు అద్భుతమయిన ప్రార్థన చేశారు. ప్రపంచంలోని అద్భుత ప్రార్థన అది. 'తమసోమా జ్యోతిర్గమ' దేవా చీకటి నించీ నన్ను కాంతిలోకి నడిపించు, అసతోమా సద్గమయ అసత్యం నించీ సత్యానికి నడిపించు. మృత్యోర్మా అమృతంగమయ మరణం నించీ మరణ రాహిత్యానికి నడిపించు. ఇది అపూర్వమైన ప్రార్థన. వేల సంవత్సరాల క్రితందయినా యిప్పటికి ఎంతో విలువైంది. యిప్పుడూ దీని ప్రాధాన్యం మరింత వుంది. నేను చీకటి నించీ వెలుగుకు నడిపించమని చెప్పను. ఎందుకంటే చీకటి వునికిలో లేదు. నన్ను కాంతి నించీ మరింత కాంతికి నడిపించమని కోరుతాను.*

*అట్లాగే అసత్యం నుండి సత్యానికి నడిపించమని కోరను. ఎందుకంటే అసత్యం లేదు. సత్యం నించీ మరింత సత్యానికి నడిపించమంటాను. అట్లాగే మరణం నించీ మరణం లేని తనానికి నడిపించమనను. ఎందుకంటే మరణమన్నది లేదు. మరణరాహిత్యం నించీ మరింత మరణ రాహిత్యానికి నడిపించమంటాను. జీవితం నించీ మరింత నిరాటంక జీవితానికి సమగ్రత నించీ మరింత సమగ్రతకు నడిపించ మంటాను. సాధారణంగా సమగ్రత అంటే దాన్ని మించి లేదని, అదే ముగింపు అని అంటారు. నేనట్లా అనుకోను. సమగ్రత మరింత సమగ్రత కావాలి. ప్రతి దశా ఒక సమగ్రతే. అది మరింత సంపన్నంగా, వర్ణభరితంగా మారుతూ సాగాలి. కొత్త నాట్యం, కొత్త ఉత్సవం, పరిణామానికి అంతముండదు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹