🌹 25, MARCH 2024 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు🌹

🌹 25, MARCH 2024 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు🌹
🌹 25, MARCH 2024 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు🌹
🌹🎨 హోళీ పండుగ, వసంత పూర్ణిమ, ఫాల్గుణ పూర్ణమి, లక్ష్మీ జయంతి శుభాకాంక్షలు అందరికి / Greetings on Holi Festival, Vasanta Purnima, Phalguna Purnima, Lakshmi Jayanti to All. 🎨🌹
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 512 / Bhagavad-Gita - 512 🌹
🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 23 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 23 🌴
2) 🌹. శ్రీ శివ మహా పురాణము - 867 / Sri Siva Maha Purana - 867 🌹
🌻. శంఖచూడుని దూత శివునితో సంభాషించుట - 4 / The conversation between Śiva and the emissary of Śaṅkhacūḍa - 4 🌻
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 125 / Osho Daily Meditations  - 125 🌹
🍀 125. సందేహం మరియు ప్రతికూలత / 125. DOUBT AND NEGATIVITY 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 539-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 539-2 🌹 
🌻 539. 'శ్రుతిః' - 2 / 539. 'Shrutih' - 2 🌻
5) 🌹 సిద్దేశ్వరయానం - 22 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹🎨 హోళీ పండుగ, వసంత పూర్ణిమ, ఫాల్గుణ పూర్ణమి, లక్ష్మీ జయంతి శుభాకాంక్షలు అందరికి / Greetings on Holi Festival, Vasanta Purnima, Phalguna Purnima, Lakshmi Jayanti to All. 🎨🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*🎨. హోళికా పూర్ణిమ / కాముని పూర్ణిమ ఎందుకు ? 🎨*
*🍀🎨. హోలీ పండగ.. ఈ రంగుల పండగ విశిష్టత ఏంటి..ఎలా జరుపుకోవాలి..? 🎨🍀*

*తెలుగు నెలల్లో చివరిది ఫాల్గుణ మాసం. హోళి పర్వదినం ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. చతుర్దశి నాడు కాముని దహనం జరిపి మరుసటి రోజు పాల్గుణ పౌర్ణమి రోజు హోళి పండుగను జరుపుకుంటారు. వసంత కాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను 'వసంతోత్సవం' పేరిట జరుపుకునేవారు. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి. ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. ఈ పండుగను హోళికా పూర్ణిమ, కాముని పూర్ణిమ, ఫాల్గుణ పౌర్ణమి, హుతాశనీ పూర్ణిమా, వహ్యుత్సవం, వసంతోత్సవం అను పేర్లతో కూడా పిలుస్తారు.*

*🍀. పురాణాలు ఏం చెబుతున్నాయి ? 🍀*

*రాక్షసులకు రాజైన హిరణ్యకశ్యపుడు, తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించ దీనికి విరుద్ధంగా, హిరణ్యకశ్యపుడి సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు, భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశ్యపుడు పలు మార్లు బెదిరించినప్పటికి, ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు. హిరణ్యకశ్యపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరిగా, ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు, ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి, తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరి పోవడం వలన ఆమె దహనం అవుతుంది ఆ శాలువా ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీను జరుపుకుంటున్నాము.*

*ఇంకొందరు ఫాల్గుణ పౌర్ణమి నాడు కాముని పున్నమి పేరిట సంబరాలు జరుపుకుంటారు. సతీవియోగంతో విరాగిలో మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయించారు. దీంతో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మథుని సాయం తీసుకున్నారు. మన్మథుడు శివుడిపైకి పూల బాణాన్ని ప్రయోగించి, తపోభంగం కలిగించాడు. తపో భంగంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మథున్ని భస్మం చేస్తాడు. అలా కోరికలు దహింపజేసిన రోజు కావడం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మథుడి బొమ్మను గడ్డితో చేసి తగులబెడతారు. మన్మథుడు శివుని తపోభంగం చేసినపుడు శివుడు మూడవ కంటితో దహించిన రోజు కనుక కాముని పూర్ణిమ అని అంటారు. హోలిక అనే రాక్షసి చంపబడినందున హోళికా పూర్ణిమ అని అంటారు. హోలికా, హోళికాదాహో అనే నామాలతో దీనిని పేర్కొంటున్నది స్మృతి కౌస్తుభము. కామదహనమనే పేరునూ వింటాము. హుతాశనీ పూర్ణిమా, వహ్యుత్సవం అని కూడా దీనిని అంటారు.*

*ఈనాడు లక్ష్మీనారాయణ వ్రతం, అశోక పూర్ణిమా వ్రతం, ధామత్రి రాత్ర వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి, శయన దాన వ్రతం చేస్తారని పురుషార్థచింతామణి, శశాంక పూజ చేస్తారని నీలమత పురాణం, చంద్రపూజ విషయం ప్రత్యేకం గమనింప తగింది. కొన్ని గ్రంథాలు దీనిని డోలా పూర్ణిమ అంటున్నాయి. ఈనాడు లింగ పురాణమును దానం చేస్తే శివలోక ప్రాప్తి కలుగునని ఫాల్గుణశుద్ధ పూర్ణిమను తెలుగువారు కాముని పున్నమ అంటారు. అది అరవవారి పంగుని ఉత్తిరమ్.*

*ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నాడు చంద్రుడు ఉత్తర ఫల్గునీ నక్షత్రంతో ఉంటాడనేది మనకు తెలిసిందే. ఈ వండుగతో శీతాకాలం వెనుకబడి వసంత ఋతువు లక్షణాలు పైకొంటాయి. చలి తగ్గు ముఖంలో ఉంటుంది. ఉక్కపోత ఇంకా ప్రారంభం కాదు. సూర్యుడు బాగా ప్రకాశిస్తూ హితవై ఉంటాడు. అన్నిపంటలు ఇంటికి వస్తాయి. కర్షకుడికి కడుపు నిండా తిండి దండిగా దొరికే రోజులు అంతా ఆనందం గోవిందంగా ఉంటుంది. వస్తూ వున్న వసంత ఋతువుకు స్వాగతోపచారాలు చేసే సమయం.*

*🍀. శాస్త్రీయ కారణాలు - సహజమైన రంగులు 🍀*

*శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంత కాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ జ్వరం, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన, నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందనేది ఒక వాదన. కుంకుమ, పసుపు, బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు. తడి రంగుల కోసం, మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. అందుకని సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధముగా పనిచేస్తుందని అర్థం.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 512 / Bhagavad-Gita - 512 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 23 🌴*

*23. ఉపద్రష్టానుమన్తా చ భర్తా భోక్తా మహేశ్వర: |*
*పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మేన్ పురుష: పర: ||*

*🌷. తాత్పర్యం : అయినను ఈ దేహమునందు దివ్యప్రభువును, దివ్యయజమానుడును, పర్యవేక్షకుడును, అంగీకరించు వాడును, పరమాత్మగా తెలియబడు వాడును అగు దివ్యభోక్త మరియొకడు కలడు.*

*🌷. భాష్యము : జీవాత్మతో సదా కూడియుండు పరమాత్ముడు దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రాతినిధ్యమని ఇచ్చట పేర్కొనబడినది. అట్టి పరమాత్మ ఎన్నడును సామాన్యజీవుడు కాడు. అద్వైతులైన వారు దేహము నెరిగిన క్షేత్రజ్ఞుడు ఒక్కడేయని భావించుట వలన ఆత్మ మరియు పరమాత్మల నడుమ భేదము లేదని తలతురు. కనుక సత్యమును వివరించుట కొరకే శ్రీకృష్ణభగవానుడు తాను పరమాత్మ రూపమున ప్రతిదేహమునందు ప్రాతినిధ్యము వహించుచున్నానని తెలియజేయుచున్నాడు. అతడు సదా జీవాత్మకు భిన్నుడైనవాడు. కనుకనే “పర”(దివ్యుడని) యని తెలియబడినాడు. జీవాత్మ కర్మక్షేత్రపు కర్మల ననుభవించుచుండ, పరమాత్ముడు మాత్రము భోక్తగా లేక కర్మల యందు వర్తించువాడుగా గాక సాక్షిగా, ఉపద్రష్టగా, అనుమంతగా, దివ్యభోక్తగా వర్తించును.*

*కనుకనే అతడు ఆత్మయని పిలువబడక పరమాత్మగా తెలియబడినాడు. అతడు సదా దివ్యుడు. అనగా ఆత్మ మరియు పరమాత్మ భిన్నమనునది స్పష్టమైన విషయము. పరమాత్మ సర్వత్రా పాణి,పాదములను కలిగియుండును. కాని జీవాత్మ అట్లు సర్వత్రా పాణి, పాదములను కలిగి యుండదు. అదియును గాక పరమాత్మ దేవదేవుని ప్రాతినిధ్యమైనందున హృదయస్థుడై నిలిచి, జీవాత్మ కోరు భోగానుభవమునకు అనుమతి నొసంగుచుండును. అనగా పరమాత్ముని అనుమతి లేనిదే జీవాత్మ ఏమియును చేయజాలదు. కనుకనే జీవాత్మ “భుక్తము” (పోషింపబడువాడు) అని, పరమాత్మ “భోక్త”(పోషించువాడు) యని తెలియబడుచున్నారు. అట్టి పరమాత్మ అసంఖ్యాకములుగా నున్న జీవులందరి యందును మిత్రుని రూపమున నిలిచియుండును.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 512 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 23 🌴*

*23. upadraṣṭānumantā ca bhartā bhoktā maheśvaraḥ*
*paramātmeti cāpy ukto dehe ’smin puruṣaḥ paraḥ*

*🌷 Translation : Yet in this body there is another, a transcendental enjoyer, who is the Lord, the supreme proprietor, who exists as the overseer and permitter, and who is known as the Supersoul.*

*🌹 Purport : It is stated here that the Supersoul, who is always with the individual soul, is the representation of the Supreme Lord. He is not an ordinary living entity. Because the monist philosophers take the knower of the body to be one, they think that there is no difference between the Supersoul and the individual soul. To clarify this, the Lord says that He is represented as the Paramātmā in every body. He is different from the individual soul; He is para, transcendental. The individual soul enjoys the activities of a particular field, but the Supersoul is present not as finite enjoyer nor as one taking part in bodily activities, but as the witness, overseer, permitter and supreme enjoyer.*

*His name is Paramātmā, not ātmā, and He is transcendental. It is distinctly clear that the ātmā and Paramātmā are different. The Supersoul, the Paramātmā, has legs and hands everywhere, but the individual soul does not. And because the Paramātmā is the Supreme Lord, He is present within to sanction the individual soul’s desiring material enjoyment. Without the sanction of the Supreme Soul, the individual soul cannot do anything. The individual is bhukta, or the sustained, and the Lord is bhoktā, or the maintainer. There are innumerable living entities, and He is staying in them as a friend.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 867 / Sri Siva Maha Purana - 867 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 35 🌴*

*🌻. శంఖచూడుని దూత శివునితో సంభాషించుట - 4 🌻*

*ఓ కైలాసగిరీశా! నీవు దేవపక్షపాతివని ప్రసిద్ధిని గాంచినావు (30). బలిచక్రవర్తియొక్క సర్వస్వమును ఊడలాగుకొని, ఆతనిని పాతాళమునకు సాగనంపుటకు కారణమేమి? గదాధరుడగు విష్ణువు ద్వారపాలకుడై ఆతనిని ఉద్ధరించినాడు 931). దేవతలు హిరణ్యాక్షుని, ఆతని సోదరుని హింసించుటకు కారణమేమి? దేవతలు శుంభాది రాక్షసులను సంహరించుటకు కారణమేమి? (32).*

*పూర్వము సముద్రమును మథించినప్పుడు దేవతలు అమృతమున భక్షించిరి. అపుడు మేము ఇడుముల పాలైతిమి. వారందరు ఫలమును అనుభవించిరి (33). ఈ జగత్తు కాలరూపుడగు పరమాత్మకు ఆటవస్తువు. ఆయన ఎప్పుడు ఎవ్వనికి ఐశ్వర్యమునిచ్చునో, అప్పుడు వాడు దానిని భోగించును (34). దేవదానవుల మధ్య శాశ్వతమగు వైరము గలదు. సర్వదా దానికి నిమిత్తము కూడ గలదు. వారికి జయపరాజయములు క్రమముగా కాలమునకు అధీనమై లభించు చుండును 935). వారి ఈ విరోధములో నీవు తలదూర్చుట వ్యర్థము అగును. ఇరుపక్షముల వారికి నీతో సమసంబంధము గలదు. కావున ఈశ్వరుడవగు నీవు ఒక పక్షమున చేరుట సొగసుగా లేదు (36). దేవదానవులకు అందరికీ ప్రభుడవు, మహాత్ముడవు అగు నీవు ఈ నాడు ఈ విధముగా మాతో కయ్యమునకు దిగుట సిగ్గుచేటు (37). నీవు జయించినచో నీ కీర్తి లేశ##మైననూ ఇనుమడించదు. కాని నీవు ఓడినచో కీర్తికి హాని కలుగును. ఈ వైపరీత్యమును నీవు మనస్సులో చక్కగా విచారించదగును (38).*

సనత్కుమారుడిట్లు పలికెను - ఈ మాటలను విని ముక్కంటి బిగ్గరగా నవ్వి దానవచక్రకర్తియగు శంఖచూడుని ఉద్దేశించి యథోచితము, మధురము అగు వచనమును పలెకెను (39).*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 867 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 35 🌴*

*🌻 The conversation between Śiva and the emissary of Śaṅkhacūḍa - 4 🌻*

30. Your Majesty too, O Śiva, is famous as a partisan of the gods. Why did you fight with the Tripuras[2] and reduce them to ashes?

31. After divesting him of every thing why was Bali packed off to Sutala and other regions[3]? Did Viṣṇu go to his threshold as his uplifter?

32. Why was Hiraṇyākṣa[4] harassed by the gods along with his brother? Why were Śumbha[5] and other Asuras subjected to fall by the gods?

33. Formerly when the ocean was churned, the nectar was drunk off by the gods.[6] All the strain and stress was ours but the gods reaped the fruit of our endeavour.

34. The entire universe is but an object of sport of Kāla the supreme soul. Whomsoever and whensoever he pleases to bestow the riches he atttains them.

35. The enmity of the gods and the Dānavas is perpetual and sparked off due to some reason or other. By turns, subject to the whims of Kāla they enjoy victory or defeat.

36. Interference on your part in the dispute between the two is futile. This does not behove you, the lord who are equally in touch with both.

37. Your rivalry to us is excessively shameful since you are lord unto the gods as well as to the Asuras. You are the supreme soul.

38. In the event of your victory your fame is not enhanced. In the event of your defeat you suffer a great loss. Let this disadvantage be pondered over.

Sanatkumāra said:—
39. On hearing these words, the three-eyed lord laughed and spoke sweetly to the leading Dānava what seemed proper.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 125 / Osho Daily Meditations  - 125 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 125. సందేహం మరియు ప్రతికూలత 🍀*

*🕉  సందేహం ఉండడం అంటే నీకు ఎలాంటి స్థితి లేదు; కానీ మీరు ఏదైనా స్వీకరించడానికి, విచారించడానికి సిద్ధంగా ఉంటే సందేహం అనేది ఉత్తమ ప్రారంభం. 🕉*

*సందేహం చెడ్డది కాదు. ప్రతికూలత పూర్తిగా భిన్నమైన విషయం. ప్రతికూలత అంటే మీరు ఇప్పటికే వ్యతిరేక స్థానాన్ని తీసుకున్నారని అర్థం. సందేహం అంటే నీకు ఎలాంటి స్థితి లేదు; మీరు విశాల దృక్పథంతో విచారించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ నుండి ప్రారంభించాలి అన్నప్పుడు సందేహం ఉత్తమ ప్రారంభం.*

*సందేహం అంటే తపన, ప్రశ్న; ప్రతికూలత అంటే మీకు ఇప్పటికే పక్షపాతం ఉంది, మీరు మూర్ఖులు. మీరు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా మీ పక్షపాతం సరైనదని నిరూపించు కోవడం. సందేహం అపారమైన ఆధ్యాత్మికం. కానీ ప్రతికూలత అనేది ఏదో అనారోగ్యం.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 125 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 125. DOUBT AND NEGATIVITY 🍀*

*🕉  Doubt means that you don't have any position; you are ready to inquire. with an open mind. Doubt is the best point from where to begin. 🕉*

*Doubt is not bad. Negativity is a totally different thing. Negativity means you have already taken a position-against. Doubt means you don't have any position; you are ready to inquire, with open mind. Doubt is the best point from where to begin.*

*Doubt simply means a quest, a question; negativity means you already have a prejudice, you are bigoted. You have already decided. Now all that you have to do is somehow to prove your prejudice right. Doubt is immensely spiritual.  But negativity is something sick.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 539 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 539 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 110. సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ ।*
*స్వాహా, స్వధా, అమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా ॥ 110 ॥ 🍀*

*🌻 539. 'శ్రుతిః' - 2 🌻*

*వేదము నుండియే ప్రథమ సంకల్పము ఏర్పడును. కాలము ఏర్పడును. ప్రకృతి పురుషులు ఏర్పడుదురు. మహదహంకారము, త్రిగుణములు యేర్పడును. త్రిగుణముల నుండి సృష్టిజీవులు, లోకములు యేర్పడును. పంచభూతాత్మక సృష్టి యేర్పడును. ఇట్లు అన్నిటికి మూల మేదియో తెలియుట వేదములు తెలియుట, బ్రహ్మమును తెలియుట, తత్త్వమును తెలియుట. ఈ తత్త్వము ఏమియూ లేనట్లుగ యుండును. చోటువలె యుండును. అందుండి క్రమముగ అన్నియూ యేర్పడును. ఏర్పడిన వాటి కన్నిటికినీ కాలపరిమితి యుండును. కాని ఆ తత్త్వము మాత్రము కాలమునకు కూడ మూలమై యుండును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 539 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 110. Sarvaodana pritachitta yakinyanba svarupini*
*svahasvadha amati rmedha shrutih smrutiranuttama ॥110 ॥ 🌻*

*🌻 539. 'Shrutih' - 2 🌻*

*The first will is formed from the Veda itself. Time is formed. Nature and man are formed. Mahadahankara, Triguna aree formed. Creatures and worlds are formed from trigunas. The creation with five elements is formed. Knowing the root of all these means knowing the Vedas, knowing Brahma, knowing Tattva. This philosophy is like nothing. It will be like a place. From there everything will be formed gradually. There is a time limit for all those that are formed such. But that philosophy would also be the source of time.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 సిద్దేశ్వరయానం - 22 🌹*

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
     
*🏵 భైరవనాథుడు 🏵*

*నాగ భైరవుడు గుహ లోపలికి అడుగు పెట్టగానే అసభ్యదృశ్యాలు కనిపిస్తున్నవి. అరకొరగుడ్డలతో ఉన్న ఒక మధ్యవయస్కుడు అతని ఒడిలో అర్ధనగ్నస్త్రీ. ఇద్దరూ మద్యం తాగుతున్నారు. ఎదురుగా మద్యపాత్రలు, మాంసఖండములు ఉన్నవి. ఇతడు లోపలికి ప్రవేశించగానే చూచి అతడు కోపంతో ఊగిపోయాడు. “మూర్ఖుడా! బుద్ధిలేదా? కామాసక్తులమై ఒంటరిగా ఉన్న స్త్రీ పురుషుల దగ్గరకు రాకూడదని తెలియదా? వెళ్ళిపో. వెంటనే బయటకువెళ్ళు అని అరిచాడు.*

*యువకుడు "నమోదత్త ! నమోదత్త! అయ్యా! ఇది దత్తాత్రేయస్వామి గుహ అని విని ఆ మహాత్ముని దర్శనానికి వచ్చాను. మీరెవరో నన్ను కోప్పడుతున్నారు. తప్పైతే మన్నించండి" అని చేతులు జోడించాడు. అతడు "తప్పా! తప్పున్నరా ! ఇది ఎవరి గుహ అనేది నాకు తెలియదు. ప్రక్కనే ఉన్న గ్రామం మాది. మేం కామం తీర్చుకోవటానికి చూస్తుంటే ఈ గుహ కనిపించింది. ఆ దత్తుడెవడో మాకు తెలియదు. చెప్పానుగా ఇంక మరుక్షణం వెళ్ళిపో" అని మళ్ళీ కేకలు పెట్టాడు.*

*యువకునకు ఏం చేయాలో తోచలేదు. వస్తానన్న గురువుగారింకా రాలేదు. మారుమాట్లాడకుండా నిలబడ్డాడు. ఆ కోపిష్టి మనిషి "నీకు సిగ్గులేదా? మెడ బట్టి బయటకు గెంటాలా? ఏం చేస్తానో చూడు. అని ఎదురుగా ఉన్న కల్లుముంత పట్టుకొని యువకుని మోహం మీదికి విసిరేశాడు. ఆ దెబ్బకు మొహంమీద ముంతపగిలి గాయమై నెత్తురు కారటం మొదలు పెట్టింది. కల్లు శరీరమంతా పడింది. అయినా అతడు కదలలేదు. విక్రియ చెందలేదు. ఇంతలో వామదేవమహర్షి వచ్చాడు. "దత్తస్వామీ ! ఈ పిల్లవాణ్ణి పరీక్షిస్తున్నారా! అనుగ్రహించండి" అని చేతులు జోడించాడు. క్షణంలో దృశ్యం మారిపోయింది. మద్యపాత్రలు లేవు. మాంస ఖండములు లేవు. అర్ధ నగ్నకామిని లేదు. జటాజూటధారి దండకమండలు సమన్వితుడు అయిన దత్తాత్రేయస్వామి సాక్షాత్కరించాడు. “మంచి కుర్రాడినే పట్టుకొచ్చావయ్యా! అనుకున్నది. సాధించటానికి పనికి వస్తాడు" అన్నాడు.*

*యువకుడు దత్తస్వామికి సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి అతని శిరస్సు మీద చేయిపెట్టి ఆశీర్వదించాడు.. వామదేవుడు "దత్తప్రభూ ! దేవకార్యం కోసం ఇతనిని శక్తిమంతుణ్ణి చేయటానికి మీరు సంకల్పించాలి. జగన్నాథుడైన కృష్ణ భగవానుడు భౌతికశరీరాన్ని విడిచిన తర్వాత ఆయనను ఎదిరించలేని శత్రువులు కృష్ణధామాన్ని, భారతభూమిని విధ్వంసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. మీకు తెలియనిదేదీ లేదు. మీ దీవెనలతో ఈ మహాకార్యం సిద్ధించాలి. హస్తమస్తక సంయోగం చేసి ఇతనిలోకి శక్తిపాతం చేశారు. చాలా సంతోషం కలిగింది. మరొక ప్రార్ధన. వృషభానుపుత్రిక కృష్ణప్రియ రాధాదేవి ఇక్కడ నూరు సంవత్సరములు తపస్సు చేసి శరీరాన్ని విడిచిపెట్టి ఉపరాధయై బృందావనేశ్వరి కృష్ణారాధ్య, కృష్ణపత్ని అయిన రాధాదేవి సేవలోకి వెళ్ళిందని విన్నాను. ఆమె శరీర అవశేషాల మీద మీరు సువర్ణ రాధా విగ్రహాన్ని నిర్మించారని సిద్ధాశ్రమ యోగులు చెప్పారు. రేపు భాద్రపద శుద్ధ అష్టమి - రావల్ గ్రామంలో ఆమె అవతరించిన రోజు గదా! మీరు దయతో ఆమె దర్శనం చేయించాలి. ఈ పిల్లవాడు కూడా మనతో రావటానికి అనుమతించండి!*

*దత్రాత్రేయులవారు అంగీకరించారు. మరునాడు ఆ దేవిని దర్శించి దత్తస్వామి దగ్గర సెలవు తీసుకొని వామదేవ ఋషి నాగభైరవునితో బయలుదేరి కైలాస పర్వత ప్రాంతంలోను, మానస సరస్సు దగ్గర ఉన్న కొందరు శతసహస్ర వర్ష మహర్షుల ఆశీస్సులిప్పించి హిమవత్ పర్వతశ్రేణులలో కొంతదూరం వెళ్ళారు. త్రోవలో ఒక కోయపల్లె కనిపించింది. కొండ క్రింద అడవి. అక్కడ ఈ గ్రామం. వామదేవ మహర్షికి ఆ ప్రదేశాలన్నీ సుపరిచితములైనవి. వీరా ఊరు చేరగానే ఆ గ్రామస్థులు భక్తితో స్వాగతం చెప్పి వసతి, భోజనాదులు ఏర్పాటు చేశారు. ఆ ఊరిలో రేణుకాదేవి ఆలయమున్నది. ఆ గుడిలో ఆ దేవి శబరకాంతగా భాసిస్తున్నది. అక్కడకు వెళ్ళి ఆ తల్లి దర్శనం చేసుకొన్నారు. మహర్షి ఆ ఎల్లమ్మ తల్లిని స్తుతించాడు.*

*శ్లో గుంజాఫలాకల్పిత చారుహారా శీర్షిశిఖండం శిఖినోవహంతీ ధనుశ్చబాణాన్ దధతీకరాభ్యాం సా రేణుకావల్కల భృత్ విచింత్యా*
*మెడలో గురివెంద గింజల దండ, తల మీద నెమలి పింఛము చేతులలో విల్లంబులు ధరించిన రేణుకాదేవికి నమస్కరిస్తున్నాను.*

సీ వందనంబిందిరావరుగన్నతల్లికి దండంబు ఫణిరాజ మండనకును అంజలి సోమ సూర్యానలనేత్రకు అభివందనము జగదంబికకును మొగుపు చేతులు దేవముని సిద్ధసేవ్యకు నమితంబు గిరిరాజ నందనకును జోహారు రమణీయ శోభనాకారకు జమదగ్ని గారాబు సతికి శరణు*
*అంటూ పారవశ్యంతో 'సురశిరశ్చరణ రేణుకా జగదధీశ్వరీ జయతి రేణుకా అని గీతాగానం చేశాడు.*

*నాగభైరవుడు ఆశ్చర్యంతో చూస్తూ ఆ ప్రస్తుతి పూర్తియై మహర్షి పూజ చేసిన తరువాత ఆ దేవత గురించి తానెప్పుడూ వినలేదని ఆమె మహత్వాన్ని గురించి తెలియ జేయమని అభ్యర్థించాడు.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj

కపిల గీత - 318 / Kapila Gita - 318


🌹. కపిల గీత - 318 / Kapila Gita - 318 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 8. ధూమ - అర్చిరాది మార్గముల ద్వారా వెళ్ళు వారి గతి - భక్తియోగ విశిష్టత - 01 🌴

01. కపిల ఉవాచ

అథ యో గృహమేధీయాన్ ధర్మానేవావసన్ గృహే|
కామమర్థం చ ధర్మాన్ స్వాన్ దోగ్ధి భూయః పిపర్తి తాన్॥


తాత్పర్యము : శ్రీ కపిల భగవానుడు వచించెను - గృహస్థాశ్రమము నందు ఉండియే సకామ భావముతో ఆ గృహస్థాశ్రమ ధర్మములను ఆచరించు వాడు తత్ఫలములైన అర్థకామములను అనుభవించుచు మరల వాటినే ఆచరించు చుండును.

వ్యాఖ్య : గృహస్థులు రెండు రకాలు. ఒకటి గృహమేధి అని, మరొకటి గృహస్థ అని అంటారు. గృహమేధి యొక్క లక్ష్యం ఇంద్రియ తృప్తి, మరియు గృహస్థ యొక్క లక్ష్యం స్వీయ-సాక్షాత్కారం. ఇక్కడ భగవంతుడు గృహమేధి లేదా ఈ భౌతిక ప్రపంచంలో ఉండాలనుకునే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఆర్థికాభివృద్ధి కోసం మతపరమైన ఆచారాలను నిర్వహించడం ద్వారా భౌతిక ప్రయోజనాలను పొందడం మరియు తద్వారా చివరికి ఇంద్రియాలను సంతృప్తిపరచడం అతని కార్యకలాపం. అతను అంతకుమించి ఏమీ కోరుకోడు. అలాంటి వ్యక్తి చాలా ధనవంతుడు కావడానికి మరియు చాలా చక్కగా తినడానికి మరియు త్రాగడానికి తన జీవితాంతం చాలా కష్టపడతాడు. పుణ్యకార్యాల కోసం కొంత దానధర్మం చేయడం ద్వారా అతను తన తదుపరి జన్మలో స్వర్గ గ్రహాలలో ఉన్నత గ్రహ వాతావరణానికి వెళ్ళవచ్చు, కానీ అతను పుట్టుక మరియు మరణం పునరావృతం కాకుండా భౌతిక ఉనికి యొక్క సారూప్య దయనీయ కారకాలతో ముగించాలని కోరుకోడు. అలాంటి వ్యక్తిని గృహమేధి అంటారు.

గృహస్థుడు కుటుంబం, భార్య, పిల్లలు మరియు బంధువులతో నివసించే వ్యక్తి, కానీ వారితో అనుబంధం లేని వ్యక్తి. అతను దూతగా లేదా సన్యాసిగా కాకుండా కుటుంబ జీవితంలో జీవించడానికి ఇష్టపడతాడు, అయితే అతని ప్రధాన లక్ష్యం స్వీయ-సాక్షాత్కారాన్ని సాధించడం లేదా కృష్ణ చైతన్య ప్రమాణానికి రావడమే. అయితే, ఇక్కడ, కపిలదేవుడు గృహమేధిల గురించి మాట్లాడుతున్నాడు. ఇది ప్రహ్లాద మహారాజుచే కూడా ఇలా చెప్పబడింది, పునః పునస్ చర్విత-కార్వాణానామ్‌: (SB 7.5.30) వారు ఇప్పటికే నమిలిన వాటిని నమలడానికి ఇష్టపడతారు. వారు ధనవంతులు మరియు సంపన్నులు అయినప్పటికీ, వారు పదేపదే భౌతిక దుఃఖాన్ని అనుభవిస్తారు, కానీ వారు ఈ రకమైన జీవితాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 318 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 8. Entanglement in Fruitive Activities - 01 🌴

01. kapila uvāca

atha yo gṛha-medhīyān dharmān evāvasan gṛhe
kāmam arthaṁ ca dharmān svān dogdhi bhūyaḥ piparti tān


MEANING : The Personality of Godhead said: The person who lives in the center of household life derives material benefits by performing religious rituals, and thereby he fulfills his desire for economic development and sense gratification. Again and again he acts the same way.

PURPORT : There are two kinds of householders. One is called the gṛhamedhī, and the other is called the gṛhastha. The objective of the gṛhamedhī is sense gratification, and the objective of the gṛhastha is self-realization. Here the Lord is speaking about the gṛhamedhī, or the person who wants to remain in this material world. His activity is to enjoy material benefits by performing religious rituals for economic development and thereby ultimately satisfy the senses. He does not want anything more. Such a person works very hard throughout his life to become very rich and eat very nicely and drink. By giving some charity for pious activity he can go to a higher planetary atmosphere in the heavenly planets in his next life, but he does not want to stop the repetition of birth and death and finish with the concomitant miserable factors of material existence. Such a person is called a gṛhamedhī.

A gṛhastha is a person who lives with family, wife, children and relatives but has no attachment for them. He prefers to live in family life rather than as a mendicant or sannyāsī, but his chief aim is to achieve self-realization, or to come to the standard of Kṛṣṇa consciousness. Here, however, Lord Kapiladeva is speaking about the gṛhamedhīs. It is said by Prahlāda Mahārāja, punaḥ punaś carvita-carvaṇānām: (SB 7.5.30) they prefer to chew the already chewed. Again and again they experience the material pangs, even if they are rich and prosperous, but they do not want to give up this kind of life.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 911 / Vishnu Sahasranama Contemplation - 911


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 911 / Vishnu Sahasranama Contemplation - 911 🌹

🌻 911. శబ్దాతిగః, शब्दातिगः, Śabdātigaḥ 🌻

ఓం శబ్దాతిగాయ నమః | ॐ शब्दातिगाय नमः | OM Śabdātigāya namaḥ


శబ్దప్రవృత్తిహేతూనాం జాత్యాదీనామసమ్భవాత్ శబ్దేన వక్తుమశక్యత్వాత్ శబ్దాతిగః

శబ్దములను అతిక్రమించి అనగా శబ్దములకు అందనిరీతిలో వ్యాపించి పోవువాడు.

వ్యుత్పన్న శబ్దములు ఏవియైనను జాతి, గుణము, క్రియ అను మూడు లక్షణములు - ఒకటియో లేక వాని సమూహముల అర్థమును చెప్పును. కావున శబ్దములు ఏదేని వస్తువునందు ప్రవర్తించ వలయుననిన - అందులకు హేతువులుగా అర్థమునందు జాతి, గుణ, క్రియలు విష్ణునందు అసంభవములు కావున శబ్దముచేనైనను చెప్పుటకు అశక్యుడు కావున అతనిని శబ్దాతిగః అనదగును.

'యతో వాచో నివర్తన్తే అప్రాప్య మనసా సహ' (తైత్తిరీయోపనిషత్ 2.4) -

'వాక్కులు మనస్సుతో కూడ ఎవనిని చేరజాలక నిలిచిపోవుచున్నవో' అను ఈ మొదలగు శ్రుతులును; 'న శబ్దగోచరం యస్య యోగిధ్యేయం పరం పదమ్‍' (విష్ణు పురాణము 1.17.22) - 'యోగుల ధ్యానమునకు మాత్రము గోచరము కాదగు ఎవని పరమ తత్త్వము శబ్దమునకు గోచరము కాదో' ఈ మొదలగు స్మృతి వనములును ఇందు ప్రమాణములు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 911🌹

🌻911. Śabdātigaḥ🌻

OM Śabdātigāya namaḥ


शब्दप्रवृत्तिहेतूनां जात्यादीनामसम्भवात् शब्देन वक्तुमशक्यत्वात् शब्दातिगः / Śabdapravr‌ttihetūnāṃ jātyādīnāmasambhavāt śabdena vaktumaśakyatvāt śabdātigaḥ

The One whose expanse is beyond the reach of words.

He is inexpressible as the elements that enable being spoken of in words like jāti, guṇa and karma i.e., class, quality and action - cannot apply to Him; so, He is Śabdātigaḥ.

'यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह / Yato vāco nivartante aprāpya manasā saha' (Taittirīyopaniṣat 2.4)' - '

from Whom speech returns along with the mind without attaining Him' from śruti and

'न शब्दगोचरं यस्य योगिध्येयं परं पदम् / 'Na śabdagocaraṃ yasya yogidhyeyaṃ paraṃ padam ' (Viṣṇu Purāṇa 1.17.22) -


'Whose supreme abode is to be meditated upon by yogins and is not within the reach of words' from smr‌ti are supporting arguments.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

अरौद्रः कुण्डली चक्री विक्रम्यूर्जितशासनः ।शब्दातिगश्शब्दसहश्शिशिरश्शर्वरीकरः ॥ ९७ ॥

అరౌద్రః కుణ్డలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః ।శబ్దాతిగశ్శబ్దసహశ్శిశిరశ్శర్వరీకరః ॥ 97 ॥

Araudraḥ kuṇḍalī cakrī vikramyūrjitaśāsanaḥ,Śabdātigaśśabdasahaśśiśiraśśarvarīkaraḥ ॥ 97 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹


DAILY WISDOM - 222 : 9. The Recognition of a Supreme Value in Life / నిత్య ప్రజ్ఞా సందేశములు - 222 : 9. జీవితంలో అత్యున్నత విలువను గుర్తించడం



🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 222 / DAILY WISDOM - 222 🌹

🍀 📖 ఉపనిషత్తులపై పాఠాల నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 9. జీవితంలో అత్యున్నత విలువను గుర్తించడం 🌻


ఈ ప్రపంచం చివరకు ఒకరి కోరికలను కూడా తీర్చే స్థితిలో లేదు. ప్రపంచం మొత్తం దాని బంగారం, వెండి, బియ్యం, వడ్లు, గోధుమలు, అవి ఏవైనా మీకు పూర్తిగా ఇస్తే, అది కూడా మీకు సంతృప్తికరంగా ఉండదు. 'ప్రపంచమంతా నాతో ఉంది.' అయితే సరే. మీరు సంపూర్ణంగా సంతృప్తి చెందారా? ఎన్ని చేసినా, మీరు రెండు కారణాల వల్ల కూడా సంతోషంగా ఉండలేరు. వాటిలో ఒకటి: “ ఈ ప్రపంచానికి పైన కూడా ఏదో ఉంది. అది కూడా ఎందుకు నాది కాకూడదు?” ఒక గ్రామం ఉన్న వ్యక్తికి మరో గ్రామం కూడా కావాలి. మీకు అన్ని గ్రామాలు ఉంటే, మీరు మొత్తం రాష్ట్రాన్ని కావాలనుకుంటారు. రాష్ట్రం మీ కింద ఉంటే దేశం మొత్తం కావాలి. దేశం మీ కింద ఉంటే, మీరు మొత్తం భూమిని కావాలనుకుంటారు. అయితే భూమి పైన ఉన్నది కూడా ఎందుకు మనది కాకూడదు? కాబట్టి అసంతృప్తి ఉంది.

“పైన ఏముంది? లేదు, ఇది మంచిది కాదు; నా పైన నేను నియంత్రించలేని, అర్థం చేసుకోలేనిది ఏదో ఉంది.' ప్రపంచం పైన, ప్రపంచం వెలుపల ఏదో ఒకటి ఉండటం మిమ్మల్ని మళ్లీ అసంతృప్తికి గురి చేస్తుంది. రెండవ అంశం: “ఈ ప్రపంచం మొత్తాన్ని నేను ఎంతకాలం స్వాధీనం చేసుకుంటాను? ఏదైనా హామీ ఉందా?” ఎవరికీ తెలియదు. తదుపరి క్షణం మీరు ఇక్కడ ఉండకపోవచ్చు. 'అవునా అలాగా. కాబట్టి, రేపు నేను దాని నుండి విసర్జించబడబోతున్నట్లయితే, మొత్తం ప్రపంచాన్ని కలిగి ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటి? ” ఆ విధంగా, జీవితంలో ఒక అత్యున్నత విలువను గుర్తించడం మరియు దానిని జీవితంలో ఒకరి ప్రయత్నానికి లక్ష్యంగా ఆరాధించాల్సిన అవసరం దేవత లేదా వేదాలలో చెప్పబడిన దైవత్వం అయింది.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 222 🌹

🍀 📖 from Lessons on the Upanishads 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 9. The Recognition of a Supreme Value in Life 🌻


This world is not in a position to satisfy the desires of even one person, finally. If the whole world is given to you with all its gold and silver, rice and paddy, wheat and whatever it is, you will not find it satisfying. “The whole world is with me.” All right. Are you perfectly satisfied? You will be unhappy even then, for two reasons. One of them is: “After all, there is something above this world. Why not have that also?” A person who has a village wants another village also. If you have all the villages, you would like the entire state. If the state is under you, you want the entire country. If the country is under you, you would like the whole Earth. But why not have something above the Earth? So there is a dissatisfaction.

“What is above? No, this is no good; there is something above me which I cannot control, which I cannot understand.” The presence of something above the world, outside the world, will make you unhappy again. The second point is: “How long will I be in possession of this whole world, sir? Is there any guarantee?” Nobody knows. The next moment you may not be here. “Oh, I see. So, what is the good of possessing the whole world, if tomorrow I am going to be dispossessed of it?” Thus, the recognition of a supreme value in life, and the need to adore it as the objective and the goal of one's endeavour in life, became the Devata, or the Divinity of the Vedas.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹




Siva Sutras - 225 : 3-31 stithilayau - 2 / శివ సూత్రములు - 225 : 3-31 స్థితిలయౌ‌ - 2


🌹. శివ సూత్రములు - 225 / Siva Sutras - 225 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

3వ భాగం - ఆణవోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 3-31 స్థితిలయౌ‌ - 2 🌻

🌴. పరిరక్షణ మరియు విధ్వంసం కూడా అతని శక్తితో నిండి ఉంటుంది మరియు అతని ద్వారా మాత్రమే విశ్వం ప్రకాశిస్తుంది. 🌴


దేవుని చర్యను సరస్సుతో పోల్చవచ్చు. సరస్సు వర్షపు నీటితో నిండినప్పుడు, అది అతని సృష్టి కార్యం. భగవంతుడు సరస్సులో నీటి స్థాయిని నిర్దేశించిన స్థాయిలో నిర్వహిస్తాడు. ఆ మట్టం దాటితే సరస్సు తెగిపోయి నీరు పొంగి ప్రవహిస్తుంది. ఇది వినాశన చర్య. మళ్లీ వర్షం కురిసేలా నీరు ఆవిరి అయినప్పుడు, అది వినోదం. ఈ ప్రక్రియ ఎప్పటికీ కొనసాగుతుంది. భగవంతుడు తన చక్రీయమైన సృష్టి, జీవనోపాధి మరియు విధ్వంసక చర్యలను ఈ విధంగా నిర్వహిస్తాడు. పరిణామం మరియు లయం రెండూ నిరంతరం జరుగుతాయి, తద్వారా విశ్వం యొక్క సమతుల్యత కాపాడబడుతుంది. భగవంతుని ఇష్టానుసారం మాత్రమే సమతౌల్యం చెదిరిపోతుంది, ఇది సృష్టి యొక్క లయానికి దారి తీస్తుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Siva Sutras - 225 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 3 - āṇavopāya

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 3-31 stithilayau - 2 🌻

🌴. Preservation and destruction are also filled with his shaktis and illuminated by him only. 🌴


The act of God can be compared to a lake. When the lake is filled with rain water, it is His act of creation. The Lord maintains the level of water in the lake at a prescribed level. When that level is crossed, the lake breaches, and water overflows. It is the act of destruction. When the water vaporises to rain again, it is recreation and this process continues forever. This is how the Lord carries out His cyclic acts of creation, sustenance and dissolution. Both evolution and dissolution happens continuously, thereby maintaining the equilibrium of the universe.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


సిద్దేశ్వరయానం - 21 Siddeshwarayanam - 21


🌹 సిద్దేశ్వరయానం - 21 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 భైరవనాథుడు 🏵

వైరోచని పట్టుదలతో ఒక సంవత్సరం చేసింది. దర్శనం కలుగలేదు. దేవతను బ్రతిమలాడింది. ఏడ్చింది. దేవత పలకలేదు. ఆర్తితో ఆవేదనతో దేవత దగ్గర కత్తి తీసుకొని తలను నరుకుకొన్నది. నేను దిగ్భ్రాంతితో చూస్తూ దేవతను ఆవాహన చేశాను. ఆ దేవి అవతరించింది. వైరోచనీదేవి ఈ వైరోచని శిరస్సును మొండెమునకు తాకించింది. అది అంటుకొన్నది. ప్రాణం వచ్చింది. పరమేశ్వరి "బిడ్డా! చాలా సాహసం చేశావు. నీ గురుప్రార్ధన వల్ల - నీ సాహసానికి మెచ్చి వచ్చాను. నీలో ఉంటాను. ఇక నీవే నేను" అని అదృశ్యమైంది. ఆమె దేవతయైనది గనుకనే బలి చక్రవర్తి ఆమెను పూజించాడు. బలి వామనునకు చేసిన దానమునకు ఆమె హర్షించి ఆశర్వీదించింది.

ఛిన్నగ్రీవా ఛిన్నమస్తా ఛిన్నముండధరాక్షతా క్షోధక్షేమకరీస్వక్షా క్షోణీశాచ్ఛాదనక్షమా వైరోచనీవరారోహ బలిదాన ప్రహర్షితా బలిపూజితపాదాబ్జా వామదేవ ప్రయోజితా - (ఛిన్నమస్తాతంత్రము)

వైరోచని చేసినట్లు నీవు తల నరుకుకోవలసిన పని లేదు, మనం హిమాలయాలకు చేరిన తరువాత నీ సాధనా మార్గం నిర్దేశించబడుతుంది.

యువకుడు - మీ దయ.

వామదేవ మహర్షి వెంట నాగభైరవుడు హిమాలయాలకు వెళ్ళాడు. త్రోవలో పశుపతినాధుని దర్శించారు. ఆ మహేశ్వరునకు హరభైరవుడని, మానస సరస్సు దగ్గరి భైరవునకు అమర భైరవుడని పేరు. పశుపతినాధుని ఆలయానికి కొద్ది క్రోసుల దూరంలో ఒక కాళీ ఆలయమున్నది. శక్తి గల దేవతగా ఆమెకు పేరు. ఆమె దర్శనం చేసుకుందామని - వామదేవుడు యువకునితో కలసి వెళ్ళాడు. వీళ్ళు వెళ్ళే సరికి సంధ్యా సమయం దాటి చీకటి పడుతున్నది. జనం ఎక్కువ మంది లేరు. అయిదారుగురున్నారు. వారంతా మద్యపానం చేసి ఎరుపెక్కిన కళ్ళతో మత్తుగా తూగుతున్నారు. వారు బలియిచ్చిన జంతువుల శరీర ఖండాలక్కడే ఉన్నవి. నెత్తురు మడుగు అంతా. వాళ్ళీ యిద్దరు మనుషులను చూచారు. అరే! కాళికి ఇవాళ నరబలి యిద్దాము. ఈ గడ్డాల పెద్దాయనను ప్రక్కకు నెట్టి వేయండి. ఈ కుర్రాణ్ణి కట్టివేయండి అని యువకుని తాళ్ళతో కట్టివేశారు. మొహానికి పసుపురాసి కుంకుమ బొట్టు పెట్టి మెడలో పూలదండవేసి బలిపీఠం మీద తలపెట్టారు. యువకుడేమీ మాట్లాడలేదు. గురువుగారి వైపు చూస్తున్నాడు. వామదేవుడు నరబలి మహాపాపం. చెయ్యవద్దు అని చెప్పి చూచాడు. వారు వికృతంగా నవ్వి ఆయనను నెట్టివేశారు. వారిలో ఒకడు కత్తి యెత్తి యువకుని శిరస్సు ఖండించబోయినాడు. అతని చెయ్యి చచ్చుపడి కత్తి క్రిందపడింది. ఏమైందిరా అని ఇంకొకడు అలా అందరూ నరకబోవటం చేతులు పక్షవాతం రావటం, వాలిపోవటం జరిగింది. వామదేవుని కన్నులలో క్రోధం కనిపించింది. దుష్టులారా! చెప్పినా వినకుండా నరబలికి ఉపక్రమించారు. చచ్చుబడిన మీ చేతులు బ్రతికినన్నాళ్ళు ఇట్లనే ఉంటవి. దీనిని చూచైనా మిగతా మీవాళ్ళు గుణపాఠం నేర్చుకొంటారు. ఈ గుడిలో ఇక ఈ దుష్కార్యాలు జరగటానికి వీలు లేదు. అసలు కాళీదేవినే ఇక్కడ ఉండి మీ పూజలు స్వీకరించవద్దని కోరుతున్నాను. ఆమె ఇంక ఇక్కడ ఉండదు - అన్నాడు ఋషి, కాళీవిగ్రహం మాయమైంది.

వాళ్ళు దిగ్భ్రాంతితో చూస్తుండగా యువకునితో కలసి వామదేవుడు బయలుదేరాడు. గురుదేవా! మరి కాళీదేవీ గుడియింక లేనట్లేనా! అన్నాడు నాగభైరవుడు. మహర్షి "ప్రస్తుతానికింతే ! కొన్ని సంవత్సరాల తర్వాత నీవే సిద్ధుడవై వచ్చి ఇక్కడ కాళీదేవిని ప్రతిష్ఠింతువుగాని" పద! అన్నాడు. వారి ప్రయాణం కొనసాగుతున్నది. మహర్షి యువకునితో "రేపు భాద్రపదశుద్ధ అష్టమి. కృష్ణప్రియ - గోలోకనాయిక రాధాదేవి పుట్టినరోజు. ఆమె తపస్సు చేసిన గుహకు వెళ్ళి ఆ రాసేశ్వరికి పూజ చేయాలి. దాని కోసం ముందు మనం దత్తాత్రేయాశ్రమానికి వెళ్ళాలి. ఇవి కైలాస పర్వతంలో ఉన్నవి. ఇక్కడి నుండి చాలా యోజనాల దూరం. భూమార్గంలో ఇక కుదరదు. నా చేయిపట్టుకో, మనం ఆకాశమార్గంలో వెళుతున్నాము" అన్నాడు. ఇప్పుడు యువకునకు ఆశ్చర్యము, కష్టము అన్న పదాల భావనకు అతీతమైన స్థితి వచ్చినది. మహాపురుషుని అనుగ్రహ పాత్రుడనైనానని తెలుసుకొన్నాడు. కొద్ది గంటలలోనే మానస సరస్సుదగ్గర ఆగి దేవతలు దిగివచ్చి స్నానం చేసే ఆ పవిత్రజలాలలో స్నానం చేసి కైలాసపర్వతం దగ్గరకు చేరుకొన్నారు. అక్కడ ఒక చిన్న ఆశ్రమము, కొన్ని కుటీరములు, ఋషి కుటుంబాలు ఉన్నవి. వారు మహర్షిని భక్తితో స్వాగతించి మర్యాదలు చేసి కృష్ణ నిర్యాణం తర్వాత వచ్చిన దేశపరిస్థితుల గురించి అడుగుతున్నారు. చిరకాల పరిచితులైన వారితో సంభాషణ చేస్తూ “నాగభైరవా! ఆ కనిపించే కాలిబాటలో ఒక అర్థ గడియ నడిచి వెళ్ళు. కొండ దగ్గరకు వెళ్ళగానే ఉదుంబర వృక్షం కనిపిస్తుంది. దాని ముందున్నది దత్తాత్రేయ గుహ. నీవు వెళ్ళి స్వామి దర్శనం చేసుకో. ఇంతలో నేను వస్తాను” మహర్షి లేకుండా తానొక్కడూ వెళ్ళటం యువకునికి ఇష్టం లేదు. కాని గురువునకు ఎదురు చెప్పరాదు గనుక 'తమ ఆజ్ఞ' అని బయలుదేరి కైలాస పర్వత గుహకు చేరుకొన్నాడు.


( సశేషం )

🌹🌹🌹🌹🌹