🌹 30, DECEMBER 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹

🍀🌹 30, DECEMBER 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 30, DECEMBER 2023 SATURDAY శనివారం, స్థిర వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 479 / Bhagavad-Gita - 479 🌹
🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -10 / Chapter 12 - Devotional Service - 10 🌴
🌹. శ్రీ శివ మహా పురాణము - 835 / Sri Siva Maha Purana - 835 🌹
🌻. శంఖచూడుని వివాహము - 5 / The penance and marriage of Śaṅkhacūḍa - 5 🌻
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 92 / Osho Daily Meditations - 92 🌹
🍀 92. సాధారణ హృదయం / 92. SIMPLE HEART 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 520 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 520 - 2 🌹 
🌻 520. 'సాకిన్యంబా స్వరూపిణీ' - 2 / 520. Sakinyanba Svarupini - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 30, డిసెంబరు, DECEMBER 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : అఖూరత సంకష్టి చతుర్ధి, Akhuratha Sankashti Chaturthi 🌻*

*🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 29 🍀*
 
*52. మహాజగరచండాగ్నిః శకటప్రాణ కంటకః |*
*ఇంద్రసేవ్యః పుణ్యగాత్రః ఖరజిచ్చండదీధితిః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : అతిమానస విజ్ఞానానుభూతి - అతిమానస విజ్ఞానచేతనయందు ఏ సమస్యలూ ఉండవు. మనః కల్పితమైన భేదజ్ఞానమును బట్టియే సమస్యలు ఉత్పన్న మవుతాయి. అతిమానస విజ్ఞానానుభూతి యందు అఖండమైన పూర్ణ స్వరూపంతో సత్య సాక్షాత్కార మవుతుంది. ప్రతిదీ ఆ పూర్ణ వస్తువులో అంతర్భాగమే. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
హేమంత ఋతువు, దక్షిణాయణం,
మార్గశిర మాసము
తిథి: కృష్ణ తదియ 09:45:29
వరకు తదుపరి కృష్ణ చవితి
నక్షత్రం: ఆశ్లేష 29:43:33 వరకు
తదుపరి మఘ
యోగం: వషకుంభ 26:55:37
వరకు తదుపరి ప్రీతి
కరణం: విష్టి 09:45:29 వరకు
వర్జ్యం: 17:19:36 - 19:05:48
దుర్ముహూర్తం: 08:13:59 - 08:58:25
రాహు కాలం: 09:31:44 - 10:55:01
గుళిక కాలం: 06:45:09 - 08:08:26
యమ గండం: 13:41:37 - 15:04:54
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:40
అమృత కాలం: 27:56:48 - 29:43:00
సూర్యోదయం: 06:45:09
సూర్యాస్తమయం: 17:51:30
చంద్రోదయం: 20:50:53
చంద్రాస్తమయం: 09:21:33
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: కర్కాటకం
యోగాలు: మానస యోగం - కార్య లాభం 29:43:33 వరకు తదుపరి పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 479 / Bhagavad-Gita - 479 🌹*
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -10 🌴*

*10. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్ |*
*అభ్యాసయోగేన తతో మమిచ్ఛాప్తుం ధనంజయ ||*

*🌷. తాత్పర్యం : భక్తియోగ నియమములను కూడా నీవు అభ్యసింపజాలనిచో నా కొరకు కర్మ నొనరించుటకు యత్నింపుము. ఏలయన నా కొరకు కర్మచేయుట ద్వారా నీవు పూర్ణశక్తిని పొందగలవు.*

*🌷. భాష్యము : భక్తియోగమునందలి నియమములను సైతము విధిగా గురువు నిర్దేశమునందు పాటింపలేనివాడు భగవానుని కొరకు కర్మ చేయట ద్వారా ఈ పూర్ణత్వస్థితిని చేరగలడు. ఆ కర్మను ఏ విధముగా నొనరింపవలెనో ఏకాదశాధ్యాయపు ఏబదిఐదవ శ్లోకమున ఇదివరకే వివరింపబడినది. అనగా మనుజుడు కృష్ణచైతన్య ప్రచారోద్యమము సాగించు భక్తులకు సహాయము చేయవచ్చును. భక్తియోగనియమములను ప్రత్యక్షముగా అభ్యసింపలేకపోయినను మనుజుడు ఇట్టి ప్రచారకార్యక్రమమునకు సహాయము నందింపవచ్చును. లోకములో ప్రతికార్యక్రమమునకు కొంత స్థలము, పెట్టుబడి, వ్యవస్థ, పరిశ్రమ లనునని అవసరములు. ఏదేని వ్యాపారమునకు స్థలము, పెట్టుబడి, పరిశ్రమ మరియు దానిని నడుపుటకు వ్యవస్థ అవసరమైనట్లే, కృష్ణుని సేవకొరకు కూడా ఇవన్నియు అవసరములై యున్నవి. కాని ఆ రెండు కర్మలలో భేదమేమనగా భౌతికస్థితిలో కర్మ స్వీయప్రీతికై ఒనరింపబడగా, రెండవదానిలో అది కృష్ణుని ప్రీత్యర్థమై ఒనరింపబడును. అట్లు కృష్ణప్రీత్యర్థమై ఒనరింపబడునదే ఆధ్యాత్మిక కర్మము.*

*ఎవరైనను ధనమును అధికముగా కలిగియున్నచో కృష్ణభక్తుని ప్రచారము చేయుటకు కార్యాలయముగాని, మందిరమునుగాని నిర్మింపవచ్చును లేదా కృష్ణసంబంధవిజ్ఞానము ముద్రించుటలో తోడ్పడవచ్చును. ఈ విధమైన కృష్ణపరకర్మలు పలుగలవు. మనుజుడు అట్టి కర్మల యందు అనురక్తుడు కావలెను. ఒకవేళ మనుజుడు తన కర్మల ఫలముగా లభించినదానిని సంపూర్ణముగా త్యాగము చేయలేకున్నచో దాని యందు కొంతశాతమునైనను కృష్ణభక్తి ప్రచారమునకై దానము చేయవచ్చును. ఈ విధముగా కృష్ణచైతన్యోద్యమ ప్రచారము స్వచ్ఛందముగా చేయబడు సేవ మనుజుని క్రమముగా అత్యున్నతమైన భగవత్ప్రేమస్థాయికి గొనిపోవును. అంతట అతడు పరిపూర్ణుడు కాగలడు.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 479 🌹
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 12 - Devotional Service - 10 🌴*

*10. abhyāse ’py asamartho ’si mat-karma-paramo bhava*
*mad-artham api karmāṇi kurvan siddhim avāpsyasi*

*🌷 Translation : If you cannot practice the regulations of bhakti-yoga, then just try to work for Me, because by working for Me you will come to the perfect stage.*

*🌹 Purport : One who is not able even to practice the regulative principles of bhakti-yoga, under the guidance of a spiritual master, can still be drawn to this perfectional stage by working for the Supreme Lord. How to do this work has already been explained in the fifty-fifth verse of the Eleventh Chapter. One should be sympathetic to the propagation of Kṛṣṇa consciousness. There are many devotees who are engaged in the propagation of Kṛṣṇa consciousness, and they require help. So, even if one cannot directly practice the regulative principles of bhakti-yoga, he can try to help such work. Every endeavor requires land, capital, organization and labor. Just as in business one requires a place to stay, some capital to use, some labor and some organization to expand, so the same is required in the service of Kṛṣṇa. The only difference is that in materialism one works for sense gratification.*

*The same work, however, can be performed for the satisfaction of Kṛṣṇa, and that is spiritual activity. If one has sufficient money, he can help in building an office or temple for propagating Kṛṣṇa consciousness. Or he can help with publications. There are various fields of activity, and one should be interested in such activities. If one cannot sacrifice the results of his activities, the same person can still sacrifice some percentage to propagate Kṛṣṇa consciousness. This voluntary service to the cause of Kṛṣṇa consciousness will help one to rise to a higher state of love for God, whereupon one becomes perfect.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 834 / Sri Siva Maha Purana - 834 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 28 🌴*

*🌻. శంఖచూడుని వివాహము - 5 🌻*

*బ్రహ్మ ఇట్లు పలికెను - ఓ శంఖచూడా! ఈ మెతో నీవేమి సంభాషణను చేయుచున్నావు? ఈమెను నీవు గాంధర్వవిధిచే వివాహమాడుము (34). నీవు పురుషులలో శ్రేష్ఠుడవు. ఈ పతివ్రత స్త్రీలలో శ్రేష్ఠురాలు. జ్ఞానవంతురాలగు ఈమెకు జ్ఞానివగు నీతో వివాహము గొప్ప గుణకారి కాగలదు (35). విరోధము లేనిది, దుర్లభ##మైనది అగు సుఖమును ఎవడు విడిచిపెట్టును? ఓ రాజా! విరోధములేని సుఖమును పరిత్యజించు వ్యక్తి పశుప్రాయుడనుటలో సందేహము లేదు (36). ఓ పుణ్యాత్మురాలా! గుణవంతుడు, దేవతలను, అసురులను దానవులను శిక్షించువాడు అగు ఇట్టి సుందరుని నీవు ఏమి పరీక్ష చేయు చున్నావు? (37) నీవీతనితో గూడి చిరకాలము అన్ని వేళలలో సర్వలోకములయందలి ప్రదేశము లన్నింటిలో యథేచ్ఛగా విహరించుము. ఓ సుందరీ! (38) ఆతడు మరణించిన తరువాత గోలోకములో మరల శ్రీకృష్ణుని పొందగలడు. ఆతడు మరణించిన పిదప నీవు వైకుంఠములో చతుర్భుజుడగు విష్ణువును పొందగలవు (39).*

*సనత్కుమారుడిట్లు పలికెను- బ్రహ్మ ఈ విధముగా ఆశీర్వదించి తన ధామమునకు వెళ్లెను. ఆ శంఖచూడుడు ఆమెను గాంధర్వవిధితో వివాహమాడెను (40). ఆతడు ఈ తీరున తులసిని వివాహమాడి తండ్రి గృహమునకు వెళ్లి మనోహరమగు ఆ నివాసములో ఆ సుందరితో గూడి రమించెను (41).*

*శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు యుద్ధఖండలో శంఖచూడ వివాహవర్ణనమనే ఇరువది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (28).*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 834 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 28 🌴*

*🌻 The penance and marriage of Śaṅkhacūḍa - 5 🌻*

Brahmā said:—
34. “O Śaṅkhacūḍa, why do you hold discussion with her? Marry her according to the Gāndharva[2] form of marriage.

35. You are jewel among men. And she, the chaste lady, is a jewel among women. The union of an intelligent lady with an intelligent man must necessarily be virtuous.

36. O king, unless forced who will abandon a chance of happiness? He who does so unforced is a brute. There is no doubt about it.

37. O chaste lady, why shall you test such a good and noble husband? He can suppress the gods, Asuras and Dānavas too.

38. O beautiful woman, you may sport with him for long, as you please, in different centres all over the world.

39. In the end, he will attain Śrīkṛṣṇa again in the Goloka. After he is dead, you will attain the four-armed lord in Vaikuṇṭha.”

Sanatkumāra said:—
40. After conferring blessings, Brahmā returned to his abode. The Dānava accepted her by means of the Gāndharva rite.

41. After marrying her he went to his father’s place. In the beautiful apartment he sported with her.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 92 / Osho Daily Meditations - 92 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 92. సాధారణ హృదయం 🍀*

*🕉. సాధారణంగా ఉండటం అంటే మనసు నుండి హృదయానికి మారడం. 🕉*

*మనసు చాలా మోసపూరితమైనది; ఇది ఎప్పుడూ సులభం కాదు. హృదయం ఎప్పుడూ మోసపూరితమైనది కాదు, ఎల్లప్పుడూ సులభంగా ఉంటుంది. సింపుల్‌గా ఉండడం అంటే మనసు నుంచి హృదయానికి మారడం. మేము తల ద్వారా జీవిస్తాము. అందుకే మన జీవితం మరింత క్లిష్టంగా మారుతుంది, ఒక అభ్యాస పజిల్ లాగా: ఏదీ సరిపోదనిపిస్తుంది. మరియు మనం ఎంత తెలివిగా ఉండటానికి ప్రయత్నిస్తామో, అంత ఎక్కువ గందరగోళంలో పడతాము. అది మన చరిత్ర: మనం మరింత పిచ్చిగా మారాము. ఇప్పుడు భూమి అంతా దాదాపు పిచ్చాసుపత్రిలా ఉంది. మానవాళి మనుగడ సాగించాలంటే, గొప్ప మార్పు జరగాల్సిన సమయం ఆసన్నమైంది: మనం మనసు నుండి హృదయానికి వెళ్లాలి. లేకపోతే ఆత్మహత్య చేసుకునేందుకు మనసు సిద్ధమైంది. ఇది చాలా కష్టాలను మరియు చాలా విసుగును మరియు అనేక సమస్యలను సృష్టించింది, ఆత్మహత్య ఒక్కటే మార్గం అనిపిస్తుంది.*

*భూమి మొత్తం ఆత్మహత్యకు సిద్ధమవుతోంది. ఒక అద్భుతం జరిగితే తప్ప, ఇది ప్రపంచవ్యాప్త ఆత్మహత్య అవుతుంది. మరియు ఇది అద్భుతం అవుతుంది-ఇది జరిగితే, ఇదే అద్భుతం, మన దృక్పథంలో గొప్ప మార్పు, సమూలమైన మార్పు ఉంటుంది: మనం హృదయం నుండి జీవించడం ప్రారంభిస్తాము. మనము మనస్సు యొక్క మొత్తం విశ్వాన్ని వదిలివేస్తాము, మరియు మనము చిన్న పిల్లల వలె కొత్తగా ప్రారంభిస్తాము. హృదయం నుండి జీవించండి. మరింత అనుభూతి చెందండి, తక్కువ ఆలోచించండి, మరింత సున్నితంగా మరియు తక్కువ తార్కికంగా ఉండండి. మరింత హృదయపూర్వకంగా ఉండండి ఆపై మీ జీవితం పరిపూర్ణమైన ఆనందంగా మారుతుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 92 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 92. SIMPLE HEART 🍀*

*🕉 To be simple means shifting from the head to the heart. 🕉*

*Mind is very cunning; it is never simple. The heart is never cunning, it is always simple. To be simple means shifting from the head to the heart. We live through the head. That's why our life becomes more and more complicated, more and more like a jigsaw puzzle: Nothing seems to fit. And the more we try to be clever, the more in a mess we are. That has been our history: We have gone more and more insane. Now the whole earth is almost like a madhouse. The time has come, if humanity is to survive at all, for a great shift to happen: We have to move from the head to the heart. Otherwise, the head is ready to commit suicide. It has created so much misery and so much boredom and so many problems that suicide seems the only way out. *

*The whole earth is preparing for suicide. It is going to be a global suicide, unless a miracle happens. And this is going to be the miracle-if it happens, this is the miraclethere will be a great shift, a radical change, in our very outlook: We will start living from the heart. We will drop the whole universe of the mind, and we will start afresh like small children. Live from the heart. Feel more, think less, be more sensitive and less logical. Be more and more heartful, and your life will become a sheer joy.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 520 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 520 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 107. ముద్గౌదనాసక్త చిత్తా, సాకిన్యంబాస్వరూపిణీ ।*
*ఆజ్ఞా చక్రాబ్జనిలయా, శుక్లవర్ణా, షడాననా ॥ 107 ॥ 🍀*

*🌻 520. 'సాకిన్యంబా స్వరూపిణీ' - 2🌻*

*మూలాధార ప్రజ్ఞ ఆరోగ్యముగ నున్నచో ఎముకలు పటిష్ఠములై, పుష్టములై భౌతిక రూపము చాలా కాలము చెడకుండ నిలచును. సహస్రారము నుండి మూలాధారమునకు శ్రీమాత అవతరణమే సృష్టి అవతరణము. సృష్టి మూలాధారము చేరుసరికి పరిపూర్ణత చెందును. అట్టి సృష్టిలో జీవులందరూ ఏడు లోకములను నిండి నివసింతురు. మరల ఆరోహణ క్రమమున సహస్రారమును చేరుటకే దివ్యవిద్య లన్నియూ. సహస్రారమునందెట్టి ప్రజ్ఞ యున్నదో మూలాధారము నందు కూడ అట్టి ప్రజ్ఞయే యున్నది. సహస్రారము నంతయూ అవ్యక్తము. మూలాధారమున అంతయూ పూర్ణ వ్యక్తము. ఒకటి అమావాస్య వంటిది కాగ రెండవది పూర్ణిమ వంటిది.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 520 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻107. Mudgaodanasaktachitta sakinyanba svarupini*
*aagynachakrabja nilaya shuklavarna shadanana ॥ 107 ॥ 🌻*

*🌻 520. Sakinyanba Svarupini - 2 🌻*

*If the Mooladhara energy is healthy, the bones will be strong and the physical form will remain intact for a long time. Shrimata's manifestation from Sahasrara to Mooladhara is the manifestation of the universe. It is perfected when it reaches the source of creation. In such a creation, all living beings inhabit the seven worlds. Again, in the order of ascension, to reach the Sahasrara, all the divine vidyas are needed. The kind of wisdom that is there in Sahasrara, is the same kind of wisdom that is there in Muladhara. Everything is all implicit at Sahasrara. Everything is completely explicit at Mooladhara. One is like Amavasya and the other is like Purnima.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3

29 Dec 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 29, డిసెంబరు, DECEMBER 2023 పంచాంగము - Panchangam 🌹

శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు. 🌻

🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 23 🍀

42. కాశ్యపీ కమలాదేవీ నాదచక్రనివాసినీ ।
మృడాధారా స్థిరా గుహ్యా దేవికా చక్రరూపిణీ ॥

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : ఆరోహణా అవరోహణలు - ఆపరా ప్రకృతికి చెందిన దేహ ప్రాణ మనస్సులను రూపాంతరం చెందించునది ఆతి మానస విజ్ఞానశక్తి మాత్రమే. నిష్పాక్షికముగ సర్వమునకు ఆధారభూతమై యుండు సచ్చిదానందము వలన ఆ పని జరుగదు. కాని, సచ్చిదానంద అనుభూతి ద్వారముననే ఆ విజ్ఞాన భూమికకు

ఆరోహణము, తదనంతరం క్రింది భూమికలకు ఆ విజ్ఞాన అవతరణము సంభవమౌతాయి. 🍀


🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

హేమంత ఋతువు, దక్షిణాయణం,

మార్గశిర మాసం

తిథి: కృష్ణ పాడ్యమి 06:47:40

వరకు తదుపరి కృష్ణ విదియ

నక్షత్రం: పునర్వసు 25:06:54

వరకు తదుపరి పుష్యమి

యోగం: ఇంద్ర 26:23:44 వరకు

తదుపరి వైధృతి

కరణం: కౌలవ 06:46:40 వరకు

వర్జ్యం: 12:17:00 - 13:59:24

దుర్ముహూర్తం: 10:26:20 - 11:10:44

మరియు 14:52:45 - 15:37:09

రాహు కాలం: 13:40:36 - 15:03:51

గుళిక కాలం: 09:30:50 - 10:54:05

యమ గండం: 06:44:20 - 08:07:35

అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:39

అమృత కాలం: 22:31:24 - 24:13:48

సూర్యోదయం: 06:44:20

సూర్యాస్తమయం: 17:50:21

చంద్రోదయం: 19:03:13

చంద్రాస్తమయం: 07:50:47

సూర్య సంచార రాశి: ధనుస్సు

చంద్ర సంచార రాశి: జెమిని

యోగాలు: సిద్ది యోగం - కార్య సిధ్ధి,

ధన ప్రాప్తి 25:06:54 వరకు తదుపరి

శుభ యోగం - కార్య జయం

దిశ శూల: దక్షిణం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀


వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹



WHY IS THERE SO MUCH FRUSTRATION IN THE WORLD?

WHY IS THERE SO MUCH FRUSTRATION IN THE WORLD?


Because there is so much expectation.

Expect, and there will be frustration. Don’t expect, and there will be no frustration. Frustration is a byproduct: the more you expect, the more you create your own frustration.

So frustration is not really the problem, it is the result.

Expectation is the problem.

Frustration is just a shadow which follows expectation. If you don’t expect even for a single moment,

if you are in a state of mind where there is no expectation, then it is simple.

You ask a question and the answer comes; there is a fulfillment.

But if you ask with any expectations you will be frustrated by the answer.

Everything we do, we do with expectations.

If I love someone, an expectation enters without my even knowing it.

I begin to expect love in return. I have not yet loved, I have not grown into love yet, but the expectation has come and now it will destroy the whole thing.

Love creates more frustration than anything else in the world because, with love, you are in a utopia of expectation.

You have not even been on the journey yet and already you have begun to think of the return home.

The more you expect love, the more difficult it will be for love to flow back to you.

If you expect love from someone the other will feel it as bondage; it will be a duty for him, something which he has to do.

And when love is a duty it cannot fulfill anyone because love as a duty is dead.

Love can only be play, not a duty. Love is freedom and duty is bondage, a heavy burden that one has to carry.

And when you have to carry something, the beauty of it is lost. The freshness, the poetry, everything is lost, and the other will immediately feel that it is only something dead which has been given.

Love with expectation and you have killed love. It is abortive – your love will be a dead child.

Then there will be frustration.

Love as play not as bargain, not because there is something you want to get out of it. Rather, love the other as an end in itself.

Thank God that you have loved and forget about whether it is returned or not.

Don’t make a bargain out of it and you will never be frustrated; your life will become filled with love.

Once love has flowered in its totality there will be bliss, there will be ecstasy.

I use love only as an example. The same law applies to everything.

There is so much frustration in the world that it is difficult to find someone who is not frustrated.