నిర్మల ధ్యానాలు - ఓషో - 209


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 209 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. సత్యం ఎన్నో వరాల్ని తీసుకొస్తుంది. వ్యక్తి ధ్యానమనే తలుపు తెరవాలి. సత్యాన్ని ఎవరో అందించాల్సిన పని లేదు. దాన్ని దేవుడే ఇచ్చాడు. నీ యథార్థ స్థితిలోనే అది వుంది. 🍀

అస్తిత్వ ఆనందమే సత్యం. చీకట్లోనే వుండాలని ఎవడు కోరుకుంటాడు? అస్తిత్వ సంబంధమయిన నిరాడంబరత నిజం. సంక్లిష్టతలోకి, సమస్యలోకి అడుగుపెట్టాలని కోరతాడు? ఎవరైనా అబద్ధాన్ని సమర్థిస్తే అది వేల రెట్లు పెరుగుతుంది. అబద్ధాన్ని అబద్ధాలు మాత్రమే పెద్ద చేస్తాయి. దాన్ని సత్యం సమర్థించదు. ఒక అబద్ధం యింకో అబద్ధాన్ని సృష్టిస్తుంది. చిన్ని అబద్ధంతో జీవితం బలహీనపడుతుంది.

సత్యం ఎన్నో వరాల్ని తీసుకొస్తుంది. వ్యక్తి ధ్యానమనే తలుపు తెరవాలి. సత్యాన్ని ఎవడో అందించాల్సిన పని లేదు. దాన్ని దేవుడే ఇచ్చాడు. నీ యథార్థ స్థితిలోనే అది వుంది. నువ్వు కొన్ని అడుగులు వేయాలి. అంతే. సన్యాసి అంటే 'సత్యాన్ని తెలుసుకునే నిర్ణయానికి రావడం' ఈ క్షణం నించీ సత్యాన్ని తెలుసుకోవడానికి నా 'జీవితాన్ని అంకితం చేస్తాను' అనడం. సత్యమెక్కడో దూరంగా లేదు. ఒకడుగు ముందుకు వేయాలి. అడుగు కాదు. పెద్ద అంగ. మనసు నించీ మనసు లేనితనానికి వేసే అడుగు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


13 Jul 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 309 - 4. ధ్యానం అనేది స్పృహ యొక్క ఏకీకరణ / DAILY WISDOM - 309 - 4. Meditation is an Integration of Consciousness


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 309 / DAILY WISDOM - 309 🌹

🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 4. ధ్యానం అనేది స్పృహ యొక్క ఏకీకరణ 🌻


ధ్యానం అనేది చైతన్యం యొక్క ఏకీకరణ. ఇది దినచర్య లేదా ఆచారం కాదు. ఇది ఏదో ఒక మతానికి చెందిన మతపరమైన విషయం కాదు. ఇది జీవితంలోని అత్యున్నత వాస్తవాలను మీరు అనుభూతి చెందడం. దీనికి హిందూ, క్రిస్టియానిటీ, ఇస్లాం లేదా ఏ మతంతో సంబంధం లేదు. దీనికి ఏ గ్రంథంతోనూ సంబంధం లేదు. ఇది మీ కోసం మీరు చేసుకునే ఒక నిస్వార్థమైన చర్య. దీనితో మీరు కేవలం ఒక నశ్వరమైన జీవి స్థాయి నుంచి అనంత విశ్వం లో ప్రయాణించే ఒక ఆత్మగా తెలుసుకునే స్థాయికి మీ చైతన్యాన్ని పెంచుకుంటారు. మీరు ఒక ఉన్నతమైన రాజ్యం నుండి వచ్చారు మరియు కొంత సమయం తర్వాత అదే రాజ్యంలోకి ప్రవేశిస్తారు. ఇది మీ ఉనికికి ఉన్న విశ్వవ్యాపకత్వాన్ని సూచిస్తుంది.

ప్రతి తలంలోనూ మీరు మీ అసంఖ్యాక జన్మలలో ప్రయాణించారు. మీరు ఎన్నో జీవిత రూపాల ద్వారా, ఎన్నో అనుభవాల ద్వారా ఎన్నో తాలాలను దాటారు. మీకు ఎంతోమంది తల్లిదండ్రులు, సంబంధాలు, రకరకాల పనులు ఉన్నాయి! మీరు ఈ విషయాలను మనస్సులో అర్థం చేసుకుని, ఈ విధంగా ఆలోచించి మీరు కేవలం ఫలానా అని ఏమాత్రం అనుకోకుండా ఈ జగత్తులో ఉన్న కర్మ ,లేదా ఏమైనా పని కారణంగా నా యొక్క స్వయం ఈ తాత్కాలికమైన దేహాన్ని ధరించింది అని తెలుసుకుంటారు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 309 🌹

🍀 📖 from Your Questions Answered 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 4. Meditation is an Integration of Consciousness 🌻

Meditation is an integration of consciousness. It is not a routine or a ritual. It is not a religious exercise belonging to some religion. It is an opening of yourself to the final realities of life. It has nothing to do with Hinduism, Christianity, Islam, or any religion. It has no connection with any scripture. It is an impersonal act on the part of yourself, wherein you lift up your consciousness to a recognition of the fact that you are a temporary sojourning entity into eternity. You have come from a larger realm, and will enter into the same realm after some time, which will indicate gradually that your existence has a kind of cosmic sweep.

From plane to plane you have journeyed in your millions of incarnations. How many planes of existence have you crossed, through what forms of life, what types of experience; how many parents, relations, types of work you have had! All these things you cogitate slowly in your mind so that you start thinking along these lines, and you will not think you are so-and-so any more. This is only a temporary form that the cosmic form has taken due to some karma, some pressure of circumstance.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


13 Jul 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 630 / Vishnu Sahasranama Contemplation - 630


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 630 / Vishnu Sahasranama Contemplation - 630🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻630. భూతిః, भूतिः, Bhūtiḥ🌻

ఓం భూతయే నమః | ॐ भूतये नमः | OM Bhūtaye namaḥ


భూతిః, भूतिः, Bhūtiḥ

భూతిస్సత్తా విభూతిర్వా విభూతీనాం నిమితత్తః ।
సర్వాసామితి వా భూతిరితి విష్ణుస్సమీర్యతే ॥

భూతిః, భవనం, సత్తా - అను మూడు పదములకును ఉనికి అని అర్థము. 'భూ' ధాతువు నుండి 'ఉనికి' అను భావార్థమున 'క్తిన్‍' ప్రత్యయముతో ఏర్పడు శబ్దము భూతిః. నిత్యమును, శుద్ధమును అగు ఉనికియే పరమాత్ముని రూపము. లేదా సర్వవిభూతులకును అనగా పరమాత్ముని రూప విశేషములైన ఐశ్వర్యములకును మూలకారణమగు వాడుగనుక 'భూతిః'.

:: శ్రీమద్భగవద్గీత - మోక్షసన్న్యాస యోగము ::

యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః ।
తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ ॥ 78 ॥

ఎచట యోగేశ్వరుడగు శ్రీకృష్ణుడున్ను, ఎచట ధనుర్ధారియగు అర్జునుడున్ను ఉందురో అచట సంపదయు, విజయమున్ను, ఐశ్వర్యమున్ను, ధృడమగు నీతియు ఉండునని నా (సంజయుని) అభిప్రాయము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 630🌹

📚. Prasad Bharadwaj

🌻630. Bhūtiḥ🌻

OM Bhūtaye namaḥ


भूतिस्सत्ता विभूतिर्वा विभूतीनां निमितत्तः ।
सर्वासामिति वा भूतिरिति विष्णुस्समीर्यते ॥

Bhūtissattā vibhūtirvā vibhūtīnāṃ nimitattaḥ,
Sarvāsāmiti vā bhūtiriti viṣṇussamīryate.

Bhūtiḥ, Bhavanaṃ and Sattā - these three words imply glorious existence. The root 'Bhū', which means existence or glory, when conjoined with morpheme 'ktin', the word Bhūtiḥ is derived. Eternal and pure existence is the very form of Lord. Or since from Him all kinds of opulence emanate, He is called Bhūtiḥ.


:: श्रीमद्भगवद्गीत - मोक्षसन्न्यास योगमु ::

यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः ।
तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम ॥ ७८ ॥


Śrīmad Bhagavad Gīta - Chapter 18

Yatra yogeśvaraḥ kr̥ṣṇo yatra pārtho dhanurdharaḥ,
Tatra śrīrvijayo bhūtiḥ dhruvā nītirmatirmama. 78.

Where there is Kr̥ṣṇa, the Lord of the yogas, and where there is Pārth (Arjuna), the wielder of the bow, there will be fortune, victory, prosperity and unfailing prudence. Such is my (Sañjaya) conviction.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

उदीर्णस्सर्वतश्चक्षुरनीशश्शाश्वतस्स्थिरः ।
भूशयो भूषणो भूतिर्विशोकश्शोकनाशनः ॥ ६७ ॥

ఉదీర్ణస్సర్వతశ్చక్షురనీశశ్శాశ్వతస్స్థిరః ।
భూశయో భూషణో భూతిర్విశోకశ్శోకనాశనః ॥ 67 ॥

Udīrṇassarvataścakṣuranīśaśśāśvatassthiraḥ,
Bhūśayo bhūṣaṇo bhūtirviśokaśśokanāśanaḥ ॥ 67 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


13 Jul 2022

గురు పూర్ణిమ విశిష్టత Significance of Guru Pournami


🌹. గురు పూర్ణిమ విశిష్టత 🌹

📚. ప్రసాద్‌ భరధ్వాజ

వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ !
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ !!

వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే !
నమో వైబ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః !!


ప్రతి సంవత్సరం ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజున వ్యాస మహర్షి జన్మ తిథి అయిన గురు పూర్ణిమ గా మనం జరుపుకుంటాం. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి , ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.

గురువుల పట్ల ఇదే గౌరవం అన్నివేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజు వ్యాసమహాముని పుట్టిన రోజు కాబట్టి దీనికంత ప్రాధాన్యత ఉంది. గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు. తర తరాలకూ కొనసాగవచ్చు.

సనాతన ధర్మంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు. వేదవ్యాసుని మానవజాతి కంతటికి మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళారు కాబట్టి ఆయనను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు.

లోకానికంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మ తిథిఅయిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆచారమైంది. మామూలు రోజులలో కన్నా ఈ వ్యాస పూర్ణిమ నాడు గురువు నుండి వెలువడే ఆశీర్వచనాలు వేయి రెట్లు ఎక్కువగా పొంద వచ్చట.. అందుకే ఈ రోజు గురుపూజోత్సవం లో పాల్గొని గురువు కరుణా కటాక్షములను పొందవచ్చు..

గురు అనే పదంలో ’గు’ అనే అక్షరం అంధకారాన్ని ’రు’ అనే అక్షరం వెలుగును సూచిస్తాయి..

ఙ్ఞానశక్తి సమారూఢః తత్త్వమాలావిభూషితః |
భుక్తిముక్తి ప్రదాతా చ తస్మై శ్రీ గురవే నమః

శిష్యునిలో అజ్ఞానాంధకారాలను తొలగించే బాధ్యతను గురువు తీసుకుంటాడు.. కాబట్టి... గురువుకే ప్రథమ స్థానమునిచ్చారు.. మాతా , పిత , గురువులలో జన్మనిచ్చిన వారి ప్రక్కన గురువుకి అత్యంత విశిష్టమైన స్థానాన్ని కల్పించినది ఇందుకే...

అలానే ఈ రోజు తప్పకుండా ఈ శ్లోకం స్మరించుకోవాలి..

నమోస్తుతే వ్యాస విశాల బుద్దే పుల్లార విందాయత పత్రనేత్ర |
వినత్వయా భారత తైల పూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమాయః ప్రదీపః

న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః |
తత్త్వఙ్ఞానాత్పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః

(’గురువును మించిన తత్వం తపస్సు జ్ఞానం వేరొకటి లేవు’)

గురుపౌర్ణమినాడు వ్యాసులవారు రచించిన ఏ గ్రంథం చదివినా , చాలా మంచిది. గురుపీఠానికి ఆద్యులైన నారాయణుడిని , సదాశివుడిని , బ్రహ్మదేవుడిని , వసిష్ఠులవారిని , శక్తిమునిని , పరాశరుడిని , వ్యాసులవారిని , శుకమహామునిని , గౌడపాదులవారిని , గోవింద భగవత్పాదులను, శంకరాచార్యులవారిని ఈ రోజు పూజిస్తే విశేషఫలం లభిస్తుంది. అంతేకాదు తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున గౌరవించి పూజించాలి.


☘️. వ్యాస పూర్ణిమ గురుపూర్ణిమ ☘️

నిజానికి వ్యాసుడు అనేది ఒక పదవి పేరు. ప్రతీ ద్వాపరయుగం లోనూ ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారయణుడే వ్యాసుడుగా అవతరిస్తాడు. ఈ అనంతంగా తిరిగే కాలచక్రంలో ధర్మం కృతయుగంలో 4 పాదాలతో , త్రేతాయుగంలో 3 పాదాలతో , ద్వాపరయుగంలో2 పాదాలతో , ఈ కలియుగంలో 1 వ పాదంతో , నడుస్తుంది.

వసిష్ఠమహామునికి మునిమనుమడు , శక్తి మహామునికి మనుమడు , పరాశరమునికి పుత్రుడు , శుకమర్షికి జనకుడైనట్టియు , నిర్మలుడైనట్టి , తపవు అనే ధనరాశి గలిగిన శ్రీ వ్యాసులవారికి నమస్కారము. ఆదిగురువు వేదవ్యాసులవారు. వ్యాసులవారు పుట్టినరోజునే గురుపూర్ణిమ , వ్యాసపూర్ణిమ , అంటారు

నారాయణమూర్తి స్వరూపమే వేదవ్యాసులవారు. అందుకే ఆయన్ని అపర నారాయణుడని పిలుస్తారు. వేదవిభజన చేసిన మహానుభావుడాయన. ఆయనవల్లనే మనకు అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి. భారత భాగవతాలనందించినవారే వ్యాసులవారు.

వ్యాసమహర్షి ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు. ప్రతి ద్వాపర యుగములోను ఒక సారి వ్యాసుడు ఉద్భవిస్తాడు. ప్రస్తుతం మనం ఉంటున్నది వైవస్వత మన్వంతరంలో ని 28 వ యుగంలోని వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు కాలంలో.

ఇంతవరకు వ్యాసపీఠాన్నధిరోహించిన వ్యాసులు పేర్లు


1. స్వాయంభువ

2. ప్రజాపతి

3. ఉశన

4. బృహశ్పతి

5. సవిత

6. మృత్యువు

7. ఇంద్ర

8. వశిష్ఠ

9. సారస్వత

10. త్రిధామ

11. త్రివృష

12. భరద్వాజ

13. అంతరిక్షక

14. ధర్ముడు

15. త్రయారుణ

16. ధనుంజయుడు

17. కృతంజయుడు

18. సంజయ

19. భరద్వాజ

20 గౌతమ

21. ఉత్తముడు

22. వాజశ్రవ

23. సోమశుష్మాయణ

24. ఋక్షుడు

25 శక్తి

26. పరాశరుడు

27. జాతూకర్ణి ప్రస్తుతం 28 వ వేదవ్యాసుని పేరు కృష్ణద్వైపాయనుడు.

ఆయన జన్మించిన తిథి అయిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమ గా జరుపుకుంటాం. లోకానికంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మ తిథిని గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆచారమైంది.

28 వ వేద వ్యాసుల వారి జయంతి. ఇతడు పరాశర మహర్షికి , మత్స్య గంధికి (సత్యవతి) కి కృష్ణ వర్ణం (నల్లని రంగు) తో ఒక ద్వీపంలో జన్మించారు కనుక కృష్ణద్వైపాయనుడు అని పిలవబడ్డాడు. పుట్టీ పుట్టగానే చేతిలో కమండలం , దండము చేతబట్టి తపస్సు చేసుకోవటానికి వెళ్తానని తల్లి మత్ష్యగంధి అనుమతితో తపస్సుకు వెళ్ళిన తపోధనుడు కృష్ణద్వైపాయనుడు.

వ్యాస మహర్షి నాలుగు వేదాలను విభజించి లోకానికి అందించాడని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం సోమకాసురుడు వేదాలను సముద్రంలో దాచేస్తే.. శ్రీ మహా విష్ణువు మత్స్యావతారంలో ఆ వేదాలను తీసుకొచ్చాడు. అలా వచ్చిన వేదాలు ఒకదానితో ఒకటి కలిసి కలగాపులగం అయిపోగా.. వాటిని వ్యాస మహర్షి విడదీసి విభజించి నాలుగు వేదాలుగా లోకానికి అందించాడు. వేదరాశి ని నిత్య కర్మలలో క్రతువుల్లో వాడే ఉపయోగాలను బట్టి ఋక్-యజుర్-సామ-అధర్వణ వేదాలుగా విభజించి వేదవ్యాసుడైనాడు. ఆతర్వాత బ్రహ్మదేవుని ఆజ్ఞతో విఘ్నేశ్వరుడు రాయగా ... వేదసారాన్నంతా చేర్చి పంచమవేదంగా ప్రసిద్ధికెక్కిన భారత ఇతిహాసాన్ని గ్రంధస్తం చేసాడు. అంతేకాక భాగవతాన్ని , అష్టాదశ పురాణాలను మనకు ప్రసాదించాడు. సాక్షాతు శ్రీ మహా విష్ణువు అవతారంగా భావించే వ్యాస భగవానుని గానూ ఆదిగురువుగానూ భావిస్తారు.


☘️. విష్ణు సహస్రనామ పీఠిక లో కూడా..... ☘️

"వ్యాసాయ విష్ణు రూపాయ - వ్యాస రూపాయ విష్ణవే
నమోవై బ్రహ్మ నిధయే వాశిష్టాయ నమోనమ: !!

అని వ్యాసునికి విష్ణువుకు అభేదం చెప్ప బడింది , వేదవ్యాసుడు అనంతంగా ఉన్న వేదాలని విభజించి పైలుడను శిష్యునకు ఋక్సంహితను , వైశంపాయనునకు యజుస్సంహితను , జైమినికి సామసంహితను , సుమంతునకు అధర్వణ సంహితను భోధించి వానిని లోకములో వ్యాప్తి చేయండని ఆదేశించాడు. వ్యాసుడు వేదాలని విభజించటమే కాకుండా అష్టా దశ పురాణాల్ని , ఉపపురాణాలను రచించాడు. బ్రహ్మసూత్రాల్ని వివరించాడు , భారత , భాగవతాలని రచించాడు. తాను గ్రంథస్థం చేసిన పురాణేతిహాసములను సూతునకు తెలియజేసి ప్రచారం చేయమని చెప్పాడు.

వ్యాస భగవానుని అనుగ్రహం వలన జ్ఞానం విస్తరించి విశ్వవ్యాప్తం అయ్యింది. సూత మహాముని ప్రథాన ప్రచారకుడై విషయములు బహుళ ప్రచారం చేసాడు.

స్మృతి కర్తలలో వ్యాసులవారు ఒకరు. రెండధ్యాయముల ఈ గ్రంథానికి లఘు వ్యాస స్మృతి అని పేరు. ఇందులో మానవులకు ఉపయోగ పడే ఆచార విషయములు ఉన్నాయి. ఇదే వ్యాస సంహిత గా విఖ్యాతి పొందింది.

వ్యాస మహర్షి సుపుత్రుని కోసం తపస్సు చేసి శివుని నుంచి వరాన్ని పొందాడు. ఆయనకు ఘృతాచి అనే అప్సరస వలన బ్రహ్మ జ్ఞాని ఐన శుకుడు జన్మించాడు.

వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే , పౌత్రమకల్మషమ్ |
పరాశరాత్మజమ్ వందే శుక తాతం తపోనిధిమ్

తాత్పర్యం:- వశిష్టుని మునిమనుమడైన కల్మష రహితుడైన శక్తికి మనుమడైన పరాశరుని కుమారుడైన , శుకమహర్షి తండ్రి అయిన ఓ వ్యాస మహర్షి నీకు వందనము.

" వ్యాసో నారాయణో హరిః " అన్నారు. వ్యాస భగవానులు సప్త చిరంజీవులలో ఒకరు.


☘️. మహాభారత రచన :- ☘️

మహాభారత రచనకు తనమనసులో ఒక ప్రణాళికను తయారుచేసుకొన్నాడు వేదవ్యాసుడు. తాను చెబుతుంటే..... అంత వేగంగా వ్రాసే వారు ఎవరు ఉన్నారూ అని విచారంలో ఉండగా..... బ్రహ్మ వ్యాసుని కోరికను గుర్తించి , అతని ఎదుట ప్రత్యక్షమయ్యి "వ్యాసా ! నీ కావ్యరచనకి, తగినవాడైన గణపతిని స్మరించు." అని తెలిపి అద్రుశ్యమయ్యాడు. అంతట వ్యాసుడు గణేశుని ప్రార్థించగా.... గణేశుడు ప్రత్యక్షమయ్యాడు. నేను మనసులోనే రచించిన భారతాన్ని నేను చెబుతూ ఉంటే నీవు వ్రాయాలి అని కోరాడు వ్యాసుడు. సరే అని ఒక షరతు పెట్టాడు గణేశుడు. నేను వ్రాసే ఘంటం ఆగకుండా నీవు చెప్పాలి. నా ఘంటం ఆగిన యెడల నేను వ్రాయను అని అన్నాడు. దానికి వ్యాసుడు అంగీకరించి నేను చెప్పిన శ్లోకాలను అర్థం చేసుకొని నీవు వ్రాయాలి అని అన్నాడు.... ఈ నియమానికి అంగీకరించాడు గణపతి. ఇలా వేద ధర్మాలను ప్రతిపాదిస్తూ వేదవ్యాసుడు చెబుతూ ఉంటే , నాలుగు వేదాల సారమైన పంచమవేదం అని మనం చెప్పుకొనే మహాభారతం అవతరించింది.

ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందింది. తల్లి కోరికపై దృతరాష్టుని , అంబాలికకు పాండు రాజుని , అంబిక దాసికి విదురుని ప్రసాదించినాడు. పాండవాగ్రజుడైన ధర్మరాజుకి ప్రతిస్మృతిని ఉపదేశించింది వ్యాసుడే ! దానిని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతలను మెప్పించి అస్త్రశస్త్రాలుపొందాడు. కురుపాండవ చరిత్ర ఖ్యాతి పొందేట్లుగా మూడు సంశ్ర…మించి జయం అనే పేరు మీద వారి గాథలు గ్రంథస్థం చేసాడు వ్యాసుడు. ఆ జయమే మహా భారతమైంది.

కలియుగంలో మానవులు అల్పబుద్ధులు , అల్పాయువులై ఉంటారు. అందుకే మన ప్రాచీనులు పరమ ప్రామాణికంగా.... అంగీకరించిన వేదాన్ని అధ్యయనం చేయలేరు. అర్థం చేసుకోలేరు.

వేదమంటే అసలు ఎవరూ తయారుచేసింది కాదు. స్వయం భగవానుని ముఖతః వేలువడినదే వేదము. అందుకే అతనిని "వేదపురుషుడు" అని అంటారు. వేదములో విషయాలు ఉన్నాయి. వేదములో లేనివి--- మరెక్కడా లేవు. ఇవన్నీ కలగాపులగంగా ఏక రూపంలో ఉంటాయి. దీనిని కలియుగంలో ఉన్న జనులు అర్థం చేసుకోలేరని, భగవానుడే ప్రతీ ద్వాపరయుగంలోనీ వ్యాసుడుగా అవతరించి , వేదాలను విభజిస్తాడు మందబుద్దుల కోసం వేదాధ్యాయానికి , అవకాశం లేనివారికోసం వేదంలోని విశేషాలను , ఇతిహాస పురాణాల ద్వారా లోకానికి అందించాడు.

ప్రాచీన గాథలు , గత కల్పాలలో జరిగిన చరిత్రలు , సృష్టికి పూర్వం అనేక సృష్టులలో జరిగిన విశ్వం యొక్క పూర్వ వృత్తాంతం మన పురాణాల్లో నిగూఢంగా నిక్షిప్తమయినాయి. ఎవరు వాటిని అర్ధం చేసుకోవాలన్నా , ఇతరులకి చెప్పాలన్నా అంతరార్ధాలతో బోధించాలన్న వ్యాస మహర్షి అనుగ్రహం అత్యవసరం. వ్యాస మహర్షి అంశ లేనిదే ఎవరూ పురాణ గాథల్ని చెప్పలేదు , చదవలేదు. అందుకే వ్యాసపూర్ణిమ నాడు వ్యాస పూజను తప్పక చేయాలంటారు. ఈ పర్వము యతులకు అతి ముఖ్యం ! వ్యాస పూర్ణిమ పర్వాన్ని ఆదిలో శంకరాచార్యులు ఏర్పాటు చేశారని చెబుతారు.

🌹 🌹 🌹 🌹 🌹

13 Jul 2022

గురుపౌర్ణమి శుభాకాంక్షలు మిత్రులందరికి Happy Guru Pournami to all friends


🌹. గురుపౌర్ణమి శుభాకాంక్షలు మిత్రులందరికి 🌹

🌼. ప్రసాద్‌ భరధ్వాజ

🍀. గురుపౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి నాడు గురువు యొక్క దివ్య వైభవాన్ని తెలుసుకుందాం. 🍀

🌻. శ్రీ గురు స్తోత్రం 🌻

1)గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః

2)అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః

3)అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా |
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః

4)స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్సచరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః

5)చిన్మయం వ్యాపి యత్సర్వం త్రైలోక్యం సచరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః

6)సర్వశ్రుతిశిరోరత్నవిరాజితపదాంబుజః |
వేదాంతాంబుజసూర్యో యస్తస్మై శ్రీగురవే నమః

7)చైతన్యః శాశ్వతః శాంతో వ్యోమాతీతో నిరంజనః |
బిందునాదకలాతీతస్తస్మై శ్రీగురవే నమః

8)జ్ఞానశక్తిసమారూఢః తత్త్వమాలావిభూషితః |
భుక్తిముక్తిప్రదాతా చ తస్మై శ్రీగురవే నమః

9)అనేకజన్మసంప్రాప్తకర్మబంధవిదాహినే |
ఆత్మజ్ఞానప్రదానేన తస్మై శ్రీగురవే నమః

10)న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః |
తత్త్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః

11)శోషణం భవసింధోశ్చ జ్ఞాపనం సారసంపదః |
గురోః పాదోదకం సమ్యక్ తస్మై శ్రీగురవే నమః

12)మన్నాథః శ్రీజగన్నాథః మద్గురుః శ్రీజగద్గురుః |
మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీగురవే నమః

13)గురురాదిరనాదిశ్చ గురుః పరమదైవతమ్ |
గురోః పరతరం నాస్తి తస్మై శ్రీగురవే నమః

14)బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం
ద్వంద్వాతీతం గనసదృశం తత్త్వమస్యాది లక్ష్యమ్ |

ఏకం నిత్యం విమలమచలం సర్వధీసాక్షిభూతంభావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి

15)త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ |
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ ||

🌹 🌹 🌹 🌹 🌹


13 Jul 2022

13 Jul 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹13 July 2022 పంచాగము - Panchagam 🌹

శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday

గురుపౌర్ణమి శుభాకాంక్షలు మిత్రులందరికి

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ


🌺. పండుగలు మరియు పర్వదినాలు : గురుపౌర్ణమి, వ్యాస పూజ, Vyasa Puja, Guru Purnima 🌺

🍀. శ్రీ గురు స్తోత్రం 🍀

1) గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః

2 )అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : పైకి ఆ ప్రియంగానో, జుగుప్సాకరంగానో, భయావహంగానో కనిపించే వేషాల మాటు నుండి దైవం నీ అవివేకపు కోపానికీ, అంతకంటే ఎక్కువ జుగుప్త్సకూ, ఇంకా అంతకంటే అవివేకపు భయానికి నవ్వు కుంటున్నాడు అని తెలుసుకో . 🍀

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, ఆషాడ మాసం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

తిథి: పూర్ణిమ 24:08:36 వరకు

తదుపరి కృష్ణ పాడ్యమి

నక్షత్రం: పూర్వాషాఢ 23:19:37 వరకు

తదుపరి ఉత్తరాషాఢ

యోగం: ఇంద్ర 12:45:58 వరకు

తదుపరి వైధృతి

కరణం: విష్టి 14:04:29 వరకు

వర్జ్యం: 10:44:48 - 12:08:36

మరియు 30:18:40 - 31:42:36

దుర్ముహూర్తం: 11:55:35 - 12:47:56

రాహు కాలం: 12:21:45 - 13:59:55

గుళిక కాలం: 10:43:36 - 12:21:45

యమ గండం: 07:27:17 - 09:05:26

అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:47

అమృత కాలం: 19:07:36 - 20:31:24

సూర్యోదయం: 05:49:08

సూర్యాస్తమయం: 18:54:23

చంద్రోదయం: 18:47:26

చంద్రాస్తమయం: 04:56:17

సూర్య సంచార రాశి: జెమిని

చంద్ర సంచార రాశి: ధనుస్సు

శ్రీవత్స యోగం - ధన లాభం , సర్వ

సౌఖ్యం 23:19:37 వరకు తదుపరి

వజ్ర యోగం - ఫల ప్రాప్తి

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

13 - JULY - 2022 Guru Pournami, WEDNESDAY MESSAGES బుధవారం, గురుపౌర్ణమి, సౌమ్య వాసర సందేశాలు

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 13, జూలై 2022 బుధవారం, సౌమ్య వాసరే Wednesday, గురుపౌర్ణమి 🌹
🌹. గురుపౌర్ణమి శుభాకాంక్షలు మిత్రులందరికి 🌹 
🌻. శ్రీ గురు స్తోత్రం 🌻
🌹 గురు పౌర్ణమి విశిష్టత 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 231 / Bhagavad-Gita - 231 - 5- 27 కర్మ యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 630 / Vishnu Sahasranama Contemplation - 630 🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 309 / DAILY WISDOM - 309 🌹  
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 209 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹13 July 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*గురుపౌర్ణమి శుభాకాంక్షలు మిత్రులందరికి*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌺. పండుగలు మరియు పర్వదినాలు : గురుపౌర్ణమి, వ్యాస పూజ, Vyasa Puja, Guru Purnima 🌺*

*🍀. శ్రీ గురు స్తోత్రం 🍀*

*1) గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |*
*గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః*
*2 )అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ |*
*తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : పైకి ఆ ప్రియంగానో, జుగుప్సాకరంగానో, భయావహంగానో కనిపించే వేషాల మాటు నుండి దైవం నీ అవివేకపు కోపానికీ, అంతకంటే ఎక్కువ జుగుప్త్సకూ, ఇంకా అంతకంటే అవివేకపు భయానికి నవ్వు కుంటున్నాడు అని తెలుసుకో . 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, ఆషాడ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: పూర్ణిమ 24:08:36 వరకు
తదుపరి కృష్ణ పాడ్యమి
నక్షత్రం: పూర్వాషాఢ 23:19:37 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
యోగం: ఇంద్ర 12:45:58 వరకు
తదుపరి వైధృతి
కరణం: విష్టి 14:04:29 వరకు
వర్జ్యం: 10:44:48 - 12:08:36
మరియు 30:18:40 - 31:42:36
దుర్ముహూర్తం: 11:55:35 - 12:47:56
రాహు కాలం: 12:21:45 - 13:59:55
గుళిక కాలం: 10:43:36 - 12:21:45
యమ గండం: 07:27:17 - 09:05:26
అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:47
అమృత కాలం: 19:07:36 - 20:31:24
సూర్యోదయం: 05:49:08
సూర్యాస్తమయం: 18:54:23
చంద్రోదయం: 18:47:26
చంద్రాస్తమయం: 04:56:17
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: ధనుస్సు
శ్రీవత్స యోగం - ధన లాభం , సర్వ
సౌఖ్యం 23:19:37 వరకు తదుపరి 
వజ్ర యోగం - ఫల ప్రాప్తి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గురుపౌర్ణమి శుభాకాంక్షలు మిత్రులందరికి 🌹*
🌼. ప్రసాద్‌ భరధ్వాజ

*🍀. గురుపౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి నాడు గురువు యొక్క దివ్య వైభవాన్ని తెలుసుకుందాం. 🍀*

*🌻. శ్రీ గురు స్తోత్రం 🌻*

1)గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః 

2)అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః 

3)అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా |
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః 

4)స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్సచరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః 

5)చిన్మయం వ్యాపి యత్సర్వం త్రైలోక్యం సచరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః 

6)సర్వశ్రుతిశిరోరత్నవిరాజితపదాంబుజః |
వేదాంతాంబుజసూర్యో యస్తస్మై శ్రీగురవే నమః 

7)చైతన్యః శాశ్వతః శాంతో వ్యోమాతీతో నిరంజనః |
బిందునాదకలాతీతస్తస్మై శ్రీగురవే నమః 

8)జ్ఞానశక్తిసమారూఢః తత్త్వమాలావిభూషితః |
భుక్తిముక్తిప్రదాతా చ తస్మై శ్రీగురవే నమః 

9)అనేకజన్మసంప్రాప్తకర్మబంధవిదాహినే |
ఆత్మజ్ఞానప్రదానేన తస్మై శ్రీగురవే నమః 

10)న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః |
తత్త్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః 

11)శోషణం భవసింధోశ్చ జ్ఞాపనం సారసంపదః |
గురోః పాదోదకం సమ్యక్ తస్మై శ్రీగురవే నమః 

12)మన్నాథః శ్రీజగన్నాథః మద్గురుః శ్రీజగద్గురుః |
మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీగురవే నమః 

13)గురురాదిరనాదిశ్చ గురుః పరమదైవతమ్ |
గురోః పరతరం నాస్తి తస్మై శ్రీగురవే నమః 

14)బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం 
ద్వంద్వాతీతం గనసదృశం తత్త్వమస్యాది లక్ష్యమ్ |
ఏకం నిత్యం విమలమచలం సర్వధీసాక్షిభూతంభావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి 

15)త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ |
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ ||
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గురు పూర్ణిమ విశిష్టత 🌹*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ !*
*పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ !!*

*వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే !*
*నమో వైబ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః !!*

ప్రతి సంవత్సరం ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజున వ్యాస మహర్షి జన్మ తిథి అయిన గురు పూర్ణిమ గా మనం జరుపుకుంటాం. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి , ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.

గురువుల పట్ల ఇదే గౌరవం అన్నివేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజు వ్యాసమహాముని పుట్టిన రోజు కాబట్టి దీనికంత ప్రాధాన్యత ఉంది. గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు. తర తరాలకూ కొనసాగవచ్చు.

సనాతన ధర్మంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు. వేదవ్యాసుని మానవజాతి కంతటికి మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళారు కాబట్టి ఆయనను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం *కృష్ణ ద్వైపాయనుడు.* వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను *వేదవ్యాసుడిగా* పిలవడం ప్రారంభించారు.

లోకానికంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మ తిథిఅయిన *ఆషాఢ శుద్ధ పూర్ణిమను* గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆచారమైంది. మామూలు రోజులలో కన్నా ఈ వ్యాస పూర్ణిమ నాడు గురువు నుండి వెలువడే ఆశీర్వచనాలు వేయి రెట్లు ఎక్కువగా పొంద వచ్చట.. అందుకే ఈ రోజు గురుపూజోత్సవం లో పాల్గొని గురువు కరుణా కటాక్షములను పొందవచ్చు.. 

గురు అనే పదంలో ’గు’ అనే అక్షరం అంధకారాన్ని ’రు’ అనే అక్షరం వెలుగును సూచిస్తాయి.. 

*ఙ్ఞానశక్తి సమారూఢః తత్త్వమాలావిభూషితః |*
*భుక్తిముక్తి ప్రదాతా చ తస్మై శ్రీ గురవే నమః *

శిష్యునిలో అజ్ఞానాంధకారాలను తొలగించే బాధ్యతను గురువు తీసుకుంటాడు.. కాబట్టి... గురువుకే ప్రథమ స్థానమునిచ్చారు.. మాతా , పిత , గురువులలో జన్మనిచ్చిన వారి ప్రక్కన గురువుకి అత్యంత విశిష్టమైన స్థానాన్ని కల్పించినది ఇందుకే...

అలానే ఈ రోజు తప్పకుండా ఈ శ్లోకం స్మరించుకోవాలి..

*నమోస్తుతే వ్యాస విశాల బుద్దే పుల్లార విందాయత పత్రనేత్ర |*
*వినత్వయా భారత తైల పూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమాయః ప్రదీపః *
*న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః |*
*తత్త్వఙ్ఞానాత్పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః *
(’గురువును మించిన తత్వం తపస్సు జ్ఞానం వేరొకటి లేవు’)

గురుపౌర్ణమినాడు వ్యాసులవారు రచించిన ఏ గ్రంథం చదివినా , చాలా మంచిది. గురుపీఠానికి ఆద్యులైన నారాయణుడిని , సదాశివుడిని , బ్రహ్మదేవుడిని , వసిష్ఠులవారిని , శక్తిమునిని , పరాశరుడిని , వ్యాసులవారిని , శుకమహామునిని , గౌడపాదులవారిని , గోవింద భగవత్పాదులను, శంకరాచార్యులవారిని ఈ రోజు పూజిస్తే విశేషఫలం లభిస్తుంది. అంతేకాదు తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున గౌరవించి పూజించాలి. 

*☘️. వ్యాస పూర్ణిమ గురుపూర్ణిమ ☘️*

నిజానికి వ్యాసుడు అనేది ఒక పదవి పేరు. ప్రతీ ద్వాపరయుగం లోనూ ఒక వ్యాసుడు ఉద్భవిస్తాడు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారయణుడే వ్యాసుడుగా అవతరిస్తాడు. ఈ అనంతంగా తిరిగే కాలచక్రంలో ధర్మం కృతయుగంలో 4 పాదాలతో , త్రేతాయుగంలో 3 పాదాలతో , ద్వాపరయుగంలో2 పాదాలతో , ఈ కలియుగంలో 1 వ పాదంతో , నడుస్తుంది.
వసిష్ఠమహామునికి మునిమనుమడు , శక్తి మహామునికి మనుమడు , పరాశరమునికి పుత్రుడు , శుకమర్షికి జనకుడైనట్టియు , నిర్మలుడైనట్టి , తపవు అనే ధనరాశి గలిగిన శ్రీ వ్యాసులవారికి నమస్కారము. ఆదిగురువు వేదవ్యాసులవారు. వ్యాసులవారు పుట్టినరోజునే గురుపూర్ణిమ , వ్యాసపూర్ణిమ , అంటారు 
నారాయణమూర్తి స్వరూపమే వేదవ్యాసులవారు. అందుకే ఆయన్ని అపర నారాయణుడని పిలుస్తారు. వేదవిభజన చేసిన మహానుభావుడాయన. ఆయనవల్లనే మనకు అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి. భారత భాగవతాలనందించినవారే వ్యాసులవారు. 

వ్యాసమహర్షి ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు. ప్రతి ద్వాపర యుగములోను ఒక సారి వ్యాసుడు ఉద్భవిస్తాడు. ప్రస్తుతం మనం ఉంటున్నది వైవస్వత మన్వంతరంలో ని 28 వ యుగంలోని వ్యాసుడు *కృష్ణద్వైపాయనుడు* కాలంలో.

*ఇంతవరకు వ్యాసపీఠాన్నధిరోహించిన వ్యాసులు పేర్లు*

1. స్వాయంభువ 
2. ప్రజాపతి
3. ఉశన 
4. బృహశ్పతి 
5. సవిత 
6. మృత్యువు 
7. ఇంద్ర 
8. వశిష్ఠ 
9. సారస్వత 
10. త్రిధామ 
11. త్రివృష 
12. భరద్వాజ 
13. అంతరిక్షక 
14. ధర్ముడు 
15. త్రయారుణ 
16. ధనుంజయుడు 
17. కృతంజయుడు 
18. సంజయ 
19. భరద్వాజ 
20 గౌతమ 
21. ఉత్తముడు 
22. వాజశ్రవ 
23. సోమశుష్మాయణ 
24. ఋక్షుడు 
25 శక్తి 
26. పరాశరుడు 
27. జాతూకర్ణి ప్రస్తుతం 28 వ వేదవ్యాసుని పేరు కృష్ణద్వైపాయనుడు.
ఆయన జన్మించిన తిథి అయిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమ గా జరుపుకుంటాం. లోకానికంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మ తిథిని గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆచారమైంది.

28 వ వేద వ్యాసుల వారి జయంతి. ఇతడు పరాశర మహర్షికి , మత్స్య గంధికి (సత్యవతి) కి కృష్ణ వర్ణం (నల్లని రంగు) తో ఒక ద్వీపంలో జన్మించారు కనుక కృష్ణద్వైపాయనుడు అని పిలవబడ్డాడు. పుట్టీ పుట్టగానే చేతిలో కమండలం , దండము చేతబట్టి తపస్సు చేసుకోవటానికి వెళ్తానని తల్లి మత్ష్యగంధి అనుమతితో తపస్సుకు వెళ్ళిన తపోధనుడు కృష్ణద్వైపాయనుడు.

వ్యాస మహర్షి నాలుగు వేదాలను విభజించి లోకానికి అందించాడని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం సోమకాసురుడు వేదాలను సముద్రంలో దాచేస్తే.. శ్రీ మహా విష్ణువు మత్స్యావతారంలో ఆ వేదాలను తీసుకొచ్చాడు. అలా వచ్చిన వేదాలు ఒకదానితో ఒకటి కలిసి కలగాపులగం అయిపోగా.. వాటిని వ్యాస మహర్షి విడదీసి విభజించి నాలుగు వేదాలుగా లోకానికి అందించాడు. *వేదరాశి* ని నిత్య కర్మలలో క్రతువుల్లో వాడే ఉపయోగాలను బట్టి ఋక్-యజుర్-సామ-అధర్వణ వేదాలుగా విభజించి వేదవ్యాసుడైనాడు. ఆతర్వాత బ్రహ్మదేవుని ఆజ్ఞతో విఘ్నేశ్వరుడు రాయగా ... వేదసారాన్నంతా చేర్చి పంచమవేదంగా ప్రసిద్ధికెక్కిన భారత ఇతిహాసాన్ని గ్రంధస్తం చేసాడు. అంతేకాక భాగవతాన్ని , అష్టాదశ పురాణాలను మనకు ప్రసాదించాడు. సాక్షాతు శ్రీ మహా విష్ణువు అవతారంగా భావించే వ్యాస భగవానుని గానూ ఆదిగురువుగానూ భావిస్తారు.

*☘️. విష్ణు సహస్రనామ పీఠిక లో కూడా..... ☘️*

*"వ్యాసాయ విష్ణు రూపాయ - వ్యాస* *రూపాయ విష్ణవే*
*నమోవై బ్రహ్మ నిధయే వాశిష్టాయ నమోనమ: !!*

అని వ్యాసునికి విష్ణువుకు అభేదం చెప్ప బడింది , వేదవ్యాసుడు అనంతంగా ఉన్న వేదాలని విభజించి పైలుడను శిష్యునకు ఋక్సంహితను , వైశంపాయనునకు యజుస్సంహితను , జైమినికి సామసంహితను , సుమంతునకు అధర్వణ సంహితను భోధించి వానిని లోకములో వ్యాప్తి చేయండని ఆదేశించాడు. వ్యాసుడు వేదాలని విభజించటమే కాకుండా అష్టా దశ పురాణాల్ని , ఉపపురాణాలను రచించాడు. బ్రహ్మసూత్రాల్ని వివరించాడు , భారత , భాగవతాలని రచించాడు. తాను గ్రంథస్థం చేసిన పురాణేతిహాసములను సూతునకు తెలియజేసి ప్రచారం చేయమని చెప్పాడు. 
వ్యాస భగవానుని అనుగ్రహం వలన జ్ఞానం విస్తరించి విశ్వవ్యాప్తం అయ్యింది. సూత మహాముని ప్రథాన ప్రచారకుడై విషయములు బహుళ ప్రచారం చేసాడు. 

స్మృతి కర్తలలో వ్యాసులవారు ఒకరు. రెండధ్యాయముల ఈ గ్రంథానికి లఘు వ్యాస స్మృతి అని పేరు. ఇందులో మానవులకు ఉపయోగ పడే ఆచార విషయములు ఉన్నాయి. ఇదే వ్యాస సంహిత గా విఖ్యాతి పొందింది.

వ్యాస మహర్షి సుపుత్రుని కోసం తపస్సు చేసి శివుని నుంచి వరాన్ని పొందాడు. ఆయనకు ఘృతాచి అనే అప్సరస వలన బ్రహ్మ జ్ఞాని ఐన శుకుడు జన్మించాడు. 

*వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే , పౌత్రమకల్మషమ్ |*
*పరాశరాత్మజమ్ వందే శుక తాతం తపోనిధిమ్ *

*తాత్పర్యం:-* వశిష్టుని మునిమనుమడైన కల్మష రహితుడైన శక్తికి మనుమడైన పరాశరుని కుమారుడైన , శుకమహర్షి తండ్రి అయిన ఓ వ్యాస మహర్షి నీకు వందనము. 

*" వ్యాసో నారాయణో హరిః "* అన్నారు. వ్యాస భగవానులు సప్త చిరంజీవులలో ఒకరు.

*☘️. మహాభారత రచన :- ☘️*

మహాభారత రచనకు తనమనసులో ఒక ప్రణాళికను తయారుచేసుకొన్నాడు వేదవ్యాసుడు. తాను చెబుతుంటే..... అంత వేగంగా వ్రాసే వారు ఎవరు ఉన్నారూ అని విచారంలో ఉండగా..... బ్రహ్మ వ్యాసుని కోరికను గుర్తించి , అతని ఎదుట ప్రత్యక్షమయ్యి *"వ్యాసా ! నీ కావ్యరచనకి, తగినవాడైన గణపతిని స్మరించు."* అని తెలిపి అద్రుశ్యమయ్యాడు. అంతట వ్యాసుడు గణేశుని ప్రార్థించగా.... గణేశుడు ప్రత్యక్షమయ్యాడు. నేను మనసులోనే రచించిన భారతాన్ని నేను చెబుతూ ఉంటే నీవు వ్రాయాలి అని కోరాడు వ్యాసుడు. సరే అని ఒక షరతు పెట్టాడు గణేశుడు. నేను వ్రాసే ఘంటం ఆగకుండా నీవు చెప్పాలి. నా ఘంటం ఆగిన యెడల నేను వ్రాయను అని అన్నాడు. దానికి వ్యాసుడు అంగీకరించి నేను చెప్పిన శ్లోకాలను అర్థం చేసుకొని నీవు వ్రాయాలి అని అన్నాడు.... ఈ నియమానికి అంగీకరించాడు గణపతి. ఇలా వేద ధర్మాలను ప్రతిపాదిస్తూ వేదవ్యాసుడు చెబుతూ ఉంటే , నాలుగు వేదాల సారమైన పంచమవేదం అని మనం చెప్పుకొనే మహాభారతం అవతరించింది.

ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందింది. తల్లి కోరికపై దృతరాష్టుని , అంబాలికకు పాండు రాజుని , అంబిక దాసికి విదురుని ప్రసాదించినాడు. పాండవాగ్రజుడైన ధర్మరాజుకి ప్రతిస్మృతిని ఉపదేశించింది వ్యాసుడే ! దానిని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతలను మెప్పించి అస్త్రశస్త్రాలుపొందాడు. కురుపాండవ చరిత్ర ఖ్యాతి పొందేట్లుగా మూడు సంశ్ర…మించి జయం అనే పేరు మీద వారి గాథలు గ్రంథస్థం చేసాడు వ్యాసుడు. ఆ జయమే మహా భారతమైంది. 
కలియుగంలో మానవులు అల్పబుద్ధులు , అల్పాయువులై ఉంటారు. అందుకే మన ప్రాచీనులు పరమ ప్రామాణికంగా.... అంగీకరించిన వేదాన్ని అధ్యయనం చేయలేరు. అర్థం చేసుకోలేరు.

వేదమంటే అసలు ఎవరూ తయారుచేసింది కాదు. స్వయం భగవానుని ముఖతః వేలువడినదే వేదము. అందుకే అతనిని *"వేదపురుషుడు"* అని అంటారు. వేదములో విషయాలు ఉన్నాయి. వేదములో లేనివి--- మరెక్కడా లేవు. ఇవన్నీ కలగాపులగంగా ఏక రూపంలో ఉంటాయి. దీనిని కలియుగంలో ఉన్న జనులు అర్థం చేసుకోలేరని, భగవానుడే ప్రతీ ద్వాపరయుగంలోనీ వ్యాసుడుగా అవతరించి , వేదాలను విభజిస్తాడు మందబుద్దుల కోసం వేదాధ్యాయానికి , అవకాశం లేనివారికోసం వేదంలోని విశేషాలను , ఇతిహాస పురాణాల ద్వారా లోకానికి అందించాడు.  

ప్రాచీన గాథలు , గత కల్పాలలో జరిగిన చరిత్రలు , సృష్టికి పూర్వం అనేక సృష్టులలో జరిగిన విశ్వం యొక్క పూర్వ వృత్తాంతం మన పురాణాల్లో నిగూఢంగా నిక్షిప్తమయినాయి. ఎవరు వాటిని అర్ధం చేసుకోవాలన్నా , ఇతరులకి చెప్పాలన్నా అంతరార్ధాలతో బోధించాలన్న వ్యాస మహర్షి అనుగ్రహం అత్యవసరం. వ్యాస మహర్షి అంశ లేనిదే ఎవరూ పురాణ గాథల్ని చెప్పలేదు , చదవలేదు. అందుకే వ్యాసపూర్ణిమ నాడు వ్యాస పూజను తప్పక చేయాలంటారు. ఈ పర్వము యతులకు అతి ముఖ్యం ! వ్యాస పూర్ణిమ పర్వాన్ని ఆదిలో శంకరాచార్యులు ఏర్పాటు చేశారని చెబుతారు.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 231 / Bhagavad-Gita - 231 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 27 🌴*

*27. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాంశ్చక్షుశ్చైవాన్తరే భ్రువో: |*
*ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యన్తరచారిణౌ*

🌷. తాత్పర్యం :
*బాహ్యేంద్రియార్థములన్నింటిని త్యజించి, దృష్టిని భ్రూమధ్యమున నిలిపి, ప్రాణాపాన వాయువులను నాసిక యందే సమములుగా చేసి తద్ద్వారా మనస్సును, బుద్ధిని, ఇంద్రియములను అదుపు చేయవలెను.*

🌷. భాష్యము :
కృష్ణభక్తిభావన యందు నియుక్తుమగుట ద్వారా మనుజుడు శీఘ్రమే తన ఆధ్యాత్మిక ఉనికిని గుర్తించగలుగును. తదుపరి అతడు భక్తియోగము ద్వారా శ్రీకృష్ణభగవానుని అవగతము చేసికొనగలడు.

భక్తియోగమునందు చక్కగా నెలకొనినపుడు మనుజుడు దివ్యమైన ఆధ్యాత్మికస్థితికి చేరి తన కర్మలన్నింటి యందును శ్రీకృష్ణుని దర్శించగలుగును. ఇట్టి విశేషస్థితియే పరబ్రహ్మమందు ముక్తస్థితి యనబడును.

పరబ్రహ్మమునందు ముక్తిని సాధించు విషయమును గూర్చి అర్జునునకు వివరించిన పిమ్మట శ్రీకృష్ణభగవానుడు అట్టి స్థితికి యమము, నియమము, ఆసనము, ప్రాణాయమము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి యను ఎనిమిదివిధములుగా గల అష్టాంగయోగము ద్వారా ఎట్లు మనుజుడు చేరగలడో ఉపదేశించుచున్నాడు. 

శభ్దము, స్పర్శ, రూపము, రుచి, ఘ్రాణము వంటి ఇంద్రియార్థములను యోగమునందలి ప్రత్యాహార విధానము ద్వారా తరిమివేసి, దృష్టిని భ్రూమధ్యమున నిలిపి, అర్థనిమీలిత నేత్రములతో ధ్యానమును సలుపవలెను. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 231 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 5 - Karma Yoga - 27 🌴*

*27. sparśān kṛtvā bahir bāhyāṁś cakṣuś caivāntare bhruvoḥ*
*prāṇāpānau samau kṛtvā nāsābhyantara-cāriṇau*

🌷 Translation : 
*Shutting out all external sense objects, keeping the eyes and vision concentrated between the two eyebrows, suspending the inward and outward breaths within the nostrils, and control the mind.*

🌹 Purport :
Being engaged in Kṛṣṇa consciousness, one can immediately understand one’s spiritual identity, and then one can understand the Supreme Lord by means of devotional service. 

When one is well situated in devotional service, one comes to the transcendental position, qualified to feel the presence of the Lord in the sphere of one’s activity. This particular position is called liberation in the Supreme.

After explaining the above principles of liberation in the Supreme, the Lord gives instruction to Arjuna as to how one can come to that position by the practice of the mysticism or yoga known as aṣṭāṅga-yoga, which is divisible into an eightfold procedure called yama, niyama, āsana, prāṇāyāma, pratyāhāra, dhāraṇā, dhyāna and samādhi. 

One has to drive out the sense objects such as sound, touch, form, taste and smell by the pratyāhāra process in yoga, and then keep the vision of the eyes between the two eyebrows and concentrate on the tip of the nose with half-closed lids. 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 630 / Vishnu Sahasranama Contemplation - 630🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻630. భూతిః, भूतिः, Bhūtiḥ🌻*

*ఓం భూతయే నమః | ॐ भूतये नमः | OM Bhūtaye namaḥ*

*భూతిః, भूतिः, Bhūtiḥ*

*భూతిస్సత్తా విభూతిర్వా విభూతీనాం నిమితత్తః ।*
*సర్వాసామితి వా భూతిరితి విష్ణుస్సమీర్యతే ॥*

*భూతిః, భవనం, సత్తా - అను మూడు పదములకును ఉనికి అని అర్థము. 'భూ' ధాతువు నుండి 'ఉనికి' అను భావార్థమున 'క్తిన్‍' ప్రత్యయముతో ఏర్పడు శబ్దము భూతిః. నిత్యమును, శుద్ధమును అగు ఉనికియే పరమాత్ముని రూపము. లేదా సర్వవిభూతులకును అనగా పరమాత్ముని రూప విశేషములైన ఐశ్వర్యములకును మూలకారణమగు వాడుగనుక 'భూతిః'.*

:: శ్రీమద్భగవద్గీత - మోక్షసన్న్యాస యోగము ::
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః ।
తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ ॥ 78 ॥

*ఎచట యోగేశ్వరుడగు శ్రీకృష్ణుడున్ను, ఎచట ధనుర్ధారియగు అర్జునుడున్ను ఉందురో అచట సంపదయు, విజయమున్ను, ఐశ్వర్యమున్ను, ధృడమగు నీతియు ఉండునని నా (సంజయుని) అభిప్రాయము.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 630🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻630. Bhūtiḥ🌻*

*OM Bhūtaye namaḥ*

भूतिस्सत्ता विभूतिर्वा विभूतीनां निमितत्तः ।
सर्वासामिति वा भूतिरिति विष्णुस्समीर्यते ॥

*Bhūtissattā vibhūtirvā vibhūtīnāṃ nimitattaḥ,*
*Sarvāsāmiti vā bhūtiriti viṣṇussamīryate.*

*Bhūtiḥ, Bhavanaṃ and Sattā - these three words imply glorious existence. The root 'Bhū', which means existence or glory, when conjoined with morpheme 'ktin', the word Bhūtiḥ is derived. Eternal and pure existence is the very form of Lord. Or since from Him all kinds of opulence emanate, He is called Bhūtiḥ.*

:: श्रीमद्भगवद्गीत - मोक्षसन्न्यास योगमु ::
यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः ।
तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम ॥ ७८ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 18
Yatra yogeśvaraḥ kr̥ṣṇo yatra pārtho dhanurdharaḥ,
Tatra śrīrvijayo bhūtiḥ dhruvā nītirmatirmama. 78.

*Where there is Kr̥ṣṇa, the Lord of the yogas, and where there is Pārth (Arjuna), the wielder of the bow, there will be fortune, victory, prosperity and unfailing prudence. Such is my (Sañjaya) conviction.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka

उदीर्णस्सर्वतश्चक्षुरनीशश्शाश्वतस्स्थिरः ।भूशयो भूषणो भूतिर्विशोकश्शोकनाशनः ॥ ६७ ॥

ఉదీర్ణస్సర్వతశ్చక్షురనీశశ్శాశ్వతస్స్థిరః ।భూశయో భూషణో భూతిర్విశోకశ్శోకనాశనః ॥ 67 ॥

Udīrṇassarvataścakṣuranīśaśśāśvatassthiraḥ,Bhūśayo bhūṣaṇo bhūtirviśokaśśokanāśanaḥ ॥ 67 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 309 / DAILY WISDOM - 309 🌹*
*🍀 📖. మీ ప్రశ్నలకు సమాధానాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 4. ధ్యానం అనేది స్పృహ యొక్క ఏకీకరణ 🌻*

*ధ్యానం అనేది చైతన్యం యొక్క ఏకీకరణ. ఇది దినచర్య లేదా ఆచారం కాదు. ఇది ఏదో ఒక మతానికి చెందిన మతపరమైన విషయం కాదు. ఇది జీవితంలోని అత్యున్నత వాస్తవాలను మీరు అనుభూతి చెందడం. దీనికి హిందూ, క్రిస్టియానిటీ, ఇస్లాం లేదా ఏ మతంతో సంబంధం లేదు. దీనికి ఏ గ్రంథంతోనూ సంబంధం లేదు. ఇది మీ కోసం మీరు చేసుకునే ఒక నిస్వార్థమైన చర్య. దీనితో మీరు కేవలం ఒక నశ్వరమైన జీవి స్థాయి నుంచి అనంత విశ్వం లో ప్రయాణించే ఒక ఆత్మగా తెలుసుకునే స్థాయికి మీ చైతన్యాన్ని పెంచుకుంటారు. మీరు ఒక ఉన్నతమైన రాజ్యం నుండి వచ్చారు మరియు కొంత సమయం తర్వాత అదే రాజ్యంలోకి ప్రవేశిస్తారు. ఇది మీ ఉనికికి ఉన్న విశ్వవ్యాపకత్వాన్ని సూచిస్తుంది.*

*ప్రతి తలంలోనూ మీరు మీ అసంఖ్యాక జన్మలలో ప్రయాణించారు. మీరు ఎన్నో జీవిత రూపాల ద్వారా, ఎన్నో అనుభవాల ద్వారా ఎన్నో తాలాలను దాటారు. మీకు ఎంతోమంది తల్లిదండ్రులు, సంబంధాలు, రకరకాల పనులు ఉన్నాయి! మీరు ఈ విషయాలను మనస్సులో అర్థం చేసుకుని, ఈ విధంగా ఆలోచించి మీరు కేవలం ఫలానా అని ఏమాత్రం అనుకోకుండా ఈ జగత్తులో ఉన్న కర్మ ,లేదా ఏమైనా పని కారణంగా నా యొక్క స్వయం ఈ తాత్కాలికమైన దేహాన్ని ధరించింది అని తెలుసుకుంటారు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 309 🌹*
*🍀 📖 from Your Questions Answered 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 4. Meditation is an Integration of Consciousness 🌻*

*Meditation is an integration of consciousness. It is not a routine or a ritual. It is not a religious exercise belonging to some religion. It is an opening of yourself to the final realities of life. It has nothing to do with Hinduism, Christianity, Islam, or any religion. It has no connection with any scripture. It is an impersonal act on the part of yourself, wherein you lift up your consciousness to a recognition of the fact that you are a temporary sojourning entity into eternity. You have come from a larger realm, and will enter into the same realm after some time, which will indicate gradually that your existence has a kind of cosmic sweep.*

*From plane to plane you have journeyed in your millions of incarnations. How many planes of existence have you crossed, through what forms of life, what types of experience; how many parents, relations, types of work you have had! All these things you cogitate slowly in your mind so that you start thinking along these lines, and you will not think you are so-and-so any more. This is only a temporary form that the cosmic form has taken due to some karma, some pressure of circumstance.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 209 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. సత్యం ఎన్నో వరాల్ని తీసుకొస్తుంది. వ్యక్తి ధ్యానమనే తలుపు తెరవాలి. సత్యాన్ని ఎవరో అందించాల్సిన పని లేదు. దాన్ని దేవుడే ఇచ్చాడు. నీ యథార్థ స్థితిలోనే అది వుంది. 🍀*

*అస్తిత్వ ఆనందమే సత్యం. చీకట్లోనే వుండాలని ఎవడు కోరుకుంటాడు? అస్తిత్వ సంబంధమయిన నిరాడంబరత నిజం. సంక్లిష్టతలోకి, సమస్యలోకి అడుగుపెట్టాలని కోరతాడు? ఎవరైనా అబద్ధాన్ని సమర్థిస్తే అది వేల రెట్లు పెరుగుతుంది. అబద్ధాన్ని అబద్ధాలు మాత్రమే పెద్ద చేస్తాయి. దాన్ని సత్యం సమర్థించదు. ఒక అబద్ధం యింకో అబద్ధాన్ని సృష్టిస్తుంది. చిన్ని అబద్ధంతో జీవితం బలహీనపడుతుంది.*

*సత్యం ఎన్నో వరాల్ని తీసుకొస్తుంది. వ్యక్తి ధ్యానమనే తలుపు తెరవాలి. సత్యాన్ని ఎవడో అందించాల్సిన పని లేదు. దాన్ని దేవుడే ఇచ్చాడు. నీ యథార్థ స్థితిలోనే అది వుంది. నువ్వు కొన్ని అడుగులు వేయాలి. అంతే. సన్యాసి అంటే 'సత్యాన్ని తెలుసుకునే నిర్ణయానికి రావడం' ఈ క్షణం నించీ సత్యాన్ని తెలుసుకోవడానికి నా 'జీవితాన్ని అంకితం చేస్తాను' అనడం. సత్యమెక్కడో దూరంగా లేదు. ఒకడుగు ముందుకు వేయాలి. అడుగు కాదు. పెద్ద అంగ. మనసు నించీ మనసు లేనితనానికి వేసే అడుగు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹