శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 353-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 353-1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 353-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 353-1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 78. భక్తిమత్-కల్పలతికా, పశుపాశ విమోచనీ ।
సంహృతాశేష పాషండా, సదాచార ప్రవర్తికా ॥ 78 ॥ 🍀

🌻 353-1. ''భక్తిమత్కల్పలతికా'🌻


భక్త జనులకు కల్పలతవలె ఇష్టమైన కోరికలను తీర్చునది శ్రీమాత అని అర్థము. భక్తి మత్కల్పులు అనగా భక్తితో కూడినవారై కోరికలు తీరనివారు. వీని ప్రవర్తనమున భక్తియే గోచరించు చుండును. కాని జీవితమున కొన్ని అంశముల యందు సంపూర్ణత లేక కొంత అసంతృప్తులై యుందురు. ఇట్టి భక్తిమతులకు కల్పలతికవలె కోరికలను కూడ విస్తారముగ పూరించి పరిపూర్ణ భక్తులను శ్రీమాత చేయుచున్నది. లతిక అనగా తీగవలె విస్తారముగ సాగునది. కస్తూరివలె సువాసన కలిగినది.

కావున కల్పలతిక అనగా విస్తారముగ సువాసనలతో కూడినదై భక్తిమతుల కోర్కెలను శ్రీమాత పూరించు చుండును. సంపద రెండు విధములుగ నుండును. ఆనందమును, వైభవమును ఇచ్చు సంపద. దుఃఖమును బంధమును కష్టములను కొనివచ్చు సంపద. రెండవ రకము సంపద దివ్య సంపద కాదు. మొదటి రకము సంపద సుగంధముతో కూడినదై యుండును. శ్రీమాత భక్తి కలవారి కోరికలు తీర్చి పూర్ణ భక్తులుగ తీర్చిదిద్దును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 353-1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 78. Bhaktimatkalpalatika pashupasha vimochani
Sanhruta sheshapashanda sadachara pravartika ॥ 78 ॥ 🌻



🌻 353-1. Bhaktimat-kalpa-latikā भक्तिमत्-कल्प-लतिका 🌻

Kalpa is a divine creeper that grants boon to those who sit under it. In the same way She gives boon to Her devotees. Latika means spread over. This indicates that Her devotees are spread over across the earth (devotees is a general term representing the whole humanity). Kalpa also means imperfection.

Those who worship Her with imperfect devotion are made to acquire perfect devotion over several births and She gives them final liberation. There is difference between final liberation and reaching the Heavens which is called mokṣa.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


03 Mar 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 147. స్వచ్ఛత / Osho Daily Meditations - 147. PURITY


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 147 / Osho Daily Meditations - 147 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 147. స్వచ్ఛత 🍀

🕉 . హృదయంలో ఉండే స్వచ్ఛత చెడిపోదు; మీరు చేసేది ఏదైనా దానిని ఏ మాత్రం ప్రభావితం చేయదు. 🕉

గొప్ప పాపి కూడా జీవి యొక్క లోతైన చోట వద్ద స్వచ్ఛంగా ఉంటాడు. కాబట్టి లోతైన పాపి కూడా చివరికి సాధువుగానే తెలియ వస్తాడు. పాపం కేవలం పరిధిని, చుట్టుకొలతను మాత్రమే తాకగలదు. ఇది మీ లోతుల్లోకి వెళ్లలేదు. ఎందుకంటే చేయడం అనేది ఉపరితలం పైనే ఉంటుంది; జీవి మాత్రమే అంతర్భాగంలో ఉంటుంది. మరియు మీరు ప్రజల ఉనికిని చూడటం ప్రారంభించినప్పుడు, ఎవరూ పాపులు కారు. అది అసాధ్యం. స్వచ్ఛత చాలా సంపూర్ణమైనది, మనం చేసేదంతా కలల కంటే ఎక్కువ కాదు; ఇదియే తూర్పు విధానం. తూర్పు విధానం మీ పని గురించి పెద్దగా బాధపడదు. మీరు ఏమి చేసినా, మీరు హృదయం లోపలికి వెళ్లినప్పుడు స్వఛ్చంగా మారవచ్చని అది చెబుతుంది. అది ఎప్పడు స్ఫటికంలా స్పష్టంగా ఉంటుంది. ఎల్లప్పుడూ స్వచ్ఛంగా, కలుషితం కాకుండా ఉండే జీవితో పరిచయం అది.

అంచున కేవలం ముఖాలు మరియు పాపులు, మంచి మరియు చెడు, ప్రసిద్ధ మరియు అపఖ్యాతి పాలైనవారు ఉన్నారు. అవి కేవలం నాటకాలు మాత్రమే. ఎవరో రాముడిగా మారారు మరియు మరొకరు రావణుడిగా మారారు. రెండూ అవసరమే. మొత్తం కథ జరగడానికి అవి రెండూ అవసరం. అయితే వేదిక వెనుక మాత్రం కలిసి కూర్చుని ఉన్నారు. అదీ వాస్తవం. ఈ ప్రపంచమంతా ఒక విశాలమైన వేదిక, ఒక గొప్ప నాటకం రూపొందుతోంది. కాబట్టి దాని గురించి చింతించకండి. మీకు ఏ భాగము ఇవ్వబడినా, దానిని వీలైనంత ఆనందంగా నెరవేర్చుకోండి మరియు మీరు ఎల్లప్పుడూ పవిత్రంగా ఉన్నారని గుర్తుంచుకోండి.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Osho Daily Meditations - 147 🌹

📚. Prasad Bharadwaj

🍀 147. PURITY 🍀

🕉 The purity that resides in the heart is incorruptible; what you do does not affect it at all. 🕉


Even the greatest sinner remains pure at the deepest core of being. So even the deepest sinner remains a saint; the sin can only touch the periphery, the circumference. It cannot go to your core, because doing remains on the surface; only being is at the core. And when you start looking at people's being, then nobody is a sinner, nobody has ever been a sinner. It is impossible. Purity is so absolute that all that we do is not more than dreams; that is the Eastern approach. The Eastern approach doesn't bother much about your doing. It says that whatever you have done, you can simply go within and have a. contact with the being, which remains crystal clear and always pure, unpolluted.

On the periphery are just facessaint and sinner, good and bad, the famous and the notorious. They are just acts, as if a drama were being enacted. Somebody has become a Rama and somebody has become a Ravana. Both are needed: Rama cannot be without Ravana, and what will Ravana be without Rama? They are both necessary for the whole Christ story to happen. But behind the stage they move together. That's the reality. This whole world is a vast stage, and a great drama is being enacted. So don't worry about it. Whatever part has been given you, fulfill it as joyously as possible, and always remember that deep down you remain pure.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


03 Mar 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 158


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 158 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. ధ్రువుని పరిపాలన 🌻

ఉత్తర ధ్రువమున కెదురుగా సప్తర్షి మండలమున్నది. దానికన్న ఉత్తరముగా అనగా ధ్రువములకు సూటిగా ధ్రువతార యున్నది. ధ్రువుడా తారయందు ప్రతిష్ఠితుడై భూమి యొక్క పరిభ్రమణమునకు ఇరుసుగా పనిచేయును. ఇతని కన్న పైన ఆకాశమున్నది. అందుండి సుడిగుండము కేంద్రము వలె ధ్రువతార మీదుగా భూమిపై ఉత్తర ధ్రువమున పనిచేయుచు ధ్రువుడు భూమిని పరిపాలించును.

ఈ భ్రమణము వలన 27 దినములు, 27 సంవత్సరములు, 27 శతాబ్దులు, 27 సహస్రాబ్దులు మొదలుగా గల పరిభ్రమణముల నేర్పరచుచుండును. కనుక 26 వేల‌ సంవత్సరములు పూర్తి చేసిన సంఖ్యతో ధ్రువుడు పరిపాలించునని చెప్పబడెను.

భాగవతము 4-291, ధ్రువోపాఖ్యానము

....✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


03 Mar 2022

శ్రీ శివ మహా పురాణము - 528 / Sri Siva Maha Purana - 528


🌹 . శ్రీ శివ మహా పురాణము - 528 / Sri Siva Maha Purana - 528 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 46

🌻. శివుడు పెళ్లికొడుకు - 1 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడు ప్రసన్నమగు మనస్సుగల శివుడు దూతలతో, తన గణములతో, దేవతలతో, మరియు మిగిలిన వారందరితో గూడి కుతూహలము గలవాడై హిమవంతుని గృహమునకు వెళ్లెను (1). హిమవంతుని ప్రాణప్రియురాలగు ఆ మేన కూడా అప్పుడు లేచి ఆ స్త్రీ గణములతో కూడి తన ఇంటి లోపలికి వెళ్లెను (2). ఆమె చేతి యందు దీపపాత్రను ధరించి శంభునకు నీరాజనమిచ్చుట కొరకై స్త్రీ గణములందరితో బాటు సాదరముగా ద్వారము వద్దకు వచ్చెను (3). అచటకు విచ్చేసి నట్టియు, మహేశ్వరుడైనట్టియు, పార్వతీపతియైనట్టియు, దేవతలందరిచే సేవింపబడునట్టి శంకుని మేన ప్రీతితో చూచెను (4).

సుందరమగు సంపెంగల కాంతి వంటి కాంతితో ప్రకాశించువాడు, ఒక ముఖము గలవాడు, మూడు కన్నులు గలవాడు, చిరునవ్వుతో గూడి ప్రసన్నముగా నున్న ముఖము గలవాడు, రత్నములతో, బంగరు ఆభరణములతో అలంకరింపబడినవాడు (5), మల్లెల మాలను ధరించినవాడు, గొప్ప రత్నములు పొదిగిన కిరీటముతో విరాజిల్లువాడు, మంచి కంఠహారమును ధరించినవాడు, సుందరమగు కంకణములతో అంగదములతో అలంకరింపబడినవాడు (6), అగ్నివలె ప్రకాశించు సాటిలేని సన్నని నూలుతో వడకిన సుందరమగు అమూల్యమైన రంగు రంగుల వస్త్రముల జంటతో ప్రకాశించువాడు (7) చందనము, అగరు, కస్తూరి, మంచి కుంకుమలతో అలంకరింపబడిన వాడు, రత్నపుటద్దము చేతి యందు గలవాడు, కాటుకతో ఒప్పారు కన్నులు గలవాడు అగు శివుని చూచెను (8).

తన కాంతిచే సర్వమును కప్పివేసిన వాడు, మిక్కిలి మనోహరాకారుడు, యువకుడు, సుందరుడు, అలంకరింపబడిన అవయవములతో నొప్పారువాడు (9), స్త్రీలను మోహింపజేయువాడు, తొందరపాటు లేనివాడు, కోటిచంద్రుల కాంతి గల పద్మము వంటి ముఖము గలవాడు, కోటి మన్మథుల కంటె అధికమగు శరీరకాంతి గలవాడు, సర్వాంగ సుందరుడు (10), గొప్ప దైవము, మహాప్రభుడు అగు అటు వంటి శివుడు అల్లుని స్థానములో తన యెదట నిలబడియుండగా గాంచిమేన శోకమును వీడి ఆనందించెను (11).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 SRI SIVA MAHA PURANA - 528 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 46 🌴

🌻 The arrival of the bridegroom - 1 🌻


Brahmā said:—

1. The delighted Śiva accompanied by His Bhūtas, Gaṇas, gods and others went to the abode of the mountain zealously.

2. Menā, the exquisite beloved of Himācala, got up from her seat and went into the harem along with the women-folk.

3. For the customary Nīrājana (waving of lights) rites of Śiva, the chaste lady came near the entrance with lights and vessels in her hands along with womenfolk of the sages.

4. Menā saw with pleasure lord Śiva, the bridegroom of Pārvatī, served by all the gods and who by that time had come there.

5-11. Śiva had the complexion of the colour of the Campaka flower. He had only one face but retained the three eyes. The face was beaming with a simple smile. He was bedecked in gems and gold and wore a garland of Mālatī flowers. The gemset crown was lustrous. He wore brilliant necklaces. He was bedecked in bangles and bracelets of fine workmanship. He was shining well with the two clothes of great value, fine texture and unrivalled beauty and purified in fire.

Highly embellished in sandal paste, aguru, musk and fine saffron, he had a gemset mirror in his hand and his eyes were lustrous with the collyrium. He was shedding a halo around him enveloping everything. He was extremely beautiful. He appeared to be very young. His limbs had the full complement of their ornaments. He was very attractive to the ladies.

He was not nervous or self-conscious. His lotuslike face had the brilliance of a thousand moons. His body shone with a refulgence more than that of a thousand cupids. He was beautiful in every limb. Seeing the lord thus as her son-in-law, Menā forgot all her grief. She was glad.


Continues....

🌹🌹🌹🌹🌹


03 Mar 2022

గీతోపనిషత్తు -330


🌹. గీతోపనిషత్తు -330 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 26-3 📚


🍀 26-3. భక్తి శ్రద్ధలు - దైవము కోరునది శ్రద్ధాభక్తులే. అతడు జీవుల హృదయము నందున్నాడు గనుక జీవులకు చేయు సేవ రూపమున తానందు కొనుచు నున్నాడు. కనుక భక్తులు, జ్ఞానులు, యోగులు, విరాగులు కూడ జీవుల రూపమున నున్న దైవమును సేవించి అనుగ్రహమును పొంద వలెను. ఇట్టి ప్రయత్నము నిరంతరము సాగుచు నుండవలెను. జీవ సేవా కార్యము నిర్వర్తింప బడుచున్న కొద్ది ఋజువర్తనము, ధర్మా చరణము, బుద్ధి ప్రకాశము, నిరహంకారము ఆవిష్కరింపబడు చుండవలెను. అంతఃకరణ శుద్ధిలేని వానికి దైవానుగ్రహము ఎండమావి యందలి జలమువలె యుండును. 🍀

26. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి |
తదహం భక్త్యుపహృత మశ్నామి ప్రయతాత్మనః ||

తాత్పర్యము : భక్తిపూర్వకముగ నాకు ఒక పత్రమును గాని, పుష్పమును గాని, ఫలమును గాని, నీటిని గాని ఎవరందించినను నేను స్వీకరించి అనుగ్రహింతును.

వివరణము : దైవము కోరునది శ్రద్ధాభక్తులే. అతనికి శ్రద్ధాభక్తులు ఎట్లు సమర్పింప గలము? అతడు జీవుల హృదయము నందున్నాడు గనుక జీవులకు చేయు సేవ రూపమున తానందుకొనుచు నున్నాడు. కనుక భక్తులు, జ్ఞానులు, యోగులు, విరాగులు కూడ జీవుల రూపమున నున్న దైవమును సేవించి అనుగ్రహమును పొంద వలెను. ఇట్టి ప్రయత్నము నిరంతరము సాగుచు నుండవలెను. ఈ శ్లోకమున సాధకులు “ప్రయతాత్మనః" అని దైవము ప్రయత్నము చేయువాని గూర్చి పలికెను. ఆ పదము ప్రయత్న శీలుని గూర్చి ఉద్దేశింపబడినది. ఆ పదమునకు నిర్మల అంతఃకరణుడని కూడ అర్ధమున్నది.

కేవలము నిత్యము జీవుల సేవ చేయుట మాత్రము చాలదు. అట్టి ప్రయత్నము చేయువాని అంతఃకరణము నిర్మలమగు చుండవలెను. అంతఃకరణము లనగా లోమనస్సు, బుద్ధి, అహంకారము. జీవుల సేవ నిత్యము చేయుచున్నప్పుడు పై మూడును నిర్మలము కావలెను. కేవలము బహిఃకరణములతో చేయు సేవ నిరుపయోగము. జీవ సేవా కార్యము నిర్వర్తింప బడుచున్నకొద్ది ఋజువర్తనము, ధర్మా చరణము, బుద్ధి ప్రకాశము, నిరహంకారము ఆవిష్కరింపబడు చుండవలెను. అంతఃకరణ శుద్ధిలేని వానికి దైవానుగ్రహము ఎండమావి యందలి జలమువలె యుండును. నిర్మల అంతఃకరణుడై, భక్తిశ్రద్ధలతో ఎదుటి జీవియందు ఈశ్వర దర్శనము చేయుచు ఏమిచ్చినను ఈశ్వరుడు సంతోషింప గలడు. ఇది సత్యము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


03 Mar 2022

03 - MARCH - 2022 గురువారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 03, గురువారం, మార్చి 2022 బృహస్పతి వాసరే 🌹
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 26-3 - 330 - భక్తి శ్రద్ధలు 🌹
3) 🌹. శివ మహా పురాణము - 528 / Siva Maha Purana - 528 🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -158🌹  
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 146 / Osho Daily Meditations - 146 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 353-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 353-1 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శుభ గురువారం మిత్రులందరికీ 🌹*
*బృహస్పతి వాసరే, 03, మార్చి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : చంద్ర దర్శనము, Chandra Darshan 🌻*

*🍀. శ్రీ కల్కి స్తోత్రం - 6 🍀*

*6. భూవియన్మరు ద్వారితేజసాం రాశిభిః శరీరేంద్రియాశ్రితైః |*
*త్రిగుణయా స్వయా మాయయా విభో కురు కృపాం భవత్సేవనార్థినామ్*
🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : మనసును మంచి ఆలోచనలతో సదా నింపకపోతే, ఆ మనసులో చెడు ఆలోచనలు చేరుకుంటాయి. 🍀*
🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
ఉత్తరాయణం, శిశిర ఋతువు, 
ఫాల్గుణ మాసం
తిథి: శుక్ల పాడ్యమి 21:38:36 వరకు
తదుపరి శుక్ల విదియ
నక్షత్రం:పూర్వాభద్రపద 25:57:45 
వరకు తదుపరి ఉత్తరాభద్రపద
యోగం: సద్య 27:28:51 వరకు
తదుపరి శుభ
సూర్యోదయం: 06:33:10
సూర్యాస్తమయం: 18:23:02
చంద్రోదయం: 07:03:55
చంద్రాస్తమయం: 19:05:34
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: కుంభం
కరణం: కింస్తుఘ్న 10:19:20 వరకు
వర్జ్యం: 08:50:48 - 10:24:00
దుర్ముహూర్తం: 10:29:47 - 11:17:07
మరియు 15:13:44 - 16:01:04
రాహు కాలం: 13:56:50 - 15:25:34
గుళిక కాలం: 09:30:38 - 10:59:22
యమ గండం: 06:33:10 - 08:01:54
అభిజిత్ ముహూర్తం: 12:05 - 12:51
అమృత కాలం: 18:10:00 - 19:43:12
ముద్గర యోగం - కలహం 25:57:45
వరకు తదుపరి ఛత్ర యోగం - 
స్త్రీ లాభం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -330 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 26-3 📚*
 
*🍀 26-3. భక్తి శ్రద్ధలు - దైవము కోరునది శ్రద్ధాభక్తులే. అతడు జీవుల హృదయము నందున్నాడు గనుక జీవులకు చేయు సేవ రూపమున తానందు కొనుచు నున్నాడు. కనుక భక్తులు, జ్ఞానులు, యోగులు, విరాగులు కూడ జీవుల రూపమున నున్న దైవమును సేవించి అనుగ్రహమును పొంద వలెను. ఇట్టి ప్రయత్నము నిరంతరము సాగుచు నుండవలెను. జీవ సేవా కార్యము నిర్వర్తింప బడుచున్న కొద్ది ఋజువర్తనము, ధర్మా చరణము, బుద్ధి ప్రకాశము, నిరహంకారము ఆవిష్కరింపబడు చుండవలెను. అంతఃకరణ శుద్ధిలేని వానికి దైవానుగ్రహము ఎండమావి యందలి జలమువలె యుండును. 🍀*

*26. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి |*
*తదహం భక్త్యుపహృత మశ్నామి ప్రయతాత్మనః ||*

*తాత్పర్యము : భక్తిపూర్వకముగ నాకు ఒక పత్రమును గాని, పుష్పమును గాని, ఫలమును గాని, నీటిని గాని ఎవరందించినను నేను స్వీకరించి అనుగ్రహింతును.*

*వివరణము : దైవము కోరునది శ్రద్ధాభక్తులే. అతనికి శ్రద్ధాభక్తులు ఎట్లు సమర్పింప గలము? అతడు జీవుల హృదయము నందున్నాడు గనుక జీవులకు చేయు సేవ రూపమున తానందుకొనుచు నున్నాడు. కనుక భక్తులు, జ్ఞానులు, యోగులు, విరాగులు కూడ జీవుల రూపమున నున్న దైవమును సేవించి అనుగ్రహమును పొంద వలెను. ఇట్టి ప్రయత్నము నిరంతరము సాగుచు నుండవలెను. ఈ శ్లోకమున సాధకులు “ప్రయతాత్మనః" అని దైవము ప్రయత్నము చేయువాని గూర్చి పలికెను. ఆ పదము ప్రయత్న శీలుని గూర్చి ఉద్దేశింపబడినది. ఆ పదమునకు నిర్మల అంతఃకరణుడని కూడ అర్ధమున్నది.*

*కేవలము నిత్యము జీవుల సేవ చేయుట మాత్రము చాలదు. అట్టి ప్రయత్నము చేయువాని అంతఃకరణము నిర్మలమగు చుండవలెను. అంతఃకరణము లనగా లోమనస్సు, బుద్ధి, అహంకారము. జీవుల సేవ నిత్యము చేయుచున్నప్పుడు పై మూడును నిర్మలము కావలెను. కేవలము బహిఃకరణములతో చేయు సేవ నిరుపయోగము. జీవ సేవా కార్యము నిర్వర్తింప బడుచున్నకొద్ది ఋజువర్తనము, ధర్మా చరణము, బుద్ధి ప్రకాశము, నిరహంకారము ఆవిష్కరింపబడు చుండవలెను. అంతఃకరణ శుద్ధిలేని వానికి దైవానుగ్రహము ఎండమావి యందలి జలమువలె యుండును. నిర్మల అంతఃకరణుడై, భక్తిశ్రద్ధలతో ఎదుటి జీవియందు ఈశ్వర దర్శనము చేయుచు ఏమిచ్చినను ఈశ్వరుడు సంతోషింప గలడు. ఇది సత్యము.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 528 / Sri Siva Maha Purana - 528 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 46

*🌻. శివుడు పెళ్లికొడుకు - 1 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడు ప్రసన్నమగు మనస్సుగల శివుడు దూతలతో, తన గణములతో, దేవతలతో, మరియు మిగిలిన వారందరితో గూడి కుతూహలము గలవాడై హిమవంతుని గృహమునకు వెళ్లెను (1). హిమవంతుని ప్రాణప్రియురాలగు ఆ మేన కూడా అప్పుడు లేచి ఆ స్త్రీ గణములతో కూడి తన ఇంటి లోపలికి వెళ్లెను (2). ఆమె చేతి యందు దీపపాత్రను ధరించి శంభునకు నీరాజనమిచ్చుట కొరకై స్త్రీ గణములందరితో బాటు సాదరముగా ద్వారము వద్దకు వచ్చెను (3). అచటకు విచ్చేసి నట్టియు, మహేశ్వరుడైనట్టియు, పార్వతీపతియైనట్టియు, దేవతలందరిచే సేవింపబడునట్టి శంకుని మేన ప్రీతితో చూచెను (4).

సుందరమగు సంపెంగల కాంతి వంటి కాంతితో ప్రకాశించువాడు, ఒక ముఖము గలవాడు, మూడు కన్నులు గలవాడు, చిరునవ్వుతో గూడి ప్రసన్నముగా నున్న ముఖము గలవాడు, రత్నములతో, బంగరు ఆభరణములతో అలంకరింపబడినవాడు (5), మల్లెల మాలను ధరించినవాడు, గొప్ప రత్నములు పొదిగిన కిరీటముతో విరాజిల్లువాడు, మంచి కంఠహారమును ధరించినవాడు, సుందరమగు కంకణములతో అంగదములతో అలంకరింపబడినవాడు (6), అగ్నివలె ప్రకాశించు సాటిలేని సన్నని నూలుతో వడకిన సుందరమగు అమూల్యమైన రంగు రంగుల వస్త్రముల జంటతో ప్రకాశించువాడు (7) చందనము, అగరు, కస్తూరి, మంచి కుంకుమలతో అలంకరింపబడిన వాడు, రత్నపుటద్దము చేతి యందు గలవాడు, కాటుకతో ఒప్పారు కన్నులు గలవాడు అగు శివుని చూచెను (8).

తన కాంతిచే సర్వమును కప్పివేసిన వాడు, మిక్కిలి మనోహరాకారుడు, యువకుడు, సుందరుడు, అలంకరింపబడిన అవయవములతో నొప్పారువాడు (9), స్త్రీలను మోహింపజేయువాడు, తొందరపాటు లేనివాడు, కోటిచంద్రుల కాంతి గల పద్మము వంటి ముఖము గలవాడు, కోటి మన్మథుల కంటె అధికమగు శరీరకాంతి గలవాడు, సర్వాంగ సుందరుడు (10), గొప్ప దైవము, మహాప్రభుడు అగు అటు వంటి శివుడు అల్లుని స్థానములో తన యెదట నిలబడియుండగా గాంచిమేన శోకమును వీడి ఆనందించెను (11). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 528 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 46 🌴*

*🌻 The arrival of the bridegroom - 1 🌻*

Brahmā said:—

1. The delighted Śiva accompanied by His Bhūtas, Gaṇas, gods and others went to the abode of the mountain zealously.

2. Menā, the exquisite beloved of Himācala, got up from her seat and went into the harem along with the women-folk.

3. For the customary Nīrājana (waving of lights) rites of Śiva, the chaste lady came near the entrance with lights and vessels in her hands along with womenfolk of the sages.

4. Menā saw with pleasure lord Śiva, the bridegroom of Pārvatī, served by all the gods and who by that time had come there.

5-11. Śiva had the complexion of the colour of the Campaka flower. He had only one face but retained the three eyes. The face was beaming with a simple smile. He was bedecked in gems and gold and wore a garland of Mālatī flowers. The gemset crown was lustrous. He wore brilliant necklaces. He was bedecked in bangles and bracelets of fine workmanship. He was shining well with the two clothes of great value, fine texture and unrivalled beauty and purified in fire. 

Highly embellished in sandal paste, aguru, musk and fine saffron, he had a gemset mirror in his hand and his eyes were lustrous with the collyrium. He was shedding a halo around him enveloping everything. He was extremely beautiful. He appeared to be very young. His limbs had the full complement of their ornaments. He was very attractive to the ladies. 

He was not nervous or self-conscious. His lotuslike face had the brilliance of a thousand moons. His body shone with a refulgence more than that of a thousand cupids. He was beautiful in every limb. Seeing the lord thus as her son-in-law, Menā forgot all her grief. She was glad.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 158 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. ధ్రువుని పరిపాలన 🌻*

*ఉత్తర ధ్రువమున కెదురుగా సప్తర్షి మండలమున్నది. దానికన్న ఉత్తరముగా అనగా ధ్రువములకు సూటిగా ధ్రువతార యున్నది. ధ్రువుడా తారయందు ప్రతిష్ఠితుడై భూమి యొక్క పరిభ్రమణమునకు ఇరుసుగా పనిచేయును. ఇతని కన్న పైన ఆకాశమున్నది. అందుండి సుడిగుండము కేంద్రము వలె ధ్రువతార మీదుగా భూమిపై ఉత్తర ధ్రువమున పనిచేయుచు ధ్రువుడు భూమిని పరిపాలించును.*

*ఈ భ్రమణము వలన 27 దినములు, 27 సంవత్సరములు, 27 శతాబ్దులు, 27 సహస్రాబ్దులు మొదలుగా గల పరిభ్రమణముల నేర్పరచుచుండును. కనుక 26 వేల‌ సంవత్సరములు పూర్తి చేసిన సంఖ్యతో ధ్రువుడు పరిపాలించునని చెప్పబడెను.*

*భాగవతము 4-291, ధ్రువోపాఖ్యానము*

....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 147 / Osho Daily Meditations - 147 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 147. స్వచ్ఛత 🍀*

*🕉 . హృదయంలో ఉండే స్వచ్ఛత చెడిపోదు; మీరు చేసేది ఏదైనా దానిని ఏ మాత్రం ప్రభావితం చేయదు. 🕉*
 
*గొప్ప పాపి కూడా జీవి యొక్క లోతైన చోట వద్ద స్వచ్ఛంగా ఉంటాడు. కాబట్టి లోతైన పాపి కూడా చివరికి సాధువుగానే తెలియ వస్తాడు. పాపం కేవలం పరిధిని, చుట్టుకొలతను మాత్రమే తాకగలదు. ఇది మీ లోతుల్లోకి వెళ్లలేదు. ఎందుకంటే చేయడం అనేది ఉపరితలం పైనే ఉంటుంది; జీవి మాత్రమే అంతర్భాగంలో ఉంటుంది. మరియు మీరు ప్రజల ఉనికిని చూడటం ప్రారంభించినప్పుడు, ఎవరూ పాపులు కారు. అది అసాధ్యం. స్వచ్ఛత చాలా సంపూర్ణమైనది, మనం చేసేదంతా కలల కంటే ఎక్కువ కాదు; ఇదియే తూర్పు విధానం. తూర్పు విధానం మీ పని గురించి పెద్దగా బాధపడదు. మీరు ఏమి చేసినా, మీరు హృదయం లోపలికి వెళ్లినప్పుడు స్వఛ్చంగా మారవచ్చని అది చెబుతుంది. అది ఎప్పడు స్ఫటికంలా స్పష్టంగా ఉంటుంది. ఎల్లప్పుడూ స్వచ్ఛంగా, కలుషితం కాకుండా ఉండే జీవితో పరిచయం అది.*

*అంచున కేవలం ముఖాలు మరియు పాపులు, మంచి మరియు చెడు, ప్రసిద్ధ మరియు అపఖ్యాతి పాలైనవారు ఉన్నారు. అవి కేవలం నాటకాలు మాత్రమే. ఎవరో రాముడిగా మారారు మరియు మరొకరు రావణుడిగా మారారు. రెండూ అవసరమే. మొత్తం కథ జరగడానికి అవి రెండూ అవసరం. అయితే వేదిక వెనుక మాత్రం కలిసి కూర్చుని ఉన్నారు. అదీ వాస్తవం. ఈ ప్రపంచమంతా ఒక విశాలమైన వేదిక, ఒక గొప్ప నాటకం రూపొందుతోంది. కాబట్టి దాని గురించి చింతించకండి. మీకు ఏ భాగము ఇవ్వబడినా, దానిని వీలైనంత ఆనందంగా నెరవేర్చుకోండి మరియు మీరు ఎల్లప్పుడూ పవిత్రంగా ఉన్నారని గుర్తుంచుకోండి.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 147 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 147. PURITY 🍀*

*🕉 The purity that resides in the heart is incorruptible; what you do does not affect it at all. 🕉*
 
*Even the greatest sinner remains pure at the deepest core of being. So even the deepest sinner remains a saint; the sin can only touch the periphery, the circumference. It cannot go to your core, because doing remains on the surface; only being is at the core. And when you start looking at people's being, then nobody is a sinner, nobody has ever been a sinner. It is impossible. Purity is so absolute that all that we do is not more than dreams; that is the Eastern approach. The Eastern approach doesn't bother much about your doing. It says that whatever you have done, you can simply go within and have a. contact with the being, which remains crystal clear and always pure, unpolluted.*

*On the periphery are just facessaint and sinner, good and bad, the famous and the notorious. They are just acts, as if a drama were being enacted. Somebody has become a Rama and somebody has become a Ravana. Both are needed: Rama cannot be without Ravana, and what will Ravana be without Rama? They are both necessary for the whole Christ story to happen. But behind the stage they move together. That's the reality. This whole world is a vast stage, and a great drama is being enacted. So don't worry about it. Whatever part has been given you, fulfill it as joyously as possible, and always remember that deep down you remain pure.*
  
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 353-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 353-1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 78. భక్తిమత్-కల్పలతికా, పశుపాశ విమోచనీ ।*
*సంహృతాశేష పాషండా, సదాచార ప్రవర్తికా ॥ 78 ॥ 🍀*

*🌻 353-1. ''భక్తిమత్కల్పలతికా'🌻* 

*భక్త జనులకు కల్పలతవలె ఇష్టమైన కోరికలను తీర్చునది శ్రీమాత అని అర్థము. భక్తి మత్కల్పులు అనగా భక్తితో కూడినవారై కోరికలు తీరనివారు. వీని ప్రవర్తనమున భక్తియే గోచరించు చుండును. కాని జీవితమున కొన్ని అంశముల యందు సంపూర్ణత లేక కొంత అసంతృప్తులై యుందురు. ఇట్టి భక్తిమతులకు కల్పలతికవలె కోరికలను కూడ విస్తారముగ పూరించి పరిపూర్ణ భక్తులను శ్రీమాత చేయుచున్నది. లతిక అనగా తీగవలె విస్తారముగ సాగునది. కస్తూరివలె సువాసన కలిగినది.*

*కావున కల్పలతిక అనగా విస్తారముగ సువాసనలతో కూడినదై భక్తిమతుల కోర్కెలను శ్రీమాత పూరించు చుండును. సంపద రెండు విధములుగ నుండును. ఆనందమును, వైభవమును ఇచ్చు సంపద. దుఃఖమును బంధమును కష్టములను కొనివచ్చు సంపద. రెండవ రకము సంపద దివ్య సంపద కాదు. మొదటి రకము సంపద సుగంధముతో కూడినదై యుండును. శ్రీమాత భక్తి కలవారి కోరికలు తీర్చి పూర్ణ భక్తులుగ తీర్చిదిద్దును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 353-1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 78. Bhaktimatkalpalatika pashupasha vimochani*
*Sanhruta sheshapashanda sadachara pravartika ॥ 78 ॥ 🌻*

*🌻 353-1. Bhaktimat-kalpa-latikā भक्तिमत्-कल्प-लतिका 🌻*

*Kalpa is a divine creeper that grants boon to those who sit under it. In the same way She gives boon to Her devotees. Latika means spread over. This indicates that Her devotees are spread over across the earth (devotees is a general term representing the whole humanity). Kalpa also means imperfection.*

*Those who worship Her with imperfect devotion are made to acquire perfect devotion over several births and She gives them final liberation. There is difference between final liberation and reaching the Heavens which is called mokṣa.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹