🌹 20, AUGUST 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹

🍀🌹 20, AUGUST 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 20, AUGUST 2023 SUNDAY ఆదివారం, భాను వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 416 / Bhagavad-Gita - 416 🌹
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 02 / Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 02 🌴
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 262 / Agni Maha Purana - 262 🌹 
🌻. శివ పూజాంగ హోమ విధి - 7 / Mode of installation of the fire (agni-sthāpana) - 7 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 128 / DAILY WISDOM - 128 🌹 
🌻 7. తత్వశాస్త్రంలో స్థిరపడిన వాస్తవికత / 7. The Reality that is Established in Philosophy 🌻
5) 🌹. శివ సూత్రములు - 130 / Siva Sutras - 130 🌹 
🌻 2-10. విద్యాసంహారే తదుత్త స్వప్న దర్శనం -2 / 2-10.  vidyāsamhāre taduttha svapna darśanam -2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 20, ఆగష్టు, AUGUST 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : నాగ చతుర్థి, Naga Chaturthi 🌻*

*🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 20 🍀*

*39. సుఖసేవ్యో మహాతేజా జగతామేకకారణమ్ |*
*మహేంద్రో విష్టుతః స్తోత్రం స్తుతిహేతుః ప్రభాకరః*
*40. సహస్రకర ఆయుష్మాన్ అరోషః సుఖదః సుఖీ |*
*వ్యాధిహా సుఖదః సౌఖ్యం కల్యాణః కలతాం వరః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : మలుపు, పిలుపు - మానసిక సిద్ధాంతాలు ప్రధానం కావు. జీవుని అభిముఖ్యము ననుసరించి, ప్రయాణంలో జీవుడు తీసుకునే మలుపు ననుసరించి, మనస్సు సిద్ధాంతాలు కల్పించడం, వాటి నామోదించడం జరుగుతూ వుంటుంది. కనుక, ప్రధానమైనది నీ లోపలి ఆ మలుపు, పిలుపు. 🍀* 

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: శుక్ల చవితి 24:23:43 వరకు
తదుపరి శుక్ల పంచమి
నక్షత్రం: హస్త 28:22:12 వరకు
తదుపరి చిత్ర
యోగం: సద్య 21:59:20 వరకు
తదుపరి శుభ
కరణం: వణిజ 11:22:08 వరకు
వర్జ్యం: 11:05:54 - 12:52:10
దుర్ముహూర్తం: 16:57:43 - 17:48:19
రాహు కాలం: 17:04:03 - 18:38:55
గుళిక కాలం: 15:29:11 - 17:04:03
యమ గండం: 12:19:27 - 13:54:19
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:44
అమృత కాలం: 21:43:30 - 23:29:46
సూర్యోదయం: 05:59:59
సూర్యాస్తమయం: 18:38:55
చంద్రోదయం: 08:56:36
చంద్రాస్తమయం: 21:08:01
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు: మానస యోగం - కార్య
లాభం 28:22:12 వరకు తదుపరి
పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 416 / Bhagavad-Gita - 416 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 02 🌴*

*02. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా |*
*త్వత్త: కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయమ్ ||*

*🌷. తాత్పర్యం : ఓ కమలపత్రాక్షా! సర్వజీవుల జనన మరణములను గూర్చి వివరముగా నీ నుండి నేను శ్రవణము చేసితిని మరియు అవ్యయములైన నీ మహాత్య్మములను కూడ గుర్తించితిని.*

*🌷. భాష్యము : గడచిన సప్తమాధ్యాయమున శ్రీకృష్ణుడు తానే సమస్త భౌతికజగత్తు యొక్క సృష్టి, నాశములకు కారణమని (అహం కృత్స్నస్య జగత: ప్రభవ: ప్రలయస్తథా:) తనతో నిశ్చయముగా పలికియున్నందున అర్జునుడు ఇచ్చట ఆనందోత్సాహములతో అతనిని “కమలపత్రాక్షా” యని (కృష్ణుని కన్నులు కమలదళములను పోలియుండును) సంభోధించు చున్నాడు.*

*ఈ విషయమును గూర్చి అర్జునుడు శ్రీకృష్ణుని నుండి సవిస్తరముగా శ్రవణము చేసెను. ఆ భగవానుడు సమస్త సృష్టి, లయములకు కారణమైనను వాటికి అతీతుడై యుండునని అర్జునుడు ఎరిగియుండెను. శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా నవమాధ్యాయమున తెలిపినట్లు తాను సర్వవ్యాపకుడైనను సర్వత్రా వ్యక్తిగతముగా నిలిచియుండడు. అచింత్యమైన ఆ దివ్యవిభూతినే తాను పూర్తిగా అవగాహన చేసికొనినట్లు అర్జునుడు ఆంగీకరించుచున్నాడు.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 416 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 02 🌴*

*02. bhavāpyayau hi bhūtānāṁ śrutau vistaraśo mayā*
*tvattaḥ kamala-patrākṣa māhātmyam api cāvyayam*

*🌷 Translation : O lotus-eyed one, I have heard from You in detail about the appearance and disappearance of every living entity and have realized Your inexhaustible glories.*

*🌹 Purport : Arjuna addresses Lord Kṛṣṇa as “lotus-eyed” (Kṛṣṇa’s eyes appear just like the petals of a lotus flower) out of his joy, for Kṛṣṇa has assured him, in a previous chapter, ahaṁ kṛtsnasya jagataḥ prabhavaḥ pralayas tathā: “I am the source of the appearance and disappearance of this entire material manifestation.”*

*Arjuna has heard of this from the Lord in detail. Arjuna further knows that in spite of His being the source of all appearances and disappearances, He is aloof from them. As the Lord has said in the Ninth Chapter, He is all-pervading, yet He is not personally present everywhere. That is the inconceivable opulence of Kṛṣṇa which Arjuna admits that he has thoroughly understood.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 262 / Agni Maha Purana - 262 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 75*

*🌻. శివ పూజాంగ హోమ విధి - 7 🌻*

*పిమ్మట కుండమునందు అగ్నేయము నుండి వాయవ్యమువరకును నైరృతి నుండి ఈశాన్యమువరకును. "ఓం హాం సద్యోజాత, వాసుదేవా ఘోర తత్పురుషేశానేభ్యః స్వాహా" అను మంత్రముతో అవిఛ్ఛిన్నాజ్యధారాహోమము చేసి పంచముఖముల ఏకీకరణము చేయవలెనను. ఈ విధముగ ఇష్టముకమునందు అన్ని ముకములును అంతర్భూతములగును. అందుచే ఒకే ముఖము అన్ని ముఖముల ఆకారమును ధరించును.కుండమునందు ఈశాన్యమున అగ్నిని పూజించి, అస్త్రమంత్రముతో మూడు ఆహుతుల నిచ్చి, అగ్నికి నామకరణము చేయవలెను. 'ఓ అగ్ని దేవా! నీవు అన్ని విధముల శివుడవు-మంగళప్రదుడవు. అందుచే నీ పేరు శివుడు" అని నామకరణము చేసి, పూజింపబడిన మాతాపితరులగు వాగీశ్వరీ వాగీశ్వరులను, నమస్కార పూర్వకముగ అగ్నియందు విసర్జించి, వారికొరకై విధిపూర్వకముగ పూర్ణాహుతి ఈయవలెను. మూలమంత్రము చివర 'వౌషట్‌' చేర్చి శివశక్తులకు యథావిధిగ పూర్ణాహుతి ఈయవలెను. పిమ్మట అంగ-సేనాసమేతుడగు, పరమతేజఃశాలియైన శివుని హృదయకమలమునందు ఆవాహనచేసి, వెనుకటివలెనే పూజించి ఆశివుని ఆజ్ఞగైకొని ఆయనునుపూర్తిగ తృప్తుని చేయవలెను.*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 262 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 75*
*🌻 Mode of installation of the fire (agni-sthāpana) - 7 🌻*

41-42. Oṃ hāṃ oblations to Sadyojāta and Vāmadeva. Oṃ hāṃ oblations to Vāmadeva and Aghora. Oṃ hāṃ oblations to Aghora and Tatpuruṣa. Oṃ hāṃ oblations to Tatpuruṣa and Īśāna. Thus the union is done in order with the recitation of these mantras. With the flow of ghee from the sacrificial ladle taking it from the fire through the angular points such as northwest, south-west, and ending with north-east, one should unite the faces. Oṃ hāṃ oblations to Sadyojāta, Vāmadeva, Aghora, Tatpuruṣa and Īśāna. Thus its form and other faces should be contemplated in the face of one’s liking.

43. Having worshipped the fire in the north-east and offering three oblations with the mantra of the weapon, (the worshipper) with his entire soul should contemplate—“O Fire-God! you are the divine essence of Śiva.”

44. Having worshipped the parents with the hṛd (mantra) and left them aside, the final oblation which concludes the rite should be offered as laid down with the principal mantra ending with vauṣaṭ.

45. Then one should worship the resplendent, Supreme God attended upon by the attendants and retinue, after having invoked him in the lotus of his heart as before. He should offer waters of oblation to Śiva after having requested his permission.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 128 / DAILY WISDOM - 128 🌹*
*🍀 📖 . జీవితం యొక్క తత్వము నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 7. తత్వశాస్త్రంలో స్థిరపడిన వాస్తవికత 🌻*

*తత్వంలో స్థిరపడిన వాస్తవాన్ని లోతైన ధ్యాన స్థితిలో మాత్రమే అనుభవించగలం. ఇక్కడ చైతన్యం మరియు అస్తిత్వం ఒకటౌతాయి. అదిగా అవడం తప్ప దానిని అనుభూతి చెండలేము. విశ్వ చైతన్యానికి విషయ-వస్తువు సంబంధం లాంటిదేమీ లేదు. దానిని పూర్తిగా అద్వైత భావనలో అర్థం చేసుకోగలరు లేదా అస్సలు అర్థం చేసుకోలేరు. అంతేకాని మధ్యేమార్గం లేదు. ఇంద్రియాలు, తెలివితేటలు మరియు హేతువాదం దాని స్వభావాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి లేదా అనుభవంలో గ్రహించే ప్రయత్నంలో అస్సలు పనికిరావు.*

*పరమాత్మ యొక్క సాక్షాత్కారంలో వ్యక్తి యొక్క మనస్సు దాని అన్ని ద్వంద్వత్వ వర్గాలతో కలిపి పూర్తిగా అధిగమించబడుతుంది. మనస్సు వాస్తవికత యొక్క లక్షణాలలో పాలుపంచుకోదు. దానికి స్పృహ లేదు మరియు ప్రకృతిలో విశ్వవ్యాప్తం కాదు. మనస్సు అనేది ఒక బలహీనమైన వస్తుపరమైన, చేతన లేని వస్తువు. ఇది భౌతిక స్వభావం కలిగిన బాహ్య ప్రపంచాన్ని గ్రహించడంలో వ్యక్తి యొక్క సాధనంగా మాత్రమే పనిచేస్తుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 128 🌹*
*🍀 📖 The Philosophy of Life 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 7. The Reality that is Established in Philosophy 🌻*

*The Reality that is established in philosophy is to be experienced in the state of deep meditation. Here consciousness and being become one. There is no way of entering into communion with it except by being it. There is no such thing as subject-object relationship in regard to the consciousness of what is universal. Either one knows it fully in non-dualistic communion or does not know it at all. The senses, the understanding and the reason are powerless instruments in one’s attempt at perfectly comprehending its nature or realising it in experience.*

*In the realisation of the Supreme Being the mind of the individual is completely transcended, together with all its dualistic categories. The mind does not partake of the characteristics of Reality. It is not conscious and also not universal in nature. The mind is a feeble objective insentient evolute acting as the individual’s instrument in the perception of the external world, which is physical in nature.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 130 / Siva Sutras - 130 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 2-10. విద్యాసంహారే తదుత్త స్వప్న దర్శనం -2 🌻*

*🌴. ఆత్మశుద్ధి యఙ్యంలో నిమ్న జ్ఞానము నశించి నప్పుడు, యోగి, ప్రపంచాన్ని శివుని స్వప్నంగాను మరియు  అతని శరీరం ఏర్పడినట్లు అనుభవిస్తాడు. అతను తన మాయ స్వరూపాన్ని గ్రహించి, స్వచ్ఛమైన జ్ఞానంలో స్థిరపడతాడు. 🌴*

*ఈ సూత్రం చైతన్యం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుతుంది. అత్యున్నత స్థాయి చైతన్యం అనేది ప్రతిరోజూ కలిగే, మెలకువ, స్వప్న మరియు గాఢనిద్ర అను మూడు స్థాయిల స్పృహలకు మించినది. ఒకరు మెలకువగా ఉన్నప్పుడు త్వరితగతిన ఈ దశలను అధిగమించ గలిగినప్పుడు, అతను సమాధి స్థితిలోకి ప్రవేశిస్తాడు. సమాధిలో కూడా ఒకరు తన చైతన్యాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలి, ఎందుకంటే బాధిత ఆలోచనా ప్రక్రియలు సమాధి స్థితిని ప్రభావితం చేస్తాయి, ఇది ఎరుక యొక్క స్థాయిని వక్రీకరిస్తుంది. వక్రీకరణ కారణంగా, అతను స్వప్న స్థితిలోకి జారిపోవచ్చు లేదా మెలకువ దశకు అంటే దిగువకు జారిపోవచ్చు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras  - 130 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 2-10.  vidyāsamhāre taduttha svapna darśanam -2 🌻*

*🌴. When the knowledge is thus destroyed in the sacrifice of self-purification, the yogi experiences the world as a dream of Shiva and his body as a formation. He realizes their illusory nature and becomes established in pure knowledge.   🌴*

*This aphorism talks about the importance of consciousness. The highest level of consciousness is beyond the three levels of consciousness that one undergoes daily, awake, dream and deep sleep. When one is able to transcend these stages in quick succession when he is awake, he enters the stage of samādhi. Even in samādhi one has to keep his consciousness pure as afflicted thought processes are bound to affect the state of samādhi, which distorts the level of awareness. Because of the distortion, he could either slip into the dream state or even lower, the wakening stage.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 470 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 470 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 470 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 470 - 3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 97. వజ్రేశ్వరీ, వామదేవీ, వయోఽవస్థా వివర్జితా ।
సిద్ధేశ్వరీ, సిద్ధవిద్యా, సిద్ధమాతా, యశస్వినీ ॥ 97 ॥ 🍀

🌻 470. ‘సిద్ధేశ్వరి'- 3 🌻


సిద్ధులు శ్రీమాత వశమున నుండును గాని, యితరుల వశమున నుండవు. ఇతరులు ధర్మము పాటించినపుడు వశమై, అధర్మము పాటించు నపుడు అదృశ్యమగును. రాక్షస ప్రవృత్తితో వశము చేసుకొను వారికి ఆపన్న సమయమున అవసర పడవు. ఈ సత్యము తెలిసిన వారు సిద్ధుల వెంటపడరు. సిద్దులకై ఆరాధన చేయరు. దైవారాధనము, ధర్మాచరణము అనుసరింతురు. అమ్మ అనుగ్రహమున సిద్ధులు కలుగును. అట్టి అనుగ్రహము కలిగినవారు నిజమగు సిద్ధపురుషులు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 470 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 97. Vajreshvari vamadevi vayovasdha vivarjita
sideshvari sidhavidya sidhamata yashasvini ॥ 97 ॥ 🌻

🌻 470. 'Siddheshwari'- 3 🌻


Siddhas are in Srimata's possession and not in any other's'. For others, when they practice dharma, the Siddhas remain in their possession and when they practice unrighteousness, they disappear. When someone with demonic nature gains them, they do not come of use in the time of need. Those who know this truth do not hanker for the siddhas. They do not worship for Siddhas. They follow Devotional worship and dharmacharana. By the grace of Amma, siddhas are attained. Those who have such a grace are real virtuous men or Siddha purushas.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



Osho Daily Meditations - 30. EMPTINESS / ఓషో రోజువారీ ధ్యానాలు - 30. శూన్యత



🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 30 / Osho Daily Meditations - 30 🌹

✍️. ప్రసాద్ భరద్వాజ

🍀 30. శూన్యత 🍀

🕉. జీవితంలో గొప్ప రోజు మీరు విసిరివేయడానికి మీలో ఏమీ లేనప్పుడు; అన్నీ ఇప్పటికే విసిరివేయబడ్డాయి మరియు స్వచ్ఛమైన శూన్యత మాత్రమే ఉంది. ఆ శూన్యంలో మీరు మిమ్మల్ని కనుగొంటారు. 🕉


ధ్యానం అంటే మనస్సులోని అన్ని విషయాల నుండి ఖాళీగా మారడం: జ్ఞాపకశక్తి, ఊహ, ఆలోచనలు, కోరికలు, అంచనాలు, మనోభావాలు. ఈ విషయాలన్నింటినీ ఖాళీ చేసుకుంటూ వెళ్లాలి. జీవితంలో గొప్ప రోజు మీరు విసిరివేయడానికి మీలో ఏదైనా కనుగొనలేనప్పుడు; అన్నీ ఇప్పటికే విసిరివేయబడ్డాయి మరియు స్వచ్ఛమైన శూన్యత మాత్రమే ఉంది. ఆ శూన్యంలో మీరు మిమ్మల్ని కనుగొంటారు; ఆ శూన్యంలో మీరు మీ స్వచ్ఛమైన చైతన్యాన్ని కనుగొంటారు. ఆ శూన్యత మనసుకు సంబంధించినంత వరకు మాత్రమే శూన్యం. లేకుంటే అది పొంగిపొర్లుతుంది, నిండుగా ఉంటుంది ---మనస్సు శూన్యం కానీ చైతన్యంతో నిండి ఉంటుంది.

కాబట్టి ఖాళీ అనే పదానికి భయపడవద్దు; అది ప్రతికూలమైనది కాదు. ఇది పాత అలవాటు నుండి మీరు తీసుకువెళుతున్న అనవసరమైన సామాను మాత్రమే నిరాకరిస్తుంది, ఇది సహాయం చేయదు కానీ అడ్డుకుంటుంది, ఇది కేవలం బరువు, పర్వత బరువు. ఈ బరువు తొలగిపోయిన తర్వాత మీరు అన్ని హద్దుల నుండి విముక్తి పొందుతారు, మీరు ఆకాశం వలె అనంతంగా ఉంటారు. ఇది భగవంతుడు లేదా బుద్ధుని అనుభవం లేదా మీరు ఇష్టపడే మరో పదం. దమ్మ అని పిలవండి, టావో అని పిలవండి, సత్యం అని పిలవండి, మోక్షం అని పిలవండి--వీటన్నిటికీ అర్థం ఒక్కటే.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 30 🌹

📚. Prasad Bharadwaj

🍀 30. EMPTINESS 🍀

🕉. The greatest day in life is when you cannot find anything in you to throw out; all has already been thrown out, and there is only pure emptiness. In that emptiness you will find yourself. 🕉

Meditation simply means becoming empty of all the contents of the mind: memory, imagination, thoughts, desires, expectations, projections, moods. One has to go on emptying oneself of all these contents. The greatest day in life is when you cannot find anything in you to throw out; all has already been thrown out, and there is only pure emptiness. In that emptiness you will find yourself; in that emptiness you find your pure consciousness. That emptiness is empty only as far as mind is concerned. Otherwise it is overflowing, full of being ---empty of mind but full of consciousness.

So don't be afraid of the word empty; it is not negative. It negates only the unnecessary luggage, which you are carrying just from old habit, which does not help but only hinders, which is just a weight, a mountainous weight. Once this weight is removed you are free from all boundaries, you become as infinite as the sky. This is the experience of God or Buddhahood or whatever word one likes. Call it dhamma, call it Tao, call it truth, call it nirvana--they all mean the same thing.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ శివ మహా పురాణము - 776 / Sri Siva Maha Purana - 776


🌹 . శ్రీ శివ మహా పురాణము - 776 / Sri Siva Maha Purana - 776 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 18 🌴

🌻. నారద జలంధర సంవాదము - 6 🌻


నారదుడిట్లు పలికెను- మిక్కిలి సుందరమైనది, శ్రేష్ఠ సంపదలతో నిండియున్నది అగు కైలాసములో దిగంబరుడగు శంభుడు యోగిరూపమును ధరించి యున్నాడు (44). ఆతని భార్య పేరు పార్వతి. ఆమె సర్వావయవ సుందరి; మిక్కిలి రమ్యమైనది; మంచి లక్షణములన్నింటితో గూడి మనస్సునకు ఆహ్లాదమును కలిగించునది (45). మిక్కిలి కుతూహలమును రేకెత్తించే ఆమె రూపము వంటి రూపము మరెక్కడనూ కానరాదు. అత్యద్భుతమగు ఆమె రూపము గొప్ప యోగులకైననూ మోహమును కలిగించును. గొప్ప సంపదలనిచ్చే ఆమె రూపము చూడ ముచ్చటను గొల్పును (46). ఓ వీరా! జలంధరా! గొప్ప భార్యతో గూడియున్న శివునికంటే గొప్ప సమృద్ధి గలవాడు ముల్లోకములలో మరియొకడు లేడని ఇప్పుడు నా మనస్సులో తోచుచున్నది (47). ఏ యువతి యొక్క సౌందర్య సముద్రములో మునిగిన బ్రహ్మగారు పూర్వము తన ధైర్యమును గోల్పోయి నాడో, అట్టి ఆమెతో ఇంకొకరిని పోల్చుట ఎట్లు సంభవము? (48). రాగద్వేషములకు అతీతుడు, మన్మథ శత్రువు, స్వతంత్రుడు అగు శివుని కూడ ఆమె తన లీలచే తన వశము చేసుకొనెను (49). అట్టి స్త్రీరత్నమును వివాహమాడిన వానికి ఏ సమృద్ధి గలదో, అట్టి సమృద్ధి, ఓ రాక్షసరాజా! సర్వశ్రేష్ఠ వస్తువులకు నీవు ప్రభువే అయిననూ, నీ వద్దలేదు (50).

సనత్కుమారుడిట్లు పలికెను- దేవర్షి, లోకములో ప్రఖ్యాతిని గాంచిన వాడు, దేవతలకు ఉపకారమును చేయుటకై సర్వదా సంసిద్ధముగ నుండు వాడు అగు ఆ నారదుడు ఇట్లు పలికి ఆకాశమార్గమున నిర్గమించెను (51).

శ్రీ శివమహాపురాణములో రుద్ర సంహితయందు యుద్ధఖండలో నారద జలంధర సంవాదమనే పదునెనిమిదవ అధ్యాయము ముగిసినది (18).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 776🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 18 🌴

🌻 The conversation between Nārada and Jalandhara - 6 🌻



Nārada said:—

44. Kailāsa is very beautiful and it possesses all sorts of things conducive to prosperity. Śiva lives there assuming the form of a naked Yogin.

45. His wife Pārvatī is exquisitely beautiful in every limb. She is charming and has all the characteristics of a beautiful lady.

46. Such an exquisite beauteous form has never been seen anywhere. It incites the enthusiasm of everybody. It is highly wonderful. It fascinates even the Yogins. It is worthy of being seen. It is conducive to great prosperity.

47. This occurs to my mind, O valiant Jalandhara that there is none more prosperous in the three worlds than Śiva who possesses the most excellent of all ladies.

48. Even the four-faced[2] lord Brahmā, immersed in her ocean of beauty, lost his mental steadiness formerly.[3] Who can be compared to such a beautiful lady?

49. Even Śiva reputed to be free from infatuation has been won over by her womanly sports. Śiva who is independent has been subjugated by her.

50. The prosperity that he enjoys inasmuch as he indulges in dalliance with the most excellent of all ladies has not come to you O lord of Daityas though you are the master of excellent gems and jewels.


Sanatkumāra said:—

51. After saying this, the world-renowned celestial sage, Nārada, pursuing his attempt to help the gods departed from there by the aerial path.


Continues....

🌹🌹🌹🌹🌹


విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 815 / Vishnu Sahasranama Contemplation - 815


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 815 / Vishnu Sahasranama Contemplation - 815🌹

🌻815. సర్వజ్ఞః, सर्वज्ञः, Sarvajñaḥ🌻

ఓం సర్వజ్ఞాయ నమః | ॐ सर्वज्ञाय नमः | OM Sarvajñāya namaḥ


సర్వం జానాతి యో విష్ణుస్స సర్వజ్ఞ ఇతీర్యతే ।
యస్సర్వజ్ఞస్సర్వవిదిత్యాదిశ్రుతిసమీరణాత్ ॥

సర్వమును, సర్వముయగు ఆత్మ తత్త్వమును స్వస్వరూపమున తానే ఎరిగియుండువాడు. సర్వమును అఖిల విశ్వములయందలి ప్రతీ అంశమును ఎరుగువాడు. 'యః సర్వజ్ఞః సర్వవిత్' (ముణ్డకోపనిషత్ 1.1.9) - 'ఏ పరమాత్ముడు సామాన్య రూపమున సర్వమును ఎరిగినవాడో విశేష రూపమునను సర్వమును ఎరిగిన వాడో' అను శ్రుతి వచనము ఇందులకు ప్రమాణము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 815🌹

🌻815. Sarvajñaḥ🌻

OM Sarvajñāya namaḥ


सर्वं जानाति यो विष्णुस्स सर्वज्ञ इतीर्यते ।
यस्सर्वज्ञस्सर्वविदित्यादिश्रुतिसमीरणात् ॥

Sarvaṃ jānāti yo viṣṇussa sarvajña itīryate,
Yassarvajñassarvavidityādiśrutisamīraṇāt.

He who knows everything, knowledge of all pervading ātman. The Omniscient vide the śruti 'यः सर्वज्ञः सर्ववित् / Yaḥ sarvajñaḥ sarvavit' (Muṇḍakopaniṣat 1.1.9) - He who is omniscient and knows all.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka


कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः ।
अमृतांशोऽमृतवपुस्सर्वज्ञस्सर्वतोमुखः ॥ ८७ ॥

కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనోఽనిలః ।
అమృతాంశోఽమృతవపుస్సర్వజ్ఞస్సర్వతోముఖః ॥ 87 ॥

Kumudaḥ kundaraḥ kundaḥ parjanyaḥ pāvano’nilaḥ,
Amr‌tāṃśo’mr‌tavapussarvajñassarvatomukhaḥ ॥ 87 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹


కపిల గీత - 223 / Kapila Gita - 223


🌹. కపిల గీత - 223 / Kapila Gita - 223 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 33 🌴

33. తస్మాన్మయ్యర్పితాశేషక్రియార్థాత్మా నిరంతరః|
మయ్యర్పితాత్మనః పుంసో మయి సంన్యస్తకర్మణః|
న పశ్యామి పరం భూతమకర్తుః సమదర్శనాత్॥॥


తాత్పర్యము : వారి కంటెను నిరంతరము తమ విధ్యుక్తకర్మల ఫలములను అన్నింటిని భగవదర్పణము గావించినవాడు గొప్పవాడు. వారి కంటెను దేహాభిమానమును వీడి భేదభావము లేకుండా భగవంతుని ఉపాసించువాడు ఉత్తమోత్తముడు. ఈ విధముగా తన చిత్తమును, కర్మలను భగవంతునికే సమర్పించి, తాను దేనికిని కర్తను గాదని భావించుచు సకల ప్రాణులను సమదృష్టితో చూచువానికంటె శ్రేష్ఠుడు మరి ఎవ్వరును ఉండరు.

వ్యాఖ్య : ఈ పద్యంలో సమదర్శనాత్‌ అనే పదం అతనికి ఇకపై ప్రత్యేక ఆసక్తి లేదని అర్థం; భక్తుని ఆసక్తి మరియు పరమాత్మ యొక్క ఆసక్తి ఒకటి. సేవ ఉండాలంటే మూడు అంశాలు ఉండాలి: యజమాని, సేవకుడు మరియు సేవ. ఇక్కడ యజమాని భగవానుడే. భగవంతుని సంతృప్తి కోసం తన జీవితాన్ని, తన కార్యకలాపాల నన్నింటినీ, తన మనస్సు మరియు అతని ఆత్మ-అన్నిటినీ అంకితం చేసినవాడు గొప్ప వ్యక్తిగా పరిగణించబడతాడని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది.

అకర్తుః అనే పదానికి 'యాజమాన్య భావన లేకుండా' అని అర్థం. ప్రతి ఒక్కరూ తన చర్యలకు యజమానిగా వ్యవహరించాలని కోరుకుంటారు, తద్వారా అతను ఫలితాన్ని ఆస్వాదించగలడు. అయితే ఒక భక్తుడికి అలాంటి కోరిక ఉండదు; అతను ఒక నిర్దిష్ట మార్గంలో ప్రవర్తించాలని భగవంతుని వ్యక్తి కోరుకుంటున్నందున అతను ప్రవర్తిస్తాడు. అతనికి వ్యక్తిగత ఉద్దేశ్యం లేదు. భగవంతుని యొక్క అత్యంత రహస్య సేవకుడైన భక్తుడు తన వ్యక్తిగత ఖాతా కోసం ఎప్పుడూ ఏమీ చేయడు, కానీ సర్వోన్నత భగవంతుని సంతృప్తి కోసం ప్రతిదీ చేస్తాడు. ఇది స్పష్టంగా చెప్పబడింది, కాబట్టి, మయి సన్యాస్తా-కర్మణః: భక్తుడు పని చేస్తాడు, కానీ అతను పరమాత్మ కోసం పనిచేస్తాడు. ఇది కూడా చెప్పబడింది, మయ్య అర్పితాత్మనః: 'అతను తన మనస్సును నాకు ఇస్తాడు.' ఈ శ్లోకం ప్రకారం, మానవులందరిలో ఉన్నతమైన వాడుగా అంగీకరించ బడిన భక్తుని యొక్క అర్హతలు ఇవి.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 223 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 5. Form of Bhakti - Glory of Time - 33 🌴

33. tasmān mayy arpitāśeṣa- kriyārthātmā nirantaraḥ
mayy arpitātmanaḥ puṁso mayi sannyasta-karmaṇaḥ
na paśyāmi paraṁ bhūtam akartuḥ sama-darśanāt

MEANING : Therefore I do not find a greater person than he who has no interest outside of Mine and who therefore engages and dedicates all his activities and all his life—everything—unto Me without cessation.

PURPORT : In this verse the word sama-darśanāt means that he no longer has any separate interest; the devotee's interest and the Supreme Personality of Godhead's interest are one. When there is service, there must be a master. Three things must be present for there to be service: the master, the servant and the service. Here it is clearly stated that he who has dedicated his life, all his activities, his mind and his soul—everything—for the satisfaction of the Supreme Lord, is considered to be the greatest person.

The word akartuḥ means "without any sense of proprietorship." Everyone wants to act as the proprietor of his actions so that he can enjoy the result. A devotee, however, has no such desire; he acts because the Personality of Godhead wants him to act in a particular way. He has no personal motive. A devotee who is a most confidential servant of the Lord never does anything for his personal account, but does everything for the satisfaction of the Supreme Lord. It is clearly stated, therefore, mayi sannyasta-karmaṇaḥ: the devotee works, but he works for the Supreme. It is also stated, mayy arpitātmanaḥ: "He gives his mind unto Me." These are the qualifications of a devotee, who, according to this verse, is accepted as the highest of all human beings.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


19 Aug 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 19, ఆగష్టు, AUGUST 2023 పంచాంగము - Panchangam 🌹

శుభ శనివారం, Saturday, స్థిర వాసరే

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : హర్యాలీ తీజ్‌, Hariyali Teej 🌻

🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 11 🍀

20. సభాస్తంభోద్భవో భీమః శీరోమాలీ మహేశ్వరః |
ద్వాదశాదిత్యచూడాలః కల్పధూమసటాచ్ఛవిః

21. హిరణ్యకోరఃస్థలభిన్నఖః సింహముఖోఽనఘః |
ప్రహ్లాదవరదో ధీమాన్ భక్తసంఘప్రతిష్ఠితః

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నేటి సూక్తి : పూర్ణ యోగ మార్గమున ప్రవేశార్హత - అంతరాత్మ పిలుపు వచ్చి, కడవరకూ సాగిపోగల సంసిద్ధత తనకు కలదన్న నిశ్చియముంటే తప్ప, ఇతర యోగముల కంటె సువిశాలమూ, కష్ట బహుళమూనైన పూర్ణయోగ మార్గమున నెవ్వరునూ ప్రవేశింప రాదు. సంసిద్దత అనగా సమర్ధత అని కాదు. ఇచ్ఛ అని అర్థం. ఎట్టి కష్టాలైనా ఎదుర్కొని కడవరకూ సాగిపోయే ఇచ్చ వుంటే ఈ మార్గాన పోవచ్చును. 🍀

🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వర్ష ఋతువు, దక్షిణాయణం,

శ్రావణ మాసం

తిథి: శుక్ల తదియ 22:21:41 వరకు

తదుపరి శుక్ల చవితి

నక్షత్రం: ఉత్తర ఫల్గుణి 25:48:36

వరకు తదుపరి హస్త

యోగం: సిధ్ధ 21:19:12 వరకు

తదుపరి సద్య

కరణం: తైతిల 09:11:48 వరకు

వర్జ్యం: 07:01:00 - 08:48:20

దుర్ముహూర్తం: 07:41:04 - 08:31:43

రాహు కాలం: 09:09:43 - 10:44:41

గుళిక కాలం: 05:59:46 - 07:34:44

యమ గండం: 13:54:39 - 15:29:37

అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:44

అమృత కాలం: 17:45:00 - 19:32:20

సూర్యోదయం: 05:59:46

సూర్యాస్తమయం: 18:39:34

చంద్రోదయం: 08:09:38

చంద్రాస్తమయం: 20:35:47

సూర్య సంచార రాశి: సింహం

చంద్ర సంచార రాశి: కన్య

యోగాలు: ఉత్పాద యోగం - కష్టములు,

ద్రవ్య నాశనం 25:48:36 వరకు తదుపరి

మృత్యు యోగం - మృత్యు భయం

దిశ శూల: తూర్పు

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹