🌹 20, AUGUST 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹

🍀🌹 20, AUGUST 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 20, AUGUST 2023 SUNDAY ఆదివారం, భాను వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 416 / Bhagavad-Gita - 416 🌹
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 02 / Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 02 🌴
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 262 / Agni Maha Purana - 262 🌹 
🌻. శివ పూజాంగ హోమ విధి - 7 / Mode of installation of the fire (agni-sthāpana) - 7 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 128 / DAILY WISDOM - 128 🌹 
🌻 7. తత్వశాస్త్రంలో స్థిరపడిన వాస్తవికత / 7. The Reality that is Established in Philosophy 🌻
5) 🌹. శివ సూత్రములు - 130 / Siva Sutras - 130 🌹 
🌻 2-10. విద్యాసంహారే తదుత్త స్వప్న దర్శనం -2 / 2-10.  vidyāsamhāre taduttha svapna darśanam -2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 20, ఆగష్టు, AUGUST 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : నాగ చతుర్థి, Naga Chaturthi 🌻*

*🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 20 🍀*

*39. సుఖసేవ్యో మహాతేజా జగతామేకకారణమ్ |*
*మహేంద్రో విష్టుతః స్తోత్రం స్తుతిహేతుః ప్రభాకరః*
*40. సహస్రకర ఆయుష్మాన్ అరోషః సుఖదః సుఖీ |*
*వ్యాధిహా సుఖదః సౌఖ్యం కల్యాణః కలతాం వరః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : మలుపు, పిలుపు - మానసిక సిద్ధాంతాలు ప్రధానం కావు. జీవుని అభిముఖ్యము ననుసరించి, ప్రయాణంలో జీవుడు తీసుకునే మలుపు ననుసరించి, మనస్సు సిద్ధాంతాలు కల్పించడం, వాటి నామోదించడం జరుగుతూ వుంటుంది. కనుక, ప్రధానమైనది నీ లోపలి ఆ మలుపు, పిలుపు. 🍀* 

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: శుక్ల చవితి 24:23:43 వరకు
తదుపరి శుక్ల పంచమి
నక్షత్రం: హస్త 28:22:12 వరకు
తదుపరి చిత్ర
యోగం: సద్య 21:59:20 వరకు
తదుపరి శుభ
కరణం: వణిజ 11:22:08 వరకు
వర్జ్యం: 11:05:54 - 12:52:10
దుర్ముహూర్తం: 16:57:43 - 17:48:19
రాహు కాలం: 17:04:03 - 18:38:55
గుళిక కాలం: 15:29:11 - 17:04:03
యమ గండం: 12:19:27 - 13:54:19
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:44
అమృత కాలం: 21:43:30 - 23:29:46
సూర్యోదయం: 05:59:59
సూర్యాస్తమయం: 18:38:55
చంద్రోదయం: 08:56:36
చంద్రాస్తమయం: 21:08:01
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు: మానస యోగం - కార్య
లాభం 28:22:12 వరకు తదుపరి
పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 416 / Bhagavad-Gita - 416 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 02 🌴*

*02. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా |*
*త్వత్త: కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయమ్ ||*

*🌷. తాత్పర్యం : ఓ కమలపత్రాక్షా! సర్వజీవుల జనన మరణములను గూర్చి వివరముగా నీ నుండి నేను శ్రవణము చేసితిని మరియు అవ్యయములైన నీ మహాత్య్మములను కూడ గుర్తించితిని.*

*🌷. భాష్యము : గడచిన సప్తమాధ్యాయమున శ్రీకృష్ణుడు తానే సమస్త భౌతికజగత్తు యొక్క సృష్టి, నాశములకు కారణమని (అహం కృత్స్నస్య జగత: ప్రభవ: ప్రలయస్తథా:) తనతో నిశ్చయముగా పలికియున్నందున అర్జునుడు ఇచ్చట ఆనందోత్సాహములతో అతనిని “కమలపత్రాక్షా” యని (కృష్ణుని కన్నులు కమలదళములను పోలియుండును) సంభోధించు చున్నాడు.*

*ఈ విషయమును గూర్చి అర్జునుడు శ్రీకృష్ణుని నుండి సవిస్తరముగా శ్రవణము చేసెను. ఆ భగవానుడు సమస్త సృష్టి, లయములకు కారణమైనను వాటికి అతీతుడై యుండునని అర్జునుడు ఎరిగియుండెను. శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా నవమాధ్యాయమున తెలిపినట్లు తాను సర్వవ్యాపకుడైనను సర్వత్రా వ్యక్తిగతముగా నిలిచియుండడు. అచింత్యమైన ఆ దివ్యవిభూతినే తాను పూర్తిగా అవగాహన చేసికొనినట్లు అర్జునుడు ఆంగీకరించుచున్నాడు.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 416 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 02 🌴*

*02. bhavāpyayau hi bhūtānāṁ śrutau vistaraśo mayā*
*tvattaḥ kamala-patrākṣa māhātmyam api cāvyayam*

*🌷 Translation : O lotus-eyed one, I have heard from You in detail about the appearance and disappearance of every living entity and have realized Your inexhaustible glories.*

*🌹 Purport : Arjuna addresses Lord Kṛṣṇa as “lotus-eyed” (Kṛṣṇa’s eyes appear just like the petals of a lotus flower) out of his joy, for Kṛṣṇa has assured him, in a previous chapter, ahaṁ kṛtsnasya jagataḥ prabhavaḥ pralayas tathā: “I am the source of the appearance and disappearance of this entire material manifestation.”*

*Arjuna has heard of this from the Lord in detail. Arjuna further knows that in spite of His being the source of all appearances and disappearances, He is aloof from them. As the Lord has said in the Ninth Chapter, He is all-pervading, yet He is not personally present everywhere. That is the inconceivable opulence of Kṛṣṇa which Arjuna admits that he has thoroughly understood.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 262 / Agni Maha Purana - 262 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 75*

*🌻. శివ పూజాంగ హోమ విధి - 7 🌻*

*పిమ్మట కుండమునందు అగ్నేయము నుండి వాయవ్యమువరకును నైరృతి నుండి ఈశాన్యమువరకును. "ఓం హాం సద్యోజాత, వాసుదేవా ఘోర తత్పురుషేశానేభ్యః స్వాహా" అను మంత్రముతో అవిఛ్ఛిన్నాజ్యధారాహోమము చేసి పంచముఖముల ఏకీకరణము చేయవలెనను. ఈ విధముగ ఇష్టముకమునందు అన్ని ముకములును అంతర్భూతములగును. అందుచే ఒకే ముఖము అన్ని ముఖముల ఆకారమును ధరించును.కుండమునందు ఈశాన్యమున అగ్నిని పూజించి, అస్త్రమంత్రముతో మూడు ఆహుతుల నిచ్చి, అగ్నికి నామకరణము చేయవలెను. 'ఓ అగ్ని దేవా! నీవు అన్ని విధముల శివుడవు-మంగళప్రదుడవు. అందుచే నీ పేరు శివుడు" అని నామకరణము చేసి, పూజింపబడిన మాతాపితరులగు వాగీశ్వరీ వాగీశ్వరులను, నమస్కార పూర్వకముగ అగ్నియందు విసర్జించి, వారికొరకై విధిపూర్వకముగ పూర్ణాహుతి ఈయవలెను. మూలమంత్రము చివర 'వౌషట్‌' చేర్చి శివశక్తులకు యథావిధిగ పూర్ణాహుతి ఈయవలెను. పిమ్మట అంగ-సేనాసమేతుడగు, పరమతేజఃశాలియైన శివుని హృదయకమలమునందు ఆవాహనచేసి, వెనుకటివలెనే పూజించి ఆశివుని ఆజ్ఞగైకొని ఆయనునుపూర్తిగ తృప్తుని చేయవలెను.*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 262 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 75*
*🌻 Mode of installation of the fire (agni-sthāpana) - 7 🌻*

41-42. Oṃ hāṃ oblations to Sadyojāta and Vāmadeva. Oṃ hāṃ oblations to Vāmadeva and Aghora. Oṃ hāṃ oblations to Aghora and Tatpuruṣa. Oṃ hāṃ oblations to Tatpuruṣa and Īśāna. Thus the union is done in order with the recitation of these mantras. With the flow of ghee from the sacrificial ladle taking it from the fire through the angular points such as northwest, south-west, and ending with north-east, one should unite the faces. Oṃ hāṃ oblations to Sadyojāta, Vāmadeva, Aghora, Tatpuruṣa and Īśāna. Thus its form and other faces should be contemplated in the face of one’s liking.

43. Having worshipped the fire in the north-east and offering three oblations with the mantra of the weapon, (the worshipper) with his entire soul should contemplate—“O Fire-God! you are the divine essence of Śiva.”

44. Having worshipped the parents with the hṛd (mantra) and left them aside, the final oblation which concludes the rite should be offered as laid down with the principal mantra ending with vauṣaṭ.

45. Then one should worship the resplendent, Supreme God attended upon by the attendants and retinue, after having invoked him in the lotus of his heart as before. He should offer waters of oblation to Śiva after having requested his permission.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 128 / DAILY WISDOM - 128 🌹*
*🍀 📖 . జీవితం యొక్క తత్వము నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 7. తత్వశాస్త్రంలో స్థిరపడిన వాస్తవికత 🌻*

*తత్వంలో స్థిరపడిన వాస్తవాన్ని లోతైన ధ్యాన స్థితిలో మాత్రమే అనుభవించగలం. ఇక్కడ చైతన్యం మరియు అస్తిత్వం ఒకటౌతాయి. అదిగా అవడం తప్ప దానిని అనుభూతి చెండలేము. విశ్వ చైతన్యానికి విషయ-వస్తువు సంబంధం లాంటిదేమీ లేదు. దానిని పూర్తిగా అద్వైత భావనలో అర్థం చేసుకోగలరు లేదా అస్సలు అర్థం చేసుకోలేరు. అంతేకాని మధ్యేమార్గం లేదు. ఇంద్రియాలు, తెలివితేటలు మరియు హేతువాదం దాని స్వభావాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి లేదా అనుభవంలో గ్రహించే ప్రయత్నంలో అస్సలు పనికిరావు.*

*పరమాత్మ యొక్క సాక్షాత్కారంలో వ్యక్తి యొక్క మనస్సు దాని అన్ని ద్వంద్వత్వ వర్గాలతో కలిపి పూర్తిగా అధిగమించబడుతుంది. మనస్సు వాస్తవికత యొక్క లక్షణాలలో పాలుపంచుకోదు. దానికి స్పృహ లేదు మరియు ప్రకృతిలో విశ్వవ్యాప్తం కాదు. మనస్సు అనేది ఒక బలహీనమైన వస్తుపరమైన, చేతన లేని వస్తువు. ఇది భౌతిక స్వభావం కలిగిన బాహ్య ప్రపంచాన్ని గ్రహించడంలో వ్యక్తి యొక్క సాధనంగా మాత్రమే పనిచేస్తుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 128 🌹*
*🍀 📖 The Philosophy of Life 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 7. The Reality that is Established in Philosophy 🌻*

*The Reality that is established in philosophy is to be experienced in the state of deep meditation. Here consciousness and being become one. There is no way of entering into communion with it except by being it. There is no such thing as subject-object relationship in regard to the consciousness of what is universal. Either one knows it fully in non-dualistic communion or does not know it at all. The senses, the understanding and the reason are powerless instruments in one’s attempt at perfectly comprehending its nature or realising it in experience.*

*In the realisation of the Supreme Being the mind of the individual is completely transcended, together with all its dualistic categories. The mind does not partake of the characteristics of Reality. It is not conscious and also not universal in nature. The mind is a feeble objective insentient evolute acting as the individual’s instrument in the perception of the external world, which is physical in nature.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 130 / Siva Sutras - 130 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 2-10. విద్యాసంహారే తదుత్త స్వప్న దర్శనం -2 🌻*

*🌴. ఆత్మశుద్ధి యఙ్యంలో నిమ్న జ్ఞానము నశించి నప్పుడు, యోగి, ప్రపంచాన్ని శివుని స్వప్నంగాను మరియు  అతని శరీరం ఏర్పడినట్లు అనుభవిస్తాడు. అతను తన మాయ స్వరూపాన్ని గ్రహించి, స్వచ్ఛమైన జ్ఞానంలో స్థిరపడతాడు. 🌴*

*ఈ సూత్రం చైతన్యం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుతుంది. అత్యున్నత స్థాయి చైతన్యం అనేది ప్రతిరోజూ కలిగే, మెలకువ, స్వప్న మరియు గాఢనిద్ర అను మూడు స్థాయిల స్పృహలకు మించినది. ఒకరు మెలకువగా ఉన్నప్పుడు త్వరితగతిన ఈ దశలను అధిగమించ గలిగినప్పుడు, అతను సమాధి స్థితిలోకి ప్రవేశిస్తాడు. సమాధిలో కూడా ఒకరు తన చైతన్యాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలి, ఎందుకంటే బాధిత ఆలోచనా ప్రక్రియలు సమాధి స్థితిని ప్రభావితం చేస్తాయి, ఇది ఎరుక యొక్క స్థాయిని వక్రీకరిస్తుంది. వక్రీకరణ కారణంగా, అతను స్వప్న స్థితిలోకి జారిపోవచ్చు లేదా మెలకువ దశకు అంటే దిగువకు జారిపోవచ్చు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras  - 130 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 2-10.  vidyāsamhāre taduttha svapna darśanam -2 🌻*

*🌴. When the knowledge is thus destroyed in the sacrifice of self-purification, the yogi experiences the world as a dream of Shiva and his body as a formation. He realizes their illusory nature and becomes established in pure knowledge.   🌴*

*This aphorism talks about the importance of consciousness. The highest level of consciousness is beyond the three levels of consciousness that one undergoes daily, awake, dream and deep sleep. When one is able to transcend these stages in quick succession when he is awake, he enters the stage of samādhi. Even in samādhi one has to keep his consciousness pure as afflicted thought processes are bound to affect the state of samādhi, which distorts the level of awareness. Because of the distortion, he could either slip into the dream state or even lower, the wakening stage.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj

No comments:

Post a Comment