శ్రీ లలితా సహస్ర నామములు - 123 / Sri Lalita Sahasranamavali - Meaning - 123

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 123 / Sri Lalita Sahasranamavali - Meaning - 123 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 123. కళాత్మికా, కళానాథా, కావ్యాలాప వినోదినీ |
సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా ‖ 123 ‖ 🍀

🍀 611. కళాత్మికా -
కళల యొక్క రూపమైనది.

🍀 612. కళానాథా -
కళలకు అధినాథురాలు.

🍀 613. కావ్యాలాపవినోదినీ 
కావ్యముల ఆలాపములో వినోదించునది.

🍀 614. సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా -
వింజామరలను కలిగియున్న ఎడమవైపున, కుడివైపున (వరుసగా) లక్ష్మీదేవి చేత, సరస్వతీదేవి చేత సేవింపబడునది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 123 🌹

📚. Prasad Bharadwaj

🌻 123. kalātmikā kalānāthā kāvyālāpa-vinodinī |
sacāmara-ramā-vāṇī-savya-dakṣiṇa-sevitā || 123 || 🌻

🌻 611 ) Kalathmika -
She who is the soul of arts

🌻 612 ) Kala nadha -
She who is the chief of arts

🌻 613 ) Kavya labha vimodhini -
She who enjoys being described in epics

🌻 614 ) Sachamara rama vani savya dhakshina sevitha -
She who is being fanned by Lakshmi the goddess of wealth and Saraswathi the goddess of knowledge

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

30 Aug 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 75

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 75 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. ఆలోచనలను తగ్గించుకొని సత్కర్మలను ఆచరించడం ముఖ్యం 🌻

ఏదైనా ఒక‌ మంచిపని మీ‌ వల్ల ఇంకొకరికి జరుగుతుందంటే దానిని చేయండి! జరగలేదంటే మనకు సంబంధించినది కాదు.

సుఖపడ దలచుకున్నవానికి నాగరికత బానిసగా పనిచేస్తుంది. అంతేగాని, నాగరికత మాత్రమే సుఖమునివ్వజాలదు.

నీకు సంబంధించినవి ఏమైనా పోయినచో వాటి కోసం వెను తిరిగి చూడకుండా ఉండగలగాలి! అప్పుడే బ్రహ్మవిద్యకు అర్హుడవు.

దేని యందు ముడిపెట్టుకున్నా అది ప్రేమ కాదు. దానిని మమకారమంటారు.

ఎదుటి వారిలోని సద్గుణాలతో మాత్రమే మనకు సంబంధము. దుర్గుణాలతో సంబంధం పెట్టుకుంటే మన సుఖమునకు మనము అభ్యంతరాన్ని ఏర్పరచుకుంటున్నట్లు.

ఆలోచనలను తగ్గించుకొని, సత్కర్మలను ఆచరించడం వల్ల మానసికమైన దుఃఖాలు తొలగిపోతాయి. తత్కారణంగా సత్వశుద్ధి కలుగుతుంది.

.....✍️ మాస్టర్ ఇ.కె.🌹

🌹 🌹 🌹 🌹 🌹

30 Aug 2021

వివేక చూడామణి - 123 / Viveka Chudamani - 123

🌹. వివేక చూడామణి - 123 / Viveka Chudamani - 123🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 26. ఆత్మ మార్పులేనిది - 10 🍀

407. కనిపించే ఈ విశ్వమునకు మూలము మనస్సు నందే ఉన్నది. మనస్సు ఎపుడైతే లేకుండా పోతుందో ఈ ప్రపంచము కూడా లేనట్లే. అందువలన ఈ మనస్సును బ్రహ్మములోకి కేంద్రీకరించి అందులో లీనము చేసిన ప్రపంచము మాయమవుతుంది.

408. జ్ఞాని అయిన సాధకుడు హృదయమందు అనగా బుద్ది యందు సమాధి స్థితి ద్వారా బ్రహ్మాన్ని దర్శించినపుడు, అది ఒక విధమైన శాశ్వత జ్ఞానాన్ని బ్రహ్మానంద స్థితిలో ఏ మాత్రము పరిమితము లేని, పూర్తి స్వేచ్ఛతో ఏ కర్మలు చేయకుండా, అంతములేనిఆకాశము వలె ప్రకాశిస్తాడు.

409. జ్ఞాని తన హృదయములో సమాధి ద్వారా బ్రహ్మాన్ని దర్శించి కారణము, ఫలితము ఆశించకుండా అన్ని ఊహలకు దూరముగా సజాతీయముగా పోటీలేని ఆధారాలతో పనిలేకుండా స్థిరపడుతుంది. ఇదంతా వేదాలలో చెప్పబడినది. అది సామాన్యులకు అహం వలె తోస్తుంది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 VIVEKA CHUDAMANI - 123 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 26. Self is Unchangeable - 10 🌻

407. This apparent universe has its root in the mind, and never persists after the mind is annihilated. Therefore dissolve the mind by concentrating it on the Supreme Self, which is thy inmost Essence.

408. The wise man realises in his heart, through Samadhi, the Infinite Brahman, which is something of the nature of eternal Knowledge and absolute Bliss, which has no exemplar, which transcends all limitations, is ever free and without activity, and which is like the limitless sky, indivisible and absolute.

409. The wise man realises in his heart, through Samadhi, the Infinite Brahman, which is devoid of the ideas of cause and effect, which is the Reality beyond all imaginations, homogeneous, matchless, beyond the range of proofs, established by the pronouncements of the Vedas, and ever familiar to us as the sense of the ego.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

30 Aug 2021

శ్రీ శివ మహా పురాణము - 446

🌹 . శ్రీ శివ మహా పురాణము - 446🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 29

🌻. శివపార్వతుల సంవాదము - 4 🌻

పరమాత్మ, పరబ్రహ్మ నీవే. నిర్గుణుడవగు నీవు ప్రకృతికి అతీతుడవు. నీవు వికారములు, కామనలు లేని స్వతంత్ర పరమేశ్వరుడవు (33).అయిననూ నీవు సగుణుడవై భక్తులను ఉద్ధరించుట ప్రధానలక్ష్యముగా కలిగి విహరించు చున్నావు. అనేక లీలలను ప్రదర్శించుటలో పండితుడవగు నీవు ఆత్మనిష్ఠుడవై ఉండెదవు (34). ఓ మహాదేవా! మహేశ్వరా! నిన్ను నేను పూర్తిగా ఎరుంగుదును. పెక్కు మాటలేల? నీవు సర్వజ్ఞుడవు. దయను చూపుము (35). గొప్ప అద్భుతమగు లీలను ప్రదర్శించి లోకములో కీర్తిని విస్తరిల్ల జేయుము. నాథా! ఆ కీర్తిని చక్కగా గానము చేయు జనులు శీఘ్రమే సంసారసముద్రము నుండి ఉత్తీర్ణులగుదురు (36).

బ్రహ్మ ఇట్లు పలికెను-

పార్వతి ఇట్లు పలికి అనేక పర్యాయము తలవంచి చేతులు ఒగ్గి మహేశ్వరునకు నమస్కరించి మిన్నకుండెను (37). ఆమె ఇట్లు పలుకగా మహాత్ముడగు ఆ మహేశ్వరుడు లోకపు తీరును అనుకరించుట కొరకై అటులనే చేసెదనని తలంచి, నవ్వుతూ ఆనందించెను (38). అపుడు మిక్కిలి ఆనందించిన శంభుడు అంతర్ధానమును చెంది కాలి యొక్క విరహముచే పీడితమైన మనస్సు గలవాడై కైలాసమును చేరుకొనెను (39).

అచటకు వెళ్లి పరమానందముతో నిండియున్న మహేశ్వరుడు ఆ వృత్తాంతమునంతనూ నంది మొదలగు వారికి చెప్పెను (40). భైరవాది గణములన్నియూ ఆ వృత్తాంతమును వని మిక్కిలి ఆనందించిన వారై మహోత్సవమును జరుపుకొనిరి (41). ఓ నారదా! ద్విజా! అచట గొప్ప మంగళము ప్రవర్తిల్లెను. అందరికీ దుఃఖము తొలగిపోయెను. రుద్రుడు కూడ మహానందమును పొందెను (42).

శ్రీ శివ మహాపురాణములో ఉరుద్రసంహితయందు పార్వతీ ఖండలో శివాశివ సంవాదమనే ఇరువది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (29).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

30 Aug 2021

గీతోపనిషత్తు -247

🌹. గీతోపనిషత్తు -247 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚

శ్లోకము 25

🍀 24. పునరావృత్తి మార్గము 🍀

ధూమో రాత్రి స్తథా కృష్ణ షణ్మాసా దక్షిణాయనమ్ |
తత్ర చాంద్రమసం జ్యోతి ర్యోగ ప్రాప్య వివర్తతే || 25

తాత్పర్యము : పొగ, రాత్రి, కృష్ణపక్షము, దక్షిణాయనము పునరావృత్తి మార్గములు సూచించు సంకేతములు. ఈ కాలములో మరణించిన యోగులు చంద్ర సంబంధము కలిగి మరలి వచ్చు చున్నారు.

వివరణము : జ్యోతి ఎంతటి స్పష్టతను తను దృష్టికి కలిగించునో, ధూమము (పొగ) అంత అస్పష్టత కలిగించును. అట్లే పగలు సూర్యకాంతి యందు దర్శనము అతి స్పష్టము. కాని రాత్రియందు దర్శనము కన్నులకు మిక్కిలి అస్పష్టము. అట్లే శుక్లపక్షము ప్రజ్ఞకు ఎట్లు క్రమబద్ధమగు వికాసము కలిగించునో కృష్ణపక్షము ఉన్న వికాసమును క్రమముగ తగ్గించు చుండును. ఉత్తరాయణము ఆరు నెలలు ప్రజ్ఞకు ఊర్ధ్వగతి ఎట్లు కలిగించునో దక్షిణాయనము ప్రజ్ఞకు అవరోహణ గతిని కలిగించును. ఇరువది నాల్గవ (24) శ్లోకమున ఊర్ధ్వగతికి అనుగుణమగు సమయములు తెలుపబడినవి. ఈ శ్లోకమున ఊర్ధ్వగతి నుండి అవరోహణ క్రమమున భూమికి చేరువగు సమయములు తెలుప బడుచున్నవి. జీవులకు ఊర్ధ్వగతి వలన ఉత్తమ సంస్కారములు, ఉత్తమ జ్ఞానము, ఉత్తమ సంకల్పములు సంక్రమించును. బ్రహ్మ వేత్తలకు బ్రహ్మము చేరుటకు కూడ ఈ సమయము లనుకూలమై యున్నవి.

ముందు శ్లోకమున బ్రహ్మవేత్తల ప్రయాణము గూర్చి భగవంతుడు వివరించినాడు. ఈ శ్లోకమున యోగులను గూర్చి ప్రస్తా వించినాడు. బ్రహ్మోపాసనము గావించి, బ్రహ్మమును చేరుట ఆశయముగ బ్రహ్మవిదులు ప్రయత్నించుచు నుందురు. బ్రహ్మ మును చేరి, బ్రహ్మమున స్థిర నివాస మేర్పరచుకొనుట వారి అభిమతము. వారు బ్రహ్మ సంకల్పముగ సృష్టిలోనికి దిగివత్తురు. యోగులు అష్టాంగ యోగ విధానమున సమాధి స్థితిని చేరి సర్వ సమన్వయము చెంది, లోకహితమునకై లోకముల యందు చరించుట కుత్సహింతురు. దివ్య సంకల్పము ననుసరించి, లోక హిత మొనర్చుచు, చిరకాలము భూలోకము నందే యుందురు.

ఇట్టి వారిని చిరంజీవు లందురు. వీరు సర్వము నెరిగియు లోక హితము కొరకై దిగివచ్చుచు నుందురు. అట్టి వారికి ఈ శ్లోకమున చెప్పబడిన సమయములు అనుకూలమని భగవానుడు తెలుపు చున్నాడు. యోగులు అన్నిలోకము లందలి అంతర్యామి తత్త్వముతో ముడిపడి యుందురు గనుక, వారు ఊర్ధ్వము అధస్సు అను వ్యత్యాసములు దాటి అంతటా నిండియున్న అంతర్యామితో కూడి యుండి భగవత్ సంకల్పము నెరవేర్చుచు, సృష్టియందు శాశ్వతులై యుందురు. యోగులకు ఉన్నతము, నిమ్నము అను భావము లుండవు. వారు సమవర్తనులు, సమదర్శనులు. భగవానునికి ఇట్టివా రెక్కువ ప్రీతిపాత్రులు. “యోగీభవ అర్జునా" అని తనకు ప్రియుడగు అర్జునుని యోగిగ నుండుమని సంకేతించెను.

బ్రహ్మజ్ఞానులు భగవంతునికి ప్రియులు. యోగులు భగవంతునికి వాహికలు. కనుక ఇరువురకును అనుకూలమగు ప్రయాణ సమయములు తెలుపబడినవి. ఇందొక దానికన్న మరియొకటి గొప్పదని భావించుట అవివేకము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

30 Aug 2021

30-AUGUST-2021 MESSAGES

1) నిత్య పంచాంగము / Daily Panchangam
కృష్ణాష్టమి శుభాకాంక్షలు 
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 248 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 446🌹 
4) 🌹 వివేక చూడామణి - 123 / Viveka Chudamani - 123🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -75🌹  
6) 🌹 Osho Daily Meditations - 65🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 123🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మిత్రులందరికీ 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. కృష్ణాష్టకం 🍀*

వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం ।
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ॥

అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితం ।
రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం ॥

కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం ।
విలసత్ కుండలధరం కృష్ణం వందే జగద్గురం ॥

మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం ।
బర్హి పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుం ॥

ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభం ।
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం ॥

రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం ।
అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం ॥

గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసం ।
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుం ॥

శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం ।
శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుం ॥

కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ ।
కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ॥
🌻 🌻 🌻 🌻 🌻

శుభ సోమవారం 
30 సోమవారం, ఆగస్టు 2021
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ
ఆయనం: దక్షిణాయణ, వర్ష ఋతువు
చాంద్రమానం : శ్రావణ మాసం
తిథి: కృష్ణ అష్టమి 26:01:38 వరకు తదుపరి కృష్ణ నవమి ?
పక్షం: కృష్ణ-పక్ష
నక్షత్రం, యోగం మరియు కరణం
నక్షత్రం: కృత్తిక 06:39:42 వరకు తదుపరి రోహిణి
యోగం: వ్యాఘత 07:46:24 వరకు తదుపరి హర్షణ
 కరణం: బాలవ 12:42:47 వరకు
వర్జ్యం: 24:42:20 - 26:30:40 ?
దుర్ముహూర్తం: 12:41:30 - 13:31:28 మరియు
15:11:24 - 16:01:21
రాహు కాలం: 07:35:29 - 09:09:10
గుళిక కాలం: 13:50:12 - 15:23:53
యమ గండం: 10:42:51 - 12:16:32
అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:40
అమృత కాలం: 03:56:36 - 05:44:52 మరియు
30:07:20 - 31:55:40 ?
సూర్యోదయం, సూర్యాస్తమయం- చంద్రోదయం, చంద్రస్తమయం మరియు ఇతర వివరాలు
సూర్యోదయం: 06:01:49, సూర్యాస్తమయం: 18:31:14
వైదిక సూర్యోదయం: 06:05:23, సూర్యాస్తమయం: 18:27:40
చంద్రోదయం: 23:53:49, చంద్రాస్తమయం: 12:30:06
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: వృషభం
ఆనందాదియోగం: స్థిర యోగం - శుభాశుభ మిశ్రమ ఫలం 
06:39:42 వరకు తదుపరి వర్ధమాన యోగం - ఉత్తమ ఫలం 
పండుగలు : కృష్ణ జన్మాష్టమి, కాలాష్టమి, అష్టమి రోహిణి, 

*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -247 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚*
శ్లోకము 25
 
*🍀 24. పునరావృత్తి మార్గము 🍀*

ధూమో రాత్రి స్తథా కృష్ణ షణ్మాసా దక్షిణాయనమ్ |
తత్ర చాంద్రమసం జ్యోతి ర్యోగ ప్రాప్య వివర్తతే || 25

తాత్పర్యము : పొగ, రాత్రి, కృష్ణపక్షము, దక్షిణాయనము పునరావృత్తి మార్గములు సూచించు సంకేతములు. ఈ కాలములో మరణించిన యోగులు చంద్ర సంబంధము కలిగి మరలి వచ్చు చున్నారు.

వివరణము : జ్యోతి ఎంతటి స్పష్టతను తను దృష్టికి కలిగించునో, ధూమము (పొగ) అంత అస్పష్టత కలిగించును. అట్లే పగలు సూర్యకాంతి యందు దర్శనము అతి స్పష్టము. కాని రాత్రియందు దర్శనము కన్నులకు మిక్కిలి అస్పష్టము. అట్లే శుక్లపక్షము ప్రజ్ఞకు ఎట్లు క్రమబద్ధమగు వికాసము కలిగించునో కృష్ణపక్షము ఉన్న వికాసమును క్రమముగ తగ్గించు చుండును. ఉత్తరాయణము ఆరు నెలలు ప్రజ్ఞకు ఊర్ధ్వగతి ఎట్లు కలిగించునో దక్షిణాయనము ప్రజ్ఞకు అవరోహణ గతిని కలిగించును. ఇరువది నాల్గవ (24) శ్లోకమున ఊర్ధ్వగతికి అనుగుణమగు సమయములు తెలుపబడినవి. ఈ శ్లోకమున ఊర్ధ్వగతి నుండి అవరోహణ క్రమమున భూమికి చేరువగు సమయములు తెలుప బడుచున్నవి. జీవులకు ఊర్ధ్వగతి వలన ఉత్తమ సంస్కారములు, ఉత్తమ జ్ఞానము, ఉత్తమ సంకల్పములు సంక్రమించును. బ్రహ్మ వేత్తలకు బ్రహ్మము చేరుటకు కూడ ఈ సమయము లనుకూలమై యున్నవి. 

ముందు శ్లోకమున బ్రహ్మవేత్తల ప్రయాణము గూర్చి భగవంతుడు వివరించినాడు. ఈ శ్లోకమున యోగులను గూర్చి ప్రస్తా వించినాడు. బ్రహ్మోపాసనము గావించి, బ్రహ్మమును చేరుట ఆశయముగ బ్రహ్మవిదులు ప్రయత్నించుచు నుందురు. బ్రహ్మ మును చేరి, బ్రహ్మమున స్థిర నివాస మేర్పరచుకొనుట వారి అభిమతము. వారు బ్రహ్మ సంకల్పముగ సృష్టిలోనికి దిగివత్తురు. యోగులు అష్టాంగ యోగ విధానమున సమాధి స్థితిని చేరి సర్వ సమన్వయము చెంది, లోకహితమునకై లోకముల యందు చరించుట కుత్సహింతురు. దివ్య సంకల్పము ననుసరించి, లోక హిత మొనర్చుచు, చిరకాలము భూలోకము నందే యుందురు. 

ఇట్టి వారిని చిరంజీవు లందురు. వీరు సర్వము నెరిగియు లోక హితము కొరకై దిగివచ్చుచు నుందురు. అట్టి వారికి ఈ శ్లోకమున చెప్పబడిన సమయములు అనుకూలమని భగవానుడు తెలుపు చున్నాడు. యోగులు అన్నిలోకము లందలి అంతర్యామి తత్త్వముతో ముడిపడి యుందురు గనుక, వారు ఊర్ధ్వము అధస్సు అను వ్యత్యాసములు దాటి అంతటా నిండియున్న అంతర్యామితో కూడి యుండి భగవత్ సంకల్పము నెరవేర్చుచు, సృష్టియందు శాశ్వతులై యుందురు. యోగులకు ఉన్నతము, నిమ్నము అను భావము లుండవు. వారు సమవర్తనులు, సమదర్శనులు. భగవానునికి ఇట్టివా రెక్కువ ప్రీతిపాత్రులు. “యోగీభవ అర్జునా" అని తనకు ప్రియుడగు అర్జునుని యోగిగ నుండుమని సంకేతించెను. 

బ్రహ్మజ్ఞానులు భగవంతునికి ప్రియులు. యోగులు భగవంతునికి వాహికలు. కనుక ఇరువురకును అనుకూలమగు ప్రయాణ సమయములు తెలుపబడినవి. ఇందొక దానికన్న మరియొకటి గొప్పదని భావించుట అవివేకము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 446🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 29

*🌻. శివపార్వతుల సంవాదము - 4 🌻*

పరమాత్మ, పరబ్రహ్మ నీవే. నిర్గుణుడవగు నీవు ప్రకృతికి అతీతుడవు. నీవు వికారములు, కామనలు లేని స్వతంత్ర పరమేశ్వరుడవు (33).అయిననూ నీవు సగుణుడవై భక్తులను ఉద్ధరించుట ప్రధానలక్ష్యముగా కలిగి విహరించు చున్నావు. అనేక లీలలను ప్రదర్శించుటలో పండితుడవగు నీవు ఆత్మనిష్ఠుడవై ఉండెదవు (34). ఓ మహాదేవా! మహేశ్వరా! నిన్ను నేను పూర్తిగా ఎరుంగుదును. పెక్కు మాటలేల? నీవు సర్వజ్ఞుడవు. దయను చూపుము (35). గొప్ప అద్భుతమగు లీలను ప్రదర్శించి లోకములో కీర్తిని విస్తరిల్ల జేయుము. నాథా! ఆ కీర్తిని చక్కగా గానము చేయు జనులు శీఘ్రమే సంసారసముద్రము నుండి ఉత్తీర్ణులగుదురు (36). 

బ్రహ్మ ఇట్లు పలికెను-

పార్వతి ఇట్లు పలికి అనేక పర్యాయము తలవంచి చేతులు ఒగ్గి మహేశ్వరునకు నమస్కరించి మిన్నకుండెను (37). ఆమె ఇట్లు పలుకగా మహాత్ముడగు ఆ మహేశ్వరుడు లోకపు తీరును అనుకరించుట కొరకై అటులనే చేసెదనని తలంచి, నవ్వుతూ ఆనందించెను (38). అపుడు మిక్కిలి ఆనందించిన శంభుడు అంతర్ధానమును చెంది కాలి యొక్క విరహముచే పీడితమైన మనస్సు గలవాడై కైలాసమును చేరుకొనెను (39).

  అచటకు వెళ్లి పరమానందముతో నిండియున్న మహేశ్వరుడు ఆ వృత్తాంతమునంతనూ నంది మొదలగు వారికి చెప్పెను (40). భైరవాది గణములన్నియూ ఆ వృత్తాంతమును వని మిక్కిలి ఆనందించిన వారై మహోత్సవమును జరుపుకొనిరి (41). ఓ నారదా! ద్విజా! అచట గొప్ప మంగళము ప్రవర్తిల్లెను. అందరికీ దుఃఖము తొలగిపోయెను. రుద్రుడు కూడ మహానందమును పొందెను (42).

శ్రీ శివ మహాపురాణములో ఉరుద్రసంహితయందు పార్వతీ ఖండలో శివాశివ సంవాదమనే ఇరువది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (29). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. వివేక చూడామణి - 123 / Viveka Chudamani - 123🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 26. ఆత్మ మార్పులేనిది - 10 🍀*

407. కనిపించే ఈ విశ్వమునకు మూలము మనస్సు నందే ఉన్నది. మనస్సు ఎపుడైతే లేకుండా పోతుందో ఈ ప్రపంచము కూడా లేనట్లే. అందువలన ఈ మనస్సును బ్రహ్మములోకి కేంద్రీకరించి అందులో లీనము చేసిన ప్రపంచము మాయమవుతుంది. 

408. జ్ఞాని అయిన సాధకుడు హృదయమందు అనగా బుద్ది యందు సమాధి స్థితి ద్వారా బ్రహ్మాన్ని దర్శించినపుడు, అది ఒక విధమైన శాశ్వత జ్ఞానాన్ని బ్రహ్మానంద స్థితిలో ఏ మాత్రము పరిమితము లేని, పూర్తి స్వేచ్ఛతో ఏ కర్మలు చేయకుండా, అంతములేనిఆకాశము వలె ప్రకాశిస్తాడు. 

409. జ్ఞాని తన హృదయములో సమాధి ద్వారా బ్రహ్మాన్ని దర్శించి కారణము, ఫలితము ఆశించకుండా అన్ని ఊహలకు దూరముగా సజాతీయముగా పోటీలేని ఆధారాలతో పనిలేకుండా స్థిరపడుతుంది. ఇదంతా వేదాలలో చెప్పబడినది. అది సామాన్యులకు అహం వలె తోస్తుంది. 

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 123 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 26. Self is Unchangeable - 10 🌻*

407. This apparent universe has its root in the mind, and never persists after the mind is annihilated. Therefore dissolve the mind by concentrating it on the Supreme Self, which is thy inmost Essence.

408. The wise man realises in his heart, through Samadhi, the Infinite Brahman, which is something of the nature of eternal Knowledge and absolute Bliss, which has no exemplar, which transcends all limitations, is ever free and without activity, and which is like the limitless sky, indivisible and absolute.

409. The wise man realises in his heart, through Samadhi, the Infinite Brahman, which is devoid of the ideas of cause and effect, which is the Reality beyond all imaginations, homogeneous, matchless, beyond the range of proofs, established by the pronouncements of the Vedas, and ever familiar to us as the sense of the ego.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 75 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆలోచనలను తగ్గించుకొని సత్కర్మలను ఆచరించడం ముఖ్యం 🌻*

 ఏదైనా ఒక‌ మంచిపని మీ‌ వల్ల ఇంకొకరికి జరుగుతుందంటే దానిని చేయండి! జరగలేదంటే మనకు సంబంధించినది కాదు. 

సుఖపడ దలచుకున్నవానికి నాగరికత బానిసగా పనిచేస్తుంది. అంతేగాని, నాగరికత మాత్రమే సుఖమునివ్వజాలదు. 

నీకు సంబంధించినవి ఏమైనా పోయినచో వాటి కోసం వెను తిరిగి చూడకుండా ఉండగలగాలి! అప్పుడే బ్రహ్మవిద్యకు అర్హుడవు. 

దేని యందు ముడిపెట్టుకున్నా అది ప్రేమ కాదు. దానిని మమకారమంటారు. 

 ఎదుటి వారిలోని సద్గుణాలతో మాత్రమే మనకు సంబంధము. దుర్గుణాలతో సంబంధం పెట్టుకుంటే మన సుఖమునకు మనము అభ్యంతరాన్ని ఏర్పరచుకుంటున్నట్లు.  

ఆలోచనలను తగ్గించుకొని, సత్కర్మలను ఆచరించడం వల్ల మానసికమైన దుఃఖాలు తొలగిపోతాయి. తత్కారణంగా సత్వశుద్ధి కలుగుతుంది. 

.....✍️ *మాస్టర్ ఇ.కె.*🌹
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 64 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 64. AUTHENTICITY 🍀*

*🕉 When you want something not to grow, just keep your back to it and it dies if its own accord. Just like a plant that is neglected, not watered, it withers away and dies. So whenever you see something that is phony, just put it aside. 🕉*

If you are just about to smile, then suddenly you realize that it would be phony, stop, even in the middle of the smile; relax your lips and ask the person to excuse you. Tell them it was a phony smile, and you are sorry. If a real smile comes, then it is okay; if it doesn't, then that is also okay. What can you do? If it comes, it comes; if it doesn't come, it doesn't. One cannot force it. I'm not saying to just get out of the social formalities. I am saying be watchful, and if you have to be false, be it consciously, Knowing that this person is your boss and you have to smile, smile consciously, knowing well that it is phony. 

Let the boss be deceived- you should not be deceived by your smile, that's the point. If you smile unconsciously, the boss may not be deceived, because it is difficult to deceive bosses-but you may be deceived. You will pat yourself on the back and think you were perfectly good, such a good boy-but there you are missing. 

So if sometimes you trunk it is necessary-because it may be necessary; life is complex and you are not alone; there are many things that you have to do because the whole society exists on phoniness-then be phony consciously. But in your relationships where you can be true, don't allow phoniness.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹 
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 123 / Sri Lalita Sahasranamavali - Meaning - 123 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 123. కళాత్మికా, కళానాథా, కావ్యాలాప వినోదినీ |*
*సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా ‖ 123 ‖ 🍀*

🍀 611. కళాత్మికా -
 కళల యొక్క రూపమైనది.

🍀 612. కళానాథా - 
కళలకు అధినాథురాలు.

🍀 613. కావ్యాలాపవినోదినీ - 
కావ్యముల ఆలాపములో వినోదించునది.

🍀 614. సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా - 
వింజామరలను కలిగియున్న ఎడమవైపున, కుడివైపున (వరుసగా) లక్ష్మీదేవి చేత, సరస్వతీదేవి చేత సేవింపబడునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 123 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 123. kalātmikā kalānāthā kāvyālāpa-vinodinī |*
*sacāmara-ramā-vāṇī-savya-dakṣiṇa-sevitā || 123 || 🌻*

🌻 611 ) Kalathmika -   
She who is the soul of arts

🌻 612 ) Kala nadha -   
She who is the chief of arts

🌻 613 ) Kavya labha vimodhini -   
She who enjoys being described in epics

🌻 614 ) Sachamara rama vani savya dhakshina sevitha -   
She who is being fanned by Lakshmi the goddess of wealth and Saraswathi the goddess of knowledge

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹