శ్రీ శివ మహా పురాణము - 217

🌹 .   శ్రీ శివ మహా పురాణము - 217   🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

48. అధ్యాయము - 3

🌻. కామశాపానుగ్రహములు - 2 🌻

బ్రహ్మోవాచ |

కౌసుమాని తథాస్త్రాణి పంచాదాయ మనోభవః | ప్రచ్ఛన్నరూపీ తత్రైవ చింతయామాస నిశ్చయమ్‌ || 11
హర్షణం రోచనాఖ్యం చ మోహనం శోషణం తథా | మారణం చేతి ప్రోక్తాని మునే ర్మోహకరాణ్యపి || 12
బ్రహ్మణా మమ యత్కర్మ సముద్దిష్టం సనాతనమ్‌ | తదహైవ కరిష్యామి మునీనాం సన్నిధౌ విధేః || 13
తిష్ఠంతి మునయశ్చాత్ర స్వయం చాపి ప్రజాపతిః | ఏతేషాం సాక్షి భూతం మే భవిష్యంత్యద్య నిశ్చయమ్‌ || 14
సంధ్యాపి బ్రహ్మణా ప్రోక్తా చేదానీం ప్రేషయేద్వచః | ఇహ కర్మ పరీక్ష్యైవ ప్రయోగాన్మోహయామ్యహమ్‌ || 15

బ్రహ్మ ఇట్లు పలికెను -

మనస్సులో ఉదయించు మన్మథుడు అయిదు పుష్పబాణములను తీసుకొని, ప్రచ్ఛన్న రూపముతో అక్కడనే యుండి ఆలోచించి ఒక నిశ్చయమునకు వచ్చెను (11).

మునులకు కూడ మోహమును కలిగించు ఈ బాణములకు హర్షణము, రోజనము, మోహనము, శోషము మరియు మారణము అని పేర్లు (12).

బ్రహ్మ నాకు ఉపదేశించిన సనాతన సృష్టి కార్యమును నేను ఇచటనే ఈ మునుల సన్నిధిలో, బ్రహ్మ సన్నిధిలో ప్రయోగించెదను (13).

ఇచట మునులు ఉన్నారు. ప్రజాపతి కూడ స్వయముగ ఉన్నాడు. నా నిశ్చయమునకు వీరందరు ఈనాడు సాక్షులు కాగలరు (14).

సంధ్య కూడ ఇచట గలదు. బ్రహ్మచే నిర్దిష్టమైన పుష్పబాణ ప్రయోగరూప కర్మను పరీక్షకొరకై ఈమె యందు ఆచరించి నేను ఈమెను మోహింపజేయగలను (15).

ఇతి సంచింత్య మనసా నిశ్చిత్య చ మనోభవః | పుష్పజం పుష్పజాతస్య యోజయామాస మార్గణౖః || 16
ఆలీఢ స్థానమాసాద్య ధనురాకృష్య యత్నతః | చకార వలయాకారం కామో దన్వివరస్తదా || 17
సంహితే తేన కోదండే మారుతాశ్చ సుగంధయః | వవుస్తత్ర మునిశ్రేష్ఠ సమ్యగాహ్లాద కారిణః || 18
తతస్తానపి ధా త్రా దీన్‌ సర్వానేవ చ మానసాన్‌ | పృథక్‌ పుష్పశ##రైస్తీక్ణై ర్మోహయామాస మోహనః || 19
తతస్తే మునయస్సర్వే మోహితాశ్చాప్యహం మునే | సంహితో మనసా కంచిద్వికారం ప్రాపురాదితః || 20

మన్మథుడు మనసులో నిట్లు నిశ్చయించుకొని పుష్పధనస్సుపై పుష్ప బాణములను ఎక్కు పెట్టెను (16).

అపుడు ధనుర్ధారులలో శ్రేష్ఠుడగు కాముడు కుడికాలును ముందుకు వంచి, ఎడమ కాలును వెనుకకు పెట్టి, ధనస్సును బలముగా లాగి గుండ్రముగా చేసెను. (17).

ఆతడు ధనస్సును ఎక్కు పెట్టగానే పరిమళ భరితములు అగు వాయువులు అచట వీచినవి. ఓ మహర్షీ! ఆ వాయువులు గొప్ప ఆహ్లాదమును కలిగించినవి (18).

మోహింప జేయు ఆ మన్మథుడు తీక్ణములగు పుష్పబాణములతో బ్రహ్మను, ఆతని మానస పుత్రులనందరినీ మోహింపజేసెను (19).

ఓ మునీ! అపుడు నేను మరియు ఆ మునులందరు మోహితులమైతిమి. మొట్టమొదటిసారిగా బ్రహ్మాదులు మనస్సులో ఒక విలక్షణమైన వికారమును పొందిరి (20).

సంధ్యాం సర్వే నిరీక్షంతస్సవికారం ముహుర్ముహుః | ఆసన్‌ ప్రవృద్ధమదనాః స్త్రీ యస్మాన్మదనైధినీ || 21
తతస్సర్వాన్‌ స మదనో మోహయిత్వా పునః పునః | యథేంద్రియవికారంతే ప్రాపుస్తానకరోత్తథా || 22
ఉదీరితేంద్రియో ధాతా వీక్ష్యాహం స యదా చ తామ్‌ | తదైవ చోన పంచాశద్భావా జాతాశ్శరీరతః || 23
సాపి తైర్వీక్ష్య మాణాథ కందర్పశరపాతనాత్‌ | చక్రే ముహుర్ముహుర్భావాన్‌ కటాక్షావరణాదికాన్‌ || 24

వారందరు సంధ్యను మరల మరల వికారములతో చూచిరి. వారి మన్మథ వికారములు వృద్ధిపొందెను. స్త్రీ కామవికారమును వృద్ధి జేయును గదా! (21).

ఇట్లు ఆ మన్మథుడు వారినందరిని మరల మరల మోహింపజేసి, వారు ఇంద్రియ వికారమును పొందునట్లు చేసెను (22).

బ్రహ్మనగు నేను ఆమెను వృద్ధిపొందిన ఇంద్రియ వికారముతో చూచుచున్న సమయములో శరీరము నుండి నలభై తొమ్మిది పదార్థములు పుట్టినవి (23).

వారు ఇట్లు చూచుచుండగా, ఆమెపై కూడ మన్మథ బాణముల ప్రభావము పడెను. ఆమెయు క్రీగంటితో చూచుట, సంజ్ఞలతో ఆహ్వానించుట మొదలగు శృంగార వికారములను అధికముగా చేయజొచ్చెను (24).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము

07.Sep.2020

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 104

🌹.   భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 104   🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. పిప్పలాద మహర్షి - 6 🌻

33. సౌర్యాయణి అనే ఋషి పిప్పలాదుని, “డెవా! శరీరంలో నిద్రించేది ఏది? మేల్కొనేది ఏది? సుఖమంటే ఏమిటి?” అనీ అడిగాడు.

దానికి పిప్పలాదుడు, “ఇంద్రియములన్నీకూడా మనసులో లయం చెందటమే నిద్ర. ఇంద్రియాలు మనసులో లయిస్తాయి. జ్ఞానేంద్రియ పంచకము – అంటే కన్ను, చర్మము వంటి కర్మేంద్రియపంచకము వెనుక సూక్ష్మరూపంలో ఉండే జ్ఞానేంద్రియ పంచకము – మనసులో లయిస్తే దానిని నిద్ర అంటాము” అని చెప్పాడు.

34. “ఈ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ పంచకము, అంతఃకరణ చతుష్టయాన్ని నడిపించటానికి కావలసిన ప్రాణశక్తిని మనలోంచి ఉద్భవంచేసి నడిపించేశక్తి ఆ పరమాత్మయందు ఉంది. కాని దానియందు ఈ ఇంద్రియములుకాని, ఈ ధాతువులుకాని ఏవీ ఉండవు. వాటికన్నిటికీ కావల్సిన శక్తిమాత్రమే అందులో ఉంటుందికాని దానిలో వస్తువులేవీ ఉండవు” అని తెలిపాడు.

35. ఓంకారోపాసన గురించి తెలియచేయమని మరొక ఋషి అడిగాడు.

దానికి పిప్పలాదుడు, “ఓంకారం ఏ కొద్దికాలం ఉపాసించినవారైనాసరే ఋగ్వేదాభిమాని అయినటువంటి దేవతలవల్ల మళ్ళీ మనుష్యులై పుడతారు. అయితే అధికంగా ఉపాసన చేసినవాళ్ళు యజుర్వేదాభిమాని అయినటువంటి చంద్రుడివల్ల చంద్రమండలానికి వెళ్ళి తిరిగివస్తారు.

36. త్రిమాత్ర అంటె ఇంకా ఎక్కువ ఉపాసించినవాళ్ళు, పాప విముక్తులై, సామవేదాభిమాని దేవతచే సూర్యమండలమార్గంలో బ్రహ్మలోకానికి వెళతారు. ఋక్‌యజుస్‌సామవేదాలకు ఉత్కృష్టస్థితి ఈ క్రమంలో ఉంటుంది” అని చెప్పాడు.

37. “షోడశ కళాపురుషులు అంటే ఎవరు?” అని మరొక ఋషి అడిగారు. “అతడు శరీరంలో ఉన్నాడు. కాబ్ట్టి దేహం స్వస్థంగా ఉండటానికి ఆధారమైన ఐదు విధముల ప్రాణశక్తి, ఆ ప్రణానికి తోడుగా శ్రద్ధ, ఐదు ఇంద్రియాలు, పృథ్వి మొదలైన పంచభూతములు – ఇవే పురుషులు. మనసు, అన్నము, వీర్యము సమస్తమూ పుడుతూ నిత్యమూ జీవనక్రియ నడుస్తూ ఉందికదా!

38. ఈ క్రియలన్నిటినీ షోడశకళలంటారు. నదులన్నీ సముద్రంలో ప్రవేశించినట్లు, అవన్నీ సర్వసాక్షి అయిన పురుషుడిలోపల ప్రవేశించి అస్తమిస్తాయి. దానినే మృత్యువంటారు. అవి శాశ్వతంగా అస్తమిస్తే అతడు అమృతుడవుతాడు. ఆ పురుషునిలోకి వెళ్ళి నిద్రించినపుడే మృత్యువు, మళ్ళీ బయటకు వచ్చినప్పుడు పునర్జన్మ ఉంటుంది. మళ్ళీ రాకుండా వెళితే మాత్రం అది మృత్యువుకాదు, అమృతత్త్వం” అని చెప్పాడు పిప్పలాదుడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

07.Sep.2020

శ్రీ విష్ణు సహస్ర నామములు - 𝟼̷ / 𝚂̷𝚛̷𝚒̷ 𝚅̷𝚒̷𝚜̷𝚑̷𝚗̷𝚞̷ 𝚂̷𝚊̷𝚑̷𝚊̷𝚜̷𝚛̷𝚊̷ 𝙽̷𝚊̷𝚖̷𝚊̷𝚟̷𝚊̷𝚕̷𝚒̷ - 𝟼̷

🌹.   శ్రీ విష్ణు సహస్ర నామములు - 6 / Sri Vishnu Sahasra Namavali - 6   🌹
నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻

అప్రమేయో హృషీకేశః పద్మనాభోఽమరప్రభుః |
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధ్రువః ‖ 6 ‖

46) అప్రమేయ: -
ఏ విధమైన ప్రమాణములకు అందనివాడు.

47) హృషీకేశ: -
ఇంద్రియములకు ప్రభువు.

48) పద్మనాభ: -
నాభియందు పద్మము గలవాడు.

49) అమరప్రభు: -
దేవతలకు ప్రభువైనవాడు.

50) విశ్వకర్మా -
విశ్వరచన చేయగల్గినవాడు.

51) మను: -
మననము(ఆలోచన) చేయువాడు.

52) త్వష్టా -
ప్రళయకాలమున సమస్త భూతములను కృశింపజేసి నశింపజేయువాడు.

53) స్థవిష్ఠ: -
అతిశయ స్థూలమైన వాడు.

54) స్థవిరోధ్రువ: -
సనాతనుడు, శాశ్వతుడైనవాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹   Vishnu Sahasra Namavali - 6   🌹
Name - Meaning

📚 Prasad Bharadwaj

🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻

aprameyō hṛṣīkeśaḥ padmanābhōmaraprabhuḥ |
viśvakarmā manusvtaṣṭā sthaviṣṭhassthavirō dhruvaḥ || 6 ||

46) Aprameya –
The Lord Who is Beyond Rules, Regulations and Definitions

47) Hrishikesha –
The Lord of Senses

48) Padmanabha –
The Lord Who has a Lotus (From Which the World Evolved) Growing on his Belly

49) Amara Prabhu –
The Lord of Immortals

50) Vishwa-Karma –
The Creator of the Universe

51) Manu –
The Lord Who Thinks (Worries) of Everything

52) Twashta –
The Lord Who Makes Huge Things Small

53) Sthavishtha –
The Supremely Gross

54) Sthaviro-Dhruva –
The Lord Who is Ancient and Permanent

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు
#VishnuSahasranam

07.Sep.2020

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 5͙ / V͙i͙s͙h͙n͙u͙ S͙a͙h͙a͙s͙r͙a͙n͙a͙m͙a͙ C͙o͙n͙t͙e͙m͙p͙l͙a͙t͙i͙o͙n͙ - 5͙

🌹.  విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 5 / Vishnu Sahasranama Contemplation - 5  🌹

📚. ప్రసాద్ భరద్వాజ

5. భూతకృత్, भूतकृत्, Bhūtakr̥t

ఓం భూతకృతే నమః | ॐ भूतकृते नमः | OM Bhūtakr̥te namaḥ

భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 'అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయస్తథా' (7.6) అని తెలిపియున్నాడు. 'నేను సమస్తమైన ప్రపంచముయొక్క ఉత్పత్తికి కారణభూతుడను. ఆ ప్రకారమే నాశమునకు (ప్రళయమునకు) కారణభూతుడను అయియున్నాను.'

సర్వ భూతాని కౌన్తేయ ప్రకృతిం యాన్తి మామికామ్ ।
కల్పక్షయే పునస్తాన్తి కల్పదౌ విసృజామ్యహమ్ ॥ (9.7)

రాజవిద్యా రాజగుహ్యయోగాధ్యాయములో అ పరమాత్మ 'సమస్త ప్రాణికోట్లు ప్రళయకాలమున నా ప్రకృతిని (మాయను) జేరి అందు అణగియుండును. తిరిగి సృష్టికాలమున వానిని నేను సృజించుచుందును' అని అర్జునునకు తెలిపినదానిలో కూడా 'భూతకృత్‌' నామార్థాన్ని చూడవచ్చును. ఈ రెండు శ్లోకాలు సృష్టి-ప్రళయ సమయాలలో ఆయనచేసే సృష్టి, లయలను గురించి తెలుపుతున్నాయి. శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్రంలోని ఈ ఐదవ నామానికి అర్థం, సాధారణ పరిస్థితులలో జరిగే జనన, మరణాలకు కూడా అనువయించుకొనవచ్చును.

‘భూతాని కరోతి ఇతి’ అని వ్యుత్పత్త్యర్థము. రజోగుణమును ఆశ్రయముగా తీసుకొని చతుర్ముఖ బ్రహ్మ రూపముతో ఆయాప్రాణులను సృష్టించుచున్నాడు. ‘భూతాని కృంతతి ఇతి భూతకృత్’ - భూతములను ఛేదించును; ‘భూతాని కృణోతి’ - భూతములను హింసించును; తమోగుణమును ఆశ్రయించి భూతములను ఛేదించును - లేదా హింసించును.

[ఇందు వరుసగా - (డు) కృఞ్ - కరణే (చేయుట అను అర్థమునందు) తనాదిగణః; కృతీ - ఛేదనే (ఛేదించుట అను అర్థము) - తుదాదిః; కృఞ్ - హింసాయామ్‌; (హింసించుట) తనాదిః; అను ధాతువులతో 'భూత' అను ఉపపదము సమాసము నందినది.]

In the Gitā, the Lord enlightens Arjuna ‘Ahaṃ kr̥tsnasya jagataḥ prabhavaḥ pralayastathā’ (7.6) - I am the origin as also the end; termination of the whole Universe.

In the subsequent chapters, we come across another stanza in which we can search for the meaning of the name 'Bhūtakr̥t.'

Sarva bhūtāni kauntēya prakr̥tiṃ yānti māmikām,
kalpakṣaye punastānti kalpadau visr̥jāmyaham. (9.7)

'O son of Kuntī, all the beings go back at the end of a cycle to My Prakr̥ti. I project them forth again at the beginning of a cycle.'

The context above is that of the cycles of creation and dissolution. However, the birth and death cycles that a Jīva goes through can also be looked at - as governed by Him.

The creator and destroyer of all existences in the universe. Assuming Rajoguṇa, He as Brahmā, is the generator of all objects. Kr̥t can also be interpreted as Kr̥ntana or dissolution. The name can therefore also mean one who, as Rudra, destroys the worlds, assuming the Guṇa of Tamas.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka :

विश्वं विष्णुर्वषट्कारो भूतभव्यभवत्प्रभुः ।

भूतकृद्भूतभृद्भावो भूतात्मा भूतभावनः ॥ 1 ॥

విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః ।

భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః ॥ 1 ॥

Viśvaṃ viṣṇurvaṣaṭkāro bhūtabhavyabhavatprabhuḥ ।

Bhūtakr̥dbhūtabhr̥dbhāvo bhūtātmā bhūtabhāvanaḥ ॥ 1 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు # #VishnuSahasranam

07.Sep.2020

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 47

🌹.   కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 47   🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి - 11 🌻

శాశ్వతమైనటువంటి ఆత్మ దృష్ట్యా చూచినప్పుడు ఇవన్నీ కూడా అశాశ్వతములైనటువంటివి.

వీటి యెడల నీ అంతరంగాన్నీ పూనడం అంటే నీ అంతరంగాన్ని పనిచేయించడం సరియైనటువంటి పద్ధతి కాదు, అది జీవ పద్ధతి, ఆత్మభావ పద్ధతి కాదు. కావున ప్రయత్నించి ఇటువంటి పద్ధతిని విడనాడాలి. అందుచేత కర్మఫలాపేక్షను వదలి కర్తవ్య కర్మలను నాచికేతాగ్ని చయన మొనరించి సాపేక్షిక నిత్యత్వం గల యమాధికారమును పొందితిని.

ఆయన అష్టదిక్పాలకులలో ఒకరిగా యమధర్మరాజు గా ఆయనకి ఆ స్థానం ఎలా లభించిందో ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన వీటన్నింటినీ విసర్జించాడు. వీటన్నిటియందు వైరాగ్యమును కలిగివున్నాడు. ఇంకేం చేశాడు. కేవలం కర్తవ్య నిష్ట మాత్రమే కలిగివున్నాడు.

ఆ కర్తవ్య నిష్ట చేత ఎవరి ప్రాణములను ఎప్పుడు హరించవలసి వచ్చినా ఆఖరికి అవతార పురుషులైనా, శ్రీరామచంద్రుడైనా, శ్రీకృష్ణమూర్తి అయినా సరే కాలమాసన్నమైనపుడు వినయముగా అవతార పురుషునివద్దకు వెళ్ళి “అయ్యా! మీ సమయం పూర్తయింది. మీరిక అవతారాన్ని చాలించండి“ అని చెప్పేటటువంటి సమవర్తి యమధర్మరాజు.

కాబట్టి నిర్భయత్వముతో, నిర్భీతితో నిరంతరాయముగా తాను సహజముగా సాక్షిగా నిలబడి కర్తవ్య కర్మను మాత్రమే ఆచరించేటటువంటి వ్యక్తి.

ఇంకేమిటటా - మిగిలిన అంశాలనన్నింటినీ నాచికేతాగ్ని సంచయనము వాటియందు – ‘సంచయనము’ అంటే బాగా గుర్తుపెట్టుకోండి నిశ్శేషముగా లేకుండా చేయుట.

ఇది సంచయనము అంటే అర్ధం. ఇన్ని అకర్మలను ఆచరించినా కూడా ఎంతో కొంత శేషభాగం మిగిలిపోతుంది. ఆ శేషభాగాన్ని మొత్తాన్ని పట్టుకెళ్ళి నాచికేతాగ్ని అనే యజ్ఞంలో పూర్ణాహుతిగా నిశ్శేషముగా దగ్ధము చేయుట. సంచయనము అంటే నిశ్శేషముగా పోగొట్టుకొనుట.

అటువంటి సంచయనము ఒనర్చడం చేతనే ఆయన సాపేక్షిక నిత్యత్వము గల యమాధికారమును పొందాడు. అంటే స్వయముగా ఈశ్వరుడేమో నిత్యుడు. ఈశ్వరునితో సమానమైనటువంటి నిత్యత్వం. సాపేక్షిక నిత్యత్వం అంటే అర్ధం అది.

ఈశ్వరుడితో సమానమైనటువంటి నిత్యత్వాన్ని పొందినటువంటి యమధర్మరాజు తనకి ఆ స్థితి అట్లా కలిగింది. ఆ ఈశ్వరనియమంతో ఈశ్వరునితో సమముగా వ్యవహరించగలిగేటటువంటి స్థితి ఎట్లా కలిగిందో ఈ అంశములందు బోధించేటటువంటి ప్రయత్నాన్ని మనకి చేశారు.

ముఖ్యమైన అంశం ఏమిటంటే కామ్య కర్మలను ఫలాపేక్షతో చేసేటటువంటి వాడు మోక్షం పొందజాలరు. తీవ్ర మోక్షేచ్ఛ అనేది వీళ్ళకు కలగదు. అతి ముఖ్యమైన అంశం. ఫలాపేక్షలేకుండా కర్మలని ఆచరించడంచేత, అంటే నిష్కామ కర్మ చేత చిత్తశుద్ధి కలుగుతుంది.

జ్ఞాన సముపార్జన ద్వారా మోక్షం కలుగుతుంది. ఈ రెండూ చాలా ముఖ్యం. నిష్కామ కర్మ ద్వారా చిత్తశుద్ధి, ఆత్మ విచారణ ద్వారా ఆత్మసాక్షాత్కార జ్ఞానం, జ్ఞాన సముపార్జన ద్వారా మోక్షం అనేవి చాలా ముఖ్యం.

ఈ రెండు జీవిత లక్ష్యాలనే స్వీకరించి కామ్యక కర్మలను సదా త్యజించవలెను. త్యజించవలెను అంటే ఫల అపేక్షను త్యజించవలెను. ఫల ఆసక్తిని త్యజించవలెను. ఫల ప్రేరణ ద్వారా నువ్వు చేయరాదు. ఈ రకమైనటువంటి కర్తవ్య నిష్ట కలిగివుండాలి.

తదుపరి చిత్తశుద్ధి ద్వారా నీవు ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించాలి. తద్వారా జీవన్ముక్తిని నీవు పొందగలవాడవు. ఈ రకముగా నీవు తెలుసుకొనవలసినది అని యమధర్మరాజు నచికేతునికి బోధించుచున్నాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

07.Sep.2020

24. గీతోపనిషత్తు - మనీషి - నిర్మలమైన బుద్ధి ఏర్పడవలె నన్నచో సతతము లోపల, వెలుపల ఆత్మానుసంధానము చేసుకొను చుండవలెను. దీనిని దైవయోగము అందురు.

🌹  24. గీతోపనిషత్తు - మనీషి - నిర్మలమైన బుద్ధి ఏర్పడవలె నన్నచో సతతము లోపల, వెలుపల ఆత్మానుసంధానము చేసుకొను చుండవలెను. దీనిని దైవయోగము అందురు.  🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 51, 52, 53 📚

బుద్ధితో యోగించి, ఫలములను త్యజించి, కర్తవ్యమును నిర్వర్తించు యోగికి నిస్సంగము ఏర్పడగలదు. అతనికి కర్తవ్యము యుండును గాని, వ్యక్తిగతమగు ఆశయములు, గమ్యములు వుండవు.

కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః |
జన్మబంధవినిర్ముక్తాః పదం గచ్ఛంత్యనామయమ్ || 51 ||

యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి |
తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ || 52 ||

శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా |
సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి || 53 ||

అనగా తాను, తన కర్తవ్యము మాత్రమే యుండును. మరణించ కూడదని యుండదు. పుట్టకూడదని కూడ యుండదు. మరణించకూడదని, పుట్టకూడదని, పుణ్య కర్మలను ఆచరించు వారు కళాసక్తితో ఆచరించు వారే తప్ప వారికి పుట్టని, చావని స్థితి కలుగనేరదు. శ్రీకృష్ణు తెలిపిన యోగజీవులు ఎట్టి సిద్ధుల కొరకును ప్రయత్నింపరు.

అమరత్వము కొరకు, బ్రహ్మత్వము కొరకు ప్రయత్నముండదు. ఉండుటయే యుండును. కర్తవ్యముండును. వారికి నిస్సంగము పరిపూర్తి యగుటచే కోరకయే సమస్తమును లభించగలదు.

వారి చేతలయందు కళాసక్తి లేదు

గనుక బంధము నుండి విడువబడిన వారలై యుందురు. బంధము లేక యుండుటయే పరమ పథంము. అట్టి వారు శరీరము నందు కూడ యుందురు. శరీరము వారిని బంధింపదు. ఎటు చూచినను ఫలమునందు ఆసక్తిలేని కర్తవ్య కర్మమే శ్రేయోదాయకమని భగవంతుడు బోధించుచున్నాడు.

బుద్ధి, మోహమును, మాయను, అజ్ఞానమును విసర్జించి, తాను అను వెలుగుగా నున్నప్పుడు నిర్మలమైన బుద్ధి అని తెలియ బడుచున్నది. నిర్మలమైన బుద్ధి ఏర్పడవలె నన్నచో సతతము లోపల, వెలుపల ఆత్మానుసంధానము చేసుకొను చుండవలెను. దీనిని దైవయోగము అందురు.

అనగా బుద్ధిని దైవముతో జత పరచుట. ఇది నిరంతరము సాగినప్పుడు బుద్ధి నిర్మలమగును. అట్టి బుద్ధితోనే నిష్కామముగ కర్మల నాచరించిన జనన మరణ రూప బంధమునుండి కూడ జీవుడు విడుదలను పొందును అని భగవానుడు చెప్పియున్నాడు.

అట్టి బుద్ధియే ధర్మముతో కూడిన కర్తవ్యములను సతతము నిర్వర్తించగలదు. అట్టి నిర్వర్తనమే కర్మలయందు కౌశలము అని తెలిపి యున్నాడు.

బుద్ధి, ఆత్మయందు యోగించగ, అట్టి బుద్ధితో యోగించిన మనస్సు కర్మలను క్షేమముగను, కౌశలముగను నిర్వర్తించ గలదని అర్థము. యోగము చెందని మనస్సు కౌశలముగ కర్మలను నిర్వర్తించుట జరుగదు.

అట్టి మనస్సే కౌశలము పేరున కుటిలత్వము ననుసరించును. కావున బుద్ధిని సదా ఆత్మతో అనుసంధానము చేయవలెను. అట్టి బుద్ధి క్రమశః నిర్మలమగును. చీకిటిని దాటిన బుద్ధిగా వెలుగొందును. అనగా మాయా వర్ణమును దాటి యుండును. అట్లు దాటి యుండుటకు కారణము ఆత్మానుసంధానమే.

అట్టి బుద్ధి కర్మలను సహజముగనే నిర్లిప్తముగను, బంధములు కలిగించని విధముగను, నిర్వర్తించుచుండును. ఏది వినినను, ఏది చూచినను వికారము చెందదు. చలనము లేని ఇట్టి బుద్ధిని పొందుట కర్తవ్యమని భగవానుడు బోధించుచున్నాడు.

🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

07.Sep.2020

అద్భుత సృష్టి - 24

🌹.   అద్భుత సృష్టి - 24   🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌟 8. మానవ దేహం - ఆధ్యాత్మిక కనెక్షన్స్🌟
(అనుసంధానం)

💠. మానవ దేహం రెండు కనెక్షన్స్ ని (అనుసంధానాలను) కలిగి ఉంటుంది.

1. ఇంటర్నల్ కనెక్షన్,

2. ఎక్స్ టర్నల్ కనెక్షన్

🔹 1. ఇంటర్నల్ కనెక్షన్ (Internal connection) శరీరంలో ఉన్న శక్తి క్షేత్రాలు అయిన ఏడు చక్రాల కుండలినీ వ్యవస్థ. వీటిని భౌతిక శక్తి క్షేత్రాలు అంటారు.

🔹 2. ఎక్స్ టర్నల్ కనెక్షన్స్ -విశ్వశక్తి క్షేత్రాలు (External connection) "ఆరా" లో ఉన్న యూనివర్సల్ ఐదు చక్రాల వ్యవస్థ.

భౌతిక శక్తి క్షేత్రాలు 7, విశ్వ శక్తి క్షేత్రాలు5, భౌతికదేహంలోని అణు పరమాణుస్థితిలో ఉన్న న్యూక్లియస్ ఎనర్జీలో DNA లో ఉన్న కోడాన్స్ తో కనెక్ట్ అయి ఉంటాయి.

💫. ఆత్మ యొక్క భౌతిక, విశ్వ సమాచారం అంతా (LEFs) "లైట్ ఎన్ కోడెడ్ ఫిలమెంట్స్" లో డేటాలో స్టోర్ చేయబడి ఉంటాయి.

ఈ కోడాన్స్ లోనూ, LEFsలోనూ సమస్తానికి సంబంధించిన సమస్త సమాచారం దాగి ఉంది. (LEFs+Codons =DNA)ని కలిపి "జెనటిక్ హార్డ్ డ్రైవ్(Genetic hard drive)" అని పిలుస్తారు.

ప్రతి DNA Strandsలో 12 పొరలు ఉంటాయి. అలాగే 12 కోణాలు ఉంటాయి.

DNA Strandsలో ఉన్న 12 పొరలు లేదా 12 ప్రోగులు 3వ పరిధికి సంబంధించిన భౌతిక చక్రాలతోనూ 5వ పరిధికి సంబంధించిన సోలార్ చక్రాస్ తోనూ కనెక్ట్ అయి ఉంటాయి. ఈ రెండు చక్రా వ్యవస్థల ద్వారా మూలం యొక్క శక్తిని మన దేహంలో అనుసంధానించుకుని భౌతిక అసెన్షన్ ద్వారా 12 ఉన్నత సంభావ్యతలలోకి నేరుగా చేరుకొని మూలంలో (భగవంతునిలో) ఎదుగుతాము.

🌟. చక్రాస్ ద్వారా DNA లోకి సమాచారం ఎక్కడి నుండి వస్తుంది?

చక్రా సిస్టమ్ ద్వారా DNAలోకి సమాచారం రెండు ప్రధానమైన మూలాల నుండి వస్తుంది.

1. వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుండి

2. ఉన్నత లోకాల సమాచారం ఉన్నత ఆత్మల నుండి

💠 1.వంశపారంపర్యంగా

🔹. 1.ఈ భౌతిక దేహం ఏ తల్లిదండ్రుల నుండి ప్రాప్తించినదో వారి యొక్క (bloodline) వంశం నుండి మనకు మన మొదటి కణాలు అయిన ప్రైమోర్డియల్ సెల్ (అండం- శుక్రకణాల కలయిక ద్వారా పిండం, జైగోట్ ఏర్పడడం) ద్వారా వంశం యొక్క సమస్త జ్ఞానం DNA లోని సమాచారంగా ఇవ్వబడ్డాయి. ఈ సమాచారం మన గత జన్మలలో చేసిన కర్మలు, మన యొక్క పూర్వీకుల కర్మల నుండి భావాలు, భావావేశాలు, మనస్థితులు, భయాలు, బంధాలు, మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, మూర్ఖత్వం, శక్తి, జ్ఞానం మొదలైనవి ఎన్నో ప్రైమోర్డియల్ సెల్ ద్వారా తెచ్చుకున్నాం, ద్వంద్వత్వ జీవితాన్ని నేర్చుకోవటం కొరకు.

🔹. 2.2000సంవత్సరాల నుండి ఉన్నత తలవాసులు యొక్క సమాచారం, మద్దతు మనకి నాన్ ఫిజికల్ జీవుల నుండి అందుతుంది. నాన్ ఫిజికల్ జీవులనే మనం "కర్మదేవతలు" గా పిలుస్తాం. వీరిలో 42 శాశ్వత సభ్యులు, 150 కన్సల్టింగ్ సభ్యులు ఉంటారు. మనం ఎన్నో లోకాలలో జీవించిన జీవితాల సారమైన జ్ఞానం, ఉన్నత సమాచార రూపంలో మన చక్రాల ద్వారా DNA కి అందజేస్తున్నారు. ఇది అంతా కూడా ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ (విద్యుత్ అయస్కాంత క్షేత్రం) ద్వారా జరుగుతుంది.

ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా ప్రకంపిస్తున్న శక్తి తరంగాలు చక్రా వ్యవస్థకు మన రెండవ దేహమైన ప్రాణమయ శరీరం ద్వారా అందించబడతాయి. ఈ దేహం తాను స్వీకరించిన శక్తిని పరమాణుస్థితిలో ఉన్న న్యూక్లియస్ ఎనర్జీ లోని DNA కి అందచేయబడుతుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి

07.Sep.2020

జ్ఞానులు మహా భక్తులు ఉత్తములకే కష్టాలు ఎందుకు వస్తాయి.?

జ్ఞానులు మహా భక్తులు ఉత్తములకే కష్టాలు ఎందుకు వస్తాయి.?

✍️. డా. పీ. ఎల్. ఎన్.ప్రసాద్
📚. ప్రసాద్ భరద్వాజ

మానవుడికి అతడి మొత్తం జన్మ ల రూపం సంచిత కర్మ.అందు లో ఒక జన్మ కి కేటాయించిన కర్మ ప్రారబ్ధ కర్మ. మనకు సందేహం వస్తుంది మనకి ఇంకా ఎన్ని జన్మలున్నాయి ..అని..గతం లోని కర్మ ల కారణం గా , ఆ కర్మలన్నీ తీరి పోవడానికి మరొక 100 జన్మలు అవసరం అవుతాయని అనుకుందాము.అతడి కర్మలను బట్టి .ఈ రాబోయే జన్మల సంఖ్య ఒక్కో మానవుడికి ఒక్కో విధంగా ఉంటుంది..రాబోయే జన్మ ల సంఖ్య లెక్క ఇప్పటి వరకు నిర్ధారించబడింది..ఆంటే. ఇప్పటి వరకు ఉన్న రుణాలు కొన్ని నిర్ధారితం జన్మలలో తీరుతాయి అని అర్ధం...ఆంటే  
అది Bank loan Installment భాషలో ఇన్నిEMI లు
ఉన్నాయి అని అర్ధం. ఇక నుండి మనం కొత్త కర్మలు లేదా కొత్త రుణాలు చేయకపోతే.!

వ్యాధులు బాధలు కష్టాలు. శత్రుత్వాలు అప్పులు అన్నీ కర్మ ఋణాలే. ఇవన్నీ సహజంగా కాలగతి లో సమయాన్ని అనుసరించి వచ్చి , తీరిపోతాయి. వీటిని భరించలేక మనం చేసే ప్రయత్నాల వలన కర్మలు అనుభవించవలసిన కాలం పెరిగి , ఆంటే మన జన్మ ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది..ఆంటే EMI లు పెరుగుతాయి.

భగవంతుడిని కానీ మరో దేవతలని కానీ ప్రత్యేకించి ప్రార్ధించి కొన్ని వ్యాధులు కొన్ని కర్మలని సమయం కన్నా ముందే పోగొట్టుకోవలనే తీవ్ర ప్రయత్నం వలన , ఆ కర్మలు ప్రస్తుత జన్మ లో అదృశ్యం అయి , తిరిగి వచ్చే జన్మ లో. నిర్ధారత సమయం వరకు వేధిస్తాయి..

ఈ కారణంగా నే జ్ఞానులు. యోగులు. ఉత్తములు. కర్మలను త్వరగా అనుభవించేయాలని చూస్తారు..ఇంక ఎన్నాళ్ళు మరో జన్మ ? "ఇంక జన్మ వద్దు మోక్షం కావాలి " అనుకునే వారికి ఒక చిత్రం జరుగుతుంది..

ఈ ఉత్తములు తమ కోరిక కి అనుగుణం గా , వారు మోక్షానికి వెళ్లి పోవడానికి , వారికి రాబోయే జన్మలన్నింటి కర్మలని ఇప్పుడే ఆనుగ్రహిస్తారు..లేదా రాబోయే జన్మల సంఖ్య తగ్గుతుంది..ఆంటే Bank భాషలో మీ కోరిక ప్రకారం మీ EMI లు తగ్గాయి..అప్పుడు జరిగే పరిణామం ఏమిటి ?

విపరీతం. గా వ్యాధులు అవమానాలు తిరస్కారాలు అప్పులు, ఇంత బయట దుర్భర స్థితి ఏర్పడుతుంది. మీరు గమనించండి..ప్రపంచం లో మహాత్ములందరికీ ఇదే స్థితి.. త్వరగా మోక్షం ఇప్పించు ప్రభు..అని వేడుకున్నారు.. వీరు భగవంతుడిని నిరంతరం భగవంతుడిని మనస్సులో నిలిపుకుని. ఆ వేదనలు అనుభవించారు. సక్కుబాయి తుకారామ్ ,మీరా. ఏసక్రీస్తు ఎవరైనా ఇలాగే కర్మలు త్వరగా అనుభవించారు..మీరు. "ఈ కష్టాలు బాధలు అనుభవించడం మా వల్ల కాదు " అన్నారో. మీ జన్మల EMI లు పెరిగిపోతాయి. మహాత్ములు భక్తులు యోగులు ఎక్కువగా కష్టాలు పడ టా నికి కారణం ఇదే..
🌹 🌹 🌹 🌹 🌹

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 37

🌹.   భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 37  🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని ఐదవ పాత్ర - పరిణామము - 4 🌻

142 . ఆత్మకు తాదాప్యము నొందుటకు రూపము కావలెను. అంతవరకు ఆత్మ యొక్క చైతన్యము, సంస్కారములయందే కేంద్రీకృతమై యుండును.

ఇప్పుడు ఆత్మ కొంతకాలముపాటు రూపం లేకుండి, తనకు రూపం లేనట్టుకూడా అనుభవమును పొందుచున్నది.

143. ఆత్మయొక్క చైతన్యము, రూపములో సహచరించి యున్నప్పుడు (తాను అనంతము, శాశ్వతము, నిరాకరము అయివుండి, పరమాత్మతో శాశ్వతంగా యున్నాననెడి సత్యమును పూర్తిగా మరచిపోయి) ఎఱుకతో ఆ రూపముతోగల తాదాత్మ్యతను పోషించుచూ నిజముగా ఆ రూపముతానేనని కనుగొనును.

144. రూపము పోయిన తరువాత, పోయిన రూపము యొక్క అవశేషములైన సంస్కారములు, తరువాతవచ్చు రూపముతో రద్దగు చుండును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

07.Sep.2020

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 45 / Sɾι Gαʝαɳαɳ Mαԋαɾαʝ Lιϝҽ Hιʂƚσɾყ - 45

🌹.   శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 45 / Sri Gajanan Maharaj Life History - 45   🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 9వ అధ్యాయము - 4 🌻

బాలాపూరుదే మరోకధ వినండి: బాలాపూరువాసి అయిన బాలకృష్ణ శ్రీరామదాసుస్వామి యొక్క గొప్ప భక్తుడు. ఇతని భార్య పుతలాబాయి కూడా సరిసమానమైన పతివ్రత. వీరిద్దరు ప్రతిఏటా నడకన సజ్జనఘడు దర్శించేవారు. వీళ్ళప్రయాణం పుష్యమాసంలో తమసామాను మోసేందుకు ఒకగుర్రంతో ప్రారంభంఅయేది. మరియు మూడు వస్తువులు, ఒక కట్టమంచం, ఒక చిన్నకర్ర మరియు పవిత్రగ్రంధం దాస్బోధ వీళ్ళతో ఉండేవి. ఇతని పవిత్రత ఏవిధమయిన అహంకారంలేనిది.

వీళ్ళు దారిలో గ్రామంలో తమకు లభించే భిక్ష స్వీకరిస్తూ, అది తినేముందు శ్రీరామునికి సమర్పించేవారు. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో బహుళ నవమి రోజున తన భార్యతో ఈయన బాలాపూరునుండి రవాణ అయ్యేవారు. దారిలో వీరు రామనామం విడవకుండా అంటూ ఉండేవారు. పెదవులపై ఈనిర్విరామ రామనామంతో, వీళ్ళు షేగాం, ఖాంగాం, మెహకర్, దెవుల్గాం, రాజా మరియు శ్రీఆనందస్వామి గ్రామం అయిన జాలనా మీదుగా ప్రయాణించేవారు.

జాలనా నుండి శ్రీరామదాసుస్వామి జన్మస్థలమయిన జాంబు వెళ్ళి అక్కడ మూడురోజులు ఉండేవేరు. అక్కడ నుండి వారు దివారు, భీడ్, మెహర్, భళేశ్వర్ మరియు శ్రీరామదాసుస్వామి ప్రముఖ శిష్యుడు కళ్యాణ్ స్థలమయిన డోంగాం వెళ్ళేవారు.

తరువాత నరశింగపూర్, ఫండరుపూరు, నాటే పోటే సింగణాపూరు, సతారా మీదుగా సజ్జనఘడు మాఘ బహుళ నవమి ఉత్సవాలలో పాల్గొందుకు మాఘ బహుళపాడ్యమికి చేరేవారు.

శ్రీరామదాసుగారికి కానుకగా అతను తన శక్తికొలది బ్రాహ్మణులకు భోజనాలు పెట్టించేవాడు. ఇతను నిజమయిన రామదాసి. ఈకాలంలో ఇటువంటివారిని చూడడం కష్టం. దాసునవమి ఉత్సవాలు అయిన తరువాత వెళ్ళిన దారినే తిరిగి వచ్చేవారు. అతని వయస్సు 60 సం. అయ్యేవరకు ఇలా ఏళ్ళతరబడి ఈపధ్ధతి జరిగింది.

ఈసారి తిరుగు ప్రయాణం అయ్యేముందు శ్రీరామదాసుస్వామి సమాధి దగ్గర కళ్ళనీళ్ళతో కూర్చుని ఓ సర్వశక్తివంతమయిన రామదాసుస్వామి ఓగురువరా, మార్గదర్శకా, నేను ముసలివాడిని అయ్యాను, అందువల్ల ఇకముందు ఇంతదూరం కాలినడకన రావడం సంభవం కాదు. వాహనంమీద ప్రయాణించి రావడం కూడా కష్టం అయ్యేలా కనిపిస్తోంది. ఇంతవరకు నేను ప్రతి సంవత్సరం రావడం అనే ప్రక్రియ చేయగలిగాను కాని ఇకముందు ఇది సంభవం కాదని పిస్తోంది.

ఏవిధ మయిన పుణ్యకార్యంగాని, భగవకార్యంకాని వారానుసారంగా చెయ్యడానికి ఆరోగ్యం అవసరం అని మీకుతెలుసు అని ప్రార్ధిస్తూ బాలకృష్ణ నిద్రపోయాడు. అతనికి కలలో నిరాశచెందకు, నువ్వు ఇకనుండి సజ్జనుఘడు రానవసరంలేదు, నీభక్తికి నేను చాలా సంతోషిస్తున్నాను. అందుకే వచ్చే ఏడాది నవమి ఉత్సవాలు నీఇంట్లోనే జరిపించు. అప్పుడు నేను నీదగ్గరకు వస్తాను. ఇది నావాగ్దానం. నవమి ఉత్సవాలకి ఖర్చు నీ పరిధిలోనే ఉండాలి అని తనతో శ్రీరామదాసస్వామి అన్నట్టు బాలకృష్ణ చూసాడు.

బాలకృష్ణ ఈకలకు చాలాసంతోషించాడు. తన భార్యతో తిరిగి బాలాపూరు వచ్చాడు. ఇక మరుసటి సంవత్సరం బాలాపూరులో ఏమి జరిగిందో వినండి. మాఘబహుళ పాడ్యమినాడు బాలకృష్ణ రామదాసు నవమి ఉత్సవాలు ప్రారంభించాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹   Sri Gajanan Maharaj Life History - 45   🌹
✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj

🌻 Chapter 9 - part 4 🌻

Now listen to another story from Balapur. Balkrishana of Balapur was a great devotee of Shri Ramdas Swami. His wife Putalabai was an equally pious lady, and she, with her husband, used to visit Sajjangad every year on foot.

Their journey started in the month of Poush with a horse to carry their luggage. They carried three things with them - A kubadi, a small dari and the sacred book of Dasbodh. His piety was free from any form of ego. They accepted alms for food from the villages on way and offered the same food to Shri Ram before eating it. Every year they used to leave Balapur on the 9th Vadya of 'Poush' month.

On the way, they continuously chanted the name of Rama and thus with the chant of Shri Ram Nama emanating from their lips they travelled via Shegaon, Khamgaon, Mehkar, Deulgaon Raja and Jalna, where they paid respects to Shri Anand Swami.

Then from Jalna they went to Jamb, the birthplace of Shri Ramdas Swami, where they used to stay for three days. From there, they went to Divara, Bid, Mohari, Beleshwar and Domgaon, the place of Kalyan, the arch devotee of Shri Ramdas Swami.

Thereafter to Narsingpur, Pandharpur, Nate Pote Shingnapur, Wai and Satara; thus they used to reach Sajjangad on the 1st Vadya of Magh month to attend the celebrations of Navami (Magh).

As an offering to Shri Ramdas Swami, Balkrishana used to feed the Brahmins to the best extent possible for him. He was a real Ramdasi; it is really difficult to find any Ramdasi like him nowadays. After the celebrations of Ram Navami he used to return the same way he followed while going there.

This routine of his continued till he became 60 years old. On the eve of starting his return journey, he sat near the Samadhi of Shri Ramdas Swami with tears in his eyes; with extreme grief said, O all powerful Ramdas Swami!

O my teacher and guide! I have become old now and as such it will not be possible for me to come here all the way hereafter on foot. Even journeying here by a vehicle appears difficult for me. I could follow this routine of an annual visit so far, but it may not be possible hereafter. You know that to follow any sacred or devotional routine, good health is required of the follower.”

Praying thus, Balkrishna went to sleep. In the dream he saw Shri Ramdas Swami saying to him, Don't despair. You need not come to Sajjangad hereafter. I am very much pleased by your devotion and so wish you to celebrate Navami at your home next year. I will come to you at that time. This is my promise. Expenditure for the celebration of Navami should be within your means.” Balkrishna was very happy about the dream.

He returned to Balapur with his wife. Now listen to what happened next year at Balapur. Balkrishna started the celebration of Ramdas Navami on the first day of Magh Vadya at Balapur.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj

07.Sep.2020

శివగీత-55 / The Siva-Gita-55

🌹.   శివగీత - 55 / The Siva-Gita - 55   🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ

ఎనిమిదో అధ్యాయము

🌻. గర్భో త్పత్త్యాది కథనము -1 🌻

పంచ భౌతిక దేహస్య - చోత్పత్తి ర్విలయ స్స్థితి:
స్వరూపం చ కథం దేహే - భగవాన్! మక్తు మర్హసి 1

పంచ భూతై స్సమారబ్దో - దేహొయం పాంచ భౌతికః,
తత్ర ప్రధానం పృథి వీ - శేషాణాం సహకారితా 2

జరాయుజోండ జస్చైవ - స్వేద జశ్చోద్భి దస్తథా,
ఏవం చతుర్విదః ప్రోక్తో - దేహొయం పాంచ భౌతికః 3

శ్రీరాముడు ప్రశ్నించుచున్నాడు: లింగ దేహమునందు పంచభూతములతో కూడిన శరీరమే రీతిగా నేర్పడుచున్నది? దీని స్థితి నాశము లెట్లు కలుగును? సవిస్తారముగా చెప్పుమని శ్రీరాముడు పరమశివుని ప్రశ్నించెను. అందుకు భగవంతుడీ విధముగా వివరించెను.

నీ శరీరము పంచభూతముల చేతనే యేర్పడినది. వాటిలో ప్రధానమైనది భూతత్త్వము. మిగిలిన జలాదులు సహకార భావమును బొందియుండును.

ఇట్టి పంచభూతాత్మకంబైన ఈ శరీరము జరాయుజమనియు అండజ మనియు, స్వేదజ ఉద్ది జలముల వలన బుట్టెడు నీ దేహము నాలుగు రకాలుగా మారినది.

అందు నర మృగాదుల జరాయుజములు, స్త్రీ గర్భకోశముల నుండి బుట్టినది జరాయువనగా స్త్రీ గర్భకోశము, పక్షులు, సర్పములు మొదలగునవి.

అండజములు, గ్రుడ్డు పగిలిన పిమ్మట వెలువడునవి, పురుగులు దోమలు మొదలగునవి స్వేదజములు, చెమట నుండి బుట్టినవి. మర్రి మొదలగునవి చెట్లు ఉద్భిదములు, ఇవి భూమిని భేదించుకొని బుట్టినవి.
🌹 🌹 🌹 🌹 🌹

🌹  The Siva-Gita - 55  🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj

Chapter 08 :
🌻 Pindotpatti Kathanam - 1 🌻

Sri Rama enquired: Within the Linga Deham (subtle body), how is the body made of five elements getting established/created? How is it sustained; how is it destroyed? Please explain it in detail.

Sri Bhagawan replied: This body is formed of five elements, out of them primary constituent is Bhutatwam (earthly essence). Other elements play a secondary role.

This body of five elements is called Jarayujam, Andajam, Svedajam, and Uddijam based on the way they are created. hence this gross body is of four types.

Among them the humans, animals are Jarayujam type because they all are born from the womb of a female.

Jarayu means the womb of a female. Birds, snakes etc creatures are called Andajam since they are born from eggs.

Egg is known as Anda hence they are termed as Andajam. Insects, mosquitoes etc. are called Svedajam since they are born from sweat.

banyan tree etc, are all called Udbheedam since they are born by tearing the womb of the earth.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివగీత #SivaGita

07.Sep.2020

నారద భక్తి సూత్రాలు - 88

🌹.  నారద భక్తి సూత్రాలు - 88  🌹 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ

చతుర్ధాధ్యాయం - సూత్రము - 58

🌻 58. అన్యస్నాత్‌ సౌలభ్యం భక్తా ॥ 🌻

ప్రేమించడం అనేది అందరికీ తెలుసు. కాని అది వస్తువులు, బంధు మిత్రులు, భార్యా బిడ్డలు, తల్లిదండ్రులు మొదలైన నిమిత్త కారణాల పై ఆధారపడిన ప్రేమ. ఈ ప్రేమలో రాగం, అనురాగం ఉంటాయి. ఈ ప్రేమ స్వంత ప్రయోజనాన్ని ఆశించి ఉంటుంది. ఇంద్రియ భోగలాలసగా, స్వార్ధ పూరితంగా ఉంటుంది.

ఇతరుల వలన ఆ ప్రయోజనం అందక పోయినా, వ్యతిరేక ఫలితం వచ్చినా, లేక వారు తిరిగి ప్రైమించకపోయినా అది ద్వెషంగా మారుతుంది. ఈ రాగద్వెషాలు నిమిత్త కారణాల మీద ఆధారపడి పుట్టుకొస్తాయి. మనసు మీద వాసనలు ముద్రించ బడతాయి. అవి సంస్కారాలై పునర్జన్మకు హేతువవుతాయి. కనుక ఇట్టి ప్రేమ బంధమవుతుంది.

అదే ప్రేమ నిస్వార్ధం, అకారణం అయినప్పుడు అక్కడ నిమిత్త కారణం భగవంతుడే అయినప్పుడు, ఆ ప్రేమ బంధమవదు. ఒకవేళ అయితే, అది భగవంతునితో బంధమవుతుంది.

భగవంతునితో బంధం పునర్జన్మ హేతువు కాదు. ఆ విధంగా భగవంతునిపై ఉదయించే ప్రేమ లేక రాగం భగవత్ ప్రేమను పెంచుతుంది. అట్టి ప్రేమలో ఆటంకం కలిగితే, విరహంగా మారి ఆ ప్రేమ మరింత పెరుగుతుందే తప్ప భగవంతునిపై ద్వేషంగా మారదు. అందువలన భగవంతుని చేరడానికి అన్య మార్గాల కంటే భక్తి మార్గం సులభం, శ్రేష్టం.

ఒకసారి భగవత్ ప్రేమ నిలబడిపోతెే, అన్య వస్తువులపై రాగం సన్నగిల్లి పోతుంది. చిత్తవృత్తులు వెలవెలవోతాయి. ముఖ్యభక్తి కలగడానికి అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ

07.Sep.2020

˜”*°•. శ్రీ లలితా సహస్ర నామములు - 86 / Sri Lalita Sahasranamavali - Meaning - 86 .•°*”˜

🌹.  శ్రీ లలితా సహస్ర నామములు - 86 / Sri Lalita Sahasranamavali - Meaning - 86  🌹
🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 165.

ధర్మాధారా ధనాధ్యక్షా ధనధాన్యవివర్ధినీ
విప్రప్రియా విప్రరూప విశ్వభ్రమణకారిణీ

881. ధర్మాధారా :
ధర్మమునకు ఆధారభూతమైనది

882. ధనాధ్యక్షా :
సర్వసంపదలకు అధికారిణి

883. ధనధాన్యవివర్ధినీ :
ధనము, ధాన్యము వర్ధిల్లచేయునది

884. విప్రప్రియా :
వేదాధ్యయన సంపన్నులైన వారియందు ప్రీతి కలిగినది

885. విప్రరూప :
వేదవిదులైనవారి యెందు ఉండునది

886. విశ్వభ్రమణకారిణీ :
విశ్వమును నడిపించునది

🌻. శ్లోకం 166.

విశ్వగ్రాసా విద్రుమాభా వైష్ణవీ విష్ణురూపిణీ
అయోని ర్యోనినిలయా కూటస్థా కులరూపిణీ

887. విశ్వగ్రాసా :
విశ్వమే ఆహారముగా కలిగినది

888. విద్రుమాభా :
పగడము వలె ఎర్రనైన కంతి కలిగినది

889. వైష్ణవీ :
వైష్ణవీ దేవి రూపమున అవతరించినది

890. విష్ణురూపిణీ :
విష్ణురూపమున జగత్తును రక్షించునది

891. అయోని: :
పుట్టుక లేనిది

892. యోనినిలయా :
సమస్త సృష్టి కి జన్మస్థానము

893. కూటస్థా :
మూలకారణ శక్తి

894. కులరూపిణీ :
కుండలినీ రూపిణి

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹.  Sri Lalita Sahasranamavali - Meaning - 86  🌹

📚. Prasad Bharadwaj

🌻 Sahasra Namavali - 86 🌻

881) Dharma dhara -
She who is the basis of Dharma-the rightful action

882) Dhanadyaksha -
She who presides over wealth

883) Dhanadhanya vivardhani -
She who makes wealth and grain to grow

884) Vipra priya -
She who likes those who learn Vedas

885) Vipra roopa -
She who is the learner of Vedas

886) Viswa brhamana karini -
She who makes the universe to rotate

887) Viswa grasa -
She who eats the universe in one handful

888) Vidhrumabha -
She who has the luster of coral

889) Vaishnavi -
She who is the power of Vishnu

890) Vishnu roopini -
She who is Vishnu

891) Ayoni -
She who does not have a cause or She who is not born

892) Yoni nilaya -
She who is the cause and source of everything

893) Kootastha -
She who is stable

894) Kula roopini -
She who is personification of culture

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi

07.Sep.2020

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 149

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 149 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. విషువత్ - 2 🌻

(21st March)

సంవత్సరాదిని నిర్ణయించుటకు వేదఋషులు ఒక పుల్లను పాతి దాని నీడను కొలిచి ఈ దినమును స్థాపించెడి వారు. ఈ బిందువునుండి సమస్త ఖగోళ గణితములను లెక్కించెడివారు.

ఈ బిందువు ప్రతి సంవత్సరము భూమధ్యరేఖపై కొంచెము వెనుకకు నడుచుచుండును. ఈ నడచుటనే గవామయము అను యజ్ఞముగా వేద ఋషులు గుర్తించిరి.

ఈ బిందువుతోపాటు సంవత్సరాది కూడ వెనుకకు నడచుచుండును. దీనినే కాలస్వరూపుడగు శంకరుడు మృగరూపమైన యజ్ఞమును వేటాడుటగా కవులు వర్ణించిరి.

'నల్లలేడియందు దృష్టి నిలిపి వింటియందెక్కు పెట్టిన బాణమును చూచుకొనుచున్న నీవు మృగము వెంట పరుగెత్తుచున్న పినాకపాణి వలె నున్నావు.' అని కాళిదాస కృతమగు శాకుంతల నాటకమున మాతలి దుష్యంతుని ప్రశంసించును.

నాటకము మొత్తము నందును చాంద్ర సంవత్సరము యొక్క కథ అంతర్వాహినిగా నడచును. కనుకనే దుష్యంతుడు చాంద్రవంశపు రాజుగా చమత్కరింపబడెను.

ఈ బిందువునకై భూమధ్యరేఖ ఖండింపబడుటకు కావలసిన సూర్యగతి‌ ధ్రువుని కాలముననే పుట్టినది.

....✍🏼 మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

07.Sep.2020

7-September-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 482 / Bhagavad-Gita - 482🌹

2) 🌹 Sripada Srivallabha Charithamrutham - 270🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 150🌹
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 170🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 86 / Sri Lalita Sahasranamavali - Meaning - 86🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 88 🌹
7) 🌹 Guru Geeta - Datta Vaakya - 58🌹
8) 🌹. శివగీత - 53 / The Shiva-Gita - 55🌹
9) 🌹. గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 45 / Gajanan Maharaj Life History - 45 🌹 
10) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 37🌹
11) 🌹. సౌందర్య లహరి - 97 / Soundarya Lahari - 97 🌹 
12) 🌹. శ్రీమద్భగవద్గీత - 397 / Bhagavad-Gita - 397 🌹
🌹. జ్ఞానులు మహా భక్తులు ఉత్తములకే కష్టాలు ఎందుకు వస్తాయి.? 🌹

13) 🌹. శివ మహా పురాణము - 217🌹
14) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 93 🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 104 🌹
16) 🌹 Twelve Stanzas From The Book Of Dzyan - 35🌹
17) శ్రీ విష్ణు సహస్ర నామములు - 6 / Sri Vishnu Sahasranama - 6 🌹 
18) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 4 / Vishnu Sahasranama Contemplation - 4 🌹
19) 🌹 Seeds Of Consciousness - 168🌹 
20) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 47🌹
21) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 24 📚
22) 🌹. అద్భుత సృష్టి - 25 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 482 / Bhagavad-Gita - 482 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 27 🌴*

27. యావత్ సంజాయతే కించిత్ సత్త్వం స్థావరజంగమమ్ |
క్షేత్రక్షేత్రజ్ఞసంయోగాత్ తద్విద్ది భరతర్షభ ||

🌷. తాత్పర్యం : 
ఓ భరతవంశశ్రేష్టుడా! స్థితిని కలిగియున్నట్టి స్థావర, జంగమములలో నీవు గాంచునదేదైనను క్షేత్రక్షేత్రజ్ఞుల సంయోగమేనని తెలిసికొనుము.

🌷. భాష్యము :
జగత్తు యొక్క సృష్టికి పూర్వమే స్థితిని కలిగియున్నట్టి భౌతికప్రకృతి మరియు జీవుల గూర్చి ఈ శ్లోకమున వివరింపబడినది.

 సృష్టింపబడిన ప్రతిదియు జీవుడు మరియు ప్రకృతి కలయిక చేతనే ఏర్పడినది. జగత్తులో వృక్షములు, పర్వతములు, కొండలవంటి అచరసృష్టి కలదు. అదేవిధముగా పలువిధములైన చరసృష్టి కూడా కలదు. 

అవియన్నియు భౌతికప్రకృతి మరియు ఉన్నతప్రకృతియైన జీవుని కలయిక చేతనే ఏర్పడినవి. ఉన్నతప్రకృతికి సంబంధించిన జీవుని కలయిక లేక స్పర్శ లేనిదే ఏదియును వృద్ధినొందదు. ఈ విధముగా భౌతికప్రకృతి మరియు జీవుల నడుమ సంబంధము అనంతముగా సాగుచున్నది. 

వారి నడుమ సంయోగమనునది శ్రీకృష్ణభగవానునిచే ప్రభావితమగు చున్నందున ఆ భగవానుడే ఉన్నత, న్యూనప్రకృతులను నియమించువాడై యున్నాడు. అనగా భౌతికప్రకృతి భగవానునిచే సృష్టింపబడి, ఉన్నతప్రకృతియైన జీవుడు దాని యందుంచబడగా సర్వకార్యములు, సృష్టి ఒనగూడుచున్నవి.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 482 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 27 🌴*

27. yāvat sañjāyate kiñcit
sattvaṁ sthāvara-jaṅgamam
kṣetra-kṣetrajña-saṁyogāt
tad viddhi bharatarṣabha

🌷 Translation : 
O chief of the Bhāratas, know that whatever you see in existence, both the moving and the nonmoving, is only a combination of the field of activities and the knower of the field.

🌹 Purport :
Both material nature and the living entity, which were existing before the creation of the cosmos, are explained in this verse. Whatever is created is but a combination of the living entity and material nature. 

There are many manifestations like trees, mountains and hills which are not moving, and there are many existences which are moving, and all of them are but combinations of material nature and the superior nature, the living entity. Without the touch of the superior nature, the living entity, nothing can grow. 

The relationship between material nature and spiritual nature is eternally going on, and this combination is effected by the Supreme Lord; therefore He is the controller of both the superior and inferior natures. 

The material nature is created by Him, and the superior nature is placed in this material nature, and thus all these activities and manifestations take place.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Sripada Srivallabha Charithamrutham - 270 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 33
*🌻. Sripada Himself performs the marriage of Ramani and Narasimha Raya - 2 🌻*

Meanwhile, one cunning sadhu came  to our village. Word spread that he was a worshipper of ‘Kaali Matha’ and could tell the past, present and future. He really had some powers. He used to foretell things hundred percent correctly. He subdued my aunt with his talk. Arrangements were made in our house to do ‘Kaali Puja’.  

He told that the ‘Krishna idol’ which Ramani was worshipping daily, should be thrown out of the house. My aunt agreed. Our Ramani cried incessantly. But, there was no effect.  

That cunning sadhu started doing ‘worship’. Many hens were sacrificed for ‘Kaali Matha’. The puja room was looking horrible with blood. Many skulls and other items required for ‘burial ground sadhana’ were kept in the house.  

He made everybody in the house believe that, after the worship, some underground wealth would be found in the house and with that the whole family would become rich.

That cunning sadhu also knew ‘Vaseekarana Vidya’ (mesmerizing tactics). He planned to spoil our Ramani with the help of that vidya. As a result of those strange worships, our Ramani’s health started deteriorating. She started behaving strangely.  

She used to drink blood in the night. After killing goats and hens, they used to give the blood to her. Instead  of rice, she would drink only blood. That cunning sadhu was telling that Kaali Matha entered Ramani and was  drinking blood, and after Kaali left her, she would become normal.  

He also made them believe that without offering blood, Kaali would not be pacified. He was assuring that  wealth would be found. The house was looking horrible. Suddenly the cooking vessels would drop into the well.  

Human skeletons were also appearing here and there in the house. In the midnight, strange shadows were appearing and doing frightful sounds. Our house was looking like a burial ground. My uncle  had no guts to tell that cunning sadhu to get out of the house.  

My aunt was hopeful that hidden wealth would be found if they tolerated the problems for a few days. The whole situation was confusing and ‘helter shelter’. One night, that cunning sadhu approached our Ramani.  

He thought that she would surrender to him because she was under his influence. When he approached her, Ramani shouted loudly, took an iron rod and frightfully hit him on his head. She herself did not know why she did like that.  

The cunning sadhu did not know why  she did that, though she was under his influence.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 149 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు  
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻. విషువత్ - 2 🌻*
*(21st March)*

సంవత్సరాదిని నిర్ణయించుటకు వేదఋషులు ఒక పుల్లను పాతి దాని నీడను కొలిచి ఈ దినమును స్థాపించెడి వారు. ఈ బిందువునుండి సమస్త ఖగోళ గణితములను లెక్కించెడివారు.  

ఈ బిందువు ప్రతి సంవత్సరము భూమధ్యరేఖపై కొంచెము వెనుకకు నడుచుచుండును. ఈ నడచుటనే *గవామయము* అను యజ్ఞముగా వేద ఋషులు గుర్తించిరి.  

ఈ బిందువుతోపాటు సంవత్సరాది కూడ వెనుకకు నడచుచుండును. దీనినే కాలస్వరూపుడగు శంకరుడు మృగరూపమైన యజ్ఞమును వేటాడుటగా కవులు వర్ణించిరి.  

'నల్లలేడియందు దృష్టి నిలిపి వింటియందెక్కు పెట్టిన బాణమును చూచుకొనుచున్న నీవు మృగము వెంట పరుగెత్తుచున్న పినాకపాణి వలె నున్నావు.' అని కాళిదాస కృతమగు శాకుంతల నాటకమున మాతలి దుష్యంతుని ప్రశంసించును. 

నాటకము మొత్తము నందును చాంద్ర సంవత్సరము యొక్క కథ అంతర్వాహినిగా నడచును. కనుకనే దుష్యంతుడు చాంద్రవంశపు రాజుగా చమత్కరింపబడెను.  

ఈ బిందువునకై భూమధ్యరేఖ ఖండింపబడుటకు కావలసిన సూర్యగతి‌ ధ్రువుని కాలముననే పుట్టినది.
....✍🏼 *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 The Masters of Wisdom - The Journey Inside - 170 🌹*
*🌴 The Bridge - 6 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

*🌻. Parts of the Bridge 🌻*

The first part of the bridge goes from the solar plexus to the heart, from the personality to the light of the soul. The bridge then continues from the heart to the brow centre. 

This centre between the eyebrows should not be confused with the Ajna. It is the highest point at which the personality can rise. It belongs to the pituitary gland (hypophysis).

The next bridge leads from the eyebrows to the Ajna, the seat of the soul. It is described by Master CVV as the 'Higher Bridge'. There is a mantra given by the Master to meditate on this bridge - 'Higher bridge beginning'. 

One of the most ancient meditations to build this bridge between the pituitary and the pineal is to contemplate a bright star in the Ajna centre and visualize ourselves in the bridge between the eyebrows. 

When this bridge is built, we will experience that we are living in the etheric body of golden light, even when the body of flesh and blood dies.

As soon as the bridge between the pineal and the pituitary is built, the central point between soul and personality gets activated. 

It is called the birthplace of Indra (Indra Yoni). Through this centre the soul manifests into the personality; this is called the soul-infused personality. 

Whenever the soul intends acting in the three worlds, this centre becomes activated and the heavenly mind manifests in the human body. 

From this point of light within the mind of God, light streams forth into our minds: “Let light descend on earth.”

🌻 🌻 🌻 🌻 🌻 
Sources used: Master K.P. Kumar: Uranus. Notes from seminars. Master Dr. E. Krishnamacharya: Spiritual Astrology.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 86 / Sri Lalita Sahasranamavali - Meaning - 86 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. శ్లోకం 165. 
*ధర్మాధారా ధనాధ్యక్షా ధనధాన్యవివర్ధినీ*
*విప్రప్రియా విప్రరూప విశ్వభ్రమణకారిణీ*

881. ధర్మాధారా : 
ధర్మమునకు ఆధారభూతమైనది

882. ధనాధ్యక్షా : 
సర్వసంపదలకు అధికారిణి

883. ధనధాన్యవివర్ధినీ : 
ధనము, ధాన్యము వర్ధిల్లచేయునది

884. విప్రప్రియా : 
వేదాధ్యయన సంపన్నులైన వారియందు ప్రీతి కలిగినది

885. విప్రరూప : 
వేదవిదులైనవారి యెందు ఉండునది

886. విశ్వభ్రమణకారిణీ : 
విశ్వమును నడిపించునది

*🌻. శ్లోకం 166. 

*విశ్వగ్రాసా విద్రుమాభా వైష్ణవీ విష్ణురూపిణీ*
*అయోని ర్యోనినిలయా కూటస్థా కులరూపిణీ*

887. విశ్వగ్రాసా : 
విశ్వమే ఆహారముగా కలిగినది

888. విద్రుమాభా : 
పగడము వలె ఎర్రనైన కంతి కలిగినది

889. వైష్ణవీ : 
వైష్ణవీ దేవి రూపమున అవతరించినది

890. విష్ణురూపిణీ : 
విష్ణురూపమున జగత్తును రక్షించునది

891. అయోని: : 
పుట్టుక లేనిది

892. యోనినిలయా : 
సమస్త సృష్టి కి జన్మస్థానము

893. కూటస్థా : 
మూలకారణ శక్తి

894. కులరూపిణీ : 
కుండలినీ రూపిణి

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 86 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 Sahasra Namavali - 86 🌻*

881 ) Dharma dhara -   
She who is the basis of Dharma-the rightful action

882 ) Dhanadyaksha -   
She who presides over wealth

883 ) Dhanadhanya vivardhani -   
She who makes wealth and grain to grow

884 ) Vipra priya -   
She who likes those who learn Vedas

885 ) Vipra roopa -   
She who is the learner of Vedas

886 ) Viswa brhamana karini -   
She who makes the universe to rotate

887 ) Viswa grasa -   
She who eats the universe in one handful

888 ) Vidhrumabha -   
She who has the luster of coral

889 ) Vaishnavi -   
She who is the power of Vishnu

890 ) Vishnu roopini -   
She who is Vishnu

891 ) Ayoni -   
She who does not have a cause or She who is not born

892 ) Yoni nilaya -   
She who is the cause and source of everything

893 ) Kootastha -   
She who is stable

894 ) Kula roopini -   
She who is personification of culture

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నారద భక్తి సూత్రాలు - 88 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ 
చతుర్ధాధ్యాయం - సూత్రము - 58

*🌻 58. అన్యస్నాత్‌ సౌలభ్యం భక్తా ॥ 🌻* 

ప్రేమించడం అనేది అందరికీ తెలుసు. కాని అది వస్తువులు, బంధు మిత్రులు, భార్యా బిడ్డలు, తల్లిదండ్రులు మొదలైన నిమిత్త కారణాల పై ఆధారపడిన ప్రేమ. ఈ ప్రేమలో రాగం, అనురాగం ఉంటాయి. ఈ ప్రేమ స్వంత ప్రయోజనాన్ని ఆశించి ఉంటుంది. ఇంద్రియ భోగలాలసగా, స్వార్ధ పూరితంగా ఉంటుంది. 

ఇతరుల వలన ఆ ప్రయోజనం అందక పోయినా, వ్యతిరేక ఫలితం వచ్చినా, లేక వారు తిరిగి ప్రైమించకపోయినా అది ద్వెషంగా మారుతుంది. ఈ రాగద్వెషాలు నిమిత్త కారణాల మీద ఆధారపడి పుట్టుకొస్తాయి. మనసు మీద వాసనలు ముద్రించ బడతాయి. అవి సంస్కారాలై పునర్జన్మకు హేతువవుతాయి. కనుక ఇట్టి ప్రేమ బంధమవుతుంది.

అదే ప్రేమ నిస్వార్ధం, అకారణం అయినప్పుడు అక్కడ నిమిత్త కారణం భగవంతుడే అయినప్పుడు, ఆ ప్రేమ బంధమవదు. ఒకవేళ అయితే, అది భగవంతునితో బంధమవుతుంది.

 భగవంతునితో బంధం పునర్జన్మ హేతువు కాదు. ఆ విధంగా భగవంతునిపై ఉదయించే ప్రేమ లేక రాగం భగవత్ ప్రేమను పెంచుతుంది. అట్టి ప్రేమలో ఆటంకం కలిగితే, విరహంగా మారి ఆ ప్రేమ మరింత పెరుగుతుందే తప్ప భగవంతునిపై ద్వేషంగా మారదు. అందువలన భగవంతుని చేరడానికి అన్య మార్గాల కంటే భక్తి మార్గం సులభం, శ్రేష్టం.

ఒకసారి భగవత్ ప్రేమ నిలబడిపోతెే, అన్య వస్తువులపై రాగం సన్నగిల్లి పోతుంది. చిత్తవృత్తులు వెలవెలవోతాయి. ముఖ్యభక్తి కలగడానికి అన్ని అడ్డంకులు తొలగిపోతాయి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 55 / The Siva-Gita - 55 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

ఎనిమిదో అధ్యాయము
*🌻. గర్భో త్పత్త్యాది కథనము -1 🌻*

పంచ భౌతిక దేహస్య - చోత్పత్తి ర్విలయ స్స్థితి:
స్వరూపం చ కథం దేహే - భగవాన్! మక్తు మర్హసి 1
పంచ భూతై స్సమారబ్దో - దేహొయం పాంచ భౌతికః,
తత్ర ప్రధానం పృథి వీ - శేషాణాం సహకారితా 2
జరాయుజోండ జస్చైవ - స్వేద జశ్చోద్భి దస్తథా,
ఏవం చతుర్విదః ప్రోక్తో - దేహొయం పాంచ భౌతికః 3

శ్రీరాముడు ప్రశ్నించుచున్నాడు: లింగ దేహమునందు పంచభూతములతో కూడిన శరీరమే రీతిగా నేర్పడుచున్నది? దీని స్థితి నాశము లెట్లు కలుగును? సవిస్తారముగా చెప్పుమని శ్రీరాముడు పరమశివుని ప్రశ్నించెను. అందుకు భగవంతుడీ విధముగా వివరించెను.  

నీ శరీరము పంచభూతముల చేతనే యేర్పడినది. వాటిలో ప్రధానమైనది భూతత్త్వము. మిగిలిన జలాదులు సహకార భావమును బొందియుండును.  

ఇట్టి పంచభూతాత్మకంబైన ఈ శరీరము జరాయుజమనియు అండజ మనియు, స్వేదజ ఉద్ది జలముల వలన బుట్టెడు నీ దేహము నాలుగు రకాలుగా మారినది.  

అందు నర మృగాదుల జరాయుజములు, స్త్రీ గర్భకోశముల నుండి బుట్టినది జరాయువనగా స్త్రీ గర్భకోశము, పక్షులు, సర్పములు మొదలగునవి. 

అండజములు, గ్రుడ్డు పగిలిన పిమ్మట వెలువడునవి, పురుగులు దోమలు మొదలగునవి స్వేదజములు, చెమట నుండి బుట్టినవి. మర్రి మొదలగునవి చెట్లు ఉద్భిదములు, ఇవి భూమిని భేదించుకొని బుట్టినవి. 

🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 The Siva-Gita - 55 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 08 :
*🌻 Pindotpatti Kathanam - 1 🌻*

Sri Rama enquired: Within the Linga Deham (subtle body), how is the body made of five elements getting
established/created? How is it sustained; how is it destroyed? Please explain it in detail. 

Sri Bhagawan replied: This body is formed of five elements, out of them primary constituent is Bhutatwam (earthly essence). Other elements play a secondary role. 

This body of five elements is called Jarayujam, Andajam, Svedajam, and Uddijam based on the way they are created. hence this gross body is of four types. 

Among them the humans, animals are Jarayujam type because they all are born from the womb of a female.

Jarayu means the womb of a female. Birds, snakes etc creatures are called Andajam since they are born from eggs. 

Egg is known as Anda hence they are termed as Andajam. Insects, mosquitoes etc. are called Svedajam since they are born from sweat.

 banyan tree etc, are all called Udbheedam since they are born by tearing the womb of the earth.

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 58 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj

We discussed that Akrura conveyed Kamsa’s command to Balarama and Krishna to bring them to Mathura.

 Balarama and Krishna agreed and boarded the chariot. Akrura drove the chariot, all the while pining intensely for the grace of Lord Krishna.  

Balarama and Krishna, seated it the chariot, feigned ignorance, laughing and immersing themselves in the beauty of nature. They saw wonderful forests, strange and exotic  birds and happy beasts along the way. They came up on the sacred Yamuna River. 

Akrura promptly stopped the chariot and requested permission from Balarama and Krishna to worship the river saying “Rama, Krishna: Yamuna washes away sins. I worship River Yamuna.  

I will offer my prayers to the river and  come back”. He asked Balarama and Krishna to be seated in the chariot.   

Akrura went up to the river and began reciting mantras while dipping in the water. To his great surprise, he saw the same Balarama and Krishna in the water, happy and smiling, looking  exactly like they did in the chariot. 

Even though Arkura was great devotee, his own ignorance prevented him from realizing that the  Lord was seated right next to him in the chariot. So, to teach him a lesson, they appeared in the sacred water of Yamuna river. 

Akrura stood up and shook his head. He found Balarama and Krishna seated in the chariot and smiling. They were in the water, but they were  also outside in the chariot. He was confused. 

He dipped in the water again and witnessed the same form and smiles  in the water. Sri Krishna then appeared to him as Lord Vishnu and blessed him. 

He gave him darshan of Vaikuntha. Did you see? The cowherd, Jagadguru Sri Krishna, appeared as Lord Vishnu in Vaikuntha, to clear the  confusion and wipe away the sorrows of Arkura and bless him.   

Similarly, the Guru also blesses the disciples who are devoted to him. Why is it that humans do not understand the Guru Principle despite many spiritual practices? What is preventing them from grasping that concept? What is it? Tell me, what is it?  

[The bird says “Raga”]. Raga. It’s called Raga. Did you see, even Suka Brahma says so. RagaDvesha (like and dislikes) engulf us. That is why humans can’t comprehend Guru Tattva.

Suka Brahmam is the one that gave us the sacred Bhagavatam.  

It is the great Principle advocated by him that Lord Shiva is now telling us through the question asked by Mother Parvati . 

 It is the same principle that Suka Brahma gave us. He said it one word. What is it? What did you call it? [Bird says “Raga”]. It’s called Raga.   

That is why, through this sloka, Lord Shiva, on account of the question posed by Supreme Mother Parvati, is teaching us not to waste all the merit accumulated through one’s spiritual practices by forgetting Guru Tattva and doubting the qualities of the Guru.

Therefore, it becomes evident that one must explore the concept of Guru. So, who is Guru? Let’s get to the core of the matter. What can he do? What are his degrees and qualifications? There are many questions that come up. Questions always keep sprouting.  

Many wonder and even ask about the  degrees, certificates and the qualifications of a Guru. They also wonder if he’s capable of transforming them. 

Those are not a good question to ask. The Guru’s qualifications, certifications, popularity and his ability to transform you are not the right questions to ask in search of a Guru. 

To understand what really a Guru is, we should follow the next two slokas  that provide a summary of the qualities of a Guru.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 45 / Sri Gajanan Maharaj Life History - 45 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. 9వ అధ్యాయము - 4 🌻*

బాలాపూరుదే మరోకధ వినండి: బాలాపూరువాసి అయిన బాలకృష్ణ శ్రీరామదాసుస్వామి యొక్క గొప్ప భక్తుడు. ఇతని భార్య పుతలాబాయి కూడా సరిసమానమైన పతివ్రత. వీరిద్దరు ప్రతిఏటా నడకన సజ్జనఘడు దర్శించేవారు. వీళ్ళప్రయాణం పుష్యమాసంలో తమసామాను మోసేందుకు ఒకగుర్రంతో ప్రారంభంఅయేది. మరియు మూడు వస్తువులు, ఒక కట్టమంచం, ఒక చిన్నకర్ర మరియు పవిత్రగ్రంధం దాస్బోధ వీళ్ళతో ఉండేవి. ఇతని పవిత్రత ఏవిధమయిన అహంకారంలేనిది. 

వీళ్ళు దారిలో గ్రామంలో తమకు లభించే భిక్ష స్వీకరిస్తూ, అది తినేముందు శ్రీరామునికి సమర్పించేవారు. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో బహుళ నవమి రోజున తన భార్యతో ఈయన బాలాపూరునుండి రవాణ అయ్యేవారు. దారిలో వీరు రామనామం విడవకుండా అంటూ ఉండేవారు. పెదవులపై ఈనిర్విరామ రామనామంతో, వీళ్ళు షేగాం, ఖాంగాం, మెహకర్, దెవుల్గాం, రాజా మరియు శ్రీఆనందస్వామి గ్రామం అయిన జాలనా మీదుగా ప్రయాణించేవారు. 

జాలనా నుండి శ్రీరామదాసుస్వామి జన్మస్థలమయిన జాంబు వెళ్ళి అక్కడ మూడురోజులు ఉండేవేరు. అక్కడ నుండి వారు దివారు, భీడ్, మెహర్, భళేశ్వర్ మరియు శ్రీరామదాసుస్వామి ప్రముఖ శిష్యుడు కళ్యాణ్ స్థలమయిన డోంగాం వెళ్ళేవారు. 

తరువాత నరశింగపూర్, ఫండరుపూరు, నాటే పోటే సింగణాపూరు, సతారా మీదుగా సజ్జనఘడు మాఘ బహుళ నవమి ఉత్సవాలలో పాల్గొందుకు మాఘ బహుళపాడ్యమికి చేరేవారు.

 శ్రీరామదాసుగారికి కానుకగా అతను తన శక్తికొలది బ్రాహ్మణులకు భోజనాలు పెట్టించేవాడు. ఇతను నిజమయిన రామదాసి. ఈకాలంలో ఇటువంటివారిని చూడడం కష్టం. దాసునవమి ఉత్సవాలు అయిన తరువాత వెళ్ళిన దారినే తిరిగి వచ్చేవారు. అతని వయస్సు 60 సం. అయ్యేవరకు ఇలా ఏళ్ళతరబడి ఈపధ్ధతి జరిగింది. 

ఈసారి తిరుగు ప్రయాణం అయ్యేముందు శ్రీరామదాసుస్వామి సమాధి దగ్గర కళ్ళనీళ్ళతో కూర్చుని ఓ సర్వశక్తివంతమయిన రామదాసుస్వామి ఓగురువరా, మార్గదర్శకా, నేను ముసలివాడిని అయ్యాను, అందువల్ల ఇకముందు ఇంతదూరం కాలినడకన రావడం సంభవం కాదు. వాహనంమీద ప్రయాణించి రావడం కూడా కష్టం అయ్యేలా కనిపిస్తోంది. ఇంతవరకు నేను ప్రతి సంవత్సరం రావడం అనే ప్రక్రియ చేయగలిగాను కాని ఇకముందు ఇది సంభవం కాదని పిస్తోంది.

ఏవిధ మయిన పుణ్యకార్యంగాని, భగవకార్యంకాని వారానుసారంగా చెయ్యడానికి ఆరోగ్యం అవసరం అని మీకుతెలుసు అని ప్రార్ధిస్తూ బాలకృష్ణ నిద్రపోయాడు. అతనికి కలలో నిరాశచెందకు, నువ్వు ఇకనుండి సజ్జనుఘడు రానవసరంలేదు, నీభక్తికి నేను చాలా సంతోషిస్తున్నాను. అందుకే వచ్చే ఏడాది నవమి ఉత్సవాలు నీఇంట్లోనే జరిపించు. అప్పుడు నేను నీదగ్గరకు వస్తాను. ఇది నావాగ్దానం. నవమి ఉత్సవాలకి ఖర్చు నీ పరిధిలోనే ఉండాలి అని తనతో శ్రీరామదాసస్వామి అన్నట్టు బాలకృష్ణ చూసాడు. 

బాలకృష్ణ ఈకలకు చాలాసంతోషించాడు. తన భార్యతో తిరిగి బాలాపూరు వచ్చాడు. ఇక మరుసటి సంవత్సరం బాలాపూరులో ఏమి జరిగిందో వినండి. మాఘబహుళ పాడ్యమినాడు బాలకృష్ణ రామదాసు నవమి ఉత్సవాలు ప్రారంభించాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 45 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 9 - part 4 🌻*

Now listen to another story from Balapur. Balkrishana of Balapur was a great devotee of Shri Ramdas Swami. His wife Putalabai was an equally pious lady, and she, with her husband, used to visit Sajjangad every year on foot. 

Their journey started in the month of Poush with a horse to carry their luggage. They carried three things with them - A kubadi, a small dari and the sacred book of Dasbodh. His piety was free from any form of ego. They accepted alms for food from the villages on way and offered the same food to Shri Ram before eating it. Every year they used to leave Balapur on the 9th Vadya of 'Poush' month. 

On the way, they continuously chanted the name of Rama and thus with the chant of Shri Ram Nama emanating from their lips they travelled via Shegaon, Khamgaon, Mehkar, Deulgaon Raja and Jalna, where they paid respects to Shri Anand Swami. 

Then from Jalna they went to Jamb, the birthplace of Shri Ramdas Swami, where they used to stay for three days. From there, they went to Divara, Bid, Mohari, Beleshwar and Domgaon, the place of Kalyan, the arch devotee of Shri Ramdas Swami. 

Thereafter to Narsingpur, Pandharpur, Nate Pote Shingnapur, Wai and Satara; thus they used to reach Sajjangad on the 1st Vadya of Magh month to attend the celebrations of Navami (Magh).

 As an offering to Shri Ramdas Swami, Balkrishana used to feed the Brahmins to the best extent possible for him. He was a real Ramdasi; it is really difficult to find any Ramdasi like him nowadays. After the celebrations of Ram Navami he used to return the same way he followed while going there. 

This routine of his continued till he became 60 years old. On the eve of starting his return journey, he sat near the Samadhi of Shri Ramdas Swami with tears in his eyes; with extreme grief said, O all powerful Ramdas Swami! 

O my teacher and guide! I have become old now and as such it will not be possible for me to come here all the way hereafter on foot. Even journeying here by a vehicle appears difficult for me. I could follow this routine of an annual visit so far, but it may not be possible hereafter. You know that to follow any sacred or devotional routine, good health is required of the follower.” 

Praying thus, Balkrishna went to sleep. In the dream he saw Shri Ramdas Swami saying to him, Don't despair. You need not come to Sajjangad hereafter. I am very much pleased by your devotion and so wish you to celebrate Navami at your home next year. I will come to you at that time. This is my promise. Expenditure for the celebration of Navami should be within your means.” Balkrishna was very happy about the dream. 

He returned to Balapur with his wife. Now listen to what happened next year at Balapur. Balkrishna started the celebration of Ramdas Navami on the first day of Magh Vadya at Balapur.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 37 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని ఐదవ పాత్ర - పరిణామము - 4 🌻*

142 . ఆత్మకు తాదాప్యము నొందుటకు రూపము కావలెను. అంతవరకు ఆత్మ యొక్క చైతన్యము, సంస్కారములయందే కేంద్రీకృతమై యుండును.

ఇప్పుడు ఆత్మ కొంతకాలముపాటు రూపం లేకుండి, తనకు రూపం లేనట్టుకూడా అనుభవమును పొందుచున్నది.

143. ఆత్మయొక్క చైతన్యము, రూపములో సహచరించి యున్నప్పుడు (తాను అనంతము, శాశ్వతము, నిరాకరము అయివుండి, పరమాత్మతో శాశ్వతంగా యున్నాననెడి సత్యమును పూర్తిగా మరచిపోయి) ఎఱుకతో ఆ రూపముతోగల తాదాత్మ్యతను పోషించుచూ నిజముగా ఆ రూపముతానేనని కనుగొనును.

144. రూపము పోయిన తరువాత, పోయినరూపము యొక్క
అవశేషములైన సంస్కారములు, తరువాతవచ్చు రూపముతో రద్దగు చుండును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సౌందర్య లహరి - 97 / Soundarya Lahari - 97 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

97 వ శ్లోకము

*🌴. వాక్ శక్తి, శరీర ధారుఢ్యము కొరకు 🌴*

శ్లో: 97. గిరామాహుర్ దేవీం ద్రుహిణగృహిణీ మాగమ విదో హరేః పత్నీం పద్మాం హర సహచరీ మద్రి తనయామ్
తురీయా కాపిత్వం దురధిగమ నిస్సీమ మహిమా
మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి.ll

🌷. తాత్పర్యం : 
అమ్మా! పరమాత్మ యగు పరమ శివుని రాణి వగు ఓ తల్లీ, ఆగమవేత్తలు నిన్ను బ్రహ్మదేవుని ఇల్లాలు అగు సరస్వతీ దేవిగాను , విష్ణువు సతియగు లక్ష్మీదేవి గాను శివుని సహచరి అయిన పార్వతి గాను చెప్పుచున్నారు. కాని నీవు యీ ముగ్గురు కంటే అపార మహిమ కలిగి సకల ప్రపంచమును మోహింప చేయు చున్నావు కదా.

🌷. జప విధానం - నైవేద్యం:- ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతీ రోజూ 8 రోజులు జపం చేస్తూ, తేనె, నివేదించినచో వాక్ శక్తి, వాక్శుద్ధి లభించును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹Soundarya Lahari - 97 🌹*
📚. Prasad Bharadwaj 

SLOKA - 97

*🌴 Redemption of the Soul 🌴*

97. Giram aahur devim Druhina-gruhinim agaamavidho Hareh pathnim padhmam Hara-sahacharim adhri-thanayam; Thuriya kapi thvam dhuradhigama-niseema-mahima Maha-maya visvam bhramayasi parabhrahma mahishi.
 
🌻 Translation : 
Oh, parashakthi who is one with parabrahma,though those who have learned vedas,call you as brahma's wife sarawathi,or call you as vishnu's wife lakshmi,or call you as shiva's wife parvathi,you are the fourth called maha maya,who gives life to the world,and have attained all that is to attain.

🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) : If one chants this verse 1000 times a day for 8 days, offering honey as nivedhyam, it is said that one will attain the power to turn his words true.

🌻 BENEFICIAL RESULTS: 
Erudition, youthful energy and appearance, robust body.

🌻 Literal Results: 
Leadership,great physical strength.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 397 / Bhagavad-Gita - 397 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 04 🌴

04. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో |
యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయమ్ ||

🌷. తాత్పర్యం : 
హే ప్రభూ! యోగేశ్వరా! నీ విశ్వరూపమును గాంచుటకు నేను సమర్థుడనని నీవు తలచినచో దయతో ఆ అపరిమితమైన విశ్వరూపమును నాకు చూపుము.

🌷. భాష్యము : 
భౌతికేంద్రియముల ద్వారా దేవదేవుడైన శ్రీకృష్ణుని దర్శించుట, శ్రవణము చేయుట, అవగాహన చేసికొనుట లేదా గ్రహించుట సాధ్యముకాదని తెలపబడినది. 

కాని తొలి నుండియే మనుజుడు ప్రేమయుతసేవలో నిమగ్నుడైనచో అ భగవానుని గాంచగలుగును. వాస్తవమునకు ఆధ్యాత్మిక స్పులింగము మాత్రమేయైన జీవునకు భగవానుని దర్శనముగాని, అవగాహనముగాని సాధ్యముగాని విషయము. 

కనుకనే భక్తుడైన అర్జునుడు తన ఊహాశక్తికి లేదా కల్పనాశక్తిపై ఆధారపడక సామాన్యజీవిగా తన పరిమితిని అంగీకరించి, శ్రీకృష్ణభగవానుని అపరిమేయ స్థితిని కీర్తించుచున్నాడు. పరిమితుడైన జీవునికి అపరిమితుడును మరియు అనంతుడును అయిన భగవంతుని గూర్చి తెలియుట సాధ్యము కాదని అర్జునుడు ఎరుగగలిగెను. 

అపరిమితుడైనవాడు తనను తాను వ్యక్తపరచుకొనినపుడే అతని కరుణచే అతని అపరిమిత స్వభావమును ఎరుగుట సాధ్యపడగలదు. శ్రీకృష్ణభగవానుడు అచింత్యశక్తి సంపన్నుడు కనుకనే “యోగేశ్వరా” యను పదము సైతము ప్రాధాన్యమును సంతరించుకొన్నది. 

అనగా అతడు అపరిమితుడైనను తాను కోరినచో తనంతట తాను వ్యక్తము కాగలడు. కనుకనే అర్జునుడు ఇచ్చట ఆజ్ఞలను ఒసగక అతని నిర్హేతుక, అచింత్యకరుణకై ప్రార్థించుచున్నాడు. 

భక్తిభావనలో తనను సంపూర్ణ శరణాగతుడై భక్తియుతసేవలో నిలువనిదే ఎవ్వరికినీ తనను వ్యక్తపరచుకొనవలసిన అవసరము శ్రీకృష్ణునకు లేదు. కనుక మానసికకల్పనాబలముపై ఆధారపడివారికి శ్రీకృష్ణభగవానుని దర్శించుట సాధ్యము కాదు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 397 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 04 🌴

04. manyase yadi tac chakyaṁ
mayā draṣṭum iti prabho
yogeśvara tato me tvaṁ
darśayātmānam avyayam

🌷 Translation : 
If You think that I am able to behold Your cosmic form, O my Lord, O master of all mystic power, then kindly show me that unlimited universal Self.

🌹 Purport :
It is said that one can neither see, hear, understand nor perceive the Supreme Lord, Kṛṣṇa, by the material senses. 

But if one is engaged in loving transcendental service to the Lord from the beginning, then one can see the Lord by revelation. Every living entity is only a spiritual spark; therefore it is not possible to see or to understand the Supreme Lord. 

Arjuna, as a devotee, does not depend on his speculative strength; rather, he admits his limitations as a living entity and acknowledges Kṛṣṇa’s inestimable position. 

Arjuna could understand that for a living entity it is not possible to understand the unlimited infinite. If the infinite reveals Himself, then it is possible to understand the nature of the infinite by the grace of the infinite. 

The word yogeśvara is also very significant here because the Lord has inconceivable power. If He likes, He can reveal Himself by His grace, although He is unlimited. Therefore Arjuna pleads for the inconceivable grace of Kṛṣṇa. 

He does not give Kṛṣṇa orders. Kṛṣṇa is not obliged to reveal Himself unless one surrenders fully in Kṛṣṇa consciousness and engages in devotional service. 

Thus it is not possible for persons who depend on the strength of their mental speculations to see Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. జ్ఞానులు మహా భక్తులు ఉత్తములకే కష్టాలు ఎందుకు వస్తాయి.? 🌹
 ✍️. డా. పీ. ఎల్. ఎన్.ప్రసాద్
📚. ప్రసాద్ భరద్వాజ

                   మానవుడికి అతడి మొత్తం జన్మ ల రూపం సంచిత కర్మ.అందు లో ఒక జన్మ కి కేటాయించిన కర్మ ప్రారబ్ధ కర్మ. మనకు సందేహం వస్తుంది మనకి ఇంకా ఎన్ని జన్మలున్నాయి ..అని..గతం లోని కర్మ ల కారణం గా , ఆ కర్మలన్నీ తీరి పోవడానికి మరొక 100 జన్మలు అవసరం అవుతాయని అనుకుందాము.అతడి కర్మలను బట్టి .ఈ రాబోయే జన్మల సంఖ్య ఒక్కో మానవుడికి ఒక్కో విధంగా ఉంటుంది..రాబోయే జన్మ ల సంఖ్య లెక్క ఇప్పటి వరకు నిర్ధారించబడింది..ఆంటే. ఇప్పటి వరకు ఉన్న రుణాలు కొన్ని నిర్ధారితం జన్మలలో తీరుతాయి అని అర్ధం...ఆంటే 
అది Bank loan Installment భాషలో ఇన్నిEMI లు 
ఉన్నాయి అని అర్ధం. ఇక నుండి మనం కొత్త కర్మలు లేదా కొత్త రుణాలు చేయకపోతే.!
        వ్యాధులు బాధలు కష్టాలు. శత్రుత్వాలు అప్పులు అన్నీ కర్మ ఋణాలే. ఇవన్నీ సహజంగా కాలగతి లో సమయాన్ని అనుసరించి వచ్చి , తీరిపోతాయి. వీటిని భరించలేక మనం చేసే ప్రయత్నాల వలన కర్మలు అనుభవించవలసిన కాలం పెరిగి , ఆంటే మన జన్మ ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది..ఆంటే EMI లు పెరుగుతాయి.
          భగవంతుడిని కానీ మరో దేవతలని కానీ ప్రత్యేకించి 
ప్రార్ధించి కొన్ని వ్యాధులు కొన్ని కర్మలని సమయం కన్నా ముందే పోగొట్టుకోవలనే తీవ్ర ప్రయత్నం వలన , ఆ కర్మలు ప్రస్తుత జన్మ లో అదృశ్యం అయి , తిరిగి వచ్చే జన్మ లో. నిర్ధారత సమయం వరకు వేధిస్తాయి.. 
         ఈ కారణంగా నే జ్ఞానులు. యోగులు. ఉత్తములు. కర్మలను త్వరగా అనుభవించేయాలని చూస్తారు..ఇంక ఎన్నాళ్ళు మరో జన్మ ? "ఇంక జన్మ వద్దు మోక్షం కావాలి " అనుకునే వారికి ఒక చిత్రం జరుగుతుంది..
         ఈ ఉత్తములు తమ కోరిక కి అనుగుణం గా , వారు మోక్షానికి వెళ్లి పోవడానికి , వారికి రాబోయే జన్మలన్నింటి కర్మలని ఇప్పుడే ఆనుగ్రహిస్తారు..లేదా రాబోయే జన్మల సంఖ్య తగ్గుతుంది..ఆంటే Bank భాషలో మీ కోరిక ప్రకారం మీ EMI లు తగ్గాయి..అప్పుడు జరిగే పరిణామం ఏమిటి ? 
     విపరీతం. గా వ్యాధులు అవమానాలు తిరస్కారాలు అప్పులు, ఇంత బయట దుర్భర స్థితి ఏర్పడుతుంది. మీరు గమనించండి..ప్రపంచం లో మహాత్ములందరికీ ఇదే స్థితి.. త్వరగా మోక్షం ఇప్పించు ప్రభు..అని వేడుకున్నారు.. వీరు భగవంతుడిని నిరంతరం భగవంతుడిని మనస్సులో నిలిపుకుని. ఆ వేదనలు అనుభవించారు. సక్కుబాయి
తుకారామ్ ,మీరా. ఏసక్రీస్తు ఎవరైనా ఇలాగే కర్మలు త్వరగా 
అనుభవించారు..మీరు. "ఈ కష్టాలు బాధలు అనుభవించడం మా వల్ల కాదు " అన్నారో. మీ జన్మల EMI లు పెరిగిపోతాయి. మహాత్ములు భక్తులు యోగులు ఎక్కువగా కష్టాలు పడ టా నికి కారణం ఇదే..
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 217 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
48. అధ్యాయము - 3

*🌻. కామశాపానుగ్రహములు - 2 🌻*

బ్రహ్మోవాచ |

కౌసుమాని తథాస్త్రాణి పంచాదాయ మనోభవః | ప్రచ్ఛన్నరూపీ తత్రైవ చింతయామాస నిశ్చయమ్‌ || 11

హర్షణం రోచనాఖ్యం చ మోహనం శోషణం తథా | మారణం చేతి ప్రోక్తాని మునే ర్మోహకరాణ్యపి || 12

బ్రహ్మణా మమ యత్కర్మ సముద్దిష్టం సనాతనమ్‌ | తదహైవ కరిష్యామి మునీనాం సన్నిధౌ విధేః || 13

తిష్ఠంతి మునయశ్చాత్ర స్వయం చాపి ప్రజాపతిః | ఏతేషాం సాక్షి భూతం మే భవిష్యంత్యద్య నిశ్చయమ్‌ || 14

సంధ్యాపి బ్రహ్మణా ప్రోక్తా చేదానీం ప్రేషయేద్వచః | ఇహ కర్మ పరీక్ష్యైవ ప్రయోగాన్మోహయామ్యహమ్‌ || 15

బ్రహ్మ ఇట్లు పలికెను -

మనస్సులో ఉదయించు మన్మథుడు అయిదు పుష్పబాణములను తీసుకొని, ప్రచ్ఛన్న రూపముతో అక్కడనే యుండి ఆలోచించి ఒక నిశ్చయమునకు వచ్చెను (11). 

మునులకు కూడ మోహమును కలిగించు ఈ బాణములకు హర్షణము, రోజనము, మోహనము, శోషము మరియు మారణము అని పేర్లు (12). 

బ్రహ్మ నాకు ఉపదేశించిన సనాతన సృష్టి కార్యమును నేను ఇచటనే ఈ మునుల సన్నిధిలో, బ్రహ్మ సన్నిధిలో ప్రయోగించెదను (13). 

ఇచట మునులు ఉన్నారు. ప్రజాపతి కూడ స్వయముగ ఉన్నాడు. నా నిశ్చయమునకు వీరందరు ఈనాడు సాక్షులు కాగలరు (14). 

సంధ్య కూడ ఇచట గలదు. బ్రహ్మచే నిర్దిష్టమైన పుష్పబాణ ప్రయోగరూప కర్మను పరీక్షకొరకై ఈమె యందు ఆచరించి నేను ఈమెను మోహింపజేయగలను (15).

ఇతి సంచింత్య మనసా నిశ్చిత్య చ మనోభవః | పుష్పజం పుష్పజాతస్య యోజయామాస మార్గణౖః || 16

ఆలీఢ స్థానమాసాద్య ధనురాకృష్య యత్నతః | చకార వలయాకారం కామో దన్వివరస్తదా || 17

సంహితే తేన కోదండే మారుతాశ్చ సుగంధయః | వవుస్తత్ర మునిశ్రేష్ఠ సమ్యగాహ్లాద కారిణః || 18

తతస్తానపి ధా త్రా దీన్‌ సర్వానేవ చ మానసాన్‌ | పృథక్‌ పుష్పశ##రైస్తీక్ణై ర్మోహయామాస మోహనః || 19

తతస్తే మునయస్సర్వే మోహితాశ్చాప్యహం మునే | సంహితో మనసా కంచిద్వికారం ప్రాపురాదితః || 20

మన్మథుడు మనసులో నిట్లు నిశ్చయించుకొని పుష్పధనస్సుపై పుష్ప బాణములను ఎక్కు పెట్టెను (16). 

అపుడు ధనుర్ధారులలో శ్రేష్ఠుడగు కాముడు కుడికాలును ముందుకు వంచి, ఎడమ కాలును వెనుకకు పెట్టి, ధనస్సును బలముగా లాగి గుండ్రముగా చేసెను. (17). 

ఆతడు ధనస్సును ఎక్కు పెట్టగానే పరిమళ భరితములు అగు వాయువులు అచట వీచినవి. ఓ మహర్షీ! ఆ వాయువులు గొప్ప ఆహ్లాదమును కలిగించినవి (18). 

మోహింప జేయు ఆ మన్మథుడు తీక్ణములగు పుష్పబాణములతో బ్రహ్మను, ఆతని మానస పుత్రులనందరినీ మోహింపజేసెను (19). 

ఓ మునీ! అపుడు నేను మరియు ఆ మునులందరు మోహితులమైతిమి. మొట్టమొదటిసారిగా బ్రహ్మాదులు మనస్సులో ఒక విలక్షణమైన వికారమును పొందిరి (20).

సంధ్యాం సర్వే నిరీక్షంతస్సవికారం ముహుర్ముహుః | ఆసన్‌ ప్రవృద్ధమదనాః స్త్రీ యస్మాన్మదనైధినీ || 21

తతస్సర్వాన్‌ స మదనో మోహయిత్వా పునః పునః | యథేంద్రియవికారంతే ప్రాపుస్తానకరోత్తథా || 22

ఉదీరితేంద్రియో ధాతా వీక్ష్యాహం స యదా చ తామ్‌ | తదైవ చోన పంచాశద్భావా జాతాశ్శరీరతః || 23

సాపి తైర్వీక్ష్య మాణాథ కందర్పశరపాతనాత్‌ | చక్రే ముహుర్ముహుర్భావాన్‌ కటాక్షావరణాదికాన్‌ || 24

వారందరు సంధ్యను మరల మరల వికారములతో చూచిరి. వారి మన్మథ వికారములు వృద్ధిపొందెను. స్త్రీ కామవికారమును వృద్ధి జేయును గదా! (21). 

ఇట్లు ఆ మన్మథుడు వారినందరిని మరల మరల మోహింపజేసి, వారు ఇంద్రియ వికారమును పొందునట్లు చేసెను (22). 

బ్రహ్మనగు నేను ఆమెను వృద్ధిపొందిన ఇంద్రియ వికారముతో చూచుచున్న సమయములో శరీరము నుండి నలభై తొమ్మిది పదార్థములు పుట్టినవి (23). 

వారు ఇట్లు చూచుచుండగా, ఆమెపై కూడ మన్మథ బాణముల ప్రభావము పడెను. ఆమెయు క్రీగంటితో చూచుట, సంజ్ఞలతో ఆహ్వానించుట మొదలగు శృంగార వికారములను అధికముగా చేయజొచ్చెను (24).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 93 🌹*
Chapter 31
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj

*🌻 Nakedness - Wines Intoxication 🌻*

This is the Avataric age, and this age is the season of spring. Creation is our Father's garden of love. 

The Avatar has planted a new garden of love for us, within us, and he showered wine instead of water on each flower so our hearts will blossom. Now is the time to desire these drops of wine in our hearts and remain intoxicated, for this Avataric age is the age of wine! 

This desire of remaining intoxicated with his wine will gradually wipe out all other desires. Intoxicated, one can shed his clothes and stand naked before God, and when one has become completely naked he will see God.  

The power of wine, intoxication, makes a man a slave of God. It is the force of desires that makes a man the slave of Maya. In the domain of Maya, both robes and rags are bindings. 

One wears an embroidered robe and another wears dusty rags, but whether it is a robe of a king or queen, or the rags of a leper or beggar, they are still clothes which, after all, hide our nakedness. If one does what is conventionally regarded as good deeds, he wears a robe. 

If one does what is conventionally considered bad, he wears rags. In either way one is not unencumbered of clothes, and so cannot enjoy the spring-tide of this Avataric age. 
 
However, if one does anything for the Avatar for the sake of him and his love, he is bound neither in robes nor in rags. On the contrary, any action in the name of the Avatar makes the clothes already covering one gradually disappear. 

Then a lover can endure being naked before him in the Avatar's season of spring. It is easy to get rid of one's desires during this season, for the Avatar has already worked to prepare an atmosphere for individuals to become naked by giving them his wine of intoxication. 
 
It is the time to accept the wine of this age. Now is the time to try to become his fortunate slaves, naked before him—to become unclothed from desires by honoring the wine he gives us. Through the wine of divine intoxication he will manifest his divinity in us and, naked we will see him as he really is.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 104 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. పిప్పలాద మహర్షి - 6 🌻*

33. సౌర్యాయణి అనే ఋషి పిప్పలాదుని, “డెవా! శరీరంలో నిద్రించేది ఏది? మేల్కొనేది ఏది? సుఖమంటే ఏమిటి?” అనీ అడిగాడు. 
దానికి పిప్పలాదుడు, “ఇంద్రియములన్నీకూడా మనసులో లయం చెందటమే నిద్ర. ఇంద్రియాలు మనసులో లయిస్తాయి. జ్ఞానేంద్రియ పంచకము – అంటే కన్ను, చర్మము వంటి కర్మేంద్రియపంచకము వెనుక సూక్ష్మరూపంలో ఉండే జ్ఞానేంద్రియ పంచకము – మనసులో లయిస్తే దానిని నిద్ర అంటాము” అని చెప్పాడు. 

34. “ఈ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ పంచకము, అంతఃకరణ చతుష్టయాన్ని నడిపించటానికి కావలసిన ప్రాణశక్తిని మనలోంచి ఉద్భవంచేసి నడిపించేశక్తి ఆ పరమాత్మయందు ఉంది. కాని దానియందు ఈ ఇంద్రియములుకాని, ఈ ధాతువులుకాని ఏవీ ఉండవు. వాటికన్నిటికీ కావల్సిన శక్తిమాత్రమే అందులో ఉంటుందికాని దానిలో వస్తువులేవీ ఉండవు” అని తెలిపాడు.

35. ఓంకారోపాసన గురించి తెలియచేయమని మరొక ఋషి అడిగాడు. 
దానికి పిప్పలాదుడు, “ఓంకారం ఏ కొద్దికాలం ఉపాసించినవారైనాసరే ఋగ్వేదాభిమాని అయినటువంటి దేవతలవల్ల మళ్ళీ మనుష్యులై పుడతారు. అయితే అధికంగా ఉపాసన చేసినవాళ్ళు యజుర్వేదాభిమాని అయినటువంటి చంద్రుడివల్ల చంద్రమండలానికి వెళ్ళి తిరిగివస్తారు. 

36. త్రిమాత్ర అంటె ఇంకా ఎక్కువ ఉపాసించినవాళ్ళు, పాప విముక్తులై, సామవేదాభిమాని దేవతచే సూర్యమండలమార్గంలో బ్రహ్మలోకానికి వెళతారు. ఋక్‌యజుస్‌సామవేదాలకు ఉత్కృష్టస్థితి ఈ క్రమంలో ఉంటుంది” అని చెప్పాడు.

37. “షోడశ కళాపురుషులు అంటే ఎవరు?” అని మరొక ఋషి అడిగారు. “అతడు శరీరంలో ఉన్నాడు. కాబ్ట్టి దేహం స్వస్థంగా ఉండటానికి ఆధారమైన ఐదు విధముల ప్రాణశక్తి, ఆ ప్రణానికి తోడుగా శ్రద్ధ, ఐదు ఇంద్రియాలు, పృథ్వి మొదలైన పంచభూతములు – ఇవే పురుషులు. మనసు, అన్నము, వీర్యము సమస్తమూ పుడుతూ నిత్యమూ జీవనక్రియ నడుస్తూ ఉందికదా! 

38. ఈ క్రియలన్నిటినీ షోడశకళలంటారు. నదులన్నీ సముద్రంలో ప్రవేశించినట్లు, అవన్నీ సర్వసాక్షి అయిన పురుషుడిలోపల ప్రవేశించి అస్తమిస్తాయి. దానినే మృత్యువంటారు. అవి శాశ్వతంగా అస్తమిస్తే అతడు అమృతుడవుతాడు. ఆ పురుషునిలోకి వెళ్ళి నిద్రించినపుడే మృత్యువు, మళ్ళీ బయటకు వచ్చినప్పుడు పునర్జన్మ ఉంటుంది. మళ్ళీ రాకుండా వెళితే మాత్రం అది మృత్యువుకాదు, అమృతత్త్వం” అని చెప్పాడు పిప్పలాదుడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 169 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 16. The ‘I am’ is your greatest foe and greatest friend, foe when binding to the illusion as body, friend when taking out of the illusion as body. 🌻*

When the sense or feeling ‘I am’ appeared on you it duped you into believing that you are the body and later on you are so and so. 

It strengthened the illusion all the more as time went by and thus began all the turmoil and suffering, in this sense it is your foe. 

But now the Guru tells you to come back to the ‘I am’, understand it, stay there, make friends with it or rather make it your guide, God or Guru. 

 Doing so the ‘I am’ shall help you break the illusion and it will itself lead you to the source.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 6 / Sri Vishnu Sahasra Namavali - 6 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻* 

*అప్రమేయో హృషీకేశః* *పద్మనాభోఽమరప్రభుః |*
*విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధ్రువః ‖ 6 ‖*

 46) అప్రమేయ: - 
ఏ విధమైన ప్రమాణములకు అందనివాడు.

47) హృషీకేశ: - 
ఇంద్రియములకు ప్రభువు.

48) పద్మనాభ: - 
నాభియందు పద్మము గలవాడు.

49) అమరప్రభు: - 
దేవతలకు ప్రభువైనవాడు.

50) విశ్వకర్మా - 
విశ్వరచన చేయగల్గినవాడు.

51) మను: - 
మననము(ఆలోచన) చేయువాడు.

52) త్వష్టా - 
ప్రళయకాలమున సమస్త భూతములను కృశింపజేసి నశింపజేయువాడు.

53) స్థవిష్ఠ: - 
అతిశయ స్థూలమైన వాడు.

54) స్థవిరోధ్రువ: - 
సనాతనుడు, శాశ్వతుడైనవాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 6 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*aprameyō hṛṣīkeśaḥ* *padmanābhōmaraprabhuḥ |*
*viśvakarmā manusvtaṣṭā* *sthaviṣṭhassthavirō dhruvaḥ || 6 ||*

46) Aprameya – 
The Lord Who is Beyond Rules, Regulations and Definitions

47) Hrishikesha – 
The Lord of Senses

48) Padmanabha – 
The Lord Who has a Lotus (From Which the World Evolved) Growing on his Belly

49) Amara Prabhu – 
The Lord of Immortals

50) Vishwa-Karma – 
The Creator of the Universe

51) Manu – 
The Lord Who Thinks (Worries) of Everything

52) Twashta – 
The Lord Who Makes Huge Things Small

53) Sthavishtha – 
The Supremely Gross

54) Sthaviro-Dhruva – 
The Lord Who is Ancient and Permanent

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 5 / Vishnu Sahasranama Contemplation - 5 🌹* 
*📚. ప్రసాద్ భరద్వాజ*

*5. భూతకృత్, भूतकृत्, Bhūtakr̥t*

*ఓం భూతకృతే నమః | ॐ भूतकृते नमः | OM Bhūtakr̥te namaḥ*

భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 'అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయస్తథా' (7.6) అని తెలిపియున్నాడు. 'నేను సమస్తమైన ప్రపంచముయొక్క ఉత్పత్తికి కారణభూతుడను. ఆ ప్రకారమే నాశమునకు (ప్రళయమునకు) కారణభూతుడను అయియున్నాను.'

సర్వ భూతాని కౌన్తేయ ప్రకృతిం యాన్తి మామికామ్ ।
కల్పక్షయే పునస్తాన్తి కల్పదౌ విసృజామ్యహమ్ ॥ (9.7)

రాజవిద్యా రాజగుహ్యయోగాధ్యాయములో అ పరమాత్మ 'సమస్త ప్రాణికోట్లు ప్రళయకాలమున నా ప్రకృతిని (మాయను) జేరి అందు అణగియుండును. తిరిగి సృష్టికాలమున వానిని నేను సృజించుచుందును' అని అర్జునునకు తెలిపినదానిలో కూడా 'భూతకృత్‌' నామార్థాన్ని చూడవచ్చును. ఈ రెండు శ్లోకాలు సృష్టి-ప్రళయ సమయాలలో ఆయనచేసే సృష్టి, లయలను గురించి తెలుపుతున్నాయి. శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్రంలోని ఈ ఐదవ నామానికి అర్థం, సాధారణ పరిస్థితులలో జరిగే జనన, మరణాలకు కూడా అనువయించుకొనవచ్చును.

‘భూతాని కరోతి ఇతి’ అని వ్యుత్పత్త్యర్థము. రజోగుణమును ఆశ్రయముగా తీసుకొని చతుర్ముఖ బ్రహ్మ రూపముతో ఆయాప్రాణులను సృష్టించుచున్నాడు. ‘భూతాని కృంతతి ఇతి భూతకృత్’ - భూతములను ఛేదించును; ‘భూతాని కృణోతి’ - భూతములను హింసించును; తమోగుణమును ఆశ్రయించి భూతములను ఛేదించును - లేదా హింసించును.

[ఇందు వరుసగా - (డు) కృఞ్ - కరణే (చేయుట అను అర్థమునందు) తనాదిగణః; కృతీ - ఛేదనే (ఛేదించుట అను అర్థము) - తుదాదిః; కృఞ్ - హింసాయామ్‌; (హింసించుట) తనాదిః; అను ధాతువులతో 'భూత' అను ఉపపదము సమాసము నందినది.]

In the Gitā, the Lord enlightens Arjuna ‘Ahaṃ kr̥tsnasya jagataḥ prabhavaḥ pralayastathā’ (7.6) - I am the origin as also the end; termination of the whole Universe.

In the subsequent chapters, we come across another stanza in which we can search for the meaning of the name 'Bhūtakr̥t.'

Sarva bhūtāni kauntēya prakr̥tiṃ yānti māmikām,
kalpakṣaye punastānti kalpadau visr̥jāmyaham. (9.7)

'O son of Kuntī, all the beings go back at the end of a cycle to My Prakr̥ti. I project them forth again at the beginning of a cycle.'

The context above is that of the cycles of creation and dissolution. However, the birth and death cycles that a Jīva goes through can also be looked at - as governed by Him.

The creator and destroyer of all existences in the universe. Assuming Rajoguṇa, He as Brahmā, is the generator of all objects. Kr̥t can also be interpreted as Kr̥ntana or dissolution. The name can therefore also mean one who, as Rudra, destroys the worlds, assuming the Guṇa of Tamas.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka : 

विश्वं विष्णुर्वषट्कारो भूतभव्यभवत्प्रभुः ।
भूतकृद्भूतभृद्भावो भूतात्मा भूतभावनः ॥ 1 ॥
విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః ।
భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః ॥ 1 ॥
Viśvaṃ viṣṇurvaṣaṭkāro bhūtabhavyabhavatprabhuḥ ।
Bhūtakr̥dbhūtabhr̥dbhāvo bhūtātmā bhūtabhāvanaḥ ॥ 1 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 47 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మ విచారణ పద్ధతి - 11 🌻*

శాశ్వతమైనటువంటి ఆత్మ దృష్ట్యా చూచినప్పుడు ఇవన్నీ కూడా అశాశ్వతములైనటువంటివి. 

వీటి యెడల నీ అంతరంగాన్నీ పూనడం అంటే నీ అంతరంగాన్ని పనిచేయించడం సరియైనటువంటి పద్ధతి కాదు, అది జీవ పద్ధతి, ఆత్మభావ పద్ధతి కాదు. కావున ప్రయత్నించి ఇటువంటి పద్ధతిని విడనాడాలి. అందుచేత కర్మఫలాపేక్షను వదలి కర్తవ్య కర్మలను నాచికేతాగ్ని చయన మొనరించి సాపేక్షిక నిత్యత్వం గల యమాధికారమును పొందితిని.

         ఆయన అష్టదిక్పాలకులలో ఒకరిగా యమధర్మరాజు గా ఆయనకి ఆ స్థానం ఎలా లభించిందో ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన వీటన్నింటినీ విసర్జించాడు. వీటన్నిటియందు వైరాగ్యమును కలిగివున్నాడు. ఇంకేం చేశాడు. కేవలం కర్తవ్య నిష్ట మాత్రమే కలిగివున్నాడు. 

ఆ కర్తవ్య నిష్ట చేత ఎవరి ప్రాణములను ఎప్పుడు హరించవలసి వచ్చినా ఆఖరికి అవతార పురుషులైనా, శ్రీరామచంద్రుడైనా, శ్రీకృష్ణమూర్తి అయినా సరే కాలమాసన్నమైనపుడు వినయముగా అవతార పురుషునివద్దకు వెళ్ళి “అయ్యా! మీ సమయం పూర్తయింది. మీరిక అవతారాన్ని చాలించండి“ అని చెప్పేటటువంటి సమవర్తి యమధర్మరాజు. 

కాబట్టి నిర్భయత్వముతో, నిర్భీతితో నిరంతరాయముగా తాను సహజముగా సాక్షిగా నిలబడి కర్తవ్య కర్మను మాత్రమే ఆచరించేటటువంటి వ్యక్తి.

         ఇంకేమిటటా - మిగిలిన అంశాలనన్నింటినీ నాచికేతాగ్ని సంచయనము వాటియందు – ‘సంచయనము’ అంటే బాగా గుర్తుపెట్టుకోండి నిశ్శేషముగా లేకుండా చేయుట. 

ఇది సంచయనము అంటే అర్ధం. ఇన్ని అకర్మలను ఆచరించినా కూడా ఎంతో కొంత శేషభాగం మిగిలిపోతుంది. ఆ శేషభాగాన్ని మొత్తాన్ని పట్టుకెళ్ళి నాచికేతాగ్ని అనే యజ్ఞంలో పూర్ణాహుతిగా నిశ్శేషముగా దగ్ధము చేయుట. సంచయనము అంటే నిశ్శేషముగా పోగొట్టుకొనుట. 

అటువంటి సంచయనము ఒనర్చడం చేతనే ఆయన సాపేక్షిక నిత్యత్వము గల యమాధికారమును పొందాడు. అంటే స్వయముగా ఈశ్వరుడేమో నిత్యుడు. ఈశ్వరునితో సమానమైనటువంటి నిత్యత్వం. సాపేక్షిక నిత్యత్వం అంటే అర్ధం అది. 

ఈశ్వరుడితో సమానమైనటువంటి నిత్యత్వాన్ని పొందినటువంటి యమధర్మరాజు తనకి ఆ స్థితి అట్లా కలిగింది. ఆ ఈశ్వరనియమంతో ఈశ్వరునితో సమముగా వ్యవహరించగలిగేటటువంటి స్థితి ఎట్లా కలిగిందో ఈ అంశములందు బోధించేటటువంటి ప్రయత్నాన్ని మనకి చేశారు.

         ముఖ్యమైన అంశం ఏమిటంటే కామ్య కర్మలను ఫలాపేక్షతో చేసేటటువంటి వాడు మోక్షం పొందజాలరు. తీవ్ర మోక్షేచ్ఛ అనేది వీళ్ళకు కలగదు. అతి ముఖ్యమైన అంశం. ఫలాపేక్షలేకుండా కర్మలని ఆచరించడంచేత, అంటే నిష్కామ కర్మ చేత చిత్తశుద్ధి కలుగుతుంది. 

జ్ఞాన సముపార్జన ద్వారా మోక్షం కలుగుతుంది. ఈ రెండూ చాలా ముఖ్యం. నిష్కామ కర్మ ద్వారా చిత్తశుద్ధి, ఆత్మ విచారణ ద్వారా ఆత్మసాక్షాత్కార జ్ఞానం, జ్ఞాన సముపార్జన ద్వారా మోక్షం అనేవి చాలా ముఖ్యం. 

ఈ రెండు జీవిత లక్ష్యాలనే స్వీకరించి కామ్యక కర్మలను సదా త్యజించవలెను. త్యజించవలెను అంటే ఫల అపేక్షను త్యజించవలెను. ఫల ఆసక్తిని త్యజించవలెను. ఫల ప్రేరణ ద్వారా నువ్వు చేయరాదు. ఈ రకమైనటువంటి కర్తవ్య నిష్ట కలిగివుండాలి. 

తదుపరి చిత్తశుద్ధి ద్వారా నీవు ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించాలి. తద్వారా జీవన్ముక్తిని నీవు పొందగలవాడవు. ఈ రకముగా నీవు తెలుసుకొనవలసినది అని యమధర్మరాజు నచికేతునికి బోధించుచున్నాడు.  

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 24. గీతోపనిషత్తు - మనీషి - నిర్మలమైన బుద్ధి ఏర్పడవలె నన్నచో సతతము లోపల, వెలుపల ఆత్మానుసంధానము చేసుకొను చుండవలెను. దీనిని దైవయోగము అందురు. 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 51, 52, 53 📚*

బుద్ధితో యోగించి, ఫలములను త్యజించి, కర్తవ్యమును నిర్వర్తించు యోగికి నిస్సంగము ఏర్పడగలదు. అతనికి కర్తవ్యము యుండును గాని, వ్యక్తిగతమగు ఆశయములు, గమ్యములు వుండవు.  

కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః |
జన్మబంధవినిర్ముక్తాః పదం గచ్ఛంత్యనామయమ్ || 51 ||

యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి |
తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ || 52 ||

శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా |
సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి || 53 ||

అనగా తాను, తన కర్తవ్యము మాత్రమే యుండును. మరణించ కూడదని యుండదు. పుట్టకూడదని కూడ యుండదు. మరణించకూడదని, పుట్టకూడదని, పుణ్య కర్మలను ఆచరించు వారు కళాసక్తితో ఆచరించు వారే తప్ప వారికి పుట్టని, చావని స్థితి కలుగనేరదు. శ్రీకృష్ణు తెలిపిన యోగజీవులు ఎట్టి సిద్ధుల కొరకును ప్రయత్నింపరు.

 అమరత్వము కొరకు, బ్రహ్మత్వము కొరకు ప్రయత్నముండదు. ఉండుటయే యుండును. కర్తవ్యముండును. వారికి నిస్సంగము పరిపూర్తి యగుటచే కోరకయే సమస్తమును లభించగలదు. 

వారి చేతలయందు కళాసక్తి లేదు
గనుక బంధము నుండి విడువబడిన వారలై యుందురు. బంధము లేక యుండుటయే పరమ పథంము. అట్టి వారు శరీరము నందు కూడ యుందురు. శరీరము వారిని బంధింపదు. ఎటు చూచినను ఫలమునందు ఆసక్తిలేని కర్తవ్య కర్మమే శ్రేయోదాయకమని భగవంతుడు బోధించుచున్నాడు.

బుద్ధి, మోహమును, మాయను, అజ్ఞానమును విసర్జించి, తాను అను వెలుగుగా నున్నప్పుడు నిర్మలమైన బుద్ధి అని తెలియ బడుచున్నది. నిర్మలమైన బుద్ధి ఏర్పడవలె నన్నచో సతతము లోపల, వెలుపల ఆత్మానుసంధానము చేసుకొను చుండవలెను. దీనిని దైవయోగము అందురు. 

అనగా బుద్ధిని దైవముతో జత పరచుట. ఇది నిరంతరము సాగినప్పుడు బుద్ధి నిర్మలమగును. అట్టి బుద్ధితోనే నిష్కామముగ కర్మల నాచరించిన జనన మరణ రూప బంధమునుండి కూడ జీవుడు విడుదలను పొందును అని భగవానుడు చెప్పియున్నాడు. 

అట్టి బుద్ధియే ధర్మముతో కూడిన కర్తవ్యములను సతతము నిర్వర్తించగలదు. అట్టి నిర్వర్తనమే కర్మలయందు కౌశలము అని తెలిపి యున్నాడు.

బుద్ధి, ఆత్మయందు యోగించగ, అట్టి బుద్ధితో యోగించిన మనస్సు కర్మలను క్షేమముగను, కౌశలముగను నిర్వర్తించ గలదని అర్థము. యోగము చెందని మనస్సు కౌశలముగ కర్మలను నిర్వర్తించుట జరుగదు. 

అట్టి మనస్సే కౌశలము పేరున కుటిలత్వము ననుసరించును. కావున బుద్ధిని సదా ఆత్మతో అనుసంధానము చేయవలెను. అట్టి బుద్ధి క్రమశః నిర్మలమగును. చీకిటిని దాటిన బుద్ధిగా వెలుగొందును. అనగా మాయా వర్ణమును దాటి యుండును. అట్లు దాటి యుండుటకు కారణము ఆత్మానుసంధానమే. 

అట్టి బుద్ధి కర్మలను సహజముగనే నిర్లిప్తముగను, బంధములు కలిగించని విధముగను, నిర్వర్తించుచుండును. ఏది వినినను, ఏది చూచినను వికారము చెందదు. చలనము లేని ఇట్టి బుద్ధిని పొందుట కర్తవ్యమని భగవానుడు బోధించుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. అద్భుత సృష్టి - 24 🌹*
 ✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
          
🌟 *8. మానవ దేహం - ఆధ్యాత్మిక కనెక్షన్స్*🌟
*(అనుసంధానం)*

💠. *మానవ దేహం రెండు కనెక్షన్స్ ని (అనుసంధానాలను) కలిగి ఉంటుంది.*
*1. ఇంటర్నల్ కనెక్షన్,*
*2. ఎక్స్ టర్నల్ కనెక్షన్*

🔹 *1. ఇంటర్నల్ కనెక్షన్ (Internal connection)* శరీరంలో ఉన్న శక్తి క్షేత్రాలు అయిన ఏడు చక్రాల కుండలినీ వ్యవస్థ. వీటిని భౌతిక శక్తి క్షేత్రాలు అంటారు.

🔹 *2. ఎక్స్ టర్నల్ కనెక్షన్స్ -విశ్వశక్తి క్షేత్రాలు (External connection)* *"ఆరా"* లో ఉన్న యూనివర్సల్ ఐదు చక్రాల వ్యవస్థ.

భౌతిక శక్తి క్షేత్రాలు 7, విశ్వ శక్తి క్షేత్రాలు5, భౌతికదేహంలోని అణు పరమాణుస్థితిలో ఉన్న న్యూక్లియస్ ఎనర్జీలో DNA లో ఉన్న కోడాన్స్ తో కనెక్ట్ అయి ఉంటాయి.

💫. ఆత్మ యొక్క భౌతిక, విశ్వ సమాచారం అంతా (LEFs) *"లైట్ ఎన్ కోడెడ్ ఫిలమెంట్స్"* లో డేటాలో స్టోర్ చేయబడి ఉంటాయి.

ఈ కోడాన్స్ లోనూ, LEFsలోనూ సమస్తానికి సంబంధించిన సమస్త సమాచారం దాగి ఉంది. (LEFs+Codons =DNA)ని కలిపి *"జెనటిక్ హార్డ్ డ్రైవ్(Genetic hard drive)"* అని పిలుస్తారు.
ప్రతి DNA Strandsలో 12 పొరలు ఉంటాయి. అలాగే 12 కోణాలు ఉంటాయి.

DNA Strandsలో ఉన్న 12 పొరలు లేదా 12 ప్రోగులు 3వ పరిధికి సంబంధించిన భౌతిక చక్రాలతోనూ 5వ పరిధికి సంబంధించిన సోలార్ చక్రాస్ తోనూ కనెక్ట్ అయి ఉంటాయి. ఈ రెండు చక్రా వ్యవస్థల ద్వారా మూలం యొక్క శక్తిని మన దేహంలో అనుసంధానించుకుని భౌతిక అసెన్షన్ ద్వారా 12 ఉన్నత సంభావ్యతలలోకి నేరుగా చేరుకొని మూలంలో (భగవంతునిలో) ఎదుగుతాము.

🌟. *చక్రాస్ ద్వారా DNA లోకి సమాచారం ఎక్కడి నుండి వస్తుంది?*
చక్రా సిస్టమ్ ద్వారా DNAలోకి సమాచారం రెండు ప్రధానమైన మూలాల నుండి వస్తుంది.

*1. వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుండి*

*2. ఉన్నత లోకాల సమాచారం ఉన్నత ఆత్మల నుండి*

💠 *1.వంశపారంపర్యంగా*

🔹. 1.ఈ భౌతిక దేహం ఏ తల్లిదండ్రుల నుండి ప్రాప్తించినదో వారి యొక్క (bloodline) వంశం నుండి మనకు మన మొదటి కణాలు అయిన ప్రైమోర్డియల్ సెల్ (అండం- శుక్రకణాల కలయిక ద్వారా పిండం, జైగోట్ ఏర్పడడం) ద్వారా వంశం యొక్క సమస్త జ్ఞానం DNA లోని సమాచారంగా ఇవ్వబడ్డాయి. ఈ సమాచారం మన గత జన్మలలో చేసిన కర్మలు, మన యొక్క పూర్వీకుల కర్మల నుండి భావాలు, భావావేశాలు, మనస్థితులు, భయాలు, బంధాలు, మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, మూర్ఖత్వం, శక్తి, జ్ఞానం మొదలైనవి ఎన్నో ప్రైమోర్డియల్ సెల్ ద్వారా తెచ్చుకున్నాం, ద్వంద్వత్వ జీవితాన్ని నేర్చుకోవటం కొరకు.

🔹. 2.2000సంవత్సరాల నుండి ఉన్నత తలవాసులు యొక్క సమాచారం, మద్దతు మనకి నాన్ ఫిజికల్ జీవుల నుండి అందుతుంది. నాన్ ఫిజికల్ జీవులనే మనం *"కర్మదేవతలు"* గా పిలుస్తాం. వీరిలో 42 శాశ్వత సభ్యులు, 150 కన్సల్టింగ్ సభ్యులు ఉంటారు. మనం ఎన్నో లోకాలలో జీవించిన జీవితాల సారమైన జ్ఞానం, ఉన్నత సమాచార రూపంలో మన చక్రాల ద్వారా DNA కి అందజేస్తున్నారు. ఇది అంతా కూడా ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ (విద్యుత్ అయస్కాంత క్షేత్రం) ద్వారా జరుగుతుంది.