శ్రీ లలితా సహస్ర నామములు - 180 / Sri Lalita Sahasranamavali - Meaning - 180


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 180 / Sri Lalita Sahasranamavali - Meaning - 180 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 180. యోనిముద్రా, త్రిఖండేశీ, త్రిగుణాంబా, త్రికోణగా ।
అనఘాద్భుత చారిత్రా, వాంఛితార్థ ప్రదాయినీ ॥ 180 ॥ 🍀


🍀 983. యోనిముద్రా :
యోగముద్రలలో ఓకటి

🍀 984. త్రికండేశీ :
3 ఖండములకు అధికారిణి

🍀 985. త్రిగుణా :
3 గుణములు కలిగినది

🍀 986. అంబా :
అమ్మ

🍀 987. త్రికోణగా :
త్రికోణమునందు ఉండునది

🍀 988. అనఘాద్భుత చారిత్రా :
పవిత్రమైన అద్భుత చరిత్ర కలిగినది

🍀 989. వాంఛితార్ధప్రదాయినీ :
కోరిన కోర్కెలు ఇచ్చునది.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 180 🌹

📚. Prasad Bharadwaj

🌻 180. Yonimudra trikhandeshi trigunanba trikonaga
Anaghadbhuta charitra vanchitardha pradaeini ॥ 180 ॥ 🌻

🌻 983 ) Trikhandesi -
She who is the lord of three zones of fire, moon and sun

🌻 984 ) Triguna -
She who is three characters

🌻 985 ) Amba -
She who is the mother

🌻 986 ) Trikonaga -
She who has attained at all vertices of a triangle

🌻 987 ) Anaga -
She who is not neared by sin

🌻 988 ) Adbutha charithra -
She who has a wonderful history

🌻 989 ) Vanchithartha pradayini -
She who gives what is desired


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


10 Jan 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 132


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 132 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : పద్మావతి దేవి

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. సమర్పణ -1🌻

తాను తరింపవలెనని జ్ఞప్తి యున్నవాడెవడును తరింపడు. అతడు గొప్ప సాధకుడు కావచ్చును గాని, తన సాధనకు తానే కేంద్రము.

తాను తరింపవలెనను బుద్ధి స్వలాభబుద్ధియగు స్వార్థమే యగును. దానిని సమర్పణము చేయని వాడెవ్వడు తరింపడు.

సమర్పణ చేయుదమనుకొన్నను అనుకొనుట పోదు కనుక సమర్పణము జరగదు. దేవుని వేషమున తానే తన మనస్సున పగటి వేషగాడై నిలబడి సమర్పించు కొనుటయు, పుచ్చుకొనుటయు చేయును గనుక సమర్పణ జరుగదు.

..... ✍🏼 మాస్టర్ ఇ.కె.🌻


🌹 🌹 🌹 🌹 🌹


10 Jan 2022

శ్రీ శివ మహా పురాణము - 502


🌹 . శ్రీ శివ మహా పురాణము - 502 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 41

🌻. వివాహ మండపము -2 🌻

ఓ నారదా! మహాప్రాజ్ఞా! శివుడు పార్వతిని వివాహమాడుటకై గణములతో కూడి వరయాత్రా సమేతుడై ఇంతవరకు రాలేదు (11). ఓ నారదా! ఇది విశ్వకర్మ సద్బుద్ధితో చేసిన విచిత్రమని యెరుంగుము. ఓ దేవర్షీ! విస్మయమును వీడుము. స్వస్థుడవై శివుని స్మరించుము (12). నీవు భోజనము చేసి , విశ్రమించి, నాపై దయ యుంచి, మైనాకుడు మొదలగు పర్వతములతో గూడి ఆనందముతో శంకరుని వద్దకు వెళ్లుము (13).

ఓ మహామతీ! ఈ పర్వతములతో గూడి నీవు శీఘ్రమే శివుని వద్దకు వెళ్లి ప్రార్థించుము. దేవతలతో కూడి యున్నవాడు, మహర్షుల సంఘములచే, మరియు దేవతలచే రాక్షసులచే పూజింపబడే చిగుళ్ల వంటి పాదములు గలవాడు అగు శివుని ఇచటకు తీసుకొని రమ్ము (14).

బ్రహ్మ ఇట్లు పలికెను-

సరే యని పలికి నీవు వెంటనే ఆ పర్వత రాజకుమారులతో, మరియు ఇతరులతో గూడి మరలివచ్చితివి. విశాల హృదయుడవగు నీవు అచటి కార్యమును చక్కబెట్టి, భోజనము చేసి శీఘ్రమే శివుని సన్నిధికి వచ్చితివి (15). అచట దేవతలు మొదలగు వారిచే చుట్టు వారబడి యున్న మహాదేవుని చూచి నీవు, ఆ పర్వతులు భక్తితో ఆయనకు నమస్కరించిరి (16).

ఓ మునీ! అపుడు నేను, విష్ణువు, ఇంద్రుడు, సర్వ దేవతలు, మరియు రుద్రుని అనుచరులు అందరు నిన్ను ప్రశ్నించితిమి (17). అనేకములగు ఆభరణములను ధరించి యున్న మైనాక సహ్య మేరు ఇత్యాది పర్వతులను చూచిన వెంటనే అందరి మనస్సులు సందేహముచే వ్యాకులమైనవి. వారికి విస్మయము కలిగినది (18).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


10 Jan 2022

గీతోపనిషత్తు -304


🌹. గీతోపనిషత్తు -304 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 20 - 1 📚

🍀 20-1. కోరికలు - ఆరాధకులు వారి స్వభావమును బట్టి అనేకానేకమగు కోరికలతో దైవమును ప్రార్ధించుచు నుందురు. అసురు లొక రకముగ కోరుచుందురు. దేవతలు మరొక రకముగ కోరుచుందురు. భోగభాగ్యములు, కీర్తిని, ఆరోగ్యమును, ఆయుషును, బలమును, వీర్యమును, విద్యను, వంశాభివృద్ధిని, రక్షణమును- ఇట్లెన్నియో విషయములను అన్ని సంప్రదాయముల వారును ఏదో ఒక విధముగ కోరుచునే యుందురు. 🍀

త్రైవిద్యా మాం సోమపా: పూతపాపా యథైరిష్ట్యా స్వర్గతిం ప్రార్థయంతే |
పుణ్యమాసాద్య సురేంద్రలోక మశ్నంతి దివ్యానివి దేవభోగాన్ || 20

తాత్పర్యము : స్వర్గప్రాప్తిని వేడుకొనుచు, మూడు వేదము లధ్యయనము చేయువారు, సోమపానము కొరకై సోమయజ్ఞము చేసినవారు, పుణ్యకర్మలు చేసినవారు, పై విధముగ నన్ను పూజించినవారు సురేంద్ర లోకమును చేరి, దివ్యమగు భోగములను అనుభవించు చున్నారు.

వివరణము : ఎవరు దేనిని గూర్చి ప్రార్ధన చేసిన వారికది లభించుట సృష్టియందు సహజము. సంకల్పబలము, శుద్ధి, దీక్ష కలిగి దేనిని కోరి దైవమును ప్రార్థించినను, అద్దానిని దేవుడిచ్చుట జరుగుచు యుండును. ఆరాధకులు వారి స్వభావమును బట్టి అనేకానేకమగు కోరికలతో దైవమును ప్రార్ధించుచు నుందురు. అసురు లొక రకముగ కోరుచుందురు. దేవతలు మరొక రకముగ కోరుచుందురు.

భోగభాగ్యములు, కీర్తిని, ఆరోగ్యమును, ఆయుషును, బలమును, వీర్యమును, విద్యను, వంశాభివృద్ధిని, రక్షణమును- ఇట్లెన్నియో విషయములను అన్ని సంప్రదాయముల వారును ఏదో ఒక విధముగ కోరుచునే యుందురు. గజతురగాది బలమును, పశుగణమును కోరువారుకూడ గలరు. వర్షము కోరువారు, ఫలపుష్ప సంపదను కోరువారు, అందమును కోరువారు ఇట్లు కోటాను కోట్ల కోరికలు జీవులు దైవమును కోరుచునుందురు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


10 Jan 2022

10-JANUARY-2022 సోమవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 00, సోమవారం, జనవరి 2022 ఇందు వాసరే 
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 304 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 502🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -132🌹  
5) 🌹 Osho Daily Meditations - 121🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 180 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 180 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ సోమవారం మిత్రులందరికీ 🌹*
*ఇందు వాసరే, 10, జనవరి 2022*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. రుద్రనమక స్తోత్రం: - 6 🍀*

*అసౌ తామ్రోరుణో బభ్రుః నీలగ్రీవ స్సుమంగళః!*
*విలోహితో స్త్వయం శంభో త్వదధిష్ఠాన ఏవహి!!11!!*
*నమో నమస్తే భగవన్ నీలగ్రీవ మీఢుషే!*
*సహస్రాక్షాయ శుద్ధాయ సచ్చిదానంద మూర్తయే!!12!!*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం,  
హేమంత ఋతువు, పౌష్య మాసం
తిథి: శుక్ల-అష్టమి 12:26:58 వరకు
తదుపరి శుక్ల-నవమి
నక్షత్రం: రేవతి 08:50:34
వరకు తదుపరి అశ్విని
యోగం: శివ 10:35:35 వరకు
తదుపరి సిధ్ధ
కరణం: బవ 12:27:58 వరకు
సూర్యోదయం: 06:48:33
సూర్యాస్తమయం: 17:58:27
వైదిక సూర్యోదయం: 06:52:26
వైదిక సూర్యాస్తమయం: 17:54:36
చంద్రోదయం: 12:28:54
చంద్రాస్తమయం: 00:22:33
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: మీనం
వర్జ్యం: -
దుర్ముహూర్తం: 12:45:50 - 13:30:30
మరియు 14:59:49 - 15:44:29
రాహు కాలం: 08:12:18 - 09:36:02
గుళిక కాలం: 13:47:15 - 15:10:59
యమ గండం: 10:59:46 - 12:23:30
అభిజిత్ ముహూర్తం: 12:01 - 12:45
అమృత కాలం: 27:44:00 - 40:48:40
మరియు 28:17:24 - 37:54:12
మతంగ యోగం - అశ్వ లాభం 08:50:34
వరకు తదుపరి రాక్షస యోగం - మిత్ర కలహం
పండుగలు : మాస దుర్గాష్టమి, 
శాకంబరి ఉత్సవ ఆరంభం
Masik Durgashtami
Shakambhari Utsavarambha
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -304 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 20 - 1 📚*
 
*🍀 20-1. కోరికలు - ఆరాధకులు వారి స్వభావమును బట్టి అనేకానేకమగు కోరికలతో దైవమును ప్రార్ధించుచు నుందురు. అసురు లొక రకముగ కోరుచుందురు. దేవతలు మరొక రకముగ కోరుచుందురు. భోగభాగ్యములు, కీర్తిని, ఆరోగ్యమును, ఆయుషును, బలమును, వీర్యమును, విద్యను, వంశాభివృద్ధిని, రక్షణమును- ఇట్లెన్నియో విషయములను అన్ని సంప్రదాయముల వారును ఏదో ఒక విధముగ కోరుచునే యుందురు. 🍀*

*త్రైవిద్యా మాం సోమపా: పూతపాపా యథైరిష్ట్యా స్వర్గతిం ప్రార్థయంతే |*
*పుణ్యమాసాద్య సురేంద్రలోక మశ్నంతి దివ్యానివి దేవభోగాన్ || 20*

*తాత్పర్యము : స్వర్గప్రాప్తిని వేడుకొనుచు, మూడు వేదము లధ్యయనము చేయువారు, సోమపానము కొరకై సోమయజ్ఞము చేసినవారు, పుణ్యకర్మలు చేసినవారు, పై విధముగ నన్ను పూజించినవారు సురేంద్ర లోకమును చేరి, దివ్యమగు భోగములను అనుభవించు చున్నారు.*

*వివరణము : ఎవరు దేనిని గూర్చి ప్రార్ధన చేసిన వారికది లభించుట సృష్టియందు సహజము. సంకల్పబలము, శుద్ధి, దీక్ష కలిగి దేనిని కోరి దైవమును ప్రార్థించినను, అద్దానిని దేవుడిచ్చుట జరుగుచు యుండును. ఆరాధకులు వారి స్వభావమును బట్టి అనేకానేకమగు కోరికలతో దైవమును ప్రార్ధించుచు నుందురు. అసురు లొక రకముగ కోరుచుందురు. దేవతలు మరొక రకముగ కోరుచుందురు.*

*భోగభాగ్యములు, కీర్తిని, ఆరోగ్యమును, ఆయుషును, బలమును, వీర్యమును, విద్యను, వంశాభివృద్ధిని, రక్షణమును- ఇట్లెన్నియో విషయములను అన్ని సంప్రదాయముల వారును ఏదో ఒక విధముగ కోరుచునే యుందురు. గజతురగాది బలమును, పశుగణమును కోరువారుకూడ గలరు. వర్షము కోరువారు, ఫలపుష్ప సంపదను కోరువారు, అందమును కోరువారు ఇట్లు కోటాను కోట్ల కోరికలు జీవులు దైవమును కోరుచునుందురు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 502 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 41

*🌻. వివాహ మండపము -2 🌻*

ఓ నారదా! మహాప్రాజ్ఞా! శివుడు పార్వతిని వివాహమాడుటకై గణములతో కూడి వరయాత్రా సమేతుడై ఇంతవరకు రాలేదు (11). ఓ నారదా! ఇది విశ్వకర్మ సద్బుద్ధితో చేసిన విచిత్రమని యెరుంగుము. ఓ దేవర్షీ! విస్మయమును వీడుము. స్వస్థుడవై శివుని స్మరించుము (12). నీవు భోజనము చేసి , విశ్రమించి, నాపై దయ యుంచి, మైనాకుడు మొదలగు పర్వతములతో గూడి ఆనందముతో శంకరుని వద్దకు వెళ్లుము (13). 

ఓ మహామతీ! ఈ పర్వతములతో గూడి నీవు శీఘ్రమే శివుని వద్దకు వెళ్లి ప్రార్థించుము. దేవతలతో కూడి యున్నవాడు, మహర్షుల సంఘములచే, మరియు దేవతలచే రాక్షసులచే పూజింపబడే చిగుళ్ల వంటి పాదములు గలవాడు అగు శివుని ఇచటకు తీసుకొని రమ్ము (14).

బ్రహ్మ ఇట్లు పలికెను-

సరే యని పలికి నీవు వెంటనే ఆ పర్వత రాజకుమారులతో, మరియు ఇతరులతో గూడి మరలివచ్చితివి. విశాల హృదయుడవగు నీవు అచటి కార్యమును చక్కబెట్టి, భోజనము చేసి శీఘ్రమే శివుని సన్నిధికి వచ్చితివి (15). అచట దేవతలు మొదలగు వారిచే చుట్టు వారబడి యున్న మహాదేవుని చూచి నీవు, ఆ పర్వతులు భక్తితో ఆయనకు నమస్కరించిరి (16). 

ఓ మునీ! అపుడు నేను, విష్ణువు, ఇంద్రుడు, సర్వ దేవతలు, మరియు రుద్రుని అనుచరులు అందరు నిన్ను ప్రశ్నించితిమి (17). అనేకములగు ఆభరణములను ధరించి యున్న మైనాక సహ్య మేరు ఇత్యాది పర్వతులను చూచిన వెంటనే అందరి మనస్సులు సందేహముచే వ్యాకులమైనవి. వారికి విస్మయము కలిగినది (18).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 132 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*సంకలనము : పద్మావతి దేవి*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. సమర్పణ -1🌻*

*తాను తరింపవలెనని జ్ఞప్తి యున్నవాడెవడును తరింపడు. అతడు గొప్ప సాధకుడు కావచ్చును గాని, తన సాధనకు తానే కేంద్రము.*

*తాను తరింపవలెనను బుద్ధి స్వలాభబుద్ధియగు స్వార్థమే యగును. దానిని సమర్పణము చేయని వాడెవ్వడు తరింపడు.*

*సమర్పణ చేయుదమనుకొన్నను అనుకొనుట పోదు కనుక సమర్పణము జరగదు. దేవుని వేషమున తానే తన మనస్సున పగటి వేషగాడై నిలబడి సమర్పించు కొనుటయు, పుచ్చుకొనుటయు చేయును గనుక సమర్పణ జరుగదు.*

..... ✍🏼 *మాస్టర్ ఇ.కె.*🌻 
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 121 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 121. DARKNESS 🍀*

*🕉 Never be bothered by negatives. You burn the candle, and the darkness goes on its own. 🕉*
 
*Don't try to fight with the darkness. There is no way, because the darkness does not exist-how can you fight with it? Just light a candle, and the darkness is gone. So forget about the darkness, forget about the fear. Forget about all those negative things that ordinarily haunt the human mind. Just burn a small candle of enthusiasm.*

*First thing in the morning, get up with a great enthusiasm, with a decision that today you are really going to live with great delight-and then start living with great delight. Have your breakfast, but eat it as if you are eating God. Then it becomes a sacrament. Take your bath, but remember that God is within you; you are giving a bath to God. Then your small bathroom becomes a temple, and the water showering on you is a Abhishekam. Get up every morning with great decisiveness, with certainty, with clarity, a promise to yourself that today is going to be tremendously beautiful and you are going to live it tremendously.*

*And each night when you go to bed, remember again how many beautiful things have happened today. Just the remembrance helps them to come back again tomorrow. Just remember, and then fall asleep remembering those beautiful moments that happened today. Your dreams will be more beautiful. They will carry your enthusiasm, and you will also start living in dreams with a new energy. Make every moment sacred.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 180 / Sri Lalita Sahasranamavali - Meaning - 180 🌹*
*🌻. మంత్రము - అర్ధం 🌻*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 180. యోనిముద్రా, త్రిఖండేశీ, త్రిగుణాంబా, త్రికోణగా ।*
*అనఘాద్భుత చారిత్రా, వాంఛితార్థ ప్రదాయినీ ॥ 180 ॥ 🍀*

🍀 983. యోనిముద్రా : 
యోగముద్రలలో ఓకటి

🍀 984. త్రికండేశీ :
 3 ఖండములకు అధికారిణి

🍀 985. త్రిగుణా : 
3 గుణములు కలిగినది

🍀 986. అంబా : 
అమ్మ

🍀 987. త్రికోణగా : 
త్రికోణమునందు ఉండునది

🍀 988. అనఘాద్భుత చారిత్రా : 
పవిత్రమైన అద్భుత చరిత్ర కలిగినది

🍀 989. వాంఛితార్ధప్రదాయినీ :
 కోరిన కోర్కెలు ఇచ్చునది. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 180 🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻 180. Yonimudra trikhandeshi trigunanba trikonaga*
*Anaghadbhuta charitra vanchitardha pradaeini ॥ 180 ॥ 🌻*

🌻 983 ) Trikhandesi -   
She who is the lord of three zones of fire, moon and sun

🌻 984 ) Triguna -   
She who is three characters

🌻 985 ) Amba -   
She who is the mother

🌻 986 ) Trikonaga -   
She who has attained at all vertices of a triangle

🌻 987 ) Anaga -   
She who is not neared by sin

🌻 988 ) Adbutha charithra -   
She who has a wonderful history

🌻 989 ) Vanchithartha pradayini -   
She who gives what is desired

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామములు #LalithaSahasranamam
 #PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/  
https://t.me/ChaitanyaVijnanam 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹