ఆధ్యాత్మిక జగత్తులో కాని, మీరు ఏ విద్య నేర్చుకోవాలన్నా In the Spiritual world, what is that you want to learn?


ఆధ్యాత్మిక జగత్తులో కాని, 

మీరు ఏ విద్య నేర్చుకోవాలన్నా





మొట్ట మొదట ఉండవలసినది

“ఏమిటంటే ధైర్యము.

నీలో ఉన్నటువంటి భగవత్‌ శక్తికి

అసంభవమైనటువంటిది

ఏదీ లేదు అన్న ధైర్యము మీకు ఉండాలి'




31 Mar 2022

Be alone once in a while

🌹 Be alone once in a while 🌹

If you spend your life in constant excitement, you will never know true happiness. Live simply and take life more easily. Happiness lies in giving yourself time to think and to introspect. Be alone once in a while, and remain more in silence. If the radio is going all the time, or other stimuli are constantly bombarding the senses, it truly affects the nerves and creates nervousness.

And don’t think so much about reforming others; reform yourself first. The greatest field of victory is your own home. If you are an angel at home, you can be an angel everywhere. The sweetness of your voice, the peace of your behavior, is needed in your own household more than anywhere else.

🌹 🌹 🌹 🌹 🌹


31 Mar 2022

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 360-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 360-1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 360-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 360-1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 79. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా ।
తరుణీ, తాపసారాధ్యా, తనుమధ్యా, తమోఽపహా ॥ 79 ॥ 🍀

🌻 360-1. 'తనుమధ్యా' 🌻


సన్నని నడుము కలది శ్రీదేవి అని అర్థము. శరీరము మధ్య భాగము అని తెలుపునది ఈ నామము. నడుము మధ్యభాగ మగుటచేతను మధ్యా అందురు. సృష్టి భగవంతుని శరీరము. దానియందు కూడ మధ్యభాగమున నుండునది శ్రీదేవి. తనువును రథము అని కూడ అందురు. రథము మధ్య భాగమున నుండునది అని కూడా తెలుపుచూ శ్రీ సూక్తమున, శ్రీమాతను 'రథమధ్యా' అని కూడ అందురు.

అవ్యక్తమునకు వ్యక్తమునకు మధ్య నుండునది చైతన్యము, ఆమె శ్రీమాత. లోకమునకు లోకమునకు మధ్య నుండునది శ్రీమాత. లోపలకు వెలుపలకు మధ్యనుండునది శ్రీమాత. తాను శుద్ధ చైతన్యమే అయిననూ తన సృష్టి యందు ఆవరణలు ఏర్పరచుచూ లోకములకు నడుమ మరియు లోకములుగను నుండునది శ్రీమాత. అణువునకు అణువునకు మధ్య నుండి పరస్పరత నేర్పరచుచు నుండును. అందు వలన ఆమెను 'ఆర్దాం' అని కూడ పిలుచుదురు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 360-1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 79. Tapatrayagni santapta samahladana chandrika
Tatuni tapasaradhya tanumadhya tamo-paha ॥ 79 ॥ 🌻

🌻 360. Tanumadhyā तनुमध्या 🌻



She has slender waist. Please refer nāma 85 also. There is a meter by name tanumadhya. Meter or chandas refers to the number of alphabets or words in a verse as per Sanskrit literature.

She is said to be in the form of this meter. Kṛṣṇa says, (Bhagavad Gīta X.35)” Gāyatrī candasāmahaṁ (गायत्री चन्दसामहं)” that He is in the form Gāyatrī meter.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


31 Mar 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 161. స్వాతంత్య్రం / Osho Daily Meditations - 161. INDEPENDENCE


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 161 / Osho Daily Meditations - 161 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 161. స్వాతంత్య్రం 🍀

🕉. 'ఏం జరిగినా నేను సంతోషంగానే ఉంటాను', అది నాకు ఎటువంటి తేడాను కలిగించదు అని చెప్పే వ్యక్తి మాత్రమే, ఏ పరిస్థితిలోనైనా సంతోషంగా ఉండటానికి నేను ఒక మార్గాన్ని కనుగొంటాను," అని స్వతంత్రంగా చెప్పవచ్చు. 🕉

ఏ రాజకీయాలు ఎలాంటి మార్పు తీసుకురాలేవు. బయటి ప్రపంచం పరిస్థితిలో ఎలాంటి తేడా వచ్చినా ఎలాంటి మార్పు జరగదు. పేదవాడుగా లేదా ధనవంతుడుగా, బిచ్చగాడుగా లేదా రాజుగా, స్వతంత్ర వ్యక్తి ఒకేలా ఉంటాడు. అతని లేదా ఆమె అంతర్గత వాతావరణం మారదు. అటువంటి ప్రశాంతతను, అటువంటి నిశ్చలతను పొందడం, ఇది అన్ని ధ్యానాల లక్ష్యం. అది షరతులు లేనిది. అప్పుడే అది నీది.

ఏది జరిగినా అది జరగనివ్వండి - మీరు సంతోషంగా ఉండండి. అప్పుడు మీరు ఆనందాన్ని అనుభూతి చెందుతారు. మీ సంకల్పాన్ని వదిలివేయండి మరియు మీరు కోరుకున్న విషయాలు వాటంతట అవే జరగడం మీరు చూస్తారు. అకస్మాత్తుగా పనులు సజావుగా సాగడం ప్రారంభిస్తాయి. ప్రతిదీ కలిసి సరిపోతుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Osho Daily Meditations - 161 🌹

📚. Prasad Bharadwaj

🍀 161. INDEPENDENCE 🍀

🕉 A person who says, 'Whatever happens, I am going to remain happy; it will not make any difference to me. I will find a way to be happy whatever the circumstance," is independent. 🕉


No politics can make any difference. No change in the state of the outside world can make any difference. Poor or rich, a beggar or a king, the independent person remains the same. His or her inner climate does not change. This is the goal of all meditation-to attain such tranquility, such stillness, that it is unconditional. Only then it is yours.

Then whatever happens, let it happen-you remain happy. You remain tremendously happy. Drop your will, and you will see that the things that you were hankering for start happening on their own. Suddenly things start running smoothly. Everything fits together.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


31 Mar 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 172


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 172 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. భక్తి యోగము - 1 🌻


సంస్కృతంలో పరమ ప్రేమకే "భక్తి" అని పేరు. భక్తిని అభ్యాసము చేయు మార్గమునకే భక్తి యోగమని పేరు. మన తలంపులను పరిశుద్ధము గావించు కొనుటకును, వానికి చక్కని రూపు కల్పించుటకును, మన భావములతో సుందర శిల్పము సృజించుటకు భక్తియోగమే శ్రేష్ఠమయిన మార్గము.

భావబలమే అంతిమ శక్తి. మన నుండి దేనినయినను, ఇది కల్పింపగలదు. సముచిత పథము‌ కల్పింపబడినచో, అది మనకును, ఒరులకును స్వర్గమును సృజించి, మనలను దైవ సామ్రాజ్యమున నిలుపును. అనుచితముగా కల్పింప బడినపుడు, దీని వలన రాజ్యములు వినాశమునకు గురియగును. దానితో మానవ జీవితము వికారమయిన శిథిలముల కట్టయగును‌.

...✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


31 Mar 2022

శ్రీ శివ మహా పురాణము - 542 / Sri Siva Maha Purana - 542


🌹 . శ్రీ శివ మహా పురాణము - 542 / Sri Siva Maha Purana - 542 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 49 🌴

🌻. బ్రహ్మ మోహితుడగుట - 2 🌻


దేవతలిట్లు పలికిరి -

ఓ దేవదేవా! జగత్తును వ్యాపించి యున్నవాడా! పరమేశ్వరా! సదాశివా! జగత్ర్పభూ! జగత్స్వ రూపా! ప్రసన్నుడవు కమ్ము (11). సర్వ ప్రాణులకు ఆత్మ, కారణము, ఈశ్వరుడు నీవే. నీవు వికార రహితుడవు, నాశము లేనివాడవు. నిత్యము, నిర్వికల్పము, అక్షరము అగు పరబ్రహ్మవు నీవే (12).

ఆది, అంతము, మధ్యము, ఇది, మరియొకటి, నేను, నాకంటె బిన్నము ఇత్యాది భేదములు లేనిది అవ్యయము, సచ్చిద్ఘనము ఆగు ఆ పరబ్రహ్మ నీవే (13). ముముక్షువులు, దృఢవ్రతులు అగు మునులు ఇహపరముల యందు సంగమును వీడి నీ పాద పద్మములను మాత్రమే సేవించెదరు (14).

పూర్ణము, అమృతము, శోకరహితము, నిర్గుణము, ఆనందఘనము, వ్యగ్రత లేనిది, వికారములు లేనిది, ఉపాధికంటె భిన్నమైనది అగుపర బ్రహ్మ నీవే (15). జగత్తు యొక్క సృష్టి స్థితిలయములకు కారణము నీవే. ఆ జగత్తునకు ఆత్మ, ప్రభుడు నీవే. సర్వ వ్యాపకుడవగు నీవు ఏనాడైననూ జగత్తపై ఆదారపడిలేవు (16).

నీవు ఒక్కడివే అయిననూ కార్య కారణ రూపములను పొంది ద్వైతముగను, అద్వైత స్వరూపుడగను ఉన్నావు. ఒకే బంగారము ఆబరణములగను, స్వరూపముగను ఉన్నది గదా! వస్తు భేదము లేనే లేదు (17). జనులు అజ్ఞానముచే నీ యందు భేదమును దర్శించెదరు. కావున భ్రమను నివారించుట ఆవశ్యకమగు చున్నది. ఉపాధికి అతీతుడవగు నీయందు బేదము లేదు (18).

మహేశ్వరా! నీ దర్శన మాత్రముచే మేము ధన్యులమైతిమి. దృఢమగు భక్తి గల మానవులకు ఆనందమునిచ్చే ఓ శంకరా! దయను చూపుము (19). జగత్తునకు నీవే కారణము. కాని నీకు కారణము లేదు. ప్రకృతికి అతీతుడగు పురుషుడవు నీవే. నీవు విశ్వేశ్వరుడవు, జగన్నాథుడవు, వికారములు లేని వాడవ, పరాత్పరుడవు (20). హే ప్రభో! ఈ బ్రహ్మ నీ అనుగ్రహముచే రజోగుణ ప్రధానుడై విరాడ్రూపుడు, లోకమునకు పితామహుడా అయినాడు. సత్త్వ గుణ ప్రదానుడగు విష్ణువు పురుషోత్తముడైనాడు (21).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 SRI SIVA MAHA PURANA - 542 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 49 🌴

🌻 The delusion of Brahmā - 2 🌻


The gods said:—

12. O lord of gods, O pervader of the universe, O Sadāśiva, O lord of the universe, O lord of the world or the very world itself, be pleased.

13. You are the supreme soul, the supreme lord and the cause of all emotions. You are free from aberrations, devoid of wastage. You are eternal, free from suspicions and doubts. You are undying. You are the great god.

14. You are Truth, Brahman and Consciousness. You are imperishable, from whom have originated the beginning, the end and the middle of visible worlds, even I too. These visible things are not the true ones.

15. The sages, desirous of liberation, worship and meditate upon your lotus feet. They are steady in their resolve. They avoid attachment on either side.

16. You are the perfect Brahman, the nectar, free from grief, devoid of attributes and the great one. You are the sole bliss, free from excitement, aberrations and even static and insentient.

17. You are the cause of production, sustenance and dissolution of the universe Śiva, the lord of souls, is greater than the universe. He is free from the necessity of its aid. He is always pervasive.

18. You are the One, both Sat and Asat. You are non-dual. Gold whether as the basic metal or as the ready made ornament does not alter in its basic and intrinsic essence.

19. People have doubts in you by their ignorance. The remedy for illusion lies in thinking on your Nirguṇa aspect, not by itself.

20. O supreme lord, we are blessed by your very vision. O Śiva, you are the bestower of supreme bliss to the people who are steady in their devotion. Have mercy.

21. You are the primordial Being. You have no beginning. You are the Puruṣa beyond the Prakṛti. You are the lord of the universe. You are the lord of the world. You are free from aberrations. You are greater than the greatest.


Continues....

🌹🌹🌹🌹🌹


31 Mar 2022

గీతోపనిషత్తు -344


🌹. గీతోపనిషత్తు -344 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 31 📚


🍀 31-1. అనన్య భక్తి - అనన్య భక్తులకు సహితము కష్టనష్టములు కర్మవశాత్తు సంభవించ వచ్చును. అయినను అతడు సత్య ధర్మములను వీడడు. పరధనములను, పరస్త్రీలను ఆశించడు. శుచి శౌచము ఎప్పుడునూ కలిగియుండును. అనన్యభక్తిని మించినటువంటి సాధన మరియొకటి లేదు. అట్టి భక్తునికి జ్ఞాన వైరాగ్యములు సహజముగ సిద్ధించును. అట్టి వారి నుండి భగవంతుడు మహత్కార్యములు నిర్వర్తించుచు నుండును. 🍀

31. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వ చ్ఛాంతిం నిగచ్ఛతి |
కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి |

తాత్పర్యము : దురాచారుడు సాధువగుట, ధర్మాత్ము డగుట, శాశ్వతమగు శాంతిని పొందుట- అనన్య భక్తిచే శీఘ్రముగ జరుగును. గుర్తుంచుకొనుము. నా భక్తుడు ఎన్నడునూ చెడడు.

వివరణము : ఈ శ్లోకమున అనన్యభక్తి యొక్క ప్రాధాన్యతను విశేషించి భగవానుడు తెలుపుచున్నాడు. అన్య మేదియు లేదని, అంతయు దైవమే అని భావించు పామరుడైనను సహజముగ ధర్మ మార్గమున నడచును. శాంతిని పొందును. అంతయు దైవమే అన్న భావము స్థిరపడినవాడు సహజముగ అహింసను పాటించును. సత్యము ననుసరించును. పరధనములను, పరస్త్రీలను అపహరించడు. కృషి లేని లబ్ధి అంగీకరించడు. శుచి శౌచము కలిగి సంతోషముగ నుండును. సంతోషము కొరకై తాపత్రయ పడక సహజమగు సంతోష ముండును. అట్టి వాడింకెట్లు చెడిపోగలడు?

అందువలన నా భక్తుడు చెడిపోడని, ఇది ముమ్మాటికి సత్యమని భగవంతుడు అత్యంత స్పష్టముగ ప్రకటించుచున్నాడు. అనన్య భక్తులకు సహితము కష్టనష్టములు కర్మవశాత్తు సంభవించ వచ్చును. అయినను అతడు సత్య ధర్మములను వీడడు. పరధనములను, పరస్త్రీలను ఆశించడు. శుచి శౌచము ఎప్పుడునూ కలిగియుండును. అనన్యభక్తిని మించినటువంటి సాధన మరియొకటి లేదు. అట్టి భక్తునికి జ్ఞాన వైరాగ్యములు సహజముగ సిద్ధించును. అట్టి వారి నుండి భగవంతుడు మహత్కార్యములు నిర్వర్తించుచు నుండును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


31 Mar 2022

31 - MARCH - 2022 గురువారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 31, గురువారం, మార్చి 2022 బృహస్పతి వాసరే 🌹
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 31-1 - 344 - అనన్య భక్తి🌹 
3) 🌹. శివ మహా పురాణము - 542 / Siva Maha Purana - 542 🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -172🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 161 / Osho Daily Meditations - 161 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 360-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 360-1🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ గురువారం మిత్రులందరికీ 🌹*
*బృహస్పతి వాసరే, 31, మార్చి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. శ్రీ కల్కి స్తోత్రం - 10 🍀*

*10. తవ జగద్వపుః సుందరస్మితం*
*ముఖమనిందితం సుందరాననమ్ |*
*యది న మే ప్రియం వల్గుచేష్టితం*
*పరికరోత్యహో మృత్యురస్త్విహ*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : భక్తి అంటే ఉన్నత ఆదర్శములతో మేళవింప బడిన ఆత్మీయతయే - పండిత శ్రీరామశర్మ ఆచార్య 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ : 1943, ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు, 
ఫాల్గుణ మాసం
తిథి: కృష్ణ చతుర్దశి 12:24:50 వరకు
తదుపరి అమావాశ్య
నక్షత్రం: పూర్వాభద్రపద 10:32:35 వరకు
తదుపరి ఉత్తరాభద్రపద
యోగం: శుక్ల 11:07:27 వరకు
తదుపరి బ్రహ్మ
కరణం: శకుని 12:25:49 వరకు
వర్జ్యం: 20:10:36 - 21:47:12
దుర్ముహూర్తం: 10:17:29 - 11:06:39
మరియు 15:12:26 - 16:01:36
రాహు కాలం: 13:52:33 - 15:24:44
గుళిక కాలం: 09:16:02 - 10:48:13
యమ గండం: 06:11:42 - 07:43:52
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:44
అమృత కాలం: 02:37:00 - 04:11:48
సూర్యోదయం: 06:11:42
సూర్యాస్తమయం: 18:29:05
చంద్రోదయం: 05:38:36
చంద్రాస్తమయం: 17:48:24
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: మీనం
ముద్గర యోగం - కలహం 10:32:35
వరకు తదుపరి ఛత్ర యోగం
- స్త్రీ లాభం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -344 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 31 📚*
 
*🍀 31-1. అనన్య భక్తి - అనన్య భక్తులకు సహితము కష్టనష్టములు కర్మవశాత్తు సంభవించ వచ్చును. అయినను అతడు సత్య ధర్మములను వీడడు. పరధనములను, పరస్త్రీలను ఆశించడు. శుచి శౌచము ఎప్పుడునూ కలిగియుండును. అనన్యభక్తిని మించినటువంటి సాధన మరియొకటి లేదు. అట్టి భక్తునికి జ్ఞాన వైరాగ్యములు సహజముగ సిద్ధించును. అట్టి వారి నుండి భగవంతుడు మహత్కార్యములు నిర్వర్తించుచు నుండును. 🍀*

*31. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వ చ్ఛాంతిం నిగచ్ఛతి |*
*కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి |*

*తాత్పర్యము : దురాచారుడు సాధువగుట, ధర్మాత్ము డగుట, శాశ్వతమగు శాంతిని పొందుట- అనన్య భక్తిచే శీఘ్రముగ జరుగును. గుర్తుంచుకొనుము. నా భక్తుడు ఎన్నడునూ చెడడు.*

*వివరణము : ఈ శ్లోకమున అనన్యభక్తి యొక్క ప్రాధాన్యతను విశేషించి భగవానుడు తెలుపుచున్నాడు. అన్య మేదియు లేదని, అంతయు దైవమే అని భావించు పామరుడైనను సహజముగ ధర్మ మార్గమున నడచును. శాంతిని పొందును. అంతయు దైవమే అన్న భావము స్థిరపడినవాడు సహజముగ అహింసను పాటించును. సత్యము ననుసరించును. పరధనములను, పరస్త్రీలను అపహరించడు. కృషి లేని లబ్ధి అంగీకరించడు. శుచి శౌచము కలిగి సంతోషముగ నుండును. సంతోషము కొరకై తాపత్రయ పడక సహజమగు సంతోష ముండును. అట్టి వాడింకెట్లు చెడిపోగలడు?*

*అందువలన నా భక్తుడు చెడిపోడని, ఇది ముమ్మాటికి సత్యమని భగవంతుడు అత్యంత స్పష్టముగ ప్రకటించుచున్నాడు. అనన్య భక్తులకు సహితము కష్టనష్టములు కర్మవశాత్తు సంభవించ వచ్చును. అయినను అతడు సత్య ధర్మములను వీడడు. పరధనములను, పరస్త్రీలను ఆశించడు. శుచి శౌచము ఎప్పుడునూ కలిగియుండును. అనన్యభక్తిని మించినటువంటి సాధన మరియొకటి లేదు. అట్టి భక్తునికి జ్ఞాన వైరాగ్యములు సహజముగ సిద్ధించును. అట్టి వారి నుండి భగవంతుడు మహత్కార్యములు నిర్వర్తించుచు నుండును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 542 / Sri Siva Maha Purana - 542 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 49 🌴*

*🌻. బ్రహ్మ మోహితుడగుట - 2 🌻*

దేవతలిట్లు పలికిరి -

ఓ దేవదేవా! జగత్తును వ్యాపించి యున్నవాడా! పరమేశ్వరా! సదాశివా! జగత్ర్పభూ! జగత్స్వ రూపా! ప్రసన్నుడవు కమ్ము (11). సర్వ ప్రాణులకు ఆత్మ, కారణము, ఈశ్వరుడు నీవే. నీవు వికార రహితుడవు, నాశము లేనివాడవు. నిత్యము, నిర్వికల్పము, అక్షరము అగు పరబ్రహ్మవు నీవే (12). 

ఆది, అంతము, మధ్యము, ఇది, మరియొకటి, నేను, నాకంటె బిన్నము ఇత్యాది భేదములు లేనిది అవ్యయము, సచ్చిద్ఘనము ఆగు ఆ పరబ్రహ్మ నీవే (13). ముముక్షువులు, దృఢవ్రతులు అగు మునులు ఇహపరముల యందు సంగమును వీడి నీ పాద పద్మములను మాత్రమే సేవించెదరు (14).

పూర్ణము, అమృతము, శోకరహితము, నిర్గుణము, ఆనందఘనము, వ్యగ్రత లేనిది, వికారములు లేనిది, ఉపాధికంటె భిన్నమైనది అగుపర బ్రహ్మ నీవే (15). జగత్తు యొక్క సృష్టి స్థితిలయములకు కారణము నీవే. ఆ జగత్తునకు ఆత్మ, ప్రభుడు నీవే. సర్వ వ్యాపకుడవగు నీవు ఏనాడైననూ జగత్తపై ఆదారపడిలేవు (16). 

నీవు ఒక్కడివే అయిననూ కార్య కారణ రూపములను పొంది ద్వైతముగను, అద్వైత స్వరూపుడగను ఉన్నావు. ఒకే బంగారము ఆబరణములగను, స్వరూపముగను ఉన్నది గదా! వస్తు భేదము లేనే లేదు (17). జనులు అజ్ఞానముచే నీ యందు భేదమును దర్శించెదరు. కావున భ్రమను నివారించుట ఆవశ్యకమగు చున్నది. ఉపాధికి అతీతుడవగు నీయందు బేదము లేదు (18).

మహేశ్వరా! నీ దర్శన మాత్రముచే మేము ధన్యులమైతిమి. దృఢమగు భక్తి గల మానవులకు ఆనందమునిచ్చే ఓ శంకరా! దయను చూపుము (19). జగత్తునకు నీవే కారణము. కాని నీకు కారణము లేదు. ప్రకృతికి అతీతుడగు పురుషుడవు నీవే. నీవు విశ్వేశ్వరుడవు, జగన్నాథుడవు, వికారములు లేని వాడవ, పరాత్పరుడవు (20). హే ప్రభో! ఈ బ్రహ్మ నీ అనుగ్రహముచే రజోగుణ ప్రధానుడై విరాడ్రూపుడు, లోకమునకు పితామహుడా అయినాడు. సత్త్వ గుణ ప్రదానుడగు విష్ణువు పురుషోత్తముడైనాడు (21).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 542 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 49 🌴*

*🌻 The delusion of Brahmā - 2 🌻*

The gods said:—

12. O lord of gods, O pervader of the universe, O Sadāśiva, O lord of the universe, O lord of the world or the very world itself, be pleased.

13. You are the supreme soul, the supreme lord and the cause of all emotions. You are free from aberrations, devoid of wastage. You are eternal, free from suspicions and doubts. You are undying. You are the great god.

14. You are Truth, Brahman and Consciousness. You are imperishable, from whom have originated the beginning, the end and the middle of visible worlds, even I too. These visible things are not the true ones.

15. The sages, desirous of liberation, worship and meditate upon your lotus feet. They are steady in their resolve. They avoid attachment on either side.

16. You are the perfect Brahman, the nectar, free from grief, devoid of attributes and the great one. You are the sole bliss, free from excitement, aberrations and even static and insentient.

17. You are the cause of production, sustenance and dissolution of the universe Śiva, the lord of souls, is greater than the universe. He is free from the necessity of its aid. He is always pervasive.

18. You are the One, both Sat and Asat. You are non-dual. Gold whether as the basic metal or as the ready made ornament does not alter in its basic and intrinsic essence.

19. People have doubts in you by their ignorance. The remedy for illusion lies in thinking on your Nirguṇa aspect, not by itself.

20. O supreme lord, we are blessed by your very vision. O Śiva, you are the bestower of supreme bliss to the people who are steady in their devotion. Have mercy.

21. You are the primordial Being. You have no beginning. You are the Puruṣa beyond the Prakṛti. You are the lord of the universe. You are the lord of the world. You are free from aberrations. You are greater than the greatest.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 172 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

 *🌻. భక్తి యోగము - 1 🌻* 

*సంస్కృతంలో పరమ ప్రేమకే "భక్తి" అని పేరు. భక్తిని అభ్యాసము చేయు మార్గమునకే భక్తి యోగమని పేరు. మన తలంపులను పరిశుద్ధము గావించు కొనుటకును, వానికి చక్కని రూపు కల్పించుటకును, మన భావములతో సుందర శిల్పము సృజించుటకు భక్తియోగమే శ్రేష్ఠమయిన మార్గము.*

*భావబలమే అంతిమ శక్తి. మన నుండి దేనినయినను, ఇది కల్పింపగలదు. సముచిత పథము‌ కల్పింపబడినచో, అది మనకును, ఒరులకును స్వర్గమును సృజించి, మనలను దైవ సామ్రాజ్యమున నిలుపును. అనుచితముగా కల్పింప బడినపుడు, దీని వలన రాజ్యములు వినాశమునకు గురియగును. దానితో మానవ జీవితము వికారమయిన శిథిలముల కట్టయగును‌.*

...✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 161 / Osho Daily Meditations - 161 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 161. స్వాతంత్య్రం 🍀*

*🕉. 'ఏం జరిగినా నేను సంతోషంగానే ఉంటాను', అది నాకు ఎటువంటి తేడాను కలిగించదు అని చెప్పే వ్యక్తి మాత్రమే, ఏ పరిస్థితిలోనైనా సంతోషంగా ఉండటానికి నేను ఒక మార్గాన్ని కనుగొంటాను," అని స్వతంత్రంగా చెప్పవచ్చు. 🕉*
 
*ఏ రాజకీయాలు ఎలాంటి మార్పు తీసుకురాలేవు. బయటి ప్రపంచం పరిస్థితిలో ఎలాంటి తేడా వచ్చినా ఎలాంటి మార్పు జరగదు. పేదవాడుగా లేదా ధనవంతుడుగా, బిచ్చగాడుగా లేదా రాజుగా, స్వతంత్ర వ్యక్తి ఒకేలా ఉంటాడు. అతని లేదా ఆమె అంతర్గత వాతావరణం మారదు. అటువంటి ప్రశాంతతను, అటువంటి నిశ్చలతను పొందడం, ఇది అన్ని ధ్యానాల లక్ష్యం. అది షరతులు లేనిది. అప్పుడే అది నీది.*

*ఏది జరిగినా అది జరగనివ్వండి - మీరు సంతోషంగా ఉండండి. అప్పుడు మీరు ఆనందాన్ని అనుభూతి చెందుతారు. మీ సంకల్పాన్ని వదిలివేయండి మరియు మీరు కోరుకున్న విషయాలు వాటంతట అవే జరగడం మీరు చూస్తారు. అకస్మాత్తుగా పనులు సజావుగా సాగడం ప్రారంభిస్తాయి. ప్రతిదీ కలిసి సరిపోతుంది.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 161 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 161. INDEPENDENCE 🍀*

*🕉 A person who says, 'Whatever happens, I am going to remain happy; it will not make any difference to me. I will find a way to be happy whatever the circumstance," is independent. 🕉*
 
*No politics can make any difference. No change in the state of the outside world can make any difference. Poor or rich, a beggar or a king, the independent person remains the same. His or her inner climate does not change. This is the goal of all meditation-to attain such tranquility, such stillness, that it is unconditional. Only then it is yours.*

*Then whatever happens, let it happen-you remain happy. You remain tremendously happy. Drop your will, and you will see that the things that you were hankering for start happening on their own. Suddenly things start running smoothly. Everything fits together.*
  
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 360-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 360-1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 79. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా ।*
*తరుణీ, తాపసారాధ్యా, తనుమధ్యా, తమోఽపహా ॥ 79 ॥ 🍀*

*🌻 360-1. 'తనుమధ్యా' 🌻* 

*సన్నని నడుము కలది శ్రీదేవి అని అర్థము. శరీరము మధ్య భాగము అని తెలుపునది ఈ నామము. నడుము మధ్యభాగ మగుటచేతను మధ్యా అందురు. సృష్టి భగవంతుని శరీరము. దానియందు కూడ మధ్యభాగమున నుండునది శ్రీదేవి. తనువును రథము అని కూడ అందురు. రథము మధ్య భాగమున నుండునది అని కూడా తెలుపుచూ శ్రీ సూక్తమున, శ్రీమాతను 'రథమధ్యా' అని కూడ అందురు.*

*అవ్యక్తమునకు వ్యక్తమునకు మధ్య నుండునది చైతన్యము, ఆమె శ్రీమాత. లోకమునకు లోకమునకు మధ్య నుండునది శ్రీమాత. లోపలకు వెలుపలకు మధ్యనుండునది శ్రీమాత. తాను శుద్ధ చైతన్యమే అయిననూ తన సృష్టి యందు ఆవరణలు ఏర్పరచుచూ లోకములకు నడుమ మరియు లోకములుగను నుండునది శ్రీమాత. అణువునకు అణువునకు మధ్య నుండి పరస్పరత నేర్పరచుచు నుండును. అందు వలన ఆమెను 'ఆర్దాం' అని కూడ పిలుచుదురు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 360-1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 79. Tapatrayagni santapta samahladana chandrika*
*Tatuni tapasaradhya tanumadhya tamo-paha ॥ 79 ॥ 🌻*

*🌻 360. Tanumadhyā तनुमध्या 🌻*

*She has slender waist. Please refer nāma 85 also. There is a meter by name tanumadhya. Meter or chandas refers to the number of alphabets or words in a verse as per Sanskrit literature.*

*She is said to be in the form of this meter. Kṛṣṇa says, (Bhagavad Gīta X.35)” Gāyatrī candasāmahaṁ (गायत्री चन्दसामहं)” that He is in the form Gāyatrī meter.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

శ్రీ కృష్ణ బోధనలు - 6 / Sri Krishna Teachings - 6


🌹. శ్రీ కృష్ణ బోధనలు - 6 / Sri Krishna Teachings - 6 🌹

📚. ప్రసాద్‌ భరధ్వాజ.

ఒక పాత్రలో ధాన్యం గింజలు నింపుతున్నప్పుడు మహిళలు ఆ పాత్రను కుదుపుతూ ఉంటారు. ధాన్యం గింజలు తమ తమ స్థానాలకు చేరుకుంటాయి. ఏ ధాన్యం గింజ కూరుకుపోతుందో, ఏ ధాన్యం గింజ పైకి చేరుకుంటుందో వాటిలో ఏ అంతరము ఉండదు ఎందుకుంటే ఆ ధాన్యపు గింజలన్నీ భోజనంగానే మారాలి. కాలం నేడు సమాజాన్ని అతలాకుతలం చేస్తోంది. మనుషులు అనే గింజలు తమ తమ స్థానాలకు చేరుకుంటారు. అధర్మం ఏ మనుష్యులను పైకి తీసుకొస్తుందో, కాలం ముందుగా వారినే భక్షిస్తుంది. ధర్మం కొందరు మనషులను రక్షిస్తుంది. కనుక కాలం వారిని తరువాత భక్షిస్తుంది. కాలగర్భంలో అందరూ ఏదో రోజు కరిగి పోవాల్సిందే. కానీ ముఖ్యమైనది ఒక్కటే. అది ఎప్పుడు? ఏ విధంగా అనేది.


Women shake a jar while filling it with grain. The grains reach their respective positions. There is no gap between which grain is dripping and which grain is rising because all those grains must be turned into food. Time is making society miserable today. The seeds of human beings reach their respective positions. What wickedness brings up men, time eats them up first. Virtue protects some human beings. So long eats them later. In the long run everyone has to melt someday. But the Most important thing is "When it is? and In what way it happens. ?"

🌹 🌹 🌹 🌹 🌹


30 Mar 2022

Make the best of the Guru’s association to attain shreyas

🌹 Make the best of the Guru’s association to attain shreyas 🌹

Just because a small vessel can hold only a little water from a river, it does not mean that the vessel itself is the limit for the capacity of the river. If one takes a big vessel to the river, one can bring a large quantity of water. The Guru is like a river. It is up to each individual to make the best of the Guru’s association to attain shreyas.

You will only be truly free and happy when you realize the Truth. The Truth cannot be spoken of as something to someday attain...

Truth resides in a dimension beyond thought, Beyond concepts, Beyond Scriptures. Truth is realized by God and Guru's grace

Be humble, Be Sweet, Be innocent, Be your-Self, Be still and realize your innate purity of Being...

🌹 🌹 🌹 🌹 🌹


30 Mar 2022

మైత్రేయ మహర్షి బోధనలు - 96


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 96 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 78. రసాయనము -2 🌻


సాధకుడు సామాన్యముగ స్థూలబుద్ధి. గురువు సూక్ష్మబుద్ధి. గురువందించిన సూత్రములను అనుస్యూతముగను, అదృశ్యముగను నిర్వర్తించు కొనుటే అతని కర్తవ్యము. అతని యందు జరుగు మార్పులను అతడు గమనింప లేడు. సద్గురువు గమనించుచునే యుండును. మార్పు సూక్ష్మము నుండి స్థూలమునకు జరుగుచు, ఒక దశలో స్థూలమున కూడ ప్రకటింపబడును.

పండిన పండు, విచ్చిన పూవు, రత్నము, బంగారము స్వయంప్రకాశములే. అంతియే కాదు, అవి జీవుల కత్యంత ఉపయోగకరము. సాధకుడు సిద్ధుడగుట కూడ లోకశ్రేయస్సు కొరకే. అది తనయందు జరుగు రసాయనము యొక్క ఫలము. రసాయనము జరుగుటకు నిరంతర సాధన, మౌనము ప్రధానములు. వాచాలత్వము దీనికి విరుద్దము.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


30 Mar 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 157


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 157 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మనం అల్పమయిన విషయాల పట్ల ఆకాంక్షతో వుంటాం. ఒకసారి నీ లోపలి నిధిని నువ్వు గుర్తిస్తే వ్యర్థమయిన కాంక్షలు, ఘర్షణలు అదృశ్యమవుతాయి. 🍀


మనమెంత విలువైన వాళ్ళమో మనం గుర్తించం. మన దగ్గరున్న అనంతనిధిని మనం గుర్తించం. మనం ఆ విషయం పట్ల స్పృహతో వుండం. మనం అల్పమయిన విషయాల పట్ల ఆకాంక్షతో వుంటాం. పనికిమాలిన విషయాల కోసం ఘర్షిస్తాం. నిష్ఫలమైన వాటికోసం పోటీ పడతాం.

ఒకసారి నీ లోపలి నిధిని నువ్వు గుర్తిస్తే వ్యర్థమయిన కాంక్షలు, ఘర్షణలు అదృశ్యమవుతాయి. జీవితం నిర్మలం అవుతుంది. శాంతిగా మారుతుంది. జీవితంలో దయ నిండుతుంది. అనవసరమయిన వాటి పట్ల ఆసక్తి పోతుంది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


30 Mar 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 257 - 13. తంత్ర సాధన / DAILY WISDOM - 257 - 13. Tantra Sadhana


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 257 / DAILY WISDOM - 257 🌹

🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 13. తంత్ర సాధన 🌻


తంత్రం ద్వారా చేసే అభ్యాసం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, అంతర్గతం కోసం బాహ్యాన్ని తిరస్కరించడం, ఆధ్యాత్మికం కోసం పదార్థాన్ని తిరస్కరించడం లేదా జీవితంలోని ప్రతి ఆనందాన్ని మొత్తంగా నిర్మూలించాల్సిన చెడుగా పరిగణించడం వంటి నిర్దిష్ట ఆదేశం లేదు. తంత్రానికి, ప్రపంచంలోని విషయాలు, అవగాహన యొక్క భౌతిక రూపాలు నిజంగా అడ్డంకులు కావు. కేవలం కోరికను తిరస్కరించడం ద్వారా వాటి కోసం మనలో ఉన్న భావాన్ని అధిగమించలేము. సరైన సందర్భంలో మరియు ఆత్మతో చూసినప్పుడు, ఈ ప్రపంచంలోని ప్రతిదీ, దాని వ్యక్తీకరణలు మరియు ఈ ప్రపంచం మొత్తం పరిపూర్ణతకు మార్గం అవుతాయి.

కనిపించేది అదృశ్యానికి మార్గం. మానవునిలో కోరికలు ఏదైనా కోరిక పట్ల మనిషిలో అభివృద్ధి చెందే తెలివితక్కువ దృక్పథం కారణంగా పుడతాయి. దానితో పాటు కోరిక యొక్క ఒత్తిడి అతనిపై పట్టు సాధిస్తున్నట్లు, తన నియంత్రణ తనపై లేకుండా చేస్తుందనే భయం కూడా ఉంది. వస్తువుకు అతీత వాస్తవానికి విడదీయ రాని సంబంధము ఉందని, వస్తువు అతీతానికి భౌతిక ధృవంగా ఉన్నందున, విషయంపై ధ్యానం చేయడం అనేది తాంత్రిక రూపాలలో ప్రముఖంగా చెప్పబడింది. కోరికను కోరిక ద్వారా మాత్రమే అధిగమించవచ్చు, వస్తువును వస్తువు ద్వారా మాత్రమే అధిగమించవచ్చు అనే సూత్రం తంత్రం యొక్క గొప్పగా చెప్పబడినది. 'దేని వల్ల మనిషి పడిపోయాడో, తిరిగి దాని వల్లనే పైకి లేస్తాడు' అనేది ఈ తంత్ర సూత్రంలోని ఇంకో అంశంగా చెప్పబడింది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 257 🌹

🍀 📖 from Essays in Life and Eternity 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 13. Tantra Sadhana🌻


A specialty of practice through Tantra is that there is no specific injunction towards a rejection of the outer for the sake of the inner, the material for the sake of the spiritual, or a considering of every joy in life as an evil to be eradicated wholesale. To the Tantra, the things of the world, the material forms of perception, are not really obstacles, and the desire for them cannot be overcame by rejecting the desire itself. Everything in the world, the world itself in its entirety, is a passage to perfection when its manifestations are viewed in their proper context and spirit.

The visible is a way to the invisible. Human desires arise on account of the unintelligent attitude that man develops towards any desire, and there is a fear of desire since its pressure seems to be mastering him rather than himself being its controller arid director. The fact that the object is inseparably related to the subject, because the object is just the other pole of which the subject is one phase, is highlighted in Tantric forms of meditation. Thus comes the great dictum of the Tantra, that desire can be overcome only by desire, even as the object can be overcome only by the object. The other aspect of this principle held by the Tantra is that ‘that by which one falls is also that by which one rises'.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


30 Mar 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 27 / Agni Maha Purana - 27


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 27 / Agni Maha Purana - 27 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 10

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. యుద్ధకాండ వర్ణనము - 3 🌻


రాముడు మేఘము వలె ఆ రావణునిపై అస్త్రాస్త్రములను కురిపించెను. అతని ధ్వజమును భేదించి, రథమును భగ్నముచేసి గుఱ్ఱములను, సారథిని చంపి, అతని ధనస్సును, బాహ్మావులను, శిరస్సులను ఛేదించెను, కాని అతని శిరస్సుమరల మరల మొలుచు చుండెను. అపుడు రాముడు బ్రహ్మాస్త్రముచే అతని హృదయమును భేదించి నేలపై కూల్చెను. రాక్షసుల నందరిని కూడ పరిమార్చెను. స్త్రీలు విహత భర్తృకలై ఏడ్చరి.

రాముని ఆజ్ఞచే విభీషణుడు ఆ స్త్రీలను ఓదార్చెను. రాముని పూజించెను. రాముడు హనుమంతుని ద్వారా సీతను రప్పించి, అగ్ని ప్రవేశముచే శుద్ధరాలగు ఆమెను స్వీకరించెను. ఇంద్రాదిదేవతలును, బ్రహ్మయు, దశరథుడును "నీవు రాక్షససంహారివైన విష్ణువే" అని అతనిని స్తుతించిరి. రాముడు కోరగా ఇంద్రుడు అమృతము కురిపించి వానరులను పునరుజ్జీవితులను చేసెను. ఆ దేవతలు యుద్ధము చూచి రామునిచే పూజితులై స్వర్గమునకు వెళ్ళిరి. రాముడు వానరులను గౌరవించి, లంకా రాజ్యమును విభీషణున కిచ్చెను.

సీతాసమేతుడై పుష్పకమునెక్కి, సంతసించిన మనస్సు కలవాడై, సీతకు వనములను, దుర్గమ భూములను చూపుచు, వచ్చిన మార్గముననే అయోధ్య వైపు తిరిగి వెళ్ళెను. భరద్వాజునకు నమస్కరించి అచట నుండి నందిగ్రామమునకు వెళ్ళి, భరతునిచే నమస్కరింపబడివాడై అయోధ్యకు వెళ్ళెను. వసిష్ఠాదులకు నమస్కరించి,కౌసల్యా-కై కేయి-సుమిత్రలకు కూడ నమస్కరించి, రాజ్యమును పొంది బ్రహ్మణులను పూజించెను.

పిమ్మట అశ్వమేధయాగములచే వాసుదేవుడైన తనను తానే ఆరాధించెను. సర్వదానములను ఇచ్చెను. ప్రజలను పుత్రులను వలె పాలించెను. దుష్టులను నిగ్రహించుటయందు అసక్తుడై ధర్మకామాదులను పాలించెను. రాముడు రాజ్యమును పాలించిన కాలమున ప్రజలందరును తమ ధర్మములను పాలించుటయందు అసక్తులైరి. అకాలమరణము చెందన వాడెవ్వడును లేకుండెను.

అగ్ని మహాపురాణమున రామాయణము నందలి యుద్దకాండవర్ణనమను దశమాధ్యాయము సమాప్తము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Agni Maha Purana -27 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 10

🌻 Yudda (War) Kand - 3 🌻

24-26. Just as a cloud, Rāma showered on him (Rāvaṇa) arrows and weapons. He cut off his flagstaff along with his chariot, horses and charioteer as well as the bow, arms and heads. The cut-off heads grew again (on his body). Rāvaṇa was made to fall down to the ground by Rāma by piercing (his) heart with the Brahmāstra (weapon of the Pitāmaha). The (rākṣasa) women wept along with other demons. After consoling them, Vibhīṣaṇa cremated him as directed by Rāma.

27-28. Rāma made the pure Sītā to be brought (to him) by Hanūmat. He accepted her who was (declared) pure by her entry into the fire and (he) was praised by Indra, Brahmā, Daśaratha and others as, “You are Viṣṇu, the killer of the demon.” Indra being propitiated, revived the monkeys by a shower of nectar.

29-30. They all (Brahmā and o hers) being worshipped by Rāma returned to heavens after witnessing the battle. Rāma entrusted Laṅkā to Vibhīṣaṇa. Having, honoured the monkeys, being seated in the (aerial chariot) Puṣpaka in the company of Sītā, Rāma returned by the same route by which he had gone (to Laṅkā) showing the forests and mountains to Sītā and having a happy mind.

31. Having paid obeisance to Bharadvāja, he reached Nandigrāma. Being revered by Bharata there, he reached Ayodhyā and settled there.

32. Having saluted Vasiṣṭha and other sages, Kauśalyā, Kaikeyī and Sumitrā and having obtained the kingdom he honoured the twice-born.

33. He worshipped Vāsudeva (Viṣṇu), his own self, with the Aśvamedha (sacrifice). He conferred gifts on the deserving men). He protected (the welfare) of his subjects.

34. (He protected) dharma (righteousness), kāma (desire for worldly enjoyments) etc. just as his sons. (He) was bent on subduing the wicked. The world was abound with all righteous activities. The earth was abound with all grains. As Rāma was ruling, there was no premature death.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


30 Mar 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 578 / Vishnu Sahasranama Contemplation - 578


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 578 / Vishnu Sahasranama Contemplation - 578🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻578. భేషజం, भेषजं, Bheṣajaṃ🌻


ఓం భేషజాయ నమః | ॐ भेषजाय नमः | OM Bheṣajāya namaḥ

భేషజం, भेषजं, Bheṣajaṃ

ఔషధం భవరోగస్య బ్రహ్మ భేషజముచ్యతే

సంసారమను రోగమునకు ఔషధము వంటి వాడు గనుక పరమాత్ముడు భేషజమనబడును.


:: పోతన భాగవతము - షష్టమ స్కంధము ::

ఉ. అరయ వీర్యవంత మగు ఔషధమెట్లు యదృచ్ఛఁ గొన్నఁ ద
చ్చారు గుణంబు రోగములఁ జయ్యనఁ బాపినమాడ్కిఁ ఋణ్య వి
స్పారుని నంబుజోదరునిఁ బామరుఁ దజ్ఞుఁ డవజ్ఞుఁ బల్కివన్‍
వారక తత్ప్రభావము ధ్రువంబుగ నాత్మగుణంబుఁ జూపదే! (126)

సారవంతమైన ఔషధం అనుకోకుండా పొరబాటున సేవించినప్పటికిని దాని గుణము వృథాగా పోదు. దాని ప్రభావం రోగాలను పోగొట్టి తీరుతుంది. అటులనే పరమపావనుడైన భగవంతుని నామము తెలియక పలికినను, తిరస్కారభావముతో పలికినను - దాని ప్రభావము ఊరకనే పోదు. దాని మహత్తర గుణమును అది తప్పక చూపి తీరుతుంది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 578🌹

📚. Prasad Bharadwaj

🌻578. Bheṣajaṃ🌻


OM Bheṣajāya namaḥ

औषधं भवरोगस्य ब्रह्म भेषजमुच्यते

Auṣadhaṃ bhavarogasya brahma bheṣajamucyate

Since Paramātma is the remedy of a malady called worldly existence, He is called Bheṣajaṃ.


:: श्रीमद्भागवते सप्तम स्कन्धे नवमोऽध्यायः ::

यस्मात्प्रियाप्रियवियोगसंयोगजन्म
शोकाग्निना सकलयोनिषु दह्यमानः ।
दुःखैषधं तदपि दुःखमतद्धियाहं
भूमन्भ्रमामि वद मे तव दास्ययोगम् ॥ १९ ॥


Śrīmad Bhāgavata - Canto 7, Chapter 9

Yasmātpriyāpriyaviyogasaṃyogajanma
Śokāgninā sakalayoniṣu dahyamānaḥ,
Duḥkhaiṣadhaṃ tadapi duḥkhamataddhiyāhaṃ
Bhūmanbhramāmi vada me tava dāsyayogam. 19.


O great one, O Supreme Lord, because of combination with pleasing and displeasing circumstances and because of separation from them, one is placed in a most regrettable position, within heavenly or hellish planets, as if burning in a fire of lamentation. Although there are many remedies by which to get out of miserable life, any such remedies in the material world are more miserable than the miseries themselves. Therefore I think that the only remedy is to engage in Your service. Kindly instruct me in such service.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

त्रिसामा सामगस्साम निर्वाणं भेषजं भिषक् ।
सन्न्यासकृच्छमश्शान्तो निष्ठा शान्तिः परायणम् ॥ ६२ ॥

త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ ।
సన్న్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠా శాన్తిః పరాయణమ్ ॥ 62 ॥

Trisāmā sāmagassāma nirvāṇaṃ bheṣajaṃ bhiṣak,
Sannyāsakr‌cchamaśśānto niṣṭhā śāntiḥ parāyaṇam ॥ 62 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


30 Mar 2022

30 - MARCH - 2022 బుధవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 30, మార్చి 2022 బుధవారం, సౌమ్య వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 179 / Bhagavad-Gita - 179 - 4-17 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 578 / Vishnu Sahasranama Contemplation - 578🌹
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 27 / Agni Maha Purana 27 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 257 / DAILY WISDOM - 257 🌹 
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 158 🌹
7) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 96 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ బుధవారం మిత్రులందరికీ 🌹*
*సౌమ్య వాసరే, 30, మార్చి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*పండుగలు మరియు పర్వదినాలు : మాస శివరాత్రి, Masik Shivaratri*

*🍀. శ్రీ గణేశ అష్టకం - 5 🍀*

*5. త్రినయనయుతభాలే శోభమానే విశాలే*
*ముకుట-మణి-సుఢాలే మౌక్తికానాం చ జాలే ।*
*ధవలకుసుమమాలే యస్య శీర్ష్ణః సతాలే*
*గణపతిమభివన్దే సర్వదా చక్రపాణిమ్ ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : మన పాపకర్మయే సమయానుగుణముగా శిక్ష రూపంలో వ్యక్తం అవుతుంది. ఇతరులు నిమిత్తమాత్రులే అవుతారని మనం గుర్తించాలి. - పండిత శ్రీరామశర్మ ఆచార్య 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, శిశిర ఋతువు, 
ఫాల్గుణ మాసం
తిథి: కృష్ణ త్రయోదశి 13:20:13 వరకు
తదుపరి కృష్ణ చతుర్దశి
నక్షత్రం: శతభిషం 10:50:16 వరకు
తదుపరి పూర్వాభద్రపద
యోగం: శుభ 13:01:13 వరకు
తదుపరి శుక్ల
కరణం: వణిజ 13:22:13 వరకు
వర్జ్యం: 17:08:12 - 18:43:00
దుర్ముహూర్తం: 11:56:09 - 12:45:14
రాహు కాలం: 12:20:41 - 13:52:44
గుళిక కాలం: 10:48:38 - 12:20:41
యమ గండం: 07:44:33 - 09:16:36
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:44
అమృత కాలం: 03:49:00 - 05:22:20
మరియు 26:37:00 - 28:11:48
సూర్యోదయం: 06:12:30
సూర్యాస్తమయం: 18:28:53
చంద్రోదయం: 04:59:26
చంద్రాస్తమయం: 16:54:23
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: కుంభం
మానస యోగం - కార్య లాభం 10:50:16
వరకు తదుపరి పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 179 / Bhagavad-Gita - 179 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 17 🌴*

*17. కర్మణ్యో హ్యాపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణ: |*
*అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి: ||*

🌷. తాత్పర్యం :
*కర్మగతులను అవగాహన చేసికొనుట అత్యంత కష్టము కనుక కర్మ యననేమో, వికర్మ యననేమో, అకర్మ యననేమో ప్రతియొక్కరు చక్కగా ఎరుగవలెను.*

🌻. భాష్యము :
ఎవరేని భవబంధము నుండి ముక్తిని బడయుట యందు కృతనిశ్చయులై యున్నచో వారు తప్పక కర్మము, వికర్మము, అకర్మముల నడుమ గల భేదమును అవగాహన చేసికొనవలెను. ఈ కర్మసంబంధ విషయము అత్యంత కటినమైనది గనుక ప్రతియొక్కరు అటువంటి వివిధ కర్మలను విశ్లేషించి తెలిసికొనవలెను. కృష్ణభక్తిని మరియు తత్పరమైన కర్మలను అవగతము చేసికొనుటకు ప్రతియొక్కరు తమకు భగవానునితో గల సంబంధమును ఎరుగవలెను. 

అనగా జ్ఞానవంతుడైనవాడు జీవుడు శ్రీకృష్ణభగవానుని నిత్యదాసుడనియు, తత్కారణముగా అతడు కృష్ణభక్తిభావనలో వర్తించవలసియుండుననియు అవగాహన చేసికొనును. భగవద్గీత యంతయు ఈ సారాంశము వైపునకే కేంద్రీకృతమై యున్నాది. ఈ భావనను మరియు తత్సంబంధిత కర్మలకు విరుద్ధములైన నిర్ణయములన్నియును నిషిద్దకర్మలే (వికర్మలే). 

ఈ విషయము నంతటిని సంపూర్ణముగా నెరుగుట కృష్ణభక్తి యందు నిష్ణాతులైనవారితో సాహచార్యము పొంది, వారి నుండి ఈ రహస్యమును తెలిసికొనవలెను. ఆ విధముగా చేయుట భగవానుని నుండి ప్రత్యక్షముగా నేర్చుటతో సమానము కాగలదు. లేనిచో అత్యంత బుద్ధిమంతులైనవారు సైతము భ్రాంతి గురికాగలరు.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 179 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 4 - Jnana Yoga - 17 🌴*

*17 . karmaṇo hy api boddhavyaṁ boddhavyaṁ ca vikarmaṇaḥ*
*akarmaṇaś ca boddhavyaṁ gahanā karmaṇo gatiḥ*

🌷 Translation : 
*The intricacies of action are very hard to understand. Therefore one should know properly what action is, what forbidden action is and what inaction is.*

🌹 Purport :
If one is serious about liberation from material bondage, one has to understand the distinctions between action, inaction and unauthorized actions. One has to apply oneself to such an analysis of action, reaction and perverted actions because it is a very difficult subject matter. To understand Kṛṣṇa consciousness and action according to its modes, one has to learn one’s relationship with the Supreme; i.e., one who has learned perfectly knows that every living entity is an eternal servitor of the Lord and that consequently one has to act in Kṛṣṇa consciousness. 

The entire Bhagavad-gītā is directed toward this conclusion. Any other conclusions against this consciousness and its attendant actions are vikarmas, or prohibited actions. To understand all this one has to associate with authorities in Kṛṣṇa consciousness and learn the secret from them; this is as good as learning from the Lord directly. Otherwise, even the most intelligent persons will be bewildered.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 578 / Vishnu Sahasranama Contemplation - 578🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻578. భేషజం, भेषजं, Bheṣajaṃ🌻*

*ఓం భేషజాయ నమః | ॐ भेषजाय नमः | OM Bheṣajāya namaḥ*

భేషజం, भेषजं, Bheṣajaṃ

*ఔషధం భవరోగస్య బ్రహ్మ భేషజముచ్యతే*

*సంసారమను రోగమునకు ఔషధము వంటి వాడు గనుక పరమాత్ముడు భేషజమనబడును.*

:: పోతన భాగవతము - షష్టమ స్కంధము ::
ఉ. అరయ వీర్యవంత మగు ఔషధమెట్లు యదృచ్ఛఁ గొన్నఁ ద
     చ్చారు గుణంబు రోగములఁ జయ్యనఁ బాపినమాడ్కిఁ ఋణ్య వి
     స్పారుని నంబుజోదరునిఁ బామరుఁ దజ్ఞుఁ డవజ్ఞుఁ బల్కివన్‍
     వారక తత్ప్రభావము ధ్రువంబుగ నాత్మగుణంబుఁ జూపదే! (126)

సారవంతమైన ఔషధం అనుకోకుండా పొరబాటున సేవించినప్పటికిని దాని గుణము వృథాగా పోదు. దాని ప్రభావం రోగాలను పోగొట్టి తీరుతుంది. అటులనే పరమపావనుడైన భగవంతుని నామము తెలియక పలికినను, తిరస్కారభావముతో పలికినను - దాని ప్రభావము ఊరకనే పోదు. దాని మహత్తర గుణమును అది తప్పక చూపి తీరుతుంది.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 578🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻578. Bheṣajaṃ🌻*

*OM Bheṣajāya namaḥ*

औषधं भवरोगस्य ब्रह्म भेषजमुच्यते 
*Auṣadhaṃ bhavarogasya brahma bheṣajamucyate*

*Since Paramātma is the remedy of a malady called worldly existence, He is called Bheṣajaṃ.*

:: श्रीमद्भागवते सप्तम स्कन्धे नवमोऽध्यायः ::
यस्मात्प्रियाप्रियवियोगसंयोगजन्म
शोकाग्निना सकलयोनिषु दह्यमानः ।
दुःखैषधं तदपि दुःखमतद्धियाहं
भूमन्भ्रमामि वद मे तव दास्ययोगम् ॥ १९ ॥

Śrīmad Bhāgavata - Canto 7, Chapter 9
Yasmātpriyāpriyaviyogasaṃyogajanma
Śokāgninā sakalayoniṣu dahyamānaḥ,
Duḥkhaiṣadhaṃ tadapi duḥkhamataddhiyāhaṃ
Bhūmanbhramāmi vada me tava dāsyayogam. 19.

O great one, O Supreme Lord, because of combination with pleasing and displeasing circumstances and because of separation from them, one is placed in a most regrettable position, within heavenly or hellish planets, as if burning in a fire of lamentation. Although there are many remedies by which to get out of miserable life, any such remedies in the material world are more miserable than the miseries themselves. Therefore I think that the only remedy is to engage in Your service. Kindly instruct me in such service.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
त्रिसामा सामगस्साम निर्वाणं भेषजं भिषक् ।सन्न्यासकृच्छमश्शान्तो निष्ठा शान्तिः परायणम् ॥ ६२ ॥

త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ ।సన్న్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠా శాన్తిః పరాయణమ్ ॥ 62 ॥

Trisāmā sāmagassāma nirvāṇaṃ bheṣajaṃ bhiṣak,Sannyāsakr‌cchamaśśānto niṣṭhā śāntiḥ parāyaṇam ॥ 62 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 27 / Agni Maha Purana - 27 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 10*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. యుద్ధకాండ వర్ణనము - 3 🌻*

రాముడు మేఘము వలె ఆ రావణునిపై అస్త్రాస్త్రములను కురిపించెను. అతని ధ్వజమును భేదించి, రథమును భగ్నముచేసి గుఱ్ఱములను, సారథిని చంపి, అతని ధనస్సును, బాహ్మావులను, శిరస్సులను ఛేదించెను, కాని అతని శిరస్సుమరల మరల మొలుచు చుండెను. అపుడు రాముడు బ్రహ్మాస్త్రముచే అతని హృదయమును భేదించి నేలపై కూల్చెను. రాక్షసుల నందరిని కూడ పరిమార్చెను. స్త్రీలు విహత భర్తృకలై ఏడ్చరి.

రాముని ఆజ్ఞచే విభీషణుడు ఆ స్త్రీలను ఓదార్చెను. రాముని పూజించెను. రాముడు హనుమంతుని ద్వారా సీతను రప్పించి, అగ్ని ప్రవేశముచే శుద్ధరాలగు ఆమెను స్వీకరించెను. ఇంద్రాదిదేవతలును, బ్రహ్మయు, దశరథుడును "నీవు రాక్షససంహారివైన విష్ణువే" అని అతనిని స్తుతించిరి. రాముడు కోరగా ఇంద్రుడు అమృతము కురిపించి వానరులను పునరుజ్జీవితులను చేసెను. ఆ దేవతలు యుద్ధము చూచి రామునిచే పూజితులై స్వర్గమునకు వెళ్ళిరి. రాముడు వానరులను గౌరవించి, లంకా రాజ్యమును విభీషణున కిచ్చెను. 

సీతాసమేతుడై పుష్పకమునెక్కి, సంతసించిన మనస్సు కలవాడై, సీతకు వనములను, దుర్గమ భూములను చూపుచు, వచ్చిన మార్గముననే అయోధ్య వైపు తిరిగి వెళ్ళెను. భరద్వాజునకు నమస్కరించి అచట నుండి నందిగ్రామమునకు వెళ్ళి, భరతునిచే నమస్కరింపబడివాడై అయోధ్యకు వెళ్ళెను. వసిష్ఠాదులకు నమస్కరించి,కౌసల్యా-కై కేయి-సుమిత్రలకు కూడ నమస్కరించి, రాజ్యమును పొంది బ్రహ్మణులను పూజించెను.

పిమ్మట అశ్వమేధయాగములచే వాసుదేవుడైన తనను తానే ఆరాధించెను. సర్వదానములను ఇచ్చెను. ప్రజలను పుత్రులను వలె పాలించెను. దుష్టులను నిగ్రహించుటయందు అసక్తుడై ధర్మకామాదులను పాలించెను. రాముడు రాజ్యమును పాలించిన కాలమున ప్రజలందరును తమ ధర్మములను పాలించుటయందు అసక్తులైరి. అకాలమరణము చెందన వాడెవ్వడును లేకుండెను.

అగ్ని మహాపురాణమున రామాయణము నందలి యుద్దకాండవర్ణనమను దశమాధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana -27 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

*Chapter 10*
*🌻 Yudda (War) Kand - 3 🌻*

24-26. Just as a cloud, Rāma showered on him (Rāvaṇa) arrows and weapons. He cut off his flagstaff along with his chariot, horses and charioteer as well as the bow, arms and heads. The cut-off heads grew again (on his body). Rāvaṇa was made to fall down to the ground by Rāma by piercing (his) heart with the Brahmāstra (weapon of the Pitāmaha). The (rākṣasa) women wept along with other demons. After consoling them, Vibhīṣaṇa cremated him as directed by Rāma.

27-28. Rāma made the pure Sītā to be brought (to him) by Hanūmat. He accepted her who was (declared) pure by her entry into the fire and (he) was praised by Indra, Brahmā, Daśaratha and others as, “You are Viṣṇu, the killer of the demon.” Indra being propitiated, revived the monkeys by a shower of nectar.

29-30. They all (Brahmā and o hers) being worshipped by Rāma returned to heavens after witnessing the battle. Rāma entrusted Laṅkā to Vibhīṣaṇa. Having, honoured the monkeys, being seated in the (aerial chariot) Puṣpaka in the company of Sītā, Rāma returned by the same route by which he had gone (to Laṅkā) showing the forests and mountains to Sītā and having a happy mind.

31. Having paid obeisance to Bharadvāja, he reached Nandigrāma. Being revered by Bharata there, he reached Ayodhyā and settled there.

32. Having saluted Vasiṣṭha and other sages, Kauśalyā, Kaikeyī and Sumitrā and having obtained the kingdom he honoured the twice-born.

33. He worshipped Vāsudeva (Viṣṇu), his own self, with the Aśvamedha (sacrifice). He conferred gifts on the deserving men). He protected (the welfare) of his subjects.

34. (He protected) dharma (righteousness), kāma (desire for worldly enjoyments) etc. just as his sons. (He) was bent on subduing the wicked. The world was abound with all righteous activities. The earth was abound with all grains. As Rāma was ruling, there was no premature death.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join 
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
 www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 257 / DAILY WISDOM - 257 🌹*
*🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 13. తంత్ర సాధన 🌻*

*తంత్రం ద్వారా చేసే అభ్యాసం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, అంతర్గతం కోసం బాహ్యాన్ని తిరస్కరించడం, ఆధ్యాత్మికం కోసం పదార్థాన్ని తిరస్కరించడం లేదా జీవితంలోని ప్రతి ఆనందాన్ని మొత్తంగా నిర్మూలించాల్సిన చెడుగా పరిగణించడం వంటి నిర్దిష్ట ఆదేశం లేదు. తంత్రానికి, ప్రపంచంలోని విషయాలు, అవగాహన యొక్క భౌతిక రూపాలు నిజంగా అడ్డంకులు కావు. కేవలం కోరికను తిరస్కరించడం ద్వారా వాటి కోసం మనలో ఉన్న భావాన్ని అధిగమించలేము. సరైన సందర్భంలో మరియు ఆత్మతో చూసినప్పుడు, ఈ ప్రపంచంలోని ప్రతిదీ, దాని వ్యక్తీకరణలు మరియు ఈ ప్రపంచం మొత్తం పరిపూర్ణతకు మార్గం అవుతాయి.*

*కనిపించేది అదృశ్యానికి మార్గం. మానవునిలో కోరికలు ఏదైనా కోరిక పట్ల మనిషిలో అభివృద్ధి చెందే తెలివితక్కువ దృక్పథం కారణంగా పుడతాయి. దానితో పాటు కోరిక యొక్క ఒత్తిడి అతనిపై పట్టు సాధిస్తున్నట్లు, తన నియంత్రణ తనపై లేకుండా చేస్తుందనే భయం కూడా ఉంది. వస్తువుకు అతీత వాస్తవానికి విడదీయ రాని సంబంధము ఉందని, వస్తువు అతీతానికి భౌతిక ధృవంగా ఉన్నందున, విషయంపై ధ్యానం చేయడం అనేది తాంత్రిక రూపాలలో ప్రముఖంగా చెప్పబడింది. కోరికను కోరిక ద్వారా మాత్రమే అధిగమించవచ్చు, వస్తువును వస్తువు ద్వారా మాత్రమే అధిగమించవచ్చు అనే సూత్రం తంత్రం యొక్క గొప్పగా చెప్పబడినది. 'దేని వల్ల మనిషి పడిపోయాడో, తిరిగి దాని వల్లనే పైకి లేస్తాడు' అనేది ఈ తంత్ర సూత్రంలోని ఇంకో అంశంగా చెప్పబడింది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 257 🌹*
*🍀 📖 from Essays in Life and Eternity 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 13. Tantra Sadhana🌻*

*A specialty of practice through Tantra is that there is no specific injunction towards a rejection of the outer for the sake of the inner, the material for the sake of the spiritual, or a considering of every joy in life as an evil to be eradicated wholesale. To the Tantra, the things of the world, the material forms of perception, are not really obstacles, and the desire for them cannot be overcame by rejecting the desire itself. Everything in the world, the world itself in its entirety, is a passage to perfection when its manifestations are viewed in their proper context and spirit. *

*The visible is a way to the invisible. Human desires arise on account of the unintelligent attitude that man develops towards any desire, and there is a fear of desire since its pressure seems to be mastering him rather than himself being its controller arid director. The fact that the object is inseparably related to the subject, because the object is just the other pole of which the subject is one phase, is highlighted in Tantric forms of meditation. Thus comes the great dictum of the Tantra, that desire can be overcome only by desire, even as the object can be overcome only by the object. The other aspect of this principle held by the Tantra is that ‘that by which one falls is also that by which one rises'.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 157 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. మనం అల్పమయిన విషయాల పట్ల ఆకాంక్షతో వుంటాం. ఒకసారి నీ లోపలి నిధిని నువ్వు గుర్తిస్తే వ్యర్థమయిన కాంక్షలు, ఘర్షణలు అదృశ్యమవుతాయి. 🍀*

*మనమెంత విలువైన వాళ్ళమో మనం గుర్తించం. మన దగ్గరున్న అనంతనిధిని మనం గుర్తించం. మనం ఆ విషయం పట్ల స్పృహతో వుండం. మనం అల్పమయిన విషయాల పట్ల ఆకాంక్షతో వుంటాం. పనికిమాలిన విషయాల కోసం ఘర్షిస్తాం. నిష్ఫలమైన వాటికోసం పోటీ పడతాం.*

*ఒకసారి నీ లోపలి నిధిని నువ్వు గుర్తిస్తే వ్యర్థమయిన కాంక్షలు, ఘర్షణలు అదృశ్యమవుతాయి. జీవితం నిర్మలం అవుతుంది. శాంతిగా మారుతుంది. జీవితంలో దయ నిండుతుంది. అనవసరమయిన వాటి పట్ల ఆసక్తి పోతుంది.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 96 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 78. రసాయనము -2 🌻*

*సాధకుడు సామాన్యముగ స్థూలబుద్ధి. గురువు సూక్ష్మబుద్ధి. గురువందించిన సూత్రములను అనుస్యూతముగను, అదృశ్యముగను నిర్వర్తించు కొనుటే అతని కర్తవ్యము. అతని యందు జరుగు మార్పులను అతడు గమనింప లేడు. సద్గురువు గమనించుచునే యుండును. మార్పు సూక్ష్మము నుండి స్థూలమునకు జరుగుచు, ఒక దశలో స్థూలమున కూడ ప్రకటింపబడును.*

*పండిన పండు, విచ్చిన పూవు, రత్నము, బంగారము స్వయంప్రకాశములే. అంతియే కాదు, అవి జీవుల కత్యంత ఉపయోగకరము. సాధకుడు సిద్ధుడగుట కూడ లోకశ్రేయస్సు కొరకే. అది తనయందు జరుగు రసాయనము యొక్క ఫలము. రసాయనము జరుగుటకు నిరంతర సాధన, మౌనము ప్రధానములు. వాచాలత్వము దీనికి విరుద్దము.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 359-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 359-2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 359-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 359-2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 79. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా ।
తరుణీ, తాపసారాధ్యా, తనుమధ్యా, తమోఽపహా ॥ 79 ॥ 🍀

🌻 359-2. 'తాపసారాధ్యా' 🌻


పుణ్య ప్రదేశములు, హీన ప్రదేశములు అని లేదు. అన్ని ప్రదేశముల యందు దర్శన చింతనయే యుండును. పాప రూపములు పుణ్య రూపములు లేవు. అన్ని రూపములందునూ శ్రీమాతనే దర్శించు ప్రయత్న ముండును. అట్లే అన్ని నామములు కూడ శ్రీమాతవే అను భావము వుండును. ఇట్లు భావించుట దర్శించుట నిజమగు తపస్సు.

ఇట్టి తపస్సు చేయువారికి క్రమముగ అన్నిటి యందు శ్రీమాత దర్శనము జరుగుట ఆరంభించును. విశ్వాత్మకమగు శుద్ధ చైతన్యము శ్రీమాతయే గనుక అది మాత్రము నిలచి ఇతరములు బాధింపని స్థితి ఏర్పడును. ఇట్టి అనన్యస్థితిలో తాపములు హరింప బడి తపస్సు చేయు జీవులు ఉద్ధరింపబడుదురు. ఈ ప్రయోజనమునకే శ్రీమాత ఆరాధనము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 359-2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 79. Tapatrayagni santapta samahladana chandrika
Tatuni tapasaradhya tanumadhya tamo-paha ॥ 79 ॥ 🌻


🌻 359. Tāpasārādhyā तापसाराध्या 🌻


She is worshipped by ascetics. The ascetics are highly respectable as they abstain from all pleasurable objects in order to seek the Supreme Brahman. They do not worship demigods or goddesses as their only aim is to realize the Ultimate Reality. Worship by such ascetics goes to confirm that She is the Brahman.

There is yet another interpretation. Tāpa means bondage which is the root of all miseries. Sārādhyā is split into sāra (essence) + ā (deep) + dhyā (dhyān or meditation). The bondage arising out of saṁsāra can only be removed by meditating on Her. Through the essence of deep meditation, bondage can be removed.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


29 Mar 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 160. ఇష్టాలు - అయిష్టాలు / Osho Daily Meditations - 160. LIKES AND DISLIKES


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 160 / Osho Daily Meditations - 160 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 160. ఇష్టాలు - అయిష్టాలు 🍀

🕉. మీకు నచ్చిన వాటిని అడగకూడదని, జరిగే వాటిని ఇష్టపడాలని నిర్ణయించుకున్న రోజు, ఆ రోజు మీరు పరిణతి చెందుతారు. 🕉

మనకు నచ్చిన దాన్ని మనం ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉండవచ్చు. కానీ అది మిమ్మల్ని ఎల్లవేళలా దుఃఖానికి గురిచేస్తుంది, ఎందుకంటే ప్రపంచం మీ ఇష్టాలు మరియు అయిష్టాల ప్రకారం నడుస్తుంది. మీకు ఏమి కావాలో, జీవితం కూడా అదే కోరుకుంటుందని ఎటువంటి హామీ లేదు; అంతేకాదు, జీవితం మీకు అస్సలు తెలియని దాని వైపు నిర్దేశించబడే ప్రతి అవకాశం కూడా ఉంది. కొన్నిసార్లు మీకు నచ్చినది జరిగినప్పుడు కూడా మీరు పూర్తి సంతోషాన్ని పొందలేరు. ఎందుకంటే ఏది జరగాలని కోరుకున్నామో, దానిని ఇప్పటికే మన ఊహలలో జీవించినదే కాబట్టి. అంటే ఇది ఇప్పటికే రెండవ అనుభూతి.

ఒక వ్యక్తి మీ ప్రేమికుడిగా ఉండాలని మీరు కోరుకుంటున్నారని మీరు చెబితే, మీరు చాలా కలలలో మరియు అనేక కల్పనలలో ఆ వ్యక్తిని ఇప్పటికే ప్రేమిస్తారు. మరియు అది జరిగితే, అప్పుడు నిజమైన మనిషి మీ ఊహలకు భిన్నంగా, దూరంగా ఉంటాడు; అతను కేవలం అచ్చుకాపీ మాత్రమే కాబోతున్నాడు, ఎందుకంటే వాస్తవికత ఎప్పుడూ ఊహలా అద్భుతంగా ఉండదు. అప్పుడు మీరు నిరుత్సాహానికి గురవుతారు. కానీ అదే మీరు జరుగుతున్న దాన్ని ఇష్టపడటం మొదలుపెడితే, - మొత్తానికి వ్యతిరేకంగా మీరు మీ స్వంత ఇష్టాన్ని ఉంచకపోతే? - ఏది జరిగినా, మీరు కేవలం అవును అని చెప్పండి - అప్పుడు మీరు ఎప్పటికీ దయనీయంగా ఉండలేరు. ఎందుకంటే ఏమి జరిగినా, మీరు ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంలో ఉంటారు. దానిని స్వీకరించడానికి మరియు ఆనందించడానికి సిద్ధంగా ఉంటారు.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Osho Daily Meditations - 160 🌹

📚. Prasad Bharadwaj

🍀 160. LIKES AND DISLIKES 🍀

🕉 The day you decide not to ask for things you like but rather to like things that happen, that day you become mature. 🕉


We can always keep wanting what we like. But that will make you always miserable, because the world does not run according to your likes and dislikes. There is no guarantee that what you want, life also wants; there is no guarantee. There is every possibility that life is destined toward something that you don't know anything about at all. When sometimes the thing you like does happen, you will still not feel very happy, because whatever we demand, we have already lived in fantasy. So it is already secondhand.

If you say that you would like a certain man to be your lover, then in many dreams and in many fantasies you have already loved that man. And if it happens, then the real man is going to fall short of your fantasy; he is going to be just a carbon copy, because reality is never as fantastic as fantasy. Then you will be frustrated. But if you start liking that which is happening-if you don't put your own will against the whole, if you simply say okay-whatever happens, you simply say yes--then you can never be miserable. Because no matter what happens, you are always in a positive attitude, ready to receive it and enjoy it.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


29 Mar 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 171


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 171 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. భావ బలము - 6 🌻


ఉద్వేగము వలన అవతలి వ్యక్తులను వస్తువులను మనకు చెందిన వానిగా భావించి చిక్కులలో పడుట జరుగును. పరమప్రేమ రూపమయిన భక్తి వలన మనవి అనబడు వానిని చివరకు మనలను గూడ సమర్పించు కొనుట జరుగును. పశుపద్ధతిలో మనము అవతలి వానిని ఇష్టపడినచో, వానిని మనకు చెందిన వస్తువుగా ‌భావించుట జరుగును. మనము అనుకొన్న మంచి పద్ధతిలో అవతలి వాడు నడువ వలెనని ఆశించుట జరుగును. ఈ పద్ధతి వట్టి మూర్ఖత యగును.

అవతలివాడు, తనదయిన రీతిలో తాను వర్తింపనారంభింపగనే, మనలో తీవ్రమగు కఠిన ప్రతిక్రియ ఉప్పతిల్లును. అంతటితో వానిని ద్వేషింప ఆరంభింతుము. ఇట్లగుటకు కారణమేమి? అవతలి వానిని మనము ప్రేమించుటయే. ఇట్టి ప్రేమ నిజమైన ప్రేమ అగునా? ఇదియు ద్వేషమను కాలుష్యముతో గూడినదై సంగమగుచున్నది. మన ప్రేమకు గురిఅయిన వానిని ద్వేషించుటకు కారణము, ఉద్వేగముచే ప్రేరేపింపబడిన భావముల శక్తియే...


...✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


29 Mar 2022

శ్రీ శివ మహా పురాణము - 541 / Sri Siva Maha Purana - 541


🌹 . శ్రీ శివ మహా పురాణము - 541 / Sri Siva Maha Purana - 541 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 49 🌴

🌻. బ్రహ్మ మోహితుడగుట - 1 🌻



బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడు నా అజ్ఞచే బ్రాహ్మణులు అగ్నిని వ్రేల్చిరి. ఈశ్వరుడు పార్వతి ప్రక్కన కూర్చుండగా హోమమును చేసెను (1). శివుడు ఋగ్యజుస్సామవేద మంత్రములచే అగ్ని యందు అహుతులనిచ్చెను. కాళి సోదరుడగు మైనాకుడు లాజహోమమును చేయించెను (2)

కుమారా! అపుడు పార్వతీ పరమేశ్వరులిద్దరు లోకాచారముననుసరించి యథావిధిగా ఆనందముతో అగ్నికి ప్రదక్షణమును చేసిరి (3). ఆచట వెంటనే పార్వతీ పతి అద్బుతమగు వృత్తాంతమును చేసెను.

ఓ దేవర్షీ! దానిని వినుము. నీ యందలి ప్రేమచే నేను చెప్పుచున్నాను (4). అ సమయములో శివమాయచే విమోహితుడనైన నేను ఆ దేవి యొక్క పాదములను, చంద్రవంక వంటి కాలి నఖములను గాంచితిని (5).

ఓ దేవర్షీ! ఆ నఖచంద్రుని దర్శనముచే నా యందు కామ వికారము ఆవేశించి నా మనస్సు అల్లకల్లోలమాయెను (6). నేను కామ మోహితుడనై ఆమె పాదములను తేరిపార జూచితిని (7). ఓ నారదా! నాకామ వికారమును గమనించిన మహాదేవుడు మిక్కిలి కోపించి నన్ను చంపుటకు ఉద్యమించెను (8).

ఓ నారదా! అపుడచట పెద్ద హాహాకారము చెలరేగెను. జనులందరు వణికిపోయిరి. విష్ణువు కూడ బయపడెను (9). ఓ మునీ! కోపముతో మండి పడుతూ సంహరించుటకు ఉద్యమించుచున్న ఆ శంభుని విష్ణువు మొదలగు దేవతలు స్తుతించిరి (10).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 541 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 49 🌴

🌻 The delusion of Brahmā - 1 🌻



Brahmā said:—

1. Then at my behest, the lord made the brahmins kindle the sacrificial fire and performed the homa, placing Pārvatī on the lap.

2. Śiva poured offerings into the fire with Mantras from Ṛk, Yajus and Sāma Vedas. Pārvatī’s brother Maināka offered handfuls of fried grains.[1]

3. Then according to the worldly convention, Pārvatī and Śiva performed the circumambulation[2] round the fire, O dear.

4. The husband of Pārvatī exhibited a wonderful feat. O celestial sage, listen to that. I shall mention it out of love for you.

5. On that occasion, deluded by Śiva’s power of illusion I stared at the feet of the goddess as well as the crescentshaped nails.

6. On seeing them, O celestial sage, I became overwhelmed by passion. My mind was greatly disturbed.

7. Deluded by the cupid I stared at her limbs frequently. Then, immediately after staring at them, my semen dropped on the ground.

8. I, the grandfather, was ashamed by the emission of my semen. O sage, I pressed the penis secretly with my feet.

9. O Nārada, on coming to know of it, the great God Śiva became furious. He wanted to kill me immediately because I was overwhelmed by lust.

10. O Nārada, there was great hue and cry everywhere. All the people trembled. Even Viṣṇu, the sustainer of the universe, was terrified.

11. O sage, then Viṣṇu and other gods eulogised Śiva who was blazing furiously and who attempted to kill me.


Continues....

🌹🌹🌹🌹🌹


29 Mar 2022

గీతోపనిషత్తు -343


🌹. గీతోపనిషత్తు -343 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 30 📚


🍀 30-3. శ్రద్ధాభక్తులు - నియమములు నిబంధనల కన్న ఉన్నది దైవముగ చూచుట రాజవిద్య. యోగేశ్వరుడగు శ్రీకృష్ణుడు తత్త్వ విచారమునకే ప్రాధాన్య మిచ్చెను గాని, ఆచార కాండకు అంత ప్రాధాన్యత ఈయలేదు. ఎంతటి దురాచారుడైనను ఈ సూత్రము శ్రద్ధా భక్తులతో పాటించినచో, సాధువై, సజ్జనుడై పరిసరములను సేవించుచు, శ్రేయస్సు కలిగించుచు దైవ సాన్నిధ్యమును పొంద వచ్చును. 🍀

30. అపి చేత్పుదురాచారో భజతే మా మనన్యభాక్ |
సాధురేవ సమంతవ్య స్సమ్యగ్వ్యవసితో హి సః ||

తాత్పర్యము : ఎంత దురాచారు డైనప్పటికిని అనన్య భక్తితో నన్ను సేవించునేని అతడు స్థిరమైన మనసును బొంది క్రమముగ సత్పురుషుడుగ తలంపబడుచున్నాడు.

వివరణము : యోగేశ్వరుడగు శ్రీకృష్ణుడు తత్త్వ విచారమునకే ప్రాధాన్య మిచ్చెను గాని, ఆచార కాండకు అంత ప్రాధాన్యత ఈయలేదు. మరల ఈ కుంభ యుగమున బ్రహ్మమే దిగివచ్చి, మాస్టర్ సి.వి.వి. రూపమున ఇట్టి సులభము, సరళము, సూటియైన మార్గము నిచ్చెను. నియమములు నిబంధనల కన్న ఉన్నది దైవముగ చూచుట రాజవిద్య. దైవమును సర్వకాలముల యందు, సర్వ దేశములయందు, సర్వ రూపముల యందు, సర్వ నామముల యందు, సర్వసన్నివేశముల యందు దైవమును చూచుట, వినుట, అనుభూతి చెందుట జరుగుచుండును.

వేషభాషలకు గాని, కట్టుబొట్టులకు గాని ప్రాధాన్య మంతంత మాత్రమే. పై తెలిపిన రాజవిద్యాసూత్రము అందరును పొందవచ్చును. దానిని నిర్వర్తించు కొనినపుడు జీవుని స్వభావము క్రమముగ సంస్కరింపబడి సాధుస్వభావ మగును. ఎంతటి దురాచారుడైనను ఈ సూత్రము శ్రద్ధా భక్తులతో పాటించినచో, సాధువై, సజ్జనుడై పరిసరములను సేవించుచు, శ్రేయస్సు కలిగించుచు దైవసాన్నిధ్యమును పొందవచ్చును. ఈ మార్గమున ఎందరో దురాచారులు శిష్టాచారులై వర్ధిల్లిరి. దైవసాన్నిధ్యమును కూడ పొందిరి.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


29 Mar 2022