🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 27 / Agni Maha Purana - 27 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 10
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
🌻. యుద్ధకాండ వర్ణనము - 3 🌻
రాముడు మేఘము వలె ఆ రావణునిపై అస్త్రాస్త్రములను కురిపించెను. అతని ధ్వజమును భేదించి, రథమును భగ్నముచేసి గుఱ్ఱములను, సారథిని చంపి, అతని ధనస్సును, బాహ్మావులను, శిరస్సులను ఛేదించెను, కాని అతని శిరస్సుమరల మరల మొలుచు చుండెను. అపుడు రాముడు బ్రహ్మాస్త్రముచే అతని హృదయమును భేదించి నేలపై కూల్చెను. రాక్షసుల నందరిని కూడ పరిమార్చెను. స్త్రీలు విహత భర్తృకలై ఏడ్చరి.
రాముని ఆజ్ఞచే విభీషణుడు ఆ స్త్రీలను ఓదార్చెను. రాముని పూజించెను. రాముడు హనుమంతుని ద్వారా సీతను రప్పించి, అగ్ని ప్రవేశముచే శుద్ధరాలగు ఆమెను స్వీకరించెను. ఇంద్రాదిదేవతలును, బ్రహ్మయు, దశరథుడును "నీవు రాక్షససంహారివైన విష్ణువే" అని అతనిని స్తుతించిరి. రాముడు కోరగా ఇంద్రుడు అమృతము కురిపించి వానరులను పునరుజ్జీవితులను చేసెను. ఆ దేవతలు యుద్ధము చూచి రామునిచే పూజితులై స్వర్గమునకు వెళ్ళిరి. రాముడు వానరులను గౌరవించి, లంకా రాజ్యమును విభీషణున కిచ్చెను.
సీతాసమేతుడై పుష్పకమునెక్కి, సంతసించిన మనస్సు కలవాడై, సీతకు వనములను, దుర్గమ భూములను చూపుచు, వచ్చిన మార్గముననే అయోధ్య వైపు తిరిగి వెళ్ళెను. భరద్వాజునకు నమస్కరించి అచట నుండి నందిగ్రామమునకు వెళ్ళి, భరతునిచే నమస్కరింపబడివాడై అయోధ్యకు వెళ్ళెను. వసిష్ఠాదులకు నమస్కరించి,కౌసల్యా-కై కేయి-సుమిత్రలకు కూడ నమస్కరించి, రాజ్యమును పొంది బ్రహ్మణులను పూజించెను.
పిమ్మట అశ్వమేధయాగములచే వాసుదేవుడైన తనను తానే ఆరాధించెను. సర్వదానములను ఇచ్చెను. ప్రజలను పుత్రులను వలె పాలించెను. దుష్టులను నిగ్రహించుటయందు అసక్తుడై ధర్మకామాదులను పాలించెను. రాముడు రాజ్యమును పాలించిన కాలమున ప్రజలందరును తమ ధర్మములను పాలించుటయందు అసక్తులైరి. అకాలమరణము చెందన వాడెవ్వడును లేకుండెను.
అగ్ని మహాపురాణమున రామాయణము నందలి యుద్దకాండవర్ణనమను దశమాధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana -27 🌹
✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj
Chapter 10
🌻 Yudda (War) Kand - 3 🌻
24-26. Just as a cloud, Rāma showered on him (Rāvaṇa) arrows and weapons. He cut off his flagstaff along with his chariot, horses and charioteer as well as the bow, arms and heads. The cut-off heads grew again (on his body). Rāvaṇa was made to fall down to the ground by Rāma by piercing (his) heart with the Brahmāstra (weapon of the Pitāmaha). The (rākṣasa) women wept along with other demons. After consoling them, Vibhīṣaṇa cremated him as directed by Rāma.
27-28. Rāma made the pure Sītā to be brought (to him) by Hanūmat. He accepted her who was (declared) pure by her entry into the fire and (he) was praised by Indra, Brahmā, Daśaratha and others as, “You are Viṣṇu, the killer of the demon.” Indra being propitiated, revived the monkeys by a shower of nectar.
29-30. They all (Brahmā and o hers) being worshipped by Rāma returned to heavens after witnessing the battle. Rāma entrusted Laṅkā to Vibhīṣaṇa. Having, honoured the monkeys, being seated in the (aerial chariot) Puṣpaka in the company of Sītā, Rāma returned by the same route by which he had gone (to Laṅkā) showing the forests and mountains to Sītā and having a happy mind.
31. Having paid obeisance to Bharadvāja, he reached Nandigrāma. Being revered by Bharata there, he reached Ayodhyā and settled there.
32. Having saluted Vasiṣṭha and other sages, Kauśalyā, Kaikeyī and Sumitrā and having obtained the kingdom he honoured the twice-born.
33. He worshipped Vāsudeva (Viṣṇu), his own self, with the Aśvamedha (sacrifice). He conferred gifts on the deserving men). He protected (the welfare) of his subjects.
34. (He protected) dharma (righteousness), kāma (desire for worldly enjoyments) etc. just as his sons. (He) was bent on subduing the wicked. The world was abound with all righteous activities. The earth was abound with all grains. As Rāma was ruling, there was no premature death.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
30 Mar 2022
No comments:
Post a Comment