1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 01, జనవరి 2022 శనివారం, స్థిర వాసరే 🌹🌹. ఆంగ్ల నూతన సంవత్సర 2022 శుభాకాంక్షలు. Happy New Year 2022 to all friends. 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 137 / Bhagavad-Gita - 137 - 3-18🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 534 / Vishnu Sahasranama Contemplation - 534 🌹
4) 🌹 DAILY WISDOM - 212🌹
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 51🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 117🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 335-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 335-1 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ శనివారం మిత్రులందరికీ 🌹*
*స్థిర వాసరే, 01, జనవరి 2022*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. శ్రీ వేంకటేశ్వర ద్వాదశమంజరికా స్తోత్రం-5 🍀*
*శ్రీమన్నారాయణం శ్రీశం బ్రహ్మాండా[వ]సనతత్పరమ్ |*
*బ్రహ్మణ్యం సచ్చిదానందం మోహాతీతం భజామహే || 8 ||*
*అంజనాద్రీశ్వరం లోకరంజనం మునిరంజనమ్ |*
*భక్తార్తిభంజనం భక్త పారిజాతం తమాశ్రయే || 9 ||*
🌻 🌻 🌻 🌻 🌻
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, హేమంత ఋతువు,
మృగశిర మాసం
తిథి: కృష్ణ త్రయోదశి 07:18:22 వరకు
తదుపరి కృష్ణ చతుర్దశి
నక్షత్రం: జ్యేష్ఠ 19:18:15 వరకు
తదుపరి మూల
యోగం: దండ 13:55:31 వరకు
తదుపరి వృధ్ధి
కరణం: వణిజ 07:17:22 వరకు
వర్జ్యం: 03:02:02 - 04:26:54 మరియు
26:20:00 - 27:44:24
సూర్యోదయం: 06:46:04
సూర్యాస్తమయం: 17:52:57
వైదిక సూర్యోదయం: 06:49:56
వైదిక సూర్యాస్తమయం: 17:49:03
చంద్రోదయం: 05:01:15
చంద్రాస్తమయం: 16:23:22
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: వృశ్చికం
దుర్ముహూర్తం: 08:14:59 - 08:59:26
రాహు కాలం: 09:32:47 - 10:56:08
గుళిక కాలం: 06:46:04 - 08:09:25
యమ గండం: 13:42:52 - 15:06:13
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:41
అమృత కాలం: 11:31:14 - 12:56:06
ముసల యోగం - దుఃఖం 19:18:15
వరకు తదుపరి గద యోగం -
కార్య హాని , చెడు
పండుగలు : మాస శివరాత్రి, ఆంగ్ల న్యూఇయర్,
Masik Shivaratri, English New Year
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 137 / Bhagavad-Gita - 137 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 18 🌴*
*18. నైవ తస్య కృతేనార్థో నకృతేనేహ కశ్చన |*
*న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయ: ||*
🌷. తాత్పర్యం :
*ఆత్మానుభవమును పొందిన మనుజుడు తన విధ్యుక్తధర్మనిర్వహణము ద్వారా పొందవలసిన ప్రయోజనమేదియును ఉండదు. అయినను అట్టి కర్మను నిర్వర్తింపక పోవుటకు కారణము గాని, ఇతర జీవులపై అధార పడవలసిన అవసరము గాని అతనికి ఉండదు.*
🌷. భాష్యము :
ఆత్మానుభవము పొందిన వ్యక్తికి కృష్ణపరమైన కర్మలు తప్ప అన్యమైన విధ్యుక్తధర్మ నిర్వహణమేదియును లేదు. రాబోవు శ్లోకములలో తెలుపబడబోవు రీతి కృష్ణభక్తిభావన జడత్వము కూడా కాదు. కృష్ణభక్తిభావన యందున్నవాడు దేవతాశరణమును గాని, మానవశరణము గాని పొందడు. కృష్ణభక్తి యందు అతడు ఏది యొనరించినను అది విధినిర్వాహణమునకు సరిపోవునదై యుండును.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 137 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 3 - Karma Yoga - 18 🌴*
*18. naiva tasya kṛtenārtho nākṛteneha kaścana*
*na cāsya sarva-bhūteṣu kaścid artha-vyapāśrayaḥ*
🌷Translation :
*A self-realized man has no purpose to fulfill in the discharge of his prescribed duties, nor has he any reason not to perform such work. Nor has he any need to depend on any other living being.*
🌷 Purport :
A self-realized man is no longer obliged to perform any prescribed duty, save and except activities in Kṛṣṇa consciousness. Kṛṣṇa consciousness is not inactivity either, as will be explained in the following verses. A Kṛṣṇa conscious man does not take shelter of any person – man or demigod. Whatever he does in Kṛṣṇa consciousness is sufficient in the discharge of his obligation.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 534 / Vishnu Sahasranama Contemplation - 534🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻 534. త్రిపదః, त्रिपदः, Tripadaḥ 🌻*
*ఓం త్రిపదాయ నమః | ॐ त्रिपदाय नमः | OM Tripadāya namaḥ*
త్రిపదః, त्रिपदः, Tripadaḥ
*అస్య త్రీణి పదానీతి త్రిపదో విష్ణురుచ్యతే ।*
*త్రీణి పదా విచక్రమ ఇత్ శ్రుతిసమీరణాత్ ॥*
*మూడు అడుగులతో త్రిలోకములనూ ఆక్రమీంచినవాడు గనుక, ఆ విష్ణుదేవుని త్రిపదః అని కీర్తింతురు. త్రీణి పదా విచక్రమే (ఋగ్వేదము, తైత్తిరీయ బ్రాహ్మణము 2.4.6) మూడు అడుగులతో పరమాత్మ లోకత్రయమును విక్రమించెనని శ్రుతి చెప్పుచున్నది.*
:: పోతన భాగవతము అష్టమ స్కంధము ::
సీ. దానవ! త్రిపదభూతల మిత్తు నంటివి ధరణిఁ జంద్రార్కు లెందాఁక నుందు
రంతభూమియు నొక్క యడుగయ్యె నాకును; స్వర్లోకమును నొక్క చరణమయ్యె;
నీ సొమ్ము సకలంబు నేఁడు రెండడుగులు; గడమ పాదమునకుఁ గలదె భూమి?
యిచ్చెద నన్నర్థ మీని దురాత్ముండు నిరయంబుఁ బొందుట నిజము గాదె?
తే. కాన దుర్గతికిని గొంతకాల మరుగు, కాక యిచ్చెదవేని వేగంబు నాకు
నిపుడు మూఁడవ పదమున కిమ్ము చూపు, బ్రాహ్మణాధీనములు ద్రోవ బ్రహ్మవశమె? (641)
*ఓ దనుజేంద్రా! మూడడుగుల నేల ఇస్తానంటివి. భూలోకమూ చంద్ర సూర్యులదాకా ఉండే స్థలమూ నాకు ఒక అడుగైనది. స్వర్గలోకం ఒక అడుగైనది. నీ సంపద అంతా ఈ నాడు రెండడుగులైనది. ఇక మూడవ అడుగుకు ఎక్కడుంది చోటు? ఇస్తానన్న అర్థాన్ని ఇవ్వనివాడు నరకాన్ని పొందడం నిజం. అందువల్ల కొంతకాలం నరకానికి వెళ్ళు. అట్లా కాకుండా మూడవ అడుగు ఇవ్వదలచుకొంటే ఆ చోటు నాకు తొందరగా చూపు. బ్రాహ్మణులకు స్వాధీనం కావలసిన దానిని కాదనటానికి బ్రహ్మకుకూడా సాధ్యం కాదు కదా!*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 534🌹*
*📚. Prasad Bharadwaj*
*🌻534. Tripadaḥ🌻*
*OM Tripadāya namaḥ*
अस्य त्रीणि पदानीति त्रिपदो विष्णुरुच्यते ।
त्रीणि पदा विचक्रम इत् श्रुतिसमीरणात् ॥
*Asya trīṇi padānīti tripado viṣṇurucyate,*
*Trīṇi padā vicakrama it śrutisamīraṇāt.*
*He has placed three steps to occupy the three worlds and hence He is Tripadaḥ.*
:: श्रीमद्भागवते द्वितीयस्कन्धे सप्तमोऽध्यायः ::
ज्यायान्गुणैरवरजोऽप्यदितेः सुतानां
लोकान्विचक्रम इमान्यदथाअथाधियज्ञः ।
क्ष्मां वामनेन जगृहे त्रिपदच्छलेन
याच्ञामृते पथि चरन्प्रभुभिर्न चाल्यः ॥ १७ ॥
Śrīmad Bhāgavata - Canto 7, Chapter 17
Jyāyānguṇairavarajo’pyaditeḥ sutānāṃ
Lokānvicakrama imānyadathāathādhiyajñaḥ,
Kṣmāṃ vāmanena jagrhe tripadacchalena
Yācñāmrte pathi caranprabhubhirna cālyaḥ. 17.
*The Lord, although transcendental to all material modes, still surpassed all the qualities of the sons of Aditi, known as the Ādityas. The Lord appeared as the youngest son of Aditi. And because He surpassed all the planets of the universe, He is the Supreme God. On the pretense of asking for a measurement of three footsteps of land, He took away all the lands of Bali Mahārāja. He asked simply because without begging, no authority can take one's rightful possession.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः ।त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृंगः कृतान्तकृत् ॥ ५७ ॥
మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః ।త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాన్తకృత్ ॥ 57 ॥
Maharṣiḥ kapilācāryaḥ krtajño medinīpatiḥ,Tripadastridaśādhyakṣo mahāśrṃgaḥ krtāntakrt ॥ 57 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 212 🌹*
*🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*
*🌻 30. A Human Being Always Stands Outside the World🌻*
*Bhagavan Sri Krishna was there as a super-personal individual, the one who could think in a different way altogether, far different from the way in which all human beings can think. He was a total Man, ‘M' capital, the true ‘son of Man', in biblical words, who could think as all human beings and yet go beyond the ken of human knowledge. The structure of the world is not the object of ordinary human perception. This is the theme of the third chapter of the Gita. The world is made in such a way that it cannot be comprehended by the apparatus of human understanding, and therefore to pass judgment on the consequences that follow from the actions of man in the field of this world would be to go off on a tangent and would not serve the purpose.*
*It would not touch even the border of reality. The nature of the world conditions the effects of human action, as it conditions the effects of any action, for that matter. Every event is inwardly connected to the organic structure of the cosmos; and this structure of the cosmos being the determinant of the rightness or the wrongness of any procedure, a human being who always stands outside the world, regarding the world as an object of the senses, would be a bad judge of the circumstances of life.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#PrasadBhardwaj
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 51 🌹*
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻 39. వసంతము 🌻*
*వసంతము విసుగుదల, చిరాకు, అలసటలను పారద్రోలి ఉత్సాహమునకు, ఆనందమునకు తెర ఎత్తును. వసంతమున చైతన్యము విద్యుత్ ప్రవాహమువలె జీవులను మేలుకొలిపి చైతన్య వంతులను చేయును. ఉన్నతోన్నతమైన భావములను ఆవిష్కరించును. భగవత తత్త్వము పూర్ణముగ ప్రతి అణువునందును వసించు సమయమే వసంతము. జీవకోటి అంతయు శిశిరము నుండి వసంత మునకు ఎదురు చూచుచుండును.*
*వేలాది సంవత్సరముల నుండి మహత్తర మైన మరియు చైతన్యవంతమైన ఘట్టములు భూమిపై వసంతము నందే జరిగినవి. వసంతము భూమికే నవచైతన్యము ప్రసాదించును. వసంత ఋతువున మొదటి తొమ్మిది రోజులు ప్రత్యేక దీక్షను వహించుటకు అనుకూలములు. ఇవియే వసంత నవరాత్రులు. అటుపై యాభై రోజులు ఈ దీక్షను కొనసాగించిన వారికి సంవత్సర మంతయును సరిపడ చైతన్యము వారియందు స్థిరపడును. వసంత ఋతువు మొత్తము సాధకులు క్రమబద్ధమైన జీవితమును గడుపవలెనని మా ఆకాంక్ష!*
*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 117 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. తెలిసో తెలియకో అనంతంతో మనం కలవడం కోసం ఆకాంక్షిస్తాం. కానీ మనసు గోడలా అడ్డు పడుతుంది. ధ్యానం వంతెన. మనసు సంబంధాన్ని తెగ గొడుతుంది. ధ్యానం సంబంధాన్ని ఏర్పరుస్తుంది. 🍀*
*మనసు గోడ. ధ్యానం వంతెన. మనసు సంబంధాన్ని తెగ గొడుతుంది. ధ్యానం సంబంధాన్ని ఏర్పరుస్తుంది. నువ్వు సమస్తంలో వున్నావంటే నువ్వు చెట్లతో, పర్వతాల్లో, నదుల్తో, నక్షత్రాల్తో, సూర్యచంద్రులో వున్నావన్నమాట. అప్పుడు ఆ శాశ్వతత్వం నీదవుతుంది. ఆ ఆనందం నీదవుతుంది.*
*జీవితం అప్పుడు మొదటిసారి స్వేచ్ఛను పొందుతుంది. సరిహద్దులు అదృశ్యమవుతాయి. మానవ హృదయానికి అంతిమ కాంక్ష అదే. తెలిసో తెలియకో అనంతంతో మనం కలవడం కోసం ఆకాంక్షిస్తాం. కారణం అనంతంతో కలిస్తేనే మనం శిఖరాగ్రాన్ని అందుకుంటాం. ఆ పర్వతాగ్రంపై పరవశం మొగ్గ తొడుగుతుంది.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 335-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 335-1🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 75. విశ్వాధికా, వేదవేద్యా, వింధ్యాచల నివాసినీ ।*
*విధాత్రీ, వేదజననీ, విష్ణుమాయా, విలాసినీ ॥ 75 ॥ 🍀*
*🌻 335-1. 'వేదవేద్యా' 🌻*
*వేదములచే తెలియదగినది శ్రీమాత అని అర్థము. శ్రీదేవి చింతామణి గృహమునకు నాలుగు దిక్కుల యందు నాలుగు ద్వారము లున్నవి. ఏ ద్వారము నుండైనను శ్రీదేవి గృహము నందు ప్రవేశించి దేవిని దర్శింపవచ్చును. నాలుగు ద్వారములు నాలుగు వేదములుగ తెలియవలెను. శ్రీదేవి గృహమును ప్రవేశించుటకు నాలుగు వేదములలో ఒక్క వేదమైననూ తెలియవలెను. వేదములు నాలుగు. అవి వరుసగ ఋగ్వేదము, యజుర్వేదము, అధర్వణ వేదము, సామవేదము. ఋగ్వేదము తూర్పు ద్వారము; యజుర్వేదము దక్షిణ ద్వారము; అధర్వణ వేదము పశ్చిమ ద్వారము; సామవేదము ఉత్తర ద్వారము.*
*మన యందు కలుగు సంకల్పములు పుట్టినచోటు నెరుగుట ఋగ్వేదము నెరుగుట. సంకల్పమే సరస్వతి. సరస్వతి పరావాక్కుగను, పశ్యంతి వాక్కుగను, మధ్యమ వాక్కుగను, వైఖరి వాక్కుగను నిత్యము వ్యక్తమగు చుండును. సరస్వతి శ్రీదేవితో నున్నప్పుడు పరావాక్కు సంకల్పమై స్ఫురించినపుడు జీవునికి తెలియును. అది పశ్యంతి వాక్కు, అది వివరమై భావ - భాష రూపము దాల్చినపుడు మధ్యమ వాక్కు కంఠము నుండి ఉచ్చరించినపుడు వైఖరి వాక్కు అగుచున్నది. ఇట్లు నిత్యము సరస్వతి జీవులయందు ప్రవహించుచునే యున్నది.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 335-1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 75. Vishvadhika vidavidya vindhyachala nivasini*
*Vidhatri vidajanani vishnu maya vilasini ॥ 75 ॥ 🌻*
*🌻 335-1. Veda-vedyā वेद-वेद्या (335) 🌻*
*She can be known through Veda-s. All the Veda-s lead to the Supreme Reality, the Brahman. Brahman is the embodiment of Veda-s.*
* Kṛṣṇa says, (Bhagavad Gīta XV.15) “By all the Veda-s, I am to be known. …I am the knower of all Veda-s”.*
*Veda-s can be known only through knowledge. In other words, unless one has knowledge, the Self-realization is not possible. Brahman is the essence of that knowledge. There is a difference between Veda-s and Vedānta. Vedānta refers to the teachings of Upaniṣads. Study of Upaniṣads gives the necessary impetus to the knowledge. It is also said that Śrī Cakra has four gates on the four sides and each gate represents one Veda. Knowing Her through Veda-s is called Śuddha Vidya (the perfect knowledge) in contrast to Śrī Vidya that deals predominantly with rituals. *
* No doubt, some good interpretations on Veda-s are available, but the fact is that Veda-s are beyond human interpretation. If one looks at the Veda-s, one may tend to believe that they talk about external fire rituals. In fact they do not. They convey several subtle interpretations and only out of such interpretations, Upaniṣads originated. Upaniṣads do plain speaking and to the point. They make attempts to qualify the Brahman by affirmations and negations. She is in the form of essence of Veda-s.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹