🍀 09, JANUARY 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🍀

🌹🍀 09, JANUARY 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 09, JANUARY 2023 MONDAY, సోమవారం, ఇందు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 116 / Kapila Gita - 116 🌹 సృష్టి తత్వము - 72
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 708 / Vishnu Sahasranama Contemplation - 708 🌹 🌻708. భూతావాసః, भूतावासः, Bhūtāvāsaḥ🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 669 / Sri Siva Maha Purana - 669 🌹 🌻. గణాలకు అధిపతిగా పట్టాభిషేకం - గణేశుని వ్రత వర్ణనము - 7 / Gaṇeśa crowned as the chief of Gaṇas - Description of Ganesha Vrata - 7 🌻
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 290 / Osho Daily Meditations - 290 🌹 🍀 290. సరైన క్షణాలు / RIGHT MOMENTS 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 423 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 423 - 1 🌹 🌻 423. 'ద్విజబృంద నిషేవితా' - 1 / 'Dwijabrinda Nishevita' - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹09, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*

*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 15 🍀*

27. ఉగ్రతేజా మహాతేజా జన్యో విజయకాలవిత్ |
జ్యోతిషామయనం సిద్ధిః సర్వవిగ్రహ ఏవ చ
28. శిఖీ ముండీ జటీ జ్వాలీ మూర్తిజో మూర్ధగో బలీ |
వేణవీ పణవీ తాలీ ఖలీ కాలకటంకటః

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : బయట పరిస్థితులపై నీ వెక్కువగా ఆధారపడరాదు. బయటి పరిస్థితులు సహాయ పడవని గాని, అవరోధాలు కల్పించవని గాని, నేననను. కానీ, ఏమైనా అవి అప్రధానములు. ప్రాధాన్యం ఇవ్వవలసినది నీ బయటగాక నీ లోపల ఉన్నది. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌, హేమంత ఋతువు,
దక్షిణాయణం, పౌష్య మాసం
తిథి: కృష్ణ విదియ 09:40:39
వరకు తదుపరి కృష్ణ తదియ
నక్షత్రం: ఆశ్లేష 33:02:18 వరకు
తదుపరి మఘ
యోగం: వషకుంభ 10:32:12
వరకు తదుపరి ప్రీతి
కరణం: గార 09:39:40 వరకు
వర్జ్యం: 20:27:52 - 22:15:36
దుర్ముహూర్తం: 12:45:17 - 13:29:55
మరియు 14:59:10 - 15:43:47
రాహు కాలం: 08:11:58 - 09:35:38
గుళిక కాలం: 13:46:39 - 15:10:19
యమ గండం: 10:59:18 - 12:22:59
అభిజిత్ ముహూర్తం: 12:00 - 12:44
అమృత కాలం: -
సూర్యోదయం: 06:48:17
సూర్యాస్తమయం: 17:57:40
చంద్రోదయం: 20:01:36
చంద్రాస్తమయం: 08:35:20
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: కర్కాటకం
యోగాలు: సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం
33:02:18 వరకు తదుపరి ధ్వాoక్ష 
యోగం - ధన నాశనం, కార్య హాని 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. కపిల గీత - 116 / Kapila Gita - 116🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 72 🌴*

*72. తమస్మిన్ ప్రత్యగాత్మానం ధియా యోగ ప్రవృత్తయా|*
*భక్త్యా విరక్త్యా జ్ఞానేన వివిచ్యాత్మని చింతయేత్॥*

*కనుక, మానవుడు భగవంతుని యందు భక్తిని చేయవలెను. ప్రకృతి పురుషుల వివేకము ద్వారా సంసారము నందు వైరాగ్యము పొందవలెను. పిమ్మట యోగముచే ఏకాగ్రము చెందిన బుద్ధితో, దేహమున కంటె వేరైన వాడుగా ఈ దేహమునందే ప్రత్యగాత్మ రూపములో నున్న పరమేశ్వరుని ధ్యానింపవలెను.*


*ఇదంతా ప్రత్యగాత్మ అధీనం (జీవాత్మ) , జీవుడు ప్రవర్తిస్తేనే, జీవుడిలో చైతన్యం ఉన్ముఖమైతేనే పని చేస్తాయి. అందుకే "నేను చేస్తున్న్నా" అనే భావన సరికాదు. ఈ సమష్టి పురుషునిలో వున్న వ్యష్టి పురుషుడిగా పేరు గాంచిన ప్రత్యగాత్మను యోగ బుద్ధితో తెలుసుకోవాలి. మనసు బుద్ధి చిత్తమూ అహంకారముతో కలిసి "వాస్తవముగా ఈ సముదాయాన్ని పని చేయిస్తున్నది ప్రత్యగాత్మ. ఆ ప్రత్యగాత్మకు అలాంటి సంకల్పం కలిగించిన వాడు పరమాత్మ".

*జీవాత్మ, పరమాత్మ, శరీరం, ఇంద్రియములు, అవయవములూ, అధిష్ఠాన దేవతలూ అంటే ఏమిటో, ఈ సమగ్ర స్వరూపాన్ని యధార్థ జ్ఞానముతో తెలుసుకొంటే, ప్రతీ పనికీ ఆరంభం ఎక్కడో తెలుసుకోవడాన్ని జ్ఞానం అంటారు. అలాంటి జ్ఞానం పొంది "ఎవరి సంకల్పముతో ఇవన్నీ పని చేస్తాయో, అలాంటి వాడి సంకల్పము లేకుంటే ఇవన్నీ నిష్క్రియలైనప్పుడు, ఇవన్నీ నాకెందుకూ" అని కలగడం విరక్తి. మొదట జ్ఞానం, తరువాత విరక్తీ, కలిగిన తరువాత పరమాత్మ మీద భక్తి కలుగుతుంది. జ్ఞ్యానముతో స్పష్టముగా విడదీసి వివేకముతో తెలుసుకుని, పరమాత్మ యందు భక్తి, ప్రపంచము యందు విరక్తినీ పెంచుకొని, ఆ స్వామిని భక్తితో ధ్యానం చేయాలి. అలా చేయడం వలన అహంకారం పెరగదు. శరీరమే ఆత్మ అన్న భ్రమ తొలగిపోతుంది.*

*ప్రతీ చిన్న పని ఎలా జరిగిందో తెలిసిన నాడు, నేనే పనీ చెయటం లేదు అని తెలుస్తుంది. ఇవన్నీ చేయిస్తున్న పరమాత్మను మన చిత్తములో ధ్యానం చేస్తాము. అప్పుడు అర్థమవుతుంది మనకి గుడికి వెళ్ళే బుద్ధి పుట్టింది అంటే పరమాత్మకు ఆ సంకల్పం కలిగింది అని అర్థం. ఇది బాగా అవగాహనమైతే అదే వివేకం. ఇలాంటి వివేకముతో పరమాత్మను ఈ ఆత్మలో బుద్ధితో ధ్యానం చేస్తే, అహంకార మమకారములు తొలగుతాయి. మనసు ఏకాగ్రమవుతుంది, బుద్ధి స్థిరమవుతుంది, చిత్తం నిశ్చలమవుతుంది.*

*రెండవ అధ్యాయము సమాప్తము.*

*కొనసాగుతుంది... 3వ అధ్యాయము*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 116 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 2. Fundamental Principles of Material Nature - 72 🌴*

*72. tam asmin pratyag-ātmānaṁ dhiyā yoga-pravṛttayā*
*bhaktyā viraktyā jñānena vivicyātmani cintayet*

*Therefore, through devotion, detachment and advancement in spiritual knowledge acquired through concentrated devotional service, one should contemplate that Supersoul as present in this very body although simultaneously apart from it.*


*One can realize the Supersoul within oneself. He is within one's body but apart from the body, or transcendental to the body. Although sitting in the same body as the individual soul, the Supersoul has no affection for the body, whereas the individual soul does. One has to detach himself, therefore, from this material body, by discharging devotional service. It is clearly mentioned here (bhaktyā) that one has to execute devotional service to the Supreme. vāsudeve bhagavati bhakti-yogaḥ prayojitaḥ. When Vāsudeva, the all-pervading Viṣṇu, the Supreme Personality of Godhead, is served in completely pure devotion, detachment from the material world immediately begins. The purpose of Sāṅkhya is to detach oneself from material contamination. This can be achieved simply by devotional service to the Supreme Personality of Godhead.*

*When one is detached from the attraction of material prosperity, one can actually concentrate his mind upon the Supersoul. As long as the mind is distracted towards the material, there is no possibility of concentrating one's mind and intelligence upon the Supreme Personality of Godhead or His partial representation, Supersoul. In other words, one cannot concentrate one's mind and energy upon the Supreme unless one is detached from the material world. Following detachment from the material world, one can actually attain transcendental knowledge of the Absolute Truth. The perfection of this sāṅkhya-yoga culminates in devotional service unto the Absolute Truth.*

*End of 2nd Chapter*

*Continues... 3rd chapter*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 708 / Vishnu Sahasranama Contemplation - 708🌹*

*🌻708. భూతావాసః, भूतावासः, Bhūtāvāsaḥ🌻*

*ఓం భూతావాసాయ నమః | ॐ भूतावासाय नमः | OM Bhūtāvāsāya namaḥ*

భూతాన్యత్రాభిముఖ్యేన వసన్తీతి జనార్దనః ।
భూతావాస ఇతి ప్రోక్తో వేదవిద్యావిశారదైః ॥
వసన్తి త్వ్యి భూతాని భూతావాస్తతో భవాన్ ।
ఇతి హరివంశే కృష్ణద్వైపాయనమునీరణాత్ ॥

*సకల భూతములకును సమగ్రమైన నివాసస్థానము అయినవాడు. సకల భూతములును ఈతనియందు అభిముఖీ భావమున అనగా అతడే తమకు రక్షకుడు అను తాత్పర్యభావమున వసించుచుండును. 'వసన్తిత్వయి భూతాని భూతావాసస్తతో భవాన్‍' అను హరివంశ వచనము (3.88.53) - 'భూతములు నీయందు వసించును అందుచేతనే నీవు భూతావాసుడవు' ఇందులకు ప్రమాణము.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 708🌹*

*🌻708.Bhūtāvāsaḥ🌻*

*OM Bhūtāvāsāya namaḥ*


भूतान्यत्राभिमुख्येन वसन्तीति जनार्दनः ।
भूतावास इति प्रोक्तो वेदविद्याविशारदैः ॥
वसन्ति त्व्यि भूतानि भूतावास्ततो भवान् ।
इति हरिवंशे कृष्णद्वैपायनमुनीरणात् ॥

Bhūtānyatrābhimukhyena vasantīti janārdanaḥ,
Bhūtāvāsa iti prokto vedavidyāviśāradaiḥ.
Vasanti tvyi bhūtāni bhūtāvāstato bhavān,
Iti harivaṃśe kr‌ṣṇadvaipāyanamunīraṇāt.

*All beings reside in Him. They reside in Him with an understanding that He is the One who sustains and protects them. In Harivaṃśa (3.88.53) it is mentioned that 'वसन्तित्वयि भूतानि भूतावासस्ततो भवान् / Vasantitvayi bhūtāni bhūtāvāsastato bhavān' meaning 'All beings live in you and therefore you are known as Bhūtāvāsaḥ.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
भूतावासो वासुदेवः सर्वासुनिलयोऽनलः ।दर्पहा दर्पदोऽदृप्तो दुर्धरोऽथापराजितः ॥ ७६ ॥
భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఽనలః ।దర్పహా దర్పదోఽదృప్తో దుర్ధరోఽథాపరాజితః ॥ 76 ॥
Bhūtāvāso vāsudevaḥ sarvāsunilayo’nalaḥ,Darpahā darpado’dr‌pto durdharo’thāparājitaḥ ॥ 76 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 . శ్రీ శివ మహా పురాణము - 669 / Sri Siva Maha Purana - 669 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 18 🌴*
*🌻. గణాలకు అధిపతిగా పట్టాభిషేకం - గణేశుని వ్రత వర్ణనము - 7 🌻*

ఈ వ్రతమును మానవుడు ఆచరించి ఒక సంత్సరము తరువాత వ్రతపూర్తి కొరకై ఉద్యాపనమును అనుష్ఠించవలెను (49). దానియందు పన్నెండు గురు బ్రాహ్మణులకు భోజనము నిడవలెను. ఇది నా ఆజ్ఞ. ఒక కలశమును స్థాపించి నీ మూర్తిని పూజించవలెను (50). అపుడు వేద విధానము ననుసరించి అష్ట దళ పద్మములను ముగ్గువేసి అదే స్థలములో హోమమును చేయవలెను. ఈ వ్రతమును చేయుటలో దనలోభమును విడువవలెను (51).

మరియు అచట మూర్తి యెదుట ఇద్దరు స్త్రీలను, ఇద్దరు బాలకులను పూజించి ఆదరముతో యథావిధిగా భోజనమునిడవలెను (52). రాత్రి జాగరమును చేసి మరల ఉదయము పూజను చేయవలెను. తరువాత మరల మరల రావలెనని ప్రార్థించి ఉద్వాసన చెప్పవలెను (53). వ్రతము పూర్ణమగుట కొరకై ఒక బాలకునకు దోసెడు పువ్వులను సమర్పించి వాని నుండి ఆశీస్సులను గ్రహించి స్వస్తి మంత్రములను పఠించవలెను (54). తరువాత నమస్కరించి మిగిలిన కార్యముల నన్నిటినీ పూర్తి చేయవలెను. ఇట్లు వ్రతము చేసిన వానికి కోరిన ఫలము లభించును (55).

ఓ గణేశా! నిన్ను నిత్యము శ్రద్ధతో యథాశక్తి పూజించు వాని కోర్కెలన్నియూ ఈడేరును (56). గణేశుడవగు నిన్ను సిందూరము, గంధము, బియ్యము, మొగలి పువ్వులు మరియువివిధ ఉపచారములతో పూజించవలెను (57). 

ఎవరైతే ఈ విధముగా నిన్ను భక్తితో అనేక ఉపచారములను సమర్పించి పూజించెదరో, వారికి సిద్ధి కలుగును. వారిని విఘ్నములు ఏనాడైననూ బాధించవు (58). అన్ని వర్ణములవారు, మరియు స్త్రీలు కూడ ఈ వ్రతమును ప్రత్యేకముగా చేయవలెను. అభివృద్ధిని గోరు రాజులు ఈ వ్రతమును విశేముగా చేయవలెను (59). ఎవరెవరు ఏయే కొర్కెలను కలిగి యుందురో వారు వారు నిన్ను నిత్యము పూజించి ఆయా కోర్కెలను నిశ్చితముగా పొందవచ్చును (60).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 669🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 18 🌴*

*🌻 Gaṇeśa crowned as the chief of Gaṇas - Description of Ganesha Vrata - 7 🌻*

49. When thus the Vrata is duly completed in a year, the devotee shall perform the rite of formal dismissal for the completion of the Vrata.

50. At my bidding twelve brahmins shall be fed. After placing a jar your image shall be worshipped.

51. After making the eight-petalled lotus diagram on the ground in accordance with Vedic injunctions a sacrifice shall be performed by the liberal people who have no disinclination to spend money.

52. Two women and two students shall be worshipped and fed in front of the idol duly.

53. The devotee shall keep awake at night and perform worship in the morning. After that the rites of formal dismissal with the mantra “Kṣemāya Punarāgamanāya Ca.” (For welfare and return again) shall be performed.

54. The benediction as well as good wishes shall be received from the boy. In order to make the Vrata complete, handfuls of flowers shall be offered.

55. After prostrations, various routines shall be carried on. He who performs Vratas like this can secure the desired fruits.

56. O Gaṇeśa, he who performs your worship upto his ability, with faith, shall derive the fruit of all desires.

57. The devotee shall worship you, the lord of Gaṇas with vermillion, sandal paste, raw rice grains and Ketaka flowers as well as with other services.

58. They who devoutly worship you with acts of service will achieve success. Their obstacles will be quelled.

59. These Vratas shall be performed by the people of all castes, particularly by women as well as kings aiming and beginning to be prosperous and flourishing.

60. He will certainly derive whatever he desires. Hence you shall always be served by him whoever he is who desires fruits.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 290 / Osho Daily Meditations - 290 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 290. సరైన క్షణాలు 🍀*

*🕉. మీరు సంతోషంగా, ప్రేమగా, తేలియాడు తున్నప్పుడు - ద్వారానికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు ఇవి సరైన క్షణాలు. ఒక్క తట్టడం చాలు. 🕉*

*ప్రజలు దయనీయంగా, ఆత్రుతగా, ఉద్విగ్నతతో మరియు ఆందోళనతో ఉన్నప్పుడు, వారు ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తారు. కాని ప్రవేశించడం కష్టం. మీరు బాధపడినప్పుడు, కోపంగా లేదా విచారంగా ఉన్నప్పుడు, మీరు ధ్యానం గురించి ఆలోచిస్తారు, కానీ అది దాదాపు విద్యుత్‌ ప్రవాహానికి విరుద్ధంగా, కష్టంగా ఉంటుంది. మీరు సంతోషంగా, ప్రేమగా, తేలియాడుతున్నప్పుడు-- తలుపుకి చాలా దగ్గరగా ఉన్నప్పుడు ఇవి సరైన క్షణాలు. ఒక్క తట్టడం చాలు. కనిపించే కారణం లేకుండానే, అకస్మాత్తుగా ఒక ఉదయం మీరు మంచి అనుభూతి చెందుతారు.*

*అపస్మారక స్థితిలో ఏదో జరిగి ఉండాలి. మీకు మరియు విశ్వానికి మధ్య ఏదో జరిగి ఉండాలి, కొంత సామరస్యం. బహుశా అది రాత్రి, గాఢ నిద్రలో జరిగి ఉండవచ్చు. ఉదయం మీరు మంచి అనుభూతి చెందుతున్నారు; ఆ సమయాన్ని వృధా చేయకు. మీరు దయనీయంగా ఉన్నప్పుడు కొన్ని రోజుల ధ్యానం కంటే కేవలం కొన్ని నిమిషాల ఇటువంటి ధ్యానం విలువైనది. లేదా రాత్రి మంచం మీద పడకున్నప్పడు, హాయిని అనుభూతి చెందినప్పుడు, మంచి పరిసరాలు, మంచం యొక్క వెచ్చదనం అనుభూతిస్తున్నప్పడు, కేవలం ఐదు నిమిషాలు కూర్చుని ధ్యానం చేయండి. ఆ క్షణం వృధా చేయకు. ఒక నిర్దిష్ట సామరస్యం ప్రస్తుతం ఉనికిలో ఉంది కదా, దానిని ఉపయోగించుకోండి, దానిపై ప్రయాణించండి. ఆ సహజ అల మిమ్మల్ని మీరు స్వంతంగా వెళ్లగలిగే దాని కంటే చాలా దూరం తీసుకు వెళుతుంది. ఈ ఆనందకరమైన క్షణాలను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.*
 
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 290 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 290. RIGHT MOMENTS 🍀*

*🕉. When you are feeling happy, loving, floating--these are the right moments when the door is very close. Just a knock will be enough. 🕉*

*It almost always happens that when people are miserable, anxious, tense, and nervous, they try meditation-but then it is hard to enter. When you are feeling hurt, angry, or sad, then you think of meditation, but that is almost going against the current and will be difficult. When you are feeling happy, loving, floating-- these are the right moments when the door is very close. Just a knock will be enough. Suddenly one morning you are feeling good, for no visible reason. Something must have happened deep in the unconscious.*

*Something must have happened between you and the cosmos, some harmony; maybe it happened in the night, in deep sleep. In the morning you are feeling good; don't waste that time. Just a few minutes of meditation will be worth more than a few days of meditation when you are miserable. Or suddenly at night lying on the bed, you feel at home ... cozy surroundings, the warmth of the bed. Just sit for five minutes; don't waste that moment. A certain harmony is there-use it, ride on it, and that wave will take you far away, farther than you can go on your own. Learn how to use these blissful moments.*
  
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 423 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 423 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 90. చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।*
*గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥ 🍀*

*🌻 423. 'ద్విజబృంద నిషేవితా' - 1🌻* 

*ద్విజుల బృందములచే విశేషముగ సేవింపబడునది శ్రీమాత అని అర్థము. ద్విజులు అనగా మరల పుట్టినవారు. రెండవ మారు పుట్టిన వారు. మానవులందరూ రక్త మాంసాదులతో కూడిన దేహమందు పుట్టుదురు. ఇట్టి వారిలో కొందరు తమ జీవితములను పరహితము, దానము, దైవ ధ్యానములకు సమర్పించి చైతన్యవంతులగుచు జడమగు దేహ పదార్థము నుండి విడివడి చైతన్యవంతమగు వెలుగు శరీరమున స్థిరపడుదురు. వారు చేయుచున్న కార్యక్రమముల నిస్వార్థతను బట్టి, దాన ధర్మములను బట్టి ధ్యానమునందు వారికి చిత్ శక్తి ఆవరించును. ఆ వెలుగు శరీరమై నిలచును. వారందు స్థిరపడి జడమయమగు దేహము యొక్క బంధము లేక జీవింతురు. అట్టివారు ద్విజులు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 423 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 90. Chichakti shchetanarupa jadashakti jadatmika*
*Gayatri vyahruti sandhya dvijabrunda nishemita ॥ 90 ॥🌻*

*🌻 423. 'Dwijabrinda Nishevita' - 1🌻*

*It means Srimata who is specially served by the groups of Dwijus. Dwiju means born again. Second born. All human beings are born in a flesh and blood body. Some of these devote their lives to charity and divine meditations, become conscious and separate from the inanimate body matter and settle down in the light body of the conscious. According to the activities of the selflessness and charitable deeds they are doing, Chit Shakti surrounds them in meditation. That will stand as the body of that light and they are settled in it and live without the bonds of the physical body. They are bijus.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj

శివ సూత్రములు - 022 - 7. జాగ్రత్ స్వప్న సుషుప్త భేదే తుర్యాభోగ సంభవః. - 2 / Siva Sutras - 022 - 7. Jāgratsvapnasuṣuptabhede turyābhogasambhavaḥ. - 2


🌹. శివ సూత్రములు - 022 / Siva Sutras - 022 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

1- శాంభవోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 7. జాగ్రత్ స్వప్న సుషుప్త భేదే తుర్యాభోగ సంభవః. - 2 🌻

🌴. మెలకువ (జాగ్రత్), స్వప్న (స్వప్న), గాఢమైన నిద్ర (సుషుప్త) వంటి విభిన్న స్థితులలో కూడా నాల్గవ స్థితి తుర్య యొక్క పారవశ్యం, ఆనందం ఉంది. 🌴


ఒక వ్యక్తిలో ఆధ్యాత్మిక పరివర్తన జరిగినప్పుడు, భౌతిక అవగాహన మరియు ఆధ్యాత్మిక అవగాహన రెండూ కలిసే స్థానం ఉంటుంది. ఆ స్థానం నుండి, ఆధ్యాత్మిక మార్గంలో పైకి కదలిక ప్రారంభమైనప్పుడు, ఒకరి అహం కరిగి పోతుంది. ధ్యానంలో ఖచ్చితంగా సాధించ వలసినది ఇదే. అహం తొలగిపోవడం ప్రారంభించి నప్పుడు, అది ఆత్మ యొక్క సార్వత్రిక వైఖరికి దారి తీస్తుంది.

బ్రహ్మం యొక్క సర్వవ్యాప్త స్వభావం యొక్క జ్ఞానం వికసించడం ప్రారంభించినప్పుడు చైతన్యం యొక్క నాల్గవ దశ చైతన్యం యొక్క ఇతర మూడు ప్రాపంచిక దశలలో ప్రబలంగా కొనసాగుతుంది. ఎందుకంటే ఒకరు అజ్ఞానం వల్ల అహంకారంతో కట్టుబడి ఉంటారు. అహంకారం కరిగిపోవడం ప్రారంభించినప్పుడు, అజ్ఞానం యొక్క బలం కూడా క్షీణించడం ప్రారంభమవుతుంది, ఆత్మ యొక్క సాక్షాత్కారానికి మార్గం సుగమం చేస్తుంది. ఈ పరివర్తన తురీయ దశలో జరుగుతుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Siva Sutras - 022 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 1 - Sāmbhavopāya

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 7. Jāgratsvapnasuṣuptabhede turyābhogasambhavaḥ. - 2 🌻

🌴. During different states of consciousness as waking (jāgrat), dreaming (svapna), profound sleep (suṣupta), there is the delight and enjoyment of the Fourth State (turya) 🌴


When spiritual transformation happens in a person, there is a meeting point between the material awareness and the spiritual awareness. Beginning from that point, when the upward movement in the spiritual path really begins, one’s ego begins to dissolve. When ego begins to fade away, it leads to universal attitude of the soul, when the knowledge of the omnipresent nature of the Brahman begins to unfold. This is what is to be precisely practiced in meditation.

The fourth stage of consciousness continues to prevail in the other three mundane stages of consciousness, as one is bound by ajñānā (ignorance) and consequent eogtism. When ego begins to get dissolved, the spell of ajñānā also begins to fade away, paving the way for the realisation of the Self. This transformation happens in the stage of turya.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

నిర్మల ధ్యానాలు - ఓషో - 285


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 285 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. వ్యక్తి నిరంతరం గానం చేసే స్థితిలో వుండాలి. ఏ క్షణమయినా సూర్యోదయం కావచ్చు. నువ్వు దాన్ని ఆహ్వానించాలి. స్వీకరించే గుణంతో వుండాలి. చురుగ్గా వుండాలి. 🍀


వ్యక్తి తన హృదయ రంద్రాల్ని తెరిచి అస్తిత్వాన్ని ఆహ్వానించిన స్థితికి పాట ప్రాధాన్యం వహిస్తుంది. పాట ప్రతీకాత్మకం. అది బాధ కాదు. పక్షులు ఉదయాన్నే పాట పాడుతాయి. అట్లా వ్యక్తి నిరంతరం గానం చేసే స్థితిలో వుండాలి. ఉదయాన్నే సూర్యోదయంలో ఉత్సాహంగా గానం చెయ్యడానికి సిద్ధంగా వుండాలి.

ఏ క్షణమయినా సూర్యోదయం కావచ్చు. నువ్వు దాన్ని ఆహ్వానించాలి. స్వీకరించే గుణంతో వుండాలి. చురుగ్గా వుండాలి. అతిథి ఏ సమయంలోనైనా రావచ్చు. పాట పాడే పక్షులు సూర్యుడికి ఆహ్వానం పలకడానికి సిద్ధంగా వుండాలి. పూలు విచ్చుకుంటాయి. గాలికి చెట్లు కదుల్తాయి. సమస్త ప్రపంచం సజీవంగా సంచలిస్తుంది. కొత్త రోజుని ఆహ్వానించడానికి సిద్ధపడుతుంది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

DAILY WISDOM - 20 - 20. The Conscious Mind . . . / నిత్య ప్రజ్ఞా సందేశములు - 20 - 20. చేతనా మనస్సు . . .


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 20 / DAILY WISDOM - 20 🌹

🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 20. చేతనా మనస్సు అంతిమ అంశంగా పనిచేస్తుంది 🌻


ఇప్పటి భౌతిక ప్రపంచం, దాని అవగాహన కేవలం సాపెక్షమైన విషయాల మీద ఆధార పడి ఉండటం వల్ల, సత్యం కాలేదు. దాని రూపం అవాస్తవమైనది. ఎందుకంటే రూపం అనేది విషయ వస్తువులపై కేంద్రీకరించ బడిన చైతన్యాల యొక్క ఊహా జనితం కాబట్టి. ఈ చైతన్యాల యొక్క మూలం విశ్వ మనస్సు. అది అనేక స్థాయిల అభివ్యక్తి లో ఈ సమస్త విషయ వస్తువులకు సృష్టికర్త.

ప్రపంచలో వ్యక్తమయ్యే ప్రతి పదార్థం, ఆ మాటకొస్తే వ్యక్తమయ్యే ప్రపంచం, అసలు వ్యక్తం అవడం అనే గుణం సైతం భ్రాంతికరమైనవి అని అర్థం చేసుకోవాలి. వ్యక్తమవడం భ్రాంతి కానీ పదార్థం భ్రాంతి కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 20 🌹

🍀 📖 The Realisation of the Absolute 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 20. The Conscious Mind Acts as the Ultimate Subject 🌻


The world of objects in its presented state is false, being dependent on relative perceptions; its form is unreal because form is an imaginary construction of the objectified centres of consciousness in the universe driven by potent desire-impulses. The Cosmic Mind acts as the ultimate subject whose consciousness is the creator of all norms, in all the degrees of manifestation.

The worldness in what is manifested, or, in other words, the very act or process of manifestation itself, is to be construed in the sense of what is illusory, though the world-essence or the ultimate substance of the world is eternal. It is the form and not the essence that is unreal.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ మదగ్ని మహాపురాణము - 155 / Agni Maha Purana - 155


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 155 / Agni Maha Purana - 155 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 48

🌻. చతుర్వింశతి మూర్తి స్తోత్రము - 2🌻


యుద్ధ కుశలుడైన ప్రద్యుమ్నుడు చక్ర-శంఖ-గదా-పద్మములను ధరించును. అనిరుద్ధుడు చక్రగదా శంఖపద్మములను అతుడు మనలను రక్షించుగాక. సురేశ్వరుడైన పురుషోత్తముడు చక్ర-కమల-శంఖ-గదలను ధరించును. అధోక్షజుడు పద్మ-గదా-శంఖ-చక్రములను ధరించును. అతడు ఘమ్ములను రక్షించుగాక. నృసింహుడు చక్ర- పద్మ - గదా - శంఖములను ధరించును. నేను అతనికి నమస్కరించుచున్నాను.

గదా-పద్మ-చక్ర-శంఖములను ధరించు అచ్యుతుడు మిమ్ములను రక్షించుగాక. శంఖ-గదా-చక్ర-పద్మములను ధరించు, బాలవటుడైన వామనుడు, పద్మ-చక్ర-శంఖ-గదలను ధరించు జనార్దనుడు, శంఖ-గదా-చక్ర-గదలను ధరించు, యజ్ఞస్వరూపుడైన శ్రీహరి, శంఖ-గదా-పద్మ-చక్రములను ధరించు కృష్ణుడు నాకు భోగములను, మోక్షమును ప్రసాదించుగాక.

వాసుదేవుడు ఆదిమూర్తి. వాసుదేవుని నుండి సంకర్షణుడు ఆవిర్భవించెను. సంకర్షణుని నుంéడి ప్రద్యుమ్నడు, ప్రద్యుమ్నుని నుండి అనిరుద్ధుడు ఆవిర్భవించెను. వీరిలో ఒక్కరొక్కరు క్రమముగ కేశవాదిమూర్తి భేదమున మూడేసి రూపములలో ఆవిర్భవించిరి. (అనగా వాసుదేవుని నండి కేశవ - నారాయణ - మాధవమూర్తులు, సంకర్షణుని నుండి గోవింద- విష్ణు - మధుసూదనమూర్తులు, ప్రద్యుమ్నుని నుండి త్రివిక్రమ - వామన - శ్రీధరమూర్తులు, అనిరుద్ధుని నుండి హృషీకేశ - పద్మనాభ - దామోదరమూర్తులు ఆవిర్భవించినవి). ఇరువది నాలుగు మూర్తుల స్తోత్రముతో కూడిన ఈ ద్వాదశాక్షర స్తోత్రమును చదువువారును. వినువారును నిర్మలులై, సంపూర్ణ మనోరథములను పొందుదురు.

విశేషాంశము: ఈ స్తోత్రములో ఇరువది నాలుగు మూర్తుల స్వరూపముమ వర్ణించు మొదటి పండ్రెండు శ్లోకములలోని మొదటి అక్షరములను కలిపి చదివినోచో ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అను ద్వానశాక్షరి ఏర్పడును అందుచే దానికి "ద్వాదశాక్షరీ స్తోత్రము" అనియు, "చతుర్వింశతి మూర్తి స్తోత్రము" అనియు పేర్లు.

అగ్ని మహాపురాణము నందు చతుర్వింశతిమూర్తి స్తోత్రమను నలుబది ఎనిమిదివ అధ్యాయము సమాప్తము.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 155 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 48

🌻Adoration of twenty-four forms of Viṣṇu - 2 🌻


8. Lord Pradyumna is one who holds a mace, disc, conch and mace as well as a lotus. May Aniruddha, who wields the disc, mace, conch and lotus protect us.

9. May Puruṣottama, the Lord of celestials, who holds disc, lotus, conch and mace (protect you). May Adhokṣaja who wields lotus, mace, conch and disc protect you.

10. I salute that Lord Nṛsiṃha, who wields disc, lotus, mace and conch. May Acyuta, who holds mace, lotus, disc and conch, protect you all.

11. So also (may) Upendra, who is of the form of a child and (who holds) the disc and lotus, (protect you). And (may) Janārdana, who wields lotus, disc, conch and mace (protect you).

12. May Hari, who holds conch, lotus, disc as well as (mace) kaumodakī yield me enjoyment and emancipation. May Kṛṣṇa, who holds conch, mace, lotus and disc give enjoyment and emancipation.

13. The first manifestation was that of Vāsudeva. Then Saṅkarṣaṇa manifested. Pradyumna manifested from Saṅkarṣaṇa. Aniruddha appeared from Pradyumna.

14. Each one of the (above) forms was divided into three forms such as Keśava and others. One who reads or hears this hymn consisting of twelve letters on the twenty-four forms gets free from impurity and gets all things.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹




శ్రీమద్భగవద్గీత - 308: 07వ అధ్., శ్లో 28 / Bhagavad-Gita - 308: Chap. 07, Ver. 28

 

🌹. శ్రీమద్భగవద్గీత - 308 / Bhagavad-Gita - 308 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం - 28 🌴

28. యేషాం త్వన్తగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్ |
తే ద్వన్ద్వమోహనిర్ముక్తా భజన్తే మాం దృఢవ్రతా: ||


🌷. తాత్పర్యం :

పూర్వజన్మము లందు, ప్రస్తుత జన్మము నందు పుణ్యకార్యములను చేయుచు పాపములను పూర్తిగ నశింప జేసికొనిన మనుజులు ద్వంద్వ మోహముల నుండి విడివడినవారై నా సేవ యందు దృఢవ్రతముతో నెలకొనెదరు.

🌷. భాష్యము :

దివ్యమైన ఆధ్యాత్మికస్థితిని పొందుటకు అర్హతను కలిగినవారు ఈ శ్లోకమున పేర్కొనబడినవారు. పాపులు, నాస్తికులు, మూర్ఖులు, వంచకులైనవారికి కోరిక మరియు ద్వేషములనెడి ద్వంద్వములను దాటుటకు దుస్సాధ్యము. కేవలము ధర్మనియమాను సారముగా జీవనము గడుపుచు పుణ్యముగా వర్తించి పాపఫలమును నశింపజేసికొనినవారే భక్తిమార్గమును చేపట్టి క్రమముగా దేవదేవుడైన శ్రీకృష్ణుని శుద్ధజ్ఞానమును పొందు స్థాయికి ఎదగగలరు. తదుపరి వారు క్రమముగా ఆ భగవానుని తలచుచు సమాధిమగ్నులు కాగలరు. ఆధ్యాత్మికస్థితి యందు నెలకొనుటకు ఇదియే సరియైన పద్ధతి. శుద్ధభక్తుల సంగమములో కృష్ణభక్తిరసభావన ద్వారా ఇట్టి ఉద్ధారము సాధ్యపడగలదు. మాహాభక్తుల సాంగత్యమున మనుజుడు భ్రాంతి నుండి విడివడుటయే అందులకు కారణము.

ఎవరేని నిజముగా ముక్తిని వాంఛించినచో భక్తులకు సేవను గూర్చవలెనని శ్రీమద్భాగవతము (5.5.2) నందు తెలుపబడినది (మహాత్సేవం ద్వారమాహు: విముక్తే: ). కాని భౌతికభావన కలిగిన కామ్యకర్మరతులతో సంగత్వము కలిగినవాడు తమస్సుకు చేరు మార్గమును చేపట్టినవాడగును (తమోద్వారం యోషితాం సంగిసంగమ్). కనుకనే బద్ధజీవులను భ్రాంతి నుండు తప్పించుటకే కృష్ణభక్తులు జగమంతటను సంచరించుచుందురు. శ్రీకృష్ణభగవానుని దాసత్వమనెడి తమ నిజస్థితిని మరచుటన్నది ఆ భగవానుని నియమమోల్లంఘనమని నిరాకారవాదులు ఎరుగజాలరు. కనుకనే మనుజుడు తన సహజస్థితియైన శ్రీకృష్ణుని దాసత్వమున తిరిగి నెలకొననంతవరకు ఆ భగవానుని అవగతము చేసికొనుట గాని, దృఢవ్రతముతో ఆ దేవదేవుని భక్తియుతసేవ యందు పూర్ణముగా నిలుచుట గాని సంభవింపదు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 308 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 28 🌴

28. yeṣāṁ tv anta-gataṁ pāpaṁ janānāṁ puṇya-karmaṇām
te dvandva-moha-nirmuktā bhajante māṁ dṛḍha-vratāḥ


🌷 Translation :

Persons who have acted piously in previous lives and in this life and whose sinful actions are completely eradicated are freed from the dualities of delusion, and they engage themselves in My service with determination.

🌹 Purport :

Those eligible for elevation to the transcendental position are mentioned in this verse. For those who are sinful, atheistic, foolish and deceitful, it is very difficult to transcend the duality of desire and hate.

Only those who have passed their lives in practicing the regulative principles of religion, who have acted piously, and who have conquered sinful reactions can accept devotional service and gradually rise to the pure knowledge of the Supreme Personality of Godhead. Then, gradually, they can meditate in trance on the Supreme Personality of Godhead.

That is the process of being situated on the spiritual platform. This elevation is possible in Kṛṣṇa consciousness in the association of pure devotees, for in the association of great devotees one can be delivered from delusion.

It is stated in the Śrīmad-Bhāgavatam (5.5.2) that if one actually wants to be liberated he must render service to the devotees (mahat-sevāṁ dvāram āhur vimukteḥ); but one who associates with materialistic people is on the path leading to the darkest region of existence (tamo-dvāraṁ yoṣitāṁ saṅgi-saṅgam). All the devotees of the Lord traverse this earth just to recover the conditioned souls from their delusion.

The impersonalists do not know that forgetting their constitutional position as subordinate to the Supreme Lord is the greatest violation of God’s law.

Unless one is reinstated in his own constitutional position, it is not possible to understand the Supreme Personality or to be fully engaged in His transcendental loving service with determination.

🌹 🌹 🌹 🌹 🌹


08 Jan 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹08, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹

శుభ ఆదివారం, Sunday, భాను వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻

🍀. సూర్య మండల స్త్రోత్రం - 3 🍀

3. యన్మండలం దేవగణైః సుపూజితం |
విప్రైః స్తుతం భావనముక్తికోవిదమ్ |
తం దేవదేవం ప్రణమామి సూర్యం |
పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : దివ్యశక్తి నిర్ణయం అమలు కొరకు మన ఆత్మ నిత్య జాగరితమై వుండి, లోపల నుంచి గాని, బయట నుంచి గాని మనలను తప్పుదారి పట్టింప జూచే దివ్యేతర ప్రవృత్తులను ప్రతిఘటింప బూనుకోవాలి. 🍀

🌷🌷🌷🌷🌷

శుభకృత్, హేమంత ఋతువు,

దక్షిణాయణం, పౌష్య మాసం

తిథి: కృష్ణ పాడ్యమి 07:08:35

వరకు తదుపరి కృష్ణ విదియ

నక్షత్రం: పుష్యమి 30:06:12 వరకు

తదుపరి ఆశ్లేష

యోగం: వైధృతి 09:42:50 వరకు

తదుపరి వషకుంభ

కరణం: కౌలవ 07:07:34 వరకు

వర్జ్యం: 12:07:20 - 13:55:12

దుర్ముహూర్తం: 16:27:51 - 17:12:27

రాహు కాలం: 16:33:25 - 17:57:02

గుళిక కాలం: 15:09:48 - 16:33:25

యమ గండం: 12:22:33 - 13:46:10

అభిజిత్ ముహూర్తం: 12:00 - 12:44

అమృత కాలం: 22:54:32 - 24:42:24

సూర్యోదయం: 06:48:03

సూర్యాస్తమయం: 17:57:02

చంద్రోదయం: 19:09:50

చంద్రాస్తమయం: 07:52:25

సూర్య సంచార రాశి: ధనుస్సు

చంద్ర సంచార రాశి: కర్కాటకం

యోగాలు: శ్రీవత్స యోగం - ధన

లాభం , సర్వ సౌఖ్యం 30:06:12 వరకు

తదుపరి వజ్ర యోగం - ఫల ప్రాప్తి

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹