🌹 18, JUNE 2023 SANDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹

🍀🌹 18, JUNE 2023 SANDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 18, JUNE 2023 SUNDAY ఆదివారం, భాను వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 386 / Bhagavad-Gita - 386 🌹
 🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 14 / Chapter 10 - Vibhuti Yoga - 14 🌴
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 233 / Agni Maha Purana - 233 🌹 
🌻. స్నాన విధానము - స్నాపనోత్సవము - 3 / Mode of conducting the bathing festival (snāna) - 3 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 098 / DAILY WISDOM - 098 🌹 
🌻 7. సమగ్ర పద్ధతిలో ఆలోచించడం మనస్సుకు అలవాటు లేదు. / 7. The Mind is not Accustomed to Think in an Integral Fashion🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 364 🌹
6) 🌹. శివ సూత్రములు - 100 / Siva Sutras - 100 🌹 
🌻 2-07. మాతృక చక్ర సంబోధః   - 3 / 2-07. Mātrkā chakra sambodhah   - 3 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 18, జూన్‌, JUNE 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : జ్యేష్ఠ అమావాస్య, Jyeshta Amavasya🌻*

*🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 11 🍀*

*21. తీర్థక్రియావాన్ సునయో విభక్తో భక్తవత్సలః |*
*కీర్తిః కీర్తికరో నిత్యః కుండలీ కవచీ రథీ*
*22. హిరణ్యరేతాః సప్తాశ్వః ప్రయతాత్మా పరంతపః |*
*బుద్ధిమానమరశ్రేష్ఠో రోచిష్ణుః పాకశాసనః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : లోలోతులకు పోవలసిన ఆవశ్యకత - సాధనలో పైకి ఎక్కడం నేర్చుకొని సాధకుడు సకల సమస్యలనూ అతిక్రమించ వచ్చుననే మాట నిజమే. కాని, క్రిందనున్న సమస్యలు సమస్యలుగానే వుండగా అతడు ఎల్లకాలం పైననే పుండడం చాల కష్టం. సాధనలో పై పైకి వెళ్ళడం వలెనే లోలోతులకు లోపలకు పోవడం కూడా
ఉన్నది గనుక, ఈ సమస్యల పరిష్కారాని కతడు తన లోలోతులకు పోవడమనేది అత్యంతావశ్యకం. 🍀* 

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
జ్యేష్ఠ మాసం
తిథి: అమావాశ్య 10:08:42 వరకు
తదుపరి శుక్ల పాడ్యమి
నక్షత్రం: మృగశిర 18:08:54
వరకు తదుపరి ఆర్ద్ర
యోగం: దండ 24:58:14 వరకు
తదుపరి వృధ్ధి
కరణం: నాగ 10:08:42 వరకు
వర్జ్యం: 27:14:24 - 28:58:40
దుర్ముహూర్తం: 17:06:49 - 17:59:30
రాహు కాలం: 17:13:25 - 18:52:11
గుళిక కాలం: 15:34:39 - 17:13:25
యమ గండం: 12:17:07 - 13:55:53
అభిజిత్ ముహూర్తం: 11:51 - 12:43
అమృత కాలం: 08:41:58 - 10:24:42
సూర్యోదయం: 05:42:03
సూర్యాస్తమయం: 18:52:11
చంద్రోదయం: 05:29:54
చంద్రాస్తమయం: 19:13:50
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: జెమిని
యోగాలు: సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం
18:08:54 వరకు తదుపరి ధ్వాo క్ష యోగం
- ధన నాశనం, కార్య హాని
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 386 / Bhagavad-Gita - 386 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 14 🌴*

14. సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ |
న హి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దానవా: ||

🌷. తాత్పర్యం :
ఓ కృష్ణా! నీవు నాకు తెలిపినదంతయు సత్యమని సంపూర్ణముగా నేను ఆంగీకరించుచున్నాను. ఓ దేవదేవా! దేవతలుగాని, దానవులుగాని నీ స్వరూపమును ఎరుగజాలరు.

🌷. భాష్యము :
*శ్రద్ధలేని వారు, దానవ ప్రవృత్తి గలవారు శ్రీకృష్ణభగవానుని ఎరుగజాలరని అర్జునుడు ఇచ్చట ధ్రువపరచుచున్నాడు. అతడు దేవతలకే తెలియబడుట లేదన్నచో ఆధునిక జగత్తుకు చెందిన నామమాత్ర పండితులను గూర్చి వేరుగా తెలుపనవసరము లేదు. కాని అర్జునుడు ఇచ్చట కృష్ణని కరుణ వలన అతనిని పరతత్త్వముగను, పరిపూర్ణునిగను తెలిసికొనగలిగెను. భగవద్గీతకు ప్రామాణికుడైన అట్టి అర్జునుని మార్గమునే ప్రతియొక్కరు అనుసరింపవలెను. చతుర్ధాధ్యాయమున తెలుపబడినట్లు గీతాధ్యాయనము కొరకు వలసిన పరంపర నశించియుండుటచే ఆ పరంపరను శ్రీకృష్ణభగవానుడు తిరిగి అర్జునునితో ప్రారంభించెను.*

*అర్జునుని సన్నిహిత స్నేహితుడనియు మరియు భక్తుడనియు ఆ దేవదేవుడు భావించుటయే అందులకు కారణము. కనుక ఈ గీతోపనిషత్తు యొక్క ఉపోద్ఘాతమున తెలుపబడినట్లు భగవద్గీతను పరంపరారూపముననే అవగతము చేసికొనవలెను. అట్టి పరంపర నశించియుండుట చేతనే దానిని పునరుద్ధరించుటకు అర్జునుడు ఎన్నుకోబడెను. శ్రీకృష్ణుడు పలికిన సర్వమును అర్జునుడు అంగీకరించిన విధమును తప్పక అనుసరింపవలెను. అప్పుడే భగవద్గీత సారము మనకు అవగతము కాగలదు. ఆ పిదపనే శ్రీకృష్ణుడు దేవదేవుడని మనము సంపూర్ణముగా అవగాహనము చేసికొనగలము.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 386 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 10 - Vibhuti Yoga - 14 🌴*

14. sarvam etad ṛtaṁ manye yan māṁ vadasi keśava
na hi te bhagavan vyaktiṁ vidur devā na dānavāḥ

🌷 Translation : 
*O Kṛṣṇa, I totally accept as truth all that You have told me. Neither the demigods nor the demons, O Lord, can understand Your personality.*

🌹 Purport :
*Arjuna herein confirms that persons of faithless and demonic nature cannot understand Kṛṣṇa. He is not known even by the demigods, so what to speak of the so-called scholars of this modern world? By the grace of the Supreme Lord, Arjuna has understood that the Supreme Truth is Kṛṣṇa and that He is the perfect one. One should therefore follow the path of Arjuna. He received the authority of Bhagavad-gītā.*

*As described in the Fourth Chapter, the paramparā system of disciplic succession for the understanding of Bhagavad-gītā was lost, and therefore Kṛṣṇa reestablished that disciplic succession with Arjuna because He considered Arjuna His intimate friend and a great devotee. Therefore, as stated in our Introduction to Gītopaniṣad, Bhagavad-gītā should be understood in the paramparā system. When the paramparā system was lost, Arjuna was selected to rejuvenate it. The acceptance by Arjuna of all that Kṛṣṇa says should be emulated; then we can understand the essence of Bhagavad-gītā, and then only can we understand that Kṛṣṇa is the Supreme Personality of Godhead.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 233 / Agni Maha Purana - 233 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 69*

*🌻. స్నాన విధానము - స్నాపనోత్సవము - 3 🌻*

*పూర్వాది సౌమ్యనవకమునందు మధ్య దధికలశ నుంచి, మిగిలిన కలశములందు. పత్ర-ఏలా-త్వక్‌-కూట-బాలక చందనద్వయలతా-కస్తూరీ-కృష్ణాగురు-సిద్ధద్రవ్యములను ఉంచవలెను. ఈశాన్యనవకమధ్యమున శాంతిజలపూర్ణ కుంభముంచవలెను. మిగిలిన కలశములతో క్రమముగ చంద్ర-తార-రజత-లోహ-త్రపు-కాంస్య-సీసక-రత్నముల నుంచవలెను. ప్రతిమకు ఘృతము పూసి, ఉద్వర్తనముచేసి, మూలమంత్రముతో స్నానము చేయించవలెను. మరల దానికి గంధాదులతో పూజ చేయవలెను.*

*అగ్నిలో హోమము చేసి పూర్ణాహుతి ఇవ్వవలెను. సకలభూతములకు బలిప్రదానముచేసి బ్రహ్మణునకు, దక్షిణాపూర్వకముగ భోజనము చేయించవలెను. దేవతలు, మునులు, అనేకులు రాజులు కూడ భగవద్విగ్రహమునకు అభిషేకముచేయటచేతనే ఐశ్వర్యాదులను పొందిరి. ఈ విధముగ ఒక వెయ్యి ఎనిమిది కలశములతో స్నాపనోత్సవము చేయవలెను. ఇట్లు చేయుటచే మానవుడు అన్ని కామములను పొందగలడు. యజ్ఞా,వభృథస్నానమునందు కూడ పూర్ణప్నానసిద్ది కలుగును. పార్వతీలక్ష్మ్యాదుల వివాహాదులలోకూడ స్నపనోత్సవము చేయబడును.*

*అగ్ని మహాపురాణమునందు స్నపనోత్సవవిధి యను ఆరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 233 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 69*
*🌻 Mode of conducting the bathing festival (snāna) - 3 🌻*

20. They should be anointed with ghee and lifted up and bathed with the principal mantra with perfumes and worshipped. Having offered oblations into the fire, the final oblation should be offered.

21. Offering should be made to all spirits. After paying fees to (the priest), (the priest and the brahmins) should be fed after having installed the images of deities, sages and other divinities.

22. Having installed (the image of the god) in this way one should conduct the bathing festival. One who bathes (the image) in one thousand eight pitchers gets all fortune.

23. By bathing at the conclusion of the rite, the bathing festival concludes. The marriage and other festivals of (the goddesses) Gaurī (consort of Śiva), Lakṣmī (consort of Viṣṇu) should be celebrated after the bathing festival.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 98 / DAILY WISDOM - 98 🌹*
*🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 7. సమగ్ర పద్ధతిలో ఆలోచించడం మనస్సుకు అలవాటు లేదు. 🌻*

*ప్రాపంచిక ఉనికి, ఆధ్యాత్మిక ఉనికి విడివిడిగా రెండు లేవని ప్రజలు కనీసం ఈ రోజునైనా గ్రహిస్తారా? ఇంతకుముందు వ్యక్తీకరించబడిన మన ఆలోచనలను పరిశీలిస్తే, ధర్మ, అర్థ, కామ మొక్షాలను విడివిడిగా కాక, ఒకే జీవిత ఆశయం యొక్క విభిన్న పార్శ్వాలుగా అర్థం చేసుకోగలుగుతారు. ముందు చెప్పినట్లుగా, ఇది చాలా కష్టమైన పని, ఎందుకంటే అలాంటి సమగ్ర పద్ధతిలో ఆలోచించడం మనస్సుకు అలవాటు లేదు.*

*కానీ ఇది తప్పదు. ఈ అవగాహన నుంచి ఎవరూ తప్పించుకోలేరు. జీవితానికి ఏదైనా అర్థం ఉండాలంటే, ప్రతి క్షణం కేవలం ఒక లక్ష్యం నుండి మరొక లక్ష్యం వైపుకు అవాంఛనీయంగా పరుగులు పెట్టడం ఉండకూడదు అనుకుంటే ఈ అవగాహన తప్పనిసరి. అర్థం, లేదా ఒకరి అన్వేషణ యొక్క భౌతిక వస్తువు, మొదటగా పరిగణించబడవచ్చు. ఎందుకంటే ఇది అనుభవ క్షేత్రంలో ప్రత్యక్షంగా ఆకర్షించే ఒక కేంద్రం. అంటే మన జ్ఞానేంద్రియాల ద్వారా మన అవగాహనకు వస్తుందని అర్థం-చూడడం, వినడం, రుచి చూడడం, వాసన చూడడం లేదా తాకడం ద్వారా మన అవగాహన లోనికి వచ్చే ఒక అంశం.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 98 🌹*
*🍀 📖 The Ascent of the Spirit 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 7. The Mind is not Accustomed to Think in an Integral Fashion 🌻*

*Would people realise at least today that existence in the world cannot be bifurcated from the existence of the Central Aim of Life? Gathering the outcome of our thoughts expressed earlier, we may proceed further to the art and the enterprise of blending dharma, artha, kama and moksha into a single body of human aspiration. As was indicated, this is a difficult job, for the mind is not accustomed to think in such an integral fashion.*

*But it has to be done, and one cannot escape it, if life is to have any meaning and not be a mere desultory drifting from one objective to another, every moment of time. Artha, or the material object of one’s pursuit, may be considered first, since it is this that seems to be the primary centre of life’s attraction in the immediately visible and tangible field of experience. The object is naturally the physical something that presents itself before a sense organ—seeing, hearing, tasting, smelling or touching.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 363 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. మనసు గతానికి, భవిష్యత్తుకు పరిగెడుతుంది. దాన్ని వర్తమానంలో నిలపాలి. అప్పుడు వ్యక్తి మెల్ల మెల్లగా యిక్కడ జీవించడం మొదలు పెడతాడు. మన నిజమైనతత్వం వర్తమానంలోొ వుంది. 🍀*

*మన లోపలి తత్వమే మన నిజమైనతత్వం. అదెక్కడో బయటలేదు. దానికోసం ఎక్కడో వెతకాల్సిన పన్లేదు. వ్యక్తి తన సొంత యింటికి రావాలి. ఇది ఇక్కడి నుండి అక్కడికి చేసే ప్రయాణం కాదు. దానికి భిన్నంగా అక్కడి నుండి యిక్కడికి చేసే ప్రయాణం. మనం ఇప్పటికే అక్కడున్నాం. మనం ఇక్కడికి చేరాలి. మనం ఎప్పుడూ 'అప్పుడు'లో వుంటాం. 'ఇప్పుడు'కి రావాలి.*

*కాబట్టి నీ మనసు ఎప్పుడు ఎక్కడికో బయల్దేరినా దాన్ని యిక్కడికి లాక్కు రావాలి. అది గతానికి, భవిష్యత్తుకు పరిగెడుతుంది. దాన్ని వర్తమానంలో నిలపాలి. అప్పుడు వ్యక్తి మెల్ల మెల్లగా యిక్కడ జీవించడం మొదలుపెడతాడు. మనం యిక్కడున్న క్షణం కలయిక జరుగుతుంది. బంధ మేర్పడుతుంది. మన నిజమైనతత్వం వర్తమానంలో వుంది.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 100 / Siva Sutras - 100 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 2-07. మాతృక చక్ర సంబోధః   - 3 🌻*
*🌴. ఒక గురువు సహాయంతో, యోగి మాతృక చక్ర జ్ఞానాన్ని మరియు మంత్ర శక్తులను స్వీయ-శుద్ధి మరియు స్వీయ-సాక్షాత్కారం కోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటాడు. 🌴*

*విశ్వాన్ని నిలబెట్టే ముప్పై ఆరు తత్త్వాలు లేదా సూత్రాలు ఉన్నాయి. ముప్పై ఆరవది శివసూత్రం మరియు దానికి ముందుది శక్తి సూత్రం, ఇది శివుని శక్తి తప్ప మరొకటి కాదు. ముప్పై ఆరు తత్వాలు మొత్తంలో శివుని నుండి ప్రత్యేక అధికారాన్ని కలిగి ఉన్న ఆమె ద్వారా మాత్రమే నియంత్రించబడుతాయి. చైతన్యం, ఆనందం, సంకల్ప శక్తి, జ్ఞానం మరియు క్రియలకు శివుడు మూలం. వాటిని వరుసగా చిత్, ఆనంద, ఇచ్ఛా శక్తి, జ్ఞాన శక్తి మరియు క్రియా శక్తి అని పిలుస్తారు. కానీ, బ్రాహ్మానికి సత్-చిత్-ఆనంద అనే మూడు గుణాలు మాత్రమే ఉన్నాయని ఉపనిషత్తులు సూచిస్తున్నాయి. కాబట్టి, ఉపనిషత్తులు బ్రహ్మాన్ని సచ్చిదానంద అని సంబోధించాయి.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras  - 100 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 2-07. Mātrkā chakra sambodhah   - 3 🌻*
*🌴. With the help of an guru, a yogi gains the knowledge of matruka chakra and how to harness the mantra shaktis, for self-purification and self-realization.  🌴*

*There are thirty six tattva-s or principles in place that make the universe sustain. Thirty sixth is the principle of Śiva and the penultimate being the principle of Śaktī, who is nothing but the energy of Śiva. The entire spectrum of thirty six tattva-s is controlled only by Her, who holds an exclusive authority from Śiva. Śiva is the source of consciousness, bliss, energy of will, knowledge and action. They are respectively known as cit, ānanda, icchā śakti, jñāna śakti, and kriyā śakti. But, Upaniṣads point out that the Brahman has only three qualities sat-cit- ānanda. Therefore, Upaniṣads address the Brahman as saccidānanda.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 460 -3 / Sri Lalitha Chaitanya Vijnanam - 460 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 460 -3 / Sri Lalitha Chaitanya Vijnanam - 460 - 3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।
కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀

🌻 460. 'సుభ్రూ' - 3 🌻


రెండు కొండల నడిమి లోయలోని ఆకాశముగ తదేక దృష్టితో దర్శించినపుడు యిట్టి కాంతి దర్శనము జరుగుటకు అవకాశమున్నది. ఆరాధనా మార్గమున జీవతత్త్వమును కూడిక చేసుకొని మనసును పూర్ణముగ యిచ్చట నిలిపి తేజోవంతమగు శ్రీమాత దర్శనమునకు అచటనే వేచి యుండుట నిత్యమూ భక్తులు నిర్వహించ వలసిన కార్యము. భక్తి పూర్వకమగు ఆరాధనము జరిగిన వెనుక కన్నులు మూసుకొని భ్రూమధ్యమున లేచి యుండుట నేర్వవలెను. త్రికరణశుద్ధిగ యిట్లు నిర్వర్తించు వారికి దర్శన స్పర్శన భాషణాదులు అనుగ్రహముగ లభింపగలవు. వేణు గానము వినిపింప గలదు. అది ప్రణవనాదమై జీవుని అంతరాళము లోనికి గొనిపోగలదు. తోరణములు ప్రవేశ ద్వారము వద్ద కట్టుట ఆచారము. దీని రహస్యము తెలియుట ప్రధానము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 460 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika
Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻

🌻 460. 'Subhru' - 3 🌻


There is a chance of seeing this light when looking at the sky in the valley between the two hills. Devotees should always perform the task of gathering life essence in the way of worship and should wait for the vision of the radiant Sri Mata by concentrating their life force here. After performing devotional worship, one should learn to close the eyes and get up in the brow centre. Those who perform this with utmost sincerity can be blessed with clairvoyance, divine touch and clairaudience. The song of the flute can be heard. It becomes Pranava and can penetrate into depths of the living being. It is customary to build arches at the entrance. It is important to know its secret.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


Osho Daily Meditations - 365. BEGINNING / ఓషో రోజువారీ ధ్యానాలు - 365. ప్రారంభం




🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 365 / Osho Daily Meditations - 365 🌹

✍️. ప్రసాద్ భరద్వాజ

🍀 365. ప్రారంభం 🍀

🕉. మీరు ఎక్కడ ఉన్నా, అది ఎల్లప్పుడూ ప్రారంభంలోనే ఉంటుంది. అందుకే జీవితం చాలా అందంగా, నవనవీనంగా ఉంటుంది. 🕉


ఏదైనా పూర్తయిందని మీరు ఆలోచించడం ప్రారంభిస్తే, మీరు చనిపోవడం ప్రారంభిస్తారు. పరిపూర్ణత మరణం లాంటిది, కాబట్టి పరిపూర్ణత కలిగిన వ్యక్తులు ఆత్మహత్యకు గురవుతారు. పరిపూర్ణంగా ఉండాలనుకోవడం ఆత్మహత్యకు ఒక దీర్ఘ మార్గం. ఏదీ ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండదు. ఇది సాధ్యం కాదు, ఎందుకంటే జీవితం శాశ్వతమైనది. ఏదీ ఎప్పుడూ ముగియదు; జీవితంలో ఎటువంటి ముగింపు లేదు - కేవలం మరింత ఉన్నత శిఖరాలే ఉన్నాయి. కానీ మీరు ఒక శిఖరానికి చేరుకున్న తర్వాత, మరొక శిఖరం మిమ్మల్ని సవాలు చేస్తుంది, మిమ్మల్ని పిలుస్తుంది, మిమ్మల్ని ఆహ్వానిస్తుoది. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా అది ఎల్లప్పుడూ ప్రారంభమే అని గుర్తుంచుకోండి.

అప్పుడు మీరు ఎప్పుడూ బిడ్డగానే ఉంటారు, కన్యగానే ఉంటారు. అదే జీవితం యొక్క మొత్తం కళ - ఒక కన్యగా ఉండటానికి, తాజాగా మరియు యవ్వనంగా ఉండటానికి, జీవితం ద్వారా మలినం కాకుండా, గతం ద్వారా మలినం కాకుండా, సాధారణంగా ప్రయాణమార్గంలో పడే దుమ్ముతో చెడిపోకుండా ఉంటుంది. గుర్తుంచుకోండి, ప్రతి క్షణం కొత్త తలుపు తెరుస్తుంది. ఇది చాలా అసంబద్ధంగా అనిపిస్తుంది, ఎందుకంటే మనం ఎప్పుడూ ఒక ప్రారంభం ఉంటే, ముగింపు కూడా ఉండాలి అని అనుకుంటాము. కానీ ఏమీ చేయలేము. జీవితం అతార్కికమైనది. దీనికి ప్రారంభం ఉంది కానీ ముగింపు లేదు. నిజంగా సజీవంగా ఉన్న ఏదీ అంతం కాదు. ఇది కొనసాగుతూనే ఉంటుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 365 🌹

📚. Prasad Bharadwaj

🍀 365. BEGINNING 🍀

🕉. Wherever you are, it is always at the beginning. That's why life is so beautiful, so young, so fresh. 🕉


Once you start thinking that something is complete, you start becoming dead. Perfection is death, so perfectionistic people are suicidal. Wanting to be perfect is a roundabout way of committing suicide. Nothing is ever perfect. It cannot be, because life is eternal. Nothing ever concludes; there is no conclusion in life--just higher and higher peaks. But once you reach one peak, another is challenging you, calling you, inviting you. So always remember that wherever you are is always a beginning.

Then one always remains a child, one remains virgin. And that's the whole art of life--to remain a virgin, to remain fresh and young, uncorrupted by life, uncorrupted by the past, uncorrupted by the dust that ordinarily gathers on the roads on the journey. Remember, each moment opens a new door. It is very illogical, 'because we always think that if there is a beginning, then there must be an end. But nothing can be done. Life is illogical. It has a beginning but no end. Nothing that is really alive ever ends. It goes on and on and on.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ శివ మహా పురాణము - 746 / Sri Siva Maha Purana - 746



🌹 . శ్రీ శివ మహా పురాణము - 746 / Sri Siva Maha Purana - 746 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 13 🌴

🌻. జలంధర వృత్తాంతములో ఇంద్రుడు ప్రాణములతో బయటపడుట - 5 🌻


ఓ రుద్రా! భూలోకములో మానవులు నీ పాదపద్మములను సేవించి దేవతలను ఆదరించుటను మానిరి. అయిననూ, వారు పుణ్యలోకములలోని భోగముల ననుభవించుచున్నారు (36). యోగసంపన్నులకైననూ పొందశక్యము కానిది, మిక్కిలి దుర్లభ##మైనది అగు పరమగతి (మోక్షము) ని మానవులు నీ పాదపద్మముల నారాధించి పొందు చున్నారు (37).


సనత్కు మారుడిట్లు పలికెను -

లోకములకు మంగళములను కలిగించు శంకరుని బృహస్పతి ఇట్లు స్తుతించి, ఇంద్రుని ఆ ఈశుని పాదములపై పడవేసెను (38). వంచిన శిరస్సుగల దేవేంద్రుని అట్లు పడవేసి, బృహస్పతి ఆదరముతో శివునకు ప్రణమిల్లి ఇట్లు పలికెను (39).


బృహస్పతి ఇట్లు పలికెను -

దీనులకు ప్రభువగు మహాదేవా! నీ పాదములకు నమస్కరించుచున్న వీనిని ఉద్ధరింపుము. నీ కన్నులనుండి పుట్టిన కోపమును శాంతింపజేయును (40). ఓ మహాదేవా! తుష్టుడవై శరణు జొచ్చిన ఇంద్రుని రక్షింపుము. నీ లలాట నేత్రమునుండి పుట్టిన అగ్ని చల్లారు గాక! (41)


సనత్కుమారుడిట్లు పలికెను -

బృహస్పతి యొక్క ఈ మాటను విని దేవదేవుడు, కరుణాసముద్రుడునగు మహేశ్వరుడు మేఘగర్జనవలె గంభీరమగు స్వరముతో నిట్లనెను (42).


మహేశ్వరుడిట్లు పలికెను -

ఓ బృహస్పతీ! కంటినుండి బయల్వడలిన కోపమును నేను మరల ఎట్లు వెనుకకు ఉపసంహరించ గల్గుదును? పాము విడిచిన కుబుసమును మరల తాను ధరించలేదు గదా! (43)


సనత్కుమారుడిట్లు పలికెను -

భయముచే కంగారుపడిన బృహస్పతి శంకరుని ఆ మాటను విని దేహములో మిక్కిలి క్లేశమును పొంది ఇట్లు పలికెను (44).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 746🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 13 🌴


🌻 Resuscitation of Indra in the context of the destruction of Jalandhara - 5 🌻

36. O Śiva, by serving your lotus like feet, the people in the world do not honour the gods and they enjoy the prosperity of the world.

37. By serving your lotus like feet the people attain the supreme goal inaccessible to every one and unattainable even to Yogins.


Sanatkumāra said:—

38. After eulogising Śiva, the benefactor of the worlds thus Bṛhaspati made Indra fall at the feet of Śiva.

39. After making Indra, lord of the gods, fall at his feet with bowed head, Bṛhaspati humbly spoke these words to Śiva with bowed head.


Bṛhaspati said:—

40. O great lord, favourable to the distressed, please raise up Indra fallen at your feet. Please quieten the anger rising from your eyes.

41. O great lord, be pleased. Protect Indra who has sought refuge in you. Let this fire rising from the eye in the forehead be rendered calm.


Sanatkumāra said:—

42. On hearing these words of Bṛhaspati, Śiva, the lord of Gods, the ocean of mercy, spoke in a thundering stentorian voice.


Lord Śiva said:—

43. O Bṛhaspati, how can I take up the fury that has already come out of my eye? A serpent does not wear again the slough that has been cast off.


Sanatkumāra said:—

44. On hearing these words of Śiva, Bṛhaspati’s mind was agitated with fear and he spoke dejectedly.


Continues....

🌹🌹🌹🌹🌹



విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 785 / Vishnu Sahasranama Contemplation - 785


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 785 / Vishnu Sahasranama Contemplation - 785🌹

🌻785. తన్తువర్ధనః, तन्तुवर्धनः, Tantuvardhanaḥ🌻

ఓం తన్తువర్ధనాయ నమః | ॐ तन्तुवर्धनाय नमः | OM Tantuvardhanāya namaḥ


యో వర్ధయతి తన్తన్తుమ్ విష్ణుశ్చేదయతీతివా ।
తన్తువర్ధన ఇత్యుక్తో మహద్భిర్విదుషాం వరైః ॥

తాను సృజించి విస్తరింపజేసిన ఆ తంతువు అనగా విస్తీర్ణ ప్రపంచమునే విష్ణువు వృద్ధినందిచును పిదప నశింపజేయును కూడ.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 785🌹

🌻785. Tantuvardhanaḥ🌻

OM Tantuvardhanāya namaḥ


यो वर्धयति तन्तन्तुम् विष्णुश्चेदयतीतिवा ।
तन्तुवर्धन इत्युक्तो महद्भिर्विदुषां वरैः ॥

Yo vardhayati tantantum viṣṇuścedayatītivā,
Tantuvardhana ityukto mahadbhirviduṣāṃ varaiḥ.


That universe which is beautifully expanded by Him as a thread is also cut by Him. He protects as well as destroys the universe.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

शुभाङ्गो लोकसारङ्गः सुतंतुस्तन्तुवर्धनः ।
इंद्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः ॥ ८४ ॥

శుభాఙ్గో లోకసారఙ్గః సుతన్తుస్తన్తువర్ధనః ।
ఇన్ద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ॥ 84 ॥

Śubhāṅgo lokasāraṅgaḥ sutantustantuvardhanaḥ,
Indrakarmā mahākarmā kr‌takarmā kr‌tāgamaḥ ॥ 84 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


కపిల గీత - 193 / Kapila Gita - 193


🌹. కపిల గీత - 193 / Kapila Gita - 193 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 03 🌴


03. విరాగో యేన పురుషో భగవన్ సర్వతో భవేత్|
ఆచక్ష్య జీవలోకస్య వివిధా మమ సంసృతీః॥

తాత్పర్యము : భగవాన్! జీవుని వివిధ గతులను గూర్చి తెలుపుము? ఆ జీవుడు వైరాగ్యమును పొంది, భక్తి మార్గముసు అనుసరించ గలిగే విధానమును గూర్చి వివరింపుము.

వ్యాఖ్య : ఈ శ్లోకంలో సంస్కృతిః అనే పదం చాలా ముఖ్యమైనది. శ్రేయః-స్కృతిః అంటే భగవంతుని యొక్క సర్వోన్నత వ్యక్తిత్వం వైపు పురోగమించే సంపన్నమైన మార్గం, మరియు సంస్కృతిః అంటే భౌతిక ఉనికి యొక్క చీకటి ప్రాంతం వైపు జనన మరియు మరణాల మార్గంలో నిరంతర ప్రయాణం. ఈ భౌతిక ప్రపంచం, భగవంతుడు మరియు అతనితో వారి అసలు సన్నిహిత సంబంధం గురించి అవగాహన లేని వ్యక్తులు వాస్తవానికి నాగరికత యొక్క భౌతిక పురోగతిలో పురోగతి పేరుతో భౌతిక ఉనికి యొక్క చీకటి ప్రాంతానికి వెళుతున్నారు. భౌతిక అస్తిత్వం యొక్క చీకటి ప్రాంతంలోకి ప్రవేశించడం అంటే మానవ జాతుల కంటే ఇతర జీవ జాతులలోకి ప్రవేశించడం. ఈ జీవితం తరువాత వారు పూర్తిగా భౌతిక స్వభావం యొక్క పట్టులో ఉన్నారని మరియు చాలా అనుకూలమైనది కాని జీవితం అందించబడుతుందని అజ్ఞాన మనుష్యులకు తెలియదు. ఒక జీవి వివిధ రకాల శరీరాలను ఎలా పొందుతుందో తదుపరి అధ్యాయంలో వివరించబడుతుంది. జనన మరణాలలో శరీరాల యొక్క ఈ నిరంతర మార్పును సంసారం అంటారు. దేవహూతి తన మహిమాన్విత కుమారుడు కపిల మునిని, భక్తి-యోగ, భక్తి సేవ యొక్క మార్గాన్ని అర్థం చేసుకోలేక అధోగతి పాలవుతున్నారనే షరతులతో కూడిన ఆత్మలపై ఆకట్టుకోవడానికి ఈ నిరంతర ప్రయాణం గురించి వివరించమని కోరింది.



సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 193 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 5. Form of Bhakti - Glory of Time - 03 🌴

03. virāgo yena puruṣo bhagavan sarvato bhavet
ācakṣva jīva-lokasya vividhā mama saṁsṛtīḥ


MEANING : Devahūti continued: My dear Lord, please also describe in detail, both for me and for people in general, the continual process of birth and death, for by hearing of such calamities we may become detached from the activities of this material world.

PURPORT : In this verse the word saṁsṛtīḥ is very important. Śreyaḥ-sṛti means the prosperous path of advancement towards the Supreme Personality of Godhead, and saṁsṛti means the continued journey on the path of birth and death towards the darkest region of material existence. People who have no knowledge of this material world, God and their actual intimate relationship with Him are actually going to the darkest region of material existence in the name of progress in the material advancement of civilization. To enter the darkest region of material existence means to enter into a species of life other than the human species. Ignorant men do not know that after this life they are completely under the grip of material nature and will be offered a life which may not be very congenial. How a living entity gets different kinds of bodies will be explained in the next chapter. This continual change of bodies in birth and death is called saṁsāra. Devahūti requests her glorious son, Kapila Muni, to explain about this continued journey to impress upon the conditioned souls that they are undergoing a path of degradation by not understanding the path of bhakti-yoga, devotional service.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


17 Jun 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 17, జూన్‌, JUNE 2023 పంచాగము - Panchagam 🌹

శుభ శనివారం, Saturday, స్థిర వాసరే

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : రోహిణి వ్రతము, Rohini Vrat 🌻

🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 02 🍀

02. శేషాద్రినిలయోఽశేషభక్త దుఃఖప్రణాశనః |
శేషస్తుత్యః శేషశాయీ విశేషజ్ఞో విభుః స్వభూః

03. విష్ణుర్జిష్ణుశ్చ వర్ధిష్ణు రుత్సహిష్ణుః సహిష్ణుకః |
భ్రాజిష్ణుశ్చ గ్రసిష్ణుశ్చ వర్తిష్ణుశ్చ భరిష్ణుకః

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : అంతర్ముఖ భక్తి భావావేశం అపేక్షణీయం - హృదయకుహరపు ఉపరితలాన వట్టి భావావేశంతో కూడి భక్తి బహిర్ముఖంగా మాత్రమే ప్రసరిస్తుంది. అది యెంత తీవ్రమైనదైనా కావచ్చు. జీవితాన్ని సమగ్రంగా మార్చగలశక్తి దాని కుండదు. హృదయకుహరపు లోలోతున, అంతర్ముఖంగా ప్రసరించే భక్తి భావావేశం బాహ్యాభ్యంతక జీవన పథాన్ని సంపూర్ణంగా మార్చి వేయగలదు. 🍀

🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,

జ్యేష్ఠ మాసం

తిథి: కృష్ణ చతుర్దశి 09:13:21

వరకు తదుపరి అమావాశ్య

నక్షత్రం: రోహిణి 16:27:40 వరకు

తదుపరి మృగశిర

యోగం: శూల 25:01:45 వరకు

తదుపరి దండ

కరణం: శకుని 09:13:21 వరకు

వర్జ్యం: 07:59:40 - 09:40:56

మరియు 22:25:34 - 24:08:18

దుర్ముహూర్తం: 07:27:13 - 08:19:53

రాహు కాలం: 08:59:23 - 10:38:09

గుళిక కాలం: 05:41:52 - 07:20:38

యమ గండం: 13:55:39 - 15:34:25

అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:42

అమృత కాలం: 13:03:28 - 14:44:44

సూర్యోదయం: 05:41:52

సూర్యాస్తమయం: 18:51:56

చంద్రోదయం: 04:39:56

చంద్రాస్తమయం: 18:18:08

సూర్య సంచార రాశి: జెమిని

చంద్ర సంచార రాశి: వృషభం

యోగాలు: శ్రీవత్స యోగం - ధనలాభం ,

సర్వ సౌఖ్యం 16:27:40 వరకు తదుపరి

వజ్ర యోగం - ఫల ప్రాప్తి

దిశ శూల: తూర్పు

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹