శ్రీ విష్ణు సహస్ర నామములు - 97 / Sri Vishnu Sahasra Namavali - 97

🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 97 / Sri Vishnu Sahasra Namavali - 97 🌹

నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷

పూర్వాభాద్ర నక్షత్ర ప్రధమ పాద శ్లోకం

🍀 97. అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః |
శబ్దాతిగః శబ్దసహః శిశిరః శర్వరీకరః ‖ 97 ‖ 🍀

🍀 906) అరౌద్ర: -
రౌద్రము లేనివాడు.

🍀 907) కుండలీ -
మకర కుండలములు ధరించినవాడు.

🍀 908) చక్రీ -
సుదర్శనమను చక్రమును ధరించినవాడు.

🍀 909) విక్రమీ -
గొప్ప శూరుడైన భగవానుడు.

🍀 910) ఊర్జిత శాసన: -
ఉల్లంఘించుటకు వీలులేని శాసనములు కలవాడు.

🍀 911) శబ్దాతిగ: -
వాక్కుకు అందనివాడు.

🍀 912) శబ్దసహ: -
సమస్త వేదములు తెలియబడినవాడు.

🍀 913) శిశిర: -
శిశిర ఋతువువలె చల్లబరుచువాడు.

🍀 914) శర్వరీకర: -
రాత్రిని కలుగజేయువాడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Vishnu Sahasra Namavali - 97 🌹

Name - Meaning

📚 Prasad Bharadwaj

🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷

Sloka for PoorvaBhadra 1st Padam

🌻 97. araudraḥ kunḍalī cakrī vikramyūrjitaśāsanaḥ |
śabdātigaḥ śabdasahaḥ śiśiraḥ śarvarīkaraḥ || 97 || 🌻

🌻 906. Araudraḥ:
Action, attachment and anger these three are Raudra. The Lord is one whose desires are all accomplished, so He has no attachment or aversion. So He is free from the Raudras mentioned above.

🌻 907. Kunḍalī:
One who has taken the form of Adisesha.

🌻 908. Cakrī:
One who sports in his hand the discus named Sudarshana, which is the category known as Manas, for the protection of all the worlds.

🌻 909. Vikramī:
Vikrama means taking a stride, as also courage.

🌻 910. Ūrjita-śāsanaḥ:
One whose dictates in the form of shrutis and smrutis are of an extremely sublime nature.

🌻 911. Śabdātigaḥ:
One who cannot be denoted by any sound because He has none of the characteristics, which could be grasped by sound.

🌻 912. Śabdasahaḥ:
One who is the purport of all Vedas.

🌻 913. Śiśiraḥ:
One who is the shelter to those who are bruning in the three types of wordly fires - sufferings arising from material causes, psychological causes and spiritual causes.

🌻 914. Śarvarīkaraḥ:
For those in bondage, the Atman is like Sarvari (night) and for an enlightened one the state of samsara is like night (Sarvari). So the Lord is called the one who generates Sarvari or night for both the enlightened and the bound ones.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

26 Dec 2020

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 133

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 133 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 12 🌻

540. భగవంతుడు:- భైతిక ప్రపంచములో - దేహ స్వరూపునిగను, సూక్ష్మ ప్రపంచములో - శక్తి స్వరూపునిగను, మానసిక ప్రపంచములో - మనోమయస్వరూపునిగను, నిర్వాణములో - చైతన్య స్వరూపునిగను, విజ్ఞానభూమికలో - ఆత్మస్వరూపునిగను వ్యవహరించుచున్నాడు.

541. ఆత్మ, పరమాత్మ స్థితిలో లీనమై పరమాత్మయైనప్పుడు; ఎఱుకలేని పరాత్పరస్థితి యందు ఇప్పుడు పూర్తి ఎఱుకను కలిగియున్నది.

542. ఎఱుకలేని పరాత్పరుని యొక్క ఎఱుకయు, అనుభవమును కలిసి పరమాత్మ స్థితి.

543. సంస్కారములతో కలిసియున్న నిర్ముక్త చైతన్యము = ఎఱుకతో కూడిన అజ్ఞానము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

26 Dec 2020

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 194

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 194 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. దధీచిమహర్షి-సువర్చల - 3 🌻

14. ఎంతటివాడినైనా స్నేహం ఏవిధంగా బాధిస్తుందో, వైరంకూడా అలాగే బాధిస్తుంది. లేడిపిల్ల కోసమని బెంగపెట్టుకుని చచ్చిపోయి, లేడిపిల్లగా పుట్టాడు ఒక ఋషి. అదీ దోషమే! ఇతరజీవులతో మనం పెట్టుకున్న, వైరములాంటి ఎలాంటి సంబంధ మైనాకూడా, మనకు బంధనమే! అటువంటప్పుడు మరి ఇతరుల మీద మనకు మోహమో, క్రోధమో ఉంటే ఇక చేప్పేదేముంది.

15. తీవ్రమయిన కక్షకాని, కోపంకాని, కోరికకాని, దుఃఖంకాని ఆర్యులకు ఏది వచ్చినా ఆనాడు ఒక్కటే శరణ్యం! అదే తపస్సు! అది ఆర్యజాతి యొక్క లక్షణం. ఒకడి మీద కక్షవస్తుంది. వాడిని ఏమీచెయ్యలేరు. చాలా బాధికుడు వాడు! ఏం చేస్తారు! వెళ్ళి తపస్సు చేస్తారు.

16. అంతేగాని దైన్యంతో ఏడుస్తూ పడుకుని, కడుపులో బాధతో కుమిలిపోవడం ఆర్యలక్షణం కాదు. వెంటనే తపస్సుకు వెళ్ళిపోతాడు ఆర్యుడు. అవమానం భరించలేకపోతే తపస్సు. కోరిక తీరకపోతే తపస్సు. అన్నిటికీ ఒకటే మార్గం. దినిలో సూక్ష్మం ఏమిటంటే, అంతర్యామిగా ఈశ్వరుడు లోపల ఉంటాడు. సర్వేశ్వరుడు. లోపలికివెళ్ళి ఆయనను అడగటమే ఈ మార్గం.

17. ఆతడిని అడిగితే సాధ్యంకానిది ఏముంటుంది! ఆ రహస్యం త్రికరణశుద్ధిగా నమ్మి, ఆ ఫలం పొందినవాళ్ళు ఆర్యులు! అందుకని తపస్సే ఆర్యుల మార్గం. ఎవరైనా సరే! ఎంత సామన్యుడయినా, ఎంతటి అల్పుడయినా సరే! ప్రపంచంలో ఏకోరిక తీర్చుకోవటానికైనా – తపస్సేమార్గం. ‘సర్వం తపస్సాధ్యం’. తపస్సుచేత సర్వమూ సాధ్యమే! ఇదీ మన సూత్రం.

18. బ్రాహ్మణుడు ఒక్కటే కోరతాడట! అది నమస్కారం. ఇంకేమీ అఖ్ఖరలేదు. దానికే సంతోషిస్తాడు. భోజనం అఖ్ఖరలేదు. ధనం అఖ్ఖరలేదు. సద్బ్రాహ్మణుడికి ఒక నమస్కారం చాలు. అది అతడి లక్షణంలోనే ఉంది. దేహంలోంచి, అలా ఇఛ్ఛానుసారంగా వెళ్ళిపోగలిగినవాడే యోగి. సాధారణుల మృత్యువు సందర్భంలో, రోగగ్రస్తమయిన-పాడైపోయిన శిథిలమైపోయిన శరీరంలోంచీ, ఇక ప్రాణాలు ఉండటానికి బలం లేక, జీవుడు బలవంతంగా బయటికిపోతాడు.

19. జీవుడిని, శరీరాన్ని కలిపికట్టి ఉంచిన పాశములు(తాళ్ళు) ప్రాణములు. శరీరం బలంగా లేకపోతే, ప్రాణములు జీవాత్మతో శరీరాన్ని బంధించి, కట్టిపెట్టి ఉంచలేవు. అటువంటి స్థితిలో శరీరం జీర్ణంకావటంచేత; ప్రాణములు, శక్తి నశించటంచేత; ప్రాణములులేని శరీరంలో తాను ఉండలేని స్థితిలో, జీవుడు శరీరంలోంచి వెళ్ళిపోవలసి వస్తుంది. దానినే మనం మృత్యువు అంటాం.

20. ప్రాణాలకు ఎప్పుడూ బలం ఉంటుంది. ఎప్పుడూ ప్రాణాలకు బలహీనతరాదు. శరీరానికి తీవ్ర రుగ్మత వచ్చినప్పుడు, ఇక ప్రాణాలు శరీరంలో వ్యాపించి ఉండలేకపోతాయి. మట్టిలో చెట్టు వ్రేళ్ళు ఎలాగైతే వ్యాపించి ఉంటాయో, అలా ప్రాణములు శరీరంలో వ్యాపించి ఉంటాయి. వేళ్ళబలం మట్టిలో ఉండే దారుఢ్యాన్ని బట్టి ఉంటుంది. వేళ్ళు బలంగా ఉండాలంటే మట్టిలో బలం ఉండాలి. వేళ్ళు బలంగాఉంటే చెట్టు బాగుంటుంది. ప్రాణములు శరీరంలో బాగా బలంగా ఉండాలంటే శరీరం బాగుండాలి. అలా ఉంటేనే ప్రాణములు జీవుడిని శరీరంలో నిక్షేపించి ఉంచుతాయి. శరీరం రోగగ్రస్తంకావటంతో విధిలేక జీవుడు వెళ్ళిపోతాడు.

21. శరీరం బలంగానే ఉన్నా, మృత్యువులోవలె ప్రాణతంతువులు తెగకుండా, తనంతటతాను వాటినుండి విడివడి జీవుడు స్వేఛ్ఛచేత ఎప్పుడంటే అప్పుడు బయటకు వెళ్ళగలిగినస్థితినే యోగము అంటారు. స్వఛ్ఛందమరణం అంటే అదే. ఎవడైతే శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళ్గలుగుతాడో వాడే ధీరుడు, ఆర్యుడు. వాడే తపస్వి, యోగి. అలాచేయటం సంకల్పబలంచేత, యోగంచేత సాధ్యమే.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

26 Dec 2020

శ్రీ శివ మహా పురాణము - 309

🌹 . శ్రీ శివ మహా పురాణము - 309 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

76. అధ్యాయము - 31

🌻. ఆకాశవాణి - 1 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! ఇంతలో నచట దక్షుడు, దేవతలు మొదలగువారు వినుచుండగా ఆకాశవాణి సత్యమును పలికెను (1).

ఆకాశవాణి ఇట్లు పలికెను -

ఓరీ దక్షా!దుష్టుడా !నీవు దంభము కొరకై యజ్ఞమును చేయుటయందు నిష్ఠగలవాడవు. ఓరీ మహమూర్ఖా! హానిని కలిగించే ఈ కర్మను ఏల చేసితివి? (2) ఓరీ మూర్ఖా !శైవ శిఖామణియగు దధీచి యొక్క మాటను ప్రమాణముగా స్వీకరించిక పోతివి. ఆయన మాటను పాటించినచో, సర్వులకు ఆనందము, శుభము కలిగి యుండెడిది (3). ఆ బ్రాహ్మణుడు సహింప శక్యముగాని శాపమునిచ్చి, నీ యజ్ఞమును వీడి నిష్క్రమించినాడు. కాని మూర్ఖడవగు నీకు అప్పుడైననూ బుద్ధి రాలేదు (4).

నీ కుమార్తె, మంగళ స్వరూపురాలు అగు స్వతి స్వయముగా నీ గృహమునకు రాగా, ఆమెను గొప్పగా ఆదరించవలెను. నీవు అట్లు చేయక పోవుటకు కారణమేమి?(5)ఓరీ అజ్ఞానీ !సతీ శివులను నీవు అర్చించవైతివి. కాణమేమి? బ్రహ్మపుత్రుడననే గర్వముచే మోహితుడవైతివి. నీ గర్వము వ్యర్థము (6).

ఆ సతిని నిత్యము ఆరాధించవలెను. ఆమె పుణ్య ఫలముల నన్నిటినీ ఇచ్చును. ఆమె ముల్లోకములకు తల్లి. మంగళస్వరూపురాలు. శంకరుని అర్థ శరీరమును పొందినది (7). ఆ సతిని నిత్యము ఆరాధించవలెను. ఆ మహేశ్వర పత్ని తన భక్తులకు సమస్త సౌభాగ్యములను, సర్వమంగళములను ఇచ్చును (8).

ఆ సతిని నిత్యము అర్చించువానికి సంసార భయము నాశమగును. ఆ దేవి మనస్సులోని కోర్కెలనీడేర్చి, సమస్త విపత్తులను తొలగించును (9). నిత్యము ఆరాధిచువారికి ఆమె కీర్తిని, సంపత్తులను, భుక్తిని, ముక్తిని ఇచ్చును. పరమేశ్వరుని అర్థాంగియగు ఆమె పరమ తత్త్వమగు బ్రహ్మస్వరూపిణి (10).

ఆ సతియే జగత్తును సృష్టించును, జగత్తును రక్షించును. అనాది శక్తియగు ఆమె కల్పాంతమునందు జగత్తును ఉపసంహరించును (11). ఆ సతియే జగన్మాత. ఆ జగదేక సుందరి విష్ణు, బ్రహ్మ, ఇంద్ర, చంద్ర, అగ్ని, సూర్యాది దేవతలకు తల్లియని మహర్షులు చెప్పుచున్నారు (12).

శంభుని శక్తి, దుష్టవినాశిని, పరాత్పరయగు ఆ సతీ మహాదేవియే తపస్సు, ధర్మము దానము మొదలగు వాటి ఫలముల నిచ్చును (13). ఇట్టి సతీదేవి ఎవని పత్నియో, ఎవని నిత్యప్రియురాలో, అట్టి శివునకు మూఢుడు, దుష్ట బుద్ధి అగు నీవు యజ్ఞములో భాగము నీయలేదు (14).

శంభువు పరమేశ్వరుడు. సర్వజగత్తులకు ప్రభువు. పరాత్పరుడు. విష్ణుబ్రహ్మాదులు ఆయనను సేవింతురు. ఆయన అందరికీ కల్యాణమును చేయును (15). ఈ శివుని దర్శించు కోరికతో సిద్ధులు తపస్సును చేయుదురు. ఈ శివుని దర్శించు కాంక్షతో యోగులు యోగము నభ్యసింతురు (16). అనంత ధన ధాన్యములను పొందుటకంటె, యజ్ఞాది పుణ్యకర్మల ఫలము కంటె శంకరుని దర్శనము యొక్క ఫలమే గొప్పదియని చెప్పబడినది (17).

శివుడే జగత్కారణము. సర్వవిద్యలకు మూలము ఆయనయే. సర్వ సమర్థుడగు ఆయనయే వేద విద్యకు శ్రేష్ఠమగు ప్రభువు. ఆయన మంగలములన్నిటిలో మంగళుడు (18). దుష్టుడా !ఆయన శక్తికి నీవీనాడు సత్కారమును చేయకుంటివి. ఈ కారణముగా ఈ నీ యజ్ఞము వినాశమును పొందగలదు (19).

పూజింప దగిన వారిని పూజించనిచో, నిశ్చయముగా అమంగళము కలుగును. శివుని పత్ని అందరిలో అధికముగా పూజార్హురాలు. కాని ఆమెకు పూజ జరుగలేదు (20). శేషుడు ఎవని పాదధూళిని నిత్యము వేయి పడగలతో ప్రీతితో ధరించుచున్నాడో, అట్టి శివుని శక్తియే సతీదేవి (21).

ఎవని పాదపద్మములను నిత్యము ధ్యానించి, ఆదరముతో పూజించి విష్ణువు విష్ణుపదవిని పొందినాడో, అట్టి శంభునకు సతీదేవి ప్రియురాలు (22). ఎవని పాదపద్మమును నిత్యము ధ్యానించి, ఆదరముతో పూజించి బ్రహ్మ సృష్టికర్త అయినాడో, అట్టి శంభునకు సతీదేవి ప్రియురాలు (23).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

26 Dec 2020

గీతోపనిషత్తు -109

🌹. గీతోపనిషత్తు -109 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్లోకము 40

🍀 35. అశ్రద్ధ - సంయమము - అజ్ఞాని ఇహలోకమున గాని, పరలోకమున గాని సుఖమును పొందలేడు. కారణమేమనగ అతడు రెండు గుణములచే బద్ధుడు. ఒకటి అశ్రద్ధ, రెండు సంశయము. శ్రద్ధ లేమివలన పనులయందాటంకములు రాగ, ఆటంకముల వలన మనసునందు రకరకముల సంశయములు మొలకెత్తుచు నుండును. సంశయము అశ్రద్ధను పోషించుచుండగ, అశ్రద్ధ సంశయమును ప్రోత్సహించు చుండును. అశ్రద్ధ వలన పనులు చెడును. శ్రద్ధ లేనివాడు ఏ కార్యమును అనుస్యుతముగ నిర్వర్తింపలేడు. శ్రద్ధ, విశ్వాసము పురోగతికి కారణములు కాగ, అశ్రద్ధ, సంశయము తిరోగతి కలిగించును 🍀

అజ్ఞశ్చా శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి |
నాయం లోక్కో స్తి న పరో న సుఖం సంశయాత్మనః || 40

అజ్ఞాని ఇహలోకమున గాని, పరలోకమున గాని సుఖమును పొందలేడు. కారణమేమనగ అతడు రెండు గుణములచే బద్ధుడు. ఒకటి అశ్రద్ధ, రెండు సంశయము.

అశ్రద్ధ వలన పనులు చెడును. శ్రద్ధ లేనివాడు ఏ కార్యమును అనుస్యుతముగ నిర్వర్తింపలేడు. మనసు లగ్నము చేసి పనులను నిర్వర్తింపలేడు. పనులన్నియు అరకొరగనే జరుగు చుండును.

శ్రద్ధ లేమివలన పనులయందాటంకములు రాగ, ఆటంకముల వలన మనసునందు రకరకముల సంశయములు మొలకెత్తుచు నుండును. సంశయము అశ్రద్ధను పోషించుచుండగ, అశ్రద్ధ సంశయమును ప్రోత్సహించు చుండును. సర్వసామాన్యముగ వైఫల్యములకు ఈ రెండు అంశములే కారణముగ తెలియ వచ్చును.

ఇట్టివారు క్రమముగ పురోగమించుట జరుగకపోగ, తిరోగమించుట జరుగుచు నుండును. ఈ శ్లోకమున సంశయాత్మకుడు నశించును అని చెప్పుటలో 'వినశ్యతి' అను పదము వాడబడినది.

అనగ అట్టివాని పతనము ఘోరముగ నుండునని తెలియవలెను. శ్రద్ధ, విశ్వాసము పురోగతికి కారణములు కాగ, అశ్రద్ధ, సంశయము తిరోగతి కలిగించును సుమా అని అర్థము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

26 Dec 2020

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 160 / Sri Lalitha Chaitanya Vijnanam - 160

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 160 / Sri Lalitha Chaitanya Vijnanam - 160 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

47. నిశ్చింతా, నిరహంకారా, నిర్మోహా, మోహనాశినీ |
నిర్మమా, మమతాహంత్రీ, నిష్పాపా, పాపనాశినీ ‖ 47 ‖

🌻160. 'నిశ్చింతా'🌻

చింతలకతీతమైనది శ్రీమాత అని భావము. చింతలు లేనిది. చింతలు లేనిది అనగా సృష్టి చింత కూడా లేనిది. శ్రీమాత సృష్టించి, పోషించుట బాధ్యతాయుతమైన విషయము. సృష్టినే నిర్మించుచూ, పోషించుచూ, రక్షించుచూ లోకులను, లోకపాలకులను, లోకములను అధిష్ఠించి యుండుటకన్న మించిన బాధ్యత సృష్టిలో ఏమున్నది? అట్టి బాధ్యత వహించుచూ కూడ శ్రీమాత చింతపడదు. అది ఆమె సామర్థ్యము, స్వామిత్వము కూడ.

సర్వముపై స్వామిత్వము కలిగినవారు అట్టి స్థితి యందు క్రీడార్థమై యుండుట పరాకాష్ఠ. ఈ విషయమున శ్రీమాతకు ఆమెయే సాటి. త్రిమూర్తులు సహితము కలవరపడ్డ సన్నివేశములు సృష్టి యందు జరిగినవి. కానీ శ్రీమాత! కలవరపడిన సన్నివేశములకు సృష్టి నిర్వహణ భారమంతయూ స్మిత వదనయై నిర్వర్తించుచున్నది. ఇది అరుదైన కళ్యాణగుణము.

సృష్టి యందు శ్రీకృష్ణుడు ఒక్కడే అట్లు జీవించి చూపినాడు. జీవులు చింతాలోలురు. జీవితమంతయూ చింతలతోనే గడిచిపోవును. మనోబుద్దీంద్రియములు, శరీరము కూడ చింతలతో శుష్కించి పోవుచుండును. వారి చింతలకంతు లేదు. అందునా బాధ్యత కలవారి చింతలధికము. బాధ్యత పడుచున్న కొలది చింతలు పెరుగు చుండును. ఇట్టి చింతాపరులగు జీవులకు శ్రీమాత ఆరాధనమే శరణ్యము. చింతలు లేని శ్రీమాత భక్తులు జీవులకు మార్గదర్శకులు.

వారు జీవితమును ఎట్లు నిర్వర్తించుకొనిరో చూచి నేర్చుకొనుట, శ్రీమాతను ఆరాధన చేయుట ఈ రెండు అంశముల అభ్యాసము జీవులను చింతల నుండి తరింపచేయును. భాగవోతోత్తముల జీవిత చరిత్రలు, శ్రీమాత లీలలు (లీలార్థమై ఆమె నిర్వహించిన మహత్కార్యములు) చింతాపరులకు ఉపశమనము కలిగించ గలవు. పరిష్కారములు చూపగలవు. పరమపదమును చేర్చగలవు. చింతలు మనస్సున ఆవేశించినప్పుడు శ్రీమాత పాదములను ఆశ్రయించుట ఉపాయము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 160 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Niścintā निश्चिन्ता (160) 🌻

She is without worries. Worries arise out of recollecting the past.

Since She transcends time and space, She does not have a past. It can also be said that in spite of the responsibility of administering the universe, She is without worries because, She has intelligently delegated Her work to Her ministers like Vārahī and Śyāmalā. This can be known while worshipping Śrī Cakra through navāvaraṇa pūja. This is in confirmation of nāma 155 Nīriśvarā,

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

26 Dec 2020

సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 17

🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 17 🌹

🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻

తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. అభంగ్ - 17 🍀

హరి పార్ట్ కీర్తి ముఖే జరీ గాయ్!
పవిత్రచి హెయ్ దేహ త్యాచా!!

తపాచే సామర్ణ్యే తపిన్నలా అమూప్!
చిరంజీవ కల్స్ వైకుంఠ నాందే!!

మాతృ పితృ భ్రాతా సగోత్రీ అపార్!
చతుర్బుజ్ నర హెవూని తేలే!

జ్ఞాన గూఢగమ్య జ్ఞానదేవా లాధలే!
నివృత్తినే దిధలే మాఝ్యా హాతీ!!

భావము :

హరి పాఠము యొక్క కీర్తిని నోరార గానము చేసిన ఫలితముగ వారి దేహము పవిత్రమై పోగలదు.

తపః శక్తి యొక్క సామర్థ్యముతో అమితముగ తపించినవాడు కల్పాంతము వరకు చిరంజీవియై వైకుంఠమందు నివసించును. తల్లిదండ్రులు బంధు సమూహము మరియు అన్నదమ్ములు గోత్రీకులు సైతం చతుర్భుజ నరులై అందరు స్థిరపడతారు.

నా గురుదేవులు నివృత్తినాథులు జ్ఞానమందలి నిగూఢ రహస్యము అయిన గమ్యాన్ని చేర్చు హరి నామాన్ని నా చేతిలో పెట్టినారని జ్ఞానదేవులు తెలిపినారు.

🌻. నామ సుధ -17 🌻

హరిపాఠ కీర్తిని గానము

నోరార పాడిన ఫలితము

పవిత్రమయి పోవును దేహము

హరినామ మహిమ అపారము

తపఃశక్తి నిండిన సామర్థ్యము

తపించినాడు అమిత తపము

చిరంజీవియై కల్పాంతము

నివసించినాడు వైకుంఠధామము

తల్లిదండ్రులు బంధు సమూహము

సగోత్రికుల పరివారమపారము

చతుర్భుజులై నరుల స్వరూపము

అయిపోవుదురు అందరు స్థిరము

జ్ఞానములోని నిగూఢ గమ్యము

జ్ఞానదేవునికి లభించిన ఫలము

నివృత్తినాథుని కృపా ప్రసాదము

అప్పగించెను హరినామము

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

26 Dec 2020

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 143

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 143 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మను తెలుసుకొను విధము - 73 🌻

ఉపమాన స్థాయి లో బోధించినపుడు అది సర్వులకు అనుసరించేటటువంటి వారందరికి కూడ, వారి వారి జీవితాలలో అనుభవనీయమై ఉన్న అంశాన్ని ఉపమానంగా స్వీకరిస్తారు. అంటే అనుభవనీయమైన స్థితిలో స్వీకరించడడం వల్ల ఉపమాన పద్ధతి సులభంగా అనుసరించే వారందరికీ అర్థం అవుతుంది. కాబట్టి ఇలా అనుసరించే వారు, శిష్యులు, సత్శిష్యులు అని మూడు రకములైనటువంటి వారు ఉంటారు.

అయితే శిష్యులలో మరల సాధకులై, నిరంతరాయంగా ప్రయత్నం చేసేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది ప్రయాణంలో అలసి విశ్రాంతి తీసుకునే వారు కూడ ఉంటారు. సత్శిష్యులు అలా విరమించె వారు ఎవరు వుండరు. గమ్యం చేరే వరకూ వారు ఆగరు. వారే సత్శిష్యులు.

ఇక అనుసరించేవారు అవకాశం ఉన్నపుడు చేస్తూ ఆన్ అండ్ ఆఫ్ [on and off] లో వుంటారు అన్నమాట. అవకాశం కుదరలేదు అండి, సాధ్యం కాలేదు అండి అనేటటువంటి ఎక్షప్సనన్ క్లాజస్ [exceptional clauses] అంటే దాని ఏమంటారు అంటే.. ఎగ్సంప్షన్స్ [exemptions] అడుగుతూ ఉంటారు అన్నమాట. ఇవ్వాళ అవకాశం చిక్కలేదు అండి లేదంటే ఇవ్వాళ కుదరలేదు అండి, రేపు ప్రయత్నిస్తాను అండి అని తమోగుణ ధర్మం కలిగినటువంటివారు అనుసరించేవారు. కాబట్టి ప్రతి ఒక్కరూ సత్శిష్యులుగా సూచన కాలంలోనే దర్శన స్థితిని సాధించేటటువంటి సమర్ధతను సంపాదించాలి.

ఏ పదం గురు వాక్యంగా ఉచ్ఛరించబడితే, ఆ పదాన్ని యధాతథంగా గురువు హృదయం లో ఉండి దర్శించేటటువంటి సమర్ధత సంపాదించిన వారు ఎవరో వారు సత్శిష్యులు. వారికి వ్యాఖ్యానంతో అవసరముండదు. సూచన చేస్తే చాలు, దర్శించ గలుగుతారు. ఇక వ్యాఖ్యానంగా, బోధ గా వివరించి చెప్తే తెలుసుకోగల్గినటువంటి వారు కొంతమంది. వీరు మరొక తరగతికి సంబంధించిన వారు, వీరు శిష్యులు.

ఇక బోధించినప్పటికీ కూడ గ్రహించలేనటువంటి, కొద్దిగా మందబుద్ధి గలిగినటువంటి వారి కొరకు ఉపమాన ఉపమేయ పద్ధతిలో చెప్పబడుతుంది. ఇది ఉపమాన ఉపమేయ పద్ధతి. అంటే ఉపమేయమైనటువంటి లక్ష్యార్ధము, ఉపమానమైనటువంటి వాచ్యార్ధము రెండింటి మధ్య గల సామ్యము, పోలిక ద్వారా వివరించి చెప్పబడుతుంది.

ఇక్కడ ఉపమానంగా ఏం స్వీకరించారు? గర్భిణీ స్త్రీని స్వీకరించారు. గర్భిణీ స్త్రీ ఒక మనిషా? ఇద్దరు మనుషులా? అని విచారణ చేస్తే ఉండటానికి ఇద్దరు మనుషులు, ముగ్గురు మనుషులు కూడ ఉండవచ్చు. కవల పిల్లలు కూడ ఉండవచ్చు కదా!

అలాగే మనిషి చూడటానికి మాత్రం ఒక మనిషే, కానీ అంతర్గతంగా జీవులు ఉండే అవకాశం ఉంది కాబట్టి హిరణ్యగర్భుడు కూడ ఎలా ఉన్నాడంటే అందుకనే గర్భస్థము అనే పదాన్ని వాడారన్నమాట. హిరణ్యము, గర్భస్థము. ఈ సృష్టి అంతా ఆ హిరణ్యంతో పోల్చబడింది. కాబట్టి ఎవరైనా సరే ఈ హిరణ్మయ పురుషుణ్ణి కనక దర్శించగల్గినటువంటి వారు ఈ హిరణ్మయ పురుషుడికి ప్రత్యక్షసాక్షియే ఆదిత్యుడు.

సూర్యుడు అన్నమాట. “హిరణ్యగర్భః” అని ఆదిత్య నామాలలో ఒక నామముంది. కాబట్టి సవితాసూర్యుడు. ఆ ‘సవితా’ శక్తిని తన యందుంచుకున్నవాడు ఎవరైతే ఉన్నాడో ఆ సవితాశక్తినే కాంతి రూపంలో, ప్రకాశంగా మనకు అందిస్తూ ఉన్నాడు.

ఈ నవ గ్రహములు కూడ 9 గా విడిపోయి, సూర్యుని చుట్టూ భ్రమణము, పరిభ్రమణము చేయక ముందు ఇవి సూర్యుని లో అంతర్భాగములుగా ఉన్నాయి. భూమి కూడ సూర్యునిలో అంతర్భాగం గానే వుంది.

అలా అంతర్భాగములుగా ఉన్నటువంటివన్నీ ఒకానొక సమయంలో అక్షరపురుషుడు , “నిశ్శబ్దో బ్రహ్మముచ్యతే” నుంచి ప్రణవాక్షరం ఉద్భవించినటువంటి సందర్భంలో “ఏకమేవాద్వితీయం బ్రహ్మ” గా ఉన్నటువంటి స్థితి నుంచి, అహంబ్రహ్మాస్మి కి మారగానే, అయమాత్మాబ్రహ్మ అనేటటువంటి స్థితి నుంచి అహం బ్రహ్మస్మి అనేటటువంటి స్థితికి మారగానే విచ్ఛిన్నమైంది.

విచ్ఛిన్నమై 9 భాగములుగా విడిపోయి, వాటియొక్క గురుత్వాకర్షణ శక్తి వలన ఎక్కణ్ణించీ అయితే ఏ ఆధారస్థానం నుండీ విడిపోయినాయో, అదే ఆధారస్థానం చుట్టూ పరిభ్రమించటం ప్రారంభమైంది. ఇది విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడ ఒప్పుకున్నటువంటి విధానం. ఇలా అనంతకోటి బ్రహ్మాండాలు విస్తరించాయి.

ఒక బ్రహ్మాండానికి ఏ సిద్ధాంతముందో అనంతకోటి బ్రహ్మాండాలకు కూడ అదే సిద్ధాంతం. మరల తిరిగి విరమించేటప్పుడు కూడ ప్రళయకాలంలో ఎట్లా వచ్చినాయో, అట్లాగే విరమిస్తాయి. మరల అదే ఆధారస్థానమైనట్టి హిరణ్మయకోశం లోకి ఇవన్నీ అంశములుగా చేరిపోతాయి. కాబట్టి గర్భిణీ స్త్రీ ఎలా ఉందో అలా ఉన్నాడట హిరణ్యగర్భుడు.- విద్యా సాగర్ గారు

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

26 Dec 2020

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 190, 191 / Vishnu Sahasranama Contemplation - 190, 191

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 190, 191 / Vishnu Sahasranama Contemplation - 190, 191 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻190. దమనః, दमनः, Damanaḥ🌻

ఓం దమనాయ నమః | ॐ दमनाय नमः | OM Damanāya namaḥ

స్వాధికారాత్ ప్రమాద్యతః ప్రజాః వైవస్వతాదిరూపేణ దమయితుం శీలం అస్య తమ అధికారమునుండి లేదా తమ కర్తవ్యమునుండి ఏమరుచున్న ప్రజలను తాను వైవస్వతుడు లేదా యముడు మొదలగు రూపములతో అదుపులో నుంచుట ఈతని శీలము లేదా అలవాటు కావున శ్రీ విష్ణువు 'దమనః' అనబడును.

:: శ్రీమద్భగవద్గీత - విభూతి యోగము ::

దణ్డో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్ ।

మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్ ॥ 38 ॥

నేను దండిచువారియొక్క దండనమును, జయింపనిచ్ఛగలవారియొక్క జయోపాయమగు నీతియు అయియున్నాను. మఱియు రహస్యములలో మౌనమును, జ్ఞానవంతులలో జ్ఞానమును నేనై యున్నాను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 190🌹

📚. Prasad Bharadwaj

🌻190. Damanaḥ🌻

OM Damanāya namaḥ

Svādhikārāt pramādyataḥ prajāḥ vaivasvatādirūpeṇa damayituṃ śīlaṃ asya / स्वाधिकारात् प्रमाद्यतः प्रजाः वैवस्वतादिरूपेण दमयितुं शीलं अस्य He who has the capacity in the form of Vaivasvata and others to punish those who swerve from the duties of their offices is Damanaḥ.

Śrīmad Bhagavad Gīta - Chapter 12

Daṇḍo damayatāmasmi nītirasmi jigīṣatām,

Maunaṃ caivāsmi guhyānāṃ jñānaṃ jñānavatāmaham. (38)

:: श्रीमद्भगवद्गीत - विभूति योग ::

दण्डो दमयतामस्मि नीतिरस्मि जिगीषताम् ।

मौनं चैवास्मि गुह्यानां ज्ञानं ज्ञानवतामहम् ॥ ३८ ॥

I am the rod of the discipliners; I am the art of those who seek victory; I am also the silence of all hidden things, and the wisdom of all knowers.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

मरीचिर्दमनो हंसस्सुपर्णो भुजगोत्तमः ।
हिरण्यनाभस्सुतपाः पद्मनाभः प्रजापतिः ॥ २१ ॥

మరీచిర్దమనో హంసస్సుపర్ణో భుజగోత్తమః ।
హిరణ్యనాభస్సుతపాః పద్మనాభః ప్రజాపతిః ॥ ౨౧ ॥

Marīcirdamano haṃsassuparṇo bhujagottamaḥ ।
Hiraṇyanābhassutapāḥ padmanābhaḥ prajāpatiḥ ॥ 21 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 191/ Vishnu Sahasranama Contemplation - 191🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻191. హంసః, हंसः, Haṃsaḥ🌻

ఓం హంసాయ నమః | ॐ हंसाय नमः | OM Haṃsāya namaḥ

హంసః, हंसः, Haṃsaḥ

అహం సః ఇతి తాదాత్మ్యభావినః సంసారభయం హంతీతి హంసః నేనే ఆ పరమాత్మ అని తాదాత్మ్యమును భావన చేయువారికి సంసార భయమును నశింపజేయును. లేదా హంతి గచ్ఛతి సర్వశరీరేషు సర్వ శరీరములయందును అంతర్యామి రూపమున చేరియుండువాడు హంసః.

:: కఠోపనిషత్ - ద్వితీయాధ్యాయము, 5వ వల్లి ::

హంసః శుచిషద్ వసుర న్తరిక్షసద్ హోతా వేదిష దతిథి ర్దురోణషత్ ।

నృషద్వరస దృతసద్ వ్యోమస దబ్జా గోజా ఋతజా అద్రిజా ఋతం బృహత్ ॥ 2 (88) ॥

సూర్యునివలె స్వర్గములో నివసించును. వాయువువలె ఆకాశములో నివసించును. అగ్నివలె భూమియందును, అతిథివలె గృహములోను నివసించును. ఆ పురుషుడు మానవులలోనూ, దేవతలలోనూ, యజ్ఞములలోనూ, సత్యములోనూ, అగ్నిలోనూ కూడ నిండియుండును. జలములో జన్మించుచున్నాడు. భూమిలో జన్మించుచున్నాడు. కొండలలో నుద్భవించుచున్నాడు. ఆ యాత్మ సత్యస్వరూపుడై ప్రకాశించుచున్నాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 191🌹

📚. Prasad Bharadwaj

🌻191. Haṃsaḥ🌻

OM Haṃsāya namaḥ

Ahaṃ saḥ iti tādātmyabhāvinaḥ saṃsārabhayaṃ haṃtīti haṃsaḥ / अहं सः इति तादात्म्यभाविनः संसारभयं हंतीति हंसः He destroys the fear of entanglement in samsāra of those who realize "I am He". Or Haṃti gacchati sarvaśarīreṣu / हंति गच्छति सर्वशरीरेषु He who goes into or pervades all bodies.

Kaṭhopaniṣat - Part II, Canto II

Haṃsaḥ śuciṣad vasura ntarikṣasad hotā vediṣa datithi rduroṇaṣat,

Nr̥ṣadvarasa dr̥tasad vyomasa dabjā gojā r̥tajā adrijā r̥taṃ br̥hat. 2 (88)

:: कठोपनिषत् - द्वितीयाध्यायमु, ५व वल्लि ::

हंसः शुचिषद् वसुर न्तरिक्षसद् होता वेदिष दतिथि र्दुरोणषत् ।

नृषद्वरस दृतसद् व्योमस दब्जा गोजा ऋतजा अद्रिजा ऋतं बृहत् ॥ २ (८८) ॥

As the moving Sun He dwells in heaven; as air He pervades all and dwells in the inter-space; as fire He resides on the earth; as Soma He stays in a jar; He lives among men; He lives among gods; He dwells in truth; He dwells in space; He is born in water; He takes birth from the earth; He is born in the sacrifice; He emerges from the mountains; He is unchanging and He is great.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

मरीचिर्दमनो हंसस्सुपर्णो भुजगोत्तमः ।
हिरण्यनाभस्सुतपाः पद्मनाभः प्रजापतिः ॥ २१ ॥

మరీచిర్దమనో హంసస్సుపర్ణో భుజగోత్తమః ।
హిరణ్యనాభస్సుతపాః పద్మనాభః ప్రజాపతిః ॥ ౨౧ ॥

Marīcirdamano haṃsassuparṇo bhujagottamaḥ ।
Hiraṇyanābhassutapāḥ padmanābhaḥ prajāpatiḥ ॥ 21 ॥

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

26 Dec 2020

26-DECEMBER-2020 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 590 / Bhagavad-Gita - 590 🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 190, 191 / Vishnu Sahasranama Contemplation - 190, 191🌹
3) 🌹 Daily Wisdom - 10🌹
4) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 143🌹
5) 🌹 సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 17 🌹
6) 🌹 Guru Geeta - Datta Vaakya - 164🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 88🌹
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 160 / Sri Lalita Chaitanya Vijnanam - 160🌹
9) 🌹. శ్రీమద్భగవద్గీత - 501 / Bhagavad-Gita - 501🌹

10) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 109🌹 
11) 🌹. శివ మహా పురాణము - 307🌹 
12) 🌹 Light On The Path - 62 🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 194 🌹 
14) 🌹 Seeds Of Consciousness - 258🌹   
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 133🌹
16) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 98 / Sri Vishnu Sahasranama - 98🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 590 / Bhagavad-Gita - 590 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 07 🌴*

07. నియతస్య తు సన్న్యాస: కర్మణో నోపపద్యతే |
మోహాత్తస్య పరిత్యాగస్తామస: పరికీర్తిత: ||

🌷. తాత్పర్యం : 
విధ్యుక్తధర్మములను ఎన్నడును విడువరాదు. మోహకారణమున ఎవ్వరేని తన విధ్యుక్తధర్మమును విడిచినచో అట్టి త్యాగము తమోగుణమునకు సంబంధించినదిగా చెప్పబడును.

🌷. భాష్యము :
భౌతికతృప్తి కొరకు చేయబడు కర్మను తప్పక విడువవలయును. కాని మనుజుని ఆధ్యాత్మికతకు ఉద్ధరించునటువంటి ప్రసాదమును తయారు చేయుట, నైవేద్యమును పెట్టుట, ప్రసాదమును స్వీకరించుట వంటి కార్యములు మాత్రము ఉపదేశింపబడినవి. 

సన్న్యాసాశ్రమము నందున్న వ్యక్తి తన కొరకై వంట తయారుచేసికొనరాదని తెలుపబడినది. సన్న్యాసియైనవానికి తన కొరకై వండుకొనుట నిషిద్ధముగాని శ్రీకృష్ణభగవానుని కొరకై వండుట నిషిద్ధము కాదు. 

అదే విధముగా సన్న్యాసియైనవాడు తన శిష్యుని కృష్ణభక్తి పురోగతికై అతని వివాహమును సైతము జరుపవచ్చును. ఒకవేళ అతడట్టి కార్యమును త్యజించినచో తమోగుణమున వర్తించినవాడగును.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 590 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 07 🌴*

07. niyatasya tu sannyāsaḥ karmaṇo nopapadyate
mohāt tasya parityāgas tāmasaḥ parikīrtitaḥ

🌷 Translation : 
Prescribed duties should never be renounced. If one gives up his prescribed duties because of illusion, such renunciation is said to be in the mode of ignorance.

🌹 Purport :
Work for material satisfaction must be given up, but activities which promote one to spiritual activity, like cooking for the Supreme Lord and offering the food to the Lord and then accepting the food, are recommended. It is said that a person in the renounced order of life should not cook for himself. Cooking for oneself is prohibited, but cooking for the Supreme Lord is not prohibited. 

Similarly, a sannyāsī may perform a marriage ceremony to help his disciple in the advancement of Kṛṣṇa consciousness. If one renounces such activities, it is to be understood that he is acting in the mode of darkness.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 190, 191 / Vishnu Sahasranama Contemplation - 190, 191 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻190. దమనః, दमनः, Damanaḥ🌻*

*ఓం దమనాయ నమః | ॐ दमनाय नमः | OM Damanāya namaḥ*

స్వాధికారాత్ ప్రమాద్యతః ప్రజాః వైవస్వతాదిరూపేణ దమయితుం శీలం అస్య తమ అధికారమునుండి లేదా తమ కర్తవ్యమునుండి ఏమరుచున్న ప్రజలను తాను వైవస్వతుడు లేదా యముడు మొదలగు రూపములతో అదుపులో నుంచుట ఈతని శీలము లేదా అలవాటు కావున శ్రీ విష్ణువు 'దమనః' అనబడును.

:: శ్రీమద్భగవద్గీత - విభూతి యోగము ::
దణ్డో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్ ।
మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్ ॥ 38 ॥

నేను దండిచువారియొక్క దండనమును, జయింపనిచ్ఛగలవారియొక్క జయోపాయమగు నీతియు అయియున్నాను. మఱియు రహస్యములలో మౌనమును, జ్ఞానవంతులలో జ్ఞానమును నేనై యున్నాను. 

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 190🌹*
📚. Prasad Bharadwaj 

*🌻190. Damanaḥ🌻*

*OM Damanāya namaḥ*

Svādhikārāt pramādyataḥ prajāḥ vaivasvatādirūpeṇa damayituṃ śīlaṃ asya / स्वाधिकारात् प्रमाद्यतः प्रजाः वैवस्वतादिरूपेण दमयितुं शीलं अस्य He who has the capacity in the form of Vaivasvata and others to punish those who swerve from the duties of their offices is Damanaḥ.

Śrīmad Bhagavad Gīta - Chapter 12
Daṇḍo damayatāmasmi nītirasmi jigīṣatām,
Maunaṃ caivāsmi guhyānāṃ jñānaṃ jñānavatāmaham. (38)

:: श्रीमद्भगवद्गीत - विभूति योग ::
दण्डो दमयतामस्मि नीतिरस्मि जिगीषताम् ।
मौनं चैवास्मि गुह्यानां ज्ञानं ज्ञानवतामहम् ॥ ३८ ॥

I am the rod of the discipliners; I am the art of those who seek victory; I am also the silence of all hidden things, and the wisdom of all knowers.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
मरीचिर्दमनो हंसस्सुपर्णो भुजगोत्तमः ।हिरण्यनाभस्सुतपाः पद्मनाभः प्रजापतिः ॥ २१ ॥

మరీచిర్దమనో హంసస్సుపర్ణో భుజగోత్తమః ।హిరణ్యనాభస్సుతపాః పద్మనాభః ప్రజాపతిః ॥ ౨౧ ॥

Marīcirdamano haṃsassuparṇo bhujagottamaḥ ।Hiraṇyanābhassutapāḥ padmanābhaḥ prajāpatiḥ ॥ 21 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 191/ Vishnu Sahasranama Contemplation - 191🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻191. హంసః, हंसः, Haṃsaḥ🌻*

*ఓం హంసాయ నమః | ॐ हंसाय नमः | OM Haṃsāya namaḥ*

హంసః, हंसः, Haṃsaḥ

అహం సః ఇతి తాదాత్మ్యభావినః సంసారభయం హంతీతి హంసః నేనే ఆ పరమాత్మ అని తాదాత్మ్యమును భావన చేయువారికి సంసార భయమును నశింపజేయును. లేదా హంతి గచ్ఛతి సర్వశరీరేషు సర్వ శరీరములయందును అంతర్యామి రూపమున చేరియుండువాడు హంసః.

:: కఠోపనిషత్ - ద్వితీయాధ్యాయము, 5వ వల్లి ::
హంసః శుచిషద్ వసుర న్తరిక్షసద్ హోతా వేదిష దతిథి ర్దురోణషత్ ।
నృషద్వరస దృతసద్ వ్యోమస దబ్జా గోజా ఋతజా అద్రిజా ఋతం బృహత్ ॥ 2 (88) ॥

సూర్యునివలె స్వర్గములో నివసించును. వాయువువలె ఆకాశములో నివసించును. అగ్నివలె భూమియందును, అతిథివలె గృహములోను నివసించును. ఆ పురుషుడు మానవులలోనూ, దేవతలలోనూ, యజ్ఞములలోనూ, సత్యములోనూ, అగ్నిలోనూ కూడ నిండియుండును. జలములో జన్మించుచున్నాడు. భూమిలో జన్మించుచున్నాడు. కొండలలో నుద్భవించుచున్నాడు. ఆ యాత్మ సత్యస్వరూపుడై ప్రకాశించుచున్నాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 191🌹*
📚. Prasad Bharadwaj 

*🌻191. Haṃsaḥ🌻*

*OM Haṃsāya namaḥ*

Ahaṃ saḥ iti tādātmyabhāvinaḥ saṃsārabhayaṃ haṃtīti haṃsaḥ / अहं सः इति तादात्म्यभाविनः संसारभयं हंतीति हंसः He destroys the fear of entanglement in samsāra of those who realize "I am He". Or Haṃti gacchati sarvaśarīreṣu / हंति गच्छति सर्वशरीरेषु He who goes into or pervades all bodies.

Kaṭhopaniṣat - Part II, Canto II
Haṃsaḥ śuciṣad vasura ntarikṣasad hotā vediṣa datithi rduroṇaṣat,
Nr̥ṣadvarasa dr̥tasad vyomasa dabjā gojā r̥tajā adrijā r̥taṃ br̥hat. 2 (88)

:: कठोपनिषत् - द्वितीयाध्यायमु, ५व वल्लि ::
हंसः शुचिषद् वसुर न्तरिक्षसद् होता वेदिष दतिथि र्दुरोणषत् ।
नृषद्वरस दृतसद् व्योमस दब्जा गोजा ऋतजा अद्रिजा ऋतं बृहत् ॥ २ (८८) ॥

As the moving Sun He dwells in heaven; as air He pervades all and dwells in the inter-space; as fire He resides on the earth; as Soma He stays in a jar; He lives among men; He lives among gods; He dwells in truth; He dwells in space; He is born in water; He takes birth from the earth; He is born in the sacrifice; He emerges from the mountains; He is unchanging and He is great.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
मरीचिर्दमनो हंसस्सुपर्णो भुजगोत्तमः ।हिरण्यनाभस्सुतपाः पद्मनाभः प्रजापतिः ॥ २१ ॥

మరీచిర్దమనో హంసస్సుపర్ణో భుజగోత్తమః ।హిరణ్యనాభస్సుతపాః పద్మనాభః ప్రజాపతిః ॥ ౨౧ ॥

Marīcirdamano haṃsassuparṇo bhujagottamaḥ ।Hiraṇyanābhassutapāḥ padmanābhaḥ prajāpatiḥ ॥ 21 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 DAILY WISDOM - 9 🌹*
*🍀 📖 The Realisation of the Absolute 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 9. The Experience of the Jivanmukta 🌻*

The Jivanmukta experiences his being the lord of all, the knower of all, the enjoyer of everything. The whole existence belongs to him; the entire universe is his body. 

He neither commands anybody, nor is he commanded by anybody. He is the absolute witness of his own glory, without terms to express it. He seems to simultaneously sink deep into and float on the ocean of the essence of being, with the feeling “I alone am”, or “I am all”. 

He breaks the boundaries of consciousness and steps into the bosom of Infinity. At times he seems to have a consciousness of relativity as a faint remembrance brought about by unfinished individualistic experience. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 143 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మను తెలుసుకొను విధము - 73 🌻*

ఉపమాన స్థాయి లో బోధించినపుడు అది సర్వులకు అనుసరించేటటువంటి వారందరికి కూడ, వారి వారి జీవితాలలో అనుభవనీయమై ఉన్న అంశాన్ని ఉపమానంగా స్వీకరిస్తారు. అంటే అనుభవనీయమైన స్థితిలో స్వీకరించడడం వల్ల ఉపమాన పద్ధతి సులభంగా అనుసరించే వారందరికీ అర్థం అవుతుంది. కాబట్టి ఇలా అనుసరించే వారు, శిష్యులు, సత్శిష్యులు అని మూడు రకములైనటువంటి వారు ఉంటారు. 

అయితే శిష్యులలో మరల సాధకులై, నిరంతరాయంగా ప్రయత్నం చేసేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది ప్రయాణంలో అలసి విశ్రాంతి తీసుకునే వారు కూడ ఉంటారు. సత్శిష్యులు అలా విరమించె వారు ఎవరు వుండరు. గమ్యం చేరే వరకూ వారు ఆగరు. వారే సత్శిష్యులు.

        ఇక అనుసరించేవారు అవకాశం ఉన్నపుడు చేస్తూ ఆన్ అండ్ ఆఫ్ [on and off] లో వుంటారు అన్నమాట. అవకాశం కుదరలేదు అండి, సాధ్యం కాలేదు అండి అనేటటువంటి ఎక్షప్సనన్ క్లాజస్ [exceptional clauses] అంటే దాని ఏమంటారు అంటే.. ఎగ్సంప్షన్స్ [exemptions] అడుగుతూ ఉంటారు అన్నమాట. ఇవ్వాళ అవకాశం చిక్కలేదు అండి లేదంటే ఇవ్వాళ కుదరలేదు అండి, రేపు ప్రయత్నిస్తాను అండి అని తమోగుణ ధర్మం కలిగినటువంటివారు అనుసరించేవారు. కాబట్టి ప్రతి ఒక్కరూ సత్శిష్యులుగా సూచన కాలంలోనే దర్శన స్థితిని సాధించేటటువంటి సమర్ధతను సంపాదించాలి.

        ఏ పదం గురు వాక్యంగా ఉచ్ఛరించబడితే, ఆ పదాన్ని యధాతథంగా గురువు హృదయం లో ఉండి దర్శించేటటువంటి సమర్ధత సంపాదించిన వారు ఎవరో వారు సత్శిష్యులు. వారికి వ్యాఖ్యానంతో అవసరముండదు. సూచన చేస్తే చాలు, దర్శించ గలుగుతారు. ఇక వ్యాఖ్యానంగా, బోధ గా వివరించి చెప్తే తెలుసుకోగల్గినటువంటి వారు కొంతమంది. వీరు మరొక తరగతికి సంబంధించిన వారు, వీరు శిష్యులు.

 ఇక బోధించినప్పటికీ కూడ గ్రహించలేనటువంటి, కొద్దిగా మందబుద్ధి గలిగినటువంటి వారి కొరకు ఉపమాన ఉపమేయ పద్ధతిలో చెప్పబడుతుంది. ఇది ఉపమాన ఉపమేయ పద్ధతి. అంటే ఉపమేయమైనటువంటి లక్ష్యార్ధము, ఉపమానమైనటువంటి వాచ్యార్ధము రెండింటి మధ్య గల సామ్యము, పోలిక ద్వారా వివరించి చెప్పబడుతుంది. 

ఇక్కడ ఉపమానంగా ఏం స్వీకరించారు? గర్భిణీ స్త్రీని స్వీకరించారు. గర్భిణీ స్త్రీ ఒక మనిషా? ఇద్దరు మనుషులా? అని విచారణ చేస్తే ఉండటానికి ఇద్దరు మనుషులు, ముగ్గురు మనుషులు కూడ ఉండవచ్చు. కవల పిల్లలు కూడ ఉండవచ్చు కదా!

        అలాగే మనిషి చూడటానికి మాత్రం ఒక మనిషే, కానీ అంతర్గతంగా జీవులు ఉండే అవకాశం ఉంది కాబట్టి హిరణ్యగర్భుడు కూడ ఎలా ఉన్నాడంటే అందుకనే గర్భస్థము అనే పదాన్ని వాడారన్నమాట. హిరణ్యము, గర్భస్థము. ఈ సృష్టి అంతా ఆ హిరణ్యంతో పోల్చబడింది. కాబట్టి ఎవరైనా సరే ఈ హిరణ్మయ పురుషుణ్ణి కనక దర్శించగల్గినటువంటి వారు ఈ హిరణ్మయ పురుషుడికి ప్రత్యక్షసాక్షియే ఆదిత్యుడు. 

సూర్యుడు అన్నమాట. “హిరణ్యగర్భః” అని ఆదిత్య నామాలలో ఒక నామముంది. కాబట్టి సవితాసూర్యుడు. ఆ ‘సవితా’ శక్తిని తన యందుంచుకున్నవాడు ఎవరైతే ఉన్నాడో ఆ సవితాశక్తినే కాంతి రూపంలో, ప్రకాశంగా మనకు అందిస్తూ ఉన్నాడు.

        ఈ నవ గ్రహములు కూడ 9 గా విడిపోయి, సూర్యుని చుట్టూ భ్రమణము, పరిభ్రమణము చేయక ముందు ఇవి సూర్యుని లో అంతర్భాగములుగా ఉన్నాయి. భూమి కూడ సూర్యునిలో అంతర్భాగం గానే వుంది. 

అలా అంతర్భాగములుగా ఉన్నటువంటివన్నీ ఒకానొక సమయంలో అక్షరపురుషుడు , “నిశ్శబ్దో బ్రహ్మముచ్యతే” నుంచి ప్రణవాక్షరం ఉద్భవించినటువంటి సందర్భంలో “ఏకమేవాద్వితీయం బ్రహ్మ” గా ఉన్నటువంటి స్థితి నుంచి, అహంబ్రహ్మాస్మి కి మారగానే, అయమాత్మాబ్రహ్మ అనేటటువంటి స్థితి నుంచి అహం బ్రహ్మస్మి అనేటటువంటి స్థితికి మారగానే విచ్ఛిన్నమైంది.

        విచ్ఛిన్నమై 9 భాగములుగా విడిపోయి, వాటియొక్క గురుత్వాకర్షణ శక్తి వలన ఎక్కణ్ణించీ అయితే ఏ ఆధారస్థానం నుండీ విడిపోయినాయో, అదే ఆధారస్థానం చుట్టూ పరిభ్రమించటం ప్రారంభమైంది. ఇది విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడ ఒప్పుకున్నటువంటి విధానం. ఇలా అనంతకోటి బ్రహ్మాండాలు విస్తరించాయి.

ఒక బ్రహ్మాండానికి ఏ సిద్ధాంతముందో అనంతకోటి బ్రహ్మాండాలకు కూడ అదే సిద్ధాంతం. మరల తిరిగి విరమించేటప్పుడు కూడ ప్రళయకాలంలో ఎట్లా వచ్చినాయో, అట్లాగే విరమిస్తాయి. మరల అదే ఆధారస్థానమైనట్టి హిరణ్మయకోశం లోకి ఇవన్నీ అంశములుగా చేరిపోతాయి. కాబట్టి గర్భిణీ స్త్రీ ఎలా ఉందో అలా ఉన్నాడట హిరణ్యగర్భుడు.- విద్యా సాగర్ గారు 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ అభంగాలు - నామసుధ - 17 🌹*
*🌻. హరిపాఠము - వైకుంఠమును పొందు మార్గము 🌻*
తెలుగు అనువాదకర్త : శ్రీ గురుదాస్ మిట్టపల్లి శంకరయ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. అభంగ్ - 17 🍀*

హరి పార్ట్ కీర్తి ముఖే జరీ గాయ్!
పవిత్రచి హెయ్ దేహ త్యాచా!!
తపాచే సామర్ణ్యే తపిన్నలా అమూప్!
చిరంజీవ కల్స్ వైకుంఠ నాందే!!
మాతృ పితృ భ్రాతా సగోత్రీ అపార్!
చతుర్బుజ్ నర హెవూని తేలే!
జ్ఞాన గూఢగమ్య జ్ఞానదేవా లాధలే!
నివృత్తినే దిధలే మాఝ్యా హాతీ!!

భావము :
హరి పాఠము యొక్క కీర్తిని నోరార గానము చేసిన ఫలితముగ వారి దేహము పవిత్రమై పోగలదు.

తపః శక్తి యొక్క సామర్థ్యముతో అమితముగ తపించినవాడు కల్పాంతము వరకు చిరంజీవియై వైకుంఠమందు నివసించును. తల్లిదండ్రులు బంధు సమూహము మరియు అన్నదమ్ములు గోత్రీకులు సైతం చతుర్భుజ నరులై అందరు స్థిరపడతారు. 

నా గురుదేవులు నివృత్తినాథులు జ్ఞానమందలి నిగూఢ రహస్యము అయిన గమ్యాన్ని చేర్చు హరి నామాన్ని నా చేతిలో పెట్టినారని జ్ఞానదేవులు తెలిపినారు.

*🌻. నామ సుధ -17 🌻*

హరిపాఠ కీర్తిని గానము
నోరార పాడిన ఫలితము
పవిత్రమయి పోవును దేహము
హరినామ మహిమ అపారము
తపఃశక్తి నిండిన సామర్థ్యము
తపించినాడు అమిత తపము
చిరంజీవియై కల్పాంతము
నివసించినాడు వైకుంఠధామము
తల్లిదండ్రులు బంధు సమూహము
సగోత్రికుల పరివారమపారము
చతుర్భుజులై నరుల స్వరూపము
అయిపోవుదురు అందరు స్థిరము
జ్ఞానములోని నిగూఢ గమ్యము
జ్ఞానదేవునికి లభించిన ఫలము
నివృత్తినాథుని కృపా ప్రసాదము
అప్పగించెను హరినామము

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Guru Geeta - Datta Vaakya - 164 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
156

As discussed earlier, right in the beginning of this hymn, we are being cautioned, “You have a beautiful body, but what is the use?” Let’s recall the sloka.

Sankaracharya’s Guru Ashtakam,
 sloka 1: Sareeram suroopam thatha va kalathram, Yasascharu chithram dhanam meru thulyam, Guroranghri padme manaschenna lagnam, Thathah kim thatha kim, thatha kim thatha kim

What is the use of that beauty? The sculptor sculpts according to the Agama scriptures (these scriptures talk about the architectural principles for temple construction, creation of idols and much more), yet the sculpture doesn’t look like it has life in it.

 Similarly, it is hard to say that the body, by itself, is beautiful. Even though that sculptor has sculpted beautifully, it needs “Drishti Pradhanam”. There is a procedure called “Drishti Pradhanam” (giving the power of vision or conscious awareness to the image). Only when this is applied does the sculpture look like it has life in it, otherwise it doesn’t. 

The sculptor who gave this power of vision to the sculpture then offers salutations to that very sculpture he worked on. Similarly, the creator is pleased to see the various forms of life he created. So, just as the creator himself is pleased with the forms he creates, the sculptor, after he has applied “Drishti Pradhanam”, is also pleased with the sculpture and offers his salutations to it.

Now tell me, did the body get its beauty because of you? Why are you so proud of your beauty? What benefit does it give you? You are so proud. You stand in front of the mirror and keep admiring yourself. If your own beauty has no use for you, what is the use of the beauty of your wife and children? Similarly, what is the use of your fame?

Some people are never satisfied with how much wealth they accumulate. They want to keep earning more and more. Their goal is to just keep earning. A lot of people accumulate wealth equivalent to Mount Meru (enormous mountain considered the abode of many Gods). 

Their bank account has loads and loads of money. What’s the use? They don’t even know what to do with all the money they saved. They only care about hoarding wealth. They are hoarding all their life. I don’t know when they enjoy that wealth or put it to good use. Finally, the money falls into the hands of the government or the thieves. 

What’s the use of that wealth with which you do nothing? The government takes it over or the thieves break in and take it away. The thieves will enjoy the money. That is why, it is said that whatever you earn, you should spend it in this life itself and put it to good use.

Some people adopt a child. When that adopted child wastes all their wealth, they grieve over it. Why this karma? Just because you have no children, you adopt a child, perhaps a relative’s child and hand over your wealth to him. You cry when he wastes all the money. What is the point of doing this? That is why, treat orphans as your own children and help them. Help even orphaned animals. 

Or, help destitute students. There are plenty of opportunities to help others. It’s wonderful if you are able to spend your wealth thinking of others as your own children. One should not just hoard wealth. This wealth is given to you by God.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రము - 88 / Sri Lalitha Sahasra Nama Stotram - 88 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 160 / Sri Lalitha Chaitanya Vijnanam - 160 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*47. నిశ్చింతా, నిరహంకారా, నిర్మోహా, మోహనాశినీ |*
*నిర్మమా, మమతాహంత్రీ, నిష్పాపా, పాపనాశినీ ‖ 47 ‖*

*🌻160. 'నిశ్చింతా'🌻*

చింతలకతీతమైనది శ్రీమాత అని భావము. చింతలు లేనిది. చింతలు లేనిది అనగా సృష్టి చింత కూడా లేనిది. శ్రీమాత సృష్టించి, పోషించుట బాధ్యతాయుతమైన విషయము. సృష్టినే నిర్మించుచూ, పోషించుచూ, రక్షించుచూ లోకులను, లోకపాలకులను, లోకములను అధిష్ఠించి యుండుటకన్న మించిన బాధ్యత సృష్టిలో ఏమున్నది? అట్టి బాధ్యత వహించుచూ కూడ శ్రీమాత చింతపడదు. అది ఆమె సామర్థ్యము, స్వామిత్వము కూడ. 

సర్వముపై స్వామిత్వము కలిగినవారు అట్టి స్థితి యందు క్రీడార్థమై యుండుట పరాకాష్ఠ. ఈ విషయమున శ్రీమాతకు ఆమెయే సాటి. త్రిమూర్తులు సహితము కలవరపడ్డ సన్నివేశములు సృష్టి యందు జరిగినవి. కానీ శ్రీమాత! కలవరపడిన సన్నివేశములకు సృష్టి నిర్వహణ భారమంతయూ స్మిత వదనయై నిర్వర్తించుచున్నది. ఇది అరుదైన కళ్యాణగుణము. 

సృష్టి యందు శ్రీకృష్ణుడు ఒక్కడే అట్లు జీవించి చూపినాడు. జీవులు చింతాలోలురు. జీవితమంతయూ చింతలతోనే గడిచిపోవును. మనోబుద్దీంద్రియములు, శరీరము కూడ చింతలతో శుష్కించి పోవుచుండును. వారి చింతలకంతు లేదు. అందునా బాధ్యత కలవారి చింతలధికము. బాధ్యత పడుచున్న కొలది చింతలు పెరుగు చుండును. ఇట్టి చింతాపరులగు జీవులకు శ్రీమాత ఆరాధనమే శరణ్యము. చింతలు లేని శ్రీమాత భక్తులు జీవులకు మార్గదర్శకులు. 

వారు జీవితమును ఎట్లు నిర్వర్తించుకొనిరో చూచి నేర్చుకొనుట, శ్రీమాతను ఆరాధన చేయుట ఈ రెండు అంశముల అభ్యాసము జీవులను చింతల నుండి తరింపచేయును. భాగవోతోత్తముల జీవిత చరిత్రలు, శ్రీమాత లీలలు (లీలార్థమై ఆమె నిర్వహించిన మహత్కార్యములు) చింతాపరులకు ఉపశమనము కలిగించ గలవు. పరిష్కారములు చూపగలవు. పరమపదమును చేర్చగలవు. చింతలు మనస్సున ఆవేశించినప్పుడు శ్రీమాత పాదములను ఆశ్రయించుట ఉపాయము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 160 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Niścintā निश्चिन्ता (160) 🌻*

She is without worries. Worries arise out of recollecting the past.  

Since She transcends time and space, She does not have a past. It can also be said that in spite of the responsibility of administering the universe, She is without worries because, She has intelligently delegated Her work to Her ministers like Vārahī and Śyāmalā. This can be known while worshipping Śrī Cakra through navāvaraṇa pūja. This is in confirmation of nāma 155 Nīriśvarā,

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 501 / Bhagavad-Gita - 501 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 11 🌴*

11. సర్వద్వారేషు దేహే(స్మిన్ ప్రకాశ ఉపజాయతే |
జ్ఞానం యదా తదా విద్యాద్ వివృద్ధం సత్త్వమిత్యుత ||

🌷. తాత్పర్యం : 
దేహ ద్వారములన్నియును జ్ఞానముచే ప్రకాశమానమైనప్పుడు సత్త్వగుణము యొక్క వ్యక్తీకరణము అనుభవమునకు వచ్చును.

🌷. భాష్యము :
దేహమునకు రెండు కన్నులు, రెండు చెవులు, రెండు నాసికారంధ్రములు, నోరు, జననావయము, పృష్టమను తొమ్మిది ద్వారములు గలవు. ఈ తొమ్మిది ద్వారములలో ప్రతిదియు సత్త్వగుణ లక్షణములచే ప్రకాశమానమైనప్పుడు మనుజుడు సత్త్వగుణమును వృద్ధిచేసికొనిననాడని అవగాహన చేసికొనవచ్చును. 

అట్టి సత్త్వగుణమున మనుజుడు విషయములను వాస్తవదృక్పథమున గాంచునట్లు, వినుటయు, స్వీకరించుటయు చేయగలడు. ఆ విధముగా అతడు అంతర్భాహ్యములందు శుద్ధుడు కాగలడు. అనగా ప్రతిద్వారముమందును ఆనందము మరియు సౌఖ్యలక్షణములు వృద్ధి కాగలవు. అదియే సత్త్వగుణపు వాస్తవస్థితి.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 501 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 11 🌴*

11. sarva-dvāreṣu dehe ’smin
prakāśa upajāyate
jñānaṁ yadā tadā vidyād
vivṛddhaṁ sattvam ity uta

🌷 Translation : 
The manifestation of the mode of goodness can be experienced when all the gates of the body are illuminated by knowledge.

🌹 Purport :
There are nine gates in the body: two eyes, two ears, two nostrils, the mouth, the genitals and the anus. When every gate is illuminated by the symptoms of goodness, it should be understood that one has developed the mode of goodness.

 In the mode of goodness, one can see things in the right position, one can hear things in the right position, and one can taste things in the right position. 

One becomes cleansed inside and outside. In every gate there is development of the symptoms of happiness, and that is the position of goodness.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -109 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
శ్లోకము 40

*🍀 35. అశ్రద్ధ - సంయమము - అజ్ఞాని ఇహలోకమున గాని, పరలోకమున గాని సుఖమును పొందలేడు. కారణమేమనగ అతడు రెండు గుణములచే బద్ధుడు. ఒకటి అశ్రద్ధ, రెండు సంశయము. శ్రద్ధ లేమివలన పనులయందాటంకములు రాగ, ఆటంకముల వలన మనసునందు రకరకముల సంశయములు మొలకెత్తుచు నుండును. సంశయము అశ్రద్ధను పోషించుచుండగ, అశ్రద్ధ సంశయమును ప్రోత్సహించు చుండును. అశ్రద్ధ వలన పనులు చెడును. శ్రద్ధ లేనివాడు ఏ కార్యమును అనుస్యుతముగ నిర్వర్తింపలేడు. శ్రద్ధ, విశ్వాసము పురోగతికి కారణములు కాగ, అశ్రద్ధ, సంశయము తిరోగతి కలిగించును 🍀*

అజ్ఞశ్చా శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి |
నాయం లోక్కో స్తి న పరో న సుఖం సంశయాత్మనః || 40

అజ్ఞాని ఇహలోకమున గాని, పరలోకమున గాని సుఖమును పొందలేడు. కారణమేమనగ అతడు రెండు గుణములచే బద్ధుడు. ఒకటి అశ్రద్ధ, రెండు సంశయము. 

అశ్రద్ధ వలన పనులు చెడును. శ్రద్ధ లేనివాడు ఏ కార్యమును అనుస్యుతముగ నిర్వర్తింపలేడు. మనసు లగ్నము చేసి పనులను నిర్వర్తింపలేడు. పనులన్నియు అరకొరగనే జరుగు చుండును. 

శ్రద్ధ లేమివలన పనులయందాటంకములు రాగ, ఆటంకముల వలన మనసునందు రకరకముల సంశయములు మొలకెత్తుచు నుండును. సంశయము అశ్రద్ధను పోషించుచుండగ, అశ్రద్ధ సంశయమును ప్రోత్సహించు చుండును. సర్వసామాన్యముగ వైఫల్యములకు ఈ రెండు అంశములే కారణముగ తెలియ వచ్చును. 

ఇట్టివారు క్రమముగ పురోగమించుట జరుగకపోగ, తిరోగమించుట జరుగుచు నుండును. ఈ శ్లోకమున సంశయాత్మకుడు నశించును అని చెప్పుటలో 'వినశ్యతి' అను పదము వాడబడినది. 

అనగ అట్టివాని పతనము ఘోరముగ నుండునని తెలియవలెను. శ్రద్ధ, విశ్వాసము పురోగతికి కారణములు కాగ, అశ్రద్ధ, సంశయము తిరోగతి కలిగించును సుమా అని అర్థము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 309 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
76. అధ్యాయము - 31

*🌻. ఆకాశవాణి - 1 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! ఇంతలో నచట దక్షుడు, దేవతలు మొదలగువారు వినుచుండగా ఆకాశవాణి సత్యమును పలికెను (1).

ఆకాశవాణి ఇట్లు పలికెను -

ఓరీ దక్షా!దుష్టుడా !నీవు దంభము కొరకై యజ్ఞమును చేయుటయందు నిష్ఠగలవాడవు. ఓరీ మహమూర్ఖా! హానిని కలిగించే ఈ కర్మను ఏల చేసితివి? (2) ఓరీ మూర్ఖా !శైవ శిఖామణియగు దధీచి యొక్క మాటను ప్రమాణముగా స్వీకరించిక పోతివి. ఆయన మాటను పాటించినచో, సర్వులకు ఆనందము, శుభము కలిగి యుండెడిది (3). ఆ బ్రాహ్మణుడు సహింప శక్యముగాని శాపమునిచ్చి, నీ యజ్ఞమును వీడి నిష్క్రమించినాడు. కాని మూర్ఖడవగు నీకు అప్పుడైననూ బుద్ధి రాలేదు (4). 

నీ కుమార్తె, మంగళ స్వరూపురాలు అగు స్వతి స్వయముగా నీ గృహమునకు రాగా, ఆమెను గొప్పగా ఆదరించవలెను. నీవు అట్లు చేయక పోవుటకు కారణమేమి?(5)ఓరీ అజ్ఞానీ !సతీ శివులను నీవు అర్చించవైతివి. కాణమేమి? బ్రహ్మపుత్రుడననే గర్వముచే మోహితుడవైతివి. నీ గర్వము వ్యర్థము (6).

ఆ సతిని నిత్యము ఆరాధించవలెను. ఆమె పుణ్య ఫలముల నన్నిటినీ ఇచ్చును. ఆమె ముల్లోకములకు తల్లి. మంగళస్వరూపురాలు. శంకరుని అర్థ శరీరమును పొందినది (7). ఆ సతిని నిత్యము ఆరాధించవలెను. ఆ మహేశ్వర పత్ని తన భక్తులకు సమస్త సౌభాగ్యములను, సర్వమంగళములను ఇచ్చును (8). 

ఆ సతిని నిత్యము అర్చించువానికి సంసార భయము నాశమగును. ఆ దేవి మనస్సులోని కోర్కెలనీడేర్చి, సమస్త విపత్తులను తొలగించును (9). నిత్యము ఆరాధిచువారికి ఆమె కీర్తిని, సంపత్తులను, భుక్తిని, ముక్తిని ఇచ్చును. పరమేశ్వరుని అర్థాంగియగు ఆమె పరమ తత్త్వమగు బ్రహ్మస్వరూపిణి (10).

ఆ సతియే జగత్తును సృష్టించును, జగత్తును రక్షించును. అనాది శక్తియగు ఆమె కల్పాంతమునందు జగత్తును ఉపసంహరించును (11). ఆ సతియే జగన్మాత. ఆ జగదేక సుందరి విష్ణు, బ్రహ్మ, ఇంద్ర, చంద్ర, అగ్ని, సూర్యాది దేవతలకు తల్లియని మహర్షులు చెప్పుచున్నారు (12). 

శంభుని శక్తి, దుష్టవినాశిని, పరాత్పరయగు ఆ సతీ మహాదేవియే తపస్సు, ధర్మము దానము మొదలగు వాటి ఫలముల నిచ్చును (13). ఇట్టి సతీదేవి ఎవని పత్నియో, ఎవని నిత్యప్రియురాలో, అట్టి శివునకు మూఢుడు, దుష్ట బుద్ధి అగు నీవు యజ్ఞములో భాగము నీయలేదు (14).

శంభువు పరమేశ్వరుడు. సర్వజగత్తులకు ప్రభువు. పరాత్పరుడు. విష్ణుబ్రహ్మాదులు ఆయనను సేవింతురు. ఆయన అందరికీ కల్యాణమును చేయును (15). ఈ శివుని దర్శించు కోరికతో సిద్ధులు తపస్సును చేయుదురు. ఈ శివుని దర్శించు కాంక్షతో యోగులు యోగము నభ్యసింతురు (16). అనంత ధన ధాన్యములను పొందుటకంటె, యజ్ఞాది పుణ్యకర్మల ఫలము కంటె శంకరుని దర్శనము యొక్క ఫలమే గొప్పదియని చెప్పబడినది (17). 

శివుడే జగత్కారణము. సర్వవిద్యలకు మూలము ఆయనయే. సర్వ సమర్థుడగు ఆయనయే వేద విద్యకు శ్రేష్ఠమగు ప్రభువు. ఆయన మంగలములన్నిటిలో మంగళుడు (18). దుష్టుడా !ఆయన శక్తికి నీవీనాడు సత్కారమును చేయకుంటివి. ఈ కారణముగా ఈ నీ యజ్ఞము వినాశమును పొందగలదు (19).

పూజింప దగిన వారిని పూజించనిచో, నిశ్చయముగా అమంగళము కలుగును. శివుని పత్ని అందరిలో అధికముగా పూజార్హురాలు. కాని ఆమెకు పూజ జరుగలేదు (20). శేషుడు ఎవని పాదధూళిని నిత్యము వేయి పడగలతో ప్రీతితో ధరించుచున్నాడో, అట్టి శివుని శక్తియే సతీదేవి (21). 

ఎవని పాదపద్మములను నిత్యము ధ్యానించి, ఆదరముతో పూజించి విష్ణువు విష్ణుపదవిని పొందినాడో, అట్టి శంభునకు సతీదేవి ప్రియురాలు (22). ఎవని పాదపద్మమును నిత్యము ధ్యానించి, ఆదరముతో పూజించి బ్రహ్మ సృష్టికర్త అయినాడో, అట్టి శంభునకు సతీదేవి ప్రియురాలు (23).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 62 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 5 - THE 5th RULE
*🌻 5. Kill out all sense of separateness - 7 🌻*

258. The power of identification is gained not only with regard to the consciousness of people but with regard to everything else on the buddhic plane. Everything is learnt from the inside instead of from the outside. If we wish to study any subject, any organism, the working of any law of nature – it does not matter what – up to and including the consciousness of the causal body we have to study it from without, looking out at it. In the causal body we are able to examine it with an enormously widened’ consciousness, with the power of knowing vastly more about it than we could possibly know on lower planes.

But when we get to the buddhic plane the difference is a fundamental difference. That which we are examining has become part of ourselves. We examine it as a kind of symptom in ourselves. It is difficult to put into words because down here we have nothing exactly like it, but this looking at things from within instead of from without does give one a very great advantage. 

It is so different in its characteristics that we are probably justified in saying that that is the first glimpse we get of the way in which the Deity looks at His universe, because He must have exactly that experience – that that at which He looks must be part of Himself because there is nothing which is not part of Him. Therefore His consciousness must be this buddhic consciousness raised to the power, and with all the insight and glory and splendour of which we can have no idea on any plane as yet. 

One can understand very clearly why that world is spoken of as the real, and all these lower ones as the unreal, because the difference is so great and the attitude is so entirely changed that any other way of looking at things does seem unreal, even ridiculous when once one has learned to see them from the inside.

259. It is not so utterly impossible as many students think to attain to that higher sight. A reasonable number of people have succeeded in this incarnation, here and now, in gaining it. It is certainly within reach of those who will try hard enough, if they are willing to follow the rules – willing to adopt the utter selflessness which is required, because so long as there is anything personal in the disciple’s point of view he cannot make any progress with this buddhic consciousness, which depends on the suppression of the personality.

260. The idea of separateness shows itself in certain ways in daily life, and it is well to watch against those manifestations. One way in which people show it very much is by their desire for power over other separated selves. One half of the world is everlastingly trying to interfere with the other half. 

This habit is so ingrained in us that we do not notice it; we usually regard it in the light of good advice. About one case in two thousand may happen to be that, but in most of the others we are simply asserting our separated self by endeavouring to impress ourselves upon the other people.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 194 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. దధీచిమహర్షి-సువర్చల - 3 🌻*

14. ఎంతటివాడినైనా స్నేహం ఏవిధంగా బాధిస్తుందో, వైరంకూడా అలాగే బాధిస్తుంది. లేడిపిల్ల కోసమని బెంగపెట్టుకుని చచ్చిపోయి, లేడిపిల్లగా పుట్టాడు ఒక ఋషి. అదీ దోషమే! ఇతరజీవులతో మనం పెట్టుకున్న, వైరములాంటి ఎలాంటి సంబంధ మైనాకూడా, మనకు బంధనమే! అటువంటప్పుడు మరి ఇతరుల మీద మనకు మోహమో, క్రోధమో ఉంటే ఇక చేప్పేదేముంది.

15. తీవ్రమయిన కక్షకాని, కోపంకాని, కోరికకాని, దుఃఖంకాని ఆర్యులకు ఏది వచ్చినా ఆనాడు ఒక్కటే శరణ్యం! అదే తపస్సు! అది ఆర్యజాతి యొక్క లక్షణం. ఒకడి మీద కక్షవస్తుంది. వాడిని ఏమీచెయ్యలేరు. చాలా బాధికుడు వాడు! ఏం చేస్తారు! వెళ్ళి తపస్సు చేస్తారు. 

16. అంతేగాని దైన్యంతో ఏడుస్తూ పడుకుని, కడుపులో బాధతో కుమిలిపోవడం ఆర్యలక్షణం కాదు. వెంటనే తపస్సుకు వెళ్ళిపోతాడు ఆర్యుడు. అవమానం భరించలేకపోతే తపస్సు. కోరిక తీరకపోతే తపస్సు. అన్నిటికీ ఒకటే మార్గం. దినిలో సూక్ష్మం ఏమిటంటే, అంతర్యామిగా ఈశ్వరుడు లోపల ఉంటాడు. సర్వేశ్వరుడు. లోపలికివెళ్ళి ఆయనను అడగటమే ఈ మార్గం. 

17. ఆతడిని అడిగితే సాధ్యంకానిది ఏముంటుంది! ఆ రహస్యం త్రికరణశుద్ధిగా నమ్మి, ఆ ఫలం పొందినవాళ్ళు ఆర్యులు! అందుకని తపస్సే ఆర్యుల మార్గం. ఎవరైనా సరే! ఎంత సామన్యుడయినా, ఎంతటి అల్పుడయినా సరే! ప్రపంచంలో ఏకోరిక తీర్చుకోవటానికైనా – తపస్సేమార్గం. ‘సర్వం తపస్సాధ్యం’. తపస్సుచేత సర్వమూ సాధ్యమే! ఇదీ మన సూత్రం.

18. బ్రాహ్మణుడు ఒక్కటే కోరతాడట! అది నమస్కారం. ఇంకేమీ అఖ్ఖరలేదు. దానికే సంతోషిస్తాడు. భోజనం అఖ్ఖరలేదు. ధనం అఖ్ఖరలేదు. సద్బ్రాహ్మణుడికి ఒక నమస్కారం చాలు. అది అతడి లక్షణంలోనే ఉంది. దేహంలోంచి, అలా ఇఛ్ఛానుసారంగా వెళ్ళిపోగలిగినవాడే యోగి. సాధారణుల మృత్యువు సందర్భంలో, రోగగ్రస్తమయిన-పాడైపోయిన శిథిలమైపోయిన శరీరంలోంచీ, ఇక ప్రాణాలు ఉండటానికి బలం లేక, జీవుడు బలవంతంగా బయటికిపోతాడు. 

19. జీవుడిని, శరీరాన్ని కలిపికట్టి ఉంచిన పాశములు(తాళ్ళు) ప్రాణములు. శరీరం బలంగా లేకపోతే, ప్రాణములు జీవాత్మతో శరీరాన్ని బంధించి, కట్టిపెట్టి ఉంచలేవు. అటువంటి స్థితిలో శరీరం జీర్ణంకావటంచేత; ప్రాణములు, శక్తి నశించటంచేత; ప్రాణములులేని శరీరంలో తాను ఉండలేని స్థితిలో, జీవుడు శరీరంలోంచి వెళ్ళిపోవలసి వస్తుంది. దానినే మనం మృత్యువు అంటాం.

20. ప్రాణాలకు ఎప్పుడూ బలం ఉంటుంది. ఎప్పుడూ ప్రాణాలకు బలహీనతరాదు. శరీరానికి తీవ్ర రుగ్మత వచ్చినప్పుడు, ఇక ప్రాణాలు శరీరంలో వ్యాపించి ఉండలేకపోతాయి. మట్టిలో చెట్టు వ్రేళ్ళు ఎలాగైతే వ్యాపించి ఉంటాయో, అలా ప్రాణములు శరీరంలో వ్యాపించి ఉంటాయి. వేళ్ళబలం మట్టిలో ఉండే దారుఢ్యాన్ని బట్టి ఉంటుంది. వేళ్ళు బలంగా ఉండాలంటే మట్టిలో బలం ఉండాలి. వేళ్ళు బలంగాఉంటే చెట్టు బాగుంటుంది. ప్రాణములు శరీరంలో బాగా బలంగా ఉండాలంటే శరీరం బాగుండాలి. అలా ఉంటేనే ప్రాణములు జీవుడిని శరీరంలో నిక్షేపించి ఉంచుతాయి. శరీరం రోగగ్రస్తంకావటంతో విధిలేక జీవుడు వెళ్ళిపోతాడు. 

21. శరీరం బలంగానే ఉన్నా, మృత్యువులోవలె ప్రాణతంతువులు తెగకుండా, తనంతటతాను వాటినుండి విడివడి జీవుడు స్వేఛ్ఛచేత ఎప్పుడంటే అప్పుడు బయటకు వెళ్ళగలిగినస్థితినే యోగము అంటారు. స్వఛ్ఛందమరణం అంటే అదే. ఎవడైతే శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళ్గలుగుతాడో వాడే ధీరుడు, ఆర్యుడు. వాడే తపస్వి, యోగి. అలాచేయటం సంకల్పబలంచేత, యోగంచేత సాధ్యమే.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 258 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻107. Having acquired and understood the knowledge 'I am', stay there in seclusion and don't wander around here and there. 🌻*

Getting stabilized in the knowledge 'I am', even after having understood it, is extremely difficult. Your identification with the body is one thing that gets in the way and the other is the mind, which, although it has understood the teaching, is sub-consciously not prepared to accept it. 

The mind keeps prompting you 'This can't be it, it's too simple', 'Try this', 'Try that', 'It must be very complex, search more' and so on. 

Thus the wandering continues endlessly and you remain where you are. The Guru perceives this difficulty and hence advises you to stay in seclusion - not from society - but from thoughts, just in the sense of 'being' or 'I am' and never wandering away from it. 

Remember that not wandering through physical seclusion maybe helpful but is quite secondary to the not wandering of thoughts when you seclude the 'I am' from the rest.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 133 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భగవంతుని ఎనిమిదవపాత్ర - ఏడవ భూమిక - బ్రహ్మీభూతుడు. - 12 🌻*

540. భగవంతుడు:- భైతిక ప్రపంచములో - దేహ స్వరూపునిగను, సూక్ష్మ ప్రపంచములో - శక్తి స్వరూపునిగను, మానసిక ప్రపంచములో - మనోమయస్వరూపునిగను, నిర్వాణములో - చైతన్య స్వరూపునిగను, విజ్ఞానభూమికలో - ఆత్మస్వరూపునిగను వ్యవహరించుచున్నాడు.

541. ఆత్మ, పరమాత్మ స్థితిలో లీనమై పరమాత్మయైనప్పుడు; ఎఱుకలేని పరాత్పరస్థితి యందు ఇప్పుడు పూర్తి ఎఱుకను కలిగియున్నది.

542. ఎఱుకలేని పరాత్పరుని యొక్క ఎఱుకయు, అనుభవమును కలిసి పరమాత్మ స్థితి.

543. సంస్కారములతో కలిసియున్న నిర్ముక్త చైతన్యము = ఎఱుకతో కూడిన అజ్ఞానము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 97 / Sri Vishnu Sahasra Namavali - 97 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*పూర్వాభాద్ర నక్షత్ర ప్రధమ పాద శ్లోకం*

*🍀 97. అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః |*
*శబ్దాతిగః శబ్దసహః శిశిరః శర్వరీకరః ‖ 97 ‖ 🍀*

🍀 906) అరౌద్ర: - 
రౌద్రము లేనివాడు.

🍀 907) కుండలీ - 
మకర కుండలములు ధరించినవాడు.

🍀 908) చక్రీ - 
సుదర్శనమను చక్రమును ధరించినవాడు.

🍀 909) విక్రమీ - 
గొప్ప శూరుడైన భగవానుడు.

🍀 910) ఊర్జిత శాసన: - 
ఉల్లంఘించుటకు వీలులేని శాసనములు కలవాడు.

🍀 911) శబ్దాతిగ: - 
వాక్కుకు అందనివాడు.

🍀 912) శబ్దసహ: - 
సమస్త వేదములు తెలియబడినవాడు.

🍀 913) శిశిర: - 
శిశిర ఋతువువలె చల్లబరుచువాడు.

🍀 914) శర్వరీకర: - 
రాత్రిని కలుగజేయువాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 97 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for PoorvaBhadra 1st Padam* 

*🌻 97. araudraḥ kunḍalī cakrī vikramyūrjitaśāsanaḥ |*
*śabdātigaḥ śabdasahaḥ śiśiraḥ śarvarīkaraḥ || 97 || 🌻*