Showing posts with label Temples. Show all posts
Showing posts with label Temples. Show all posts

మనలో నిద్రిస్తున్న దేవాలయం The Sleeping Temple Inside Us (YT Short 1)



https://youtube.com/shorts/hAOCr5lIB2s


🌹మనలో నిద్రిస్తున్న దేవాలయం Short 1 The Sleeping Temple Inside Us 🌹


🍀 నిజమైన దేవాలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా? కుండలిని అంటే ఏమిటి? అది ఎలా మేల్కొంటుంది? దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి? మనం దేవుడిని వెతుక్కుంటూ ఎన్నో దేవాలయాలకు వెళ్తాం. కానీ భారతీయ ఋషులు ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్పారు. 🍀

✍️ రచన : ప్రసాద్ భరద్వాజ

Like, Subscribe and Share


🌹🌹🌹🌹🌹





పూర్తి వీడియో ఇక్కడ చూడండి. Watch the full video here.

కుండలిని చైతన్య జాగృతి – అత్యున్నత వెలుగు వైపు చేసే అంతర్ముఖ ప్రయాణం 
 Kundalini Consciousness Awakening – The Inner Journey Toward the Supreme Light

https://youtu.be/STr3uqyRTpU


🌹🌹🌹🌹🌹

పుసలార్ నాయనార్ చరిత్ర Short రహస్య మానస దేవాలయం - The Story of Pusalar Nayanar — The Secret Temple of the Mind



https://youtube.com/shorts/zSCYZCIT5k0

🌹పుసలార్ నాయనార్ చరిత్ర Short రహస్య మానస దేవాలయం - The Story of Pusalar Nayanar — The Secret Temple of the Mind 🌹

🍀 పుసలార్ నాయనార్ చరిత్ర - రహస్య మానస దేవాలయం. కుంభాభిషేకానికి శివుడు స్వయంగా హాజరైన గుడి.. కానీ ఆ గుడి ఎవరికి కనిపించదు. 🍀

ప్రసాద్‌ భరధ్వాజ

like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹



దేహమేరా దేవాలయం జీవుడేరా సనాతన దైవం / Body is Temple, Living being is eternal god



https://youtube.com/shorts/SZGFxCBKzfs

🌹 దేహమేరా దేవాలయం జీవుడేరా సనాతన దైవం
Body is Temple, Living being is eternal god 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹



దేవాలయంలో ప్రదక్షిణం చేయు విధానం? How to circumambulate a temple?


Facebookhttps://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2080214002765070


🌹 దేవాలయంలో ప్రదక్షిణం చేయు విధానం - ఎవరికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? 🌹
ప్రసాద్ భరద్వాజ


🌹 How to circumambulate a temple - How many circumambulates should be done for whom? 🌹
Prasad Bharadwaja


Famous Shiva Temples in Telangana తెలంగాణలోని ప్రముఖ శివాలయాలు



🌹 తెలంగాణలోని ప్రముఖ శివాలయాలు 🌹
ప్రసాద్ భరద్వాజ


🌹 Famous Shiva Temples in Telangana 🌹
Prasad Bharadwaja

అరుదైన మరకత శివలింగం కలిగి ఉన్న చందిప్ప మరకత సోమప్ప ఆలయం Chandippa Marakata Somappa Temple



🌹 అరుదైన మరకత శివలింగం కలిగి ఉన్న చందిప్ప మరకత సోమప్ప ఆలయం విశిష్టత - భాగ్య నగరానికి అతి సమీపంలో ఆరోగ్య ప్రదాత 🌹

ప్రసాద్ భరద్వాజ


🌹 Chandippa Marakata Somappa Temple, which has a rare marakata Shivalinga, is special – very close to Bhaghya Nagara, a provider of health 🌹

Prasad Bharadwaj


భక్తులను అనుగ్రహించడానికి పరమేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగ రూపాల్లో వెలిశాడు. ఈ క్షేత్రాల్లో మహారాష్ట్రలోని పర్లి ప్రత్యేకమైంది. ఇక్కడ వైద్యనాథేశ్వరుడిగా కొలువుదీరి ఆయురారోగ్యాలను అనుగ్రహిస్తున్నాడు శివుడు. పర్లి వైద్యనాథుడిని పోలిన బ్రహ్మసూత్రం కలిగిన మరకత శివలింగం రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి సమీపంలోని చందిప్ప గ్రామంలో ఉంది. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ మరకత సోమేశ్వర లింగాన్ని సేవిస్తే వ్యాధులు పోతాయని, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. చందిప్ప మరకత సోమప్ప విశేషాలెన్నో.

శివలింగం.. పార్థివ లింగం, స్ఫటిక లింగం, సైకత లింగం ఇలా వివిధ రూపాల్లో దర్శనమిస్తుంది. అందులోనూ మరకత లింగం ముదురు ఆకుపచ్చ రంగులో మెరిసిపోతూ ఉంటుంది. అరుదైన ఆ మరకత లింగం కొలువై ఉన్న చందిప్ప క్షేత్రానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ముచుకుంద నది ఒడ్డున ఉందీ క్షేత్రం. క్రీస్తు శకం 1076-1126 మధ్య పశ్చిమ చాళుక్య రాజు ఆరో విక్రమాదిత్యుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడని శాసనం ద్వారా తెలుస్తున్నది. క్రీ.శ.1101 సంవత్సరం కార్తిక శుద్ధ పంచమి.. గురువారం నాడు ప్రతిష్ఠ ఉత్సవం జరిగిందని అదే శాసనంలో స్పష్టంగా లిఖించారు. దాదాపు 920 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ పురాతన శివాలయం కాలపరీక్షకులోనై శిథిలమైపోయింది. పదిహేనేండ్ల కిందట కొందరు భక్తులు పూనుకొని పునరుద్ధరించారు. నూతన గర్భాలయాన్ని నిర్మించారు.

ఆరోగ్య ప్రదాత - పర్లిలోని వైద్యనాథ జ్యోతిర్లింగానికి, చందిప్ప మరకత లింగానికి చాలా పోలికలు ఉన్నాయని చెబుతారు పండితులు. చందిప్ప శివయ్యను పూజిస్తే పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. అసలే శివుడు అభిషేక ప్రియుడు. ఐదు సోమవారాలు కానీ, ఐదు పౌర్ణములు కానీ, ఐదు మాస శివరాత్రులు కానీ మరకత లింగాన్ని అర్చిస్తే సకల కోరికలూ నెరవేరుతాయని విశ్వాసం. పౌర్ణమినాడు లింగాభిషేకం చేసిన జలాలతో స్నానం చేసిన వారికి వైకుంఠప్రాప్తి తథ్యమని చెబుతారు. అంతేకాదు బ్రాహ్మీ ముహూర్తంలో.. అభిషేకిస్తే పరమశివుడి కటాక్షం లభిస్తుందని స్థానిక ఐతిహ్యం.

భైరవం.. క్షేత్రపాలం

ఈ ఆలయానికి కాలభైరవుడు క్షేత్ర పాలకుడు. ఆలయ ప్రాంగణంలో వెలిసిన కాలభైరవుడు ఆవరణను వెయ్యి కండ్లతో రక్షిస్తూ ఉంటాడని చెబుతారు. ఆదివారం కాలభైరవుడిని పూజిస్తే సమస్త గ్రహదోషాలూ తొలగిపోతాయని స్థల పురాణం. అంతేకాదు శివుడి కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామి ఇక్కడ నాగుపాము రూపంలో సంచరిస్తూ ఉంటాడని ప్రతీతి. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయం కొన్నేండ్ల కిందటి వరకూ నిరాదరణకు గురైంది. పండుగలప్పుడు తప్ప భక్తులు వచ్చేవారు కాదు. 2007లో శివరాత్రి సందర్భంగా ఒక భక్తుడు ఆలయంలో అభిషేకం చేశాడు. అప్పుడు శివలింగంపై ప్రసరించిన సూర్యకిరణాలు పరావర్తనం చెందడంతో దానిని మరకత లింగంగా గుర్తించాడు. తర్వాత చందిప్ప చరిత్ర తెలుసుకొని భక్తుల సహకారంతో ఆలయాన్ని పునరుద్ధరించాడు. శ్రావణం, కార్తిక మాసాల్లో ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. శివరాత్రి ఘనంగా నిర్వహిస్తారు. హైదరాబాద్‌ వాసులు వారాంతంలో వెళ్లిరావడానికి అనువైన క్షేత్రమిది. మానసిక ఒత్తిళ్లతో కూడిన జీవితంలో ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శన మనోబలాన్ని ప్రసాదిస్తుంది.

చందిప్ప క్షేత్రం హైదరాబాద్‌కు 48 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది . శంకర్‌పల్లి వరకు బస్సులో వెళ్లాలి. అక్కడి నుంచి చందిప్పకు ఆటోలు ఉంటాయి. తప్పక దర్శించుకుని శివుని అనుగ్రహానికి పాత్రులు అవుదాం..

ఓం నమఃశివాయ 🙏

🌹 🌹 🌹 🌹 🌹


ఇక వాట్సాప్‌లోనే తిరుమల దర్శనం టికెట్లు... Now get Tirumala darshan tickets on WhatsApp...




🌹 ఇక వాట్సాప్‌లోనే తిరుమల దర్శనం టికెట్లు.. బుకింగ్ ప్రాసెస్ ఇదే! 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 Now get Tirumala darshan tickets on WhatsApp.. Here's the booking process! 🌹
Prasad Bharadwaj



తిరుమల దర్శనం టికెట్లు ఇక సులభంగా పొందే వెసులుబాటు కలిగింది. ఇప్పటి వరకు టీటీడీ ఆన్ లైన్.. ఆఫ్ లైన్ విధానంలో టికెట్లు పొందే విధానం అందుబాటులో ఉంది. ఇక నుండి ఆ సేవలు వాట్సప్ లో అందుబాటులోకి తెచ్చింది టిటిడి.

బుకింగ్ విధానం

భక్తుల కోసం ఇంగ్లీష్, తెలుగు భాషల్లో మన మిత్ర వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా దేవాలయాలకు సంబంధించిన సేవలు అందుబాటులోకి తెచ్చారు. సేవలను సులువుగా పొందడానికి '95523 00009' అనే వాట్సాప్ నెంబర్​ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్​లోని అన్ని ప్రముఖ దేవాలయాలకు సంబంధించిన దర్శనాలు, సేవలు పొందొచ్చు. ముందుగా మీ మొబైల్​లో '9552300009' అనే నంబర్ సేవ్ చేసుకొని 'Hi' అని మెస్సేజ్ చేయాలి. అప్పుడు సేవలు ఎంచుకోండి) అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి కిందకు స్క్రోల్ చేస్తే 'దేవాలయ బుకింగ్ సేవలుఅనే ఆప్షన్ కనిపిస్తుంది.

అనంతరం శ్రీశైలం, కాణిపాకం, అన్నవరం, విజయవాడ (Vijayawada), శ్రీకాళ హస్తి ఇలా ఏపీలోని ప్రముఖ టెంపుల్స్ నేమ్స్ డిస్​ప్లే అవుతాయి. అప్పుడు మీరు ఏ దేవాలయం వెళ్లాలనుకుంటున్నారో ఆ టెంపుల్​ ను సెలెక్ట్ చేసి నిర్ధారించి ఆప్షన్ ​పై క్లిక్ చేయాలి. దర్శనం సేవకు సంబంధించి భక్తుడి పూర్తి వివరాలు ఇవ్వటం ద్వారా దర్శనం సేవా టికెట్లు పొందవచ్చు.

🌹 🌹 🌹 🌹 🌹

శఠగోపం వెనుక ఉన్న అసలు రహస్యం... The real secret behind the Shatagopam...


Facebook:  https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2063687124417758/


🌹 శఠగోపం వెనుక ఉన్న అసలు రహస్యం.. ఆ సమయంలో కోరిక ఎందుకు కోరుకోవాలి? 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 The real secret behind the Shatagopam... Why should you make a wish at that moment? 🌹
Prasad Bharadwaj



ఆలయంలో దైవ దర్శనం ముగిసిన తర్వాత భక్తులు భక్తిశ్రద్ధలతో తలవంచి 'శఠగోపాన్ని' స్వీకరిస్తారు. దీనిని కేవలం ఒక ఆచారంగా మాత్రమే కాకుండా, భక్తుడికి దైవానికి మధ్య జరిగే ఒక ఆత్మీయ సంభాషణగా పండితులు అభివర్ణిస్తారు.

శఠగోపం తలపై ఉంచినప్పుడు భగవంతుని పాదాలనే మనం శిరస్సుపై ధరిస్తున్నామనే భావన కలగాలి. అందుకే ఆ క్షణం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించ బడుతుంది.

ఆ సమయంలో పక్కనున్న వారికి, కనీసం ఆ శఠగోపం ఉంచే పూజారికి కూడా వినిపించనంత మెల్లగా మనసులో తన కోరికను చెప్పుకోవాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మన సంకల్పం నేరుగా ఆ పరమాత్ముడికి చేరుతుందని నమ్మకం.

ఈ పవిత్ర స్పర్శ ద్వారా మన మనసులోని కోరికలు సిద్ధించడమే కాకుండా, శరీరంలోని నాడులకు ఒక రకమైన సానుకూల శక్తి లభిస్తుంది.

శాస్త్రీయంగా మరియు ఆధ్యాత్మికంగా చూస్తే.. శఠగోపాన్ని తలపై ఉంచడం అంటే మానవ సహజమైన అరిషడ్వర్గాలను (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు) దైవ ప్రసన్నంతో అదుపులో ఉంచుకోవడమే. మనలోని అహంకారాన్ని వీడి, దుర్గుణాలకు దూరంగా ఉంటామని దేవుని ముందు తలవంచి అంగీకరించే గొప్ప ప్రక్రియ ఇది. ఈ వినయం మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది.

చివరగా, శఠగోప దర్శనం అనేది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, అది మనసును ప్రక్షాళన చేసే ఒక అద్భుత సాధనం. దీనివల్ల మానసిక ప్రశాంతత లభించడంతో పాటు, ఒత్తిడి తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందుకే ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ ఏకాగ్రతతో, భక్తితో శఠగోపాన్ని స్వీకరిస్తే మన జీవితంలో సానుకూల మార్పులు సంభవిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

🌹 🌹 🌹 🌹 🌹

మేడారం జాతర తేదీలు 2026 Medaram Jathara Dates 2026


https://youtube.com/shorts/sbkwonr-fqw


🌹 మేడారం జాతర తేదీలు 2026 Medaram Jathara Dates 2026 🌹

ప్రసాద్‌ భరధ్వాజ.

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹

గట్టమ్మ ఆలయం.. Gattamma Temple..


🌹 గట్టమ్మ ఆలయం.. మేడారం ప్రధాన ద్వారం ఎందుకో తెలుసా? 🌹
ప్రసాద్ భరద్వాజ

🌹 Gattamma Temple.. Do you know why Medaram has the main gate? 🌹
Prasad Bharadwaj



గిరిజన వనదేవతలైన మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకునే భక్తులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకున్నాకే ఆ సమ్మక్క-సారలమ్మ సన్నిధికి బయలుదేరి వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది.

మేడారం ములుగు మార్గంలో ఉన్న గట్టమ్మకు తొలి పూజలు జరిపాకే భక్తులంతా మేడారానికి వెళతారు. ఇంతకీ ఆ గట్టమ్మ తల్లి ఎవరు ఆ తల్లి చారిత్రక నేపథ్యం ఏంటో తెలుసుకుందామా?

కోరిన వారికి కొంగుబంగారంగా వరాలు ఇచ్చే మహిమాన్విత శక్తి దేవత గట్టమ్మతల్లి ఆలయం ములుగు జిల్లాలో ఉంది. వివిధ ప్రాంతాల్లో గట్టమ్మ తల్లికి ఆలయాలు ఉన్నప్పటికీ ములుగు గట్టమ్మ తల్లికి ఇంచుమించు సమ్మక్క, సారలమ్మ తల్లులంత వైభవం ఉంటుంది.గట్టమ్మ తల్లికి తొలి పూజలు జరిపాకే భక్తులంతా మేడారానికి వెళ్తారు.ఈ ఆలయం గేట్ వే ఆఫ్ మేడారంగా ప్రసిద్ధి చెందింది. మేడారం గిరిజన రాజ్యంకోసం సాగించిన యుద్ధంలో సమ్మక్క తల్లికి గట్టమ్మ తల్లి అంగరక్షకురాలిగా ఉంది. అసమాన ధైర్య పరక్రమాలతో అనుపమ త్యాగశీలంతో శత్రువులతో రణం చేసి గొప్ప యుద్ధ వీరవనితగా పేరు తెచ్చుకొని చరిత్రకెక్కింది.

గట్టమ్మ తల్లితో పాటు అంగరక్షకులుగా సురపల్లి సురక్క,మారపల్లి మారక్క,కోడూరు లక్ష్మక్క తదితరులు సమ్మక్క తల్లిని యుద్ధంలో శత్రువుల ఆయుధాల దాడి నుంచి కాపాడుతూ తమ ప్రాణాలని పణంగా పెట్టి అమరులయ్యారు. అందుకే శ్రీ రామునికి నమ్మిన బంటుగా ఉన్న ఆంజనేయుడు, శివునికి నమ్మిన బంటుగా ఉన్న నందీశ్వరుడు పూజలు అందుకుంటున్నట్లుగా, వన దేవతలకు నమ్మిన బంటు అయిన గట్టమ్మ తల్లి సమ్మక్క సారలమ్మ తల్లులతో సమానంగా పూజలందుకుంటున్నట్లు భక్తులు చెబుతారు.

అందుకే ఈ అమరవీరులను కూడా గిరిజన దేవతలుగా మలుచుకొని వారికి గుడులు కట్టి వారి యొక్క స్మృతికి నివాళులుగా వారికి పూజలు చేస్తున్నారు. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడితో జరిగిన యుద్ధంలో సమ్మక్క తల్లి కుటుంబంతో పాటు ఎంతోమంది ఆదివాసి కోయ గిరిజనులు అమరులైనప్పటికీ వారందరి కన్నా గట్టమ్మ తల్లికి ఎక్కువ కీర్తి దక్కింది.అదంతా కూడా గట్టమ్మతల్లికి నమ్మిన బంటు కావడం గట్టమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుంటే సమ్మక్క-సారలమ్మ దేవతలను దర్శించుకున్నంత పుణ్యఫలం వస్తుందని భక్తుల నమ్మకం.గట్టమ్మ తల్లికి గిరిజన పూజ సాంప్రదాయంతో నాయక పోడు పూజారులు పూజలు నిర్వహిస్తారు.

పెళ్లికాని యువతులు మంచి భర్త దొరకాలని, సంతానం లేని మహిళలు సంతానం కలగాలని, అన్నదాతల పంటలు మంచిగా పండాలని, తల్లితండ్రులు తమ పిల్లలు మంచిగా ఉండాలని, విద్యార్థులు చదువుల్లో మంచి ప్రతిభ కనబర్చి ఉద్యోగం సాధించాలని ఇలా అనేకమంది తమ సమస్యలను పరిష్కరించాలనీ గట్టమ్మ తల్లికి మొక్కుకుంటూ వరాలందుకుంటారు. అలాగే కొత్త వాహనాలు కొనుక్కున్నవారు గట్టమ్మ తల్లి వద్ద పూజలు చేయించుకుని ఆ తల్లి గద్దె చుట్టూ ప్రదక్షిణలు చేసి తల్లికి ప్రీతిపాత్రమై అనుగ్రహం పొంది తమ జీవితాల్లో విజయాలు సాధించుకుంటున్నారు. అందుకే ములుగు గట్టమ్మ తల్లి గుడి మరోశక్తిపీఠంగా ఎంతోమంది భక్తుల నిత్య పూజలు అందుకుంటోంది.

గట్టమ్మ తల్లి పూజల్ని గిరిజన పూజా సంప్రదాయంలో నాయకపోడు పూజారులు నిర్వహిస్తారు. గట్టమ్మ తల్లి దేవతను గిరిజన పూజారులు మేడారం మార్గంలోని గండికామారం, కాలువపల్లి అడవి మార్గాల్లో, జంగాలపల్లి ఆవల ములుగు ప్రేమనగర్ వద్ద ఇంకా తదితర ప్రాంతాల్లో ప్రతిష్ఠించి సమ్మక్క, సారలమ్మల దేవతల అనుబంధ దేవతగా గట్టమ్మ తల్లికి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. గట్టమ్మ తల్లి కూడా కోరినవారికి కొంగు బంగారంగా వరాలిచ్చే మహా మహిమాన్విత శక్తి దేవత అయినందున ఆ తల్లిని ఆయా ప్రాంతాల్లో నిత్యం భక్తిశ్రద్ధలతో కొలుస్తూ తల్లి దేవత కృపకు పాతృలై పలువురు భక్తులు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లాపాపలతో పాడి పంటలతో సుఖసంతోషాలతో చల్లగా వర్థిల్లుతున్నారు. దీంతో సమ్మక్క, సారలమ్మ తల్లుల భక్తులంతా గట్టమ్మ తల్లి భక్తులయ్యారు.గట్టమ్మ తల్లి కూడా కోరిన వారికి కొంగుబంగారంగా వరాలు ఇచ్చే మహిమ శక్తి దేవత అయినందువల్ల మేడారం వెళ్లే భక్తులు ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో కొలుస్తున్నారు.

🌹 🌹 🌹 🌹 🌹

రామ మందిర 2వ వార్షిక స్థాపన దినోత్సవ శుభాకాంక్షలు Greetings on 2nd Anniversary of the Ram Mandir establishment


🌹 రామ మందిర 2వ వార్షిక స్థాపన దినోత్సవ శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్ భరద్వాజ



🌹 Happy 2nd Anniversary of the Ram Mandir establishment to everyone 🌹

Prasad Bharadwaj


సంక్రాంతికి ఈ 6 ఆలయాలు దర్శిస్తే విశేష ఫలితాలు / Visiting these 6 temples during Sankranthi yields blessings


🌹 సంక్రాంతికి ఈ 6 ఆలయాలు దర్శిస్తే విశేష ఫలితాలు 🌹
ప్రసాద్ భరద్వాజ


🌹 Visiting these 6 temples during Sankranthi yields special blessings 🌹
Prasad Bharadwaj


సంక్రాంతి పండుగను సాధారణంగా పంటల పండుగగా మాత్రమే చూసినా, భక్తుల దృష్టిలో ఇది ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైన కాలం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి ఉత్తరాయణం ప్రారంభమయ్యే ఈ సమయంలో చేసిన పూజలు, దర్శనాలు విశేష ఫలితాలు ఇస్తాయని శాస్త్రాలు చెబుతాయి.

అందుకే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటే పండుగ సందడితో పాటు దేవాలయాల వైపు భక్తుల ప్రవాహం కూడా ఉద్ధృతంగా కనిపిస్తుంది. ఈ పుణ్యదినాల్లో శివ-కేశవుల ఆరాధనతో పాటు సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడం అత్యంత శుభప్రదమని విశ్వసిస్తారు. సంక్రాంతి రోజుల్లో కొన్ని ప్రత్యేక ఆలయాలను దర్శిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబ సుఖశాంతులు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో సంక్రాంతి సమయంలో తెలుగు రాష్ట్రాల్లో తప్పకుండా దర్శించాల్సిన ఆరు ప్రధాన ఆలయాలు భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి..

ముందుగా చెప్పుకోవాల్సింది శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని ఏకైక పురాతన సూర్య దేవాలయం. మకర సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయంలో ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలు ఎంతో ప్రాముఖ్యత కలవిగా భావిస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి, ఆర్థిక అభివృద్ధి కోరుకునే భక్తులు ఈ రోజున సూర్యుని దర్శించుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం.

కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం కూడా సంక్రాంతి వేళ ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. కొత్త ఆరంభాలకు సంకేతమైన ఈ పండుగ రోజున లక్ష్మీదేవితో కూడిన వేంకటేశ్వరుడిని దర్శించుకోవడం వల్ల ధనధాన్య వృద్ధి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా వ్యాపారులు, ఉద్యోగస్తులు ఈ రోజున స్వామివారి దర్శనాన్ని అత్యంత శుభంగా భావిస్తారు.

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం కూడా సంక్రాంతి సమయంలో భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ రోజున శివుడికి అభిషేకం చేయడం వల్ల పాపనాశనం, మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల విశ్వాసం. కుటుంబ సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులతో బాధపడేవారు శ్రీశైల దర్శనంతో ఉపశమనం పొందుతారని భావిస్తారు.

తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం సంక్రాంతి రోజున ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నూతన ఆలయ నిర్మాణం తర్వాత ఈ క్షేత్ర వైభవం మరింత పెరిగింది. సంక్రాంతి నాడు నరసింహ స్వామిని శాంత రూపంలో దర్శించుకోవడం వల్ల భయాలు తొలగి ధైర్యం, మనోబలం పెరుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. గ్రహ దోష నివారణకు కూడా ఈ క్షేత్రం ప్రసిద్ధి.

విద్యాభ్యాసానికి ప్రసిద్ధి చెందిన బసర జ్ఞాన సరస్వతి ఆలయం కూడా సంక్రాంతి సమయంలో భక్తులతో కళకళలాడుతుంది. గోదావరి తీరంలో కొలువైన సరస్వతీ దేవిని ఈ రోజున దర్శించుకుంటే విద్యలో ప్రగతి సాధిస్తారని నమ్మకం. పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఆశీస్సులు పొందడానికి ఇది అనుకూల క్షేత్రంగా భావిస్తారు.

అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం సంక్రాంతి పర్వదినంలో మరో ముఖ్యమైన గమ్యస్థానం. రత్నగిరిపై వెలసిన సత్యదేవుడు కోరిన కోర్కెలు తీర్చే దైవంగా ప్రసిద్ధి. ఈ రోజున సత్యనారాయణ వ్రతం ఆచరిస్తే కుటుంబ సుఖశాంతులు, శుభకార్యాలు సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ముఖ్యంగా కుటుంబ సమేతంగా వెళ్లే వారికి అన్నవరం విశేష అనుభూతిని అందిస్తుంది.

🌹🌹🌹🌹🌹



ఆలయ దర్శనం తర్వాత వెంటనే చేతులు–కాళ్లు కడగాలా? Should one wash their hands & feet immediately after visiting the temple?



🌹 ఆలయ దర్శనం తర్వాత వెంటనే చేతులు–కాళ్లు కడగాలా? సంప్రదాయం ఏమి చెబుతోంది 🌹
✍️ ప్రసాద్ భరధ్వాజ


🌹 Should one wash their hands & feet immediately after visiting the temple? What does tradition say? 🌹
✍️ Prasad Bharadwaj




భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఆలయ దర్శనానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గుడికి వెళ్లడం అంటే కేవలం పూజ చేసి రావడం మాత్రమే కాదు; మనసును శుద్ధి చేసుకుని, లోపల ఉన్న అశాంతిని తగ్గించుకునే ఒక ప్రక్రియగా పెద్దలు భావించారు. ఈ క్రమంలో, గుడి దర్శనం పూర్తయ్యాక వెంటనే చేతులు, కాళ్లు కడగకూడదని కొందరు పండితులు సూచిస్తుంటారు. ఆలయంలో గడిపిన సమయంలో మన శరీరం, మనస్సు ఒక సానుకూల స్థితిలోకి వెళ్తాయని, అక్కడి దైవసన్నిధి వల్ల ఏర్పడిన పవిత్రతను వెంటనే నీటితో తొలగించకూడదనే భావన దీనికి ఆధారం. అందుకే ఈ విషయంపై చాలామందిలో సందేహాలు ఏర్పడుతుంటాయి.

పండితుల వివరణ ప్రకారం, గుడిలో చేసే ప్రదక్షిణలు, పూజా విధానాలు కేవలం శారీరక చర్యలు కావు. ఆలయ ప్రాంగణంలో నడిచే సమయంలో, పాదాలు అక్కడి పవిత్ర నేలను తాకడం ద్వారా ఒక రకమైన ప్రశాంతత మన శరీరంలోకి చేరుతుందని నమ్మకం. అలాగే దీపాల వెలుగు, ధూప వాసన, మంత్రోచ్చారణల ధ్వని కలిసి మనస్సును ఒక ధ్యాన స్థితికి తీసుకెళ్తాయని చెబుతారు. ఈ సమయంలో గ్రహించిన ఆ భావాన్ని దర్శనం పూర్తైన వెంటనే కడుక్కోవడం ద్వారా తగ్గించుకుంటే, ఆధ్యాత్మిక అనుభూతి త్వరగా మసకబారుతుందని సంప్రదాయ విశ్వాసం.

అందుకే గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతసేపు ఆ ప్రశాంతతలోనే ఉండాలని పెద్దలు సూచిస్తారు. సాధారణంగా 15 నుంచి 20 నిమిషాల వరకు చేతులు, కాళ్లు కడగకుండా ఉండటం వల్ల మనసు నెమ్మదిగా స్థిరపడుతుందని వారు భావిస్తారు. ఆలయ వాతావరణం నుంచి బయటకు వచ్చినప్పటికీ, ఆ భావోద్వేగ అనుభూతి మనతో పాటు కొనసాగాలన్న ఉద్దేశమే ఈ ఆచారం వెనుక ఉంది. ఆధునిక దృష్టితో చూస్తే, ఇది ఒక మానసిక విరామం లాంటిది. గుడి దర్శనం తర్వాత వెంటనే పనులు, ఒత్తిళ్లలో పడిపోకుండా కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండటం మనస్సుకు మేలు చేస్తుందనే భావన ఇందులో దాగి ఉంది.

అయితే దీనిని కఠిన నియమంగా తీసుకోవాల్సిన అవసరం లేదని పండితులే స్పష్టంగా చెబుతారు. పరిశుభ్రత కూడా మన సంస్కృతిలో అంతే ముఖ్యమైన అంశం. ప్రయాణం వల్ల గాని, రద్దీ ప్రాంతాల్లో తిరగడం వల్ల గాని చేతులు మురికి అయితే తప్పకుండా కడుక్కోవాలి. తినే ముందు శుభ్రంగా ఉండటం ఆరోగ్యానికి అవసరం. ఆధ్యాత్మికత పేరుతో శుభ్రతను విస్మరించడం సరైనది కాదని వారు హెచ్చరిస్తున్నారు.

మొత్తానికి, గుడి దర్శనం తర్వాత వెంటనే చేతులు–కాళ్లు కడగకూడదన్నది ఒక ఆధ్యాత్మిక సూచనగా మాత్రమే చూడాలి. ఇది ప్రతి వ్యక్తి విశ్వాసం, భక్తి లోతుపై ఆధారపడి ఉంటుంది. ఎవరి నమ్మకాలను వారు గౌరవించుకోవడం అవసరం. భక్తి మరియు పరిశుభ్రత – ఈ రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇవ్వడమే మన సంప్రదాయం యొక్క అసలైన ఆత్మ. దర్శనం తర్వాత కొంతసేపు మనసులో ఆధ్యాత్మిక ప్రశాంతతను నిలుపుకోవడం మంచిదే, అదే సమయంలో ఆరోగ్యం, శుభ్రత అవసరమైన చోట తగిన నిర్ణయం తీసుకోవడమే సమతుల్యమైన మార్గం. భక్తి అంటే అంధంగా నియమాలను పాటించడం కాదు; వాటి భావాన్ని అర్థం చేసుకుని జీవితంలో అన్వయించుకోవడమే నిజమైన భక్తి.

🌹🌹🌹🌹🌹


గుండెలపై కాదు... తలపై కుంపటి, Not on hearts... On the head,


గుండెలపై కాదు... తలపై కుంపటి,

ఈ గుడి - "తెలంగాణ కంచి" శ్రీ వరదరాజ పెరుమాళ్ దేవాలయం, వరదరాజపురం


ఈ దేవాలయంకి వెళ్లే దారి:-

E.C.I.L క్రాస్ రోడ్ నుంచి కుశాయిగుడా, కీసర గ్రామాలు దాటి అంకిరెడ్డిపల్లె చౌరస్తాకి వెళ్లాలి. అక్కడ నుంచి మూడుచింతల క్రాస్ రోడ్ చేరుకుని, కరకపట్ల ఊరు దాటాలి. ఆ తరువాత 8 కి.మీ. వెళ్తే వరదరాజుపురం వస్తుంది.

ఓ 40 కి.మీ. ప్రయాణించాలి. దారి బాగుంటుంది. లేదా షామీర్ పేట దాటి ప్రజ్ఞాపూర్ చౌరస్తా వెళ్లి, అక్కడ కుడివైపుకి తిరిగి 12 కి.మీ. వెళ్తే వరదరాజ పురం చేరుకోవచ్చు. ఈ దారిలో సిద్ధిపేట - భోనగిర్ బస్సులు కూడా వెళ్తాయి

గూడ పెరుమాళ్లు పంతులు తలపై కుంపటి...;
చేతుల్లో వరదరాజపెరుమాళ్ దేవతా మూర్తి...;
కుంపట్లో కణకణలాడే నిప్పు కణికలున్నాయి...;

ఆయన కళ్లలో మాత్రం మిలమిలలాడే ధృడతసంకల్పం, తళతళలాడే దృఢనిశ్చయం ఉన్నాయి...;

జనం వేల సంఖ్యలో పోగై పెరుమాళ్ ను చూస్తున్నారు...; పెరుమాళ్ చేతులోని పెరుమాళ్ ను చూస్తున్నారు. భక్తితో జోతలు చేస్తున్నారు. పారవశ్యంతో జోహార్లు చేస్తున్నారు.

అక్కడ గోల్కొండ నవాబు సైన్యం మొహరించింది. జాగీర్దారు ఓ కుర్చీపై కూర్చున్నాడు. కంచికి వెళ్లి, వరదరాజ పెరుమాళ్ ని దర్శించి, వస్తూ వస్తూ నా ఊరిలోనూ వరదరాజ పెరుమాళ్ల గుడి కట్టుకుంటానని "గూడ పెరుమాళ్ల పంతులు" అనుకున్నాడు. అనుకోవడమేమిటి... వరదరాజపెరుమాళ్ విగ్రహాన్ని చేయించుకుని, అపార భక్తి శ్రద్ధలతో, అనంత పారవశ్యంతో తలపై మోసుకొచ్చాడు.

సరిగ్గా మెదక్ జిల్లా జగదేవపూర్ మండలానికి వచ్చే సరికి నవాబు సైనికులు ఆగమన్నారు. విగ్రహాన్ని పెట్టడాన్ని, గుడి కట్టటాన్ని ఒప్పుకునేది లేదని దబాయించారు. నా దేవుడి గుడిని నేను కట్టుకుంటాను. నన్నూ నా దేవుడిని వదిలేయండి అని పెరుమాళ్లు పంతులు వేడుకున్నాడు. ఆ వెర్రి బాపడిని చూసి నవాబు సైనికులు పగలబడి నవ్వారు. జాగిర్దారు తలపై కణకణమండే బొగ్గుల కుంపటిని మోసుకుని నడిస్తే గుడి కట్టుకునేందుకు అనుమతినిస్తానన్నాడు. పెరుమాళ్లు పంతులు అంతే పట్టుదలగా నా పెరుమాళ్లుకి ఈ పెరుమాళ్లు భక్తుడు. నా భక్తే నిజమైతే నడవటం ఏమిటి... పరిగెడతాను కూడా అన్నాడు.

అయితే ఒక షరతు... కుంపట్లో బొగ్గు మసి కాకూడదు. నీకు వేడి తగలకూడదు

నా పెరుమాళ్లు ప్రహ్లాదుడిని రక్షించాడు. గజేంద్రుడిని కాపాడాడు. నన్నూ కాపాడతాడు

పాగల్ బొమ్మన్... పగలబడి నవ్వాడు జాగిర్దారు.


నాదీ ఒక షరతుంది ఒప్పుకుంటావా!? జాగీర్దార్ సాబ్.. పెరుమాళ్లు గొంతు పెనుసింహం గర్జనలా గర్జించింది...

నేను కుంపటి తలకెత్తుకుని ఎంత దూరం నడుస్తానో అంత మేర భూమిని నాకిచ్చేయాలి. నా దేవుడికి గుడి కట్టుకునేందుకు ఆ భూమి నాకిచ్చేయాలి.

సరే ...కానిమ్మన్నాడు జాగిర్దార్. జాగిర్దార్ ది హిరణ్యకశిపుడి అహంకారం. పెరుమాళ్లుది ప్రహ్లాదుడి భక్తి...

పెరుమాళ్లు నడిచాడు... నడిచాడు... రోజు రోజంతా నడుస్తూనే ఉన్నాడు. అలసట లేదు. ఆయాసం లేదు. ఆగడం అంతకన్నా లేదు. అమ్మా అనలేదు. అయ్యో అనలేదు. వరదరాజ స్వామి వరద హస్తం తలపైనుందో లేక నరసింహుడే అవరించాడో తెలియదు కానీ 1,500 ఎకరాలు చుట్టివచ్చి, జాగిర్దారు ముందు కుంపటి దించాడు. బొగ్గు బూడిద కాలేదు. కణకణ మండుతూనే ఉంది. పెరుమాళ్లు తలపై కనీసం మాడినట్టుగా మచ్చ లేదు. ఖంగుతిన్న జాగీర్దార్ తూ జీత్ గయారే బొమ్మన్ అని గుడి కట్టుకోవడానికి అనుమతిచ్చాడు. అంతే కాదు... 1,500 ఎకరాలూ వదులుకున్నాడు.

ఆ 1,500 ఎకరాల్లో ఒక్క అంగుళం కూడా తన కోసం దాచుకోలేదు పెరుమాళ్లు పంతులు. మొత్తం గుడి కట్టించాడు. సువిశాలమైన గుడి, బృహదాకారపు కోనేరు, వసతి గృహాలు, విశ్రామ మంటపాలు, మహాసింహద్వారం, పెద్ద రాజ గోపురం, వాహనాల మంటపం, రథాల మంటపం చూస్తే పెరుమాళ్లు పంతులు సమర్పణ భావం కనిపిస్తుంది. తన సంపదను దేవుడికి పెట్టాడు. నగలు, కిరీటాలు, వడ్డాణాలు, యజ్ఞోపవీతాలు చేయించాడు. 16 మంది పూజారుల్ని పెట్టాడు. పండగలు, పబ్బాలు, జాతరలు, తీర్థాలకు లోటు లేకుండా చేశాడు. వరదరాజుల వారికి రక్షణగా ఊరి మొదట్లో అంజనేయ స్వామిని కూడా ప్రతిష్ఠించాడు.

ఊళ్లో గుడి వెలియలేదు. గుడి చుట్టూ ఊరు వెలిసింది. వరదరాజ స్వామి పేరిట వరదరాజపురం ఏర్పాటైంది. మెదక్ జిల్లా జగదేవ్ పూర్ మండలంలో వరదరాజు ఇప్పటికీ ఉన్నాడు. పెరుమాళ్లు పంతులు వారసులు 450 ఏళ్లుగా సేవలందిస్తూనే ఉన్నారు. పరంపరాగత ధర్మకర్తలుగా కొనసాగుతూనే ఉన్నారు. వారిప్పుడు మౌలాలీ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉంటున్నారు. అలనాటి పూజారుల వారసులే ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు. దేవుడిని నమ్ముకుని పూజలు చేస్తూనే ఉన్నారు.

ఇదంతా 450 ఏళ్ల క్రితం సంగతి. ఇదంతా కట్టుకథ అనుకునేవాళ్లు, స్థానిక జనసందోహం చేసిన ధార్మిక విప్లవానికి ముస్లిం నవాబు తలొగ్గాడని టీకా చెప్పుకోవచ్చు. రామదాసు భద్రాచలం గుడి కట్టడం హైందవ జన చైతన్యానికి ఎలా ప్రతీకో, వరదరాజపురం గుడి కూడా అలాగే ఒక ధార్మిక జన విప్లవ ప్రతీక. అయితే ఇప్పటి తరానికి ఈ గుడి కథ తెలియదు. దీని గొప్పదనం తెలియదు. ఎప్పుడైనా రాత్రి నిద్ర చేయాల్సి వస్తే మాత్రం పది ఊళ్లకి వరదరాజస్వామే దిక్కు.

టాల్స్టాయ్ కథ ఒకటుంది. ఓ రైతు రోజంతా ఎంత మేర నడిస్తే అంత భూమి ఇస్తానని జమీందారు చెపుతాడు. అయితే మొదలుపెట్టిన చోటకి తిరిగి రావాలని షరతు పెడతాడు. ఆశ, ఆత్రం కలగలిసి రైతు పరుగు పెట్టి పెట్టి చివరికి గమ్యం చేరకుండానే చనిపోతాడు. వరదరాజపురం లో పెరుమాళ్లు పంతులు కూడా రోజంతా తిరిగాడు - అదీ తలపై కుంపటిపెట్టుకుని... ఈయన చనిపోలేదు. ఈ గుడి రాతి బండల్లో, స్తంభాల్లో, గోపురంలో, పునాదిరాయిలో ఇంకా బతికే ఉన్నాడు. తన కోసం చేసుకునే దానికి, ధర్మం కోసం చేసే దానికి ఉన్న తేడా అది.

మీరు ఈ దేవాలయాన్ని దర్శించండి. ఆ స్వామినే నమ్ముకుని ఆ దేవాలయంలో స్వామీ సేవ చేస్తున్న వంశపారంపర్య అర్చకులకు దక్షిణ ఇచ్చి వారికి ఇతోధికంగా సహాయం చేయండి. మీ మిత్రులతో మరియు సన్నిహితులతో ఈ దేవాలయం గురించి హి వివరించండి. ఈ క్షేత్రం "తెలంగాణా కంచి" వరదరాజ దేవాలయంగా మారడానికి కృషి చేద్దాము_


గ్రహదోష నివారణ

గ్రహదోష నివారణ

🌴🌿🌴🌿🌴🌿🌴🌿🌴

*ద్రాక్షారామ చుట్టుపక్కల అనేక శివాలయాలు దేవీమందిరాలు ఉన్నాయని అందరికి తెలిసిన విషయమే.*

*ఆ ఆలయాలన్నిటిని ఆకాశమార్గాన చూస్తే అన్ని కలిపి ఒక పద్మాకారం లో వుంటాయి. ఈ ఆలయాల గురించి బహుళ ప్రాచుర్యం లేనందున చాల మందికి ఈ ఆలయాల గురించిన అవగాహన లేదు.*

*విశేషమేమిటంటే, ప్రతి వ్యక్తి 27 నక్షత్రాలు లో ఉన్న 108 పాదాలలో ఏదో ఒక దానిలో జన్మిస్తారు. ప్రతి నక్షత్రానికి దానికి సంబంధించిన ప్రతి పాదానికి సంబంధించి ప్రత్యేకమైన ఆలయం ఉంటుంది*

*గ్రహదోష నివారణ కోసం  అభిషేకాలు చేయ దలుచుకున్న వారికి ఆ ప్రత్యేకమైన ఆలయంలో మొదట నామ నక్షత్రము,  లేదా జన్మనక్షత్రానికి తరువాత రాశికి సంబంధించిన లింగ ఆరాధన చేసి చివరకు ద్రాక్షారామం దర్శించుకుంటే ఫలితం ఉంటుందట .*

*మేషరాశి నుండి మీనరాశి వరకు అదే క్రమంలో ఆరాధించ వలసిన ఆలయాల సమాచారం.*

*మేష రాశి*
మేషరాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామం భీమేశ్వర స్వామి వారి ఆలయానికి తూర్పున విలాసగంగావరంలో వుంది. 

*అశ్విని నక్షత్రం*
మొదటి పాదం ---------బ్రహ్మపురి-------శ్రీశ్రీశ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి
రెండవ ------- - ఉట్రుమిల్లి -------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భీమశంకర స్వామి
మూడవ------    కుయ్యూరు    శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
నాలుగవ    దుగ్గుదూరు   శ్రీశ్రీశ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

*భరణి నక్షత్రం*
మొదటి------కోలంక---------శ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామి
రెండవ-------ఎంజారం-------శ్రీ ఉమా సమేత కృపేశ్వర స్వామి
మూడవ------పల్లిపాలెం------శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి
నాలుగవ------ఉప్పంగళ-------శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి

*కృత్తికా నక్షత్రం*
మొదటి-------నేలపల్లి---------శ్రీ మీనాక్షి దేవి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి.

*వృషభ రాశి*
ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి తూర్పున వృషభ రాశికి సంబంధించిన ఆలయం విలాసగంగావరం లో ఉన్నది.

*కృత్తికా నక్షత్రం*
రెండవ------అదంపల్లి------శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
మూడవ-----వట్రపూడి------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
నాలుగవ-----ఉండూరు------శ్రీ ఉమా సమేత శ్రీ మార్కండేయ స్వామి

*రోహిణీ*
మొదటి-----తనుమల్ల--------శ్రీ పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి
రెండవ-------కాజులూరు-------శ్రీ అన్నపూర్ణేశ్వరీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి
మూడవ------ఐతపూడి--------శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
నాలుగవ -----  చీల    ---------శ్రీ ఉమా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

*మృగశిర*
మొదటి--------తాళ్ళరేవు------శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి.
రెండవ---------గురజానపల్లి------శ్రీ ఓం శ్రీ సర్వమంగళ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి

*మిధున రాశి.*
ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఈశాన్యమున మిధున రాశికి సంబంధించిన ఆలయం హసనాబాద్ లో ఉన్నది.

*మృగశిర*
మూడవ-------- అంద్రగ్గి-------శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
నాలుగవ--------జగన్నాధగిరి------ శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి

*ఆరుద్ర*
మొదటి-------పనుమళ్ళ------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
రెండవ--------గొల్లపాలెం------శ్రీ పార్వతీ సమేత గోకర్ణేశ్వర స్వామి
మూడవ----వేములవాడ-----శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి
నాలుగవ------కూరాడ----------శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి

*పునర్వసు*
మొదటి-------గొర్రిపూడి (భీమలింగపాడు)----శ్రీ పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి
రెండవ--------కరప----------శ్రీ పార్వతవర్ధి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
మూడవ------ఆరట్లకట్ల------ శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లీశ్వర స్వామి
  
*కర్కాటక రాశి*

ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరమున కర్కాటక రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఇక్కడి ఆలయం వెల్ల లో శ్రీ ఉత్తర సోమేశ్వర స్వామి వారికి అంకితం.

*పునర్వసు*
నాలుగవ------యెనమాడల--------శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

*పుష్యమి*
మొదటి--------కాపవరం-------శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి
రెండవ---------సిరిపురం-------శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి
మూడవ-------వేలంగి----------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భవానీ శంకర స్వామి
నాలుగవ--------ఓడూరు--------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భవానీ శంకర స్వామి

*ఆశ్లేష*
మొదటి-------- దోమాడ--------శ్రీ ఉమా సమేత శ్రీ మార్కండేశ్వర స్వామి
రెండవ---------పెదపూడి-------శ్రీ శ్యామలాంబా సమేత శ్రీ సోమేశ్వర స్వామి
మూడవ-------గండ్రాడు--------శ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామి
నాలుగవ-------మామిడాడ-------శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీశ్రీ భీమేశ్వర స్వామి

*సింహ రాశి*
ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరమున సింహ రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఇక్కడి ఆలయం వెల్ల లో శ్రీ ఉత్తర సోమేశ్వర స్వామి వారికి అంకితం.

*మఖ నక్షత్రం*
మొదటి------నరసరావుపేట------శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
రెండవ--------మెల్లూరు------------శ్రీ విశాలాక్షీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి
మూడవ------అరికిరేవుల----------శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి
నాలుగవ------కొత్తూరు------------శ్రీ పార్వతీ సమేత శ్రీ నాగలింగేశ్వర స్వామి

*పుబ్బ నక్షత్రం*
మొదటి--------చింతపల్లి---------శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి
రెండవ---------వెదురుపాక------శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి
మూడవ--------తొస్సిపూడి-------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ గోరేశ్వర స్వామి
నాలుగవ--------పొలమూరు-----ఉమా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

*ఉత్తర నక్షత్రం*
మొదటి----------పందలపాక--------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

*కన్యా రాశి*
ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి వాయవ్యమున కన్యా రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఈ ఆలయం యూరుపల్లిలోని శ్రీ రాజరాజేశ్వరీ సమేత నీలకంఠేశ్వర స్వామి వారికి అంకితం చేయబడ్డది.

*ఉత్తర నక్షత్రం*
రెండవ---------చోడవరం---------శ్రీ పార్వతీ సమేత శ్రీ అగస్త్తేశ్వర స్వామి
మూడవ-----నదురుబాడు--------శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
నాలుగవ------పసలపూడి---------శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ రాజరాజేశ్వరుడు

*హస్త*
మొదటి------సోమేశ్వరం--------శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
రెండవ-------పడపర్తి------------శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరుడు
మూడవ------పులగుర్త-----------శ్రీ పార్వతీసమేత శ్రీ వీరేశ్వర స్వామి
నాలుగవ------మాచవరం-------శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి

*చిత్త నక్షత్రం*
మొదటి-------కొప్పవరం--------శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
రెండవ--------అర్థమూరు-------శ్రీ పార్వతీ సమేతశ్రీ అగస్తేశ్వర స్వామి

*తుల రాశి*
ద్రాక్షారామానికి పడమరగా  వున్న ఆదివారపుపేట లో తులారాశికి సంబంధించిన ఆలయం ఉన్నది.

*చిత్త నక్షత్రం*
మూడవ-------చల్లూరు------------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి
నాలుగవ-------కాలేరు--------శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

*స్వాతి నక్షత్రం*
మొదటి--------మారేడుబాక---శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి
రెండవ---------మండపేట------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ అగస్తేశ్వర కైలాసేశ్వర స్వామి
మూడవ-------గుమ్మిలూరు----శ్రీ ఉమాసమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
నాలుగవ------వెంటూరు-------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

*విశాఖ నక్షత్రం*
మొదటి-----దూళ్ళ-------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి
రెండవ------నర్సిపూడి----శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామి
మూడవ-----నవాబుపేట----శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామి

*వృశ్చిక రాశి*
ద్రాక్షారామానికి పడమరగా వున్న ఆదివారపుపేట లో వృశ్చికరాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఈ ఆలయం శ్రీ పార్వతీ సమేత పరమేశ్వరునికి అంకితం.

*విశాఖ నక్షత్రం*
నాలుగవ-------కూర్మపురం------శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

*అనూరాధా నక్షత్రం*
మొదటి------పనికేరు--------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ ఇష్టకాంతేశ్వర స్వామి
రెండవ-------చింతలూరు-----శ్రీ పార్వతీ సమేత శ్రీ పృధ్వీశ్వర స్వామి
మూడవ-----పినపల్ల---------శ్రీ పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి
నాలుగవ-----పెదపల్ల-------శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

*జ్యేష్టా నక్షత్రం*
మొదటి------వడ్లమూరు------శ్రీ పార్వతీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి
రెండవ--------నల్లూరు---------శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
మూడవ------వెదురుమూడి---శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
నాలుగవ----- తేకి--------------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వరస్వామి

*ధనుస్సు రాశి*
ధనుస్సు రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి నైఋతి లోఉన్నది.  నేలపర్తిపాడులోని శ్రీ అన్నపూర్నాసమేత కాశివిశ్వేశ్వర స్వామికి అంకితం

*మూల నక్షత్రం*
మొదటి---------యెండగండి-------శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
రెండవ----------పామర్రు-----------శ్రీ ఉమాపార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
మూడవ--------అముజూరు--------శ్రీ ఉమాపార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
నాలుగవ--------పానంగిపల్లి--------శ్రీ లలితాంబికా సమేత శ్రీ ఉత్తరేశ్వర స్వామి

*పూర్వాషాఢ*
మొదటి---------అంగర-----------శ్రీ పార్వతీ సమేత శ్రీ కనకలింగేశ్వర స్వామి
రెండవ---------కోరుమిళ్ళ--------శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
మూడవ-------కుళ్ళ-------------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
నాలుగవ-------వాకతిప్ప--------శ్రీ ఉమాసమేత రామలింగేశ్వర స్వామి

*ఉత్తరాషాఢ*
మొదటి-------తాతపూడి---------శ్రీ పార్వతీసమేత శ్రీ మల్లేశ్వర స్వామి

*మకర రాశి*
మకర రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణం ఉన్నది.  కుందలమ్మ చెరువులోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడ్డది ఈ ఆలయం.

*ఉత్తరాషాడ నక్షత్రం*
రెండవ---------మచర--------శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
మూడవ-------సత్యవాడ------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
నాలుగవ-------సుందరపల్లి----శ్రీ ఉమాసమేత శ్రీ సోమేశ్వర స్వామి

*శ్రవణ నక్షత్రం*
మొదటి-------వానపల్లి-------శ్రీ ఉమాసమేత శ్రీ వైద్యనాధీశ్వర స్వామి
రెండవ--------మాదిపల్లి (మాడుపల్లి)---  శ్రీ పార్వతీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి
మూడవ------వాడపాలెం-------శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ వీరేశ్వర స్వామి
నాలుగవ------ వీరపల్లిపాలెం----శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి

*ధనిష్ట*
మొదటి--------వెల్వలపల్లి-------శ్రీ మహిషాసురమర్ధనీ సమేత శ్రీ రాజరాజనరేంద్ర స్వామి
రెండవ---------అయినవెల్లి-------శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి

*కుంభ రాశి*
కుంభ రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణం లోఉన్నది.  కుందలమ్మ చెరువులోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడ్డది ఈ ఆలయం.

*ధనిష్ట*
మూడవ-------మసకపల్లి------శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లికార్జున స్వామి
నాలుగవ-------కుందూరు------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

*శతభష*
మొదటి--------కోటిపల్లి---------శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
రెండవ--------కోటిపల్లి--------  శ్రీ పార్వతీ సమేత శ్రీ కోటేశ్వర స్వామి
మూడవ------తొట్టరమూడి-----శ్రీ భ్రమరాంబా సమేత శ్రీమూల్లేశ్వర స్వామి
నాలుగవ------పాతకోట--------శ్రీ లోపాముద్రా సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి

*పూర్వాభాద్ర*
మొదటి--------ముక్తేశ్వరం-----శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి
రెండవ---------శాసనపల్లి లంక----శ్రీ భ్రమరాంబా సమేత శ్రీశ్రీ చౌడేశ్వర స్వామి
మూడవ--------తానెలంక-----------శ్రీ పార్వతీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి

*మీన రాశి*
మీనరాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణం ఉన్నది.  కుందలమ్మ చెరువులోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడ్డది ఈఆలయం.

*పూర్వాభాద్ర*
నాలుగవ---------ఎర్రపోతవరం------శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లికార్జున స్వామి

*ఉత్తరాభాద్ర*
మొదటి-------డంగేరు-----------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
రెండవ------- కుడుపూరు------- శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి
మూడవ------గుడిగళ్ళ---------శ్రీ ఉమాదేవీ సమేత శ్రీ మార్కండేయ స్వామి
నాలుగవ-----శివల-----------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ త్రిపురాంతక స్వామి

*రేవతి*
మొదటి----భట్లపాలిక-------శ్రీ లోపాముద్ర సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి
రెండవ-----కాపులపాలెం----శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి
మూడవ---- పేకేరు-----------శ్రీ లోపాముద్ర సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి
నాలుగవ---- బాలాంత్రం------శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి.
🌹 🌹 🌹 🌹 🌹
సేకరణ 🙏 ప్రసాద్