🍀 28 - NOVEMBER - 2022 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🍀

🌹🍀 28 - NOVEMBER - 2022 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 28 - NOVEMBER - 2022 MONDAY,సోమవారం, ఇందు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 96 / Kapila Gita - 96 🌹 సృష్టి తత్వము - 52
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 688 / Vishnu Sahasranama Contemplation - 688 🌹
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 135 / Agni Maha Purana - 135 🌹 🌻. ఆలయ ప్రాసాద నిర్మాణము - 1 🌻
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 270 / Osho Daily Meditations - 270 🌹 మనస్సు చేసే మాయలు - MIND TRICKS
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 416-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 416-1 🌹 ‘చిచ్ఛక్తి’ - 1 - 'Chichhakti' - 1

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹28, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
 *మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : వివాహ పంచమి, నాగుల పంచమి, సుబ్రమణ్య షష్టి, Vivah Panchami, Naga Panchami, Subrahmanya Sashti🌻*

*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 9 🍀*

*15. దీర్ఘశ్చ హరికేశశ్చ సుతీర్థః కృష్ణ ఏవ చ | సృగాలరూపః సిద్ధార్థో ముండః సర్వశుభంకరః*
*16. అజశ్చ బహురూపశ్చ గంధధారీ కపర్ద్యపి | ఊర్ధ్వరేతా ఊర్ధ్వలింగ ఊర్ధ్వశాయీ నభస్స్థలః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ద్రష్టగా మారిన నీలోని నిశ్చలత్వం ప్రకృతికి వ్యాపించి ఆ ప్రకృతి కూడ నిశ్చలంగా మారిపోతుంది. అయితే, నీవు కేవలం నిశ్చలుడవుగానే ఉండిపోరాదు. కొన్ని ప్రకృతి వ్యాపారములకు అనుమతి నొసగే అనుమంతవు కూడ కావాలి. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, హేమంత ఋతువు,
దక్షిణాయణం, మార్గశిర మాసం
తిథి: శుక్ల పంచమి 13:36:16 వరకు
తదుపరి శుక్ల షష్టి
నక్షత్రం: ఉత్తరాషాఢ 10:30:31 వరకు
తదుపరి శ్రవణ
యోగం: వృధ్ధి 18:04:03 వరకు
తదుపరి ధృవ
కరణం: బాలవ 13:38:16 వరకు
వర్జ్యం: 14:10:30 - 15:39:06
దుర్ముహూర్తం: 12:26:13 - 13:11:00
మరియు 14:40:34 - 15:25:20
రాహు కాలం: 07:51:57 - 09:15:55
గుళిక కాలం: 13:27:48 - 14:51:45
యమ గండం: 10:39:52 - 12:03:50
అభిజిత్ ముహూర్తం: 11:41 - 12:25
అమృత కాలం: 04:39:40 - 06:07:00
మరియు 23:02:06 - 24:30:42
సూర్యోదయం: 06:28:04
సూర్యాస్తమయం: 17:39:40
చంద్రోదయం: 10:53:04
చంద్రాస్తమయం: 22:16:40
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: మకరం
యోగాలు : కాల యోగం - అవమానం
11:57:00 వరకు తదుపరి సిద్ది యోగం
- కార్య సిధ్ధి , ధన ప్రాప్తి 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. కపిల గీత - 96 / Kapila Gita - 96🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 52 🌴*

*52. ఏకదండం విశేషాభ్యాం క్రమవృద్ధైర్ద శోత్తరైః|*
*తోయాదిభిః పరివృతం ప్రధానేనావృతైర్బహిః|*
*యత్ర లోకవితానోఽయం రూపం భగవతో హరేః॥

*ఈ అండము "విశేషము" అను పేరుతో పిలువబడెను. దీనిలోపల శ్రీహరి స్వరూపమైన పదునాలుగు భువనములు విస్తరించియున్నవి. దీనికి నాలుగు వైపుల క్రమముగా జలము, దానికి పదిరెట్లు అగ్ని, దానికి పదిరెట్లు వాయువు, దానికి పదిరెట్లు ఆకాశము, దానికి పదిరెట్లు అహంకారము, దానికి పదిరెట్లు మహత్తత్త్వము ఆవరించియున్నవి. ఈ ఆఱు ఆవరణములకు వెలుపల ఏడవ ఆవరణమైన ప్రకృతి వెలసియున్నది.*

*దీనినే విశేషమైన అండము అంటాము. బ్రహ్మాండానికి ఏడు పొరలు ఉన్నాయి. పృధ్వి అప్ తేజో వాయు ఆకాశము, అహంకారము, మహత్తు. ఒక ఆవరణ కంటే రెండో ఆవరణ పది రెట్లు ఎక్కువ. పృధువి కన్నా నీరు పది రెట్లు ఎక్కువ. భూమి యాభై కోట్ల విస్తీర్ణం. నీటికన్నా వాయువు పది రెట్లు ఎక్కువ.
ఈ బ్రహ్మాండానికి ఈ ఏడు ఆవరణలూ దాటాక కూడా ఇంకో ఆవరణ ఉన్నది. అదే ప్రధానం (ప్రకృతి). సకల లోకాల విస్తారణం బ్రహ్మ యొక్క రూపమే. నీటిలో ఉన్న హిరణ్మయ రూపమైన బ్రహ్మాండ కోశములోంచి స్వామి బయటకు వచ్చాడు.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 96 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 2. Fundamental Principles of Material Nature - 52 🌴*

*52. etad aṇḍaṁ viśeṣākhyaṁ krama-vṛddhair daśottaraiḥ*
*toyādibhiḥ parivṛtaṁ pradhānenāvṛtair bahiḥ*
*yatra loka-vitāno 'yaṁ rūpaṁ bhagavato hareḥ*

*This universal egg, or the universe in the shape of an egg, is called the manifestation of material energy. Its layers of water, air, fire, sky, ego and mahat-tattva increase in thickness one after another. Each layer is ten times bigger than the previous one, and the final outside layer is covered by pradhāna. Within this egg is the universal form of Lord Hari, of whose body the fourteen planetary systems are parts.*

*This universe, or the universal sky which we can visualize with its innumerable planets, is shaped just like an egg. As an egg is covered by a shell, the universe is also covered by various layers. The first layer is water, the next is fire, then air, then sky, and the ultimate holding crust is pradhāna. Within this egglike universe is the universal form of the Lord as the virāṭ-puruṣa. All the different planetary situations are parts of His body. This is already explained in the beginning of Śrīmad-Bhāgavatam, Second Canto.*

*The planetary systems are considered to form different bodily parts of that universal form of the Lord. Persons who cannot directly engage in the worship of the transcendental form of the Lord are advised to think of and worship this universal form. The lowest planetary system, Pātāla, is considered to be the sole of the Supreme Lord, and the earth is considered to be the belly of the Lord. Brahmaloka, or the highest planetary system, where Brahmā lives, is considered to be the head of the Lord.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 688 / Vishnu Sahasranama Contemplation - 688🌹*

*🌻688. పుణ్యకీర్తిః, पुण्यकीर्तिः, Puṇyakīrtiḥ🌻*

*ఓం పుణ్యకీర్తయే నమః | ॐ पुण्यकीर्तये नमः | OM Puṇyakīrtaye namaḥ*

*కర్మజైర్వ్యాధిభిర్‍బాహ్యైరాన్తరైర్నైవపీడ్యతే ।*
*ఇతి విద్వద్భిరీశానః సోఽనామయ ఇతీర్యతే ॥*

*ఈతని కీర్తిని, యశమును, మహిమను కీర్తించుట వలన జీవులకు పుణ్యము సంప్రాప్తించును. ఈతనిది పుణ్యకరమగు కీర్తి కనుక ఆ విష్ణుదేవుడు పుణ్యకీర్తి అనబడును.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 688🌹*

*🌻688. Puṇyakīrtiḥ🌻*

*OM Puṇyakīrtaye namaḥ*

कर्मजैर्व्याधिभिर्‍बाह्यैरान्तरैर्नैवपीड्यते ।
इति विद्वद्भिरीशानः सोऽनामय इतीर्यते ॥

*Karmajairvyādhibhirˈbāhyairāntarairnaivapīḍyate,*
*Iti vidvadbhirīśānaḥ so’nāmaya itīryate.*

*Of holy fame for praising of fame brings auspiciousness to the men who sing it. Since His' is holy fame, He is called Puṇyakīrtiḥ.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
स्तव्यस्स्तवप्रियस्स्तोत्रं स्तुतिः स्तोता रणप्रियः ।पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः ॥ ७३ ॥
స్తవ్యస్స్తవప్రియస్స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః ।పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ॥ 73 ॥
Stavyasstavapriyasstotraṃ stutiḥ stotā raṇapriyaḥ,Pūrṇaḥ pūrayitā puṇyaḥ puṇyakīrtiranāmayaḥ ॥ 73 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 135 / Agni Maha Purana - 135 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 42*

*🌻. ఆలయ ప్రాసాద నిర్మాణము - 1🌻*

హయగ్రీవుడు పలికెను. - ఇపుడు సర్వసాధారణమైన దేవాలయమును గూర్చి చెప్పదను, వినుము, దేవాలయమును నిర్మింపదలచిన విద్వాంసుడు, నలుపలకలగా ఉన్న క్షేత్రమును పదునారు భాగములుగా విభజింపవలెను. వాటిలో మధ్యనున్న నాలుగు భాగములతో ఆయముతో కూడిన గర్భమును నిశ్చయించి, మిగిలిన పండ్రెండు భాగములను గోడల నిమిత్తము నిర్ణయించుకొనవలెను. పై పండ్రెండు భాగములలో నాలుగు భాగముల పొడవు ఎంత ఉండునో, గోడల ఎత్తు అంత ఉండవలెను. శిఖరము ఎత్తు గోడల ఎత్తునకు రెట్టింపు ఉంచవలెను. శిఖరము ఎత్తులో నాల్గవవంతు ఎత్తు దేవాలయపరిక్రమ ఎత్తు ఉంచవలెను. రెండు పార్శ్వములందును ఉన్న మార్గముల (ద్వారముల) కొలత ఈ కొలతను బట్టియే ఉండవలెను. 

ఆ ద్వారములు సమాన ప్రమాణములై ఉండవలెను. ఆలయము ఎదుటనున్న ప్రదేశము విస్తారము కూడ శిఖరముతో సమానముగా ఉండవలెను. అందముగా ఉండుటకై దాని విస్తారము శిఖతము కంటె రెటింపు ఉండునట్లు కూడ చేయవచ్చును. ఆలయము ఎదుటనున్న సభామండపము విస్తారము, గర్భసూత్రమునకు రెట్టింపు ఉండవలెను. దేవాలయ పాద స్తంభముల పొడవు గోడపొడవుతో సమముగా ఉండవలెను, వాటికి మధ్య స్తంభముల మర్చి అందముగా ఉండు నట్లు చేయవలెను. ముఖమండప ప్రమాణము ఆలయ గర్భ ప్రమాణముతో సమముగా నుండవలెను. పిమ్మట ఎనుబది ఒక్కపదముల వాస్తు మండపమును ఆరంభింపవలెను.

మొదట ద్వారన్యాసము దగ్గరనున్న పదములలో ఉండు దేవతలను పూజింపవలెను. పిమ్మట ప్రాకారవిన్యాసము దగ్గరనున్న దేవతలను, అంతమునందు పదములందు స్థాపింపబడిన ముప్పది ముగ్గురు దేవతలను పూజింపవలెను. ఇది ప్రాసాదముల సర్వసాధారణ లక్షణము. ఇపుడు ప్రతిమా మానాను సారముగ నిర్మించు ఇతర ప్రాసాదములను గూర్చి వినుము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 135 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 42*
*🌻 Construction of a temple - 1 🌻*

Hayagrīva said:

1. Listen to me describing the construction of a temple in general. A wise man should divide a square ground into sixteen parts.

2. One should make the four central squares endowed with. wealth. The other sixteen parts are left for the walls.

3. The pedestal should extend over four squares. The length of the cornice should be double that of the pedestal.

4. The path of circumambulation should be a quarter of (the length) of the cornice. Two equal openings having the same width as the latter, should be left on the two sides for projections

5. The extent of the ground should be made at first equal to the length of the tower or twice that such as it may be beautiful.

6- 7. One should construct the pavilion in front of the sanctum on the lines running parallel through the sides of its inner chamber, adorned with pillars and being of the same length or longer than the principal temple sanctorum by a quarter of its length. The anti-chamber should then be constructed at 81 steps.

8. The deities at the end of the base should be worshipped before placing the parrots at the front door. In the same manner the thirty-two gods at the end should be worshipped when the outer wall is raised.

9. This is the characteristic of a temple in general. Listen to the description (of raising) a temple proportionate to the (size of the) image.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 270 / Osho Daily Meditations - 270 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 270. మనస్సు చేసే మాయలు🍀*

*🕉. ఇది ఆధ్యాత్మిక అన్వేషకులందరి సమస్య: ముందుగానే లేదా తరువాత మనస్సు మాయ ఆటలు ఆడటం ప్రారంభిస్తుంది. 🕉*

*ఎవరైనా వెలుగులను చూస్తారు, ఎవరైనా శబ్దాలు వినడం ప్రారంభిస్తారు, మరొకరు ఇంకేదో అనుభవించడం ప్రారంభిస్తారు. మరియు అహం చెబుతుంది, 'ఇది గొప్ప విషయం - ఇది మీకు మాత్రమే జరుగుతుంది. ఇది అరుదు. నువ్వు ప్రత్యేకమైన వాడివి, అందుకే నీకు ఇలా జరుగుతోంది.' మీరు సహకరించడం ప్రారంభిస్తారు. కానీ దానిపై ఎక్కువ శ్రద్ధ చూపవద్దు - దానిని నిర్లక్ష్యం చేయండి! మీరు పూర్తిగా ఖాళీ అయిపోవాలి. ఆధ్యాత్మికం అని పిలవడానికి విలువైన ఏకైక ఆధ్యాత్మిక అనుభవం శూన్యత. ఈ శూన్యత సూఫీలు ​​ఫనా అని పిలిచే అహంకారం అదృశ్యమయిన స్థితి. అదొక్కటే ఆధ్యాత్మిక అనుభవం - మిగతావన్నీ కేవలం మనస్సు ఆటలు మాత్రమే. మనస్సు అనేక విషయాలను సృష్టించగలదు. మనస్సు భ్రాంతిని ప్రారంభించ వచ్చు; అది దర్శనాలను కలిగి ఉంటుంది, కృష్ణడు లేదా బుద్ధుడిని చూడగలదు. కళ్ళు తెరిచి కూడా కలలు కనే సామర్థ్యం మనస్సుకు ఉంది.*

*నీ ఎదురుగా నిలబడిన కృష్ణుడిని చూస్తే ఎలా నమ్మరు? కానీ మీ ముందు కృష్ణుడు నిలబడడు - ఇది మీ ఊహ మాత్రమే. అందుకే జెన్ గురువులు ఇలా అంటారు. 'బుద్ధుడిని రోడ్డుపై కలిస్తే చంపేయండి!' అని. అవి పూర్తిగా సరైనవే. మీరు బుద్ధుడిని కలిస్తే అతన్ని చంపాలి అని చెప్పడం అపవిత్రంగా, అగౌరవంగా అనిపిస్తుంది, కానీ ఇది నిజం. మీరు మార్గంలో బుద్ధుడిని లేదా కృష్ణుడిని కలుస్తారు -- కానీ అది నిజం కాదు. మీ బాల్యం నుండి మీపై రుద్దబడిన భావాలలో ఏదైనా మీరు చూస్తారు. గొప్ప ఆధ్యాత్మిక గురువులు మరియు టిబెటన్ లామాలు కనిపిస్తారు మరియు గొప్ప ఏదో జరుగుతుందని మీరు అనుకుంటారు. అనేక మంది తెలివితక్కువ వ్యక్తులు మిమ్మల్ని అభినందిస్తున్నట్టుగా మీరు కనుగొంటారు. వాళ్ళు ఇలా అంటారు, 'నీ స్థితి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది; మీరు ఉన్నత స్థితులకు చేరుకుంటున్నారు.'అని. కానీ అవి వినవద్దు.*
 
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 270 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 270. MIND TRICKS 🍀*

*🕉. This is the problem of all spiritual seekers: sooner or later the mind starts playing tricks. 🕉*

*Somebody will see lights, somebody will start hearing sounds, somebody will start experiencing something else. And the ego says, "This is something great-it's only happening to you. It is rare. You are special, that's why it's happening to you." And you start cooperating. Don't pay much attention to it-just neglect it! One has to become utterly empty. The only spiritual experience worth calling spiritual is the experience of nothingness, of emptiness, what Sufis call fana, the disappearance of the ego. That is the only spiritual experience-all else is just mind" games. And the mind can create many things. The mind can start hallucinating; it can have visions, can see Christ and Buddha. The mind has the capacity to dream even with open eyes it can dream.*

*When you see Krishna standing in front of you, how do you not believe? And there is no krishna standing before you--it is your projection. That's why Zen masters say, "If you meet the Buddha on the road, kill him!" They are absolutely right. It sounds sacrilegious, disrespectful to say if you meet Buddha you should kill him, but it is true. You will-meet Buddha on the way, or krishna -- that is not the point. You will come across anything that you had been conditioned for in your childhood. Great spiritual masters and Tibetan lamas will appear, and you will see that something great is happening. And you will find foolish people appreciating you. They will say, "Your status is going higher and higher every day; you are reaching higher stations." Don't listen.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 416 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 416 -1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 90. చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।*
*గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥ 🍀*

*🌻 416. ‘చిచ్ఛక్తి’ - 1🌻* 

*చైతన్యశక్తి శ్రీమాత అని అర్థము. చైతన్యశక్తియే సమస్త సృష్టికి ఆధారము. ఎందు చైతన్యము లేదో అందు కదలిక యుండదు. చైతన్యశక్తి లేని రూపములు అచేతనములై యుండును. నిజమునకు అందుకూడ చైతన్యమున్నది. కాని నిద్రాణమై యున్నది. ఒక వస్తువునందు చైతన్యమెంత మేల్కాంచిన అంత ప్రకాశము కలుగుచున్నది. అట్టి ప్రకాశము వలన తెలియుట వుండును. అట్టి ప్రకాశము లేనప్పుడు తెలియకపోవుట వుండును. తెలియుట విద్య, తెలియకపోవుట అవిద్య.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 416 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*

*🌻 90. Chichakti shchetanarupa jadashakti jadatmika*
*Gayatri vyahruti sandhya dvijabrunda nishemita ॥ 90 ॥🌻*

*🌻 416. 'Chichhakti' - 1🌻*

*The power of consciousness is Srimata. Consciousness is the basis of all creation. If there is no consciousness, there is no rythm. Forms without consciousness are lifeless. Truth is that even they also have consciousness. But it is dormant. In an object, as much consciousness is awakened, so much is the object radiant. There is knowing due to such radiance. In the absence of such illumination there is ignorance. Knowing is education, not knowing is ignorance. Creation itself is the embodiment of education and ignorance.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

శివ సూత్రములు - 02 - 1. చైతన్యమాత్మా - 2 / Siva Sutras - 02 - 1. Caitanyamātmā - 2


*🌹. శివ సూత్రములు - 02 / Siva Sutras - 02 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
1- శాంభవోపాయ
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻. 1. చైతన్యమాత్మ - 2 🌻*
*🌴. అత్యున్నత చైతన్యమే ప్రతిదానికీ వాస్తవికత. 🌴*

*వ్యక్తులందరికీ వివిధ స్థాయిల స్పృహ ఉంటుంది. అత్యున్నత స్థాయి స్పృహను పొందిన వాడు జ్ఞానంతో నిండి ఉంటాడు. అయితే అది విజ్ఞానం అతనికి ప్రసాదించినది కాదు. అతను తన స్వంత ప్రయత్నాల ద్వారా ఈ జ్ఞానాన్ని పొందాడు, అంటే ఆధ్యాత్మిక గురువు నుండి నేర్చుకోవడం, అతనిని అభ్యసించడం మొదలైనవి. జ్ఞానాన్ని సంపాదించడానికి అనేక పద్ధతులు ఉన్నాయి, అయితే గురువు నుండి పొందడం సరైనదిగా పరిగణించ బడుతుంది. జ్ఞానాన్వేషకుల మదిలో తలెత్తే పనికిమాలిన సందేహాలకు సమాధానం చెప్పగలిగిన వారు ఎవరైనా ఉండాలి. ఒకరికి సందేహం రాకపోతే, అతను తన అభ్యాస ప్రక్రియలో తీవ్రంగా లేడని అర్థం.*

*ప్రబలంగా ఉన్న అజ్ఞానం యొక్క స్థాయి కారణంగా స్పృహ స్థాయి వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటుంది. జ్ఞాన సముపార్జన ద్వారానే ఈ అజ్ఞానం తొలగిపోతుంది. ప్రస్తుత సందర్భంలో, జ్ఞానం లేదా అజ్ఞానం అంటే ఆధ్యాత్మికత స్థాయి మాత్రమే. కాబట్టి, ముఖ్యమైనది సాధన యొక్క వ్యవధి కాదు, కానీ అభ్యాసం యొక్క నాణ్యత. కొన్ని క్షణాల అధిక ఏకాగ్రత శివుడిని సాధించడానికి సరిపోతుంది. అన్ని అభ్యాసాలు ఆ కొన్ని క్షణములకు మాత్రమే దారి తీస్తాయి, ఇది ఒకరి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఏ క్షణంలోనైనా జరగవచ్చు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras -02 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻1. Caitanyamātmā - 2 🌻*
*🌴 Supreme consciousness is the reality of everything.🌴*

*All the individuals have different levels of consciousness. The one who has acquired the highest level of consciousness is full of knowledge. Knowledge is not something that is gifted to him. He has acquired this knowledge through his own efforts, learning from a spiritual preceptor, or by reading him, etc. There are many methods of acquiring knowledge, though acquiring from a learned guru is considered as the right one. There should be someone who is able to answer trivial doubts that arise in the minds of the seekers of knowledge. If one does not get a doubt, then it means he is not serious in his learning process.*

*The level of consciousness varies from person to person due to the level of ignorance that prevails. This ignorance can be removed only by acquiring knowledge. In the present context, knowledge or ignorance means only the level of spirituality. So, what is important is not the duration of the practice, but the quality of the practice. A few seconds of high concentration is more than enough to attain Shiva. All the practice leads only to those few seconds, which could happen any moment in one’s spiritual journey.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

నిర్మల ధ్యానాలు - ఓషో - 265


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 265 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. అహమెప్పుడు 'కాదు' అంటుంది. కాదు అన్నది అహానికి ఆహారం. అవును అన్నది సృజనాత్మకం. అవును' అన్నది సృజనకారుడి మార్గం. ప్రేమికుడి మార్గం. సమస్తానికి లొంగిపోవడం. అవును అంటే శరణం, కాదు అంటే యుద్ధం.🍀


మనిషి 'కాదు' లో లేదా 'అవును'లో జీవించవచ్చు. నువ్వు 'కాదు'లో నీ జీవితాన్ని జీవిస్తే నువ్వు యుద్ధవీరుడవుతావు. ఎప్పుడూ సంఘర్షణలో వుంటావు. అప్పుడు జీవితం కేవలం ఘర్షణ అవుతుంది. నువ్వు ప్రతిదానికీ వ్యతిరేకంగా పోట్లాడతావు. అది ఓడిపోయే యుద్ధమే కావచ్చు. నువ్వు ఓటమికి సిద్ధం కావాలి. వ్యక్తి సమస్తానికి వ్యతిరేకంగా పోరాడి గెలవలేడు. ఆ అభిప్రాయమే తప్పు. కానీ అహం అలా అంటుంది. అహమెప్పుడు 'కాదు' అంటుంది. కాదు అన్నది అహానికి ఆహారం. అవును అన్నది సృజనాత్మకం. అవును' అన్నది సృజనకారుడి మార్గం. ప్రేమికుడి మార్గం.

అవును అంటే శరణం, కాదు అంటే యుద్ధం, అవును' అంటే లొంగిపోవడం. సమస్తానికి లొంగిపోవడం. సమస్తానికి లొంగడంలో సంఘర్షణ లేదు. అవును'కు ఎట్లాంటి నిబంధనలూ పెట్టకు. అప్పుడు నువ్వు ఆశ్చర్యపోతావు. జీవితం సరిహద్దులు దాటి సాగుతుంది. జీవితంలో కాంతి వస్తుంది. సౌందర్యం వస్తుంది. అనూహ్యమైన దయ వస్తుంది. జీవితం అన్నది అంతం లేని పరవశ మవుతుంది. దానికి నువ్వు తలుపులు, కిటికీలు తెరవాలి. సూర్యుడికి, చంద్రుడికి, వర్షానికి, సమస్తానికి 'అవును' అని ఆమోదం తెలుపు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

నిత్య ప్రజ్ఞా సందేశములు - 366 - 31. అస్తిత్వం - చైతన్యం . . . / DAILY WISDOM - 366 - 31. Existence Which is . . .


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 366 / DAILY WISDOM - 366 🌹

🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀

📝. ప్రసాద్ భరద్వాజ్

🌻31. అస్తిత్వం - చైతన్యం మరియు ఆనందం🌻


చైతన్యం అనే అస్తిత్వం యొక్క లక్షణం ఆనందం. ఇది ఎందుకు ఆనందం? ఎందుకంటే, మీరు అనుభవించే బాధలు, కష్టాలు, పరిమితులన్ని కూడా మీ స్వభావం యొక్క పరిమితుల నుంచి పుడతాయి. ఒక వ్యక్తి అనంతుడు అయినప్పుడు, అన్ని కోరికలు నెరవేరుతాయి. అనంతత్వంలో అన్ని కోరికలు నశిస్తాయని అందరూ అనుకుంటారు కానీ అలా కాదు. అవి నెరవేరబడతాయి. మనం ఇప్పుడు కేవలం వస్తువుల యొక్క నీడను మాత్రమే అనుభూతి చెందుతున్నాము.

కానీ అక్కడ, ఒకరు స్వప్నంలోనుంచి మేల్కొని వస్తువుల యొక్క వాస్తవికతను చూసినట్లుగా, ఒక వ్యక్తి వస్తువుల యొక్క మూలరూపం తానే అవుతాడు. ఈ బ్రహ్మానందం కూడా అస్తిత్వం-చైతన్యం నుండి వేరు కాదు. అస్తిత్వమే చైతన్యం. అదే ఆనందం. గాఢనిద్రలో స్వయం అస్తిత్వం-చైతన్యం-ఆనందంగా ఉంటే, అది స్వప్న మరియు జాగృత స్థితుల్లో వేరేలా ఉంటుందా? ఉండదు, ఎందుకంటే ఇది విడదీయరానిది, అందువలన, అనంతం; అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. అందువలన, ముఖ్యంగా, స్వయమే సత్-చిత్-ఆనందం. అస్తిత్వం-చైతన్యం-ఆనందం. ఇక్కడ అనంతం మరియు శాశ్వతత్వం ఒకదానిలో ఒకటి ఏకత్వంగా మిళితం అవుతాయి.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 366 🌹

🍀 📖 from The Philosophy of Religion 🍀

📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj

🌻31. Existence Which is Consciousness is Bliss🌻


Existence which is Consciousness is of the character of Bliss. Why is it Bliss? Because, all suffering and finitude, every difficulty and penury of any kind, is the result of the finitude of one's nature. When one has become the Infinite, all desires are fulfilled. The desires are not abolished or destroyed in the Infinite, as people may imagine. All wishes are totally fulfilled in their reality. We enjoy at present dream objects, a shadow of the substance, as it were.

But there, one becomes the archetype or the original of things, as if one in dream rises into the waking life and beholds the reality of things as they are. Even this Bliss is not separate from Existence-Consciousness. Existence, which is Consciousness, itself is bliss. If the Self is Existence-Consciousness-Bliss in deep sleep, can it be otherwise in the waking and dream states? No, because it is indivisible, thus, infinite; it would be the same always. Thus, essentially, the Self is Sat-Chit-Ananda, Existence-Consciousness-Bliss. Here Infinity and Eternity get blended into All-Being.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ శివ మహా పురాణము - 649 / Sri Siva Maha Purana - 649

🌹 . శ్రీ శివ మహా పురాణము - 649 / Sri Siva Maha Purana - 649 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 15 🌴

🌻. గణేశ యుద్ధము - 4 🌻


మహాబలుడగు గణేశుడు పరిఘను చేతబట్టుట గాంచి నేను వెంటనే పలాయనము చిత్తగించితిని (34), 'పొండు పొండు' అని పలుకతూ ఆతడు వారిని పరిఘతో మోదెను. కొందరు వారంతట వారే క్రిందబడిరి. మరికొందరిని ఆతడు పడవైచెను (35). మరికొందరు క్షణములో శివుని దరిజేరి ఆ వృత్తాంతమును సర్వమును శివునకు విన్నవించుకొనిరి (36). లీలాపండితుడగు శివుడు వారి ఆ దురవస్థను గాంచి ఆ వృత్తాంతమును విని పట్టజాలని కోపమును పొందెను (37).

అపుడాయన ఇంద్రుడు మొదలగు దేవగణములను, షణ్ముఖుడు, మొదలగా గల గణములను, భూతప్రేత పిశాచములను అందరినీ ఆదేశించెను (38). శివునిచే ఆజ్ఞాపించబడిన ఆ వీరులందరు ఆ గణశుని సంహరించు కోరికతో ఆయుధములనెత్తి పట్టుకొని ఎవరి వీలును బట్టి వారు అన్నివైపులనుండియు ముట్టడించిరి (39). ఎవరెవరి వద్ద ఏయే ఆయుధములు గలవో వారు వారు ఆయా ఆయుధములను ఆ గణేశునిపై బలముగా ప్రయోగించిరి (40). స్థావర జంగమాత్మకమగు ముల్లోకములలో పెద్ద హాహాకారము చెలరేగెను. ముల్లోకములలోని జనులందరు సందేహమును పొందిరి (41).

బ్రహ్మ గారి ఆయుర్ధాయము పూర్తికాలేదు గదా! శివుని ఇచ్ఛచే బ్రహ్మాండము కాలము కాని కాలమందు తనంత తానుగా వినాశనమును పొందుచున్నది (42). అచటకు విచ్చేసిన షణ్ముఖుడు మొదలగు గణములు మరియు దేవతలు, తమ ఆయుధములు వ్యర్థము కాగా పరమాశ్చర్యమును పొందిరి (43).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 649🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 15 🌴

🌻 Gaṇeśa’s battle - 4 🌻


34. On seeing the powerful Gaṇeśa seizing the iron club I began to run away immediately.

35. The others too who were shouting “Go, Go” were struck down with the iron club. Some fell themselves and some were felled by him.

36. Some of them fled to Śiva in a trice and intimated to him the details of the incident.

37. On seeing them in that plight and on hearing the news, Śiva, an adept in sports became very angry.

38. He issued directives to Indra and other gods, to the Gaṇas led by the six-faced Kumāra and to goblins, ghosts and spirits.

39. At the bidding of Śiva they all desired to kill Gaṇeśa. Lifting up their weapons in a suitable manner they came there from all directions.

40. Whatever weapon they had was hurled on Gaṇeśa with force.

41. There was a great hue and cry in all the three worlds consisting of the mobile and immobile. The inhabitants of the worlds were in a great fix and uncertainty.

42. “Brahma’s life span is not over, but the whole universe is undergoing untimely destruction. Certainly it is due to Śiva’s wish.

43. The sixfaced deity and the other gods who came there failed to use their weapons effectively. They were very much surprised.


Continues....

🌹🌹🌹🌹🌹

శ్రీమద్భగవద్గీత - 288: 07వ అధ్., శ్లో 08 / Bhagavad-Gita - 288: Chap. 07, Ver. 08

 

🌹. శ్రీమద్భగవద్గీత - 288 / Bhagavad-Gita - 288 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం - 08 🌴

08. రసోహమప్సు కౌన్తేయ ప్రభాస్మి శశిసూర్యయో: |
ప్రణవ: సర్వవేదేషు శబ్ద: ఖే పౌరుషం నృషు ||

🌷. తాత్పర్యం :

ఓ కుంతీపుత్రా! నీటి యందు రుచిని, సూర్యచంద్రుల యందు కాంతిని, వేదమంత్రములందు ఓంకారమును, ఆకాశము నందు శబ్దమును, నరుని యందు సామర్థ్యమును నేనే అయి యున్నాను.

🌷. భాష్యము :

భౌతికము మరియు ఆధ్యాత్మికములనెడి తన వైవిధ్యశక్తులచే శ్రీకృష్ణభగవానుడు ఏ విధముగా సర్వవ్యాపియై యుండునో ఈ శ్లోకము వివరించుచున్నది. ఈ వివిధశక్తుల ద్వారానే భగవానుడు తొలుత దర్శింపబడి నిరాకారరూపముగా అనుభవమునకు వచ్చును. సూర్యమండలము నందుండెడి సాకారుడైన సూర్యదేవుడు తన సర్వవ్యాపకశక్తి (సూర్యకాంతి) ద్వారా దర్శనీయుడైనట్లు, శ్రీకృష్ణభగవానుడు తన దామమునందు నిలిచియున్నను సర్వత్రా వ్యాపించియుండెడి తన శక్తుల ద్వారా దర్శనీయుడగును. ఉదాహరణకు రుచి యనునది నీటి యందలి ప్రధాన విషయము. లవణపూర్ణమై యున్నందున సముద్రనీటిని త్రాగుటకు ఎవ్వరును ఇచ్చగింపరు. అనగా రుచిని బట్టియే నీటి యెడ ఎవ్వరైనను ఆకర్షణను కలిగియుందురు. అట్టి రుచి శ్రీకృష్ణభగవానుని శక్తులలో ఒకటియై యున్నది. నిరాకారవాదియైనవాడు నీటి రుచి ద్వారా దాని యందు భగవానుని ఉనికిని గాంచగా, మనుజుని దాహమును తీర్చుటకు కరుణతో రుచిగల నీటి నొసగుచున్న ఆ భగవానుని సాకారవాడి కీర్తించును. భగవానుని దర్శించుటకు ఇదియే మార్గము. వాస్తవమునకు సాకారవాదమునకు మరియు నిరాకారవాదమునకు ఎట్టి విరోధము లేదు. భగవతత్త్వము నెరిగినవాడు సాకారభావనము మరియు నిరాకారభావనము అనునవి ఏకకాలమున సమస్తమునందు నెలకొనియున్నవనియు మరియు ఆ తత్త్వములందు ఎట్టి వ్యతిరేకత లేదనియు తెలిసియుండును. కనుకనే శ్రీచైతన్యమాహాప్రభువు ఏకకాలమున ఏకత్వము మరియు భిన్నత్వము తెలిపెడి “అచింత్యభేదాభేదతత్త్వము” అనెడి తమ ఉదాత్తమగు సిద్ధాంతమును స్థాపించిరి.

సూర్యచంద్రుల కాంతి సైతము శ్రీకృష్ణభగవానుని నిరాకారతేజమైన బ్రహ్మజ్యోతి నుండియే వెలువడునటువంటిది. అలాగుననే సర్వవేదమంత్రముల ఆదిపదమైన ప్రణవాము లేదా ఓంకారము దేవదేవునే సంబోధించును. నిరాకారవాదులు శ్రీకృష్ణభగవానుని అతని అసంఖ్యాక నామముల ద్వారా సంబోధించుటకు వెరగు చెందియుండుటచే దివ్యమగు ఓంకారమును పలుకుట యందు మక్కువను చూపుదురు. కాని ఓంకారము శ్రీకృష్ణుని శబ్దప్రాతినిధ్యమై యని వారు ఎరుగజాలరు. వాస్తవమునకు కృష్ణభక్తిరసభావనపు పరిధి సర్వత్రా వ్యాపించియున్నది. దాని నెరిగినవాడు ధన్యుడు కాగలడు. అనగా కృష్ణుని గూర్చి తెలియనివారు మాయలో నున్నట్టివారే. కనుకనే కృష్ణపరజ్ఞానము ముక్తియై యుండగా, కృష్ణుని గూర్చి తెలియకుండుట బంధమై యున్నది.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 288 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Yoga - 08 🌴


08. raso ’ham apsu kaunteya prabhāsmi śaśi-sūryayoḥ
praṇavaḥ sarva-vedeṣu śabdaḥ khe pauruṣaṁ nṛṣu

🌷 Translation :

O son of Kuntī, I am the taste of water, the light of the sun and the moon, the syllable oṁ in the Vedic mantras; I am the sound in ether and ability in man.


🌹 Purport :

This verse explains how the Lord is all-pervasive by His diverse material and spiritual energies. The Supreme Lord can be preliminarily perceived by His different energies, and in this way He is realized impersonally. As the demigod in the sun is a person and is perceived by his all-pervading energy, the sunshine, so the Lord, although in His eternal abode, is perceived by His all-pervading diffusive energies. The taste of water is the active principle of water. No one likes to drink sea water, because the pure taste of water is mixed with salt. Attraction for water depends on the purity of the taste, and this pure taste is one of the energies of the Lord. The impersonalist perceives the presence of the Lord in water by its taste, and the personalist also glorifies the Lord for His kindly supplying tasty water to quench man’s thirst.

That is the way of perceiving the Supreme. Practically speaking, there is no conflict between personalism and impersonalism. One who knows God knows that the impersonal conception and personal conception are simultaneously present in everything and that there is no contradiction. Therefore Lord Caitanya established His sublime doctrine: acintya bheda- and abheda-tattva – simultaneous oneness and difference.

🌷🌷🌷🌷🌷


Daily Panchang నిత్య పంచాంగము 27 Nov 2022


🌹27, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹

శుభ ఆదివారం, Sunday, భాను వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : వినాయక చతుర్థి, Vinayaka Chaturthi🌻

🍀. ఆదిత్య స్తోత్రం - 11 🍀

11. ఓమిత్యుద్గీథభక్తేరవయవపదవీం ప్రాప్తవత్యక్షరేఽస్మిన్
యస్యోపాస్తిః సమస్తం దురితమపనయత్వర్కబింబే స్థితస్య |

యత్ పూజైకప్రధానాన్యఘమఖిలమపి ఘ్నన్తి కృచ్ఛ్రవ్రతాని
ధ్యాతః సర్వోపతాపాన్ హరతు పరశివః సోఽయమాద్యో భిషఙ్నః

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : ప్రాణ మనఃకోశముల ప్రకృతి వ్యాపారముల నుండి నీవు వేరుపడుటయే కాదు, అట్లు వేరుపడిన నీలోని పురుషుడు నిశ్చలుడూ నిర్లిప్తుడూ నైన ద్రష్ట కూడా కావాలి. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, హేమంత ఋతువు,

దక్షిణాయణం, మార్గశిర మాసం

తిథి: శుక్ల చవితి 16:26:47 వరకు

తదుపరి శుక్ల పంచమి

నక్షత్రం: పూర్వాషాఢ 12:39:29 వరకు

తదుపరి ఉత్తరాషాఢ

యోగం: దండ 21:33:38 వరకు

తదుపరి వృధ్ధి

కరణం: విష్టి 16:27:47 వరకు

వర్జ్యం: 19:55:40 - 21:23:00

దుర్ముహూర్తం: 16:09:58 - 16:54:47

రాహు కాలం: 16:15:34 - 17:39:35

గుళిక కాలం: 14:51:33 - 16:15:34

యమ గండం: 12:03:30 - 13:27:31

అభిజిత్ ముహూర్తం: 11:41 - 12:25

అమృత కాలం: 08:19:00 - 09:45:40

మరియు 28:39:40 - 30:07:00

సూర్యోదయం: 06:27:24

సూర్యాస్తమయం: 17:39:36

చంద్రోదయం: 09:54:56

చంద్రాస్తమయం: 21:10:43

సూర్య సంచార రాశి: వృశ్చికం

చంద్ర సంచార రాశి: ధనుస్సు

యోగాలు : శుభ యోగం - కార్య జయం

12:39:29 వరకు తదుపరి అమృత

యోగం - కార్య సిధ్ది

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹