మైత్రేయ మహర్షి బోధనలు - 66


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 66 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 52. సంఘములు - సిద్ధాంతములు 🌻


మానవ సంఘమున అనేక సంఘములున్నవి. అనేక ఆధ్యాత్మిక సంఘములు కూడ నున్నవి. ఈ ఆధ్యాత్మిక సంఘముల ఆశయము లన్నియు ఒక్కటియే. వీరందరు కోరునది దివ్యజీవనమే. వీరవలంబించు మార్గములు మాత్రము వివిధములు. మార్గమున నడచు సభ్యులు దివ్యజీవనము కొరకు చేయు ప్రయత్నములో కొన్ని సిద్ధాంతములకు లోబడుదురు. సిద్ధాంతములచే బంధింప బడిన వారికి దివ్యభావన కన్న తమ సిద్ధాంతములను ప్రపంచమున కెక్కించుటకు ఉత్సాహమెక్కువగును. తత్కారణముగ రజోగుణ ప్రేరితులై ఇతర సిద్ధాంతములను నిరసించుచు మరింత బంధనము కలిగించు కొనుచుందురు. క్రమముగ దివ్యత్వము మరుగై సిద్ధాంతమే మిగులును.

ఇట్లు సిద్ధాంతములందు చిక్కుకొనువారు కోటానుకోట్లు కలరు. వీరందరి కిని వారి వారి సంఘములు ప్రాణతుల్యములు. ఇతర సంఘములు తుచ్ఛములు, అజ్ఞాన పూరితములు. తమ సిద్ధాంతమందు రాగమెంత యుండునో, ఇతర సిద్ధాంతముల యందు ద్వేషమంత యుండును. పై విధముగ రాగద్వేషములచే పీడింప బడుచు, తాము దైవజ్ఞులమని అహంకరించుచు, సంఘమున అలజడి కలిగించుచుందురు. నిజమగు దివ్యజీవనమున పరస్పరత్వము, సహాయ సహకారములు, ప్రశాంతత, సమర్థత గోచరించును.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


31 Jan 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 129-2


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 129-2 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మనిషి తనలో అసాధారణ శక్తిని కలిగి వున్నాడు. అది అనుభవానికి సంబంధించిన సమశృతి. దానికి అవసరయినదల్లా దాన్ని నువ్వు వినగలిగే శక్తి. అది గాఢమయిన నిశ్శబ్దం. అది నీ హృదయ స్పందన లాంటిది. అది లోతుల్లో కొంత రహస్యంగా వుంది. 🍀


మనిషి తనలో అనంతమయిన సంగీతాన్ని వినిపించగలిగే అసాధారణ శక్తిని కలిగి వున్నాడు. నేను 'మనిషి' అంటే ప్రతి మనిషీ అని అర్థం. నేను 'సంగీతం' అంటే మామూలు సంగీతమని కాదు. సాధారణార్థంలో ప్రతిమనిషీ సంగీతకారుడు కాడు. ఆ నైపుణ్యం కొందరికే వుంటుంది. అది పుట్టుకతో వస్తుంది. నేను చెప్పే అర్థం పూర్తిగా వేరయింది. ఆందరికి అనుభవానికి సంబంధించిన సమశృతి. అది అన్ని సంగీతాల కన్నా అపురూపమైంది. అది 'సృష్టింపబడని' సంగీతం. దానికి ఎట్లాంటి సంగీతవాద్యాలు అక్కర్లేదు. ఎట్లాంటి శిక్షణా అవసరం లేదు.

అక్కడ అవసరయినదల్లా దాన్ని నువ్వు వినగలిగే శక్తి. అది గాఢమయిన నిశ్శబ్దం. అది అప్పటికే అక్కడ వుంది. అది నీ జీవితం. జెన్'కు సంబంధించి దాన్ని 'ఒంటి చేతి చప్పుడు' అంటారు. సాధారణ సంగీతానికి రెండు విషయాలు అవసరం. అప్పుడు అక్కడ శబ్దం సృష్టింపబడుతుంది. గిటార్ వాయించాలంటే తీగలపై వేళ్ళుండాలి. నీ వేళ్ళతో తీగల్ని మీటితే సంగీతం వస్తుంది. కానీ లోపలి సంగీతానికి సంబంధించి అక్కడ చెయ్యాల్సింది అలాంటిది కాదు. అక్కడ అప్పటికే ఆ సంగీతం వుంది. అది నీ హృదయ స్పందన లాంటిది. మరికొంత లోతుల్లో మరికొంత రహస్యంగా అది వుంది. అది నీ నిజమైన హృదయ స్పందన.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


31 Jan 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 547 / Vishnu Sahasranama Contemplation - 547


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 547 / Vishnu Sahasranama Contemplation - 547 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 547. వేధాః, वेधाः, Vedhāḥ 🌻


ఓం వేధసే నమః | ॐ वेधसे नमः | OM Vedhase namaḥ

వేధాః, वेधाः, Vedhāḥ

వేధా విధానాత్ పృషోదరాదిత్వాత్ సాధుతోచ్యతే

లోకములను సృజించును అను వ్యుత్పత్తిచే విధాతా - వేధాః - రెండు రూపములును అగును. వేధాః అను రూపము వృషోదరాది గణమునందు పఠింపబడుచు సాధు రూపమే యగును.


:: పోతన భాగవతము - చతుర్థ స్కంధము ::

తే. సర్వ సత్తాయ దేవాయ సన్నిమాయ, కాయ బహిర న్తరాత్మనే కారణాత్మ
నే సమస్తార్థ లిఙ్గాయ నిర్గుణాయ, వేధసే జితాత్మక సాధవే నమోఽస్తు. (704)

నీవు సర్వ సత్త్వుడవు. దేవుడవు. నియామకుడవు. బయటా లోపలా వ్యాపించి ఉంటావు. నీవు సమస్తార్థచిహ్న స్వరూపుడవు. నిర్గుణుడవు. సృష్టికర్తవు. జితాత్మక సాధు స్వరూపుడవు. నీకు నమస్కారం.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 547 🌹

📚. Prasad Bharadwaj

🌻547. Vedhāḥ🌻


OM Vedhase namaḥ


वेधा विधानात् पृषोदरादित्वात् साधुतोच्यते /

Vedhā vidhānāt pr‌ṣodarāditvāt sādhutocyate


As the progenitor of the worlds, He is Vidhātā - Vedhāḥ; both forms implying the same meaning.


:: श्रीमद्भागवते चतुर्थस्कन्धे सप्तदशोऽध्यायः ::

सर्गादि योऽस्यानुरुणद्धि शक्तिभिर्द्रव्यक्रियाकारकचेतनात्मभिः ।
तस्मै समुन्नद्धनिरुद्धशक्तये नमः परस्मै पुरुषाय वेधसे ॥ ३३ ॥


Śrīmad Bhāgavata - Canto 4, Chapter 17

Sargādi yo’syānuruṇaddhi śaktibhirdravyakriyākārakacetanātmabhiḥ,
Tasmai samunnaddhaniruddhaśaktaye namaḥ parasmai puruṣāya vedhase. 33.


My dear Lord, by Your own potencies You are the original cause of the material elements, as well as the performing instruments (the senses), the workers of the senses (the controlling deities), the intelligence and the ego, as well as everything else. By Your energy You manifest this entire cosmic creation, maintain it and dissolve it. Through Your energy alone everything is sometimes manifest and sometimes not manifest. You are therefore the Supreme God, the cause of all causes. I offer my respectful obeisances unto You.


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

वेदास्स्वाङ्गोऽजितःकृष्णो दृढस्सङ्कर्षणोऽच्युतः ।
वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः ॥ ५९ ॥

వేదాస్స్వాఙ్గోఽజితఃకృష్ణో దృఢస్సఙ్కర్షణోఽచ్యుతః ।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥ 59 ॥

Vedāssvāṅgo’jitaḥkr‌ṣṇo dr‌ḍassaṅkarṣaṇo’cyutaḥ,
Varuṇo vāruṇo vr‌kṣaḥ puṣkarākṣo mahāmanāḥ ॥ 59 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


31 Jan 2022

31-JANUARY-2022 సోమవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 31, జనవరి 2022 సోమవారం, ఇందు వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 151 / Bhagavad-Gita - 152 - 3-33 కర్మయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 547 / Vishnu Sahasranama Contemplation - 547🌹
4) 🌹 DAILY WISDOM - 227🌹 
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 129-2🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 66🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శుభ సోమవారం మిత్రులందరికీ 🌹*
*ఇందు వాసరే, 31, జనవరి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. రుద్రనమక స్తోత్రం - 9 🍀*

*17. కపర్దినో మహేశస్య యది నాభుర్నిషంగధిః!*
*ఇషవో పి సమర్థాశ్చేత్ సామర్థ్యాతు భయం భవేత్!!*

*18. యాతే హేతిర్ధనుర్హస్తే మీఢుష్టమ బభూవ యా!*
*తయాస్మాన్ విశ్వతస్తేన పాలయ త్వ మయక్ష్మయా!!*

🌻 🌻 🌻 🌻 🌻

*పండుగలు మరియు పర్వదినాలు :* 
*తై అమావాస్య, దర్ష అమావాస్య (అమావాస్య ముందురోజు)*
*Thai Amavasai, Darsha Amavasya* 

*🍀. నీకు కావలసిన దాని కోసం శ్రమించకుండా, పోగొట్టుకున్న దాని గురించి బాధ పడడం మూర్ఖత్వం అవుతుంది. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం,
హేమంత ఋతువు, పౌష్య మాసం
తిథి: కృష్ణ చతుర్దశి 14:19:56 వరకు
తదుపరి అమావాశ్య
నక్షత్రం: ఉత్తరాషాఢ 21:58:59 వరకు
తదుపరి శ్రవణ
సూర్యోదయం: 06:48:12
సూర్యాస్తమయం: 18:10:47
వైదిక సూర్యోదయం: 06:51:57
వైదిక సూర్యాస్తమయం: 18:07:02
చంద్రోదయం: 05:57:59
చంద్రాస్తమయం: 17:18:38
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: మకరం
యోగం: వజ్ర 10:25:00 వరకు
తదుపరి సిధ్ధి
కరణం: శకుని 14:19:56 వరకు
వర్జ్యం: 07:34:40 - 09:01:00
దుర్ముహూర్తం: 12:52:15 - 13:37:45
మరియు 15:08:45 - 15:54:16
రాహు కాలం: 08:13:32 - 09:38:51
గుళిక కాలం: 13:54:49 - 15:20:08
యమ గండం: 11:04:10 - 12:29:30
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:51
అమృత కాలం: 16:12:40 - 17:39:00
మృత్యు యోగం - మృత్యు భయం
16:33:59 వరకు తదుపరి కాల యోగం
- అవమానం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PANCHANGUM
#DAILYCalender
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 152 / Bhagavad-Gita - 152 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 33 🌴*

*33. సదృశం చేష్టతే స్వస్యా: ప్రకృతేర్ జ్ఞానవానపి |*
*ప్రకృతిం యాన్తి భూతాని నిగ్రహ: కిం కరిష్యతి ||*

🌷. తాత్పర్యం :
*జ్ఞానవంతుడైన మనుజుడు సైతము తన గుణముల ననుసరించియే కర్మ నొనరించును. ఏలయన ప్రతియొక్కరు త్రిగుణముల నుండి తాము పొందిన స్వభావమునే అనుసరింతురు. అట్టి యెడ నిగ్రహమేమి చేయగలదు?*

🌷. భాష్యము :
సప్తమాధ్యాయమున (7.14) శ్రీకృష్ణుభగవానుడు నిర్ధారించిన రీతి మనుజుడు సంపూర్ణ కృష్ణభక్తిభావన యనెడి అధ్యాత్మికస్థితి యందు నెలకొననిదే భౌతికప్రకృతి త్రిగుణముల ప్రభావము నుండి ముక్తిని పొందలేడు. కావున లౌకికభావనలో గొప్ప విధ్వాంసుడని పెరోందనివానికి సైతము కేవలము సిద్ధాంతమాత్ర జ్ఞానముచే (ఆత్మను దేహమునకు అన్యముగా గాంచుట) మాయబంధము నుండి ముక్తిని పొందుట సాధ్యము కాదు. 

జ్ఞానమునందు పురోగతి నొందినవానిగా పైకి ప్రదర్శనము గావించుచు అంతరమున సంపూర్ణముగా గుణములకు లోబడి వాటిని జయింపలేని నామమాత్ర ఆధ్యాత్మికవాదులు పెక్కురు గలరు. మనుజుడు విద్యాజ్ఞానసంపన్నుడైనను చిరకాల భౌతికప్రకృతి సాహచర్యముచే బద్దుడై యుండును. మనుజుడు తన భౌతికస్థితి ననుసరించి వివిధకర్మలలో నియుక్తుడై యున్నను భౌతికబంధము నుండి ముక్తినోన్డుతకు కృష్ణభక్తిరసభావనము సహాయపడగలదు. కావున సంపూర్ణముగా కృష్ణభక్తిభావనాయుతులు కానిదే ఎవ్వరును విధ్యుక్తధర్మములను త్యజింపరాదు. 

అనగా విధ్యక్తధర్మములను తొందరపాటుగా త్యజించి నామమాత్ర యోగిగా లేదా కృత్రిమ ఆధ్యాత్మికునిగా నగుటకు ఎవ్వరును యత్నింపరాదు. మనుజుడు తానున్న స్థితి యందే నిలిచి, ఉన్నత శిక్షణలో కృష్ణభక్తిని పొందుటకు యత్నించుట ఉత్తమమైన విధానము. ఆ విధముగా అతడు శ్రీకృష్ణుని మయాబంధము నుండి విడుదలను పొందగలడు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 152 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 3 - Karma Yoga - 33 🌴*

*33. sadṛśaṁ ceṣṭate svasyāḥ prakṛter jñānavān api*
*prakṛtiṁ yānti bhūtāni nigrahaḥ kiṁ kariṣyati*

🌷 Translation : 
*Even a man of knowledge acts according to his own nature, for everyone follows the nature he has acquired from the three modes. What can repression accomplish?*

🌷 Purport :
Unless one is situated on the transcendental platform of Kṛṣṇa consciousness, he cannot get free from the influence of the modes of material nature, as it is confirmed by the Lord in the Seventh Chapter (7.14). 

Therefore, even for the most highly educated person on the mundane plane, it is impossible to get out of the entanglement of māyā simply by theoretical knowledge, or by separating the soul from the body. There are many so-called spiritualists who outwardly pose as advanced in the science but inwardly or privately are completely under particular modes of nature which they are unable to surpass. 

Academically, one may be very learned, but because of his long association with material nature, he is in bondage. Kṛṣṇa consciousness helps one to get out of the material entanglement, even though one may be engaged in his prescribed duties in terms of material existence. 

Therefore, without being fully in Kṛṣṇa consciousness, one should not give up his occupational duties. No one should suddenly give up his prescribed duties and become a so-called yogī or transcendentalist artificially. It is better to be situated in one’s position and to try to attain Kṛṣṇa consciousness under superior training. Thus one may be freed from the clutches of Kṛṣṇa’s māyā.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 547 / Vishnu Sahasranama Contemplation - 547 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 547. వేధాః, वेधाः, Vedhāḥ 🌻*

*ఓం వేధసే నమః | ॐ वेधसे नमः | OM Vedhase namaḥ*

వేధాః, वेधाः, Vedhāḥ

వేధా విధానాత్ పృషోదరాదిత్వాత్ సాధుతోచ్యతే 

లోకములను సృజించును అను వ్యుత్పత్తిచే విధాతా - వేధాః - రెండు రూపములును అగును. వేధాః అను రూపము వృషోదరాది గణమునందు పఠింపబడుచు సాధు రూపమే యగును.

:: పోతన భాగవతము - చతుర్థ స్కంధము ::
తే. సర్వ సత్తాయ దేవాయ సన్నిమాయ, కాయ బహిర న్తరాత్మనే కారణాత్మ
     నే సమస్తార్థ లిఙ్గాయ నిర్గుణాయ, వేధసే జితాత్మక సాధవే నమోఽస్తు. (704)

నీవు సర్వ సత్త్వుడవు. దేవుడవు. నియామకుడవు. బయటా లోపలా వ్యాపించి ఉంటావు. నీవు సమస్తార్థచిహ్న స్వరూపుడవు. నిర్గుణుడవు. సృష్టికర్తవు. జితాత్మక సాధు స్వరూపుడవు. నీకు నమస్కారం.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 547 🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻547. Vedhāḥ🌻*

*OM Vedhase namaḥ*

वेधा विधानात् पृषोदरादित्वात् साधुतोच्यते / 
Vedhā vidhānāt pr‌ṣodarāditvāt sādhutocyate 

As the progenitor of the worlds, He is Vidhātā - Vedhāḥ; both forms implying the same meaning.

:: श्रीमद्भागवते चतुर्थस्कन्धे सप्तदशोऽध्यायः ::
सर्गादि योऽस्यानुरुणद्धि शक्तिभिर्द्रव्यक्रियाकारकचेतनात्मभिः ।
तस्मै समुन्नद्धनिरुद्धशक्तये नमः परस्मै पुरुषाय वेधसे ॥ ३३ ॥

Śrīmad Bhāgavata - Canto 4, Chapter 17
Sargādi yo’syānuruṇaddhi śaktibhirdravyakriyākārakacetanātmabhiḥ,
Tasmai samunnaddhaniruddhaśaktaye namaḥ parasmai puruṣāya vedhase. 33.

My dear Lord, by Your own potencies You are the original cause of the material elements, as well as the performing instruments (the senses), the workers of the senses (the controlling deities), the intelligence and the ego, as well as everything else. By Your energy You manifest this entire cosmic creation, maintain it and dissolve it. Through Your energy alone everything is sometimes manifest and sometimes not manifest. You are therefore the Supreme God, the cause of all causes. I offer my respectful obeisances unto You.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
वेदास्स्वाङ्गोऽजितःकृष्णो दृढस्सङ्कर्षणोऽच्युतः ।
वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः ॥ ५९ ॥

వేదాస్స్వాఙ్గోఽజితఃకృష్ణో దృఢస్సఙ్కర్షణోఽచ్యుతః ।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥ 59 ॥

Vedāssvāṅgo’jitaḥkr‌ṣṇo dr‌ḍassaṅkarṣaṇo’cyutaḥ,
Varuṇo vāruṇo vr‌kṣaḥ puṣkarākṣo mahāmanāḥ ॥ 59 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 227 🌹*
*🍀 📖 from Lessons on the Upanishads 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 14. The Upanishad Refers to God and it Refers to Nothing Else 🌻*

*The Upanishads are not telling us about any god. Then, what is it that the Upanishads are telling us if it is not speaking about God? It is speaking about God, but not about the God that we usually think in our mind according to our upbringing, culture, language or tradition. It refers to God and it refers to nothing else, whereas the other religious forms of the concept of God—the God of the various ‘isms' in the world—have other things in addition to and simultaneous with God's existence, such as: Something must be done, something must not be done.*

*These ‘do's' and ‘don'ts' fill the texture of every religion in the world. Something has to be done and something should not be done. The question of this dichotomy does not arise in the Upanishads. The concept of God, or the Ultimate Reality, that we encounter in the Upanishads is markedly different from our transcendent conception of God. We always look up to the skies, fold our palms and humbly offer a prayer to a divinity that is invisible to the eyes but considered as transcendent, above us—perhaps very far from us. None of us can escape this idea of God being a little far from us. Certainly, there is some distance between us and God. That distance frightens us.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 129-2 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. మనిషి తనలో అసాధారణ శక్తిని కలిగి వున్నాడు. అది అనుభవానికి సంబంధించిన సమశృతి. దానికి అవసరయినదల్లా దాన్ని నువ్వు వినగలిగే శక్తి. అది గాఢమయిన నిశ్శబ్దం. అది నీ హృదయ స్పందన లాంటిది. అది లోతుల్లో కొంత రహస్యంగా వుంది. 🍀*

*మనిషి తనలో అనంతమయిన సంగీతాన్ని వినిపించగలిగే అసాధారణ శక్తిని కలిగి వున్నాడు. నేను 'మనిషి' అంటే ప్రతి మనిషీ అని అర్థం. నేను 'సంగీతం' అంటే మామూలు సంగీతమని కాదు. సాధారణార్థంలో ప్రతిమనిషీ సంగీతకారుడు కాడు. ఆ నైపుణ్యం కొందరికే వుంటుంది. అది పుట్టుకతో వస్తుంది. నేను చెప్పే అర్థం పూర్తిగా వేరయింది. ఆందరికి అనుభవానికి సంబంధించిన సమశృతి. అది అన్ని సంగీతాల కన్నా అపురూపమైంది. అది 'సృష్టింపబడని' సంగీతం. దానికి ఎట్లాంటి సంగీతవాద్యాలు అక్కర్లేదు. ఎట్లాంటి శిక్షణా అవసరం లేదు.*

*అక్కడ అవసరయినదల్లా దాన్ని నువ్వు వినగలిగే శక్తి. అది గాఢమయిన నిశ్శబ్దం. అది అప్పటికే అక్కడ వుంది. అది నీ జీవితం. జెన్'కు సంబంధించి దాన్ని 'ఒంటి చేతి చప్పుడు' అంటారు. సాధారణ సంగీతానికి రెండు విషయాలు అవసరం. అప్పుడు అక్కడ శబ్దం సృష్టింపబడుతుంది. గిటార్ వాయించాలంటే తీగలపై వేళ్ళుండాలి. నీ వేళ్ళతో తీగల్ని మీటితే సంగీతం వస్తుంది. కానీ లోపలి సంగీతానికి సంబంధించి అక్కడ చెయ్యాల్సింది అలాంటిది కాదు. అక్కడ అప్పటికే ఆ సంగీతం వుంది. అది నీ హృదయ స్పందన లాంటిది. మరికొంత లోతుల్లో మరికొంత రహస్యంగా అది వుంది. అది నీ నిజమైన హృదయ స్పందన.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 66 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 52. సంఘములు - సిద్ధాంతములు 🌻*

*మానవ సంఘమున అనేక సంఘములున్నవి. అనేక ఆధ్యాత్మిక సంఘములు కూడ నున్నవి. ఈ ఆధ్యాత్మిక సంఘముల ఆశయము లన్నియు ఒక్కటియే. వీరందరు కోరునది దివ్యజీవనమే. వీరవలంబించు మార్గములు మాత్రము వివిధములు. మార్గమున నడచు సభ్యులు దివ్యజీవనము కొరకు చేయు ప్రయత్నములో కొన్ని సిద్ధాంతములకు లోబడుదురు. సిద్ధాంతములచే బంధింప బడిన వారికి దివ్యభావన కన్న తమ సిద్ధాంతములను ప్రపంచమున కెక్కించుటకు ఉత్సాహమెక్కువగును. తత్కారణముగ రజోగుణ ప్రేరితులై ఇతర సిద్ధాంతములను నిరసించుచు మరింత బంధనము కలిగించు కొనుచుందురు. క్రమముగ దివ్యత్వము మరుగై సిద్ధాంతమే మిగులును.*

*ఇట్లు సిద్ధాంతములందు చిక్కుకొనువారు కోటానుకోట్లు కలరు. వీరందరి కిని వారి వారి సంఘములు ప్రాణతుల్యములు. ఇతర సంఘములు తుచ్ఛములు, అజ్ఞాన పూరితములు. తమ సిద్ధాంతమందు రాగమెంత యుండునో, ఇతర సిద్ధాంతముల యందు ద్వేషమంత యుండును. పై విధముగ రాగద్వేషములచే పీడింప బడుచు, తాము దైవజ్ఞులమని అహంకరించుచు, సంఘమున అలజడి కలిగించుచుందురు. నిజమగు దివ్యజీవనమున పరస్పరత్వము, సహాయ సహకారములు, ప్రశాంతత, సమర్థత గోచరించును.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹