శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 400 / Sri Lalitha Chaitanya Vijnanam - 400

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 400 / Sri Lalitha Chaitanya Vijnanam - 400 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 87. వ్యాపినీ, వివిధాకారా, విద్యాఽవిద్యా స్వరూపిణీ ।
మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ॥ 87 ॥ 🍀

🌻 400. 'వ్యాపినీ' 🌻

సమస్త జగత్తు నందునూ వ్యాపించినది శ్రీమాత అని అర్థము. పరము నుండి మూల ప్రకృతిగను, అటుపైన అవ్యక్తగను, ఆపైన వ్యక్తా వ్యక్త స్వరూపిణిగను పరిణమించు శ్రీమాత ఇచ్ఛా జ్ఞాన

క్రియ లను మూడు విధములైన అహంకారములను దాల్చి ప్రకృతి సర్గములుగ (లోకములుగ) పరిణమించును. ఇట్లు జగత్తంతయూ వ్యాపించును. ఇట్లు వ్యాప్తిచెంది విశ్వరూపమై నిలచును. శ్రీమాత వ్యాపక శక్తి అణువునుండి బ్రహ్మాండము వరకు పనిచేయు చుండును. ఆమె లేని జగత్తు లేదు. తాను వ్యాప్తిచెందిన జగత్తును కూడ అతిక్రమించి వసించును. అటుపైన వివిధ ఆకారములు ధరించును.

'వివిధాకార' అను నామముతో పంచమ శతకము ప్రారంభమగును. ఈ నాలుగవ శతకము వ్యాపిని నామముతో పరిసమాప్త మగుచున్నది. శ్రీమాత అనుగ్రహముగల భక్తులు దివ్యేచ్ఛ, దివ్యజ్ఞానములను శ్రీమాత అనుగ్రహము పొంది దివ్యకార్యములను నిర్వర్తించుచు సృష్టి యందు వ్యాప్తి చెందుచునే యున్నారు. శ్రీమాత నారాధించు వారికి యిట్టి వ్యాప్తి శ్రీమాత అనుగ్రహించవలెనని ప్రార్థన చేయుచు ఈ చతుర్థ శతకమును శ్రీమాత పాదముల చెంత సమర్పించుచు పరిసమాప్తము చేయబడు చున్నది. పంచమ శతకమున కిది పునాదియై

నిలువవలెనని ప్రార్థన.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 400 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj

🌻 87. Vyapini vividhakara vidya vidya svarupini
Mahakameshanayana kumudahlada kaomudi ॥ 87 ॥ 🌻

🌻 400. Vyāpinī व्यापिनी 🌻

She is all pervading. Because She is mūlaprakṛtiḥ and avykatā, She is all pervading. She is also called eka elsewhere, because She is the one who is all pervading, the nature of the Brahman.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

21 Aug 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 232. భూమితో అనుసంధానంతో ఉండండి / Osho Daily Meditations - 232. Be connected with the Earth

🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 232 / Osho Daily Meditations - 232 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 232. భూమితో అనుసంధానంతో ఉండండి 🍀

🕉. మీ పాదాలలో భూమిని మరింత ఎక్కువగా అనుభూతి చెందండి. 🕉

కొన్నిసార్లు చెప్పులు లేకుండా భూమిపై నిలబడి దాని చల్లదనాన్ని, దాని మృదుత్వాన్ని, దాని వెచ్చదనాన్ని అనుభూతి చెందండి. ఆ క్షణంలో భూమి ఏమి ఇవ్వడానికి సిద్ధంగా ఉందో, దానిని అనుభూతి చెందండి మరియు మీ ద్వారా ప్రవహించ నివ్వండి. మరియు మీ శక్తిని భూమిలోకి ప్రవహించ నివ్వండి. భూమితో అనుసంధానించ బడి ఉండండి. చాలా మంది వ్యక్తులు నాభి వరకు ఊపిరి పీల్చుకుంటారు కానీ అంతకు మించి కాదు, కాబట్టి సగం శరీరం దాదాపు పక్షవాతానికి గురవుతుంది మరియు దాని కారణంగా సగం జీవితం కూడా స్తంభించి పోతుంది. అప్పుడు చాలా విషయాలు అసాధ్యంగా మారతాయి... ఎందుకంటే శరీరంలోని కింది భాగం మూలాల వలె పనిచేస్తుంది. కాళ్ళు మూలాలు, మరియు అవి మిమ్మల్ని భూమితో కలుపుతాయి. ప్రజలు భూమితో సంబంధం లేకుండా దెయ్యాలలా వేలాడుతున్నారు. ఒకరు తిరిగి పాదాలకు కదలాలి.

లావోట్జు తన శిష్యులతో ఇలా అంటుండే వాడు, 'మీరు మీ పాదాల నుండి ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించక పోతే, మీరు నా శిష్యులు కాదు'. - మీ పాదాల నుండి ఊపిరి పీల్చుకోవడం - అతను సరిగ్గా అన్నాడు. మీరు ఎంత లోతుగా వెళ్తే, మీ శ్వాస అంత లోతుగా సాగుతుంది. మీ జీవి యొక్క సరిహద్దు మీ శ్వాస యొక్క సరిహద్దు అని దాదాపు నిజం. సరిహద్దు పెరిగి, మీ పాదాలను తాకినప్పుడు, మీ శ్వాస దాదాపు పాదాలకు చేరుకుంటుంది- శారీరక కోణంలో కాదు, మానసిక కోణంలో - అప్పుడు మీరు మీ మొత్తం శరీరాన్ని సొంతం చేసుకున్నారు. మొదటి సారి మీరు పూర్తిగా, ఒక ఏక భాగంగా కలిసి ఉన్నారు.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Osho Daily Meditations - 232 🌹

📚. Prasad Bharadwaj

🍀 232. Be connected with the Earth 🍀

🕉. Feel Earth more and more in your feet. 🕉

Sometimes just stand on the earth without shoes and feel its coolness, its softness, its warmth. Whatever the earth is ready to give in that moment, just feel it and let it flow through you. And allow your energy to flow into the earth. Be connected with the earth. At most people breathe down to the navel but not beyond that, so half the body is almost paralyzed, and because of it, half of life is also paralyzed. Then many things become impossible... because the lower part of the body functions like roots. The legs are the roots, and they connect you with the earth. So people are hanging like ghosts, unconnected with the earth. One has to move back to the feet.

Lao Tzu used to say to his' disciples, "Unless you start breathing from the soles of your feet, you are not my disciples." Breathing from the soles of your feet-and he is perfectly right. The deeper you go, the deeper goes your breath. It is almost true that the boundary of your being is the boundary of your breath. When the boundary increases and touches your feet, your breath almost reaches to the feet-not in a physiological sense, but in a psychological sense--then you have claimed your whole body. For the first time you are whole, of one piece, together.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

21 Aug 2022

శ్రీ శివ మహా పురాణము - 612 / Sri Siva Maha Purana - 612

🌹 . శ్రీ శివ మహా పురాణము - 612 / Sri Siva Maha Purana - 612 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 07 🌴

🌻. యుద్ధారంభము - 4 🌻

తరువాత దేవదానవుల మధ్య వినాశకరమగు ద్వంద్వ యుద్ధము జరిగెను. దానిని చూచి వీరులు ఆనందించిరి. వీరులు కానివారు భయపడిరి (33). ఆ యుద్ధములో బలవంతుడగు తారకాసురుడు ఇంద్రునితో, సంహ్రాదుడు అగ్నితో, జంభుడు యమునితో (34). మహాప్రభుడు న్తెరృతునితో, బలుడు వరుణునితో, సువీరుడు వాయువుతో, పవమానుడు కుబేరునితో (35). రణవిద్యావిశారదుడగు శుంభుడు ఈశానునితో, శుంభుడు శేషునితో, కుంభాసురుడు చంద్రునితో యుద్ధమును చేసిరి (36).

మహాబలుడు, పరాక్రమశాలి, అనేకక యుద్ధముల పాండిత్యము గలవాడునగు కుంబరుడు ఆ సంగ్రాముములో మిహిరునితో పోరాడెను (37). దృఢమగు నిశ్చయము గల దేవదానవులు ఈ తీరున ఆ సంగ్రామములో బలమును ప్రదర్శించి గొప్ప ద్వంద్వయుద్ధమును చేసిరి (38). ఓ మునీ! ఆ దేవాసుర సంగ్రామములో మహాబలురగు దేవతలు, దానవులు ఒకరిని మించి మరియొకరు పోదాడిరి. కాని ఒకరినొకరు జయించలేక పోయిరి (39).

అపుడు జయమును గోరు ఆ దేవదానవులకు తుముల (పక్షముల తేడా తెలియని) యుద్ధము జరిగెను. అభిమానవంతులగు వీరులకు ఆనందమును కలిగించు ఆ యుద్ధము ఇతరులకు భయమును గొల్పెను (40). వేలాదిగా నేలగూలిన దేవదానవులతో భూమి మిక్కిలి భయంకరముగా నుండి, అడుగు పెట్టుటకు చోటు లేకుండెను. అయిననూ వీరులకు మహాసౌఖ్యమే కలిగెను (41).

శ్రీ శివమహాపురాణములో రుద్రసంహితయందు కుమార ఖండలో యుద్ధ ప్రారంభ వర్ణనమనే ఏడవ అధ్యాయము ముగిసినది (7).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 SRI SIVA MAHA PURANA - 612🌹

✍️ J.L. SHASTRI

📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 07 🌴

🌻 Commencement of the War - 4 🌻

33. Duels were fought by the gods and the Asuras crushing each other, on seeing which heroes were delighted and cowards were terrified.

34. The Asura Tāraka of great strength fought with Indra, Saṃhrāda with Agni and Yama with Jambha.

35. Lord Varuṇa fought with Nairṛta and Bala. Suvīra, the king of Guhyas, fought with Vāyu.

36. Śambhu fought with Īśāna. Śumbha an expert in battle fought with Śeṣa. Kumbha the Asura fought with the Moon.

37. Kuñjara of great strength and exploit, an expert in different kinds of battles, fought with Mihira, using great weapons.

38. Thus the gods and the Asuras, fought duels using their full strength with resolution.

39. O sage, desiring to gain the upper hand and vying with each other, the powerful gods and the Asuras were equally invincible in the battle.

40. The fight between the gods and the Asuras desirous of victory over each other was very tumultuous. It was pleasing to the brave and terrible to the others.

41. The battle ground became impassable and awful with the corpses of the gods and Asuras lying there in thousands but it was very pleasing to the brave.

Continues....

🌹🌹🌹🌹🌹

21 Aug 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 97 / Agni Maha Purana - 97

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 97 / Agni Maha Purana - 97 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 31

🌻. అపామార్జన (ఆత్మ రక్షణ ) విధానము - 4 🌻

స్థావరము, జంగమము, కృత్రిమము, దంతములందు పుట్టినది, నఖములందు పుట్టినది, అకాశమునందు పుట్టినది, సాలెపురుగు మొదలగువాటినుండి పుట్టినది, ఇంకను ఇతరవిధములైన దుఃఖకర మగు విషమును భగవంతుడైన వాసుదేవుని స్మరణము నశింపచేయుగాక. బాలకృష్ణుని చరిత్రముయొక్క కీర్తనము గ్రహ-ప్రేతగ్రహ-డాకినీ పూతనాది గ్రహ-వినాయకగ్రహ - ముఖమండికా - క్రూరరేవతీ - వృద్ధరేవతీ - వృద్ధికానామకోగ్రగ్రహ - మాతృగ్రహాదులగు బాలగ్రహములను నశింప చేయుగాక!

భగవంతుడ వైన నరసివంహా! నీ దృష్టిప్రసారముచే బాలగ్రహములు, యువగ్రహములు, వృద్ధగ్రహాములు దగ్ధము లైపోవుగాక! జూలుతో భయంకర మైన ముఖము కలవాడును, లోకమునకు హితము చేకూర్చువాడును, మహాబలవంతుడును అగు భగవంతు డైన నృసింహుడు సమస్తబాలగ్రహములను నశింపచేయుగాక, ఓ నరసింహా! మహాసింహా! జ్వాలామాలలచే నీ ముఖమండలము ప్రకాశించుచున్నది. ఓ అగ్ని లోచనా! సర్వేశ్వరా! సమస్తగ్రహములను భక్షించుము! భక్షించుము.

పరమాత్ము డైన జనార్దనుడు సర్వాత్మస్వరూపుడు. ఓ వాసుదేవా! ఈ వ్యక్తియందు ఏ రోగములన్నవో, ఏ మహోత్పాతము లున్నవో, ఏ విషమున్నదో, ఏ మహాగ్రము లున్నవో, క్రూరభూతము లున్నవో, దారుణ మైన గ్రహపీడ లున్నవో వాటి నన్నింటిని ఏదియో ఒక రూపము ధరించి నశింపచేయుము. దేవశ్రేష్ఠుడ వైన అచ్యుతా! జ్వాలామాలలచే మిక్కిలి భయంకరమైన సుదర్శనచక్రమును ప్రయోగించి దుష్టరోగలముల నన్నింటిని నశించేయుము.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Agni Maha Purana - 97 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 31

🌻 Mode of cleansing and Protection oneself and others - 4 🌻

27-28. On his (name) being recited, may Janārdana destroy the poisons of animate and inanimate objects, as well as artificially made, those caused by teeth, by nails and those arising from the sky as well as those caused by (insects like) spider and others which cause grief.

29-31. May the life of boyhood of Viṣṇu (Kṛṣṇa) destroy the evil forces which afflict mothers and children,. such as, planets, evil spirits, female goblins, vampires, ghosts, gandharvas, yakṣas, demons, the impeding forces such as Śakuni, Pūtanā and others, (the female forces such as) Mukhamaṇḍī, Revatī and the terrible Vṛddharevatī, and the fierce forces known as Vṛddhaka.

32. May these evil forces which afflict at the old age, and the children and the youth be scorched by the looks of the Manlion.

33. May the dreadful face of the Man-lion of enormous strength destroy these evil forces completely for the welfare of the world.

34. O Man-lion, O Great lion, possessor of garland of flames, Fiery-mouthed, Possessor of fiery eyes, Lord of all, devour the evil forces completely.

35-37. May the Lord of all (beings), Supreme Lord, Janārdana destroy diseases, great portents, poisons, great evil forces, the fierce beings, the afflictions due to the planets whichever is cruel, the injuries caused by weapons, and jvālāgardabhaka[3] etc., assuming any one of the forms of Vāsudeva and hurling the Sudarśana disc which is dreadful like a garland of fire.. O Acyuta, the foremost among gods (you) destroy the evil. forces.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

21 Aug 2022

కపిల గీత - 58 / Kapila Gita - 58

🌹. కపిల గీత - 58 / Kapila Gita - 58🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

2వ అధ్యాయము

🌴 2వ అధ్యాయము - సృష్టి తత్వం - 14 🌴

14. మనోబుద్ధిరహంకారశ్చిత్త మిత్యంతరాత్మకమ్|
చతుర్ధా లక్ష్యతే భేదో వృత్త్యా లక్షణరూపయా॥

మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అను నాల్గింటిని అంతఃకరణచతుష్టయము అందురు. సంకల్పము, నిశ్చయము, చింత, అభిమానము అనునవి వరుసగా ఆ నాల్గింటి వృత్తులు.

సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Kapila Gita - 58 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

✍️ Swami Prabhupada. 📚 Prasad Bharadwaj

🌴 2. Fundamental Principles of Material Nature - 14 🌴

14. mano buddhir ahaṅkāraś cittam ity antar-ātmakam
caturdhā lakṣyate bhedo vṛttyā lakṣaṇa-rūpayā

The internal, subtle senses are experienced as having four aspects, in the shape of mind, intelligence, ego and contaminated consciousness. Distinctions between them can be made only by different functions, since they represent different characteristics.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

21 Aug 2022

21 Aug 2022 Daily Panchang నిత్య పంచాంగము

🌹21, August ఆగస్టు 2022 పంచాగము - Panchangam 🌹

శుభ ఆదివారం, Sunday, భాను వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻

🍀. శ్రీ సూర్య పంజర స్తోత్రం - 23 🍀

22. ఆదిత్యాయ నమః దక్షిణ చక్షూషి మాం రక్షతు ।
సవిత్రే నమః వామచక్షుషి మాం రక్షతు ।

భాస్కరాయ నమః హస్తే మాం రక్షతు ।
అర్కాయ నమః కవచే మాం రక్షతు ॥

23. ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి ।
తన్నో ఆదిత్యః ప్రచోదయాత్ ॥

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : మానవులు భగవానుని ప్రేమించ గలిగి తోటి మానవులను ప్రేమించలేక పోవడమనేది చాల విడ్డూరమైన సంగతి. మరి, అలాంటి వారు ప్రేమిస్తున్న దెవరిని ? 🍀

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శ్రావణ మాసం

దక్షిణాయణం, వర్ష ఋతువు

తిథి: కృష్ణ దశమి 27:37:40 వరకు

తదుపరి కృష్ణ ఏకాదశి

నక్షత్రం: మృగశిర 31:41:47 వరకు

తదుపరి ఆర్ద్ర

యోగం: హర్షణ 22:38:26 వరకు

తదుపరి వజ్ర

కరణం: వణిజ 14:22:27 వరకు

వర్జ్యం: 10:58:14 - 12:46:18

దుర్ముహూర్తం: 16:57:01 - 17:47:32

రాహు కాలం: 17:03:20 - 18:38:03

గుళిక కాలం: 15:28:36 - 17:03:20

యమ గండం: 12:19:08 - 13:53:52

అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:44

అమృత కాలం: 21:46:38 - 23:34:42

సూర్యోదయం: 06:00:12

సూర్యాస్తమయం: 18:38:03

చంద్రోదయం: 00:42:27

చంద్రాస్తమయం: 14:17:54

సూర్య సంచార రాశి: సింహం

చంద్ర సంచార రాశి: వృషభం

సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం 31:41:47

వరకు తదుపరి ధ్వాo క్ష యోగం - ధన

నాశనం, కార్య హాని

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

🍀 21 - AUGUST - 2022 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🍀

🌹🍀 21 - AUGUST - 2022 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🍀🌹
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 21, ఆదివారం, ఆగస్టు 2022 భాను వాసరే  Sunday 🌹
2) 🌹 కపిల గీత - 58 / Kapila Gita - 58 🌹 సృష్టి తత్వము - 14
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 97 / Agni Maha Purana - 97 🌹
4) 🌹. శివ మహా పురాణము - 613 / Siva Maha Purana -613 🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 232 / Osho Daily Meditations - 232 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 400 / Sri Lalitha Chaitanya Vijnanam - 400 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹21,  August ఆగస్టు 2022 పంచాగము - Panchangam  🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు :  లేవు 🌻*

*🍀.  శ్రీ సూర్య పంజర స్తోత్రం - 23 🍀*

*22. ఆదిత్యాయ నమః దక్షిణ చక్షూషి మాం రక్షతు ।*
*సవిత్రే నమః వామచక్షుషి మాం రక్షతు ।*
*భాస్కరాయ నమః హస్తే మాం రక్షతు ।*
*అర్కాయ నమః కవచే మాం రక్షతు ॥*
*23. ఓం భాస్కరాయ విద్మహే  మహాద్యుతికరాయ ధీమహి ।*
*తన్నో ఆదిత్యః ప్రచోదయాత్ ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀.  నేటి సూక్తి : మానవులు భగవానుని ప్రేమించ గలిగి తోటి మానవులను ప్రేమించలేక పోవడమనేది చాల విడ్డూరమైన సంగతి. మరి, అలాంటి వారు ప్రేమిస్తున్న దెవరిని ? 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శ్రావణ మాసం
దక్షిణాయణం, వర్ష ఋతువు
తిథి: కృష్ణ దశమి 27:37:40 వరకు
తదుపరి కృష్ణ ఏకాదశి
నక్షత్రం: మృగశిర 31:41:47 వరకు
తదుపరి ఆర్ద్ర
యోగం: హర్షణ 22:38:26 వరకు
తదుపరి వజ్ర
కరణం: వణిజ 14:22:27 వరకు
వర్జ్యం: 10:58:14 - 12:46:18
దుర్ముహూర్తం: 16:57:01 - 17:47:32
రాహు కాలం: 17:03:20 - 18:38:03
గుళిక కాలం: 15:28:36 - 17:03:20
యమ గండం: 12:19:08 - 13:53:52
అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:44
అమృత కాలం: 21:46:38 - 23:34:42
సూర్యోదయం: 06:00:12
సూర్యాస్తమయం: 18:38:03
చంద్రోదయం: 00:42:27
చంద్రాస్తమయం: 14:17:54
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: వృషభం
సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం 31:41:47
వరకు తదుపరి ధ్వాo క్ష యోగం - ధన
నాశనం, కార్య హాని

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో  నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం  దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 58 / Kapila Gita - 58🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*
*2వ అధ్యాయము*

*🌴 2వ అధ్యాయము - సృష్టి తత్వం  - 14 🌴*

*14. మనోబుద్ధిరహంకారశ్చిత్త మిత్యంతరాత్మకమ్|*
*చతుర్ధా లక్ష్యతే భేదో వృత్త్యా లక్షణరూపయా॥*

*మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అను నాల్గింటిని అంతఃకరణచతుష్టయము అందురు. సంకల్పము, నిశ్చయము, చింత, అభిమానము అనునవి వరుసగా ఆ నాల్గింటి వృత్తులు.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 58 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*✍️  Swami Prabhupada.   📚 Prasad Bharadwaj*

*🌴 2. Fundamental Principles of Material Nature - 14 🌴*

*14. mano buddhir ahaṅkāraś cittam ity antar-ātmakam*
*caturdhā lakṣyate bhedo vṛttyā lakṣaṇa-rūpayā*

*The internal, subtle senses are experienced as having four aspects, in the shape of mind, intelligence, ego and contaminated consciousness. Distinctions between them can be made only by different functions, since they represent different characteristics.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 97 / Agni Maha Purana - 97 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚.  ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః  ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 31*

*🌻. అపామార్జన (ఆత్మ రక్షణ ) విధానము - 4 🌻*

స్థావరము, జంగమము, కృత్రిమము, దంతములందు పుట్టినది, నఖములందు పుట్టినది, అకాశమునందు పుట్టినది, సాలెపురుగు మొదలగువాటినుండి పుట్టినది, ఇంకను ఇతరవిధములైన దుఃఖకర మగు విషమును భగవంతుడైన వాసుదేవుని స్మరణము నశింపచేయుగాక. బాలకృష్ణుని చరిత్రముయొక్క కీర్తనము గ్రహ-ప్రేతగ్రహ-డాకినీ పూతనాది గ్రహ-వినాయకగ్రహ - ముఖమండికా - క్రూరరేవతీ - వృద్ధరేవతీ - వృద్ధికానామకోగ్రగ్రహ - మాతృగ్రహాదులగు బాలగ్రహములను నశింప చేయుగాక!

భగవంతుడ వైన నరసివంహా! నీ దృష్టిప్రసారముచే బాలగ్రహములు, యువగ్రహములు, వృద్ధగ్రహాములు దగ్ధము లైపోవుగాక! జూలుతో భయంకర మైన ముఖము కలవాడును, లోకమునకు హితము చేకూర్చువాడును, మహాబలవంతుడును అగు భగవంతు డైన నృసింహుడు సమస్తబాలగ్రహములను నశింపచేయుగాక, ఓ నరసింహా! మహాసింహా! జ్వాలామాలలచే నీ ముఖమండలము ప్రకాశించుచున్నది. ఓ అగ్ని లోచనా! సర్వేశ్వరా! సమస్తగ్రహములను భక్షించుము! భక్షించుము.

పరమాత్ము డైన జనార్దనుడు సర్వాత్మస్వరూపుడు. ఓ వాసుదేవా! ఈ వ్యక్తియందు ఏ రోగములన్నవో, ఏ మహోత్పాతము లున్నవో, ఏ విషమున్నదో, ఏ మహాగ్రము లున్నవో, క్రూరభూతము లున్నవో, దారుణ మైన గ్రహపీడ లున్నవో వాటి నన్నింటిని ఏదియో ఒక రూపము ధరించి నశింపచేయుము. దేవశ్రేష్ఠుడ వైన అచ్యుతా! జ్వాలామాలలచే మిక్కిలి భయంకరమైన సుదర్శనచక్రమును ప్రయోగించి దుష్టరోగలముల నన్నింటిని నశించేయుము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 97 🌹*
*✍️ N. Gangadharan  📚. Prasad Bharadwaj *

*Chapter 31*
*🌻 Mode of cleansing and Protection oneself and others - 4 🌻*

27-28. On his (name) being recited, may Janārdana destroy the poisons of animate and inanimate objects, as well as artificially made, those caused by teeth, by nails and those arising from the sky as well as those caused by (insects like) spider and others which cause grief.

29-31. May the life of boyhood of Viṣṇu (Kṛṣṇa) destroy the evil forces which afflict mothers and children,. such as, planets, evil spirits, female goblins, vampires, ghosts, gandharvas, yakṣas, demons, the impeding forces such as Śakuni, Pūtanā and others, (the female forces such as) Mukhamaṇḍī, Revatī and the terrible Vṛddharevatī, and the fierce forces known as Vṛddhaka.

32. May these evil forces which afflict at the old age, and the children and the youth be scorched by the looks of the Manlion.

33. May the dreadful face of the Man-lion of enormous strength destroy these evil forces completely for the welfare of the world.

34. O Man-lion, O Great lion, possessor of garland of flames, Fiery-mouthed, Possessor of fiery eyes, Lord of all, devour the evil forces completely.

35-37. May the Lord of all (beings), Supreme Lord, Janārdana destroy diseases, great portents, poisons, great evil forces, the fierce beings, the afflictions due to the planets whichever is cruel, the injuries caused by weapons, and jvālāgardabhaka[3] etc., assuming any one of the forms of Vāsudeva and hurling the Sudarśana disc which is dreadful like a garland of fire.. O Acyuta, the foremost among gods (you) destroy the evil. forces.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 612 / Sri Siva Maha Purana - 612 🌹*
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి  📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః  - అధ్యాయము - 07 🌴*
*🌻. యుద్ధారంభము  - 4 🌻*

తరువాత దేవదానవుల మధ్య వినాశకరమగు ద్వంద్వ యుద్ధము జరిగెను. దానిని చూచి వీరులు ఆనందించిరి. వీరులు కానివారు భయపడిరి (33). ఆ యుద్ధములో బలవంతుడగు తారకాసురుడు ఇంద్రునితో, సంహ్రాదుడు అగ్నితో, జంభుడు యమునితో (34). మహాప్రభుడు న్తెరృతునితో, బలుడు వరుణునితో, సువీరుడు వాయువుతో, పవమానుడు కుబేరునితో (35). రణవిద్యావిశారదుడగు శుంభుడు ఈశానునితో, శుంభుడు శేషునితో, కుంభాసురుడు చంద్రునితో యుద్ధమును చేసిరి (36).

మహాబలుడు, పరాక్రమశాలి, అనేకక యుద్ధముల పాండిత్యము గలవాడునగు కుంబరుడు ఆ సంగ్రాముములో మిహిరునితో పోరాడెను (37). దృఢమగు నిశ్చయము గల దేవదానవులు ఈ తీరున ఆ సంగ్రామములో బలమును ప్రదర్శించి గొప్ప ద్వంద్వయుద్ధమును చేసిరి (38). ఓ మునీ! ఆ దేవాసుర సంగ్రామములో మహాబలురగు దేవతలు, దానవులు ఒకరిని మించి మరియొకరు పోదాడిరి. కాని ఒకరినొకరు జయించలేక పోయిరి (39).

అపుడు జయమును గోరు ఆ దేవదానవులకు తుముల (పక్షముల తేడా తెలియని) యుద్ధము జరిగెను. అభిమానవంతులగు వీరులకు ఆనందమును కలిగించు ఆ యుద్ధము ఇతరులకు భయమును గొల్పెను (40). వేలాదిగా నేలగూలిన దేవదానవులతో భూమి మిక్కిలి భయంకరముగా నుండి, అడుగు పెట్టుటకు చోటు లేకుండెను. అయిననూ వీరులకు మహాసౌఖ్యమే కలిగెను (41).

శ్రీ శివమహాపురాణములో రుద్రసంహితయందు కుమార ఖండలో యుద్ధ ప్రారంభ వర్ణనమనే ఏడవ అధ్యాయము ముగిసినది (7).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 612🌹*
*✍️  J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER  07 🌴*

*🌻 Commencement of the War - 4 🌻*

33. Duels were fought by the gods and the Asuras crushing each other, on seeing which heroes were delighted and cowards were terrified.

34. The Asura Tāraka of great strength fought with Indra, Saṃhrāda with Agni and Yama with Jambha.

35. Lord Varuṇa fought with Nairṛta and Bala. Suvīra, the king of Guhyas, fought with Vāyu.

36. Śambhu fought with Īśāna. Śumbha an expert in battle fought with Śeṣa. Kumbha the Asura fought with the Moon.

37. Kuñjara of great strength and exploit, an expert in different kinds of battles, fought with Mihira, using great weapons.

38. Thus the gods and the Asuras, fought duels using their full strength with resolution.

39. O sage, desiring to gain the upper hand and vying with each other, the powerful gods and the Asuras were equally invincible in the battle.

40. The fight between the gods and the Asuras desirous of victory over each other was very tumultuous. It was pleasing to the brave and terrible to the others.

41. The battle ground became impassable and awful with the corpses of the gods and Asuras lying there in thousands but it was very pleasing to the brave.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 232 / Osho Daily Meditations  - 232 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 232. భూమితో అనుసంధానంతో ఉండండి 🍀*

*🕉. మీ పాదాలలో భూమిని మరింత ఎక్కువగా అనుభూతి చెందండి. 🕉*
 
*కొన్నిసార్లు చెప్పులు లేకుండా భూమిపై నిలబడి దాని చల్లదనాన్ని, దాని మృదుత్వాన్ని, దాని వెచ్చదనాన్ని అనుభూతి చెందండి. ఆ క్షణంలో భూమి ఏమి ఇవ్వడానికి సిద్ధంగా ఉందో, దానిని అనుభూతి చెందండి మరియు మీ ద్వారా ప్రవహించ నివ్వండి. మరియు మీ శక్తిని భూమిలోకి ప్రవహించ నివ్వండి. భూమితో అనుసంధానించ బడి ఉండండి. చాలా మంది వ్యక్తులు నాభి వరకు ఊపిరి పీల్చుకుంటారు కానీ అంతకు మించి కాదు, కాబట్టి సగం శరీరం దాదాపు పక్షవాతానికి గురవుతుంది మరియు దాని కారణంగా సగం జీవితం కూడా స్తంభించి పోతుంది. అప్పుడు చాలా విషయాలు అసాధ్యంగా మారతాయి... ఎందుకంటే శరీరంలోని కింది భాగం మూలాల వలె పనిచేస్తుంది. కాళ్ళు మూలాలు, మరియు అవి మిమ్మల్ని భూమితో కలుపుతాయి.  ప్రజలు భూమితో సంబంధం లేకుండా దెయ్యాలలా వేలాడుతున్నారు. ఒకరు తిరిగి పాదాలకు కదలాలి.*

*లావోట్జు తన శిష్యులతో ఇలా అంటుండే వాడు, 'మీరు మీ పాదాల నుండి ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించక పోతే, మీరు నా శిష్యులు కాదు'.  - మీ పాదాల నుండి ఊపిరి పీల్చుకోవడం - అతను సరిగ్గా అన్నాడు. మీరు ఎంత లోతుగా వెళ్తే, మీ శ్వాస అంత లోతుగా సాగుతుంది. మీ జీవి యొక్క సరిహద్దు మీ శ్వాస యొక్క సరిహద్దు అని దాదాపు నిజం. సరిహద్దు పెరిగి, మీ పాదాలను తాకినప్పుడు, మీ శ్వాస దాదాపు పాదాలకు చేరుకుంటుంది- శారీరక కోణంలో కాదు, మానసిక కోణంలో - అప్పుడు మీరు మీ మొత్తం శరీరాన్ని సొంతం చేసుకున్నారు. మొదటి సారి మీరు పూర్తిగా, ఒక ఏక భాగంగా కలిసి ఉన్నారు.*
 
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 232 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 232. Be connected with the Earth 🍀*

*🕉. Feel Earth more and more in your feet.  🕉*
 
*Sometimes just stand on the earth without shoes and feel its coolness, its softness, its warmth. Whatever the earth is ready to give in that moment, just feel it and let it flow through you. And allow your energy to flow into the earth. Be connected with the earth.  At most people breathe down to the navel but not beyond that, so half the body is almost paralyzed, and because of it, half of life is also paralyzed. Then many things become impossible... because the lower part of the body functions like roots. The legs are the roots, and they connect you with the earth. So people are hanging like ghosts, unconnected with the earth. One has to move back to the feet.*

*Lao Tzu used to say to his' disciples, "Unless you start breathing from the soles of your feet, you are not my disciples." Breathing from the soles of your feet-and he is perfectly right. The deeper you go, the deeper goes your breath. It is almost true that the boundary of your being is the boundary of your breath. When the boundary increases and touches your feet, your breath almost reaches to the feet-not in a physiological sense, but in a psychological sense--then you have claimed your whole body. For the first time you are whole, of one piece, together.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 400 / Sri Lalitha Chaitanya Vijnanam  - 400 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  87. వ్యాపినీ, వివిధాకారా, విద్యాఽవిద్యా స్వరూపిణీ ।
మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ॥ 87 ॥ 🍀*

*🌻 400. 'వ్యాపినీ' 🌻*

*సమస్త జగత్తు నందునూ వ్యాపించినది శ్రీమాత అని అర్థము. పరము నుండి మూల ప్రకృతిగను, అటుపైన అవ్యక్తగను, ఆపైన వ్యక్తా వ్యక్త స్వరూపిణిగను పరిణమించు శ్రీమాత ఇచ్ఛా జ్ఞాన
క్రియ లను మూడు విధములైన అహంకారములను దాల్చి ప్రకృతి సర్గములుగ (లోకములుగ) పరిణమించును. ఇట్లు జగత్తంతయూ వ్యాపించును. ఇట్లు వ్యాప్తిచెంది విశ్వరూపమై నిలచును. శ్రీమాత వ్యాపక శక్తి అణువునుండి బ్రహ్మాండము వరకు పనిచేయు చుండును. ఆమె లేని జగత్తు లేదు. తాను వ్యాప్తిచెందిన జగత్తును కూడ అతిక్రమించి వసించును. అటుపైన వివిధ ఆకారములు ధరించును.*

*'వివిధాకార' అను నామముతో పంచమ శతకము ప్రారంభమగును. ఈ నాలుగవ శతకము వ్యాపిని నామముతో పరిసమాప్త మగుచున్నది. శ్రీమాత అనుగ్రహముగల భక్తులు దివ్యేచ్ఛ, దివ్యజ్ఞానములను శ్రీమాత అనుగ్రహము పొంది దివ్యకార్యములను నిర్వర్తించుచు సృష్టి యందు వ్యాప్తి చెందుచునే యున్నారు. శ్రీమాత నారాధించు వారికి యిట్టి వ్యాప్తి శ్రీమాత అనుగ్రహించవలెనని ప్రార్థన చేయుచు ఈ చతుర్థ శతకమును శ్రీమాత పాదముల చెంత సమర్పించుచు పరిసమాప్తము చేయబడు చున్నది. పంచమ శతకమున కిది పునాదియై
నిలువవలెనని ప్రార్థన.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 400 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma   📚. Prasad Bharadwaj*

*🌻 87. Vyapini vividhakara vidya vidya svarupini
Mahakameshanayana kumudahlada kaomudi ॥ 87 ॥ 🌻*

*🌻 400. Vyāpinī व्यापिनी 🌻*

*She is all pervading.  Because She is mūlaprakṛtiḥ and avykatā, She is all pervading.  She is also called eka elsewhere, because She is the one who is all pervading, the nature of the Brahman.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹