శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 549 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 549 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 549 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 549 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।
సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀

🌻 549. 'విద్యా' - 2 🌻


శ్రీమాత అనుగ్రహమున్నచో అన్ని విద్యలు తెలియవచ్చును. కాళిదాసు ఆదిగా గల కవులు అట్లే తెలిసికొనిరి. ఆమె అనుగ్రహము లేనిదే విద్యల యందు రాణించుట దుర్లభము. ఆమె అనుగ్రహమున మాత్రమే మాయను దాట వచ్చును. ఏ విద్య నేర్చువారైననూ ప్రప్రథమముగ శ్రీమాతను ఆరాధించుట నిజమగు ఉపాయము. కనుకనే భారతీయ సంప్రదాయమున విద్యార్జనము చేయువారు సరస్వతీ రూపమున శ్రీమాతను ఆరాధింతురు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 549 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh
sarvavyadhi prashamani sarvamrutyu nivarini ॥112 ॥ 🌻

🌻 549. 'Vidya' - 2 🌻

With the grace of Srimata, all skills can be known. Poets like Kalidasa came to know the same way. It is impossible to excel in skills without her grace. Maya can be crossed only by her grace. Worshiping Srimata first and foremost is a good practice for any learner. That is why those who study in Indian tradition worship Srimata in the form of Saraswati.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


సిద్దేశ్వరయానం - 88 Siddeshwarayanam - 88

🌹 సిద్దేశ్వరయానం - 88 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 19 వ శతాబ్దం-ఆంధ్రదేశానికి ప్రయాణం 🏵


పరమాత్మస్వామి ఈ సారి కాశీలో చాలాకాలం ఉన్నారు. వివిధ ప్రదేశాలనుండి భక్తులు వస్తున్నారు పోతున్నారు. కుంభమేళా ఉత్సవాలు ఈ సారి ఇక్కడ రావటం వల్ల నగరమంతా కోలాహలంగా ఉంది. వీటి కోసమే స్వామివారు ఇన్నాళ్ళు వారణాసిలో ఉండటం. దిగంబరులైన నాగసాధువులు కొన్ని వందలమంది రావటం ప్రత్యేక విశేషం. ఒంటినిండా భస్మం పూసుకొన్న వారు త్రిశూలధారులు జటాజూటములు దాల్చినవారు. చిత్ర చిత్రంగా ప్రకాశిస్తున్న వారు వీరిలో ఉన్నారు. హిమాలయాలనుండి మహనీయులైన యోగులెందరో వచ్చారు. కైలాసగుహావాసులైన సిద్ధులు సిద్ధాశ్రమానికి చెందిన మహాపురుషులు గంగాస్నానానికి విశాలాక్షీ విశ్వేశ్వరుల దర్శనానికి, కాలభైరవుని పూజించటానికి యాత్రికులెందరో అరుగుదెంచారు. మంచుకొండల నుండి వచ్చిన శతసహస్రవర్ష జీవులను పలకరించి వారిలో పూర్వమిత్రులు కొందరికి ఆతిథ్యమిచ్చి ఆ రోజులు విశ్రాంతి రహితంగా గడిపారు.

స్వామీజీ ఆ సంరంభం అయిపోయిన తర్వాత కాశీ విడిచి వెళ్ళ వలసిన సమయం వచ్చింది. భైరవాదేశం ప్రకారం తాను ఆంధ్రదేశానికి వెళ్ళాలి. ఉదయం పెందలకడ గంగాస్నానం చేసి అన్నపూర్ణా విశాలాక్షి విశ్వేశ్వరులను పూజించి డుంఠిగణపతికి మ్రొక్కి, సాక్షి గణపతికంజలించి, దండపాణిని ప్రస్తుతించి, కామాఖ్యకాళికి ప్రణతులర్పించి, ప్రధాన దేవతా మందిరాలన్నీ దర్శించి కాలభైరవుని దగ్గరకు వెళ్ళి విన్నవించుకొని సెలవిమ్మని ప్రార్థించాడు.

ఉ॥ అచ్చపు భక్తితో బహుశతాబ్దములిచ్చట ఉండిపోవుచున్ ముచ్చటతోడ నీ కడనె మోహనరాగము పాడినాడ న న్నెచ్చటనో జనించుటకు ఎందుకు పంపితి వైననేమి నే వచ్చెడునట్లు చేయగదె! భైరవ! పూర్వము గుర్తు చేయుచున్

సపరివారంగా బయలుదేరి వారణాసి విడిచి వెళుతుంటే పూర్వ కాలంలో అగస్త్యమహర్షికి కలిగినట్లు చాలాబాధ కలిగింది. మనస్సు వేదన చెందుతున్నది.

నెమ్మదిగా తప్పనిసరియై కాశీనివీడి ప్రయాగ చేరి మాధవుని దర్శించి అష్టాదశ పీఠములలోని లలితాంబకు మ్రొక్కి త్రోవలోని క్షేత్రములను అక్కడి దేవతలను అర్చిస్తూ కొల్హాపూర్ చేరి దారుణ ఖడ్గధారతో కోలాసురుని సంహరించిన మహాలక్ష్మిని పూజించి కాశీ వియోగ దుఃఖితుడైన అగస్త్య మహర్షిని ఓదార్చి వచ్చే మహాయుగంలో వ్యాసుడు కాగలవని వరమిచ్చిన ఆ జగన్మాతకు అంజలించి తనకుగూడ త్వరలో మళ్ళీ కాశీవాసం లభించేలా అనుగ్రహించమని ప్రార్థించాడు.

అచటి నుండి కదలి ఆంధ్రదేశంలో ప్రవేశించి దక్షారామం చేరి గోదావరీ స్నానం చేసి ఆ గౌతమీ గంగ ఒడ్డున ఉన్న భీమేశ్వరాలయానికి వెళ్ళి ఆ స్వామిని దర్శించగానే కాశీవిశ్వేశ్వరునకు ఈ తెలుగు శివునకు గల భేదం గోచరించింది.

సీ || గజచర్మమెన్నడోగాని నిచ్చలుకట్టు పసిడి కమ్ముల పట్టుపచ్చడంబు భసితమెన్నడొ గాని ప్రతిదినంబునలందు మలయజంబు కురంగ మదము గూర్చి నిడుదపాముల రాజు తొడవు లెన్నడొగాని తారహారములు నిత్యము ధరించు నృకరండరుండ మాలిక యెన్నడోగాని ధరియించు కల్హార దామకంబు

గీ ||కాటినడుచక్కి నెన్నడోగాని ఉండు దక్షవాటి సువర్ణ సౌధముల మీద ఎన్నడొ పిశాచులను గానఇందుముఖుల నెల్లవేళల దలచు భీమేశ్వరుండు.-శ్రీనాథుడు

బంగారుజరీ ధోవతి ధరించి రత్నహారములతో చందన కస్తూరీ సుగంధ ద్రవ్యానులేపనంతో గంధర్వాప్సరసలతో బంగారు మేడలయందు శృంగార విలాస పురుషునిగా ప్రకాశిస్తున్న ఆ పరమశివుని లీలలకు ఆశ్చర్యం కలిగింది.

( సశేషం )

🌹🌹🌹🌹🌹

శ్రీమద్భగవద్గీత - 545: 14వ అధ్., శ్లో 21 / Bhagavad-Gita - 545: Chap. 14, Ver. 21

 

🌹. శ్రీమద్భగవద్గీత - 545 / Bhagavad-Gita - 545 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 21 🌴

21. అర్జున ఉపాచ

కైర్లింగైః త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో ।
కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే ।। 21 ।।


🌷. తాత్పర్యం : అర్జునుడు ప్రశ్నించెను : హే ప్రభూ! ఈ త్రిగుణములకు అతీతుడైనవాడు ఏ లక్షణముల ద్వారా తెలియబడును? అతని ప్రవర్తనమెట్టిది? ప్రకృతి త్రిగుణములను అతడు ఏ విధముగా అధిగమించును?

🌷. భాష్యము : ఈ శ్లోకమునందలి అర్జునుని ప్రశ్నలు మిగుల సమంజసముగా నున్నవి. త్రిగుణములను దాటినట్టి మహాత్ముని లక్షణములను అతడు తెలిసికొనగోరుచున్నాడు. అట్టి త్రిగుణాతీత మహాత్ముని లక్షణములను తొలుత అతడు విచారణ కావించుచున్నాడు. అట్టివాడు త్రిగుణ ప్రభావమును ఇదివరకే దాటియున్నాడని మనుజుడు ఎట్లు జీవించునో, అతని కర్మలేవియో అర్జునుడు అడుగుచున్నాడు.

ఆ కర్మలు నియమబద్ధములైనవా లేక నియమబద్ధములు కానివా! పిదప అర్జునుడు అట్టి దివ్యస్వభావమును పొందగలిగే మార్గమును గూర్చి ప్రశ్నించుచున్నాడు. ఈ విషయము అత్యంత ముఖ్యమైనది. సర్వదా దివ్యస్థితి యందు నిలుచుటకు ప్రత్యక్షమార్గమును తెలియనిదే ఎవ్వరును అట్టి దివ్యలక్షణములను కలిగియుండు నవకాశము లేదు.

కనుకనే అర్జునుడు అడిగిన ఈ ప్రశ్నలన్నియును అత్యంత ముఖ్యమై యున్నవి. శ్రీకృష్ణుడు ఆ ప్రశ్నలన్నింటికిని సమాధానమొసగుచున్నాడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 545 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 21 🌴


21. arjuna uvāca

kair liṅgais trīn guṇān etān atīto bhavati prabho
kim-ācāraḥ kathaṁ caitāṁs trīn guṇān ativartate


🌷 Translation : Arjuna inquired: O my dear Lord, by which symptoms is one known who is transcendental to these three modes? What is his behavior? And how does he transcend the modes of nature?

🌹 Purport : In this verse, Arjuna’s questions are very appropriate. He wants to know the symptoms of a person who has already transcended the material modes. He first inquires of the symptoms of such a transcendental person.

How can one understand that he has already transcended the influence of the modes of material nature? The second question asks how he lives and what his activities are. Are they regulated or nonregulated? Then Arjuna inquires of the means by which he can attain the transcendental nature.

That is very important. Unless one knows the direct means by which one can be situated always transcendentally, there is no possibility of showing the symptoms. So all these questions put by Arjuna are very important, and the Lord answers them.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 27, JUNE 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు🌹

🍀🌹 27, JUNE 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు🌹🍀
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 545 / Bhagavad-Gita - 545 🌹
🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 21 / Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 21 🌴
3) 🌹 సిద్దేశ్వరయానం - 88 🌹
🏵 19 వ శతాబ్దం-ఆంధ్రదేశానికి ప్రయాణం 🏵
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 549 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 549 - 2 🌹 
🌻 549. 'విద్యా' - 2 / 549. 'Vidya' - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీమద్భగవద్గీత - 545 / Bhagavad-Gita - 545 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 21 🌴*

*21. అర్జున ఉపాచ*
*కైర్లింగైః త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో ।*
*కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే ।। 21 ।।*

*🌷. తాత్పర్యం : అర్జునుడు ప్రశ్నించెను : హే ప్రభూ! ఈ త్రిగుణములకు అతీతుడైనవాడు ఏ లక్షణముల ద్వారా తెలియబడును? అతని ప్రవర్తనమెట్టిది? ప్రకృతి త్రిగుణములను అతడు ఏ విధముగా అధిగమించును?*

*🌷. భాష్యము : ఈ శ్లోకమునందలి అర్జునుని ప్రశ్నలు మిగుల సమంజసముగా నున్నవి. త్రిగుణములను దాటినట్టి మహాత్ముని లక్షణములను అతడు తెలిసికొనగోరుచున్నాడు. అట్టి త్రిగుణాతీత మహాత్ముని లక్షణములను తొలుత అతడు విచారణ కావించుచున్నాడు. అట్టివాడు త్రిగుణ ప్రభావమును ఇదివరకే దాటియున్నాడని మనుజుడు ఎట్లు జీవించునో, అతని కర్మలేవియో అర్జునుడు అడుగుచున్నాడు.*

*ఆ కర్మలు నియమబద్ధములైనవా లేక నియమబద్ధములు కానివా! పిదప అర్జునుడు అట్టి దివ్యస్వభావమును పొందగలిగే మార్గమును గూర్చి ప్రశ్నించుచున్నాడు. ఈ విషయము అత్యంత ముఖ్యమైనది. సర్వదా దివ్యస్థితి యందు నిలుచుటకు ప్రత్యక్షమార్గమును తెలియనిదే ఎవ్వరును అట్టి దివ్యలక్షణములను కలిగియుండు నవకాశము లేదు.*

*కనుకనే అర్జునుడు అడిగిన ఈ ప్రశ్నలన్నియును అత్యంత ముఖ్యమై యున్నవి. శ్రీకృష్ణుడు ఆ ప్రశ్నలన్నింటికిని సమాధానమొసగుచున్నాడు.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 545 🌹
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 21 🌴*

*21. arjuna uvāca*
*kair liṅgais trīn guṇān etān atīto bhavati prabho*
*kim-ācāraḥ kathaṁ caitāṁs trīn guṇān ativartate*

*🌷 Translation : Arjuna inquired: O my dear Lord, by which symptoms is one known who is transcendental to these three modes? What is his behavior? And how does he transcend the modes of nature?*

*🌹 Purport : In this verse, Arjuna’s questions are very appropriate. He wants to know the symptoms of a person who has already transcended the material modes. He first inquires of the symptoms of such a transcendental person.*

*How can one understand that he has already transcended the influence of the modes of material nature? The second question asks how he lives and what his activities are. Are they regulated or nonregulated? Then Arjuna inquires of the means by which he can attain the transcendental nature.*

*That is very important. Unless one knows the direct means by which one can be situated always transcendentally, there is no possibility of showing the symptoms. So all these questions put by Arjuna are very important, and the Lord answers them.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 సిద్దేశ్వరయానం - 88 🌹*

*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
                     
*🏵 19 వ శతాబ్దం-ఆంధ్రదేశానికి ప్రయాణం 🏵*

*పరమాత్మస్వామి ఈ సారి కాశీలో చాలాకాలం ఉన్నారు. వివిధ ప్రదేశాలనుండి భక్తులు వస్తున్నారు పోతున్నారు. కుంభమేళా ఉత్సవాలు ఈ సారి ఇక్కడ రావటం వల్ల నగరమంతా కోలాహలంగా ఉంది. వీటి కోసమే స్వామివారు ఇన్నాళ్ళు వారణాసిలో ఉండటం. దిగంబరులైన నాగసాధువులు కొన్ని వందలమంది రావటం ప్రత్యేక విశేషం. ఒంటినిండా భస్మం పూసుకొన్న వారు త్రిశూలధారులు జటాజూటములు దాల్చినవారు. చిత్ర చిత్రంగా ప్రకాశిస్తున్న వారు వీరిలో ఉన్నారు. హిమాలయాలనుండి మహనీయులైన యోగులెందరో వచ్చారు. కైలాసగుహావాసులైన సిద్ధులు సిద్ధాశ్రమానికి చెందిన మహాపురుషులు గంగాస్నానానికి విశాలాక్షీ విశ్వేశ్వరుల దర్శనానికి, కాలభైరవుని పూజించటానికి యాత్రికులెందరో అరుగుదెంచారు. మంచుకొండల నుండి వచ్చిన శతసహస్రవర్ష జీవులను పలకరించి వారిలో పూర్వమిత్రులు కొందరికి ఆతిథ్యమిచ్చి ఆ రోజులు విశ్రాంతి రహితంగా గడిపారు.* 

*స్వామీజీ ఆ సంరంభం అయిపోయిన తర్వాత కాశీ విడిచి వెళ్ళ వలసిన సమయం వచ్చింది. భైరవాదేశం ప్రకారం తాను ఆంధ్రదేశానికి వెళ్ళాలి. ఉదయం పెందలకడ గంగాస్నానం చేసి అన్నపూర్ణా విశాలాక్షి విశ్వేశ్వరులను పూజించి డుంఠిగణపతికి మ్రొక్కి, సాక్షి గణపతికంజలించి, దండపాణిని ప్రస్తుతించి, కామాఖ్యకాళికి ప్రణతులర్పించి, ప్రధాన దేవతా మందిరాలన్నీ దర్శించి కాలభైరవుని దగ్గరకు వెళ్ళి విన్నవించుకొని సెలవిమ్మని ప్రార్థించాడు.*

*ఉ॥ అచ్చపు భక్తితో బహుశతాబ్దములిచ్చట ఉండిపోవుచున్ ముచ్చటతోడ నీ కడనె మోహనరాగము పాడినాడ న న్నెచ్చటనో జనించుటకు ఎందుకు పంపితి వైననేమి నే వచ్చెడునట్లు చేయగదె! భైరవ! పూర్వము గుర్తు చేయుచున్*

*సపరివారంగా బయలుదేరి వారణాసి విడిచి వెళుతుంటే పూర్వ కాలంలో అగస్త్యమహర్షికి కలిగినట్లు చాలాబాధ కలిగింది. మనస్సు వేదన చెందుతున్నది.*

*నెమ్మదిగా తప్పనిసరియై కాశీనివీడి ప్రయాగ చేరి మాధవుని దర్శించి అష్టాదశ పీఠములలోని లలితాంబకు మ్రొక్కి త్రోవలోని క్షేత్రములను అక్కడి దేవతలను అర్చిస్తూ కొల్హాపూర్ చేరి దారుణ ఖడ్గధారతో కోలాసురుని సంహరించిన మహాలక్ష్మిని పూజించి కాశీ వియోగ దుఃఖితుడైన అగస్త్య మహర్షిని ఓదార్చి వచ్చే మహాయుగంలో వ్యాసుడు కాగలవని వరమిచ్చిన ఆ జగన్మాతకు అంజలించి తనకుగూడ త్వరలో మళ్ళీ కాశీవాసం లభించేలా అనుగ్రహించమని ప్రార్థించాడు.*

*అచటి నుండి కదలి ఆంధ్రదేశంలో ప్రవేశించి దక్షారామం చేరి గోదావరీ స్నానం చేసి ఆ గౌతమీ గంగ ఒడ్డున ఉన్న భీమేశ్వరాలయానికి వెళ్ళి ఆ స్వామిని దర్శించగానే కాశీవిశ్వేశ్వరునకు ఈ తెలుగు శివునకు గల భేదం గోచరించింది.*

*సీ || గజచర్మమెన్నడోగాని నిచ్చలుకట్టు పసిడి కమ్ముల పట్టుపచ్చడంబు భసితమెన్నడొ గాని ప్రతిదినంబునలందు మలయజంబు కురంగ మదము గూర్చి నిడుదపాముల రాజు తొడవు లెన్నడొగాని తారహారములు నిత్యము ధరించు నృకరండరుండ మాలిక యెన్నడోగాని ధరియించు కల్హార దామకంబు*

*గీ ||కాటినడుచక్కి నెన్నడోగాని ఉండు దక్షవాటి సువర్ణ సౌధముల మీద ఎన్నడొ పిశాచులను గానఇందుముఖుల నెల్లవేళల దలచు భీమేశ్వరుండు.-శ్రీనాథుడు*

*బంగారుజరీ ధోవతి ధరించి రత్నహారములతో చందన కస్తూరీ సుగంధ ద్రవ్యానులేపనంతో గంధర్వాప్సరసలతో బంగారు మేడలయందు శృంగార విలాస పురుషునిగా ప్రకాశిస్తున్న ఆ పరమశివుని లీలలకు ఆశ్చర్యం కలిగింది.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 549 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 549 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।*
*సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀*

*🌻 549. 'విద్యా' - 2 🌻*

*శ్రీమాత అనుగ్రహమున్నచో అన్ని విద్యలు తెలియవచ్చును. కాళిదాసు ఆదిగా గల కవులు అట్లే తెలిసికొనిరి. ఆమె అనుగ్రహము లేనిదే విద్యల యందు రాణించుట దుర్లభము. ఆమె అనుగ్రహమున మాత్రమే మాయను దాట వచ్చును. ఏ విద్య నేర్చువారైననూ ప్రప్రథమముగ శ్రీమాతను ఆరాధించుట నిజమగు ఉపాయము. కనుకనే భారతీయ సంప్రదాయమున విద్యార్జనము చేయువారు సరస్వతీ రూపమున శ్రీమాతను ఆరాధింతురు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 549 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh*
*sarvavyadhi prashamani sarvamrutyu nivarini  ॥112 ॥ 🌻*

*🌻 549. 'Vidya' - 2 🌻*

*With the grace of Srimata, all skills can be known. Poets like Kalidasa came to know the same way. It is impossible to excel in skills without her grace. Maya can be crossed only by her grace. Worshiping Srimata first and foremost is a good practice for any learner. That is why those who study in Indian tradition worship Srimata in the form of Saraswati.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj