🍀 18, JANUARY 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🍀

🌹🍀 18, JANUARY 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 18, JANUARY 2023 WEDNESDAY, బుధవారం, సౌమ్య వాసరే నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 313 / Bhagavad-Gita -313 🌹 🌴 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం / Akshara Brahma Yoga - 03 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 160 / Agni Maha Purana - 160 🌹 🌻. మత్స్యాది దశావతార ప్రతిమా లక్షణములు - 5 / Characteristics of forms of ‘Fish’ etc. of Viṣṇu - 5 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 025 / DAILY WISDOM - 025 🌹 🌻 25. నిజమైన ప్రేమ ఎప్పుడూ వ్యక్తపరచబడదు / True Love is Never Expressed🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 290 🌹
6) 🌹. శివ సూత్రములు - 27 / Siva Sutras - 27 🌹 🌻 8. జ్ఞానం జాగృత, 9. స్వప్నో వికల్పం, 10. అవివేకో మాయా సుషుప్తం - 2 / 8.Jñānaṁ jāgrat, 9. Svapno vikalpāḥ, 10. Aviveko māyāsauṣuptam -2🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹18, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌺. పండుగలు మరియు పర్వదినాలు : సత్తీల ఏకాదశి, Shattila Ekadashi 🌺*

*🍀. శ్రీ గణేశ హృదయం - 4‌ 🍀*

6. మాయాస్వరూపం తు సదైకవాచకం
దంతః పరో మాయికరూపధారకః |
యోగే తయోరేకరదం సుమానిని
ధీస్థం నతోఽహం జనభక్తిలాలసమ్

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : సాధకుడు శక్తుల కొరకై తంటాలు పడరాదు. లభ్యపడిన శక్తులు తనవిగా భావించరాదు. దైవేచ్ఛ నెరవేర్చే నిమిత్తం వాటిని దైవం అనుగ్రహించినవిగా తలపోయాలి. స్వార్థం కొరకు వాటిని దుర్వినియోగం చేయకుండ జాగ్ర తపడాలి. వాటిని చూచుకొని గర్వించకూడదు. దేవం చేతిలో తాను సాధనం కాగలిగానన్న అహంభావానికి సైతం తావీయ రాదు. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌, హేమంత ఋతువు,
ఉత్తరాయణం, పౌష్య మాసం
తిథి: కృష్ణ ఏకాదశి 16:04:06 వరకు
తదుపరి కృష్ణ ద్వాదశి
నక్షత్రం: అనూరాధ 17:23:41 వరకు
తదుపరి జ్యేష్ఠ
యోగం: వృధ్ధి 26:47:29 వరకు
తదుపరి ధృవ
కరణం: బాలవ 15:57:06 వరకు
వర్జ్యం: 22:29:50 - 23:57:30
దుర్ముహూర్తం: 12:03:53 - 12:48:48
రాహు కాలం: 12:26:20 - 13:50:33
గుళిక కాలం: 11:02:07 - 12:26:20
యమ గండం: 08:13:41 - 09:37:54
అభిజిత్ ముహూర్తం: 12:04 - 12:48
అమృత కాలం: 07:35:24 - 09:05:48
సూర్యోదయం: 06:49:28
సూర్యాస్తమయం: 18:03:13
చంద్రోదయం: 02:57:31
చంద్రాస్తమయం: 14:20:37
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు: సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం
17:23:41 వరకు తదుపరి ధ్వాo క్ష యోగం
- ధన నాశనం, కార్య హాని 
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻    

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీమద్భగవద్గీత - 313 / Bhagavad-Gita - 313 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 03 🌴*

*03. శ్రీభగవానువాచ*
*అక్షరం బ్రహ్మ పరమం స్వభావో ఆధ్యాత్మముచ్యతే |*
*భూతభావోద్భవకరో విసర్గ: కర్మసంజ్ఞిత: ||*

🌷. తాత్పర్యం :
*శ్రీకృష్ణభగవానుడు పలికెను : నాశరహితమును, దివ్యమును అగు జీవుడే బ్రహ్మమనియు మరియు అతని నిత్యస్వభావమే ఆధ్యాత్మమనియు చెప్పబడును. జీవుల దేహోద్భవమునకు సంబంధించిన కార్యమే కర్మము (కామ్యకర్మలు) అనబడును.*

🌷. భాష్యము :
బ్రహ్మము నాశరహితమును మరియు శాశ్వతమును అయి యున్నది. కాలములో దాని సహజస్థితి యందు ఎట్టి మార్పు ఉండదు. అట్టి బ్రహ్మమునకు పరముగా నున్నదే పరబ్రహ్మము. బ్రహ్మము జీవుని సూచించగా పరబ్రహ్మము దేవదేవుడైన శ్రీకృష్ణుని సూచించును. అట్టి జీవుడు భౌతికజగత్తు నందు స్వీకరించెడి స్థితి అతని నిజస్థితి భిన్నమైనటువంటిది. 

భౌతికచైతన్యములో అతడు ప్రకృతితో ప్రభువుగా నగుటకు యత్నించినను ఆధ్యాత్మిక చైతన్యములో (కృష్ణభక్తిభావన యందు) మాత్రము శ్రీకృష్ణభగవానునికి దాసునిగా వర్తించును. అట్టి భౌతికచైతన్యము నందున్నంత కాలము అతడు భౌతికజగమున వివిధములైన దేహములను పొందవలసివచ్చును. అదియే భౌతికచైతన్యపు ప్రభావము వలన కలిగెడి విభిన్నసృష్టి లేదా కర్మము అనబడును.

వేదవాజ్మయమునందు జీవుడు జీవాత్మగా మరియు బ్రహ్మముగా పిలువబడెనే గాని పరబ్రహ్మముగా ఎన్నడును పిలువబడలేదు. అట్టి జీవుడు కొన్నిమార్లు భౌతికచైతన్యముతో తాదాత్మ్యము చెంది తనను భౌతికమని భావించును. మరికొన్నిమార్లు ఉన్నతమైన ఆధ్యాత్మికశక్తితో తనను గుర్తించుచుండును. ఈ విధముగా అతడు వివధగతులను పొందుచుండును. కనుకనే అతడు శ్రీకృష్ణభగవానుని తటస్థశక్తిగా పిలువబడినాడు. అతని భౌతిక, ఆధ్యాత్మిక తాదాత్మ్యము ననుసరించి అతడు భౌతికదేహమునుగాని లేదా ఆధ్యాత్మికదేహమునుగాని పొందుచుండును. భౌతికప్రకృతిలో అతడు ఎనుమదినాలుగులక్షల జీవరాసులలోని ఏదేని ఒక జన్మను పొందినను ఆధ్యాత్మిక స్వభావమున మాత్రము ఒకే దివ్యదేహమును కలిగి యుండును. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 313 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 03 🌴*

*03. śrī-bhagavān uvāca*
*akṣaraṁ brahma paramaṁ svabhāvo ’dhyātmam ucyate*
*bhūta-bhāvodbhava-karo visargaḥ karma-saṁjñitaḥ*

🌷 Translation : 
*The Supreme Personality of Godhead said: The indestructible, transcendental living entity is called Brahman, and his eternal nature is called adhyātma, the self. Action pertaining to the development of the material bodies of the living entities is called karma, or fruitive activities.*

🌹 Purport :
Brahman is indestructible and eternally existing, and its constitution is not changed at any time. But beyond Brahman there is Para-brahman. Brahman refers to the living entity, and Para-brahman refers to the Supreme Personality of Godhead. The constitutional position of the living entity is different from the position he takes in the material world. In material consciousness his nature is to try to be the lord of matter, but in spiritual consciousness, Kṛṣṇa consciousness, his position is to serve the Supreme. When the living entity is in material consciousness, he has to take on various bodies in the material world. That is called karma, or varied creation by the force of material consciousness.

In Vedic literature the living entity is called jīvātmā and Brahman, but he is never called Para-brahman. The living entity (jīvātmā) takes different positions – sometimes he merges into the dark material nature and identifies himself with matter, and sometimes he identifies himself with the superior, spiritual nature. Therefore he is called the Supreme Lord’s marginal energy. According to his identification with material or spiritual nature, he receives a material or spiritual body. In material nature he may take a body from any of the 8,400,000 species of life, but in spiritual nature he has only one body. 
🌹 🌹 🌹🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 159 / Agni Maha Purana - 159 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 49*

*🌻. మత్స్యాది దశావతార ప్రతిమా లక్షణములు - 5 🌻*

విశ్వరూపుని విగ్రహము ఇరువది చేతులతో ప్రకాశించు చుండును. కుడిచేతులలో చక్ర-ఖడ్గ-ముసల-అంకశ-పట్టిశ-ముద్గర-పాశ-శక్తి-శూల-బాణములను, ఎడమ చేతులలో శంఖ-శార్జ-గదా-పాశ-తోమర-హల-పరశు-దండ- ఛురికా (చాకు)- చర్మలను ధరించి యుండును. కుడి వైపున చతుర్భుజుడగు బ్రహ్మ, ఎడమవైపున త్రినేత్రుడును ఉందురు. జలశాయి జలములో శయనించి ఉండును. ఈ మూర్తిని శేషశయ్యపై శయనించి యున్నట్లు చేయవలెను. లక్ష్మీదేవి ఒక పాదము ఒత్తు చుండును. 

విమల మొదలగు శక్తులు స్తుతించుచుండును. ఈ శ్రీహరి నాభికమలమున చతుర్భుజుడగు బ్రహ్మ ప్రకాశించుచుండును. హరిహరమూర్తి కుడిచేతులలో శూల-ఋష్టులను, ఎడమచేతులలో గదా చక్రములను ధరించియుండును. శరీరము కుడిభాగమున రుద్రచిహ్నములు, ఎడమభాగమున కేశవచిహ్నములు ఉండును. దక్షిణపార్శ్వవమున పార్వతి, వామపార్శ్వమున లక్ష్మి ఉందురు. 

హయగ్రీవుని నాలుగుచేతులలో శంఖ-చక్ర-గదా-వేదములుండును. ఎడమపాదము అదిశేషునిమీదను, కుడిపాదము కచ్ఛపము వీపుపైనను ఉంచియుండును. దత్తాత్రేయునకు రెండు బాహువులుండును. వామాంకమున లక్ష్మి ఉండును. భగవంతుని పార్షదుడైన విష్వక్సేనుడు నాలుగుచేతులలో చక్ర-గదా-హల-శంఖములను ధరించియుండును.

శ్రీ అగ్ని మహాపురాణమునందు మత్స్యాది దశావతార ప్రతిమా లక్షణమను నలుబది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 160 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 49
*🌻Characteristics of forms of ‘Fish’ etc. of Viṣṇu - 5 🌻*

22. Then (the form of) Viśvarūpa (of Viṣṇu) (should be endowed) with the club, noose, spear and arrow in the right hand and conch, bow, mace, noose, tomara (javelin), plough, axe, staff, sword and leather sling in the left hand.

23-24. The Harihara (Śiva and Viṣṇu) form of Viṣṇu (should be placed) on the right or left (side), (being endowed with) twenty hands, four faces and three eyes. He should either be lying on his left or reclining on the water. (He should further be represented) as his leg being held by the goddess Śrī (Lakṣmi). He should also be shown as being attended to by (the female divinities) Vimalā and others. He should also have the fourfaced (Brahmā) in the navel-lotus.

25. The form of Viṣṇu bearing the marks of Rudra and Keśava should hold a spear and sword in the right hand and the mace and disc in the other and be in the company of Gaurī and Lakṣmī (the consorts of Śiva and Viṣṇu).

26. The Hayaśiras (horse-headed) form of Viṣṇu (should be represented) as holding the conch, disc, mace and the Vedas. The left foot should rest on (the serpent) Śeṣa and the right on the back of tortoise.

27. The form of Dattātreya may have two arms, the goddess Śrī (Lakṣmī) being seated on the left lap. The Viṣvaksena form of Viṣṇu (may hold) a disc, mace, plough and conch.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 25 / DAILY WISDOM - 25 🌹*
*🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 25. నిజమైన ప్రేమ ఎప్పుడూ వ్యక్తపరచబడదు 🌻*

*విషయ వస్తువుల పట్ల ఉన్ముఖమైన శక్తిని అంతర్ముఖం చేసి, చైతన్యం లో స్వయం ప్రకాశంతో వెలుగొందే సాధకులు దైవం యొక్క మహత్తర కార్యాలను ముందుకు తీసుకువెళ్లే సమర్థులు. పవిత్రత మరియు ప్రకాశం యొక్క స్థాయి పెరిగేకొద్దీ చైతన్యం విస్తారమయ్యి స్వయంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తుందని ఛాందోగ్య ఉపనిషత్తు చెప్తుంది.*

*అటువంటి మహిమాన్వితమైన సాధకులు ఆధ్యాత్మిక బలంతో ప్రకాశిస్తారు. వీరు ప్రకృతి యొక్క అత్యంత బలీయమైన శక్తులను కూడా సులభంగా ఎదుర్కోగలరు. వీరు ఉనికి యొక్క లోతుల్లోకి దూకగల ధైర్యవంతులు. విషయాలను లేదా వస్తువులను సాధించాలని అనుకునే ప్రేమ పరిపూర్ణమైంది కాదు. నిజమైన ప్రేమ వ్యక్తీకరించ బడలేదు. అది ఉనికిలో భాగమై పోతుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹


*🌹 DAILY WISDOM - 25 🌹*
*🍀 📖 The Realisation of the Absolute 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 25. True Love is Never Expressed 🌻*

*The seekers who austerely transform the objectifying energy into the Conscious Power that causes the blossoming of the self-sense into the objectless Consciousness are the integrated aspirants of the Absolute, whose power is used to carry on profound spiritual meditation. The Chhandogya Upanishad says that, when purity and light are increased, there is a generation of steady consciousness which shatters open the knots of the self.*

*Such glorious aspirants glow with a lustrous spiritual strength which handles with ease even the most formidable forces of nature. They are the heroes who have girt up their loins with the vow of leaping over phenomenon into the Heart of Existence. Love that wants an object is not perfect. True love is never expressed. It simply melts in experience.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 290 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. కోరిక అంటే సమస్తానికి వ్యతిరేకంగా సాగడం. అది అసాధ్యమైన లక్ష్యం. అది వీలుపడదు. కోరిక లేకపోవడమంటే అనంతంతో బాటు ఆహ్లాదంగా గడపడం, దాంతో సాగడం, అంటే సొంత కోరిక లేకపోవడం. 🍀*

*మనిషి తన జీవితాన్ని కలల ఇసుకతో కట్టుకుంటాడు. కాబట్టే వ్యక్తి ఏం చేసినా ప్రతిదీ నిష్పలమవుతుంది. అన్ని ఇళ్ళు కూలిపోతాయి. దాని పునాదులు శాశ్వతత్వంలో వుండవు. క్షణికమయిన దాంట్లో వుంటాయి. ఒక ఇసుక భవనం కూలిపోతే వ్యక్తి మరొక దాన్ని నిర్మిస్తాడు. ఒక కల మాయమైతే మరొక కల కంటాడు. ఒక కోరిక నెరవేరకుంటే యింకొక కోరికలోకి దూకుతాడు. ఆ కాంక్ష వైఫల్య పునాదిగా వున్నదని గుర్తించం. కోరిక అంటే సమస్తానికి వ్యతిరేకంగా సాగడం. అది అసాధ్యమైన లక్ష్యం. అది వీలుపడదు. కోరిక లేకపోవడమంటే అనంతంతో బాటు ఆహ్లాదంగా గడపడం, దాంతో సాగడం, అంటే సొంత కోరిక లేకపోవడం.*

*సొంత కోరిక లేకపోవడమంటే, సమస్తమూ ఏమి కాంక్షిస్తుందో అదే నా కాంక్ష నా వ్యక్తిగతమయిన లక్ష్యమంటూ ఏదీ లేదు అని అర్థం. మనం అస్తిత్వమంటే మనలో భాగమని వినడానికి అలవాటు పడ్డాం. మనం సముద్రపు అలలం. మనకు వ్యక్తిగత లక్ష్యాలు లేవు. ధ్యానమంటే మనకు ప్రత్యేకమయిన వునికి లేదని మనం గుర్తించడం మనం ద్వీపాలం కామని తెలుసుకోవడం. మనం అనంత ఖండంలో భాగాలం. దాన్ని దేవుడను, సత్యమను, అంతమమను, కేవలమను, నీ యిష్టమొచ్చిన పేరు పెట్టుకో!*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 027 / Siva Sutras - 027 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
 *✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 8. జ్ఞానం జాగృత, 9. స్వప్నో వికల్పం, 10. అవివేకో మాయా సుషుప్తం -2 🌻*
*🌴. జాగృత - స్పృహ, జ్ఞానం : స్వప్నం - ఊహ, కలలు : సుషుప్తి - అజ్ఞానం, మాయ. 🌴*

*ఈ మూడు సూత్రాలు కలిసి చెప్పబడ్డాయి. ఎందుకంటే అవి ప్రాపంచిక స్థాయి చైతన్యం యొక్క వరుస దశలను సూచిస్తాయి. ప్రతి వ్యక్తి దాదాపు ప్రతిరోజూ ఈ మూడు వరుస స్థాయి స్పృహలను అనుభవిస్తాడు. మొదటి దశ అవగాహన యొక్క సాధారణ క్రియాశీల దశను సూచిస్తుంది, ఇది లేకుండా ఎటువంటి చర్య జరగదు. ఇక్కడ ఇంద్రియ అవగాహనలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.*

*రెండవ దశ అనేది స్వప్న స్థితిలోకి ప్రవేశించే దశ, ఇది గాఢ నిద్ర యొక్క తదుపరి దశకు నాంది. ఇక్కడ, మానసిక ధోరణి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, ఎందుకంటే కలలు మనస్సు ద్వారా మాత్రమే అనుభూతి చెందబడతాయి. సాధారణ స్పృహ స్థాయి యొక్క చివరి దశ గాఢ నిద్ర, ఇక్కడ మనస్సు కూడా పనిచేయడం మానేస్తుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Siva Sutras - 027 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 8.Jñānaṁ jāgrat 🌻 🌻9. Svapno vikalpāḥ 🌻 🌻 10. Aviveko māyāsauṣuptam - 2 🌻*
*🌴. Knowledge is Jagrat: Fancy is Svapna. Ignorance, Maya, is Susupti 🌴*

*These three aphorisms are considered together because they refer to the successive stages of mundane level of consciousness. Every person undergoes through these three successive levels of consciousness almost daily. The first stage refers to the normal active stage of awareness, without which no action can take place. Here sensory perceptions play the lead role.*

*Second stage is the stage where one enters the dream state, a prelude to the next stage of deep sleep. Here, mentation plays a significant role, as dreams unfold only through mind. The last of stage of normal consciousness level is deep sleep, where even the mind ceases to function.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 425 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 425 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 425 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 425 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 90. చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।
గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥ 🍀

🌻 425. 'తత్త్వమయీ’ - 2🌻


ఆమె మహిమలను, విభూతులను అనేకానేక నామమలతో వర్ణించుచు, కీర్తించుచూ ఆరాధన చేయు సమయమున ఆరాధకుడు తన్మయము చెందును. తన్మయము చెందినపుడు తా నుండడు. మరల సముద్రము నుండి అలవలె తాను తనకు జ్ఞప్తికి రాగా, తన్మయ స్థితి యొక్క మాధుర్యమును కించిన్మాత్రము రుచి తెలియుట వలన దానినే కోరుచు జీవించును. అట్టివా డెట్టి కార్యముల యందున్ననూ అందు తత్త్వమునే దర్శించును. దానితో అనుసంధానము చెందుచూ జీవితమును రసోపేతముగ నిర్వర్తించుకొను చుండును. శ్రీమాత తత్త్వమయీ, ఆమె తత్ స్థితిలోనే యుండును. శివునితో విడిపడనిది, విడదీయ రానిది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 425 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 90. Chichakti shchetanarupa jadashakti jadatmika
Gayatri vyahruti sandhya dvijabrunda nishemita ॥ 90 ॥🌻

🌻 425. 'Tattvamayi' - 2 🌻

The worshiper is awestruck at the time of praising and describing her glories and virtues with many names. He is not there when he is in bliss. And when he remembers himself like a wave from the sea, he lives longing for the sweetness of his own state. Such aspirant always sees philosophy in all these actions. By connecting with it, he will live his life. Srimata is the deitification of philosophy, Tattvamayi, and she remains in the state of Tattva. Inseparable from Shiva.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

ఓషో రోజువారీ ధ్యానాలు - 294. తెలియనిది / Osho Daily Meditations - 294. THE UNKNOWABLE


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 294 / Osho Daily Meditations - 294 🌹

✍️. ప్రసాద్ భరద్వాజ

🍀 294. తెలియనిది 🍀

🕉. మనస్సు అనేది తెలిసినది, ధ్యానం అనేది తెలియని దానిలో నిలబడటం. దైవభక్తి అనేది తెలియని వాటిపై సరిహద్దుగా ఉన్న పరిధి లాంటిది. మీరు ఎంత దగ్గరగా వస్తున్నారో, అది మరింత దూరంగా ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ ఇంద్రధనస్సు. మీరు పట్టుకోలేరు. 🕉


మీరు తెలియని వాటిని చేరుకోవడానికి ప్రయత్నించవచ్చు. దానిని చేరుకోవడానికి ప్రతి ప్రయత్నం చేయాలి. కానీ అది ఎల్లప్పుడూ చేరుకోలేనిది. దేవుడు తెలియని వాడు, మరియు తెలియనిది ఉనికిలో ఉన్నందున, జీవితం అందంగా ఉంటుంది. అసాధ్యమైనది ఉనికిలో ఉన్నందున, జీవితం అనేది ఆవిష్కరణ యొక్క అద్భుతమైన అందమైన సాహసం. ఒక విషయం తెలిసినప్పుడు, సాధ్యమైనప్పుడు, అది దాని అర్థాన్ని కోల్పోతుంది. అందుకే పాశ్చాత్య జీవనం తూర్పు కంటే ఎక్కువ అర్థాన్ని కోల్పోతోంది.

ఆధునిక విజ్ఞానం మిమ్మల్ని మరింత జ్ఞానవంతం చేసింది కాబట్టి, అది మీపై కురిపించిన ధూళి కారణంగా, ఆశ్చర్యపోయే సామర్థ్యం తగ్గుతోంది. మీరు తెలియని విషయాల పట్ల దాదాపుగా బండబారి పోతున్నారు. ఇదొక్కటే సమాధి, ఏకైక మరణం. మీకు తెలిసిందని మీరు అనుకుంటున్నారు. తెలియని వాటికి మరియు అపరిచిత విషయాలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండండి.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 294 🌹

📚. Prasad Bharadwaj

🍀 294. THE UNKNOWABLE 🍀

🕉. The mind is the known, meditation is to stand in the unknown, and godliness is the unknowable-like a horizon just bordering on the unknown. The closer you come, the further away it recedes. It is always a rainbow; you can never catch hold if it. 🕉


You can try to reach the unknowable--every effort should be made to reach it-but it is always unreachable. God is unknowable, and because the unknowable exists, life is beautiful. Because the impossible exists, life is a tremendously beautiful adventure of discovery. When a thing becomes known, possible, it loses its meaning. That's why in the West life is losing more meaning than in the East.

Because science has made you more knowledgeable, and because of the dust science has poured on you, the capacity to be surprised is becoming less and less. You are becoming almost insensitive to the unknowable. This is the only grave, the only death-- that you think that you have known. Always remain available to the unknown and the unknowable.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ శివ మహా పురాణము - 673 / Sri Siva Maha Purana - 673


🌹 . శ్రీ శివ మహా పురాణము - 673 / Sri Siva Maha Purana - 673 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 19 🌴

🌻. గణేశ వివాహోపక్రమము - 2 🌻


జగత్తునకు తల్లి దండ్రులగు ఆ దంపతులు వారి మాటలను విని ఆచ్చెరువునందరి. వారు లోకాచారముననుసరించుచుండిరి (13). ' ఏమి చేయవలెను ? వీరిద్దరి వివాహకార్యమును ఎట్లు నెరవేర్చవలెను?' అని ఆలోచించి వారిద్దరు ఒక అద్భుతమగు యుక్తిని పన్నిరి (14). ఆ యుక్తి ప్రకారంగా ఒకనాడు ఆ తల్లిదండ్రులు పుత్రులనిద్దరినీ పిలిచి ఇట్లు పలికిరి (15).


పార్వతీ పరమేశ్వరులిట్లు పలికిరి -

మీకిద్దరికీ సుఖమును కలిగించే నియమము నొకదానిని మేము పూర్వము ఏర్పాటు చేసితిమి. ఓ పుత్రులారా! వినుడు. మీకు ప్రీతితో సత్యమును చెప్పదము (16). మీరిద్దరు పుత్రులు సద్గుణములలో సమానులు. మీలో భేదము లేదు. కావుననే మీకిద్దరికీ సుఖమునిచ్చే పోటీని ఒక దానిని నిశ్చయించితిమి (17). మీ ఇద్దరిలో ఎవరైతే భూమినంతనీ చుట్టి ముందుగా ఇచటకు చేరునో, వానికి మాత్రమే ముందుగా శుభకరముగు వివాహము ఏర్పాటు చేయబడగలదు (18).


బ్రహ్మ ఇట్లు పలికెను -

మహాబలుడగు కుమారస్వామి వారిద్దరి ఆ మాటను విని పృథివిని చుట్టి వచ్చుట కొరకై వెంటనే మందిరము నుండి బయలు దేరెను (19). బుద్ధిమంతుడు గణేశుడు అచటనే ఉన్నవాడై తెలివి తేటలను ఉపయోగించి మనస్సులో తీవ్రముగా ఆలోచించెను (20). ఏమి చేయవలెను? ఎచటకు వెళ్లవలెను? పెద్దల ఆదేశమును ఉల్లంఘించ శక్యము కాదు. నేను రెండు మైళ్ల కంటె అధిక రూరమును పయనించ జాలను (21).

పృథివినంతనూ ఎట్లు చుట్టి రాగలను? నేను ఈ పరీక్షలో ఎట్లు సుఖముగా గెలువవలెను? గణేశుడు ఇట్లు ఆలోచించి ఏమి చేసెనో చెప్పెదను. వినుము (22). ఆతడు స్నానమును చేసి స్వయముగా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి యథోచితముగా నిట్లు పలికెను (23).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 SRI SIVA MAHA PURANA - 673🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 19 🌴

🌻 Gaṇapati’s marriage - 2 🌻


13. The couple, the rulers of the worlds, on hearing their words, were very much surprised, following the worldly conventions.

14. A wonderful expedient was devised by them after thinking about the course to be followed in the celebration of their marriage.

15. Once they called the sons to them and spoke as follows.


Śiva and Pārvatī said:—

16. O good sons, we have framed the rules conducive to your happiness. Listen lovingly. We shall tell you the truth.

17. Both of you are good sons and equal in our eyes. There is no difference. Hence a condition that is beneficial to both of you has been made.

18. The auspicious marriage will be celebrated of that boy who comes here first after going round the entire earth.


Brahmā said:—

19. On hearing their words, the powerful Kumāra started immediately from the fixed point in order to go round the earth.

20. Gaṇeśa of excellent intellect stood there itself after pondering in his mind frequently with his keen intellect.

21. “What shall be done? Where am I to go? I cannot cross the earth. At best it may be possible to go a Krośa. I cannot go beyond it.

22. What avails that happiness which is achieved after going round the earth?” Please listen to what Gaṇeśa did after thinking thus.

23. He performed the ceremonial ablution and returned, home. He then spoke to his father and mother.


Continues....

🌹🌹🌹🌹🌹

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 712 / Vishnu Sahasranama Contemplation - 712


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 712 / Vishnu Sahasranama Contemplation - 712🌹

🌻712. దర్పహా, दर्पहा, Darpahā🌻

ఓం దర్పఘ్నే నమః | ॐ दर्पघ्ने नमः | OM Darpaghne namaḥ


తిష్ఠతాం ధర్మవిరుద్ధే పథి దర్పం జనార్దనః ।
హన్తీతి శ్రీమహావిష్ణుర్దర్పహేత్యుచ్యతే బుధైః ॥

ధర్మ విరుద్ధ మార్గమున ఉండువారి దర్పమును, మదమును నశింపజేయువాడు జనార్దనుడు. అందుచేత శ్రీమహావిష్ణువునకు దర్పహా అను నామము కలదు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 712🌹

🌻712. Darpahā🌻

OM Darpaghne namaḥ


तिष्ठतां धर्मविरुद्धे पथि दर्पं जनार्दनः ।
हन्तीति श्रीमहाविष्णुर्दर्पहेत्युच्यते बुधैः ॥

Tiṣṭhatāṃ dharmaviruddhe pathi darpaṃ janārdanaḥ,
Hantīti śrīmahāviṣṇurdarpahetyucyate budhaiḥ.


Lord Janārdana destroys the pride of those who tread the path opposed to righteousness and hence He is known by the name Darpahā.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

भूतावासो वासुदेवः सर्वासुनिलयोऽनलः ।
दर्पहा दर्पदोऽदृप्तो दुर्धरोऽथापराजितः ॥ ७६ ॥

భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఽనలః ।
దర్పహా దర్పదోఽదృప్తో దుర్ధరోఽథాపరాజితః ॥ 76 ॥

Bhūtāvāso vāsudevaḥ sarvāsunilayo’nalaḥ,
Darpahā darpado’dr‌pto durdharo’thāparājitaḥ ॥ 76 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹



కపిల గీత - 120 / Kapila Gita - 120


🌹. కపిల గీత - 120 / Kapila Gita - 120🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 04 🌴

04. అర్థే హ్యవిద్యమానేऽపి సంసృతిర్న నివర్తతే
ధ్యాయతో విషయానస్య స్వప్నేऽనర్థాగమో యథా

స్వప్నము నందు భయశోకాదులకు ఎట్టి కారణము లేకున్నను స్వప్నపదార్థములను సత్యముగ భావించుటచే దుఃఖము కలుగుచుండును. అట్లే భయశోకములకును, అహంకార మమకారములకును, జననమరణాది రూపమైనట్టి జగత్తునకును, ఎటువంటి అస్తిత్వము లేకున్ననూ అజ్ఞానవశుడై విషయములను చింతించు చుండుట వలన, జీవుడు సంసార చక్రము నుండి ఎన్నడును బయట పడలేదు.

ఆత్మకు వాస్తవముగా దేవక్ తిర్యక్ మనుష్యాది శరీరాలు లేకున్నా ఈ ఆత్మ సంసారాన్ని విడిచి పెట్టదు. సంసారమూ ఆత్మని విడిచిపెట్టదు. నేను మనషినీ అంటే ఎంత అహంకారమో, నేను మనిషిని కాదు అన్నా అహంకారమే. నేను మంచివాడినీ అంటే ఎంత అహంకారమో, నేను చెడ్డవాడినీ అంటే అంతే అహంకారం. ఆత్మ ఏమీ కాకున్నా, ఆత్మకు ఏమీ లేకున్నా, ఎక్కడో ఉన్న విషయాలను ధ్యానం చేస్తూ ఉంటే విషయాలతో సంగం ఏర్పడుతుంది. ఎలాగంటే కలలో వచ్చే విషయాలు నిజముగా మనకే వస్తాయి అనిపిస్తాయి.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 120 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 04 🌴

04. arthe hy avidyamāne 'pi saṁsṛtir na nivartate
dhyāyato viṣayān asya svapne 'narthāgamo yathā


Actually a living entity is transcendental to material existence, but because of his mentality of lording it over material nature, his material existential condition does not cease, and just as in a dream, he is affected by all sorts of disadvantages.

The example of a dream is very appropriate. Due to different mental conditions, in dreams we are put into advantageous and disadvantageous positions. Similarly, the spirit soul has nothing to do with this material nature, but because of his mentality of lording it over, he is put into the position of conditional existence. Conditional existence is described here as dhyāyato viṣayān asya. Viṣaya means "an object of enjoyment." As long as one continues to think that he can enjoy material advantages, he is in conditioned life, but as soon as he comes to his senses, he develops the knowledge that he is not the enjoyer, for the only enjoyer is the Supreme Personality of Godhead.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


Daily Panchang నిత్య పంచాంగము 17 Jan 2023


🌹17, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹

శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : ముక్కనుమ Mukkanuma🌻

🍀. అపరాజితా స్తోత్రం - 2 🍀

3. కల్యాణ్యై ప్రణతా వృద్ధ్యై సిద్ధ్యై కుర్మో నమో నమః |
నైరృత్యై భూభృతాం లక్ష్మ్యై శర్వాణ్యై తే నమో నమః

4. దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణ్యై |
ఖ్యాత్యై తథైవ కృష్ణాయై ధూమ్రాయై సతతం నమః

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : సాధన : కర్మాచరణ - కొరగాని కర్మ అజ్ఞానావృతమైన లోకానికి ఎంతో మేలు చేకూర్చే దైనప్పటికీ అహంకార ప్రవృత్తితో చేసిన ఏ కార్యమైనా యోగ సాధకునికి _ కొరగానిదే అవుతుంది.🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌, హేమంత ఋతువు,

ఉత్తరాయణం, పౌష్య మాసం

తిథి: కృష్ణ దశమి 18:06:51 వరకు

తదుపరి కృష్ణ ఏకాదశి

నక్షత్రం: విశాఖ 18:47:45 వరకు

తదుపరి అనూరాధ

యోగం: శూల 08:35:35 వరకు

తదుపరి దండ

కరణం: వణిజ 06:49:18 వరకు

వర్జ్యం: 00:51:22 - 02:24:54

మరియు 22:33:00 - 24:03:24

దుర్ముహూర్తం: 09:04:03 - 09:48:55

రాహు కాలం: 15:14:18 - 16:38:27

గుళిక కాలం: 12:26:00 - 13:50:09

యమ గండం: 09:37:42 - 11:01:51

అభిజిత్ ముహూర్తం: 12:04 - 12:48

అమృత కాలం: 10:12:34 - 11:46:06

సూర్యోదయం: 06:49:24

సూర్యాస్తమయం: 18:02:36

చంద్రోదయం: 01:56:28

చంద్రాస్తమయం: 13:30:16

సూర్య సంచార రాశి: మకరం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹