🍀 28, JANUARY 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🍀

🌹🍀 28, JANUARY 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 28, JANUARY 2023 SATURDAY, శనివారం, స్థిర వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
🍀. రధసప్తమి, నర్మదా జయంతి, బీష్మాష్టమి శుభాకాంక్షలు - విశిష్టత - Ratha Saptami, Narmada Jayanti, Bhishma Ashtami Good Wishes to all 🍀
2) 🌹 కపిల గీత - 125 / Kapila Gita - 125 🌹 🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 09 / 3. Salvation due to wisdom of Nature and Jeeva - 09 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 717 / Vishnu Sahasranama Contemplation - 717 🌹 
🌻717. విశ్వమూర్తిః, विश्वमूर्तिः, Viśvamūrtiḥ🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 678 / Sri Siva Maha Purana - 678 🌹 🌻. గణేశుని వివాహము - 2 / The celebration of Gaṇeśa’s marriage - 2 🌻
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 299 / Osho Daily Meditations - 299 🌹 🍀 299. నీడ / SHADOW 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 427 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 427 - 1 🌹 🌻427. 'నిస్సీమ మహిమ’ - 1 / 'Nisseema Mahima' - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹28, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*
*🍀. రధసప్తమి, నర్మదా జయంతి, బీష్మాష్టమి శుభాకాంక్షలు - Ratha Saptami, Narmada Jayanti, Bhishma Ashtami Good Wishes to all 🍀*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : రధసప్తమి, నర్మదా జయంతి, బీష్మాష్టమి, Ratha Saptami, Narmada Jayanti, Bhishma Ashtami 🌻*

*🍀. శ్రీ సూర్య ప్రార్థన 🍀*
 
*ధ్యాయేత్సూర్యమనంత కోటికిరణం తేజోమయం భాస్కరం*
*భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్*
*ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం*
*భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : జీవన్ముక్తావస్థ - జీవన్ముక్తుడు బంధరహితుడై చరిస్తాడు. ఏ కర్మయూ అతనిని బంధించ నేరదు. ఏలనంటే, అహంకార స్ఫురణ అతనిలో ఉండదు గనుక . కర్మ చేయునది అతని యందలి విశ్వ ప్రకృతి గాని, అతడు గాదు. విశ్వప్రకృతి కతీతమైన పరతత్వంతో తాదాత్మ్యం చెంది పరిపూరుడై యుండుటయే అతనికి సహజ లక్షణం అవుతుంది.🍀*

🌹. రథసప్తమి విశిష్టత (సంక్షిప్త) 🌹

*మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణముతో సమానము. ఆ రోజున అరుణోదయ వేళ చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణ, దానాదులన్ని అనేక కోట్ల రెట్లు పుణ్య ఫలములను ఆయురారోగ్య సంపదలను ఇచ్చును. సప్తమినాడు షష్ఠి తిథి గూడ యున్నచో షష్ఠీ సప్తమీ తిథుల యోగమునకు పద్మమని పేరు. ఈ యోగము సూర్యుని కత్యంత ప్రీతికరము. ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీ స్నానము చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి.*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, మాఘ మాసం
తిథి: శుక్ల-సప్తమి 08:44:17 వరకు
తదుపరి శుక్ల-అష్టమి
నక్షత్రం: అశ్విని 19:07:13 వరకు
తదుపరి భరణి
యోగం: సద్య 11:54:27 వరకు
తదుపరి శుభ
కరణం: వణిజ 08:45:18 వరకు
వర్జ్యం: 15:01:10 - 16:39:06
మరియు 29:12:00 - 30:53:00
దుర్ముహూర్తం: 08:19:32 - 09:04:53
రాహు కాలం: 09:38:53 - 11:03:55
గుళిక కాలం: 06:48:51 - 08:13:52
యమ గండం: 13:53:57 - 15:18:59
అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:50
అమృత కాలం: 11:45:18 - 13:23:14
సూర్యోదయం: 06:48:51
సూర్యాస్తమయం: 18:09:01
చంద్రోదయం: 11:37:38
చంద్రాస్తమయం: 00:35:44
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: మేషం
యోగాలు: సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం
19:07:13 వరకు తదుపరి ధ్వాoక్ష 
యోగం - ధన నాశనం, కార్య హాని 
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

 

*🍀. రధసప్తమి, నర్మదా జయంతి, బీష్మాష్టమి శుభాకాంక్షలు - Ratha Saptami, Narmada Jayanti, Bhishma Ashtami Good Wishes to all 🍀
*ప్రసాద్ భరద్వాజ*

*🌹🌻. రథసప్తమి - బీష్మాష్టమి విశిష్టత 🌻🌹*

*సప్త సప్త మహా సప్త, సప్త ద్వీపా వసుంధరా*
*సప్తార్క పర్ణ మాధాయ సప్తమి రధ సప్తమి*

*ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి జన్మదినమే రథసప్తమి. సూర్యుని గమనం ఏడు గుర్రములు పూన్చిన బంగారు రథం మీద సాగుతుందని వేదము "హిరణ్యయేన సవితారథేన" అని తెలుపుతుంది. సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనము, దక్షిణాయనము అని రెండు విధములు. ఆషాఢమాసము నుండి పుష్యమాసము వరకు దక్షిణాయనము. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకముగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్ర దినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. "భా" అంటే సూర్యకాంతి, "రతి" అంటే సూర్యుడు, కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీయులు. "భారతీ" అంటే వేదమాత. వేదమాత నారాధించు వారును భారతీయులే.*

*సూర్యగ్రహణతుల్యా సా శుక్లా మాఘస్య సప్తమీ,*
*అరుణొదయవేళాయాం స్నానం తత్ర మహాఫలమ్‌.*
*మాఘే మాసి సితే పక్షే సప్తమీ కోటిపుణ్యదా,*
*కుర్యాత్ స్నానార్ఘ్యదానాభ్యా మాయురారోగ్యసంపదః.*

*మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణముతో సమానము. ఆ రోజున అరుణోదయ వేళ చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణ, దానాదులన్ని అనేక కోట్ల రెట్లు పుణ్య ఫలములను ఆయురారోగ్య సంపదలను ఇచ్చును. సప్తమినాడు షష్ఠి తిథి గూడ యున్నచో షష్ఠీ సప్తమీ తిథుల యోగమునకు పద్మమని పేరు. ఈ యోగము సూర్యుని కత్యంత ప్రీతికరము. ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీ స్నానము చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ జన్మలోను, జన్మాంతరంలోను (రెండు), మానసిక, వాచిక, శారీరకములు (మూడు), తెలిసిచేసేవి, తెలియకచేసేవి (రెండు) కలిసి మొత్తం ఏడు పాపములు నేడు రోగాలకు కారణములు.*

*రథసప్తమి నాడు బంగారముతో గాని, వెండితో గాని, రాగితో గాని రథమును చేయించి, కుంకుమాదులు, దీపములతో నలంకరించి అందు ఎర్రని రంగుగల సూర్యుని ప్రతిమ నుంచి, పూజించి, గురువునకు ఆ రథమును దానమీయ వలెను, ఆ రోజు ఉపవాసముండి, సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమములను చూచుచూ కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణప్రబోధము. రథసప్తమి వ్రతము మన సంప్రదాయమున నిలచియుండుట భారతీయతకు చిహ్నము.*

*🌻. సూర్య స్తోత్రం 🌻*
*ధ్యాయేత్సూర్యమనంతకోటికిరణం తేజోమయం భాస్కరం*
*భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్*
*ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం*
*భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్*

*🌹.బీష్మాష్టమి విశిష్టత 🌹*

*ప్రతి సంవత్సరం రథ సప్తమి అనంతరం భీష్మ అష్టమి అనుసరించాల్సి ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరు మూడు దోసిళ్ల అర్ఘ్యం భీష్మ ప్రీతికి అనుసరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను అందరూ భీష్మ తర్పణం అని అంటారు. ధర్మశాస్త్రం ప్రకారం, భీష్మ తర్పణం, యమ తర్పణం తండ్రి బతికి ఉన్నవారు కూడా చేయాల్సిందే. ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఈరోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు.*

*భీష్మాష్టమి రోజున విష్ణుమూర్తి పూజ అనంతరం ఆవునెయ్యితో పంచహారతి ఇవ్వాలి. దీపారాధనకు తామరవత్తులను వాడాలి. విష్ణుమూర్తి ఆలయాల్లో విష్ణు అష్టోత్తరం, సత్యనారాయణ వ్రతం, బ్రహోత్సవ దర్శనం, లక్ష తులసి పూజ వంటివి నిర్వహించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు. అలాగే విష్ణు సహస్రనామం, విష్ణు పురాణం, సత్య నారాయణ వ్రత పుస్తకాలను సన్నిహితులకు తాంబూలాలు ఇవ్వాలని పురోహితులు చెబుతున్నారు.*

*🌻. పాలు పొంగించే విధానం 🌻*

*సూర్యుని కిరణాలూ పడే చోట..లేదా..తులసిచెట్టు ఉండే దగ్గర ఓ పీటను పెట్టి దాన్ని పసుపుతో శుద్ధి చేసి, ముగ్గులుపెట్టి, సూర్యభగవానుడి ఫోటోను ఉంచాలి. గంధం, కుంకుమతో బొట్టు పెట్టాలి. ఎర్రటి పుష్పాలతో అలంకరించాలి.*

*ఏడు చిక్కుడు కాయలను తీసుకుని రథంగా తయారుచేసుకోవాలి. ఈ రోజు సూర్యునికి నేతితో దీపం వెలిగించి ఆవు పిడకలను కర్పూరంతో వెలిగించి దానిపై ఇత్తడి పాత్ర ఉంచి ఆవుపాలు, బెల్లం, బియ్యం తో చేసిన పరమాన్నం చేసుకోవాలి. ఈ పరమాన్నం సూర్యునికి ఎంతో ప్రీతి.*

*🍀. భీష్మ అష్టమి తర్పణ శ్లోకం 🍀*

*వైయాఘ్రపాద గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ |*
*గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే ౧*
*భీష్మః శాన్తనవో వీరః సత్యవాదీ జితేంద్రియః |*
*ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితాం క్రియామ్ ౨*
*వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ |*
*అర్ఘ్యం దదామి భీష్మాయ ఆజన్మబ్రహ్మచారిణే ౩*
*భీష్మాయ నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 125 / Kapila Gita - 125🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 09 🌴*

*09. సానుబంధే చ దేహేఽస్మిన్నకుర్వన్న సదాగ్రహమ్|*
*జ్ఞానేన దృష్టతత్త్వేన ప్రకృతేః పురుషస్య చ॥*

* ప్రాణుల యెడల మైత్రీభావమును కలిగి యుండ వలెను. దయాళువై యుండ వలెను. సుఖదుఃఖాది ద్వంద్వములకు వెరవక ధీరుడై యుండవలెను. ప్రకృతి పురుషులయొక్క వాస్తవస్వరూపమును తెలిసికొని, తత్త్వజ్ఞానియై, స్త్రీపుత్రాదుల యందును, దేహము పైనను నేను-నాది అను మిథ్యాభిమానమును త్యజింప వలెను.*

*ఈ శరీరము యందు ఆసక్తిని తగ్గించాలి. దుష్టమైన కోరికనూ, ఆసక్తినీ తగ్గించాలి. ఒక్క దేహానికి మాత్రమే కాదు. స బంధు. పుత్ర మిత్రాదులతో ఉన్న దేహం యొక్క ఆసక్తిని తగ్గించాలి. ఈ భోగాలలో ఏదీ ఆత్మకోసం లేదు. ఇన్ని అనుబంధాలతో ఉన్న శరీరమునకు సత్ స్నేహాలు పెంచుకోవాలి. ఆ స్నేహాలు వలన భక్తి పెరిగితే మంచిదే, కానీ అసత్ స్నేహాలని దూరముగా ఉంచాలి. ప్రకృతి తత్వమునూ పురుష తత్వమునూ చక్కగా తెలుసుకోవడమే జ్ఞానం. అసదాగ్రహం - లేని దాన్ని గురించి పట్టుదల. శరీరము నేనే అనుకోవడం కూడా అసదాగ్రహమే. నేనూ-నాదీ అనుకోవడం కూడా అసదాగ్రహం. ఇది పోగొట్టుకోవాలి. జ్ఞానం కేవలం ఆత్మకే ఉంటుంది. జ్ఞానానికి నెలవు ఆత్మ.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 125 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 09 🌴*

*09. sānubandhe ca dehe 'sminn akurvann asad-āgraham*
*jñānena dṛṣṭa-tattvena prakṛteḥ puruṣasya ca*

*One's seeing power should be increased through knowledge of spirit and matter, and one should not unnecessarily identify himself with the body and thus become attracted by bodily relationships.*

*The conditioned souls are eager to identify with the body and consider that the body is "myself" and that anything in relationship with the body or possessions of the body is "mine." In Sanskrit this is called aham-mamatā, and it is the root cause of all conditional life. A person should see things as the combination of matter and spirit. He should distinguish between the nature of matter and the nature of spirit, and his real identification should be with spirit, not with matter. By this knowledge, one should avoid the false, bodily concept of life.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 717 / Vishnu Sahasranama Contemplation - 717🌹*

*🌻717. విశ్వమూర్తిః, विश्वमूर्तिः, Viśvamūrtiḥ🌻*

*ఓం విశ్వమూర్తయే నమః | ॐ विश्वमूर्तये नमः | OM Viśvamūrtaye namaḥ*

*విశ్వమూర్తిర్హరేర్యస్య విశ్వమూర్తిస్స ఉచ్యతే*

*పరమాత్ముడు సర్వాత్మకుడు, సర్వమును తానేయగువాడు కావున విశ్వము అంతయు ఈతని మూర్తియే.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 717🌹*

*🌻717. Viśvamūrtiḥ🌻*

*OM Viśvamūrtaye namaḥ*

*विश्वमूर्तिर्हरेर्यस्य विश्वमूर्तिस्स उच्यते / Viśvamūrtirhareryasya viśvamūrtissa ucyate*

*As He is all-pervading, the entire universe is His form - He is Viśvamūrtiḥ.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् ।अनेकमूर्तिरव्यक्तश्शतमूर्तिश्शताननः ॥ ७७ ॥
విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ ।అనేకమూర్తిరవ్యక్తశ్శతమూర్తిశ్శతాననః ॥ 77 ॥
Viśvamūrtirmahāmūrtirdīptamūrtiramūrtimān,Anekamūrtiravyaktaśśatamūrtiśśatānanaḥ ॥ 77 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 678 / Sri Siva Maha Purana - 678 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 20 🌴*
*🌻. గణేశుని వివాహము - 2 🌻*

గణేశుడు విశ్వరూపప్రజాపతి యొక్క కుమార్తెలగు అతిశయించిన అందముగల ఇద్దరు కన్యలను ఆనందముతో వివాహమాడెను (13). అతనికి సుందరాంగనలగు ఆ ఇద్దరు పత్నులయందు ఇద్దరు పుత్రులు కలిగిరి. సిద్ధి అను నామెకు క్షేముడు, బుద్ధి అను నామెకు సర్వసుఖముల నిచ్చే లాభుడు కలిగిరి (14). ఈ గణేశుడు ఇద్ధరు భార్యమలయందు ఇద్దరు శుభపుత్రులను పొందినాడు. తల్లి దండ్రుల అంగీకారముతో నాతడు ఎడతెరపి లేని సుఖము ననుభవించుచున్నాడు (15). కుమారా! నీవు వారి మోసపూరితమగు ఆజ్ఞకు బద్ధుడవై సముద్రములతో అడవులతో కూడి యున్న భూమిని చుట్టి వచ్చితివి. దానికి లభించిన ఫలము ఇది (16).

కుమారా! నీవు ఆలోచింపుము. వ్యక్తికి ప్రభులగు తల్లిదండ్రులే మోసమును చేసినచో, ఇతరులు కూడ మోసమును ఎట్లు చేయకుందురు? (17) నీ తల్లి దండ్రులు చేసిన పని యోగ్యముగా లేదు. నీవు కూడ ఆలోచించుము. నా మనస్సునకు వారు చేసిన పని శుభకరమని తోచలేదు (18). తల్లి విషము నిచ్చినచో, తండ్రి అమ్మివేసినచో, రాజు సర్వస్వమును అపహరించినచో, ఎవనికి ఏమి చెప్పవలెను? (19) కుమారా! ఎవరైతే ఇట్టి గొప్ప అనర్ధమును కలిగించే కర్మను చేయుదురో, అట్టి వారి ముఖమును శాంతిని గోరు బుద్ధిశాలి చూడకుండుట మేలు (20).

వేదశాస్త్రములు, మరియు స్మృతులు ఇట్టి నీతిని దృఢముగా బోధించు చున్నవి. ఆ నీతిని నేను నీకు విన్నవించితిని. నీకు నచ్చిన రీతిని ఆచరింపుము (21).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 678🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 20 🌴*

*🌻 The celebration of Gaṇeśa’s marriage - 2 🌻*

13. By this marriage that was celebrated, Gaṇeśa has obtained two wives joyously. They are the excellent daughters of Prajāpati Viśvarūpa.

14. He has begot of his two wives of auspicious body two sons, Kṣema of Siddhi and Lābha of Buddhi. They bestow happiness on every one.

15. Begetting two sons of auspicious features of his wives Gaṇeśa is continuously enjoying happiness as conceived by your parents.

16. The entire earth consisting of oceans and jungles has been traversed by you due to their deceptive behest. O dear, this is the result of that.

17. O dear, consider. If parents begin to deceive or particularly if our masters begin to deceive, won’t others also begin to deceive.

18. Your parents have not done well. Just ponder over it. I don’t think their action has been good.

19. If mother were to poison her son, if father were to sell his son, if the king were to confiscate the assets of his subjects what can be said and to whom?

20. O dear, an intelligent peace-loving person shall never look at the face of the person who has committed this harmful deed.

21. This policy has been mentioned in the Vedas, Smṛtis and sacred texts. It has been intimated to you now. Do as you wish.”

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 299 / Osho Daily Meditations - 299 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 299. నీడ 🍀*

*🕉. అహాన్ని ఎవరూ చంపలేరు, ఎందుకంటే అహం కాదు. ఇది నీడ. నీడను చంపలేవు. 🕉*

*నీడతో పోరాడడం కూడా మూర్ఖత్వం. మీరు ఓడిపోతారు - నీడ చాలా శక్తివంతమైనది కాబట్టి కాదు, నీడ ఏమీ కాదు కాబట్టి! నీడతో యుద్ధం మొదలుపెడితే ఎలా గెలుస్తావు? ఇది అస్తిత్వం లేనిది; అలాగే అహం కూడా అంతే. అహం స్వయం యొక్క నీడ.*

*శరీరం నీడను సృష్టించినట్లే, నేను కూడా నీడను సృష్టిస్తుంది. మీరు దానితో పోరాడలేరు మరియు మీరు దానిని చంపలేరు; నిజానికి దాన్ని చంపాలనుకునేది అహం. దీనిని ఇలా మాత్రమే అర్థం చేసుకోగలరు. మీరు నీడను చంపాలనుకుంటే, కాంతిని తీసుకురండి, మరియు నీడ అదృశ్యమవుతుంది; మరింత అవగాహనను పెంచుకోండి. దానితో అహం అదృశ్యమవుతుంది.*
 
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 299 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 299. SHADOW 🍀*

*🕉. Nobody can kill the ego, because the ego is not anyrthing. It is a shadow you cannot kill a shadow 🕉*

*Even to fight with a shadow is foolish, you will be defeated-and not because the shadow is very powerful but because the shadow is not! If you start fighting with a shadow, how can you win? It is nonexistential; and so is the ego.*

*The ego is the shadow of the self, Just as the body creates a shadow, the self also creates a shadow. You cannot fight with it, and you cannot kill it; in fact, the one who wants to kill it is the ego. One can only understand. If you want to kill the shadow, bring light in, and the shadow will disappear; bring more awareness, and the ego will disappear.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 427 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 427 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 91. తత్త్వాసనా, తత్త్వమయీ, పంచకోశాంతరస్థితా ।*
*నిస్సీమమహిమా, నిత్యయౌవనా, మదశాలినీ ॥ 91 ॥ 🍀*

*🌻 427. 'నిస్సీమ మహిమ’ - 1 🌻* 

*హద్దులు లేని మహిమ కలది శ్రీమాత అని అర్థము. శ్రీమాత మహిమకు హద్దులు లేవు. అన్నిటికినీ హద్దులు ఏర్పరచునది శ్రీమాత. ఆమెకు హద్దులు లేవు. అనంతము అపరిమితము అగు తత్త్వము హద్దుల నేర్పరచి అందుండుటయే గాక వాని నతిక్రమించి కూడ యుండును. సృష్టికి ఈవల ఆవల నిండియుండు ప్రజ్ఞ సృష్టి యందిమిడి యున్నట్లుగ గోచరించును. నిజమునకు ఆ ప్రజ్ఞయందే సృష్టి ఇమిడి యున్నది.*

*అల యందు సముద్రమున్ననూ అలను మించి సముద్ర మున్నది గదా! అద్దమందు కొండ యున్నట్లుగ యుండును. కాని కొండ పరిమాణమందు అద్దమెంత? అద్దమందలి కొండవలెనే పదునాలుగు భువనముల సృష్టియందు శ్రీమాత ఇమిడి యున్నట్లు గోచరించును. సృష్టి పరిమాణమును కాలము రూపమున కొలతలు వేయవచ్చును. కాని శ్రీమాత మహిమను, శ్రీమాతను కొలతలు వేయుట సాధ్యము కాదు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 427 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 91. Tatvasana tatvamaei panchakoshantarah sdhita*
*Nisima mahima nitya-yaovana madashalini ॥ 91 ॥ 🌻*

*🌻 427. 'Nisseema Mahima' - 1 🌻*

*It means that Srimata has unlimited glory. Srimata's glory knows no bounds. Srimata limits everything. She herself has no boundaries. The infinite Divine limits itself to the boundaries but exists even beyond them. Prajna,Wisdom, which is full beyond creation, appears as if it is limited by creation. Truth is the creation exists within wisdom( Prajna).*

*There is a sea beyond the waves! It is like a hill in the mirror. But what is the size of the hill? It can be seen that Shrimata is involved in the creation of fourteen earths just like the reflection of hill in the mirror. The size of creation can be measured in terms of time. But it is not possible to measure Srimata' s glory and Srimata.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj

Siva Sutras - 031 - 8.Jñānaṁ jāgrat, 9. Svapno vikalpāḥ, 10. Aviveko māyāsauṣuptam - 6 / శివ సూత్రములు - 031 - 8. జ్ఞానం జాగృత, 9. స్వప్నో వికల్పం, 10. అవివేకో మాయా సుషుప్తం - 6



🌹. శివ సూత్రములు - 031 / Siva Sutras - 031 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

1- శాంభవోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 8. జ్ఞానం జాగృత 🌻 🌻 9. స్వప్నో వికల్పం 🌻 🌻 10. అవివేకో మాయా సుషుప్తం - 6🌻

🌴. జాగృత - స్పృహ, జ్ఞానం : స్వప్నం - ఊహ, కలలు : సుషుప్తి - అజ్ఞానం, మాయ. 🌴


యోగిన్ అంటే కలపడం. అతని ఏకాగ్రత ఎప్పుడూ కేంద్రీకృతమై ఉంటుంది. జాగ్రుదావస్థ లో సైతం, అతను అత్యున్నత వాస్తవికత అయిన శివునితో అనుసంధానమై ఉంటాడు. అతని ఇంద్రియ గ్రహణాలు కేవలం తన స్థూల శరీరాన్ని కాపాడుకోవడానికి మాత్రమే పరిమితం చేయబడ్డాయి. శరీరం లోపల ఉన్న శివునికి కవచం మాత్రమే. స్థూల విషయాలేవీ అతనికి ఆసక్తి కలిగించవు. అతని మనస్సులో అన్యమయిన ముద్రలు లేనప్పుడు, అతని స్వప్న స్థితిలో కూడా, అతను శివునితో ఐక్యంగా ఉంటాడు.

అతని అంతర్గత అవగాహనల్లో భౌతిక వాసనలు లేకపోవడం వల్ల శివుడు కాకుండా వేరే కలని వారు కనరు. అతని ఇంద్రియ గ్రహణశక్తి వాటి ఉద్దేశించిన ప్రయోజనాలను దాదాపుగా కోల్పోయి ఉంటాయి. అందువల్ల శివుని గురించి కాకుండా వేరొక దాని గురించి కలలు కనడానికి ఎటువంటి ముఖ్యమైన ముద్రలు కలిగించవు. ఎటువంటి మార్పులు లేకుండా, అతని చైతన్యం అతని గాఢ నిద్ర స్థితిలో సమాధి దశలోకి ప్రవేశిస్తుంది. అతను తన స్వంత ఇష్టానుసారం సమాది స్థితిలోకి ప్రవేశిస్తాడు. వాస్తవానికి చాలా సార్లు అతను సమాది దశలోనే ఉంటాడు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Siva Sutras - 031 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 1 - Sāmbhavopāya

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 8.Jñānaṁ jāgrat 🌻 🌻9. Svapno vikalpāḥ 🌻 🌻 10. Aviveko māyāsauṣuptam - 6 🌻

🌴. Knowledge is Jagrat: Fancy is Svapna. Ignorance, Maya, is Susupti 🌴


Yogin means yoking. His concentration is always focused. Even in active state (Jāgrat), he remains connected with Shiva, the Ultimate Reality. His sensory perceptions are limited to merely maintain his gross body that merely acts a cover for Shiva within. None of the gross matters is of any interest to him. In the absence of extraneous impressions in his mind, in his dream state also, he remains united with Shiva.

His internal perceptions do not undergo any significant changes to cause a dream other than Shiva. His sensory perceptions would have almost lost their intended utilities and therefore do not cause any significant impressions to dream about something else other than his own Shiva. Without any modifications, his consciousness enters the stage of samādi, in his deep sleep state. He enters the state of samādi at his own will and in fact most of the times he remains in the stage of samādi.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



నిర్మల ధ్యానాలు - ఓషో - 294


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 294 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. సాధారణంగా మనం సంక్షోభంలో వుంటాం. సంక్లిష్టంగా వుంటాం. వైరుధ్యాలతో వుంటాం. మనకి సమన్వయం కావాలి, స్పష్టత ఏర్పడాలి. అప్పుడే అస్తిత్వపు సత్యం అవగాహనకు వస్తుంది. అదెప్పుడూ లోపలనే వుంది.🍀


సత్యం కేవలం గాఢమయిన లోపలి సమశృతి గుండా మాత్రమే తెలుస్తుంది. సాధారణంగా మనం సంక్షోభంలో వుంటాం. సంక్లిష్టంగా వుంటాం. వైరుధ్యాలతో వుంటాం. మనలో ఒకరు 'యిది చెయ్యి' అంటారు. యింకొకరు 'ఇది చెయ్యకు' అంటారు. యిద్దరూ మనలోనే వున్నారు. మనసులోనే వున్నారు. మనం పగిలిన గాజు పాత్రలం. మనిషి పరిస్థితి అది. మనకి సమన్వయం కావాలి, స్పష్టత ఏర్పడాలి.

ఆ సమన్వయం ఏర్పడితే గొప్ప సంగీతం మొదలవుతుంది. అప్పుడే అస్తిత్వపు సత్యం అవగాహనకు వస్తుంది. అదెప్పుడూ లోపలనే వుంది. మనసు పెట్టే అల్లరిలో మనం గుర్తించం. ఈ లోపలి సంక్షోభం ఎప్పుడు చల్లబడుతుందో మనకు సన్నని సంగీతం వినపడుతుంది. అపుడు వ్యక్తి నిస్సందేహంగా 'ఇది నా స్వరం' నాలోంచీ ఆలపిస్తోంది' అని గ్రహిస్తాడు. అప్పుడు జీవితం ఆలయమవుతుంది. లేకుంటే మనం గాలిమేడలవుతాం.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

DAILY WISDOM - 29 - 29. Becoming the Object Seems to be the Aim of the Subject / నిత్య ప్రజ్ఞా సందేశములు - 29 - 29. వస్తువుగా మారడం విషయం యొక్క లక్ష్యం



🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 29 / DAILY WISDOM - 29 🌹

🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 29. వస్తువుగా మారడం విషయం యొక్క లక్ష్యం 🌻


తాను కోరుకున్న వస్తువుగా స్వయంగా మారడం అనేది కోరుకున్న వ్యక్తి యొక్క అంతిమ ఉద్దేశం. విషయానికి వస్తువు యొక్క సామీప్యత ఎంత ఎక్కువ అంటే, విషయానికి మరియు వస్తువుకు మధ్య దూరం ఎంత తక్కువగా ఉంటే, వస్తువు అంత ఎక్కువ ఆనందాన్ని పొందుతుంది. దీని ద్వారా విషయము మరియు వస్తువు మధ్య ఎంత సామీప్యత ఉంటే అంత ఆనందం అయినప్పుడు, అత్యున్నత ఆనందం విషయం వస్తువులో కరిగిపోయినప్పుడు మాత్రమే వస్తుందని మనం ఊహించగలం.

గ్రహణశక్తి మరియు సాపేక్షత లేని చోట, విషయం మరియు వస్తువు కలిసిపోయి కేవలం ఉనికి ఉంటే , అదే అత్యున్నత ఆనందానికి నిలయం. ఈ చైతన్య రాశి అనేది జ్ఞానం యొక్క ఏకీకరణ. ఇక్కడ అది తెలుసుకునే సాధనం కాదు. దానిలోని సారాంశం, ఉనికి మరియు దానిలో భాగం. ఉపనిషత్తులు ఈ సత్యం వైపు మన దృష్టిని మరల్చడానికి ఆసక్తిని కలిగి ఉన్నాయి.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 29 🌹

🍀 📖 The Realisation of the Absolute 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 29. Becoming the Object Seems to be the Aim of the Subject 🌻


Becoming the object seems to be the aim of the subject in its processes of desireful knowledge. The greater the proximity of the object to the subject, that is, the lesser the distance between the subject and the object, the greater is the happiness derived; whereby we are able to deduce that the least distance, nay, the loss of distance itself in a state of identity, a state of infinite oneness, where things lose their separateness.

Where perception and relatedness are no more, where the subject and the object coalesce and mere ‘Be’-ness seems to be the reality, should be the abode of supreme bliss. This consciousness-mass is the one integration of knowledge where it is no more a means of knowing but the essence, the existence and the content in itself. The Upanishads are keen about turning our attention to this truth.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ మదగ్ని మహాపురాణము - 164 / Agni Maha Purana - 164


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 164 / Agni Maha Purana - 164 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 50

🌻. దేవీ ప్రతిమా లక్షణములు - 4 🌻


రుద్రచర్చిక గజచర్మధరించి ఎడమ చేతిలో కాపాలము, కర్తరి ధరించి, కుడి చేతిలో శూల-పాశములను ధరించి, ముఖమును. ఒక పాదమును ఎత్తి ఉండును. ఈ దేవి అష్ట భూజారూపమున గూడ పూజింపబడును. మండమాలను డమరువును ధరించినపుడు ఆమెయే 'రుద్రచాముండ'అని చెప్పబడును. ఆమె నాట్యము చేయును. అందుచే 'నట్యేశ్వరి' అని కూడ ఈమెకు పేరు.

ఈమె నాలుగు ముఖములతో ఆసనముపై కూర్చున్నప్పుడు ''చతుర్ముఖీ మహాలక్ష్మీ'' (మహాలక్ష్మి యొక్క తామస మూర్తి) అని చెప్పబడును. ఈమె తన చేతులలో నున్న నరులను గుఱ్ఱములను, దున్నలను, ఏనుగులను తినుచుండును. సిద్ధ చాముండకు పది భుజడములు, మూడు నేత్రములు ఉండును. కుడి చేతులలో శస్త్రమును, ఖడ్గమును, మూడు డమరువులను ధరించును, ఎడమ చేతులలో గంట, ఖేటకము, మంచపుకోడు, త్రిశూలము, (డాలు) ధరించి యుండును.

సిద్ధ యోగీశ్వరీ దేవి సంపూర్ణ సిద్ధినిచ్చును. ఈదేవికి స్వరూపమైన మరియొక సక్తి యున్నధి, ఈమె శరీరకాంతి ఎఱ్ఱగా నుండును. పాశాంకుశములను ధరించిన ఈమెకు 'ఖైరవి' అని పేరు. రూప విద్యాదేవికి పండ్రెండు భుజములుండును. ఈ దేవులందరును శ్మశానములో ఆవిర్భవింతురు. భయంకరముగ నుందురు, ఈ ఎనమండుగురు దేవులకును (రుద్ర, చండ, అష్టభుజ లేతా రుద్ర చాముండ, సిద్దయోగీశ్వరి భైరవి, రూపవిద్య) ''అంబాష్టకము'' అని పేరు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 164 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 50

🌻Characteristics of an image of the Goddess - 4 🌻

30-31. (The image of) Rudracarcikā (the manifestation of) the goddess may have a bow adorned by the plume of peacock, club, banner, protective posture, cock, skull, scissors, trident and noose in the right and left hands. (She should also be) clad in the elephant hide, with her leg raised up and the little drum placed on the head.

32. Hence she (is known as) Rudracāmuṇḍā, the goddess of dancing and one who is dancing. This (goddess herself), having four faces and in the sitting posture (is known as) Mahālakṣmī.

33-34. (The goddess) having ten hands and three eyes (holding) (different) weapons, sword and ḍamaru (little drum) in the right hand and the bell, club, staff with a skull at one end and trident in the left (hand) and eating men, horses, buffaloes and elephants held in the hand is called Siddhacāmuṇḍā.

35. That goddess accomplishes everything and is (known (as) Siddhayogeśvarī. She is also represented in another form endowed with the noose and goad and red (in complexion).

36. (The goddess) Bhairavī who has an embodiment of beauty is endowed with twelve arms. These are (all) (spoken as) fierce (forms) arising from the cremation ground. The above are remembered as the eight forms of the goddess.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీమద్భగవద్గీత - 317: 08వ అధ్., శ్లో 07 / Bhagavad-Gita - 317: Chap. 08, Ver. 07

 

🌹. శ్రీమద్భగవద్గీత - 317 / Bhagavad-Gita - 317 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 07 🌴

07. తస్మాత్సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ |
మయ్యర్పితమనోబుద్ధిర్మామేవైష్యస్యసంశయ; ||


🌷. తాత్పర్యం :

కావున ఓ అర్జునా! సర్వకాలముల యందును నీవు నన్నే (శ్రీకృష్ణుని) తలచుచు నీ విధ్యుక్తధర్మమైన యుద్ధము నొనరింపుము. నీ కర్మలను నాకు అర్పించుట ద్వారా మరియు నీ మనోబుద్ధులను నా యందు నిలుపుట ద్వారా నీవు నన్ను నిస్సందేహముగా పొందగలవు.

🌷. భాష్యము :

అర్జునునకు ఒసగబడిన ఈ ఉపదేశము కామ్యకర్మల యందు మునిగియుండెడి సర్వజనులకు అత్యంత ముఖ్యమైనది. విధ్యుక్తధర్మములను లేదా కర్మలను త్యజించుమణి భగవానుడిచ్చట తెలుపుటలేదు. అనగా వాటిని వారు కొనసాగించుచునే హరేకృష్ణమహామంత్ర జప,కీర్తనముల ద్వారా శ్రీకృష్ణుని స్మరించవలెను.

ఈ పద్ధతి మనుజిని భౌతికకల్మషము నుండి ముక్తిని చేసి, మనోబుద్ధులను కృష్ణుని యందు నియుక్తమగునట్లు చేయగలదు. దివ్యమైన శ్రీకృష్ణుని నామమును కీర్తించుట ద్వారా మనుజుడు అసంశయముగా దివ్యలోకమగు కృష్ణధామమును చేరగలడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 317 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 07 🌴

07. tasmāt sarveṣu kāleṣu mām anusmara yudhya ca
mayy arpita-mano-buddhir mām evaiṣyasy asaṁśayaḥ


🌷 Translation :

Therefore, Arjuna, you should always think of Me in the form of Kṛṣṇa and at the same time carry out your prescribed duty of fighting. With your activities dedicated to Me and your mind and intelligence fixed on Me, you will attain Me without doubt.

🌹 Purport :

This instruction to Arjuna is very important for all men engaged in material activities. The Lord does not say that one should give up his prescribed duties or engagements. One can continue them and at the same time think of Kṛṣṇa by chanting Hare Kṛṣṇa.

This will free one from material contamination and engage the mind and intelligence in Kṛṣṇa. By chanting Kṛṣṇa’s names, one will be transferred to the supreme planet, Kṛṣṇaloka, without a doubt.

🌹 🌹 🌹 🌹 🌹


27 Jan 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹27, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹

శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : స్కంద షష్టి, Skanda Shasti 🌻

🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -29 🍀


29. సురసఙ్ఘశుభఙ్కరి జ్ఞానప్రదే
మునిసఙ్ఘప్రియఙ్కరి మోక్షప్రదే ।

నరసఙ్ఘజయఙ్కరి భాగ్యప్రదే
శరణం శరణం జయలక్ష్మి నమః ॥

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : ప్రాణ, మనఃకోశముల నతిక్రమించి ఆత్మానుభవం పొందిన వారు ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తూ వుండవలసిన పనిలేదు. ఆత్మకు కేవలం తన ఉనికిలోనే ఆనందమున్నది. ఒక పని చేయడానికి గాని, చేయక పోవడానికి గాని దానికి పరిపూర్ణ స్వేచ్ఛ కలదు. ఏదైనా ఒక పని చేస్తే అది ఆ పనికి బద్ధమై చేస్తున్నదనడానికి ఎంత మాత్రమూ వీలులేదు.🍀


🌷🌷🌷🌷🌷


శుభకృత్‌, శిశిర ఋతువు,

ఉత్తరాయణం, మాఘ మాసం

తిథి: శుక్ల షష్టి 09:11:06 వరకు

తదుపరి శుక్ల-సప్తమి

నక్షత్రం: రేవతి 18:38:45 వరకు

తదుపరి అశ్విని

యోగం: సిధ్ధ 13:21:04 వరకు

తదుపరి సద్య

కరణం: తైతిల 09:13:06 వరకు

వర్జ్యం: -

దుర్ముహూర్తం: 09:04:54 - 09:50:12

మరియు 12:51:23 - 13:36:41

రాహు కాలం: 11:03:49 - 12:28:44

గుళిక కాలం: 08:13:56 - 09:38:52

యమ గండం: 15:18:36 - 16:43:33

అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:50

అమృత కాలం: 29:54:30 - 43:58:50

సూర్యోదయం: 06:49:00

సూర్యాస్తమయం: 18:08:28

చంద్రోదయం: 10:59:48

చంద్రాస్తమయం: 23:42:05

సూర్య సంచార రాశి: మకరం

చంద్ర సంచార రాశి: మీనం

యోగాలు: శ్రీవత్స యోగం - ధన

లాభం , సర్వ సౌఖ్యం 18:38:45 వరకు

తదుపరి వజ్ర యోగం - ఫల ప్రాప్తి

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹