🍀 25 - NOVEMBER - 2022 FRIDAY ALL MESSAGES శుక్రవారం, భృగు వాసర సందేశాలు 🍀

🌹🍀 25 - NOVEMBER - 2022 FRIDAY ALL MESSAGES శుక్రవారం, భృగు వాసర సందేశాలు 🍀🌹
1) 🌹25 - NOVEMBER నవంబరు - 2022 WEDNESDAY శుక్రవారం, భృగు వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 287 / Bhagavad-Gita -287 - 7వ అధ్యాయము 07 జ్ఞాన విజ్ఞాన యోగము🌹
3) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 648 / Sri Siva Maha Purana - 648 🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 365 / DAILY WISDOM - 365 🌹
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 264 🌹
6) 🌹. శివ సూత్రములు - 01 / Siva Sutras - 01 🌹. చైతన్యమాత్మా - 1 Caitanyamātmā - 1

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹25, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : చంద్ర దర్శనము, Chandra Darshan 🌻*

*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం -21 🍀*

*21. నిర్వ్యాజపూర్ణకరుణారససుప్రవాహే రాకేన్దుబిమ్బవదనే త్రిదశాభివన్ద్యే ।*
*ఆబ్రహ్మకీటపరిపోషిణి దానహస్తే శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ఈశ్వరశ క్తి ప్రేరణ - నిష్కామస్థితిని నీవు సాధించినప్పుడు, నిన్ను ప్రేరణ చెయ్యడానికి మంచి, చెడ్డ కోరిక లేవీ నీలో ఉండవు. అప్పుడు ఈశ్వరశక్తియే నిన్ను ప్రేరణ చేస్తుంది. ఆమెయే స్వయంగా కార్యం చేపట్టుతుంది. నెమ్మదిగా నీ సత్త యావత్తూ విచ్చుకొంటుంది. సర్వమూ పైనుంచి · నీలోనికి ప్రసరిస్తుంది. మనం కేవలం ఉపకరణ ప్రాయులమై పోతాము. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, హేమంత ఋతువు,
దక్షిణాయణం, మార్గశిర మాసం
తిథి: శుక్ల విదియ 22:36:31 వరకు
తదుపరి శుక్ల తదియ
నక్షత్రం: జ్యేష్ఠ 17:21:59 వరకు
తదుపరి మూల
యోగం: సుకర్మ 08:43:33 వరకు
తదుపరి ధృతి
కరణం: బాలవ 12:06:54 వరకు
వర్జ్యం: 00:42:02 - 02:08:54
మరియు 24:33:40 - 26:00:12
దుర్ముహూర్తం: 08:40:53 - 09:25:46
మరియు 12:25:18 - 13:10:11
రాహు కాలం: 10:38:42 - 12:02:51
గుళిక కాలం: 07:50:23 - 09:14:32
యమ గండం: 14:51:10 - 16:15:20
అభిజిత్ ముహూర్తం: 11:40 - 12:24
అమృత కాలం: 09:23:14 - 10:50:06
సూర్యోదయం: 06:26:13
సూర్యాస్తమయం: 17:39:29
చంద్రోదయం: 07:43:29
చంద్రాస్తమయం: 18:59:22
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు : చర యోగం - దుర్వార్త శ్రవణం
17:21:59 వరకు తదుపరి స్థిర యోగం -
శుభాశుభ మిశ్రమ ఫలం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీమద్భగవద్గీత - 287 / Bhagavad-Gita - 287 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 7 వ అధ్యాయము - జ్ఞానవిజ్ఞాన యోగం - 07 🌴*

*07. మత్త: పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ |*
*మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ||*

🌷. తాత్పర్యం :
*ఓ ధనంజయా! నా కన్నను శ్రేష్ఠమైన సత్యము వేరొక్కటి లేదు. దారమునందు ముత్యములు కూర్చాబడినట్లు సమస్తము నా పైననే ఆధారపడియున్నది.*

🌷. భాష్యము :
పరతత్త్వము సాకారమా లేక నిరాకారమా అను విషయముపై ఒక వివాదము కలదు. కాని భగవద్గీతకు సంబంధించినంతవరకు పరతత్త్వమనగా దేవదేవుడైన శ్రీకృష్ణుడే. ఈ విషయమే భగవద్గీత యందు అడుగుగడుగునా నిర్దారింపబడినది. ముఖ్యముగా ఈ శ్లోకములో పరతత్త్వము సాకారమని నొక్కి చెప్పబడినది. దేవదేవుడే పరతత్త్వమనెడి విషయమును బ్రహ్మసంహిత సైతము ద్రువీకరించినది. 

“ఈశ్వర: పరమ: కృష్ణ: సచ్చిదానందవిగ్రహ: - ఆదిదేవుడును, ఆనందనిదానమును, గోవిందుడును, సచ్చిదానంద విగ్రహుడును అగు శ్రీకృష్ణుడే పరతత్త్వమైన దేవదేవుడు”. ఈ ప్రాణములన్నియును పరతత్త్వము సర్వకారణకారణుడైన దివ్యపురుషుడని నిస్సందేహముగా నిరూపించుచున్నవి. కాని నిరాకారవాదులు శ్వేతాశ్వతరోపనిషత్తు (3.10) నందు తెలుపబడిన విషయమును ఆధారము చేసికొని తమ నిరాకారవాదనను చేయుదురు. 

“తతో యదుత్తరతరం తదురూప మనామయమ్/ య ఏతద్విదు రమృతాస్తే భవన్త్యథేతరే దుఃఖమేవాపియన్తి – విశ్వపు తొలిజీవియైన బ్రహ్మదేవుడు ఈ భౌతికజగమునందు దేవతలు, మానవులు, జంతువుల కన్నను అత్యంత ఘనుడని తెలియబడుచున్నాడు. కాని ఆ బ్రహ్మదేవునకు పరముగా భౌతికరూపరహితము మరియు భౌతికకల్మషరహితము నైన తత్త్వము (పరమపురుషుడు) వేరొకటున్నది. అతనిని తెలిసికొనగలిగినవాడు సైతము అతని దివ్యుడు కాగా, అతనిని తెలిసికొనలేనివారు భౌతికజగమునందు దుఃఖభాగులదురు.”

నిరాకారవాది ఈ ఉపనిషద్వాక్యములోని “అరూపమ్” అను పదమునకే ఎక్కువ ప్రాధాన్యత నొసగుచున్నను వాస్తవమునకు ఈ “అరూపము” అను పదము నిరాకారవాదమును సూచించుట లేదు. కేవలము అది బ్రహ్మసంహితలో వర్ణింపబడిన సచ్చిదానంద దివ్యరూపమునే సూచించుచున్నది. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 287 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 7 - Jnana Vijnana Yoga - 07 🌴*

*07. mattaḥ parataraṁ nānyat kiñcid asti dhanañ-jaya*
*mayi sarvam idaṁ protaṁ sūtre maṇi-gaṇā iva*

🌷 Translation : 
*O conqueror of wealth, there is no truth superior to Me. Everything rests upon Me, as pearls are strung on a thread.*

🌹 Purport :
There is a common controversy over whether the Supreme Absolute Truth is personal or impersonal. As far as Bhagavad-gītā is concerned, the Absolute Truth is the Personality of Godhead, Śrī Kṛṣṇa, and this is confirmed in every step. In this verse, in particular, it is stressed that the Absolute Truth is a person. 

That the Personality of Godhead is the Supreme Absolute Truth is also the affirmation of the Brahma-saṁhitā: īśvaraḥ paramaḥ kṛṣṇaḥ sac-cid-ānanda-vigrahaḥ; that is, the Supreme Absolute Truth Personality of Godhead is Lord Kṛṣṇa, who is the primeval Lord, the reservoir of all pleasure, Govinda, and the eternal form of complete bliss and knowledge. These authorities leave no doubt that the Absolute Truth is the Supreme Person, the cause of all causes.

The impersonalist, however, argues on the strength of the Vedic version given in the Śvetāśvatara Upaniṣad (3.10): tato yad uttara-taraṁ tad arūpam anāmayam/ ya etad vidur amṛtās te bhavanti athetare duḥkham evāpiyanti. “In the material world Brahmā, the primeval living entity within the universe, is understood to be the supreme amongst the demigods, human beings and lower animals. But beyond Brahmā there is the Transcendence, who has no material form and is free from all material contaminations. Anyone who can know Him also becomes transcendental, but those who do not know Him suffer the miseries of the material world.”

The impersonalist puts more stress on the word arūpam. But this arūpam is not impersonal. It indicates the transcendental form of eternity, bliss and knowledge as described in the Brahma-saṁhitā quoted above. 
🌷 🌷 🌷 🌷 🌷

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 . శ్రీ శివ మహా పురాణము - 648 / Sri Siva Maha Purana - 648 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 15 🌴*
*🌻. గణేశ యుద్ధము - 3 🌻*

అపుడు వారందరు శివునకు హితమును చేయగోరి ఆయనకు నమస్కరించి ఎదుట నిలచి ఇట్లు పలికిరి: హే ప్రభూ! ఆజ్ఞాపించుము (22). నీవు పరబ్రహ్మవు, సర్వేశ్వరుడవు. మేమందరము నీ సేవకులము. సృష్ఠి స్థితిలయ కారణుడగు పరమేశ్వరుడవు నీవే (23). నీవు స్వరూపములో నిర్గుణడవేయైననూ లీలచే రజస్సత్త్వ తమోగుణములతో రూపమును స్వీకరించెదవు. హే ప్రభూ! నీవీనాడు ఎట్టి లీలను వెలయించితివో చెప్పుము (24).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ ముని శ్రేష్ఠా! మహేశ్వరుడు వారి మాటలను విని, తన గణములు చెల్లాచెదరగుటను గాంచి వారికి వృత్తాంతము నంతనూ విన్నవించెను (25). ఓ మునిశ్రేష్ఠా! సర్వేశ్వరుడు, గిరిజాపతి యగు శంకరుడు అపుడు నవ్వి బ్రహ్మ నగు నాతో నిట్లు పలికెను (26).

శివుడిట్లు పలికెను -

ఓ బ్రహ్మా! వినుము. నా ద్వారము నందు మహాబలుడగు ఒక బాలుడు చేత కర్ర బట్టు కొని నిలబడి ఇంటిలోనికి వెళ్లకుండగా అడ్డుపడుచున్నాడు (27). ఈతడు యుద్ధములో శత్రువును దెబ్బతీయుటలో దిట్ట. నా గణములను స్వీయబలముచే ఓడించి చెల్లాచెదరు చేసినాడు (28). ఓ బ్రహ్మా! నీవు మహాబలుడవు. ఆతని వద్దకు వెళ్లి ఆతనిని ప్రసన్నునిగా చేయుము. ఓ బ్రహ్మ! విధీ! నీవు సామరస్యముతో నీతిని ఉపయోగించి కార్యమును సాధించుము (29).

బ్రహ్మ ఇట్లు పలికెను -

కుమారా! అజ్ఞానముచే మోహితుడనైన నేను ప్రభువు యొక్క ఈ వాక్యమును విని భావమునెరుంగక మహర్షులందరితో గూడి ఆ బాలకుని వద్ధకు వెళ్లితిని (30). మహాబలుడగు ఆ గణశుడు సమీపమునకు వచ్చుచున్న నన్ను గాంచి కోపించి దగ్గరకు వచ్చి నా మీసములను పెరికి వేసెను (31). ఓ దేవా! క్షమించుము. క్షమించుము. నేను యుద్ధము కొరకు వచ్చినవాడను గాను. నేను బ్రాహ్మణుడను. శాంతికాముకుడను. ఉపద్రవమును చేయువాడను గాను. అనుగ్రహించుము (32). ఓ నారదా! మహావీరుడు, బాలుడే అయినా పెద్దల పరాక్రమము గల వాడు అగు ఆ గణశుడు ఇట్లు నేను పలుకుచుండగనే పరిఘను చేత బట్టెను (33).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 648🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 15 🌴*

*🌻 Gaṇeśa’s battle - 3 🌻*

22. Standing in front of Śiva and bowing to him with a desire to secure good for him they said—“O lord, be pleased to command us.

23. You are the great Brahman, the lord of all, the creator, the sustainer and the annihilator of all created things. All are your servants.

24. You are intrinsically devoid of attributes but by means of your sports you assume Rājasika, Sāttvika and Tāmasika forms. O lord, what sort of sport you are indulging in, now?”

Brahmā said:—
25. O excellent sage, on hearing their words and seeing the Gaṇas completely shattered, lord Śiva told them everything.

26. O excellent sage, Śiva, the lord of all, the consort of Pārvatī, then laughingly told me, Brahmā.

Śiva said:—
27. O Brahmā, listen. A boy is standing at the entrance to my house. He is very strong. He has a staff in his hand. He prevents me from entering the house.

28. He strikes very dexterously. He has destroyed many of my Pārṣadas. He has forcefully defeated my Gaṇas.

29. O Brahmā, you alone should go there. This strong boy shall be propitiated. O Brahmā, you shall do everything to bring him under control.

Brahmā said:—
30. On hearing the words of the lord and unable to know the reality, being deluded by ignorance, O dear, I went near Gaṇeśa accompanied by the sages.

31. On seeing me approaching, the powerful Gaṇeśa came to me very furiously and plucked my moustache and beard.

32. “Forgive me. Forgive me, O lord. I have not come for fighting. I am a brahmin and shall be blessed. I have come to make peace and I will cause no harm.”

33. While I said thus, O brahmin, the heroic Gaṇeśa, the boy of great valour uncommon to the boys took up the iron club.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 365 / DAILY WISDOM - 365 🌹*
*🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀*
*📝. ప్రసాద్ భరద్వాజ్*

*🌻30. అస్తిత్వము అంతా చైతన్యమే🌻*

*ప్రతి ఒక్కరూ గాఢనిద్రలో ఉన్నప్పుడు, స్వచ్ఛమైన స్థితిలో, లక్షణరహితంగా, కేవలం ఒక చైతన్యం గానే ఉనికిలో ఉంటారు. గాఢ నిద్రలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏమయ్యారు? చైతన్యంతో ముడిపడి ఉన్న ఉనికిగ మాత్రమే ఉన్నారు. ఇది ఉనికి మరియు చైతన్యం అని రెండు విషయాలు కాదు. ఇది ఉనికిగా ఉన్న చైతన్యం. సత్-చిత్. వేదాంత తత్వశాస్త్రం ‘సత్-చిత్’ అనే పదాన్ని ఉపయోగిస్తుంది, అంటే ఉనికి-చైతన్యం. భాష యొక్క క్లిష్టత ఏమిటంటే, సత్-చిత్ అంటే ఏమిటో సూచించడానికి ఏ పదాన్ని ఉపయోగించలేరు. అవి రెండు వేర్వేరు విషయాలు కాదు. ఉనికిగా ఉన్న చైతన్యం, చైతన్యంగా ఉన్న ఉనికి. ఉనికి - చైతన్యం.*

*ఉనికే చైతన్యం, చైతన్యమే ఉనికి. కాబట్టి ఒకే పదం కింద సూచించడానికి ఉనికి - చైతన్యం అని ఉపయోగించబడింది. ఎందుకంటే దానిని వ్రాయడానికి వేరే మార్గం లేదు. గాఢనిద్ర స్థితిలో అందరూ ఉనికి-చైతన్యం మాత్రమే. ఒకవేళ చైతన్యమే ఉనికి అయితే, సహజంగా అది విభజించబడదు. ఇది విభజించబడదు. అది అవిభాజ్యం. ఒకరు చైతన్యం యొక్క విభజనను ఊహించి నట్లయితే, కనీసం సిద్ధాంతపరంగా లేదా విద్యాపరంగా, ఒకరు చైతన్యం యొక్క రెండు భాగాల మధ్య ఒక ఖాళీని ఊహించవలసి ఉంటుంది, ఎందుకంటే ఒక వస్తువు నుండి మరొక వస్తువును వేరుచేసేది స్థలం లేదా సమయం. ఇప్పుడు, చైతన్యం యొక్క రెండు భాగాల మధ్య ఖాళీ ఉందని ఎవరైనా ఊహించగలరా?*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 365 🌹*
*🍀 📖 from The Philosophy of Religion 🍀*
*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*

*🌻30. It is Being which is Consciousness🌻*

*Everyone was in the state of deep sleep, in a condition of pure being—impersonal, featureless, indeterminate awareness associated with existence. What was everyone in the state of deep sleep? Only existence which is associated with consciousness in an integral manner. It was not existence and consciousness. It was existence which was consciousness, Sat-Chit. The Vedanta philosophy uses the word ‘Sat-Chit', which means Existence-Consciousness. The difficulty of language is such that no word can be used at all to designate what Sat-Chit means. They are not two different things or states. It is Being which is Consciousness, or Consciousness which is Being.*

*Being is Consciousness, and Consciousness is Being. So the hyphen is used, Existence-Consciousness, because no other way is known to write it down. Everyone is only Existence-Consciousness in the state of deep sleep. If the Self is Consciousness, naturally it cannot be divisible. It is not partite, it is impartite. If one imagines a division of Consciousness, theoretically at least, or academically, one has to imagine a space between two parts of Consciousness, because what distinguishes one thing from another thing is space, or time. Now, can one imagine that there is space between two parts of Consciousness?*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 264 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. జీవితం సంపూర్ణమయిన 'అవును' కావాలి. ఐతే దాన్ని మనం పూర్తిగా మార్చేశాం. కాదు'లన్నిట్నీ కరిగించి 'అవును'లుగా పోత పోయాలి. అది అందరికీ వర్తిస్తుంది. అది అసాధ్యం కాదు. 🍀*

*నువ్వు ఒక మనిషి లోపల అన్వేషిస్తే కాదు అన్న వాటికి సంబంధించి గుంపులు కనిపిస్తాయి. కాదు, కాదు, కాదు, కాదు. తవ్వేకొద్దీ అవే వస్తూ వుటాయి. చాలా పెద్దవి వస్తాయి. 'అవును' అన్నది చాలా అరుదుగా కనబడుతుంది. ఎక్కడో ఒకటి కనిపించినా అది నీరసంగా, నలిగిపోయి వుంటుంది. 'పేద' అవును తొక్కిడిలో నలిగి వుంటుంది. ఎక్కడో మూల అది వున్నా కొనవూపిరితో వుంటుంది. జీవితం సంపూర్ణమయిన 'అవును' కావాలి. ఐతే దాన్ని మనం పూర్తిగా మార్చేశాం. కాదు'లన్నిట్నీ కరిగించి 'అవును'లుగా పోత పోయాలి. అది అందరికీ వర్తిస్తుంది. అది అసాధ్యం కాదు.*

*బుద్ధుడి నించీ లావోట్జు వరకు అందరికీ అది జరిగింది. అది నీకూ సాధ్యం కావచ్చు. దాన్ని నేను వచనం నించీ కవిత్వానికి మారడమంటాను. అది గణితం నించీ సంగీతానికి మారడం. అప్పుడు జీవితమే ఒక పాట పరవశం. నేను మత సంబంధమయిన విషాదాన్ని బోధించను. శరీర హింసను బోధించే, ఆత్మహింసను బోధించే మతాలకు నేను వ్యతిరేకిని. ప్రేమ పునాది వున్న భయం లేని వర్తమాన పునాదులున్న, భవిష్యత్తుతో సంబంధించని, హేతువు పునాదిగా లేని ప్రేమపునాదిగా వున్న కొత్త మతాన్ని నేను ప్రవచిస్తాను.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శివ సూత్రములు - 01 / Siva Sutras - 01 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
1- శాంభవోపాయ
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻. 1. చైతన్యమాత్మ - 1 🌻*
*🌴. అత్యున్నత చైతన్యమే ప్రతిదానికీ వాస్తవికత. 🌴*

*చైతన్యం + ఆత్మ. చైతన్యం (లలిత సహస్రనామ 919) అనేది చేతన (లలిత సహస్రనామ 417) అనే పదం నుండి ఉద్భవించింది. చైతన్యం అంటే స్వచ్ఛమైన స్పృహ. చైతన్యం (చైతన్యం) చేతన (చేతన) నుండి ఉద్భవించింది. జ్ఞానం యొక్క అత్యున్నత రూపం స్వచ్ఛమైన చైతన్యం, దీనిని ఆత్మ లేదా స్వయం లేదా బ్రహ్మం అని కూడా పిలుస్తారు. చైతన్యము, జ్ఞానము మరియు బ్రహ్మము ఒకదానికొకటి భిన్నమైనవి కావు. అవన్నీ ఒకేలాంటివి. అయితే, స్పృహ స్థాయి భిన్నంగా ఉంటుంది. 

అత్యున్నత స్థాయి స్పృహ అంటే మొత్తం ఆలోచనల స్వేచ్ఛ, శివుడిలో మాత్రమే ఉండే స్థాయి. అంటే శివుడు ఒక్కడే పూర్తిగా స్వతంత్రుడు. శివుడు తప్ప, ఈ విశ్వంలోని ప్రతి వస్తువు పరస్పరం ఆధారపడి ఉంటుంది. సృష్టి యొక్క ముఖ్యమైన అంశాలలో పరస్పర ఆధారపడటం ఒకటి. శివుని స్వతంత్ర స్వభావాన్ని స్వాతంత్య్ర శక్తి అంటారు . (శక్తి అంటే బలము). ఇది శివుని యొక్క ప్రత్యేక లక్షణం కనుక దీనిని శక్తి అంటారు. శివుడు (బ్రాహ్మణుడు) స్పృహ యొక్క స్వచ్ఛమైన రూపంగా సూచించబడినప్పుడు, దాని అర్థం అతని స్వాతంత్య్ర శక్తి. ఈ స్పృహ మాత్రమే ప్రతిచోటా ప్రబలంగా ఉంటుంది, అందుకే శివుడు సర్వవ్యాపి అని పిలువబడ్డాడు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras - 01 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, *📚. Prasad Bharadwaj*

*🌻1. Caitanyamātmā - 1 🌻*
*🌴 Supreme consciousness is the reality of everything.🌴*

*Caitanyam + ātmā. Caitanyam (Lalitha Sahasranamam nāmā 919) is derived from the word cetana (Lalitha Sahasranamam nāmā 417), which means sentient being. Caitanyam means purest form of consciousness. Consciousness (caitanyam) is derived from conscious (cetana). The highest form of knowledge is pure consciousness which is also known as Ātmā or the Self or the Brahman. Consciousness, knowledge and the Brahman are not different from each other. They are the same. However, the level of consciousness differs. 

The highest level of consciousness means total freedom of thoughts, the level that prevails only in Shiva. This means that Shiva alone is completely independent. Except Shiva, every other thing on this universe is interdependent. Interdependency is one of the important aspects of creation. The independent nature of Shiva is called svātantrya śaktī (śaktī means power). It is called śaktī because it is the unique feature of Shiva. When Shiva (the Brahman) is referred to as the purest form of consciousness, it means His svātantrya śaktī. This consciousness alone prevails everywhere, hence Shiva is called omnipresent.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 415 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 415 -1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 415 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 415 -1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 89. శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా ।
అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా ॥ 89 ॥ 🍀

🌻 415 'మనోవాచామగోచరా’ - 1🌻


మనస్సునకు, వాక్కునకు గోచరము కానిది శ్రీమాత అని అర్థము. మనస్సుచేత పూర్ణముగ ఊహింపబడునది, వాక్కుచేత సంపూర్ణముగ ప్రకటింపబడునది శ్రీమాత. మనస్సుతో గాని, కన్నుతోగాని, చెవితోగాని, స్పర్శతోగాని, సుగంధ స్పర్శతోగాని, రుచితోగాని శ్రీమాతను లేశమాత్రము అనుభూతి చెందవచ్చును. మనస్సు, ఇంద్రియములు ఇత్యాదివి పరిమితములు. అట్టి వానిద్వారా అపరిమితమగు తత్త్వము ఎట్లు తెలియగలము. కాని తెలియు ప్రయత్నము చేయుచున్నచో మనస్సు, ఇంద్రియములు అపరిమిత తత్త్వమునకు ఉన్ముఖమై క్రమముగ అనుభూతి వృద్ధి యగుచుండును. అవగాహన పెరుగుచుండును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 415 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Prasad Bharadwaj

🌻 89. Shivapriya shivapara shishteshta shishta-pujita
Aprameya svaprakasha manovachamagochara ॥ 89 ॥ 🌻

🌻 415 'Manovachamagochara' - 1🌻


Srimata means that which is incomprehensible to mind and speech. Sri Mata cannot be fully conceived by the mind and cannot be fully revealed by speech. With the mind, with the eye, with the ear, with the touch, with the aromatic odour, with the taste, one can only feel a sliver of Srimata for mind and senses are limited and one cannot comprehend the infinite with finite mind. But if you try to know, the mind and the senses will be exposed to the unlimited philosophy and the comprehension will grow gradually. Awareness will increase.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

ఓషో రోజువారీ ధ్యానాలు - 268. వేగం / Osho Daily Meditations - 268. SPEED


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 268 / Osho Daily Meditations - 268 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 268. వేగం 🍀

🕉. మనందరికీ మన స్వంత వేగం ఉంది. జీవితం మన స్వంత వేగంతో, సహజమైన దానితో కలసి కదలాలి. 🕉


మీరు మీ సరైన లయను కనుగొన్న తర్వాత, మీరు చాలా ఎక్కువ చేయగలరు. అప్పుడు మీ చర్యలు తీవ్రమైనవిగా వుండవు, అవి మరింత సజావుగా నడుస్తాయి. నెమ్మదిగా పనిచేసేవారు ఉన్నారు, కానీ నెమ్మదితనం దాని స్వంత లక్షణాలను కలిగి ఉంటుంది. నిజానికి, ఇవి మంచి లక్షణాలు. వేగవంతమైన పనివాడు పరిమాణాత్మకంగా మంచివాడు. అతను లేదా ఆమె మరింత పరిమాణాత్మకంగా ఉత్పత్తి చేయగలరు కానీ గుణాత్మకంగా ఎప్పటికీ మంచిగా ఉండలేరు. నెమ్మదిగా పనిచేసేవాడు గుణాత్మకంగా మరింత పరిపూర్ణుడు. అతని శక్తి మొత్తం గుణాత్మక కోణంలోకి వెళుతుంది.

పరిమాణం ఎక్కువగా ఉండకపోవచ్చు, కానీ పరిమాణం నిజంగా విషయం కాదు. మీరు కొన్ని పనులు చేయగలిగితే, కానీ నిజంగా అందమైన పనులు, దాదాపు పరిపూర్ణంగా ఉంటే, మీరు చాలా సంతోషంగా మరియు సంతృప్తి చెందినట్లు భావిస్తారు. చాలా పనులు చేయాల్సిన అవసరం లేదు. మీకు పూర్తి సంతృప్తినిచ్చే ఒక పనిని మీరు చేయగలిగితే, అది సరిపోతుంది; మీ జీవితం సఫలమైంది. మీరు అనేక పనులు చేస్తూనే ఉంటారు, ఏదీ మీకు సఫలత నివ్వదు. దీనిలో ముఖ్యమైన విషయం ఏమిటి? కొన్ని ప్రాథమిక విషయాలను అర్థం చేసుకోవాలి. మానవ స్వభావము అంటూ లేదు. మనుషులు ఎంత మంది ఉన్నారో అన్ని మానవ స్వభావాలు ఉన్నాయి. వాటికి ఒక ప్రమాణం ఏమీ లేదు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Osho Daily Meditations - 268 🌹

📚. Prasad Bharadwaj

🍀 268. SPEED 🍀

🕉. We all have our own speeds. Life should move with our own speed, with that which is natural. 🕉


Once you find your right rhythm, you will be able to do much more. Your actions will not be hectic, they will run more smoothly, and you will be able to do much more. There are slow workers, but slowness has its own qualities. And in fact, those are better qualities. A fast worker can be quantitatively good. He or she can produce more quantitatively but qualitatively can never be very good. A slow worker is qualitatively more perfect. His whole energy moves into a qualitative dimension.

The quantity may not be much, but quantity is not really the point. If you can do a few things, but really beautiful things, almost perfect, you feel very happy and fulfilled. There is no need to do many things. If you can even do one thing that gives you total contentment, that is enough; your life is fulfilled. You can go on doing many things, with nothing fulfilling you. What is the point? A few basic things have to be understood. There is no such thing as human nature. There are as many human natures as there are human beings, so there is no one criterion.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ మదగ్ని మహాపురాణము - 133 / Agni Maha Purana - 133


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 133 / Agni Maha Purana - 133 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 41

🌻. అథ శిలా విన్యాస విధి - 3🌻


''సకలభూతముల అధీశ్వరివైన ఓ భూదేవీ! పర్వతాసమనముపై విరాజిల్లుచు, సముద్రములచే చుట్చబడియున్న నీవు ఏకాంతమునందు గర్భధారణము చేయుము. వసిష్ఠకన్యవైన ఓ నందా! వసువులతోడను, ప్రజలతోడను కూడియున్న నీవు నన్ను ఆనందింపచేయుము. భార్గవ పుత్రివైన ఓ జయా! నీవు ప్రజలకు విజయము నిచ్చుదానవు. (నాకు కూడ విజయము నిమ్ము.)

అంగిరసుని పుత్రివైన ఓ పూర్ణా! నీవు నాకోరికలను తీర్పుము. కశ్యపమహర్షి పుత్రికవైన ఓభద్రా! నీవు నాకు కల్యాణమైన బుద్ధినిమ్ము. సకలబీజములతో నిండి, సమస్త రత్నౌషధుంతో సంపన్నమైన, సుందరియైన ఓ జయాదేవీ! వసిష్ఠ పుత్రికయైన ఓ నందాదేవీ! ఇచట ఆనంద పూర్వకముగ రమింపుము.

కశ్యపుని కన్యయైన ఓ భద్రా! నీవు ప్రజాపతికి పుత్రివి. నాలుగు దిక్కులందును వ్యాపించినదానవు. చాలగొప్పదానవు సుందరివి, మనోహరమైనదానవు. ఈగృహమునందు రమింపుము. ఓ భార్గవీదేవీ! నీవు చాల ఆశ్చర్యమయురాలవు. గంధమాల్యాదులతో పూడింపబడి ప్రకాశించచున్నావు. జనులకు ఐశ్వర్యమునిచ్చు ఓదేవీ! నీవీ గృహమునందు విహరింపుము. ఈదేశాధిపతికిని, నగరాధిపతికిని, గృహాధిపతికిని, దీనియందు నివసించు బాలాదులకును, మనుష్యాది ప్రాణులకును ఆనందము కలిగించుటకై పశ్వాదులను వృద్ధిపొందింపుము.'' ఈవిధముగా ప్రార్థించి వాస్తుకుండమును గోమూత్రముతో తడుపవలెను.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 133 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 41

🌻 Mode of performing consecration - 3 🌻


21-22. The goddess earth should be worshipped in a copper vessel of the shape of a lotus. “O the exclusive mistress of all beings, abound with the summits of mountains as the seats, one surrounded by oceans, O goddess! You resort to this hole. O rejoicer! born of sage Vasiṣṭha! you rejoice with the Vasus and the progeny.

23. O Victorious! related to Bhārgava (Paraśurāma) Maker of thine subjects victorious! the perfect! the relative of Aṅgiras! fulfil all my desires.

24. O Auspicious one! related to sage Kāśyapa! Make my intellect good. One who is accomplished with all seeds! One who possesses all gems and herbs!

25. May you be victorious! O beautiful one! O rejoicer! Related to Vasiṣṭha! The daughter of the creator! O Goddess! O handsome one! Stay on here in bliss—O majestic one!

26. Stay thou in this house! O beautiful and brilliant one! the daughter of Kaśyapa! The honoured, most wonderful and bedecked with scents and garlands!

27. O Goddess! Stay in bliss in this room! O Bhār-gavi (daughter of Śukra)! Bestower of worldly prosperities! Possessed by the gods, kings, and masters of the house!

28. May you become the multiplier of animals for the happiness of men and others. Having said in this way one should then sprinkle cow’s urine on the pit.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 686 / Vishnu Sahasranama Contemplation - 686


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 686 / Vishnu Sahasranama Contemplation - 686🌹

🌻686. పూరయితా, पूरयिता, Pūrayitā🌻

ఓం పూరయిత్రే నమః | ॐ पूरयित्रे नमः | OM Pūrayitre namaḥ


న కేవలం పూర్ణ ఏవ సర్వేషామపి సమ్పదా ।
పూరయితాఽపి స హరిః పరమాత్మా జనార్దనః ॥

తాను కామిత ఫల పూర్ణుడగుట మాత్రమే కాదు; వారిని సంపదలతో పూరించువాడుగనుక ఆ పరమాత్మ అయిన జనార్దనుడు పూరయితా అని చెప్పబడుతాడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 686🌹

🌻686. Pūrayitā🌻

OM Pūrayitre namaḥ


न केवलं पूर्ण एव सर्वेषामपि सम्पदा ।
पूरयिताऽपि स हरिः परमात्मा जनार्दनः ॥

Na kevalaṃ pūrṇa eva sarveṣāmapi sampadā,
Pūrayitā’pi sa hariḥ paramātmā janārdanaḥ.


He not merely Pūrṇah but also He fills all with riches. Hence for this reason, Lord Janārdana is called Pūrayitā.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

स्तव्यस्स्तवप्रियस्स्तोत्रं स्तुतिः स्तोता रणप्रियः ।पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः ॥ ७३ ॥

స్తవ్యస్స్తవప్రియస్స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః ।పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ॥ 73 ॥

Stavyasstavapriyasstotraṃ stutiḥ stotā raṇapriyaḥ,Pūrṇaḥ pūrayitā puṇyaḥ puṇyakīrtiranāmayaḥ ॥ 73 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹

కపిల గీత - 94 / Kapila Gita - 94


🌹. కపిల గీత - 94 / Kapila Gita - 94🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 50 🌴

50. ఏతాన్యసంహత్య యదా మహదాదీని సప్త వై|
కాలకర్మగుణోపేతో జగదాదిరుపావిశత్॥


మహత్తత్త్వము, అహంకారము, పంచభూతములను ఏడు తత్త్వములను పరస్పరము కలియకుండును. దేనికదియే విడివిడిగా ఉండును. అప్పుడు జగత్తునకు కారణుడైన శ్రీమన్నారాయణుడు కాలము, అదృష్టము, సత్త్వాది త్రిగుణములతో గూడి వాటి యందు ప్రవేశించును.

ఇలా ఉన్న ఏడూ (మహత్తు అహంకారమూ పంచభూతాలు) సృష్టించబడి ఉన్నా ఒక ఆకారంగా ఏర్పడలేకపోయాయి. ఇంద్రియాలు, భూతాలు, వాటి గుణాలు, తన్మాత్రలు, అన్ని విడి విడిగా ఉన్నాయి. వీటిలో కొన్ని గ్రాహ్యములూ, ఇంకోటి గ్రాహకములూ. ఇంద్రియములు గ్రాహ్యములూ, గుణాలు గ్రాహకములు. తమలో తాము ఒకటై తమలో ఉన్న వాటిని గ్రహించి, "ఇది బాగుంది, ఇది బాగా లేదు" అని చెప్పడమే భోగము. అన్ని భోగాలకు మూలము శరీరము. అప్పుడు పరమాత్మ వీటన్నిటిలో ప్రవేశించాడు. ఒంటిగా ప్రవేశించకుండా, కాల కర్మ గుణములతో ప్రవేశించాడు. కర్మ అంటే మనము చేసుకున్న కర్మ, అదృష్టం. గుణము అంటే సత్వ రజో తమో గుణాలు.

బ్రహ్మాండములో ఉన్న అనంతకోటి జీవరాశులకూ ఆకారం చేయాలి. అందరినీ ఒకే ఆకారము చేయలేదు. దేవతలూ మానవులూ రాక్షసులూ పక్షులూ మొదలైన జీవాలు ఉన్నాయి. అన్ని ఇంద్రియాలు కలిపి ఒక ఆకారం చేయాలంటే ఒకే ఆకారం ఉండాలి. మరి, ఇంద్రియాలు ఒకటే ఐతే ఇన్ని ఆకారాలు ఎందుకు ఉన్నాయి. వాటి వాటి కర్మకనుగుణముగా, వాటిని అనుభవించడానికి అనువైన ఆకారముండాలి. అదే భోగాయతనం.

కాలమూ కర్మా అనే వాటి వలన ఇన్ని జీవులు ఉద్భవిస్తున్నాయి. ఏ ప్రాణికి ఏ పాపాన్ని ఏ ప్రాణికి ఏ పుణ్యాన్ని సరఫరా చేయాలో అలా చేస్తాడు. పరమాత్మ పరమాత్మగా రాలేదు, కాల కర్మములతో కలిసి ప్రవేశించాడు. ఇది వరకి జన్మలో వారు ఆచరించిన కర్మానుసారముగా భోగము అనుభవించడానికి తగిన ఆకారము ఇస్తాడు. కర్మ అంటే అదృష్టము. గుణము అంటే సత్వం రజస్సు తమస్సు. వారి వారి పాప పుణ్యాలకు ఏ ఏ గుణాలు ఉండాలో ఆ గుణాలకు తగిన శరీరాన్ని ఇస్తాడు.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 94 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 2. Fundamental Principles of Material Nature - 50 🌴

50. etāny asaṁhatya yadā mahad-ādīni sapta vai
kāla-karma-guṇopeto jagad-ādir upāviśat


When all these elements were unmixed, the Supreme Personality of Godhead, the origin of creation, along with time, work, and the qualities of the modes of material nature, entered into the universe with the total material energy in seven divisions.

After stating the generation of the causes, Kapiladeva speaks about the generation of the effects. At that time when the causes were unmixed, the Supreme Personality of Godhead, in His feature of Garbhodakaśāyī Viṣṇu, entered within each universe. Accompanying Him were all of the seven primary elements—the five material elements, the total energy (mahat-tattva) and the false ego. This entrance of the Supreme Personality of Godhead involves His entering even the atoms of the material world.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

24 Nov 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹24, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹

శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻

🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రము - 18 🍀

18. స్వైరానుభావాస్ త్వదధీనభావాః సమృద్ధవీర్యాస్త్వదనుగ్రహేణ
విపశ్చితోనాథ తరంతి మాయాం వైహారికీం మోహనపింఛికాం తే ॥

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : నీ కర్మలన్నిటినీ నీలో నిష్కామస్థితిని నెలకొల్పుకొన్న మీదట, ఈశ్వరునికి బలిగా సమర్పించుకుంటూ పోవడమే ఇక నీవు చేయవలసినది. నీలో పనిచేపేది ఈశ్వర శక్తియేననీ, ఆమెయే ఆ పనిని ఈశ్వరునికి బలిగా సమర్పిస్తున్నదనీ నీవు తెలుసుకోవాలి. చేసే పని ఎంతగా నిష్కామమైతే, అర్పించే బలి కూడా అంతగా విశుద్ధమవుతూ వుంటుంది. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, హేమంత ఋతువు,

దక్షిణాయణం, మృగశిర మాసం

తిథి: శుక్ల పాడ్యమి 25:38:21 వరకు

తదుపరి శుక్ల విదియ

నక్షత్రం: అనూరాధ 19:38:35 వరకు

తదుపరి జ్యేష్ఠ

యోగం: అతిగంధ్ 12:19:52 వరకు

తదుపరి సుకర్మ

కరణం: కింస్తుఘ్న 15:02:18 వరకు

వర్జ్యం: 01:18:00 - 02:46:00

మరియు 24:42:02 - 26:08:54

దుర్ముహూర్తం: 10:10:16 - 10:55:11

మరియు 14:39:47 - 15:24:43

రాహు కాలం: 13:26:48 - 14:51:01

గుళిక కాలం: 09:14:07 - 10:38:20

యమ గండం: 06:25:40 - 07:49:53

అభిజిత్ ముహూర్తం: 11:40 - 12:24

అమృత కాలం: 10:06:00 - 11:34:00

సూర్యోదయం: 06:25:40

సూర్యాస్తమయం: 17:39:28

చంద్రోదయం: 06:36:37

చంద్రాస్తమయం: 18:00:25

సూర్య సంచార రాశి: వృశ్చికం

చంద్ర సంచార రాశి: వృశ్చికం

యోగాలు : ఆనంద యోగం - కార్య సిధ్ధి

19:38:35 వరకు తదుపరి కాలదండ

యోగం - మృత్యు భయం

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹