🌹 07, FEBRUARY 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹

🌹🍀 07, FEBRUARY 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 07, FEBRUARY 2023 TUESDAY, మంగళవారం, భౌమ వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 130 / Kapila Gita - 130 🌹 🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 14 / 3. Salvation due to wisdom of Nature and Jeeva - 14 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 722 / Vishnu Sahasranama Contemplation - 722 🌹 
🌻722. అవ్యక్తః, अव्यक्तः, Avyaktaḥ🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 683 / Sri Siva Maha Purana - 683 🌹 🌻. త్రిపుర వర్ణనము - 3 / Description of Tripura (the three cities) - 3🌻
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 304 / Osho Daily Meditations - 304 🌹 🍀 304. పాతుకు పోవడం / ROOTED 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 430 / Sri Lalitha Chaitanya Vijnanam - 430 🌹 🌻 430. 'మదఘూర్ణిత రక్తాక్షి' / 430. 'Madaghurnita Raktakshi' 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹07, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ *
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : 🌻*

*🍀. అపరాజితా స్తోత్రం - 5 🍀*

9. యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః 
10. యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : పరతత్వం సత్_చిత్_ఆనందములుగ వర్ణించబడినట్లే, జగత్కారిణియైన శక్తిని వెలువరించు చైతన్యంగా వర్ణించబడింది. మనస్సు కూడా ఒక విధమైన చైతన్యమే. అది మానసిక శక్తిని వెలువరించు చైతన్యం. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, మాఘ మాసం
తిథి: కృష్ణ విదియ 28:29:11 వరకు
తదుపరి కృష్ణ తదియ
నక్షత్రం: మఘ 17:46:48 వరకు
తదుపరి పూర్వ ఫల్గుణి
యోగం: శోభన 16:03:59 వరకు
తదుపరి అతిగంధ్
కరణం: తైతిల 15:24:12 వరకు
వర్జ్యం: 04:25:30 - 06:12:14
మరియు 26:35:40 - 28:21:36
దుర్ముహూర్తం: 09:03:49 - 09:49:41
రాహు కాలం: 15:22:10 - 16:48:09
గుళిక కాలం: 12:30:12 - 13:56:11
యమ గండం: 09:38:13 - 11:04:12
అభిజిత్ ముహూర్తం: 12:08 - 12:52
అమృత కాలం: 15:05:54 - 16:52:38
సూర్యోదయం: 06:46:14
సూర్యాస్తమయం: 18:14:09
చంద్రోదయం: 19:37:47
చంద్రాస్తమయం: 07:51:38
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: సింహం
యోగాలు: కాలదండ యోగం - మృత్యు
భయం 17:46:48 వరకు తదుపరి ధూమ్ర
యోగం - కార్య భంగం, సొమ్ము నష్టం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. కపిల గీత - 130 / Kapila Gita - 130🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 14 🌴*

*14. భూత సూక్ష్మేంద్రియమనో బుద్ధ్యాదిష్వివ నిద్రయా|*
*లీనేష్వసతి యస్తత్ర వినిద్రో నిరహంక్రియః॥*

*తాత్పర్యము : సుషుప్తి అవస్థయందు శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అనునవి నిద్రయందు అహంకారమునందు లీనమగును. కాని, ఆత్మచైతన్యము నిద్రింపదు. సర్వథా అది అహంకార శూన్యమైనది. ఆ సమయమున జాగ్రత్, స్వప్న, సుషుప్తి అను మూడు విధములగు అవస్థలకు ద్రష్టా, సాక్షియైన వాడే పరమాత్మ.*

*వ్యాఖ్య : భూతేంద్రియ మనస్సులు పని చేయకున్నా ఆత్మ పని చేస్తుందా? ఆత్మ పని చేస్తేనే ఇవి పని చేస్తాయి. ఆత్మ పని చేస్తున్నా భూతెంద్రియ మనసులు పని చేయకుండా ఉండొచ్చు. అయినా ఆత్మ పని చేయట్లేదు అనుకోవడానికి వీలు లేదు.
నిదుర పోయినపుడు ఇంద్రియాలు, మనసు నిద్ర కూడా నిద్రపోతాయి. ఐనా ఆత్మ నిద్రపోదు. ఆత్మ ఉన్నదని గుర్తుపట్టడానికి నిద్రపోవడమే ఒక ప్రమాణం. అంటే ఇవన్నీ పని చేయడం మానేసినా పని చేసేది ఒకటి ఉంది. మనము నిద్రపోయినా అది మేలుకొనే ఉంటుంది. నిదురపోయి లేచిన వాడు "హాయిగా నిద్రపట్టింది" అంటే. నిద్రపోయినప్పుడు ఇంద్రియములూ మనసూ ఎటువంటి అనుభూతి పొందకపోయినా, ఆ అనుభూతిని చెప్పగలిగేది ఒకటి ఉంది. నిద్రావస్థలో కూడా ఆత్మ జాగరూకతతోనే ఉంటుంది. శరీరేంద్రియాలు పని చేయకున్నా ఆత్మ జ్ఞానం ఉంటుంది. నిద్రలో కూడా మనకి "బాగా నిద్రపోయాను" అనే జ్ఞానం కలిగిందంటే శరీరమునకు విడిగా ఆత్మ అనేది ఒకటి ఉంది. శరీరాదులు నిద్రపోయినా అది నిద్రపోదు. నిద్రపోకపోయినా నిద్రపోయినందు వలన కలిగే అనుభూతిని వ్యక్తీకరిస్తుంది. నిద్రపోకుండా నిద్రపోతున్న వాటిలో ఉండి అవి పొందిన అనుభూతిని మనకు చెబుతుంది. నిద్రావస్థలో కూడా ఆత్మ జ్ఞానం కలుగుతుంది. భూత సూక్ష్మ ఇంద్రియాలు, మనసు కూడా నిద్రపోతాయి. అప్పుడు కూడా నిద్రపోకుండా ఉండేది ఆత్మ. ఆ ఆత్మకు అహంకారం ఉండదు.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 130 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 14 🌴*

*14. bhūta-sūkṣmendriya-mano- buddhy-ādiṣv iha nidrayā*
*līneṣv asati yas tatra vinidro nirahaṅkriyaḥ*

*MEANING : Although a devotee appears to be merged in the five material elements, the objects of material enjoyment, the material senses and material mind and intelligence, he is understood to be awake and to be freed from the false ego.*

*PURPORT : The explanation by Rūpa Gosvāmī in the Bhakti-rasāmṛta-sindhu of how a person can be liberated even in this body is more elaborately explained in this verse. The living entity who has become satya-dṛk, who realizes his position in relationship with the Supreme Personality of Godhead, may remain apparently merged in the five elements of matter, the five material sense objects, the ten senses and the mind and intelligence, but still he is considered to be awake and to be freed from the reaction of false ego. Here the word līna is very significant. The Māyāvādī philosophers recommend merging in the impersonal effulgence of Brahman; that is their ultimate goal, or destination. That merging is also mentioned here. But in spite of merging, one can keep his individuality. The example given by Jīva Gosvāmī is that a green bird that enters a green tree appears to merge in the color of greenness, but actually the bird does not lose its individuality. Similarly, a living entity merged either in the material nature or in the spiritual nature does not give up his individuality. Real individuality is to understand oneself to be the eternal servitor of the Supreme Lord.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 722 / Vishnu Sahasranama Contemplation - 722🌹*

*🌻722. అవ్యక్తః, अव्यक्तः, Avyaktaḥ🌻*

*ఓం అవ్యక్తాయ నమః | ॐ अव्यक्ताय नमः | OM Avyaktāya namaḥ*

*యద్యప్యనేకమూర్తిత్వమస్య విష్ణోస్తథాపి చ ।*
*అయమీదృశ ఏవేతి న వ్యక్తోఽవ్యక్త ఉచ్యతే ॥*

*పరమాత్ముడు అనేక మూర్తులు కలవాడే అయినను, ఇతడు ఇట్టివాడు అని తెలియదగినట్లు వ్యక్తత అనగా స్పష్టత నందు వాడు కాదు కనుక అవ్యక్తః.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 722🌹*

*🌻722. Avyaktaḥ🌻*

*OM Avyaktāya namaḥ*

यद्यप्यनेकमूर्तित्वमस्य विष्णोस्तथापि च ।
अयमीदृश एवेति न व्यक्तोऽव्यक्त उच्यते ॥

*Yadyapyanekamūrtitvamasya viṣṇostathāpi ca,*
*Ayamīdr‌śa eveti na vyakto’vyakta ucyate.*

*Though He has many forms, He is not identifiable as a being of particular form and hence He is Avyaktaḥ.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् ।अनेकमूर्तिरव्यक्तश्शतमूर्तिश्शताननः ॥ ७७ ॥
విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ ।అనేకమూర్తిరవ్యక్తశ్శతమూర్తిశ్శతాననః ॥ 77 ॥
Viśvamūrtirmahāmūrtirdīptamūrtiramūrtimān,Anekamūrtiravyaktaśśatamūrtiśśatānanaḥ ॥ 77 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 . శ్రీ శివ మహా పురాణము - 683 / Sri Siva Maha Purana - 683 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 02 🌴*
*🌻. త్రిపుర వర్ణనము - 3 🌻*

వారు వేయి సంవత్సరములు శిరస్సుపై నిలబడి, వందసంవత్సరములు చేతులు పైకి ఎత్తియు తపస్సులు చేసిరి (22). చెడు పట్టుదల గల ఆ రాక్షసులు ఇట్లు పరమ దుఃఖముననుభవిస్తూ రాత్రింబగళ్లు నిద్రలేని వారై తపస్సును చేసిరి (23). ఓ మహర్షీ! ఇట్లు వారు గొప్ప తపస్సును చేయుచుండగా చాలాకాలము గడచినది. బ్రహ్మపై లగ్నమైన మనస్సు గల ఆ తారకపుత్రులు ధర్మముతో జీవిస్తూ తపస్సును చేసిరని నా అభిప్రాయము (24). అపుడు దేవతలకు మరియు రాక్షసులకు గురువు, గొప్ప కీర్తి గలవాడు, మహాత్ముడు అగు బ్రహ్మ వారి తపస్సుచే సంతసించి వరము నిచ్చుటకు ప్రత్యక్షమాయెను (25).

సర్వప్రాణులకు పితామహుడగు బ్రహ్మ మునులతో, దేవతలతో మరియు రాక్షసులతో గూడి అపుడు వారితో అనునయ పూర్వకముగా నిట్లనెను (26).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ గొప్ప రాక్షసులారా! మీ ఈ తపస్సుచే ప్రసన్నుడనైతిని. మీకు సర్వమును ఇచ్చెదను. మీకేది కావలయునో దానిని వరమడుగుడు (27). ఓ దేవ శత్రువులారా! మీరింత గొప్ప తపస్సును దేనికొరకు చేసితిరో చెప్పుడు. సర్వమును సృష్టించు నేనే అన్ని కాలములయందు సర్వుల తపస్సునకు ఫలము నిచ్చెదను (28).

సనత్కుమారుడిట్లు పలికెను -

ఆయన మాటలను విని వారు ముగ్గురు ఆ పితామహునకు ప్రణమిల్లి చేతులు జోడించి మెల్లగా తమ మనస్సులోని మాటను వెల్లడించిరి (29).

ఆ రాక్షసులిట్లు పలికిరి -

ఓ దేవ దేవా! నీవు ప్రసన్నుడవై వరము నియదలచినచో, మేము ఏ ప్రాణిచేతనైననూ మరణము పొందకుండునట్లు మాకు వరము నిమ్ము (30). ఓ జగత్ప్రభూ! మమ్ములను శాశ్వతముగా నుండునట్లు చేయుము. ముసలితనము, రోగము మొదలగు ఆటంకములు మమ్ములను దరి చేరకుండు గాక! మమ్ములను ఏ కాలము నందైననూ మృత్యువు సమీపించరాదు (31). మేము ముగ్గురము జరామరణములు లేని వారము కావలెను. ఇది మా కోరిక. ముల్లోకములలో ఇతరులనందరినీ మృత్యువును పొందునట్లు మేము చేసెదము (32). విశాలమగు సంపదతో గాని, గొప్ప నగరములతో గాని, ఇతరములగు మహాభోగములతో గాని, స్థిరమగు ఐశ్వర్యముతో గాని ప్రయోజనమేమి గలదు? (33)

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 683🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 01 🌴*

*🌻 Description of Tripura (the three cities) - 3 🌻*

22. They remained standing on their heads for a thousand years. They remained standing with their arms lifted for hundred years.

23. Thus they bore extreme distress in their tenacious evil intent. They remained alert day and night.

24. O sage, thus many years elapsed even as they performed the penance. I think they had a virtuous dedication of their souls in Brahmā, these sons of Tāraka.

25. Satisfied by their penance, Brahmā the supreme lord of the gods and Asuras, of great glory, appeared in front of them in order to grant them boons.

26. He was accompanied by sages, gods and Asuras. The grandfather of all living beings spoke to them thus, appeasing them.

Brahmā said:—
27. O great Asuras, I am now pleased with your penance. I shall grant you everything. Speak out the boons you wish to have.

28. O enemies of the gods, tell me why you have been performing this penance. I am the bestower of the fruits of all sorts of penance. I am the creator of everything for ever.

Sanatkumāra said:—
29. On hearing his words they bowed to the grandfather, with their palms joined in reverence and spoke to him revealing their mind’s desire slowly.
The Asuras said:—

30. O lord of gods, if you are pleased, if boons are to be given to us, please grant us indestructibility at the hands of everyone, every living being.

31. O lord of the universe, make us steady. Protect us from enemies. Let not old age, sickness and death befall us at any time.

32. We wish to become free from old age and death. In the three worlds we shall subject all others to death.

33. Of what avail are riches, vast earth, excellent cities, other sorts of vast enjoyments or big positions and power?

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 304 / Osho Daily Meditations - 304 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 304. పాతుకు పోవడం 🍀*

*🕉. మీరు ప్రేమలో పాతుకు పోతే, మీరు మూలంలో పాతుకు పోయినట్టే. పాతుకు పోవడానికి వేరే మార్గం లేదు. 🕉*

*మీకు డబ్బు ఉండవచ్చు, మీకు ఇల్లు ఉండవచ్చు, మీకు భద్రత ఉండవచ్చు, మీకు బ్యాంకు బ్యాలెన్స్ ఉండవచ్చు; ఆ విషయాలు మీకు పాతుకు పోవు. వారు కేవలం ప్రత్యామ్నాయాలు, ప్రేమకు పేద ప్రత్యామ్నాయం. అవి మీ ఆందోళనను మరింత పెంచవచ్చు, ఎందుకంటే మీకు భౌతిక భద్రతగా డబ్బు, సామాజిక హోదా ఉన్నందున - ఈ విషయాలు మీ నుండి తీసుకో బడతాయని మీరు మరింత ఎక్కువగా భయపడతారు. లేదా మీరు ఈ విషయాలను మరింత ఎక్కువగా కలిగి ఉండటం గురించి ఆందోళన చెందుతారు, ఎందుకంటే అసంతృప్తికి పరిమితి లేదు. కానీ మీ ప్రాథమిక అవసరం స్వయంలో పాతుకు పోవడం.*

*ప్రేమ అనేది ఒక వ్యక్తి పాతుకుపోవాల్సిన భూమి. చెట్లు భూమిలో పాతుకు పోయినట్లే, మానవులు ప్రేమలో పాతుకుపోవాలి. దాని మూలాలు కనిపించవు, కాబట్టి కనిపించే ఏదైనా సహాయం చేయదు. డబ్బు చాలా కనిపిస్తుంది, ఇల్లు చాలా కనిపిస్తుంది, సామాజిక స్థితి చాలా కనిపిస్తుంది. కానీ మనం కనిపించని మూలాలున్న చెట్టులం. మీరు ఏదో ఒక అదృశ్య భూమిని కనుగొనవలసి ఉంటుంది - దానిని ప్రేమ అని పిలవండి, దానిని దైవభక్తి అని పిలవండి, ప్రార్థన అని పిలవండి - కానీ అది అలాంటిదే, అదృశ్య, కనిపించని, అంతుచిక్కని, రహస్యమైనది. మీరు దానిని పట్టుకోలేరు. దీనికి విరుద్ధంగా, మీరు దానిని మిమ్మల్ని పట్టుకోవడానికి అనుమతించ వలసి ఉంటుంది.*
 
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 304 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 304. ROOTED 🍀*

*🕉. If you are rooted in love, you are rooted. There is no other way to be rooted. 🕉*

*You can have money, you can have a house, you can have security, you can have a bank balance; those things will not give you rootedness. They are just substitutes, a poor substitute for love. They may increase your anxiety even more, because once you have physical securitymoney, a social status--you become more and more afraid that these things may be taken from you. Or you become worried about having more and more of these things, because discontent knows no limit. And your basic need was of being rooted.*

*Love is the earth where one needs to be rooted. Just as trees are rooted in the earth, human beings are rooted in love. Our roots are invisible, so anything visible is not going to help. Money is very visible, a house is very visible, social status is very visible. But we are trees with invisible roots. You will have to find some invisible earth--call it love, call it godliness, call it prayer-but it is going to be something like that, something invisible, intangible, elusive, mysterious. You cannot catch hold of it. On the contrary, you will have to allow it to catch hold of you.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 430 / Sri Lalitha Chaitanya Vijnanam - 430 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 92. మదఘూర్ణిత రక్తాక్షీ, మదపాటల గండభూః ।*
*చందన ద్రవదిగ్ధాంగీ, చాంపేయ కుసుమ ప్రియా ॥ 92 ॥ 🍀*

*🌻 430. 'మదఘూర్ణిత రక్తాక్షి' 🌻* 

*మదముచే కదలుచున్న ఎఱ్ఱని కన్నులు కలది శ్రీదేవి అని 'మదము' అనగా అతిశయించిన ఆనందము అని తెలుప బడినది. బాహ్య విషయములందు నిర్లిప్తత, అంతరంగమందు శివుని యందు ఆసక్తత సతతము కలిగి యుండుటచే శివుని తేజో మహిమ కన్నుల యందు నిండగ శ్రీమాత కన్నులు ఎఱ్ఱని జీరతో యుండును. ఈ ఎఱ్ఱని జీర కల కన్నులు శుభలక్షణములు గలవిగ తెలుప బడినవి.శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఎఱ్ఱని జీరతో గూడిన కన్నులు గలవారే అని పురాణేతిహాసములు కీర్తించును.*

*మహాశివుడు హృదయమున మహా విష్ణువు నారాధించునని అట్లే మహా విష్ణువు హృదయమున మహేశ్వరు నారాధించునని, పై గ్రంథములు తెలుపును. శ్రీమాత వైష్ణవియే. అంతరంగమందు అగ్ని స్వరూపుడు లోహితాక్షుడు అయిన ఈశ్వరుని ప్రార్థించుట వలన అతని అనుగ్రహము, ఆమె కన్నుల నుండి వ్యక్తమగు చున్నది. తత్ఫలితముగ కన్నుల యందు ఎఱ్ఱ జీర యుండును. లోక విషయములను నిర్వర్తించుచున్ననూ శివుని యందే యుండుటచే కన్నుల జీర వ్యక్తమగు చుండును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 430 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 92. Madagharnita raktakshi madapatala gandabhuh*
*Chandana drava digdhangi chanpeya kusumapriya ॥ 92 ॥ 🌻*

*🌻 430. 'Madaghurnita Raktakshi' 🌻*

*It means that Srimata has red tinge in Her eyes due to exuberant joy. Detachment from external things and constant interest in Lord Shiva inwardly gives Her eyes a red tinge due to lord Shiva's brilliance reflecting in Her eyes. The red tinge of these eyes are said to have auspicious features. Legends glorify that Lord Rama and Lord Krishna have red tinge in their eyes.*

*The above scriptures also say that Maha Vishnu worships Maha Shiva in His heart and Maheshwar worships Maha Vishnu in His heart. Srimata is Vaishnavie. As she prays to Lord Shiva, the form of fire within, Lohitaksha, His grace is manifested from her eyes. As a result, there will be red tinge in the eyes. The red tinge in the eyes are manifested because it is in Shiva that the affairs of the world are being carried out.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj

Siva Sutras - 036 - 12. Vismayo yogabhūmikāḥ- 1 / శివ సూత్రములు - 036 - 12. విస్మయో యోగ భూమికాః - 1


🌹. శివ సూత్రములు - 036 / Siva Sutras - 036 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

1- శాంభవోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 12. విస్మయో యోగ భూమికాః - 1🌻

🌴. యోగా యొక్క దశలు ఒక అద్భుతం 🌴


విస్మయః అంటే ఆశ్చర్యంతో నిండి ఉండటం మరియు యోగభూమిక అంటే యోగము యొక్క వివిధ దశలు. ఈ సూత్రం యోగ అభివృద్ధి యొక్క వివిధ దశలను సూచిస్తుంది, యోగి యొక్క చైతన్యాభివృద్ధి. ఇక్కడ ఒక యోగి గురించి ప్రస్తావించబడింది, ఎందుకంటే ఒక యోగి తన వ్యక్తిగత చైతన్యాన్ని విశ్వ చైతన్యం లేదా శివ చైతన్యంతో ఏకం చేయడానికి ప్రయత్నిస్తాడు.

ఒక యోగి చైతన్యం యొక్క సాధారణ దశలను అధిగమించి తుర్య వైపు వెళ్ళినప్పుడు, అతను ఆనందాన్ని అనుభవించడం ప్రారంభిస్తాడు. దాని ప్రభావంతో కొంత కలవరపడతాడు. వేడి భూభాగం నుండి ఎత్తైన కొండ ప్రాంతానికి తన ప్రయాణాన్ని చేస్తున్న వ్యక్తితో దీనిని పోల్చవచ్చు. అతను కొండ వైపు కదులుతున్నప్పుడు, అతను వేడి నుండి చలి వాతావరణ పరిస్థితులలో మార్పును అనుభవిస్తాడు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Siva Sutras - 036 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 1 - Sāmbhavopāya

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 12. Vismayo yogabhūmikāḥ- 1 🌻

🌴. The stages of yoga are a wonder🌴


Vismayaḥ means filled with astonishment and yogabhūmikā means the various stages of yoga. This aphorism refers to different stages of yogic development, the development of consciousness of a yogi. The reference is made to a yogi, because a yogi attempts to unite his individual consciousness with that of cosmic consciousness or Shiva consciousness.

When a yogi transcends normal stages of consciousness and moves towards turya, he begins to feel the bliss and becomes bewildered by its effect. This can be compared to a person from a hot terrain making his journey to a hill resort. When he moves towards the hill, he could feel the change in weather conditions from hot to cold.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


నిర్మల ధ్యానాలు - ఓషో - 299


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 299 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ప్రతి బిడ్డకూ ఆనందంగా ఎట్లా వుండాలో తెలుసు. దాన్ని మళ్ళీ నేర్చుకోవాలి. నిన్ను నువ్వు అస్తిత్వ ప్రేమికుడిగా మలచుకో. అప్పుడు అత్యున్నత శిఖరం దర్శనమిస్తుంది. 🍀

ప్రతి పసిబిడ్డకు ఎట్లా ప్రతిస్పందించాలో తెలుసు. అందుకనే పిల్లలందరూ అందంగా వుంటారు. ఆనందంగా వుంటారు. వాళ్ళ కళ్ళలోకి చూడు. ఎంత నిశ్శబ్దం! వాళ్ళ ఆనందాన్ని చూడు. ఎంతగా పొంగిపొర్లుతూ వుంటుంది ! ప్రతి బిడ్డకూ ఆనందంగా ఎట్లా వుండాలో తెలుసు. కానీ త్వరలోనే పసిబిడ్డ ఆనందాన్ని మరచిపోతుంది. లేదా మరచిపోయేలా మనం చేస్తాం. దాన్ని మళ్ళీ నేర్చుకోవాలి. ఆ కళని తిరిగి గ్రహించాలి.

ప్రతిస్పందించే తనాన్ని తెలుసుకోవాలి. అప్పుడు అంతా ఎప్పట్లాగే వుంటుంది. నిన్ను నువ్వు అస్తిత్వ ప్రేమికుడిగా మలచుకో. అప్పుడు అత్యున్నత శిఖరం దర్శనమిస్తుంది. దానికి పవిత్ర గ్రంథాల పరామర్శ అక్కర్లేదు. ఎందుకంటే ఈ అనంత విశ్వమే అపూర్వ పవిత్ర గ్రంథం. ప్రతిచోటా అస్తిత్వ సంతకముంది. మతాలన్నీ మానవ నిర్మితాలే.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


DAILY WISDOM - 34 - 3. Have You Time to Think? / నిత్య ప్రజ్ఞా సందేశములు - 34 - 3. మీకు ఆలోచించడానికి సమయం ఉందా?


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 34 / DAILY WISDOM - 34 🌹

🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 3. మీకు ఆలోచించడానికి సమయం ఉందా? 🌻


మనలో ఏదో వెలితి మనకు నిరంతరంగా ఆందోళన కలిగిస్తూ ఉంటుంది. మీరు భౌతిక లేదా సామాజిక కోణంలో ప్రతిదీ కలిగి ఉన్నప్పటికీ, ఏదో సరిగ్గా లేదు అని మీరు అనుకుంటారు. మీరు సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తులు. మీకు మీ స్వంత ఆర్థిక స్థితి ఉంది; అంతా బాగానే ఉంది కానీ మీరు నిజంగా సంతోషంగా లేరు. దీనికి కారణం కనుక్కోవడానికి మీకు ఇంకా సమయం దొరకలేదు. బయటి పరిస్థితుల వరదతో మనం చాలా ఖాళీ లేకుండా ఉన్నాము. ఆలోచించే సామర్థ్యాన్ని కూడా కలిగి లేకపోవడమే కాకుండా ఆలోచించడానికి సమయం కూడా దొరకకుండా ఉన్నాము.

మనకు సరిగ్గా ఆలోచించే సామర్థ్యం ఉందా లేదా అనేది వేరే విషయం, కానీ ఆలోచించడానికి మీకు కనీసం సమయం ఉందా? అందరూ అసలు ఖాళీ లేకుండా ఉన్నారు. అందువల్ల, సరైన ఆలోచనలు చేయడానికి కావలసిన సమయాన్ని కనుగొనే అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మీ జీవితం మానసికమైన జీవితం తప్ప మరొకటి కాదు. మానసిక జీవితాన్ని విస్మరించినట్లయితే, మీ శారీరక మరియు సామాజిక జీవితం మిమ్మల్ని స్వేచ్ఛగా ఉండనీయవు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 34 🌹

🍀 📖 Philosophy of Yoga 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 3. Have You Time to Think? 🌻

There is something which speaks within us in a language of anxiety. Something is not all right, though you have everything in the physical or social sense. You are respectable people in society. You have a financial status of your own; everything is going well but you are not really happy, for a reason which you have not yet found time to go deep into. We are so busy with the enormous flood of the atmospheric conditions outside that we have been prevented from even finding time to think, let alone having the capacity to think.

Whether we have a capacity to think correctly or not is a different subject, but have you time to think? Everyone is very busy indeed. Therefore, there is the need to learn the art of finding time to think in the proper way, because your life is nothing but a mental life. If the mental life is ignored, your physical and social life is not going to make you free.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



శ్రీ మదగ్ని మహాపురాణము - 169 / Agni Maha Purana - 169


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 169 / Agni Maha Purana - 169 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 52

🌻. చతుఃషష్టి యోగిన్యాది లక్షణములు - 1 🌻

హయగ్రీవుడు చెప్పెను: ఇపుడు అరువది నాలుగు యోగినులను గూర్చి చెప్పెదను. వీరి స్థానము క్రమముగ తూర్పు నుండి ఈశాన్య పర్యంతము ఉండును. యోగినుల పేర్లు : అక్షోభ్య, రూక్షకర్ణి, రాక్షసి, కృపణ, క్షయ, పింగాక్షి, అక్షయ, క్షేమ, ఇల, నీలాలయ, లోల, అలక్త, బలాకేశి, లాలస, విమల, హుతాశ, విశాలాక్షీ, హుంకార, బడబాముఖి, మహాక్రూర, క్రోధన, భయంకరి, మహానన, సర్వజ్ఞ, తరల, తార, ఋగ్వేద, హయానన, సార, హుద్రసంగ్రాహి, శబర, తాలజింఘిక, రక్తాక్షి, సుప్రసిద్ద, విద్యుజ్జిహ్వ, కరఁకిణి, మేఘనాద, ప్రచండ, ఉగ్ర, కాలకర్ణి, వరప్రడ, చంద్ర చంద్రావలి, ప్రపంచ, ప్రలయాంతిక, శిశువక్త్ర, పిశాచి పిశితాశ, లోలుప, ధమని, తపని, రాగిణి, వికృతానన, వాయువేగ, బృహృత్కుక్షి, వికృత, విశ్వరూపిక, యమజిహ్వ, జయంతి, దుర్జయ, జయంతిక, బిడాలి, రేవతి, పూతన, విజయాంతిక. ఈ యోగినులకు ఎనిమిది లేదా నాలుగు చేతులుండును.

ఇచ్ఛానుసారముగ ఆయుధములను ధరించు చుందురు, ఉపాసకులకు సంపూర్ణ సిద్ధులను ప్రసాదింతురు. భైరవునకు పండ్రెండు చేతులుండును. దంతములు ఎత్తుగా ఉండును. శిరస్సుపై జటా-చంద్రులుండును. ఒక వైపున నున్న ఐదు చేతులతో ఖడ్గ-అంకుశ-కుఠార-బాణ-జగదభయప్రదాన ముద్రలును రెండవ ప్రక్కనున్న ఐదుచేతులలో ధనుష్‌ - త్రిశూల-ఖట్వాంగ (మంచము కోడు) పాశకార్ధ - వరముద్రలను ధరించి యుండును. మిగిలిన రెండు చేతులలో గజ చర్మ యుండును. గజ చర్మమే వస్త్రము. సర్పాలంకారములచే అలంకృతుడై యుండును. మాతృకల మధ్య ప్రేతముపై కూర్చుండును. భైరవుని ప్రతిమ ఈ రూపమున నిర్మించి పూజించవలెను. భైరవునకు ఒక ముఖముండ వచ్చును. లేదా ఐదు ముఖములుండవచ్చును.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 169 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 52

🌻Characteristics of images of different forms of goddesses - 1 🌻


The Lord said:

1. I shall describe (the characteristics) of the eight Yoginis (female attendants on Durgā) respectively residents of (the eight quarters) east to north-east. (The Yoginīs) Akṣobhyā, Rūkṣakarṇī, Rākṣasi, Kṛpaṇā and Akṣayā (reside in the east).

2. (The Yoginīs) Piṅgākṣī, Kṣayā, Kṣemā, Ilā, Līlā, Layā, Laktā, Balākeśī, Lālasā and Vimalā (dwell in the south-east).

3. (The Yoginīs) Hutāśā, Viśālākṣī, Huṅkārā, Vaḍavāmukhī, Mahākrūrā, Krodhanā, Bhayaṅkarī and Mahānanā (are the residents of the south).

4. (The Yoginīs) Sarvajñā, Taralā, Tārā, Ṛgvedā, Hayānanā, Sārā (Sārākhyā), Rudrasaṅgrāhī, Śambarā and Tālajaṅghikā (occupy the south (-west).

5. Raktākṣī, Suprasiddhā, Vidyujjihvā, Karaṅkiṇī, Meghanādā, Pracaṇḍogrā, Kālakarṇī and Varapradā (are the inmates of the west).

6. Candrā, Candrāvalī, Prapañcā, Pralayāntikā, Śiśuvaktrā, Piśācī, Piśitāśā and Lolupā (dwell in the north-west).

7. Dhamanī, Tāpanī, Rāgiṇī, Vikṛtānanā, Vāyuvegā, Bṛhatkukṣi, Vikṛtā and Viśvarūpikā (govern the north).

8. Yamajihvā, Jayanti, Durjayā, Jayantikā, Viḍālā, Revatī, Pūtanā and Vijayāntikā (hold sway over the north-east).

9. (These Yoginīs should be represented) as having eight arms (or) four arms, wielding weapons of their choice and yielding all benefits (on their votaries). (Lord) Bhairava may hold the arka plant (Calotropis gigantee) in the hand and have the face like the knee or elbow bearing the matted hair and the Moon.

10. Kṛttivāsas (should be represented) as holding on one side the sword, goad, axe and arrow and offering protection to the universe and a bow, trident, club with a skull at the top and noose on the other.

11. Or he shall be having five faces and be wearing the elephant’s hide and adorned by the serpents. He shall be seated on the dead body. He must be worshipped in the midst of the mother goddesses.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీమద్భగవద్గీత - 322: 08వ అధ్., శ్లో 12 / Bhagavad-Gita - 322: Chap. 08, Ver. 12

 

🌹. శ్రీమద్భగవద్గీత - 322 / Bhagavad-Gita - 322 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 8వ అధ్యాయము - అక్షరబ్రహ్మ యోగం - 12 🌴

12. సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుద్య చ |
మూర్ద్న్యాధాయాత్మన: ప్రాణమాస్థితో యోగధారణమ్ ||

🌷. తాత్పర్యం :

ఇంద్రియ కర్మల నుండు విడివడి యుండుటయే యోగస్థితి యనబడును. సర్వేంద్రియ ద్వారములను మూసివేసి, మనస్సును హృదయము నందు స్థిరము చేసి, ప్రాణవాయువును శీర్షాగ్రము నందు నిలిపి మనుజుడు యోగము నందు స్థితుడు కాగలడు.

🌷. భాష్యము :

ఇచ్చట తెలుపబడిన యోగవిధానమును అభ్యసించుట మనుజుడు మొట్టమొదట సర్వభోగద్వారములను మూసివేయవలెను. ఇట్టి అభ్యాసమునకే “ప్రత్యాహారము”

(ఇంద్రియార్థముల నుండు ఇంద్రియములను మరలించుట) అని పేరు.

జ్ఞానేంద్రియములైన కన్నులు, చెవులు, నాసికము, జిహ్య, స్పర్శను సంపూర్ణముగా నిగ్రహించవలెను. స్వీయతృప్తి యందు వాటిని నియుక్తము చేయరాదు. ఈ విధముగా ఒనరించినపుడు మనస్సు హృదయస్థ పరమాత్మపై నెలకొని, ప్రాణవాయువు శీర్షాగ్రము నందు ప్రతిష్టితమగును. షష్టాధ్యాయమున ఈ పద్ధతి విపులముగా వివరింపబడినది.

కాని ఇదివరకే తెలుపబడినట్లు ఈ యోగపద్ధతి ప్రస్తుతకాలమునాకు ఆచరణీయము కానిది. కలియుగమునకు ఏకైక ఉత్తమమార్గము కృష్ణభక్తిరసభావనమే. భక్తియోగమునందు శ్రీకృష్ణుని పైననే సదా మనస్సు లగ్నము చేయగలిగినచో అచంచలమైన సమాధిస్థితి యందు నిలుచుట మనుజునకు సులభతరము కాగలదు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 322 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 8 - Akshara Brahma Yoga - 12 🌴

12 . sarva-dvārāṇi saṁyamya mano hṛdi nirudhya ca
mūrdhny ādhāyātmanaḥ prāṇam āsthito yoga-dhāraṇām

🌷 Translation :

The yogic situation is that of detachment from all sensual engagements. Closing all the doors of the senses and fixing the mind on the heart and the life air at the top of the head, one establishes himself in yoga.

🌹 Purport :

To practice yoga as suggested here, one first has to close the doors of all sense enjoyment. This practice is called pratyāhāra, or withdrawing the senses from the sense objects. The sense organs for acquiring knowledge – the eyes, ears, nose, tongue and touch – should be fully controlled and should not be allowed to engage in self-gratification. In this way the mind focuses on the Supersoul in the heart, and the life force is raised to the top of the head. In the Sixth Chapter this process is described in detail. But as mentioned before, this practice is not practical in this age. The best process is Kṛṣṇa consciousness. If one is always able to fix his mind on Kṛṣṇa in devotional service, it is very easy for him to remain in an undisturbed transcendental trance, or in samādhi.

🌹 🌹 🌹 🌹 🌹


06 Feb 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹06, ఫిబ్రవరి, February 2023 పంచాగము - Panchagam 🌹

శుభ సోమవారం, Monday, ఇందు వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻

🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 19 🍀


35. లోహితాక్షో మహాక్షశ్చ విజయాక్షో విశారదః |
సంగ్రహో నిగ్రహః కర్తా సర్పచీరనివాసనః

36. ముఖ్యోఽముఖ్యశ్చ దేహశ్చ కాహలిః సర్వకామదః |
సర్వకాలప్రసాదశ్చ సుబలో బలరూపధృక్

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : తమ స్వరూపం లోలోతులకు చొరని మానవులకు మనస్సన్నా చైతన్యమన్నా ఒకటిగానే తోస్తుంది. చైతన్య వికాసం ద్వారా మన నిజస్వరూపం మనకు ఎరుకపడుతున్న కొలదీ పెక్కు తరగతులు, భూమికలు, శక్తులు చైతన్యానికి ఉన్నవని మనం గ్రహిస్తాము. అన్నమయ, ప్రాణమయ, మనోమయాది కోశములతో విలసిల్లేది చైతన్యమే. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌, శిశిర ఋతువు,

ఉత్తరాయణం, మాఘ మాసం

తిథి: కృష్ణ పాడ్యమి 26:20:25

వరకు తదుపరి కృష్ణ విదియ

నక్షత్రం: ఆశ్లేష 15:04:31 వరకు

తదుపరి మఘ

యోగం: సౌభాగ్య 15:25:08 వరకు

తదుపరి శోభన

కరణం: బాలవ 13:09:10 వరకు

వర్జ్యం: 02:32:40 - 04:20:00

మరియు 28:25:00 - 30:11:48

దుర్ముహూర్తం: 12:53:01 - 13:38:49

మరియు 15:10:26 - 15:56:15

రాహు కాలం: 08:12:28 - 09:38:21

గుళిక కాలం: 13:56:00 - 15:21:53

యమ గండం: 11:04:14 - 12:30:07

అభిజిత్ ముహూర్తం: 12:08 - 12:52

అమృత కాలం: 13:16:40 - 15:04:00

సూర్యోదయం: 06:46:34

సూర్యాస్తమయం: 18:13:40

చంద్రోదయం: 18:48:13

చంద్రాస్తమయం: 07:14:26

సూర్య సంచార రాశి: మకరం

చంద్ర సంచార రాశి: కర్కాటకం

యోగాలు: సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం

15:04:31 వరకు తదుపరి ధ్వాoక్ష యోగం

- ధన నాశనం, కార్య హాని

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻



🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹