DAILY WISDOM - 34 - 3. Have You Time to Think? / నిత్య ప్రజ్ఞా సందేశములు - 34 - 3. మీకు ఆలోచించడానికి సమయం ఉందా?
🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 34 / DAILY WISDOM - 34 🌹
🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి 🍀
✍️. ప్రసాద్ భరద్వాజ
🌻 3. మీకు ఆలోచించడానికి సమయం ఉందా? 🌻
మనలో ఏదో వెలితి మనకు నిరంతరంగా ఆందోళన కలిగిస్తూ ఉంటుంది. మీరు భౌతిక లేదా సామాజిక కోణంలో ప్రతిదీ కలిగి ఉన్నప్పటికీ, ఏదో సరిగ్గా లేదు అని మీరు అనుకుంటారు. మీరు సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తులు. మీకు మీ స్వంత ఆర్థిక స్థితి ఉంది; అంతా బాగానే ఉంది కానీ మీరు నిజంగా సంతోషంగా లేరు. దీనికి కారణం కనుక్కోవడానికి మీకు ఇంకా సమయం దొరకలేదు. బయటి పరిస్థితుల వరదతో మనం చాలా ఖాళీ లేకుండా ఉన్నాము. ఆలోచించే సామర్థ్యాన్ని కూడా కలిగి లేకపోవడమే కాకుండా ఆలోచించడానికి సమయం కూడా దొరకకుండా ఉన్నాము.
మనకు సరిగ్గా ఆలోచించే సామర్థ్యం ఉందా లేదా అనేది వేరే విషయం, కానీ ఆలోచించడానికి మీకు కనీసం సమయం ఉందా? అందరూ అసలు ఖాళీ లేకుండా ఉన్నారు. అందువల్ల, సరైన ఆలోచనలు చేయడానికి కావలసిన సమయాన్ని కనుగొనే అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మీ జీవితం మానసికమైన జీవితం తప్ప మరొకటి కాదు. మానసిక జీవితాన్ని విస్మరించినట్లయితే, మీ శారీరక మరియు సామాజిక జీవితం మిమ్మల్ని స్వేచ్ఛగా ఉండనీయవు.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 34 🌹
🍀 📖 Philosophy of Yoga 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 3. Have You Time to Think? 🌻
There is something which speaks within us in a language of anxiety. Something is not all right, though you have everything in the physical or social sense. You are respectable people in society. You have a financial status of your own; everything is going well but you are not really happy, for a reason which you have not yet found time to go deep into. We are so busy with the enormous flood of the atmospheric conditions outside that we have been prevented from even finding time to think, let alone having the capacity to think.
Whether we have a capacity to think correctly or not is a different subject, but have you time to think? Everyone is very busy indeed. Therefore, there is the need to learn the art of finding time to think in the proper way, because your life is nothing but a mental life. If the mental life is ignored, your physical and social life is not going to make you free.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment