11-July-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 424 / Bhagavad-Gita - 424 🌹
2) 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 212 / Sripada Srivallabha Charithamrutham - 212 🌹
3) 🌹. శ్రీ ఆర్యా ద్విశతి - 76🌹
4) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 92🌹 
5) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 115 🌹
6) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 54 🌹 
7) 🌹. నారద భక్తి సూత్రాలు - 32 🌹 
8) 🌹. DATTATREYA JEEVANMUKTHA GEETA - 1 🌹
9) 🌹. శ్రీ దత్తాత్రేయ విరచిత జీవన్ముక్తగీత - 4🌹
10) 🌹. సౌందర్య లహరి - 39 / Soundarya Lahari - 39 🌹
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 338 / Bhagavad-Gita - 338 🌹
12) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 167 🌹 
13) 🌹 VEDA UPANISHAD SUKTHAM - 55 🌹
14) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 39🌹
15) 🌹 Seeds Of Consciousness - 119 🌹
16) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 29 / Sri Lalita Sahasranamavali - Meaning - 29 🌹
17) 🌹. మనోశక్తి - Mind Power - 57 🌹
18) 🌹. సాయి తత్వం - మానవత్వం - 48 / Sai Philosophy is Humanity - 48🌹
19) 🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 2 🌹
20) 🌹. ఓంకారము ~ షోడశ కళలు వివరణ 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీమద్భగవద్గీత - 424 / Bhagavad-Gita - 424 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 33 🌴

33. తస్మాత్త్వముత్తిష్ట యశో లభస్య
జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధమ్ |
మయైవైతే నిహతా: పూర్వమేవ
నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ ||

🌷. తాత్పర్యం : 
అందుచే లెమ్ము. యుద్ధసన్నద్ధుడవై కీర్తిని గడింపుము. శత్రువులను జయించి సమృద్ధమైన రాజ్యము ననుభవింపుము. ఓ సవ్యసాచీ! నా ఏర్పాటుచే వారందరును ఇదివరకే మరణించియున్నందున ఈ యుద్ధమున నీవు కేవలము నిమిత్తమాత్రుడవగుము.

🌷. భాష్యము : 
“సవ్యసాచి” యను పదము యుద్ధరంగమున అతినిపుణతతో బాణప్రయోగము చేయగలవానిని సూచించును.

 ఆ విధముగా అర్జుండు శత్రుసంహారము కొరకు బాణప్రయోగమును చేయగల సమర్థుడైన యోధుడని సంభోధింపబడినాడు. ఈ శ్లోకమున “నిమిత్తమాత్రమ్” అను పదము మిక్కిలి ప్రధానమైనది. 

జగత్తంతయు శ్రీకృష్ణభగవానుని సంకల్పము, ప్రణాళికచే నడుచుచుండ తగినంత జ్ఞ్ఞానములేని మూఢులు ప్రకృతి ఎట్టి ప్రణాళిక లేకనే నడుచుచున్నదనియు మరియు సృష్టులన్నియును యాదృచ్చికముగా సంభవించినవనియు భావింతురు. 

“బహుశ: ఇది ఇట్లుండవచ్చును” లేదా “బహుశ: దానిని పోలవచ్చును” అని పలుకు నామమాత్ర శాస్త్రజ్ఞులు పలువురు కలరు. కాని ఈ విషయమున “బహుశ:” లేదా “ఇది కావచ్చును” అను ప్రశ్నకు తావే లేదు. 

అనగా ఈ భౌతికజగత్తు సృష్టి వెనుక ప్రత్యేకమైన ప్రణాళిక ఒకటి కలదు. ఆ ప్రణాళిక యేమిటి? ఈ భౌతికసృష్టి బద్ధజీవులు భగవద్ధామమును తిరిగి చేరుటకు ఒక ఆవకాశమై యున్నది. 

భౌతికప్రకృతిపై అధిపత్యము చెలాయించు భావమున్నంతవరకు జీవులు బద్ధులై యుందురు. కాని ఎవరైనను శ్రీకృష్ణభగవానుని సంకల్పము నెరిగి కృష్ణభక్తి అలవరచుకొనినచో అత్యంత బుద్ధికుశలురు కాగలరు. 

విశ్వము యొక్క సృష్టి, లయములు ఆ భగవానుని పరమనిర్దేశమునందు జరుగుచుండును గనుక కురుక్షేత్రమందలి యుద్ధము కూడా అతని సంకల్పము పైననే ఏర్పాటు చేయబడినది. 

కనుకనే అర్జునుడు యుద్ధము చేయ నిరాకారించినపుడు దేవదేవుని కోరిక ననుసరించి యుద్ధము చేయమని బోధింపబడినాడు. అప్పుడే అతడు ఆనందభాగుడు కాగలడు. 

అనగా కృష్ణభక్తిభావనలో సంపూర్ణముగా నిమగ్నుడై జీవితమును ఆ భగవానుని దివ్యసేవకే అంకితము చేసినవాడు పరిపూర్ణుడు కాగలడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 424 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 33 🌴

33. tasmāt tvam uttiṣṭha yaśo labhasva
jitvā śatrūn bhuṅkṣva rājyaṁ samṛddham
mayaivaite nihatāḥ pūrvam eva
nimitta-mātraṁ bhava savya-sācin

🌷 Translation : 
Therefore get up. Prepare to fight and win glory. Conquer your enemies and enjoy a flourishing kingdom. They are already put to death by My arrangement, and you, O Savyasācī, can be but an instrument in the fight.

🌹 Purport :
Savya-sācin refers to one who can shoot arrows very expertly in the field; thus Arjuna is addressed as an expert warrior capable of delivering arrows to kill his enemies. “Just become an instrument”: nimitta-mātram. 

This word is also very significant. The whole world is moving according to the plan of the Supreme Personality of Godhead. 

Foolish persons who do not have sufficient knowledge think that nature is moving without a plan and all manifestations are but accidental formations. 

There are many so-called scientists who suggest that perhaps it was like this, or maybe like that, but there is no question of “perhaps” and “maybe.” There is a specific plan being carried out in this material world. 

What is this plan? This cosmic manifestation is a chance for the conditioned souls to go back to Godhead, back to home. As long as they have the domineering mentality which makes them try to lord it over material nature, they are conditioned. 

But anyone who can understand the plan of the Supreme Lord and cultivate Kṛṣṇa consciousness is most intelligent. The creation and destruction of the cosmic manifestation are under the superior guidance of God. 

Thus the Battle of Kurukṣetra was fought according to the plan of God. Arjuna was refusing to fight, but he was told that he should fight in accordance with the desire of the Supreme Lord. 

Then he would be happy. If one is in full Kṛṣṇa consciousness and his life is devoted to the Lord’s transcendental service, he is perfect.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 212 / Sripada Srivallabha Charithamrutham - 212 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయం 38 

🌻. పురాణపండితుని కథ 🌻

ఇంతలో ఊరిలోకి పురాణం చెప్పే ఒక పండితుడు వచ్చారు. పురాణాలన్ని వాళ్ళకి తెలిసినవే కాబట్టి అవి కేవలం శూద్రుల కోసమే అని వాళ్ళు పురాణ శ్రవణం చేసి పండితునికి దక్షిణ ఇవ్వాలని బ్రాహ్మణులు నిర్ణయించారు. 

అతనికి బాపనార్యుల ఇంటిలో భోజనం ఏర్పాటు చేసారు. పురాణ ప్రవచనం ముందు లక్ష్మి అతనికి పాలు కాచి యిచ్చేది. ఆ పురాణ పండితుడు మహాఙ్ఞాని, మహాయోగి. 

అతడు తన యోగశక్తివల్ల తన ఆత్మ ధరించిన ఇతర రూపాలు తెలుసుకొని వాటిని తనలోకి ఆకర్షించు కున్నాడు. ఇక్కడ జమిందారు ఇంట్లో నాల్గునెలల పసి బాలునిలో తన ఆత్మ ఉందని, ఆ ఆత్మయే మరుజన్మలో లక్ష్మికి భర్త అవగలదని యోగదృష్టితో కనిపెట్టాడు. 

లక్ష్మి భర్త మరణానంతరం అతని ఆత్మ మూలతత్వమైన పురాణ పండితునిలో లీనమయ్యిందన్న విషయం సర్వఙ్ఞులైన శ్రీపాదులకి తెలుసు.

అయితే ఆ పండితుడు తనకు ఉన్న కర్మ ఋణాను బంధాలు తీర్చుకొని, అలాగే తన ఆత్మ ధరించిన ఇతర రూపాలను తనలో ఆకర్షింప చేసుకొని భగవంతునిలో లీనమవ్వాలని నిశ్చయించుకున్నాడు. 

అలా అయిన పక్షం లో వచ్చే జన్మలో లక్ష్మికి భర్త కావలసిన జమిందారు కొడుకు ఆ పసికందు మరణించి, ఆ జన్మలో లక్ష్మి బ్రహ్మ చారిణిగానే జీవించాల్సి ఉంటుంది. 

కాని లక్ష్మి మరుజన్మలో బ్రాహ్మణుల ఇంట్లో పుట్టాలని, ఈ జన్మలోని భర్తయే మరు జన్మలో కూడా భర్త కావాలని తీవ్రంగా కోరుకుంటున్నది.

🌻. కర్తవ్య బోధ 🌻

పురాణ ప్రవచనం ముగిసాక శూద్రుల దగ్గర సంభావనలు తీసుకోవడంవల్ల వాళ్ళతో తనకున్న ఋణానుబంధం తీరి పోయిందని, అలాగే బాపనార్యుల ఇంట్లో భోజనం చేయడం వల్ల బ్రాహ్మణ జన్మకి సంబంధించిన ఋణానుబంధం తీరిం దని ఆ పండితుడు లెక్కలు వేసుకుంటున్నాడు. 

బాప నార్యులవద్ద సెలవు తీసుకొని వెళ్ళబోతుంటే శ్రీపాదులు అతనితో, "నాయనా! ఈ లక్ష్మి అమాయకురాలు, ఇంక కొంత కాలమే జీవిస్తుంది. నీవు ఆ జమిందారు కొడుకు నుండి చైతన్యం తీసివేస్తే మరుజన్మలో బ్రాహ్మణిలా పుట్టే లక్ష్మి గతి ఏమిటి? 

నేను ఈమెను ఆశీర్వదించి, మాంగల్యం కూడా సృష్టించి హిరణ్యలోకంలో ఉంచాను. అందువల్ల ఋణానుబంధం తెంచుకొనకుండా ఈమె దగ్గర సువర్ణ దానం స్వీకరించి, వచ్చే జన్మలో ఆదర్శ దంపతులై జీవించండి," అని దీవించారు. 

ఈ విధంగా జమిందారు కొడుకుయొక్క అకాల మృత్యువు, తమ భక్తురాలైన లక్ష్మికి మరుజన్మలో కన్యగానే ఉండిపోవాల్సిన రాత రెండింటిని విచిత్రంగా తప్పించారు ఆ జగత్ప్రభువులు. వారి లీలలు అద్భుతములు, అనూహ్యములు కాదా!. 

శ్రీపాదరాజం శరణం ప్రపద్యే

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sripada Srivallabha Charithamrutham - 212 🌹
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj 

CHAPTER 21

🌻. The relationship of Arundhathi and Vashista 🌻 

I asked Gurucharana, ‘I heard that Arundhati Matha was born in a ‘chandala’ family. In such case, how did Vasishta Maharshi marry her?’ Gurucharana said, ‘In ancient times, Vasishta did tapas for thousand years.  

At that time, one chandala girl by name Aksha Mala did service to him within her limits. The Maharshi was pleased and told her to ask for any boon. She desired that he should marry her.  

Vasishta questioned, ‘I am a Brahmin. You belong to a chandala family. How is the relationship of wife and husband suitable to us?’ She said, ‘you told me to ask for a boon, I asked. If you give, it is good. Otherwise permit me to go back.’  

Then Maharshi was afraid of breaking his promise and said ‘in that case, will you agree to whatever I do with your body?’. She agreed.  

The Maharshi burnt her to ashes and again brought her back to life. Thus, he did seven times. In the seventh ‘janma’, the sin of ‘chandala’ was completely destroyed and she became pure.  

Then Vasishta married her. She did not object even a little to what her husband did, so she became famous as ‘Arundhati’.  

This thing was told to Narasimha Varma who belonged to Vasishta ‘gothra’ during the course of a conversation by Sripada.  

A person born in a sudra ‘kshetram’ to a Brahmin can be treated as Brahmin after doing upanayanam in his seventh ‘janma’. It is good if people belonging to the four ‘varnas’ behave according to their respective qualities and actions allotted to them.  

A Brahmin, because of his bad deeds can slowly become fallen and become a ‘sudra’. A Sudra, because of his good deeds (satkarmas) slowly get elevated and can become a Brahmin. 

People who keep undisturbed faith in Datta Prabhu will get the higher states quickly according to their eligibility.  

Datta Prabhu can grant life, health and wealth necessary for living happily, to His devotee in whichever caste he is born or in which ever circumstances he is.  

It is Sripada’s natural leela to cut the bonds of ‘karma’ of many ‘janmas’ and give higher states to the devotee.’ Thus he explained. 

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 92 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. *చేయవలసినది- చేయదలచినది - 8* 🌻 

పరమాత్మ యందు ఉండటం మొదలు పెట్టిన తరువాత సాధన చేయక పోవటం ఉండదు. నిరంతరం నిత్యం ఉండేదే సాధన. 

ఇది చేస్తే ఏం వస్తుంది? అది చేస్తే ఏం వస్తుందని కొందరడుగుతుంటారు. "స్నానం చేస్తే ఏం వస్తుందండీ" అని మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాఫీ తాగితే ఏం వస్తుందండీ, ఎన్నాళ్ళు త్రాగాలి? అన్నం తింటే ఏం వస్తుంది ఎన్నాళ్ళు తినాలి? ఈ ప్రశ్నలు రావేం? ఆ ప్రశ్నలకు అర్థం ఎంతో ఈ అనుష్ఠానం చేస్తే ఏం వస్తుంది? అనే ప్రశ్నకు కూడా అర్థం అంతే. 

ఒళ్ళు క్షాళనం చేసికొంటే ఏం వస్తుంది? గుడ్డలు మార్చుకుంటే ఏం వస్తుంది? ఏమీ రాదు. అది చేయకపోతే రోగం వస్తుంది. స్నానం చేయకపోతే రోగం వస్తుందనేది సత్యం తప్ప చేస్తే ఏం రాదు. అలాగే గుడ్డలు మార్చుకోకపోతే కంపుకొడుతుందనేది సత్యం. 

సత్యము, సచ్చిదానంద రూపము, పరమాత్మ స్వరూపమైన విషయం ధ్యానంలో నిలబడి ఉండి దానిలో మన పనులు మనం చేసికొంటూ ఉండటమే. ఈ శరీరమును ఒక రథంగా, ఇంద్రియములను రథమునకు కట్టేసిన గుర్రములుగా, మనస్సును పగ్గంగా, రథంలో ప్రయాణం చేస్తున్న రథి అయిన జీవుడు తనకు సారధి (భగవంతుని) ని వరణ చేసికొనవలెను. ఈ సాధనంతా దాని కోసమే. 

తనకు రథం తోలిపెట్టే సారధి ఎవడా? అని వెతుక్కోవాలి. ఈ వెతుక్కోవటం చూపించుట కొరకే అర్జునుడు తన జీవితాన్ని నాటకంగా నడిపాడు. అర్జునుడు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి సహాయం (సారధిగా) అపేక్షించుట దీనికి సంకేతం.‌ మానవజీవిత రంగంలో ప్రతి ఒక్కడు పరమాత్మను తనకు సహాయంగా ఆవాహన చేసి తన హృదయంలోనికి ఆహ్వానం చేసికొనుటకు సంకేతంగా మహాభారతంలో ఈ ఘట్టం ఉన్నది.
....✍ *మాస్టర్ ఇ.కె.*
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹 The Masters of Wisdom - The Journey Inside - 114 🌹
🌴 Meditation for the Aquarian AGE - 5 🌴
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

🌻 The Fundamental - 2 🌻

If we are self-centred and meditate, the meditation easily gets us into problems: It might strengthen ambition and pride, but also emotionality or uncontrolled sexual impulses. 

With some even confusion and psychic disturbances develop. Therefore we should be careful, use our discrimination and control our motives.

For meditation no specific qualification nor prerequisite is needed. It is nothing exclusive and there is also no question which status you have attained. We gain the inner awareness according to our ability to align. 

Everybody can work with his own power of imagination and visualisation and get into this awareness. The power of visualizing depends on the general state of purity which we have obtained in our lives. 

Continuous working leads to attain alignment and the corresponding realisation. No one can get the fruit before the fundamentals aren’t cleared. 

But this shouldn’t prevent us from using or imparting the technique. Most techniques protect themselves.

To meditate in a group is particularly effective.

🌻 🌻 🌻 🌻 🌻 🌻 
Sources used: Master K. P. Kumar: The Aquarian Master / seminar notes.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీ ఆర్యా ద్విశతి - 76 🌹
🌻. శ్రీ లలితా స్తవరత్న వైజ్ఞానిక ధ్యాన యోగము 🌻
✍️. విరచితం : భగవాన్ శ్రీ క్రోధభట్టారక (దుర్వాస మహర్షి)
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 II లలితా కవచము II 🌻 

లలితా పాతు శిరోమే
లలాట మమ్బా చ మధుమతీ రూపా I
భ్రూమధ్యం చ భవానీ
పుష్ప శరా పాతు లోచన ద్వన్ద్వమ్ II 1 II

పాయా న్నాసాం బాలా
సుభగా దన్తాంశ్చ సున్దరీ జుహ్వామ్ I
అధరోష్ఠ మాదిశక్తిః
చక్రేశీ పాతు మే సదా చుబుకమ్ II 2 II

కామేశ్వరీ చ కర్ణౌ
కామాక్షీ పాతు గణ్డయో ర్యుగళమ్ I
శృఙ్గార నాయికాఽవ్యాద్
వక్త్రం సింహాసనేశ్వరీ చ గళమ్ II 3 II

స్కన్ద ప్రసూశ్చ పాతు
స్కన్ధౌ బహు చ పాటలాఙ్గీ మే I
పాణీ చ పద్మనిలయా
పాయా దనిశం నఖావళిం విజయా II 4 II

కోదణ్డినీ చ వక్షః
కుక్షిం చావ్యాత్ కులాచల తనూజా I
కల్యాణీ చ వలగ్నం
కటిం చ పాయాత్ కలాధర శిఖణ్డా II 5 II

ఊరుద్వయం చ పాయా
దుమా మృడానీ చ జానునీ రక్షేత్ I
జఙ్ఘే తు షోడశీ మే
పాయాత్పాదౌ చ పాశసృణిహస్తా II 6 II

ప్రాతః పాతు పరా మాం
మధ్యాహ్నే పాతు మణిగృహాధీశా I
శర్వాణ్యవతు చ సాయం
పాయాద్రాత్రౌ చ భైరవీ సాక్షాత్ II 7 II

భార్యాం రక్షతు గౌరీ
పాయాత్ పుత్రాంశ్చ బిన్దుగృహేపీఠా I
శ్రీవిద్యా చ యశోమే
శీలం చావ్యా చ్చిరం మహారాజ్ఞీ II 8 II

పవనమయి! పావకమయి!
క్షోణిమయి! వ్యోమమయి! కృపీటమయి!
రవిమయి! శశిమయి! దిజ్మయి!
సమయమయి! ప్రాణమయి! శివేపాహి II 9 II

కాళీ! కపాలిని! శూలిని!
భైరవి! మాతఙ్గి! పఞ్చమి! త్రిపురే!
వాగ్దేవి! విన్ధ్యవాసిని!
బాలే! భువనేశి! పాలయ! చిరం మామ్ II 10 II

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. నారద భక్తి సూత్రాలు - 31 🌹 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, అచల గురు పీఠము. 
📚. ప్రసాద్ భరద్వాజ 
ప్రథమాధ్యాయం - సూత్రము - 19

🌻 18. ఆత్మరత్య విరోధేనేతి శాండిల్యః - 2 🌻

భగవంతుడు చైతన్యపు లోతుల్లో మౌనంగా ఉంటాడు. భక్తుడు కూడా అదే స్థితిలో ఉంటేనే భక్తుడు ఆయనతో కలసి ఆత్మానందుడవుతాడు. దీనినే భగవదనుగ్రహం అంటారు.

            మౌనంలోనే యదార్థం ఇవ్వడం, పుచ్చుకొనడం జరుగుతుంది
-మెహెర్‌ బాబా

            అనగా భక్తుడు భగవంతుని యెడల సహజ ప్రేమలో ఉంటూ, ప్రాపంచిక విషయాలపై మౌనం వహిస్తే భగవదనుగ్రహం కలుగుతుంది. 

నేను అనేది మౌనపడ్డప్పుడు, ఆ ''నేను'' అనే అడ్డు తొలగుతుంది. ''నేను'' పోతే భగవత్ప్రేమ సాక్షాత్కరిస్తుంది. అప్పుడు ఆత్మానందుడౌతాడు.

            భగవంతుడు తప్ప మరే ఇతరమైనవి నీలో ఉన్నా భగవంతుడు నీలో ప్రతిష్ఠితమవడానికి బిడియ పడతాడని మెహెర్‌బాబా చెప్పేవారు.

కామక్రోధాదిక వైరి షట్కము జయించు
 దనుక, లేదు దివ్య పద దర్శనంబు -మెహెర్‌ బాబా

            భక్త ప్రహ్లాదుడు తన తండ్రితో ఇలా అన్నాడు.

            లోకములన్నియు గడియలో జయించిన వాడ, వింద్రియా
            నీకము జిత్తమున్‌ గెలువ నేరవు, నిన్ను నిబద్ధుజేయు నీ
            భీకర శత్రులార్వురబ్రభిన్నుల జేసిన, బ్రాణికోటిలో
            నీకు విరోధి లేడొకడు నేర్పున జూడుము, దానవేశ్వరా !

తా|| నీ విన్ని లోకాలను గడియలో జయించిన పరాక్రమశాలివి అయినను నీవు నీ ఇంద్రియాలను, నీ చిత్తాన్ని జయించలేకపోతివి. నిన్ను గట్టిగా బంధించి ఉన్న ఆర్గురు భయంకరమైన శత్రువులు నీలోనే ఉన్నారు. 

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఆర్గురు శత్రువులను జయించినచో ఇక బయటి లోకాలలో ఏ ఒక్కడైనను నీకు విరోధిగా ఉండడు కదా ! ఈ విషయాన్ని వివేకంతో గ్రహించుము తండ్రీ !

కనుక అంతః శత్రువులను జయిస్తే భగవంతుని యొక్క పవిత్ర ప్రేమ సామ్రాజ్యంలో ప్రవేశిస్తాడు భక్తుడు.

నన్ను ప్రేమించి, ఆత్మార్పణము నెవండు
సేయు, నాతడు నన్గాంచు చిత్తమల
ఎవరు భగవానుకై మరణింత్రు - వారు
శాశ్వతంబుగ నివసింత్రు - సత్యమిద్ది -మెహెర్‌ బాబా

            సర్వ సమర్పణ జేసికొన్న భక్తుడు ఆత్మానందం పొందుతాడు. అందుకోసం అడ్డుగా ఉన్న అహంకారాదులను తొలగించుకున్న భక్తుడు భగవంతుని ప్రేమ స్వరూప లక్షణంతో మమేకమవుతాడు.

            భక్తి అనేది ఆధ్యాత్మికమే గాని, కాయిక, వాచిక, మానసికాలు కాదని తెలియాలి. మానసిక భక్తిలో ధ్యానావస్థ, విక్షేపావస్థలను అధిగమించి ఆత్మానందం పొందటానికి ఉన్న విరోధాలను భగవంతుని యందలి ప్రీతిచే తొలగించుకోవటం తప్పనిసరి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీ దత్తాత్రేయ విరచిత జీవన్ముక్తిగీత - 4 🌹
📚. ప్రసాద్ భరద్వాజ

ఆత్మాగురుః త్వం విశ్వం చ
చిదాకాశో న లిప్యతే
గతాగతం ద్వయోః నాస్తి
జీవన్ముక్త స్స ఉచ్యతే ll 13

భావము: ఆత్మయే గురువు. నీవును ఆత్మయే. అది సర్వగత చైతన్యము. దేని చేతను అది అంటబడదు. రాకపోకలు లేనిది. అట్టి ఆత్మను తెలిసిన వాడు ‘జీవన్ముక్తుడు’.

గర్భ ధ్యానేన పశ్యన్తి
జ్ఞానినాం మన ఉచ్యతే
సోఽహం మనో విలీయన్తే
జీవన్ముక్త స్స ఉచ్యతే ll 14

భావము: అంతర్‌ధ్యానమున జ్ఞానులు వారి మనస్సుచే వీక్షించుచున్నారని చెప్పబడినది. ‘సోఽహం’ భావనలో ఆ మనస్సును కూడా ఎవడు విలీనమొనర్చునో వాడే ‘జీవన్ముక్తుడు’.

ఊర్ధ్వధ్యానేన పశ్యన్తి
విజ్ఞానం మన ఉచ్యతే
శూన్యం లయం చ విలయం
జీవన్ముక్త స్స ఉచ్యతే ll 15

భావము: ఊర్ధ్వధ్యానము చేత జ్ఞాని సమాధిలో దేనిని గాంచుచున్నాడో అదియే విజ్ఞానము. అది ఆత్మవిదుని మనస్సు. అదియే శూన్యము. అదియే లయము. అదియే విలయము. ఇది తెలిసినవాడే ‘జీవన్ముక్తుడు’.

అభ్యాసే రమతే నిత్యం
మనోధ్యాన లయం గతమ్‌
బంధ మోక్ష ద్వయం నాస్తి
జీవన్ముక్త స్స ఉచ్యతే ll 16

భావము: ఎవని మనస్సు అభ్యాసము నందు నిత్యము రమించుచుండునో, ధ్యానమగ్నమై యుండునో, లయించిపోవునో, బంధమోక్షములు రెండును తెలియక యుండునో వాడే ‘జీవన్ముక్తుడు’.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. DATTATREYA JIVANMUKTA GITA - 1 🌹
📚. Prasad Bharadwaj 

1. He is called a Jivanmukta or liberated sage who has a balanced mind, an equal vision and who beholds the one Satchidananda Atman in all names and forms.

2. He is called a Jivanmukta who has transcended the three bodies, the three Gunas, the five sheaths and the three Avastha.
 
3. He is called a Jivanmukta who perceives equally the One Infinite Being seated in the Jiva and Siva and in all beings.

4. He is called a Jivanmukta who is desireless, angerless, egoless, mineless, selfless, homeless and mindless.

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. సౌందర్య లహరి - 39 / Soundarya Lahari - 39 🌹
📚. ప్రసాద్ భరద్వాజ 

39 వ శ్లోకము

🌴. దుస్వప్నములు రాకుండా ఉండుటకు, పీడకలల భయ నివారణకు 🌴

శ్లో: 39. తవ స్వాధిష్టానే హుతవహ మధిష్ఠాయ నిరతం 
తమీడే సంవర్తం జనని మహతీం తాంచ సమయాంl 
యదాలోకే లోకాన్ దహతి మహతి క్రోధకలితే 
దయార్ద్రా యాద్దృష్టిః శిశిరముపచారం రచయతిll 
 
🌻. తాత్పర్యము : 
అమ్మా ! నీ స్వాదిస్థాన చక్రమందు ఉన్న అగ్ని తత్వమును అధిష్టించి ఎల్లప్పుడూ ప్రకాశించు అగ్ని రూపమయిన పరమ శివుని ఎల్లప్పుడూ ప్రార్ధించెదను. ఆయనతో సమ రూపువయిన నిన్ను కూడా ప్రార్ధించెదను. తేజో రూపమయిన అగ్ని జగములను దహించు చుండగా చల్లనయిన నీ చూపు శీతలములు అయిన ఉపచారములు కలిగించును కదా ! 
  
🌻. జప విధానం - నైవేద్యం :--

ఈ శ్లోకమును 108, సార్లు ప్రతి రోజు 12 రోజులు జపం చేస్తూ, పాయసం, తేనె, పొంగలి నివేదించినచో జీవిత స్పష్టత, దుస్వప్నముల నాశనం వాటి భయం నివారింపబడును అని చెప్పబడింది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Soundarya Lahari - 39 🌹 
📚 Prasad Bharadwaj 

SLOKA -39

🌴 Clarity of life, stopping bad dreams and To eliminate fear of them 🌴

39. Thava Swadhishtaaney Huthavahamadhishtaaya Niratham 
Thameedey Samvartham Janani Mahathee Thaam Cha Samayaam! 
Yadaalokey Lokaan Dahathi Mahathi Krodhakalithey 
Dayaardraa Yaa Drushtihi Shishiramupachaaram Rachayathi!" 
 
🌻 Translation : 
Mother, think and worship I of the fire, in your holy wheel of swadishtana, and the rudra who shines in that fire, like the destroying fire of deluge, and you who shine there as samaya when that angry fire of look of rudhra, burns the world, then your look drenches it in mercy, which treats and cools it down.

🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) :   

If one chants this verse 108 times each day for 12 days, offering, pongal, milk payasam and honey as prasadam, it is said that one would stop getting bad dreams and eliminate fear of them. Get Clarity of mind.

🌻 BENEFICIAL RESULTS: 
Frees person from bad and fearful dreams. Relief from doubts and suspecting nature. 
 
🌻 Literal Results: 
Activates Swadhishtana chakram. Enhances creativity and sexual urge.

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹

🌻 Guru Geeta Datta Vaakya - 1 🌻
✍ Sri GS Swami ji 
📚 Prasad Bharadwaj 

🌻 In life Guru is as important as parents 🌻

In life Guru is as important as parents are. For an individual to be fulfilled in life, for his life’s journey to be smooth and without any turbulence, for his life’s goal to be achieved, Guru’s assistance and cooperation are crucial. Guru helps an individual lead a respectable life in society as an honored citizen. He transforms him into a noble and charitable individual.

Some who have acquired a certain exalted position in society tend to claim that it was obtained entirely by their own merit and begin to feel that they do not require a Guru. In such instances also Guru exists in them as their own self esteem that has conferred the fruit upon them.

Upon proper analysis they can realize this. God, Guru, and Soul are one and the same and bestow success. Guru is a physician who treats the mind. To uplift a disciple, Guru exerts himself to a great extent.

In the case of parents, friends and relatives, attachment, bondage and sentiments get in the way of accomplishing this. Guru has absolutely no hesitation in helping the disciple. Socially and spiritually the disciple is shaped into a beneficial and productive citizen. Mother and Father would be proud of such a person. Such is the benefit granted by Guru.

This secret knowledge of Guru Gita that helps the entire world was taught by Lord Siva to his consort Parvati. For generations people have benefited by it. Its teachings apply to all ages and all times. One more time, now let us learn the glory of Sri Guru Gita.

May the first and foremost Guru of all, Lord Dattatreya shower His blessings upon all seekers.
🌻 🌻 🌻 🌻 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 338 / Bhagavad-Gita - 338 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 19 🌴

19. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్స్రుజామి చ |
అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున ||

🌷. తాత్పర్యం :
ఓ అర్జునా! వేడినొసగువాడను, వర్షము నిరోధించుట మరియు కురిపించుట చేయువాడను నేనే. అమృతత్వమును మరియు మృత్యువును నేనే. సత్, అసత్తులు రెండును నా యందే యున్నవి.

🌷. భాష్యము :
శ్రీకృష్ణభగవానుడు తన వివిధశక్తులచే విద్యుత్,సూర్యుల ద్వారా వేడిని, వెలుతురును ప్రసరించుచుండును. 

వేసవి కాలమున వర్షము పడకుండా ఆపునది మరియు వర్షకాలమున కుండపోత వర్షములు కురిపించినది ఆ శ్రీకృష్ణుడే. జీవితకాలమున పొడగించుచు మనలను పోషించు ప్రాణశక్తి అయిన అతడు అంత్యమున మృత్యువుగా మనకు దర్శనమిచ్చును. 

ఈ శక్తులన్నింటిని విశ్లేషించి చూచినచో శ్రీకృష్ణునకు భౌతికము మరియు ఆధ్యాత్మికముల నడుమ ఎత్తి భేదము లేదని మనము నిశ్చయించుకొనగలము. అనగా సత్, అసత్తులు రెండును అతడే. 

కనుకనే కృష్ణభక్తిరసభావన యందు పురోగమించిన స్థితి యందు మనుజుడు సత్, అసత్తుల భేదమును గాంచక సర్వమునందు కృష్ణునే గాంచును.

సత్, అసత్ లు రెండును శ్రీకృష్ణుడే అయినందున సర్వ భౌతికసృష్టులను కలిగియున్న విశ్వరూపము కుడా శ్రీకృష్ణుడే. అంతియేగాక ద్విభుజ మురళీధర శ్యామసుందరుని రూపమున అతడు ఒనరించిన బృందావనలీలలు ఆ దేవదేవునివే.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Bhagavad-Gita as It is - 338 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 19 🌴

19. tapāmy aham ahaṁ varṣaṁ
nigṛhṇāmy utsṛjāmi ca
amṛtaṁ caiva mṛtyuś ca
sad asac cāham arjuna

🌷 Translation : 
O Arjuna, I give heat, and I withhold and send forth the rain. I am immortality, and I am also death personified. Both spirit and matter are in Me.

🌹 Purport :
Kṛṣṇa, by His different energies, diffuses heat and light through the agency of electricity and the sun. 

During the summer season it is Kṛṣṇa who checks rain from falling from the sky, and then during the rainy season He gives unceasing torrents of rain. 

The energy which sustains us by prolonging the duration of our life is Kṛṣṇa, and Kṛṣṇa meets us at the end as death. 

By analyzing all these different energies of Kṛṣṇa, one can ascertain that for Kṛṣṇa there is no distinction between matter and spirit, or, in other words, He is both matter and spirit. In the advanced stage of Kṛṣṇa consciousness, one therefore makes no such distinctions. He sees only Kṛṣṇa in everything.

Since Kṛṣṇa is both matter and spirit, the gigantic universal form comprising all material manifestations is also Kṛṣṇa, and His pastimes in Vṛndāvana as two-handed Śyāmasundara, playing on a flute, are those of the Supreme Personality of Godhead.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹 . శ్రీ శివ మహా పురాణము - 167 🌹 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴 
38. అధ్యాయము - 13

🌻. శివపూజ - 7 🌻

కుర్యాదారార్తికం పంచవర్తికామనుసంఖ్యయా | పాదయోశ్చ చతుర్వారం ద్విః కృత్యో నాభిమండలే || 71

ఏకకృత్వో ముఖే సప్తకృత్వస్సర్వాగ ఏవ హి| తతో ధ్యానం యథోక్తం వై కృత్వా మంత్రముదీరయేత్‌ || 72

యథాసంఖ్యం యథాజ్ఞానం కుర్యాన్మంత్ర విధిం నరః | గురూపదిష్ట మర్గేణ కృత్వా మంత్రజపం సుధీః || 73

స్తోత్రైర్నానావిధైః ప్రీత్యా స్తువీత వృషభద్వజమ్‌ |తతః ప్రదక్షిణాం కుర్యాచ్ఛివస్య చ శనైశ్సనైః || 74

అయిదు వత్తుల గల హారతిని సంఖ్యానియమానుసారముగా ఈయవలెను. పాదములకు నాలుగు సార్లు, నాభీమండలమునందు రెండుసార్లు (71), 

ముఖమునందొకసారి, సర్వాగములయందు ఏడుసార్లు హారతినీయవలెను. తరువాత ధ్యానమును చేయవలెను. మంత్రమును జపించవలెను (72). 

భక్తుడు గురువు ఉపదేశించిన మార్గములో ధ్యానపూర్వకముగా మంత్రమును శాస్త్రోక్త సంఖ్యలో జపించవలెను (73). 

తరువాత వృషభము ధ్వజమునందు గల శివుని ప్రేమతో అనేక స్తోత్రములతో స్తుతించవలెను. అటు పిమ్మట శివునకు మెల్లగా ప్రదక్షిణమును చేయవలెను (74).

నమస్కారం తతః కుర్యాత్సాష్టాంగం విధివత్పుమాన్‌ | తతః పుష్పాంజలిర్దేయో మంత్రేణానేన భక్తితః || 75

శంకరాయ పరేశాయ శివ సంతోషహేతవే | అజ్ఞానాద్యది వా జ్ఞానాద్యద్యత్పూజాదికం మయా || 76

కృతం తదస్తు సఫలం కృపయా తవ శంకర | తావకస్త్వద్గత ప్రాణ స్త్వచ్చిత్తోహం సదా మృడ || 77

ఇతి విజ్ఞాయ గౌరీశ భూతనాథ ప్రసీద మే | భూమౌ స్ఖలితపాదానాం భూమిరేవావలంబనమ్‌ || 78

త్వయి జాతాపరాధానాం త్వమేవ శరణం ప్రభో | ఇత్యాది బహువిజ్ఞప్తిం కృత్వా సమ్యగ్విధానతః || 79

తరువాత భక్తుడు యథావిధిగా సాష్టాంగ నమస్కారమును చేయవలెను. తరువాత దేవదేవుడగు శంకరునికి ప్రీతిని కలిగించుటకై భక్తితో ఈ మంత్రమును నుచ్చరించి పుష్పాంజలినీయవలెను (75). హే శంకరా! నేను తెలిసి గాని, తెలియక గాని చేసిన పూజాదికము (76) 

నీదయవలన సఫలమగు గాక! హే మృడా! నేను నీవాడను. నా ప్రాణములు నీయందే ఉన్నవి. నేను సర్వదా నిన్నే స్మరించెదను (77). 

ఈ విధముగా పార్వతీపతికి విజ్ఞాపన చేయవలెను. హే భూతనాథా! నాయందు దయ చూపుము. భూమి యందు జారిపడిన వారికి భూమియే ఆలంబనమగును (78). 

హే ప్రభో! అదే తీరున, నీయందు అపరాధము చేసిన వారికి నీవే శరణు. ఇత్యాదిగా శివునకు చక్కని విధములో అనేక విజ్ఞప్తులను చేయవలెను (79).

పుష్పాంజలిం సమర్ప్యైవం పునః కుర్యాన్నంతి ముహుః | స్వస్థానం గచ్ఛ దేవేశ పరివారయుతః ప్రభో || 80

పూజాకాలే పునర్నాథ త్వయా గంతవ్యమాదరాత్‌ | ఇతి సంప్రార్ధ్య బహుశశ్శంకరం భక్తవత్సలమ్‌ || 81

విసర్జయేత్స్వ హృదయే తదపో మూర్ద్ని విన్యసేత్‌ | ఇతి ప్రోక్త మశేషేణ మునయ శ్శివపూజనమ్‌ || 82

భుక్తి ముక్తి ప్రదం చైవ కిమన్యచ్ఛ్రోతు మర్హథ || 83

ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ప్రథమఖండే సృష్ట్యుపాఖ్యానే శివపూజన వర్ణనం నామ త్రయో దశోsధ్యాయః (13).

ఈ విధముగా పుష్పాంజలిని సమర్పించి మరల అనేక పర్యాయములు నమస్కరించవలెను. హే దేవదేవా! ప్రభో! పరివారముతో గూడి స్వస్థానమునకు వెళ్లుము (80).

 హేనాథా! పూజాకాలమునందు మరల దయతో విచ్చేయుము. ఈ రీతిగా భక్తవత్సలుడగు శంకరుని అనేక తెరంగుల ప్రార్థించి (81)

 తన హృదయములోనికి విసర్జన చేసుకొనవలెను. ఆ జలములను శిరస్సుపై ఉంచుకొనవలెను. ఓ మునులారా! మీకీ విధముగా శివపూజను నిశ్శేషముగా చెప్పితిని (82). 

ఈ పూజ వలన భుక్తి,మరియు ముక్తి లభించును. మీరింకనూ ఏమి వినగోరుచున్నారు? (83).

శ్రీ శివ మహాపురాణములోని రెండవదియగు రుద్రసంహిత యందు మొదటిదియగు సృష్ట్యుపాఖ్యాన ఖండములో శివ పూజా వర్ణనము అనే పదమూడవ అధ్యాయము ముగిసినది (13).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. VEDA UPANISHAD SUKTHAM - 55 🌹
🌻 1. Annapurna Upanishad - 16 🌻
--- From Atharva Veda
✍️ Dr. A. G. Krishna Warrier
📚. Prasad Bharadwaj

IV-51. The mind abiding coolly in itself, after the inner rejection (of all objects), though in modifications, is (still) held to have the form of non-being. 

IV-52. They indeed are deemed liberated in life whose latent, un-enjoyed, impressions are like the fried seeds, incapable of sprouting any more. 

IV-53. Their minds have acquired the form of Sattva; they have gone beyond the farther shore of knowledge; they are said to be mindless. With the fall of their bodies they become sky-like. 

IV-54. Due to rejection of objects, both the vibrations of vital breaths and latent impressions swiftly perish as does a tree whose root is cut off. 

IV-55. In this state of cognition, whatever appears either as experienced before or as altogether new, must be meticulously wiped out by every one whose knowledge is sound. 

IV-56. The vast transmigratory life is (due to) the failure to obliterate them; on the contrary, liberation is held to be just their obliteration. 

IV-57. Be immaterial (spiritual), rejecting all pleasures and cognitions. 

IV-58. Knowledge depends on the states of objects; one having no knowledge is non-cognitive, though he performs a hundred actions; he is held to be non-inert. 

IV-59. He is said to be liberated in life, the clear sphere of whose emotions is not in the least affected by objects; his knowledge is spiritual. 

IV-60. Due to the absence of latent impressions in the mind when nothing is imagined, it remains steady with cognitions similar to those of children and the dumb.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 39 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 17
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. జగత్ సృష్టి వర్ణనము - 1 🌻

అథ సృష్టివర్ణనమ్‌
అగ్ని రువాచ :

జగత్సర్గాదికాం క్రీడాం విష్ణోర్వక్ష్యే7ధునా శృణు | స్వర్గాదికృత్స సర్గాదిః సృష్ట్యాదిః సగుణోగుణః. 1

అగ్ని పలికెను- ఇపుడు విష్ణువుయొక్క జగత్సృష్టలి మొదలగు క్రీడను గూర్చి చెప్పెదను, వినుము. స్వర్గాదులను నిర్మించిన ఆతడే సృష్టికి ఆది యైనవాడు ఆతడు గుణములు కలవాడు. నిర్గుణుడు కూడ.

బ్రహ్మావ్యక్తం సదగ్రేభూన్న ఖం రాత్రిదినాదికమ్‌ ప్రకృతిం పురుషం విష్ణుం ప్రవిశ్యాక్షోభయత్తతః. 2

ప్రారంభమున సద్రూప మేన బ్రహ్మయే ఆవ్యక్తావస్థలో ఉండెను. ఆకాశము గాని, రాత్రి గాని, పగలు కాని లేకుండెను. (ఆ బ్రహ్య) ప్రకృతిని, పురుషు డైన విష్ణువును ప్రవేశించి క్షోభింపచేసెను.

సర్గకాలే మహత్తత్త్వ మహఙార స్తతోభవత్‌ | వైకారిక స్తైజసశ్చ భూతారిశ్చైవ తామసః. 3

సృష్టి సమయయున ఆ ప్రకృతి పురుషుల క్షోభవలన మహత్తత్త్వము జనించెను. దానినుండి ఆహంకారము జనించెను. ఇంద్రియాది వికారములకు కారణ మైన అహంకారము తైజనము. పంచభూతములకు కారణ మైనది తామసము.

అహఙ్కారాచ్ఛబ్దమాత్రమాకా శమబవత్తతః | స్పర్శమాత్రోనిల స్తస్మాద్రూపమాత్రోనలస్తతః. 4

రసమాత్తరా ఆప ఇతో గన్ధమాత్రా మహీ స్మృతా | అహఙ్కారాత్తామసాత్తు తైజసానీన్ద్రియాణి చ. 5

వై కారికా దశ దేవా మన ఏకాదశేన్ద్రియమ్‌ | తతః స్వయమ్భూర్భగవాన్‌ సిసృక్షుర్వివాధాః ప్రజాః. 6

అప ఏవ సనర్జాదౌ తాసు వీర్యమపాసృజత్‌ | ఆపో నారా ఇతి ప్రోక్తా ఆపో వై నరసూనవః. 7

ఆయనం తస్య తాః పూర్వం తేన నారాయణః స్మృతః |

ఆహంకారమునుండి శబ్దతన్మాత్రరూప మైన ఆకాశము. దానినుండి స్పర్శతన్మాత్రరూప మైన వాయువు, దానినుండి రూపతన్మాత్రరూప మైన అగ్ని, దానినుండి రసతన్మాత్రరూప మైన ఉదకము, దానినుండి గంధతన్మాత్రరూప మైన పృథివియు జనించెను. 

ఇవన్నియు తామసాహంకారము నుండి జనించెను. పిదప (తైజసాహంకారము నుండి తైజసమైన ఇంద్రియములు పది వైకారికదేవతలు, పదకొండవ ఇంద్రియ మైన మనస్సు పుట్టినవి. 

పిమ్మట భగవంతుడైన బ్రహ్మ వివిధ ప్రజలను సృజింప దలచినవాడై ముందుగా జలమును సృజించెను. దానియందు తన వీర్యమును విడచెను. 

ఉదకమునకు నారములు అని పేరు. ఆవి నరుని వలన పుట్లెను. కదా. పూర్వము నారములు అనగా ఉదకములు, నరునకు స్థాన మాయెను. ఆందుచే ఆతడు నారాయణు డని చెప్పబడెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 54 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. పులస్త్యమహర్షి - హవిర్భువు - 3 🌻

9. రాక్షసస్వభావం కలవారిని గుర్తుపట్టాలంటే, మరొకడి దుఃఖంవల్ల ఆనందం పొందేవాడని సులభంగా చెప్పారు పెద్దలు. ఈ రాక్షసస్వభావంగలవాడికి ఏమీ కోరికలుండవు. 

10. నీ దగ్గర ఉండే సొమ్ము నాకు కావాలని ఆశించడు. “నువ్వు దానిని అనుభవిస్తున్నావుకాబట్టి, దానిని నాశనం చేస్తాను. నువ్వు ఆనందంగా ఉండటమే నాకు దుఃఖం. నువ్వు దుఃఖపడటమే నాకానందం” అంటాడు. ఇవే వాడి లక్షణాలు. 

11. ఇట్లాంటి లక్షణాలు ఒకవేళ బ్రాహ్మణులను ఆశ్రయించినాయంటే ఇక భారతీయసంస్కృతికి భవిష్యత్తు ఎక్కడుంటుంది? అలాగేకనుక జరిగితే, ఇక ఆసురీ సంపత్తియే తప్ప దేవతాలక్షణం, దైవీసంపత్తి మిగలదు. దానివల్ల భారతజాతి అష్టకష్టాలపాలవుతుంది.

12. ఏమీలేకుండా, ఏ నేరమూ చేయకుండానే భారతదేశం ఈ స్థితికి ఎందుకొచ్చింది? మనది మహోత్కృష్టమయిన సంస్కృతి అంటాం కదా! మనవారు పరమ ధార్మికులు, ఇది ఉత్తమమైన ఆర్యసంస్కృతి అని మనం అందరికీ చెప్పుకుంటాం.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹 Seeds Of Consciousness - 119 🌹
✍️ Nisargadatta Maharaj 
📚. Prasad Bharadwaj

For the sprouting of any seed, water is necessary. Similarly for the sprouting of this knowledge 'I am', water and food are necessary. 

In the essence of the food the quality of 'I amness' is in a dormant state. As salt is in seawater, similarly, in the body, in combination with the vital breath, the consciousness appears.

 It is the consciousness that feels pain or pleasure not the body or the vital breath. 

Once you know that you are not the body, all the concepts about pain and pleasure will disappear by themselves.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 2 🌹 
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

నాస్ట్రోడామస్, నే ఉదాహరణగా తీసుకుంటే …. హిట్లర్, నెపోలియన్ వంటి ప్రముఖుల ప్రస్తావన నాస్ట్రోడామస్ జోస్యంలో కనిపిస్తుంది. రాజీవ్ గాంధి హత్య, ప్రపంచ వాణిజ్య భవన సముదాయం కూల్చివేత వంటి విపత్కర సంఘటనలకు నాస్ట్రోడామస్ జోస్యాలు కొన్నింటికి అన్వయం కుదురుతుంది. మరి ఆయన చెప్పింది వీరి గురించేనా? అనేది స్పష్టంగా చెప్పలేము. అయితే, వీటిని ఎక్కువమంది నమ్ముతారు.

వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిందీ ఇలాంటివే! నాస్ట్రోడామస్ ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలను దర్శించారని ఆయన జోస్యాలను నమ్మినవారు భావిస్తునట్టే, రాష్ట్రంలో అనేక సంఘటనల గురించి వీరబ్రహ్మేంద్రస్వామి ముందుగానే భవిష్యద్దర్శనం చేసి చెప్పిన ఉదంతాలు కాలజ్ఞానంలో కనిపిస్తాయి.

వీరబ్రహ్మేంద్రస్వామి జ్యోస్యాలలో కొన్ని సూటిగా వుంటే, మరికొన్నింటికి మనమే అన్వయం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఇప్పటికే జరిగాయి, ఇంకా కొన్ని ఇకముందు జరగవలసి ఉన్నాయి. భవిష్యత్తులో జరగవలసి ఉన్నవాటిలో ఎక్కువ ప్రచారంలో ఉన్న విషయం ‘కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పుడకను అందుకుంటుంది అనేది.

కృష్ణానది ఇంద్రకీలాద్రి అంత ఎత్తుకు చేరుకునేంతగా ఎగసి పడుతుందా? లేక కనకదుర్గమ్మ ముక్కుపోగు నీటిని చేరుకుంటుందా అనేది మనం ఊహించలేము. ఈ రెండింటిలో ఎదైనా జరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో జగరబోయే జలప్రళయాన్ని వీరబ్రహ్మేంద్రస్వామి మనోనేత్రంతో దర్శించారు.

జల ప్రళయమే అవసరం లేదు. ఏదైనా భూకంపం వంటి ప్రకృతి వైపరిత్యంవల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్ ఆనకట్టలకు బీటలు పడితే ఎగసి వచ్చే అపార జలరాశి చాలు. అలాంటి విపత్తు ఎదురైతే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది. ఇక ముక్కుపుడక కృష్ణానదిని చేరుకోవడం అనే విషయాన్ని ఎవరికి తోచినట్లు వారు ఊహిస్తున్నారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 29 / Sri Lalita Sahasranamavali - Meaning - 29 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 60

244. చరాచర జగన్నాథా - 
కదిలెడి, కదలని ఈ జగత్తుకు అధినాథురాలు.

245. చక్రరాజ నికేతనా - 
చక్రములలో గొప్పదైన దానిని నిలయముగా కలిగినది.

246. పార్వతీ - 
పర్వతరాజ పుత్రి.

247. పద్మనయనా - 
పద్మములవంటి నయనములు కలది.

248. పద్మరాగ సమప్రభా -
 పద్మరాగముల కాంతికి సమానమగు శరీరకాంతి కలది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 29 🌹
📚. Prasad Bharadwaj 

🌻 Sahasra Namavali - 29 🌻

244 ) Charachara Jagannatha -   
She  who is the Lord of all moving and immobile things

245 ) Chakra Raja Nikethana -   
She who lives in the middle of Sree Chakra

246 ) Parvathi -  
 She who is the daughter of the mountain

247 ) Padma nayana -   
She who has eyes like the lotus

248 ) Padma raga samaprabha -   
She who shines as much as the Padma Raga jewel.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. ఓంకారము ~ షోడశ కళలు వివరణ 🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ 
చలాచల బోధ 
📚. ప్రసాద్ భరద్వాజ 

ఓంకారము (ప్రణవమునకు) 4 పాదములు కలవు. 

1. అవిద్యాపాదము, 
2. విద్యాపాదము, 
3. ఆనందపాదము మరియు 
4. తురీయపాదము. 

అకారము, ఉకారము, మకారము, అర్థమాత్రలే వరుసగా ఈ నాలుగు పాదములు.

ఇందొక్కొక్కటి నాలుగు ‘కళ’లు చొప్పున మొత్తము ఓంకారమునకు 16 కళలు.

ప్రణవము = [15 కళలు + 1 అలోక కళ]. 
‘కళ’యనగా 1 లో 16 వభాగము. 16 వ కళ యందు అలోక కళకు ‘పరమ’అనిపేరు.

ఈ 16 కళలను ‘జ్ఞానము యొక్క మార్పులు’అని గ్రహించవలెను.
అనగా జ్ఞానము 16 రకములుగా ఉన్నదన్నమాట.

ఎట్లనగా
1. జాగ్రత్తలో జాగ్రత్త:- 
గురు సన్నిధానమున అడిగి తెలుసుకున్న సమస్తమును మరుపులేక జ్ఞప్తి యందుంచుకొనుట.

2. జాగ్రత్తలో స్వప్నము:- 
శ్రవణము చేసిన విషయములు సగం మరచి సగం మరువకుండా ఉండడము.

3. జాగ్రత్తలో సుషుప్తి:- 
విన్న విషయములు బొత్తిగా జ్ఞప్తి యందు లేకపోవుట.

4. జాగ్రతలో తురీయము:- 
వస్తునిశ్చయజ్ఞానం కలిగి దానినే స్మరించుచుండుట.

5. స్వప్నములో జాగ్రత్త:- 
కలలో తోచిన సమస్తము తిరిగి చెప్పగలుగుట.

6. స్వప్నంలో స్వప్నం:- 
కలగన్న విషయములు కొన్ని మరచి, కొన్ని మరువక యుండుట.

7. స్వప్నంలో సుషుప్తి:- 
కలగన్న సమస్తము మరచి పోవుట.

8. స్వప్నంలో తురీయం:- 
సుఖ స్వప్నములు కని అందువలన తనకు ఏవో సుఖానుభవములు కలుగుననే భ్రాంతిని పొందకుండా తన బ్రహ్మనిష్టయందు చలించకనే యుండుట.

9. సుషుప్తిలో జాగ్రత్త:- 
సుఖముగా నిద్రించి, మేల్కొని ఆ నిద్ర సుఖమును గూర్చి చెప్పుట.

10. సుషుప్తి లో స్వప్నము:- 
నిద్ర సుఖము తెలిసి తెలియకుండుట.

11. సుషుప్తిలో సుషుప్తి:- 
నిద్రసుఖము ఇట్టిదని తెలియక పోవుట.

12. సుషుప్తిలో తురీయం:- 
నిద్ర యందలి సుఖము అజ్ఞానమున అనగా నా కారణ శరీరమగు విషయమే గాని, ప్రత్యగాత్మనైన నాకు విషయం కాదని ఎరుగుట.

13. తురీయంలో జాగ్రత్త:- 
బ్రహ్మ నిష్ట యందుండి కూడ ప్రపంచవృత్తి కలుగుట.

14. తురీయంలో స్వప్నం:- 
ఆత్మానుసంధానము చేయుచున్నప్పుడు ప్రపంచ వృత్తులు తోచీ, తోచకుండుట.

15. తురీయంలో సుషుప్తి:- 
బ్రహ్మానంద నిష్టయందున్నప్పుడు ఆకలి దప్పులు మొదలగునవి ఏమియు కలగకుండుట.

16. తురీయంలో తురీయం:- 
నేనే సచ్చిదానంద స్వరూపుడనని ఎరిగి తాను తానై యుండుట.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. మనోశక్తి - Mind Power - 57 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

🌹. Q 53:-- మిధ్యా భౌతికరూపం అంటే ఏమిటి? - 2 🌹

4) మనం భూమి మీద జన్మ తీసుకోక ముందే మన తల్లిదండ్రులు ను భౌతిక పరిస్థితులు ను వాతావరణాన్ని ప్రదేశాన్ని మనం ఏ అనుభవాలు పొందాలో మనమే అంతర్ ప్రపంచం నుండి సృష్టించుకున్నాము.

5) మనం మన స్నేహితుణ్ణి కలవాలని తీవ్రంగా ఆలోచించాం అనుకోండి. అతని దగ్గర మన మిధ్యరూపం ప్రత్యక్షమవుతుంది. అది బాహ్యేమద్రియాలకు అర్థం కాదు. మన అంతరేంద్రియాలు మనం అక్కడే ఉన్నట్లు పసిగట్టగలవు.

మనం ఏకాంతంగా వున్నప్పుడు ఇలాంటి feelings అర్థమవుతాయి. మన friends తాలూకు మిధ్యా రూపాలు మన దగ్గరకు వచ్చినప్పుడు వారు మన దగ్గరే ఉన్నట్లు నిజంగానే feel అవుతాము.

6) మనం ప్రతిక్షణం వర్షపు తుంపర్లు లాగా భౌతిక రూపాలను సృష్టిస్తూనే ఉంటాము. అవి మన నుండి విడి పోయిన తర్వాత స్వతంత్రంగా పరిణామం చెందుతాయి. అవి మనపైన ఆధారపడవు.

అవి మన ఆలోచనల ద్వారా సృష్టింపబడిన మిద్యాభౌతిక రూపాలే అయినా మన సలహా మన సూచన పైన ఆధారపడవు. ఇలా మనం కూడా మన పూర్ణాత్మ ఆలోచన ద్వారా సృష్టింపబడ్డ ఆత్మ శకలమే.

ఆ విధంగా మనం పూర్ణాత్మ నుండి విడివడిన తర్వాత స్వతంత్రంగా, స్వేచ్ఛ గా పరిణామం చెందుతాము.
అలా మన నుండి వెలువడిన భౌతిక రూపాలు ఇతర డిమెన్షన్స్ లో కొనసాగుతుంటాయి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. సాయి తత్వం - మానవత్వం - 48 / Sai Philosophy is Humanity - 48 🌹
🌴. అధ్యాయము - 7 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. సాయిబాబా విచిత్ర వైఖరులు - 2 🌻

10. ఒక్కొక్కప్పుడు స్నానముచేసేవారు; మరొక్కప్పుడు స్నానము లేకుండానే యుండెడివారు.

11. తొలిదినములలో బాబా తెల్లటి తలపాగా, శుభ్రమైన ధోవతి, చొక్కా ధరించేవారు. మొదటి రోజులలో వారు వైద్యం చేసేవారు.

12. గ్రామములో రోగులను పరీక్షించి ఔషధములిచ్చెడివారు. వారి చేతితో నిచ్చిన మందులు అద్భుతముగ పనిచేయుచుండెడివి.

13. వారు గొప్ప 'హకీం' (వైద్యుడు) యని పేరు వచ్చెను. ఈ సందర్భమున నొక ఆసక్తి కరమైన సంఘటనను చెప్పవలెను.

14. ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి యెఱ్ఱబడెను. శిరిడీలో వైద్యుడు దొరకలేదు. ఇతరభక్తులాతనిని బాబా వద్దకు గొనిపోయిరి.

15. సామాన్యముగ అట్టి రోగులకు అంజనములు, ఆవుపాలు, కర్పూరముతో చేసిన ఔషధములు వైద్యులుపయోగించెదరు.

16. కాని బాబా చేసిన చికిత్స విలక్షమైనది. నల్లజీడిగింజలను నూరి రెండు మాత్రలుగ జేసి, యొక్కొక్క కంటిలో నొక్కొక్క దానిని పెట్టి గుడ్డతో కట్టుకట్టిరి.

17. మరిసటి దినము ఆ కట్లను విప్పి నీళ్ళను ధారగా పోసిరి. కండ్లలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యెను.

18. నల్లజీడి పిక్కలను నూరి కండ్లలో పెట్టిననూ సున్నితమైన కండ్లు మండనేలేదు. అటువంటి చిత్రములనేకములు గలవు కాని, యందు యిదొకటి మాత్రమే చెప్పబడినది.

🌹. Sai Philosophy is Humanity - 48 🌹
Chapter 7
✍️. Sri NV. Gunaji
📚. Prasad Bharadwaj

🌻. Behaviour of Sai Baba - 2 🌻

He used to tie a white turban on his head; and wear a clean Dhotar round his waist, and a shirt on his body. This was his dress in the beginning. 

He started practicing medicine in the village, examined patients and gave medicines. He was always successful, and He became famous as a Hakim (Doctor). 

A curious case may be narrated here. 

One devotee got his eye balls quite red and swollen. No Doctor was available in Shirdi. The other devotees took him to Baba. 

Other Doctors would use ointments, Anjans, cow’s milk and camphorated drugs etc., in such cases. Baba’s remedy was quite unique. 

He pounded some ‘BEEBA’ (Some Carpus Ana Cardium i.e. marking nuts) and made two balls of them, thrust them on in each eye of the patient and wrapped a cloth-bandage round them (eyes). 

Next day, the bandage was removed and water was poured over them in a stream. 

The inflammation subsided and the pupils became white and clear. 

Though the eyes are very delicate, the BEEBA caused no smarting; but removed the disease of the eyes. 

Many such cases were cured and this is only an instance in point.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹