శ్రీ లలితా సహస్ర నామములు - 49 / Sri Lalita Sahasranamavali - Meaning - 49

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 49 / Sri Lalita Sahasranamavali - Meaning - 49 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 49. నిర్వికల్పా, నిరాబాధా, నిర్భేదా, భేదనాశినీ ।
నిర్నాశా, మృత్యుమథనీ, నిష్క్రియా, నిష్పరిగ్రహా ॥ 49 ॥ 🍀

🍀 176. నిర్వికల్పా -
వికల్పములు లేనిది.

🍀 177. నిరాబాధా -
బాధలు, వేధలు లేనిది.

🍀 178. నిర్భేదా -
భేదములు లేనిది.

🍀 179. భేదనాశినీ -
భేదములను పోగొట్టునది.

🍀 180. నిర్నాశా -
నాశము లేనిది.

🍀 181. మృత్యుమథనీ -
మృత్యు భావమును, మృత్యువును పోగొట్టునది.

🍀 182. నిష్క్రియా -
క్రియలు (చేయవలసిన, చేయకూడని) లేనిది.

🍀 183. నిష్పరిగ్రహా -
స్వీకరణ, పరిజనాదులు లేనిది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 49 🌹

📚. Prasad Bharadwaj

🌻 49. nirvikalpā nirābādhā nirbhedā bhedanāśinī |
nirnāśā mṛtyumathanī niṣkriyā niṣparigrahā || 49 || 🌻

🌻 176 ) Nirvikalpa -
She who does not do anything she does not desire

🌻 177 ) Nirabhadha -
She who is not affected by anything

🌻 178 ) Nirbhedha -
She who does not have any difference

🌻 179 ) Bhedha nasini -
She who promotes oneness

🌻 180 ) Nirnasa -
She who does not die

🌻 181 ) Mrityu madhani -
She who removes fear of death

🌻 182 ) Nishkriya -
She who does not have any work.

🌻 183 ) Nishparigraha - She who does not accept help from others

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

18 Mar 2021

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 194

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 194 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - నాల్గవ దివ్య యానము - సద్గురువు -అవతార పురుషుడు. - 8 🌻

ఎరుక తోడను ఎరుక లేకను జరిగెడు మహిమలు

724. అవతార పురుషుని వలన, సద్గురువుల వలన జరిగెడు మహిమలు 2 రకములు.

1. ఐచ్ఛికముగా చేయు మహిమలు

2. తాము చేయవలెనని, తెలిసియుండి చేయు మహిమలు.

725. 1. తమ దివ్యసంకల్పము యొక్క తీవ్రత ననుసరించి భాహ్యముగా చేయు మహిమలు.

2. అనైఛ్చికంగా జరుగు మహిమలు. తమకు తెలియకనే జరుగు చుండెడి మహిమలు తమ పరిసర ములలో ఎప్పుడూను క్రియాత్మక మగు శక్తితో కూడిన వాతావరణం చుట్టి యుండును. మహిమలు జరుగుటకు తాము మూల కారకులు కాబట్టి అనైఛ్చికంగా జరుగు చుండు మహిమలు వారికి తెలియకనే జరుగుచుండును.

3. ప్రపంచము యొక్క ఆధ్యాత్మిక జాగృతి కొరకే సద్గురువుల మూలముగా ఎల్లప్పుడును ఐచ్చికముగను అనైఛ్చికముగను (ఎరుకను ఎరుక లేకను) మహిమలు జరుగుచుండును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

18 Mar 2021

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 252

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 252 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. కాశ్యప మహర్షి - 3 🌻

చివరిభాగము

17. ఎట్లా ఉంటుందంటే, ఉదాహరణకు తన పళ్ళమీద దృష్టి ఉంటే, పళ్ళను గురించే ఆలోచిస్తుంది మనసు. “నా పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, వంకరగా ఉన్నాయి” అని అలోచిస్తుంది. మంచిది అలాగే ఉండనియ్యి. ఆ విధంగా మనస్సును నిగ్రహించిన తరువాత, ఇక యోగికి దాని పీడ తొలగిపోతుంది! ఈ మనస్సనేది అతడిని బాధించకుండా వదిలేసింది కాబట్టి, అప్పుడు యోగంలోకి వెళ్ళ గలుగుతాడు అతదు.

18. అది కోరిన పని తీర్చనంతసేపు, అతడు యోగంలో ఉండడు. ఏమీ చెయ్యలేడు. దానిని నిగ్రహించే విధానం, దానికి సాధ్యం కానిపని అప్పగించటమే! అసాధ్యమైన పని, దుస్సాధ్యమైన పని అప్పజెప్పాలి.

18. మనస్సు నశించిన వెనుక, యోగి బ్రహ్మోన్ముఖుడైపోతాడు. బ్రహ్మవైపు, నిర్గుణమైన బ్రహ్మవస్తువును తాను చేరటం మొదలుపెడతాడు. ఈ మనస్సనేది దానియొక్క చప్పుడు, అల్లరి. అది ఉడిగిపోయిన తరువాత, బ్రహ్మదర్శనం కోసమని వెళతాదు.

19. అనాది అయిన బ్రహ్మము పంచేంద్రియాలకు గ్రాహ్యంకాదు. అది పంచేంద్రియాలకు, వానితోకలిసిన మనోవృత్తికి తెలియదు. కాబట్టి అన్నిటినుంచి మనసు తొలగిపోయి, మనస్సు నశించాక, ఉజ్జ్వలమైన బ్రహ్మవస్తువు అంతటా కూడా కనబడుతుంది.

20. దాంట్లో వెలుగుతున్న తేజస్సులో తాను, తన లోకము, తన బంధువులు, తన ప్రపంచమున చెట్టు, పుట్టలు, ఇంద్రియాలు, తన పూర్వాపరములు, భూత వర్తమాన భవిష్యత్తులు అన్ని కూడా ఆ తేజస్సులో కనబడతాయి. తన లోపల తేజస్సును వెతుక్కుంటాయి, దాంట్లోనూ కనబడతాయి.

21. చివరకు అవి ఏవీ కూడా కనబడవు. కేవలం అదే కనబడుతుంది, అనంతమైన సత్యము. అది కామక్రోధలోభాలకు అతీతంగా ఉంటుంది అది అని చెప్పి, దానిని – ఆ వెలుగును – చూసినవాడే బ్రహ్మవేత్త అని అంటారు, అని చెప్పి కాశ్యపుడికి బ్రహ్మవిద్యా రహస్యం, యోగవిద్యా విధానమంతా ఆ సిద్ధుడు బోధించాడు.

సమాప్తం .... 🙏. శ్రీ శివానంద సద్గురవే నమః

🌹 🌹 🌹 🌹 🌹

18 Mar 2021

శ్రీ శివ మహా పురాణము - 372

🌹 . శ్రీ శివ మహా పురాణము - 372 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 10

🌻. కుజ గ్రహోత్పత్తి - 2 🌻

అపుడా శిశువు పరమేశ్వరుని యెదుట ఏడ్చెను. లోకాచార పరాయణుడగు శివుని యెదుట ఆ శిశువు ఇతర శిశువుల వలె ఏడ్చెను(16). అపుడా భూదేవి శంకరునకు భయపడి మంచి బుద్ధితో ఆలోచించి సుందర స్త్రీ రూపమును ధరించి అచట సాక్షాత్కరించెను(17).

ఆ భూదేవి ఆ శ్రేష్ఠ బాలకుని వెంటనే లేవదేసి ఒడిలో కూర్చుండ బెట్టుకొని, తన ఉపరితముపై లభించు పాలను స్తన్యరూపములో అ బాలునకు ప్రేమతో త్రాగించెను (18). సతీదేవి లేకుండుటచే ఆమె బాలుని తన కుమారునిగా భావించి, అ బాలుని ముఖమును ప్రేమతో ముద్దాడెను. అమె తల్లియగుట పరమేశ్వరునకు అనందమును కలింగించెను (19). కృతార్థుడు, జగత్కర్త, అంతర్యామి, పాపహరుడు అగు శంభుడు భూదేవిని గుర్తు పట్టి, ఆమె యొక్క ఆ ప్రవృత్తిని గాంచి చిరునవ్వుతో నిట్లనెను (20). ఓ భూదేవీ ! నీవు ధన్యురాలవు. మహాతేజశ్శాలియగు నా యొక్క చెమట నీపై పడగా పుట్టిన ఈ నా శ్రేష్ఠుడగు పుత్రుని ప్రేమతో పెంచుము(21).

ఓ భూదేవీ! ఈ ప్రీతికరుడగు బాలుడు నా శ్రమజలమునుండి పుట్టిన వాడే అయినా, నిత్యము మూడు విధముల (ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక) తాపములు లేని ఈబాలుడు నీ పేరుతో ప్రసిద్ధిని గాంచుగలడు(22). ఈ నీ కుమారుడు భూమిని దానము చేయు గుణవంతుడు కాగలడు. నాకు కూడా ఈతడు సుఖమును కలిగంచగలడు. ఈ బాలుని ప్రేమతో స్వీకరించుము (23). విరహ దుఃఖమునుండి కొద్ది ముక్తిని పొందిన మనస్సు గల ఆ రుద్రుడు లోకాచారమును ప్రవర్తిల్ల జేయుచూ ఇట్లు పలికి మిన్నకుండెను. సత్పురుషులకు ప్రీతి పాత్రుడగు శంభుడు వికారములు లేని వాడుగదా! (24). ఆ భూదేవి కూడా వెను వెంటనే శివుని ఆనతిని పొంది కుమారుని దోడ్కొని తన స్థానమునకు వెళ్లి బ్రహ్మానందమును పొందెను (25).

ఆ బాలుడు భౌముడు(కుజుడు) అని పేరు గాంచి శీఘ్రముగా పెరిగి యువకుడయ్యెను. ఆతడు కాశీనగరములో చిరకాలము శంకర ప్రభుని సేవించెను (26). ఆ కుజుడు విశ్వేశ్వరుని అనుగ్రహమచే గ్రహత్వమును పొంది, శుక్రలోకము కంటె శ్రేష్ఠమగు దివ్యలోకమును శీఘ్రమే పొందెను (27). సతీ వియోగముతో నున్న శంభుని చరితమును నీకీ తీరున వర్ణించితిని. ఓ మహర్షీ! శంభుని తపశ్చరణమును గూర్చి చెప్పెదను. శ్రధ్ధతో వినుము(28).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతీ ఖండములో భౌముని పుట్టుక అను పదవ అధ్యాయము ముగిసినది (10).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

18 Mar 2021

గీతోపనిషత్తు -172

🌹. గీతోపనిషత్తు -172 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 15

🍀 15. పరమ శాంతి - నియతమగు మనస్సు కలిగి, ఎల్లపుడును ఆత్మతో కూడి యుండి, నా యందు స్థితిగొని, ప్రవృత్తి కతీతమగు శాంతిని యోగి పొందుచు నుండును. పరి పరి విధముల పోక నిర్దేశించిన విషయము నందు మనస్సు స్థిరముగ నున్నపుడు అట్టి మనస్సును స్థిరమగు మనస్సు లేక చిత్తము అందురు. స్థిరమగు మనస్సు లేక ధ్యానమున కుపక్రమించుట పిల్లతనము. మనోప్రజ్ఞ స్థిరముగ నున్నపుడు ఆ ప్రజ్ఞను నేను అను వెలుగుపై లగ్నము చేయుటకు సాధ్యపడును. అట్లు లగ్నము చేసినపుడే సాలోక్యము సిద్ధించును. నియతమగు మనస్సు నేనను వెలుగుతో ఎల్లప్పుడును జతకట్టి యుండుట ధ్యాన ప్రక్రియ. 🍀

యుంజన్నేవం సదా 2 త్మానం యోగీ నియతమానసః |
శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థా మధిగచ్ఛతి || 15

నియతమగు మనస్సు కలిగి, ఎల్లపుడును ఆత్మతో కూడి యుండి, నా యందు స్థితిగొని, ప్రవృత్తి కతీతమగు శాంతిని యోగి పొందుచునుండును. భగవానుడు యోగి లక్షణము నొకదానిని ఇచ్చట ఆవిష్కరించు చున్నాడు. ఈ లక్షణము యోగసాధకునకు లక్ష్యమై యుండ వలెను. నియత మానసుడనగ నియమింపబడిన మనస్సు గలవాడు.

పరి పరి విధముల పోక నిర్దేశించిన విషయమునందు మనస్సు స్థిరముగ నున్నపుడు అట్టి మనస్సును స్థిరమగు మనస్సు లేక చిత్తము అందురు. అట్టి స్థిరమగు చిత్తము పొందుటకు ఎన్నియో నియమములు పూర్వమున దైవము పేర్కొని యున్నాడు. భక్తి, శ్రద్ధ, దీక్ష గలవారు ఆ నియమములను పాటింతురు.

స్థిరమగు మనస్సు లేక ధ్యానమున కుపక్రమించుట పిల్లతనము. మనోప్రజ్ఞ స్థిరముగ నున్నపుడు ఆ ప్రజ్ఞను నేను అను వెలుగుపై లగ్నము చేయుటకు సాధ్యపడును. అట్లు లగ్నము చేసినపుడే సాలోక్యము సిద్ధించును.

సాలోక్యమనగ సారించి చూచుట. చూచు విషయములు తప్ప, ఇతర విషయములు భాసింపవు. అపుడు తాను, చూడబడు చున్నవి మాత్రమే యుండును. దానిని చూచుటయే యుండును. ఇతరములు గోచరములు కావు. అట్లు నిరంతరముగ చూచుట వలన చూడబడు విషయము వైపునకు చూచువాడాకర్షింపబడును. ఇట్లాకర్షింపబడుట వలన చూచు విషయమునకు సామీప్యమున చేరును. క్రమముగ సాయుజ్యము లభించును.

అనగ చూడబడు విషయముతో జత కట్టును. అట్లు నేనను ఆత్మ వెలుగుతో మనోప్రజ్ఞ జతకట్టుట ఈ శ్లోకమున తెలుపబడు చున్నది. “యుంజన్నేవం సదా ఆత్మానం" అని శ్లోకము ఆరంభమగుచున్నది.

నియతమగు మనస్సు నేనను వెలుగుతో ఎల్లప్పుడును జతకట్టి యుండుట ధ్యాన ప్రక్రియ. అట్లు జతకట్టి యుండుట వలన ప్రవృత్తి భావము లుండవు. అనగ ప్రాపంచిక విషయము లేవియు స్ఫురించవు.

తాను, తన వెలుగు మాత్రమే యుండును. అది సాధకునకు చక్కని శాంతినిచ్చును. ఇతర భావము లన్నియు నిర్వాణము చెందుట వలన పరమశాంతి పొందును. దీని రుచి తెలిసినవాడు నేనను వెలుగున స్థిరపడుటకు ఉత్సహించును. ఇతరము లేవియు అంతకన్న విలువైన విషయము లనిపించవు. ప్రవృత్తి నధిగమించి, నివృత్తి యందు స్థిరపడి దేశకాలములను బట్టి నిమిత్తమాత్రుడై కార్యములను నిర్వర్తించును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

18 Mar 2021

18-MARCH-2021 MESSAGES

10) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 172🌹  
11) 🌹. శివ మహా పురాణము - 372🌹 
12) 🌹 Light On The Path - 121🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 254🌹 చివరి భాగం 
14) 🌹 Seeds Of Consciousness - 319🌹   
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 194🌹
16) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 49 / Lalitha Sahasra Namavali - 49🌹 
17) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 49 / Sri Vishnu Sahasranama - 49🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -172 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 15

*🍀 15. పరమ శాంతి - నియతమగు మనస్సు కలిగి, ఎల్లపుడును ఆత్మతో కూడి యుండి, నా యందు స్థితిగొని, ప్రవృత్తి కతీతమగు శాంతిని యోగి పొందుచు నుండును. పరి పరి విధముల పోక నిర్దేశించిన విషయము నందు మనస్సు స్థిరముగ నున్నపుడు అట్టి మనస్సును స్థిరమగు మనస్సు లేక చిత్తము అందురు. స్థిరమగు మనస్సు లేక ధ్యానమున కుపక్రమించుట పిల్లతనము. మనోప్రజ్ఞ స్థిరముగ నున్నపుడు ఆ ప్రజ్ఞను నేను అను వెలుగుపై లగ్నము చేయుటకు సాధ్యపడును. అట్లు లగ్నము చేసినపుడే సాలోక్యము సిద్ధించును. నియతమగు మనస్సు నేనను వెలుగుతో ఎల్లప్పుడును జతకట్టి యుండుట ధ్యాన ప్రక్రియ. 🍀*

యుంజన్నేవం సదా 2 త్మానం యోగీ నియతమానసః |
శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థా మధిగచ్ఛతి || 15

నియతమగు మనస్సు కలిగి, ఎల్లపుడును ఆత్మతో కూడి యుండి, నా యందు స్థితిగొని, ప్రవృత్తి కతీతమగు శాంతిని యోగి పొందుచునుండును. భగవానుడు యోగి లక్షణము నొకదానిని ఇచ్చట ఆవిష్కరించు చున్నాడు. ఈ లక్షణము యోగసాధకునకు లక్ష్యమై యుండ వలెను. నియత మానసుడనగ నియమింపబడిన మనస్సు గలవాడు. 

పరి పరి విధముల పోక నిర్దేశించిన విషయమునందు మనస్సు స్థిరముగ నున్నపుడు అట్టి మనస్సును స్థిరమగు మనస్సు లేక చిత్తము అందురు. అట్టి స్థిరమగు చిత్తము పొందుటకు ఎన్నియో నియమములు పూర్వమున దైవము పేర్కొని యున్నాడు. భక్తి, శ్రద్ధ, దీక్ష గలవారు ఆ నియమములను పాటింతురు. 

స్థిరమగు మనస్సు లేక ధ్యానమున కుపక్రమించుట పిల్లతనము. మనోప్రజ్ఞ స్థిరముగ నున్నపుడు ఆ ప్రజ్ఞను నేను అను వెలుగుపై లగ్నము చేయుటకు సాధ్యపడును. అట్లు లగ్నము చేసినపుడే సాలోక్యము సిద్ధించును. 

సాలోక్యమనగ సారించి చూచుట. చూచు విషయములు తప్ప, ఇతర విషయములు భాసింపవు. అపుడు తాను, చూడబడు చున్నవి మాత్రమే యుండును. దానిని చూచుటయే యుండును. ఇతరములు గోచరములు కావు. అట్లు నిరంతరముగ చూచుట వలన చూడబడు విషయము వైపునకు చూచువాడాకర్షింపబడును. ఇట్లాకర్షింపబడుట వలన చూచు విషయమునకు సామీప్యమున చేరును. క్రమముగ సాయుజ్యము లభించును. 

అనగ చూడబడు విషయముతో జత కట్టును. అట్లు నేనను ఆత్మ వెలుగుతో మనోప్రజ్ఞ జతకట్టుట ఈ శ్లోకమున తెలుపబడు చున్నది. “యుంజన్నేవం సదా ఆత్మానం" అని శ్లోకము ఆరంభమగుచున్నది. 

నియతమగు మనస్సు నేనను వెలుగుతో ఎల్లప్పుడును జతకట్టి యుండుట ధ్యాన ప్రక్రియ. అట్లు జతకట్టి యుండుట వలన ప్రవృత్తి భావము లుండవు. అనగ ప్రాపంచిక విషయము లేవియు స్ఫురించవు. 

తాను, తన వెలుగు మాత్రమే యుండును. అది సాధకునకు చక్కని శాంతినిచ్చును. ఇతర భావము లన్నియు నిర్వాణము చెందుట వలన పరమశాంతి పొందును. దీని రుచి తెలిసినవాడు నేనను వెలుగున స్థిరపడుటకు ఉత్సహించును. ఇతరము లేవియు అంతకన్న విలువైన విషయము లనిపించవు. ప్రవృత్తి నధిగమించి, నివృత్తి యందు స్థిరపడి దేశకాలములను బట్టి నిమిత్తమాత్రుడై కార్యములను నిర్వర్తించును. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, WA, FB Groups 🌹
https://t.me/BhagavadGita_Telugu_English
www.facebook.com/groups/bhagavadgeetha/
https://chat.whatsapp.com/BzCAiTrm6X9K1NsjyGWzlg

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 372🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 10

*🌻. కుజ గ్రహోత్పత్తి - 2 🌻*

అపుడా శిశువు పరమేశ్వరుని యెదుట ఏడ్చెను. లోకాచార పరాయణుడగు శివుని యెదుట ఆ శిశువు ఇతర శిశువుల వలె ఏడ్చెను(16). అపుడా భూదేవి శంకరునకు భయపడి మంచి బుద్ధితో ఆలోచించి సుందర స్త్రీ రూపమును ధరించి అచట సాక్షాత్కరించెను(17).

ఆ భూదేవి ఆ శ్రేష్ఠ బాలకుని వెంటనే లేవదేసి ఒడిలో కూర్చుండ బెట్టుకొని, తన ఉపరితముపై లభించు పాలను స్తన్యరూపములో అ బాలునకు ప్రేమతో త్రాగించెను (18). సతీదేవి లేకుండుటచే ఆమె బాలుని తన కుమారునిగా భావించి, అ బాలుని ముఖమును ప్రేమతో ముద్దాడెను. అమె తల్లియగుట పరమేశ్వరునకు అనందమును కలింగించెను (19). కృతార్థుడు, జగత్కర్త, అంతర్యామి, పాపహరుడు అగు శంభుడు భూదేవిని గుర్తు పట్టి, ఆమె యొక్క ఆ ప్రవృత్తిని గాంచి చిరునవ్వుతో నిట్లనెను (20). ఓ భూదేవీ ! నీవు ధన్యురాలవు. మహాతేజశ్శాలియగు నా యొక్క చెమట నీపై పడగా పుట్టిన ఈ నా శ్రేష్ఠుడగు పుత్రుని ప్రేమతో పెంచుము(21).

ఓ భూదేవీ! ఈ ప్రీతికరుడగు బాలుడు నా శ్రమజలమునుండి పుట్టిన వాడే అయినా, నిత్యము మూడు విధముల (ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక) తాపములు లేని ఈబాలుడు నీ పేరుతో ప్రసిద్ధిని గాంచుగలడు(22). ఈ నీ కుమారుడు భూమిని దానము చేయు గుణవంతుడు కాగలడు. నాకు కూడా ఈతడు సుఖమును కలిగంచగలడు. ఈ బాలుని ప్రేమతో స్వీకరించుము (23). విరహ దుఃఖమునుండి కొద్ది ముక్తిని పొందిన మనస్సు గల ఆ రుద్రుడు లోకాచారమును ప్రవర్తిల్ల జేయుచూ ఇట్లు పలికి మిన్నకుండెను. సత్పురుషులకు ప్రీతి పాత్రుడగు శంభుడు వికారములు లేని వాడుగదా! (24). ఆ భూదేవి కూడా వెను వెంటనే శివుని ఆనతిని పొంది కుమారుని దోడ్కొని తన స్థానమునకు వెళ్లి బ్రహ్మానందమును పొందెను (25).

  ఆ బాలుడు భౌముడు(కుజుడు) అని పేరు గాంచి శీఘ్రముగా పెరిగి యువకుడయ్యెను. ఆతడు కాశీనగరములో చిరకాలము శంకర ప్రభుని సేవించెను (26). ఆ కుజుడు విశ్వేశ్వరుని అనుగ్రహమచే గ్రహత్వమును పొంది, శుక్రలోకము కంటె శ్రేష్ఠమగు దివ్యలోకమును శీఘ్రమే పొందెను (27). సతీ వియోగముతో నున్న శంభుని చరితమును నీకీ తీరున వర్ణించితిని. ఓ మహర్షీ! శంభుని తపశ్చరణమును గూర్చి చెప్పెదను. శ్రధ్ధతో వినుము(28).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతీ ఖండములో భౌముని పుట్టుక అను పదవ అధ్యాయము ముగిసినది (10).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 LIGHT ON THE PATH - 121 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 8 - THE 20th RULE
*🌻 20. Seek it not by any one road. - 14 🌻*

459. When people once reach some of these higher levels the rate of their progress is very greatly increased. 

I remember once being asked in India whether a man’s progress on the Path might be measured by arithmetical progression. I replied: “I think when once progress is definitely started it is very much more like geometrical progression.” 

That was rather doubted. The Indians seemed to feel that that was an extreme statement, so I asked the Master Kuthumi whether geometrical progression would be a fair statement of the progress of one who had entered upon the Path. 

“No,” He said, “that would not be a fair statement. When once a person enters upon the Path, if he converges all his energies upon it, his progress will be neither by arithmetical nor geometrical progression, but by powers.” So it would not be in the ratio 2, 4, 8, 16, etc., but as 2, 4, 16, 256, etc. 

That throws a very different light on the matter, and we begin to see that what is before us is not so impossible and not so wearisome as it sometimes seems. We have taken all these thousands of years to reach our present stage, and it does not seem a great achievement when we consider the time spent upon it. 

If our future evolution were to be equally slow the mind would fall back appalled before the contemplation of the aeons needed for us to reach the goal. It is encouraging to think that when we definitely begin to tread the Path we make progress with very great rapidity indeed.

460. I suppose that the average good person is devoting a hundredth part of his mind to making himself a little better. Many people are not doing even that. We who are studying and trying to live by the principles of occultism have gone further, and are beginning to devote a reasonable part of our time to it. 

When once the stage is reached where all our force and thought is concentrated upon this great task we shall go ahead by leaps and bounds; however backward we are now, when we can devote all our powers to the work to be done we shall be able to do it much more perfectly than now seems at all possible.

461. Seek it by plunging into the mysterious and glorious depths of your own inmost being. Seek it by testing all experience, by utilizing the senses in order to understand the growth and meaning of individuality, and the beauty and obscurity of those other divine fragments which are struggling side by side with you, and form the race to which you belong. 

Seek it by study of the laws of being, the laws of nature, the laws of the supernatural; and seek it by making the profound obeisance of the soul to the dim star that burns within. Steadily, as you watch and worship, its light will grow stronger. Then you may know you have found the beginning of the way. And when you have found the end its light will suddenly become the infinite light.

462. A.B. – In this comment we again consider the triple method of seeking the way.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 252 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. కాశ్యప మహర్షి - 3 🌻*
చివరిభాగము

17. ఎట్లా ఉంటుందంటే, ఉదాహరణకు తన పళ్ళమీద దృష్టి ఉంటే, పళ్ళను గురించే ఆలోచిస్తుంది మనసు. “నా పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, వంకరగా ఉన్నాయి” అని అలోచిస్తుంది. మంచిది అలాగే ఉండనియ్యి. ఆ విధంగా మనస్సును నిగ్రహించిన తరువాత, ఇక యోగికి దాని పీడ తొలగిపోతుంది! ఈ మనస్సనేది అతడిని బాధించకుండా వదిలేసింది కాబట్టి, అప్పుడు యోగంలోకి వెళ్ళ గలుగుతాడు అతదు. 

18. అది కోరిన పని తీర్చనంతసేపు, అతడు యోగంలో ఉండడు. ఏమీ చెయ్యలేడు. దానిని నిగ్రహించే విధానం, దానికి సాధ్యం కానిపని అప్పగించటమే! అసాధ్యమైన పని, దుస్సాధ్యమైన పని అప్పజెప్పాలి.

18. మనస్సు నశించిన వెనుక, యోగి బ్రహ్మోన్ముఖుడైపోతాడు. బ్రహ్మవైపు, నిర్గుణమైన బ్రహ్మవస్తువును తాను చేరటం మొదలుపెడతాడు. ఈ మనస్సనేది దానియొక్క చప్పుడు, అల్లరి. అది ఉడిగిపోయిన తరువాత, బ్రహ్మదర్శనం కోసమని వెళతాదు. 

19. అనాది అయిన బ్రహ్మము పంచేంద్రియాలకు గ్రాహ్యంకాదు. అది పంచేంద్రియాలకు, వానితోకలిసిన మనోవృత్తికి తెలియదు. కాబట్టి అన్నిటినుంచి మనసు తొలగిపోయి, మనస్సు నశించాక, ఉజ్జ్వలమైన బ్రహ్మవస్తువు అంతటా కూడా కనబడుతుంది. 

20. దాంట్లో వెలుగుతున్న తేజస్సులో తాను, తన లోకము, తన బంధువులు, తన ప్రపంచమున చెట్టు, పుట్టలు, ఇంద్రియాలు, తన పూర్వాపరములు, భూత వర్తమాన భవిష్యత్తులు అన్ని కూడా ఆ తేజస్సులో కనబడతాయి. తన లోపల తేజస్సును వెతుక్కుంటాయి, దాంట్లోనూ కనబడతాయి. 

21. చివరకు అవి ఏవీ కూడా కనబడవు. కేవలం అదే కనబడుతుంది, అనంతమైన సత్యము. అది కామక్రోధలోభాలకు అతీతంగా ఉంటుంది అది అని చెప్పి, దానిని – ఆ వెలుగును – చూసినవాడే బ్రహ్మవేత్త అని అంటారు, అని చెప్పి కాశ్యపుడికి బ్రహ్మవిద్యా రహస్యం, యోగవిద్యా విధానమంతా ఆ సిద్ధుడు బోధించాడు.

సమాప్తం .... 🙏. శ్రీ శివానంద సద్గురవే నమః
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM
www.facebook.com/groups/maharshiwisdom/
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Seeds Of Consciousness - 319 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 168. When you are established in the 'I am' there are no thoughts or words, you are everything and everything is you; later even that goes. 🌻*

As your 'Sadhana' (practice) matures, your conviction grows stronger and you get firmly established in the 'I am'. That is to say, you are permanently established in the 'Turiya' or the fourth state. 

In this state there are no thoughts or words, everywhere there is only the 'I am', you are everything and everything is you. When you abide thus, the stage is set for your transcending the 'I am'. Ultimately that too goes, leaving you as the Absolute or 'Parabrahman'.
 
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #SeedsofConsciousness #Nisargadatta
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 194 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - నాల్గవ దివ్య యానము - సద్గురువు -అవతార పురుషుడు. - 8 🌻*

*ఎరుక తోడను ఎరుక లేకను జరిగెడు మహిమలు*

724. అవతార పురుషుని వలన, సద్గురువుల వలన జరిగెడు మహిమలు 2 రకములు.
1. ఐచ్ఛికముగా చేయు మహిమలు
2. తాము చేయవలెనని, తెలిసియుండి చేయు మహిమలు.

725. 1. తమ దివ్యసంకల్పము యొక్క తీవ్రత ననుసరించి భాహ్యముగా చేయు మహిమలు.
2. అనైఛ్చికంగా జరుగు మహిమలు. తమకు తెలియకనే జరుగు చుండెడి మహిమలు తమ పరిసర ములలో ఎప్పుడూను క్రియాత్మక మగు శక్తితో కూడిన వాతావరణం చుట్టి యుండును. మహిమలు జరుగుటకు తాము మూల కారకులు కాబట్టి అనైఛ్చికంగా జరుగు చుండు మహిమలు వారికి తెలియకనే జరుగుచుండును.

3. ప్రపంచము యొక్క ఆధ్యాత్మిక జాగృతి కొరకే సద్గురువుల మూలముగా ఎల్లప్పుడును ఐచ్చికముగను అనైఛ్చికముగను (ఎరుకను ఎరుక లేకను) మహిమలు జరుగుచుండును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
Join and share
Meher Baba అవతార్‌ మెహర్‌ బాబా
www.facebook.com/groups/avataarmeherbaba/
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 49 / Sri Lalita Sahasranamavali - Meaning - 49 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 49. నిర్వికల్పా, నిరాబాధా, నిర్భేదా, భేదనాశినీ ।*
*నిర్నాశా, మృత్యుమథనీ, నిష్క్రియా, నిష్పరిగ్రహా ॥ 49 ॥ 🍀*

🍀 176. నిర్వికల్పా - 
వికల్పములు లేనిది.

🍀 177. నిరాబాధా - 
బాధలు, వేధలు లేనిది.

🍀 178. నిర్భేదా - 
భేదములు లేనిది.

🍀 179. భేదనాశినీ - 
భేదములను పోగొట్టునది.

🍀 180. నిర్నాశా - 
నాశము లేనిది.

🍀 181. మృత్యుమథనీ - 
మృత్యు భావమును, మృత్యువును పోగొట్టునది.

 🍀 182. నిష్క్రియా - 
క్రియలు (చేయవలసిన, చేయకూడని) లేనిది.

🍀 183. నిష్పరిగ్రహా - 
స్వీకరణ, పరిజనాదులు లేనిది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 49 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 49. nirvikalpā nirābādhā nirbhedā bhedanāśinī |*
*nirnāśā mṛtyumathanī niṣkriyā niṣparigrahā || 49 || 🌻*

🌻 176 ) Nirvikalpa -   
She who does not do anything she does not desire

🌻 177 ) Nirabhadha -   
She who is not affected by anything

🌻 178 ) Nirbhedha -  
 She who does not have any difference

🌻 179 ) Bhedha nasini -   
She who promotes oneness

🌻 180 ) Nirnasa -   
She who does not die

🌻 181 ) Mrityu madhani -   
She who removes fear of death

🌻 182 ) Nishkriya -   
She who does not have any work. 

🌻 183 ) Nishparigraha - She who does not accept help from others

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranamaJoin and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/SriMataChaitanyam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 49 / Sri Vishnu Sahasra Namavali - 49 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*కన్యా రాశి- హస్త నక్షత్రం 1వ పాద శ్లోకం*

49వ శ్లోకము : 
*🍀 49. సువ్రతస్సుముఖసూక్ష్మః సుఘోషస్సుఖదస్సుహృత్|*
*మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః|| 🍀*

🍀 455) సువ్రత: - 
చక్కని వ్రతదీక్ష కలవాడు.

🍀 456) సుముఖ: - 
ప్రసన్న వదనుడు.

🍀 457) సూక్ష్మ: - 
సర్వవ్యాపి.

🍀 458) సుఘోష: - 
చక్కటి ధ్వని గలవాడు.

🍀 459) సుఖద: - 
సుఖమును అనుగ్రహించువాడు.

🍀 460) సుహృత్ - 
ఏ విధమైన ప్రతిఫలము నాశించకనే సుహృద్భావముతో ఉపకారము చేయువాడు.

🍀 461) మనోహర: - 
మనస్సులను హరించువాడు.

🍀 462) జితక్రోధ: - 
క్రోధమును జయించినవాడు.

🍀 463) వీరబాహు: - 
పరాక్రమము గల బాహువులు కలవాడు.

🍀 464) విదారణ: - 
దుష్టులను చీల్చి చెండాడువాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 49 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*Sloka for Kanya Rasi, Hasta 1st Padam*

*🌻 49. suvrataḥ sumukhaḥ sūkṣmaḥ sughōṣaḥ sukhadaḥ suhṛt |*
*manōharō jitakrōdhō vīrabāhurvidāraṇaḥ || 49 || 🌻*

🌻 455. Suvrataḥ: 
One who has take the magnanimous vow to save all refuge-seekers.

🌻 456. Sumukhaḥ: 
One with a pleasant face.

🌻 457. Sūkṣmaḥ: 
One who is subtle because He is without any gross causes like sound etc.

🌻 458. Sughōṣaḥ: 
One whose auspicious sound is the Veda. Or one who has got a deep and sonorous sound like the clouds.

🌻 459. Sukhadaḥ: 
One who gives happiness to good people.

🌻 460. Suhṛt: 
One who helps without looking for any return.

🌻 461. Manōharaḥ: 
One who attracts the mind by His incomparable blissful nature.

🌻 462. Jitakrōdhaḥ: 
One who has overcome anger.

🌻 463. Vīrabāhuḥ: 
One whose arms are capable of heroic deeds as demonstrated in his destruction of Asuras for establishing Vedic Dharma.

🌻 464. Vidāraṇaḥ: 
One who destroys those who live contrary to Dharma.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasra
www.facebook.com/groups/vishnusahasranam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹