🌹 26, OCTOBER 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹
శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 495 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 495 - 3
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 495 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 495 - 3 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 102. మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా ।
వజ్రాధికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా ॥ 102 ॥ 🍀
🌻 495. 'మణిపూరాబ్జ నిలయా' - 3 🌻
బాహ్యము నందు ఇష్ట పూరణము కొఱకై తాపత్రయపడు జీవులు చిల్లుకుండను నింపుతున్నట్లు జన్మల తరబడి విఫల యత్నము చేయుదురు. కొన్ని వేల జన్మలిట్లు గడువగ బాహ్యమున పూర్ణ ఆనందము పొందుట మిథ్య యని శ్రీమాత అనుగ్రహముగ తెలిసి అంతర్ మనస్సు ఆధారముగ అంతరంగమగు అనాహతమును చేరు ప్రయత్నము చేయుదురు. అంతరంగమున ఆనందము క్రమముగ పూరింపబడును. ఇట్లు ఆనంద పూరణమునకు ఉపాయముగల పద్మముగ మణిపూర పద్మమును తెలియవలెను. బహిరంగ జీవనము క్షరము. అది నశించునది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 495 - 3 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻102. Manipurabja nilaya vadanatraya sanyuta
vajradikayudhopeta dayaryadibhiravruta ॥ 102 ॥ 🌻
🌻 495. Manipurabja - 3 🌻
Being tempted to seek the fulfillment of desire from outside, the living beings try unsuccessfully for births together like filling a bucket with a hole. After a few thousand births, they realize that external happiness is illusory, that is, through the blessings of Sri Mata, they try to reach the internal base of the inner self Anahata. Inner joy is gradually filled. Thus one should know Manipura Padma as instrumental for filling up with joy. Life in the outer world has an end. It is perishable.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Osho Daily Meditations - 60. FREEDOM / ఓషో రోజువారీ ధ్యానాలు - 60. స్వేచ్ఛ
✍️. ప్రసాద్ భరద్వాజ
🍀 60. స్వేచ్ఛ 🍀
🕉. జీవితం అభద్రత - అంటే జీవితం స్వెచ్చామయం. భద్రత ఉంటే, అప్పుడు బంధం ఉంటుంది; ప్రతిదీ ఖచ్చితంగా ఉంటే, అప్పుడు స్వేచ్ఛ ఉండదు. 🕉
రేపు అనేది స్థిరంగా ఉంటే, అప్పుడు భద్రత ఉంటుంది, కానీ మీకు స్వేచ్ఛ లేదు. అప్పుడు మీరు రోబోట్ లాగా ఉంటారు. ముందుగా నిర్ణయించిన కొన్ని విషయాలను మీరు నెరవేర్చాలి. కానీ రేపు అందమైనది, ఎందుకంటే రేపు సంపూర్ణ స్వేచ్ఛ. ఏం జరగబోతోందో ఎవరికీ తెలియదు. మీరు ఊపిరి పీల్చుకుంటారా, మీరు సజీవంగా ఉంటారా, ఎవరికీ తెలియదు. అందం ఉంది, ఎందుకంటే ప్రతిదీ గందరగోళంలో ఉంది, ప్రతిదీ ఒక సవాలు, మరియు ప్రతిదీ ఒక అవకాశంగా ఉంది. ఓదార్పులు అడగవద్దు. మీరు అడగడం కొనసాగితే, మీరు అభద్రతాభావంతో ఉంటారు.
అభద్రతను అంగీకరించండి అప్పుడు అభద్రత అదృశ్యమవుతుంది. ఇది వైరుధ్యం కాదు, ఇది సాధారణ సత్యం-విరుద్ధం, కానీ పూర్తిగా నిజం. ఇప్పటి వరకు మీరు ఉన్నారు, కాబట్టి రేపటి గురించి ఎందుకు చింత? నువ్వు ఈరోజు ఉండగలిగితే, నిన్న ఉండగలిగితే, రేపు కూడా తనని తాను చూసుకుంటుంది. రేపటి గురించి ఆలోచించకండి మరియు స్వేచ్ఛగా తిరగండి. ప్రశాంతంగా ఉన్న గందరగోళం -- ఒక వ్యక్తి అలా ఉండాలి. మీరు మీలో ఒక విప్లవాన్ని మోస్తున్నప్పుడు, ప్రతి క్షణం కొత్త ప్రపంచాన్ని, కొత్త జీవితాన్ని తెస్తుంది... ప్రతి క్షణం కొత్త జన్మ అవుతుంది.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations - 60 🌹
📚. Prasad Bharadwaj
🍀 60. FREEDOM 🍀
🕉. Life is insecure-that means life is free. if there is security, then there will be bondage; if everything is certain, then there will be no freedom. 🕉
If tomorrow is fixed, then there can be security, but you have no freedom. Then you are just like a robot. You have to fulfill certain things that are already predestined. But tomorrow is beautiful, because tomorrow is total freedom. Nobody knows what is going to happen. Whether you will be breathing, whether you will be alive at all, nobody knows. Hence there is beauty, because everything is in a chaos, everything is a challenge, and everything exists as a possibility. Don't ask for consolations. If you go on asking, you will remain insecure.
Accept insecurity, and insecurity will disappear. This is not a paradox, it is a simple truth-paradoxical, but absolutely true. Up to now you have existed, so why be worried about tomorrow? If you could exist today, if you could exist yesterday, tomorrow will take care of itself too. Don't think of the morrow, and move freely. A chaos at ease -- that's how a person should be. When you carry a revolution within you, every moment brings a new world, a new life ... every moment becomes a new birth.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
శ్రీ శివ మహా పురాణము - 803 / Sri Siva Maha Purana - 803
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 23 🌴
🌻. పాతివ్రత్య భంగము - 1 🌻
వ్యాసుడిట్లు పలికెను -
ఓ సనత్కుమారా! సర్వజ్ఞా! నీవు వక్తలలో శ్రేష్టుడవు. అచట విష్ణువు ఏమి చేసెను? ఆమె ధర్మమునెట్లు విడిచిపెట్టెను? చెప్పుము (1).
సనత్కుమారుడిట్లు పలికెను - విష్ణువు జలంధరాసురుని పురములో ప్రవేశించి బృందయొక్క పాతివ్రత్యమును చెడగొట్టుటకు నిశ్చయించెను (2). మాయావులలో శ్రేష్ఠుడుగు ఆ విష్ణువు అద్భుతమగు రూపమును దాల్చి ఆ నగరము యొక్క ఉద్యానవనములో స్వయముగా మకాముచేసి బృంద ఒక స్వప్నమును గనునట్లు చేసెను (3). అపుడు జలంధరుని భార్య, గొప్ప వ్రతము గలది అగు ఆ బృందాదేవి విష్ణువుయొక్క మాయాప్రభావముచే రాత్రియందు చెడుకలను గనెను (4). ఆమె విష్ణుమాయచే స్వప్న మధ్యములో దున్నను ఆరోహించిన వాడు, నూనె రాసుకొని దిగంబరముగా నున్న వాడు, నల్లని పుష్పములను అలంకారముగా ధరించి యున్నవాడు, రాక్షసగణములచే సేవింపబడు చున్నవాడు, తల గొరిగించుకొని దక్షిణ దిక్కునకు వెళ్లుచున్నవాడు, ఆ సమయములో చీకటిచే ఆవరింపబడినవాడు అగు తన భర్తను గాంచెను (5, 6).
ఆ నగరము తనతో సహా సముద్రములో మునిగి పోయినట్లు వెంటనే ఆ కలలో ఆమెకు కన్పట్టెను. ఆమె తెల్లవారు సమయములో ఇట్టి అనేక దుస్స్వప్నములను గాంచెను (7). ఆ అమాయకురాలు అపుడు నిద్రలేచి ఆ కలను గురించి తలపోయుచుండగనే ఉదయించుచున్న సూర్యుని గాంచెను. ఆ సూర్యమండలములో మధ్యలో ఛిద్రము కానవచ్చెను. మరియు సూర్యుడు అనేకపర్యాయములు వెలవెల బోవుచుండెను. (8).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 803 🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 23 🌴
🌻 Outraging the modesty of Vṛndā - 1 🌻
Vyāsa said:—
1. O omniscient Sanatkumāra, please narrate, O eloquent one, what did Viṣṇu do there? How did she err from her virtue?
Sanatkumāra said:—
2. After going to the city of Jalandhara, Viṣṇu thought of violating the chastity of Vṛndā.
3. The foremost among those who wield illusion, he assumed a wonderful body and stationed himself in a park of the city. He made Vṛndā see a dream.
4. The gentle lady Vṛndā, the wife of Jalandhara, though of pure rites, had a very bad dream at night on account of Viṣṇu’s power of illusion.
5. In the dream as a result of Viṣṇu’s power of illusion she saw the naked form of her husband anointed with oil and seated on a buffalo.
6. He was proceeding in the southern direction. His head had been completely shaved. He was wearing black flowers to decorate himself. He was being served by a number of Asuras. He was completely encompassed by darkness.
7. Later, towards the end of the night she had various bad dreams, such as the whole city was submerged in the sea, all of a sudden, along with herself.
8. Then the lady woke up still thinking of the dream she had had. She saw the rising sun with a hole in the middle and fading repeatedly.
Continues....
🌹🌹🌹🌹🌹
శ్రీమద్భగవద్గీత - 447: 11వ అధ్., శ్లో 33 / Bhagavad-Gita - 447: Chap. 11, Ver. 33
🌹. శ్రీమద్భగవద్గీత - 447 / Bhagavad-Gita - 447 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 33 🌴
33. తస్మాత్త్వముత్తిష్ట యశో లభస్య జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధమ్ |
మయైవైతే నిహతా: పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ ||
🌷. తాత్పర్యం : అందుచే లెమ్ము. యుద్ధసన్నద్ధుడవై కీర్తిని గడింపుము. శత్రువులను జయించి సమృద్ధమైన రాజ్యము ననుభవింపుము. ఓ సవ్యసాచీ! నా ఏర్పాటుచే వారందరును ఇదివరకే మరణించియున్నందున ఈ యుద్ధమున నీవు కేవలము నిమిత్త మాత్రుడవగుము.
🌷. భాష్యము : “సవ్యసాచి” యను పదము యుద్ధరంగమున అతినిపుణతతో బాణప్రయోగము చేయగలవానిని సూచించును. ఆ విధముగా అర్జుండు శత్రుసంహారము కొరకు బాణప్రయోగమును చేయగల సమర్థుడైన యోధుడని సంభోధింపబడినాడు. ఈ శ్లోకమున “నిమిత్తమాత్రమ్” అను పదము మిక్కిలి ప్రధానమైనది. జగత్తంతయు శ్రీకృష్ణభగవానుని సంకల్పము, ప్రణాళికచే నడుచుచుండ తగినంత జ్ఞ్ఞానములేని మూఢులు ప్రకృతి ఎట్టి ప్రణాళిక లేకనే నడుచుచున్నదనియు మరియు సృష్టులన్నియును యాదృచ్చికముగా సంభవించినవనియు భావింతురు. “బహుశ: ఇది ఇట్లుండవచ్చును” లేదా “బహుశ: దానిని పోలవచ్చును” అని పలుకు నామమాత్ర శాస్త్రజ్ఞులు పలువురు కలరు. కాని ఈ విషయమున “బహుశ:” లేదా “ఇది కావచ్చును” అను ప్రశ్నకు తావే లేదు.
అనగా ఈ భౌతికజగత్తు సృష్టి వెనుక ప్రత్యేకమైన ప్రణాళిక ఒకటి కలదు. ఆ ప్రణాళిక యేమిటి? ఈ భౌతికసృష్టి బద్ధజీవులు భగవద్ధామమును తిరిగి చేరుటకు ఒక ఆవకాశమై యున్నది. భౌతిక ప్రకృతిపై అధిపత్యము చెలాయించు భావమున్నంతవరకు జీవులు బద్ధులై యుందురు. కాని ఎవరైనను శ్రీకృష్ణభగవానుని సంకల్పము నెరిగి కృష్ణభక్తి అలవరచుకొనినచో అత్యంత బుద్ధికుశలురు కాగలరు. విశ్వము యొక్క సృష్టి, లయములు ఆ భగవానుని పరమనిర్దేశమునందు జరుగుచుండును గనుక కురుక్షేత్రమందలి యుద్ధము కూడా అతని సంకల్పము పైననే ఏర్పాటు చేయబడినది. కనుకనే అర్జునుడు యుద్ధము చేయ నిరాకారించినపుడు దేవదేవుని కోరిక ననుసరించి యుద్ధము చేయమని బోధింపబడినాడు. అప్పుడే అతడు ఆనందభాగుడు కాగలడు. అనగా కృష్ణభక్తిభావనలో సంపూర్ణముగా నిమగ్నుడై జీవితమును ఆ భగవానుని దివ్యసేవకే అంకితము చేసినవాడు పరిపూర్ణుడు కాగలడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 447 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 33 🌴
33. tasmāt tvam uttiṣṭha yaśo labhasva jitvā śatrūn bhuṅkṣva rājyaṁ samṛddham
mayaivaite nihatāḥ pūrvam eva nimitta-mātraṁ bhava savya-sācin
🌷 Translation : Therefore get up. Prepare to fight and win glory. Conquer your enemies and enjoy a flourishing kingdom. They are already put to death by My arrangement, and you, O Savyasācī, can be but an instrument in the fight.
🌹 Purport : Savya-sācin refers to one who can shoot arrows very expertly in the field; thus Arjuna is addressed as an expert warrior capable of delivering arrows to kill his enemies. “Just become an instrument”: nimitta-mātram. This word is also very significant. The whole world is moving according to the plan of the Supreme Personality of Godhead. Foolish persons who do not have sufficient knowledge think that nature is moving without a plan and all manifestations are but accidental formations.
There are many so-called scientists who suggest that perhaps it was like this, or maybe like that, but there is no question of “perhaps” and “maybe.” There is a specific plan being carried out in this material world. What is this plan? This cosmic manifestation is a chance for the conditioned souls to go back to Godhead, back to home. As long as they have the domineering mentality which makes them try to lord it over material nature, they are conditioned. But anyone who can understand the plan of the Supreme Lord and cultivate Kṛṣṇa consciousness is most intelligent. The creation and destruction of the cosmic manifestation are under the superior guidance of God. Thus the Battle of Kurukṣetra was fought according to the plan of God. Arjuna was refusing to fight, but he was told that he should fight in accordance with the desire of the Supreme Lord. Then he would be happy. If one is in full Kṛṣṇa consciousness and his life is devoted to the Lord’s transcendental service, he is perfect.
🌹 🌹 🌹 🌹 🌹
25 Oct 2023 : Daily Panchang నిత్య పంచాంగము
🌹 25, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹
శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday
మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు :పాపాంకుశ ఏకాదశి, Papankusha Ekadashi 🌻
🍀. శ్రీ గజానన స్తోత్రం - 15 🍀
15. రవిస్వరూపం రవిభాసహీనం హరిస్వరూపం హరిబోధహీనమ్ |
శివస్వరూపం శివభాసనాశం గజాననం భక్తియుతా భజామః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : చేసిన తప్పులు గురువుతో చెప్పుకోవాలి - గురువుకు త్రికరణశుద్ధిగా ఆత్మసమర్పణ మొనర్చుకొను శిష్యుడు సాధనకు సంబంధించిన ఏ ముఖ్య విషయాన్నీ గురువు వద్ద దాచరాదు. చేసిన తప్పులు గురువుతో చెప్పుకోడం వల్ల చేతన యందలి ప్రతిబంధకాలు తొలగి ఆంతరంగిక విశుద్ధి ఏర్పడుతుంది. గురుశిష్య సంబంధం అత్యంత సన్నిహితమై ప్రభావ సంపన్న మవుతుంది. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
శరద్ ఋతువు, దక్షిణాయణం,
ఆశ్వీయుజ మాసం
తిథి: శుక్ల-ఏకాదశి 12:33:57 వరకు
తదుపరి శుక్ల ద్వాదశి
నక్షత్రం: శతభిషం 13:31:30 వరకు
తదుపరి పూర్వాభద్రపద
యోగం: వృధ్ధి 12:17:20 వరకు
తదుపరి ధృవ
కరణం: విష్టి 12:31:57 వరకు
వర్జ్యం: 19:21:56 - 20:49:40
దుర్ముహూర్తం: 11:36:50 - 12:23:17
రాహు కాలం: 12:00:04 - 13:27:08
గుళిక కాలం: 10:32:59 - 12:00:04
యమ గండం: 07:38:51 - 09:05:55
అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:23
అమృత కాలం: 06:54:24 - 08:22:32
మరియు 28:08:20 - 29:36:04
సూర్యోదయం: 06:11:47
సూర్యాస్తమయం: 17:48:20
చంద్రోదయం: 15:25:05
చంద్రాస్తమయం: 02:30:25
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: కుంభం
యోగాలు: మానస యోగం - కార్య
లాభం 13:31:30 వరకు తదుపరి
పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹