శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 311-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 311-1

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 311-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 311-1🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 71. రాజరాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా ।
రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా ॥ 71 ॥ 🍀

🌻 311-1. 'రస్యా' 🌻

ఆస్వాదించుట కనువైనది శ్రీమాత అని అర్థము. రసోవైసః' అనునది శ్రుతి వాక్యము. రసానుభూతియే జీవుడు కోరునది. అనగా దైవానుభూతియే ప్రతి విషయమునందు జీవుడు

కోరుచున్నాడు. రస మనగా అమితమగు ఆనందమని అర్థము. ఏ పని చేసిననూ ప్రతి జీవుడు అనుభూతి కొరకే చేయుచున్నాడు. తేనె టీగ పూవునందలి తేనెను గ్రోలుట మొదలుగ, సింహము ఏనుగు కుంభస్థలము కోరుట వరకు చేయు ప్రయత్నము లన్నియూ రసాను భూతికే. జంతువులన్నియూ రసానుభూతికై కదలుచున్నవి. వృక్షము లన్నియూ రసానుభూతికే పెరుగుచున్నవి.

మానవులందరూ రసాను భూతికే ఆరాటపడుచూ పుట్టుచు, చచ్చుచు నున్నారు. ఎవరు ఏ పని చేసిననూ ఆ పనికి మూల కారణము రసానుభూతికై ప్రాకులాడుటయే. దైవమును తెలియగోరు వారు కూడ రసానుభూతి కొరకే తపస్సులు, దానములు, యజ్ఞములు, వ్రతములు ఆచరించు చున్నారు. సృష్టి యందు కోటాను కోట్ల జీవులు ఒకే ఒక ప్రయత్నమున నున్నారు. ప్రయత్నమునకు మూలము రసాస్వాదనము. అందులకై బహిరంగమున ప్రయత్నించువారు, అంతరంగమున ప్రయత్నించు వారు అను రెండు తెగలుగ మానవులున్నారు. రసాస్వాదనమునకు ద్వయస్థితి తప్పనిసరి. ఆస్వాదించబడు వస్తువు, ఆస్వాదించు జీవుడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 311-1 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🍀 71. rājarājārcitā rājñī ramyā rājīvalocanā |
rañjanī ramaṇī rasyā raṇatkiṅkiṇi-mekhalā || 71 || 🍀

🌻 311-1. Rasyā रस्या (311) 🌻

She is in the form of essence of Ātman. The meaning of rasa (essence) can be understood from Taittirīya Upaniṣad (II.vii) which says raso vai saḥ. The meaning is “That is to be identified with sweetness.” It further says that “anyone who has this sweetness is happy” and the source of sweetness comes from the Self.

Happiness is bliss and it says that bliss can be attained only if individual Self is realized. ‘That’ means the Supreme Self. The nāma says that She is in the form of That Supreme Self. The Supreme Self is the condensed form of the universe realized as the empirical Self.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

22 Sep 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 75

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 75 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. సత్యాన్ని నీకు నువ్వే కనిపెట్టాలి. మహాత్ములు దారి చూపించారు కానీ నీ అంతట నువ్వే సాగాలి. అది సదీర్ఘ ప్రయాణం. కష్టమయింది కానీ అద్భుతమయింది. 🍀

సత్యమన్నది రెడీమేడ్ గా దొరికే సరుకు కాదు. అది సంప్రదాయంలో లేదు, పవిత్ర గ్రంథాల్లో లేదు. ప్రతివ్యక్తి దాన్ని పరిశోధించాలి, తనలోకి అన్వేషించాలి. నేను దాన్ని కనుక్కున్నాను కానీ నీకు అందివ్వలేను. నాకు నీకు అందివ్వకూడదన్న వుద్దేశం లేదు. కానీ అది అందివ్వలేనిది. ఒకరి నించీ యింకొకరికి చేరవేయ లేనిది యిచ్చే మార్గం లేదు.

ఒకసారి ఆ సత్యాన్ని నువ్వు యింకొకరికి చేరవేస్తే అది కాస్తా అబద్ధమయి కూచుంటుంది. ఆ సత్యాన్ని నీకు నువ్వే కనిపెట్టాలి. మహాత్ములు దారి చూపించారు కానీ నీ అంతట నువ్వే సాగాలి. అది సదీర్ఘ ప్రయాణం. కష్టమయింది కానీ అద్భుతమయింది. ప్రతిక్షణం దిగ్భ్రమకు లోను చేసేదే. ప్రతిక్షణం అద్భుతంతో నిండినదే.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

22 Sep 2021

మైత్రేయ మహర్షి బోధనలు - 8

🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 8 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 6. బృందజీవనము 🌻

బృంద జీవనమునకు సహకారము, పరస్పర గౌరవము, ఏకాభిప్రాయము, సమిష్ఠి శ్రేయస్సు మూల స్తంభములు. ఈ నాలుగు అంశములూ ఎచ్చట ప్రకాశించుచుండునో అచ్చట బృందజీవనము (Group living) సహజీవనముగ సిద్ధించును. బృందమునకు ఒక నాయకుడున్నను, నిర్ణయములు సమిష్టిగా జరుగుట, సమిష్టి నిర్ణయమును నాయకుడు నిర్వహించుట శ్రేయస్కరము. తన తోటివారిని తనతో సమానముగా మన్నించి, గౌరవించి, సంప్రదించి, సమిష్టి నిర్ణయమును మాత్రమే నిర్వర్తించువాడు నిజమైన నాయకుడు. అధికారమును చూపువాడు సంస్కారవంతుడగు నాయకుడు కాడు. ఈ భావమునే రోమన్ రాజ్యాంగ విధానము అనుసరించినది. మరియు గ్రీకు దేశపు ద్రష్టలగు సోక్రటీసు, ప్లాటో ప్రతిపాదించిరి. సమత్వము, సమభావము నాయకుని ముఖ్య లక్షణములు. బృందమందలి సభ్యుల యందు పరస్పరత్వము ఒక కట్టు బాటు.

ఒకరినొకరు ఆదరించుట, సహాయపడుట, విమర్శించు కొనకుండుట పరస్పర ప్రేమానురాగములకు దారి తీయును. ఇది లేనిచో బృందమొక మఠమగును. మఠములయందు యాంత్రిక దినచర్యయే కాని స్ఫూర్తి తరుగుచుండును. ఒకచోట ఉండినను, ఎవరికి వారుగా నుండుట, యాంత్రికముగ కలియుట, యాంత్రికముగ పూజలు చేయుట జరుగుచుండుట చేత కార్యక్రమములు యందు నిస్పృహ తాండవించుచుండును. స్ఫూర్తి అదృశ్యమగు చుండును. బృందములుగ జీవించుటకు చెప్పబడిన సూత్రములు నాలుగు. అవి ఎచ్చట నిర్వర్తింప బడుచున్నవో అచ్చట బృందజీవనము యొక్క రసానుభూతి కలుగును. కావున బృందజీవనము ఆశ్రమ జీవనమే కానక్కరలేదు. కుటుంబము నందేర్పరచు కొనవచ్చును. అన్ని రకముల సంస్థల యందు కూడా బృందజీవనము రసానుభూతి కలిగించును. ఈ సూత్రములతో నిర్వహింపబడు ఆధ్యాత్మిక సంస్థ కాని, ధార్మిక సంస్థ కాని, సాంఘిక సంస్థ కాని, వ్యాపార సంస్థ కాని మానవునకు స్ఫూర్తి, ఆనందము కలిగించుట తథ్యము.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

22 Sep 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 491 / Vishnu Sahasranama Contemplation - 491

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 491 / Vishnu Sahasranama Contemplation - 491🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 491. మహాదేవః, महादेवः, Mahādevaḥ 🌻

ఓం మహాదేవాయ నమః | ॐ महादेवाय नमः | OM Mahādevāya namaḥ

మహాదేవః, महादेवः, Mahādevaḥ

యన్మహత్యాత్మజ్ఞానయోగైశ్వర్యే యో మహీయతే ।
సర్వన్భావాన్పరిత్యజ్య స మహాదేవ ఉచ్యతే ॥

సంభవములగు సర్వభావములను వదలి మిగుల గొప్పదియగు ఆత్మజ్ఞానయోగమునకు ఈశ్వరుడుగానుండుట అను స్థితియందు పూజింపబడుచుండునుగావున 'మహాన్‍' అనబడును. మహాన్ అగు దేవుడు కావున శ్రీ మహా విష్ణువు 'మహాదేవః' అనబడుచున్నాడు.

:: పోతన భాగవతము అష్టమ స్కంధము ::

సీ.భూతాత్మా! భూతేశ! భూతభావనరూప! దేవ! మహాదేవ! దేవవంద్య!యీ లోకములకెల్ల నీశ్వరుండవు నీవు; బంధమోక్షములకుఁ బ్రభుఁడ నీవ;యార్త శరణ్యుండ వగు గురుండవు నిన్నుఁ గోరి భజింతురు కుశలమతులు;సకల సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మవిష్ణు శివాఖ్య బరఁగు దీవు;ఆ.పరమ గుహ్య మయిన బ్రహ్మంబు సదసత్త, మంబు నీవ; శక్తి మయుఁడ వీవశబ్ద యోని వీవ; జగదంతరాత్మవు నీవ, ప్రాణ మరయ నిఖిలమునకు. (222)

నీవు పంచభూతాలకూ ఆత్మయైనవాడవు. భూతనాథుడవు. జీవులకు కారణరూపమైన దేవుడవు. దేవదేవా! మహాదేవా! దేవవంద్యా! అన్ని లోకాలనూ పాలించేవాడవు నీవు. లోకములోని బంధ మోక్షాలకు ప్రభుడవు నీవు. దుఃఖించే వారిని చేరదీసే తండ్రివి నీవు. బుద్ధిమంతులు ప్రీతితో నిన్ను పూజిస్తారు. సమస్తమైన సృష్టికీ స్థితికీ లయానికీ కర్తవు నీవు. బ్రహ్మ, విష్ణు, శివుడు అనే పేరులతో ప్రకాశిమ్చే వాడవు నీవే. భావింపరాని పరమాత్మవు నీవు. ప్రకృతి పురుష సవరూప్డవు నీవే. శక్తియుతుడవు నీవే. శబ్దానికి జన్మస్థానం నీవే. లోకానికి అంతరాత్మవు నీవే. సమస్తానికీ ప్రాణం నీవే.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 491 🌹

📚. Prasad Bharadwaj

🌻 491. Mahādevaḥ 🌻

OM Mahādevāya namaḥ

यन्महत्यात्मज्ञानयोगैश्वर्ये यो महीयते ।
सर्वन्भावान्परित्यज्य स महादेव उच्यते ॥

Yanmahatyātmajñānayogaiśvarye yo mahīyate,
Sarvanbhāvānparityajya sa mahādeva ucyate.

Abandoning all possible concepts, He glories in the great wealth of ātmajñāna or self-realization, yoga and aiśvarya. Therefore, Lord Mahā Viṣṇu is called Mahādevaḥ.

:: श्रीमद्भागवते दशमस्कन्धे द्विषष्टितमोऽद्यायः ::

नमस्ये त्वां महादेव लोकानां गुरुमीश्वरम् ।
पुंसामपूर्णकामानां कामपूरामराङ्घ्रिपम् ॥ ७ ॥

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 62

Namasye tvāṃ mahādeva lokānāṃ gurumīśvaram,
Puṃsāmapūrṇakāmānāṃ kāmapūrāmarāṅghripam. 7.

O Lord Mahādeva, I bow down to you, the spiritual master and controller of the worlds. You are like the heavenly tree that fulfills the desires of those whose desires are unfulfilled.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

गभस्तिनेमिस्सत्त्वस्थस्सिंहो भूतमहेश्वरः ।आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः ॥ ५२ ॥

గభస్తినేమిస్సత్త్వస్థస్సింహో భూతమహేశ్వరః ।ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ॥ 52 ॥

Gabhastinemissattvasthassiṃho bhūtamaheśvaraḥ,Ādidevo mahādevo deveśo devabhrdguruḥ ॥ 52 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

22 Sep 2021

22-SEPTEMBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 22 సెప్టెంబర్ 2021 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 94 / Bhagavad-Gita - 94 - 2-47🌹*
3) 🌹. శ్రీమద్భగవద్గీత - 662 / Bhagavad-Gita - 662 -18-73🌹
4) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 491 / Vishnu Sahasranama Contemplation - 491🌹
5) 🌹 DAILY WISDOM - 169🌹 
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 8 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 75 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 311-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 311-1🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ బుధవారం మిత్రులందరికీ 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ అయ్యప్ప స్తోత్రం - 1 🍀*

అరుణోదయసంకాశం నీలకుండలధారణం |
నీలాంబరధరం దేవం వందేఽహం బ్రహ్మనందనమ్ || 1

చాపబాణం వామహస్తే చిన్ముద్రాం దక్షిణకరే |
విలసత్కుండలధరం వందేఽహం విష్ణునందనమ్ || 2
🌻 🌻 🌻 🌻 🌻

22 బుధవారం, సెప్టెంబర్‌ 2021
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ
దక్షిణాయణం,  వర్ష ఋతువు
చాంద్రమానం : భాద్రపద మాసం
తిథి: కృష్ణ విదియ 30:55:41 వరకు తదుపరి కృష్ణ తదియ
పక్షం: కృష్ణ-పక్ష
నక్షత్రం: రేవతి 30:44:17 వరకు తదుపరి అశ్విని
యోగం: వృధ్ధి 13:53:14 వరకు తదుపరి ధృవ
 కరణం: తైతిల 18:22:57 వరకు
వర్జ్యం: -
దుర్ముహూర్తం: 11:44:22 - 12:32:52
రాహు కాలం: 12:08:37 - 13:39:32
గుళిక కాలం: 10:37:42 - 12:08:37
యమ గండం: 07:35:51 - 09:06:46
అభిజిత్ ముహూర్తం: 11:44 - 12:32
అమృత కాలం: -
సూర్యోదయం: 06:04:55, సూర్యాస్తమయం: 18:12:18
వైదిక సూర్యోదయం: 06:08:28 
వైదిక సూర్యాస్తమయం: 18:08:47
చంద్రోదయం: 19:17:55, చంద్రాస్తమయం: 07:02:06
సూర్య రాశి: కన్య, చంద్ర రాశి: మీనం
ఆనందాదియోగం: ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య నాశనం 30:44:17 వరకు తదుపరి మృత్యు యోగం - మృత్యు భయం
పండుగలు : ద్వితీయ మహాలయ శ్రాధ్ధం
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 94 / Bhagavad-Gita - 94 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 47 🌴*

47. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |
మా కర్మఫల హేతుర్బూర్మా తే సజ్ఞోస్త్వకర్మణి ||

🌷. తాత్పర్యం :
*విధ్యుక్తధర్మమును నిర్వర్తించుట యందే నీకు అధికారము కలదు గాని కర్మఫలమునందు కాదు. నీ కర్మఫలములకు నీవే కారణమని ఎన్నడును భావింపకుము. అలాగుననే విధ్యుక్తధర్మమును వీడుట యందు ఆసక్తుడవు కాకుము.*

🌻. భాష్యము :
విధ్యుక్తధర్మములు, దుష్కర్మలు, అకర్మ అనుచు కర్మలు మూడు రకములు. మనుజుని గుణముల ననుసరించి విధింపబడిన కర్మలే విధ్యుక్తధర్మములు. ప్రామాణికమైన అనుమతి లేకుండగనే ఒనరింపబడునవి దుష్కర్మలు కాగా, విధ్యుక్తధర్మమును చేయకుండుట అకర్మ అనుదాని భావము. ఆకర్మునిగా కారాదనియు మరియు ఫలాపేక్ష లేకుండా విధ్యుక్తధర్మమును విధిగా నిర్వహించు మనియు ఇచ్చట శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు ఉపదేశించినాడు. కర్మఫలములందు ఆసక్తిని కలిగియుండెడివాడు ఆ కర్మలకు సైతము కారణముగుటచే ఆ ఫలముల వలన సుఖి లేదా దుఃఖి యగుచున్నాడు.

ఇక విధ్యుక్తధర్మములకు సంబంధించినవరకు వాటిని నిత్యకర్మము, అత్యవసరకర్మము, ఇష్టమైన కర్మలనెడి మూడింటిగా విభజింపవచ్చును. శాస్త్రానుసారముగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా విధిగా నిర్వర్తింపబడు నిత్యకర్మ సత్వగుణకర్మ అనబడును. ఫలితము వాంచించుచు చేయబడు కర్మ బంధమును కలిగించును గావున అది అమంగళదాయకము. ప్రతియెక్కరికిని వారి విధ్యుక్తధర్మమునందు అధికారము కలదు. కాని ఆ ధర్మమును వారు ఫలాపేక్ష లేకుండా నిర్వర్తింప వలసి యున్నది. అట్టి ఫలాపేక్ష రహిత విధ్యుక్త ధర్మపాలనము మనుజుని ముక్తిమార్గమును చేర్చగలదు.

కావుననే ఫలమునందు ఆసక్తిని గొనక విధిగా యుద్ధము చేయుమని శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశమొసగినాడు. యుద్ధములో పాల్గొనకపోవుటయు ఒక విధముగా ఆసక్తియే. అటువంటి ఆసక్తి ఎన్నడును మనుజుని ముక్తిపథమునకు నడిపించదు. ఆసక్తి ఎటువంటిదైనను అది బంధమునకే కారణము కాగలదు. అకర్మ అనునది పాపమే కనుక విధిగా యుద్ధము చేయుటయే అర్జునునికి శుభప్రదమైన మోక్షమార్గమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 94 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada 
📚 Prasad Bharadwaj 

*🌴 Chapter 2 - Sankhya Yoga - 47 🌴*

47. karmaṇy evādhikāras te mā phaleṣu kadācana
mā karma-phala-hetur bhūr mā te saṅgo ’stv akarmaṇi

🌻 Translation :
*You have a right to perform your prescribed duty, but you are not entitled to the fruits of action. Never consider yourself the cause of the results of your activities, and never be attached to not doing your duty.*

🌻 Purport :
There are three considerations here: prescribed duties, capricious work, and inaction. Prescribed duties are activities enjoined in terms of one’s acquired modes of material nature. Capricious work means actions without the sanction of authority, and inaction means not performing one’s prescribed duties. The Lord advised that Arjuna not be inactive, but that he perform his prescribed duty without being attached to the result. One who is attached to the result of his work is also the cause of the action. Thus he is the enjoyer or sufferer of the result of such actions.

As far as prescribed duties are concerned, they can be fitted into three subdivisions, namely routine work, emergency work and desired activities. Routine work performed as an obligation in terms of the scriptural injunctions, without desire for results, is action in the mode of goodness. Work with results becomes the cause of bondage; therefore such work is not auspicious. Everyone has his proprietary right in regard to prescribed duties, but should act without attachment to the result; such disinterested obligatory duties doubtlessly lead one to the path of liberation.

Arjuna was therefore advised by the Lord to fight as a matter of duty without attachment to the result. His nonparticipation in the battle is another side of attachment. Such attachment never leads one to the path of salvation. Any attachment, positive or negative, is cause for bondage. Inaction is sinful. Therefore, fighting as a matter of duty was the only auspicious path of salvation for Arjuna.
🌹🌹🌹🌹🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 662 / Bhagavad-Gita - 662 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 73 🌴*

73. నష్టో మోహ: స్మృతిర్లబ్ధా 
త్వత్ప్రసాదాన్మయాచ్యుత |
స్థితోస్మి గతసన్దేహ: 
కరిష్యే వచనం తవ ||

🌷. తాత్పర్యం : 
అర్జునుడు పలికెను : ఓ అచ్యుతా! నా మోహము ఇప్పుడు నశించినది. నీ కరుణచే నా స్మృతిని తిరిగి పొందితిని. ఇప్పుడు నేను స్థిరుడును, సందేహరహితుడును అయి నీ ఆజ్ఞానుసారమును వర్తించుటకు సిద్ధముగా నున్నాను.

🌷. భాష్యము :
దేవదేవుడైన శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారము వర్తించుటయే జీవుని (అర్జునుని) సహజస్థితియై యున్నది. అతడట్లు నియమబద్ధముగా వర్తించుటకే నిర్దేశింపబడినాడు. 

జీవుని నిజమైన స్థితి శ్రీకృష్ణుని నిత్యదాసత్వమే యని చైతన్యమహాప్రభువు కూడా తెలిపియున్నారు. ఈ సిద్ధాంతము మరచియే జీవుడు భౌతికప్రకృతిచే బద్ధుడగుచున్నాడు. కాని అతడు ఆ భగవానుని సేవలో నిమగ్నుడగుట ద్వారా ముక్తుడు కాగలడు. జీవుని సహజస్థితి దాసత్వమే గనుక అతడు మాయనో లేదా దేవదేవుడైన శ్రీకృష్ణునో సదా సేవింపవలసివచ్చును. 

ఒకవేళ అతడు శ్రీకృష్ణభగవానుని సేవించినచో తన సహజస్థితియందు నిలువగలడు. కాని భౌతికశక్తియైన మాయను సేవింపదలచినచో నిక్కముగా బంధములో చిక్కుబడగలడు. భ్రాంతి యందు భౌతికజగమున సేవను గూర్చుచు అతడు ఇచ్చాకామములచే బద్ధుడైనను తనను తాను జగత్తుకు అధినేతయైనట్లు భావించును. 

అట్టి భావనయే భ్రాంతి యనబడును. కాని మనుజుడు ముక్తుడైనపుడు అట్టి భ్రాంతి నశించి, ఆ దేవదేవుని కోరికల ననుసరించి వర్తించుటకు స్వచ్చందముగా శరణాగతుడగును. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 662 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 73 🌴*

73. arjuna uvāca
naṣṭo mohaḥ smṛtir labdhā
tvat-prasādān mayācyuta
sthito ’smi gata-sandehaḥ
kariṣye vacanaṁ tava

🌷 Translation : 
Arjuna said: My dear Kṛṣṇa, O infallible one, my illusion is now gone. I have regained my memory by Your mercy. I am now firm and free from doubt and am prepared to act according to Your instructions.

🌹 Purport :
The constitutional position of a living entity, represented by Arjuna, is that he has to act according to the order of the Supreme Lord. He is meant for self-discipline. 

Śrī Caitanya Mahāprabhu says that the actual position of the living entity is that of eternal servant of the Supreme Lord. Forgetting this principle, the living entity becomes conditioned by material nature, but in serving the Supreme Lord he becomes the liberated servant of God. 

The living entity’s constitutional position is to be a servitor; he has to serve either the illusory māyā or the Supreme Lord. If he serves the Supreme Lord he is in his normal condition, but if he prefers to serve the illusory, external energy, then certainly he will be in bondage. In illusion the living entity is serving in this material world. 

He is bound by his lust and desires, yet he thinks of himself as the master of the world. This is called illusion. When a person is liberated, his illusion is over, and he voluntarily surrenders unto the Supreme to act according to His desires.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 491 / Vishnu Sahasranama Contemplation - 491🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 491. మహాదేవః, महादेवः, Mahādevaḥ 🌻*

*ఓం మహాదేవాయ నమః | ॐ महादेवाय नमः | OM Mahādevāya namaḥ*

మహాదేవః, महादेवः, Mahādevaḥ

యన్మహత్యాత్మజ్ఞానయోగైశ్వర్యే యో మహీయతే ।
సర్వన్భావాన్పరిత్యజ్య స మహాదేవ ఉచ్యతే ॥

సంభవములగు సర్వభావములను వదలి మిగుల గొప్పదియగు ఆత్మజ్ఞానయోగమునకు ఈశ్వరుడుగానుండుట అను స్థితియందు పూజింపబడుచుండునుగావున 'మహాన్‍' అనబడును. మహాన్ అగు దేవుడు కావున శ్రీ మహా విష్ణువు 'మహాదేవః' అనబడుచున్నాడు.

:: పోతన భాగవతము అష్టమ స్కంధము ::
సీ.భూతాత్మా! భూతేశ! భూతభావనరూప! దేవ! మహాదేవ! దేవవంద్య!యీ లోకములకెల్ల నీశ్వరుండవు నీవు; బంధమోక్షములకుఁ బ్రభుఁడ నీవ;యార్త శరణ్యుండ వగు గురుండవు నిన్నుఁ గోరి భజింతురు కుశలమతులు;సకల సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మవిష్ణు శివాఖ్య బరఁగు దీవు;ఆ.పరమ గుహ్య మయిన బ్రహ్మంబు సదసత్త, మంబు నీవ; శక్తి మయుఁడ వీవశబ్ద యోని వీవ; జగదంతరాత్మవు నీవ, ప్రాణ మరయ నిఖిలమునకు. (222)

నీవు పంచభూతాలకూ ఆత్మయైనవాడవు. భూతనాథుడవు. జీవులకు కారణరూపమైన దేవుడవు. దేవదేవా! మహాదేవా! దేవవంద్యా! అన్ని లోకాలనూ పాలించేవాడవు నీవు. లోకములోని బంధ మోక్షాలకు ప్రభుడవు నీవు. దుఃఖించే వారిని చేరదీసే తండ్రివి నీవు. బుద్ధిమంతులు ప్రీతితో నిన్ను పూజిస్తారు. సమస్తమైన సృష్టికీ స్థితికీ లయానికీ కర్తవు నీవు. బ్రహ్మ, విష్ణు, శివుడు అనే పేరులతో ప్రకాశిమ్చే వాడవు నీవే. భావింపరాని పరమాత్మవు నీవు. ప్రకృతి పురుష సవరూప్డవు నీవే. శక్తియుతుడవు నీవే. శబ్దానికి జన్మస్థానం నీవే. లోకానికి అంతరాత్మవు నీవే. సమస్తానికీ ప్రాణం నీవే.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 491 🌹*
📚. Prasad Bharadwaj

*🌻 491. Mahādevaḥ 🌻*

*OM Mahādevāya namaḥ*

यन्महत्यात्मज्ञानयोगैश्वर्ये यो महीयते ।
सर्वन्भावान्परित्यज्य स महादेव उच्यते ॥

Yanmahatyātmajñānayogaiśvarye yo mahīyate,
Sarvanbhāvānparityajya sa mahādeva ucyate.

Abandoning all possible concepts, He glories in the great wealth of ātmajñāna or self-realization, yoga and aiśvarya. Therefore, Lord Mahā Viṣṇu is called Mahādevaḥ.

:: श्रीमद्भागवते दशमस्कन्धे द्विषष्टितमोऽद्यायः ::
नमस्ये त्वां महादेव लोकानां गुरुमीश्वरम् ।
पुंसामपूर्णकामानां कामपूरामराङ्घ्रिपम् ॥ ७ ॥

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 62
Namasye tvāṃ mahādeva lokānāṃ gurumīśvaram,
Puṃsāmapūrṇakāmānāṃ kāmapūrāmarāṅghripam. 7.

O Lord Mahādeva, I bow down to you, the spiritual master and controller of the worlds. You are like the heavenly tree that fulfills the desires of those whose desires are unfulfilled.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
गभस्तिनेमिस्सत्त्वस्थस्सिंहो भूतमहेश्वरः ।आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः ॥ ५२ ॥

గభస్తినేమిస్సత్త్వస్థస్సింహో భూతమహేశ్వరః ।ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ॥ 52 ॥

Gabhastinemissattvasthassiṃho bhūtamaheśvaraḥ,Ādidevo mahādevo deveśo devabhrdguruḥ ॥ 52 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 169 🌹*
*🍀 📖 In the Light of Wisdom 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 17. One Going One Way, and Another Going the Other Way 🌻*

What is the difference between ‘looking at’ and ‘seeing through’? They are quite different things. The inner stuff of things has to be seen. We ought to see the object, the thing or the person as it is or as he is in itself. There is no use in merely gathering information. Glancing over something is not knowledge. Yoga psychology is based on a philosophy that commenced with the observation of the fact that there is a deeper conflict in nature than the mere psychological conflict in the mind of the human being. 

This psychological conflict seems to be based on another conflict which our psychologists do not know. Why should there be this conflict of the ideal with that real? It is due to another deeper conflict. Here we have entered the philosophy of yoga. There seems to be a conflict between the individual desire and the society’s ideal, because these two seem to be irreconcilable with one going one way and another going the other way.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 8 🌹* 
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 6. బృందజీవనము 🌻*

బృంద జీవనమునకు సహకారము, పరస్పర గౌరవము, ఏకాభిప్రాయము, సమిష్ఠి శ్రేయస్సు మూల స్తంభములు. ఈ నాలుగు అంశములూ ఎచ్చట ప్రకాశించుచుండునో అచ్చట బృందజీవనము (Group living) సహజీవనముగ సిద్ధించును. బృందమునకు ఒక నాయకుడున్నను, నిర్ణయములు సమిష్టిగా జరుగుట, సమిష్టి నిర్ణయమును నాయకుడు నిర్వహించుట శ్రేయస్కరము. తన తోటివారిని తనతో సమానముగా మన్నించి, గౌరవించి, సంప్రదించి, సమిష్టి నిర్ణయమును మాత్రమే నిర్వర్తించువాడు నిజమైన నాయకుడు. అధికారమును చూపువాడు సంస్కారవంతుడగు నాయకుడు కాడు. ఈ భావమునే రోమన్ రాజ్యాంగ విధానము అనుసరించినది. మరియు గ్రీకు దేశపు ద్రష్టలగు సోక్రటీసు, ప్లాటో ప్రతిపాదించిరి. సమత్వము, సమభావము నాయకుని ముఖ్య లక్షణములు. బృందమందలి సభ్యుల యందు పరస్పరత్వము ఒక కట్టు బాటు. 

ఒకరినొకరు ఆదరించుట, సహాయపడుట, విమర్శించు కొనకుండుట పరస్పర ప్రేమానురాగములకు దారి తీయును. ఇది లేనిచో బృందమొక మఠమగును. మఠములయందు యాంత్రిక దినచర్యయే కాని స్ఫూర్తి తరుగుచుండును. ఒకచోట ఉండినను, ఎవరికి వారుగా నుండుట, యాంత్రికముగ కలియుట, యాంత్రికముగ పూజలు చేయుట జరుగుచుండుట చేత కార్యక్రమములు యందు నిస్పృహ తాండవించుచుండును. స్ఫూర్తి అదృశ్యమగు చుండును. బృందములుగ జీవించుటకు చెప్పబడిన సూత్రములు నాలుగు. అవి ఎచ్చట నిర్వర్తింప బడుచున్నవో అచ్చట బృందజీవనము యొక్క రసానుభూతి కలుగును. కావున బృందజీవనము ఆశ్రమ జీవనమే కానక్కరలేదు. కుటుంబము నందేర్పరచు కొనవచ్చును. అన్ని రకముల సంస్థల యందు కూడా బృందజీవనము రసానుభూతి కలిగించును. ఈ సూత్రములతో నిర్వహింపబడు ఆధ్యాత్మిక సంస్థ కాని, ధార్మిక సంస్థ కాని, సాంఘిక సంస్థ కాని, వ్యాపార సంస్థ కాని మానవునకు స్ఫూర్తి, ఆనందము కలిగించుట తథ్యము. 

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 75 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. సత్యాన్ని నీకు నువ్వే కనిపెట్టాలి. మహాత్ములు దారి చూపించారు కానీ నీ అంతట నువ్వే సాగాలి. అది సదీర్ఘ ప్రయాణం. కష్టమయింది కానీ అద్భుతమయింది. 🍀*

సత్యమన్నది రెడీమేడ్ గా దొరికే సరుకు కాదు. అది సంప్రదాయంలో లేదు, పవిత్ర గ్రంథాల్లో లేదు. ప్రతివ్యక్తి దాన్ని పరిశోధించాలి, తనలోకి అన్వేషించాలి. నేను దాన్ని కనుక్కున్నాను కానీ నీకు అందివ్వలేను. నాకు నీకు అందివ్వకూడదన్న వుద్దేశం లేదు. కానీ అది అందివ్వలేనిది. ఒకరి నించీ యింకొకరికి చేరవేయ లేనిది యిచ్చే మార్గం లేదు. 

ఒకసారి ఆ సత్యాన్ని నువ్వు యింకొకరికి చేరవేస్తే అది కాస్తా అబద్ధమయి కూచుంటుంది. ఆ సత్యాన్ని నీకు నువ్వే కనిపెట్టాలి. మహాత్ములు దారి చూపించారు కానీ నీ అంతట నువ్వే సాగాలి. అది సదీర్ఘ ప్రయాణం. కష్టమయింది కానీ అద్భుతమయింది. ప్రతిక్షణం దిగ్భ్రమకు లోను చేసేదే. ప్రతిక్షణం అద్భుతంతో నిండినదే.

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 311-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 311-1🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 71. రాజరాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా ।*
*రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా ॥ 71 ॥ 🍀*

*🌻 311-1. 'రస్యా' 🌻* 

ఆస్వాదించుట కనువైనది శ్రీమాత అని అర్థము. రసోవైసః' అనునది శ్రుతి వాక్యము. రసానుభూతియే జీవుడు కోరునది. అనగా దైవానుభూతియే ప్రతి విషయమునందు జీవుడు
కోరుచున్నాడు. రస మనగా అమితమగు ఆనందమని అర్థము. ఏ పని చేసిననూ ప్రతి జీవుడు అనుభూతి కొరకే చేయుచున్నాడు. తేనె టీగ పూవునందలి తేనెను గ్రోలుట మొదలుగ, సింహము ఏనుగు కుంభస్థలము కోరుట వరకు చేయు ప్రయత్నము లన్నియూ రసాను భూతికే. జంతువులన్నియూ రసానుభూతికై కదలుచున్నవి. వృక్షము లన్నియూ రసానుభూతికే పెరుగుచున్నవి. 

మానవులందరూ రసాను భూతికే ఆరాటపడుచూ పుట్టుచు, చచ్చుచు నున్నారు. ఎవరు ఏ పని చేసిననూ ఆ పనికి మూల కారణము రసానుభూతికై ప్రాకులాడుటయే. దైవమును తెలియగోరు వారు కూడ రసానుభూతి కొరకే తపస్సులు, దానములు, యజ్ఞములు, వ్రతములు ఆచరించు చున్నారు. సృష్టి యందు కోటాను కోట్ల జీవులు ఒకే ఒక ప్రయత్నమున నున్నారు. ప్రయత్నమునకు మూలము రసాస్వాదనము. అందులకై బహిరంగమున ప్రయత్నించువారు, అంతరంగమున ప్రయత్నించు వారు అను రెండు తెగలుగ మానవులున్నారు. రసాస్వాదనమునకు ద్వయస్థితి తప్పనిసరి. ఆస్వాదించబడు వస్తువు, ఆస్వాదించు జీవుడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 311-1 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🍀 71. rājarājārcitā rājñī ramyā rājīvalocanā |*
*rañjanī ramaṇī rasyā raṇatkiṅkiṇi-mekhalā || 71 || 🍀*

*🌻 311-1. Rasyā रस्या (311) 🌻*

She is in the form of essence of Ātman. The meaning of rasa (essence) can be understood from Taittirīya Upaniṣad (II.vii) which says raso vai saḥ. The meaning is “That is to be identified with sweetness.” It further says that “anyone who has this sweetness is happy” and the source of sweetness comes from the Self.  

Happiness is bliss and it says that bliss can be attained only if individual Self is realized. ‘That’ means the Supreme Self. The nāma says that She is in the form of That Supreme Self. The Supreme Self is the condensed form of the universe realized as the empirical Self. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹