1) 🌹 శివ సూత్రాలు - 13వ సూత్రం - ఇచ్ఛాశక్తి ఉమా కుమారి - యోగి సంకల్పం శివుని తేజో శక్తి. తేజస్సు అంటే ఉమ మరియు సంకల్పం అంటే కుమారి. - 3 లఘు వీడియోలు - 1. పంచముఖ ఈశ్వరుడు, 2. ఇచ్ఛాశక్తి - యోగి సంకల్పశక్తి , 3. శివునితో పూర్ణ ఐక్యత. 🌹*
2) 🌹 Shiva Sutras - 13th Sutra. - Ichhaa Shakti Uma Kumari. - The yogi's will is the radiant energy of Lord Shiva. Radiance is Uma, and willpower is Kumari. - 3 Short Videos. 1. Five Faces of Shiva, 2. Ichhaa Shakti - Yogi's Will Power, 3. Oneness with Shiva. 🌹
3) 🌹 शिव सूत्र - 13वां सूत्र - इच्छा शक्ति उमा कुमारी. - योगी की इच्छा शक्ति भगवान शिव की तेजस्वी ऊर्जा है। तेजस्विता उमा है, और संकल्प शक्ति कुमारी है। - 3 लघु वीडियो। - 1. शिव के पाँच मुख., 2. इच्छा शक्ति - योगी की इच्छाशक्ति. 3. शिव के साथ एकत्व. 🌹
4) 🌹. కార్తిక పురాణం - 30 🌹
🌻 30వ అధ్యాయము - కార్తీకవ్రత మహిమ్నా ఫలశ్రుతి 🌻
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 577 - 8 / Sri Lalitha Chaitanya Vijnanam - 577 - 8 🌹
🌻 577. 'మాతృకా వర్ణరూపిణీ' - 8 / 577. 'Mātrkā Varṇarūpiṇī' - 8 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 శివ సూత్రాలు - 13వ సూత్రం - ఇచ్ఛాశక్తి ఉమా కుమారి - యోగి సంకల్పం శివుని తేజో శక్తి. తేజస్సు అంటే ఉమ మరియు సంకల్పం అంటే కుమారి. - 3 లఘు వీడియోలు - 1. పంచముఖ ఈశ్వరుడు, 2. ఇచ్ఛాశక్తి - యోగి సంకల్పశక్తి , 3. శివునితో పూర్ణ ఐక్యత. 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
*1. పంచముఖ ఈశ్వరుడు*
*2. ఇచ్ఛాశక్తి - యోగి సంకల్పశక్తి*
https://youtube.com/shorts/MagcXOi-kBI
*3. శివునితో పూర్ణ ఐక్యత.*
*సబ్ స్క్రయిబ్ చైతన్య విజ్ఞానం చానల్. లైక్ చేయండి, షేర్ చేయండి.*
*ప్రసాద్ భరధ్వాజ.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Shiva Sutras - 13th Sutra. - Ichhaa Shakti Uma Kumari. - The yogi's will is the radiant energy of Lord Shiva. Radiance is Uma, and willpower is Kumari. - 3 Short Videos. 1. Five Faces of Shiva, 2. Ichhaa Shakti - Yogi's Will Power, 3. Oneness with Shiva. 🌹*
*Prasad Bhardwaj.*
*1. Five Faces of Shiva*
*2. Ichhaa Shakti - Yogi's Will Power*
*3. Oneness with Shiva.*
*Subscribe to the Chaitanya Vijnana Channel. Like and Share!*
*Prasad Bharadwaj*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 शिव सूत्र - 13वां सूत्र - इच्छा शक्ति उमा कुमारी. - योगी की इच्छा शक्ति भगवान शिव की तेजस्वी ऊर्जा है। तेजस्विता उमा है, और संकल्प शक्ति कुमारी है। - 3 लघु वीडियो। - 1. शिव के पाँच मुख., 2. इच्छा शक्ति - योगी की इच्छाशक्ति. 3. शिव के साथ एकत्व. 🌹*
*प्रसाद भारद्वाज.*
*1. शिव के पाँच मुख.*
*2. इच्छा शक्ति - योगी की इच्छाशक्ति.*
*3. शिव के साथ एकत्व.*
*चैतन्य विज्ञान चैनल को सब्सक्राइब करें। लाइक और शेयर करें!*
*प्रसाद भारद्वाज*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కార్తీక పురాణం - 30 🌹*
*🌻 30వ అధ్యాయము - కార్తీకవ్రత మహిమ్నా ఫలశ్రుతి 🌻*
*ప్రసాద్ భరద్వాజ*
నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాదిమహామునుల కందరకు సూతమహాముని తెలియజేసిన విష్ణుమహిమను, విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి, వేయినోళ్లకొనియాడిరి. శౌనకాది మునులకు యింకను సంశయములు తీరనందున, సూతునిగాంచి,
"ఓ ముని తిలకమా! కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై, అత్యాచారపరులై జీవించుచు సంసారసాగరము తరింపలేకున్నారు. అటువంటివారు సులభముగా ఆచరించు తరణోపాయమేదైనా కలదా? ధర్మములన్నింటిలో మోక్షసాధనకుపకరించు వుత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తినొసంగు వుత్తమదైవమెవరు? మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపు మాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల వుపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో నున్నాము. కాన దీనిని వివరించి తెలియజేయు"మని కోరిరి.
అంత సూతుడా ప్రశ్న నాలకించి "ఓ మునులారా! మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసారసాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్షసాధనము కాగలవు. కార్తీకవ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటె ఘనమైనదని శ్రీహరి వరించియున్నాడు. ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతియేకాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యముకాదు. అయినను సూక్షముగా వివరించెదను.
కార్తీకమాసమందు ఆచరించవలసిన పద్ధతులను జెప్పుచున్నాను. శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీకమాసమున సూర్యభగవానుదు తులారాశి యందున్నప్పుడు శ్రీహరి ప్రీతికొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగ నదీస్నానము చేయవలెను. దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజింపవలెను. తనకున్న దానితో కొంచమైనా దీపదానం చేయవలయును. ఈ నెలరోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమున గాని, శివాలయమునగాని ఆవునేతితో దీపారాధన చేయవలెను. ప్రతి దినము సాయంకాలము పురాణపఠనము చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశియందున్న నెలరోజులు యీ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తివుండికూడా ఆచరించక గాని, లేక, ఆచరించువారలను యెగతాళి చేసినగాని, వారికి ధనసహాయము చేయువారికి అడ్డుపడిన వారును మందు అనేక కష్టముల పాలగుటయేగాక వారి జన్మాంతర మందు నరకములో యమకింకరుల చేత నానా హింసలపాలుకాగలరు. అంతియేగాక అట్తివారు నూరుజన్మలవరకు ఛండాలాది హీన జన్మలెత్తుదురు.
కార్తీక మాసములో కావేరి నదిలోగాని, గంగా నదిలోగాని, అఖండ గౌతమినదిలోగాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్టతో ఆచరించిననూ యిహమందు సర్వసుఖములను అనుభవించుటయే గాక, జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు.
సంవత్సరములోవచ్చు అన్ని మాసములకన్నా కార్తీకమాసము వుత్తమోత్తమమైనది అధిక ఫలదాయకమైనది. హరి హరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీకమాస వ్రతము వలన జన్మజన్మలనుండి వారలకున్న సకలపాపములు హరించి, మరుజన్మలేక, వైకుంఠమందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే యీ వ్రతమాచరించవలెననెది కోరిక పుట్టి దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీకమాసమన్న కార్తీక వ్రతమన్నా అసహ్యము కలుగును.
కాన, ప్రతిమానవుదు ఈ పరమ సత్యమును గ్రహించి యిటువంటి పుణ్యమును చేతులారా విడువక ఆచరించవలెను. ఇటుల నెలరోజులు చేయలేని వారు కార్తీకశుద్ద పౌర్ణమినాడు అయినను తమశక్తి కొలదీ వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి, జాగరణము వుండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెలరోజులు చేసిన ఫలముతో సమానఫలము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో యెప్పటికినీ తరగని పుణ్యము లభించును. ఈనె, అరోజులు ధనవంతుడైనను, బీదవాడైనను మరెవ్వరైనను సరే శ్రీహరినామస్మరణ చేయుచు, పురాణములు వింటూ, పుణ్యతీర్థములను సేవిస్తూ దానధర్మములు చేయుచున్న యెడల వారికి పుణ్యలోక మబ్బును. ఈ కథను చదివిన వారికిని వినిన వారికిని శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు యిచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును.
ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్థప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి త్రింశోధ్యాయము- ముప్పదవ(ఆఖరి రోజు) పారాయణము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 577 - 8 / Sri Lalitha Chaitanya Vijnanam - 577 - 8 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 116. పరాశక్తిః, పరానిష్ఠా, ప్రజ్ఞాన ఘనరూపిణీ ।*
*మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ ॥ 116 ॥ 🍀*
*🌻 577. 'మాతృకా వర్ణరూపిణీ' - 8 🌻*
*నలుబది తొమ్మిది అక్షరములతో సప్తసప్తిగా లోక నిర్మాణము చేసి అందుపై శివశక్తులు అధిష్ఠించి యుందురు. అందువలన యాబది యొక్క అక్షరముల దేవ భాషగ సంస్కృతము యేర్పడినది. పరదేవతగ శ్రీమాత మాతృకలను, వాని వర్ణములను కూడ దాటి యున్నది గనుక ఆమెను మాతృక అవర్ణ రూపిణి అని కూడ తెలియవలెను. తాను వస్తుతః మాతృకలు కాదు. ఆమెకు వర్ణములు లేవు. రూపములు లేవు. అన్నియూ తానై వర్తించును.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 577 - 8 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 116. Parashaktih paranishta pragynana ghanarupini*
*madhvipanalasa matta matrukavarna rupini ॥116 ॥ 🌻*
*🌻 577. 'Mātrkā Varṇarūpiṇī' - 8 🌻*
*With forty-nine letters, the seven groups of seven were used to create the worlds, and upon them, Śiva and Śakti preside. Hence, the fifty letters gave rise to the divine language, Sanskrit. Śrī Māta, the Supreme Goddess, transcends both the Mātrkās (letters) and their forms. Therefore, she is also known as Mātrkā Avarṇa Rūpiṇī, meaning one who is beyond the Mātrkās and their classifications. In essence, she is not confined to the Mātrkās. She has no letters, no forms, yet she pervades and exists as everything.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Follow My 🌹Chaitanyavijnanam YouTube channel Facebook WhatsApp Channel 🌹
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. Chaitanya Vijnaanam YouTube FB Telegram groups 🌹
https://m.youtube.com/@ChaitanyaVijnaanam
Like, Subscribe and Share 👀
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
http://www.facebook.com/groups/chaitanyavijnanamspiritualwisdom/
https://whatsapp.com/channel/0029VaA1eUWLSmbT5VgtN00h
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj