2) 🌹 శ్రీమద్భగవద్గీత - 634 / Bhagavad-Gita - 634 - 18-45🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 455, 456 / Vishnu Sahasranama Contemplation - 455, 456🌹
4) 🌹 Daily Wisdom - 141🌹
5) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 115🌹
6) 🌹. నిర్మల ధ్యానములు - 47🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 291-2 / Sri Lalita Chaitanya Vijnanam - 291-2🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత / Bhagavad-gita - 66 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 19 🌴*
19. య ఏనం వేత్తి హన్తారాం యశ్చైనం మన్యతే హతం |
ఉభౌ తౌ న విజానీతో నాయం హన్తి న హన్యతే ||
🌷. తాత్పర్యం :
*జీవుడు చంపువాడని తలచువాడు గాని, చంపబడువాడని భావించువాడు గాని జ్ఞానవంతులు కారు. ఏలయన ఆత్మ చంపదు మరియు చంపబడదు.*
🌷. భాష్యము :
మారణాయుధములచే దేహధారి గాయపడినపుడు దేహమునందలి జీవుడు మాత్రము చంపబడడని ఎరుగవలెను. అత్యంత సూక్ష్మమైన అట్టి ఆత్మను వధించుట ఎత్తి ఆయుధములచేతను సాధ్యము కాదు. ఈ విషయము రాబోవు శ్లోకముల ద్వారా నిరూపణ కాగలదు.
అంతియేగాక దివ్యమైన ఆధ్యాత్మికస్థితి కారణముగా ఆత్మ వధార్హము కాదు. అనగా చంపబడునది లేదా చంపబడవలసినది కేవలము దేహము మాత్రమే. అయినను దీని ఉద్దేశ్యము దేహవధను ప్రోత్సహించుట కాదు. “మా హింస్యాత్ సర్వభూతాని” యను వేదనియమము ప్రకారము ఎవ్వరి యెడను హింసను ప్రదర్శించరాదు. అలాగుననే జీవుడెన్నడును చంపబడడని అవగాతమగుట జంతువధను ప్రోత్సహించుట ఎన్నడను కాదు.
అధికారము లేకుండా ఎవరినేని వధించుట అత్యంత హేయమైన కార్యము. అట్టి చర్య దేశనియమము ప్రకారము మరియు భగవన్నియమము ప్రకారము దండనీయమే కాగలదు. కాని ఇచ్చట అర్జునుడు ధర్మము కొరకే సంహారము నందు నియోగింప బడుచుండెను గాని విపరీత తలంపుతో కాదు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 66 🌹*
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada
📚. Prasad Bharadwaj
*🌴 Chapter 2 - Sankhya Yoga - 19 🌴*
19. ya enaṁ vetti hantāraṁ yaś cainaṁ manyate hatam
ubhau tau na vijānīto nāyaṁ hanti na hanyate
🌷 Translation :
*Neither he who thinks the living entity the slayer nor he who thinks it slain is in knowledge, for the self slays not nor is slain.*
🌷 Purport :
When an embodied living entity is hurt by fatal weapons, it is to be known that the living entity within the body is not killed. The spirit soul is so small that it is impossible to kill him by any material weapon, as will be evident from subsequent verses.
Nor is the living entity killable, because of his spiritual constitution. What is killed, or is supposed to be killed, is the body only. This, however, does not at all encourage killing of the body. The Vedic injunction is mā hiṁsyāt sarvā bhūtāni: never commit violence to anyone. Nor does understanding that the living entity is not killed encourage animal slaughter.
Killing the body of anyone without authority is abominable and is punishable by the law of the state as well as by the law of the Lord. Arjuna, however, is being engaged in killing for the principle of religion, and not whimsically.
🌹🌹🌹🌹🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 634 / Bhagavad-Gita - 634 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 45 🌴*
45. స్వే స్వే కర్మణ్యభిరత: సంసిద్ధిం లభతే నర: |
స్వకర్మనిరత: సిధ్ధిం యథా విన్దతి తచ్ర్ఛుణు ||
🌷. తాత్పర్యం :
మనుజుడు తన గుణమునకు సంబంధించిన కర్మను చేయుట ద్వారా పూర్ణత్వమును పొందగలడు. ఇక దీనిని ఏ విధముగా ఒనరింపవచ్చునో నా నుండి ఆలకింపుము.
🌷. భాష్యము :
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 634 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 45 🌴*
45. sve sve karmaṇy abhirataḥ
saṁsiddhiṁ labhate naraḥ
sva-karma-nirataḥ siddhiṁ
yathā vindati tac chṛṇu
🌷 Translation :
By following his qualities of work, every man can become perfect. Now please hear from Me how this can be done.
🌹 Purport :
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 455, 456 / Vishnu Sahasranama Contemplation - 455, 456 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻455. సువ్రతః, सुव्रतः, Suvrataḥ🌻*
*ఓం సువ్రతాయ నమః | ॐ सुव्रताय नमः | OM Suvratāya namaḥ*
సువ్రతః, सुव्रतः, Suvrataḥ
శోభనం వ్రతమస్యేతి సువ్రతో హరిరుచ్యతే ప్రపన్నులను రక్షించుట అను ఉత్తమమగు వ్రతనియమము, కర్మాచరణము ఈతనికి కలదు.
:: శ్రీమద్రామాయణే యుద్ధకాండే అష్టాదశః సర్గః ::
సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే ।
అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ ॥ 35 ॥
'నేను నీవాడను' అని పలుకుచు ఎవ్వరైనను ప్రపత్తితో నన్ను శరణుగోరినచో, వారికి రక్షించి అభయమిత్తును. ఇది నా వ్రతము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 455🌹*
📚. Prasad Bharadwaj
*🌻 455. Suvrataḥ 🌻*
*OM Suvratāya namaḥ*
Śobhanaṃ vratamasyeti suvrato harirucyate / शोभनं व्रतमस्येति सुव्रतो हरिरुच्यते One who has taken the magnanimous vow to save all refuge seekers.
Śrīmad Rāmāyaṇa - Book 6, Chapter 18
Sakrdeva prapannāya tavāsmīti ca yācate,
Abhayaṃ sarvabhūtebhyo dadāmyetadvrataṃ mama. 35.
:: श्रीमद्रामायणे युद्धकांडे अष्टादशः सर्गः ::
सकृदेव प्रपन्नाय तवास्मीति च याचते ।
अभयं सर्वभूतेभ्यो ददाम्येतद्व्रतं मम ॥ ३५ ॥
He who seeks refuge in me just once, telling me that 'I am yours', I shall give him assurance of safety against all types of beings. This is my solemn pledge
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सुव्रतस्सुमुखस्सूक्ष्मः सुघोषस्सुखदस्सुहृत् ।मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः ॥ ४९ ॥
సువ్రతస్సుముఖస్సూక్ష్మః సుఘోషస్సుఖదస్సుహృత్ ।మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః ॥ ౪౯ ॥
Suvratassumukhassūkṣmaḥ sughoṣassukhadassuhrt ।Manoharo jitakrodho vīrabāhurvidāraṇaḥ ॥ 49 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 456 / Vishnu Sahasranama Contemplation - 456🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻 456. సుముఖః, सुमुखः, Sumukhaḥ 🌻*
*ఓం సుముఖాయ నమః | ॐ सुमुखाय नमः | OM Sumukhāya namaḥ*
శోభనం ముఖ మస్యేతి సుముఖో హరిరుచ్యతే ఎందును ఏ వికారమును పొందక స్వభావ సుందరముగా ఒకే విధముగ శోభించు లోకహితకరమగు శోభన ముఖము కలవాడు.
'ప్రసన్న వదనం చారు పద్మపత్రాయతాక్షణమ్' (విష్ణు పురాణమ్ 6.7.80) ప్రసన్నమగు ముఖమును, సుందరములగు తామరపూరేకులవలె విశాలములగు నేత్రములు కలవాడు అని విష్ణు పురాణమున చెప్పబడినది.
:: శ్రీమద్రామాయణే, అయోధ్యాకాండే ఏకోనవింశస్సర్గః ::
న వనం గంతుకామస్య త్యజతశ్చ వసుంధరామ్ ।
సర్వలోకాతిగస్యేవ లక్ష్యతే చిత్తవిక్రియా ॥ 33 ॥
రాజ్యాధికారమును త్యజించుచు వనగమనమునకు సుముఖుడైయున్న శ్రీరామునకూ, జీవన్ముక్తుడైన యోగికి వలె ఎట్టి మనోవికారమూ కలుగలేదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 456🌹*
📚. Prasad Bharadwaj
*🌻 456. Sumukhaḥ 🌻*
*OM Sumukhāya namaḥ*
Śobhanaṃ mukha masyeti sumukho harirucyate / शोभनं मुख मस्येति सुमुखो हरिरुच्यते One with a pleasant face in any condition, favorable or otherwise.
Prasanna vadanaṃ cāru padmapatrāyatākṣaṇam / प्रसन्न वदनं चारु पद्मपत्रायताक्षणम् (Viṣṇu purāṇa 6.7.80) His face is pleasing and beautiful with large eyes resembling the lotus leaf.
Śrīmad Rāmāyaṇa, Book 2, Chapter 19
Na vanaṃ gaṃtukāmasya tyajataśca vasuṃdharām,
Sarvalokātigasyeva lakṣyate cittavikriyā. 33.
:: श्रीमद्रामायणे, अयोध्याकांडे एकोनविंशस्सर्गः ::
न वनं गंतुकामस्य त्यजतश्च वसुंधराम् ।
सर्वलोकातिगस्येव लक्ष्यते चित्तविक्रिया ॥ ३३ ॥
There was no agitation in the mind of Rāma, like an emancipated ascetic, when he was to be exiled to the forest relinquishing His kingdom.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
सुव्रतस्सुमुखस्सूक्ष्मः सुघोषस्सुखदस्सुहृत् ।मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः ॥ ४९ ॥
సువ్రతస్సుముఖస్సూక్ష్మః సుఘోషస్సుఖదస్సుహృత్ ।మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః ॥ ౪౯ ॥
Suvratassumukhassūkṣmaḥ sughoṣassukhadassuhrt ।Manoharo jitakrodho vīrabāhurvidāraṇaḥ ॥ 49 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 141 🌹*
*🍀 📖 The Philosophy of Life 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 20. The Vedanta Follows the Purely Spiritual Approach 🌻*
The way of the Rigveda and the earlier Upanishads is purely intuitional. Seers entered into the heart of Reality in intense concentration of mind, in meditation, ecstasy, rapture and attunement, and proclaimed to the world in their simple language and powerful style that nature is, in truth, one.
The Nyaya, Vaiseshika, Sankhya and Mimamsa philosophies bolstered up a thoroughly realistic method of the analysis of experience. The Yoga system pursued the psychological techniques of inner discipline, while the Vedanta followed the purely spiritual approach to life, backing it up with a rigorous logical scrutiny and examination of experience.
But, all these Indian systems have one thing in common: to them all, philosophy is an intensely practical affair, the art of wise living, the way of the attainment of salvation and freedom of the self. The method of philosophy in general is not to study things piecemeal, as physical science does, but to make a comprehensive study of the totality of experience provided to us through all avenues of knowledge.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. Daily satsang Wisdom 🌹
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. దేవాపి మహర్షి బోధనలు - 115 🌹*
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻 93. వైద్య మతములు -1 🌻*
వైద్యము నందు వివిధ సిద్ధాంతములున్నవి. ఎవరి సిద్ధాంతము వారిది. ఒకరి సిద్ధాంతమొకరు ఒప్పుకొనరు. వారి సిద్ధాంతమే గొప్పదనుభావము, అందరి వైద్యుల యందు కన్పట్టుచున్నది. వైద్య సిద్ధాంతములకు, మత సిద్ధాంతములకు పెద్ద వ్యత్యాసమున్నట్లుగ గోచరించదు. దైవమును గూర్చిమతము లున్నట్లే వైద్యమును గూర్చి కూడ మతములున్నవి. ఇతర మతములు, తమ మతముతో సరి కావని ఎట్లు మతాధిపతులు భావింతురో, అట్లే వైద్యాధికారులు కూడను.
కొందరు హోమియో వైద్యము గొప్పదందురు. మరికొందరది అశాస్త్రీయ మందురు. కొందరు అలోపతి, శాస్త్రీయము గనుక గొప్పదందురు. అదియును అశాస్త్రీయమే మరియు విషపూరితము కూడ అని కొందరందురు. ఇంకొందరు ఆయుర్వేదమద్భుత మందురు. మరికొందరు ఆయుర్వేద శాస్త్రమునకు ప్రామాణికమగు సిద్ధాంతములు యందు వ్యత్యాసముందందురు.
ఒక కుటుంబము నందు నిర్వర్తింపబడు ఆయుర్వేదమునకు మరియొక కుటుంబము నందు నిర్వర్తింపబడు ఆయుర్వేదమునకు అవగాహనలో బేధముందందురు. వివిధ ప్రాంతములందు వివిధమగు అవగాహనలతో కూడి తామరతంపర వలె అంతుపట్టక నుండునది ఆయుర్వేద మని కొందరి భావము. మరికొందరు ప్రకృతి చికిత్స అన్నిటికన్న ఉత్తమమైన దందురు. అట్లే చీనీవైద్యము, యునాని వైద్యము, నాటు వైద్యము (పసరు వైద్యము) మొదలైనవెన్నియో వైద్య విధానములున్నవి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 47 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀. లొంగి పోవడమన్నది ఆహానికి విషంలాంటిది. కాబట్టి లొంగిపోవడం మీద దృష్టి పెట్టు. సమర్పణ మీద దృష్టి పెట్టు. 🍀*
నువ్వు ఘర్షించినపుడే అహం వునికిలో వుంటుంది. లొంగి పోవడమన్నది ఆహానికి విషంలాంటిది. కాబట్టి లొంగిపోవడం మీద దృష్టి పెట్టు. సమర్పణ మీద దృష్టి పెట్టు. ఘర్షణే ఆహారం. లొంగిపోవడమే విషం. అహం చనిపోవాలి. అపుడే నువ్వు జన్మిస్తావు. ఒక ఒరలో రెండు కత్తులు! నువ్వు లోపల వుంటే ఇగో బయటికొస్తుంది. లేదా అహం లోపల వుంటే నువ్వు బయటికొస్తావు. అజ్ఞాతంలో వుంటావు. లక్షలమంది అలా అజ్ఞాతంలో జీవిస్తూ వుంటే అహం సింహాసనాన్నధిరోహిస్తోంది.
అహం అదృశ్యమయితే నువ్వు సహజ స్థితిలోకి వచ్చి రంగంలో వుంటావు. నీ జీవితం అస్తిత్వం చేతిలో ఉపకరణ మవుతుంది. దాని పెదాలతో పిల్లగ్రోవి అవుతుంది. నువ్వు బోలుగా వుంటే నీ గుండా అది పాటలు పాడుతుంది. అది పాడాలనుకోనపుడు అక్కడ సౌంధర్యభరితమైన నిశ్శబ్దం నిండి వుంటుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 291 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 291 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 69. పురుషార్థప్రదా, పూర్ణా, భోగినీ, భువనేశ్వరీ ।*
*అంబికా,ఽనాది నిధనా, హరిబ్రహ్మేంద్ర సేవితా ॥ 69 ॥ 🍀*
*🌻 291-2. 'పురుషార్థప్రదా' 🌻*
అర్థకామములను నిర్వర్తించుటలో ధర్మము ననుసరించు వారు, అనుసరించనివారు కూడ నుందురు. ఇందరును కలిసి జీవించుటలో ఘర్షణలు కూడ యుండును. అన్నియునూ జీవునికి అనుభవము నందించుటకే. అన్ని అనుభవములూ పరిపూర్ణమైనపుడు జీవునికి పరిపూర్ణత్వము లభించును.
కావున శ్రీమాత సృష్టి విధానమున ఆమె కోరినవారికి కోరునది ప్రసాదించును. కోరుటలోని తప్పు ఒప్పులతో ఆమెకు సంబంధము లేదు. తప్పుల వలన కూడ ఫలితముల ద్వారా జీవులు నేర్చుకొనుచునే యుందురు. మహాత్ములైన వారు కూడ ప్రాథమిక దశలో తప్పులు చేసినవారే. శ్రీమాతకు అందరూ తన పిల్లలే. ఎవరెవరు ఏ విధముగ నేర్వవలెనో వారి వారి కట్లే నేర్చుచు నుండును.
కావుననే కోరికలు కోరువారికి కోరికలు తీర్చుట, ధనార్జనమున నిమగ్నమైనవారి ప్రార్థనలను మన్నించి ధనవంతులను చేయుట, ధర్మము నర్థించువారికి సత్పురుషుల ద్వారా ధర్మమును నేర్పుట, శిక్షణ నిచ్చుట, ఇత్యాదులన్నీ శ్రీమాతయే చేయుచున్నది. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు కూడ ఇదే విధముగ పలుకును. ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు, తనను గూర్చిన అన్వేషణలో జన్మ పరంపరలను సాగించు చున్నారని తెలిపెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 291 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🍀 69. puruṣārthapradā pūrṇā bhoginī bhuvaneśvarī |*
*ambikā'nādi-nidhanā haribrahmendra-sevitā || 69 || 🍀*
*🌻 Puruṣārtha-pradā पुरुषार्थ-प्रदा (291) 🌻*
Puruṣārtha is the fourfold values of human life. They are dharma (righteousness or virtues), artha (wish or purpose), kāma (desires and pleasures) and mokṣa (the liberation). It is clear that the ancient scriptures do not prohibit these great human values. What they say is not to get attached to them. On many occasions this concept is misquoted. She is the giver of this puruṣārtha.
There is another interpretation. Puruṣā means Śiva (Śaktī is prakṛti), artha means salvation and prada means giver. Śiva gives salvation through Śaktī. The importance of Śaktī is emphasized or probably the interdependence of Śiva and Śaktī is cited through this nāma.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹