శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 329 / Sri Lalitha Chaitanya Vijnanam - 329
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 329 / Sri Lalitha Chaitanya Vijnanam - 329 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 74. కళావతీ, కళాలాపా, కాంతా, కాదంబరీప్రియా ।
వరదా, వామనయనా, వారుణీమదవిహ్వలా ॥ 74 ॥ 🍀
🌻 329. 'కాంతా' 🌻
'కాంతా' అనగా స్త్రీ, అందమైన స్త్రీ అని అర్థము. సృష్టి యందు సౌందర్య మంతయూ శ్రీమాత సౌందర్యమే. పరతత్త్వమునకు ఏ లక్షణమూ లేదు. అది రూపమునకు కూడ అతీతమే. సంకల్పము అతని ప్రథమ రూపము. సంకల్పమే అతని నుండి భాసించినపుడు వెలుగై నిలచును. అటుపిమ్మట ఆ వెలుగు నుండి అన్ని రూపములు స్థూలము వఱకు ఏర్పడుచున్నవి. ఈ సమస్త రూపము లలో కమనీయరూపములుగ శ్రీమాత అవతరించు చున్నది. అన్నియూ శ్రీమాత రూపములే అయిననూ అందు కమనీయమగు రూపముగ ఆమె అధికముగ అవతరించి యున్నది. రూపముయొక్క కమనీయత్వమును బట్టియే జీవులు ఆకర్షింపబడు చుందురు.
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అట్టి రూపములు గలవారు. వారి రూప కమనీయత ఎందరినో ఆకర్షించి యుద్ధరించినది. వారియందు పరిపూర్ణముగ శ్రీమాత స్థితిగొనుట వలననే అట్టి నిరుపమానమగు ఆకర్షణము అన్ని జీవులకు కలిగినది. శ్రీమాతయే జగన్మోహినీ. మోహనరూపము ఉద్ధారణమునకు, పతనమునకు కూడ శ్రీమాత వినియోగించు చుండును. రాముని మోహనరూపమును చూచి ఎందరో తరింపగ, రాక్షస ప్రవృత్తి గల శూర్పణఖ రాక్షస వినాశనమునకు కారణమైనది. అట్లే సీత రూపమును మోహించిన రావణుడు కూడ పతనము చెందెను.
మోహమును జీవుల అవరోహణమునకు, ఆరోహణమునకు కూడ శ్రీమాత లీలాప్రాయముగ వినియోగించును. శ్రీమాత కాంతా రూపము. సత్పురుషులను, సదాచార సంపన్నులగు స్త్రీలను ఆశ్రయించి కూడ వుండును. అట్లే కొన్ని పర్వతములను, కొన్ని వృక్షములను, కొన్ని పక్షులను, కొన్ని జంతువులను, కొన్ని వస్తువులను ఆశ్రయించి దర్శనము యిచ్చుచుండును. కః అంత, కాంతకు నిర్వచనము. 'కః' అనగా బ్రహ్మ. 'అంతః' అనగా అతని లోపల వసించునది. బ్రహ్మము లోపల నుండి వ్యక్తమై చతుర్ముఖ బ్రహ్మను, ఇతర సృష్టి జీవులను నడిపించునది శ్రీమాతయే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 329 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 74. Kalavati kalalapa kanta kadanbari priya
Varada vamanayana varunimadavihvala ॥ 74 ॥ 🌻
🌻 329. Kāntā कान्ता (329) 🌻
She is beautiful. Nāma 324 discussed about vibration of Her auspiciousness. This nāma says that Her beauty is vibrating and radiating. This is with regard to Her gross form. This nāma also talks about Her Brahman form. Ka means the Brahman and antā means the ultimate. Therefore kāntā also means the Supreme Brahman, the Ultimate (refer nāma 325).
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
16 Dec 2021
నిర్మల ధ్యానాలు - ఓషో - 110
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 110 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ధ్యానం చేసేటపుడు ఫలితం గురించి పట్టించుకోకు. ఎదురు చూడకు. అది దాని సమయంలో వస్తుంది. నమ్ము! ధ్యానం ధ్యానం కోసమని ఆనందించు. ఎట్లాంటి అత్యుత్సాహాన్ని ప్రదర్శించకు. ధ్యానానికి ముఖ్యంగా వుండాల్సిన సహజ లక్షణం సహనం. తొందర పడకూడదు. అప్పుడు హఠాత్తుగా అద్భుతం జరుగుతుంది. 🍀
ధ్యానంలో ప్రవేశించడానికి ముఖ్యంగా వుండాల్సిన సహజ లక్షణం సహనం. తొందర పడకూడదు. తొందరపడే కొద్దీ మరింత దూరమవుతుంది. శాశ్వతంగా ఎదురు చూడ్డానికి మనిషి సిద్ధపడాలి. ప్రేమతో, నమ్మకంతో ఎదురు చూడాలి హఠాత్తుగా జరగవచ్చు. నువ్వు ఎంత సహనంతో, ఓర్పుతో వున్నావన్న దానిమీద అది ఆధారపడి వుంటుంది. ఐతే ఒక విషయం గుర్తుంచుకో. ధ్యానం చేసేటపుడు ఫలితం గురించి పట్టించుకోకు. ఎదురుచూడకు. అది దాని సమయంలో వస్తుంది. నమ్ము! ధ్యానం ధ్యానం కోసమని ఆనందించు. దాన్ని గురించి అసూయపడకు. ఎట్లాంటి అత్యుత్సాహాన్ని ప్రదర్శించకు. ధ్యానాన్ని ఆరంభంగా చూడకు. అంతంగా చూడు. అప్పుడు హఠాత్తుగా అద్భుతం జరుగుతుంది. అది నీ సమస్త అస్తిత్వాన్ని మారుస్తుంది.
పరివర్తన అన్నది సులభం. సహనంగా వుండడమన్న కళను వ్యక్తి తెలుసుకోవాలి. మానవజాతి మరచిపోయిన విషయమదే. ప్రతి ఒక్కరూ పనులు త్వరత్వరగా కావాలని చూస్తారు. నిజానికి ఎవరూ ఎదురుచూడరు. అందుకనే అన్ని మతాల్లో ఈ క్షణ ప్రయోజనాలకి సంబంధించి దురభిప్రాయాలేర్పడ్డాయి. మోసగించడాలు ఎక్కువయ్యాయి. నేను సహనాన్ని బోధిస్తాను. కేవలం సహనంగా వుండమంటాను. అప్పుడు నిజంగా అనుకున్నది జరుగుతుంది. అదే పారడాక్స్! సత్యానికి సంబంధించిన ఏదైనా విరోధాభాసమే. ఎందుకంటే సత్యం తన వ్యతిరేకతని కూడా తనలో కలుపుకుంటుంది!
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
16 Dec 2021
మైత్రేయ మహర్షి బోధనలు - 43
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 43 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 31. సద్భావము 🌻
భావనల యందు కురుచతనము తగదు. ఉత్తమ భావములే ఉత్తమ మానవుని తయారు చేయగలవు. సంకుచిత భావములు గలవారిని మేము మరుగుజ్జులందుము. మరుగుజ్జులకు చీమల పుట్టలే మహాపర్వతములై అవరోధములు కల్పింప గలవు. ఉత్తమ భావములను మనస్సుయందు సదా నిలుపుకొనుట వలన మనస్సు, బుద్ధియును కూడా దైవీ ప్రజ్ఞకు అందుబాటులో నుండగలవు. మనస్సు - తుచ్ఛము, నీచము, సంకుచితమైన భావములయందు చిక్కుబడినపుడు, ప్రయత్నించి సాధకుడు ఉత్తమ సంగీతమును గానీ, భక్తి ప్రధానమైన కీర్తనలను గానీ, మహాత్ముల ప్రబోధములనుగానీ వినవలెను.
మనస్సు నాకర్షించునట్టి భాగవత, రామాయణాది గ్రంథములను కానీ, సూక్తములను కానీ, సుభాషితములను కానీ పారాయణము చేయవలెను. అట్టి ప్రయత్నమున మాత్రమే మనస్సు చీకటి భావములనుండి బయల్పడి, వెలుగును సంతరించు కొనగలదు. పై సద్భావములయందు విముఖత కలిగిననాడు, సాధకుడు తనను తానుద్దరించు కొను కార్యక్రమమున విఫలుడగును. అతనిని ఎవరునూ రక్షింపలేరు. పై తెలిపిన ప్రయత్నమున మాత్రమే వారు మరల హృదయస్థులై వికసించ గలరు. అట్టి వారికే జీవన వైభవము. అట్టి రుచి లేనివారు మరుగుజ్జులై విభూతి లేక యుందురు.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
16 Dec 2021
విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 526 / Vishnu Sahasranama Contemplation - 526
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 526 / Vishnu Sahasranama Contemplation - 526🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 526. ఆనన్దః, आनन्दः, Ānandaḥ 🌻
ఓం ఆనన్దాయ నమః | ॐ आनन्दाय नमः | OM Ānandāya namaḥ
ఆనన్దః, आनन्दः, Ānandaḥ
ఆనన్దోఽస్య స్వరూప మిత్యానన్ద ఇతి కీర్త్యతేః ।
యే తస్యేత్యాది బృహదారణ్యక శ్రుతి వాక్యతః ॥
ఆనందమే తన స్వరూపముగా కలవాడు గనుక ఆనన్దః.
:: బృహదారణ్యకోపనిషత్ - షష్ఠాధ్యాయః, తృతీయం బ్రాహ్మణమ్ ::
సలిల ఏకో ద్రష్టాఽద్వైతో భవ త్యేష బ్రహ్మలోకః స మ్రాడితి హైన మనుశశాన యాజ్ఞవల్క్య ఏషాస్య పరమా గతి రేషాస్యపరమా సమ్పదేషోఽస్య పరమోలోక ఏషోఽస్య పరమ ఆనన్ద ఏతస్యైవా నన్ద స్యాన్యాని భూతాని మాత్రా ముపజీవన్తి (32)
ఆత్మ స్వచ్ఛమైన ఉదకము. ఉదకమునందువలెనే, సుషుప్తియందు రెండవ వస్తువులేనిది. దేహేంద్రియోపాధి భేదములేని ఈ ఆత్మ, ఈ సుషుప్తి కాలము నందు స్వకీయమైన ఆత్మ తేజస్సునందున్నది. ఈ ఆత్మ బ్రహ్మస్వరూపమైన లోకము.
ఈ విధముగా యాజ్ఞవల్క్య ఋషి జనకమహారాజునకు బోధించెను. ఈ విజ్ఞానమయాత్మకు ఇది శ్రేష్ఠమైన స్థానము మరియూ శ్రేష్ఠమైన సంపత్తు. ఇదియే శ్రేష్ఠమైన లోకము. ఇదియే శ్రేష్ఠమైన ఆనందము. ఇతర భూతములు ఈ ఆనందము యొక్క అంశమును అనుసరించి జీవించుచున్నవి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 526🌹
📚. Prasad Bharadwaj
🌻526. Ānandaḥ🌻
OM Ānandāya namaḥ
आनन्दोऽस्य स्वरूप मित्यानन्द इति कीर्त्यतेः ।
ये तस्येत्यादि बृहदारण्यक श्रुति वाक्यतः ॥
Ānando’sya svarūpa mityānanda iti kīrtyateḥ,
Ye tasyetyādi brhadāraṇyaka śruti vākyataḥ.
His form or nature is Ānanda or bliss and hence He is Ānandaḥ.
:: बृहदारण्यकोपनिषत् - षष्ठाध्यायः, तृतीयं ब्राह्मणम् ::
सलिल एको द्रष्टाऽद्वैतो भव त्येष ब्रह्मलोकः स म्राडिति हैन मनुशशान याज्ञवल्क्य एषास्य परमा गति रेषास्यपरमा सम्पदेषोऽस्य परमोलोक एषोऽस्य परम आनन्द एतस्यैवा नन्द स्यान्यानि भूतानि मात्रा मुपजीवन्ति (३२)
Brhadāraṇyaka Upaniṣat - Section 6, Chapter 3
Salila eko draṣṭā’dvaito bhava tyeṣa brahmalokaḥ sa mrāḍiti haina manuśaśāna yājñavalkya eṣāsya paramā gati reṣāsyaparamā sampadeṣo’sya paramoloka eṣo’sya parama ānanda etasyaivā nanda syānyāni bhūtāni mātrā mupajīvanti (32)
It becomes transparent like water, one, the witness and without a second. This is the world or state of Brahman, O Emperor.
Thus did Yājñavalkya instructs Janaka: This is its supreme attainment, this is its supreme glory, this is its highest world, this is its supreme bliss. One a particle of this very bliss, other being live.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अजो महार्हस्स्वाभाव्यो जितामित्रः प्रमोदनः ।आनन्दो नन्दनोऽनन्दस्सत्यधर्मा त्रिविक्रमः ॥ ५६ ॥
అజో మహార్హస్స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।ఆనన్దో నన్దనోఽనన్దస్సత్యధర్మా త్రివిక్రమః ॥ 56 ॥
Ajo mahārhassvābhāvyo jitāmitraḥ pramodanaḥ,Ānando nandano’nandassatyadharmā trivikramaḥ ॥ 56 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
16 Dec 2021
16-DECEMBER-2021 గురువారం MESSAGES
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 16, డిసెంబర్ 2021 గురువారం, బృహస్పతి వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 129 / Bhagavad-Gita - 129 3-10🌹*
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 526 / Vishnu Sahasranama Contemplation - 526 🌹
4) 🌹 DAILY WISDOM - 204🌹
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 43 🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 110🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 329 / Sri Lalitha Chaitanya Vijnanam - 329 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ గురువారం మిత్రులందరికీ 🌹*
*బృహస్పతి వాసరే, 16, డిసెంబర్ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. శ్రీ రాధాకృష్ణాష్టకం -3 🍀*
*యం దృష్ట్వా కంసభూపః స్వకృతకృతిమహో*
*సంస్మరన్మంత్రివర్యాన్ కిం వా పూర్వం మయేదం*
*కృతమితి వచనం దుఃఖితః ప్రత్యువాచ |*
*ఆజ్ఞప్తో నారదేన స్మితయుతవదనః పూరయన్సర్వకామాన్*
*కృష్ణో రాధాసమేతో విలసతు హృదయే సోఽస్మదీయే సదైవ || 2 ||*
🌻 🌻 🌻 🌻 🌻
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, హేమంత ఋతువు,
మృగశిర మాసం
తిథి: శుక్ల త్రయోదశి 28:42:20
వరకు తదుపరి శుక్ల చతుర్దశి
నక్షత్రం: భరణి 07:35:56 వరకు
తదుపరి కృత్తిక
యోగం: శివ 07:17:39 వరకు
తదుపరి సిధ్ధ
కరణం: కౌలవ 15:21:12 వరకు
వర్జ్యం: 21:08:00 - 22:56:24
దుర్ముహూర్తం: 10:20:37 - 11:05:01
మరియు 14:47:00 - 15:31:23
రాహు కాలం: 13:34:51 - 14:58:06
గుళిక కాలం: 09:25:07 - 10:48:22
యమ గండం: 06:38:38 - 08:01:53
అభిజిత్ ముహూర్తం: 11:49 - 12:33
అమృత కాలం: 02:12:12 - 03:59:48
సూర్యోదయం: 06:38:38
సూర్యాస్తమయం: 17:44:35
వైదిక సూర్యోదయం: 06:42:32
వైదిక సూర్యాస్తమయం: 17:40:41
చంద్రోదయం: 15:41:59
చంద్రాస్తమయం: 04:05:32
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: మేషం
పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి
07:35:56 వరకు తదుపరి లంబ
యోగం - చికాకులు, అపశకునం
పండుగలు : కన్నడ హనుమాన్ జయంతి,
ధను సంక్రాంతి,
Hanuman Jayanti Kannada,
Dhanu Sankranti,
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత -129 / Bhagavad-Gita - 129 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 10 🌴*
*సహజయజ్ఞా: ప్రజా: సృష్ట్వా పురోవాచ ప్రజాపతి: |*
*అనేన ప్రసవిష్యధ్వమేష వోస్త్విష్టకామధుక్ ||*
🌷. తాత్పర్యం :
*సృష్ట్యారంభమున సర్వజీవులకు ప్రభువైన భగవానుడు మానవులకు మరియు దేవతలకు విష్ణుప్రీత్యర్థమైన యజ్నములతో సహా సృష్టించి “ ఈ యజ్ఞములచే మీరు సౌఖ్యవంతులు కండు. ఏలయన వీని ఆచరణము మీ సుఖజీవనమునకు మరియు ముక్తికి కావలసిన సర్వమును ఒసంగును” అని ఆశీర్వదించెను.*
🌷. భాష్యము :
సర్వజీవుల ప్రభువైన విష్ణువుచే సృష్టింపబడిన భౌతికజగత్తు బద్ధజీవులు భగవద్దామము తిరిగి చేరుటకు ఒసగాబడిన ఒక అవకాశము వంటిది. దేవదేవుడైన శ్రీకృష్ణునితో గల సంబంధమును మరచుట చేతనే ఈ జగమునందు జీవులందరును భౌతికప్రకృతిచే బద్దులగుచున్నారు. అట్టి నిత్యసంబంధమును జీవులు తెలిసికొనుటకు వేదము సహాయపడును. “వేదైశ్చ సర్వైరహమేవవేద్య:” అని ఈ విషయమునే భగవద్గీత తెలియజేయుచున్నది.
తన నెరుగుటయే వేదముల ఉద్దేశ్యమని శ్రీకృష్ణభగవానుడు తెలిపియున్నాడు. “పతిం విశ్వస్యాత్మేశ్వరం” అని వేదంమంత్రములందు తెలుపబడినది. అనగా జీవులకు ప్రభువు దేవదేవుడైన విష్ణువు. శ్రీమద్భాగవతమునందు కూడా శ్రీల శుకదేవగోస్వామి భగవానుడే పతి యని పలు విధములుగా వర్ణించి యున్నారు. (2.4.20)
శ్రియ: పతి ర్యజ్ఞపతి: ప్రజాపతి ర్దియాం పతిర్లోకపతిర్ధరాపతి: |
పతిర్గతి శ్చాన్ధకవృష్టిసాత్వతాం ప్రసీదతాం మే భగవాన్ సతాం పతి: ||
భగవానుడైన విష్ణువే ప్రజాపతి. అతడే సమస్త జీవులకు, సమస్త లోకములకు, సమస్త సౌందర్యములకు పతియై యున్నాడు. సర్వులకు అతడే రక్షకుడు. విష్ణుప్రీత్యర్తమై ఏ విధముగా యజ్ఞములను నిర్వహింపవలెనో బద్ధజీవులు నేర్చుట కొరకే అతడు ఈ భౌతికజగత్తును సృష్టించెను. తద్ద్వారా వారు ఈ జగత్తునందున్నంతవరకు ఎటువంటి కలతలు లేకుండా సుఖముగా జీవించి, దేహత్యాగము పిమ్మట భగవద్ధామమును చేరగలరు. బద్ధజీవుల కొరకై ఏర్పాటు చేయబడిన కార్యమమిదియే. యజ్ఞనిర్వాహణము ద్వారా బద్ధజీవులు క్రమముగా కృష్ణభక్తిరసభావితులై అన్నివిధముల దివ్యులగుదురు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 117 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 3 - Karma Yoga - 10 🌴*
*saha-yajñāḥ prajāḥ sṛṣṭvā purovāca prajāpatiḥ*
*anena prasaviṣyadhvam eṣa vo ’stv iṣṭa-kāma-dhuk*
🌷Translation :
*In the beginning of creation, the Lord of all creatures sent forth generations of men and demigods, along with sacrifices for Viṣṇu, and blessed them by saying, “Be thou happy by this yajña [sacrifice] because its performance will bestow upon you everything desirable for living happily and achieving liberation.”*
🌷 Purport :
The material creation by the Lord of creatures (Viṣṇu) is a chance offered to the conditioned souls to come back home – back to Godhead. All living entities within the material creation are conditioned by material nature because of their forgetfulness of their relationship to Viṣṇu, or Kṛṣṇa, the Supreme Personality of Godhead. The Vedic principles are to help us understand this eternal relation, as it is stated in the Bhagavad-gītā: vedaiś ca sarvair aham eva vedyaḥ.
The Lord says that the purpose of the Vedas is to understand Him. In the Vedic hymns it is said: patiṁ viśvasyātmeśvaram. Therefore, the Lord of the living entities is the Supreme Personality of Godhead, Viṣṇu. In the Śrīmad-Bhāgavatam also (2.4.20) Śrīla Śukadeva Gosvāmī describes the Lord as pati in so many ways:
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 526 / Vishnu Sahasranama Contemplation - 526🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻 526. ఆనన్దః, आनन्दः, Ānandaḥ 🌻*
*ఓం ఆనన్దాయ నమః | ॐ आनन्दाय नमः | OM Ānandāya namaḥ*
*ఆనన్దః, आनन्दः, Ānandaḥ*
*ఆనన్దోఽస్య స్వరూప మిత్యానన్ద ఇతి కీర్త్యతేః ।*
*యే తస్యేత్యాది బృహదారణ్యక శ్రుతి వాక్యతః ॥*
*ఆనందమే తన స్వరూపముగా కలవాడు గనుక ఆనన్దః.*
:: బృహదారణ్యకోపనిషత్ - షష్ఠాధ్యాయః, తృతీయం బ్రాహ్మణమ్ ::
సలిల ఏకో ద్రష్టాఽద్వైతో భవ త్యేష బ్రహ్మలోకః స మ్రాడితి హైన మనుశశాన యాజ్ఞవల్క్య ఏషాస్య పరమా గతి రేషాస్యపరమా సమ్పదేషోఽస్య పరమోలోక ఏషోఽస్య పరమ ఆనన్ద ఏతస్యైవా నన్ద స్యాన్యాని భూతాని మాత్రా ముపజీవన్తి (32)
*ఆత్మ స్వచ్ఛమైన ఉదకము. ఉదకమునందువలెనే, సుషుప్తియందు రెండవ వస్తువులేనిది. దేహేంద్రియోపాధి భేదములేని ఈ ఆత్మ, ఈ సుషుప్తి కాలము నందు స్వకీయమైన ఆత్మ తేజస్సునందున్నది. ఈ ఆత్మ బ్రహ్మస్వరూపమైన లోకము.*
*ఈ విధముగా యాజ్ఞవల్క్య ఋషి జనకమహారాజునకు బోధించెను. ఈ విజ్ఞానమయాత్మకు ఇది శ్రేష్ఠమైన స్థానము మరియూ శ్రేష్ఠమైన సంపత్తు. ఇదియే శ్రేష్ఠమైన లోకము. ఇదియే శ్రేష్ఠమైన ఆనందము. ఇతర భూతములు ఈ ఆనందము యొక్క అంశమును అనుసరించి జీవించుచున్నవి.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 526🌹*
📚. Prasad Bharadwaj
*🌻526. Ānandaḥ🌻*
*OM Ānandāya namaḥ*
आनन्दोऽस्य स्वरूप मित्यानन्द इति कीर्त्यतेः ।
ये तस्येत्यादि बृहदारण्यक श्रुति वाक्यतः ॥
*Ānando’sya svarūpa mityānanda iti kīrtyateḥ,*
*Ye tasyetyādi brhadāraṇyaka śruti vākyataḥ.*
*His form or nature is Ānanda or bliss and hence He is Ānandaḥ.*
:: बृहदारण्यकोपनिषत् - षष्ठाध्यायः, तृतीयं ब्राह्मणम् ::
सलिल एको द्रष्टाऽद्वैतो भव त्येष ब्रह्मलोकः स म्राडिति हैन मनुशशान याज्ञवल्क्य एषास्य परमा गति रेषास्यपरमा सम्पदेषोऽस्य परमोलोक एषोऽस्य परम आनन्द एतस्यैवा नन्द स्यान्यानि भूतानि मात्रा मुपजीवन्ति (३२)
Brhadāraṇyaka Upaniṣat - Section 6, Chapter 3
Salila eko draṣṭā’dvaito bhava tyeṣa brahmalokaḥ sa mrāḍiti haina manuśaśāna yājñavalkya eṣāsya paramā gati reṣāsyaparamā sampadeṣo’sya paramoloka eṣo’sya parama ānanda etasyaivā nanda syānyāni bhūtāni mātrā mupajīvanti (32)
*It becomes transparent like water, one, the witness and without a second. This is the world or state of Brahman, O Emperor.*
*Thus did Yājñavalkya instructs Janaka: This is its supreme attainment, this is its supreme glory, this is its highest world, this is its supreme bliss. One a particle of this very bliss, other being live.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अजो महार्हस्स्वाभाव्यो जितामित्रः प्रमोदनः ।आनन्दो नन्दनोऽनन्दस्सत्यधर्मा त्रिविक्रमः ॥ ५६ ॥
అజో మహార్హస్స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।ఆనన్దో నన్దనోఽనన్దస్సత్యధర్మా త్రివిక్రమః ॥ 56 ॥
Ajo mahārhassvābhāvyo jitāmitraḥ pramodanaḥ,Ānando nandano’nandassatyadharmā trivikramaḥ ॥ 56 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 204 🌹*
*🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*
*🌻 22. Conformity to Reality is Dharma 🌻*
*Conformity to reality is dharma, and anything opposed to it is adharma. The principle of reality is what determines the nature of dharma or virtue, goodness or righteousness, or rectitude in action, conduct, behaviour, thought and feeling. So a person who does not have a correct idea of what reality is cannot be really virtuous or righteous. Our social forms of goodness and virtue, rectitude and legality are relative to the conditions in which we are placed, and inasmuch as they have no reference to the ultimate reality of things, we have to go on changing our colours like chameleons from day to day.*
*But there can be harmony between the relative forms of dharma and the ultimate form of it. Our daily conduct may vary according to the needs of the hour. Seasons, social circumstances, the state of one's health and various other requirements of the time may demand a relative expression of conformity, all which has to be in harmony, finally, with a principle motive which cannot change.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. Daily satsang Wisdom 🌹
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 43 🌹*
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻 31. సద్భావము 🌻*
*భావనల యందు కురుచతనము తగదు. ఉత్తమ భావములే ఉత్తమ మానవుని తయారు చేయగలవు. సంకుచిత భావములు గలవారిని మేము మరుగుజ్జులందుము. మరుగుజ్జులకు చీమల పుట్టలే మహాపర్వతములై అవరోధములు కల్పింప గలవు. ఉత్తమ భావములను మనస్సుయందు సదా నిలుపుకొనుట వలన మనస్సు, బుద్ధియును కూడా దైవీ ప్రజ్ఞకు అందుబాటులో నుండగలవు. మనస్సు - తుచ్ఛము, నీచము, సంకుచితమైన భావములయందు చిక్కుబడినపుడు, ప్రయత్నించి సాధకుడు ఉత్తమ సంగీతమును గానీ, భక్తి ప్రధానమైన కీర్తనలను గానీ, మహాత్ముల ప్రబోధములనుగానీ వినవలెను.*
*మనస్సు నాకర్షించునట్టి భాగవత, రామాయణాది గ్రంథములను కానీ, సూక్తములను కానీ, సుభాషితములను కానీ పారాయణము చేయవలెను. అట్టి ప్రయత్నమున మాత్రమే మనస్సు చీకటి భావములనుండి బయల్పడి, వెలుగును సంతరించు కొనగలదు. పై సద్భావములయందు విముఖత కలిగిననాడు, సాధకుడు తనను తానుద్దరించు కొను కార్యక్రమమున విఫలుడగును. అతనిని ఎవరునూ రక్షింపలేరు. పై తెలిపిన ప్రయత్నమున మాత్రమే వారు మరల హృదయస్థులై వికసించ గలరు. అట్టి వారికే జీవన వైభవము. అట్టి రుచి లేనివారు మరుగుజ్జులై విభూతి లేక యుందురు.*
*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 110 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. ధ్యానం చేసేటపుడు ఫలితం గురించి పట్టించుకోకు. ఎదురు చూడకు. అది దాని సమయంలో వస్తుంది. నమ్ము! ధ్యానం ధ్యానం కోసమని ఆనందించు. ఎట్లాంటి అత్యుత్సాహాన్ని ప్రదర్శించకు. ధ్యానానికి ముఖ్యంగా వుండాల్సిన సహజ లక్షణం సహనం. తొందర పడకూడదు. అప్పుడు హఠాత్తుగా అద్భుతం జరుగుతుంది. 🍀*
*ధ్యానంలో ప్రవేశించడానికి ముఖ్యంగా వుండాల్సిన సహజ లక్షణం సహనం. తొందర పడకూడదు. తొందరపడే కొద్దీ మరింత దూరమవుతుంది. శాశ్వతంగా ఎదురు చూడ్డానికి మనిషి సిద్ధపడాలి. ప్రేమతో, నమ్మకంతో ఎదురు చూడాలి హఠాత్తుగా జరగవచ్చు. నువ్వు ఎంత సహనంతో, ఓర్పుతో వున్నావన్న దానిమీద అది ఆధారపడి వుంటుంది. ఐతే ఒక విషయం గుర్తుంచుకో. ధ్యానం చేసేటపుడు ఫలితం గురించి పట్టించుకోకు. ఎదురుచూడకు. అది దాని సమయంలో వస్తుంది. నమ్ము! ధ్యానం ధ్యానం కోసమని ఆనందించు. దాన్ని గురించి అసూయపడకు. ఎట్లాంటి అత్యుత్సాహాన్ని ప్రదర్శించకు. ధ్యానాన్ని ఆరంభంగా చూడకు. అంతంగా చూడు. అప్పుడు హఠాత్తుగా అద్భుతం జరుగుతుంది. అది నీ సమస్త అస్తిత్వాన్ని మారుస్తుంది.*
*పరివర్తన అన్నది సులభం. సహనంగా వుండడమన్న కళను వ్యక్తి తెలుసుకోవాలి. మానవజాతి మరచిపోయిన విషయమదే. ప్రతి ఒక్కరూ పనులు త్వరత్వరగా కావాలని చూస్తారు. నిజానికి ఎవరూ ఎదురుచూడరు. అందుకనే అన్ని మతాల్లో ఈ క్షణ ప్రయోజనాలకి సంబంధించి దురభిప్రాయాలేర్పడ్డాయి. మోసగించడాలు ఎక్కువయ్యాయి. నేను సహనాన్ని బోధిస్తాను. కేవలం సహనంగా వుండమంటాను. అప్పుడు నిజంగా అనుకున్నది జరుగుతుంది. అదే పారడాక్స్! సత్యానికి సంబంధించిన ఏదైనా విరోధాభాసమే. ఎందుకంటే సత్యం తన వ్యతిరేకతని కూడా తనలో కలుపుకుంటుంది!*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 329 / Sri Lalitha Chaitanya Vijnanam - 329 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 74. కళావతీ, కళాలాపా, కాంతా, కాదంబరీప్రియా ।*
*వరదా, వామనయనా, వారుణీమదవిహ్వలా ॥ 74 ॥ 🍀*
*🌻 329. 'కాంతా' 🌻*
*'కాంతా' అనగా స్త్రీ, అందమైన స్త్రీ అని అర్థము. సృష్టి యందు సౌందర్య మంతయూ శ్రీమాత సౌందర్యమే. పరతత్త్వమునకు ఏ లక్షణమూ లేదు. అది రూపమునకు కూడ అతీతమే. సంకల్పము అతని ప్రథమ రూపము. సంకల్పమే అతని నుండి భాసించినపుడు వెలుగై నిలచును. అటుపిమ్మట ఆ వెలుగు నుండి అన్ని రూపములు స్థూలము వఱకు ఏర్పడుచున్నవి. ఈ సమస్త రూపము లలో కమనీయరూపములుగ శ్రీమాత అవతరించు చున్నది. అన్నియూ శ్రీమాత రూపములే అయిననూ అందు కమనీయమగు రూపముగ ఆమె అధికముగ అవతరించి యున్నది. రూపముయొక్క కమనీయత్వమును బట్టియే జీవులు ఆకర్షింపబడు చుందురు.*
*శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అట్టి రూపములు గలవారు. వారి రూప కమనీయత ఎందరినో ఆకర్షించి యుద్ధరించినది. వారియందు పరిపూర్ణముగ శ్రీమాత స్థితిగొనుట వలననే అట్టి నిరుపమానమగు ఆకర్షణము అన్ని జీవులకు కలిగినది. శ్రీమాతయే జగన్మోహినీ. మోహనరూపము ఉద్ధారణమునకు, పతనమునకు కూడ శ్రీమాత వినియోగించు చుండును. రాముని మోహనరూపమును చూచి ఎందరో తరింపగ, రాక్షస ప్రవృత్తి గల శూర్పణఖ రాక్షస వినాశనమునకు కారణమైనది. అట్లే సీత రూపమును మోహించిన రావణుడు కూడ పతనము చెందెను.*
*మోహమును జీవుల అవరోహణమునకు, ఆరోహణమునకు కూడ శ్రీమాత లీలాప్రాయముగ వినియోగించును. శ్రీమాత కాంతా రూపము. సత్పురుషులను, సదాచార సంపన్నులగు స్త్రీలను ఆశ్రయించి కూడ వుండును. అట్లే కొన్ని పర్వతములను, కొన్ని వృక్షములను, కొన్ని పక్షులను, కొన్ని జంతువులను, కొన్ని వస్తువులను ఆశ్రయించి దర్శనము యిచ్చుచుండును. కః అంత, కాంతకు నిర్వచనము. 'కః' అనగా బ్రహ్మ. 'అంతః' అనగా అతని లోపల వసించునది. బ్రహ్మము లోపల నుండి వ్యక్తమై చతుర్ముఖ బ్రహ్మను, ఇతర సృష్టి జీవులను నడిపించునది శ్రీమాతయే.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 329 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 74. Kalavati kalalapa kanta kadanbari priya*
*Varada vamanayana varunimadavihvala ॥ 74 ॥ 🌻*
*🌻 329. Kāntā कान्ता (329) 🌻*
*She is beautiful. Nāma 324 discussed about vibration of Her auspiciousness. This nāma says that Her beauty is vibrating and radiating. This is with regard to Her gross form. This nāma also talks about Her Brahman form. Ka means the Brahman and antā means the ultimate. Therefore kāntā also means the Supreme Brahman, the Ultimate (refer nāma 325).*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Subscribe to:
Posts (Atom)