శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 329 / Sri Lalitha Chaitanya Vijnanam - 329


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 329 / Sri Lalitha Chaitanya Vijnanam - 329 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 74. కళావతీ, కళాలాపా, కాంతా, కాదంబరీప్రియా ।
వరదా, వామనయనా, వారుణీమదవిహ్వలా ॥ 74 ॥ 🍀

🌻 329. 'కాంతా' 🌻

'కాంతా' అనగా స్త్రీ, అందమైన స్త్రీ అని అర్థము. సృష్టి యందు సౌందర్య మంతయూ శ్రీమాత సౌందర్యమే. పరతత్త్వమునకు ఏ లక్షణమూ లేదు. అది రూపమునకు కూడ అతీతమే. సంకల్పము అతని ప్రథమ రూపము. సంకల్పమే అతని నుండి భాసించినపుడు వెలుగై నిలచును. అటుపిమ్మట ఆ వెలుగు నుండి అన్ని రూపములు స్థూలము వఱకు ఏర్పడుచున్నవి. ఈ సమస్త రూపము లలో కమనీయరూపములుగ శ్రీమాత అవతరించు చున్నది. అన్నియూ శ్రీమాత రూపములే అయిననూ అందు కమనీయమగు రూపముగ ఆమె అధికముగ అవతరించి యున్నది. రూపముయొక్క కమనీయత్వమును బట్టియే జీవులు ఆకర్షింపబడు చుందురు.

శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అట్టి రూపములు గలవారు. వారి రూప కమనీయత ఎందరినో ఆకర్షించి యుద్ధరించినది. వారియందు పరిపూర్ణముగ శ్రీమాత స్థితిగొనుట వలననే అట్టి నిరుపమానమగు ఆకర్షణము అన్ని జీవులకు కలిగినది. శ్రీమాతయే జగన్మోహినీ. మోహనరూపము ఉద్ధారణమునకు, పతనమునకు కూడ శ్రీమాత వినియోగించు చుండును. రాముని మోహనరూపమును చూచి ఎందరో తరింపగ, రాక్షస ప్రవృత్తి గల శూర్పణఖ రాక్షస వినాశనమునకు కారణమైనది. అట్లే సీత రూపమును మోహించిన రావణుడు కూడ పతనము చెందెను.

మోహమును జీవుల అవరోహణమునకు, ఆరోహణమునకు కూడ శ్రీమాత లీలాప్రాయముగ వినియోగించును. శ్రీమాత కాంతా రూపము. సత్పురుషులను, సదాచార సంపన్నులగు స్త్రీలను ఆశ్రయించి కూడ వుండును. అట్లే కొన్ని పర్వతములను, కొన్ని వృక్షములను, కొన్ని పక్షులను, కొన్ని జంతువులను, కొన్ని వస్తువులను ఆశ్రయించి దర్శనము యిచ్చుచుండును. కః అంత, కాంతకు నిర్వచనము. 'కః' అనగా బ్రహ్మ. 'అంతః' అనగా అతని లోపల వసించునది. బ్రహ్మము లోపల నుండి వ్యక్తమై చతుర్ముఖ బ్రహ్మను, ఇతర సృష్టి జీవులను నడిపించునది శ్రీమాతయే.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 329 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 74. Kalavati kalalapa kanta kadanbari priya
Varada vamanayana varunimadavihvala ॥ 74 ॥ 🌻

🌻 329. Kāntā कान्ता (329) 🌻

She is beautiful. Nāma 324 discussed about vibration of Her auspiciousness. This nāma says that Her beauty is vibrating and radiating. This is with regard to Her gross form. This nāma also talks about Her Brahman form. Ka means the Brahman and antā means the ultimate. Therefore kāntā also means the Supreme Brahman, the Ultimate (refer nāma 325).


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


16 Dec 2021

No comments:

Post a Comment