శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 348 / Sri Lalitha Chaitanya Vijnanam - 348


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 348 / Sri Lalitha Chaitanya Vijnanam - 348 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 77. విజయా, విమలా, వంద్యా, వందారు జనవత్సలా ।
వాగ్వాదినీ, వామకేశీ, వహ్నిమండల వాసినీ ॥ 77 ॥ 🍀

🌻 348. 'వంద్యా ' 🌻

నమస్కరింపదగినది శ్రీమాత అని అర్థము. ఈ నామమునకు వ్యాఖ్యానము అవసరము లేదు. త్రిమూర్తులు సహితము శ్రీమాతకే నమస్కరింతురు. ఆమె నుండియే ప్రేరణ చెంది వారి వారి కార్యములను నిర్వర్తింతురు. ఇక ఇతరుల సంగతి చెప్పనేల? ఇచ్ఛా, జ్ఞాన, క్రియలు సరిగ నిర్వర్తింపబడుటకు శ్రీమాతకు నమస్కరించ వలసినదే.

ఆమెకు నమస్కరించి ప్రేరణను పొంది ఆ ప్రేరణను నిర్వర్తించుటకు వలసిన జ్ఞానమును అమ్మనుండియే పొంది, ఆమె అందించు శక్తిచే నిర్వర్తించుట, అటుపైన అంతయూ ఆమెకే సమర్పించుట భక్తులు చేయు కార్యము. ఆమెను తిరస్కరించినవారికి సృష్టి యందు తిప్పలు తప్పవు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 348 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 77. Vijaya vimala vandya mandaru janavatsala
Vagvadini vamakeshi vahni mandala vasini ॥ 77 ॥ 🌻

🌻 348. Vandyā वन्द्या (348) 🌻


She is adorable. We adore someone by merely seeing him and without even knowing him. This happens because he draws divine energy from the cosmos and this gets reflected through his body as vibrations. Such vibrations are normally drawn through an orifice in the crown cakra and also through medulla oblongata which is situated beneath the back of our head.

The third eye, the pineal gland and the back head cakra are placed in a straight line. When one is able to look within through the ājñā cakra, the energy generated passes through the pineal gland and gets released through the back head cakra and in the process cleanses bio-plasma body. This process not only accelerates one’s spiritual progress but also rarely confers some super human powers (siddhi-s).

She is the embodiment of all the energies of the universe. She draws Her energy from the Supreme Śiva and transmits to the universe for its sustenance.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


13 Feb 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 149


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 149 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. మానవజన్మము - విశిష్టత -2 🌻


ఈ శరీరం, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి మొదలైన ఉపకరణాలు మనకి ఇవ్వబడినవని తెలుసుకోవాలి. వీటిని సద్వనియోగపరచి ఇతర జీవుల యందు తనకు గల కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించడం మానవుని ప్రధాన లక్ష్యం. కేవలం తన మేధాశక్తిని ‌మాత్రమే ఆశ్రయించి తద్వారా ఇతర జీవులను తన‌ వశంలో పెట్టుకునే ప్రయత్నం రాక్షసత్వమే అవుతుంది. మానవ జన్మము చక్కని శిక్షణ శిబిరము.

మొదట తన‌ కుటుంబ సభ్యులతో మొదలై క్రమంగా వ్యాప్తి చెంది సామాజిక జీవనంలోకి‌ ప్రవేశించి అనేక సన్నివేశముల రూపంలో ప్రకృతి నుంచి‌ ఎన్నో పాఠాలు నేర్చుకుంటాడు మానవుడు. అటుపైన తన కోసం తాను జీవించడమే కాకుండా లోకహితం కోరి పని చేయడం మొదలుపెట్టాలి. అప్పుడే వ్యక్తిగతమనే బంధం నుంచి విముక్తుడవుతాడు. అప్పుడు అప్రయత్నంగానే లోకహితం కోసం పనిచేయగలిగే సామర్థ్యం ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాగ అయినప్పుడే మానవుడు ఉత్తమ మానవుడుగా ఆవిర్భవిస్తాడు....


...✍️ మాస్టర్ ఇ.కె.

🌹 🌹 🌹 🌹 🌹


13 Feb 2022

శ్రీ శివ మహా పురాణము - 519


🌹 . శ్రీ శివ మహా పురాణము - 519 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 44

🌻. మేన యొక్క మంకు పట్టు - 5 🌻


మేన ఇట్లు పలికెను -

ఓ నాథా! నా మాటను విని నేను చెప్పినట్లు చేయుము. ఈ నీ కుమార్తె యగు పార్వతిని తీసుకు వెళ్లి కంఠము నందు బంధించి (48), శంకలేని వాడవై క్రిందకు త్రోసివేయుము. నేను ఆమెను శివునకు ఈయను. లేదా, ఓ నాథా! ఈమెను సముద్రములో ముంచి వేయుము. ఓ పర్వతరాజా! అపుడు నీకు సుఖము కలుగును. ఓ స్వామి! నీవు నీ పుత్రికను వికట రూపుడగు రుద్రునకిచ్చినచో నేను నిశ్చయముగా దేహత్యాగము చేసెదను (49, 50).

బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడచట మేన మొండి పట్టుదలతో ఇట్లు పలుకగా, పార్వతి స్వయముగా వచ్చి రమ్యముగా నిట్లు పలికెను (51).

పార్వతి ఇట్లు పలికెను -

తల్లీ! నీకు అశుభములను కలిగించే విపరీత బుద్ధి పుట్టినది. ధర్మమును అవలంబించిన నీవు ఇపుడు ధర్మము నేల వీడుచున్నావు? (52) ఈ రుద్రుడే పరమాత్మ యనియు, సర్వకారణుడగు ఈశ్వరుడేననియు, సుఖమును ఇచ్చువాడనియు, అందమైన రూపము గలవాడనియు వేదములన్నియు వర్ణించుచున్నవి. (53).

అమ్మా | ఈ శంకరుడు మహేశ్వరుడు, సర్వదేవతలకు ప్రభువు, జగన్నాథుడు, అనేక రూపములను ధరించు వాడు, విష్ణు బ్రహ్మాడులచే సేవింపబడువాడు (54), సర్వప్రాణులకు అధిష్ఠానము, జగత్తును సృష్టించి సంహరించు ప్రభుడు, వికారములులేనివాడు, బ్రహ్మవిష్ణు రుద్రులను త్రిమూర్తులకు ప్రభువు, వినాశము లేనివాడు, సనాతనుడు (55). ఆయనకొరకై దేవతలందరు విచ్చేసి కింకరుల వలె ఈనాడు నీ ద్వారము వద్ద ఉత్సవమును చేయుచున్నారు. ఇంతకంటె గొప్ప సుఖమేమి గలదు? (56) కావున నీవు జాగ్రత్తగా లెమ్ము. నీ జీవితమును సార్థకమును చేసుకొనుము. నన్నీ శివునకు ఇచ్చి నీ గృహస్థాశ్రమమును సఫలము చేసుకొనుము (57).

అమ్మా! నన్ను పరమేశ్వరుడగు శంకరునకు ఇమ్ము. తల్లీ! నేను వినయముతో చెప్పు ఈ మాటను నీవు అంగీకరించుము (58). నీవు నన్ను శివునకు ఈయక పోయినచో నేను మరియొక వరుని వివాహమాడను. ఇతరులను వంచించి జీవించు నక్క సింహమునకు ఉద్దేశించిన భాగమును ఎట్లు పొందగల్గును? (59) తల్లీ! నేను మనోవాక్కాయ కర్మలచే శివుని వరించితిని. ఇది నిశ్చితము. నీకు నచ్చిన తీరున నీవాచరింపుము (60).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


13 Feb 2022

గీతోపనిషత్తు -321


🌹. గీతోపనిషత్తు -321 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 24-1 📚


🍀 24-1. తత్త్వదర్శనము - దైవతత్త్వము సర్వవ్యాపకము, సర్వజ్ఞము, సర్వ శక్తిమంతము. సర్వకాలముల యందు, సర్వదేశముల యందు, సర్వ సన్నివేశములయందు తత్త్వతః దైవ మందుబాటులోనే యున్నాడు. మనము చూచినదంతయు దైవముతోనే నిండి యున్నది. మనము వినునదంతయు కూడ దైవముతోనే నిండి యున్నది. పరిసరముల నుండి మనలను గమనించునది కూడ దైవమే. అట్లే లోపలి నుండి కూడ చూచుచు నుండును మరియు మనలను వినుచును యుండును. మనకు కూడ లోపలున్న దైవమును వినుట, చూచుట సాధ్యపడును. 🍀

24. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ |
న తు మామభిజానంతి తత్త్యనాత శ్చ్యవంతి తే ||

తాత్పర్యము : వివిధ దేవతా రూపములను ఆరాధనము చేయువారు తత్త్వ దర్శనము చేయజాలకున్నారు. సర్వయజ్ఞములకును ప్రభువును, భోక్తను నేనే అని తెలియలేకున్నారు. కనుక వారు జారిపోవుచున్నారు.

వివరణము : దైవారాధన పై శ్లోకములో తెలిపిన విధముగ ఒక నామమునకు, ఒక రూపమునకు పరిమితమైనపుడు తత్యానుభూతి యుండదు. దైవతత్త్వము సర్వవ్యాపకము, సర్వజ్ఞము, సర్వ శక్తిమంతము. సర్వకాలముల యందు, సర్వదేశముల యందు, సర్వ సన్నివేశములయందు తత్త్వతః దైవ మందుబాటులోనే యున్నాడు. మనము చూచినదంతయు దైవముతోనే నిండి యున్నది. మనము వినునదంతయు కూడ దైవముతోనే నిండి యున్నది.

ఇతరులు మనలను చూచునపుడు వారిలో నుండి దైవమే మనలను చూచుచున్నాడు. అట్లే ఇతరులు భాషించు నపుడు వారి నుండి శబ్దమూలమగు నాదముగ తానే వినిపించు చున్నాడు. మనము పరిసరములను చూచునపుడు అందు యథార్థముగ దైవమే యున్నది. పరిసరముల నుండి మనలను గమనించునది కూడ దైవమే. అట్లే లోపలి నుండి కూడ చూచుచు నుండును మరియు మనలను వినుచును యుండును. మనకు కూడ లోపలున్న దైవమును వినుట, చూచుట సాధ్యపడును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


13 Feb 2022

13 - FEBRUARY - 2022 ఆదివారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 13, ఆదివారం, ఫిబ్రవరి 2022 భాను వాసరే 🌹
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 24-1 - 321- తత్వదర్శనము 🌹
3) 🌹. శివ మహా పురాణము - 519🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -149🌹  
5) 🌹 Osho Daily Meditations - 138🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 348 / Sri Lalitha Chaitanya Vijnanam - 348🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹*
*భాను వాసరే, 13, ఫిబ్రవరి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. ద్వాదశ ఆదిత్య ధ్యాన శ్లోకాలు - 6 🍀*

*🌟 6. వివస్వాన్ –*
*వివస్వానుగ్రసేనశ్చ వ్యాఘ్ర ఆసారణో భృగుః |*
*అనుమ్లోచాః శంఖపాలో నభస్యాఖ్యం నయంత్యమీ*
*జగన్నిర్మాణకర్తారం సర్వదిగ్వ్యాప్తతేజసమ్ |*
*నభోగ్రహమహాదీపం వివస్వంతం నమామ్యహం*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : బ్రహ్మముతో కూడి యుండు ప్రయత్నము చేయు వానికి సులభముగ యోగము సిద్ధించును. 🍀*

*పండుగలు మరియు పర్వదినాలు :*
*కుంభ సంక్రాంతి, Kumbha Sankranti*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం,
శిశిర ఋతువు, మాఘ మాసం
తిథి: శుక్ల ద్వాదశి 18:43:22 వరకు
తదుపరి శుక్ల త్రయోదశి
నక్షత్రం: ఆర్ద్ర 09:28:16 వరకు
తదుపరి పునర్వసు
యోగం: ప్రీతి 21:15:55 వరకు
తదుపరి ఆయుష్మాన్
కరణం: బాలవ 18:39:22 వరకు
సూర్యోదయం: 06:43:43
సూర్యాస్తమయం: 18:16:55
వైదిక సూర్యోదయం: 06:47:21
వైదిక సూర్యాస్తమయం: 18:13:15
చంద్రోదయం: 15:23:56
చంద్రాస్తమయం: 04:11:05
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: జెమిని
వర్జ్యం: 22:40:30 - 24:26:10
దుర్ముహూర్తం: 16:44:30 - 17:30:43
రాహు కాలం: 16:50:16 - 18:16:55
గుళిక కాలం: 15:23:37 - 16:50:16
యమ గండం: 12:30:19 - 13:56:58
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:53
అమృత కాలం: -
ధ్వాంక్ష యోగం - ధన నాశనం, కార్య 
హాని 09:28:16 వరకు తదుపరి ధ్వజ 
యోగం - కార్య సిధ్ధి 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PANCHANGUM
#DAILYCalender
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -321 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 24-1 📚*
 
*🍀 24-1. తత్త్వదర్శనము - దైవతత్త్వము సర్వవ్యాపకము, సర్వజ్ఞము, సర్వ శక్తిమంతము. సర్వకాలముల యందు, సర్వదేశముల యందు, సర్వ సన్నివేశములయందు తత్త్వతః దైవ మందుబాటులోనే యున్నాడు. మనము చూచినదంతయు దైవముతోనే నిండి యున్నది. మనము వినునదంతయు కూడ దైవముతోనే నిండి యున్నది. పరిసరముల నుండి మనలను గమనించునది కూడ దైవమే. అట్లే లోపలి నుండి కూడ చూచుచు నుండును మరియు మనలను వినుచును యుండును. మనకు కూడ లోపలున్న దైవమును వినుట, చూచుట సాధ్యపడును. 🍀*

*24. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ |*
*న తు మామభిజానంతి తత్త్యనాత శ్చ్యవంతి తే ||*

*తాత్పర్యము : వివిధ దేవతా రూపములను ఆరాధనము చేయువారు తత్త్వ దర్శనము చేయజాలకున్నారు. సర్వయజ్ఞములకును ప్రభువును, భోక్తను నేనే అని తెలియలేకున్నారు. కనుక వారు జారిపోవుచున్నారు.*

*వివరణము : దైవారాధన పై శ్లోకములో తెలిపిన విధముగ ఒక నామమునకు, ఒక రూపమునకు పరిమితమైనపుడు తత్యానుభూతి యుండదు. దైవతత్త్వము సర్వవ్యాపకము, సర్వజ్ఞము, సర్వ శక్తిమంతము. సర్వకాలముల యందు, సర్వదేశముల యందు, సర్వ సన్నివేశములయందు తత్త్వతః దైవ మందుబాటులోనే యున్నాడు. మనము చూచినదంతయు దైవముతోనే నిండి యున్నది. మనము వినునదంతయు కూడ దైవముతోనే నిండి యున్నది.*

*ఇతరులు మనలను చూచునపుడు వారిలో నుండి దైవమే మనలను చూచుచున్నాడు. అట్లే ఇతరులు భాషించు నపుడు వారి నుండి శబ్దమూలమగు నాదముగ తానే వినిపించు చున్నాడు. మనము పరిసరములను చూచునపుడు అందు యథార్థముగ దైవమే యున్నది. పరిసరముల నుండి మనలను గమనించునది కూడ దైవమే. అట్లే లోపలి నుండి కూడ చూచుచు నుండును మరియు మనలను వినుచును యుండును. మనకు కూడ లోపలున్న దైవమును వినుట, చూచుట సాధ్యపడును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 519 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 44

*🌻. మేన యొక్క మంకు పట్టు - 5 🌻*

మేన ఇట్లు పలికెను -

ఓ నాథా! నా మాటను విని నేను చెప్పినట్లు చేయుము. ఈ నీ కుమార్తె యగు పార్వతిని తీసుకు వెళ్లి కంఠము నందు బంధించి (48), శంకలేని వాడవై క్రిందకు త్రోసివేయుము. నేను ఆమెను శివునకు ఈయను. లేదా, ఓ నాథా! ఈమెను సముద్రములో ముంచి వేయుము. ఓ పర్వతరాజా! అపుడు నీకు సుఖము కలుగును. ఓ స్వామి! నీవు నీ పుత్రికను వికట రూపుడగు రుద్రునకిచ్చినచో నేను నిశ్చయముగా దేహత్యాగము చేసెదను (49, 50).

బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడచట మేన మొండి పట్టుదలతో ఇట్లు పలుకగా, పార్వతి స్వయముగా వచ్చి రమ్యముగా నిట్లు పలికెను (51).

పార్వతి ఇట్లు పలికెను -

తల్లీ! నీకు అశుభములను కలిగించే విపరీత బుద్ధి పుట్టినది. ధర్మమును అవలంబించిన నీవు ఇపుడు ధర్మము నేల వీడుచున్నావు? (52) ఈ రుద్రుడే పరమాత్మ యనియు, సర్వకారణుడగు ఈశ్వరుడేననియు, సుఖమును ఇచ్చువాడనియు, అందమైన రూపము గలవాడనియు వేదములన్నియు వర్ణించుచున్నవి. (53).

అమ్మా | ఈ శంకరుడు మహేశ్వరుడు, సర్వదేవతలకు ప్రభువు, జగన్నాథుడు, అనేక రూపములను ధరించు వాడు, విష్ణు బ్రహ్మాడులచే సేవింపబడువాడు (54), సర్వప్రాణులకు అధిష్ఠానము, జగత్తును సృష్టించి సంహరించు ప్రభుడు, వికారములులేనివాడు, బ్రహ్మవిష్ణు రుద్రులను త్రిమూర్తులకు ప్రభువు, వినాశము లేనివాడు, సనాతనుడు (55). ఆయనకొరకై దేవతలందరు విచ్చేసి కింకరుల వలె ఈనాడు నీ ద్వారము వద్ద ఉత్సవమును చేయుచున్నారు. ఇంతకంటె గొప్ప సుఖమేమి గలదు? (56) కావున నీవు జాగ్రత్తగా లెమ్ము. నీ జీవితమును సార్థకమును చేసుకొనుము. నన్నీ శివునకు ఇచ్చి నీ గృహస్థాశ్రమమును సఫలము చేసుకొనుము (57).

అమ్మా! నన్ను పరమేశ్వరుడగు శంకరునకు ఇమ్ము. తల్లీ! నేను వినయముతో చెప్పు ఈ మాటను నీవు అంగీకరించుము (58). నీవు నన్ను శివునకు ఈయక పోయినచో నేను మరియొక వరుని వివాహమాడను. ఇతరులను వంచించి జీవించు నక్క సింహమునకు ఉద్దేశించిన భాగమును ఎట్లు పొందగల్గును? (59) తల్లీ! నేను మనోవాక్కాయ కర్మలచే శివుని వరించితిని. ఇది నిశ్చితము. నీకు నచ్చిన తీరున నీవాచరింపుము (60).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 149 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

🌻. మానవజన్మము - విశిష్టత -2 🌻*

*ఈ శరీరం, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి మొదలైన ఉపకరణాలు మనకి ఇవ్వబడినవని తెలుసుకోవాలి. వీటిని సద్వనియోగపరచి ఇతర జీవుల యందు తనకు గల కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించడం మానవుని ప్రధాన లక్ష్యం. కేవలం తన మేధాశక్తిని ‌మాత్రమే ఆశ్రయించి తద్వారా ఇతర జీవులను తన‌ వశంలో పెట్టుకునే ప్రయత్నం రాక్షసత్వమే అవుతుంది. మానవ జన్మము చక్కని శిక్షణ శిబిరము.*

*మొదట తన‌ కుటుంబ సభ్యులతో మొదలై క్రమంగా వ్యాప్తి చెంది సామాజిక జీవనంలోకి‌ ప్రవేశించి అనేక సన్నివేశముల రూపంలో ప్రకృతి నుంచి‌ ఎన్నో పాఠాలు నేర్చుకుంటాడు మానవుడు. అటుపైన తన కోసం తాను జీవించడమే కాకుండా లోకహితం కోరి పని చేయడం మొదలుపెట్టాలి. అప్పుడే వ్యక్తిగతమనే బంధం నుంచి విముక్తుడవుతాడు. అప్పుడు అప్రయత్నంగానే లోకహితం కోసం పనిచేయగలిగే సామర్థ్యం ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాగ అయినప్పుడే మానవుడు ఉత్తమ మానవుడుగా ఆవిర్భవిస్తాడు....*

...✍️ *మాస్టర్ ఇ.కె.*
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 138 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 138. BECOME POETIC 🍀*

*🕉 A poet comes to know certain things that are revealed only in a poetic relationship with reality. 🕉*
 
*The poet is foolish as far as worldly cleverness is concerned. He will never rise in the world of wealth and power. But in his poverty he knows a different kind of richness in life that nobody else knows. Love is possible to a poet, and God is possible to a poet. Only one who is innocent enough to enjoy the small things of life can understand that God exists, because God exists in the small things of life: he exists in the food you eat, he exists in the walk that you go for in the morning. God exists in the love that you have for your beloved, in the friendship that you have with somebody.*

*God does not exist in the churches; churches are not part of poetry, they are part of politics. Become more and more poetic. It takes guts to be poetic; one needs to be courageous enough to be called a fool by the world, but only then can one be poetic. And by being poetic I don't mean that you have to write poetry. Writing poetry is only a small, nonessential part of being poetic. One may be a poet and never write a single line of poetry, and one may write thousands of poems and still not be a poet. Being a poet is a way of life. It is love for life, it is reverence for life, it is a heart-to-heart relationship with life.* 

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 348 / Sri Lalitha Chaitanya Vijnanam - 348 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 77. విజయా, విమలా, వంద్యా, వందారు జనవత్సలా ।*
*వాగ్వాదినీ, వామకేశీ, వహ్నిమండల వాసినీ ॥ 77 ॥ 🍀*

*🌻 348. 'వంద్యా ' 🌻* 

*నమస్కరింపదగినది శ్రీమాత అని అర్థము. ఈ నామమునకు వ్యాఖ్యానము అవసరము లేదు. త్రిమూర్తులు సహితము శ్రీమాతకే నమస్కరింతురు. ఆమె నుండియే ప్రేరణ చెంది వారి వారి కార్యములను నిర్వర్తింతురు. ఇక ఇతరుల సంగతి చెప్పనేల? ఇచ్ఛా, జ్ఞాన, క్రియలు సరిగ నిర్వర్తింపబడుటకు శ్రీమాతకు నమస్కరించ వలసినదే.*

*ఆమెకు నమస్కరించి ప్రేరణను పొంది ఆ ప్రేరణను నిర్వర్తించుటకు వలసిన జ్ఞానమును అమ్మనుండియే పొంది, ఆమె అందించు శక్తిచే నిర్వర్తించుట, అటుపైన అంతయూ ఆమెకే సమర్పించుట భక్తులు చేయు కార్యము. ఆమెను తిరస్కరించినవారికి సృష్టి యందు తిప్పలు తప్పవు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 348 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 77. Vijaya vimala vandya mandaru janavatsala*
*Vagvadini vamakeshi vahni mandala vasini ॥ 77 ॥ 🌻*

*🌻 348. Vandyā वन्द्या (348) 🌻*

*She is adorable. We adore someone by merely seeing him and without even knowing him. This happens because he draws divine energy from the cosmos and this gets reflected through his body as vibrations. Such vibrations are normally drawn through an orifice in the crown cakra and also through medulla oblongata which is situated beneath the back of our head.  

*The third eye, the pineal gland and the back head cakra are placed in a straight line. When one is able to look within through the ājñā cakra, the energy generated passes through the pineal gland and gets released through the back head cakra and in the process cleanses bio-plasma body. This process not only accelerates one’s spiritual progress but also rarely confers some super human powers (siddhi-s).*

*She is the embodiment of all the energies of the universe. She draws Her energy from the Supreme Śiva and transmits to the universe for its sustenance. *

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

12 - FEBRUARY - 2022 శనివారం MESSAGES భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 12, ఫిబ్రవరి 2022 శనివారం, స్థిర వాసరే 🌹
🌹. జయ ఏకాదశి, భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 157 / Bhagavad-Gita - 157 - 3-38 కర్మయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 555 / Vishnu Sahasranama Contemplation - 555🌹
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 4 ప్రశ్నము - 1 🌹  
5) 🌹 DAILY WISDOM - 233🌹 
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 135 🌹
7) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 72 🌹 

*🌹. ఏకదండి, ద్విదండి, త్రిదండి... స్వాముల చేతిలో కర్రలెందుకు ఉంటాయో తెలుసా...🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. జయ ఏకాదశి, భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు మరియు శుభ శనివారం మిత్రులందరికీ 🌹*
*స్థిర వాసరే, 12, ఫిబ్రవరి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ వేంకటేశ అష్టకం-1 🍀*

*1. వేంకటేశో వాసుదేవః ప్రద్యుమ్నోఽమితవిక్రమః |*
*సంకర్షణోఽనిరుద్ధశ్చ శేషాద్రిపతిరేవ చ*
*2. జనార్దనః పద్మనాభో వేంకటాచలవాసినః |*
*సృష్టికర్తా జగన్నాథో మాధవో భక్తవత్సలః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : నిత్య దైవ స్మరణ వలన, నిరంతర ధ్యానపరుడు అగుట వలన, దైవమును చేరవచ్చు. 🍀*

*పండుగలు మరియు పర్వదినాలు : జయ ఏకాదశి, Jaya Ekadashi*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం,
శశిర ఋతువు, మాఘ మాసం
 తిథి: శుక్ల-ఏకాదశి 16:28:40 వరకు
తదుపరి శుక్ల ద్వాదశి
నక్షత్రం: ఆర్ద్ర ఉ 9:28:29 వరకు
తదుపరి పునర్వసు
యోగం: వషకుంభ 20:40:42 వరకు
తదుపరి ప్రీతి
కరణం: విష్టి 16:25:40 వరకు
సూర్యోదయం: 06:44:10
సూర్యాస్తమయం: 18:16:29
వైదిక సూర్యోదయం: 06:47:50
వైదిక సూర్యాస్తమయం: 18:12:51
చంద్రోదయం: 14:32:16
చంద్రాస్తమయం: 03:19:35
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: జెమిని
వర్జ్యం: 16:01:30 - 17:48:50
దుర్ముహూర్తం: 08:16:28 - 09:02:37
రాహు కాలం: 09:37:15 - 11:03:47
గుళిక కాలం: 06:44:10 - 08:10:42
యమ గండం: 13:56:52 - 15:23:25
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:53
అమృత కాలం: 22:17:10 - 24:04:30
ముద్గర యోగం - కలహం ఉ 9:28:29 వరకు
తదుపరి ఛత్ర యోగం - స్త్రీ లాభం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PANCHANGUM
#DAILYCalender
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 157 / Bhagavad-Gita - 157 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 38 🌴*

*38. ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ |*
*యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్ ||*

*🌷. తాత్పర్యం :*
*పొగ చేత అగ్ని, ధూళి చేత అద్దము, మావి చేత గర్భము కప్పబడినట్లు కామము యొక్క వివిధ దశలచే జీవుడు కప్పుడియుండును.*

🌷. భాష్యము :
జీవుని శుద్ధచైతన్యమును మరుగుపరచు ఆవరణదశలు మూడు కలవు. ఆ ఆవరణయే కామము. అదియే అగ్ని యందలి పొగ, అద్దము పై నుండెడి ధూళి మరియు గర్భము పైని మావి వలె వివిధరూపములలో నుండును. కామము పొగచే పోల్చినపుడు జీవుడనెడి అగ్ని అతికొద్దిగా అనుభూతమగునని అవగతము చేసికొనవచ్చును. 

అనగా జీవుడు కృష్ణభక్తిభావనను కొద్దిగా ప్రదర్శించునపుడు పొగ చేత కప్పబడిన అగ్నిని పోలియుండును. పొగ ఉన్నచోట అగ్నియున్నను ప్రారంభదశలో అగ్ని ప్రదర్శితము కాక గుప్తముగా నుండును. ఈ స్థితిని కృష్ణభక్తిరసభావన యందలి తొలిదశతో పోల్చవచ్చును. అద్దము పైన గల ధూళి వివిధములైన ఆధ్యాత్మికపద్దతుల ద్వారా మనోదర్పణ మాలిన్యమును తొలగించు విధానమును సూచించును. దాని కొరకు హరినామసంకీర్తనమే అత్యుత్తమమైన మార్గము. మావి చేత గర్భము కప్పబడియుండుట అనెడి ఉపమానము నిస్సహాయస్థితిని సూచించును. ఏలయన మావి యందు శిశువు నిస్సహాయస్థితిలో కదలలేకయుండును. 

ఇట్టి జీవనస్థితి వృక్షములకు అన్వయింపవచ్చును. వృక్షములు సైతము జీవులే. కాని అత్యధిక కామమును వారు ప్రదర్శించియుండుటచే అట్టి దాదాపు చేతనారహిత జీవనస్థితిని పొందిరి. ధూళి చేత అద్ధము కప్పబడిన ఉపమానము పక్షులకు మరియు జంతువులకు అన్యయింపవచ్చును. మానవజన్మలో జీవుడు కృష్ణభక్తిరసభావనను జాగృతము చేసికొనగలడు. దాని యందు అతడు పురోగమించినచో ఆధ్యాత్మికజీవనమనెడి అగ్ని రగుల్కొనగలదు. తదుపరి పొగను జాగ్రత్తగా నివారించినచో అగ్నిని ప్రజ్వలింపచేయ వచ్చును. 

కావుననే ఈ మానవజన్మ భవబంధముల నుండి తప్పించుకొనుటకు జీవునకు ఒక చక్కని అవకాశమై యున్నది. అట్టి మానవజన్మ యందు సమర్థవంతమైన మార్గదర్శకత్వమున కృష్ణభక్తిభావనను అలవరచుకొనుట ద్వారా ఎవ్వరైనను కామమనెడి శత్రువును జయింపగలరు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 157 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 3 - Karma Yoga - 38 🌴*

*38. dhūmenāvriyate vahnir yathādarśo malena ca*
*yatholbenāvṛto garbhas tathā tenedam āvṛtam*

🌷 Translation : 
*As fire is covered by smoke, as a mirror is covered by dust, or as the embryo is covered by the womb, the living entity is similarly covered by different degrees of this lust.*

🌷 Purport :
There are three degrees of covering of the living entity by which his pure consciousness is obscured. This covering is but lust under different manifestations like smoke in the fire, dust on the mirror, and the womb about the embryo. When lust is compared to smoke, it is understood that the fire of the living spark can be a little perceived. 

In other words, when the living entity exhibits his Kṛṣṇa consciousness slightly, he may be likened to the fire covered by smoke. Although fire is necessary where there is smoke, there is no overt manifestation of fire in the early stage. This stage is like the beginning of Kṛṣṇa consciousness. The dust on the mirror refers to a cleansing process of the mirror of the mind by so many spiritual methods. 

The best process is to chant the holy names of the Lord. The embryo covered by the womb is an analogy illustrating a helpless position, for the child in the womb is so helpless that he cannot even move. This stage of living condition can be compared to that of the trees. The trees are also living entities, but they have been put in such a condition of life by such a great exhibition of lust that they are almost void of all consciousness. The covered mirror is compared to the birds and beasts, and the smoke-covered fire is compared to the human being. 

In the form of a human being, the living entity may revive a little Kṛṣṇa consciousness, and, if he makes further development, the fire of spiritual life can be kindled in the human form of life. By careful handling of the smoke in the fire, fire can be made to blaze. Therefore the human form of life is a chance for the living entity to escape the entanglement of material existence. In the human form of life, one can conquer the enemy, lust, by cultivation of Kṛṣṇa consciousness under able guidance.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 555 / Vishnu Sahasranama Contemplation - 555 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 555. వృక్షః, वृक्षः, Vr‌kṣaḥ 🌻*

*ఓం వృక్షాయ నమః | ॐ वृक्षाय नमः | OM Vr‌kṣāya namaḥ*

వృక్షః, वृक्षः, Vr‌kṣaḥ

*వృక్ష ఇవాచలతయా స్థితో వృక్ష ఇతీర్యతే ।*
*వృక్ష ఇవ స్తబ్ధో దివి తిష్టత్యేక ఇతి శ్రుతేః ॥*

*వృక్షము వలె కదలనివాడు గనుక వృక్షః. వృక్షము అనుటలో ఎన్ని సంవత్సరములు గడిచినను వృక్షమునుండి ఆకులు రాలుట, క్రొత్తవి పుట్టుట, పూచుట, కాచుట మొదలగునవి ఋతు ధర్మము ననుసరించి జరుగుచున్నను, ఆకులు మొదలగునవి మారుచున్నను వృక్షము మాత్రము మార్పులేక అట్లే యుండును. అటులనే పరమాత్మ దేశకాల వస్తు కృత భేదమునకు పాత్రములగుచు ఎందరు జీవులు వచ్చుచు పోవుచున్నను ఎన్ని సృష్టులు జరిగినను పరమాత్ముడు మాత్రము ఏ మార్పును లేక స్థిరుడై యుండును.*

:: శ్వేతాశ్వతరోపనిషత్ తృతీయోఽధ్యాయః ::
యస్మాత్పరం నాపర మస్తి కిఞ్చి ద్యస్మా న్నాణీయో న జ్యాయేఽస్తి కశ్చిత్ । వృక్ష ఇవ స్తబ్ధో దివి తిష్టత్యేకస్తేనేదం పూర్ణం పురుషేణ సర్వమ్ ॥ 9 ॥

*ఏ బ్రహ్మముకంటే శ్రేష్ఠమైనది కానీ, వేఱైనదిగానీ, పెద్దది కానీ, చిన్నది కాని ఏదియునులేదో, ఏది ఆకాశమందు వృక్షమువలె నిలబడియున్నదో, అట్టి బ్రహ్మము చేత ఈ సమస్త ప్రపంచము పరిపూర్ణమై వ్యాప్తమైయున్నది.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 555 🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻 555. Vr‌kṣaḥ 🌻*

*OM Vr‌kṣāya namaḥ*

वृक्ष इवाचलतया स्थितो वृक्ष इतीर्यते ।
वृक्ष इव स्तब्धो दिवि तिष्टत्येक इति श्रुतेः ॥ 

*Vr‌kṣa ivācalatayā sthito vr‌kṣa itīryate,*
*Vr‌kṣa iva stabdho divi tiṣṭatyeka iti śruteḥ.*

*He stands firm like a tree and hence He is Vr‌kṣaḥ. Here a tree symbolizes that entity which stands firm even though the leaves appear and then fall going through different seasons as like the living beings that are born and then die in time. Even in spite of these cycles, the Paramātma is comparable to that tree that remains firm with its identity in tact.*

:: श्वेताश्वतरोपनिषत् तृतीयोऽध्यायः ::
यस्मात्परं नापर मस्ति किञ्चि द्यस्मा न्नाणीयो न ज्यायेऽस्ति कश्चित् । वृक्ष इव स्तब्धो दिवि तिष्टत्येकस्तेनेदं पूर्णं पुरुषेण सर्वम् ॥ ९ ॥

Śvetāśvataropaniṣat - Chapter 3
Yasmātparaṃ nāpara masti kiñci dyasmā nnāṇīyo na jyāye’sti kaścit, vr‌kṣa iva stabdho divi tiṣṭatyekastenedaṃ pūrṇaṃ puruṣeṇa sarvam. 9.

The whole universe is filled by the Purusha, to whom there is nothing superior, from whom there is nothing different, than whom there is nothing either smaller or greater; who stands alone, motionless as a tree, established in His own glory.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
वेदास्स्वाङ्गोऽजितःकृष्णो दृढस्सङ्कर्षणोऽच्युतः ।
वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः ॥ ५९ ॥
వేదాస్స్వాఙ్గోఽజితఃకృష్ణో దృఢస్సఙ్కర్షణోఽచ్యుతః ।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥ 59 ॥
Vedāssvāṅgo’jitaḥkr‌ṣṇo dr‌ḍassaṅkarṣaṇo’cyutaḥ,
Varuṇo vāruṇo vr‌kṣaḥ puṣkarākṣo mahāmanāḥ ॥ 59 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 4 / Agni Maha Purana - 4 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 1*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. ప్రశ్నము - 1 🌻*

శ్రీ మహాలక్ష్మికిని, సరస్వతికిని, పార్వతికిని, గణపతికిని, కుమారస్వామికిని, మహేశ్వరునకును, అగ్ని దేవునకును, ఇంద్రాదులకును, శ్రీమహావిష్ణువు నకును నమస్కరించుచున్నాను.

నైమిషారణ్యమునందు హరిని ఉద్దేశించి యజ్ఞము చేయుచున్న శౌనకాది మహర్షులు తీర్థయాత్రాసందర్భమున అచ్చటికి వచ్చిన సూతునితో ఇట్లనిరి.

ఋషులు పలికిరి : ఓ సూతుడా! నీవు (మాచేత పూజింపబడినావు) మాకు పూజ్యుడవు. దేనిని తెలసికొనినంత మాత్రముచే (మానవునకు) సర్వజ్ఞత్వము కలుగునో అట్టి సారములలో కెల్ల సార మైనదానిని మాకు చెప్పుము.

సూతుడు పలికెను - సృష్ట్యాదులను చేసిన ప్రభువును, భగవంతుడును అయిన శ్రీమహావిష్ణువే సారములలో కెల్ల సారమైన వాడు. " నేనే ఆ పరబ్రహ్మస్వరూపుడను" అని ఆ విష్ణువును గూర్చి తెలిసికొన్నచో సర్వజ్ఞత్వము కలుగును.

శబ్దములకు గోచర మగు సగుణబ్రహ్మయు, పర మగునిర్గుణబ్రహ్మయు తెలియదగినవి. అథర్వవేదమునకు సంబంధించిన ముండకోపనిషత్తు గూడ -" రెండు విద్యలు తెలిసికొనవలెను" అని చెప్పుచున్నది.

నేనును, శుకుడను, పైలుడు మొదలగువారును బదరికాశ్రమమునకు వెళ్ళి వ్యాసుని నమస్కరించి ప్రశ్నింపగా అపుడాతడు మాకు సారము నుపదేశించెను.

వ్యాసుడు పలికెను: నేను మునులతో కలిసివెళ్ళి, పరముకంటె పరమును, సారభూతముము అగు బ్రహ్మను గూర్చి ప్రశ్నింపగా వసిష్ఠుడు ఏమని చెప్పెనో, ఓ! సూతా! నీవును శుకాదులును వినుడు.

వసిష్ఠుడు పలికెను : ఓ వ్యాసా! పూర్వము అగ్ని దేవుడు మునులకును, దేవతలకును, నాకును ఏ విధముగా చెప్పెనో ఆ విధముగ సర్వవ్యాప్త మగు, ద్వివిధ మైన బ్రహ్మను గూర్చి చెప్పదను; వినుము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 4🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj*

*🌻. Chapter 1- Questioning - 1 🌻 *

I. I bow to (goddesses) Śrī (Lakṣmī), Sarasvatī, Gaurī (Pārvatī) and gods Gaṇeśa, Skanda, Īśvara (Śiva), Brahmā, Vahni, Indra and other celestials and Vāsudeva (Kṛṣṇa).

2. Śaunaka and other sages (staying at the sacred forest) of Naimiṣa, conducting a sacrifice devoted to Hari (Viṣṇu), welcomed Sūta (the reciter of ancient lores) on his arrival there after a pilgrimage.

The sages said:

3. O Sūta! You are adored by us. Tell us the quintessence of all things, by knowing which alone one gets omniscience.

Sūta said:

4. The illustrious Viṣṇu (who is) the Supreme Being (and) the Creator, is the quintessence. By know ng that ‘I am Brahman’, one gets omniscience.

5. Two Brahmans are to be known, the Śabdabrahman (the Vedas) and Parabrahman (the Supreme Spirit). The Ātharvaṇī Śruti (Muṇḍakopaniṣad) refers to this as the two (kinds of) knowledge to be learnt.

6. Myself, (sage) Śuka (son of sage Vyāsa), (sage) Paila. (disciple of sage Vyāsa) and others bowed Vyāsa having resorted to the hermitage at (holy) Badarikāśrama. He imparted to us the quintessence (of all things).

Vyāsa said:

7. O Sūta, listen in the company of Śuka and others what Vasiṣṭha has said to me about the excellent quintessence of the Brahman, when he was requested by the sages.

Vasiṣṭha said:

8. O Vyāsa, Listen, in entirety, to the two (kinds of) knowledge, which (god) Agni narrated to me in the company of the sages and the celestials.

9. The excellent Purāṇa (known as) the Āgneya (or Agni) and the two (kinds of) knowledge, Parā (the superior) and Aparā (the inferior) signifying respectively the knowledge about the Brahman and the knowledge about thel!.gveda and so on, which satisfies all the celestials (will be narrated to you).

10. The Purāṇa spoken by Agni and designated as the Āgneya by Brahmā and which gives bhukti (enjoyment) and mukti (release from mundane existence) for those who read it or hear it (will be narrated to you).

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 అగ్ని మహా పురాణము చానెల్ 🌹Agni Maha Purana
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 DAILY WISDOM - 234 🌹*
*🍀 📖 from Lessons on the Upanishads 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 21. Work Done as a Duty Alone can Purify 🌻*

*When you do a work, you must put a question to yourself: “What is the reason behind engaging in that work? Is it because there is some extraneous or ulterior motive behind that work? Or is it done for mere self-purification? You must distinguish between work done as a job and work done as a duty. A duty may not apparently bring you a material benefit at the very outset, but it will bring you an invisible benefit. That is why duty is adored so much everywhere and people say you must do your duty. If duty is not so very important, but a remunerative job is the only thing that is important, then insistence on duty would be out of point.*

*Everybody says duty must be done; but, what is duty? Work done as a duty alone can purify; no other work can purify the self. It is not any kind of labour that can be regarded as karma yoga. So, what is this duty that we are talking of which is going to chasten the personality of the individual, and purify it? Briefly it can be called unselfish action. It is a work that you do for the benefit that may accrue to a larger dimension of reality, and not merely to the localised entity called your own individual self.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 135 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. మేలుకోవడానికి నీ సమస్త శక్తుల్ని కేంద్రీకరించు. నువ్వు ఎప్పుడయితే పూర్తిగా మేలుకుంటావో, ఇరవై నాలుగు గంటలూ మెలకువతో వుంటావో, అంటే నిద్రపోతున్న సమయంలోనూ స్పృహతో వుంటావో, చైతన్యంతో వుంటావో శరీరం నిద్రపోతున్నా ఆత్మ మేల్కొని వుంటుందో అది నిజమైన మెలకువ. అప్పుడు వ్యక్తి సంతృప్తి చెందుతాడు. 🍀*

*మన కోరికలు మన కలలు. మన ఆలోచనలన్నీ మన కలలు. మనం నిద్రపోతూ వుంటాం కాబట్టి మనం కలలో జీవిస్తూ వుంటాం. కలలన్నవి మన నిద్రలో మాత్రమే వునికిలో వుంటాయి. మనం మేలుకున్న వెంటనే కలలు మాయమవుతాయి. కలల్ని దాటి వెళ్ళడమంటే మేలుకోవడమే. ఇదే సరయిన సమయం. నువ్వు కావలసినంత నిద్రపోయావు. ఎన్నెన్నో జీవితాల పాటు నిద్రపోయావు. మేలుకోవడానికి కలిగిన ఈ అవకాశాన్ని చేజార్చుకోకు. యిది అరుదయిన అవకాశం. దీన్ని సులభంగా చేజార్చుకోవచ్చు. కాబట్టి మేలుకోవడానికి నీ సమస్త శక్తుల్ని కేంద్రీకరించు.*

*ఆరంభంలో దాదాపు అది అసాధ్యమనిపిస్తుంది. ఎట్లా చెయ్యాలి? వ్యక్తి ప్రయత్నించే కొద్దీ వీలవుతుంది. ఒక క్షణం ఒక మెరుపు చాలు. నీ అస్తిత్వాన్ని మేలుకొలుపుతుంది. అట్లా క్రమక్రమంగా క్షణాలు కొనసాగుతాయి. నువ్వు ఎప్పుడయితే పూర్తిగా మేలుకుంటావో, ఇరవై నాలుగు గంటలూ మెలకువతో వుంటావో, అంటే నిద్రపోతున్న సమయంలోనూ స్పృహతో వుంటావో, చైతన్యంతో వుంటావో శరీరం నిద్రపోతున్నా ఆత్మ మేల్కొని వుంటుందో అది నిజమైన మెలకువ. అప్పుడు వ్యక్తి సంతృప్తి చెందుతాడు. తన చోటికి చేరతాడు. దానికి పూర్వం నీకు చేతనయినంతగా ప్రయత్నించు. మెలకువకు ప్రయత్నించు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 72 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 58. అపౌరుషేయము 🌻*

*అజ్ఞానమును, అంధ విశ్వాసములను, భీతిని పారద్రోలుట, జ్ఞానమును, సంకల్ప బలమును, ధీరతను పెంపొందించుట మా ప్రణాళికలోని అంశములు. ప్రజ్ఞా వికాసములకు తోడ్పడు ప్రతి ప్రయత్నమునకు మేము తోడ్పడుదుము. తత్సంబంధమైన సంకల్పములను అదృశ్యముగ ప్రోత్సహింతుము. ఊహలను అపోహలను నిర్మూలించి, జీవులకు కర్తవ్యోన్ముఖులను చేయుట కూడ మా ప్రణాళికలో భాగము. శ్రమకోర్చి పనిచేయువారికి సహకారమునందించి సంఘ జీవనమున వారికొక చక్కని ప్రణాళిక నేర్పరచి తీర్చిదిద్దుట తెర వెనుక నుండి నిర్వర్తించు చుందుము.*

*మాచే ఎన్నుకొనబడిన వారికి స్ఫూర్తిని కలిగించి వారి నుండి సనాతనమగు ధర్మమార్గమును జనజీవనమునకు అందించుట గూడ మా కర్తవ్యములలో ఒకటి. అసామాన్యునివలె శక్తి సామర్థ్యములను గఱపి సామాన్య జీవనమున మా శిక్షితులు లోకహిత కార్యములను నిర్వర్తించు చుందురు. ఉత్తమోత్తమమైన సత్యము, ధర్మము అతి నిర్మలముగను, సామాన్యముగను, రహస్యముగను నిర్వర్తింపబడుట సృష్టి యందలి ధర్మము. ఈ ధర్మమును పాటించుచు వేలాది సంవత్సరములు ప్రత్యేక గుర్తింపు కొఱకు కాక, లోకహితము కొఱకు నిర్వర్తించుట మా విధానము. మే మొనర్చునదంతయు అపౌరుషేయమే.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఏకదండి, ద్విదండి, త్రిదండి... స్వాముల చేతిలో కర్రలెందుకు ఉంటాయో తెలుసా...🌹*

🌿ఆది శంకరాచార్యుల నుంచి నేటి అందరు స్వాముల వరకూ చేతిలో కర్ర ఉండటాన్ని అందరూ గమనించే ఉంటారు. 

🌿స్వామీజీ అంటే కర్ర పట్టుకోవాలనుకుంటే పొరపాటే..

🌿దాని వెనుక ఎంత ఆంతర్యం ఉందో తెలుసా...

🌿ఆదిశంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజచార్యులు, జీయర్ స్వాములు మరికొందరు..వీళ్లందరి చేతిలో పొడవాటి కర్ర ఉంటుంది గమనించారా. 

🌿ఏ సమయంలో చూసినా వాళ్ల చేతిలో ఉంటాయి. 

🌿అదేమైనా ఊతకోసమా అంటే కానేకాదు. 

🌿మరి ఎప్పుడూ చేత్తో పట్టుకుని ఉంటారెందుకు అంటారా..

🌿అవి వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత, అద్వైత భావానికి గుర్తు.  

🌿ఈ (దండాలు) కర్రలు వివిధ ఆకారాల్లో ఉంటాయి. 

🌿అయితే ప్రతి ఆకారానికి ఓ అర్థం ఉంది.  

🌿గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం పంచభూతాల సమ్మేళనమే మనిషి, 

🌿కాబట్టి సన్యాసులు ఐదడుగుల కర్రను చేతపట్టుకుని తిరుగుతారని చెబుతారు.  

🌿ఈ కర్రల్లో మూడు రకాలున్నాయి అవే ఏకదండి, ద్విదండి, త్రిదండి. 

🌿ఏకదండి:- 🌿🌿🌿 

🌿ఒక కర్రను (ఏకదండి ) ధరించేవారు అద్వైత సిద్ధాంతాన్ని విశ్వసిస్తారు. 

🌿అందుకు ఉదాహరణ ఆదిశంకరాచార్యులు. 

🌿అద్వైతం అంటే జీవుడు, దేవుడు ఒక్కటేననే సిద్ధాంతం. 

🌿అంతరాత్మకు విరుద్ధంగా అక్రమ, అన్యాయ మార్గాన సంచరించినా, ప్రవర్తించినా ఆ పాపఫలితాన్ని బతికి ఉండగానే ఏదో ఒక రూపంలో ఇక్కడే తప్పకుండా అనుభవించక తప్పదనే సిద్ధాంతాన్ని వారు బోధిస్తారు. 

🌿వీరి చేతిలో జ్ఞానానికి సంకేతమైన రావిచెట్టు నుంచి సేకరించిన కర్ర ఉంటుంది.

🌿ద్విదండి:- 🌿🌿🌿 

🌿రెండు కర్రలు కలిపి ఒక్కటిగా కట్టి (ద్విదండి)ధరించి బోధనలు చేసేవారు ద్వైత సిద్ధాంతాన్ని అవలంబించేవారు.  

🌿ఇందుకు ఉదాహరణ మధ్వాచార్యులు. 

🌿వీరిని ‘ద్విదండి స్వాములు’అంటారు. దేవుడు వేరు– జీవుడు వేరు అని బోధిస్తారు. 

🌿జీవాత్మ, పరమాత్మ వేరువేరన్నది వీరి ఉద్దేశం. 

🌿జీయర్ లు అందరూ ఈ సిద్ధాంతం కిందకు వస్తారు.

🌿త్రిదండి:- 🌿🌿🌿 

🌿మూడు కర్రలను ఒకే కట్టగా కట్టి (త్రిదండి) భుజాన పెట్టుకునేవారిని తత్వత్రయం అంటారు. 

🌿ఇలా ధరించే వారు విశిష్ఠాద్వైతాన్ని బోధిస్తారు. 

🌿వీరిది రామానుజాచార్యుల పరంపర. 

🌿శరీరంలో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉంటాడని విశ్వసిస్తారు. 

🌿జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి సత్యాలని, ఈ మూడింటిని నారాయణ తత్వంగా నమ్ముతూ, 

🌿జీవుడు ఆజ్ఞానంతో సంసార బంధాన చిక్కుకుంటాడని, 

🌿నారాయణుని శరణు వేడిన వారు భగవదనుగ్రహం వలన అజ్ఞానం నుంచి విముక్తులై, 

🌿మరణానంతరం నారాయణ సాన్నిధ్యం, మోక్షం పొందుతారని, 

🌿వారికి మరుజన్మ ఉండదని విశిష్ఠాద్వైతపు సిద్ధాంతాన్ని బోధిస్తారు.

🌿ఇది ఏకదండి, ద్విదండి, త్రిదండి అనే వాటి గురించిన వివరణ, స్వస్తి.
🌹🌹🌹🌹🌹.

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹