మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 149
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 149 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. మానవజన్మము - విశిష్టత -2 🌻
ఈ శరీరం, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి మొదలైన ఉపకరణాలు మనకి ఇవ్వబడినవని తెలుసుకోవాలి. వీటిని సద్వనియోగపరచి ఇతర జీవుల యందు తనకు గల కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించడం మానవుని ప్రధాన లక్ష్యం. కేవలం తన మేధాశక్తిని మాత్రమే ఆశ్రయించి తద్వారా ఇతర జీవులను తన వశంలో పెట్టుకునే ప్రయత్నం రాక్షసత్వమే అవుతుంది. మానవ జన్మము చక్కని శిక్షణ శిబిరము.
మొదట తన కుటుంబ సభ్యులతో మొదలై క్రమంగా వ్యాప్తి చెంది సామాజిక జీవనంలోకి ప్రవేశించి అనేక సన్నివేశముల రూపంలో ప్రకృతి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకుంటాడు మానవుడు. అటుపైన తన కోసం తాను జీవించడమే కాకుండా లోకహితం కోరి పని చేయడం మొదలుపెట్టాలి. అప్పుడే వ్యక్తిగతమనే బంధం నుంచి విముక్తుడవుతాడు. అప్పుడు అప్రయత్నంగానే లోకహితం కోసం పనిచేయగలిగే సామర్థ్యం ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాగ అయినప్పుడే మానవుడు ఉత్తమ మానవుడుగా ఆవిర్భవిస్తాడు....
...✍️ మాస్టర్ ఇ.కె.
🌹 🌹 🌹 🌹 🌹
13 Feb 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment