Siva Sutras - 271 : 3 - 45. bhuyah syat pratimilanam - 1 / శివ సూత్రములు - 271 : 3 - 45. భూయః స్యాత్ ప్రతిమిలానం - 1


🌹. శివ సూత్రములు - 271 / Siva Sutras - 271 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

3వ భాగం - ఆణవోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 3 - 45. భూయః స్యాత్ ప్రతిమిలానం - 1 🌻

🌴. చైతన్యం యొక్క ప్రకాశం వల్ల పరిమిత జీవి కరిగి పోవడంతో, స్వచ్ఛమైన స్వయం తిరిగి దాని అసలైన స్వచ్ఛమైన స్థితికి తిరిగి వస్తుంది. 🌴


భూయాస్ – మళ్లీ మళ్లీ; స్యాత్ – ఉంది; ప్రతిమిలానం – భగవంతుని గురించిన అవగాహన, అంతర్లీనంగా మరియు బాహ్యంగా.

ఈ సూత్రంతో, భగవంతుడు పరిపూర్ణ యోగి గురించి తన విశదీకరణలను పూర్తి చేసాడు.

భగవంతుడు అని కూడా పిలువబడే పరమాత్మ చైతన్యం నుండి విశ్వం ఉద్భవించింది. భగవంతుని స్థితిని ఏకీకృత స్వరంలో వివరించలేము. ఆలోచన ప్రక్రియల వైవిధ్యం వివిధ వ్యక్తులకు వివిధ రకాల అనుభవాలకు దారి తీస్తుంది. గరిష్టంగా, భగవంతుని భావనను విశ్వంలో జరిగే ప్రతిదానికీ అనంతం నుండి ఒక మూలంగా వివరించవచ్చు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Siva Sutras - 271 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 3 - āṇavopāya

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 3 - 45. bhūyah syāt pratimīlanam - 1 🌻

🌴. With the illumination of the consciousness and dissolution of the beingness, the pure-self reverts to its original, pure state again. 🌴


bhūyas – again and again; syāt – there is; pratimīlanam – awareness of the Lord, both inwardly and outwardly.

With this sūtra, the Lord completes His elucidations of a perfect yogi.

The universe arises from the Supreme Consciousness which is also known as the Lord. The state of the Lord cannot be explained in a unified voice. The diversity of thought processes leads to different kinds of experiences for different persons. At the most, the concept of the Lord can be explained as a source from infinity, for everything that happens in the universe.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


సిద్దేశ్వరయానం - 113 Siddeshwarayanam - 113

🌹 సిద్దేశ్వరయానం - 113 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 9 🏵


అమెరికా సంచారములో కూడా చిత్ర విచిత్రాలు ఎన్నో జరిగినవి. అట్లాంటాలో యజ్ఞం చేస్తుంటే దేవతతో పాటు ఒక సిద్ధుడు కూడా రావటం గమనించి ఫలానా సిద్ధుడు వచ్చాడని ఆయన ఆకృతి, పేరు, చెప్పినపుడు ప్రేక్షకులలో నుండి ఒక వ్యక్తి లేచి "నేను ఆయోగి శిష్యుడను. ఆయన పేరు గాని ఆకృతిగాని ఇక్కడ ఎవరికి తెలియదు. దానిని మేము రహస్యంగా ఉంచుతాము. మీరు వివరాలు చెప్పటం చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది” అన్నారు. న్యూజెర్సీలో దేవీభాగవత ప్రవచనం జరుగుతుంటే ఒక ప్రేక్షకుడు మామూలు కెమెరాతో నా ఫోటో తీయగా శిరస్సు చుట్టూ ఒక కాంతివలయం పడిందట ! అతడు వెంటనే తన కెమారాను ఆ ఫోటోను ప్రేక్షకులకు చూపించి సంభ్రమానందాలను ప్రకటించాడు. కాలిఫోర్నియా లోని శాన్ ఫ్రాన్సిస్కోలో రాధాదేవి పూజ చేసినపుడు వాతావరణంలో ఏదో ప్రసన్నమైన మార్పు వచ్చిందన్న అనుభూతి అందరికీ కలిగింది. దానికి కారణమైన బృందావనేశ్వరిని ఇలా వర్ణించాను.

ప్రేమరసాధిదేవియయి పెన్నిధియై అల కాలిఫోర్నియా వ్యోమమునందు కాంచన మయోజ్వల దివ్యరధంబు నెక్కి భవ్యామృత వీక్షణంబుల దయన్ కురిపించుచు వచ్చినట్టి కృ ష్ణామర వృక్ష పుష్పమధు వద్భుతసుందరి రాధ గొల్చెదన్.

ఆ పూజకు కారకుడైన గృహస్థు పూర్వజన్మలో బృందావన భక్తుడు కావటం. దానిని గుర్తింప చేయటానికి రాధాదేవి చేసిన లీల ఇది. ఇటువంటివి మరికొన్ని విశేషాలు కూడా. ఒక బగళాముఖి ఉపాసకుడు, ఒక యక్షుడు, ఒక గంధర్వకాంత, ఒక రెడ్ ఇండియన్ సూక్ష్మదేహి, మొదలైనవారు వివిధ ప్రదేశాలలో కనిపించి తమ తమ విశేషాలను తెలియచేసి సౌహార్దభావం ప్రదర్శించారు. గణపతి మంత్రాన్ని ఉపదేశం పొందిన ఒక మహిళ తను పూజ చేస్తూ పాలు నైవేద్యం పెడితే ఆ విగ్రహం పాలు త్రాగిందని ఆనందంతో చెప్పింది. చాలా సంవత్సరాల క్రింద ప్రపంచంలో అనేక దేశాలలో ఇటువంటి సంఘటనలు జరగటం పత్రికలు చదివిన వారికి గుర్తు ఉండి ఉంటుంది. ఈ అమెరికా వాసినికి ఇది ఆమెకు మాత్రమే పరిమితమైన అనుభవం. ఒక ఆప్తుని కుమారుడు న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటరులో పనిచేస్తున్నాడు. అతని ప్రార్ధన మీద రాధామంత్రాన్ని ఉపదేశించాను. శ్రద్ధగా జపం చేస్తున్నాడు. ఒక రోజు ఉదయం ఆఫీసుకు బయలుదేరగానే కదలలేనంత జ్వరం వచ్చింది. పై అధికారికి ఫోను చేసి సెలవు మంజూరు చేయమని కోరి ఇంటిలోనే ఉండిపోయాడు. కాసేపటికి అతని ఆఫీసు భవనంలోకి విమానం దూసుకు వెళ్ళి కొన్ని వేలమంది మరణించారు. ఇతడు ఆఫీసుకు వెళ్ళి ఉంటే మిగతావాళ్ళ గతే పట్టేది. ఇతనికి జ్వరం వచ్చేటట్లు చేసి ఆఫీసుకు వెళ్ళకుండా చేసింది మంత్ర దేవత. దేవతల పద్ధతులు చిత్రంగా ఉంటవి.

అమెరికా సంచారంలో దాదాపు 20 మంది యొక్క పూర్వజన్మ రహస్యాలను దేవతలు తెలియచేశారు. వారి సమస్యలను పరిష్కరించడానికి అధ్యాత్మికాభివృద్ధికి ఇవి ఎంతో దోహదం చేసినవి.

ఇటీవల కొద్ది సంవత్సరాలుగా ఇన్నీ అని లెక్కపెట్టటానికి వీలులేనంతగా ఎందరో వ్యక్తుల పూర్వపరజన్మ విశేషాలను పరమేశ్వరి తెలియచేస్తూ ఉన్నది. వారిలో ఎక్కువ భాగం నాతో జన్మాంతర అనుబంధం కలవారే. కొద్ది మంది ఏ సంబంధం లేనివారు కూడా ఉన్నారు. మా పీఠంలోని సన్యాసులు దాదాపు అందరి జన్మరహస్యాలను దేవి తెలిపింది. మౌనస్వామితో అయిదువేల ఏండ్ల నుండి ఉన్న జన్మనుబంధాల విశేషాలను జగన్మాత చూపించింది. ఒక సన్యాసి పూర్వజన్మలో బ్రహ్మపుత్రాతీరంలోని నాగసాధువు. ఇంకొకరు కాశీలో ఒక వేదపండితుని కుమారుడు. వేరొకరు హరిద్వారంలో తపస్వి, అలానే మా పీఠంలో అర్చకుడు పూర్వజన్మలో ఒక మళయాళ మంత్రసిద్ధుని శిష్యుడు. గుంటూరులోని కాళీమందిర నిర్మాణానికి సహాయపడిన ఒక ధనవంతుడు పూర్వం నాగాలాండ్లో దైవభక్తుడు. ఒక భక్తురాలు రెండువేల అయిదువందల సంవత్సరాల క్రింద బుద్ధుడు సాధన దశలో ఉన్నపుడు బోధివృక్షం దగ్గర ఆయనకు అన్నం పెట్టిన సుజాత. ఇప్పుడు ఒక గొప్ప యోగిగా ప్రసిద్ధి చెందిన ఒక వ్యక్తి పూర్వం ఒక కొండమీద కాళీసాధన చేసి అది సిద్ధించక దత్తాత్రేయ సాధనలోకి మారి ఆస్వామి అనుగ్రహాన్ని కొంత పొందాడు. ఇప్పుడు జన్మమారి బ్రహ్మచారియై తీవ్రసాధన చేసి యోగివర్యునిగా కీర్తించబడుతున్నాడు. యజ్ఞప్రియుడైన ఒకరాజు జన్మమారి ఇప్పుడు ఒక రైతు కుటుంబంలో పుట్టి వాసనా బలం వల్ల కొన్ని వందల యజ్ఞాలను చేయించి పురాణప్రవచన కార్యక్రమాలు ఏర్పాటు చేయిస్తున్నాడు.


( సశేషం )

🌹🌹🌹🌹🌹


విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 957 / Vishnu Sahasranama Contemplation - 957


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 957 / Vishnu Sahasranama Contemplation - 957 🌹

🌻 957. ప్రణవః, प्रणवः, Praṇavaḥ 🌻

ఓం ప్రణవాయ నమః | ॐ प्रणवाय नमः | OM Praṇavāya namaḥ

ఓఙ్కారః ప్రణవో నామ వాచకః పరమాత్మనః ।
తదభేదోపచారేణ స ప్రణవ ఇతీర్యతే ॥

ప్రణవమనేది పరమాత్మను చెప్పు ఓంకారము. ఆ శబ్దమునకును, ఆ శబ్దముచే చెప్పబడు పరమాత్మునకును అభేదమును వ్యవహారమునకై ఆరోపించి గ్రహించుటచేత పరమాత్ముడే 'ప్రణవః' అనబడును.

409. ప్రణవః, प्रणवः, Praṇavaḥ


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 957🌹

🌻 957. Praṇavaḥ 🌻

OM Praṇavāya namaḥ

ओङ्कारः प्रणवो नाम वाचकः परमात्मनः ।
तदभेदोपचारेण स प्रणव इतीर्यते ॥

Oṅkāraḥ praṇavo nāma vācakaḥ paramātmanaḥ,
Tadabhedopacāreṇa sa praṇava itīryate.


Praṇava is Omkāra (ॐ) signifying the Paramātman. Being non-different from it, He is Praṇavaḥ.


409. ప్రణవః, प्रणवः, Praṇavaḥ

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

आधारनिलयोऽधाता पुष्पहासः प्रजागरः ।
ऊर्ध्वगस्सत्पथाचारः प्राणदः प्रणवः पणः ॥ १०२ ॥

ఆధారనిలయోఽధాతా పుష్పహాసః ప్రజాగరః ।
ఊర్ధ్వగస్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ॥ 102 ॥

Ādhāranilayo’dhātā puṣpahāsaḥ prajāgaraḥ,
Ūrdhvagassatpathācāraḥ prāṇadaḥ praṇavaḥ paṇaḥ ॥ 102 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


हम चेतना की विभिन्न अभिव्यक्तियाँ हैं (We are different expressions of consciousness)


🌹🎥 हम चेतना की विभिन्न अभिव्यक्तियाँ हैं 🎥🌹

प्रसाद भारद्वाज


https://youtu.be/J_uIlSzxyMQ

चेतना और इसके विभिन्न रूपों के गहरे अर्थ को जानिए। समझें कि कैसे चेतना हमें ब्रह्मांड से जोड़ती है और आत्म-जागरूकता के माध्यम से हमें आध्यात्मिक उन्नति की ओर ले जाती है। बाहरी दुनिया और हमारे आंतरिक आत्मा के बीच के अंतर को पहचानकर आत्म-ज्ञान की यात्रा शुरू करें।




🌹 31, JULY 2024 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు🌹

🍀🌹 31, JULY 2024 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు🌹🍀
1) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 957 / Vishnu Sahasranama Contemplation - 957 🌹🌻 957. ప్రణవః, प्रणवः, Praṇavaḥ 🌻
2) 🌹 సిద్దేశ్వరయానం - 113🌹
🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 9 🏵
3) 🌹. శివ సూత్రములు - 271 / Siva Sutras - 271 🌹
🌻 3 - 45. భూయః స్యాత్ ప్రతిమిలానం - 1 / 3 - 45. bhūyah syāt pratimīlanam - 1 🌻
6) 🌹🎥 గురువు యొక్క ప్రాముఖ్యత - అజ్ఞానపు చీకటి నుండి దైవిక కాంతికి ప్రయాణం 🎥🌹
Like, Subscribe and Share 👀



🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹🎥 గురువు యొక్క ప్రాముఖ్యత - అజ్ఞానపు చీకటి నుండి దైవిక కాంతికి ప్రయాణం 🎥🌹*

*ఈ వీడియోలో, గురు-శిష్యుల సంబంధం యొక్క లోతైన ప్రాముఖ్యత తెలిపాను. ఇది షరతులు లేని దైవిక ప్రేమ మరియు జ్ఞానంతో పాతుకుపోయిన బంధం. దైవిక సంకల్పం ద్వారా నియమించబడిన ఒక గురువు మనలను అజ్ఞానం అనే చీకటి నుండి జ్ఞానం మరియు స్వేచ్ఛ యొక్క శాశ్వతమైన వెలుగులోకి ఎలా నడిపిస్తాడో తెలుసుకోండి.*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 🎥 The Importance of a Guru: A Journey from Darkness to Divine Light 🎥🌹*

*In this video, we explore the profound significance of the guru-disciple relationship, a bond rooted in unconditional divine love and wisdom. Discover how a guru, appointed by divine will, leads us from the darkness of ignorance to the eternal light of wisdom and freedom. Join us as we delve into the sacred essence of this relationship and learn how it can transform your spiritual journey.*
*✍️. Prasad Bharadwaj*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹🎥 हम चेतना की विभिन्न अभिव्यक्तियाँ हैं 🎥🌹
प्रसाद भारद्वाज

चेतना और इसके विभिन्न रूपों के गहरे अर्थ को जानिए। समझें कि कैसे चेतना हमें ब्रह्मांड से जोड़ती है और आत्म-जागरूकता के माध्यम से हमें आध्यात्मिक उन्नति की ओर ले जाती है। बाहरी दुनिया और हमारे आंतरिक आत्मा के बीच के अंतर को पहचानकर आत्म-ज्ञान की यात्रा शुरू करें।


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 957 / Vishnu Sahasranama Contemplation - 957 🌹*

*🌻 957. ప్రణవః, प्रणवः, Praṇavaḥ 🌻*

*ఓం ప్రణవాయ నమః | ॐ प्रणवाय नमः | OM Praṇavāya namaḥ*

*ఓఙ్కారః ప్రణవో నామ వాచకః పరమాత్మనః ।*
*తదభేదోపచారేణ స ప్రణవ ఇతీర్యతే ॥*

*ప్రణవమనేది పరమాత్మను చెప్పు ఓంకారము. ఆ శబ్దమునకును, ఆ శబ్దముచే చెప్పబడు పరమాత్మునకును అభేదమును వ్యవహారమునకై ఆరోపించి గ్రహించుటచేత పరమాత్ముడే 'ప్రణవః' అనబడును.*

409. ప్రణవః, प्रणवः, Praṇavaḥ

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 957🌹*

*🌻 957. Praṇavaḥ 🌻*

*OM Praṇavāya namaḥ*

ओङ्कारः प्रणवो नाम वाचकः परमात्मनः ।
तदभेदोपचारेण स प्रणव इतीर्यते ॥

*Oṅkāraḥ praṇavo nāma vācakaḥ paramātmanaḥ,*
*Tadabhedopacāreṇa sa praṇava itīryate.*

*Praṇava is Omkāra (ॐ) signifying the Paramātman. Being non-different from it, He is Praṇavaḥ.*

409. ప్రణవః, प्रणवः, Praṇavaḥ

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
आधारनिलयोऽधाता पुष्पहासः प्रजागरः ।ऊर्ध्वगस्सत्पथाचारः प्राणदः प्रणवः पणः ॥ १०२ ॥
ఆధారనిలయోఽధాతా పుష్పహాసః ప్రజాగరః ।ఊర్ధ్వగస్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ॥ 102 ॥
Ādhāranilayo’dhātā puṣpahāsaḥ prajāgaraḥ,Ūrdhvagassatpathācāraḥ prāṇadaḥ praṇavaḥ paṇaḥ ॥ 102 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 సిద్దేశ్వరయానం - 113 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*

*🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 9 🏵*

*అమెరికా సంచారములో కూడా చిత్ర విచిత్రాలు ఎన్నో జరిగినవి. అట్లాంటాలో యజ్ఞం చేస్తుంటే దేవతతో పాటు ఒక సిద్ధుడు కూడా రావటం గమనించి ఫలానా సిద్ధుడు వచ్చాడని ఆయన ఆకృతి, పేరు, చెప్పినపుడు ప్రేక్షకులలో నుండి ఒక వ్యక్తి లేచి "నేను ఆయోగి శిష్యుడను. ఆయన పేరు గాని ఆకృతిగాని ఇక్కడ ఎవరికి తెలియదు. దానిని మేము రహస్యంగా ఉంచుతాము. మీరు వివరాలు చెప్పటం చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది” అన్నారు. న్యూజెర్సీలో దేవీభాగవత ప్రవచనం జరుగుతుంటే ఒక ప్రేక్షకుడు మామూలు కెమెరాతో నా ఫోటో తీయగా శిరస్సు చుట్టూ ఒక కాంతివలయం పడిందట ! అతడు వెంటనే తన కెమారాను ఆ ఫోటోను ప్రేక్షకులకు చూపించి సంభ్రమానందాలను ప్రకటించాడు. కాలిఫోర్నియా లోని శాన్ ఫ్రాన్సిస్కోలో రాధాదేవి పూజ చేసినపుడు వాతావరణంలో ఏదో ప్రసన్నమైన మార్పు వచ్చిందన్న అనుభూతి అందరికీ కలిగింది. దానికి కారణమైన బృందావనేశ్వరిని ఇలా వర్ణించాను.*

*ప్రేమరసాధిదేవియయి పెన్నిధియై అల కాలిఫోర్నియా వ్యోమమునందు కాంచన మయోజ్వల దివ్యరధంబు నెక్కి భవ్యామృత వీక్షణంబుల దయన్ కురిపించుచు వచ్చినట్టి కృ ష్ణామర వృక్ష పుష్పమధు వద్భుతసుందరి రాధ గొల్చెదన్.*

*ఆ పూజకు కారకుడైన గృహస్థు పూర్వజన్మలో బృందావన భక్తుడు కావటం. దానిని గుర్తింప చేయటానికి రాధాదేవి చేసిన లీల ఇది. ఇటువంటివి మరికొన్ని విశేషాలు కూడా. ఒక బగళాముఖి ఉపాసకుడు, ఒక యక్షుడు, ఒక గంధర్వకాంత, ఒక రెడ్ ఇండియన్ సూక్ష్మదేహి, మొదలైనవారు వివిధ ప్రదేశాలలో కనిపించి తమ తమ విశేషాలను తెలియచేసి సౌహార్దభావం ప్రదర్శించారు. గణపతి మంత్రాన్ని ఉపదేశం పొందిన ఒక మహిళ తను పూజ చేస్తూ పాలు నైవేద్యం పెడితే ఆ విగ్రహం పాలు త్రాగిందని ఆనందంతో చెప్పింది. చాలా సంవత్సరాల క్రింద ప్రపంచంలో అనేక దేశాలలో ఇటువంటి సంఘటనలు జరగటం పత్రికలు చదివిన వారికి గుర్తు ఉండి ఉంటుంది. ఈ అమెరికా వాసినికి ఇది ఆమెకు మాత్రమే పరిమితమైన అనుభవం. ఒక ఆప్తుని కుమారుడు న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటరులో పనిచేస్తున్నాడు. అతని ప్రార్ధన మీద రాధామంత్రాన్ని ఉపదేశించాను. శ్రద్ధగా జపం చేస్తున్నాడు. ఒక రోజు ఉదయం ఆఫీసుకు బయలుదేరగానే కదలలేనంత జ్వరం వచ్చింది. పై అధికారికి ఫోను చేసి సెలవు మంజూరు చేయమని కోరి ఇంటిలోనే ఉండిపోయాడు. కాసేపటికి అతని ఆఫీసు భవనంలోకి విమానం దూసుకు వెళ్ళి కొన్ని వేలమంది మరణించారు. ఇతడు ఆఫీసుకు వెళ్ళి ఉంటే మిగతావాళ్ళ గతే పట్టేది. ఇతనికి జ్వరం వచ్చేటట్లు చేసి ఆఫీసుకు వెళ్ళకుండా చేసింది మంత్ర దేవత. దేవతల పద్ధతులు చిత్రంగా ఉంటవి.*

*అమెరికా సంచారంలో దాదాపు 20 మంది యొక్క పూర్వజన్మ రహస్యాలను దేవతలు తెలియచేశారు. వారి సమస్యలను పరిష్కరించడానికి అధ్యాత్మికాభివృద్ధికి ఇవి ఎంతో దోహదం చేసినవి.*

*ఇటీవల కొద్ది సంవత్సరాలుగా ఇన్నీ అని లెక్కపెట్టటానికి వీలులేనంతగా ఎందరో వ్యక్తుల పూర్వపరజన్మ విశేషాలను పరమేశ్వరి తెలియచేస్తూ ఉన్నది. వారిలో ఎక్కువ భాగం నాతో జన్మాంతర అనుబంధం కలవారే. కొద్ది మంది ఏ సంబంధం లేనివారు కూడా ఉన్నారు. మా పీఠంలోని సన్యాసులు దాదాపు అందరి జన్మరహస్యాలను దేవి తెలిపింది. మౌనస్వామితో అయిదువేల ఏండ్ల నుండి ఉన్న జన్మనుబంధాల విశేషాలను జగన్మాత చూపించింది. ఒక సన్యాసి పూర్వజన్మలో బ్రహ్మపుత్రాతీరంలోని నాగసాధువు. ఇంకొకరు కాశీలో ఒక వేదపండితుని కుమారుడు. వేరొకరు హరిద్వారంలో తపస్వి, అలానే మా పీఠంలో అర్చకుడు పూర్వజన్మలో ఒక మళయాళ మంత్రసిద్ధుని శిష్యుడు. గుంటూరులోని కాళీమందిర నిర్మాణానికి సహాయపడిన ఒక ధనవంతుడు పూర్వం నాగాలాండ్లో దైవభక్తుడు. ఒక భక్తురాలు రెండువేల అయిదువందల సంవత్సరాల క్రింద బుద్ధుడు సాధన దశలో ఉన్నపుడు బోధివృక్షం దగ్గర ఆయనకు అన్నం పెట్టిన సుజాత. ఇప్పుడు ఒక గొప్ప యోగిగా ప్రసిద్ధి చెందిన ఒక వ్యక్తి పూర్వం ఒక కొండమీద కాళీసాధన చేసి అది సిద్ధించక దత్తాత్రేయ సాధనలోకి మారి ఆస్వామి అనుగ్రహాన్ని కొంత పొందాడు. ఇప్పుడు జన్మమారి బ్రహ్మచారియై తీవ్రసాధన చేసి యోగివర్యునిగా కీర్తించబడుతున్నాడు. యజ్ఞప్రియుడైన ఒకరాజు జన్మమారి ఇప్పుడు ఒక రైతు కుటుంబంలో పుట్టి వాసనా బలం వల్ల కొన్ని వందల యజ్ఞాలను చేయించి పురాణప్రవచన కార్యక్రమాలు ఏర్పాటు చేయిస్తున్నాడు.*

*( సశేషం )*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 271 / Siva Sutras - 271 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*3వ భాగం - ఆణవోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 3 - 45. భూయః స్యాత్ ప్రతిమిలానం - 1 🌻*

*🌴. చైతన్యం యొక్క ప్రకాశం వల్ల పరిమిత జీవి కరిగి పోవడంతో, స్వచ్ఛమైన స్వయం తిరిగి దాని అసలైన స్వచ్ఛమైన స్థితికి తిరిగి వస్తుంది. 🌴*

*భూయాస్ – మళ్లీ మళ్లీ; స్యాత్ – ఉంది; ప్రతిమిలానం – భగవంతుని గురించిన అవగాహన, అంతర్లీనంగా మరియు బాహ్యంగా.*
*ఈ సూత్రంతో, భగవంతుడు పరిపూర్ణ యోగి గురించి తన విశదీకరణలను పూర్తి చేసాడు.* 
*భగవంతుడు అని కూడా పిలువబడే పరమాత్మ చైతన్యం నుండి విశ్వం ఉద్భవించింది. భగవంతుని స్థితిని ఏకీకృత స్వరంలో వివరించలేము. ఆలోచన ప్రక్రియల వైవిధ్యం వివిధ వ్యక్తులకు వివిధ రకాల అనుభవాలకు దారి తీస్తుంది. గరిష్టంగా, భగవంతుని భావనను విశ్వంలో జరిగే ప్రతిదానికీ అనంతం నుండి ఒక మూలంగా వివరించవచ్చు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras  - 271 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
*Part 3 - āṇavopāya*
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 3 - 45. bhūyah syāt pratimīlanam - 1 🌻*

*🌴. With the illumination of the consciousness and dissolution of the beingness, the pure-self reverts to its original, pure state again. 🌴*

*bhūyas – again and again; syāt – there is; pratimīlanam – awareness of the Lord, both inwardly and outwardly.*
*With this sūtra, the Lord completes His elucidations of a perfect yogi.* 
*The universe arises from the Supreme Consciousness which is also known as the Lord. The state of the Lord cannot be explained in a unified voice. The diversity of thought processes leads to different kinds of experiences for different persons. At the most, the concept of the Lord can be explained as a source from infinity, for everything that happens in the universe.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
https://www.youtube.com/channel/UC6UB7NB3KJ_CSrdwnokH_NQ
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.threads.net/@prasad.bharadwaj