శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 271 / Sri Lalitha Chaitanya Vijnanam - 271

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 271 / Sri Lalitha Chaitanya Vijnanam - 271 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 64. సంహారిణీ, రుద్రరూపా, తిరోధానకరీశ్వరీ ।
సదాశివానుగ్రహదా, పంచకృత్య పరాయణా ॥ 64 ॥ 🍀

🌻 271. 'ఈశ్వరీ' 🌻

సత్త్వగుణ ప్రధానమై సర్వస్వతంత్రయై సర్వ అధికారిణియై యుండునది శ్రీమాత అని అర్థము. ఈశ్వరుడనగా స్వామి, సర్వస్వతంత్రుడు. కర్తవ్యము, కర్తృత్వము లేనివాడు. ఇచ్ఛా, క్రియలు కూడ లేనివాడు. శుద్ధ సత్త్వమైన చైతన్యము. మాయచేత కూడ బంధింపబడనివాడు. జీవులకు శరణ్యమైన వాడు. దేవాసుర భావముల కతీతుడు. జగదీశ్వరి శ్రీమాత. ఆమెయందీ గుణము లన్నియూ ప్రస్ఫుటముగ గోచరించును.

జగదీశ్వరుని యందు కూడ ఈ గుణములు గోచరించును. సిద్ధులు, ఋషులు, యోగులు కోరునదీ స్థితియే. వ్యక్తిగత కర్మను దగ్ధము కావించుకొని సత్త్వగుణ ప్రధానులై నిత్య సత్యమందు నిలచి దివ్య ప్రణాళికయందు తమ కర్తవ్యమును స్వచ్ఛందముగా నిర్వర్తించువారు నిజమగు సిద్ధులు, యోగులు. ఇట్టి వారికి కర్తృత్వము లేదు. గనుక కర్మలేదు. కర్మబంధము లేదు గనుక స్వతంత్రులు. వీరి ఇచ్ఛా క్రియలన్నియూ దైవ ప్రేరితములే.

ఇట్టి వారిని కూడ ఈశ్వరులని (మాస్టర్స్) అని పిలుతురు. ఇట్టి యోగీశ్వరులకు, యోగేశ్వరియైన శ్రీమాతకు భేదమున్నది. అట్లే ఇట్టి యోగీశ్వరులకు యోగేశ్వరుడైన శ్రీకృష్ణునకు (లేక శ్రీ మహావిష్ణువునకు) భేదమున్నది. యోగేశ్వరీ యోగేశ్వరుల అధీనమున మాయ ఉన్నది.

కానీ యోగీశ్వరులగు సిద్ధులు, యోగులు దైవ మాయకు బద్దులే. సనక సనందనాదులు, నారములు, త్రిమూర్తులు కూడ మాయనబడిన సందర్భము లున్నవి. ఇక ఇతరుల విషయము చెప్పనేల? మాయా స్వరూపమును దాటి యుండునది శుద్ధ చైతన్యమూర్తి యగు శ్రీదేవియే.

గోవిందుని రూపమున నున్నది కూడ ఆమెయే. మాయ వారి కనుసన్నలలో మెలగుచుండును. ప్రళయమందుకూడ మాయ విశ్రాంతి గొనుచు నుండునేగాని నశింపదని భాగవత పురాణము తెలుపుచున్నది. కావున ఈశ్వరీ ఈశ్వర పదములు త్రిగుణాతీత శుద్ద సత్త్వమునకు మాత్రమే ఆపాదింపదగును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 271 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🍀 64. saṁhāriṇī rudrarūpā tirodhāna-karīśvarī |
sadāśivā'nugrahadā pañcakṛtya-parāyaṇā || 64 || 🍀

🌻 Īśvarī ईश्वरी (271)🌻

The one who does the act of tirodhāna explained in the previous nāma. Īśvara tattva is the 26th tattva (principle) out of the 36 tattva-s, where the power of knowledge is predominant.

Īśvara controls everything. Īśvara is parāhaṃtā, meaning Supreme individuality. Viṣṇu Sahasranāma nāma 36 is also Īśvara.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

29 May 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 23

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 23 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. బహుమతికి సిద్ధంగా వుండు. నీలో ఎంతగా స్వీకరించే గుణముంటే అంతగా నువ్వు అందుకుంటావు. 🍀

జీవితంలోని కష్టమయిన విషయం బహుమతిని స్వీకరించడం. కారణం అది ఆహానికి వ్యతిరేకమైంది. ఇవ్వడం సులభం, చాలా చాలా సులభం. స్వీకరించడమన్నది చాలా కష్టమయిన సంగతి. మరీ నీకు అర్హత లేనపుడు స్వీకరించడమన్నది మరీ కష్టం. మనకు అర్హత లేదు. మనం ఆశీర్వాధానికి అర్హులం కాం. కానీ అస్తిత్వం మనకు యిస్తూ పోతుంది. మనకు అర్హత వుందని కాదు.

దాని దగ్గర అనంతంగా వుంది. ఏ క్షణంలో నువ్వు బహుమతిని స్వీకరిస్తావో అస్తిత్వం నీ పట్ల కృతజ్ఞత ప్రకటిస్తుంది. నువ్వు దాన్ని తేలిక పరిచినందుకు, తన దగ్గరున్న కొంత బరువును పంచుకున్నందుకు అది కృతజ్ఞత ప్రకటిస్తుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకో. ఒక బహుమతిని స్వీకరించడం చాలా కష్టం. అది అవమానాన్ని అనుభూతి చెందడం లాంటిది. వ్యక్తి ఆందోళనకు గురవుతాడు. గొప్ప ఆనందంతో, ఉత్సవంలో బహుమతిని ఎట్లా స్వీకరించాలో సాధకుడు అన్నవాడు తెలుసుకోవాలి.

ఎందుకంటే నీలో ఎంతగా స్వీకరించే గుణముంటే అంతగా నువ్వు అందుకుంటావు. నువ్వు సంపూర్ణంగా స్వీకరించే తనంతో వుంటే సమస్త స్వర్గం ఈ క్షణం నీలోకి ప్రవహిస్తుంది, అడుగిడుతుంది. ఇపుడు, యిక్కడ, ఈ క్షణం అది జరుగుతుంది. నీ వైపు నించీ జరగాల్సింది ఒక్కటే. నువ్వు బహిరంగంగా వుండు. తెరిచిన తలుపులా వుండు. స్వీకరించడానికి సిద్ధంగా వుండు.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

29 May 2021

వివేక చూడామణి - 80 / Viveka Chudamani - 80

🌹. వివేక చూడామణి - 80 / Viveka Chudamani - 80🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 20. శరీర బంధనాలు - 5 🍀

279. తప్పకుండా మనము తెలుసుకోవాలి, ఈ శరీరము గత జన్మల కర్మఫలితముగా ఏర్పడినదని. ఈ ప్రారబ్ద జన్మ నశించాలంటే మనకు అడ్డుగా ఉన్న మోసపూరితమైన వస్తు వ్యామోహాలను నశింపజేయాలి.

280. ‘నేను జీవాత్మను కాను’, ‘ఆ పరబ్రహ్మమును నేనే’. అనే స్థిరమైన భావముతో, ఆనాత్మ భావమును తొలగించు కోవాలి. అందుకు మోసముతో కూడిన గత జన్మల ప్రారబ్ద ఫలమైన బాహ్య, వస్తు భావమును పూర్తిగా నశింపజేయాలి.

281. నేనే ఆత్మను అను భావమును నీకు నీవు తెలుసుకొని అందుకు శాస్త్రపఠనము, సత్యాసత్య వస్తు విచారణ మరియు నీ యొక్క స్వయం అనుభవముల ద్వారా నీలోని బాహ్య వస్తు మోహములను ఏ మాత్రము మిగలకుండా నాశనము చేయాలి.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 VIVEKA CHUDAMANI - 80 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 20. Bondages of Body - 6 🌻

279. Knowing for certain that the Prarabdha work will maintain this body, remain quiet and do away with thy superimposition carefully and with patience.

280. "I am not the individual soul, but the Supreme Brahman" – eliminating thus all that is not-Self, do away with thy superimposition, which has come through the momentum of (past) impressions.

281. Realising thyself as the Self of all by means of Scripture, reasoning and by thy own realisation, do away thy superimposition, even when a trace of it seems to appear.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

29 May 2021

దేవాపి మహర్షి బోధనలు - 91

🌹. దేవాపి మహర్షి బోధనలు - 91 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 72. ఆడంబరము - అధోగతి 🌻

త్రికరణ శుద్ధి లేని జీవనము కృత్రిమము. కృత్రిమ జీవనము అశాంతికి కారణము. లౌకిక జీవనమునకు గాని, అలౌకిక జీవనమునకు గాని త్రికరణశుద్ధి ముఖ్యము. కృత్రిమ జీవనము జీవుని రకరకములుగ బంధించును. తన నిజస్వభావమునకు విరుద్ధముగ మాటలాడువారు, పనులు చేయువారు ఆడంబరులు. లోపల స్వార్థబుద్ధి, వెలుపల ధర్మ ప్రవచనము, వీరిలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇట్టి డంబాచారులకు మాటలో సరళత యుండదు. చేతలో స్పష్టత యుండదు. ఆడంబరమునకు ఎక్కువ లొంగి ఉందురు.

ఇట్టివారు ఆధ్యాత్మిక మార్గమున పురోగతి చెందుట దుర్లభము. ఆడంబర జీవనమునకు మూలమున స్వార్థముండును. తనను, తనవి పెంపొందించుకొనుటకు ధర్మపన్నములు వల్లించుటయే కాని నిజముగ ధర్మానుష్ఠానబుద్ధి యుండదు. ధనకాంక్ష, కీర్తికాంక్ష కలిగి కామక్రోధముకులోనై, అసూయాగ్రస్తుడై అధోగతి పాలగును. డంబము ఆత్మశత్రువు. ఆత్మహంత.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

29 May 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 406, 407 / Vishnu Sahasranama Contemplation - 406, 407

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 406 / Vishnu Sahasranama Contemplation - 406🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻406. పురుషః, पुरुषः, Puruṣaḥ🌻

ఓం పురుషాయ నమః | ॐ पुरुषाय नमः | OM Puruṣāya namaḥ

సర్వస్మాత్ పురాసదనాత్ సర్వపాపస్య సాదనాత్ ।
పురిశయనాద్వ హరిః బుధైః పురుష ఉచ్యతే ॥

ప్రతియొకదానికంటెను ముందుగానే చేరియున్నాడు. అన్నిటికంటె పూర్వుడు, ముందటివాడు అగుచునే సర్వపాపములను దహించెను.

స యత్పూర్వోఽస్మాత్సర్వస్మాత్సర్వా న్పాప్మన ఉఔష త్త్స్మాత్ పురుషః (బృ 3.4.1) ఆతడు ఈ దృశ్యమానము, కనబడుచున్నదియగు ప్రయొక దానికంటెను పూర్వుడు అగుచు తన తపముచే సర్వపాపములను దహించినందువలన తాను 'పురుషః'.

స వా అయం పురుషః సర్వాసు పూర్షు పురి శయః (బృ 4.5.18) ఆ ఈ ఆత్మ, పరమాత్మయే సర్వపుర, శరీరములయందును ఉండుచు పురుషః అనబడుచున్నాడు.

14. పురుషః, पुरुषः, Puruṣaḥ

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 406🌹

📚. Prasad Bharadwaj

🌻406. Puruṣaḥ🌻

OM Puruṣāya namaḥ

Sarvasmāt purāsadanāt sarvapāpasya sādanāt,
Puriśayanādva hariḥ budhaiḥ puruṣa ucyate.

सर्वस्मात् पुरासदनात् सर्वपापस्य सादनात् ।
पुरिशयनाद्व हरिः बुधैः पुरुष उच्यते ॥

One who existed before everything. Or One who can efface all sins.

Sa yatpūrvo’smātsarvasmātsarvā npāpmana uauṣa ttsmāt puruṣaḥ (Br̥ 3.4.1) / स यत्पूर्वोऽस्मात्सर्वस्मात्सर्वा न्पाप्मन उऔष त्त्स्मात् पुरुषः (बृ ३.४.१) He existed before everything. He reduces all sins to ashes; so He is Puruṣaḥ.

Sa vā ayaṃ puruṣaḥ sarvāsu pūrṣu puri śayaḥ (Br̥ 4.5.18) / स वा अयं पुरुषः सर्वासु पूर्षु पुरि शयः (बृ ४.५.१८) He lies in all puras or bodies.

14. పురుషః, पुरुषः, Puruṣaḥ

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः ।हिरण्यगर्भश्शत्रुघ्नोव्याप्तो वायुरधोक्षजः ॥ ४४ ॥

వైకుణ్ఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ।హిరణ్యగర్భశ్శత్రుఘ్నోవ్యాప్తో వాయురధోక్షజః ॥ ౪౪ ॥

Vaikuṇṭhaḥ puruṣaḥ prāṇaḥ prāṇadaḥ praṇavaḥ pr̥thuḥ ।Hiraṇyagarbhaśśatrughnovyāpto vāyuradhokṣajaḥ ॥ 44 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 407 / Vishnu Sahasranama Contemplation - 407🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻407. ప్రాణః, प्राणः, Prāṇaḥ🌻

ఓం ప్రాణాయ నమః | ॐ प्राणाय नमः | OM Prāṇāya namaḥ

ప్రాణః, प्राणः, Prāṇaḥ

విష్ణుః క్షేత్రజ్ఞరూపేణ ప్రాణితి శ్రీధరో హరిః ।
ప్రాణాత్మనా చేష్టయన్వా ప్రాణ ఇత్యుచ్యతే బుధైః ॥

విష్ణుడే సర్వక్షేత్ర, శరీరములయందును క్షేత్రజ్ఞ రూపమున అనగా జీవుడుగా ప్రాణించుచు, శ్వాసించుచు ఉన్నాడు. ప్రాణరూపుడుగానుండుచు జీవులను ఆయా వ్యాపారములను చేష్టింపజేయుచున్నాడు. చేష్టాం కరోతి శ్వసనస్వరూపి (వి. పు) శ్వాస రూపమున ప్రాణుల చేష్టింపజేయుచున్నాడు.

66. ప్రాణః, प्राणः, Prāṇaḥ

320. ప్రాణః, प्राणः, Prāṇaḥ

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 407🌹

📚. Prasad Bharadwaj

🌻407. Prāṇaḥ🌻

OM Prāṇāya namaḥ

Viṣṇuḥ kṣetrajñarūpeṇa prāṇiti śrīdharo hariḥ,
Prāṇātmanā ceṣṭayanvā prāṇa ityucyate budhaiḥ.

विष्णुः क्षेत्रज्ञरूपेण प्राणिति श्रीधरो हरिः ।
प्राणात्मना चेष्टयन्वा प्राण इत्युच्यते बुधैः ॥

As kṣetrajña He breathes. Assuming the form of prāṇa or life force, He makes the organs and limbs of various beings function. Ceṣṭāṃ karoti śvasanasvarūpi (Vi. Pu) / चेष्टां करोति श्वसनस्वरूपि (वि. पु) In the form of breath, He acts.

66. ప్రాణః, प्राणः, Prāṇaḥ

320. ప్రాణః, प्राणः, Prāṇaḥ

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः ।हिरण्यगर्भश्शत्रुघ्नोव्याप्तो वायुरधोक्षजः ॥ ४४ ॥

వైకుణ్ఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ।హిరణ్యగర్భశ్శత్రుఘ్నోవ్యాప్తో వాయురధోక్షజః ॥ ౪౪ ॥

Vaikuṇṭhaḥ puruṣaḥ prāṇaḥ prāṇadaḥ praṇavaḥ pr̥thuḥ ।Hiraṇyagarbhaśśatrughnovyāpto vāyuradhokṣajaḥ ॥ 44 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

29 May 2021

29-MAY-2021 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 1-42 / Bhagavad-Gita - 1-42🌹
2) 🌹 శ్రీమద్భగవద్గీత - 609 / Bhagavad-Gita - 610 - 18-21🌹 
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 406 407 / Vishnu Sahasranama Contemplation - 406, 407🌹
4) 🌹 Daily Wisdom - 117🌹
5) 🌹. వివేక చూడామణి - 80🌹
6) 🌹Viveka Chudamani - 80🌹
7) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 80🌹
8) 🌹. నిర్మల ధ్యానములు - 23🌹
9) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 271 / Sri Lalita Chaitanya Vijnanam - 271 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీమద్భగవద్గీత - 42 / Bhagavad-Gita - 42 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 

🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము 🌴
శ్లోకము 42

42. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ |
పతన్తి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియా: ||

🌷. తాత్పర్యం : 
అవాంచిత సంతానము వృద్ధియగుట వలన కుటుంబమువారు మరియు కుటుంబ ఆచారమును నష్టపరచినవారు ఇరువురికి నరకము సంప్రాప్తించును. పిండోదక క్రియలు సంపూర్ణముగా ఆపివేయబడుటచే అట్టి అధర్మ కుటుంబములకు చెందిన పితురులు పతనము నొందుదురు.

🌷. భాష్యము : 
కర్మకాండ విధుల ప్రకారము వంశపితురులకు నియమానుసారముగా పిండోదకములు అర్పించవలసిన అవసరమున్నది. అట్టి అర్పణము విష్ణువు యొక్క అర్చనము ద్వారా చక్కగా ఒనరించబడగలదు. 

ఏలయన విష్ణువునకు అర్పించిన ఆహారమును భుజించుట యనెడి కార్యము మనుజుని అన్ని రకములైన పాపముల నుండి ముక్తుని చేయగలదు. కొన్నిమార్లు వంశపితరులు పలువిధములైన పాపకర్మఫలముల కారణమున తపించు చుండవచ్చును. ఇంకొన్నిమార్లు వారికి స్థూలదేహము సైతము లభింపక పిశాచములుగా సూక్ష్మదేహమునందే బలవంతముగా నిలువవలసివచ్చును. 

కాని వంశీయులచే భగత్ప్రసాదము ఆ పితురులకు అర్పింపబడినప్పుడు వారు పిశాచరూపముల నుండి మరియు ఇతర దుర్భర జీవనస్థితుల నుండి విడుదలను పొందగలరు. పితరులకు ఒనర్చబడెడి అట్టి సహాయము వాస్తవమునకు ఒక వంశాచారము. 

భక్తియుతజీవనము నందు నిలువనివాడు అటువంటి కర్మకాండ తప్పక ఒనరింపవలెను. కాని భక్తియుత జీవనము నందు నిలిచినవాడు అట్టి కర్మలను ఒనరింపవలసిన అవసరము లేదు. కేవలము భక్తియుక్త సేవను నిర్వహించుట ద్వారా మనుజుడు లక్షలాది పితృదేవతలనైనను సర్వవిధములైన దుఃఖముల నుండి ముక్తులను చేయగలడు. ఈ విషయమే శ్రీమద్భాగవతము (11.5.41) నందు ఈ క్రింది విధముగా తెలుపబడినది.

దేవర్షిభూతాప్తనృణాం పితౄణాం న కింకరో నాయమృణీ చ రాజన్ |
సర్వాత్మనా య: శరణం శరణ్యం గతో ముకున్దం పరిహృత్య కర్తమ్ || 

 “సర్వవిధములైన ధర్మములను త్యజించి ముక్తినొసగెడి ముకుందుని చరణపద్మాశ్రయ శరణమున నిలిచినవాడు మరియు చేపట్టిన మార్గమునందు పూర్ణ శ్రద్ధాళువైనవాడు దేవతలకుగాని, ఋషులకుగాని, జీవులకుగాని, కుటుంబమువారికిగాని, పితృదేవతలకుగాని ఋణపడియుండడు. వారి యెడ అతనికి ఎట్టి విధులుగాని, బాధ్యతలుగాని లేవు.” 

పూర్ణపురుషోత్తముడైన శ్రీకృష్ణుని భక్తియుతసేవ ద్వారా అట్టి సమస్త బాధ్యతలు అప్రయత్నముగా పూర్ణము కావింపబడుచున్నవి.

🌹 Bhagavad-Gita as It is - 42 🌹
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada 
📚. Prasad Bharadwaj 

🌴 Chapter 1 - Vishada Yoga 🌴
Verse 42

42. saṅkaro narakāyaiva
kula-ghnānāṁ kulasya ca
patanti pitaro hy eṣāṁ
lupta-piṇḍodaka-kriyāḥ

Translation : 
An increase of unwanted population certainly causes hellish life both for the family and for those who destroy the family tradition. The ancestors of such corrupt families fall down, because the performances for offering them food and water are entirely stopped.

Purport : 
According to the rules and regulations of fruitive activities, there is a need to offer periodical food and water to the forefathers of the family. 

This offering is performed by worship of Viṣṇu, because eating the remnants of food offered to Viṣṇu can deliver one from all kinds of sinful reactions. Sometimes the forefathers may be suffering from various types of sinful reactions, and sometimes some of them cannot even acquire a gross material body and are forced to remain in subtle bodies as ghosts. 

Thus, when remnants of prasādam food are offered to forefathers by descendants, the forefathers are released from ghostly or other kinds of miserable life. Such help rendered to forefathers is a family tradition, and those who are not in devotional life are required to perform such rituals. 

One who is engaged in the devotional life is not required to perform such actions. Simply by performing devotional service, one can deliver hundreds and thousands of forefathers from all kinds of misery. It is stated in the Bhāgavatam (11.5.41):

devarṣi-bhūtāpta-nṛṇāṁ pitṝṇāṁ
na kiṅkaro nāyam ṛṇī ca rājan
sarvātmanā yaḥ śaraṇaṁ śaraṇyaṁ
gato mukundaṁ parihṛtya kartam

“Anyone who has taken shelter of the lotus feet of Mukunda, the giver of liberation, giving up all kinds of obligation, and has taken to the path in all seriousness, owes neither duties nor obligations to the demigods, sages, general living entities, family members, humankind or forefathers.” 

Such obligations are automatically fulfilled by performance of devotional service to the Supreme Personality of Godhead.
🌹🌹🌹🌹🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 610 / Bhagavad-Gita - 610 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 21 🌴*

21. పృథక్త్వేన తు యత్ జ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ |
వేత్తి సర్వేషు భూతేషు తద్ జ్ఞానం విద్ధి రాజసమ్ ||

🌷. తాత్పర్యం : 
ఏ జ్ఞానము ద్వారా భిన్న శరీరములందు భిన్న జీవులున్నట్లు మనుజుడు గాంచునో అట్టి జ్ఞానము రజోగుణ సంబంధమైనదని నీవెరుగుము. 

🌷. భాష్యము :
దేహమే జీవుడనియు, దేహము నశించగనే చైతన్యము సైతము నశించిపోవుననియు తలచు జ్ఞానము రజోగుణ సంబంధమైనట్టిది. అట్టి జ్ఞానము ప్రకారము వివిధ చైతన్యముల వృద్ది కారణముననే పలువిధములైన దేహములు గోచరించుచున్నవి. 

అంతియే గాని చైతన్యమును కలిగించు ఆత్మ వేరొక్కటి లేదు. అనగా అట్టి రజోగుణజ్ఞానము ననుసరించి దేహమే ఆత్మగాని,దేహమునకు పరముగా వేరొక్క ఆత్మ లేదు. అట్టి జ్ఞానము ప్రకారము చైతన్యము తాత్కాలికమైనది. 

జీవాత్మలు వేరుగాలేక జ్ఞానపూర్ణమైన ఒక్క ఆత్మనే సర్వత్రా వ్యాపించియున్నదనియు మరియు ఈ దేహము తాత్కాలిక అజ్ఞానము యొక్క ప్రదర్శనమనియు తలచుట లేదా దేహమునకు పరముగా వేరొక్క ఆత్మ గాని, దివ్యాత్మగాని లేదని భావించుట మొదలగునవన్నియు రజోగుణఫలములుగా భావింపబడును.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 610 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 21 🌴*

21. pṛthaktvena tu yaj jñānaṁ nānā-bhāvān pṛthag-vidhān
vetti sarveṣu bhūteṣu taj jñānaṁ viddhi rājasam

🌷 Translation : 
That knowledge by which one sees that in every different body there is a different type of living entity you should understand to be in the mode of passion.

🌹 Purport :
The concept that the material body is the living entity and that with the destruction of the body the consciousness is also destroyed is called knowledge in the mode of passion. 

According to that knowledge, bodies differ from one another because of the development of different types of consciousness, otherwise there is no separate soul which manifests consciousness. The body is itself the soul, and there is no separate soul beyond the body. 

According to such knowledge, consciousness is temporary. Or else there are no individual souls, but there is an all-pervading soul, which is full of knowledge, and this body is a manifestation of temporary ignorance. Or beyond this body there is no special individual or supreme soul. All such conceptions are considered products of the mode of passion.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 406, 407 / Vishnu Sahasranama Contemplation - 406, 407 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻406. పురుషః, पुरुषः, Puruṣaḥ🌻*

*ఓం పురుషాయ నమః | ॐ पुरुषाय नमः | OM Puruṣāya namaḥ*

సర్వస్మాత్ పురాసదనాత్ సర్వపాపస్య సాదనాత్ ।
పురిశయనాద్వ హరిః బుధైః పురుష ఉచ్యతే ॥

ప్రతియొకదానికంటెను ముందుగానే చేరియున్నాడు. అన్నిటికంటె పూర్వుడు, ముందటివాడు అగుచునే సర్వపాపములను దహించెను.

స యత్పూర్వోఽస్మాత్సర్వస్మాత్సర్వా న్పాప్మన ఉఔష త్త్స్మాత్ పురుషః (బృ 3.4.1) ఆతడు ఈ దృశ్యమానము, కనబడుచున్నదియగు ప్రయొక దానికంటెను పూర్వుడు అగుచు తన తపముచే సర్వపాపములను దహించినందువలన తాను 'పురుషః'.

స వా అయం పురుషః సర్వాసు పూర్షు పురి శయః (బృ 4.5.18) ఆ ఈ ఆత్మ, పరమాత్మయే సర్వపుర, శరీరములయందును ఉండుచు పురుషః అనబడుచున్నాడు.

14. పురుషః, पुरुषः, Puruṣaḥ

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 406🌹*
📚. Prasad Bharadwaj

*🌻406. Puruṣaḥ🌻*

*OM Puruṣāya namaḥ*

Sarvasmāt purāsadanāt sarvapāpasya sādanāt,
Puriśayanādva hariḥ budhaiḥ puruṣa ucyate.

सर्वस्मात् पुरासदनात् सर्वपापस्य सादनात् ।
पुरिशयनाद्व हरिः बुधैः पुरुष उच्यते ॥

One who existed before everything. Or One who can efface all sins.

Sa yatpūrvo’smātsarvasmātsarvā npāpmana uauṣa ttsmāt puruṣaḥ (Br̥ 3.4.1) / स यत्पूर्वोऽस्मात्सर्वस्मात्सर्वा न्पाप्मन उऔष त्त्स्मात् पुरुषः (बृ ३.४.१) He existed before everything. He reduces all sins to ashes; so He is Puruṣaḥ.

Sa vā ayaṃ puruṣaḥ sarvāsu pūrṣu puri śayaḥ (Br̥ 4.5.18) / स वा अयं पुरुषः सर्वासु पूर्षु पुरि शयः (बृ ४.५.१८) He lies in all puras or bodies.

14. పురుషః, पुरुषः, Puruṣaḥ

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः ।हिरण्यगर्भश्शत्रुघ्नोव्याप्तो वायुरधोक्षजः ॥ ४४ ॥
వైకుణ్ఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ।హిరణ్యగర్భశ్శత్రుఘ్నోవ్యాప్తో వాయురధోక్షజః ॥ ౪౪ ॥
Vaikuṇṭhaḥ puruṣaḥ prāṇaḥ prāṇadaḥ praṇavaḥ pr̥thuḥ ।Hiraṇyagarbhaśśatrughnovyāpto vāyuradhokṣajaḥ ॥ 44 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 407 / Vishnu Sahasranama Contemplation - 407🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻407. ప్రాణః, प्राणः, Prāṇaḥ🌻*

*ఓం ప్రాణాయ నమః | ॐ प्राणाय नमः | OM Prāṇāya namaḥ*

ప్రాణః, प्राणः, Prāṇaḥ

విష్ణుః క్షేత్రజ్ఞరూపేణ ప్రాణితి శ్రీధరో హరిః ।
ప్రాణాత్మనా చేష్టయన్వా ప్రాణ ఇత్యుచ్యతే బుధైః ॥

విష్ణుడే సర్వక్షేత్ర, శరీరములయందును క్షేత్రజ్ఞ రూపమున అనగా జీవుడుగా ప్రాణించుచు, శ్వాసించుచు ఉన్నాడు. ప్రాణరూపుడుగానుండుచు జీవులను ఆయా వ్యాపారములను చేష్టింపజేయుచున్నాడు. చేష్టాం కరోతి శ్వసనస్వరూపి (వి. పు) శ్వాస రూపమున ప్రాణుల చేష్టింపజేయుచున్నాడు.

66. ప్రాణః, प्राणः, Prāṇaḥ
320. ప్రాణః, प्राणः, Prāṇaḥ

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 407🌹*
📚. Prasad Bharadwaj

*🌻407. Prāṇaḥ🌻*

*OM Prāṇāya namaḥ*

Viṣṇuḥ kṣetrajñarūpeṇa prāṇiti śrīdharo hariḥ,
Prāṇātmanā ceṣṭayanvā prāṇa ityucyate budhaiḥ.

विष्णुः क्षेत्रज्ञरूपेण प्राणिति श्रीधरो हरिः ।
प्राणात्मना चेष्टयन्वा प्राण इत्युच्यते बुधैः ॥

As kṣetrajña He breathes. Assuming the form of prāṇa or life force, He makes the organs and limbs of various beings function. Ceṣṭāṃ karoti śvasanasvarūpi (Vi. Pu) / चेष्टां करोति श्वसनस्वरूपि (वि. पु) In the form of breath, He acts.

66. ప్రాణః, प्राणः, Prāṇaḥ
320. ప్రాణః, प्राणः, Prāṇaḥ

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः ।हिरण्यगर्भश्शत्रुघ्नोव्याप्तो वायुरधोक्षजः ॥ ४४ ॥
వైకుణ్ఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ।హిరణ్యగర్భశ్శత్రుఘ్నోవ్యాప్తో వాయురధోక్షజః ॥ ౪౪ ॥
Vaikuṇṭhaḥ puruṣaḥ prāṇaḥ prāṇadaḥ praṇavaḥ pr̥thuḥ ।Hiraṇyagarbhaśśatrughnovyāpto vāyuradhokṣajaḥ ॥ 44 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 DAILY WISDOM - 117 🌹*
*🍀 📖 The Ascent of the Spirit 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 26. The World Needs the Leadership of a Superman 🌻*

The leadership of a tremendous genius and capacity for mustering in universal forces is called for. And these forces are neither material ones minus the spiritual, nor the spiritual minus the material. 

Truth is a fusion of both spirit and matter, of divinity and humanity, of God and the world. Will man be able to awaken this vision of himself? Then, there is hope for him, and then there can be peace, not only on Earth but also in heaven and everywhere. Else, the object sought for is far to seek, and difficult to find. 

The world needs the leadership of a superman, whose eyes can see God and world at the same time, whose personality will be at once the sacred temple of the Almighty and the active thoroughfare of human business. 

The world did see the realisation of such an ideal in the personality of Sri Krishna, who was an outstanding specimen of the world’s greatest statesman in the sense we have defined above as an urgent need for the welfare of mankind.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. వివేక చూడామణి - 80 / Viveka Chudamani - 80🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 20. శరీర బంధనాలు - 5 🍀*

 279. తప్పకుండా మనము తెలుసుకోవాలి, ఈ శరీరము గత జన్మల కర్మఫలితముగా ఏర్పడినదని. ఈ ప్రారబ్ద జన్మ నశించాలంటే మనకు అడ్డుగా ఉన్న మోసపూరితమైన వస్తు వ్యామోహాలను నశింపజేయాలి. 

280. ‘నేను జీవాత్మను కాను’, ‘ఆ పరబ్రహ్మమును నేనే’. అనే స్థిరమైన భావముతో, ఆనాత్మ భావమును తొలగించు కోవాలి. అందుకు మోసముతో కూడిన గత జన్మల ప్రారబ్ద ఫలమైన బాహ్య, వస్తు భావమును పూర్తిగా నశింపజేయాలి. 

281. నేనే ఆత్మను అను భావమును నీకు నీవు తెలుసుకొని అందుకు శాస్త్రపఠనము, సత్యాసత్య వస్తు విచారణ మరియు నీ యొక్క స్వయం అనుభవముల ద్వారా నీలోని బాహ్య వస్తు మోహములను ఏ మాత్రము మిగలకుండా నాశనము చేయాలి. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 VIVEKA CHUDAMANI - 80 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 20. Bondages of Body - 6 🌻*

279. Knowing for certain that the Prarabdha work will maintain this body, remain quiet and do away with thy superimposition carefully and with patience.

280. "I am not the individual soul, but the Supreme Brahman" – eliminating thus all that is not-Self, do away with thy superimposition, which has come through the momentum of (past) impressions. 

281. Realising thyself as the Self of all by means of Scripture, reasoning and by thy own realisation, do away thy superimposition, even when a trace of it seems to appear.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 91 🌹* 
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 72. ఆడంబరము - అధోగతి 🌻*

త్రికరణ శుద్ధి లేని జీవనము కృత్రిమము. కృత్రిమ జీవనము అశాంతికి కారణము. లౌకిక జీవనమునకు గాని, అలౌకిక జీవనమునకు గాని త్రికరణశుద్ధి ముఖ్యము. కృత్రిమ జీవనము జీవుని రకరకములుగ బంధించును. తన నిజస్వభావమునకు విరుద్ధముగ మాటలాడువారు, పనులు చేయువారు ఆడంబరులు. లోపల స్వార్థబుద్ధి, వెలుపల ధర్మ ప్రవచనము, వీరిలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇట్టి డంబాచారులకు మాటలో సరళత యుండదు. చేతలో స్పష్టత యుండదు. ఆడంబరమునకు ఎక్కువ లొంగి ఉందురు. 

ఇట్టివారు ఆధ్యాత్మిక మార్గమున పురోగతి చెందుట దుర్లభము. ఆడంబర జీవనమునకు మూలమున స్వార్థముండును. తనను, తనవి పెంపొందించుకొనుటకు ధర్మపన్నములు వల్లించుటయే కాని నిజముగ ధర్మానుష్ఠానబుద్ధి యుండదు. ధనకాంక్ష, కీర్తికాంక్ష కలిగి కామక్రోధముకులోనై, అసూయాగ్రస్తుడై అధోగతి పాలగును. డంబము ఆత్మశత్రువు. ఆత్మహంత. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 23 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. బహుమతికి సిద్ధంగా వుండు. నీలో ఎంతగా స్వీకరించే గుణముంటే అంతగా నువ్వు అందుకుంటావు. 🍀*

జీవితంలోని కష్టమయిన విషయం బహుమతిని స్వీకరించడం. కారణం అది ఆహానికి వ్యతిరేకమైంది. ఇవ్వడం సులభం, చాలా చాలా సులభం. స్వీకరించడమన్నది చాలా కష్టమయిన సంగతి. మరీ నీకు అర్హత లేనపుడు స్వీకరించడమన్నది మరీ కష్టం. మనకు అర్హత లేదు. మనం ఆశీర్వాధానికి అర్హులం కాం. కానీ అస్తిత్వం మనకు యిస్తూ పోతుంది. మనకు అర్హత వుందని కాదు. 

దాని దగ్గర అనంతంగా వుంది. ఏ క్షణంలో నువ్వు బహుమతిని స్వీకరిస్తావో అస్తిత్వం నీ పట్ల కృతజ్ఞత ప్రకటిస్తుంది. నువ్వు దాన్ని తేలిక పరిచినందుకు, తన దగ్గరున్న కొంత బరువును పంచుకున్నందుకు అది కృతజ్ఞత ప్రకటిస్తుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకో. ఒక బహుమతిని స్వీకరించడం చాలా కష్టం. అది అవమానాన్ని అనుభూతి చెందడం లాంటిది. వ్యక్తి ఆందోళనకు గురవుతాడు. గొప్ప ఆనందంతో, ఉత్సవంలో బహుమతిని ఎట్లా స్వీకరించాలో సాధకుడు అన్నవాడు తెలుసుకోవాలి. 

ఎందుకంటే నీలో ఎంతగా స్వీకరించే గుణముంటే అంతగా నువ్వు అందుకుంటావు. నువ్వు సంపూర్ణంగా స్వీకరించే తనంతో వుంటే సమస్త స్వర్గం ఈ క్షణం నీలోకి ప్రవహిస్తుంది, అడుగిడుతుంది. ఇపుడు, యిక్కడ, ఈ క్షణం అది జరుగుతుంది. నీ వైపు నించీ జరగాల్సింది ఒక్కటే. నువ్వు బహిరంగంగా వుండు. తెరిచిన తలుపులా వుండు. స్వీకరించడానికి సిద్ధంగా వుండు.

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 271 / Sri Lalitha Chaitanya Vijnanam - 271 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 64. సంహారిణీ, రుద్రరూపా, తిరోధానకరీశ్వరీ ।*
*సదాశివానుగ్రహదా, పంచకృత్య పరాయణా ॥ 64 ॥ 🍀*

*🌻 271. 'ఈశ్వరీ' 🌻* 

సత్త్వగుణ ప్రధానమై సర్వస్వతంత్రయై సర్వ అధికారిణియై యుండునది శ్రీమాత అని అర్థము. ఈశ్వరుడనగా స్వామి, సర్వస్వతంత్రుడు. కర్తవ్యము, కర్తృత్వము లేనివాడు. ఇచ్ఛా, క్రియలు కూడ లేనివాడు. శుద్ధ సత్త్వమైన చైతన్యము. మాయచేత కూడ బంధింపబడనివాడు. జీవులకు శరణ్యమైన వాడు. దేవాసుర భావముల కతీతుడు. జగదీశ్వరి శ్రీమాత. ఆమెయందీ గుణము లన్నియూ ప్రస్ఫుటముగ గోచరించును. 

జగదీశ్వరుని యందు కూడ ఈ గుణములు గోచరించును. సిద్ధులు, ఋషులు, యోగులు కోరునదీ స్థితియే. వ్యక్తిగత కర్మను దగ్ధము కావించుకొని సత్త్వగుణ ప్రధానులై నిత్య సత్యమందు నిలచి దివ్య ప్రణాళికయందు తమ కర్తవ్యమును స్వచ్ఛందముగా నిర్వర్తించువారు నిజమగు సిద్ధులు, యోగులు. ఇట్టి వారికి కర్తృత్వము లేదు. గనుక కర్మలేదు. కర్మబంధము లేదు గనుక స్వతంత్రులు. వీరి ఇచ్ఛా క్రియలన్నియూ దైవ ప్రేరితములే. 

ఇట్టి వారిని కూడ ఈశ్వరులని (మాస్టర్స్) అని పిలుతురు. ఇట్టి యోగీశ్వరులకు, యోగేశ్వరియైన శ్రీమాతకు భేదమున్నది. అట్లే ఇట్టి యోగీశ్వరులకు యోగేశ్వరుడైన శ్రీకృష్ణునకు (లేక శ్రీ మహావిష్ణువునకు) భేదమున్నది. యోగేశ్వరీ యోగేశ్వరుల అధీనమున మాయ ఉన్నది. 

కానీ యోగీశ్వరులగు సిద్ధులు, యోగులు దైవ మాయకు బద్దులే. సనక సనందనాదులు, నారములు, త్రిమూర్తులు కూడ మాయనబడిన సందర్భము లున్నవి. ఇక ఇతరుల విషయము చెప్పనేల? మాయా స్వరూపమును దాటి యుండునది శుద్ధ చైతన్యమూర్తి యగు శ్రీదేవియే.

గోవిందుని రూపమున నున్నది కూడ ఆమెయే. మాయ వారి కనుసన్నలలో మెలగుచుండును. ప్రళయమందుకూడ మాయ విశ్రాంతి గొనుచు నుండునేగాని నశింపదని భాగవత పురాణము తెలుపుచున్నది. కావున ఈశ్వరీ ఈశ్వర పదములు త్రిగుణాతీత శుద్ద సత్త్వమునకు మాత్రమే ఆపాదింపదగును. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 271 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🍀 64. saṁhāriṇī rudrarūpā tirodhāna-karīśvarī |*
*sadāśivā'nugrahadā pañcakṛtya-parāyaṇā || 64 || 🍀*

*🌻 Īśvarī ईश्वरी (271)🌻*

The one who does the act of tirodhāna explained in the previous nāma. Īśvara tattva is the 26th tattva (principle) out of the 36 tattva-s, where the power of knowledge is predominant.  

Īśvara controls everything. Īśvara is parāhaṃtā, meaning Supreme individuality. Viṣṇu Sahasranāma nāma 36 is also Īśvara.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹