శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 387 / Sri Lalitha Chaitanya Vijnanam - 387

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 387 / Sri Lalitha Chaitanya Vijnanam - 387🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : . ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 84. సద్యఃప్రసాదినీ విశ్వసాక్షిణీ సాక్షివర్జితా
షడంగదేవతాయుక్తా షాడ్గుణ్యపరిపూరితా ॥ 84 ॥ 🍀

🌻 387. 'షాడ్గుణ్య పరిపూరిత'🌻

ఆరు గుణములతో నిండినది శ్రీదేవి అని అర్థము. ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, శ్రీ, ధ్యానము, వైరాగ్యము అనునవి షడ్గుణములు. ఈ గుణములు గలవారు శ్రీమంతులు. కేవలము ధనము గలవారు శ్రీమంతులు గారు. శ్రీమాత పై గుణములను పరిపూర్ణముగ కలిగి యున్నది. ఆమెను ఆరాధించువారు పై గుణములను పొందుదురు. సద్భక్తి యున్నచోట పై గుణములు తప్పక యుండును. ధర్మ మాచరించు వారికి క్రమముగ మిగిలిన ఐదు గుణములు అబ్బగలవు.

పాండవులలో ధర్మరాజు, రఘువంశము నందు శ్రీరాముడు ఈ ఆరు గుణములకు పూర్ణమగు ఉదాహరణములు. హరిశ్చంద్రుడు, నలుడు కూడ అట్టివారే. దైవము, ధర్మము అనునవి నాణెమునకు బొమ్మ, బొరుసు వంటివి. ధర్మ మాచరించు వారికి దైవము చేరువ అగును. దైవము నారాధించు వారిని ధర్మ మాశ్రయించును. ధర్మముతో కూడని దైవారాధన డాంబికమై యుండును. ధర్మమాధారముగ మిగిలిన ఐదు గుణములు పొందవచ్చును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 387 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 84. Sadyah prasadini vishvasakshini sakshivarjita
Shadanga devata yukta shadgunya paripurita ॥ 84 ॥ 🌻

🌻 387. ṣāḍguṇya-paripūritā षाड्गुण्य-परिपूरिता 🌻

She is endowed with six qualities that are considered auspicious. They are prosperity, righteousness, fame, material wealth, wisdom and dispassion. Dispassion because, She will not show any special favours to a select few, transcending the law of karma. She does not encourage favouritism.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

18 Jul 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 215. శక్తి / Osho Daily Meditations - 215. ENERGY

🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 215 / Osho Daily Meditations - 215 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 215. శక్తి 🍀

🕉. చెట్టు జీవశక్తితో పొంగిపొర్లుతున్నప్పుడు అది వికసిస్తుంది మరియు పుష్పిస్తుంది. పువ్వులు విలాసవంతమైనవి. మీకు చాలా ఎక్కువ జీవశక్తి ఉన్నప్పుడు మరియు మీరు దానిని కలిగి ఉండలేనప్పుడు మాత్రమే, అది విస్ఫోటనం చెందుతుంది. 🕉

ఆధ్యాత్మికత పుష్పించేది--అది అంతిమ విలాసం. మీరు తేజముతో పొంగిపోతుంటే, అప్పుడు మాత్రమే బంగారు పువ్వు వంటిది నీలో వికసిస్తుంది. విలియం బ్లేక్ చెప్పింది నిజమే, 'శక్తి చాలా ఆనందమైనది. 'మీలో ఎంత ఎక్కువ శక్తి ఉందో, అంత ఆనందాన్ని పొందుతారు. వైరాగ్యం కూడా వస్తుంది. ఎందుకంటే శక్తి వ్యర్థంగా విడుదల అవుతూ ఉంటుంది. దానిని ఎలా కలిగి ఉండాలో ప్రజలు మర్చిపోయారు. వేయి ఒక్క ఆలోచనల్లో, చింతల్లో, కోరికల్లో, ఊహల్లో, కలల్లో, జ్ఞాపకాల్లో, శక్తి కారుతోంది. సులభంగా నివారించగల అనవసరమైన విషయాలలో శక్తి విడుదల అవుతుంది. మాట్లాడాల్సిన అవసరం లేనప్పుడు మాట్లాడుకుంటూ పోతారు. ఏమీ చేయవలసిన అవసరం లేనప్పుడు, వారు నిశ్శబ్దంగా కూర్చోలేరు; వారు ఏదో ఒకటి 'చేయాలి అనుకుంటారు.'

చేయడం ఒక విధమైన మత్తుగా భావించి ప్రజలు చేయడం పట్ల నిమగ్నమై ఉన్నారు; అది వారిని త్రాగిన వారి వలే ఉంచుతుంది. జీవితంలోని అసలైన సమస్యల గురించి ఆలోచించడానికి వారికి సమయం ఉండదు కాబట్టి వారు దానిలోనే నిమగ్నమై ఉంటారు. వారు తమలో తాము కొట్టుకోకుండా తమను తాము బిజీగా ఉంచుకుంటారు. వారు భయపడుతున్నారు - లోపల ఆవలించే అగాధానికి భయపడతారు. ఈ విధంగా ఎనర్జీ కూరుతూనే ఉంటుంది మరియు దీని వలన మీకు ఎప్పుడూ ఎక్కువ శక్తి అందుబాటలో ఉండదు. అనవసరమైన వాటిని వదులుకోవడం నేర్చుకోవాలి, మరియు సాధారణ జీవితంలో తొంభై శాతం అనవసరం; అది సులభంగా పడిపోతుంది. దాదాపు సంకేతికంగా ఉండండి, అవసరమైన వాటిని మాత్రమే ఉంచుకోండి. అప్పుడు మీకు చాలా శక్తి మిగిలి ఉంటుంది. ఒక రోజు మీరు ఎటువంటి కారణం లేకుండా అకస్మాత్తుగా వికసించడం ప్రారంభిస్తారు.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Osho Daily Meditations - 215 🌹

📚. Prasad Bharadwaj

🍀 215. ENERGY 🍀

🕉. When the tree is overflowing with vitality it blooms and flowers. Flowers are a luxury. Only when you have too much and you cannot contain it, do they burst forth. 🕉

Spirituality is a flowering--it is the ultimate luxury. If you are overflowing with vitality, only then does something like a golden flower bloom in you. William Blake was right when he said, "Energy is delight."The more energy you have, the more delight you will have. Despair comes because energy goes on leaking, and people have forgotten how to contain it. In a thousand and one thoughts, worries, desires, imagination, dreams, memories, energy is leaking. And energy is leaking in unnecessary things that can be easily avoided. When there is no need to talk, people go on talking. When there is no need to do anything, they cannot sit silently; they have to “do.”

People are obsessed with doing, as if doing is a sort of intoxicant; it keeps them drunk. They remain occupied so that they don't have time to think about the real problems of life. They keep themselves busy so that they don't bump into themselves. They are afraid--afraid of the abyss that is yawning within. This is how energy goes on leaking, and this is why you never have too much of it. One has to learn to drop the unnecessary. And ninety percent of ordinary life is unnecessary; it can easily be dropped. Be almost telegraphic, keeping just the essential, and you will have so much energy left that one day you will suddenly start blooming, for no reason at all.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

18 Jul 2022

శ్రీ శివ మహా పురాణము - 596 / Sri Siva Maha Purana - 596

🌹 . శ్రీ శివ మహా పురాణము - 596 / Sri Siva Maha Purana - 596 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 04 🌴

🌻. కార్తికేయుని కొరకై అన్వేషణ - 5 🌻

కార్తికేయుడిట్లు పలికెను -

ఓ మంగళ మూర్తులారా ! భయమును విడనాడుడు. నేను ఉండగా భయమేల? తల్లులారా!: నేను ఆప శక్యము గాని బాలకుడను. నన్ను ఎవరు ఆపగలరు? (43)

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఇంతలో సేనాధి పతియగు నందీశ్వరుడు అచట కార్తికేయుని ఎదుట గూర్చుండి ఇట్లు పలికెను (44).

నందీశ్వరుడిట్లు పలికెను-

ఓ తల్లులారా! సోదరా! నా వృత్తాంతమును చెప్పెదను. వినుము. లయకర్త, మహేశ్వరుడు అగు శంకరుడు నన్ను పంపినాడు (45). కుమారా! బ్రహ్మ విష్ణు శివులు, సమస్త దేవతలు కైలాసమయునందు మహోత్సాహముతో మంగళకరమగు సందర్భములో సభను దీర్చి యున్నారు (46). అపుడు పార్వతి సభ యందు సర్వులకు శుభమును కలిగించే శంకరుని సంభోదించి నిన్ను వెతికించు మని చెప్పెను (47). అపుడు శివుడు దేవతలను నీ గురించి ప్రశ్నించగా, వారు ఒకరి తరువాత మరియొకరు సముచితమగు సమాధానముల నిచ్చిరి (48).

ధర్మా ధర్మములగు కర్మలకు సాక్షులుగా ఉండే ధర్ముడు మొదలగు వారందరు ఈశ్వరునితో నీవు కృత్తికల గృహములో ఇచట ఉన్నావని చెప్పిరి (49). పూర్వము పార్వతీ పరమేశ్వరులు ఏకాంతములో విహరించు చుండిరి. దేవతలు వారి ఏకాంతమునకు భంగము కలింగించగా శివుని తేజస్సు భూమికి సంక్రమించెను (50).

భూమి అగ్ని యందు, అగ్ని కైలాస పర్వతమునందు, కైలాసుడు గంగయందు, గంగ తన తరంగముల వేగముచే రెల్లు గడ్డి వనమునందు నిక్షేపించిరి(51). అపుడు సమర్ధుడవగు నీవు దేవకార్యము కొరకై బాలుడవై జన్మించితివి. కృత్తికలు నిన్ను అచట కనుగొనిరి. ఇప్పుడు నీవు కైలాసమునకు వెళ్లుము (52).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 SRI SIVA MAHA PURANA - 596 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 04 🌴

🌻 Search for Kārttikeya and his conversation with Nandin - 5 🌻

Kārttikeya said:—

43. O good women, O mothers, cast off your fear. When I am here what fear need you have? Although I am a boy I am invincible. Who can thwart me?

Brahmā said:—

44. In the meantime, Nandīśvara the commander-inchief sat in front of Kārttikeya and said.

Nandīśvara said:—

45. O brother, O mothers, listen to my auspicious mission. I have been commissioned by lord Śiva, the annihilator.

46. O dear, all the gods, Brahmā, Viṣṇu, Śiva and others are holding a jubilant conference at Kailāsa.

47. At that time Pārvatī addressed Śiva the benefactor of all, in that assembly urging a search for you.

48. Śiva asked the assembly severally about you in order to get you back. They too replied in a suitable manner.

49. They said to Śiva that you were here in the abode of Kṛttikas. Dharma and others who are the cosmic witnesses of all righteous and unrighteous activities revealed your whereabouts.

50. Formerly Pārvatī and Śiva indulged in their secret sexual dalliance. The semen of Śiva seen by the gods fell on the ground.

51. The earth dropped it into the fire, the fire on the mountain, the mountain in the Gaṅgā and the Gaṅgā transmitted it to the grove of Sara plants by her following currents and waves.

52. There you developed into a boy, the lord with the mission of fulfilling the task of the gods. There you were picked up by the Kṛttikas. Now you shall come down to the Earth.

Continues....

🌹🌹🌹🌹🌹

18 Jul 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 80 / Agni Maha Purana - 80

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 80 / Agni Maha Purana - 80 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 27

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. దీక్షా విధి - 6 🌻

ఓం సుగన్ధతన్మాత్రే వియుజ్‌క్ష్వ హుం ఫట్‌ ఓం సంపాహి స్వాహా'' అనునది గంధతన్మాత్రా విమోజన మంత్రము. ''ఓం స్వం స్వం యుజ్‌క్ష్వప్రకృత్యా'' అనునది ప్రకృతి సంయోజన మంత్రము, ''ఓం సుం హుం గన్ధతన్మాత్రే సంహర స్వాహా' అనునది సంహార మంత్రము, పిమ్మట పూర్ణాహుతి చేయవలెను. మిగిలినవాటి విషయమున గూడ ఇట్లే చేయవలెను. ''ఓం రసతన్మాత్రే'' మొదలు ''ఓం ఓం ప్రకృతౌ'' అను దానివరకును ఉన్న ఎనిమిది యుత్తత్ర్పయోగాలలో ఉపయోగించు ఉమంత్రములు. ఇది ఏకమూర్తి విషయమున సంపూర్ణముగ చెప్పబడిన దీక్షా విధానము. నవవ్యూహాదికమునందు కూడ ప్రయోగ మిట్లే అని చెప్పబడినది.

నరుడు ప్రకృతిని దహించి దానిని పరమ నిర్వాణమునందు చేర్చవలెను. నరుడు ప్రకృతిని అవికారుఢగు ఈశ్వరునితో చేర్చవలెను. పిమ్మట భూతశుద్ధి చేసి బుద్ధ్యాఖ్యములగు కర్మాంగములను, పిమ్మట తన్మాత్రలను, మనస్సును జ్ఞానమును, అహంకారమును శోధించవలెను.

అంతమునందు లింగాత్మశోధనము చేసి మరల ప్రకృతి శోదనము చేయవలెను. పరిశుద్ధుడును, ఈశ్వరధామమున నున్న వాడును, అన్ని భోగములను తన గోచరముచేసికొనినవాడును, ముక్తియందు స్థితి సంపాదించినవాడును అగు ప్రాకృతీ పురుషుని ధ్యానించుచు పూర్ణాహుతిని ఇవ్వవలెను. ఇది అధికారికి సంబంధించిన దీక్షా విధానము.

మంత్రాంగములచే ఆరాధనచేసి తత్త్వముల సముదాయమును సమముగా నుండునట్లుచేసి ఈవిధముగ సక్రమముగా విశోధనముచేసి, అంతమునందు సర్వసిద్ధి సమన్వితుని ధ్యానించుచు పూర్ణాహుతి ఇవ్వవలెను, ఇది సాధకుడు చేయవలసిన దీక్షా పద్ధతి.

ద్రవ్యములను కూర్చుకొనుటకు సామర్ధ్యము లేకపోయినచో? లేదా తనకు శక్తి లేకపోయినచో, దేశికోత్తముడు పూర్వము చెప్పినట్లు సర్వోపకరణసహితు డగు దేవుని ఆరాధించి వెంటనే శిష్యునకు ద్వాదశియందు దీక్ష ఇవ్వవలెను.

భక్తుడును, వినయవంతుడును, సమస్తమైన శారీర గుణములు కలవాడును అగు విష్యుడు అధిక ధనవంతుడు కానిచో ఆతనికి స్థండిలాభ్యర్చన చేయించి దీక్ష ఇవ్వవలెను.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Agni Maha Purana - 80 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 27

🌻 Mode of performing the initiation rite - 6 🌻

52. Oṃ, suṃ, to the principle of smell, separate, huṃ, phaṭ. Oṃ, protect, hā. Oṃ, svam, svam, unite with the primordial. Oṃ, suṃ, huṃ, to the principle of smell, destroy oblations. Then the final oblation is to be applied in the northern direction as follows: Oṃ, rāṃ, to the principle of taste. Oṃ, bheṃ, to the principle of colour. Oṃ, raṃ, the principle of touch. Oṃ, eṃ, to the principle of sound. Oṃ, bhaṃ, salutations. Oṃ, soṃ, egoism. Oṃ, naṃ, to intellect. Oṃ, Oṃ, to the primordial. This method of initiation has been described in brief in the case of the deity of a single form. The procedure for the nine-vyūhas etc. are also remembered to be of the same kind.

53. A person after having consumed (all the things) should consign the primordial thing to eternal bliss. Then a person has to consign the primordial thing to the Lord devoid of transformation.

54. Then having purified the elements, one has to purify the instruments of action, the intellect, the principles, mind, knowledge and egoism.

55-56. After having purified the soul of the body, he should again purify the primordial principle at the end. The supreme being and the pure primordial principle stationed in the Lord (which is) held under control and has been rendered an abode after being freed from bondage is contemplated upon and the final oblation is offered. This is the (mode of) initiation for a person (who is) fit.

57-58. Having worshipped with the constituents of the mystic syllables, the principles are uniformly carried and gradually purified. Having meditated (on the Lord) endowed with all accomplishments, the final oblation is made. This is the (mode of) initiation for an aspirant in case if there is no abundance of articles and no capacity for a person.

59. Having worshipped the lord as before endowed with all the materials, the excellent preceptor has to initiate (the disciple) on the dvādaśī (the 12th day) from the beginning of the rite.

60. The disciple must be devoted, humble, endowed with all physical qualities, not very rich. Such a person is initiated.after the worship of the deity in the altar.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

18 Jul 2022

కపిల గీత - 41 / Kapila Gita - 41

🌹. కపిల గీత - 41 / Kapila Gita - 41🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ కందాడై రామానుజాచార్యులు
📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴. 17. సర్వ నియామకుడినైన నన్ను ఆశ్రయం పొందడం - 1 🌴

41. నాన్యత్ర మద్భగవతః ప్రధానపురుషేశ్వరాత్
ఆత్మనః సర్వభూతానాం భయం తీవ్రం నివర్తతే

సంసారం వలనా, ప్రకృతి వలనా, విషయభోగముల వలన సుఖేచ్చల వలన కలిగే భయమూ సంతాపమూ, నన్ను తప్ప మిగతా దేనిని సేవించినా తొలగదూ. అన్ని ప్రాణులకూ ప్రకృతి వలన సహజముగా కలిగే భయము నా వలననే పోతుంది. భయము కలిగించే వాడినీ నేనే. భయము తొలగించే వాడినీ నేనే. అందరూ నా వలననే భయపడతారు. నన్ను స్మరించే భయాన్ని పోగొట్టుకుంటారు.

సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Kapila Gita - 41 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

✍️ Swami Prabhupada.
📚 Prasad Bharadwaj

🌴 17. Taking Shelter of Me, the Supreme Controller - 1 🌴

41. nanyatra mad-bhagavatah pradhana-purusesvarat
atmanah sarva-bhutanam bhayam tivram nivartate

The terrible fear of birth and death can never be forsaken by anyone who resorts to any shelter other than Myself, for I am the almighty Lord, the Supreme Personality of Godhead, the original source of all creation, and also the Supreme Soul of all souls.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

18 Jul 2022

18 Jul 2022 Daily Panchang నిత్య పంచాంగము

🌹18, July 2022 పంచాగము - Panchangam 🌹

శుభ సోమవారం, Monday, ఇందు వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు. 🌻

🍀. రుద్రనమక స్తోత్రం - 33 🍀

63. కాట్యాయ గహ్వరేష్ఠాయ హ్రదయ్యాయ చ తే నమః!
నివేష్ప్యాయ నమస్తుభ్యం పాగ్oసవ్యాయ తే నమః!!

64. రజస్యాయ నమస్తుభ్యం పరాత్పర తరాయ చ!
నమస్తే హరికేశాయ శుష్క్యాయ చ నమోనమః!!

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : మానవులనేకులు సిరిసంపదకూ, శక్తిప్రాభవాలూ పొందడానికి కృషి చేస్తూ వుంటారు. మరి నీవో, - ఈశ్వరుని పొందడానికి మాత్రమే కృషి చెయ్యి. అదే నీ కర్తవ్యం. నీకు సింహాసన మివ్వనీ, భిక్షాపాత్ర యివ్వనీ, అది ఆయనకే వదిలి వెయ్యి. 🍀

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, ఆషాడ మాసం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

తిథి: కృష్ణ పంచమి 08:56:44 వరకు

తదుపరి కృష్ణ షష్టి

నక్షత్రం: పూర్వాభద్రపద 12:25:51

వరకు తదుపరి ఉత్తరాభద్రపద

యోగం: శోభన 15:25:23 వరకు

తదుపరి అతిగంధ్

కరణం: తైతిల 08:58:44 వరకు

వర్జ్యం: 21:55:12 - 23:30:24

దుర్ముహూర్తం: 12:48:19 - 13:40:31

మరియు 15:24:54 - 16:17:05

రాహు కాలం: 07:28:39 - 09:06:31

గుళిక కాలం: 14:00:05 - 15:37:57

యమ గండం: 10:44:22 - 12:22:13

అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:48

అమృత కాలం: 04:44:20 - 06:16:16

సూర్యోదయం: 05:50:47

సూర్యాస్తమయం: 18:53:40

చంద్రోదయం: 22:51:33

చంద్రాస్తమయం: 10:17:58

సూర్య సంచార రాశి: కర్కాటకం

చంద్ర సంచార రాశి: కుంభం

ముసల యోగం - దుఃఖం 12:25:51

వరకు తదుపరి గద యోగం - కార్య హాని , చెడు

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

🌹. శ్రీమద్భగవద్గీత - 233 / Bhagavad-Gita - 233🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 233 / Bhagavad-Gita - 233🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 29 🌴*

*29. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్ |*
*సుహృదం సర్వభుతానాం జ్ఞాత్వా మాం శాన్తిమృచ్చతి ||*

🌷. తాత్పర్యం :
*నా సంపూర్ణభావన యందున్నవాడు నన్ను సర్వయజ్ఞములకు తపస్సులకు చరమభోక్తగను, సకల లోకములకు దేవతలకు ప్రభువుగను, సకలజీవులకు లాభమును గూర్చువానిగను మరియు శ్రేయోభిలాషిగను తెలిసికొని భౌతికదుఃఖముల నుండి విడివడి పరమశాంతిని పొందును.*

🌷. భాష్యము :
మాయాశక్తి బంధములో నున్న బద్ధజీవులు భౌతికజగమునందు శాంతిని పొందుటకై ఆరాటపడుచుందురు. కాని శాంతిసూత్రమును మాత్రము వారెరుగరు. అదియే భగవద్గీత యందు ఇచ్చట వివరింపబడినది. ఆ ఘనమైన శాంతిసూత్రము ఈ విధముగా తెలుపబడినది. సమస్త మానవకర్మలకు శ్రీకృష్ణభగవానుడే దివ్యభోక్త. అతడే సర్వలోకములకు మరియు అందున్న దేవతలకు ప్రభువు కనుక జనులు అతని దివ్యసేవకే సమస్తమును అర్పించవలసి యున్నది. అతని కన్నాను ఘనుడైనవాడు వేరోక్కడు లేడు. బ్రహ్మరుద్రాదుల వంటి దేవతల కన్న్నాను అతడు ఘనమైనవాడు.

మాయకారణముననే జీవులు తమను ప్రభువులుగా తలచుచున్నను వాస్తవమునాకు వారు దేవదేవుని మాయకు ఆధీనులైనట్టివారే. శ్రీకృష్ణభగవానుడు ప్రకృతి ప్రభువు కాగా, కఠినమగు ప్రకృతి నియమములచే నియమింపబడువారు బద్ధజీవులు. ఈ నగ్నసత్యమును అవగతము చేసికొననంతవరకు వక్తిగతముగా గాని, సామూహికముగా గాని విశ్వశాంతిని సాధించు అవకాశమే లేదు. దేవదేవుడైన శ్రీకృష్ణుడే సర్వులకు ప్రభువు మరియు దేవతలతో సహా సర్వజీవులు అతనికి లోబడియుండువారు అనుటయే కృష్ణభక్తిరసభావనము. అట్టి సంపూర్ణ కృష్ణభక్తిభావన యందే మనుజుడు పూర్ణశాంతిని పొందగలడు.

 యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి యను ఎనిమిది అంగములు గల యోగాభ్యాసమునందు క్రమానుగతమైన ఉద్దరమున్నను అది భక్తియుక్తసేవచే సంపూర్ణత్వము నొందుట యందు ఉపోద్ఘాతము వంటిది మాత్రమే. భక్తియోగమునందలి సంపూర్ణత్వమొక్కటే మనుజునకు శాంతిని గూర్చగలదు. అదియే మానవజన్మ యొక్క పరమసిద్ధియై యున్నది.

శ్రీమద్భగవద్గీత యందలి “కర్మయోగము – కృష్ణభక్తిరసభావితకర్మ” అను పంచమాధ్యాయమునకు భక్తివేదాంత భాష్యము సమాప్తము. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 233 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 5 - Karma Yoga - 29 🌴*

*29. bhoktāraṁ yajña-tapasāṁ sarva-loka-maheśvaram*
*suhṛdaṁ sarva-bhūtānāṁ jñātvā māṁ śāntim ṛcchati*

🌷 Translation : 
*A person in full consciousness of Me, knowing Me to be the ultimate beneficiary of all sacrifices and austerities, the Supreme Lord of all planets and demigods, and the benefactor and well-wisher of all living entities, attains peace from the pangs of material miseries.*

🌹 Purport :

🌹 Purport :
The conditioned souls within the clutches of the illusory energy are all anxious to attain peace in the material world. But they do not know the formula for peace, which is explained in this part of the Bhagavad-gītā. The greatest peace formula is simply this: Lord Kṛṣṇa is the beneficiary in all human activities. Men should offer everything to the transcendental service of the Lord because He is the proprietor of all planets and the demigods thereon. No one is greater than He. He is greater than the greatest of the demigods, Lord Śiva and Lord Brahmā. 

Under the spell of illusion, living entities are trying to be lords of all they survey, but actually they are dominated by the material energy of the Lord. The Lord is the master of material nature, and the conditioned souls are under the stringent rules of material nature. Unless one understands these bare facts, it is not possible to achieve peace in the world either individually or collectively. This is the sense of Kṛṣṇa consciousness: Lord Kṛṣṇa is the supreme predominator, and all living entities, including the great demigods, are His subordinates. One can attain perfect peace only in complete Kṛṣṇa consciousness.

There is a gradual process of elevation in the practice of yama, niyama, āsana, prāṇāyāma, pratyāhāra, dhāraṇā, dhyāna and samādhi. But these only preface perfection by devotional service, which alone can award peace to the human being. It is the highest perfection of life. 

Thus end the Bhaktivedanta Purports to the Fifth Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of Karma-yoga, or Action in Kṛṣṇa Consciousness.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://www.tumblr.com/blog/bhagavadgitawisdom
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj

🍀 18 - JULY - 2022 MONDAY ALL MESSAGES సోమవారం , ఇందు వాసర సందేశాలు 🍀

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 18, సోమవారం, జూలై 2022 ఇందు వాసరే Monday 🌹
2) 🌹 కపిల గీత - 41 / Kapila Gita - 41 🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 80 / Agni Maha Purana - 80 🌹
4) 🌹. శివ మహా పురాణము - 596 / Siva Maha Purana - 596 🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 215 / Osho Daily Meditations - 215 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 387 / Sri Lalitha Chaitanya Vijnanam - 387 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹18, July 2022 పంచాగము - Panchangam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు. 🌻*

*🍀. రుద్రనమక స్తోత్రం - 33 🍀*

*63. కాట్యాయ గహ్వరేష్ఠాయ హ్రదయ్యాయ చ తే నమః!*
*నివేష్ప్యాయ నమస్తుభ్యం పాగ్oసవ్యాయ తే నమః!!*
*64. రజస్యాయ నమస్తుభ్యం పరాత్పర తరాయ చ!*
*నమస్తే హరికేశాయ శుష్క్యాయ చ నమోనమః!!*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : మానవులనేకులు సిరిసంపదకూ, శక్తిప్రాభవాలూ పొందడానికి కృషి చేస్తూ వుంటారు. మరి నీవో, - ఈశ్వరుని పొందడానికి మాత్రమే కృషి చెయ్యి. అదే నీ కర్తవ్యం. నీకు సింహాసన మివ్వనీ, భిక్షాపాత్ర యివ్వనీ, అది ఆయనకే వదిలి వెయ్యి. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, ఆషాడ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: కృష్ణ పంచమి 08:56:44 వరకు
తదుపరి కృష్ణ షష్టి
నక్షత్రం: పూర్వాభద్రపద 12:25:51
వరకు తదుపరి ఉత్తరాభద్రపద
యోగం: శోభన 15:25:23 వరకు
తదుపరి అతిగంధ్
కరణం: తైతిల 08:58:44 వరకు
వర్జ్యం: 21:55:12 - 23:30:24
దుర్ముహూర్తం: 12:48:19 - 13:40:31
మరియు 15:24:54 - 16:17:05
రాహు కాలం: 07:28:39 - 09:06:31
గుళిక కాలం: 14:00:05 - 15:37:57
యమ గండం: 10:44:22 - 12:22:13
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:48
అమృత కాలం: 04:44:20 - 06:16:16
సూర్యోదయం: 05:50:47
సూర్యాస్తమయం: 18:53:40
చంద్రోదయం: 22:51:33
చంద్రాస్తమయం: 10:17:58
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: కుంభం
ముసల యోగం - దుఃఖం 12:25:51
వరకు తదుపరి గద యోగం - కార్య హాని , చెడు

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 41 / Kapila Gita - 41🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
✍️. శ్రీమాన్ కందాడై రామానుజాచార్యులు
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴. 17. సర్వ నియామకుడినైన నన్ను ఆశ్రయం పొందడం - 1 🌴*

*41. నాన్యత్ర మద్భగవతః ప్రధానపురుషేశ్వరాత్*
*ఆత్మనః సర్వభూతానాం భయం తీవ్రం నివర్తతే*

*సంసారం వలనా, ప్రకృతి వలనా, విషయభోగముల వలన సుఖేచ్చల వలన కలిగే భయమూ సంతాపమూ, నన్ను తప్ప మిగతా దేనిని సేవించినా తొలగదూ. అన్ని ప్రాణులకూ ప్రకృతి వలన సహజముగా కలిగే భయము నా వలననే పోతుంది. భయము కలిగించే వాడినీ నేనే. భయము తొలగించే వాడినీ నేనే. అందరూ నా వలననే భయపడతారు. నన్ను స్మరించే భయాన్ని పోగొట్టుకుంటారు.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 41 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*

*🌴 17. Taking Shelter of Me, the Supreme Controller - 1 🌴*

*41. nanyatra mad-bhagavatah pradhana-purusesvarat*
*atmanah sarva-bhutanam bhayam tivram nivartate*

*The terrible fear of birth and death can never be forsaken by anyone who resorts to any shelter other than Myself, for I am the almighty Lord, the Supreme Personality of Godhead, the original source of all creation, and also the Supreme Soul of all souls.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 80 / Agni Maha Purana - 80 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 27*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. దీక్షా విధి - 6 🌻*

ఓం సుగన్ధతన్మాత్రే వియుజ్‌క్ష్వ హుం ఫట్‌ ఓం సంపాహి స్వాహా'' అనునది గంధతన్మాత్రా విమోజన మంత్రము. ''ఓం స్వం స్వం యుజ్‌క్ష్వప్రకృత్యా'' అనునది ప్రకృతి సంయోజన మంత్రము, ''ఓం సుం హుం గన్ధతన్మాత్రే సంహర స్వాహా' అనునది సంహార మంత్రము, పిమ్మట పూర్ణాహుతి చేయవలెను. మిగిలినవాటి విషయమున గూడ ఇట్లే చేయవలెను. ''ఓం రసతన్మాత్రే'' మొదలు ''ఓం ఓం ప్రకృతౌ'' అను దానివరకును ఉన్న ఎనిమిది యుత్తత్ర్పయోగాలలో ఉపయోగించు ఉమంత్రములు. ఇది ఏకమూర్తి విషయమున సంపూర్ణముగ చెప్పబడిన దీక్షా విధానము. నవవ్యూహాదికమునందు కూడ ప్రయోగ మిట్లే అని చెప్పబడినది.

నరుడు ప్రకృతిని దహించి దానిని పరమ నిర్వాణమునందు చేర్చవలెను. నరుడు ప్రకృతిని అవికారుఢగు ఈశ్వరునితో చేర్చవలెను. పిమ్మట భూతశుద్ధి చేసి బుద్ధ్యాఖ్యములగు కర్మాంగములను, పిమ్మట తన్మాత్రలను, మనస్సును జ్ఞానమును, అహంకారమును శోధించవలెను.

అంతమునందు లింగాత్మశోధనము చేసి మరల ప్రకృతి శోదనము చేయవలెను. పరిశుద్ధుడును, ఈశ్వరధామమున నున్న వాడును, అన్ని భోగములను తన గోచరముచేసికొనినవాడును, ముక్తియందు స్థితి సంపాదించినవాడును అగు ప్రాకృతీ పురుషుని ధ్యానించుచు పూర్ణాహుతిని ఇవ్వవలెను. ఇది అధికారికి సంబంధించిన దీక్షా విధానము.

మంత్రాంగములచే ఆరాధనచేసి తత్త్వముల సముదాయమును సమముగా నుండునట్లుచేసి ఈవిధముగ సక్రమముగా విశోధనముచేసి, అంతమునందు సర్వసిద్ధి సమన్వితుని ధ్యానించుచు పూర్ణాహుతి ఇవ్వవలెను, ఇది సాధకుడు చేయవలసిన దీక్షా పద్ధతి.

ద్రవ్యములను కూర్చుకొనుటకు సామర్ధ్యము లేకపోయినచో? లేదా తనకు శక్తి లేకపోయినచో, దేశికోత్తముడు పూర్వము చెప్పినట్లు సర్వోపకరణసహితు డగు దేవుని ఆరాధించి వెంటనే శిష్యునకు ద్వాదశియందు దీక్ష ఇవ్వవలెను.

భక్తుడును, వినయవంతుడును, సమస్తమైన శారీర గుణములు కలవాడును అగు విష్యుడు అధిక ధనవంతుడు కానిచో ఆతనికి స్థండిలాభ్యర్చన చేయించి దీక్ష ఇవ్వవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 80 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

*Chapter 27*
*🌻 Mode of performing the initiation rite - 6 🌻*

52. Oṃ, suṃ, to the principle of smell, separate, huṃ, phaṭ. Oṃ, protect, hā. Oṃ, svam, svam, unite with the primordial. Oṃ, suṃ, huṃ, to the principle of smell, destroy oblations. Then the final oblation is to be applied in the northern direction as follows: Oṃ, rāṃ, to the principle of taste. Oṃ, bheṃ, to the principle of colour. Oṃ, raṃ, the principle of touch. Oṃ, eṃ, to the principle of sound. Oṃ, bhaṃ, salutations. Oṃ, soṃ, egoism. Oṃ, naṃ, to intellect. Oṃ, Oṃ, to the primordial. This method of initiation has been described in brief in the case of the deity of a single form. The procedure for the nine-vyūhas etc. are also remembered to be of the same kind.

53. A person after having consumed (all the things) should consign the primordial thing to eternal bliss. Then a person has to consign the primordial thing to the Lord devoid of transformation.

54. Then having purified the elements, one has to purify the instruments of action, the intellect, the principles, mind, knowledge and egoism.

55-56. After having purified the soul of the body, he should again purify the primordial principle at the end. The supreme being and the pure primordial principle stationed in the Lord (which is) held under control and has been rendered an abode after being freed from bondage is contemplated upon and the final oblation is offered. This is the (mode of) initiation for a person (who is) fit.

57-58. Having worshipped with the constituents of the mystic syllables, the principles are uniformly carried and gradually purified. Having meditated (on the Lord) endowed with all accomplishments, the final oblation is made. This is the (mode of) initiation for an aspirant in case if there is no abundance of articles and no capacity for a person.

59. Having worshipped the lord as before endowed with all the materials, the excellent preceptor has to initiate (the disciple) on the dvādaśī (the 12th day) from the beginning of the rite.

60. The disciple must be devoted, humble, endowed with all physical qualities, not very rich. Such a person is initiated.after the worship of the deity in the altar.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 596 / Sri Siva Maha Purana - 596 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 04 🌴*

*🌻. కార్తికేయుని కొరకై అన్వేషణ - 5 🌻*

కార్తికేయుడిట్లు పలికెను -

ఓ మంగళ మూర్తులారా ! భయమును విడనాడుడు. నేను ఉండగా భయమేల? తల్లులారా!: నేను ఆప శక్యము గాని బాలకుడను. నన్ను ఎవరు ఆపగలరు? (43)

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఇంతలో సేనాధి పతియగు నందీశ్వరుడు అచట కార్తికేయుని ఎదుట గూర్చుండి ఇట్లు పలికెను (44).

నందీశ్వరుడిట్లు పలికెను-

ఓ తల్లులారా! సోదరా! నా వృత్తాంతమును చెప్పెదను. వినుము. లయకర్త, మహేశ్వరుడు అగు శంకరుడు నన్ను పంపినాడు (45). కుమారా! బ్రహ్మ విష్ణు శివులు, సమస్త దేవతలు కైలాసమయునందు మహోత్సాహముతో మంగళకరమగు సందర్భములో సభను దీర్చి యున్నారు (46). అపుడు పార్వతి సభ యందు సర్వులకు శుభమును కలిగించే శంకరుని సంభోదించి నిన్ను వెతికించు మని చెప్పెను (47). అపుడు శివుడు దేవతలను నీ గురించి ప్రశ్నించగా, వారు ఒకరి తరువాత మరియొకరు సముచితమగు సమాధానముల నిచ్చిరి (48).

ధర్మా ధర్మములగు కర్మలకు సాక్షులుగా ఉండే ధర్ముడు మొదలగు వారందరు ఈశ్వరునితో నీవు కృత్తికల గృహములో ఇచట ఉన్నావని చెప్పిరి (49). పూర్వము పార్వతీ పరమేశ్వరులు ఏకాంతములో విహరించు చుండిరి. దేవతలు వారి ఏకాంతమునకు భంగము కలింగించగా శివుని తేజస్సు భూమికి సంక్రమించెను (50).

భూమి అగ్ని యందు, అగ్ని కైలాస పర్వతమునందు, కైలాసుడు గంగయందు, గంగ తన తరంగముల వేగముచే రెల్లు గడ్డి వనమునందు నిక్షేపించిరి(51). అపుడు సమర్ధుడవగు నీవు దేవకార్యము కొరకై బాలుడవై జన్మించితివి. కృత్తికలు నిన్ను అచట కనుగొనిరి. ఇప్పుడు నీవు కైలాసమునకు వెళ్లుము (52).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 596 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 04 🌴*

*🌻 Search for Kārttikeya and his conversation with Nandin - 5 🌻*

Kārttikeya said:—
43. O good women, O mothers, cast off your fear. When I am here what fear need you have? Although I am a boy I am invincible. Who can thwart me?

Brahmā said:—
44. In the meantime, Nandīśvara the commander-inchief sat in front of Kārttikeya and said.

Nandīśvara said:—
45. O brother, O mothers, listen to my auspicious mission. I have been commissioned by lord Śiva, the annihilator.

46. O dear, all the gods, Brahmā, Viṣṇu, Śiva and others are holding a jubilant conference at Kailāsa.

47. At that time Pārvatī addressed Śiva the benefactor of all, in that assembly urging a search for you.

48. Śiva asked the assembly severally about you in order to get you back. They too replied in a suitable manner.

49. They said to Śiva that you were here in the abode of Kṛttikas. Dharma and others who are the cosmic witnesses of all righteous and unrighteous activities revealed your whereabouts.

50. Formerly Pārvatī and Śiva indulged in their secret sexual dalliance. The semen of Śiva seen by the gods fell on the ground.

51. The earth dropped it into the fire, the fire on the mountain, the mountain in the Gaṅgā and the Gaṅgā transmitted it to the grove of Sara plants by her following currents and waves.

52. There you developed into a boy, the lord with the mission of fulfilling the task of the gods. There you were picked up by the Kṛttikas. Now you shall come down to the Earth.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 215 / Osho Daily Meditations - 215 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 215. శక్తి 🍀*

*🕉. చెట్టు జీవశక్తితో పొంగిపొర్లుతున్నప్పుడు అది వికసిస్తుంది మరియు పుష్పిస్తుంది. పువ్వులు విలాసవంతమైనవి. మీకు చాలా ఎక్కువ జీవశక్తి ఉన్నప్పుడు మరియు మీరు దానిని కలిగి ఉండలేనప్పుడు మాత్రమే, అది విస్ఫోటనం చెందుతుంది. 🕉*

*ఆధ్యాత్మికత పుష్పించేది--అది అంతిమ విలాసం. మీరు తేజముతో పొంగిపోతుంటే, అప్పుడు మాత్రమే బంగారు పువ్వు వంటిది నీలో వికసిస్తుంది. విలియం బ్లేక్ చెప్పింది నిజమే, 'శక్తి చాలా ఆనందమైనది. 'మీలో ఎంత ఎక్కువ శక్తి ఉందో, అంత ఆనందాన్ని పొందుతారు. వైరాగ్యం కూడా వస్తుంది. ఎందుకంటే శక్తి వ్యర్థంగా విడుదల అవుతూ ఉంటుంది. దానిని ఎలా కలిగి ఉండాలో ప్రజలు మర్చిపోయారు. వేయి ఒక్క ఆలోచనల్లో, చింతల్లో, కోరికల్లో, ఊహల్లో, కలల్లో, జ్ఞాపకాల్లో, శక్తి కారుతోంది. సులభంగా నివారించగల అనవసరమైన విషయాలలో శక్తి విడుదల అవుతుంది. మాట్లాడాల్సిన అవసరం లేనప్పుడు మాట్లాడుకుంటూ పోతారు. ఏమీ చేయవలసిన అవసరం లేనప్పుడు, వారు నిశ్శబ్దంగా కూర్చోలేరు; వారు ఏదో ఒకటి 'చేయాలి అనుకుంటారు.'*

*చేయడం ఒక విధమైన మత్తుగా భావించి ప్రజలు చేయడం పట్ల నిమగ్నమై ఉన్నారు; అది వారిని త్రాగిన వారి వలే ఉంచుతుంది. జీవితంలోని అసలైన సమస్యల గురించి ఆలోచించడానికి వారికి సమయం ఉండదు కాబట్టి వారు దానిలోనే నిమగ్నమై ఉంటారు. వారు తమలో తాము కొట్టుకోకుండా తమను తాము బిజీగా ఉంచుకుంటారు. వారు భయపడుతున్నారు - లోపల ఆవలించే అగాధానికి భయపడతారు. ఈ విధంగా ఎనర్జీ కూరుతూనే ఉంటుంది మరియు దీని వలన మీకు ఎప్పుడూ ఎక్కువ శక్తి అందుబాటలో ఉండదు. అనవసరమైన వాటిని వదులుకోవడం నేర్చుకోవాలి, మరియు సాధారణ జీవితంలో తొంభై శాతం అనవసరం; అది సులభంగా పడిపోతుంది. దాదాపు సంకేతికంగా ఉండండి, అవసరమైన వాటిని మాత్రమే ఉంచుకోండి. అప్పుడు మీకు చాలా శక్తి మిగిలి ఉంటుంది. ఒక రోజు మీరు ఎటువంటి కారణం లేకుండా అకస్మాత్తుగా వికసించడం ప్రారంభిస్తారు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 215 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 215. ENERGY 🍀*

*🕉. When the tree is overflowing with vitality it blooms and flowers. Flowers are a luxury. Only when you have too much and you cannot contain it, do they burst forth. 🕉*

*Spirituality is a flowering--it is the ultimate luxury. If you are overflowing with vitality, only then does something like a golden flower bloom in you. William Blake was right when he said, "Energy is delight."The more energy you have, the more delight you will have. Despair comes because energy goes on leaking, and people have forgotten how to contain it. In a thousand and one thoughts, worries, desires, imagination, dreams, memories, energy is leaking. And energy is leaking in unnecessary things that can be easily avoided. When there is no need to talk, people go on talking. When there is no need to do anything, they cannot sit silently; they have to “do.”*

*People are obsessed with doing, as if doing is a sort of intoxicant; it keeps them drunk. They remain occupied so that they don't have time to think about the real problems of life. They keep themselves busy so that they don't bump into themselves. They are afraid--afraid of the abyss that is yawning within. This is how energy goes on leaking, and this is why you never have too much of it. One has to learn to drop the unnecessary. And ninety percent of ordinary life is unnecessary; it can easily be dropped. Be almost telegraphic, keeping just the essential, and you will have so much energy left that one day you will suddenly start blooming, for no reason at all.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 387 / Sri Lalitha Chaitanya Vijnanam - 387🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : . ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 84. సద్యఃప్రసాదినీ విశ్వసాక్షిణీ సాక్షివర్జితా*
*షడంగదేవతాయుక్తా షాడ్గుణ్యపరిపూరితా ॥ 84 ॥ 🍀*

*🌻 387. 'షాడ్గుణ్య పరిపూరిత'🌻*

*ఆరు గుణములతో నిండినది శ్రీదేవి అని అర్థము. ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, శ్రీ, ధ్యానము, వైరాగ్యము అనునవి షడ్గుణములు. ఈ గుణములు గలవారు శ్రీమంతులు. కేవలము ధనము గలవారు శ్రీమంతులు గారు. శ్రీమాత పై గుణములను పరిపూర్ణముగ కలిగి యున్నది. ఆమెను ఆరాధించువారు పై గుణములను పొందుదురు. సద్భక్తి యున్నచోట పై గుణములు తప్పక యుండును. ధర్మ మాచరించు వారికి క్రమముగ మిగిలిన ఐదు గుణములు అబ్బగలవు.*

*పాండవులలో ధర్మరాజు, రఘువంశము నందు శ్రీరాముడు ఈ ఆరు గుణములకు పూర్ణమగు ఉదాహరణములు. హరిశ్చంద్రుడు, నలుడు కూడ అట్టివారే. దైవము, ధర్మము అనునవి నాణెమునకు బొమ్మ, బొరుసు వంటివి. ధర్మ మాచరించు వారికి దైవము చేరువ అగును. దైవము నారాధించు వారిని ధర్మ మాశ్రయించును. ధర్మముతో కూడని దైవారాధన డాంబికమై యుండును. ధర్మమాధారముగ మిగిలిన ఐదు గుణములు పొందవచ్చును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 387 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 84. Sadyah prasadini vishvasakshini sakshivarjita
Shadanga devata yukta shadgunya paripurita ॥ 84 ॥ 🌻*

*🌻 387. ṣāḍguṇya-paripūritā षाड्गुण्य-परिपूरिता 🌻*

*She is endowed with six qualities that are considered auspicious. They are prosperity, righteousness, fame, material wealth, wisdom and dispassion. Dispassion because, She will not show any special favours to a select few, transcending the law of karma. She does not encourage favouritism.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹