🍀 02 - OCTOBER - 2022 THURSDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🍀

🌹🍀 02 - OCTOBER - 2022 THURSDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🍀🌹
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 02, అక్టోబరు 2022 ఆదివారం, భాను వాసరే SUNDAY 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 264 / Bhagavad-Gita -264 - 6వ అధ్యాయము 31 ధ్యాన యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 663 / Vishnu Sahasranama Contemplation - 663 🌹
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 625 / Sri Siva Maha Purana - 625 🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 342 / DAILY WISDOM - 342 🌹   
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 242 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹02, October 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : సరస్వతి పూజ, నవపత్రికా పూజ, గాంధీ జయంతి, Saraswati Avahan, Navpatrika Puja, Gandhi Jayanti🌻*

*🍀. ఆదిత్య స్తోత్రం - 04 🍀*

4. శ్రేష్ఠాస్తేషాం సహస్రే త్రిదివవసుధయోః పఞ్చదిగ్వ్యాప్తిభాజాం
శుభ్రాంశుం తారకౌఘం శశితనయముఖాన్ పఞ్చ చోద్భాసయన్తః |
ఆరోగో భ్రాజముఖ్యాస్త్రిభువనదహనే సప్తసూర్యా భవన్తః
సర్వాన్ వ్యాధీన్ సుషుమ్నాప్రభృతయ ఇహ మే సూర్యపాదాః క్షిపన్తు

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ఉపనిషత్తులలో 'శాశ్వతీః సమాః' అని విస్తారమైన, కొలతకందని దేశకాలాలు సూచిత మవుతున్నాయి. నిరపేక్ష శాశ్వతత్వం కలిగిన వస్తువు నిర్విశేష బ్రహ్మ మొక్కటే. అయినా, అంతర్దృష్టితో చూచినప్పుడు అన్ని వస్తువులూ వాస్తవానికి శాశ్వతములుగానే కనిపిస్తాయి. వాటికి అంతము లేదు, ఆదీ లేదు. 🍀* 

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, దక్షిణాయణం,
శరద్‌ ఋతువు, అశ్వీయుజ మాసం
తిథి: శుక్ల-సప్తమి 18:48:09 వరకు
తదుపరి శుక్ల-అష్టమి
నక్షత్రం: మూల 25:53:45 వరకు
తదుపరి పూర్వాషాఢ
యోగం: సౌభాగ్య 17:14:07 వరకు
తదుపరి శోభన
కరణం: గార 07:48:25 వరకు
వర్జ్యం: 10:45:40 - 12:16:24
దుర్ముహూర్తం: 16:28:34 - 17:16:26
రాహు కాలం: 16:34:33 - 18:04:17
గుళిక కాలం: 15:04:49 - 16:34:33
యమ గండం: 12:05:21 - 13:35:05
అభిజిత్ ముహూర్తం: 11:42 - 12:28
అమృత కాలం: 19:50:04 - 21:20:48
సూర్యోదయం: 06:06:23
సూర్యాస్తమయం: 18:04:17
వైదిక సూర్యోదయం: 06:09:56
వైదిక సూర్యాస్తమయం: 18:00:44
చంద్రోదయం: 12:07:10
చంద్రాస్తమయం: 23:19:16
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: ధనుస్సు
సిద్ది యోగం - కార్య సిధ్ధి , ధన ప్రాప్తి
25:53:45 వరకు తదుపరి శుభ యోగం
- కార్య జయం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 264 / Bhagavad-Gita - 264 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 31 🌴*

*31. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థిత: |*
*సర్వథా వర్తమానోపి స యోగీ మయి వర్తతే*

🌷. తాత్పర్యం :
*నేను మరియు హృదయస్థ పరమాత్మ ఇరువురుము ఏకమేనని ఎరిగి పరమాత్మ భజనమందు నియుక్తుడైన యోగి అన్ని పరిస్థితుల యందును నా యందే నిలిచి యుండును.*

🌷. భాష్యము :
పరమాత్మ ధ్యానమును సాగించు యోగి శ్రీకృష్ణుని సంపూర్ణాంశను శంఖము, చక్రము, గద, పద్మమును దాల్చిన చతుర్భాహు విష్ణువుగా హృదయమునందు వీక్షించును. యోగియైనవాడు ఆ విష్ణువు శ్రీకృష్ణునకు అభిన్నుడని ఎరుగవలెను. వాస్తవమునకు కృష్ణుడే అట్టి పరమాత్మ రూపములో ఎల్లరి హృదయములందును నిలిచియున్నాడు. అంతియేగాక అసంఖ్యాక జీవరాసులలో నిలిచియున్న అసంఖ్యాక పరమాత్మల నడుమను ఎట్టి భేదము లేదు. అలాగుననే శ్రీకృష్ణభగవానుని దివ్యమగు భక్తియుతసేవ యందు నియుక్తుడైన కృష్ణభక్తిరసభావితునికి మరియు పరమాత్మ ధ్యానమునందు సంలగ్నమైన పూర్ణయోగికి ఎట్టి భేదము లేదు. 

కృష్ణభక్తిభావన యందున్న యోగి భౌతికస్థితిలో వివిధకర్మల యందు నియుక్తుడైనను సదా కృష్ణుని యందే స్థితిని కలిగినట్టివాడగును. “నిఖిలాస్వపి అవస్థాసు జీవన్ముక: స ఉచ్యతే” యనుచు శ్రీరూపగోస్వామివారిని భక్తిరసామృతసింధువు (1.2.187) నందును ఇది నిర్ధారింపబడినది. అనగా కృష్ణభక్తి యందు చరించు భక్తుడు అప్రయత్నముగా ముక్తుడే యగుచున్నాడు. ఈ విషయము నారదపంచరాత్రము నందు ఈ విధముగా ధృవీకరింపబడినది.

దిక్కాలాద్యనవిచ్చిన్నే కృష్ణే చేతో విధాయ చ |
తన్మయో భవతి క్షిప్రం జీవో బ్రహ్మణి యోజయేత్ 

“సర్వవ్యాపియు మరియు దేశకాలాతీతుడును అగు శ్రీకృష్ణుని దివ్యరూపముపై ధ్యానము కావించువాడు కృష్ణుని భావములోనే నిమగ్నుడై, తదనంతరము ఆ భగవానుని దివ్య సహచర్యమును ఆనందస్థితిని పొందగలడు.”

కృష్ణభక్తిరసభావన మనునది యోగపధ్ధతి యందలి అత్యున్నత సమాధిస్థితి వంటిది. శ్రీకృష్ణుడు పరమాత్మ రూపున ఎల్లరి హృదయములందు వసించియున్నాడనెడి ఈ అవగాహనయే యోగిని దోషరహితునిగా చేయగలదు. “ఏకో(పి సన్ బహుధా యో 'వభాతి – భగవానుడు ఏకమైనను అసంఖ్యాక హృదయములలో బహురూపునిగా నిలిచియున్నాడు” అని వేదములు (గోపాలతాపన్యుపనిషత్తు 121) ఆ భగవానుని అచింత్యశక్తిని నిరూపించుచున్నవి. 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 264 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 6 - Dhyana Yoga - 31 🌴*

*31. sarva-bhūta-sthitaṁ yo māṁ bhajaty ekatvam āsthitaḥ*
*sarvathā vartamāno ’pi sa yogī mayi vartate*

🌷 Translation : 
*Such a yogī, who engages in the worshipful service of the Supersoul, knowing that I and the Supersoul are one, remains always in Me in all circumstances.*

🌹 Purport :
A yogī who is practicing meditation on the Supersoul sees within himself the plenary portion of Kṛṣṇa as Viṣṇu – with four hands, holding conchshell, wheel, club and lotus flower. The yogī should know that Viṣṇu is not different from Kṛṣṇa. Kṛṣṇa in this form of Supersoul is situated in everyone’s heart. Furthermore, there is no difference between the innumerable Supersouls present in the innumerable hearts of living entities. Nor is there a difference between a Kṛṣṇa conscious person always engaged in the transcendental loving service of Kṛṣṇa and a perfect yogī engaged in meditation on the Supersoul. \

The yogī in Kṛṣṇa consciousness – even though he may be engaged in various activities while in material existence – remains always situated in Kṛṣṇa. This is confirmed in the Bhakti-rasāmṛta-sindhu (1.2.187) of Śrīla Rūpa Gosvāmī: nikhilāsv apy avasthāsu jīvan-muktaḥ sa ucyate. A devotee of the Lord, always acting in Kṛṣṇa consciousness, is automatically liberated.

erstanding that Kṛṣṇa is present as Paramātmā in everyone’s heart makes the yogī faultless. The Vedas (Gopāla-tāpanī Upaniṣad 1.21) confirm this inconceivable potency of the Lord as follows: eko ’pi san bahudhā yo ’vabhāti. “Although the Lord is one, He is present in innumerable hearts as many.” Similarly, in the smṛti-śāstra it is said:

eka eva paro viṣṇuḥ sarva-vyāpī na saṁśayaḥ
aiśvaryād rūpam ekaṁ ca sūrya-vat bahudheyate

“Viṣṇu is one, and yet He is certainly all-pervading. By His inconceivable potency, in spite of His one form, He is present everywhere, as the sun appears in many places at once.”
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 663 / Vishnu Sahasranama Contemplation - 663🌹*

*🌻663. బ్రహ్మా, ब्रह्मा, Brahmā🌻*

*ఓం బ్రహ్మణే నమః | ॐ ब्रह्मणे नमः | OM Brahmaṇe namaḥ*

బ్రహ్మా, ब्रह्मा, Brahmā

*బ్రహ్మా బ్రహ్మాత్మనాసర్వం సృజతీతి జనార్దనః ।*
*బృహత్వాత్ బృంహణత్వాచ్చ విష్ణుర్బ్రహ్మేతి కీర్త్యతే ॥*

*జగములను సృజించెడి కార్యబ్రహ్మ అయిన చతుర్ముఖ బ్రహ్మను గూడ సృజించెడి కారణ బ్రహ్మ జనార్దనుడు. కావుననే బ్రహ్మా. మరియు కార్యకారణాతీత బ్రహ్మను, బృహత్వ బ్రహ్మణ్యములును తనలోనే కలిగి యున్నందున విష్ణుదేవుడు బ్రహ్మా అని కీర్తించ బడుతాడు.*

వ.అనఘా! యేనును బ్రహ్మయు శివుండును నీజగంబులకుఁ గారణభూతుల; మందు నే నీశ్వరుండను నుపద్రష్టను స్వయంప్రకాశకుండను నై గుణమయం బయిన యాత్మీయమాయం బ్రవేశించి జనన వృద్ధి విలయంబులకు హేతు భూతంబు లగు తత్తత్‍క్రియోచితంబులైన బ్రహ్మరుద్రాది నామధేయంబుల నొందు చుందుదు; నట్టి నద్వితీయ బ్రహ్మరూపకుండ నైన నా యందు నజ భవాదులను భూతగణంబులను మూఢుండగువాఁడు వేరుగాఁ జూచు; మనుజుండు శరీరంబునకుఁ గరచరణాదులు వేరుగాఁ దలంపని చందంబున మద్భక్తుం డగువాఁడు నా యందు భూతజాలంబు భిన్నంబుగాఁ దలంపండు. గావున మా మువ్వుర నెవ్వండు వేరు సేయకుండు వాఁడు కృతార్థుండని యానతిచ్చిన దక్షుండును. (207)

*పుణ్యాత్ముడా! నేనూ, బ్రహ్మ, శివుడూ మువ్వురం ఈ లోకములకు హేతుభూతులము. నేను ఈశ్వరుడను. సాక్షిని స్వయంప్రకాశకుడను. నేను త్రిగుణాత్మకమైన నా మాయను ప్రవర్తింపజేసి సృష్టి స్థితి లయ కార్యములను నిర్వహిస్తూ ఆయా పనులకు తగిన బ్రహ్మరుద్రాది నామములను పొందుతు ఉంటాను. నా కంటె వేరగు పరబ్రహ్మ రూపము లేదు. బ్రహ్మ, శివుడు మొదలగు వారినీ, జీవకోటినీ బుద్ధిహీనుండు నా కంటె వేరుగా చూస్తాడు. మనుష్యుడు తన చేతులు, కాళ్ళు మొదలగు అవయవములను తన శరీరముకంటె వేరుగ చూడడుగదా! అటులనే నా భక్తుడు జీవులను నా కంటె వేరుగ భావింపడు. హరిహరబ్రహ్మలమైన మా ముగ్గురును వేరుగ చూడనివాడు ధన్యుడు.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 663🌹*

*🌻663. Brahmā🌻*

*OM Brahmaṇe namaḥ*

ब्रह्मा ब्रह्मात्मनासर्वं सृजतीति जनार्दनः ।
बृहत्वात् बृंहणत्वाच्च विष्णुर्ब्रह्मेति कीर्त्यते ॥

*Brahmā brahmātmanāsarvaṃ sr‌jatīti janārdanaḥ,*
*Br‌hatvāt br‌ṃhaṇatvācca viṣṇurbrahmeti kīrtyate.*

*Lord Brahma, who creates the worlds is himself created by Lord Janardana and hence He is Brahmā. As also since Lord Viṣṇu contains the universe along with its creator within Himself, He is called Brahmā.*

:: श्रीमद्भागवते चतुर्थस्कन्धे सप्तमोऽध्यायः ::
अहं ब्रह्मा च शर्वश्च जगतः कारणं परम् ।
आत्मेश्वर उपद्रष्टा स्वयन्दृगविशॆषणः ॥ ५० ॥

Śrīmad Bhāgavata - Canto 4, Chapter 7
Ahaṃ brahmā ca śarvaśca jagataḥ kāraṇaṃ param,
Ātmeśvara upadraṣṭā svayandr‌gaviśeṣaṇaḥ. 50.

Brahmā, Lord Śiva and I are the supreme cause of the material manifestation. I am the Supersoul, the self sufficient witness. But impersonally there is no difference between Brahmā, Lord Śiva and Me.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ।ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः ॥ ७१ ॥
బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః ।బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ॥ 71 ॥
Brahmaṇyo brahmakr‌dbrahmā brahma brahmavivardhanaḥ,Brahmavidbrāhmaṇo brahmī brahmajño brāhmaṇapriyaḥ ॥ 71 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 625 / Sri Siva Maha Purana - 625 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 10 🌴*
*🌻. తారకాసుర వధ - 3 🌻*

వాయువు వీచలేదు. సూర్యుడు వెలవెల బోయెను. పర్వతములతో, అడవులతో సహా భూమి అంతయూ కంపించెను (24). ఇంతలో హిమవంతుడు మొదలుగా గల పర్వతములు కుమారుని వియోగముచే పీడితులై కుమారుని చూడగోరి అచటకు అప్పుడు విచ్చేసిరి (25). అపుడు పార్వతీ పరమేశ్వరుల పుత్రుడగు ఆ కుమారుడు భయభీతులై ఉన్న వారినందరినీ గాంచి, పర్వతములను కూడ చూచి వారిని ఓదార్చుచూ నిట్లనెను (26).

కుమారుడిట్లు పలికెను -

మహాత్మురాలగు పార్వతి దుఃఖించకుండు గాక! చింతిల్లకుడు. మీరందరు చూచుచుండగా ఇపుడీ పాపాత్ముని సంహరించెదను (27). అతడీ తీరున పర్వతులను, దేవతలను, గణములను ఓదార్చి పార్వతీ పరమేశ్వరులకు ప్రణమిల్లి అపుడు గొప్ప కాంతులు గల శక్తిని తీసుకొనెను (28). శంభుపుత్రుడు, మహావీరుడు, మహాప్రభుడునగు కుమారుడు తారకుని చంపుటకై శక్తిని చేత బట్టి మిక్కిలి ప్రకాశించెను (29). శంకరుని తేజజస్సు నిండియున్న కుమారుడు అపుడు లోకకంటకుడగు తారకాసురుని ఆ శక్తితో కొట్టెను(30).

మహావీరుడు, రాక్షసగణములన్నింటికి ప్రభువు అగు తారకాసురుడు శిథిలమైన అవయవములు గలవాడై వెంటనే నేలగూలెను (31). ఓ మునీ! అందరు చూచుచుండగా కుమారునిచే కొట్టబడిన మహావీరుడగు ఆ తారకుడు అచటనే మరణించెను (32). యుద్ధములో ప్రాణములను వీడి నేలగూలిన బలశాలియగు తారకుని వీరుడగు ఆకుమారుడు చూచి మరల కొట్టలేదు (33). మహారాక్షసుడు, మహాబలశాలి యగు ఆ తారకాసురుడు సంహరింపబడగానే, అనేక రాక్షసులు దేవతలచే మరియు గణములచే సంహరింపబడిరి (34).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 625🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 10 🌴*

*🌻 Jubilation of the gods at the death of Tāraka - 3 🌻*

24. The wind did not blow. The sun became dim. The earth quaked along with mountains and forests.

25. In the meantime Himālaya and other mountains anxious to see Kumāra out of affection came there.

26. On seeing the mountains extremely terrified, Kumāra the son of Śiva and Pārvatī spoke enlightening them thereby.
Kumāra said:—

27. O mountains, O fortunate sirs, do not be vexed, or worried. Even as you stand looking on I will kill this sinner.

28. Consoling the mountains, the gods and the Gaṇas thus, and bowing to Śiva and Pārvatī he took up his brilliant spear.

29. The heroic Kumāra, son of Śiva the great lord, with the spear in his hand shone in his resolve to kill Tāraka.

30. Possessing the brilliance of Śiva, Kumāra with his spear struck Tāraka who had harrassed the worlds.

31. Immediately the Asura Tāraka the ruler of the hosts of Asuras, although very heroic, fell on the ground with all his limbs shattered.

32. The great warrior Tāraka was slain by Kumāra. O sage, even as all were looking on, he passed away.

33. On seeing the powerful Asura fallen dead in the battle, the hero did not go and attack him again.

34. When the powerful Asura was slain, other Asuras were killed by gods and Gaṇas.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 342 / DAILY WISDOM - 342 🌹*
*🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀*
*📝. ప్రసాద్ భరద్వాజ్*

*🌻 7. ఏదీ ఎప్పటికీ ఒకే స్థితిలో నిలబడదు🌻*

*ఏ మానవ సంస్థ కూడా శాశ్వతంగా మనుగడలో ఉండలేదు. ఎన్నో సామ్రాజ్యాలు వచ్చాయి, పోయాయి. ఏ రాజ్యం, వ్యవస్థ కూడా శాశ్వతంగా మనుగడలో లేవు, ఉండలేవు. ఎందుకంటే అన్ని మానవ వ్యవస్థలు పరిణామ గతి చేత అనుక్షణం ప్రభావితం చెందే అప్పటి ప్రజల సామూహిక మానసిక ఒప్పుదల మీద ఆధారపడి ఉంటాయి. పరిణామ గతిలో ఎదిగే కొద్దీ ప్రజల మానసిక స్థితిలో, వారి ఆలోచనల్లో మార్పు తప్పక వస్తుంది. కాబట్టి మానవ వ్యవస్థలు శాశ్వతంగా ఉండలేవు. ఏ కుటుంబం అయినా, ఏ దేశమయినా, ఏ సామ్రాజ్యం అయినా శాశ్వతంగా నిలబడదు. ఎందుకంటే ఇది పరిణామ చట్టం ద్వారా అనుమతించబడదు. ఒకప్పుడు శిశువుగా ఉన్నప్పటికీ, ఎల్లప్పుడూ శిశువుగా ఉండలేదు. శిశువు పరిణతి చెందిన వ్యక్తిగా మారుతుంది మరియు అభివృద్ధి చెందుతుంది.*

*సాంఘిక సంస్థల రూపంలో సంస్థాగత వ్యవస్థలు పరిపక్వతకు పెరుగుతాయి మరియు అవి వ్యక్తి వలె పాతవిగా మారతాయి; అప్పుడు అవి కుళ్ళిపోతాయి, నశిస్తాయి. వ్యక్తిత్వం మరియు వస్తువులలో కనిపించే పెరుగుదల మరియు క్షీణత యొక్క చట్టం సంస్థలలో కూడా పనిచేస్తుంది. ఎందుకంటే సంస్థలు కేవలం వ్యక్తి యొక్క లక్షణాల ద్వారా మానసికంగా రూపొందించబడి స్థూల రూపం పొందిన వస్తువులు మాత్రమే. ఇవి పెరుగుదల, క్షయం మరియు అంతిమ వినాశనానికి సంబంధించిన ఈ పరిణామ ప్రక్రియకు లోబడి ఉంటాయి. ప్రపంచం మొత్తం ఈ పరిణామ నియమానికి లోబడి పనిచేస్తుంది. ఏదీ ఎప్పటికీ ఒకే స్థితిలో నిలబడదు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 342 🌹*
*🍀 📖 from The Philosophy of Religion 🍀*
*📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj*

*🌻 7. Nothing Can Stand in the Same Condition Forever🌻*

*No human institution survives for eternity. All empires came and fell. No kingdom succeeded for eternity, and no institution can, because all institutions which are humanly organised are conditioned by the evolutionary factors to which the minds of people are subject, and, as there is an advance in evolution, there is, naturally, a change in the setup of psychic actions and reactions. Therefore, human institutions cannot be perpetually established in the world. No family, no nation, no empire can stand for ever, because it is not permitted by the law of evolution, just as one cannot be a baby always, though one was a baby once upon a time. A baby becomes a mature person, and advances.*

*The systems of organisation in the form of social institutions grow into maturity, and they become old like the individual; then they decay, and they perish. The law of growth and decay that is seen in the individual personality and things operates even in institutions. This is so because institutions are only manufactured goods psychologically projected by the characteristics of the individual, which are subject to this evolutionary process of growth, decay, and final extinction. The whole world seems to be subjected to this law of evolution. Nothing can stand in the same condition forever.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 242 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. మనసు అల్లరిని ఆపితే ఆనందాన్ని అందుకోవచ్చు. మనసు ముందుకొస్తే ఆనందం వుండదు. అది అన్ని మర్మతత్వాల సారం. వ్యక్తి ఈ సాధారణమైన రహస్యాన్ని తెలుసుకుంటే జీవితంలో అంతకు మించి తెలుసుకోవాల్సింది లేదు. 🍀*

*జీవితం సంగీతం. మనసు గడబిడ ద్వని. మనసు చేసే రణగొణధ్వని వల్ల మనం జీవన సంగీతాన్ని వినలేం. మనం మనసు చేసే అల్లరిని అపకుంటే జీవన మధుర సంగీతాన్ని వినలేం. మనసు అల్లరిని ఆపితే ఆనందాన్ని అందుకోవచ్చు. మనసు ముందుకొస్తే ఆనందం వుండదు. అది అన్ని మతాల సారం, రహస్యం. అది అన్ని మర్మతత్వాల సారం. వ్యక్తి ఈ సాధారణమైన రహస్యాన్ని తెలుసుకుంటే జీవితంలో అంతకు మించి తెలుసుకోవాల్సింది లేదు. అది చాలు. అదే మాస్టర్ సంగీతం దైవత్వానికి చాలా దగ్గరగా వస్తుంది. ఎందుకంటే దైవత్వమన్నది అస్తిత్వానికి సంబంధించిన అంతిమ సంగీతం. అది విశ్వంలో వున్న సమశృతికి మరో పేరు.*

*సంగీతమని దేన్ని అంటామో అది దానికి సంబంధించిన ఒక అల్పమైన నీటిబొట్టు. అది చిన్న నీటి బిందువైనా దాంట్లో సమస్త సముద్ర రహస్యం దాగుంది. అది సంగీతంలోని అపూర్వ ఆకర్షణ. అది నీలో ధ్యానాన్ని నెలకొల్పుతుంది. అది బంధింపబడిన ఆనందాన్ని విముక్తి కలిగిస్తుంది. క్షణకాలం జైలు గోడలు అదృశ్యమవుతాయి. నువ్వు క్షణకాలం మరో ప్రపంచంలోకి ప్రయాణమవుతావు. క్షణకాలం కాలంలోకి, స్థలంలోకి రూపాంతరం చెందుతావు. నువ్వు అనంతమవుతావు. సరిహద్దులు లేనివాడవవుతావు. అది ఆరంభం మాత్రమే. ఆరంభమయిన ఆ యాత్రకు అంతముండదు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹