శ్రీ దత్త దర్శనం - 1985 Sri Datta Darshanam - 1985


శ్రీ దత్త దర్శనం - 1985


నేనే సత్యం.. నేనే నిత్యం.. నేనే జీవం నేనే దైవం..

నేను అనంతం.. అమేయం.. అఖండం..

నాదే జగతికి అమోఘ చైతన్యం..


ఆత్మభువును నేను.. స్వయంభువును నేను..

ధర్మదీపకుడను.. కర్మకారకుడను..

సర్వ కర్తను..సర్వ భర్తను..సర్వ హర్తను..సర్వ జిత్తును

సర్వధారినై ఉన్నాను...సర్వాంతర్యామిని నేనూ...

నేనే సత్యం.. నేనే నిత్యం.. నేనే జీవం.. నేనే దైవం


చతుర్వేదముల ఘోషలు..రచనలేని నా భాషలు

ఉపనిషత్తులు గీతలు..నేను చేసినా బోధలు

సృష్టిని నేను..స్థితిని నేను..లయం నేను..లాస్యం నేను


అహమేవ బ్రహ్మా..అహమేవ విష్ణువు..అహమేవ మహేశ్వరః...

అహమేవహి సచ్చిదానంద స్వరూపః.. పరబ్రహ్మా...






Sri Datta Darshanam - 1985


I am the truth .. I am the eternity .. I am the life, I am the God ..

I am infinite .. indestructible .. absolute ..

Awesome consciousness for my world ..


I am self .. I am self ..

Dharmadeepakudanu .. Karmakarakudanu ..

All Lord..all Sarva Husband..Sarva Hartanu..Sarva Jittunu

I am omnipresent ... I am omnipresent ...

I am the truth .. I am the eternity .. I am the life .. I am the God


Ghoshas of the Chaturvedas..my languages ​​that cannot be written

Upanishads Gitalu .. Teachings I did

I am the creation..I am the status..I am the rhythm..I am the lass


Ahameva Brahma..Ahameva Vishnu..Ahameva Maheshwarah ...

Ahamevahi Sachchidananda Swarupah .. Parabrahma ...


02 May 2022


మైత్రేయ మహర్షి బోధనలు - 112


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 112 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 88. రుచికర బోధనము 🌻

మా బోధనలు సంప్రదాయక బోధనలకన్న భిన్నముగ నున్నవని చాల మంది భావింతురు. సృష్టి పరిణామ కథలో బోధనలు కూడ పరిణామము చెందుచున్నవి. కాలమును, దేశమును, ప్రజల సంస్కృతిని బట్టి బోధనలు అందించు విధానమున కొంత మార్పు జరుగుచుండును. బోధనల ఆశయము జీవులకు జ్ఞానాసక్తి కలిగించుటయే. ఆసక్తి కలుగవలెనన్నచో, బోధనలయందు కొంత ఆకర్షణ యుండవలెను. ఆకర్షితులైన జీవులు జ్ఞానమున ప్రవేశించుటకు వీలగును. జీవులను చైతన్య మార్గమున ముందునకు నడుపుటయే మా ఏకైక ఆశయము. ఆశయ నిర్వహణమునకై మా బృందము రకరకములగ బోధనలను చేయును.

బోధనల ముఖ్య ఉద్దేశ్యము, శ్రద్ధను కలిగించి జ్ఞానమున ప్రవేశపెట్టుట. ఆకలి తీర్చుటకై ఆహారము భుజించుట అవశ్యకము. ఆహారము పోషకాహారమై యుండవలెను. పోషణమునకు విరుద్ధము కాని రుచి భుజించువారికి ఆహారమునందాసక్తి కలిగించును. రుచికాకర్షింపబడి పోషకమగు ఆహారమును భుజించువాడు శరీర పుష్టినెట్లు పొందునో, అట్లే బోధనలు రుచికరము చేయవలెను. అనుసరించు వారికి రుచి కలుగవలెను. రుచి అనగా వెలుగు అని కూడ అర్థమున్నది. బోధనలయందు రుచి జ్ఞానముగ ఆవిర్భ వించును.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


02 May 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 173


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 173 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. నువ్వు నరకం కావచ్చు. నువ్వు స్వర్గం కావచ్చు. అదంతా నువ్వే. అది నీ నిర్ణయం. నరకం సృష్టించినట్లే స్వర్గాన్ని నువ్వే సృష్టించావు. అది ఒక మానసిక స్థితి. నువ్వు దాని సృష్టికర్త అని ఎప్పుడు గుర్తిస్తావో, గొప్ప స్వేచ్ఛని అప్పుడు పొందుతావు. 🍀


జీన్పాల్ సార్రేది విలువైన స్టేట్ మెంట్ వుంది. యితరమైన ప్రతిదీ నరకమే! దాదాపు ప్రపంచంలోని అందరి అభిప్రాయమదే. కేవలం కొందరు 'బుద్ధుల అభిప్రాయం మాత్రమే దానికి భిన్నమైంది. 'యితరమైన ప్రతిదీ నరకమే' నేను అతన్తో ఏకీభవించను. అది లక్షల మంది అనుభవం ఐనా కావచ్చు. అది కరక్టే అనిపిస్తుంది. కానీ కరెక్టు కాదు. అది కేవలం నువ్వు. నువ్వు నరకం కావచ్చు. నువ్వు స్వర్గం కావచ్చు. అదంతా నువ్వే. అది నీ నిర్ణయం.

స్వర్గం ఎక్కడో లేదు. నరకం సృష్టించినట్లే స్వర్గాన్ని నువ్వే సృష్టించావు. అది ఒక మానసిక స్థితి. నువ్వు దాని సృష్టికర్త అని ఎప్పుడు గుర్తిస్తావో. గొప్ప స్వేచ్ఛని అప్పుడు పొందుతావు. యితరులు బాధ్యులయితే నీకు స్వేచ్చ వుండదు. నువ్వొక దాస్యంలో వున్నావు. అందువల్ల యితరులు నీకు సుఖదు:ఖాలు సృష్టిస్తున్నారను కుంటున్నావు. రెండు రకాలుగా నువ్వు ఆధారపడి వున్నావు. కానీ ఎవ్వరూ ఆధారపడి వుండాలనుకోరు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


02 May 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 273 - 29. ప్రకృతిని కాపాడడం మన తక్షణ కర్తవ్యం / DAILY WISDOM - 273 - 29. Nature, the First and Immediate Neighbour



🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 273 / DAILY WISDOM - 273 🌹

🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 29. ప్రకృతిని కాపాడడం మన తక్షణ కర్తవ్యం 🌻


పౌర విధులలో పర్యావరణ పరిగణనలు మరియు ప్రకృతి యొక్క వాస్తవ రూపాన్ని, స్వచ్ఛతను రక్షించే బాధ్యత కూడా ఉన్నాయి. పర్వతాలు నిలబడనివ్వండి, నదులు ప్రవహించనివ్వండి, చెట్లు పెరగనివ్వండి, స్వచ్ఛమైన గాలి వీచనివ్వండి మరియు వారి స్వేచ్ఛ, తాజాదనం మరియు నిర్మలత్వం లో ఎవరూ అడ్డు పడకూడదు. పొగ మరియు ధూళితో గాలిని కలుషితం చేయడం, నీటిపై వ్యర్థాలు మరియు ధూళిని వేయడం ద్వారా నీటిని నాశనం చేయడం, తాము నిలబడి ఉన్న నేల యొక్క బలానికి కారణమై మరియు తగిన ఋతువులో వర్షపాతానికి కారణమయ్యే చెట్లను నాశనం చేయడం మనిషి యొక్క పౌర నేరాలు. బహిరంగ మైదానంలో చెత్త వేయటం ప్రకృతికి మరియు ప్రజల ఆరోగ్యానికి నిషిద్ధం.

ఒక వ్యక్తి తనలా భావించి ప్రేమించవలసిన మొదటి సహోదరి ప్రకృతి కాదా? జీవం తనలో తాను నిర్వహించుకునే ఆర్థిక సూత్రాల ద్వారా మనుగడ సాగిస్తుంది. జీవం అనేది తన లక్షణాలలో హెచ్చుతగ్గులు లేకుండా సామరస్యతతో కూడిన వ్యవస్థ. ఆర్థిక పరిస్థితులు అంటే కేవలం బంగారం మరియు వెండి, భూమి మరియు ఆస్తులతో ఆగిపోవు. అర్థసాస్త్రం అనేది జీవితం మరియు శక్తి యొక్క పరిరక్షణ యొక్క , అంతర్గత సమతుల్యత నిర్వహణ యొక్క సూత్రం. శరీరం తన యొక్క సాధారణ అవసరాలు పెరగటం మరియు తగ్గటం వల్ల ఏ విధంగా అనారోగ్యం పాలవుతుందో అదే విధంగా మనసు కూడా అవసరమైన దానికంటే ఎక్కువ లేదా తక్కువ పనిచేయటం వల్ల తన శక్తిని కోల్పోతుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 273 🌹

🍀 📖 from Essays in Life and Eternity 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 29. Nature, the First and Immediate Neighbour 🌻


Civic duties also include ecological considerations and the obligation to protect nature in its originality and purity. Let mountains stand, let rivers flow, let trees grow, let fresh air blow, and let no one interfere with their freedom, freshness and innocence. Polluting air with smoke and dust, vitiating water by dumping waste and dirt on it, destroying living trees which are responsible for the strength of the ground on which they stand and are also responsible for rainfall in the suitable season, are civic offences on the part of man. Throwing garbage on open ground is prohibitory to commonweal and health of people.

Is not nature the first and immediate neighbour whom one has to love as one's own self? Life survives by the principle of economy it maintains in itself. Life is a system of harmony without excess in any of its features. Economic conditions do not exhaust themselves merely in gold and silver, land and property. Economy is the principle of the conservation of life and energy, the proper maintenance of balance in its internally adjusted parts. As more than the normal or less than the normal needs of the body may turn it sick and make it droop in weakness, so can the mind lose its power and become ill by either excessive activity or inactivity.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


02 May 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 594 / Vishnu Sahasranama Contemplation - 594


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 594 / Vishnu Sahasranama Contemplation - 594🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 594. వృషభాక్షః, वृषभाक्षः, Vr‌ṣabhākṣaḥ 🌻


ఓం వృషభాక్షాయ నమః | ॐ वृषभाक्षाय नमः | OM Vr‌ṣabhākṣāya namaḥ

వృషభాక్షః, वृषभाक्षः, Vr‌ṣabhākṣaḥ


వార్షుకేఽఖిలకామానామక్షిణీహ్యస్య మాపతేః ।
యస్మాత్తస్వాద్వృషభాక్ష ఇతి విష్ణుస్సమీర్యతే ॥
అథవా వృషభో ధర్మః దృష్టిరస్యేతి వా హరిః ।
వృషభాక్ష ఇతి ప్రోక్తో వేదవిద్యావిశారదైః ॥

వర్షతి ఇతి వృషః, వృషభః అను అర్థమున వర్షించునది. సర్వ కామములను వర్షించు కనులు ఈతనికి కలవు. లేదా వృషభము అనగా సర్వ కామములను వర్షించునదియగు ధర్మము ఈతనికి అక్షి అనగా దృష్టి లేదా కన్నుగా నున్నది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 594🌹

📚. Prasad Bharadwaj

🌻594. Vr‌ṣabhākṣaḥ🌻

OM Vr‌ṣabhākṣāya namaḥ



वार्षुकेऽखिलकामानामक्षिणीह्यस्य मापतेः ।
यस्मात्तस्वाद्वृषभाक्ष इति विष्णुस्समीर्यते ॥
अथवा वृषभो धर्मः दृष्टिरस्येति वा हरिः ।
वृषभाक्ष इति प्रोक्तो वेदविद्याविशारदैः ॥


Vārṣuke’khilakāmānāmakṣiṇīhyasya māpateḥ,
Yasmāttasvādvr‌ṣabhākṣa iti viṣṇussamīryate.
Athavā vr‌ṣabho dharmaḥ dr‌ṣṭirasyeti vā hariḥ,
Vr‌ṣabhākṣa iti prokto vedavidyāviśāradaiḥ.


वर्षति इति वृषः, वृषभः / Varṣati iti vr‌ṣaḥ, vr‌ṣabhaḥ from this derivation, as rain or bestow in abundance. Thus Vr‌ṣabhākṣaḥ is the One whose eyes bestow all that is desired in abundance.

Or the One with eye or sight that bestows all that is desired in abundance.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

शुभाङ्गश्शान्तिदस्स्रष्टा कुमुदः कुवलेशयः ।
गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः ॥ ६३ ॥

శుభాఙ్గశ్శాన్తిదస్స్రష్టా కుముదః కువలేశయః ।
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ 63 ॥

Śubhāṅgaśśāntidassraṣṭā kumudaḥ kuvaleśayaḥ,
Gohito gopatirgoptā vr‌ṣabhākṣo vr‌ṣapriyaḥ ॥ 63 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


02 May 2022

02 - MAY - 2022 సోమవారం, ఇందు వాసరే MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 02, మే 2022 సోమవారం, ఇందు వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 195 / Bhagavad-Gita - 195 - 4-33 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 594 / Vishnu Sahasranama Contemplation - 594🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 273 / DAILY WISDOM - 273 🌹  
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 173 🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 112 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ సోమవారం మిత్రులందరికీ 🌹*
*ఇందు వాసరే, 02, మే 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. రుద్రనమక స్తోత్రం - 21 🍀*

*41. నమశ్శష్ప్యాయ ఫేన్యాయ సికత్యాయ నమోనమః!*
*ప్రవాహ్యాయ నమస్తేస్తు హ్రస్వాయాస్తు నమోనమః!!*
*42. వామనాయ నమస్తేస్తు బృహతేచ నమోనమః!*
*వర్షీయసే నమస్తేస్తు నమో వృద్ధాయతే నమః!!*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : మీకు వచ్చిన కష్టంలో ఏ సుఖాన్ని దైవం దాచాడో గమనించుకోండి. ఈ కష్టం వద్దు అంటే దానిలో దాచిన వరదానం కూడా పోతుంది. - మాస్టర్‌ ఆర్‌.కె. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, వైశాఖ మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిధి : శుద్ధ పాడ్యమి తె.3:28 వరకు,
శుద్ధ విదియ 03తా తె.5:21 వరకు
నక్షత్రం : కృత్తిక 03తా తె.0:34 వరకు
యోగం : సౌభాగ్య మ.3:37 వరకు,
కరణం : బల తె.3:28 వరకు
బాలవ సా.4:22 వరకు, 
కౌలువ 03తా తె.5:21వరకు
సూర్యోదయం : ఉ.5:54
సూర్యాస్తమయం : సా.6:34
అభిజత్ ముహూర్తం : ఉ.11:48-మ.12:39
బ్రహ్మ ముహూర్తం : తె.4:17ల తె.5:05
అమృత కాలం : సా.5:56ల రా.7:56
వర్జ్య కాలం : ఉ.11:20ల మ.1:20
గుళిక : మ.1:49ల మ.3:24
దుర్ముహూర్తం : మ.12:39ల మ.1:30,  
మ.3:11ల సా.4:01
రాహు కాలం : ఉ.7:28ల ఉ.9:04
యమగండం : ఉ.10:39ల మ.12:13
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: వృషభం
స్థిర యోగం - శుభాశుభ మిశ్రమ ఫలం
24:35:03 వరకు తదుపరి వర్ధమాన యోగం
- ఉత్తమ ఫలం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 195 / Bhagavad-Gita - 195 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 33 🌴

*33. శ్రేయాన్ ద్రవ్యమాయాద్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ: పరన్తప |*
*సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే ||*

🌷. తాత్పర్యం :
*ఓ పరంతపా! జ్ఞానయజ్ఞము ద్రవ్యమయజ్ఞము కన్నను మహత్తరమైనది. ఓ పార్థా! కర్మయజ్ఞము లన్నియును చివరికి దివ్యజ్ఞానమునందే పరిసమాప్తి నొందును.*

🌷. భాష్యము :
సంపూర్ణ జ్ఞానస్థితిని సాధించి తద్ద్వారా భౌతికక్లేశముల నుండి బయటపడి అంత్యమున శ్రీకృష్ణభగవానుని ప్రేమయుక్తసేవ యందు (కృష్ణభక్తిరసభావనము) నియుక్తమగుటయే సర్వయజ్ఞముల ముఖ్యోద్దేశ్యమై యున్నది. అయినను ఈ యజ్ఞములకు సంబంధించిన ఒక రహస్యము కలదు. దానిని ప్రతియొక్కరు తప్పక ఎరుగవలెను. 

అదియే మన కర్త యొక్క శ్రద్ధ ననుసరించి యజ్ఞములు వివిధరూపములను దాల్చుచుండును. కర్తకు గల శ్రద్ధ దివ్యజ్ఞానస్థితికి చేరినప్పుడు, అట్టి కర్త జ్ఞానరహితముగా కేవలము తన సంపత్తులను త్యాగము చేయువాని కన్నను శ్రేష్టుడుగా గుర్తింపబడును. ఏలయన జ్ఞానప్రాప్తి కలుగనపుడు యజ్ఞములు భౌతికపరధికే చెంది ఎట్టి ఆధ్యాత్మికలాభమును గూర్చకుండును. అట్టి నిజమైన జ్ఞానము చివరికి దివ్యజ్ఞానపు ఉత్కృష్టస్థితియైన కృష్ణభక్తిరసభావనగా మార్పుచెందును. 

జ్ఞానవృద్ధి లేకుండా చేయబడు యజ్ఞములు కేవలము భౌతికకర్మలే కాగలవు. కాని అవి జ్ఞానస్థితికి చేరినప్పుడు సంపూర్ణ ఆధ్యాత్మిక స్థాయికి చేరగలవు. ఈ యజ్ఞములు వాటి ఉద్దేశ్యముల ననుసరించి కొన్నిమార్లు కర్మకాండగా( కామ్యకర్మములు), మరికొన్నిమార్లు జ్ఞానకాండగా (పరమాత్మాన్వేషణ జ్ఞానము) పిలువబడును. వాటి అంతిమలక్ష్యము జ్ఞానమే యగుట అత్యంత శ్రేష్టము.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 195 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 4 - Jnana Yoga - 33 🌴*

*33. śreyān dravya-mayād yajñāj jñāna-yajñaḥ paran-tapa*
*sarvaṁ karmākhilaṁ pārtha jñāne parisamāpyate*

🌷 Translation : 
*O chastiser of the enemy, the sacrifice performed in knowledge is better than the mere sacrifice of material possessions. After all, O son of Pṛthā, all sacrifices of work culminate in transcendental knowledge.*

🌹 Purport :
The purpose of all sacrifices is to arrive at the status of complete knowledge, then to gain release from material miseries and, ultimately, to engage in loving transcendental service to the Supreme Lord (Kṛṣṇa consciousness). Nonetheless, there is a mystery about all these different activities of sacrifice, and one should know this mystery. Sacrifices sometimes take different forms according to the particular faith of the performer. 

When one’s faith reaches the stage of transcendental knowledge, the performer of sacrifices should be considered more advanced than those who simply sacrifice material possessions without such knowledge, for without attainment of knowledge, sacrifices remain on the material platform and bestow no spiritual benefit. 

Real knowledge culminates in Kṛṣṇa consciousness, the highest stage of transcendental knowledge. Without the elevation of knowledge, sacrifices are simply material activities. When, however, they are elevated to the level of transcendental knowledge, all such activities enter onto the spiritual platform. Depending on differences in consciousness, sacrificial activities are sometimes called karma-kāṇḍa (fruitive activities) and sometimes jñāna-kāṇḍa (knowledge in the pursuit of truth). It is better when the end is knowledge.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 594 / Vishnu Sahasranama Contemplation - 594🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 594. వృషభాక్షః, वृषभाक्षः, Vr‌ṣabhākṣaḥ 🌻*

*ఓం వృషభాక్షాయ నమః | ॐ वृषभाक्षाय नमः | OM Vr‌ṣabhākṣāya namaḥ*

*వృషభాక్షః, वृषभाक्षः, Vr‌ṣabhākṣaḥ*

*వార్షుకేఽఖిలకామానామక్షిణీహ్యస్య మాపతేః ।*
*యస్మాత్తస్వాద్వృషభాక్ష ఇతి విష్ణుస్సమీర్యతే ॥*
*అథవా వృషభో ధర్మః దృష్టిరస్యేతి వా హరిః ।*
*వృషభాక్ష ఇతి ప్రోక్తో వేదవిద్యావిశారదైః ॥*

*వర్షతి ఇతి వృషః, వృషభః అను అర్థమున వర్షించునది. సర్వ కామములను వర్షించు కనులు ఈతనికి కలవు. లేదా వృషభము అనగా సర్వ కామములను వర్షించునదియగు ధర్మము ఈతనికి అక్షి అనగా దృష్టి లేదా కన్నుగా నున్నది.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 594🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻594. Vr‌ṣabhākṣaḥ🌻*

*OM Vr‌ṣabhākṣāya namaḥ*

वार्षुकेऽखिलकामानामक्षिणीह्यस्य मापतेः ।
यस्मात्तस्वाद्वृषभाक्ष इति विष्णुस्समीर्यते ॥
अथवा वृषभो धर्मः दृष्टिरस्येति वा हरिः ।
वृषभाक्ष इति प्रोक्तो वेदविद्याविशारदैः ॥

Vārṣuke’khilakāmānāmakṣiṇīhyasya māpateḥ,
Yasmāttasvādvr‌ṣabhākṣa iti viṣṇussamīryate.
Athavā vr‌ṣabho dharmaḥ dr‌ṣṭirasyeti vā hariḥ,
Vr‌ṣabhākṣa iti prokto vedavidyāviśāradaiḥ.

*वर्षति इति वृषः, वृषभः / Varṣati iti vr‌ṣaḥ, vr‌ṣabhaḥ from this derivation, as rain or bestow in abundance. Thus Vr‌ṣabhākṣaḥ is the One whose eyes bestow all that is desired in abundance.*

Or the One with eye or sight that bestows all that is desired in abundance.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
शुभाङ्गश्शान्तिदस्स्रष्टा कुमुदः कुवलेशयः ।गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः ॥ ६३ ॥

శుభాఙ్గశ్శాన్తిదస్స్రష్టా కుముదః కువలేశయః ।గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ 63 ॥

Śubhāṅgaśśāntidassraṣṭā kumudaḥ kuvaleśayaḥ,Gohito gopatirgoptā vr‌ṣabhākṣo vr‌ṣapriyaḥ ॥ 63 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 273 / DAILY WISDOM - 273 🌹*
*🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 29. ప్రకృతిని కాపాడడం మన తక్షణ కర్తవ్యం 🌻*

*పౌర విధులలో పర్యావరణ పరిగణనలు మరియు ప్రకృతి యొక్క వాస్తవ రూపాన్ని, స్వచ్ఛతను రక్షించే బాధ్యత కూడా ఉన్నాయి. పర్వతాలు నిలబడనివ్వండి, నదులు ప్రవహించనివ్వండి, చెట్లు పెరగనివ్వండి, స్వచ్ఛమైన గాలి వీచనివ్వండి మరియు వారి స్వేచ్ఛ, తాజాదనం మరియు నిర్మలత్వం లో ఎవరూ అడ్డు పడకూడదు. పొగ మరియు ధూళితో గాలిని కలుషితం చేయడం, నీటిపై వ్యర్థాలు మరియు ధూళిని వేయడం ద్వారా నీటిని నాశనం చేయడం, తాము నిలబడి ఉన్న నేల యొక్క బలానికి కారణమై మరియు తగిన ఋతువులో వర్షపాతానికి కారణమయ్యే చెట్లను నాశనం చేయడం మనిషి యొక్క పౌర నేరాలు. బహిరంగ మైదానంలో చెత్త వేయటం ప్రకృతికి మరియు ప్రజల ఆరోగ్యానికి నిషిద్ధం.*

*ఒక వ్యక్తి తనలా భావించి ప్రేమించవలసిన మొదటి సహోదరి ప్రకృతి కాదా? జీవం తనలో తాను నిర్వహించుకునే ఆర్థిక సూత్రాల ద్వారా మనుగడ సాగిస్తుంది. జీవం అనేది తన లక్షణాలలో హెచ్చుతగ్గులు లేకుండా సామరస్యతతో కూడిన వ్యవస్థ. ఆర్థిక పరిస్థితులు అంటే కేవలం బంగారం మరియు వెండి, భూమి మరియు ఆస్తులతో ఆగిపోవు. అర్థసాస్త్రం అనేది జీవితం మరియు శక్తి యొక్క పరిరక్షణ యొక్క , అంతర్గత సమతుల్యత నిర్వహణ యొక్క సూత్రం. శరీరం తన యొక్క సాధారణ అవసరాలు పెరగటం మరియు తగ్గటం వల్ల ఏ విధంగా అనారోగ్యం పాలవుతుందో అదే విధంగా మనసు కూడా అవసరమైన దానికంటే ఎక్కువ లేదా తక్కువ పనిచేయటం వల్ల తన శక్తిని కోల్పోతుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 273 🌹*
*🍀 📖 from Essays in Life and Eternity 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 29. Nature, the First and Immediate Neighbour 🌻*

*Civic duties also include ecological considerations and the obligation to protect nature in its originality and purity. Let mountains stand, let rivers flow, let trees grow, let fresh air blow, and let no one interfere with their freedom, freshness and innocence. Polluting air with smoke and dust, vitiating water by dumping waste and dirt on it, destroying living trees which are responsible for the strength of the ground on which they stand and are also responsible for rainfall in the suitable season, are civic offences on the part of man. Throwing garbage on open ground is prohibitory to commonweal and health of people.*

*Is not nature the first and immediate neighbour whom one has to love as one's own self? Life survives by the principle of economy it maintains in itself. Life is a system of harmony without excess in any of its features. Economic conditions do not exhaust themselves merely in gold and silver, land and property. Economy is the principle of the conservation of life and energy, the proper maintenance of balance in its internally adjusted parts. As more than the normal or less than the normal needs of the body may turn it sick and make it droop in weakness, so can the mind lose its power and become ill by either excessive activity or inactivity.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 173 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. నువ్వు నరకం కావచ్చు. నువ్వు స్వర్గం కావచ్చు. అదంతా నువ్వే. అది నీ నిర్ణయం. నరకం సృష్టించినట్లే స్వర్గాన్ని నువ్వే సృష్టించావు. అది ఒక మానసిక స్థితి. నువ్వు దాని సృష్టికర్త అని ఎప్పుడు గుర్తిస్తావో, గొప్ప స్వేచ్ఛని అప్పుడు పొందుతావు. 🍀*

*జీన్పాల్ సార్రేది విలువైన స్టేట్ మెంట్ వుంది. యితరమైన ప్రతిదీ నరకమే! దాదాపు ప్రపంచంలోని అందరి అభిప్రాయమదే. కేవలం కొందరు 'బుద్ధుల అభిప్రాయం మాత్రమే దానికి భిన్నమైంది. 'యితరమైన ప్రతిదీ నరకమే' నేను అతన్తో ఏకీభవించను. అది లక్షల మంది అనుభవం ఐనా కావచ్చు. అది కరక్టే అనిపిస్తుంది. కానీ కరెక్టు కాదు. అది కేవలం నువ్వు. నువ్వు నరకం కావచ్చు. నువ్వు స్వర్గం కావచ్చు. అదంతా నువ్వే. అది నీ నిర్ణయం.*

*స్వర్గం ఎక్కడో లేదు. నరకం సృష్టించినట్లే స్వర్గాన్ని నువ్వే సృష్టించావు. అది ఒక మానసిక స్థితి. నువ్వు దాని సృష్టికర్త అని ఎప్పుడు గుర్తిస్తావో. గొప్ప స్వేచ్ఛని అప్పుడు పొందుతావు. యితరులు బాధ్యులయితే నీకు స్వేచ్చ వుండదు. నువ్వొక దాస్యంలో వున్నావు. అందువల్ల యితరులు నీకు సుఖదు:ఖాలు సృష్టిస్తున్నారను కుంటున్నావు. రెండు రకాలుగా నువ్వు ఆధారపడి వున్నావు. కానీ ఎవ్వరూ ఆధారపడి వుండాలనుకోరు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 112 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 88. రుచికర బోధనము 🌻*

*మా బోధనలు సంప్రదాయక బోధనలకన్న భిన్నముగ నున్నవని చాల మంది భావింతురు. సృష్టి పరిణామ కథలో బోధనలు కూడ పరిణామము చెందుచున్నవి. కాలమును, దేశమును, ప్రజల సంస్కృతిని బట్టి బోధనలు అందించు విధానమున కొంత మార్పు జరుగుచుండును. బోధనల ఆశయము జీవులకు జ్ఞానాసక్తి కలిగించుటయే. ఆసక్తి కలుగవలెనన్నచో, బోధనలయందు కొంత ఆకర్షణ యుండవలెను. ఆకర్షితులైన జీవులు జ్ఞానమున ప్రవేశించుటకు వీలగును. జీవులను చైతన్య మార్గమున ముందునకు నడుపుటయే మా ఏకైక ఆశయము. ఆశయ నిర్వహణమునకై మా బృందము రకరకములగ బోధనలను చేయును.*

*బోధనల ముఖ్య ఉద్దేశ్యము, శ్రద్ధను కలిగించి జ్ఞానమున ప్రవేశపెట్టుట. ఆకలి తీర్చుటకై ఆహారము భుజించుట అవశ్యకము. ఆహారము పోషకాహారమై యుండవలెను. పోషణమునకు విరుద్ధము కాని రుచి భుజించువారికి ఆహారమునందాసక్తి కలిగించును. రుచికాకర్షింపబడి పోషకమగు ఆహారమును భుజించువాడు శరీర పుష్టినెట్లు పొందునో, అట్లే బోధనలు రుచికరము చేయవలెను. అనుసరించు వారికి రుచి కలుగవలెను. రుచి అనగా వెలుగు అని కూడ అర్థమున్నది. బోధనలయందు రుచి జ్ఞానముగ ఆవిర్భ వించును.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹