🌹 23, OCTOBER 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹

🍀🌹 23, OCTOBER 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 23, OCTOBER 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వ వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 9. సిద్ధిధాత్రి మాత - శ్రీ రాజరాజేశ్వరీ దేవి / Worship Maa Siddhidatri on the 9th day of Navaratri 🌹
🍀. మహర్నవమి - మహిషాసుర మర్దిని విశిష్టత 🍀
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 446 / Bhagavad-Gita - 446 🌹
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 32 / Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 32 🌴
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 59 / Osho Daily Meditations  - 59 🌹
🍀 59. భయమే పాపం / 59. FEAR IS SIN 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 495 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 495 1 🌹 
🌻 495. 'మణిపూరాబ్జ నిలయా' - 2 / 495.  Manipurabja - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 23, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*🍀. మహర్నవమి శుభాకాంక్షలు అందరికి, Maha Navami, Good Wishes to All 🍀*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మహర్నవమి, ఆయుధ పూజ, Maha Navami, Ayudha Puja 🌻*

*🌷. మహిషాసురమర్ధిని స్తోత్రము :*
*అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతే*
*గిరివరవింధ్య శిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే |*
*భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే*
*జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : మౌన సంకల్పం - ధ్యానాభ్యాస కాలంలోనైనా సాధకుడు అన్నమయ, ప్రాణమయ చిత్త వృత్తుల నరికట్టి మనస్సును నిశ్చల, నీరవతా స్థితిలో నుంచుకోడానికి దృఢమైన మౌనసంకల్ప బల సంపాదన అత్యంత సహాయకం. ఈ మౌన సంకల్పం మనస్సుకు వెనుక నుండే పురుషునిది. మనస్సు నిశ్చల, నీరవతాస్థితి నందుకొన్నప్పుడు, ప్రకృతి క్రియాకలాపము కంటే వేరైన యీ పురుషుడు తెలియబడుతాడు. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శరద్‌ ఋతువు, దక్షిణాయణం,
ఆశ్వీయుజ మాసం
తిథి: శుక్ల-నవమి 17:46:43 వరకు
తదుపరి శుక్ల-దశమి
నక్షత్రం: శ్రవణ 17:15:46 వరకు
తదుపరి ధనిష్ట
యోగం: శూల 18:53:12 వరకు
తదుపరి దండ
కరణం: బాలవ 06:54:22 వరకు
వర్జ్యం: 20:57:10 - 22:26:02
దుర్ముహూర్తం: 12:23:36 - 13:10:10
మరియు 14:43:17 - 15:29:50
రాహు కాలం: 07:38:26 - 09:05:44
గుళిక కాలం: 13:27:37 - 14:54:55
యమ గండం: 10:33:02 - 12:00:20
అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:23
అమృత కాలం: 07:30:00 - 09:00:00
మరియు 29:50:22 - 31:19:14
సూర్యోదయం: 06:11:09
సూర్యాస్తమయం: 17:49:31
చంద్రోదయం: 13:56:29
చంద్రాస్తమయం: 00:26:03
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: మకరం
యోగాలు: సిద్ది యోగం - కార్య సిధ్ధి,
ధన ప్రాప్తి 17:15:46 వరకు తదుపరి
శుభ యోగం - కార్య జయం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 9. సిద్ధిధాత్రి మాత - శ్రీ రాజరాజేశ్వరీ దేవి / Worship Maa Siddhidatri on the 9th day of Navaratri 🌹*
*🌻 . ప్రసాద్ భరద్వాజ*

🌷. శ్రీ సిద్ధిధాత్రి దేవి ప్రార్ధనా శ్లోకము 🌷*
*'సిద్ధ గంధర్వ యక్షాద్యైః అసురైర మరైరపి*
*సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ'*

*🌷. శ్రీ రాజరాజేశ్వరి దేవి స్తోత్రము 🌷*
*అంబా శాంభవి చంద్రమౌళిరబలాఽపర్ణా ఉమా పార్వతీ*
*కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ |*
*సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా
*చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ||*

*🌷. అలంకారము - నైవేద్యం : శ్రీ రాజరాజేశ్వరీ దేవి- ఆకుపచ్చ రంగు - పరమాన్నం, పిండివంటలు*

*🌷. మహిమ - చరిత్ర 🌷*
*తొమ్మిదవ శక్తి స్వరూపమైన సిద్ధిధాత్రి సర్వసిద్ధులనూ ప్రసాదిస్తుంది. ఈమె కరుణవల్లే పరమేశ్వరుని అర్ధశరీర భాగాన్ని పార్వతీ దేవి సాధించినట్టు పురాణకథనం. ఈమెకి ప్రార్ధన చేస్తే పరమానంద దాయకమైన అమృతపథం సంప్రాప్తిస్తుంది.*

*🌻. సాధన -*
*దుర్గామాత తొమ్మిదవ శక్తి స్వరూప నామం ‘సిద్ధిదాత్రి’. ఈమె సర్వవిధ సిద్ధులనూ ప్రసాదిస్తుంది. మార్కండేయ పురాణంలో 1) అణిమ, 2) మహిమ, 3) గరిమ, 4) లఘిమ, 5) ప్రాప్తి, 6) ప్రాకామ్యము, 7) ఈశిత్వము, 8) వశిత్వము అని సిద్ధులు ఎనిమిది రకాలుగా పేర్కొన బడ్డాయి. బ్రహ్మవైవర్త పురాణంలోని శ్రీకృష్ణ జన్మ ఖండంలో సిద్ధులు అష్టాదశ విధాలుగా తెలుపబడ్డాయి. అవి…*

*1) అణీమ, 2) లఘీమ, 3) ప్రాప్తి, 4) ప్రాకామ్యము, 5) మహిమ, 6) ఈశిత్వ వశిత్వాలు, 7) సర్వకామావసాయిత, 8) సర్వజ్ఞత్వం, 9) దూరశ్రవణం, 10) పరకాయ ప్రవేశం, 11) వాక్‍సిద్ధి, 12) కల్పవృక్షత్వం, 13) సృష్టి, 14) సంహారకరణ సామర్థ్యం, 15) అమరత్వం, 16) సర్వన్యాయకత్వం, 17) భావన మరియు 18) సిద్ధి.*

*సిద్ధిదాత్రి మాత భక్తులకూ, సాధకులకూ ఈ సిద్ధులన్నింటిని ప్రసాదించగలదు. పరమేశ్వరుడు ఈ సర్వ సిద్ధులను దేవి కృపవలననే పొందారని దేవీ పురాణం పేర్కొంటుంది. ఈ సిద్ధిదాత్రి మాత పరమశివునిపై దయ తలచి, ఆయన శరీరంలో అర్ధభాగమై నిలిచింది. కనుక ఆయన అర్ధనారీశ్వరుడుగా వాసికెక్కారు. సిద్ధిదాత్రి దేవి చతుర్భుజ. సింహవాహన. ఈ దేవీ స్వరూపం కమలంపై ఆసీనురాలై ఉంటుంది. ఈమె కుడివైపు ఒక చేతిలో చక్రాన్ని దాల్చి ఉంటుంది. మరొక చేతిలో గదను ధరించి ఉంటుంది. ఎడమవైపు ఒక చేతిలో శంఖాన్నీ, మరొక హస్తంలో కమలాన్నీ దాల్చి దర్శనమిస్తుంది.*

*నవరాత్రి మహోత్సవాల్లో తొమ్మిదవరోజున ఉపాసించబడే దేవీ స్వరూపం ఈమెదే. తొమ్మిదవరోజున శాస్త్రీయ విధి విధానాలతో సంపూర్ణ నిష్ఠతో ఈమెను ఆరాధించేవారికి సకల సిద్ధులూ కరతలామలకం అవుతాయి. సృష్టిలో ఈమెకు అగమ్యమైనది ఏదీ లేదు. ఈ మాత కృపతో ఉపాసకుడికి ఈ బ్రహ్మాండాన్నే జయించే సామర్థ్యం లభిస్తుంది.*

*ఈ సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రులవ్వడానికి నిరంతరం ప్రతీ వ్యక్తీ ప్రయత్నించాలి. ఈ మాత దయా ప్రభావంవల్ల అతడు అనంతమైన దుఃఖరూప సంసారం నుండి నిర్లిప్తుడవ్వగలడు. అన్ని సుఖాలను పొందడమే కాకుండా మోక్షాన్ని సైతం పొందుతాడు.*

*నవదుర్గల్లో ‘సిద్ధిదాత్రి’ అవతారం చివరిది. మొదటి ఎనిమిది రోజుల్లో క్రమంగా దుర్గాదేవి ఎనిమిది అవతారాలను విద్యుక్తంగా నిష్ఠతో ఆరాధించి, తొమ్మిదవ రోజు ఉపాసకుడు ఈ సిద్ధిదాత్రి ఆరాధనలో నిమగ్నుడు కావాలి. ఈ దేవిని ఉపాసించడం ముగియగానే భక్తులయొక్క, సాధకులయొక్క లౌకిక, పారలౌకిక మనోరథాలన్నీ సఫలమవుతాయి. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తుడికి కోరికలేవీ మిగిలి ఉండవు. ఇలాంటి భక్తుడు అన్ని విధాలైన సాంసారిక వాంఛలకు, అవసరాలకు, ఆసక్తులకు అతీతుడవుతాడు. అతడు మానసికంగా భగవతీ దేవి దివ్య లోకంలో విహరిస్తాడు. ఆ దేవీ కృపారసామృతం నిరంతరంగా ఆస్వాదిస్తూ, విషయ భోగ విరక్తుడవుతాడు. అట్టి వారికి భగవతీ దేవి సాన్నిధ్యమే సర్వస్వంగా ఉంటుంది. ఈ పరమ పదాన్ని పొందిన వెంటనే అతనికి ఇతరాలైన ప్రాపంచిక వస్తువుల అవసరం ఏ మాత్రం ఉండదు.*

*దుర్గామాత చరణ సన్నిధిని చేరటానికై మనం నిరంతరం నియమ నిష్ఠలతో ఆమెను ఉపాసించడమే కర్తవ్యం. భగవతీ మాత స్మరణ, ధ్యాన పూజాదికాల ప్రభావం వల్ల ఈ సంసారం నిస్సారమని మనకు బోధ పడుతుంది. తన్మహత్త్వాన నిజమైన పరమానందదాయకమైన అమృత పథం మనకు ప్రాప్తిస్తుంది.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Worship Maa Siddhidatri on the 9th day of Navaratri 🌹*

*The last among the nine Avtar of Maa Durga, Maa Siddhidatri, is worshipped on the 9th day of Navaratri. Maa Siddhidatri grants Her devotees all sorts of achievements and is capable of giving all sorts of occult powers. She is the possessor of 26 different wishes (Siddhis) which She grants Her worshipers. The legend has it that the Lord Shiva got all those Siddhis by worshipping Maa Shakti. With Her gratitude the half body of Lord Shiva became that of Maa Shakti, and therefore he was called as Ardhnarishvar.*

*This Avtar of Maa Durga removes ignorance and provides knowledge to Her devotees. She is also worshipped by Deva, Gandharva, Asura, Yaksha and Siddha. Maa sits on Kamal (Lotus) and rides on the lion. She has four hands and holds a Gadain the lower right hand, a Chakra in the upper right hand, a lotus flower in the lower left hand and a Shankha in the upper left hand.*

*Her glory and power are infinite and worshipping Maa Siddhidatri on the final day (the ninth day) of Navaratri bestows all Siddhis to Her devotees and also marks the successful completion of the Navaratri festival.*

*🌻 Mantra and other Facts 🌻*

*Recite the below-mentioned Mantras to get the blessing from the almighty Maa Siddhidatri.*

*“Om Devi Siddhidatryai Namah”*
*या देवी सर्वभूतेषु माँ सिद्धिदात्री रूपेण संस्थिता ।*
*नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ॥*
*Ya Devi Sarvabhuteshu Maa Siddhidatri Rupena Samsthita।*
*Namastasyai Namastasyai Namastasyai Namo Namah*

*Maa Siddhidatri rules over the planet Ketu. She is the governess of the minds of people and motivates them towards a disciplined and spiritual life. Mata Siddhidatri eliminates all the ignorance, fear & sufferings from the life of the devotees, provides knowledge and fulfils all their desires.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🍀. మహర్నవమి శుభాకాంక్షలు అందరికి, Maha Navami, Good Wishes to All 🍀*
*🌻. ప్రసాద్ భరద్వాజ*

*🍀. మహర్నవమి - మహిషాసుర మర్దిని విశిష్టత 🍀*

*దుర్గా నవరాత్రులలో 9వ రోజు నవమి, మహర్నవమి అంటారు. మహర్నవమి చాలా పవిత్రమైన రోజు. ఎందుకంటే? దేవి ఉపాసకులు ఉపవాసాలుండి, శ్రద్ధతో అమ్మవారిని అర్చించి, ధ్యానించి, ఈ 9వ రోజున అమ్మవారి కృపా కటాక్షాలు కోసం ఎదురుచూసే రోజు. 9 రోజులలో ఏ రోజు చేయకపోయినా, ఈ 3 రోజులు (మూలా నక్షత్రం -- దుర్గాష్టమి -- మహర్నవమి) పూజ చేస్తే అమ్మవారు కరుణిస్తుంది. విజయవాడలో ఈ రోజు "మహిషాసుర మర్దిని" అవతారం. శ్రీశైలంలో "సిద్ధిధాత్రిగా" పూజిస్తారు. ఈమెని పూజించడం వల్ల వాంఛితార్థ సిద్ధి కలుగుతుంది. కుమారి పూజలో 10 సం:ల వయస్సు గల బాలికని పూజిస్తారు. ఈ తల్లి దర్శనం వల్లే కాదు, మనసులో ఒక్కసారి స్మరించుకున్నా శత్రు వినాశనం జరుగుతుంది. వృక్షాలలో దేవగన్నేరు వృక్షాన్ని పూజిస్తారు. నైవేద్యంగా పాయసం నివేదించాలి.*

*🌷. చదువుకోవలసిన స్తోత్రాలు 🌷*

*మహిషాసుర మర్దిని అష్టోత్తరం, సహస్ర నామావళి, కాళీ కవచం, కాళీ అష్టకం, (మహాకవి కాళిదాసు రచించిన..) కాళీ శతనామస్తోత్రం, కాళీ స్తోత్రం (ఋషులు, దేవతలు రచించిన..) కాళీ సహస్రనామ స్తోత్రం, ( 'క' కార కాళీ కాదు..) మహిషాసుర మర్దిని స్తోత్రం (అయిగిరి నందిని..) పారాయణ చేసుకోవాలి. ఈ రోజు లలితా సహస్రనామాల్లోని "అపర్ణా చండికా చండముండాసుర నిషూదిని" శ్లోకాన్ని పారాయణ చేసుకోవాలి. " ఓం శ్రీ మహిషాసురమర్ధిని దేవతాయై నమః" అనే నామాన్ని జపించుకోవచ్చు. మహిషాసుర మర్దిని గాయత్రి మంత్రం "ఓం మహిషాసురమర్ధిని రూపాయ విద్మహే! పరమాత్మికాయై ధీమహి తన్నో పూర్ణః ప్రచోదయాత్" అనే మంత్రాన్ని జపించుకోవాలి.*

*🌻. మహిషాసురమర్దిని చరిత్ర - మహిమ 🌻*

*దుర్గాదేవి అష్ట భుజాలతో మహిషాసురుణ్ణి సంహరించి, సింహవాహిని శక్తిగా వికటాట్టహాసం చేసింది. మహిషాసురుడి సేనాధిపతులైన చిక్షిలుడు, చామరుడు, ఉదదృడు, బాష్కలుడు, విడాలుడు అనే సైన్యాధ్యక్షులందరిని సంహరించి, చివరగా మహిషాసురుణ్ణి సంహరించి, మహిషాసురమర్దిని అయింది. సింహవాహనం మీద "ఆలీడా పాదపద్ధతిలో", ఒక చేతిలో త్రిశూలాన్ని ధరించి, మహిషాసురుని సంహరించింది. ఈమె అష్టోత్తర శతనామ స్తోత్రం భక్తులు పారాయణం చేస్తే, శత్రు బాధలు, దత్త గ్రహబాధలనుండి విముక్తి కలగటమే కాక, మనసులో ఉన్న భయాన్ని పోగొట్టి, ధైర్యాన్ని ప్రసాదిస్తుంది.*

*ఇంద్రాది దేవతలు మహిషాసురుడి వల్ల అనేక కష్టాలు అనుభవించారు. అప్పుడే ఇంద్రాది దేవతలు తమ తమ శరీరాల్లోని దివ్యతేజస్సు లన్నింటిని బయటికి తీసుకొచ్చి, ఆ తేజస్సుకి ఒక రూపాన్నిచ్చారు. ఆ మూర్తి యొక్క రూపమే మహిషాసురమర్దిని. ఆ తేజోమూర్తికి తమ ఆయుధాలను సమర్పించారు. తండ్రిగారైన హిమవంతుడు ఒక సింహాన్ని సమర్పించాడు. దుర్గాదేవి శార్దూల వాహినిగా (పులి) దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించింది... మహిషాసురమర్దిని సింహవాహినిగా మహిషాసురుని సంహరించింది.*

*ఈ శరన్నవరాత్రులలో మహిషాసుర మర్దిని అవతారం, సింహవాహనం మీద ఆలీడా పాదపద్ధతిలో, ఒక చేతిలో త్రిశూలాన్ని ధరించి, మహిషాసురుడిని సంహరిస్తున్న రూపంలో దర్శనమిస్తుంది. శ్రీశైలంలో అమ్మవారు సిద్ధిధాత్రిగా దర్శనమిస్తుంది. ఈ తల్లి సర్వ సిద్ధులను ప్రసాదిస్తుంది. పరమేశ్వరుడు సర్వసిద్ధులను దేవికృప వల్లనే పొందాడని దేవీపురాణంలో ఉంటుంది. ఈ తల్లి శివుని పతిగా పొందడమే కాక! తన శరీరంలోని అర్ధభాగాన్ని ఆ పరమేశ్వరుడుకిచ్చి "అర్ధనారీశ్వరిగా" అవతరించింది. ఈ తల్లి చతుర్భుజి, సింహవాహిని. కుడివైపు చేతిలో చక్రం, గద ధరిస్తుంది. ఎడమచేతిలో శంఖాన్ని, కమలాన్ని ధరిస్తుంది. ఈ తల్లి కమలం మీద కూర్చొని ఉంటుంది.*

*ఈమెని ఆరాధించేవారికి సర్వ సిద్ధులు కరతలామలకం. ఈమె కృపచేతనే భక్తుల--, సాధకుల--, లౌకిక, పారమార్థిక, మనోరథాలు తీరతాయి. ఈ తల్లి కృపకు పాత్రుడైన భక్తుడికిగానీ, ఉపాసకుడుకి గాని కోరికలు ఏవి మిగలవు? (కుంతీదేవి కోరికలు లేని స్థితిని, కష్టాలనే ప్రసాదించమని శ్రీకృష్ణుని అర్థించింది.. ఎందుకంటే!! కష్టాల్లోనే భగవంతుడు చెంతనే ఉంటాడు కనుక...) అలాంటివారికి అమ్మవారి సన్నిధే సర్వసోపానం. ఈ అమ్మవారి స్మరణ, ధ్యాన, పూజ వల్ల సంసారం నిస్సారమన బోధపడుతుంది. పరమానంద పరమైన అమృత పదాన్ని (మోక్షాన్ని) పొందుతారు. ఈ తల్లి అణిమాది అష్టసిద్ధులనే కాక మోక్షాన్ని ప్రసాదించేది. లౌకిక, అలౌకిక, సర్వార్థ సిద్ధులకు అధిష్టాన ధాత్రి... "సిద్ధిధాత్రి"..*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 446 / Bhagavad-Gita - 446 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 32 🌴*

*32. శ్రీ భగవానువాచ*
*కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్దో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త: |*
*ఋతేపి త్వాం న భవిష్యన్తి సర్వే యేవస్థితా: ప్రత్యనీకేషు యోధా:*

*🌷. తాత్పర్యం : దేవదేవుడైన శ్రీకృష్ణభగవానుడు పలికెను : నేను ఘనమైన లోకవినాశకర కాలమును. జనులందరినీ నశింపజేయుటకే నేను ఇచ్చటకు అరుదెంచితిని. నీవు (పాండవులు) తప్ప ఇచ్చటనున్న ఇరుపక్ష యోధులందరును చంపబడనున్నారు.*

*🌷. భాష్యము : శ్రీకృష్ణుడు దేవదేవుడని, తనకు స్నేహితుడని తెలిసినను అతని వివిధరూప ప్రదర్శనచే అర్జునుడు విభ్రాంతుడయ్యెను. కనుకనే అతడు ఆ వినాశకర శక్తి యొక్క వాస్తవ ప్రయోజనమును గూర్చి మరల అడిగెను. పరమసత్యము సమస్తమును (చివరికి బ్రాహ్మణులను కూడా) నశింపజేయునని వేదములందు తెలుపబడినది.*

 కఠోపనిషత్తు (1.2.25) నందు ఈ క్రింది విధముగా తెలుపబడినది.*

*యస్య బ్రహ్మ చ క్షత్రం చ ఉభే భవత ఓదన: |*
*మృత్యుర్యస్యోపసేచనం కే ఇత్థా వేద యత్ర స:*

*అనగా అంత్యమున బ్రాహ్మణులు, క్షత్రియులు మరియు ప్రతియొక్కరు దేవదేవునిచే ఆహారము వలె మ్రింగివేయబడుదురు. దేవదేవుని ఈ ప్రస్తుత రూపము సర్వమును హరించునటువంటిది. ఈ విధముగా శ్రీకృష్ణుడు తనను సర్వమును హరించు కాలముగా ప్రదర్శించుచున్నాడు. పాండవులు తప్ప అచ్చట యుద్ధరంగము నందు నిలిచిన సర్వులును అతనిచే మ్రింగివేయ బడుచున్నారు.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 446 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 32 🌴*

*32. śrī-bhagavān uvāca*
*kālo ’smi loka-kṣaya-kṛt pravṛddho lokān samāhartum iha pravṛttaḥ*
*ṛte ’pi tvāṁ na bhaviṣyanti sarve ye ’vasthitāḥ praty-anīkeṣu yodhāḥ*

*🌷 Translation : The Supreme Personality of Godhead said: Time I am, the great destroyer of the worlds, and I have come here to destroy all people. With the exception of you [the Pāṇḍavas], all the soldiers here on both sides will be slain.*

*🌹 Purport : Although Arjuna knew that Kṛṣṇa was his friend and the Supreme Personality of Godhead, he was puzzled by the various forms exhibited by Kṛṣṇa. Therefore he asked further about the actual mission of this devastating force. It is written in the Vedas that the Supreme Truth destroys everything, even the brāhmaṇas. As stated in the Kaṭha Upaniṣad (1.2.25),*

*yasya brahma ca kṣatraṁ ca ubhe bhavata odanaḥ*
*mṛtyur yasyopasecanaṁ ka itthā veda yatra saḥ*

*Eventually all the brāhmaṇas, kṣatriyas and everyone else are devoured like a meal by the Supreme.*

*This form of the Supreme Lord is the all-devouring giant, and here Kṛṣṇa presents Himself in that form of all-devouring time. Except for a few Pāṇḍavas, everyone who was present on that battlefield would be devoured by Him. Arjuna was not in favor of the fight, and he thought it was better not to fight; then there would be no frustration. In reply, the Lord is saying that even if he did not fight, every one of them would be destroyed, for that was His plan. If Arjuna stopped fighting, they would die in another way. Death could not be checked, even if he did not fight. In fact, they were already dead. Time is destruction, and all manifestations are to be vanquished by the desire of the Supreme Lord. That is the law of nature.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 59 / Osho Daily Meditations  - 59 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 59. భయమే పాపం 🍀*

*🕉. దేనినైనా అణచివేయడం నేరం: ఇది ఆత్మను కుంగదీస్తుంది. ఇది ప్రేమ కంటే భయానికి ఎక్కువ శ్రద్ధ ఇస్తుంది మరియు అదే పాపం. 🕉*

*భయాన్ని ఎక్కువగా గమనించడం పాపం, ప్రేమను ఎక్కువగా గమనించడం పుణ్యం. మరియు ఎల్లప్పుడూ ప్రేమను ఎక్కువగా గమనించాలని గుర్తుంచుకోండి, ఎందుకంటే ప్రేమ ద్వారానే ఒకరు జీవితంలోని ఉన్నత శిఖరాలను, దేవునికి చేరుకుంటారు. భయం వల్ల ఎదగలేడు. భయం అంగవైకల్యం, పక్షవాతం: ఇది నరకాన్ని సృష్టిస్తుంది. పక్షవాతానికి గురైన వారందరూ-మానసిక పక్షవాతానికి, ఆధ్యాత్మికంగా పక్షవాతానికి -నరకంలో జీవిస్తారు. వారు దానిని ఎలా సృష్టిస్తారు? రహస్యం ఏమిటంటే వారు భయంతో జీవిస్తారు; వారు భయం లేనప్పుడు మాత్రమే ఒక నిర్దిష్ట పనిని చేస్తారు, కానీ అప్పుడు చేయడానికి విలువైనదేమీ ఉండదు.*

*చేయవలసిన ప్రతి పనికి కొన్ని భయాలు ఉంటాయి. మీరు ప్రేమలో పడితే, మీరు తిరస్కరించబడవచ్చు అని భయం ఉంటుంది. భయం చెబుతుంది, 'ప్రేమలో పడకండి, అప్పుడు మిమ్మల్ని ఎవరూ తిరస్కరించరు.' అది నిజం-మీరు ప్రేమలో పడకపోతే, ఎవరూ మిమ్మల్ని తిరస్కరించరు-కాని మీరు ప్రేమలేని ఉనికిని జీవిస్తారు, ఇది చాలా దారుణం తిరస్కరించడం కంటే. మరియు ఒకరు మిమ్మల్ని తిరస్కరిస్తే, మరొకరు మిమ్మల్ని అంగీకరిస్తారు. భయపడి జీవించే వారు తప్పులు చేయకూడదని ఎక్కువగా ఆలోచిస్తారు. వారు ఏ తప్పులు చేయరు, కానీ వారు ఏమీ చేయరు కూడా; వారి జీవితం శూన్యం. వారు ఉనికికి ఏమీ తోడ్పడరు. వారు వస్తారు, నిస్తేజంగా జీవిస్తారు, చనిపోతారు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 59 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 59. FEAR IS SIN 🍀*

*🕉  To repress anything is a crime: It cripples the soul. It gives more attention to fear than to love, and that is what sin is.  🕉*

*To take more note of fear is sin, to take more note of love is virtue. And always remember to take more note of love, because it is through love that one reaches the higher peaks of life, to God. Out of fear one cannot grow. Fear cripples, paralyzes: It creates hell. All paralyzed people-psychologically paralyzed, spiritually paralyzed-live life in hell. And how do they create it? The secret is that they live in fear; they only do a certain thing when there is no fear, but then there is nothing left worth doing.*

*All that is worth doing has certain fears around it. If you fall in love, there is fear because you may be rejected. Fear says, "Don't fall in love, then nobody will reject you."That is true-if you don't fall in love, nobody will ever reject you-but then you will live a loveless existence, which is far worse than being rejected. And if one rejects you, somebody else will accept you. Those who live out of fear think mostly of not committing mistakes. They don't commit any mistakes, but they don't do anything else, either; their life is blank. They don't Contribute anything to existence. They come, they exist-they vegetate, rather-and then they die.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 495 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 495 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  102. మణిపూరాబ్జ నిలయా, వదనత్రయ సంయుతా ।*
*వజ్రాధికాయుధోపేతా, డామర్యాదిభి రావృతా ॥ 102 ॥ 🍀*

*🌻 495. 'మణిపూరాబ్జ నిలయా' - 2 🌻*

*పశ్యకులనగా బైటికి చూచువారు. లోపలకు బైటకు కూడ చూడగలిగిన వారిని కశ్యపులు అందురు. యోగులు, ఋషులు, తపస్విజనులు కశ్యపులు. ఇతరులు పశ్యకులు. పశ్యకులు పశుప్రాయుల వలె కేవలము ఇంద్రియముల ద్వారా ఇంద్రియార్థములను కోరుచు బాహ్యమున జీవమును నశింపజేసి కొనుచు మరణింతురు. వీరికే మరణము, జననము కలవు. అంత రంగమున చూచుట, వర్తించుట నేర్చినవారు మరణము దాటిన వారగుదురు. ఈ కారణముగ మణిపూరకము అత్యంత ప్రాముఖ్యముతో కూడిన పద్మముగ పెద్దలు వర్ణించిరి.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 495 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻102. Manipurabja nilaya vadanatraya sanyuta
vajradikayudhopeta dayaryadibhiravruta ॥ 102 ॥ 🌻*

*🌻 495.  Manipurabja - 2 🌻*

*Pashyakas means those who look outside. Those who can see inside and outside are called Kashyapas. Yogis, sages and ascetics are Kashyaps. Others are Pashyakas. Pashyakas, like animals, seek sense objects only through the senses, destroy the life outside and die. Death and birth happen to them. Those who learn to perceive and live inside, become those who have surpassed death. For this reason Manipuraka is described by elders as the most important lotus.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj

Siva Sutras - 160 : 3-8. jagrad dvitiyakarah - 1 / శివ సూత్రములు - 160 : 3-8. జాగ్రద్ ద్వితీయకారః - 1


🌹. శివ సూత్రములు - 160 / Siva Sutras - 160 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

3వ భాగం - ఆణవోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 3-8. జాగ్రద్ ద్వితీయకారః - 1 🌻

🌴. ఒక యోగి స్వయం యొక్క స్వచ్ఛమైన జ్ఞానంలో దృఢంగా స్థిరపడినప్పుడు, అతనికి ఈ బాహ్య ప్రపంచం తనలో ఒక కిరణం లేదా పొడిగింపు లేదా ఊహాదృశ్యంలా ద్వితీయంగా అవుతుంది. 🌴


జాగ్రత్ - జాగృత స్థితి, లేదా సాధారణ క్రియాశీల స్థితి; ద్వితీయ – రెండవ; కారః - కాంతి కిరణం.

శుద్ధీకరణ ప్రక్రియను ప్రారంభించడం ద్వారా సాధకుడు గణనీయమైన ఆధ్యాత్మిక పురోగతిని సాధించ గలిగినప్పుడు మరియు కావలసిన స్థాయి స్పృహను సాధించినప్పుడు, బాహ్య విశ్వం అతనికి మరొక కాంతి ప్రకాశంగా కనిపిస్తుంది. 'నేను' మరియు 'ఇది' లేదా 'అహం' మరియు 'ఇదం' అనే భావన ఈ సూత్రంలో చర్చించబడింది. శుద్దీకరణ ప్రక్రియ పూర్తయినప్పుడు, ఆ దశను ఉన్మనా అంటారు, దీనిని సహజ విద్య అని కూడా అంటారు. ఉన్మనా అనేది ఎటువంటి ఆలోచనా ప్రక్రియలు లేకుండా మనస్సు నిశ్చలంగా ఉండే దశ. 'జ్ఞానోదయం యొక్క జాడలు కూడా తుడిచి పెట్టుకుపోయే' దశ ఇది. నేను లేదా అహం అంటే వ్యక్తిగత స్వయం మరియు ఇది లేదా ఇదం అంటే విశ్వంలో ఉన్న వస్తువులు. మరో మాటలో చెప్పాలంటే, అహం అనేది చూసేవాడు మరియు ఇదం అనేది బాహ్యంగా కనిపించేది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Siva Sutras - 160 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 3 - āṇavopāya

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 3-8. jāgrad dvitīyakarah - 1 🌻

🌴. When a yogi is firmly established in the pure knowledge of the self, the wakeful world becomes secondary to him, like a ray or an extension or projection within himself. 🌴

Jāgrat – the state of awakening, the normal active state; dvitīya – second; karaḥ - ray of light.


When the aspirant is able to make significant spiritual progress by initiating the process of purification and achieved the desired level of consciousness, the universe appears to him as another radiance of light. The concept of “I” and “This” or “aham” and “idam” is discussed in this sūtra. When the purification process is complete, that stage is called unmanā, which is also known as sahaja vidyā. Unmanā is the stage where mind is stilled without any thought processes. This is the stage where “even the traces of enlightenment are wiped out”. I or aham means the individual self and this or idam means objects that prevail in the universe. In other words, aham is the seer and idam is seen.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 845 / Vishnu Sahasranama Contemplation - 845


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 845 / Vishnu Sahasranama Contemplation - 845🌹

🌻845. ప్రాగ్వంశః, प्राग्वंशः, Prāgvaṃśaḥ🌻

ఓం ప్రాగ్వంశాయ నమః | ॐ प्राग्वंशाय नमः | OM Prāgvaṃśāya namaḥ



అన్యస్య వంశినో వంశాః పాశ్చాత్యా అస్య శార్ఙ్గిణః ।

వంశః ప్రపఞ్చః ప్రాగేవ న పాశ్చాత్య ఇతీశ్వరః ॥

ప్రాగ్వంశ ఇత్యుచ్యతే హి వేదవిద్యావిశారదైః ॥



తమ పేరున వంశము కలవారగు 'వంశుల'కు వంశములు తమ కంటె పాశ్చాత్త్యములు అనగా తమ తరువాత ఏర్పడునవి. కాని ప్రపంచము అనబడు పరమాత్ముని సంతానపు వంశము మాత్రము ముందుగానే, అనాదిగా, అది-ఇది అని నిర్ణయించ శక్యముకాక ఉన్నది. కావున పరమాత్ముడు ప్రాగ్వంశః - ముందునుండియు తన వంశము కలవాడు అని పరమాత్ముడు చెప్పబడును.



సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹






🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 845🌹

🌻845. Prāgvaṃśaḥ🌻

OM Prāgvaṃśāya namaḥ



अन्यस्य वंशिनो वंशाः पाश्चात्या अस्य शार्ङ्गिणः ।

वंशः प्रपञ्चः प्रागेव न पाश्चात्य इतीश्वरः ॥

प्राग्वंश इत्युच्यते हि वेदविद्याविशारदैः ॥



Anyasya vaṃśino vaṃśāḥ pāścātyā asya śārṅgiṇaḥ,

Vaṃśaḥ prapañcaḥ prāgeva na pāścātya itīśvaraḥ.

Prāgvaṃśa ityucyate hi vedavidyāviśāradaiḥ.




Those by whose name races got into existence, have been there before the race itself. The race comes later. But the race of paramātma, namely the universe has been in existence before all that and not later; hence He is Prāgvaṃśaḥ.


🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka


अणुर्बृहत्कृशः स्थूलो गुणभृन्निर्गुणो महान् ।

अधृतः स्वधृतस्स्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः ॥ ९० ॥


అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ ।

అధృతః స్వధృతస్స్వాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥ 90 ॥


Aṇurbr‌hatkr‌śaḥ sthūlo guṇabhr‌nnirguṇo mahān,

Adhr‌taḥ svadhr‌tassvāsthyaḥ prāgvaṃśo vaṃśavardhanaḥ ॥ 90 ॥




Continues....

🌹 🌹 🌹 🌹




కపిల గీత - 253 / Kapila Gita - 253


🌹. కపిల గీత - 253 / Kapila Gita - 253 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 6. దేహ గేహముల యందు ఆసక్తుడైన వానికి ప్రాప్తించు అధోగతి - 18 🌴

18. ఏవం కుటుంబభరణే వ్యాపృతాత్మాఽ జితేంద్రియః|
మ్రియతే రుదతాం స్వానామురువేదనయాస్తధీః॥


తాత్పర్యము : ఈ విధముగా మూఢుడు ఇంద్రియ నిగ్రహము లేని వాడై దూరదృష్టి లేక నిరంతరము కుటుంబ పోషణ యందే తలమున్కలై యుండును. చివరిదశలో చుట్టును జేరి ఏడ్చుచున్న తనవారి మధ్య అచేతునుడై పడి యుండి వేదనపడుచు మరణించును.

వ్యాఖ్య : భగవద్గీతలో మరణ సమయంలో అతను తన జీవితకాలంలో పండించిన ఆలోచనలలో మునిగిపోతాడని చెప్పబడింది. తన కుటుంబ సభ్యులను సరిగ్గా నిర్వహించడం తప్ప వేరే ఆలోచన లేని వ్యక్తి తన చివరి ఆలోచనలలో కుటుంబ వ్యవహారాలను కలిగి ఉంటాడు. అది సామాన్యుడికి సహజమైన క్రమం. సామాన్యుడికి తన జీవిత గమ్యం తెలియదు; క్షణికమైన జీవితంలో అతను తన కుటుంబాన్ని కాపాడుకుంటూ వ్యస్తుడై ఉన్నాడు. చివరి దశలో, అతను కుటుంబ ఆర్థిక పరిస్థితిని ఎలా మెరుగుపరిచాడనే దానితో ఎవరూ సంతృప్తి చెందరు; అతను తగినంతగా అందించలేదని అందరూ అనుకుంటారు. అతని లోతైన కుటుంబ ఆప్యాయత కారణంగా, అతను ఇంద్రియాలను నియంత్రించడం మరియు తన ఆధ్యాత్మిక స్పృహను మెరుగుపరచడం అనే తన ప్రధాన కర్తవ్యాన్ని మరచిపోతాడు. కొన్నిసార్లు చనిపోతున్న వ్యక్తి కుటుంబ వ్యవహారాలను తన కొడుకు లేదా బంధువుకి అప్పగిస్తాడు, 'నేను వెళ్తున్నాను. దయచేసి కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి.' అతను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, కానీ మరణ సమయంలో కూడా అతను తన కుటుంబాన్ని ఎలా పోషిస్తాడో అని ఆత్రుతగా ఉంటాడు. కొన్నిసార్లు మరణిస్తున్న వ్యక్తి తాను ప్రారంభించిన కుటుంబ నిర్వహణ ప్రణాళికను పూర్తి చేయడానికి కనీసం కొన్ని సంవత్సరాల పాటు తన జీవితాన్ని పెంచుకోవాలని వైద్యుని అభ్యర్థించడం కనిపిస్తుంది. ఇవి షరతులతో కూడిన ఆత్మ యొక్క భౌతిక వ్యాధులు. అతను దైవీ స్పృహను పొందడం అనే తన నిజమైన నిశ్చియాన్ని పూర్తిగా మరచిపోతాడు. అతను కుటుంబాన్ని ఒకదాని తర్వాత ఒకటిగా మార్చుకున్నప్పటికీ, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ గంభీరంగా ఉంటాడు.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 253 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 6. Description by Lord Kapila of Adverse Fruitive Activities - 18 🌴

18. evaṁ kuṭumba-bharaṇe vyāpṛtātmā jitendriyaḥ
mriyate rudatāṁ svānām uru-vedanayāsta-dhīḥ

MEANING : Thus the man, who engaged with uncontrolled senses in maintaining a family, dies in great grief, seeing his relatives crying. He dies most pathetically, in great pain and without consciousness.

PURPORT : In Bhagavad-gītā it is said that at the time of death one will be absorbed in the thoughts which he cultivated during his lifetime. A person who had no other idea than to properly maintain his family members must have family affairs in his last thoughts. That is the natural sequence for a common man. The common man does not know the destiny of his life; he is simply busy in his flash of life, maintaining his family. At the last stage, no one is satisfied with how he has improved the family economic condition; everyone thinks that he could not provide sufficiently. Because of his deep family affection, he forgets his main duty of controlling the senses and improving his spiritual consciousness. Sometimes a dying man entrusts the family affairs to either his son or some relative, saying, "I am going. Please look after the family." He does not know where he is going, but even at the time of death he is anxious about how his family will be maintained. Sometimes it is seen that a dying man requests the physician to increase his life at least for a few years so that the family maintenance plan which he has begun can be completed. These are the material diseases of the conditioned soul. He completely forgets his real engagement—to become Kṛṣṇa conscious—and is always serious about planning to maintain his family, although he changes families one after another.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


దుర్గాష్టమి శుభాకాంక్షలు, Good Wishes on Durga Ashtami


🍀. దుర్గాష్టమి శుభాకాంక్షలు అందరికి, Durga Ashtami Good Wishes to All. 🍀

🌻. ప్రసాద్ భరద్వాజ


🌷. శ్రీ దుర్గా దేవి స్తోత్రము 🌷

రక్ష రక్ష మహాదేవి దుర్గే దుర్గతినాశిని | మాం భక్తమనురక్తం చ శత్రుగ్రస్తం కృపామయి

విష్ణుమాయే మహాభాగే నారాయణి సనాతని | బ్రహ్మస్వరూపే పరమే నిత్యానందస్వరూపిణీ




ఓం హ్రీం దుం దుర్గాయై నమః

విరాటనగరం రమ్యం – గచ్చమానో యుద్ధిష్టిరః

అస్తువ న్మనసా దేవీం – దుర్గాం త్రిభువనేశ్వరీమ్.

త్వం బ్రహ్మవిద్యావిద్యానాం మహానిద్రా చ దేహినామ్

స్కందమాతర్భగవతి దుర్గే కాంతారవాసిని



🍀. దుర్గాష్టమి విశిష్టత 🍀


ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దేవీ నవరాత్రులు జరుపుకుంటారు. ఎనిమిదవ రోజు.. అంటే ఆశ్వయుజ అష్టమి దుర్గాష్టమి లేదా మహాష్టమి పర్వదినం. ఈ రోజున వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడిన వారు అస్త్ర పూజ చేస్తారు. తమ వృత్తికి సంబంధించిన సామగ్రిని, ముఖ్యమైన పరికరాలను అమ్మవారి ఎదుట ఉంచి పూజ చేస్తారు.

పాండవులు అరణ్యవాసం ముగించి, అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మిచెట్టు కొమ్మల మధ్య తమ ఆయుధాలను దాచి వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను తీసి, పూజించి, ఉత్తర గోగ్రహణ యుద్ధం చేశాడు. శత్రువులను జయించి విజయుడయ్యాడు. ఆయుధాలకు రక్షణ కల్పించిన జమ్మిచెట్టు పవిత్రతను సంతరించుకుంది. కనుకనే ఇప్పటికీ జమ్మిచెట్టుకు విజయదశమి నాడు భక్తిగా పూజలు చేస్తారు.

మహాష్టమి నాడు 64 యోగినులను, దుర్గాదేవి రూపాలైన అష్ట నాయికలను అర్చిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రాహ్మణి, మహేశ్వరి, కామేశ్వరి, వైష్ణవి, వరాహి, నార్సింగి, ఇంద్రాణి, చాముండి - అనే ఎనిమిది శక్తి రూపాలను కొలుస్తారు.

తమ పిల్లలను తల్లిదండ్రులు ఇతర రోజుల కంటే దుర్గాష్టమి లేదా విజయదశమి రోజున విద్యాభ్యాసం చేయించడం ఉత్తమంగా భావిస్తారు. ఈ రోజుల్లో గనుక చిన్నారుల చేత ''ఓంకారం'' రాయించి విద్యాభ్యాసం చేయిస్తే చదువు బాగా వస్తుందని విశ్వసిస్తారు.

వ్యాపారులు తమ షాపులు లేదా సంస్థలను పూవులతో అలంకరించుకుని దుర్గాదేవి పూజ చేసుకుంటారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు దుర్గాష్టమి, విజయదశమి రోజుల్లో ఆరంభించడం శుభసూచకంగా భావిస్తారు. అందుచేత దుర్గాష్టమి రోజున శక్తిపీఠాలను దర్శించుకోవడం లేదా సమీపంలోని అమ్మవారి ఆలయాలను సందర్శించడం చేయాలని పండితులు చెబుతారు.

🌹 🌹 🌹 🌹🌹




Worship Maa Mahagauri - Mahisasura Mardhini Devi on the 8th day of Navaratri


🌹. Worship Maa Mahagauri - Mahisasura Mardhini Devi on the 8th day of Navaratri 🌹

The 8th day of Navaratri is dedicated to Maa Mahagauri, the 8th Avtar of Maa Durga. The legend has it that Maa Mahagauri liberated the world from evil forces. She has three eyes and four hands. Her lower right hand holds a trishul and the upper right hand is in the mudra of allaying fear. Whereas her lower left hand is in a pose of granting boons to Her devotees and she is holding a damaru in Her upper left hand.

She has extremely fair complexion and therefore Maa is compared with the conch, the moon and the white flower of Kunda. Radiant and compassionate, Maa Maugauri is usually depicted in a white or green saari and riding a bull. She is also known as Shwetambardhara. Maa Mahagauri purifies the souls of Her devotees and removes all their sins. She has a calming effect on the lives of Her devotees and she also helps them improve their knowledge.

Worship Maa Mahagauri to be free from the clutches of the material world and to remove sorrows from your life, for She will lead you to the path of virtue and inner power.


🍀. Spiritual Significance 🍀

Mahagauri is the kriya Shakti of existence . Kriya means action , the energy which creates motion in static matter is Mahagauri . She is the eighth manifestation of Goddess Durga who is worshiped on Maha Durgashtami . She is the beloved wife of Lord Shiva , who is meditated upon seated on Nandi , the bull . She has four hands in which she holds a trident , damru , abhaya and Vara mudras. She is saumyamukhi or has blissful expression on face .

Mahagauri also represents the union of Shiva with Shakti . She completes him by merging him with herself , which makes him Ashutosh . Shiva grants auspicious boons to his devotees only when he is United with Shakti , without her he becomes dispassionate and has no purpose in existence . The reason Mahagauri plays a Damru represents that divine union of Shiva and Shakti . Their union is considered auspicious for continuance of existence , so Mahagauri embodies the greatest Auspiciousness.

She is the creator of life , the Yoni from whom the creation takes birth . She is mother to all life forms . Her worship grants experience of oneness with all lives . When one feels the same amount of love and compassion for everyone , the oneness can be felt . This oneness is auspiciousness of Mahagauri , as it reduces friction and stress in our surrounding and creates acceptance and Harmony , for smooth functioning of life . The purpose of spirituality is to reduce external friction to go deed inside your spiritual self . Mahagauri provides this kind of transformation with her worship .



🌻. Mantra and other Facts 🌻

Recite the below-mentioned Mantras to get the blessing from the almighty Maa Mahagauri.



ॐ देवी महागौर्यै नमः॥

Om Devi Mahagauryai Namah॥



या देवी सर्वभू‍तेषु माँ महागौरी रूपेण संस्थिता। 
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥

Ya Devi Sarvabhuteshu Maa Mahagauri Rupena Samsthita।
Namastasyai Namastasyai Namastasyai Namo Namah॥



The devotees should perform the eighth day of Navratri puja with huge devotion and pure mind so that Devi Mahagauri fulfils all their desires. You can also attain abundance and bring happiness to your life by worshipping a Meru Prushth Shree Yantra. Maa Mahagauri vanishes all the previous sins and wrong deeds of the devotees and purifies their life. Goddess Mahagauri leads them to the path of truth and happiness.

🌹 🌹 🌹 🌹 🌹


దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 8. మహాగౌరి మాత - మహిషాసురమర్ధిని దేవి / Worship Maa Mahagauri - Mahisasura Mardhini Devi on the 8th day of Navaratri


🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 8. మహాగౌరి మాత - మహిషాసురమర్ధిని దేవి / Worship Maa Mahagauri - Mahisasura Mardhini Devi on the 8th day of Navaratri 🌹

🍀 . ప్రసాద్ భరద్వాజ

🌻. 8. మహాగౌరి ప్రార్ధనా శ్లోకము 🌻

శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః ।
మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవప్రమోదదా ॥



🌷. 8. మహిషాసురమర్ధిని స్తోత్రము 🌷

అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతే
గిరివరవింధ్య శిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే |

భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ||


🌷. అలంకారము - నైవేద్యం : మహాగౌరి - మహిషాసురమర్ధిని దేవి - ముదురు ఎరుపు రంగు. - బెల్లం పొంగలి


🌴. మహిమ - చరిత్ర 🌴

దుర్గామాత యొక్క ఎనిమిదవ స్వరూపానికి ‘మహాగౌరి’ అని పేరు. ఈమె పూర్తిగా గౌరవర్ణశోభిత. ఈమె గౌరవర్ణశోభలు మల్లెపూలూ, శంఖం, చంద్రులను తలపింపజేస్తాయి. ఈమె అష్టవర్షప్రాయముగలది (అష్టవర్షభవేద్గౌరీ). ఈమె ధరించే వస్త్రాలూ, ఆభరణాలూ ధవళ కాంతులను వెదజల్లుతుంటాయి. చతుర్భుజ, సింహవాహన. ఒక కుడిచేత అభయముద్రనూ, మరొక కుడి చేతిలో త్రిశూలాన్నీ వహించి ఉంటుంది. ఒక ఏడమచేతిలో డమరుకమూ, మరొక ఎడమ చేతిలో వరదముద్రనూ కలిగి ఉంటుంది. ఈ ముద్రలలో ఈమె దర్శనం ప్రశాంతంగా ఉంటుంది.

పార్వతి అవతారంలో ఈమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందటానికి కఠోరమైన తపస్సును ఆచరించింది. వ్రియేఽహం వరదం శంభుం నాన్యం దేవం మహేశ్వరాత్ (నారద పాంచరాత్రము) అనేది ఈమె ప్రతిజ్ఞ. భగవంతుడైన శివుణ్ణి పరిణయమాడటానికే దృఢంగా సంకల్పించుకొన్నట్లు తులసీదాస మహాకవి పేర్కొన్నాడు.

జన్మకోటిలగి రగర హమారీ । బర ఉఁసంభు న తరహ ఉఁకుఁమారీ ॥


🌻. సాధన 🌻


కఠోర తపస్సు కారణాన ఈమె శరీరం పూర్తిగా నలుపెక్కి పోతుంది. ఈమె తపస్సునకు సంతుష్టుడైన శివుడు ప్రసన్నుడై, ఈమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళన గావిస్తారు. తత్ప్రభావంవల్ల ఈమె శ్వేతవర్ణశోభిత అయి విద్యుత్‌ కాంతులను విరజిమ్ముతుంటుంది. అప్పటినుండి ఈమె ‘మహాగౌరి’ అని వాసి గాంచింది.

ఇంకో కధ ప్రకారం, పుట్టుకతోనే నల్లని రంగు గల పరమేశ్వరిని ... పతి అయిన పరమేశ్వరుడు ఒకసారి పరిహాసముగా " కాళీ " అని పిలుస్తాడు. దాంతో ఆమె శివునితో పంతగించి , బ్రహ్మ గురించి కఠోర తపస్సు చేసి ... ఆ నల్లని దేహాన్ని వదిలి శివునికి దీటుగా తెల్లని ఛాయతో 'మహా గౌరి 'గా అవతరించినది.

అష్టమ శక్తియైన మహాగౌరి పూజ కరణంగా ప్రాప్తించే మహిమలు శ్రీదేవీ బహగవతంలో వర్ణించబడినవి. ఈమె నామస్మరణ చేత సత్ప్రవర్తన వైపు మనసు నడుస్తుంది. సర్వవిధ శుభంకరి - మహాగౌరి.

దుర్గా నవరాత్రోత్సవాల్లో ఎనిమిదవ రోజున మహాగౌరి ఉపాసన విధ్యుక్తంగా నిర్వహించబడుతుంది. ఈమె శక్తి అమోఘమూ, సధ్యఃఫలదాయకము.

ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషాలన్నీ ప్రక్షాళన చెందుతాయి. వారి పూర్వసంచిత పాపాలన్నీ పూర్తిగా నశిస్తాయి. భవిష్యత్తులో కూడా పాపతాపాలుగానీ, దైన్యదుఃఖాలు కానీ వారి దరిజేరవు. వారు సర్వ విధాలా పునీతులై, అక్షయంగా పుణ్య ఫలాలను పొందుతారు.

మహాగౌరీ మాతను ధ్యానించటం, స్మరించటం, పూజించటం, ఆరాధించటం, మున్నగు రీతుల్లో సేవించటం వల్ల భక్తులకు సర్వ విధాలైనట్టి శుభాలు చేకూరుతాయి. మనము ఎల్లప్పుడు ఈమెను ధ్యానిస్తూ ఉండాలి. దేవి కృపవల్ల ఎల్లరికీ అలౌకిక సిద్ధులు ప్రాప్తిస్తాయి. మనస్సును ఏకాగ్రచిత్తం చేసి, అనన్య నిష్ఠతో సాధకులు ఈ దేవి పాదారవిందాలను సేవించటంవల్ల వారి కష్ఠాలు మటుమాయమవుతాయి.

ఈమె ఉపాసన ప్రభావం వల్ల అసంభవాలైన కార్యాలు సైతం సంభవాలవుతాయి. కనుక సర్వదా సర్వదా ఈమె పాదాలను శరణుజొచ్చటమే కర్తవ్యము. పురాణాలలో ఈమె మహిమలు శతథా ప్రస్తుతించబడ్డాయి. ఈమె సాధకుల మనో వ్యాపారాలను అపమార్గాల నుండి సన్మార్గానికి మరలిస్తుంది. మనం అనన్య భక్తి ప్రపత్తులతో ఈమెకు శరణాగతులమవటం ఎంతో శుభదాయకం.

🌹 🌹 🌹 🌹 🌹




22 Oct 2023 : Daily Panchang నిత్య పంచాంగము



🌹 22, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹

శుభ ఆదివారం, Sunday, భాను వాసరే

🍀. దుర్గాష్టమి శుభాకాంక్షలు అందరికి, Durga Ashtami Good Wishes to All. 🍀

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : దుర్గాష్టమి, Durga Ashtami, 🌻




🌷. శ్రీ దుర్గా దేవి స్తోత్రము 🌷

రక్ష రక్ష మహాదేవి దుర్గే దుర్గతినాశిని | 
మాం భక్తమనురక్తం చ శత్రుగ్రస్తం కృపామయి

విష్ణుమాయే మహాభాగే నారాయణి సనాతని | 
బ్రహ్మస్వరూపే పరమే నిత్యానందస్వరూపిణీ



ఓం హ్రీం దుం దుర్గాయై నమః

విరాటనగరం రమ్యం – గచ్చమానో యుద్ధిష్టిరః

అస్తువ న్మనసా దేవీం – దుర్గాం త్రిభువనేశ్వరీమ్.

త్వం బ్రహ్మవిద్యావిద్యానాం మహానిద్రా చ దేహినామ్

స్కందమాతర్భగవతి దుర్గే కాంతారవాసిని



🌷. అలంకారము - నైవేద్యం : దుర్గాదేవి - ముదురు ఎరుపు రంగు - కదంబం (కిచిడి), శాకాన్నం.



🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : నిశ్చల నీరవతా స్థితి - మనస్సు ఏ ఆలోచనలూ లేక నిశ్చల నీరువత గడించు కొన్నప్పుడే తరచుగా ఊర్ధ్వము నుండి విశాలశాంతి సంపూర్ణంగా అవతరించడం, మనస్సున కతీతమై సర్వత్రా విస్తరించుకొని వున్న ఆత్మతత్వ అనుభూతి కలుగడం జరుగుతూ వుంటుంది. కాని, అట్టి నీరవతా స్థితిలో అన్నమయ, ప్రాణమయ చిత్తవృత్తులు ఆ అవకాశం లోనికి చొరబడకుండా మాత్రం సాధకుడు జాగ్రత్త తీసుకోడం అవసరం. 🍀


🌷🌷🌷🌷🌷




విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

శరద్ ఋతువు, దక్షిణాయణం,

ఆశ్వీయుజ మాసం

తిథి: శుక్ల-అష్టమి 20:00:33 వరకు

తదుపరి శుక్ల-నవమి

నక్షత్రం: ఉత్తరాషాఢ 18:45:13

వరకు తదుపరి శ్రవణ

యోగం: ధృతి 21:53:55 వరకు

తదుపరి శూల

కరణం: విష్టి 08:58:04 వరకు

వర్జ్యం: 03:31:40 - 05:03:00

మరియు 22:30:00 - 24:00:00

దుర్ముహూర్తం: 16:16:52 - 17:03:29

రాహు కాలం: 16:22:42 - 17:50:06

గుళిక కాలం: 14:55:17 - 16:22:42

యమ గండం: 12:00:28 - 13:27:53

అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:23

అమృత కాలం: 12:39:40 - 14:11:00

సూర్యోదయం: 06:10:51

సూర్యాస్తమయం: 17:50:06

చంద్రోదయం: 13:05:54

చంద్రాస్తమయం: 00:26:03

సూర్య సంచార రాశి: తుల

చంద్ర సంచార రాశి: మకరం

యోగాలు: అమృత యోగం - కార్య

సిధ్ది 13:03:59 వరకు తదుపరి

ముసల యోగం - దుఃఖం

దిశ శూల: పశ్చిమం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹