తిరుప్పావై పాశురముల తెలుగు భావ గాన మాలిక 1 to 3 / Thiruppavai Pasurams Telugu Bhava Gana Malika 1 to 3



https://youtu.be/9hy3143nNeo


🌹 తిరుప్పావై పాశురముల తెలుగు భావ గాన మాలిక 1 to 3 Thiruppavai Pasurams Telugu Bhava Gana Malika 1 to 3 🌹

తప్పకుండా వీక్షించండి

గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


శ్రీ గోదాదేవీ అష్టోత్తర శతనామావళి Sri Goda devi Ashtottara Shatanamavali




🌹 శ్రీ గోదాదేవీ అష్టోత్తర శతనామావళి Sri Goda devi Ashtottara Shatanamavali 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


ఓం గోదాయై నమః

ఓం రంగానాయక్యై నమః

ఓం విష్ణుచిత్తాత్మజాయై నమః

ఓం సత్యై నమః

ఓం గోపీవేషధారయై నమః

ఓం దేవ్యై నమః

ఓం భూసుతాయై నమః

ఓం భోగదాయిన్యై నమః

ఓం తులసీవాసజ్ఞాయై నమః

ఓం శ్రీ తన్వీపురవాసిన్యై నమః

ఓం భట్ట నాధప్రియకర్యై నమః

ఓం శ్రీ కృష్ణాయుధ భోగిన్యై నమః

ఓం అముక్త మాల్యదాయై నమః

ఓం బాలాయై నమః

ఓం రంగనాథ ప్రియాయై నమః

ఓం వారాయై నమః

ఓం విశ్వంభరాయై నమః

ఓం యతిరాజ సహోదర్యై నమః

ఓం కలాలాపాయై నమః

ఓం కృష్ణా సురక్తాయై నమః

ఓం సుభగాయై నమః

ఓం దుర్లభశ్రీ సులక్షణాయై నమః

ఓం లక్ష్మీప్రియసఖ్యై నమః

ఓం శ్యామాయై నమః

ఓం ఫల్గుణ్యావిర్భవాయై నమః

ఓం రమ్యాయై నమః

ఓం ధనుర్మాసకృతవృతాయై నమః

ఓం చంపకాశోకపున్నాగ్యై నమః

ఓం మాలా విరాసత్ కచాయై నమః

ఓం అకారత్రయ సంపన్నాయై నమః

ఓం నారాయణ పదాంఘ్రితాయై నమః

ఓం రాజస్తిత మనోరధాయై నమః

ఓం మోక్ష ప్రధాన నిపుణాయై నమః

ఓం మను రక్తాదిదేవతాయై నమః

ఓం బ్రాహ్మన్యే నమః

ఓం లోకజనన్యై నమః

ఓం లీలా మానుషరూపిన్యై నమః

ఓం బ్రహ్మజ్ఞాణ ప్రదాయై నమః

ఓం మాయయై నమః

ఓం సచ్చిదానందవిగ్రహాయై నమః

ఓం మహాపతివ్రతాయై నమః

ఓం విష్ణుగుణకీర్తనలోలుపాయై నమః

ఓం ప్రసన్నార్తిహరాయై నమః

ఓం నిత్యాయై నమః

ఓం వేదసౌధవిహారిన్యై నమః

ఓం రంగనాధమాణిక్య మంజర్యై నమః

ఓం మంజుభూషిన్యై నమః

ఓం పద్మా ప్రియాయై నమః

ఓం పద్మా హస్తాయై నమః

ఓం వేదాంత ద్వయ భోదిన్యై నమః

ఓం సుప్రసన్నాయై నమః

ఓం భగవత్యై నమః

ఓం జనార్ధన దీపికాయై నమః

ఓం సుగందావయవాయై నమః

ఓం చారుమంగళదీపికాయై నమః

ఓం ధ్వజ వజ్రాంకుశాభ్జాంగయ నమః

ఓం మృదుపాదకలామ్జితాయై నమః

ఓం తారకాకారకరాయై నమః

ఓం కూర్మోపమేయపాదోర్ద్వబాగాయై నమః

ఓం శోభన పార్షీకాయై నమః

ఓం వేదార్ధ భావ తత్వ జ్ఞాయై నమః

ఓం లోకారాధ్యాం ఘ్రీపంకజాయై నమః

ఓం పరమాసంకాయై నమః

ఓం కుబ్జాసుధ్వయాడ్యాయై నమః

ఓం విశాలజఘనాయై నమః

ఓం పీనసుశ్రోన్యై నమః

ఓం మణిమేఖలాయై నమః

ఓం ఆనందసాగరా వర్యై నమః

ఓం గంభీరా భూజనాభికాయై నమః

ఓం భాస్వతవల్లిత్రికాయై నమః

ఓం నవవల్లీరోమరాజ్యై నమః

ఓం సుధాకుంభాయితస్థనాయై నమః

ఓం కల్పశాఖానిధభుజాయై నమః

ఓం కర్ణకుండలకాంచితాయై నమః

ఓం ప్రవాళాంగులివిన్య స్తమయై నమః

ఓం హారత్నాంగులియకాయై నమః

ఓం కంభుకంట్యై నమః

ఓం సుచుం బకాయై నమః

ఓం బింబోష్ట్యై నమః

ఓం కుందదంతయుతే

ఓం కమనీయ ప్రభాస్వచ్చయై నమః

ఓం చంపేయనిభనాసికాయై నమః

ఓం యాంచికాయై నమః

ఓం ఆనందార్క ప్రకాశోత్పద్మణి నమః

ఓం తాటంకశోభితాయై నమః

ఓం కోటిసుర్యాగ్నిసంకాశై నమః

ఓం నానాభూషణభూషితాయై నమః

ఓం సుగంధవదనాయై నమః

ఓం సుభ్రవే నమః

ఓం అర్ధచంద్ర లలాటకాయై నమః

ఓం పూర్ణచంద్రాసనాయై నమః

ఓం నీలకుటిలాళకశోబితాయై నమః

ఓం సౌందర్యసీమావిలసత్యై నమః

ఓం కస్తూరితిలకోజ్వలాయై నమః

ఓం దగద్దకాయమనోధ్యత్ మణినే నమః

ఓం భూషణ రాజితాయై నమః

ఓం జుజ్వల్యమానసత్రరత్నదేవ్యకుటావతం సకాయై నమః

ఓం ఆత్యర్కానల తేజస్విమణీంకంజుకదారిన్యై నమః

ఓం నానామణిగణాకీర్ణకాంచనాంగదభూషితాయై నమః

ఓం కుకుంమాగరుకస్తూరీదివ్య చందన చర్చితాయై నమః

ఓం సోచితోజ్వల విధ్తోతవిచిత్రై నమః

ఓం శుభహారిణ్యై నమః

ఓం సర్వావయ వభూషణాయై నమః

ఓం శ్రీ రంగనిలయాయై నమః

ఓం పూజ్యాయై నమః

ఓం దివ్య దేవిసుసేవితాయై నమః

ఓం శ్రీ మత్యైకోతాయై నమః

ఓం శ్రీ గోదాదేవ్యై నమః



ఇతి శ్రీ గోదాదేవి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

🌹🌹🌹🌹🌹

శ్రీ రంగనాథ అష్టోత్తరశతనామావళి Ranganatha Ashtottara Shatanamavali



🌹 శ్రీ రంగనాథ అష్టోత్తరశతనామావళి Ranganatha Ashtottara Shatanamavali 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


ఓం శ్రీరంగశాయినే నమః |

ఓం శ్రీకాన్తాయ నమః |

ఓం శ్రీప్రదాయ నమః |

ఓం శ్రితవత్సలాయ నమః |

ఓం అనన్తాయ నమః |

ఓం మాధవాయ నమః |

ఓం జేత్రే నమః |

ఓం జగన్నాథాయ నమః |

ఓం జగద్గురవే నమః | ౯

ఓం సురవర్యాయ నమః |

ఓం సురారాధ్యాయ నమః |

ఓం సురరాజానుజాయ నమః |

ఓం ప్రభవే నమః |

ఓం హరయే నమః |

ఓం హతారయే నమః |

ఓం విశ్వేశాయ నమః |

ఓం శాశ్వతాయ నమః |

ఓం శంభవే నమః | ౧౮

ఓం అవ్యయాయ నమః |

ఓం భక్తార్తిభంజనాయ నమః |

ఓం వాగ్మినే నమః |

ఓం వీరాయ నమః |

ఓం విఖ్యాతకీర్తిమతే నమః |

ఓం భాస్కరాయ నమః |

ఓం శాస్త్రతత్త్వజ్ఞాయ నమః |

ఓం దైత్యశాస్త్రే నమః |

ఓం అమరేశ్వరాయ నమః | ౨౭

ఓం నారాయణాయ నమః |

ఓం నరహరయే నమః |

ఓం నీరజాక్షాయ నమః |

ఓం నరప్రియాయ నమః |

ఓం బ్రహ్మణ్యాయ నమః |

ఓం బ్రహ్మకృతే నమః |

ఓం బ్రహ్మణే నమః |

ఓం బ్రహ్మాంగాయ నమః |

ఓం బ్రహ్మపూజితాయ నమః | ౩౬

ఓం కృష్ణాయ నమః |

ఓం కృతజ్ఞాయ నమః |

ఓం గోవిందాయ నమః |

ఓం హృషీకేశాయ నమః |

ఓం అఘనాశనాయ నమః |

ఓం విష్ణవే నమః |

ఓం జిష్ణవే నమః |

ఓం జితారాతయే నమః |

ఓం సజ్జనప్రియాయ నమః | ౪౫

ఓం ఈశ్వరాయ నమః |

ఓం త్రివిక్రమాయ నమః |

ఓం త్రిలోకేశాయ నమః |

ఓం త్రయ్యర్థాయ నమః |

ఓం త్రిగుణాత్మకాయ నమః |

ఓం కాకుత్స్థాయ నమః |

ఓం కమలాకాన్తాయ నమః |

ఓం కాళీయోరగమర్దనాయ నమః |

ఓం కాలామ్బుదశ్యామలాంగాయ నమః | ౫౪

ఓం కేశవాయ నమః |

ఓం క్లేశనాశనాయ నమః |

ఓం కేశిప్రభంజనాయ నమః |

ఓం కాన్తాయ నమః |

ఓం నన్దసూనవే నమః |

ఓం అరిన్దమాయ నమః |

ఓం రుక్మిణీవల్లభాయ నమః |

ఓం శౌరయే నమః |

ఓం బలభద్రాయ నమః | ౬౩

ఓం బలానుజాయ నమః |

ఓం దామోదరాయ నమః |

ఓం హృషీకేశాయ నమః |

ఓం వామనాయ నమః |

ఓం మధుసూదనాయ నమః |

ఓం పూతాయ నమః |

ఓం పుణ్యజనధ్వంసినే నమః |

ఓం పుణ్యశ్లోకశిఖామణయే నమః |

ఓం ఆదిమూర్తయే నమః | ౭౨

ఓం దయామూర్తయే నమః |

ఓం శాంతమూర్తయే నమః |

ఓం అమూర్తిమతే నమః |

ఓం పరస్మై బ్రహ్మణే నమః |

ఓం పరస్మై ధామ్నే నమః |

ఓం పావనాయ నమః |

ఓం పవనాయ నమః |

ఓం విభవే నమః |

ఓం చంద్రాయ నమః | ౮౧

ఓం ఛన్దోమయాయ నమః |

ఓం రామాయ నమః |

ఓం సంసారామ్బుధితారకాయ నమః |

ఓం ఆదితేయాయ నమః |

ఓం అచ్యుతాయ నమః |

ఓం భానవే నమః |

ఓం శంకరాయ నమః |

ఓం శివాయ నమః |

ఓం ఊర్జితాయ నమః | ౯౦

ఓం మహేశ్వరాయ నమః |

ఓం మహాయోగినే నమః |

ఓం మహాశక్తయే నమః |

ఓం మహత్ప్రియాయ నమః |

ఓం దుర్జనధ్వంసకాయ నమః |

ఓం అశేషసజ్జనోపాస్తసత్ఫలాయ నమః |

ఓం పక్షీన్ద్రవాహనాయ నమః |

ఓం అక్షోభ్యాయ నమః |

ఓం క్షీరాబ్ధిశయనాయ నమః | ౯౯

ఓం విధవే నమః |

ఓం జనార్దనాయ నమః |

ఓం జగద్ధేతవే నమః |

ఓం జితమన్మథవిగ్రహాయ నమః |

ఓం చక్రపాణయే నమః |

ఓం శంఖధారిణే నమః |

ఓం శార్ఙ్గిణే నమః |

ఓం ఖడ్గినే నమః |

ఓం గదాధరాయ నమః | ౧౦౮


ఇతి శ్రీ రంగనాథ అష్టోత్తరశతనామావళిః సంపూర్ణం ||

🌹🌹🌹🌹🌹


Dhanurmasam Special - Sri Vishnu Das Avatar



https://youtube.com/shorts/MzkkF-UHiyo


🌹 DHANURMASAM special శ్రీ విష్ణవు దశావతారాలు యధాయధాహి ధర్మస్య సంభవామి యుగేయుగే Sri Vishnu Das avatar 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹

Dhanurmasam - గోదాదేవి వ్రతం, మార్గళి వ్రతం, శ్రీవ్రతం, కాత్యాయని వ్రతం - గోదాదేవి కళ్యాణం - వైకుంఠ ఏకాదశి పర్వదినాల మాసం ధనుర్మాసం, ధను సంక్రాంతి శుభాకాంక్షలు


🌹 గోదాదేవి వ్రతం, మార్గళి వ్రతం, శ్రీవ్రతం, కాత్యాయని వ్రతం - గోదాదేవి కళ్యాణం - వైకుంఠ ఏకాదశి పర్వదినాల మాసం ధనుర్మాసం, ధను సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి 🌹

ప్రసాద్‌ భరధ్వాజ



ఓం శ్రీ రంగనాథాయ నమః

ఓం గోదాయై నమః


🌿 విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైన ధనుర్మాసంలో నెల రోజుల పాటు వైష్ణవ ఆలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలో రంగనాథుడిని పరమభక్తితో సేవించడం ద్వారా గోదాదేవి ఆయనను వరించి, తన భక్తిని చాటుకుంది. సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి ఈనెలలోనే ప్రవేశిస్తాడు. నిత్యం తిరుప్పావై పారాయణం చేస్తూ విష్ణుమూర్తిని, శ్రీ కృష్ణుని తులసి ఆకులతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ప్రత్యేక పూజలు చేయడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరతాయని అలాగే సంపద, ఆరోగ్యం, మోక్షం లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ధనుర్మాసంలో తిరుప్పావై వ్రతం ముఖ్యమైనదని పురోహితులు చెబుతున్నారు. ఈ వ్రతం సందర్భంగా నెలరోజుల పాటు రోజుకో పాశురం చొప్పున విన్నపం చేస్తారు. విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి గోదాదేవి రోజుకో రీతిలో తిరుప్పావై పాశురాలను ఆలపించింది. ఒకటి నుంచి ఐదు రోజులు నియమ నిబంధనలకు సంబంధించిన పాశురాలు, 6వ రోజు నుంచి 15వ రోజు వరకు పాశురాలలో తన తోటి చెలికత్తెలను నిద్రలేపి సందగోపుని గృహానికి వెళ్లడం. 16, 17, 18వ రోజుల్లో పాశురాలలో నందగోపుడు, యశోద, బలరాములను మేల్కొలపడం, 23వ రోజు పాశురంలో మంగళాశాసనం, 25, 26వ రోజుల్లో స్వామికి అలంకారాలైన ఆయుధాలను 'పర' అనే వాయిద్యాన్ని తమ శరణాగతిని అనుగ్రహించి, తమ సంకల్పాన్ని నేరవేర్చమని ప్రార్థిస్తారు. చివరి రోజు గోదారంగనాథుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ధనుర్మాసం మొత్తం నిత్యం ప్రతి ఇంటి ముందు కళ్లాపు చల్లి అందమైన ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి గోదాదేవి, లక్ష్మీదేవి, గౌరీమాతగా భావిస్తారు. గోవుపేడతో పేడతో చేసిన గొబ్బెమ్మలను ముగ్గుల మధ్యలో ఉంచుతారు. 🌿


🍀 1.పాశురము 🍀

మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్

నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్

శీర్ మల్ గు మాయ్ ప్పాడి చ్చెల్వచ్చిఱుమీర్ కాళ్

కూర్ వేల్ - కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్

ఏరార్ న్దకణ్ణి యశోదై యిళ శింజ్గమ్

కార్ మేని చ్చెంగళ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్

నారాయణనే నమక్కే పఱై దరువాన్

పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్ !

భావము - సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా~ మార్గశీర్ష మాసం ఎంతో మంచిది. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి. శూరుడైన నందగోపుని కుమారుడును, విశాల నేత్రియగు యశోదకు బాల సింహము వంటి వాడును, నల్లని మేఘము వంటి శరీరిమును, చంద్రునివలె ఆహ్లాదకరుడును, సూర్యునివలె తేజోమయుడును యైన నారాయణునే తప్పు, యితరములను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కాలవసినవిచ్చుటకు సిద్ధపడినాడు. కావున మీరందరూ యీ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించునట్లుగ దాని కంగమైన మార్గళి స్నానము చేయు కోరికగల వారందరును ఆలసింపక శ్రీఘ్రముగ రండని శ్రీ గోదాదేవి గొల్ల కన్నియలందరను ఆహ్వానించు చున్నది.


🍁 ధనుర్మాసంలో విశిష్టమైన రోజులు 🍁

2025, డిసెంబరు 24వ తేదీన వేశేష ధూప్‌ సేవ(తూమని మాడత్తు)

డిసెంబరు 30వ తేదీన వైకుంఠ ఏకాదశి (ఉత్తరద్వార దర్శనం)


2026, జనవరి 3వ తేదీన విశేష దీపాలంకరణ సేవ(కుత్తు విళక్కెరియ)

జనవరి 8వ తేదీన పొన్నాకుల హారతి (అన్జు ఇవ్వులగం)


జనవరి 11వ తేదీన విశేష ప్రసాద సేవ (కూడారై వెల్లుం)

జనవరి 14వ తేదీన భోగి రోజున పూలంగి సేవ, శ్రీగోదారంగనాథుల కల్యాణం

🌹 🌹 🌹 🌹 🌹