శ్రీ లలితా సహస్ర నామములు - 136 / Sri Lalita Sahasranamavali - Meaning - 136

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 136 / Sri Lalita Sahasranamavali - Meaning - 136 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 136. దీక్షితా, దైత్యశమనీ, సర్వలోక వశంకరీ ।
సర్వార్థదాత్రీ, సావిత్రీ, సచ్చిదానంద రూపిణీ ॥ 136 ॥ 🍀

🍀 697. దీక్షితా :
భక్తులను రకించుట యెందు దీక్ష వహించినది

🍀 698. దైత్యశమనీ :
రాక్షసులను సం హరించునది

🍀 699. సర్వలోకవశంకరీ :
సమస్తలోకములను వశము చేసుకొనునది

🍀 700. సర్వార్ధదాత్రీ :
కోరిన కోర్కెలన్నిటినీ తీర్చునది

🍀 701. సావిత్రీ :
గాయత్రీ మాత

🍀 702. సచ్చిదానందరూపిణీ :
సత్,చిత్, ఆనందములే రూపముగా కలిగినది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 136 🌹

📚. Prasad Bharadwaj

🌻 136. Dikshita daityashamani sarvaloka vashankari
Sarvardhadatri savitri sachidananda rupini ॥ 136 ॥ 🌻

🌻 697 ) Deekshitha -
She who gives the right to do fire sacrifice

🌻 698 ) Dhaitya Shamani -
She who controls anti gods

🌻 699 ) Sarva loka vasam kari -
She who keeps all the world within her control

🌻 700 ) Sarvartha Dhatri -
She who gives all wealth

🌻 701 ) Savithri -
She who is shines like the sun

🌻 702 ) Sachidananda roopini -
She who is personification of the ultimate truth

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

13 Oct 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 88

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 88 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. చేయవలసినది- చేయదలచినది - 4 🌻

మళ్ళీ క్రమశిక్షణ మనం స్థాపనం చేసుకోవాలి. దాని కొరకు మనం ఒక Time పెట్టుకోవాలి. దీని కోసం మన సంస్థవారు యువకులంతా కలిసి మాస్టరు సి.వి.వి. గారు చెప్పిన ప్రకారం ఒక కాలమును నిర్ణయించుకున్నారు.

ఉదయం 6.00 గంటల నుండి మీ ఇష్టం వచ్చినంత సేపు సాయంత్రం 6.00 గంటల నుండి మీ ఇష్టం వచ్చినంత సేపు అనుష్ఠానం చేసికొంటూ ఉండండి. (అని నియమం) ఈ సంస్థ యువకులలోంచి బయలు దేరి ఇన్ని దేశాలలోను స్థాపింపబడినది.

ఈ సంస్థ ఇప్పుడు భారతదేశంలోనే కాక ఫ్రాన్స్, బెల్జియం, హాలండ్, స్విట్లర్లాండ్, వెస్ట్ జర్మనీ, స్కాండినేవియన్ దేశాలలో అనగా డెన్మార్క్ మొదలయిన దేశాలలో కూడా ఉన్నది. ఈ దేశాలన్నింటిలోను స్థానికమైన కాలమానం ప్రకారం ఉదయం, సాయంకాలం 6.00 గంటలకు ప్రార్థన చేసికొంటున్నారు.

ఈ ప్రార్థన చేసికొనేటప్పుడు కూర్చున్న తరువాత ముందు 'ఓంకారము' మూడు పర్యాయములు చేసి తరువాత గురుస్తోత్రం చేసికోవాలి.

తరువాత గాయత్రీ మంత్రం పదిమారులు సస్వరంగా కంఠమెత్తి ముక్తకంఠంగా ఉచ్చారణ చేసికొనవలసినది. అది అయిన తరువాత గురుశిష్య సంబంధాన్ని స్థాపించు "శంనో మిత్రః శంవరుణః" అను మంత్రమును ఉచ్చరించవలెను.

తరువాత జ్వాలాకూల మహర్షి యావత్ర్పపంచమునకు బ్రహ్మ విద్యా సమన్వయం చేయటం కోసం, ఒక సుప్రభాతం (Invocation) అనునది ఇచ్చారు. ఆ Invocation‌ ని ఉదయం పూట చేసికొనవలసినది. తరువాత నేను ఒక Invocation ఇచ్చాను. వీటిని ఇన్ని దేశాల వారు ఒక Standard క్రింద పెట్టుకున్నారు.

దీనిని అనుష్ఠానం చేసికొనునపుడు ప్రతి ఇంటిలోను ఒక దేవుని మందిరం ఏర్పాటు చేసికొనవలసినది. దేవుని ఏర్పాటు చేసికొన్న స్థానం (ప్రదేశం) ఒకటి తప్పనిసరిగా ఉండాలి. అని ఇన్ని దేశాల వారు నియమంగా పెట్టుకున్నారు.

.......✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹

13 Oct 2021

వివేక చూడామణి - 136 / Viveka Chudamani - 136

🌹. వివేక చూడామణి - 136 / Viveka Chudamani - 136🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 27. విముక్తి - 9 🍀

446. ప్రారబ్ద కర్మల వలన ఎంత కాలము భౌతిక ఆనంద స్థితులు అనుభవిస్తుంటామో అవి అంత కాలముంటాయి. ప్రతి ఫలితము తాను చేసిన పనుల ఫలితమేనని గ్రహించాలి. ఇపుడు ఈ పనులన్ని స్వతంత్రముగా పోగుపడినవిగా భావించాలి.

447. బ్రహ్మాన్ని తెలుసుకొని తనను తాను గుర్తించిన తరువాత, పేరుకు పోయిన గత జన్మల, ఈ జన్మ యొక్క వందల కోట్ల జన్మల కర్మలన్ని, కల నుండి మెలుకవ స్థితిలో అవన్ని మాయమైనట్లు, మాయమవుతాయి.

448. మంచి పనులు కాని భయంకరమైన పాపాలుకాని ఒక వ్యక్తి తన కలలోని స్థితిలో చేసినను అతడు స్వర్గ నరకాలకు చేరగలడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 VIVEKA CHUDAMANI - 136 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 27. Redemption - 9 🌻

446. Prarabdha work is acknowledged to persist so long as there is the perception of happiness and the like. Every result is preceded by an action, and nowhere is it seen to accrue independently of action.

447. Through the realisation of one’s identity with Brahman, all the accumulated actions of a hundred crore of cycles come to nought, like the actions of dream-state on awakening.

448. Can the good actions or dreadful sins that a man fancies himself doing in the dream-state, lead him to heaven or hell after he has awakened from sleep ?

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

13 Oct 2021

శ్రీ శివ మహా పురాణము - 459

🌹 . శ్రీ శివ మహా పురాణము - 459🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 32

🌻. సప్తర్షుల రాక - 3 🌻

శివుడిట్లు పలికెను-

ఋషులు సర్వదా పూజనీయులు. మీరు మరిం పూజనీయులు. ఓ విప్రులారా! నేను ఒక కారణముచే మిమ్ములను స్మరించితిని (24). నేను లోకములకు సిద్ధిని కలిగించి ఉపకారమును చేయుటకు నడుము కట్టి యుందునని మీరెంగుదురు (25). దుర్మార్గుడగు తారకుని వలన దేవతలకు దుఃఖము సంప్రాప్తమైనది. బ్రహ్మ అతిక్లిష్టమగు వరము నిచ్చినాడు. నేనేమి చేయుదును? (26) ఓ మహర్షులారా! నా ఎనిమిది మూర్తులు లోక ప్రసిద్ధుములై యున్నవి. అవి లోకముల ఉపకారము కొరకే గాని, నా స్వార్థము కొరకు గాదని స్పష్టమే (27).

ఆ కారణముగనే నేను శివాదేవిని వివాహమాడ గోరితిని. ఆమె మహర్షులు కూడ చేయరాని గొప్ప తపస్సును చేసినది (28). ఆమెకు అభీష్టము, హితకరము అగు పరమఫలము నీయవలసి యుండెను. భక్తులకు ఆనందమును కలిగించుట నా ప్రతిజ్ఞయని స్పష్టమే గదా! (29) పార్వతియొక్క మాటను అనుసరించి నేను భిక్షరూపముతో హిమవంతుని గృహమునకు వెళ్లితిని. లీలా పండితుడనగు నేను ఆ కాళి మాటను నిలబెట్టితిని (30). ఆ దంతపులు నన్ను పరబ్రహ్మయని గుర్తించి పరమభక్తితో తమ కుమార్తెను వేదోక్త విధిగా నాకీయ గోరిరి (31).

నేను దేవతల ప్రేరణచే శివనిందను చేసితిని. వారి భక్తిని చెడగొట్టుటకై నేను వైష్ణవ రూపమును ధరించి అట్లు చేసితిని (32). వారా నిందను విని మిక్కిలి నిర్వేదమును పొంది భక్తిని గోల్పోయిరి. ఇపుడు వారు నాకు తమ కన్యను ఈయనిచ్చగించుటలేదు. ఓ మునులారా! (33) కావున మీరు హిమవంతుని గృహమునకు వెళ్లి ఆ పర్వతరాజునకు, ఆయన భార్యకు హితము నుపదేశించుడు (34). వారికి వేదతుల్యమగు ఉపదేశమును ప్రయత్నపూర్వకముగా చేయుడు. ఈ ఉత్తమ కార్యము తప్పక సఫలమగునట్లు చేయుడు (35).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

13 Oct 2021

గీతోపనిషత్తు -260

🌹. గీతోపనిషత్తు -260 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚

శ్లోకము 4-2

🍀 4. చిదాకాశము -2 - మన యందు ఈశ్వరుడు లేనిచో మనము లేము. అతడాధారముగనే మనయందు సమస్త వ్యాపారము జరుగుచున్నది. జాగ్రదవస్థ, నిద్రావస్థ, స్వప్న అవస్థ మనకున్నవి గాని, మన యందలి ఈశ్వరునకు లేవు. ఈశ్వరుడు సర్వత్ర ఈశ్వరుడుగనే యుండును. జీవుల అవస్థలు ఈశ్వరునిపై ప్రభావము చూపవు. మనము తురీయ అవస్థ పొందగలిగినచో ఈశ్వరుని అనవస్థిత్వము తెలియును. మన యందలి ఈశ్వరుడు ఎప్పుడును ఈశ్వరుడుగనే యున్నాడు.🍀

మయాతత మిదం పర్వం జగదవ్యక్తమూర్తినా |
మళ్లోని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః || 4

తాత్పర్యము : ఈ సమస్త ప్రపంచము అవ్యక్త రూపుడగు నాచే వ్యాపింపబడినది. సమస్త భూతములు నా యందే యున్నవి. వాని యందు నేను అవస్థితి చెందను. నేను నేనుగనే యుందును.

వివరణము : భగవానుడు తెర వెలిగి యున్నపుడు చిదాకాశమై యుండును. అపుడే బొమ్మల కథ (సృష్టి కథ). తెర వెలుగకున్నచో పరాకాశమై యుండును. అపుడే కథయు లేదు. తానే యుండును. నాకవస్థితి లేదు అని భగవానుడు పలుకుటలో తానెప్పుడును, ఎట్టి మార్పు చెందని వాడని తెలియ జేయుచున్నాడు. మార్పును చెందునవి జీవులు, సృష్టి మాత్రమే.

మరియొక ఉదాహరణము : బంగారముతో ఉంగరము చేయించినపుడు, ఉంగరముగ గోచరించునది బంగారమే. బంగారము లేనిదే ఉంగరము లేదు. ఉంగరమందు కూడ బంగారము బంగారముగనే యుండును గాని ఉంగరభావము బంగారమున కుండదు. మరియొక ఉదాహరణము : సముద్రమున అలలు గోచరించును. అలల యందున్నది సముద్రమే. సముద్రము అల యందు కూడ సముద్రముగనే యుండును. అవస్థితి అలకేగాని సముద్రమునకు గాదు.

మరియొక ఉదాహరణము : మన యందలి ఈశ్వరుడు ఎప్పుడును ఈశ్వరుడుగనే యున్నాడు. అతడాధారముగ మన మనేకమగు వర్తనములు సలుపుచున్నాము. మన యందు ఈశ్వరుడు లేనిచో మనము లేము. అతడాధారముగనే మనయందు సమస్త వ్యాపారము జరుగుచున్నది. జాగ్రదవస్థ, నిద్రావస్థ, స్వప్న అవస్థ మనకున్నవి గాని, మన యందలి ఈశ్వరునకు లేవు. ఈశ్వరుడు సర్వత్ర ఈశ్వరుడుగనే యుండును. జీవుల అవస్థలు ఈశ్వరునిపై ప్రభావము చూపవు. మనము తురీయ అవస్థ పొందగలిగినచో ఈశ్వరుని అనవస్థిత్వము తెలియును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

13 Oct 2021

దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 7. కాళరాత్రి దేవి - దుర్గాదేవి Devi Navratra - Nav Durgas Sadhana - 7. Kalatri Devi - Durga Devi

🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 7. కాళరాత్రి దేవి - దుర్గాదేవి 🌹

🌻 . ప్రసాద్ భరద్వాజ

🌷. ప్రార్ధనా శ్లోకము :

ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నా ఖరస్థితా ।
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ ॥
వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా ।
వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ॥

🌷. అలంకారము :

దుర్గాదేవి - ముదురు ఎరుపు రంగు

🌷. నివేదనం : కదంబం (కిచిడి - వెజిటబుల్ రైస్)

🌷. మహిమ - చరిత్ర :

దుర్గామాత ఏడవ శక్తి ‘కాళరాత్రి’ అనే పేరుతో ఖ్యాతి వహించింది. ఈమె శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదరై ఉంటాయి. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది. ఈమెకు గల త్రినేత్రాలు బ్రహ్మాండములాగా గుండ్రనివి. వాటినుండి విద్యుత్కాంతులు ప్రసరిస్తూ ఉంటాయి. ఈమె నాసికా శ్వాస ప్రశ్వాసలు భయంకరములైన అగ్ని జ్వాలలను వెడలగ్రక్కుతుంటాయి. ఈమె వాహనము గార్ధబము లేదా గాడిద.

ఈమె తన ఒక కుడిచేతి వరదముద్ర ద్వారా అందరికీ వరాలను ప్రసాదిస్తుంది. మరోక కుడిచేత అభయముద్రను కలిగి ఉంటుంది. ఒక ఎడమచేతిలో ఇనుపముళ్ళ ఆయుధాన్నీ, మరొక ఎడమచేతిలో ఖడ్గాన్నీ ధరించి ఉంటుంది.

కాళరాత్రి స్వరూపము చూడటానికి మిక్కిలి భయానకమైనప్పటికీ ఈమె ఎల్లప్పుడూ శుభ ఫలితాలనే ప్రసాదిస్తుంది. అందు వలన ఈమెను ‘శుభంకరి’ అని కూడా అంటారు. కాబట్టి భక్తులు ఈమెను చూసి ఏ భయాన్నిగానీ, అందోళననుగానీ పొందనవసరంలేదు

🌻. సాధన :

దుర్గానవరాత్రులలో ఏడవ రోజున కాళరాత్రి మాతను ఉపాసిస్తారు. ఆ రోజు సాధకుని మనస్సు సహస్రార చక్రంలో స్థిరమవుతుంది.

అతనికి బ్రహ్మాండములలోని సమస్త సిద్ధులూ కరతలామలకములవుతాయి. ఈ చక్రాన స్థిరపడిన సాధకుడి మనస్సు పూర్తిగా కాళరాత్రి స్వారూపంపైనే స్థిరమవుతుంది. ఈమె సాక్షాత్కారం వలన భక్తునికి మహాపుణ్యము లభిస్తుంది. అతని సమస్త పాపాలు, ఎదురయ్యె విఘ్నాలు పటాపంచలైపోతాయి. అతనికి అక్షయ పుణ్యలోప్రాప్తి కలుగుతుంది.

కాళరాత్రి మాత దుష్టులను అంతమొందిస్తుంది. ఈమెను స్మరించినంత మాత్రానే దానవులూ, దైత్యులూ, రాక్షసులూ, భూతప్రేత పిశాచాలూ భయంతో పారిపోవడం తథ్యం.

ఈమె అనుగ్రహంవల్ల గ్రహబాధలు తొలగిపోతాయి. ఈమెను ఉపాసించేవారికి అగ్ని, జలము, జంతువులు మొదలైన వాటి భయం కానీ శత్రువుల భయం కానీ, రాత్రి భయం కానీ – ఏ మాత్రం ఉండవు. ఈమె కృపవల్ల భక్తులు సర్వదా భయవిముక్తులవుతారు.

కాళరాత్రి మాత స్వరూపాన్ని హృదయంలో నిలుపుకొని మనుష్యుడు నిష్ఠతో ఉపాసించాలి. యమ, నియమ సంయమనాలను పూర్తిగా పాటించాలి. త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి. ఈ దేవి సర్వశుభంకరి. ఈమెను ఉపాసించే వారికి కలిగే శుభాలు అనంతాలు. మనం నిరంతరం ఈమె స్మరణ, ధ్యానములను, పూజలనూ చేయటం – ఇహపర ఫల సాధకం.

🌹 🌹 🌹 🌹 🌹

13-OCTOBER-2021 MESSAGES

1) 🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 7. కాళరాత్రి దేవి - దుర్గాదేవి 🌹
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 260 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 459🌹 
4) 🌹 వివేక చూడామణి - 136 / Viveka Chudamani - 136🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -88🌹  
6) 🌹 Osho Daily Meditations - 78🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 136 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 136 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. దేవీ నవరాత్రులు - నవ దుర్గలు సాధన - 7. కాళరాత్రి దేవి - దుర్గాదేవి 🌹*
*🌻 . ప్రసాద్ భరద్వాజ*

🌷. ప్రార్ధనా శ్లోకము :
*ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నా ఖరస్థితా ।*
*లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ ॥*
*వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా ।*
*వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ॥*

🌷. అలంకారము :
*దుర్గాదేవి - ముదురు ఎరుపు రంగు*
🌷. నివేదనం : కదంబం (కిచిడి - వెజిటబుల్ రైస్) 

🌷. మహిమ - చరిత్ర :
దుర్గామాత ఏడవ శక్తి ‘కాళరాత్రి’ అనే పేరుతో ఖ్యాతి వహించింది. ఈమె శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదరై ఉంటాయి. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది. ఈమెకు గల త్రినేత్రాలు బ్రహ్మాండములాగా గుండ్రనివి. వాటినుండి విద్యుత్కాంతులు ప్రసరిస్తూ ఉంటాయి. ఈమె నాసికా శ్వాస ప్రశ్వాసలు భయంకరములైన అగ్ని జ్వాలలను వెడలగ్రక్కుతుంటాయి. ఈమె వాహనము గార్ధబము లేదా గాడిద. 

ఈమె తన ఒక కుడిచేతి వరదముద్ర ద్వారా అందరికీ వరాలను ప్రసాదిస్తుంది. మరోక కుడిచేత అభయముద్రను కలిగి ఉంటుంది. ఒక ఎడమచేతిలో ఇనుపముళ్ళ ఆయుధాన్నీ, మరొక ఎడమచేతిలో ఖడ్గాన్నీ ధరించి ఉంటుంది.

కాళరాత్రి స్వరూపము చూడటానికి మిక్కిలి భయానకమైనప్పటికీ ఈమె ఎల్లప్పుడూ శుభ ఫలితాలనే ప్రసాదిస్తుంది. అందు వలన ఈమెను ‘శుభంకరి’ అని కూడా అంటారు. కాబట్టి భక్తులు ఈమెను చూసి ఏ భయాన్నిగానీ, అందోళననుగానీ పొందనవసరంలేదు

🌻. సాధన :
దుర్గానవరాత్రులలో ఏడవ రోజున కాళరాత్రి మాతను ఉపాసిస్తారు. ఆ రోజు సాధకుని మనస్సు సహస్రార చక్రంలో స్థిరమవుతుంది. 

అతనికి బ్రహ్మాండములలోని సమస్త సిద్ధులూ కరతలామలకములవుతాయి. ఈ చక్రాన స్థిరపడిన సాధకుడి మనస్సు పూర్తిగా కాళరాత్రి స్వారూపంపైనే స్థిరమవుతుంది. ఈమె సాక్షాత్కారం వలన భక్తునికి మహాపుణ్యము లభిస్తుంది. అతని సమస్త పాపాలు, ఎదురయ్యె విఘ్నాలు పటాపంచలైపోతాయి. అతనికి అక్షయ పుణ్యలోప్రాప్తి కలుగుతుంది.

కాళరాత్రి మాత దుష్టులను అంతమొందిస్తుంది. ఈమెను స్మరించినంత మాత్రానే దానవులూ, దైత్యులూ, రాక్షసులూ, భూతప్రేత పిశాచాలూ భయంతో పారిపోవడం తథ్యం. 

ఈమె అనుగ్రహంవల్ల గ్రహబాధలు తొలగిపోతాయి. ఈమెను ఉపాసించేవారికి అగ్ని, జలము, జంతువులు మొదలైన వాటి భయం కానీ శత్రువుల భయం కానీ, రాత్రి భయం కానీ – ఏ మాత్రం ఉండవు. ఈమె కృపవల్ల భక్తులు సర్వదా భయవిముక్తులవుతారు.

కాళరాత్రి మాత స్వరూపాన్ని హృదయంలో నిలుపుకొని మనుష్యుడు నిష్ఠతో ఉపాసించాలి. యమ, నియమ సంయమనాలను పూర్తిగా పాటించాలి. త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి. ఈ దేవి సర్వశుభంకరి. ఈమెను ఉపాసించే వారికి కలిగే శుభాలు అనంతాలు. మనం నిరంతరం ఈమె స్మరణ, ధ్యానములను, పూజలనూ చేయటం – ఇహపర ఫల సాధకం.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -260 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 4-2
 
*🍀 4. చిదాకాశము -2 - మన యందు ఈశ్వరుడు లేనిచో మనము లేము. అతడాధారముగనే మనయందు సమస్త వ్యాపారము జరుగుచున్నది. జాగ్రదవస్థ, నిద్రావస్థ, స్వప్న అవస్థ మనకున్నవి గాని, మన యందలి ఈశ్వరునకు లేవు. ఈశ్వరుడు సర్వత్ర ఈశ్వరుడుగనే యుండును. జీవుల అవస్థలు ఈశ్వరునిపై ప్రభావము చూపవు. మనము తురీయ అవస్థ పొందగలిగినచో ఈశ్వరుని అనవస్థిత్వము తెలియును. మన యందలి ఈశ్వరుడు ఎప్పుడును ఈశ్వరుడుగనే యున్నాడు.🍀*

మయాతత మిదం పర్వం జగదవ్యక్తమూర్తినా |
మళ్లోని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః || 4

తాత్పర్యము : ఈ సమస్త ప్రపంచము అవ్యక్త రూపుడగు నాచే వ్యాపింపబడినది. సమస్త భూతములు నా యందే యున్నవి. వాని యందు నేను అవస్థితి చెందను. నేను నేనుగనే యుందును. 

వివరణము : భగవానుడు తెర వెలిగి యున్నపుడు చిదాకాశమై యుండును. అపుడే బొమ్మల కథ (సృష్టి కథ). తెర వెలుగకున్నచో పరాకాశమై యుండును. అపుడే కథయు లేదు. తానే యుండును. నాకవస్థితి లేదు అని భగవానుడు పలుకుటలో తానెప్పుడును, ఎట్టి మార్పు చెందని వాడని తెలియ జేయుచున్నాడు. మార్పును చెందునవి జీవులు, సృష్టి మాత్రమే.

మరియొక ఉదాహరణము : బంగారముతో ఉంగరము చేయించినపుడు, ఉంగరముగ గోచరించునది బంగారమే. బంగారము లేనిదే ఉంగరము లేదు. ఉంగరమందు కూడ బంగారము బంగారముగనే యుండును గాని ఉంగరభావము బంగారమున కుండదు. మరియొక ఉదాహరణము : సముద్రమున అలలు గోచరించును. అలల యందున్నది సముద్రమే. సముద్రము అల యందు కూడ సముద్రముగనే యుండును. అవస్థితి అలకేగాని సముద్రమునకు గాదు. 

మరియొక ఉదాహరణము : మన యందలి ఈశ్వరుడు ఎప్పుడును ఈశ్వరుడుగనే యున్నాడు. అతడాధారముగ మన మనేకమగు వర్తనములు సలుపుచున్నాము. మన యందు ఈశ్వరుడు లేనిచో మనము లేము. అతడాధారముగనే మనయందు సమస్త వ్యాపారము జరుగుచున్నది. జాగ్రదవస్థ, నిద్రావస్థ, స్వప్న అవస్థ మనకున్నవి గాని, మన యందలి ఈశ్వరునకు లేవు. ఈశ్వరుడు సర్వత్ర ఈశ్వరుడుగనే యుండును. జీవుల అవస్థలు ఈశ్వరునిపై ప్రభావము చూపవు. మనము తురీయ అవస్థ పొందగలిగినచో ఈశ్వరుని అనవస్థిత్వము తెలియును. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 459🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 32

*🌻. సప్తర్షుల రాక - 3 🌻*

శివుడిట్లు పలికెను-

ఋషులు సర్వదా పూజనీయులు. మీరు మరిం పూజనీయులు. ఓ విప్రులారా! నేను ఒక కారణముచే మిమ్ములను స్మరించితిని (24). నేను లోకములకు సిద్ధిని కలిగించి ఉపకారమును చేయుటకు నడుము కట్టి యుందునని మీరెంగుదురు (25). దుర్మార్గుడగు తారకుని వలన దేవతలకు దుఃఖము సంప్రాప్తమైనది. బ్రహ్మ అతిక్లిష్టమగు వరము నిచ్చినాడు. నేనేమి చేయుదును? (26) ఓ మహర్షులారా! నా ఎనిమిది మూర్తులు లోక ప్రసిద్ధుములై యున్నవి. అవి లోకముల ఉపకారము కొరకే గాని, నా స్వార్థము కొరకు గాదని స్పష్టమే (27).

ఆ కారణముగనే నేను శివాదేవిని వివాహమాడ గోరితిని. ఆమె మహర్షులు కూడ చేయరాని గొప్ప తపస్సును చేసినది (28). ఆమెకు అభీష్టము, హితకరము అగు పరమఫలము నీయవలసి యుండెను. భక్తులకు ఆనందమును కలిగించుట నా ప్రతిజ్ఞయని స్పష్టమే గదా! (29) పార్వతియొక్క మాటను అనుసరించి నేను భిక్షరూపముతో హిమవంతుని గృహమునకు వెళ్లితిని. లీలా పండితుడనగు నేను ఆ కాళి మాటను నిలబెట్టితిని (30). ఆ దంతపులు నన్ను పరబ్రహ్మయని గుర్తించి పరమభక్తితో తమ కుమార్తెను వేదోక్త విధిగా నాకీయ గోరిరి (31).

నేను దేవతల ప్రేరణచే శివనిందను చేసితిని. వారి భక్తిని చెడగొట్టుటకై నేను వైష్ణవ రూపమును ధరించి అట్లు చేసితిని (32). వారా నిందను విని మిక్కిలి నిర్వేదమును పొంది భక్తిని గోల్పోయిరి. ఇపుడు వారు నాకు తమ కన్యను ఈయనిచ్చగించుటలేదు. ఓ మునులారా! (33) కావున మీరు హిమవంతుని గృహమునకు వెళ్లి ఆ పర్వతరాజునకు, ఆయన భార్యకు హితము నుపదేశించుడు (34). వారికి వేదతుల్యమగు ఉపదేశమును ప్రయత్నపూర్వకముగా చేయుడు. ఈ ఉత్తమ కార్యము తప్పక సఫలమగునట్లు చేయుడు (35).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 136 / Viveka Chudamani - 136🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 27. విముక్తి - 9 🍀*

446. ప్రారబ్ద కర్మల వలన ఎంత కాలము భౌతిక ఆనంద స్థితులు అనుభవిస్తుంటామో అవి అంత కాలముంటాయి. ప్రతి ఫలితము తాను చేసిన పనుల ఫలితమేనని గ్రహించాలి. ఇపుడు ఈ పనులన్ని స్వతంత్రముగా పోగుపడినవిగా భావించాలి. 

447. బ్రహ్మాన్ని తెలుసుకొని తనను తాను గుర్తించిన తరువాత, పేరుకు పోయిన గత జన్మల, ఈ జన్మ యొక్క వందల కోట్ల జన్మల కర్మలన్ని, కల నుండి మెలుకవ స్థితిలో అవన్ని మాయమైనట్లు, మాయమవుతాయి. 

448. మంచి పనులు కాని భయంకరమైన పాపాలుకాని ఒక వ్యక్తి తన కలలోని స్థితిలో చేసినను అతడు స్వర్గ నరకాలకు చేరగలడు. 

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 136 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 27. Redemption - 9 🌻*

446. Prarabdha work is acknowledged to persist so long as there is the perception of happiness and the like. Every result is preceded by an action, and nowhere is it seen to accrue independently of action.

447. Through the realisation of one’s identity with Brahman, all the accumulated actions of a hundred crore of cycles come to nought, like the actions of dream-state on awakening.

448. Can the good actions or dreadful sins that a man fancies himself doing in the dream-state, lead him to heaven or hell after he has awakened from sleep ?
 
Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 88 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. *చేయవలసినది- చేయదలచినది - 4* 🌻

మళ్ళీ క్రమశిక్షణ మనం స్థాపనం చేసుకోవాలి. దాని కొరకు మనం ఒక Time పెట్టుకోవాలి. దీని కోసం మన సంస్థవారు యువకులంతా కలిసి మాస్టరు సి.వి.వి. గారు చెప్పిన ప్రకారం ఒక కాలమును నిర్ణయించుకున్నారు. 

ఉదయం 6.00 గంటల నుండి మీ ఇష్టం వచ్చినంత సేపు సాయంత్రం 6.00 గంటల నుండి మీ ఇష్టం వచ్చినంత సేపు అనుష్ఠానం చేసికొంటూ ఉండండి. (అని నియమం) ఈ సంస్థ యువకులలోంచి బయలు దేరి ఇన్ని దేశాలలోను స్థాపింపబడినది. 

ఈ సంస్థ ఇప్పుడు భారతదేశంలోనే కాక ఫ్రాన్స్, బెల్జియం, హాలండ్, స్విట్లర్లాండ్, వెస్ట్ జర్మనీ, స్కాండినేవియన్ దేశాలలో అనగా డెన్మార్క్ మొదలయిన దేశాలలో కూడా ఉన్నది. ఈ దేశాలన్నింటిలోను స్థానికమైన కాలమానం ప్రకారం ఉదయం, సాయంకాలం 6.00 గంటలకు ప్రార్థన చేసికొంటున్నారు. 

ఈ ప్రార్థన చేసికొనేటప్పుడు కూర్చున్న తరువాత ముందు 'ఓంకారము' మూడు పర్యాయములు చేసి తరువాత గురుస్తోత్రం చేసికోవాలి. 

తరువాత గాయత్రీ మంత్రం పదిమారులు సస్వరంగా కంఠమెత్తి ముక్తకంఠంగా ఉచ్చారణ చేసికొనవలసినది. అది అయిన తరువాత గురుశిష్య సంబంధాన్ని స్థాపించు "శంనో మిత్రః శంవరుణః" అను మంత్రమును ఉచ్చరించవలెను. 

తరువాత జ్వాలాకూల మహర్షి యావత్ర్పపంచమునకు బ్రహ్మ విద్యా సమన్వయం చేయటం కోసం, ఒక సుప్రభాతం (Invocation) అనునది ఇచ్చారు. ఆ Invocation‌ ని ఉదయం పూట చేసికొనవలసినది. తరువాత నేను ఒక Invocation ఇచ్చాను. వీటిని ఇన్ని దేశాల వారు ఒక Standard క్రింద పెట్టుకున్నారు. 

దీనిని అనుష్ఠానం చేసికొనునపుడు ప్రతి ఇంటిలోను ఒక దేవుని మందిరం ఏర్పాటు చేసికొనవలసినది. దేవుని ఏర్పాటు చేసికొన్న స్థానం (ప్రదేశం) ఒకటి తప్పనిసరిగా ఉండాలి. అని ఇన్ని దేశాల వారు నియమంగా పెట్టుకున్నారు.

.......✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 77 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 77. TOGETHERNESS 🍀*

*🕉 People have completely forgotten the language of doing things together or not doing anything but just being together. 🕉*

People have forgotten how to just be. If they have nothing to do, they make love. Then nothing happens, and by and by they are frustrated by love itself. Man and woman are different-not only different, they are opposite; they cannot fit together. And that's the beauty-when they fit together it is a miracle, a magic moment. Otherwise they conflict and fight. That's natural and can be understood, because they have different minds. Their outlooks are polar opposites. They cannot agree on anything, because their ways are different, their logic is different.

To fit in a deep attunement, to fall in deep harmony, is almost miraculous. It is like a Kohinoor, a great diamond, and one should not ask for it every day. One should not ask for it as part of a routine. One should wait for it. Months, sometimes years, pass, and then suddenly it is there. And it is always out of the blue, uncaused. Don't be worried-it will take care of itself. And don't become a seeker of love, or else you will miss it completely. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 136 / Sri Lalita Sahasranamavali - Meaning - 136 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 136. దీక్షితా, దైత్యశమనీ, సర్వలోక వశంకరీ ।*
*సర్వార్థదాత్రీ, సావిత్రీ, సచ్చిదానంద రూపిణీ ॥ 136 ॥ 🍀*

🍀 697. దీక్షితా : 
భక్తులను రకించుట యెందు దీక్ష వహించినది 

🍀 698. దైత్యశమనీ : 
రాక్షసులను సం హరించునది 

🍀 699. సర్వలోకవశంకరీ :
 సమస్తలోకములను వశము చేసుకొనునది 

🍀 700. సర్వార్ధదాత్రీ : 
కోరిన కోర్కెలన్నిటినీ తీర్చునది 

🍀 701. సావిత్రీ : 
గాయత్రీ మాత 

🍀 702. సచ్చిదానందరూపిణీ : 
సత్,చిత్, ఆనందములే రూపముగా కలిగినది. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 136 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 136. Dikshita daityashamani sarvaloka vashankari*
*Sarvardhadatri savitri sachidananda rupini ॥ 136 ॥ 🌻*