శ్రీ సాయినాథ మహిమ్న స్తోత్రం

🌹. శ్రీ సాయినాథ మహిమ్న స్తోత్రం 🌹

సదాసత్స్వ రూపం చిదానంద కందం

జగత్సంభవస్థాన సంహార హేతుం

స్వచాక్తేచ్చయామానుషం దర్శయంతం

నమామీశ్వరం సద్గురుం సాయినాథం

భవద్వాంత విధ్వంస మార్తాండ మీడ్యం

మనోవాగతీతం మునిధ్యాన గమ్యం

జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణత్వాం

నమామీశ్వరం సద్గురుం సాయినాథం

భవాంభోది మగ్నార్థితానాం జనానాం

స్వపాదా శ్రితానాం స్వభక్తి ప్రోయాణాం

సముద్ధారణార్థం కలౌసంభవంతం

నమామీశ్వరం సద్గురుం సాయినాథం

సదానింబ వృక్షస్య మూలాధి పాసాత్

సుదాస్రావిణం తిక్త మవ్యప్రియంతం

తరుం కల్పవృక్షాధి కంసాధయంతం

నమామీశ్వరం సద్గురుం సాయినాథం

సదాకల్ప వృక్షస్య తస్యాధిమూలే

భవద్భావ బుద్ధ్యా సపర్యాది సేవాం

నృణాం కుర్యతాం భుక్తి ముక్తి ప్రదంతం

నమామీశ్వరం సద్గురుం సాయినాథం

అనేకాశ్రుతా తర్క్య లీలావిలాసైహః

సమానిష్కృతేశాన భాస్వత్ప్రాభావ

అహంభావ హీనం ప్రసన్నాత్మభావం

నమామీశ్వరం సద్గురుం సాయినాథం

సతాంనిశ్ర మరామమే వాభిరామం

సపదాజ్జనైః సంస్తుతం సన్నమద్భిః

జనామోదకం భక్త భద్రప్రదంతం

నమామీశ్వరం సద్గురుం సాయినాథం

అజన్మాద్యమేకం పరబ్రహ్మ సాక్షాత్

స్వయం సంభవం రామమే నాపతీర్థం

భవద్దర్శనాత్సం పునీతః ప్రభోహం

నమామీశ్వరం సద్గురుం సాయినాథం

🌹🌼🌷🌼🕉🌼🌷🌼🌹

21 Jan 2021

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 186 / Sri Lalitha Chaitanya Vijnanam - 186

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 186 / Sri Lalitha Chaitanya Vijnanam - 186 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము 

నిస్తులా, నీలచికురా, నిరపాయా, నిరత్యయా |
దుర్లభా, దుర్గమా, దుర్గా, దుఃఖహంత్రీ, సుఖప్రదా ‖ 50 ‖

🌻 186. 'నిరపాయా' 🌻

సర్వమును శ్రీమాత ఆధీనమున యుండుటవలన ఆమె ఎట్టి అపాయమును ఎరుగదు. అపాయము ఎవరికి యుండును? తన స్వాధీనము కానిది ఒకటి యున్నప్పుడే కదా! తనకు స్వాధీనము కానిది తనకు ఎదురు తిరుగవచ్చును. జ్ఞానము, అజ్ఞానమూ కూడ ఆమె స్వాధీనముననే యున్నవి. అట్టి శ్రీమాతకు ఆపాయ మెట్లుండును?

జ్ఞానులు అప్పుడప్పుడు అహంకరించుటచే, సృష్టియందు అపాయము వాటిల్లును. వానిని ఇంద్రుడు, త్రిమూర్తులు ఆదిగాగల దేవతలు నివారింతురు. వారి వశముకానిచో శ్రీమాత నివారించును. ఇట్లే అజ్ఞానులు అహంకరించి లోకములండు అనిశ్చిత నేర్పరచినప్పుడు కూడ శ్రీమాత అట్టి అపాయములను పరిష్కరించును. సృష్టియందు ఏ అపాయమునైననూ నిర్వర్తించు సమర్ధురాలు శ్రీమాత.

అపాయములు రెండు విధములుగా కలుగవచ్చును. బయట నుండి, లోపలినుండి అపాయము లేర్పడుచుండును. బయట జనించినను, లోపల జయించనివారు అపాయములకు గురియగుదురు. అట్టివారే హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణులు. వారు తమ లోపల జయించకపోవుటవలన అపాయమునకు గురి అయిరి.

అహంకారము, చిత్తము, ఇంద్రియానీకములను జయించిన యోగులు ఎట్టి అపాయమునకు గురికారు. అగస్త్యుడు, వశిష్ఠుడు, గౌతముడు, సనక సనందనాదులు, నారదుడు అట్టివారు. లోపల జయించిననూ బయటినుండి అపాయములు రావచ్చును. శ్రీరాముని జీవితము దానికి తార్కాణము. అట్లే యుధిష్ఠిరుని జీవితము కూడ. లోపల జయించుటచేత, వారు అపాయములకు గురియైననూ, ఆ అపాయములు పరిష్కరింపబడినవి.

భక్తులకు ఈ నామమిచ్చు సందేశ మొకటున్నది. అంతరంగ విజయము నిజమగు విజయమని, బహిరంగ విజయము నిజమగు విజయము కాదని, అంతరంగ విజయము ద్వారా నిరపాయ స్థితిని పొందవచ్చని, శ్రీమాత ఆరాధనము అంతరంగ విజయమునకే ఉద్దేశింప బడవలెనని సందేశము, "అంతర్ముఖ సమారాధ్యా" అని రాబోవు నామమున ఈ విషయము ప్రస్తావనకు రాగలదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 186 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Nirapāyā निरपाया (186)🌻

She is without destruction, the prime quality of the Brahman. Apāyā means destruction, death, annihilation.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

21 Jan 2021

ఈ ఉన్నత శిఖరాలూ అశాశ్వతాలే

🌹. ఈ ఉన్నత శిఖరాలూ అశాశ్వతాలే 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో ) 🍀

ప్రవహించే నదిలా, ఆకాశంలో ఎగిరే పక్షిలా స్వేచ్ఛగా జీవిస్తారు. అలా జీవించే క్షణంలో భార్య, భర్త, కుటుంబం సమాజం, భద్రత, గౌరవ మర్యాదలు- ఇలా అన్నీ క్రమక్రమంగా కనుమరుగవుతూ, చివరికి పూర్తిగా క్షీణించి అదృశ్యమవుతాయి. అపుడు మీరు ఒంటరిగా మిగిలిపోతారు.

అందుకే అందరికీ ఫార్ములా- 1 కార్ల పోటీ, గ్లైడింగ్ (గాలిపటంలా ఆకాశంలో ఎగరడం), సర్ఫింగ్ (సముద్ర కెరటాలపై విహరించడం) లాంటి ప్రమాదంతో కూడుకున్న ఆటలపై ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది.

అందువల్ల ఆ ప్రమాదాలనుంచి తప్పించుకునే మార్గాలను మీరు చక్కగా నేర్చుకుంటారు. అలా వాటిలో మీ నైపుణ్యం పెరుగుతుంది. అపుడు అవి మీకు అంత ప్రమాదకరమైనవిగా కనిపించవు. అందువల్ల మీరు ఆ ప్రమాదాలను ఏ మాత్రం పట్టించుకోకుండా ముందుకు దూసుకుపోతారు. చూసేవారికి మాత్రమే అవి ప్రమాదకరంగా కనిపిస్తాయి. ఒకవేళ వాటిలో ప్రమాదమున్నప్పటికీ అది చాలా స్వల్పంగా, కేవలం శరీరానికి సంబంధించినంత వరకే వుంటుంది.

అందుకే అవి అందరూ అనుకుంటున్నంత ప్రమాదకరమైనవి కావని నేనంటాను.

ధార్మికతలో జీవించడం ఆధ్యాత్మికపరమైన ప్రమాదం. ఎందుకంటే ధార్మికతలో మీరు వెనక్కి రాలేనంత ఉన్నత శిఖరాలకు చేరుకోవడం జరుగుతుంది. అదే ఆధ్యాత్మికపరమైన ప్రమాదం.

‘‘ప్రమాదకరంగా జీవించండి’’ అని నేనంటున్నానంటే అర్థం శారీరకపరమైన ప్రమాదాలలో మాత్రమే కాకుండా, మానసికపరమైన, చివరికి ఆధ్యాత్మికమైన ప్రమాదాలలో కూడా జీవించండి అని.

ధార్మికతలో జీవించడం ఆధ్యాత్మికపరమైన ప్రమాదం. అది మిమ్మల్ని చాలా ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. కానీ, మీరు అక్కడినుంచి వెనక్కి రాలేకపోవచ్చు. దాని బుద్ధుడు ‘అనగమి’ (వెనక్కి రాలేనివాడు) అంటాడు. ఎందుకంటే, ధార్మికతలో మీరు వెనక్కి రాలేనంత ఉన్నత శిఖరాలకు చేరుకోవడం జరుగుతుంది. అదే ఆధ్యాత్మికపరమైన ప్రమాదం.

మామూలు మేయర్‌గానో, కార్పొరేషన్ సభ్యునిగానో లేదా ఒక మంత్రిగానో జీవించకండి. పేరు, ప్రతిష్ఠ, గౌరవ మర్యాదలు, చాలా డబ్బు, అనేక సౌకర్యాలతో అది పరిపూర్ణంగానే ఉండవచ్చు. అంతమాత్రాన అదే జీవితం కాదు. మహాఅయితే మీరు చనిపోగానే పెద్ద ఊరేగింపు జరగవచ్చు, వార్తాపత్రికలలో మీ ఫొటోలు ప్రచురించవచ్చు. మీ గురించి సంపాదకీయాలు రాయవచ్చు. తరువాత అందరూ మిమ్మల్ని మర్చిపోవచ్చు.

ఇలాంటి అతి సాధారణ లౌకిక విషయాలకోసమా మీరు మీ జీవితాన్ని పణంగా పెట్టారు. అవి అర్థంలేనివని నేను చెప్పట్లేదు. అవి అర్థవంతమైనవే. కానీ, అవి మీరనుకున్నంత అర్థవంతమైనవి కావని నేనంటాను. అలాంటి స్వల్ప విషయాలకు అంతగా ప్రాముఖ్యత ఇవ్వకపోవడమే ఆధ్యాత్మికత అంటే.

డబ్బు, ఇల్లు, వాహనం-ఇలాంటి వసతులు, సౌకర్యాలు జీవితానికి అవసరమే. కానీ, అవి అవసరానికి తగినంత ఉంటే సరిపోతుంది. అంతేకానీ, అవే జీవిత పరమార్థం కాకూడదు. దీనిని తప్పుగా అర్థం చేసుకోకండి.

ఉదాహరణకు, ఇల్లు మనకు అవసరం కానీ, ఇంటికి మనం అవసరం కాకూడదు. కానీ, కొందరు ‘‘వారే ఇంటికి అవసరం’’అన్నట్లుగా దాని కోసమే కష్టపడుతూ బతుకుతారు. అలాగే కొందరు ‘‘తాము లేకపోతే బ్యాంకుల్లో డబ్బే ఉండదు’’అన్నట్లుగా చాలా కష్టపడి సంపాదించడం కోసమే బతుకుతూ, చివరికి మరణిస్తారే కానీ, ఒక్క క్షణమైనా హాయిగా ఎప్పుడూ జీవించరు.

ఇలాంటివన్నీ చెప్పే నేను, మీ కొంపలుకూల్చి హిమాలయాలకు పారిపోవాలని కోరుకునే సన్యాసిని కాను. కాబట్టి, మనుషుల్ని గమనిస్తే అంతా తలకిందులుగా ఉన్నట్లనిపిస్తుంది.

డబ్బు, ఇళ్ళు, భూములు, పదవులు, కీర్తి, ప్రతిష్ఠ, అధికారాలు- ఇలా కేవలం లౌకిక సుఖాలు, అవసరాల బంధనాలలో అందరూ భద్రంగా బతుకుతూ మరణిస్తున్నారే తప్ప, జీవన వాహినిలో ఒక్క క్షణమైనా ఎవరూ హాయిగా జీవించట్లేదు.

🌹 🌹 🌹 🌹 🌹

21 Jan 2021

దేవాపి మహర్షి బోధనలు - 9

🌹. దేవాపి మహర్షి బోధనలు - 9 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 4. అశ్వవిద్య - 1 🌻

ప్రాచీన వేద సంప్రదాయము ఒక మతముగా పరిణమింపక ముందున్న శాస్త్ర కక్ష్యలను పరిశీలించుట అత్యవసరము. అనేక దేవతలు జంతువుల రూపములలో వారి విజ్ఞానము సంకేతింపబడి యున్నది.

అశ్వము, మేషము, విహంగము, చక్రము, పద్మము, సర్పము, హంస ఇత్యాది సంకేతములు వున్నవి. అందు అశ్వమును గూర్చి కొంత పరిశీలింతము.

“అశ్నుతే గమనేన ఇతి అశ్వం” అనగా గమనమున వ్యాపించున దని దీని భావము. కిరణము, అగ్ని ఈ విధమగు వ్యాపనము, గమనము కలిగియున్నవి.

ఇతర జీవుల గమనము నందున్నప్పుడు వ్యాపన ముండదు. వ్యాపనము నందున్నప్పుడు గమనముండదు. గమనము, వ్యాపనము రెండూ కలిగియుండుట దైవీ లక్షణము. చైతన్య మట్టిది. గుఱ్ఱము సంకేతముగ ఈ విద్యను అశ్వవిద్యగ వేద ఋషులు బోధించిరి.

“శ్వ” అనగా రేపు, నిన్న. “అశ్వ” అనగా రేపు నిన్న కానిది. అనగా నేడు. భవిష్యత్తు, భూతములుగాక ఉన్న కాలమును అశ్వమని ఋషులు చమత్కరించిరి. అనగా ప్రస్తుతము, వర్తమానము, నిత్యనూతనమగు ప్రాణశక్తి అని అర్థము. జ్ఞానము అని కూడా అర్థము.

అనుభవవైకమగు ప్రాణశక్తి అని అర్థము. వేద వాజ్మయమున అశ్వము అనగా తేజోమయము, విజ్ఞానమయము, కామగమనము, నిత్యగమనము, కాలస్వరూపము గల ఒక దేవత.

పంచభూతములు శరీరముగ సృష్టి అగుట, శరీరము పంచభూతములుగ లయమగుట అను సంచయ లయ శక్తులకు మూలకారణమై అంగములయందు నిహితమైన ప్రాణాగ్నిని అశ్వత్థము అని చెప్పుదురు. అశ్వరూపమున అగ్ని అంగములయందు వుండుటచే అశ్వత్థము అనిరి.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

21 Jan 2021

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 169

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 169 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మను తెలుసుకొను విధము - 99 🌻

భగవద్గీతలో కూడా ఈ మాయ ఎలా ఉన్నది అంటే, దుమ్ము పట్టినటువంటి అద్దం ఎలా ఉందో, శిశువు చుట్టూ మావి ఎలా ఉందో....’ధూమేన వ్రియతే వహ్నిః యథా దీపో మలేనచ’ అనేటటువంటి పద్ధతిగా...

పొగచేత నిప్పు, మావి చేత శిశువు... దుమ్ము ధూళి చేత అద్దము కప్పబడినప్పడు వాటి యొక్క వాస్తవికమైనటువంటి స్థితిని, నువ్వు ఎట్లా గుర్తించ లేవో, అట్లా త్రిగుణ మాలిన్యము అనేటటువంటి జీవభావము గనుక ఆవరించి ఉన్నట్లయితే, శరీర తాదాత్మ్యత భావన గనుక నిన్ను ఆవరించి ఉన్నట్లయితే, కర్తృత్వ, భోక్తృత్వ అభిమానములు గనుక ఆవరించి ఉన్నట్లయితే,

శరీర త్రయము, దేహత్రయము, గుణత్రయము, అవస్థాత్రయము... వంటి త్రిపుటులకు సంబంధించిన మాలిన్యము అంతా ఆవరించి ఉన్నట్లయితే, నీవు యథార్థమైనటువంటి పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందలేవు. పొందాలి అంటే ఈ మాలిన్యాన్నీ తొలగించుకోవాలి. కాబట్టి, ధ్యానము అంటే అర్థం ఏమిటంటే? ఈ త్రిగుణ మాలిన్యమును తొలిగించుకోవడమే, ఈ శుద్ధ అంతఃకరణాన్ని పొందగలగడమే ధ్యానము అంటే.

కాబట్టి, ‘ధ్యాన సాధన’ చేసేవారందరూ తప్పక గుర్తించవలసిన అంశం ఏమిటంటే, వారు వారివారి మనోఫలకం మీద ఏ రకమైనటువంటి ఆలోచనలు వచ్చినప్పటికి, ఏ రకమైనటువంటి దృశ్యములు ఏర్పడినప్పటికి, ఏ రకమైనటువంటి భావములు ఏర్పడినప్పటికి, ఏ రకమైనటువంటి తాదాత్మ్యత స్థితులు ఏర్పడినప్పటికి, వాటికి ఔననక, కాదనక ఉపేక్షించి ఉండి, సాక్షీ భావం వహించి, ఉదాసీన వైఖరిని అవలంబించి, ఊరక చూస్తూ ఉండాలి. ఇట్లు చూస్తూ ఉండగలిగేటటువంటి సమర్థత చేత, ప్రతి దినము తన మనోమాలిన్యాన్ని తానే శుద్ధి చేసుకోగలిగేటటువంటి సమర్థత సంపాదిస్తారు.

ముఖ్యముగా చతుస్సంధ్యలలో మిమ్మల్ని చెయ్యమన్నటువంటి సాధన వలన, ఏ సంధ్యకి ఆ సంధ్యే ఆ మధ్యకాలంలో ఏర్పడేటటువంటి మనోమాలిన్యా్న్ని, ఆ ధ్యానకాలంలోనే తొలిగించి వేసేటటువంటి సత్కర్మ, సత్‌ క్రతువు చేస్తూ ఉంటాము. ఈ ఆంతరిక యజ్ఞాన్ని ప్రతి ఒక్కరూ చేయాలి. ఇట్లా ఎవరైతే చతుస్సంధ్యలలో చేసి, జాగ్రత్‌ స్వప్న సుషుప్త్యావస్థలలో ఆయా అవస్థల ప్రభావం చేత ఏర్పడినటువంటి విషయ తాదాత్మ్యత మాలిన్యాన్ని,

ఎవరైతే తొలగించుకుంటూ ఉంటారో, ఏ రోజుకారోజే ప్రారబ్ద కర్మ విశేష ఫలాన్ని, ఆగామి కర్మగా మారకుండా అనుభవిస్తూ ఉంటారో, అనంతమైనటువంటి సంచిత కర్మరాశిని దగ్ధం చేసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాగ్నిని సముపార్జిస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే హృద్ గుహలో ఈ పరమాత్మని అనగా ప్రత్యగాత్మ రూప పరమాత్మని సాక్షాత్కారింప చేసుకుంటారు.

కాబట్టి, మౌళికమైనటువంటి, ప్రధానమైనటువంటి సాధనని తప్పక ప్రతి ఒక్కరూ ఆచరించాలి.

ఆచరణ శీలురైనటువంటి వారుమాత్రమే, మనన శీలురైన వాళ్ళు మాత్రమే, శ్రవణ, మనన, నిధి ధ్యాస పరులు మాత్రమే, నిరంతరాయముగా కొనసాగించేటటువంటి సాధన వలన మాత్రమే, నిరంతరాయముగా నీ జీవితములో ఏర్పడుచున్న ఐదైదులు ఇరవైఐదు ఇంద్రియములు, పిండాండ పంచీకరణలో ఉన్నటువంటి వాటిని సాధన దృష్ట్యా... ఏ ఏ ఇంద్రియ స్థానంలో త్రిగుణ మాలిన్యము ఏర్పడుతుందో, గుర్తించి, గ్రహించి, ఆయా త్రిగుణ మాలిన్యమునకు అతీతముగా వ్యవహరించేటటువంటి నైపుణ్యాన్ని నువ్వు బుద్ధి సూక్ష్మత ద్వారా సాధించాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి సాధన.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

21 Jan 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 242, 243 / Vishnu Sahasranama Contemplation - 242, 243

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 242, 243 / Vishnu Sahasranama Contemplation - 242, 243 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻242. సత్కృతః, सत्कृतः, Satkr̥taḥ🌻

ఓం సత్కృతాయ నమః | ॐ सत्कृताय नमः | OM Satkr̥tāya namaḥ

సత్కృతః, सत्कृतः, Satkr̥taḥ

పూజితై రపి పూజితః పూజితులగు బ్రహ్మేంద్రాదులచేత గూడ పూజించబడువాడు.

:: పోతన భాగవతము - అష్టమ స్కంధము (వామన చరితము)::

సీ. యోగమార్గంబున నూహించి బహువిధ పుష్పదామంబులఁ బూజజేసి

దివ్యగంధంబులు తెచ్చి సమర్పించి ధూపదీపములఁ దోడ్తోడ నిచ్చి

భూరి లాజాక్షతంబులు సల్లి ఫలములు గానిక లిచ్చి రాగములఁ బొగడి

శంఖాదిరవముల జయ ఘోషములు వేసి 'కరుణాంబునిధి! త్రివిక్రమ' యటంచు

తే. బ్రహ్మమొదలు లోకపాలురు గొనియాడి; రెల్ల దిశల వనచరేశ్వరుండు

జంబవంతుఁ డరిగి చాటె భేరీధ్వని, వెలయఁ జేసి విష్ణు విజయ మనుచు. (632)

లోకాలను పాలించే బ్రహ్మాదులు మహావిష్ణువును యోగమార్గంలో ఊహించి పలువిధాలైన పూలమాలలతో పూజించినారు. మేలైన సుగంధ వస్తువులూ, ధూపదీపాలనూ సమర్పించినారు. పేలాలనూ, అక్షతలనూ చల్లినారు. ఫలాలను కానుక పెట్టినారు. సంతోషంతో పొగడినారు. శంఖాలను ఊదినారు. 'జయ జయ' నాదాలు చేసినారు. 'కరుణాసముద్రా! త్రివిక్రమ దేవా!' అని కొనియాడినారు. భల్లూకరాజైన జాంబవంతుడు అన్ని దిక్కులలో డంకా మ్రోగించుతూ "విష్ణుదేవుని విజయాన్ని" చాటినాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 242🌹

📚. Prasad Bharadwaj

🌻242. Satkr̥taḥ🌻

OM Satkr̥tāya namaḥ

Pūjitai rapi pūjitaḥ / पूजितै रपि पूजितः Worshiped even by those who are worshiped.

Śrīmad Bhāgavata - Canto 8, Chapter 21

Brahmādayo lokanāthāḥ svanāthāya samādr̥tāḥ,
Sānugā balimājahruḥ saṅkṣiptātmavibhūtaye. (5)

Toyaiḥ samrhaṇaiḥ sragbhirdivyagandhānulepanaiḥ,
Dhūpairdīpaiḥ surabhibhirlājākṣataphalāṅkuraiḥ. (6)

:: श्रीमद्भागवते अष्टम स्कन्धे एकविंशोऽध्यायः ::

ब्रह्मादयो लोकनाथाः स्वनाथाय समादृताः ।
सानुगा बलिमाजह्रुः सङ्क्षिप्तात्मविभूतये ॥ ५ ॥

तोयैः सम्र्हणैः स्रग्भिर्दिव्यगन्धानुलेपनैः ।
धूपैर्दीपैः सुरभिभिर्लाजाक्षतफलाङ्कुरैः ॥ ६ ॥

Lord Brahmā and all the predominating deities of the various planetary systems began to worship Lord Vāmanadeva, their supreme master, who had reduced Himself from His all-pervading form to His original form. They collected all the ingredients and paraphernalia for this worship.

They worshiped the Lord by offering fragrant flowers, water, pādya and arghya, sandalwood pulp and aguru pulp, incense, lamps, fused rice, unbroken grains, fruits, roots and sprouts. While so doing, they offered prayers indicating the glorious activities of the Lord and shouted "Jaya! Jaya!" They also danced, played instruments, sang, sounded conch-shells and beat kettledrums, in this way worshiping the Lord.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग्विश्वभुग्विभुः ।
सत्कर्तासत्कृतस्साधुर्जह्नुर्नारायणो नरः ॥ २६ ॥

సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః ।
సత్కర్తాసత్కృతస్సాధుర్జహ్నుర్నారాయణో నరః ॥ ౨౬ ॥

Suprasādaḥ prasannātmā viśvadhr̥gviśvabhugvibhuḥ ।
Satkartāsatkr̥tassādhurjahnurnārāyaṇo naraḥ ॥ 26 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 243/ Vishnu Sahasranama Contemplation - 243🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻243. సాధుః, साधुः, Sādhuḥ🌻

ఓం సాధవే నమః | ॐ साधवे नमः | OM Sādhave namaḥ

సాధుః, साधुः, Sādhuḥ

న్యాయ ప్రవృత్తః న్యాయమగు మార్గమున ప్రవర్తిల్లు వాడు. లేదా సాధ్యభేధాన్ సాధయతి సాధ్యములగు వేరు వేరు కార్యములను సాధించువాడు. లేదా ఉపాదానాత్ సాధ్యమాత్రం సాధయతి ఉపాదాన కారణమునుండి సాధించబడదగినదానిని దేనినైనను సాధించు శక్తి కలవాడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 243🌹

📚. Prasad Bharadwaj

🌻243. Sādhuḥ🌻

OM Sādhave namaḥ

Nyāya pravr̥ttaḥ / न्याय प्रवृत्तः As His actions are just, He is Sādhuḥ. Or Sādhyabhedhān sādhayati / साध्यभेधान् साधयति One who achieves all Sādhyas i.e., accomplishes everything that can be accomplisehd. Or Upādānāt sādhyamātraṃ sādhayati / उपादानात् साध्यमात्रं साधयति Realizes things without extraneous aids.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग्विश्वभुग्विभुः ।
सत्कर्तासत्कृतस्साधुर्जह्नुर्नारायणो नरः ॥ २६ ॥

సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః ।
సత్కర్తాసత్కృతస్సాధుర్జహ్నుర్నారాయణో నరః ॥ ౨౬ ॥

Suprasādaḥ prasannātmā viśvadhr̥gviśvabhugvibhuḥ ।
Satkartāsatkr̥tassādhurjahnurnārāyaṇo naraḥ ॥ 26 ॥

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

21 Jan 2021

21-JANUARY-2021 MESSAGES

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 616 / Bhagavad-Gita - 616🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 242, 243 / Vishnu Sahasranama Contemplation - 242, 243🌹
3) 🌹 Daily Wisdom - 35🌹
4) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 169🌹
5) 🌹 Guru Geeta - Datta Vaakya - 190🌹
6) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 9🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 108 / Sri Lalitha Sahasra Namaavali - 108 🌹
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 186 / Sri Lalita Chaitanya Vijnanam - 186🌹
9) 🌹. ఈ ఉన్నత శిఖరాలూ అశాశ్వతాలే 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో ) 🍀
10) 🌹. శ్రీమద్భగవద్గీత - 526 / Bhagavad-Gita - 527🌹 
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 6 / Bhagavad-Gita - 6🌹
సాయినాధ మహిమ్నా స్తోత్రము 

12) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 130🌹  
13) 🌹. శివ మహా పురాణము - 330🌹 
14) 🌹 Light On The Path - 83🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 215🌹 
16) 🌹 Seeds Of Consciousness - 279 🌹   
17) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 154🌹
18) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 10 / Lalitha Sahasra Namavali - 10🌹 
19) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 10 / Sri Vishnu Sahasranama - 10🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 616 / Bhagavad-Gita - 616 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 33 🌴*

33. ధృత్వా యయా ధారయతే మన:ప్రాణేన్ద్రియక్రియా: |
యోగేనావ్యభిచారిణ్యే ధృతి: సా పార్థ సాత్త్వికీ ||

🌷. తాత్పర్యం : 
ఓ పృథాకుమారా! అవిచ్చిన్నమైనదియు, యోగాభ్యాసముచే స్థిరముగా కొనసాగునదియు, తత్కారణముగా ఇంద్రియ, మనో, ప్రాణముల కార్యములను నియమించునదియు నైన నిశ్చయము సత్త్వగుణప్రధానమైనది.

🌷. భాష్యము :
దేవదేవుడైన శ్రీకృష్ణుని అవగాహనము చేసికొనుట యోగము ఒక మార్గము వంటిది. ఇంద్రియ, మనో, ప్రాణముల కార్యములను సంపూర్ణముగా కేంద్రీకరించి ధృఢనిశ్చయముతో అట్టి దేవదేవుని యందు స్థిరముగా లగ్నమైనవాడు కృష్ణభక్తిభావన యందు వర్తించినవాడగును. 

అటువంటి స్థిరనిశ్చయము సత్త్వగుణప్రధానమైనది. కృష్ణభక్తిరసభావితులైనవారు ఎట్టి ఇతర కార్యములచే పెడత్రోవ పట్టరని సూచించుచున్నందున ఈ శ్లోకమునందు “ఆవ్యభిచారిణ్యా” యను పదము ప్రాధాన్యమును సంతరించుకొన్నది.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 616 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 33 🌴*

33. dhṛtyā yayā dhārayate
manaḥ-prāṇendriya-kriyāḥ
yogenāvyabhicāriṇyā
dhṛtiḥ sā pārtha sāttvikī

🌷 Translation : 
O son of Pṛthā, that determination which is unbreakable, which is sustained with steadfastness by yoga practice, and which thus controls the activities of the mind, life and senses is determination in the mode of goodness.

🌹 Purport :
Yoga is a means to understand the Supreme Soul. One who is steadily fixed in the Supreme Soul with determination, concentrating one’s mind, life and sensory activities on the Supreme, engages in Kṛṣṇa consciousness. 

That sort of determination is in the mode of goodness. The word avyabhicāriṇyā is very significant, for it indicates that persons who are engaged in Kṛṣṇa consciousness are never deviated by any other activity.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 242, 243 / Vishnu Sahasranama Contemplation - 242, 243 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻242. సత్కృతః, सत्कृतः, Satkr̥taḥ🌻*

*ఓం సత్కృతాయ నమః | ॐ सत्कृताय नमः | OM Satkr̥tāya namaḥ*

సత్కృతః, सत्कृतः, Satkr̥taḥ
పూజితై రపి పూజితః పూజితులగు బ్రహ్మేంద్రాదులచేత గూడ పూజించబడువాడు.

:: పోతన భాగవతము - అష్టమ స్కంధము (వామన చరితము)::
సీ. యోగమార్గంబున నూహించి బహువిధ పుష్పదామంబులఁ బూజజేసి
దివ్యగంధంబులు తెచ్చి సమర్పించి ధూపదీపములఁ దోడ్తోడ నిచ్చి
భూరి లాజాక్షతంబులు సల్లి ఫలములు గానిక లిచ్చి రాగములఁ బొగడి
శంఖాదిరవముల జయ ఘోషములు వేసి 'కరుణాంబునిధి! త్రివిక్రమ' యటంచు
తే. బ్రహ్మమొదలు లోకపాలురు గొనియాడి; రెల్ల దిశల వనచరేశ్వరుండు
జంబవంతుఁ డరిగి చాటె భేరీధ్వని, వెలయఁ జేసి విష్ణు విజయ మనుచు. (632)

లోకాలను పాలించే బ్రహ్మాదులు మహావిష్ణువును యోగమార్గంలో ఊహించి పలువిధాలైన పూలమాలలతో పూజించినారు. మేలైన సుగంధ వస్తువులూ, ధూపదీపాలనూ సమర్పించినారు. పేలాలనూ, అక్షతలనూ చల్లినారు. ఫలాలను కానుక పెట్టినారు. సంతోషంతో పొగడినారు. శంఖాలను ఊదినారు. 'జయ జయ' నాదాలు చేసినారు. 'కరుణాసముద్రా! త్రివిక్రమ దేవా!' అని కొనియాడినారు. భల్లూకరాజైన జాంబవంతుడు అన్ని దిక్కులలో డంకా మ్రోగించుతూ "విష్ణుదేవుని విజయాన్ని" చాటినాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 242🌹*
📚. Prasad Bharadwaj 

*🌻242. Satkr̥taḥ🌻*

*OM Satkr̥tāya namaḥ*

Pūjitai rapi pūjitaḥ / पूजितै रपि पूजितः Worshiped even by those who are worshiped.

Śrīmad Bhāgavata - Canto 8, Chapter 21
Brahmādayo lokanāthāḥ svanāthāya samādr̥tāḥ,
Sānugā balimājahruḥ saṅkṣiptātmavibhūtaye. (5)
Toyaiḥ samrhaṇaiḥ sragbhirdivyagandhānulepanaiḥ,
Dhūpairdīpaiḥ surabhibhirlājākṣataphalāṅkuraiḥ. (6)

:: श्रीमद्भागवते अष्टम स्कन्धे एकविंशोऽध्यायः ::
ब्रह्मादयो लोकनाथाः स्वनाथाय समादृताः ।
सानुगा बलिमाजह्रुः सङ्क्षिप्तात्मविभूतये ॥ ५ ॥
तोयैः सम्र्हणैः स्रग्भिर्दिव्यगन्धानुलेपनैः ।
धूपैर्दीपैः सुरभिभिर्लाजाक्षतफलाङ्कुरैः ॥ ६ ॥ 

Lord Brahmā and all the predominating deities of the various planetary systems began to worship Lord Vāmanadeva, their supreme master, who had reduced Himself from His all-pervading form to His original form. They collected all the ingredients and paraphernalia for this worship.

They worshiped the Lord by offering fragrant flowers, water, pādya and arghya, sandalwood pulp and aguru pulp, incense, lamps, fused rice, unbroken grains, fruits, roots and sprouts. While so doing, they offered prayers indicating the glorious activities of the Lord and shouted "Jaya! Jaya!" They also danced, played instruments, sang, sounded conch-shells and beat kettledrums, in this way worshiping the Lord.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग्विश्वभुग्विभुः ।
सत्कर्तासत्कृतस्साधुर्जह्नुर्नारायणो नरः ॥ २६ ॥
సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః ।
సత్కర్తాసత్కృతస్సాధుర్జహ్నుర్నారాయణో నరః ॥ ౨౬ ॥
Suprasādaḥ prasannātmā viśvadhr̥gviśvabhugvibhuḥ ।
Satkartāsatkr̥tassādhurjahnurnārāyaṇo naraḥ ॥ 26 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 243/ Vishnu Sahasranama Contemplation - 243🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻243. సాధుః, साधुः, Sādhuḥ🌻*

*ఓం సాధవే నమః | ॐ साधवे नमः | OM Sādhave namaḥ*

సాధుః, साधुः, Sādhuḥ

న్యాయ ప్రవృత్తః న్యాయమగు మార్గమున ప్రవర్తిల్లు వాడు. లేదా సాధ్యభేధాన్ సాధయతి సాధ్యములగు వేరు వేరు కార్యములను సాధించువాడు. లేదా ఉపాదానాత్ సాధ్యమాత్రం సాధయతి ఉపాదాన కారణమునుండి సాధించబడదగినదానిని దేనినైనను సాధించు శక్తి కలవాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 243🌹*
📚. Prasad Bharadwaj 

*🌻243. Sādhuḥ🌻*

*OM Sādhave namaḥ*

Nyāya pravr̥ttaḥ / न्याय प्रवृत्तः As His actions are just, He is Sādhuḥ. Or Sādhyabhedhān sādhayati / साध्यभेधान् साधयति One who achieves all Sādhyas i.e., accomplishes everything that can be accomplisehd. Or Upādānāt sādhyamātraṃ sādhayati / उपादानात् साध्यमात्रं साधयति Realizes things without extraneous aids.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग्विश्वभुग्विभुः ।
सत्कर्तासत्कृतस्साधुर्जह्नुर्नारायणो नरः ॥ २६ ॥
సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః ।
సత్కర్తాసత్కృతస్సాధుర్జహ్నుర్నారాయణో నరః ॥ ౨౬ ॥
Suprasādaḥ prasannātmā viśvadhr̥gviśvabhugvibhuḥ ।
Satkartāsatkr̥tassādhurjahnurnārāyaṇo naraḥ ॥ 26 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 35 🌹*
*🍀 📖 Philosophy of Yoga 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 4. Life in Itself is Neither Inward nor Outward 🌻*

Our life, whether it is inner or outer, consists of a series. It is not a solid substance. Our existence is not like a hard stone which is immovable and motionless. It is a flux, a series of tendencies, movements, enterprises, etc., which get practically bifurcated into the inward and the outward phases. 

Life in itself is neither inward nor outward. It is everywhere. But for convenience’s sake we make this distinction of being inside and outside, just as we say we are inside the room. But this ‘inside’ idea arises on account of the wall around; if the wall were not to be there, we would not say that we are inside. 

We are just on the surface of the Earth, but because there is a consciousness of walls on the four sides, there is also a consciousness of an inside and conversely a consciousness of an outside. 

There is really no such thing as inner life and outer life, just as there is really no inside or outside, unless there is a wall which separates the inside from the outside.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 169 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మను తెలుసుకొను విధము - 99 🌻*

భగవద్గీతలో కూడా ఈ మాయ ఎలా ఉన్నది అంటే, దుమ్ము పట్టినటువంటి అద్దం ఎలా ఉందో, శిశువు చుట్టూ మావి ఎలా ఉందో....’ధూమేన వ్రియతే వహ్నిః యథా దీపో మలేనచ’ అనేటటువంటి పద్ధతిగా... 

పొగచేత నిప్పు, మావి చేత శిశువు... దుమ్ము ధూళి చేత అద్దము కప్పబడినప్పడు వాటి యొక్క వాస్తవికమైనటువంటి స్థితిని, నువ్వు ఎట్లా గుర్తించ లేవో, అట్లా త్రిగుణ మాలిన్యము అనేటటువంటి జీవభావము గనుక ఆవరించి ఉన్నట్లయితే, శరీర తాదాత్మ్యత భావన గనుక నిన్ను ఆవరించి ఉన్నట్లయితే, కర్తృత్వ, భోక్తృత్వ అభిమానములు గనుక ఆవరించి ఉన్నట్లయితే, 

శరీర త్రయము, దేహత్రయము, గుణత్రయము, అవస్థాత్రయము... వంటి త్రిపుటులకు సంబంధించిన మాలిన్యము అంతా ఆవరించి ఉన్నట్లయితే, నీవు యథార్థమైనటువంటి పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందలేవు. పొందాలి అంటే ఈ మాలిన్యాన్నీ తొలగించుకోవాలి. కాబట్టి, ధ్యానము అంటే అర్థం ఏమిటంటే? ఈ త్రిగుణ మాలిన్యమును తొలిగించుకోవడమే, ఈ శుద్ధ అంతఃకరణాన్ని పొందగలగడమే ధ్యానము అంటే.
        
కాబట్టి, ‘ధ్యాన సాధన’ చేసేవారందరూ తప్పక గుర్తించవలసిన అంశం ఏమిటంటే, వారు వారివారి మనోఫలకం మీద ఏ రకమైనటువంటి ఆలోచనలు వచ్చినప్పటికి, ఏ రకమైనటువంటి దృశ్యములు ఏర్పడినప్పటికి, ఏ రకమైనటువంటి భావములు ఏర్పడినప్పటికి, ఏ రకమైనటువంటి తాదాత్మ్యత స్థితులు ఏర్పడినప్పటికి, వాటికి ఔననక, కాదనక ఉపేక్షించి ఉండి, సాక్షీ భావం వహించి, ఉదాసీన వైఖరిని అవలంబించి, ఊరక చూస్తూ ఉండాలి. ఇట్లు చూస్తూ ఉండగలిగేటటువంటి సమర్థత చేత, ప్రతి దినము తన మనోమాలిన్యాన్ని తానే శుద్ధి చేసుకోగలిగేటటువంటి సమర్థత సంపాదిస్తారు.
         
ముఖ్యముగా చతుస్సంధ్యలలో మిమ్మల్ని చెయ్యమన్నటువంటి సాధన వలన, ఏ సంధ్యకి ఆ సంధ్యే ఆ మధ్యకాలంలో ఏర్పడేటటువంటి మనోమాలిన్యా్న్ని, ఆ ధ్యానకాలంలోనే తొలిగించి వేసేటటువంటి సత్కర్మ, సత్‌ క్రతువు చేస్తూ ఉంటాము. ఈ ఆంతరిక యజ్ఞాన్ని ప్రతి ఒక్కరూ చేయాలి. ఇట్లా ఎవరైతే చతుస్సంధ్యలలో చేసి, జాగ్రత్‌ స్వప్న సుషుప్త్యావస్థలలో ఆయా అవస్థల ప్రభావం చేత ఏర్పడినటువంటి విషయ తాదాత్మ్యత మాలిన్యాన్ని, 

ఎవరైతే తొలగించుకుంటూ ఉంటారో, ఏ రోజుకారోజే ప్రారబ్ద కర్మ విశేష ఫలాన్ని, ఆగామి కర్మగా మారకుండా అనుభవిస్తూ ఉంటారో, అనంతమైనటువంటి సంచిత కర్మరాశిని దగ్ధం చేసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాగ్నిని సముపార్జిస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే హృద్ గుహలో ఈ పరమాత్మని అనగా ప్రత్యగాత్మ రూప పరమాత్మని సాక్షాత్కారింప చేసుకుంటారు.
        కాబట్టి, మౌళికమైనటువంటి, ప్రధానమైనటువంటి సాధనని తప్పక ప్రతి ఒక్కరూ ఆచరించాలి. 

ఆచరణ శీలురైనటువంటి వారుమాత్రమే, మనన శీలురైన వాళ్ళు మాత్రమే, శ్రవణ, మనన, నిధి ధ్యాస పరులు మాత్రమే, నిరంతరాయముగా కొనసాగించేటటువంటి సాధన వలన మాత్రమే, నిరంతరాయముగా నీ జీవితములో ఏర్పడుచున్న ఐదైదులు ఇరవైఐదు ఇంద్రియములు, పిండాండ పంచీకరణలో ఉన్నటువంటి వాటిని సాధన దృష్ట్యా... ఏ ఏ ఇంద్రియ స్థానంలో త్రిగుణ మాలిన్యము ఏర్పడుతుందో, గుర్తించి, గ్రహించి, ఆయా త్రిగుణ మాలిన్యమునకు అతీతముగా వ్యవహరించేటటువంటి నైపుణ్యాన్ని నువ్వు బుద్ధి సూక్ష్మత ద్వారా సాధించాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి సాధన.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 9 🌹* 
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 4. అశ్వవిద్య - 1 🌻*

ప్రాచీన వేద సంప్రదాయము ఒక మతముగా పరిణమింపక ముందున్న శాస్త్ర కక్ష్యలను పరిశీలించుట అత్యవసరము. అనేక దేవతలు జంతువుల రూపములలో వారి విజ్ఞానము సంకేతింపబడి యున్నది. 

అశ్వము, మేషము, విహంగము, చక్రము, పద్మము, సర్పము, హంస ఇత్యాది సంకేతములు వున్నవి. అందు అశ్వమును గూర్చి కొంత పరిశీలింతము.

“అశ్నుతే గమనేన ఇతి అశ్వం” అనగా గమనమున వ్యాపించున దని దీని భావము. కిరణము, అగ్ని ఈ విధమగు వ్యాపనము, గమనము కలిగియున్నవి. 

ఇతర జీవుల గమనము నందున్నప్పుడు వ్యాపన ముండదు. వ్యాపనము నందున్నప్పుడు గమనముండదు. గమనము, వ్యాపనము రెండూ కలిగియుండుట దైవీ లక్షణము. చైతన్య మట్టిది. గుఱ్ఱము సంకేతముగ ఈ విద్యను అశ్వవిద్యగ వేద ఋషులు బోధించిరి.

“శ్వ” అనగా రేపు, నిన్న. “అశ్వ” అనగా రేపు నిన్న కానిది. అనగా నేడు. భవిష్యత్తు, భూతములుగాక ఉన్న కాలమును అశ్వమని ఋషులు చమత్కరించిరి. అనగా ప్రస్తుతము, వర్తమానము, నిత్యనూతనమగు ప్రాణశక్తి అని అర్థము. జ్ఞానము అని కూడా అర్థము. 

అనుభవవైకమగు ప్రాణశక్తి అని అర్థము. వేద వాజ్మయమున అశ్వము అనగా తేజోమయము, విజ్ఞానమయము, కామగమనము, నిత్యగమనము, కాలస్వరూపము గల ఒక దేవత. 

పంచభూతములు శరీరముగ సృష్టి అగుట, శరీరము పంచభూతములుగ లయమగుట అను సంచయ లయ శక్తులకు మూలకారణమై అంగములయందు నిహితమైన ప్రాణాగ్నిని అశ్వత్థము అని చెప్పుదురు. అశ్వరూపమున అగ్ని అంగములయందు వుండుటచే అశ్వత్థము అనిరి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. ఈ ఉన్నత శిఖరాలూ అశాశ్వతాలే 🌹*
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో ) 🍀*

ప్రవహించే నదిలా, ఆకాశంలో ఎగిరే పక్షిలా స్వేచ్ఛగా జీవిస్తారు. అలా జీవించే క్షణంలో భార్య, భర్త, కుటుంబం సమాజం, భద్రత, గౌరవ మర్యాదలు- ఇలా అన్నీ క్రమక్రమంగా కనుమరుగవుతూ, చివరికి పూర్తిగా క్షీణించి అదృశ్యమవుతాయి. అపుడు మీరు ఒంటరిగా మిగిలిపోతారు.

అందుకే అందరికీ ఫార్ములా- 1 కార్ల పోటీ, గ్లైడింగ్ (గాలిపటంలా ఆకాశంలో ఎగరడం), సర్ఫింగ్ (సముద్ర కెరటాలపై విహరించడం) లాంటి ప్రమాదంతో కూడుకున్న ఆటలపై ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. 

అందువల్ల ఆ ప్రమాదాలనుంచి తప్పించుకునే మార్గాలను మీరు చక్కగా నేర్చుకుంటారు. అలా వాటిలో మీ నైపుణ్యం పెరుగుతుంది. అపుడు అవి మీకు అంత ప్రమాదకరమైనవిగా కనిపించవు. అందువల్ల మీరు ఆ ప్రమాదాలను ఏ మాత్రం పట్టించుకోకుండా ముందుకు దూసుకుపోతారు. చూసేవారికి మాత్రమే అవి ప్రమాదకరంగా కనిపిస్తాయి. ఒకవేళ వాటిలో ప్రమాదమున్నప్పటికీ అది చాలా స్వల్పంగా, కేవలం శరీరానికి సంబంధించినంత వరకే వుంటుంది. 

అందుకే అవి అందరూ అనుకుంటున్నంత ప్రమాదకరమైనవి కావని నేనంటాను.
ధార్మికతలో జీవించడం ఆధ్యాత్మికపరమైన ప్రమాదం. ఎందుకంటే ధార్మికతలో మీరు వెనక్కి రాలేనంత ఉన్నత శిఖరాలకు చేరుకోవడం జరుగుతుంది. అదే ఆధ్యాత్మికపరమైన ప్రమాదం.

‘‘ప్రమాదకరంగా జీవించండి’’ అని నేనంటున్నానంటే అర్థం శారీరకపరమైన ప్రమాదాలలో మాత్రమే కాకుండా, మానసికపరమైన, చివరికి ఆధ్యాత్మికమైన ప్రమాదాలలో కూడా జీవించండి అని.

ధార్మికతలో జీవించడం ఆధ్యాత్మికపరమైన ప్రమాదం. అది మిమ్మల్ని చాలా ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. కానీ, మీరు అక్కడినుంచి వెనక్కి రాలేకపోవచ్చు. దాని బుద్ధుడు ‘అనగమి’ (వెనక్కి రాలేనివాడు) అంటాడు. ఎందుకంటే, ధార్మికతలో మీరు వెనక్కి రాలేనంత ఉన్నత శిఖరాలకు చేరుకోవడం జరుగుతుంది. అదే ఆధ్యాత్మికపరమైన ప్రమాదం.

మామూలు మేయర్‌గానో, కార్పొరేషన్ సభ్యునిగానో లేదా ఒక మంత్రిగానో జీవించకండి. పేరు, ప్రతిష్ఠ, గౌరవ మర్యాదలు, చాలా డబ్బు, అనేక సౌకర్యాలతో అది పరిపూర్ణంగానే ఉండవచ్చు. అంతమాత్రాన అదే జీవితం కాదు. మహాఅయితే మీరు చనిపోగానే పెద్ద ఊరేగింపు జరగవచ్చు, వార్తాపత్రికలలో మీ ఫొటోలు ప్రచురించవచ్చు. మీ గురించి సంపాదకీయాలు రాయవచ్చు. తరువాత అందరూ మిమ్మల్ని మర్చిపోవచ్చు. 

ఇలాంటి అతి సాధారణ లౌకిక విషయాలకోసమా మీరు మీ జీవితాన్ని పణంగా పెట్టారు. అవి అర్థంలేనివని నేను చెప్పట్లేదు. అవి అర్థవంతమైనవే. కానీ, అవి మీరనుకున్నంత అర్థవంతమైనవి కావని నేనంటాను. అలాంటి స్వల్ప విషయాలకు అంతగా ప్రాముఖ్యత ఇవ్వకపోవడమే ఆధ్యాత్మికత అంటే. 

డబ్బు, ఇల్లు, వాహనం-ఇలాంటి వసతులు, సౌకర్యాలు జీవితానికి అవసరమే. కానీ, అవి అవసరానికి తగినంత ఉంటే సరిపోతుంది. అంతేకానీ, అవే జీవిత పరమార్థం కాకూడదు. దీనిని తప్పుగా అర్థం చేసుకోకండి.

ఉదాహరణకు, ఇల్లు మనకు అవసరం కానీ, ఇంటికి మనం అవసరం కాకూడదు. కానీ, కొందరు ‘‘వారే ఇంటికి అవసరం’’అన్నట్లుగా దాని కోసమే కష్టపడుతూ బతుకుతారు. అలాగే కొందరు ‘‘తాము లేకపోతే బ్యాంకుల్లో డబ్బే ఉండదు’’అన్నట్లుగా చాలా కష్టపడి సంపాదించడం కోసమే బతుకుతూ, చివరికి మరణిస్తారే కానీ, ఒక్క క్షణమైనా హాయిగా ఎప్పుడూ జీవించరు.

ఇలాంటివన్నీ చెప్పే నేను, మీ కొంపలుకూల్చి హిమాలయాలకు పారిపోవాలని కోరుకునే సన్యాసిని కాను. కాబట్టి, మనుషుల్ని గమనిస్తే అంతా తలకిందులుగా ఉన్నట్లనిపిస్తుంది.

డబ్బు, ఇళ్ళు, భూములు, పదవులు, కీర్తి, ప్రతిష్ఠ, అధికారాలు- ఇలా కేవలం లౌకిక సుఖాలు, అవసరాల బంధనాలలో అందరూ భద్రంగా బతుకుతూ మరణిస్తున్నారే తప్ప, జీవన వాహినిలో ఒక్క క్షణమైనా ఎవరూ హాయిగా జీవించట్లేదు.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 108 / Sri Lalitha Sahasra Namaavali - 108 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 186 / Sri Lalitha Chaitanya Vijnanam - 186 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*నిస్తులా, నీలచికురా, నిరపాయా, నిరత్యయా |*
*దుర్లభా, దుర్గమా, దుర్గా, దుఃఖహంత్రీ, సుఖప్రదా ‖ 50 ‖*

*🌻 186. 'నిరపాయా' 🌻*

సర్వమును శ్రీమాత ఆధీనమున యుండుటవలన ఆమె ఎట్టి అపాయమును ఎరుగదు. అపాయము ఎవరికి యుండును? తన స్వాధీనము కానిది ఒకటి యున్నప్పుడే కదా! తనకు స్వాధీనము కానిది తనకు ఎదురు తిరుగవచ్చును. జ్ఞానము, అజ్ఞానమూ కూడ ఆమె స్వాధీనముననే యున్నవి. అట్టి శ్రీమాతకు ఆపాయ మెట్లుండును? 

జ్ఞానులు అప్పుడప్పుడు అహంకరించుటచే, సృష్టియందు అపాయము వాటిల్లును. వానిని ఇంద్రుడు, త్రిమూర్తులు ఆదిగాగల దేవతలు నివారింతురు. వారి వశముకానిచో శ్రీమాత నివారించును. ఇట్లే అజ్ఞానులు అహంకరించి లోకములండు అనిశ్చిత నేర్పరచినప్పుడు కూడ శ్రీమాత అట్టి అపాయములను పరిష్కరించును. సృష్టియందు ఏ అపాయమునైననూ నిర్వర్తించు సమర్ధురాలు శ్రీమాత. 

అపాయములు రెండు విధములుగా కలుగవచ్చును. బయట నుండి, లోపలినుండి అపాయము లేర్పడుచుండును. బయట జనించినను, లోపల జయించనివారు అపాయములకు గురియగుదురు. అట్టివారే హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణులు. వారు తమ లోపల జయించకపోవుటవలన అపాయమునకు గురి అయిరి.

అహంకారము, చిత్తము, ఇంద్రియానీకములను జయించిన యోగులు ఎట్టి అపాయమునకు గురికారు. అగస్త్యుడు, వశిష్ఠుడు, గౌతముడు, సనక సనందనాదులు, నారదుడు అట్టివారు. లోపల జయించిననూ బయటినుండి అపాయములు రావచ్చును. శ్రీరాముని జీవితము దానికి తార్కాణము. అట్లే యుధిష్ఠిరుని జీవితము కూడ. లోపల జయించుటచేత, వారు అపాయములకు గురియైననూ, ఆ అపాయములు పరిష్కరింపబడినవి.

భక్తులకు ఈ నామమిచ్చు సందేశ మొకటున్నది. అంతరంగ విజయము నిజమగు విజయమని, బహిరంగ విజయము నిజమగు విజయము కాదని, అంతరంగ విజయము ద్వారా నిరపాయ స్థితిని పొందవచ్చని, శ్రీమాత ఆరాధనము అంతరంగ విజయమునకే ఉద్దేశింప బడవలెనని సందేశము, "అంతర్ముఖ సమారాధ్యా" అని రాబోవు నామమున ఈ విషయము ప్రస్తావనకు రాగలదు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 186 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Nirapāyā निरपाया (186)🌻*

She is without destruction, the prime quality of the Brahman. Apāyā means destruction, death, annihilation. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 6 / Bhagavad-Gita - 6 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 

🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము - 6 🌴

6. యుధామన్యుశ్చ విక్రాన్త ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ |
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథా: ||

🌷. తాత్పర్యం :
పరాక్రమవంతులైన యుధామన్యుడు, శక్తిశాలియైన ఉత్తమౌజుడు, సుభద్రా తనయుడు, ద్రౌపదికుమారులును అందున్నారు. ఈ వీరులందరును మహారథులు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 BhagavadGita As it is - 6 🌹 
✍️ Swamy Bhakthi Vedantha Sri Prabhupada 
📚 Prasad Bharadwaj 

🌴 Chapter 1 - Vishada Yoga - 6 🌴

6. yudhāmanyuś ca vikrānta
uttamaujāś ca vīryavān
saubhadro draupadeyāś ca
sarva eva mahā-rathāḥ

🌷 Translation :
There are the mighty Yudhāmanyu, the very powerful Uttamaujā, the son of Subhadrā and the sons of Draupadī. All these warriors are great chariot fighters.
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 527 / Bhagavad-Gita - 527 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 10 🌴*

10. యతన్తో యోగినశ్చైనం పశ్యన్త్యాత్మన్యవస్థితమ్ |
యతన్తో(ప్యకృతాత్మానో నైనం పశ్యన్త్యచేతస: ||

🌷. తాత్పర్యం : 
ఆత్మానుభవము నందు స్థితిని పొందిన యత్నశీలురైన యోగులు దీనినంతటిని స్పష్టముగా గాంచగలుగుదురు. కాని అచేతసులు మరియు ఆత్మానుభవము నందు స్థితిని పొందినవారు ప్రయత్నించినను ఏమి జరుగుచున్నదో గాంచలేరు.

🌷. భాష్యము :
ఆత్మానుభవమార్గమున పలువురు యోగులున్నను ఆత్మానుభవమునందు స్థితుడు కానివాడు దేహి యొక్క దేహమునందు మార్పులెట్లు కలుగుచున్నవో గాంచలేడు. కనుకనే ఈ విషయమున “యోగిన:” అను పదము మిక్కిలి ప్రాధాన్యమును సంతరించుకొన్నది. 

నేటికాలమున పలువురు నామమాత్ర యోగులు మరియు నామమాత్ర యోగసంఘములున్నను వాస్తవమునకు ఆత్మానుభవ విషయమున వారందరును అంధులై యున్నారు. వారు కేవలము ఏదియోనొక దేహవ్యాయామమునకు అలవాటుపడి, దేహము దృఢముగా మరియు ఆరోగ్యముగా నున్నచో తృప్తినొందుచున్నారు. 

దానికి అన్యమైన విషయము వారికి తెలియదు. అట్టివారే “యతన్తో(ప్యకృతాత్మాన:” యనబడుదురు. వారు అట్టి నామమాత్రయోగమును అభ్యసించినను ఆత్మవిదులు కాజాలరు. వారెన్నడును ఆత్మా యొక్క పునర్జన్మ విధానమును అవగతము చేసికొనజాలరు. 

వాస్తవముగా యోగమునందు నిలిచి ఆత్మ, జగత్తు, శ్రీకృష్ణభగవానుడు అనెడి అంశములను అవగాహన చేసికొనినవారే (అనగా కృష్ణభక్తిభావన యందు విశుద్ధ భక్తియోగమున నియుక్తులైన భక్తియోగులు) ఏది యెట్లు జరుగుచున్నదో అవగతము చేసికొనగలరు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 527 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 15 - Purushothama Yoga - 10 🌴*

10. utkrāmantaṁ sthitaṁ vāpi
bhuñjānaṁ vā guṇānvitam
vimūḍhā nānupaśyanti
paśyanti jñāna-cakṣuṣaḥ

🌷 Translation : 
The foolish cannot understand how a living entity can quit his body, nor can they understand what sort of body he enjoys under the spell of the modes of nature. But one whose eyes are trained in knowledge can see all this.

🌹 Purport :
The word jñāna-cakṣuṣaḥ is very significant. Without knowledge, one cannot understand how a living entity leaves his present body, nor what form of body he is going to take in the next life, nor even why he is living in a particular type of body. This requires a great amount of knowledge understood from Bhagavad-gītā and similar literatures heard from a bona fide spiritual master. 

One who is trained to perceive all these things is fortunate. Every living entity is quitting his body under certain circumstances, he is living under certain circumstances, and he is enjoying under certain circumstances under the spell of material nature. 

As a result, he is suffering different kinds of happiness and distress, under the illusion of sense enjoyment. Persons who are everlastingly fooled by lust and desire lose all power to understand their change of body and their stay in a particular body. They cannot comprehend it. 

Those who have developed spiritual knowledge, however, can see that the spirit is different from the body and is changing its body and enjoying in different ways. A person in such knowledge can understand how the conditioned living entity is suffering in this material existence. 

Therefore those who are highly developed in Kṛṣṇa consciousness try their best to give this knowledge to the people in general, for their conditional life is very much troublesome. They should come out of it and be Kṛṣṇa conscious and liberate themselves to transfer to the spiritual world.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ సాయినాథ మహిమ్న స్తోత్రం 🌹*

సదాసత్స్వ రూపం చిదానంద కందం
జగత్సంభవస్థాన సంహార హేతుం
స్వచాక్తేచ్చయామానుషం దర్శయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

భవద్వాంత విధ్వంస మార్తాండ మీడ్యం
మనోవాగతీతం మునిధ్యాన గమ్యం
జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణత్వాం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

భవాంభోది మగ్నార్థితానాం జనానాం
స్వపాదా శ్రితానాం స్వభక్తి ప్రోయాణాం
సముద్ధారణార్థం కలౌసంభవంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

సదానింబ వృక్షస్య మూలాధి పాసాత్
సుదాస్రావిణం తిక్త మవ్యప్రియంతం
తరుం కల్పవృక్షాధి కంసాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

సదాకల్ప వృక్షస్య తస్యాధిమూలే
భవద్భావ బుద్ధ్యా సపర్యాది సేవాం
నృణాం కుర్యతాం భుక్తి ముక్తి ప్రదంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

అనేకాశ్రుతా తర్క్య లీలావిలాసైహః
సమానిష్కృతేశాన భాస్వత్ప్రాభావ
అహంభావ హీనం ప్రసన్నాత్మభావం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

సతాంనిశ్ర మరామమే వాభిరామం
సపదాజ్జనైః సంస్తుతం సన్నమద్భిః
జనామోదకం భక్త భద్రప్రదంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

అజన్మాద్యమేకం పరబ్రహ్మ సాక్షాత్
స్వయం సంభవం రామమే నాపతీర్థం
భవద్దర్శనాత్సం పునీతః ప్రభోహం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

🌹🌼🌷🌼🕉🌼🌷🌼🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹