1) 🌹 08, MAY 2023 MONDAY సోమవారం, ఇందు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 367 / Bhagavad-Gita - 367 🌹 🌴 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం / Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 29 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 214 / Agni Maha Purana - 214 🌹
🌻. దేవతా ప్రతిష్ఠా కథనము. - 2 / Mode of installation of other Gods and Goddesses - 2 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 079 / DAILY WISDOM - 079 🌹
🌻 19. సంపూర్ణత యొక్క అనుభూతి ప్రియమైనది / 19. What is Dear is the Condition of Completeness 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 344 🌹
6) 🌹. శివ సూత్రములు - 81 / Siva Sutras - 81 🌹
🌻 2-03. విద్య శరీర సత్త మంత్రం రహస్యం - 1 / 2-03. Vidyā śarīra sattā mantra rahasyam - 1 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 08, మే, May 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : సంకష్ఠి చతుర్థి, Sankashti Chaturthi 🌻*
*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 31 🍀*
*61. గండలీ మేరుధామా చ దేవాధిపతిరేవ చ |*
*అథర్వశీర్షః సామాస్య ఋక్సహస్రామితేక్షణః*
*62. యజుః పాదభుజో గుహ్యః ప్రకాశో జంగమస్తథా |*
*అమోఘార్థః ప్రసాదశ్చ అభిగమ్యః సుదర్శనః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : ఈశ్వర ప్రేమ సాధకుని అధికార సంపత్తి - ఈశ్వరుని ప్రేమ గంభీరము, విశాలము, నీరవము. దానిని నీవు గుర్తెరిగి దానిచే ప్రభావితుడవు కావాలంటే, శాంతుడవు. విశాలుడవు కావడం అవసరం. దానికి సర్వ సమర్పణ మొనర్చుకొని, దాని ఉపకరణం కావడానికి నీవు సిద్ధ పడినప్పుడు, అదే నిన్ను ఎలా మలచుకోవాలో అలా మలచుకొంటుంది. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వసంత ఋతువు, ఉత్తరాయణం,
వైశాఖ మాసం
తిథి: కృష్ణ తదియ 18:20:09 వరకు
తదుపరి కృష్ణ చవితి
నక్షత్రం: జ్యేష్ఠ 19:11:09
వరకు తదుపరి మూల
యోగం: శివ 24:09:31 వరకు
తదుపరి సిధ్ధ
కరణం: వణిజ 07:19:07 వరకు
వర్జ్యం: 01:42:12 - 03:13:24
మరియు 26:42:40 - 28:13:00
దుర్ముహూర్తం: 12:38:22 - 13:29:48
మరియు 15:12:39 - 16:04:05
రాహు కాలం: 07:23:23 - 08:59:49
గుళిక కాలం: 13:49:05 - 15:25:30
యమ గండం: 10:36:14 - 12:12:39
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:37
అమృత కాలం: 10:49:24 - 12:20:36
సూర్యోదయం: 05:46:57
సూర్యాస్తమయం: 18:38:21
చంద్రోదయం: 21:29:16
చంద్రాస్తమయం: 07:40:51
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు: పద్మ యోగం - ఐశ్వర్య
ప్రాప్తి 19:11:09 వరకు తదుపరి లంబ
యోగం - చికాకులు, అపశకునం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 367 / Bhagavad-Gita - 367 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 29 🌴*
*29. సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియ: |*
*యే భజన్తి తు మాం భక్యా మయి తే తేషు చాప్యహమ్ ||*
🌷. తాత్పర్యం :
*నేనెవరిని ద్వేషింపను, ఎవరి యెడను పక్షపాతమును కలిగియుండను. నేను సర్వుల యెడ సమముగా వర్తింతురు. కాని భక్తితో నాకు సేవనొసగెడివాడు నాకు మిత్రుడై నా యందుండును మరియు నేనును అతనికి మిత్రుడనై యుందును.*
🌷. భాష్యము :
*శ్రీకృష్ణుడు సర్వుల యెడ సమముగా వర్తించువాడైనచో మరియు అతనికి ఎవ్వరును ప్రత్యేక స్నేహితులు కానిచో తన దివ్యసేవలో సదా నిమగ్నులై యుండెడి భక్తుల యెడ ఎందులకై ప్రత్యేకశ్రద్ధ వహించుననెడి ప్రశ్న ఇచ్చట ఉదయించును. కాని వాస్తవమునకు ఇది సహజమేగాని భేదభావము కాదు. ఉదాహరణకు జగమునందు ఎవరేని మనుజుడు గొప్పదాత యని పేరుగాంచినను, తన సంతానము యెడల అతడు ప్రత్యేకశ్రద్ధను కలిగియుండును. అదే విధముగా భగవానుడు వివిధరూపములలో నున్న సర్వజీవులను సంతానముగ భావించి వారి జీవితావాసరమునకు కావలసిన సర్వమును ఉదారముగా సమకూర్చును. భూమియని గాని, కొండయని గాని, జలమని గాని ఎట్టి భేదభావము లేకుండా వర్షమును కురిపించెడి మేఘము వంటివాడు ఆ దేవదేవుడు. కాని తన భక్తుల యెడ మాత్రము అతడు ప్రత్యేకశ్రద్ధను కలిగియుండును.*
*అట్టి భక్తిపరాయణులైనవారే ఈ శ్లోకమునందు పేర్కొనబడినవారు. కృష్ణభక్తిభావనలో సదా నిలిచియుండుటచే ఆ భక్తులు నిత్యము కృష్ణుని యందే స్థితిని కలిగియుందురు. కనుకనే కృష్ణభక్తిభావనము నందున్న మహాత్ములు దివ్యాత్ములై ఆ శ్రీకృష్ణభగవానుని యందు నిలిచియున్నట్టివారని “కృష్ణభక్తిరసభావనము” అనెడి పదము సూచించుచున్నది. తత్కారణముగనే శ్రీకృష్ణుడు “మయితే” (వారు నాయందున్నారు) అని స్పష్టముగా పలికియున్నాడు. అనగా భగవానుడు వారియందున్నాడు. ఇట్టి పరస్పరానుభవమే “యే యథా మామ్ ప్రపద్యన్తే తాం స్తథైవ భజామ్యహమ్” అనెడి భగవానుని వాక్యములను సైతము వివరించును.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 367 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 29 🌴*
*29. samo ’haṁ sarva-bhūteṣu na me dveṣyo ’sti na priyaḥ*
*ye bhajanti tu māṁ bhaktyā mayi te teṣu cāpy aham*
🌷 Translation :
*I envy no one, nor am I partial to anyone. I am equal to all. But whoever renders service unto Me in devotion is a friend, is in Me, and I am also a friend to him.*
🌹 Purport :
*One may question here that if Kṛṣṇa is equal to everyone and no one is His special friend, then why does He take a special interest in the devotees who are always engaged in His transcendental service? But this is not discrimination; it is natural. Any man in this material world may be very charitably disposed, yet he has a special interest in his own children. The Lord claims that every living entity – in whatever form – is His son, and so He provides everyone with a generous supply of the necessities of life. He is just like a cloud which pours rain all over, regardless of whether it falls on rock or land or water. But for His devotees, He gives specific attention. Such devotees are mentioned here: they are always in Kṛṣṇa consciousness, and therefore they are always transcendentally situated in Kṛṣṇa.*
*The very phrase “Kṛṣṇa consciousness” suggests that those who are in such consciousness are living transcendentalists, situated in Him. The Lord says here distinctly, mayi te: “They are in Me.” Naturally, as a result, the Lord is also in them. This is reciprocal. This also explains the words ye yathā māṁ prapadyante tāṁs tathaiva bhajāmy aham: “Whoever surrenders unto Me, proportionately I take care of him.” This transcendental reciprocation exists because both the Lord and the devotee are conscious. When a diamond is set in a golden ring, it looks very nice. The gold is glorified, and at the same time the diamond is glorified. The Lord and the living entity eternally glitter, and when a living entity becomes inclined to the service of the Supreme Lord he looks like gold. The Lord is a diamond, and so this combination is very nice. Living entities in a pure state are called devotees. The Supreme Lord becomes the devotee of His devotees.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 214 / Agni Maha Purana - 214 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 63*
*🌻. దేవతా ప్రతిష్ఠా కథనము. - 2 🌻*
*జ్వాలామాలాసముదాయస్వరూపా! అంతటను వ్యాపించిన అనంతమైన జ్వాలలయొక్క, వజ్రములయొక్కయు, అశనులయొక్కయు సముదాయముచే పాతాలము లన్నింటిని నశింపచేయుము, నశింపచేయము. అంతటను వ్యాపించిన, అనంతమైన జ్వాలలచేతను, వజ్రముల చేతను, శరపంజరముచేతను పాతాళముల నన్నింటిని చుట్టుముట్టుము. సర్వపాతాళములందు నివసించు ఆసురల హృదయములను లాగుము, లాగుము, శీఘ్రముగ కాల్చివేయుము. కాల్చివేయుము. వండుము, వండుము, మథించుము, మంథించుము, ఎండచేయుము, ఎండచేయుము. వారందరును నాకు వశ మగునంతవరకు ఖండించుము, ఖండించుము. "పాతాలేభ్యః ఫట్, అసురేభ్యః ఫట్, మన్త్రరూపేభ్యః ఫట్, మంత్రజాతిభ్యః ఫట్" భగవంతుడవైన, నరసింహ రూపములో నున్న ఓ విష్ణూ! నన్ను సందిగ్ధస్థితి నుండియు, సర్వాపదల నుండియు సర్వమంత్ర రూపములనుండియు రక్షింపుము, రక్షింపుము, "హుం" "ఫట్" నీకు నమస్కారము, నమస్కారము."*
*ఇది శ్రీహరిరూపిణి యగు నృసింహవిద్య, సర్వర్థములను ఒసగునది. త్రైలోక్యమోహన శ్రీవిష్ణుమూర్తి ప్రతిష్ఠత్రైలోక్యమోహనమంత్ర సమూహముతో చేయవలెను. ద్విభుజవిగ్రహమునకు ఎడమ చేతిలో గద, కుడి చేతిలో ఆభయ ముద్ర ఉండవలెను. చతుర్భుజరూప మైనచో పై కుడిచేతిలో చక్రము, పై ఎడమచేతిలో పాంచజన్యము ఉండవలెను. ఈ విగ్రహముతో శ్రీపుష్టులను గాని, బలరామ-సుభద్రలను గాని స్థాపింపవలెను. శ్రీవిష్ణు-వామన-వైకుంఠ-హయగ్రీవ-అనిరుద్ధులను ప్రాసాదములో గాని గృహములో గాని, మండమునందు గాని స్థాపింపవలెను. మత్స్యాద్యవతారములలో జల శయ్యపై స్థాపించి పరుండబెట్టవలెను. సంకర్షణ- విశ్రూప-రుద్రమూర్తిలింగ-అర్ధనారీశ్వర-హరిహార-మాతృకాగణ-భైరవ-సూర్య-గ్రహ-వినాయకులను, ఇంద్రాదులచే సేవింపబడు గౌరిని, చిత్రజను, బలాబలవిద్యను కూడ ఈ విధముగనే స్థాపింపవలెను.*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 214 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 63*
*🌻Mode of installation of other Gods and Goddesses - 2 🌻*
A multitude of cluster of flames! Destroy all nether regions with your disc (showering) flames and thunderbolts in all directions! Besiege the nether regions with your arrows of thunderbolt discharging endless fire! Pull out the hearts of all demons residing in the nether worlds! Burn quickly! Cook! Destroy! Dry up! Hack them to pieces till they have not been subject to my control! Phaṭ to the nether worlds! Phaṭ to the demons! Phaṭ to all kinds of incantations! O Lord of the form of Narasiṃha! Protect me from all doubts! Protect me from all calamities and all incantations! O Viṣṇu! Hum Phaṭ! Salutations to you! This is the spell of Narasiṃha representing Hari (Viṣṇu) which grants all desires.
4. The captivator of the three worlds (trailokyamohana) (the image of the lord) should be installed with the mantras known as trailokyamohana (captivating the three worlds) (described above). (The image) should be made to have two or four arms, holding the mace in the right hand and conferring benediction.
5. The disc should be placed in the upper left arm and the (conch-shell) pāñcajanya on the lower (arm). (The two right hands) should be provided with śrī (riches) and puṣṭi (nourishment) along with strength and welfare.
6. The images of Viṣṇu, Vāmana (dwarf form of Viṣṇu), Vaikuṇṭha, Hayāsya (horse-faced form of Viṣṇu) and Aniruddha should be installed in a shed or house or edifice.
7-9. (The images of) manifestations (of Viṣṇu) (such as) the fish etc. should be installed in waters. (The images of) Saṅkarṣaṇa, Viśvarūpa, liṅga, the form of Rudra, hermaphrodite form (of Śiva) (Ardhanārīśvara), Hari (Viṣṇu), Śaṅkara, Śiva, the divine mothers, Bhairava, Sūrya, the planets, Vināyaka, Gaurī (consort of Śiva) worshipped by Indra and others, Bala and Abala (should also be installed similarly). I shall describe the (mode of) consecration of books [i.e., pustaka-pratiṣṭhā—pustakānāṃ pratiṣṭhāṃ] and the mode of writing them.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 79 / DAILY WISDOM - 79 🌹*
*🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 19. సంపూర్ణత యొక్క అనుభూతి ప్రియమైనది 🌻*
*మీరు ఇష్టపడేది ఏమిటంటే మీకు ఒక వస్తువు స్వాధీనం అయినపుడు మీరు అనుభూతి చెందే ఒక సంపూర్ణత. మీరు ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తించాలి. మీరు ఇష్టపడేది వస్తువు మీదైనపుడు ఆ స్వాధీనత అనే ఊహ మాత్రమే. కానీ ఆ స్థితిని ఎప్పటికీ చేరుకోలేము, దాని కారణంగా ఎంతో ఇప్పటికే పేర్కొన్నాము. కాబట్టి, ఈ ప్రపంచంలో ఏదీ ప్రియమైనది కాదు.*
*మీకు ప్రియమైనది ఏమిటంటే ఆ వస్తువు యొక్క సంపర్కంతో మీలో వచ్చే లేదా రావలనుకునే ఒక అనుభూతి. కాబట్టి, ఈ ప్రపంచంలో ఏ వ్యక్తీ ప్రియమైనవాడు కాదు, కానీ ప్రియమైనది ఏమిటంటే, ఆ వస్తువు మీ స్వాధీనం అయిన తర్వాత మీరు అనుభూతి చెందే లేదా అనుభూతి చెందుతామని ఊహించే ఒక స్థితి. *
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 79 🌹*
*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 19. What is Dear is the Condition of Completeness 🌻*
*What you love is a completeness of being which is reflected in the condition felt to exist between yourself and the object concerned. You must mark this point. What you love is only the condition that you imagine to be present in the state of the possession of the object. But that state can never be reached, for the reason already mentioned. So, nothing is dear in this world.*
*What is dear is the condition which you intend to create, or project in your own being by an imagined contact with the object. So, not one person is dear in this world, but what is dear is that condition which is imagined to be present after the possession of that object or that relationship.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 344 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. రోజుకు ఇరవైనాలుగు గంటలూ నిరంతరం ధ్యానంలో వుంటే తప్ప నువ్వు రూపాంతరం చెందవు. అట్లా వుంటే ఒక రోజు అద్భుతం జరుగుతుంది. అప్పుడు వ్యక్తి ధ్యాన సంబంధమైన చైతన్యంతో నిద్రపోవచ్చు. శరీరం నిద్రపోతుంది. కానీ లోలోతుల్లో చైతన్య స్రవంతి సాగుతుంది. 🍀*
*మన సమస్త శక్తుల్నీ ధ్యానం మీద కేంద్రీకరించకుంటే అది కలగా మిగిలిపోతుంది. యథార్థంగా మారదు. ధ్యానం మన సంపూర్ణతని కోరుతుంది. దాన్ని పాక్షికంగా నిర్వహించలేం. ఎప్పుడో ఒకసారి నిర్వహించలేం. ఉదయాన్నే పదిహేను నిముషాలు సాయంత్రం పదిహేను నిముషాలు చెయ్యడం కుదరదు. రోజుకు ఇరవైనాలుగు గంటలూ నిరంతరం ధ్యానంలో వుంటే తప్ప నువ్వు రూపాంతరం చెందవు.*
*అట్లా వుంటే ఒక రోజు అద్భుతం జరుగుతుంది. అప్పుడు వ్యక్తి ధ్యాన సంబంధమైన చైతన్యంతో నిద్రపోవచ్చు. శరీరం నిద్రపోతుంది. కానీ లోలోతుల్లో చైతన్య స్రవంతి సాగుతుంది. నువ్వు నిద్రపోతున్నావని నీకు తెలుస్తుంది. ఆ స్థాయిలో కొనసాగితే వ్యక్తి ధ్యానంలోనే మరణించవచ్చు. ధ్యానంలో మరణించిన వ్యక్తి మళ్ళీ జన్మించడు. అనంత విశ్వంలో భాగమవుతాడు. మళ్ళీ శరీర చెరసాలకు రాడు.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివ సూత్రములు - 081 / Siva Sutras - 081 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*🌻 2-03. విద్య శరీర సత్త మంత్రం రహస్యం - 1 🌻*
*🌴. మంత్రం యొక్క రహస్యం, జ్ఞానాన్ని చలన శక్తిగా కలిగి ఉన్న దాని శరీరమే. స్వచ్ఛమైన జ్ఞానంతో తన చిత్తాన్ని, మానసిక శరీరాన్ని ప్రకాశింపజేసే యోగి అదే శక్తిని పెంపొందించుకుని మంత్రశక్తిపై ఆధిపత్యం సాధిస్తాడు. 🌴*
*విద్య - పరమ సత్యమైన శివునితో ఏకత్వాన్ని అనుభూతి చెందడానికి అవసరమైన అత్యున్నత జ్ఞానం; శరీర - శారీరక రూపం మరియు ఇక్కడ దీని అర్థం పైన పేర్కొన్న ప్రధాన జ్ఞానం లేదా విద్య; సత్తా - శ్రేష్ఠత; మంత్రం - మంత్రం (సాధారణ మంత్రాలు కాదు, కానీ అత్యున్నత స్వీయ చైతన్యం); రహస్యం – రహస్యం.*
*ఈ సూత్రంలో, అత్యున్నత వాస్తవికతతో ఉన్న అద్వైత జ్ఞానం, అనుభావిక వ్యక్తిలో ఉన్న స్వీయ చైతన్యం యొక్క స్వభావం ద్వారానే బహిర్గతమవుతుంది అని చెప్పబడింది. ఇక్కడ మంత్రం అంటే ద్వంద్వత్వం లేని సారాంశం లేదా పరమ చైతన్యంతో ఏకత్వం. స్థూల మరియు సూక్ష్మ విశ్వాల ఏకత్వాన్ని సాక్షాత్కరించుకోడం ఈ సూత్రంలో వివరించబడింది. అలా గ్రహించడాన్ని మంత్ర రహస్యం అంటారు.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Siva Sutras - 081 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*
*🌻 2-03. Vidyā śarīra sattā mantra rahasyam - 1 🌻*
*🌴. The secret of the mantra is its body which has knowledge as its moving force. A yogi who illuminates his chitta and mental body with pure knowledge develops a similar power and gains lordship over the mantra shaktis. 🌴*
*Vidyā – the highest knowledge that is required to feel the oneness with the Ultimate Reality, Śiva; śarīra – bodily form and here it means core knowledge or vidyā referred above; sattā – excellence; mantra – mantra (not the routine mantra-s, but the supreme I consciousness); rahasyam – secret.*
*This sūtra means that the supreme knowledge of oneness with Ultimate Reality is revealed through the inherent essence of I consciousness that is present in empirical individual. Mantra here means the essence of non-dualism or oneness with Supreme consciousness. Realization of oneness of macrocosms with microcosms is dealt with in this sūtra. Such realization is called mantra rahasyam.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama