కైలాశ పర్వతం నుండి జాలువారే విభూతి ధార....!! Vibhuti Dhara falls from Mount Kailash..!!




🎻🌹🙏 కైలాశ పర్వతం నుండి జాలువారే విభూతి ధార....!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

కైలాస పర్వత ప్రదక్షిణం చేస్తుంటారు కొంతమంది యాత్రికులు ,

కానీ మరీ దగ్గరగా వెళ్లేవారు మాత్రమే మాటల్లో వర్ణించలేని ఈ అనుభూతి పొందగలరు.

కైలాస పర్వతాన్ని సమీపిస్తున్న కొద్దీ సుగంధ పరిమళాల సువాసనలు వీస్తుంటాయట.

అక్కడ మంచు బదులు విభూతి ఉంటుందట. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరవలసిన క్షేత్రాలలో ఇదీ ఒకటి.

దయచేసి మీకు తెలిసిన పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి . దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో ,

ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో మన ఊహకు అందదు.అందరికీ దర్శనభాగ్యం కలగాలనే మా ప్రయత్నం...🚩🌞🙏🌹🎻


🙏" సంభవామి యుగే యుగే "🙏


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


14 May 2022


మిత్రులందరికి నృసింహ జయంతి శుభాకాంక్షలు Happy Narasimha Jayanti to all



🌹. మిత్రులందరికి నృసింహ జయంతి శుభాకాంక్షలు 🌹


🍀. శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం  Sri Lakshminarasimha Karavalamba Stotram🍀

శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్రభోగమణిరాజిత పుణ్యమూర్తే |
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౧

బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత |
లక్ష్మీలసత్కుచసరోరుహరాజహంస లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౨

సంసారదావదహనాకరభీకరోరు-జ్వాలావళీభిరతిదగ్ధతనూరుహస్య |
త్వత్పాదపద్మసరసీరుహమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౩

సంసారజాలపతితతస్య జగన్నివాస సర్వేంద్రియార్థ బడిశాగ్ర ఝషోపమస్య |
ప్రోత్కంపిత ప్రచురతాలుక మస్తకస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౪

సంసారకూమపతిఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య |
దీనస్య దేవ కృపయా పదమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౫

సంసారభీకరకరీంద్రకరాభిఘాత నిష్పీడ్యమానవపుషః సకలార్తినాశ |
ప్రాణప్రయాణభవభీతిసమాకులస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౬

సంసారసర్పవిషదిగ్ధమహోగ్రతీవ్ర దంష్ట్రాగ్రకోటిపరిదష్టవినష్టమూర్తేః |
నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౭

సంసారవృక్షబీజమనంతకర్మ-శాఖాయుతం కరణపత్రమనంగపుష్పమ్ |
ఆరుహ్య దుఃఖఫలితః చకితః దయాళో లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౮

సంసారసాగరవిశాలకరాళకాళ నక్రగ్రహగ్రసితనిగ్రహవిగ్రహస్య |
వ్యగ్రస్య రాగనిచయోర్మినిపీడితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౯

సంసారసాగరనిమజ్జనముహ్యమానం దీనం విలోకయ విభో కరుణానిధే మామ్ |
ప్రహ్లాదఖేదపరిహారపరావతార లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౧౦

సంసారఘోరగహనే చరతో మురారే మారోగ్రభీకరమృగప్రచురార్దితస్య |
ఆర్తస్య మత్సరనిదాఘసుదుఃఖితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౧౧

బద్ధ్వా గలే యమభటా బహు తర్జయంత కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మామ్ |
ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౧౨

లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప |
బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౧౩

ఏకేన చక్రమపరేణ కరేణ శంఖ-మన్యేన సింధుతనయామవలంబ్య తిష్ఠన్ |
వామేతరేణ వరదాభయపద్మచిహ్నం లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౧౪

అంధస్య మే హృతవివేకమహాధనస్య చోరైర్మహాబలిభిరింద్రియనామధేయైః |
మోహాంధకారకుహరే వినిపాతితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౧౫

ప్రహ్లాదనారదపరాశరపుండరీక-వ్యాసాదిభాగవతపుంగవహృన్నివాస |
భక్తానురక్తపరిపాలనపారిజాత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౧౬

లక్ష్మీనృసింహచరణాబ్జమధువ్రతేన స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ |
యే తత్పఠంతి మనుజా హరిభక్తియుక్తా-స్తే యాంతి తత్పదసరోజమఖండరూపమ్ ౧౭

🌹 🌹 🌹 🌹 🌹


14 May 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 600 / Vishnu Sahasranama Contemplation - 600


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 600 / Vishnu Sahasranama Contemplation - 600🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 600. శివః, शिवः, Śivaḥ 🌻

ఓం శివాయ నమః | ॐ शिवाय नमः | OM Śivāya namaḥ

శివః, शिवः, Śivaḥ

స్వనామస్మృతిమాత్రేణ పావయన్ శివ ఉచ్యతే

తన నామమును స్మరించినంతనే స్మరించినవారిని పవిత్రులునుగా చేయువాడుగనుక ఆ పరమాత్మకు శివః అను నామము.


:: పోతన భాగవతము - తృతీయ స్కంధము ::

చ. అలరు భవత్పదాంబుజ యుగార్పితమై పొలుపొందునట్టి యీ
తులసి పవిత్రమైన గతిఁ దోయజనాభ! భవత్కథాసుధా
కలితములైన వాక్కుల నకల్మషయుక్తుని విన్నఁ గర్ణముల్‍
విలసిత లీలమై భువిఁ బవిత్రములై విలసిల్లు మాధవా! (551)


ఓ పద్మనాభా! ఓ రమావల్లభా! నీ పాదారవిందములపై అర్పింపబడిన ఈ తులసి పవిత్రమైనట్లు నీ కథామృతంతో కూడిన వాక్కులను కల్మషం లేకుండా విన్న మా చెవులుకూడా పరమ పవిత్రాలై భాసిల్లుతాయి.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 600🌹

📚. Prasad Bharadwaj

🌻600. Śivaḥ🌻

OM Śivāya namaḥ


स्वनामस्मृतिमात्रेण पावयन् शिव उच्यते / Svanāmasmr‌timātreṇa pāvayan śiva ucyate

Because of remembrance of His name, He purifies those who have uttered His name and hence He is called Śivaḥ.


:: श्रीमद्भागवते द्वितीय स्कन्धे द्वितीयोऽध्यायः ::

न ह्यन्तोऽन्यः शिवः पन्था विषतः संसृताविह ।
वासुदेवो भगवति भक्तियोगो यतो भवेत् ॥ ३३ ॥


Śrīmad Bhāgavata - Canto 2, Chapter 2

Na hyanto’nyaḥ śivaḥ panthā viṣataḥ saṃsr‌tāviha,
Vāsudevo bhagavati bhaktiyogo yato bhavet. 33.


For those who are wandering in the material universe, there is no more auspicious means of deliverance than what is aimed at in the direct devotional service of Lord Kr‌s‌n‌a.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः ।
श्रीवत्सवक्षाश्श्रीवासश्श्रीपतिः श्रीमतां वरः ॥ ६४ ॥

అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।
శ్రీవత్సవక్షాశ్శ్రీవాసశ్శ్రీపతిః శ్రీమతాం వరః ॥ 64 ॥

Anivartī nivr‌ttātmā saṃkṣeptā kṣemakr‌cchivaḥ,
Śrīvatsavakṣāśśrīvāsaśśrīpatiḥ śrīmatāṃ varaḥ ॥ 64 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹


14 May 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 279 - 5. మనం ఒక స్వంత ప్రపంచాన్ని సృష్టించుకుంటాము / DAILY WISDOM - 279 - 5. We Create a World of Our Own


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 279 / DAILY WISDOM - 279 🌹

🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 5. మనం ఒక స్వంత ప్రపంచాన్ని సృష్టించుకుంటాము 🌻


అనుబంధం లేదా ఆప్యాయత అనేది చైతన్యం యొక్క విచిత్రమైన ద్వంద్వ వైఖరి. ఏదైనా నిర్దిష్ట వస్తువుతో జతచేయబడినప్పుడు అది ఏకకాలంలో రెండంచుల కత్తిలా పని చేస్తుంది. తాను కోరుకునే వస్తువు లేదా దానికి అనుబంధంగా ఉన్న వస్తువులు తన ఉనికిలో భాగం కాదనే భావన సూక్ష్మంగా ఉంటుంది - ఎందుకంటే ఒక వస్తువు మన స్వయంలో భాగమైతే, దానిని కోరుకునే ప్రశ్నే తలెత్తదు. మన ఉనికిలో భాగమైన దేనినైనా ప్రేమించాల్సిన అవసరం లేదు, కాబట్టి అది మనలో భాగం కాదనే సూక్ష్మ భావన మనకు ఉంటుంది. నిజంగా చెప్పాలంటే కుటుంబ సభ్యులు మనకు చెందరు. అది మనకు బాగా తెలుసు.

అందువల్ల, ఆప్యాయత, ప్రేమ లేదా అనుబంధం అని పిలువబడే ఒక మానసిక స్థితి ద్వారా మన ఉనికితో వారి ఉనికిని కృత్రిమంగా గుర్తించేలా చేస్తాము. మూర్ఖుల స్వర్గం అని పిలవబడే మన స్వంత ప్రపంచాన్ని మనం సృష్టిస్తాము. కుటుంబ పెద్ద నివసించే స్వర్గం ఇది. “ఓహ్, నా ఈ కుటుంబం ఎంత అందంగా ఉంది. నాకు పెద్ద కుటుంబం ఉంది. ” అసలు దాని అర్థం ఏమిటో అతనికి తెలియదు. అలాగే, అది ఏమిటో తెలుసుకోవడం చాలా ప్రమాదకరం కూడా. ఎందుకంటే ఇది నిజంగా ఏమిటో తెలిస్తే, మన నరాలు గగుర్పొడిచేలా వెంటనే భయపడిపోతాము.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 279 🌹

🍀 📖 from The Study and Practice of Yoga 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 5. We Create a World of Our Own 🌻


Attachment, or affection, is a peculiar double attitude of consciousness. It is simultaneously working like a double-edged sword when it is attached to any particular object. It has a feeling that the things which it loves, or to which it is attached, are not really a part of its being—because if a thing is a part of our own being, the question of desiring it will not arise. There is no need to love something which is a part of our being, so we have a subtle feeling that it is not a part of us. The members of the family do not belong to us, really speaking. We know it very well.

Therefore, we create an artificial identification of their being with our being by means of a psychological movement or a function known as affection, love or attachment. We create a world of our own which may be called a fool's paradise. This is the paradise in which the head of the family lives. “Oh, how beautiful it is. I have got a large family.” He does not know what it actually means. Also, it is very dangerous to know what it is because if we know what it really is, we will be horrified immediately, to the shock of our nerves.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


14 May 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 179


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 179 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. కేవలం చైతన్యం ద్వారా మాత్రమే నువ్వు యాంత్రికతని అధిగమించగలవు. గురువు ద్వారా మాత్రమే ఆధ్యాత్మిక జన్మ వీలవుతుంది. గురువు ద్వారా మాత్రమే పూర్తిగా విభిన్నమయిన ప్రయాణం ఆరంభమవుతుంది. 🍀


మనిషి, సాధారణ మనిషి, మంద, గుంపు తరతరాలుగా వునికిలో వున్నారు. అది యాంత్రికం. కేవలం చైతన్యం ద్వారా మాత్రమే నువ్వు యాంత్రికతని అధిగమించగలవు. అదే నిజమైన జన్మ. అప్పుడు నువ్వు రెండోసారి జన్మిస్తావు. నీ తల్లిదండ్రుల ద్వారా పొందిన జన్మ శారీరక జన్మ. ఆధ్యాత్మిక జన్మ కాదు.

గురువు ద్వారా మాత్రమే ఆధ్యాత్మిక జన్మ వీలవుతుంది. గురువు ద్వారా మాత్రమే పూర్తిగా విభిన్నమయిన ప్రయాణం ఆరంభమవుతుంది. అది నీ కొత్త జన్మ కొత్తకోణం. ఆధ్యాత్మిక కోణం. వ్యక్తి తన పట్ల తను స్పృహతో వుండేలా చైతన్యం కలిగించడమే గురువు చేసే పని.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


14 May 2022

మైత్రేయ మహర్షి బోధనలు - 118


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 118 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 91. జీవుని అశ్రద్ధ -2🌻

మానవులకు మాత్రమే ఆలోచన, వివేచన, భాషణ యీయబడినవి. కాని వాని విలువ తెలియక అతడు ప్రవర్తించుచున్నాడు. శ్రద్ధ సహజ గుణము కాబడినది. కొన్ని విషయములపై శ్రద్ధ, మరికొన్ని విషయముల యందు అశ్రద్ధ గలవారు శ్రద్ధాళువులు కాలేరు.

శ్రద్ధ సహజగుణమైనచో అన్ని విషయము లందును అది భాసించగలదు. శ్రీరాముని జీవితము శ్రద్ధకు పరిపూర్ణ సంకేతము. శ్రద్ధ లేనివారు ఇపుడాధ్యాత్మిక బోధన కెగబడుట కలియుగ ప్రభావమే. వారు ఆచరణము నందు శ్రద్ధలేక, ప్రచారముననే శ్రద్ధ గలిగి యున్నారు.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


14 May 2022

14 - MAY - 2022 శనివారం, స్థిర వాసరే MESSAGES నృసింహ జయంతి శుభాకాంక్షలు

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 14, మే 2022 శనివారం, స్థిర వాసరే 🌹
🍀. నృసింహ జయంతి శుభాకాంక్షలు - శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం 🍀
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 201 / Bhagavad-Gita - 201 - 4-39 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 600 / Vishnu Sahasranama Contemplation - 600🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 279 / DAILY WISDOM - 279🌹  
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 179 🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 118 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నృసింహ జయంతి శుభాకాంక్షలు మరియు శుభ శనివారం మిత్రులందరికీ 🌹*
*స్థిర వాసరే, 14, మే, 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : నృసింహ జయంతి, Narasimha Jayanti 🌻*

*🍀. శ్రీ వేంకటేశ్వర రక్షా స్తోత్రం - 4 🍀*

*4) అరిషడ్వర్గాదిభంజనభవ్యకుఠారం*
*అసంఖ్యాకభక్తావళీరక్షాకరహస్తం*
*అంగీరసాదిమునిగణసేవితాంఘ్రిం*
*శ్రీ వేంకటేశ రక్షమాం శ్రీధరనిశం*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : సత్వగుణంతో కాని రజోగుణం తో కాని, 
తమోగుణంతో కాని మనము పొందేటటువంటి భావనాపరమైనటువంటి వేదనలకే 'స్వభావము ' అనిపేరు. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, వైశాఖ మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిథి: శుక్ల త్రయోదశి 15:24:31 వరకు
తదుపరి శుక్ల చతుర్దశి
నక్షత్రం: చిత్ర 17:28:57 వరకు
తదుపరి స్వాతి
యోగం: సిధ్ధి 12:59:34 వరకు
తదుపరి వ్యతీపాత
కరణం: తైతిల 15:18:32 వరకు
వర్జ్యం: 02:22:40 - 03:53:12
మరియు 22:37:38 - 24:06:06
దుర్ముహూర్తం: 07:27:58 - 08:19:42
రాహు కాలం: 08:58:30 - 10:35:30
గుళిక కాలం: 05:44:30 - 07:21:30
యమ గండం: 13:49:29 - 15:26:29
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:37
అమృత కాలం: 11:25:52 - 12:56:24
సూర్యోదయం: 05:44:30
సూర్యాస్తమయం: 18:40:28
చంద్రోదయం: 16:56:47
చంద్రాస్తమయం: 04:09:30
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: కన్య
కాల యోగం - అవమానం 17:28:57
వరకు తదుపరి సిద్ది యోగం
- కార్య సిధ్ధి , ధన ప్రాప్తి 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మిత్రులందరికి నృసింహ జయంతి శుభాకాంక్షలు 🌹*

*🍀. శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం 🍀*

శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్రభోగమణిరాజిత పుణ్యమూర్తే |
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౧ 

బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత |
లక్ష్మీలసత్కుచసరోరుహరాజహంస లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౨ 

సంసారదావదహనాకరభీకరోరు-జ్వాలావళీభిరతిదగ్ధతనూరుహస్య |
త్వత్పాదపద్మసరసీరుహమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౩ 

సంసారజాలపతితతస్య జగన్నివాస సర్వేంద్రియార్థ బడిశాగ్ర ఝషోపమస్య |
ప్రోత్కంపిత ప్రచురతాలుక మస్తకస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౪ 

సంసారకూమపతిఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య |
దీనస్య దేవ కృపయా పదమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౫ 

సంసారభీకరకరీంద్రకరాభిఘాత నిష్పీడ్యమానవపుషః సకలార్తినాశ |
ప్రాణప్రయాణభవభీతిసమాకులస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౬ 

సంసారసర్పవిషదిగ్ధమహోగ్రతీవ్ర దంష్ట్రాగ్రకోటిపరిదష్టవినష్టమూర్తేః |
నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౭ 

సంసారవృక్షబీజమనంతకర్మ-శాఖాయుతం కరణపత్రమనంగపుష్పమ్ |
ఆరుహ్య దుఃఖఫలితః చకితః దయాళో లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౮ 

సంసారసాగరవిశాలకరాళకాళ నక్రగ్రహగ్రసితనిగ్రహవిగ్రహస్య |
వ్యగ్రస్య రాగనిచయోర్మినిపీడితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౯ 

సంసారసాగరనిమజ్జనముహ్యమానం దీనం విలోకయ విభో కరుణానిధే మామ్ |
ప్రహ్లాదఖేదపరిహారపరావతార లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౧౦ 

సంసారఘోరగహనే చరతో మురారే మారోగ్రభీకరమృగప్రచురార్దితస్య |
ఆర్తస్య మత్సరనిదాఘసుదుఃఖితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౧౧ 

బద్ధ్వా గలే యమభటా బహు తర్జయంత కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మామ్ |
ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౧౨ 

లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప |
బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౧౩ 

ఏకేన చక్రమపరేణ కరేణ శంఖ-మన్యేన సింధుతనయామవలంబ్య తిష్ఠన్ |
వామేతరేణ వరదాభయపద్మచిహ్నం లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౧౪ 

అంధస్య మే హృతవివేకమహాధనస్య చోరైర్మహాబలిభిరింద్రియనామధేయైః |
మోహాంధకారకుహరే వినిపాతితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౧౫ 

ప్రహ్లాదనారదపరాశరపుండరీక-వ్యాసాదిభాగవతపుంగవహృన్నివాస |
భక్తానురక్తపరిపాలనపారిజాత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ ౧౬ 

లక్ష్మీనృసింహచరణాబ్జమధువ్రతేన స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ |
యే తత్పఠంతి మనుజా హరిభక్తియుక్తా-స్తే యాంతి తత్పదసరోజమఖండరూపమ్ ౧౭
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 201 / Bhagavad-Gita - 201 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 39 🌴*

*39. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర: సంయతేన్ద్రియ: |*
*జ్ఞానం లభ్ధ్వా పరాం శాంతిమచిరేణాధిగచ్ఛతి ||*

🌷. తాత్పర్యం :
*దివ్యజ్ఞానతత్పరుడైన శ్రద్ధావంతుడు ఇంద్రియములను నియమించి అట్టి ఆధ్యాత్మికజ్ఞానమును పొందుట అర్హుడగును. దానిని సాధించి అతడు శీఘ్రముగా పరమశాంతిని పొందును.*

🌷. భాష్యము :
దేవదేవుడైన శ్రీకృష్ణుని యందు దృఢమైన విశ్వాసము కలిగిన మనుజునికి అట్టి కృష్ణభక్తిభావనా జ్ఞానము లభించగలదు. కృష్ణభక్తిభావన యందు కేవలము వర్తించుట చేతనే సంపూర్ణత్వము సిద్ధించునని భావించువాడు శ్రద్ధావంతుడనబడును. 

భక్తియుతసేవ నొనరించుట ద్వారా మరియు హృదయమాలిన్యమును తొలగించు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే అను మాహామంత్రమును జపకీర్తనములు చేయుట ద్వారా అట్టి శ్రద్ధ ప్రాప్తించగలదు. వీనితోపాటుగా అతడు ఇంద్రియములను సైతము నిగ్రహించవలెను. శ్రీకృష్ణుని యెడ శ్రద్ధను కలిగి ఇంద్రియనియమమును పాటించువాడు కృష్ణభక్తి రసభావన జ్ఞానము నందు పూర్ణత్వమును ఏమాత్రము జాగులేక సులభముగా పొందగలడు.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 201 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 4 - Jnana Yoga - 39 🌴*

*39. śraddhāvāḻ labhate jñānaṁ tat-paraḥ saṁyatendriyaḥ*
*jñānaṁ labdhvā parāṁ śāntim acireṇādhigacchati*

🌷 Translation : 
*A faithful man who is dedicated to transcendental knowledge and who subdues his senses is eligible to achieve such knowledge, and having achieved it he quickly attains the supreme spiritual peace.*

🌹 Purport :
Such knowledge in Kṛṣṇa consciousness can be achieved by a faithful person who believes firmly in Kṛṣṇa. One is called a faithful man who thinks that simply by acting in Kṛṣṇa consciousness he can attain the highest perfection. 

This faith is attained by the discharge of devotional service and by chanting Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare, which cleanses one’s heart of all material dirt. Over and above this, one should control the senses. A person who is faithful to Kṛṣṇa and who controls the senses can easily attain perfection in the knowledge of Kṛṣṇa consciousness without delay.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 600 / Vishnu Sahasranama Contemplation - 600🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 600. శివః, शिवः, Śivaḥ 🌻*

*ఓం శివాయ నమః | ॐ शिवाय नमः | OM Śivāya namaḥ*

*శివః, शिवः, Śivaḥ*

*స్వనామస్మృతిమాత్రేణ పావయన్ శివ ఉచ్యతే*

*తన నామమును స్మరించినంతనే స్మరించినవారిని పవిత్రులునుగా చేయువాడుగనుక ఆ పరమాత్మకు శివః అను నామము.*

:: పోతన భాగవతము - తృతీయ స్కంధము ::
చ. అలరు భవత్పదాంబుజ యుగార్పితమై పొలుపొందునట్టి యీ
     తులసి పవిత్రమైన గతిఁ దోయజనాభ! భవత్కథాసుధా
     కలితములైన వాక్కుల నకల్మషయుక్తుని విన్నఁ గర్ణముల్‍
     విలసిత లీలమై భువిఁ బవిత్రములై విలసిల్లు మాధవా! (551)

*ఓ పద్మనాభా! ఓ రమావల్లభా! నీ పాదారవిందములపై అర్పింపబడిన ఈ తులసి పవిత్రమైనట్లు నీ కథామృతంతో కూడిన వాక్కులను కల్మషం లేకుండా విన్న మా చెవులుకూడా పరమ పవిత్రాలై భాసిల్లుతాయి.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 600🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻600. Śivaḥ🌻*

*OM Śivāya namaḥ*

*स्वनामस्मृतिमात्रेण पावयन् शिव उच्यते / Svanāmasmr‌timātreṇa pāvayan śiva ucyate*

*Because of remembrance of His name, He purifies those who have uttered His name and hence He is called Śivaḥ.*

:: श्रीमद्भागवते द्वितीय स्कन्धे द्वितीयोऽध्यायः ::
न ह्यन्तोऽन्यः शिवः पन्था विषतः संसृताविह ।
वासुदेवो भगवति भक्तियोगो यतो भवेत् ॥ ३३ ॥

Śrīmad Bhāgavata - Canto 2, Chapter 2
Na hyanto’nyaḥ śivaḥ panthā viṣataḥ saṃsr‌tāviha,
Vāsudevo bhagavati bhaktiyogo yato bhavet. 33.

*For those who are wandering in the material universe, there is no more auspicious means of deliverance than what is aimed at in the direct devotional service of Lord Kr‌s‌n‌a.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः ।श्रीवत्सवक्षाश्श्रीवासश्श्रीपतिः श्रीमतां वरः ॥ ६४ ॥

అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః ।శ్రీవత్సవక్షాశ్శ్రీవాసశ్శ్రీపతిః శ్రీమతాం వరః ॥ 64 ॥

Anivartī nivr‌ttātmā saṃkṣeptā kṣemakr‌cchivaḥ,Śrīvatsavakṣāśśrīvāsaśśrīpatiḥ śrīmatāṃ varaḥ ॥ 64 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 279 / DAILY WISDOM - 279 🌹*
*🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 5. మనం ఒక స్వంత ప్రపంచాన్ని సృష్టించుకుంటాము 🌻*

*అనుబంధం లేదా ఆప్యాయత అనేది చైతన్యం యొక్క విచిత్రమైన ద్వంద్వ వైఖరి. ఏదైనా నిర్దిష్ట వస్తువుతో జతచేయబడినప్పుడు అది ఏకకాలంలో రెండంచుల కత్తిలా పని చేస్తుంది. తాను కోరుకునే వస్తువు లేదా దానికి అనుబంధంగా ఉన్న వస్తువులు తన ఉనికిలో భాగం కాదనే భావన సూక్ష్మంగా ఉంటుంది - ఎందుకంటే ఒక వస్తువు మన స్వయంలో భాగమైతే, దానిని కోరుకునే ప్రశ్నే తలెత్తదు. మన ఉనికిలో భాగమైన దేనినైనా ప్రేమించాల్సిన అవసరం లేదు, కాబట్టి అది మనలో భాగం కాదనే సూక్ష్మ భావన మనకు ఉంటుంది. నిజంగా చెప్పాలంటే కుటుంబ సభ్యులు మనకు చెందరు. అది మనకు బాగా తెలుసు.*

*అందువల్ల, ఆప్యాయత, ప్రేమ లేదా అనుబంధం అని పిలువబడే ఒక మానసిక స్థితి ద్వారా మన ఉనికితో వారి ఉనికిని కృత్రిమంగా గుర్తించేలా చేస్తాము. మూర్ఖుల స్వర్గం అని పిలవబడే మన స్వంత ప్రపంచాన్ని మనం సృష్టిస్తాము. కుటుంబ పెద్ద నివసించే స్వర్గం ఇది. “ఓహ్, నా ఈ కుటుంబం ఎంత అందంగా ఉంది. నాకు పెద్ద కుటుంబం ఉంది. ” అసలు దాని అర్థం ఏమిటో అతనికి తెలియదు. అలాగే, అది ఏమిటో తెలుసుకోవడం చాలా ప్రమాదకరం కూడా. ఎందుకంటే ఇది నిజంగా ఏమిటో తెలిస్తే, మన నరాలు గగుర్పొడిచేలా వెంటనే భయపడిపోతాము.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 279 🌹*
*🍀 📖 from The Study and Practice of Yoga 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 5. We Create a World of Our Own 🌻*

*Attachment, or affection, is a peculiar double attitude of consciousness. It is simultaneously working like a double-edged sword when it is attached to any particular object. It has a feeling that the things which it loves, or to which it is attached, are not really a part of its being—because if a thing is a part of our own being, the question of desiring it will not arise. There is no need to love something which is a part of our being, so we have a subtle feeling that it is not a part of us. The members of the family do not belong to us, really speaking. We know it very well.*

*Therefore, we create an artificial identification of their being with our being by means of a psychological movement or a function known as affection, love or attachment. We create a world of our own which may be called a fool's paradise. This is the paradise in which the head of the family lives. “Oh, how beautiful it is. I have got a large family.” He does not know what it actually means. Also, it is very dangerous to know what it is because if we know what it really is, we will be horrified immediately, to the shock of our nerves.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 179 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. కేవలం చైతన్యం ద్వారా మాత్రమే నువ్వు యాంత్రికతని అధిగమించగలవు. గురువు ద్వారా మాత్రమే ఆధ్యాత్మిక జన్మ వీలవుతుంది. గురువు ద్వారా మాత్రమే పూర్తిగా విభిన్నమయిన ప్రయాణం ఆరంభమవుతుంది. 🍀*

*మనిషి, సాధారణ మనిషి, మంద, గుంపు తరతరాలుగా వునికిలో వున్నారు. అది యాంత్రికం. కేవలం చైతన్యం ద్వారా మాత్రమే నువ్వు యాంత్రికతని అధిగమించగలవు. అదే నిజమైన జన్మ. అప్పుడు నువ్వు రెండోసారి జన్మిస్తావు. నీ తల్లిదండ్రుల ద్వారా పొందిన జన్మ శారీరక జన్మ. ఆధ్యాత్మిక జన్మ కాదు.*

*గురువు ద్వారా మాత్రమే ఆధ్యాత్మిక జన్మ వీలవుతుంది. గురువు ద్వారా మాత్రమే పూర్తిగా విభిన్నమయిన ప్రయాణం ఆరంభమవుతుంది. అది నీ కొత్త జన్మ కొత్తకోణం. ఆధ్యాత్మిక కోణం. వ్యక్తి తన పట్ల తను స్పృహతో వుండేలా చైతన్యం కలిగించడమే గురువు చేసే పని.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 118 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 91. జీవుని అశ్రద్ధ -2🌻*

*మానవులకు మాత్రమే ఆలోచన, వివేచన, భాషణ యీయబడినవి. కాని వాని విలువ తెలియక అతడు ప్రవర్తించుచున్నాడు. శ్రద్ధ సహజ గుణము కాబడినది. కొన్ని విషయములపై శ్రద్ధ, మరికొన్ని విషయముల యందు అశ్రద్ధ గలవారు శ్రద్ధాళువులు కాలేరు.*

*శ్రద్ధ సహజగుణమైనచో అన్ని విషయము లందును అది భాసించగలదు. శ్రీరాముని జీవితము శ్రద్ధకు పరిపూర్ణ సంకేతము. శ్రద్ధ లేనివారు ఇపుడాధ్యాత్మిక బోధన కెగబడుట కలియుగ ప్రభావమే. వారు ఆచరణము నందు శ్రద్ధలేక, ప్రచారముననే శ్రద్ధ గలిగి యున్నారు.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹