"If you touch a bare wire, then you feel nothing. But the moment you insert one end of the wire into a socket and touch, then in a moment your whole system will be full of electric charge and it will be magnetized. Similarly, God is remaining in your whole system. If you can be in contact with a good master, then in a moment of that divine touch your whole system will be full of divine charge. You can see divine light, can hear the divine sound, and also can feel the God movement sensation in the whole body."
20 Apr 2022
శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 364-3 / Sri Lalitha Chaitanya Vijnanam - 364-3
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 364-3 / Sri Lalitha Chaitanya Vijnanam - 364-3 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 80. చితి, స్తత్పదలక్ష్యార్థా, చిదేక రసరూపిణీ ।
స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః ॥ 80 ॥ 🍀
🌻 364-3. 'చిదేక రసరూపిణీ' 🌻
మహత్తు నుండి అణువు వరకు అన్నిటి యందు ఈశ్వరుడున్నాడు. ఆ ఈశ్వరునితో కూడి యుండియే అంతయూ నిర్మాణము చేయుచు ఆనందముగ నుండునది శ్రీమాత. ఆమె ఆనందము ఈశ్వరునితో కూడియుండుట వలన కలుగు ఆనందము. మన యందు మూలాధారమున ఈశ్వరునితో కూడి యున్నది. సహస్రారమున కూడ ఈశ్వరునితోనే కూడి యున్నది. ఇట్లు సతతము కూడి యుండుట వలన రసానుభూతిని పొందుచు రసరూపిణిగా నున్నది.
జీవులకు ఆనందానుభూతి, ఈశ్వరానుభూతి కలుగజేయునది శ్రీమాతయే. ఆమె అనుగ్రహము లేనిదే ఆనందము కలుగదు. యోగము జరుగదు. ఈశ్వరునితో రసలీల సాధ్యపడదు. పై రసానుభూతిని జగదీశ్వరుడగు కృష్ణునితో కూడి పొందవలె నను తపన గల గోపికలు, కాత్యాయనీ దేవిని ప్రార్థించుట యందు గల రహస్య మిదియే. కృష్ణుని ప్రార్థించినచో రసానుభూతి నివ్వడు. కాత్యాయనీ దేవిని ప్రార్థించినపుడు ఆమె అనుగ్రహించుట చేత రసానుభూతిని గోపికలకు పరమాత్మ అందించినాడు. గోపిక లందరూ ఒకరి నొకరు కృష్ణునిగ చూచి పరమానంద భరితులై పరవశముతో రాసలీల గావించినారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 364-3 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 80. Chiti statpada lakshyardha chidekarasa rupini
Svatyananda lavibhuta bramha dyananda santatih ॥ 80 ॥ 🌻
🌻 364-3. Cideka-rasa-rūpiṇī चिदेक-रस-रूपिणी 🌻
She is the essence of knowledge. The difference between knowledge and the essence of knowledge is to be understood. The knowledge of the unconditioned Brahman or the Prakāśa form of the Brahman is different from the conditioned Brahman or the vimarśa form of the Brahman. The Brahman with attributes and without attributes remains the same, so also their purity of knowledge. This is the reason for establishing the identity of the both as one.
This nāma says that She is not different from Cit (nāma 362) or That (nāma 363), the qualities of the Brahman. There is no difference between conditioned and unconditioned Brahman as any modifications take place purely at the will of Brahman for the purpose of creation, sustenance and dissolution. When knowledge is extracted, the essence of knowledge is obtained, possibly from its gross form to its subtle form. But, the foundational nature of both gross and subtle forms of knowledge is not different. This can be compared to milk and its derivatives.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
20 Apr 2022
ఓషో రోజువారీ ధ్యానాలు - 171. అవగాహన లేని ప్రేమ / Osho Daily Meditations - 171. UNENLIGHTENED LOVE
🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 171 / Osho Daily Meditations - 171 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 171. అవగాహన లేని ప్రేమ 🍀
🕉. ప్రేమ అంటే స్వేచ్ఛ అని అర్ధం కాదు. అది ఆదర్శం కనుక ఉండాలి అంటాము- ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, మీరు ఎవరినైనా అవగాహనతో ప్రేమిస్తే, అప్పుడే అది ఒక ఆశీర్వాదం. 🕉
ప్రేమ అనేక విధాలుగా విధ్వంసకరం కావచ్చు, ఎందుకంటే ప్రేమ తప్పనిసరిగా అవగాహనను కలిగి ఉండాలని లేదు. ఒక తల్లి బిడ్డను ప్రేమిస్తుంది. ఈనాడు నిజంగా చూస్తే తల్లులు తమ పిల్లలను అతిగా ప్రేమిస్తున్నందున వల్లనే ప్రపంచం మొత్తం బాధపడుతోంది. కావాలంటే మానసిక వైద్యులను, మనస్తత్వవేత్తలను అడగండి. ప్రతి మానసిక రుగ్మతను తల్లి-బిడ్డల బంధానికి ఆపాదించవచ్చు అని వారు అంటున్నారు. పిచ్చాస్పత్రిలో ఉన్న చాలా మంది ఈ అవగాహన లేని అతిప్రేమ వల్లే పిచ్చికి గురయ్యి బాధపడుతున్నారు. తండ్రులు ప్రేమిస్తారు, పూజారులు, రాజకీయ నాయకులు ప్రేమిస్తారు. ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు, కానీ ప్రేమ తప్పనిసరిగా బుద్ధిని కలిగి ఉండాలని లేదు. ప్రేమ బుద్ధిని కలిగి ఉన్నప్పుడు, జ్ఞానంగా అయినప్పుడు, అది కరుణగా వుంటుంది. అప్పుడు అది పూర్తిగా భిన్నమైన నాణ్యతతో ఉంటుంది. అది మీకు స్వేచ్ఛను ఇస్తుంది. దాని పూర్తి విధి స్వేచ్ఛను ఇవ్వడం.
అది స్వేచ్ఛ గురించి మాట్లాడడమే కాదు-మిమ్మల్ని స్వేచ్ఛగా మార్చడానికి మరియు స్వేచ్ఛా మార్గంలో ఉన్న అన్ని అడ్డంకులను నాశనం చేయడానికి అది ప్రతి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రేమ ఉనికిలో ఉంటుంది, కానీ అప్రమత్తంగా లేకపోతే, అది చాలా వినాశకరమైనది. ప్రేమ ఒక్కటి ఉంటే మాత్రమే సరిపోదు. అలా అయితే ప్రపంచం ఇప్పటికే స్వర్గంగా మారిపోయింది. మీరు మీ భాగస్వామిని ప్రేమిస్తారు, మీ భాగస్వామి మిమ్మల్ని ప్రేమిస్తారు, కానీ చివరకు ఏమి జరుగుతుంది? ఈ మోహంగా వ్యక్తం అయ్యే ప్రేమ విధ్వంసం తప్ప మరేమీ తీసుకురాదు. మీ ప్రేమ పైకి బానే వున్నట్టు కనబడుతుంది కానీ, మీరు బాగా లేరు. ఎక్కడో అవగాహనలో లోపం ఉంది. అపస్మారక స్థితిలో ఏదో లోతుగా ఉంది, అది మీకు తెలియని విషయాలను సృష్టిస్తుంది. ప్రేమను తిరస్కరించాలని నేను చెప్పను, కానీ ప్రేమకు మొదటి స్థానం ఇవ్వకూడదు. ముందుగా అవగాహన రావాలి. ప్రేమ నీడలా వెంబడించాలి.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations - 171 🌹
📚. Prasad Bharadwaj
🍀 171. UNENLIGHTENED LOVE 🍀
🕉 Love does not necessarily mean .freedom. It should-that is the ideal. Always remember, if you love somebody with awareness, only then will it be a blessing. 🕉
Love can be destructive in many ways, because love is not necessarily enlightened. A mother loves the child and the whole world is suffering because mothers love their children. Ask the psychiatrists, the psychologists. They say that every neurosis can be reduced to the mother-child relationship. Many people in the insane asylums are suffering from nothing but love. Fathers love their sons, priests love, politicians love. Everybody is loving, but love is not necessarily enlightened. When love is enlightened, it is compassion. Then it is of a totally different quality. It gives you freedom. Its whole function is to give freedom, absolutely.
And not only that it talks about freedom-it makes every effort to make you free and to destroy all the hindrances on the path of freedom. So love can exist, but if it is not very alert, then it is destructive. Love alone is not enough, otherwise the world would already have become a paradise. You love your partner, your partner loves you, but what happens finally? Nothing but destruction. Your love is okay, but you are not okay. Something is there deep down in the unconscious that goes on creating things you are not aware of. I don't say that love should be denied, but love should not come first. Awareness should come first. Love has to follow like a shadow.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
20 Apr 2022
శ్రీ మదగ్ని మహాపురాణము - 36 / Agni Maha Purana - 36
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 36 / Agni Maha Purana - 36 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 13
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
🌻. భారతము యొక్క వర్ణనము - 2 🌻
దైవవశముచే కురుపాండవుల మధ్య వైరము ఏర్పడెను. దుష్టబుద్ధియైన దుర్యోధనుడు లక్క ఇంటిలో పాండవులను కాల్చెను. కాని తల్లితో కూడిన పంచపాండవులును కాలిపోయిన ఇంటి నుండి తప్పించుకొని వెళ్ళిపోయిరి. పిమ్మట ఆ పాండవులు ఏకచక్రనగరమునందు మునివేషధారులై ఒక బ్రాహ్మణుని ఇంట నివసించిరి. అచట వారు బకరాక్షసుని చంపిరి.
వారు ద్రౌపదీస్వయంవర నిమిత్తమై పాంచాల దేశమునకు వెళ్లిరి. అచట వివిధాలంకారభూషిత యైన ద్రౌపదిని పాండవు లైదుగురును భార్యగా పొందిరి.
దుర్యోధనాదులచే గుర్తింపబడిన ఆ పాండవులు అర్దరాజ్యమును పొందిరి. అర్జునుడు, అగ్ని దేవునుండి గాండీవ మను దివ్యధనస్సును, ఉత్తమమైన రథమును, అక్షయ్యమైన బాణములు గల అమ్ములపొదలను పొందెను. ద్రోణునివలన బ్రహ్మద్యస్త్రములను పొందెను. కృష్ణుని యుద్ధసమయమున సారథిగా పొందెను. వారందరరును శస్త్రాస్త్రములందు నమర్థులైరి.
పాండుకుమారుడైన అర్జునుడు తన శరవర్షముచే, ఇంద్రుడు కురిపించిన వర్షమును అడ్డగించి, కృష్ణసహాయముతో, ఖాండవ వనము నందు అగ్నిని సంతృప్తిని చేసెను. పాండవులు నలుదిక్కులను జయించిరి. యధిష్ఠిరుడు రాజ్యము చేసెను. అధిక మగు సువర్ణదానము గల రాజసూయయాగమును చేసెను. దుర్యోధనుడు దీని నంతను సహింపలేకపోయెను. సోదరుడైన దుఃశాసనుడును, ఐశ్వర్యము లభించిన కర్ణుడును, శకునియు చెప్పగా యుధిష్ఠిరుని ద్యూతము నకై ఆహ్వానించి, ఆ ద్యూతశాలలో యుధిష్ఠిరుని మోనము చేసి నవ్వుచు, అతని రాజ్యమును హరించెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana -36 🌹
✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj
Chapter 13 - Bharatam
🌻 Origin of the Kauravas and Pāṇḍavas - 2 🌻
11. Karṇa, born to Kuntī, when she was a virgin, became a dependent of Duryodhana. By destiny there was enmity between the Kurus (Kauravas) and Pāṇḍavas.
12. The wicked Duryodhana burnt the Pāṇḍavas in the lac house. The Pāṇḍavas escaped from the burnt house along with their mother as the sixth.
13. Then at (the place) Ekacakrā, in the house of a brahmin, they all remained in the attire of an ascetic after killing the demon Baka.[2]
14. They went to the fair at Pāñcāla and in the svayamvara (self-choice) of Draupadī. The well adorned Draupadī was obtained by the five Pāṇḍavas.
15. Then (they) were known to have got half of the kingdom by Duryodhana and others. The divine bow Gāṇḍīva and the excellent chariot were obtained from the Fire god.
16. And in the battle, Arjuna got Kṛṣṇa as the charioteer and inexhaustible arrows and similarly the missiles (known as) Brahmā and other weapons (were obtained) from Droṇa. All were proficient in (the use of) arms.
17-18. (Acting on the words of) Kṛṣṇa, Arjuna put out the fire at the Khāṇḍava forest. And the Pāṇḍava (Arjuna) having obstructed rains (caused by Indra) with the shower of arrows, conquered the countries in different) directions. Yudhiṣṭhira ruled the country along with the (other) Pāṇḍavas. (He performed) the Rājasūya (sacrifice) (spending) plenty of gold. Suyodhana (Duryodhana) could not bear that.
19. Being directed by brother Duḥśāsana and by Karṇa who had been enriched by him, he won over Yudhiṣṭhira in dice, (being assisted) by Śakuni in playing the dice. His kingdom was also won by conceit. Those in the court laughed at him.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
20 Apr 2022
శ్రీ శివ మహా పురాణము - 552 / Sri Siva Maha Purana - 552
🌹 . శ్రీ శివ మహా పురాణము - 552 / Sri Siva Maha Purana - 552 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 51 🌴
🌻. కామ సంజీవనము - 2 🌻
దేవీ మూర్తు లిట్లు పలికినారు -
నీకు భక్త వత్సలుడని పేరు. దీనులకు బంధువు నీవే. నీవుదయానిధివి. మన్మథుని బ్రతికించి రతికి ఉత్సాహమునిమ్ము. నీకు నమస్కారమగు గాక! (12)
బ్రహ్మ ఇట్లు పలికెను-
వారి ఈ మాటను విని కరుణా సముద్రుడగు మహేశ్వర ప్రభుడు ప్రసన్నుడై వెంటనే దయాదృష్టిని బరపెను (13). శూలపాణియగు శివుని అమృతదృష్టిచే భస్మ నుండి అదే రూపము వేషము చిహ్నములు గల అద్భుతమగు సుందరమైన దేహము గలవాడై మన్మథుడు బయటకు వచ్చెను (14). అదే రూపముతో చిరునవ్వుతో ధనుర్బాణములను ధరించి యున్న తన భర్తను చూచి రతి ఆతనికి, మహేశ్వరునకు ప్రణమిల్లెను (15). భర్త జీవుంచటచే కృతార్థురాలైన ఆమె ప్రాణనాథుని ఇచ్చిన శివ దేవుని చేతులు జోడించి అనేక పర్యాయములు స్తుతించెను (16). భార్యతో గూడి మన్మథుడు చేసిన స్తోత్రమును విని కరుణార్ద్రహృదయుడగు శంకరుడు మిక్కలి ప్రసన్నుడై ఇట్లు పలికెను (17).
శంకరుడిట్లు పలికెను -
ఓయీ! మనస్సులో నీ అంతట నీవు పుట్టే మన్మథా! భార్యతో గూడి నీవు చేసిన స్తుతికి నేను ప్రసన్నుడనైతిని. నీకిష్టమగు వరమును కోరుకొనుము. నీకు ఇచ్చెదను (18).
బ్రహ్మ ఇట్లు పలికెను-
శంభుని ఈ మాటను విని మన్మథుడపుడు మహానందమును పొందినవాడై చేతులు జోడించి నమస్కరించి బొంగురుపోయిన కంఠముతో నిట్లనెను (19).
మన్మథుడిట్లు పలికెను-
దేవ దేవా! మహాదేవా! కరుణా సముద్రా! ప్రభూ! సర్వేశ్వరుడవగు నీవు ప్రసన్నుడవైనచో నాకు ఆనందమును కలిగించుము (20). ప్రభూ! పూర్వము నేను చేసిన అపరాధమును మన్నించుము. నీ భక్తుల యందు పరమప్రీతిని, నీ పాదములయందు భక్తిని ఇమ్ము (21).
బ్రహ్మ ఇట్లు పలికెను-
మన్మథుని ఈ మాటను విని ప్రసన్నుడైన కరుణా సముద్రుడగు పరమేశ్వరుడు నవ్వి ఆతనితో 'అటులనే' అని ఇట్లనెను (22).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 552 🌹
✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 51 🌴
🌻 The resuscitation of Kāma - 2 🌻
The celestial ladies said:—
12. Obeisance to you, O lord, you are known as favourably disposed to your devotees. You are friend of the distressed, storehouse of mercy. Resuscitate the cupid. Make Rati jubilant.
Brahmā said:—
13. On hearing their words, lord Śiva was delighted. The lord, the ocean of mercy, glanced compassionately.
14. Thanks to the nectarine glance of the Tridentbearing lord, Kāma came out of the ashes, a comely wonder-inspiring body with splendid dress and features.
15. On seeing her husband in the same form as before, wielding the bow and the arrows and smiling, Rati bowed to lord Śiva.
16. She became contented. With her husband resuscitated and with palms joined in reverence she eulogised the lord, the bestower of her husband, frequently.
17. On hearing the eulogy of Kāma and his wife, Śiva was delighted and he spoke with his heart melting with pity.
Śiva said:—
18. O Kāma, I am delighted by your eulogy in the company of your wife. O self-born, tell me the boon you desire. I shall grant it.
Brahmā said:—
19. On hearing these words of Śiva, Kāma was highly delighted. Humbly and in faltering accents he spoke with palms joined in reverence.
Kāma said:—
20. O lord of gods, O ocean of mercy, if you, the lord of all, are pleased with me please be delightful to me.
21. O lord, please forgive my fault formerly perpetrated by me. Please grant me great affection towards my people and devotion to your feet.
Brahmā said:—
22. On hearing the words of Kāma, lord Śiva was delighted. Giving consent, the lord of mercy laughingly said.
Continues....
🌹🌹🌹🌹🌹

గీతోపనిషత్తు -354
🌹. గీతోపనిషత్తు -354 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 33 📚
🍀 33-4. కూడి యుండుట - సంబంధ బాంధవ్యములు అసుఖమే గాక అనిత్యము గూడ. అయినను మాయాబద్ధుడగు జీవుడు వీనితో పెనుగులాడుచు నుండును. అట్లుకాక అందరి యందుగల పరమాత్మను గుర్తించి, దర్శించి, సేవించుచు నున్నచో అతడు నిత్యమున్నాడు గనుక అతనితో సంబంధము నిత్యమై యుండును. మనముండుట యనగ ఈశ్వరుడుండుటయే గనుక ఈశ్వరునితో కూడి యుండుట వలన శాశ్వత సుఖ మేర్పడును. అతని ప్రేమ కూడ నిత్యము, శాశ్వతము. అహర్నిశలు మనను అంటిపెట్టుకొని యున్న ఈశ్వరుని చింత మాని, ఇతర చింత యందుండువారు సుఖపడలేరు. 🍀
కిం పునరాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా |
అనిత్య మసుఖం లోక మిమం ప్రాప్య భజస్వ మామ్ || 33
తాత్పర్యము : అన్ని జాతులవారును అనన్యభక్తి మార్గమున నన్ను పొందగలిగినపుడు పుణ్యాత్ములగు బ్రాహ్మణులు, భక్తులగు రాజర్షులు కూడ నన్ను పొందగలరని వేరుగ చెప్పనవసరము లేదు గదా! ఈ లోక మనిత్యము. ఇందు సుఖము లేదు. కావున నన్ను సేవించుచు ఆనందము పొందుము.
వివరణము : కనుక సంబంధ బాంధవ్యములు అసుఖమే గాక అనిత్యము గూడ. అయినను మాయాబద్ధుడగు జీవుడు వీనితో పెనుగులాడుచు నుండును. అట్లుకాక అందరి యందుగల పరమాత్మను గుర్తించి, దర్శించి, సేవించుచు నున్నచో అతడు నిత్యమున్నాడు గనుక అతనితో సంబంధము నిత్యమై యుండును. సుఖమై యుండును కూడ. పరిసరముల యందలి జీవుల యందున్నటువంటి ఈశ్వరునితో అనుబంధ మేర్పడినచో జీవులు మారినను ఈశ్వరుడు మారడు. ఈశ్వరుడు నిత్యబంధువై శాశ్వతమగు మిత్రుడై తోడుగ ఎల్లప్పుడును యుండును.
మనముండుట యనగ ఈశ్వరుడుండుటయే గనుక ఈశ్వరునితో కూడి యుండుట వలన శాశ్వత సుఖ మేర్పడును. అతని ప్రేమ కూడ నిత్యము, శాశ్వతము. అహర్నిశలు మనను అంటిపెట్టుకొని యున్న ఈశ్వరుని చింత మాని, ఇతర చింత యందుండువారు సుఖపడలేరు. కనుక తనతో కూడి యుండుమని దైవము అమిత వాత్సల్యముతో పలికినాడు. ఇతరములతో కూడినచో సుఖమంతంత మాత్రమే అని హెచ్చరించినాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
20 Apr 2022
20 - APRIL - 2022 బుధవారం సౌమ్య వాసరే Wednesday MESSAGES
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 20, బుధవారం, ఏప్రిల్ 2022 సౌమ్య వాసరే 🌹
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 33-4 - 354 - కూడి యుండుట🌹
3) 🌹. శివ మహా పురాణము - 552 / Siva Maha Purana - 552 🌹
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 36 / Agni Maha Purana - 36 🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 171 / Osho Daily Meditations - 171 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 364-3 / Sri Lalitha Chaitanya Vijnanam - 364-3🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ బుధవారం మిత్రులందరికీ 🌹*
*సౌమ్య వాసరే, 20, ఏప్రిల్ 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*పండుగలు మరియు పర్వదినాలు : లేవు*
*🍀. శ్రీ గణేశ అష్టకం - 8 🍀*
*8. కల్పద్రుమాధఃస్థిత-కామధేనుం*
*చిన్తామణిం దక్షిణపాణిశుణ్డమ్ ।*
*బిభ్రాణమత్యద్భుతచిత్తరూపం యః*
*పూజయేత్ తస్య సమస్తసిద్ధిః ॥*
*వ్యాసాష్టకమిదం పుణ్యం గణేశస్తవనం నృణామ్ ।*
*పఠతాం దుఃఖనాశాయ విద్యాం సంశ్రియమశ్నుతే ॥*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : మనం ఏ కోరికతో, ఏ భావనతో పనులు చేస్తామో అదే కోరిక, భావనతో పాప పుణ్యములు కొలవబడతాయి - పండిత శ్రీరామశర్మ ఆచార్య 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, చైత్ర మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిథి: కృష్ణ చవితి 13:54:08 వరకు
తదుపరి కృష్ణ పంచమి
నక్షత్రం: జ్యేష్ఠ 23:42:58 వరకు
తదుపరి మూల
యోగం: వరియాన 13:38:20 వరకు
తదుపరి పరిఘ
కరణం: బాలవ 13:54:08 వరకు
వర్జ్యం: 06:47:42 - 08:15:54
దుర్ముహూర్తం: 11:49:54 - 12:40:20
రాహు కాలం: 12:15:07 - 13:49:40
గుళిక కాలం: 10:40:34 - 12:15:07
యమ గండం: 07:31:28 - 09:06:01
అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:40
అమృత కాలం: 15:36:54 - 17:05:06
సూర్యోదయం: 05:56:56
సూర్యాస్తమయం: 18:33:19
చంద్రోదయం: 22:27:33
చంద్రాస్తమయం: 08:44:00
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
ధ్వాo క్ష యోగం - ధన నాశనం,
కార్య హాని 23:42:58 వరకు తదుపరి
ధ్వజ యోగం - కార్య సిధ్ధి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PanchangDaily
#DailyTeluguCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -354 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 33 📚*
*🍀 33-4. కూడి యుండుట - సంబంధ బాంధవ్యములు అసుఖమే గాక అనిత్యము గూడ. అయినను మాయాబద్ధుడగు జీవుడు వీనితో పెనుగులాడుచు నుండును. అట్లుకాక అందరి యందుగల పరమాత్మను గుర్తించి, దర్శించి, సేవించుచు నున్నచో అతడు నిత్యమున్నాడు గనుక అతనితో సంబంధము నిత్యమై యుండును. మనముండుట యనగ ఈశ్వరుడుండుటయే గనుక ఈశ్వరునితో కూడి యుండుట వలన శాశ్వత సుఖ మేర్పడును. అతని ప్రేమ కూడ నిత్యము, శాశ్వతము. అహర్నిశలు మనను అంటిపెట్టుకొని యున్న ఈశ్వరుని చింత మాని, ఇతర చింత యందుండువారు సుఖపడలేరు. 🍀*
*కిం పునరాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా |*
*అనిత్య మసుఖం లోక మిమం ప్రాప్య భజస్వ మామ్ || 33*
*తాత్పర్యము : అన్ని జాతులవారును అనన్యభక్తి మార్గమున నన్ను పొందగలిగినపుడు పుణ్యాత్ములగు బ్రాహ్మణులు, భక్తులగు రాజర్షులు కూడ నన్ను పొందగలరని వేరుగ చెప్పనవసరము లేదు గదా! ఈ లోక మనిత్యము. ఇందు సుఖము లేదు. కావున నన్ను సేవించుచు ఆనందము పొందుము.*
*వివరణము : కనుక సంబంధ బాంధవ్యములు అసుఖమే గాక అనిత్యము గూడ. అయినను మాయాబద్ధుడగు జీవుడు వీనితో పెనుగులాడుచు నుండును. అట్లుకాక అందరి యందుగల పరమాత్మను గుర్తించి, దర్శించి, సేవించుచు నున్నచో అతడు నిత్యమున్నాడు గనుక అతనితో సంబంధము నిత్యమై యుండును. సుఖమై యుండును కూడ. పరిసరముల యందలి జీవుల యందున్నటువంటి ఈశ్వరునితో అనుబంధ మేర్పడినచో జీవులు మారినను ఈశ్వరుడు మారడు. ఈశ్వరుడు నిత్యబంధువై శాశ్వతమగు మిత్రుడై తోడుగ ఎల్లప్పుడును యుండును.*
*మనముండుట యనగ ఈశ్వరుడుండుటయే గనుక ఈశ్వరునితో కూడి యుండుట వలన శాశ్వత సుఖ మేర్పడును. అతని ప్రేమ కూడ నిత్యము, శాశ్వతము. అహర్నిశలు మనను అంటిపెట్టుకొని యున్న ఈశ్వరుని చింత మాని, ఇతర చింత యందుండువారు సుఖపడలేరు. కనుక తనతో కూడి యుండుమని దైవము అమిత వాత్సల్యముతో పలికినాడు. ఇతరములతో కూడినచో సుఖమంతంత మాత్రమే అని హెచ్చరించినాడు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 552 / Sri Siva Maha Purana - 552 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 51 🌴*
*🌻. కామ సంజీవనము - 2 🌻*
దేవీ మూర్తు లిట్లు పలికినారు -
నీకు భక్త వత్సలుడని పేరు. దీనులకు బంధువు నీవే. నీవుదయానిధివి. మన్మథుని బ్రతికించి రతికి ఉత్సాహమునిమ్ము. నీకు నమస్కారమగు గాక! (12)
బ్రహ్మ ఇట్లు పలికెను-
వారి ఈ మాటను విని కరుణా సముద్రుడగు మహేశ్వర ప్రభుడు ప్రసన్నుడై వెంటనే దయాదృష్టిని బరపెను (13). శూలపాణియగు శివుని అమృతదృష్టిచే భస్మ నుండి అదే రూపము వేషము చిహ్నములు గల అద్భుతమగు సుందరమైన దేహము గలవాడై మన్మథుడు బయటకు వచ్చెను (14). అదే రూపముతో చిరునవ్వుతో ధనుర్బాణములను ధరించి యున్న తన భర్తను చూచి రతి ఆతనికి, మహేశ్వరునకు ప్రణమిల్లెను (15). భర్త జీవుంచటచే కృతార్థురాలైన ఆమె ప్రాణనాథుని ఇచ్చిన శివ దేవుని చేతులు జోడించి అనేక పర్యాయములు స్తుతించెను (16). భార్యతో గూడి మన్మథుడు చేసిన స్తోత్రమును విని కరుణార్ద్రహృదయుడగు శంకరుడు మిక్కలి ప్రసన్నుడై ఇట్లు పలికెను (17).
శంకరుడిట్లు పలికెను -
ఓయీ! మనస్సులో నీ అంతట నీవు పుట్టే మన్మథా! భార్యతో గూడి నీవు చేసిన స్తుతికి నేను ప్రసన్నుడనైతిని. నీకిష్టమగు వరమును కోరుకొనుము. నీకు ఇచ్చెదను (18).
బ్రహ్మ ఇట్లు పలికెను-
శంభుని ఈ మాటను విని మన్మథుడపుడు మహానందమును పొందినవాడై చేతులు జోడించి నమస్కరించి బొంగురుపోయిన కంఠముతో నిట్లనెను (19).
మన్మథుడిట్లు పలికెను-
దేవ దేవా! మహాదేవా! కరుణా సముద్రా! ప్రభూ! సర్వేశ్వరుడవగు నీవు ప్రసన్నుడవైనచో నాకు ఆనందమును కలిగించుము (20). ప్రభూ! పూర్వము నేను చేసిన అపరాధమును మన్నించుము. నీ భక్తుల యందు పరమప్రీతిని, నీ పాదములయందు భక్తిని ఇమ్ము (21).
బ్రహ్మ ఇట్లు పలికెను-
మన్మథుని ఈ మాటను విని ప్రసన్నుడైన కరుణా సముద్రుడగు పరమేశ్వరుడు నవ్వి ఆతనితో 'అటులనే' అని ఇట్లనెను (22).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 552 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 51 🌴*
*🌻 The resuscitation of Kāma - 2 🌻*
The celestial ladies said:—
12. Obeisance to you, O lord, you are known as favourably disposed to your devotees. You are friend of the distressed, storehouse of mercy. Resuscitate the cupid. Make Rati jubilant.
Brahmā said:—
13. On hearing their words, lord Śiva was delighted. The lord, the ocean of mercy, glanced compassionately.
14. Thanks to the nectarine glance of the Tridentbearing lord, Kāma came out of the ashes, a comely wonder-inspiring body with splendid dress and features.
15. On seeing her husband in the same form as before, wielding the bow and the arrows and smiling, Rati bowed to lord Śiva.
16. She became contented. With her husband resuscitated and with palms joined in reverence she eulogised the lord, the bestower of her husband, frequently.
17. On hearing the eulogy of Kāma and his wife, Śiva was delighted and he spoke with his heart melting with pity.
Śiva said:—
18. O Kāma, I am delighted by your eulogy in the company of your wife. O self-born, tell me the boon you desire. I shall grant it.
Brahmā said:—
19. On hearing these words of Śiva, Kāma was highly delighted. Humbly and in faltering accents he spoke with palms joined in reverence.
Kāma said:—
20. O lord of gods, O ocean of mercy, if you, the lord of all, are pleased with me please be delightful to me.
21. O lord, please forgive my fault formerly perpetrated by me. Please grant me great affection towards my people and devotion to your feet.
Brahmā said:—
22. On hearing the words of Kāma, lord Śiva was delighted. Giving consent, the lord of mercy laughingly said.
Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 36 / Agni Maha Purana - 36 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 13*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*🌻. భారతము యొక్క వర్ణనము - 2 🌻*
దైవవశముచే కురుపాండవుల మధ్య వైరము ఏర్పడెను. దుష్టబుద్ధియైన దుర్యోధనుడు లక్క ఇంటిలో పాండవులను కాల్చెను. కాని తల్లితో కూడిన పంచపాండవులును కాలిపోయిన ఇంటి నుండి తప్పించుకొని వెళ్ళిపోయిరి. పిమ్మట ఆ పాండవులు ఏకచక్రనగరమునందు మునివేషధారులై ఒక బ్రాహ్మణుని ఇంట నివసించిరి. అచట వారు బకరాక్షసుని చంపిరి.
వారు ద్రౌపదీస్వయంవర నిమిత్తమై పాంచాల దేశమునకు వెళ్లిరి. అచట వివిధాలంకారభూషిత యైన ద్రౌపదిని పాండవు లైదుగురును భార్యగా పొందిరి.
దుర్యోధనాదులచే గుర్తింపబడిన ఆ పాండవులు అర్దరాజ్యమును పొందిరి. అర్జునుడు, అగ్ని దేవునుండి గాండీవ మను దివ్యధనస్సును, ఉత్తమమైన రథమును, అక్షయ్యమైన బాణములు గల అమ్ములపొదలను పొందెను. ద్రోణునివలన బ్రహ్మద్యస్త్రములను పొందెను. కృష్ణుని యుద్ధసమయమున సారథిగా పొందెను. వారందరరును శస్త్రాస్త్రములందు నమర్థులైరి.
పాండుకుమారుడైన అర్జునుడు తన శరవర్షముచే, ఇంద్రుడు కురిపించిన వర్షమును అడ్డగించి, కృష్ణసహాయముతో, ఖాండవ వనము నందు అగ్నిని సంతృప్తిని చేసెను. పాండవులు నలుదిక్కులను జయించిరి. యధిష్ఠిరుడు రాజ్యము చేసెను. అధిక మగు సువర్ణదానము గల రాజసూయయాగమును చేసెను. దుర్యోధనుడు దీని నంతను సహింపలేకపోయెను. సోదరుడైన దుఃశాసనుడును, ఐశ్వర్యము లభించిన కర్ణుడును, శకునియు చెప్పగా యుధిష్ఠిరుని ద్యూతము నకై ఆహ్వానించి, ఆ ద్యూతశాలలో యుధిష్ఠిరుని మోనము చేసి నవ్వుచు, అతని రాజ్యమును హరించెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana -36 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *
*Chapter 13 - Bharatam*
*🌻 Origin of the Kauravas and Pāṇḍavas - 2 🌻*
11. Karṇa, born to Kuntī, when she was a virgin, became a dependent of Duryodhana. By destiny there was enmity between the Kurus (Kauravas) and Pāṇḍavas.
12. The wicked Duryodhana burnt the Pāṇḍavas in the lac house. The Pāṇḍavas escaped from the burnt house along with their mother as the sixth.
13. Then at (the place) Ekacakrā, in the house of a brahmin, they all remained in the attire of an ascetic after killing the demon Baka.[2]
14. They went to the fair at Pāñcāla and in the svayamvara (self-choice) of Draupadī. The well adorned Draupadī was obtained by the five Pāṇḍavas.
15. Then (they) were known to have got half of the kingdom by Duryodhana and others. The divine bow Gāṇḍīva and the excellent chariot were obtained from the Fire god.
16. And in the battle, Arjuna got Kṛṣṇa as the charioteer and inexhaustible arrows and similarly the missiles (known as) Brahmā and other weapons (were obtained) from Droṇa. All were proficient in (the use of) arms.
17-18. (Acting on the words of) Kṛṣṇa, Arjuna put out the fire at the Khāṇḍava forest. And the Pāṇḍava (Arjuna) having obstructed rains (caused by Indra) with the shower of arrows, conquered the countries in different) directions. Yudhiṣṭhira ruled the country along with the (other) Pāṇḍavas. (He performed) the Rājasūya (sacrifice) (spending) plenty of gold. Suyodhana (Duryodhana) could not bear that.
19. Being directed by brother Duḥśāsana and by Karṇa who had been enriched by him, he won over Yudhiṣṭhira in dice, (being assisted) by Śakuni in playing the dice. His kingdom was also won by conceit. Those in the court laughed at him.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 171 / Osho Daily Meditations - 171 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀 171. అవగాహన లేని ప్రేమ 🍀*
*🕉. ప్రేమ అంటే స్వేచ్ఛ అని అర్ధం కాదు. అది ఆదర్శం కనుక ఉండాలి అంటాము- ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, మీరు ఎవరినైనా అవగాహనతో ప్రేమిస్తే, అప్పుడే అది ఒక ఆశీర్వాదం. 🕉*
*ప్రేమ అనేక విధాలుగా విధ్వంసకరం కావచ్చు, ఎందుకంటే ప్రేమ తప్పనిసరిగా అవగాహనను కలిగి ఉండాలని లేదు. ఒక తల్లి బిడ్డను ప్రేమిస్తుంది. ఈనాడు నిజంగా చూస్తే తల్లులు తమ పిల్లలను అతిగా ప్రేమిస్తున్నందున వల్లనే ప్రపంచం మొత్తం బాధపడుతోంది. కావాలంటే మానసిక వైద్యులను, మనస్తత్వవేత్తలను అడగండి. ప్రతి మానసిక రుగ్మతను తల్లి-బిడ్డల బంధానికి ఆపాదించవచ్చు అని వారు అంటున్నారు. పిచ్చాస్పత్రిలో ఉన్న చాలా మంది ఈ అవగాహన లేని అతిప్రేమ వల్లే పిచ్చికి గురయ్యి బాధపడుతున్నారు. తండ్రులు ప్రేమిస్తారు, పూజారులు, రాజకీయ నాయకులు ప్రేమిస్తారు. ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు, కానీ ప్రేమ తప్పనిసరిగా బుద్ధిని కలిగి ఉండాలని లేదు. ప్రేమ బుద్ధిని కలిగి ఉన్నప్పుడు, జ్ఞానంగా అయినప్పుడు, అది కరుణగా వుంటుంది. అప్పుడు అది పూర్తిగా భిన్నమైన నాణ్యతతో ఉంటుంది. అది మీకు స్వేచ్ఛను ఇస్తుంది. దాని పూర్తి విధి స్వేచ్ఛను ఇవ్వడం.*
*అది స్వేచ్ఛ గురించి మాట్లాడడమే కాదు-మిమ్మల్ని స్వేచ్ఛగా మార్చడానికి మరియు స్వేచ్ఛా మార్గంలో ఉన్న అన్ని అడ్డంకులను నాశనం చేయడానికి అది ప్రతి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రేమ ఉనికిలో ఉంటుంది, కానీ అప్రమత్తంగా లేకపోతే, అది చాలా వినాశకరమైనది. ప్రేమ ఒక్కటి ఉంటే మాత్రమే సరిపోదు. అలా అయితే ప్రపంచం ఇప్పటికే స్వర్గంగా మారిపోయింది. మీరు మీ భాగస్వామిని ప్రేమిస్తారు, మీ భాగస్వామి మిమ్మల్ని ప్రేమిస్తారు, కానీ చివరకు ఏమి జరుగుతుంది? ఈ మోహంగా వ్యక్తం అయ్యే ప్రేమ విధ్వంసం తప్ప మరేమీ తీసుకురాదు. మీ ప్రేమ పైకి బానే వున్నట్టు కనబడుతుంది కానీ, మీరు బాగా లేరు. ఎక్కడో అవగాహనలో లోపం ఉంది. అపస్మారక స్థితిలో ఏదో లోతుగా ఉంది, అది మీకు తెలియని విషయాలను సృష్టిస్తుంది. ప్రేమను తిరస్కరించాలని నేను చెప్పను, కానీ ప్రేమకు మొదటి స్థానం ఇవ్వకూడదు. ముందుగా అవగాహన రావాలి. ప్రేమ నీడలా వెంబడించాలి.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 171 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 171. UNENLIGHTENED LOVE 🍀*
*🕉 Love does not necessarily mean .freedom. It should-that is the ideal. Always remember, if you love somebody with awareness, only then will it be a blessing. 🕉*
*Love can be destructive in many ways, because love is not necessarily enlightened. A mother loves the child and the whole world is suffering because mothers love their children. Ask the psychiatrists, the psychologists. They say that every neurosis can be reduced to the mother-child relationship. Many people in the insane asylums are suffering from nothing but love. Fathers love their sons, priests love, politicians love. Everybody is loving, but love is not necessarily enlightened. When love is enlightened, it is compassion. Then it is of a totally different quality. It gives you freedom. Its whole function is to give freedom, absolutely.*
*And not only that it talks about freedom-it makes every effort to make you free and to destroy all the hindrances on the path of freedom. So love can exist, but if it is not very alert, then it is destructive. Love alone is not enough, otherwise the world would already have become a paradise. You love your partner, your partner loves you, but what happens finally? Nothing but destruction. Your love is okay, but you are not okay. Something is there deep down in the unconscious that goes on creating things you are not aware of. I don't say that love should be denied, but love should not come first. Awareness should come first. Love has to follow like a shadow.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://oshodailymeditations.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 364-3 / Sri Lalitha Chaitanya Vijnanam - 364-3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 80. చితి, స్తత్పదలక్ష్యార్థా, చిదేక రసరూపిణీ ।*
*స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః ॥ 80 ॥ 🍀*
*🌻 364-3. 'చిదేక రసరూపిణీ' 🌻*
మహత్తు నుండి అణువు వరకు అన్నిటి యందు ఈశ్వరుడున్నాడు. ఆ ఈశ్వరునితో కూడి యుండియే అంతయూ నిర్మాణము చేయుచు ఆనందముగ నుండునది శ్రీమాత. ఆమె ఆనందము ఈశ్వరునితో కూడియుండుట వలన కలుగు ఆనందము. మన యందు మూలాధారమున ఈశ్వరునితో కూడి యున్నది. సహస్రారమున కూడ ఈశ్వరునితోనే కూడి యున్నది. ఇట్లు సతతము కూడి యుండుట వలన రసానుభూతిని పొందుచు రసరూపిణిగా నున్నది.
జీవులకు ఆనందానుభూతి, ఈశ్వరానుభూతి కలుగజేయునది శ్రీమాతయే. ఆమె అనుగ్రహము లేనిదే ఆనందము కలుగదు. యోగము జరుగదు. ఈశ్వరునితో రసలీల సాధ్యపడదు. పై రసానుభూతిని జగదీశ్వరుడగు కృష్ణునితో కూడి పొందవలె నను తపన గల గోపికలు, కాత్యాయనీ దేవిని ప్రార్థించుట యందు గల రహస్య మిదియే. కృష్ణుని ప్రార్థించినచో రసానుభూతి నివ్వడు. కాత్యాయనీ దేవిని ప్రార్థించినపుడు ఆమె అనుగ్రహించుట చేత రసానుభూతిని గోపికలకు పరమాత్మ అందించినాడు. గోపిక లందరూ ఒకరి నొకరు కృష్ణునిగ చూచి పరమానంద భరితులై పరవశముతో రాసలీల గావించినారు.
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 364-3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 80. Chiti statpada lakshyardha chidekarasa rupini*
*Svatyananda lavibhuta bramha dyananda santatih ॥ 80 ॥ 🌻*
*🌻 364-3. Cideka-rasa-rūpiṇī चिदेक-रस-रूपिणी 🌻*
She is the essence of knowledge. The difference between knowledge and the essence of knowledge is to be understood. The knowledge of the unconditioned Brahman or the Prakāśa form of the Brahman is different from the conditioned Brahman or the vimarśa form of the Brahman. The Brahman with attributes and without attributes remains the same, so also their purity of knowledge. This is the reason for establishing the identity of the both as one.
This nāma says that She is not different from Cit (nāma 362) or That (nāma 363), the qualities of the Brahman. There is no difference between conditioned and unconditioned Brahman as any modifications take place purely at the will of Brahman for the purpose of creation, sustenance and dissolution. When knowledge is extracted, the essence of knowledge is obtained, possibly from its gross form to its subtle form. But, the foundational nature of both gross and subtle forms of knowledge is not different. This can be compared to milk and its derivatives.
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Subscribe to:
Posts (Atom)